breaking news
Other Sports
-
CWG 2026: భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన సాక్షి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు మరో పతకం ఖరారైంది. ఇప్పటికే 12 పతకాలతో (2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు) పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ మరో పతకం ఖాయం చేసుకొని పట్టికలో మరింత మెరుగైన స్థానానికి వెళ్లే దిశగా సాగుతోంది.మహిళల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి ఈ పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖరారైంది.ఈ బౌట్లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సాక్షి మూడు రౌండ్లలోనూ ఏకగ్రీవంగా 5-0 స్కోరుతో విజయం సాధించింది. వేగవంతమైన కదలికలు, కచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తన ఆధీనంలో ఉంచుకుంది.ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే సెమీఫైనల్లో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్‌తో సాక్షి తలపడనుంది. అంతకుముందు ప్రీక్వార్టర్ఫైనల్లో బోట్స్వానాకు చెందిన లెథాబో మొడుకనెలెపై విజయం సాధించి సాక్షి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.ఇదిలా ఉంటే, ఈ పోటీల్లో భారత బాక్సర్ల పోరు కొనసాగనుంది. మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి న్యూజిలాండ్‌కు చెందిన మోర్గాన్ హెండర్సన్‌తో క్వార్టర్ఫైనల్లో పోటీ పడనుండగా.. పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ బోట్స్వానాకు చెందిన ట్రెజర్ మోరెమితో.. 80 కేజీల విభాగంలో అంకుష్ యాదవ్ సీషెల్స్‌కు చెందిన జేడ్ మికాక్తో, 90 కేజీల విభాగంలో నరేందర్ బెర్వాల్ సమోవాకు చెందిన మైఖేల్ సెకోతో క్వార్టర్‌ఫైనల్ బరిలోకి దిగనున్నారు. -
చరిత్ర సృష్టించా.. నా రక్తం ధారపోశాను.. కానీ ఇప్పుడు!
బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ నెయ్మార్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను జాతీయ జట్టు కోసం రక్తం ధారపోశానని.. అయితే, ఇకపై ఆ పనిచేయలేనంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి పలికేశానంటూ రిటైర్మెంట్ గురించి పునరుద్ఘాటించాడు.గత కొన్నాళ్లుగా గాయాలతో సావాసం చేసిన నెయ్మార్.. ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీతో బ్రెజిట్ జట్టు తరఫున పునరాగమనం చేశాడు. అయితే, ఈ మెగా ఈవెంట్లో రౌండ్ 16లో నార్వే చేతిలో 2-1 గోల్ తేడాతో ఓడి బ్రెజిల్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో నెయ్మార్ ఒక గోల్ కొట్టాడు. ఓటమి అనంతరం మాట్లాడుతూ.. బ్రెజిల్ తరఫున తనకు ఇదే చివరి మ్యాచ్ అని రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.తాజాగా ఇదే విషయం గురించి మరోసారి ప్రస్తావన రాగా.. ‘‘జాతీయ జట్టుతో నా బంధం ముగిసిపోయింది. బ్రెజిల్ తరఫున నేను చరిత్ర సృష్టించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా జట్టు కోసం రక్తం ధారపోశాను. నా జీవితాన్ని, సర్వస్వాన్ని అర్పించాను.యెల్లో జెర్సీ ధరించడం కోసం ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ ఇకముందు ఆ పని చేయాల్సిన అవసరం లేదు’’ అని నెయ్మార్ గోల్.కామ్‌తో పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్ తర్వాత క్లబ్ కెరీర్ మీద దృష్టి సారించిన నెయ్మార్.. సారథిగా సాంటోస్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో భాగంగా యూనివర్సిడాడ్ సెంట్రల్‌పై సాంటోస్ 4-2 గోల్ తేడాతో విజయం సాధించింది. తద్వారా కోపా సదమెరికానా రౌండ్ 16కు అర్హత సాధించింది. అనంతరం నెయ్మార్ మాట్లాడుతూ.. తన అంతర్జాతీయ రిటైర్మెంట్ విషయాన్ని పునరుద్ఘాటించాడు.కాగా బ్రెజిల్ తరఫున 130 మ్యాచ్‌లు ఆడిన నెయ్మార్.. 80 గోల్స్ సాధించాడు. తద్వారా బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన ఫుట్‌బాలర్‌గా 34 ఏళ్ల నెయ్మార్ చరిత్రకెక్కాడు. అంతేకాదు పదహారేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 59 అసిస్ట్‌లు కూడా అందించాడు. నెయ్మార్ ఘనతలుఅమెరికాతో ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా 2010లో నెయ్మార్ అరంగేట్రం చేశాడు. ఫిఫా ప్రపంచకప్ 2014, 2018, 2022, 2026 ఎడిషన్లలో బ్రెజిల్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్-2013 విజేత. 2012 ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు. 2016 ఒలింపిక్స్‌లో కెప్టెన్‌గా బ్రెజిల్‌కు స్వర్ణం అందించాడు.Neymar has officially announced that he will retire from international football. 😢He was visibly emotional walking off of a World Cup pitch for the final time. ❤️(🎥: @liberta___depre)pic.twitter.com/GcMIjvmpYt— theScore (@theScore) July 5, 2026 -
CG 2026: వర్షంలోనూ తగ్గని జోరు.. ఆఖరి క్షణాల్లో అద్భుతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ చారిత్రాత్మక విజయం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో అతడు రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలో పతకం గెలుచుకున్న తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.ఆఖరి క్షణాల్లో అద్భుతంఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో 28 ఏళ్ల గుల్వీర్ ఆఖరి క్షణాల్లో అద్భుతం చేశాడు. చివరి ల్యాప్‌లో అనూహ్యమైన వేగంతో ముందుకు దూసుకెళ్లిన గుల్వీర్.. 27 నిమిషాల 49.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ (27:48.93) స్వర్ణ పతకం సాధించగా.. ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన డేవిడ్ ముల్లార్కే కాంస్య పతకం ఒడిసి పట్టాడు.వర్షంలోనూ తగ్గని జోరుకాగా స్కాట్స్టౌన్ స్టేడియంలో ఈ పరుగు పందం తీవ్ర ప్రతికూల వాతావరణంలో జరిగింది. రేసు సమయంలో భారీ వర్షం కురిసింది. నీటితో ట్రాక్ తడిసిపోయింది. అయినప్పటికి గుల్వీర్ తన పట్టుదలను వీడలేదు. మొదటి నుంచీ అగ్రస్థానంలో ఉన్న అథ్లెట్ల గుంపుతోనే సాగుతూ టాప్-2లో నిలిచాడు. అయితే ఈ విభాగంలో ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించే కెన్యా, ఉగాండా అథ్లెట్లకు ఈసారి పతకాలు దక్కకపోవడం విశేషం. 1986 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పురుషుల 10,000 మీటర్ల విభాగంలో ఒక్క ఆఫ్రికన్ అథ్లెట్ కూడా పతకం గెలవకపోవడం ఇదే మొదటిసారి. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలోని గ్రెనేడియర్స్ రెజిమెంట్‌లో నాయిబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు భారత వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ సైతం సత్తాచాటింది. మహిళల 69 కేజీల విభాగంలో మొత్తం 227 కేజీల (స్నాచ్‌లో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు) బరువును ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ఈ క్రీడల్లో భారత పతకాలు సంఖ్య 12కు చేరింది. -
జిదాన్ వచ్చేశాడు
పారిస్: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. 1998 ప్రపంచకప్, 2000 యూరో చాంపియన్‌షిప్ విజేత జట్టు సభ్యుడు, స్టార్ ప్లేయర్ జినెదిన్ జిదాన్‌ను ఫ్రాన్స్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా... ఆ తర్వాత విజయవంతమైన కోచ్‌గా గుర్తింపు సాధించిన జిదాన్... 2030 వరకు ఫ్రాన్స్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 14 ఏళ్లుగా ఫ్రాన్స్ కోచ్‌గా వ్యవహరించిన దీదీర్ డెషాంప్స్ పదవీకాలం ఇటీవలి ప్రపంచకప్‌తో ముగిసింది. దీంతో అతడి స్థానంలో 54 ఏళ్ల జిదాన్‌ను ఎంపిక చేసినట్లు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య మంగళవారం ప్రకటించింది. డెషాంప్స్ కోచింగ్‌లో ఫ్రాన్స్ జట్టు 2018లో వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. 2022 ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్... తాజా వరల్డ్‌కప్‌లో నాలుగో స్థానం దక్కించుకుంది. ‘చాలా ఉత్సుకతతో ఉన్నా. ఫ్రాన్స్ జట్టు మిమ్మల్ని కలలు కనేలా చేస్తుంది. మా జట్టులో అసాధారణమైన ప్లేయర్లు ఉన్నారు. ఈ అవకాశం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా. అందుకే చాలా భావోద్వేగంగా ఉంది. నేను ఎప్పుడూ ఈ జట్టుకు అభిమానినే. రియల్ మాడ్రిడ్ తర్వాత ఫ్రాన్స్ జట్టుకు మాత్రమే కోచ్‌గా పనిచేయాలనుకున్నా. అందుకే చాలా ఇతర అవకాశాలను వదులుకున్నా. ఇన్నాళ్లు ఫ్రాన్స్ కోచ్‌గా వ్యవహరించిన డెషాంప్స్ జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. దాన్ని కొనసాగించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అని జిదాన్ పేర్కొన్నాడు. జిదాన్ శిక్షణలో ఫ్రాన్స్ జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ఫిలిప్ డయల్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు. జిదాన్ కోచింగ్‌లో ఫ్రాన్స్ జట్టు సెపె్టంబర్ 25న టర్కీతో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 2న స్వదేశంలో ఇటలీతో ఫ్రాన్స్ తలపడనుంది.‘రెడ్‌కార్డ్’తో కెరీర్ ముగింపుప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్ జట్టుకు అభిమానులను సాధించి పెట్టడంలో జిదాన్ ప్రధాన పాత్ర పోషించాడు. 1998 ప్రపంచకప్‌లో జిదాన్ ప్రదర్శనను ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పటికీ మరవలేరు. డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో జిదాన్ రెండు ‘హెడర్’ గోల్స్‌తో ఫ్రాన్స్‌ను ఒంటిచేత్తో టైటిల్ కట్టబెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు ఫ్రాన్స్‌కు యూరో కప్ అందించడంలోనూ అతడి పాత్ర కీలకం. 2004లో కెరీర్‌కు వీడ్కోలు పలికిన జిదాన్... ఆ తర్వాత అందరి అభ్యర్ధన మేరకు తిరిగి జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో ఫ్రాన్స్ జట్టు 2006 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే తుదిపోరులో ఇటలీ ఆటగాడు మార్కో మాటెరాజీ స్లెడ్జింగ్‌కు పాల్పడటంతో అతడి ఛాతీపై తలతో గుద్దినందుకు గానూ జిదాన్ ‘రెడ్ కార్డ్’కు గురయ్యాడు. ఆ మ్యాచ్‌తోనే అతడి కెరీర్ ముగియగా... ఫైనల్ ‘షూటౌట్’లో ఫ్రాన్స్ పరాజయం పాలైంది. ఓవరాల్‌గా 12 ఏళ్ల కెరీర్లో జాతీయ జట్టు తరఫున 108 మ్యాచ్‌లాడిన జిదాన్ 31 గోల్స్ చేశాడు. రిటైర్మెంట్ అనంతరం కోచ్ అవతారమెత్తిన అతడు... 2016–2021 మధ్య రియల్ మాడ్రిడ్ క్లబ్‌ను అజేయ శక్తిగా తీర్చిదిద్దాడు. -
అటు అజయ్... ఇటు సర్వేశ్
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అబ్బాయి వల్లూరి అజయ్ బాబు రజతం అందించగా... హైజంప్‌లో తొలిసారి రజతాన్ని అందించిన ఘనతను సర్వేశ్ కుశారే సొంతం చేసుకున్నాడు. పారా అథ్లెట్లు కూడా తమ వంతుగా రెండు పతకాలను భారత్ ఖాతాలో చేర్చారు. షాట్‌పుట్‌లో షర్మిల స్వర్ణంతో, శిల్ప కాంస్యంతో మెరిశారు.గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. ఈ క్రీడాంశం ద్వారా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 79 కేజీల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు మొత్తం 330 కేజీల బరువెత్తి రజతం గెలుచుకున్నాడు. స్నాచ్‌లో 149 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీల బరువెత్తిన అజయ్‌కు రెండో స్థానం దక్కింది. మలేసియాకు చెందిన హిదాయత్ (331 కేజీలు) స్వర్ణం సాధించగా, క్రిస్ ముర్రే (ఇంగ్లండ్; 325 కేజీలు) కాంస్యం గెలిచాడు. పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే రజతాన్ని సొంతం చేసుకున్నాడు. 2.25 మీటర్ల ఎత్తుకు ఎగిరిన సర్వేశ్ రెండో స్థానంలో నిలిచాడు. జమైకా అథ్లెట్ రొమైన్బెక్ఫోర్డ్ (2.25 మీటర్లు) స్వర్ణం దక్కించుకోగా... కిమాని జాక్ (ఇంగ్లండ్; 2.20 మీటర్లు) కాంస్యం సాధించాడు. సర్వేశ్, బెక్‌ఫోర్డ్ ఇద్దరూ 2.25 మీటర్ల ఎత్తే ఎగిరినా... కౌంట్‌బ్యాక్‌లో జమైకా అథ్లెట్ పైచేయి సాధించాడు. సర్వేశ్‌తో పోలిస్తే బెక్‌ఫోర్డ్ విఫల ప్రయత్నాల సంఖ్య తక్కువ కావడమే అందుకు కారణం. కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇది తొలి రజతం కావడం విశేషం. హైజంప్‌లో ఇప్పటి వరకు తేజస్విన్ శంకర్ (2022 బర్మింగ్‌హామ్) గెలుచుకున్న కాంస్యమే భారత్‌కు ఏకైక పతకం కాగా... ఇప్పుడు సర్వేశ్ దానిని సవరించాడు. మరో భారత హైజంపర్ ఆదర్శ్రామ్ (2.15 మీటర్లు) ఐదో స్థానంతో ముగించాడు. మరోవైపు బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), పురుషుల విభాగంలో జాదుమణి సింగ్ (55 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు. మరో బాక్సర్ పర్విన్ 2–3తో సాషా హెకీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 63 కేజీల విభాగంలో నిరుపమా దేవి విఫలమైంది. స్నాచ్‌లో 93 కేజీలు బరువెత్తిన నిరుపమా క్లీన్ అండ్ జెర్క్ మూడు ప్రయత్నాల్లోనూ ఫౌల్ చేసింది. పారా స్విమ్మింగ్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో భారత స్విమ్మర్ రవి బుడిగిన (ఆంధ్రప్రదేశ్; 25.68 సెకన్లు) 6వ స్థానంలో నిలిచాడు.స్వర్ణ, కాంస్యాలు మనవే...కామన్వెల్త్ పారా క్రీడల అథ్లెటిక్స్ పోటీల చరిత్రలో భారత్ తొలిసారి స్వర్ణం గెలుచుకుంది. మహిళల షాట్‌పుట్ (ఎఫ్57)లో హరియాణకు చెందిన షర్మిల ధన్కర్ పసిడి సొంతం చేసుకుంది. ఆమె తన మూడో ప్రయత్నంలో ఇనుప గుండును 9.81 మీటర్ల దూరం విసిరింది. భారత్‌కే చెందిన కంచుగరకొప్పలు శిల్పా శైలా (కర్ణాటక) కాంస్యం సొంతం చేసుకుంది. ఆమె గుండును 7.26 మీటర్లు విసిరింది. గృహ హింసకు గురై... హరియాణాలోని చిత్రోలికి చెందిన 40 ఏళ్ల షర్మిల గృహ హింస బాధితురాలు. రెండేళ్ల వయసులోనే పోలియో బారిన పడిన ఆమెకు చిన్నతనంలోనే పెళ్లయింది. అయితే వివాహానంతరం ఆమె తీవ్ర హింసకు గురైంది. దీనిని తట్టుకోలేక చివరకు ఆ బంధం నుంచి తప్పుకున్న ఆమె మరో పెళ్లి చేసుకుంది. భర్త అజిత్ సింగ్ ఆమెకు అండగా నిలుస్తూ అన్ని విధాలా ప్రోత్సహించాడు. దాంతో ఆరేళ్ల క్రితం ఆమె పారా అథ్లెట్ కెరీర్ మొదలైంది. ఏడాదిలోపే జాతీయ టైటిల్ గెలుచుకోవడంతో పాటు పారా షాట్‌పుట్, పారా డిస్కర్త్రోలో భారత అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగింది. ఇంటర్నేషల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన షర్మిల 2022 కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచింది.ఒక్కో మెట్టు ఎదుగుతూ... ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఈవెంట్లో టాప్–3లో నిలిచిన నాలుగో భారత ఆటగాడి గా సర్వేశ్ గుర్తింపు పొందాడు. గతంలో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇటీవల మొనాకోలో జరిగిన పోటీల్లో సర్వేశ్ ఈ ఘనత సాధించాడు. ఆలస్యంగా ఆటలోకి అడుగుపెట్టి సత్తా చాటిన అరుదైన అథ్లెట్‌గా సర్వేశ్ అందరి దృష్టిలో పడ్డాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సర్వేశ్ తండ్రి ఉల్లిగడ్డలు పండించే రైతు. 20 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అతను పాల్గొన్నాడు. జాతీయ సీనియర్ పోటీల్లో వరుసగా రెండేళ్లు ఇండియన్ ఓపెన్‌లో స్వర్ణం గెలిచిన అతను గత నెలలో ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో 2.31 మీటర్ల ఎత్తు ఎగిరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. 2025 వరల్డ్ చాంపియన్ షిప్లో ఆరో స్థానంలో నిలిచిన సర్వేశ్...ఈ పోటీల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన తొలి భారత హైజంపర్గా నిలిచాడు. -
నాన్నకు ప్రేమతో...
ఆ అబ్బాయికి అప్పటికి ఆరేళ్ల వయసు... తన తండ్రి సాధించిన ఘనత ఏమిటో అతనికేమీ తెలేదు... కానీ తర్వాతి రోజుల్లో అదే అతనికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంత వద్దనుకున్నా మనసు వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లింది. చివరకు తండ్రి బాటలో పతకాల వేట మొదలు పెట్టిన ఆ కుర్రాడు ఇప్పుడు తన నాన్న ఘనతను పునరావృతం చేశాడు. సరిగ్గా చెప్పాలంటే తండ్రికంటే మరో అడుగు ముందుకు వేశాడు. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం, రజతం గెలిచిన తండ్రీకొడుకుల గాథ ఇది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరి శ్రీనివాసరావు పతకధారి కాగా....16 ఏళ్ల తర్వాత వల్లూరి అజయ్ బాబు మెడల్ సొంతం చేసుకొని సగర్వంగా నిలిచాడు. శ్రీనివాసరావు 2010 క్రీడల్లో 56 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం గెలుచుకున్నాడు. ఆర్మీలో ఉద్యోగిగా ఉన్న ఆయన తన ఆరేళ్ల అబ్బాయిని కూడా తనతో పాటు పుణేలోని శిక్షణా కేంద్రానికి తరచుగా తీసుకువెళ్లేవాడు. తండ్రి మాట ప్రకారం ఆరంభంలో ఆటల వైపు కాకుండా చదువు పైనే అజయ్ దృష్టి పెట్టాడు. కానీ ఇంట్లో కనిపిస్తున్న కామన్వెల్త్ క్రీడల పతకం అతడిని పదే పదే వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించింది. దాంతో సహజంగానే శ్రీనివాసరావు తొలి కోచ్‌గా మారి ఆటలో ఓనమాలు నేర్పించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొండవెలగాడ స్వస్థలం కాగా, శిక్షణ కోసం అజయ్ విజయవాడకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో అవకాశం లభించడంతో అతని కెరీర్ మారిపోయింది. ఈ క్రమంలో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలవడంతో అతను మరింత పైకి ఎదిగాడు. కీలక సమయాల్లో తండ్రి అండగా నిలుస్తూ అందించిన ప్రోత్సాహం అజయ్‌ను సరైన దిశలో నడిపించింది. రెండేళ్ల క్రితం మోచేతికి గాయమై శస్త్ర చికిత్స జరిగినప్పుడు మళ్లీ కోలుకొని వెయిట్‌లిఫ్టింగ్‌పై దృష్టి పెట్టేందుకు నాన్న ఇచ్చిన చేయూతే ఫలితాలు అందించింది. గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతోనే ఈ మెగా ఈవెంట్లో అజయ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. తండ్రితో పోలిక కూడా మొదలైంది. గ్లాస్గోకు వెళ్లే ముందు స్వర్ణం సాధిస్తానని అతను తండ్రికి మాటిచ్చాడు. అయితే పసిడి దక్కకపోయినా వెండి పతక విలువేమీ తక్కువ కాదు. ప్రస్తుతం 21 ఏళ్ల వయసే ఉన్న అజయ్‌కు మున్ముందు మరిన్ని పెద్ద విజయాలు సాధించగల సత్తా ఉందని ఈ ప్రదర్శన నిరూపించింది. -
ఫ్రాన్స్ హెడ్ కోచ్‌గా జిదాన్
దిగ్గజ ఫుట్‌బాలర్ జినెదిన్ జిదాన్‌ను ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సమాఖ్య (FFF) తమ జాతీయ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా ప్రకటించింది. 14 ఏళ్ల పాటు జట్టును నడిపించిన డిడియర్ డెషాంప్స్ 2026 ప్రపంచకప్ సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి అనంతరం పదవి నుంచి తప్పుకున్నాడు.54 ఏళ్ల జిదాన్ 2021లో రియల్ మాడ్రిడ్‌ను విడిచిన తర్వాత మళ్లీ కోచింగ్ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పుడు 2030 ప్రపంచకప్ అర్హత పోటీల వరకు కొనసాగే ఒప్పందంపై ఫ్రాన్స్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు.కొత్త బాధ్యతపై జిదాన్ మాట్లాడుతూ.. "ఫ్రాన్స్ జాతీయ జట్టుకు కోచ్‌గా నియమితుడవడం నాకు ఎంతో గర్వకారణం. ఈ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప బాధ్యత. అత్యున్నత లక్ష్యాలతో ముందుకు సాగుతాను" అని అన్నాడు.డెషాంప్స్ నాయకత్వంలో ఫ్రాన్స్:* 2018 ఫిఫా ప్రపంచకప్ విజేత* 2022 ప్రపంచకప్ రన్నరప్* మొత్తం మూడు ప్రధాన టోర్నీల ఫైనల్స్‌కు చేరింది.జిదాన్ కోచ్‌గా సాధించిన విజయాలు:రియల్ మాడ్రిడ్‌కు కోచ్‌గా:* 3 వరుస UEFA ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు (2016, 2017, 2018)* 2 లా లిగా టైటిళ్లు* అనేక అంతర్జాతీయ ట్రోఫీలుఛాంపియన్స్ లీగ్ యుగంలో వరుసగా మూడు సార్లు ట్రోఫీ గెలిచిన తొలి కోచ్‌లలో జిదాన్ ఒకరు.ఆటగాడిగా జిదాన్..* 1998 ప్రపంచకప్ విజేత* యూరో 2000 ఛాంపియన్* 1998 బాలన్ డి'ఓర్ విజేత1998 ప్రపంచకప్ ఫైనల్లో బ్రెజిల్‌పై రెండు హెడర్లతో ఫ్రాన్స్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించాడు. 2006 ప్రపంచకప్ ఫైనల్లో ఇటలీ ఆటగాడు మార్కో మెటరాజీకి హెడ్‌బట్ చేయడంతో రెడ్ కార్డ్ అందుకోవడం కూడా ఫుట్‌బాల్ చరిత్రలో గుర్తుండిపోయే సంఘటనల్లో ఒకటిగా నిలిచింది.తొలి మ్యాచ్ఫ్రాన్స్ హెడ్ కోచ్‌గా జిదాన్ తన తొలి అధికారిక మ్యాచ్‌ను సెప్టెంబర్ 25న టర్కీతో జరిగే UEFA నేషన్స్ లీగ్ మ్యాచ్ ద్వారా ఆరంభించనున్నాడు. ఫ్రాన్స్ అభిమానులు అతడి నాయకత్వంలో జట్టు మళ్లీ ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రస్థానానికి చేరుతుందనే ఆశతో ఉన్నారు. -
వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్‌కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి ; కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజత పతకం సాధించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తండ్రి వారసత్వాన్ని అజయ్ విజయవంతంగా కొనసాగించటం నిజంగా ప్రశంసనీయమన్నారు వైఎస్ జగన్. ఈ మేరకు ట్వీట్ చేశారు.‘మీ అద్భుతమైన ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌కు మరియు యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలాని కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా’ అని అభినందనలు తెలియజేశారు. Heartiest congratulations, Valluri Ajaya Babu, on winning the silver medal in the Men's 79 kg weightlifting event at the 2026 Commonwealth Games! Hats off to you for carrying forward the incredible legacy of your father, Valluri Srinivasa Rao Garu.Your outstanding performance… pic.twitter.com/1O8Ip66ZhY— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026 కాగా, వెయిట్‌లిఫ్టింగ్ స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. దాంతో రజతం ఒడిసిపట్టుకున్నాడు వల్లూరి అజయ బాబు. తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం -
టెన్నిస్‌లో అద్భుతం.. సబలెంకాతో జత కట్టనున్న జకోవిచ్
టెన్నిస్ ఆటలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. సెర్బియా దిగ్గజం, 24 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, మాజీ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్.. మహిళల ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకాతో కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్‌లో జత కట్టనున్నాడు. వీరితో పాటు టోర్నీలో బరిలోకి దిగనున్న 16 జట్ల జాబితాను ప్రకటించారు. గతేడాది యూఎస్ ఓపెన్‌కు ముందే టోర్నీని సమూలంగా మార్చారు. పురుషుల, మహిళల విభాగంలో అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు మిక్స్డ్ డబుల్స్‌లో జతకట్టి ఆడితే ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ అదనంగా ఇస్తామని యూఎస్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ) గతేడాదే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి జకోవిచ్, సబలెంకా కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్‌లో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరితో పాటు 2025లో రన్నరప్‌గా నిలిచిన ఇగా స్వియాటెక్, కాస్పర్ రూడ్ జంటతో పాటు ఎలెనా రైబాకినా-టేలర్ ఫ్రిట్జ్ , నవోమి ఒసాకా-కీ నిషికోరి, జెస్సికా పెగులా-జాక్ డ్రేపర్ మరోసారి బరిలోకి దిగుతున్నారు . ప్రధాన డ్రా ఆగస్టు 25-26 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుతుంది. ఆర్థర్ ఆషే స్టేడియం, లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆగస్టు 17 వరకు జట్లు నమోదు చేసుకోవచ్చు. ఆరోజు వరకు అత్యుత్తమ సంయుక్త సింగిల్స్ ర్యాంకింగ్‌లు కలిగిన ఆరు జంటలు ఆటోమేటిక్‌గా మెయిన్ డ్రాలోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్కన టాప్-10లో ఉన్న జకోవిచ్, సబలెంకా జోడి నేరుగా మెయిన్ డ్రాలో ప్రవేశించనుంది. దీంతో పాటు ఎనిమిది జట్లకు యూఎస్‌టీఏ వైల్డ్ కార్డ్‌లను ఇస్తుంది. మరో రెండు జట్లు ఆగస్టు 24న జరిగే క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ద్వారా ఫైనల్స్‌కు చేరుకుంటాయి. అయితే గతేడాది మిక్సడ్ డబుల్స్ చాంపియన్లుగా నిలిచిన సారా ఎర్రాని, ఆండ్రీ వవస్సోరిలు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-20లో లేకపోవడంతో ఈ జంట మరోసారి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఎనిమిది జట్లతో కూడిన క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌ను కూడా చేర్చారు, ఇందులో ఆరు జట్లకు నేరుగా ప్రవేశం, రెండు జట్లకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. సెమీఫైనల్స్ వరకు, మ్యాచ్‌ల ఫార్మాట్ బెస్ట్-ఆఫ్-త్రీ-సెట్స్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో సెట్లు నాలుగు గేమ్‌లకు, 4-ఆల్ వద్ద టైబ్రేకర్లు, మూడవ సెట్‌కు బదులుగా 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేక్ ఉంటాయి. ఫైనల్ స్టాండర్డ్ స్కోరింగ్ పద్ధతిలో ఉంటుంది, ఇందులో సెట్లు ఆరు గేమ్‌లకు, 6-ఆల్ వద్ద టైబ్రేకర్, అవసరమైతే 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేకర్ ఉంటాయి. Novak Djokovic and Aryna Sabalenka are set to play together in the upcoming US Open mixed doubles 🎾🤝 pic.twitter.com/NVnakqmwGT— BBC Sport (@BBCSport) July 27, 2026Read: సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్? -
తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం
కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత అథ్లెట్లు తమ జోరును ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజతం ఒడిసిపట్టాడు. ముందుగా స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. మలేషియాకు చెందిన ఎర్రీ హిదయత్ ముహమ్మద్ 331 కేజీలు (స్నాచ్ 147 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 184 కేజీలు) ఎత్తి ఒక్క కేజీ బరువు తేడాతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ వెయిట్‌లిఫ్టర్ క్రిస్ ముర్రే 325 కేజీల బరువు ఎత్తి కాంస్యం ఒడిసిపట్టాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం కావడం విశేషం. Photo Credit: IOA Twitterతొలి ప్రయత్నంలో హిదయత్ క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీలు ఎత్తగా, ఆ వెంటనే అజయ బాబు కూడా 181 కేజీలు ఎత్తడంతో 330 కేజీల వద్ద సమంగా నిలిచారు. అయితే రెండో ప్రయత్నంలో హిదయత్ 184 కేజీల బరువు ఎత్తగా, అజయ బాబు విఫలమయ్యాడు. దీంతో ఒక్క కేజీ బరువు తేడాతో అజయ బాబు తృటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. ఇక స్నాచ్ విభాగంలో మాత్రం అజయ బాబు 149 కేజీలు ఎత్తగా, హిదయత్ మాత్రం 147 కేజీలకే పరిమితమయ్యాడు.2010లో తండ్రికి కాంస్యంఇక అజయ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా వెయిట్‌లిఫ్టరే కావడం విశేషం. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీనివాసరావు పురుషుల 56 కేజీల విభాగంలో కాంస్య పతకం ఒడిసిపట్టాడు. తాజాగా వల్లూరి అజయ బాబు 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించి తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు పొందాడు. Photo Credit: IOA Twitterవిజయనగరం జిల్లాకు చెందిన అజయ బాబు వెయిట్‌లిఫ్టింగ్‌లో రోజురోజుకు తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటున్నాడు. 2025 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో ఇదే 79 కేజీల విభాగంలో అజయ బాబు స్వర్ణం సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో అజయ బాబు 335 కేజీలు ( స్నాచ్‌లో 152 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 183 కేజీలు) బరువు ఎత్తి పర్సనల్ బెస్ట్ నమోదు చేశాడు. ఈ ప్రదర్శన అతడిని నేరుగా కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించేందుకు ఉపయోగపడింది. 2024 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ అజయ బాబు డబుల్ స్వర్ణాలతో మెరిశాడు. జూనియర్, సీనియర్ కేటగిరీల్లో 81 కేజీల విభాగంలో అజయ బాబు ఈ ఫీట్ సాధించాడు. #CWG2026 | "It is a mix of happiness and sadness, as I missed out on the gold," says Indian weightlifter Valluri Ajaya Babu after winning silver in the men's 79kg event at the 2026 Commonwealth Games in Glasgow with a total lift of 330kg(Source: ANI) pic.twitter.com/TrdIiENBLL— WION (@WIONews) July 28, 2026Sheer strength on show! 🥈Many congratulations to Khelo India athlete Valluri Ajaya Babu on winning the Silver Medal in the Men's 79kg Weightlifting. With a total lift of 330kg, he also set a Commonwealth Games record in the Snatch. A memorable performance and another proud… pic.twitter.com/GMCQPQtIvm— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 28, 2026 -
పతకాల జోరు.. డబుల్ డిజిట్ దాటిన భారత్
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు జోరును ప్రదర్శిస్తున్నారు. సోమవారం రాత్రి మరో నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేరడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరు అజయ బాబు 79 కేజీల విభాగంలో రజతం సాధించగా, పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుషారే రజతం సాధించాడు. ఇక పారా అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్ ఎఫ్-57 కేటగిరీలో షర్మిలా ధంకర్ స్వర్ణం సాధించగా, శిల్ప కాంస్యం ఒడిసిపట్టింది. ముఖ్యంగా పారా షాట్ ఫుట్ F57 విభాగంలో భారత స్టార్ అథ్లెట్ షర్మిలా ధనకర్ తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించి బంగారు పతకాన్ని ముద్దాడారు. మరోవైపు పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుష్వారే సంచలన ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా సర్వేశ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.వీరితో పాటు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో అజయ బాబు వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఒకే రోజున అటు పారా అథ్లె టిక్స్, ఇటు ట్రాక్ అండ్ ఫీల్డ్, వెయిట్రిఫ్టింగ్ విభాగాల్లో వరుస పతకాలు వరించడంతో భారత క్రీడాభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐదో రోజులు ముగిసేసరికి భారత్ రెండు స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు కలిపి మొత్తం 10 పతకాలతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. An exciting end to Day 4 🇮🇳Team India’s Medal Tally Grew to 10! 🙌🥇 Sharmila Dhankar struck gold in Women’s Shot Put F57🥈 Sarvesh Anil Kushare soared to silver in Men’s High Jump🥈 Valluri Ajaya Babu bagged a silver in Men’s 79kg Weightlifting 🥉 Bindyarani Devi… pic.twitter.com/pNUMnAPLo1— Team India (@WeAreTeamIndia) July 27, 2026Heartiest congratulations to Sharmila on scripting history by winning the Gold medal in the Women's Shot Put F57 event at #CWG2026.Becoming India's first-ever Commonwealth Games Gold medallist in Para Athletics is a truly remarkable achievement. Your unwavering determination,… pic.twitter.com/vuUedWlwuF— Sunil Singhi (@SunilSinghiIND) July 28, 2026Silver for Sarvesh! 🥈 Sarvesh Kushare clears 2.25m to clinch the Silver Medal in the Men's High Jump at Glasgow 2026.👏Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/3e62CEPb5M— Sony Sports Network (@SonySportsNetwk) July 27, 2026Read: తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం -
భారత టీటీ జట్ల శుభారంభం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. భారత పురుషుల జట్టు 3–0తో జింబాబ్వే జట్టుపై... భారత మహిళల జట్టు 3–0తో మాల్దీవులు జట్టుపై విజయం సాధించాయి. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ మానవ్ ఠక్కర్ 11–3, 11–2, 11–6తో తయెందా ముమ్వుమాపై, హర్మిత్ దేశాయ్ 11–5, 11–4, 11–5తో తపివా ముసరువాపై, పాయస్ జైన్ 11–3, 11–3, 11–8తో విక్రమ్ సింగ్‌పై గెలిచారు. భారత మహిళల జట్టు తరఫున సుతీర్థ ముఖర్జీ, యశస్విని, స్వస్తిక విజయం అందుకున్నారు. సుతీర్థ 11–4, 11–2, 11–5తో ఫతీమత్ ధీమా అలీపై, యశస్విని 11–2, 11–5, 11–7తో ఐశాత్ రఫా నాజిమ్పై, స్వస్తిక 11–3, 11–5, 11–2తో మిష్కా ఇబ్రహీంపై గెలుపొందారు. ఏడేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల టీమ్ విభాగాలతోపాటు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత క్రీడాకారులే డిఫెండింగ్ చాంపియన్స్‌గా ఉండటం విశేషం. -
కబడ్డీ నుంచి వెయిట్‌లిఫ్టింగ్ వైపు...
రాజా ముత్తుపండి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోవిల్పట్టి సమీపంలోని శంకరలింగాపురం. తండ్రి ముత్తుపండి రోజూవారీ లేబర్ కాగా, తల్లి పెచ్చియమ్మాల్ ఒక అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. చిన్నప్పటి నుంచి రాజా, అతని సోదరుడు సురేశ్ కబడ్డీ బాగా ఆడేవారు. సాయంత్రం ఫిట్నెస్ కోసం స్థానికంగా ఉండే జిమ్‌కు కూడా వారిద్దరు వెళ్లేవారు. రాజా శారీరక సామర్థ్యం, అతని పట్టుదల చూసిన కోచ్ అతడిని భవిష్యత్ బాగుంటుందంటూ వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించాడు. ఇక్కడ అతను కఠోర శ్రమతో లిఫ్టింగ్‌లో ప్రతిభను ప్రదర్శించాడు. ఈ క్రమంలో మైలదుత్తురైలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్లో అతనికి సీటు లభించింది. ఆపై తగిన శిక్షణ, కోచ్‌ల మార్గనిర్దేశనంలో రాజా ఆట మెరుగైంది. 2017 యూత్/జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలతో తొలిసారి రాజాకు గుర్తింపు దక్కింది. 2024లో జాతీయ రికార్డు నెలకొల్పిన అతను గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (299 కేజీలు) నమోదు చేశాడు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన రాజా... 2022 కామన్వెల్త్ క్రీడలకు ముందు కాలికి అనూహ్య గాయంతో పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రయత్నంలో అతనికి మెడల్ దక్కింది. రాజాకు తమిళనాడు ప్రభుత్వం రూ.30 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించింది. -
రజత రాజా... వెండి జ్ఞానేశ్వరి
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. భారత వెయిట్‌లిఫ్టర్లు ఈ మూడు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో రాజా ముత్తుపండి, మహిళల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్‌లకు రజతాలు లభించగా... మణిపూర్ ప్లేయర్ బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం భారత్ ఒక స్వర్ణం, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 42 పతకాలతో (18 స్వర్ణాలు, 9 రజతాలు, 15 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహిళల 53 కేజీల కేటగిరీలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం గెలుచుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీల బరువెత్తి (మొత్తం 199 కేజీలు) ఆమె రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమొలొలా దీదీ మొత్తం 206 కేజీలు (93+113) స్వర్ణం సాధించి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా... రెబెకా గ్రోక్స్ (కెనడా–178 కేజీలు) కాంస్యం అందుకుంది. స్నాచ్‌లో వరుసగా 82, 85, 88 కేజీల బరువుతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న జ్ఞానేశ్వరి...క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా మూడు ప్రయత్నాల్లో 103, 107, 111 కేజీల బరువును ఎత్తింది. వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల విభాగంలో భారత్‌కు రాజా ముత్తుపండి రజతంతో మెరిశాడు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 126 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 160 కేజీలు కలిపి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తిన రాజాకు రజతం లభించింది. ఈ ఈవెంట్లో అజ్నిల్ బిన్ బిదిన్ ముహమ్మద్ (మలేసియా) కామన్వెల్త్ రికార్డు 299 కేజీలు (133+166)తో స్వర్ణం గెలుచుకోగా, మోరియా బారు (పవువా న్యూ గినియా; 282 కేజీలు)కు కాంస్యం లభించింది. ఈసారి కాంస్యం.. మహిళల 58 కేజీల కేటగిరీలో బింద్యారాణి దేవి సొరొఖైబమ్కు కాంస్య పతకం దక్కింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలుచుకున్న ఆమె ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని బరిలోకి దిగినా... కాంస్యానికే పరిమితమైంది. ఒకదశలో స్వర్ణం దిశగా సాగుతున్నట్లు అనిపించినా... చివర్లో ఆమె తడబడింది. ఓవరాల్‌గా 199 కేజీలు (స్నాచ్‌లో 87 + క్లీన్ అండ్ జర్క్‌లో 112) బరువు ఎత్తిన బింద్యారాణి మూడో స్థానంతో ముగించింది. ఈ పోటీల్లో రఫియతు లవాల్ (నైజీరియా; 229 కేజీలు) కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకోగా... ఆన్ సోఫీ (కెనడా; 215 కేజీలు)కు రజతం దక్కింది. బింద్యారాణి గతంలో కామన్వెల్త్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఒక స్వర్ణం, 2 రజతాలు సాధించింది.పోలీస్ ఖాతాలో పతకం... ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా పని చేస్తోంది. చిన్న వయసులో ముందు పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి చూపించిన ఆమెను వెయిట్‌లిఫ్టింగ్ మరింతగా ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక క్రీడాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జ్ఞానేశ్వరి వెలుగులోకి వచ్చింది. ఎల్రక్టీషియన్ అయిన తండ్రి దీపక్ యాదవ్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురైనా... కూతురిని ఆమె లక్ష్యం దిశగా ప్రోత్సహించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. జూనియర్ స్థాయిలో పలు విజయాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె... పాటియాలాలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో శిక్షణ పొందుతోంది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5వ స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి ఇటీవలే ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఈ కామన్వెల్త్ క్రీడల కోసం గ్లాస్గోలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బర్మింగ్‌హామ్‌లోని వార్లీ వెయిట్‌లిఫ్టింగ్ క్లబ్లో ప్రత్యేకంగా సిద్ధమై ఫలితం సాధించింది.ఫైనల్లో సాజన్ ప్రకాశ్ స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో భారత స్టార్ సాజన్ ప్రకాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కేరళకు చెందిన ‘డబుల్ ఒలింపియన్’ సాజన్ హీట్–2లో 1ని:58.59 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఆరో ఫాస్టెస్ట్ స్విమ్మర్‌గా సాజన్ ఫైనల్లో చోటు సంపాదించాడు. క్వార్టర్స్‌లో అంకుశ్, సచిన్ పురుషుల బాక్సింగ్ ఈవెంట్లో భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతకాలు ఖరారు చేసుకోవడానికి విజయం దూరంలో నిలిచారు. 80 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకుశ్ 5:0తో జాన్ జలాన్ (అంటిగ్వా అండ్ బార్బుడా)పై గెలుపొందగా... 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సచిన్ 4:1తో విలియమ్ హెవిట్ (ఇంగ్లండ్)ను ఓడించాడు.నిరాశపరిచిన సమంత మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్లో భారత జిమ్నాస్ట్ ప్రొతీస్థా సమంత నిరాశ పరిచింది. సమంత 12.883 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. లియా మోనిక (కెనడా; 14.000 పాయింట్లు) స్వర్ణం, అబిగెయిల్ మార్టీన్ (ఇంగ్లండ్; 13.799 పాయింట్లు) రజతం, రోపెర్ (వేల్స్; 13.433 పాయింట్లు) కాంస్యం నెగ్గారు.లాంగ్‌జంప్ ఫైనల్లో శ్రీశంకర్అథ్లెటిక్స్ ఫీల్డ్ ఈవెంట్ లాంగ్‌జంప్‌లో భారత్ నుంచి ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టారు. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో రజతం నెగ్గిన శ్రీశంకర్తోపాటు లోకేశ్ సత్యనాథన్ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్ 8.01 మీటర్ల దూరం గెంతి నేరుగా ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫయింగ్ ప్రమాణం 8 మీటర్ల కావడంతో శ్రీశంకర్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. లోకేశ్ 7.77 మీటర్ల దూరం గెంతి ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ శిర్సే కూడా ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్ రేసును తేజస్ 13.76 సెకన్లలో ముగించి ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల 100 మీటర్ల విభాగంలో జాతీయ చాంపియన్ గురీందర్వీర్ సింగ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. గురీందర్వీర్ 10.39 సెకన్లలో గమ్యానికి చేరి ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు. -
భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరికి రజతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మహిళల 53 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం సొంతం చేసుకుంది.ఈ ఈవెంట్ ఆరంభం నుంచే జ్ఞానేశ్వరి అదరగొట్టింది. తొలుత స్నాచ్ విభాగంలో తన మూడో ప్రయత్నంలో 88 కేజీలను ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కూడా తన జోరును కొనసాగించింది. మొదటి ప్రయత్నంలో 103 కేజీలు, రెండో ప్రయత్నంలో 107 కేజీలు ఎత్తగా.. మూడో ప్రయత్నంలో ఏకంగా 111 కేజీలు లిఫ్ట్ చేసింది. జ్ఞానేశ్వరి మొత్తం 199 కేజీలు (స్నాచ్ 88 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు) లిఫ్ట్ చేసి రెండో స్దానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. మొత్తం 206 కేజీలు (93 కేజీలు + 113 కేజీలు) ఎత్తిన నైజీరియా అథ్లెట్ ఒనోమే దిదిద్కు స్వర్ణ పతకం దక్కింది. -
కామన్వెల్త్ హీరోకు సీఎం విజయ్ భారీ నజరానా
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తమిళనాడు వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ముత్తుపాండిని అభినందించారు. ఆయన సాధించిన విజయం తమిళనాడుకు గర్వకారణమని అన్నారు. ముత్తుపాండి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి రాష్ట్రం, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముత్తుపాండి తమిళనాడులోని కోవిల్పట్టికి చెందినవారు.కాగా, ముత్తుపాండి కామన్వెల్త్ క్రీడల పురుషుల 65 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించాడు.స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 126 కిలోలు ఎత్తడంలో విఫలమైన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తాడు. అనంతరం 129 కిలోల ప్రయత్నం విఫలమైనప్పటికీ, 126 కిలోలతో ఆ విభాగాన్ని ముగించాడు.క్లీన్ అండ్ జర్క్‌లో కూడా తొలి ప్రయత్నంలో 158 కిలోలు ఎత్తలేకపోయిన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో 160 కిలోలు విజయవంతంగా ఎత్తి మొత్తం 286 కిలోల లిఫ్ట్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ హవా.. ఈషా సింగ్‌కు స్వర్ణం, మనుకు కాంస్యం
హ్యాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత షూటర్లు సత్తాచాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణం సాధించగా, మను భాకర్ కాంస్యం గెలుచుకున్నారు. ఈ ఈవెంట్లో ఇద్దరు భారత షూటర్లు ఒకేసారి పోడియంపై నిలవడం విశేషం.అయితే ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ ఆధిపత్యం ప్రదర్శించి, 40 హిట్స్‌తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తీవ్ర పోటీ నడుమ షూట్-ఆఫ్‌ను దాటుకుని వచ్చిన మను బాకర్ 28 హిట్స్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది.అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లోనూ భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని చాటారు. మను బాకర్ 586-20x స్కోరుతో క్వాలిఫయింగ్ చార్ట్‌లో అగ్రస్థానంలో నిలవగా, ఈషా సింగ్ 585-18x స్కోరుతో రెండో స్థానంలో నిలిచి ఎనిమిది మందితో కూడిన ఫైనల్‌కు అర్హత సాధించారు. కానీ ఫైనల్లో మాత్రం 21 ఏళ్ల ఇషా.. మనును వెనక్కి నెట్టి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. -
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది
రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు జాన్ సీనా తన జుట్టు మార్పిడి (Hair Transplant) ప్రయాణం గురించి ఎప్పుడూ చాలా బహిరంగంగా మాట్లాడతారు. తాజాగా శాన్ డియాగో కామిక్-కాన్ (San Diego Comic-Con) వేడుకలో పాల్గొన్న ఆయన, తన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వివరాలను వెల్లడించారు. ఈ మార్పు తన రూపాన్ని మెరుగుపరచడమే కాకుండా, జీవితాన్నే మార్చేసిందని వెల్లడించారు. సిగ్గుతోనే, ఈ ప్రక్రియ గురించి పట్టించుకోలేదని లేదంటే పదేళ్ల క్రితమే చేయించుకుని ఉండేవాడినని తెలిపాడు. అంతేకాదు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ చుట్టూ సమాజంలో ఉన్న సిగ్గు/సంకోచం (Shame) గురించి ఆయన విచారం వ్యక్తం చేశారు.'PEOPLE' మ్యాగజైన్‌తో మాట్లాడిన జాన్ సీనా ఇప్పటివరకు రెండుసార్లు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించు కున్నట్లు తెలిపారు. తన కొత్త హెయిర్‌స్టైల్ గురించి చెప్తూ, ఈ ప్రొసీజర్ చాలా బాగా జరిగిందని అన్నారు. ఎక్కువ జుట్టు పొందడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ఈ జీవితాన్ని మార్చిన మార్పుకు కారణమైన తన వైద్యుడికి ధన్యవాదాలు తెలిపారు: ఎక్కువ జుట్టు కావాలనేది టార్గెట్. దానికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సరియైన మార్గం. ఈ క్రమంలో తనకెంతో ఇష్టమైన డాక్టర్ కేన్ ఆండర్సన్ తన జీవితాన్నే పూర్తిగా మార్చే శారని చెప్పుకొచ్చారు.రెండోసారి చికిత్స , అనుభవంజార్జియాలోని 'ఆండర్సన్ సెంటర్ ఫర్ హెయిర్' వైద్యుల సేవలకు ఇంప్రెస్ అయిన సీనా, మొదటి సర్జరీ జరిగిన 15 నెలల తర్వాత మళ్లీ ఫాలో-అప్ కోసం వెళ్లినపుడు తల పూర్తిగా షేవ్ చేస్తే జుట్టు మార్పిడిని మరింత వేగంగా చేయవచ్చని తెలిపారు. అలా తన తొలి ఆపరేషన్పదమూడున్నర గంటలు పట్టిందన్నారు. కానీ రెండోది ఎనిమిది గంటల్లో పూర్తయిందనీ తన డాక్టర్‌పై పూర్తి నమ్మకం ఉందని,ఆయన చెప్పిన ప్రక్రియను నేను నమ్ముతున్నానని తెలిపారు.జాన్ సీనా హెయిర్ జర్నీ FUE అనేది జుట్టును పునరుద్ధరించడానికి వ్యక్తిగత వెండ్రుకల ఫోలికల్స్‌ను వేరు చేసి నాటే ఒక ఆధునిక సర్జరీ పద్ధతి. జూన్ 2026లో జాన్ సీనా తన రెండో వింత 'ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్' (FUE) చికిత్స గురించి ఫేస్బుక్లో పంచుకున్నారు. దీంతోపాటు గతంలో 2024 చివరలో మొదటిసారి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. ఆగస్టు 2025లో పీపుల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, అభిమానులు, ప్రేక్షకుల వల్లే తాను జుట్టు మార్పడిపై దృష్టి పెట్టానని చెప్పారుతాను బట్టతలను దాచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రేక్షకులు రింగ్ సైడ్ వద్ద 'ది బాల్డ్ జాన్ సీనా' అని బోర్డులు పట్టుకుని చూపించారని గుర్తు చేసుకున్నారు. దాంతో తాను రీసెర్చ్ చేసి, జుట్టు, స్కాల్ప్ ఆరోగ్యం గురించి తెలుసుకునేలా అభిమానులే ప్రోత్సహించారని కూడా తెలిపారు. ప్రస్తుతం రెడ్-లైట్ థెరపీ, మినోక్సిడిల్ (Minoxidil), విటమిన్లు, ప్రత్యేకమైన షాంపూ , కండిషనర్ ఉపయోగిస్తున్నానని వెల్లడించారు.అపోహలపై సీనా ఆవేదనహెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ చుట్టూ సమాజంలో ఉన్న సిగ్గు/సంకోచం (Shame) గురించి ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సంకోచం లేకపోయి ఉంటే తాను దశాబ్దం (10 ఏళ్ల) కిందటే ఈ చికిత్స చేయించుకునే వాడినని అన్నారు. సుమారు 70శాతం నుండి 80శాతం మంది పురుషులు జుట్టు రాలడం లేదా బట్టతల సమస్యతో బాధపడుతున్నారని, కాబట్టి దీని గురించి మాట్లాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని సీనా అభిప్రాయపడ్డారు.ఎవరీ జాన్ సీనాజాన్ ఫెలిక్స్ ఆంథోనీ సీనా రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్. మాజీ రాపర్. ప్రొఫెషనల్ రెజ్లింగ్ చరిత్రలో అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన జాన్ సీనా నటుడు కూడా.2002లో రెజ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సీనా కేవలం ఒకదశాబ్దంలోనే గ్లోబల్ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) లో సూపర్ స్టార్‌గా అభిమానులను అలరించిన సీనా సినీ రంగంలోను రాణించారు. 30 పైగా సినిమాల్లో నటించారు. 24 సంవత్సరాల అద్భుతమైన కెరీర్లో 17సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించి, డిసెంబర్ 2025లో ఆయన పోటీల నుండి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం WWEకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.మేక్-ఎ-విష్ (Make-A-Wish) ఫౌండేషన్ ద్వారా వందలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల కోరికలను తీర్చి మానవతావాదిగా నిలిచారు. రెజ్లింగ్‌తో పాటునటనారంగం (హాలీవుడ్)లో 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' (F9), 'ది సూసైడ్ స్క్వాడ్', 'పీస్‌మేకర్' వంటి ప్రముఖ చిత్రాలు, సిరీస్‌లలో నటించి నటుడిగానూ రాణించారు. -
మీరాబాయి స్వర్ణం వెనుక దాగున్న కన్నీటిగాథ!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో స్వర్ణంతో మెరిసి ఔరా అనిపించింది. 48 కేజీల కేటగిరీలో మీరాబాయి స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగ2ఇరీలో 105 కేజీలు.. మొత్తంగా 190 కేజీల బరువు ఎత్తి దేశానికి తొలి స్వర్ణంప పతకం అందించింది. మీరాబాయికి కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడో పతకం. 2018 గోల్డ్‌కోస్ట్, 2022 బర్మింగ్హమ్ క్రీడల్లోనూ మీరాబాయి పతకాలు సాధించింది. తాజాగా గ్లాస్కో వేదికపై వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన మీరాబాయి ఫోడియంపై నిలబడ్డ సమయంలో జాతీయ గీతం ఆలపిస్తూ కన్నీటిపర్యంతమవ్వడం వైరల్‌గా మారింది. విజయం తర్వాత మీరాబాయి చాను మాట్లాడుతూ.. ‘వరుసగా మూడోసారి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు గత రెండు రోజులుగా ఆహారం ఏమీ తీసుకోలేదు. పసిడి పతకం గెలవడంతో నాపై ఉన్న ఒత్తిడి అంతా పోయింది. నేను చాలా సంతోషంగా, అలాగే చాలా ఉద్వేగంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇవాళ పతకం గెలవడం వెనుక ఎన్నో త్యాగాలు చేయడంతో పాటు, ఒత్తిడిని, గాయాలను అధిగమించాను. నేను కామన్వెల్త్ గేమ్స్‌లో రికార్డు నెలకొల్పుతానని అనుకోలేదు. కేవలం నా కోచ్ అప్పగించిన బాధ్యతను పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి సారించాను. కష్టకాలంలో నా తల్లితో పాటు కోచ్ విజయ్ శర్మ అండగా నిలిచారు. కుటుంబం, స్నేహితుల నుంచి నాపై చాలా ఒత్తిడి ఉండేది. భారత్‌కు మూడో స్వర్ణం అందించినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రీడల్లో నేను పెద్దగా శ్రమ పెట్టకూడదని అనుకున్నాను, కానీ నా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. నేను చెరో రెండు లిఫ్టులు చేస్తానని కోచ్, నేను భావించాము.’ అని మీరాబాయి వ్యాఖ్యానించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన మీరాబాయి తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం ద్వారా కొత్త చరిత్ర లిఖించింది. INDIAN NATIONAL ANTHEM IN GLASGOW 🇮🇳- Mirabai Chanu got emotional after winning the Gold Medal for India in Weightlifting! 🏋️♀️🥺 pic.twitter.com/UfNeFHXg1a— The Khel India (@TheKhelIndia) July 26, 2026 मीराबाई चानू ने CWG 2026 में जीता गोल्ड मेडल CWG गेम्स में चानू की गोल्डन हैट्रिकMirabai Chanu #MirabaiChanu || #GoldMedal #BreakingNews #CWG #mirabaichanu pic.twitter.com/GDCUum3jqY— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) July 26, 2026Read: పాక్ బాక్సర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి -
పాక్ బాక్సర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ జాదుమణి పతకం ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన జాదుమణి పతకానికి అడుగుదూరంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జాదుమణి 5-0తో పాకిస్తాన్ బాక్సర్ సుమామా రెహమాన్‌ను మట్టికరిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం జాదుమణి ఈ విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. "నా విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నాను. పాకిస్థాన్‌పై గెలవడం చాలా గొప్పగా అనిపించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మరింత మెరుగ్గా రాణించి భారత్‌కు స్వర్ణం సాధించిపెడతాను''అని జాదుమణి పేర్కొన్నాడు. తొలి రౌండ్లో బై లభించిన జాదుమణి రెండో రౌండ్లో స్కాట్లాండ్కు చెందిన ఆరోన్ కల్లెన్పై 5-0తో అజేయ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రిక్వార్టర్స్‌లో పాకిస్తానీ బాక్సర్‌పై విరుచుకుపడిన జాదుమణి 5-0తో ఏకగ్రీవ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక జాదుమణి మంగళవారం క్వార్టర్స్ ఫైట్‌లో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశిస్తే అతనికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో సెమీఫైనల్లో ఓడిపోయిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయి.ఇక మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి దెబోరా మావ్ (కెన్యా) రెండో రౌండ్లోనే చేతులెత్తేసింది. ఇక స్విమ్మింగ్‌లో భారత ఫ్రీస్టయిల్ రిలే జట్టు ఫైనల్‌కు చేరింది. 4X200 ఫ్రీస్టయిల్ రిలే హీట్‌లో దక్షణ్, అనీశ్ గౌడ, ఆర్యన్ నెహ్రా, శ్రీహరి నటరాజ్లతో కూడిన భారత జట్టు 7ని:39.48 సెకన్లలో లక్ష్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ ఫైనల్లో భారత ప్లేయర్ తపన్ మొహంతి 70.100 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. లాన్ బౌల్స్‌లో మహిళల పెయిర్ ఈవెంట్లో రూపా రాణి–పింకీ సింగ్ (భారత్) జోడీ, పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ (భారత్) పరాజయాలు చవిచూసి ముందంజ వేయడంలో విఫలమయ్యారు. 🚨 INDIA’S JADUMANI SINGH THRASHED PAKISTANI BOXER 5-0 AT COMMONWEALTH GAMES 2026 🇮🇳🔥Jadumani Singh Mandengbam said - "I dedicate my win to the Kargil heroes. I felt great winning against Pakistan."Another day, Another humiliation for Pakistan 😅pic.twitter.com/1REqzhnEoe— Ajay Jadeja (@AjayJadeja171) July 27, 2026 -
‘వెండి’ కెరటం.. మోచేయి విరిగినా పట్టువదలని విక్రమార్కుడు!
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడో పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి పతకం కొల్లగొట్టిన రాజా ముత్తుపాండి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. మరి ఎవరీ రాజా ముత్తుపాండి? అతడి నేపథ్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.తొలి ప్రయత్నంలోనే స్వర్ణం..జనవరి 12, 2000న జన్మించిన రాజా ముత్తుపాండి, ఇండియన్ రైల్వేస్‌కు వెయిట్‌లిఫ్టర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2017లో కామన్వెల్త్ యూత్/జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ, రజత పతకాలతో రాజా ముత్తుపాండి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 2019, 2022లో జాతీయ టైటిళ్లను గెలుచుకున్న ముత్తుపాండి వెయిట్‌లిఫ్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. మోచేతికి తీవ్రగాయం..అయితే కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 2019లో రాజా ముత్తుపాండి మోచేతి గాయానికి గురయ్యాడు. మోచేతి లిగ్మెంట్‌లో చీలిక రావడంతో బరువులు ఎత్తొద్దని డాక్టర్లు చెప్పడంతో రాజా ముత్తుపాండి కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న రాజా ముత్తుపాండి పట్టువదలని విక్రమార్కుడిలా మోచేతి గాయం నుంచి కోలుకొని తన ప్రస్థానాన్ని మళ్లీ మొదటి నుంచే మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రాజా ముత్తుపాండి 2024లో రాజా 61 కేజీల విభాగంలో 289 కేజీల బరువు ఎత్తి జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో (296 కేజీల బరువు ఎత్తి) రజతం గెలుచుకున్నాడు. నార్వేలోని ఫోర్డేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 65 కేజీల విభాగంలో తొమ్మిదవ స్థానంలో నిలిచిన రాజా ముత్తుపాండి 299 కేజీల (130 కేజీల స్నాచ్ + 169 కేజీల క్లీన్ అండ్ జర్క్) బరువు ఎత్తి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. తద్వారా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు రాజా ముత్తుపాండి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదే ఏడాది సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 302 కేజీల బరువు ఎత్తిన రాజా ముత్తుపాండి జాతీయ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. Proud Moment for Indian Weightlifting!Many congratulations to Raja Muthupandi for clinching Silver in Men's 65kg Weightlifting. #Cheer4Bharat #CWG2026 pic.twitter.com/qjldVR9ja5— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 27, 2026CWG 2026: On winning the silver medal in the men's 65kg weightlifting event at the Commonwealth Games 2026, Muthupandi Raja says, "I did not perform well enough to win the gold, and it was not my best compared to how I had been performing in training. Still, I am happy to have… pic.twitter.com/OEuklfSq3h— IANS (@ians_india) July 26, 2026 -
CWG 2026: వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఈ విభాగం నుంచి ఇప్పటికే రెండు పతకాలు రాగా, తాజగా మూడో పతకం వచ్చి చేరింది. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిదిన్ 299 కేజీల (133+166) బరువు ఎత్తి వరుసగా మూడో సారి స్వర్ణం గెలుచుకోవగా, పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 282 కేజీల (125+157 ) బరువు ఎత్తి కాంస్యం కైవసం చేసుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకోగా, 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ రజతం సాధించాడు. ఓవరాల్‌గా స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు వచ్చి చేరాయి. Another lift. Another medal. 🥈 Raja Muthupandi muscles his way to Commonwealth Games silver in the Men's 65kg event. 🏋️♂️ Watch the Commonwealth Games 2026 TODAY, 2 PM onwards, LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels and Sony LIV#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/SUTs7cv1mH— Sony Sports Network (@SonySportsNetwk) July 26, 2026 #WATCH | Scotland | Glasgow Commonwealth Games 2026 | On winning the silver medal in men's 65kg weightlifting final, Indian weightlifter Raja Muthupandi says, "... I am certainly disappointed because my coach had placed his trust in me, believing we would put in the full effort… pic.twitter.com/hRcmht7xnc— ANI (@ANI) July 26, 2026 -
శ్రీజ, సత్యన్లపై భారీ అంచనాలు
న్యూఢిల్లీ: ఒకవైపు గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ క్రీడలు కొనసాగుతుండగా... మరోవైపు భారత్ వేదికగా నేటి నుంచి 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. స్వదేశంలో జరగనున్న ఈ టోర్నమెంట్లో పలువురు భారత స్టార్లు బరిలోకి దిగనున్నారు. పురుషుల టీమ్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్, హరీ్మత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుశ్ షా, పాయస్ జైన్‌లతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. వచ్చే నెల 2 వరకు కొనసాగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో భారత ప్యాడ్లర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్ల నుంచి ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మహిళల విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ ఆకుల శ్రీజపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ ప్లేయర్ మనికా బాత్రా ఈ టోర్నీకి ఎంపిక కాకపోగా... శ్రీజతో పాటు సుతీర్థ ముఖర్జీ, యశస్విని, సిండ్రెల్లా దాస్, స్వస్తిక ఘోష్ బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో టాప్ సీడ్ సింగపూర్, కెనడా, మలేసియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి భారత ప్యాడ్లర్లకు ప్రధాన పోటీ ఎదురుకానుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 23 పురుషుల, 18 మహిళల జట్లు పాల్గొననున్నాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 1.10 లక్షల డాలర్లు (1.06 కోట్లు) కాగా... కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ఆధ్వర్యంలో దశలవారీగా పోటీలు జరగనున్నాయి. -
టర్కీ ఓపెన్ విజేత సాయి నచికేత్
సాక్షి, హైదరాబాద్: టర్కీష్ ఓపెన్ జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ భట్రాజు సాయి నచికేత్ మెరిశాడు. ఇస్తాంబుల్ లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సాయి నచికేత్ పురుషుల అండర్–19 సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో నచికేత్ 39 నిమిషాల్లో 21–11, 23–21తో టాప్ సీడ్ మెహెమెత్ కాన్ టొరెమిస్ (టరీ్క)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో నచికేత్ 27 నిమిషాల్లో 21–13, 21–19తో మూడో సీడ్ ఆమెర్ మొహమ్మద్ (సౌదీ అరేబియా)పై, క్వార్టర్ ఫైనల్లో 47 నిమిషాల్లో 21–18, 21–23, 21–9తో ఐదో సీడ్ అమీర్ అలీ అహ్మద్లూ (ఇరాన్)పై నెగ్గాడు. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన నచికేత్‌కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో నచికేత్ 21–8, 21–9తో అహ్మెత్ అర్దా కాయా (టర్కీ)పై, మూడో రౌండ్లో 21–17, 21–13తో సలీహ్ మెర్ట్ కాలిమ్లి (టర్కీ)పై విజయం సాధించాడు. రెండు వారాల వ్యవధిలో సాయి నచికేత్కిది రెండో సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. గతవారం అతను ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ టోర్నీలోనూ చాంపియన్‌గా నిలిచాడు. ‘అర్జున అవార్డు’ గ్రహీత, అంతర్జాతీయ మాజీ షట్లర్ చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నచికేత్ శిక్షణ తీసుకుంటున్నాడు. ‘వరుసగా రెండు అంతర్జాతీయ టోర్నీల్లో టైటిల్స్ సాధించడం అంత సులువు కాదు. నచిచేత్ విజయాలకు నేను గరి్వస్తున్నాను. అతనికిది ఆరంభం మాత్రమే. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తాడు’ అని నచికేత్ కోచ్ చేతన్ ఆనంద్ అన్నాడు. -
ఆశాకిరణం అనాహత్
స్క్వాష్ అంటే ఈజిప్ట్... ఈజిప్ట్ అంటే స్క్వాష్... ఈ ‘రాకెట్ క్రీడ’లో ఈజిప్ట్ క్రీడాకారులు రాకెట్ వేగంతో అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు. కారణాలు ఏమైతేనేం కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్క్వాష్‌లో ఈజిప్ట్ ప్లేయర్లు సాధిస్తున్న విజయాలు అసాధారణం. ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలుకొని... ప్రొఫెషనల్ టూర్లో... అంతర్జాతీయ టోర్నీల్లో ఈజిప్ట్ క్రీడాకారులే టైటిల్స్ సొంతం చేసుకుంటున్నారు. సీనియర్లు ఓడిపోతే జూనియర్లు... జూనియర్లు కాకపోతే ద్వితీయశ్రేణి ఆటగాళ్లు... కేటగిరీ మారినా... టోర్నీ స్థాయి మారినా... చివరకు టైటిల్స్ ఈజిప్ట్ ఖాతాలోకే వెళ్లడం సాధారణమైపోయింది. కెనడాలోని ఒంటారియోలో శనివారం ముగిసిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లోనూ ఈజిప్ట్ క్రీడాకారులు టైటిల్స్ ఎగురేసుకుపోవడం ఖాయమనుకున్నారు. కానీ ఈజిప్ట్ జైత్రయాత్రకు భారత ‘నయా రాకెట్’ అనాహత్ సింగ్ అడ్డుకట్ట వేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త జగజ్జేతగా అవతరించింది. అనాహత్ దెబ్బకు...గత 16 ఏళ్లుగా వరుసగా ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన ఈజిప్ట్ క్రీడాకారిణులు ఈసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు. –సాక్షి క్రీడా విభాగం మరో రెండేళ్లలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో స్క్వాష్ క్రీడ తొలిసారి మెడల్ ఈవెంట్‌గా అరంగేట్రం చేయనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్ తొలి ప్రయత్నంలోనే స్క్వాష్‌లో పతకం సాధించే అవకాశం ఉంది. ఇంత నమ్మకం ఎందుకంటే... భారత రైజింగ్ సాŠట్ర్ అనాహత్ సింగ్ అసాధారణ ప్రదర్శన గమనించాక అంచనాలు అమాంతం పెరిగాయి. నాలుగేళ్లుగా అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న అనాహత్ తాజాగా ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. 2005లో జోష్నా చినప్ప ఫైనల్‌కు చేరినా... తుది పోరులో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. అనాహత్ మాత్రం ఫైనల్ చేరిన తొలి ప్రయత్నంలోనే జగజ్జేతగా నిలిచింది. గత ఏడాది ఇదే ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ అనాహత్ ఈసారి మాత్రం అదరగొట్టింది. చాంపియన్‌గా నిలిచిన క్రమంలో ఆమె వరుసగా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో ముగ్గురు ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ ఏడాది తర్వాత 18 ఏళ్ల అనాహత్ జూనియర్ సర్క్యూట్లో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రపంచ సీనియర్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అనాహత్ 20వ స్థానంలో ఉంది. వచ్చే రెండేళ్లలలో ఆమె ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశముంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో 16 మంది... మహిళల సింగిల్స్‌లో 16 మంది పోటీపడతారు. ఐదు బెర్త్‌లను రీజినల్ గేమ్స్ (ఆసియా, ఆఫ్రికా, పాన్ అమెరికా, యూరోపియన్, ఓసియానియా/కరీబియన్ ప్లే ఆఫ్స్) ద్వారా భర్తీ చేస్తారు. సెపె్టంబర్లో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో అనాహత్ సింగ్ స్వర్ణం సాధిస్తే నేరుగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒలింపిక్స్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే పోటీపడే వీలుంది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ నుంచి ఇద్దరు మాత్రమే అర్హత సాధిస్తారు. ఫలితంగా అనాహత్ లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తే పతకం రేసులో కూడా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్ఫూర్తితో ఐదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన అనాహత్... ఆ తర్వాత తన సోదరి అమీరా ప్రేరణతో స్క్వాష్ వైపు మళ్లింది. 2019లో బ్రిటిష్ ఓపెన్‌లో అండర్–11 సింగిల్స్‌లో విజేతగా నిలిచి వెలుగులోకి వచి్చన అనాహత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన ఆటకు పదును పెంచుకుంటూ పోయింది. ఢిల్లీకి చెందిన అనాహత్ మూడుసార్లు ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచింది. 2022 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు గెలిచింది. 2025 ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది. ‘ఈ విజయం నాకు సర్వస్వం లాంటిది. అంతా కలలా అనిపిస్తోంది. ఈ టోర్నీ నాకు శాపంలా అనిపించింది. ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ లేదా సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాను. అయితే ఈసారి అన్నీ అధిగమించి టైటిల్ అందుకున్నాను. ఈ గెలుపు ఇంకా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే జూనియర్ విభాగంలో నాకిదే చివరి సంవత్సరం. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచేందుకు నా ముందున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. ఒత్తిడి పెంచుకుంటే నా ఆటతీరు దారుణంగా ఉంటుందని తెలుసు. అందుకే ఈసారి ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా ప్రతి పాయింట్‌ను ఆస్వాదించాలని బరిలోకి దిగాను. అనుకున్నది సాధించాను’– అనాహత్ సింగ్ -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషల వెయిట్‌లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రిషికాంత్ సింగ్ రజత పతకం సాధించాడు. ఈ ఈవెంట్లో రిషికాంతకు ప్రధాన పోటీదారుడిగా నిలిచిన మలేషియా అథ్లెట్ అనిక్ కస్దాన్కు గోల్డ్‌మెడల్ దక్కింది.కాగా తొలుత స్నాచ్ విభాగంలో రిషికాంత, అనిక్ కస్దాన్లు ఇద్దరూ అత్యధికంగా 121 కేజీల బరువును ఎత్తి ఇద్దరూ అగ్రస్ధానంలో నిలిచారు. క్లీన్ అండ్ జెర్క్‌లో మాత్రం కస్దాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. రిషికాంత తన అత్యుత్తమ ప్రయత్నంలో 143 కేజీలు మాత్రమే ఎత్తగా, కస్దాన్ 152 కేజీల బరువును ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచాడు. కస్దాన్ మొత్తం 273 కేజీల (121kg+152kg) బరువు ఎత్తి అగ్రస్ధానంలో నిలవగా.. రిషికాంత మొత్తం 264 కేజీల (121kg+143kg) రెండో స్ధానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన జోషువా అముంగా మబోయా 260 కేజీల మొత్తం స్కోరుతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. -
కామన్వెల్త్ గేమ్స్‌లో అపశ్రుతి.. జిమ్నాస్టిక్స్‌లో భయానక దృశ్యం!
కామన్వెల్త్ గేమ్స్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. జిమ్నాస్టిక్స్ ఫైనల్ ఈవెంట్ సందర్భంగా ఇంగ్లండ్ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్టన్ హారిజంటల్ బార్‌పై పట్టు కోల్పోయి తలకిందులుగా మ్యాట్‌పైకి జారిపడ్డాడు. దీంతో అతడి మెడకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. సపోర్ట్ స్టాఫ్ వచ్చి లాంగ్టన్కు అత్యవసర చికిత్స అందించారు. Photo Credit: CWG 2026 Twitterఆ తర్వాత లాంగ్టన్ లేవడానికి ఇబ్బంది పడడంతో స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. లాంగ్టన్ కిందపడడంతో కాసేపు భయానక వాతావరణం నెలకొనడంతో పోటీలు నిలిపివేశారు. ఇప్పటికే గాయంతో ఆరుసార్లు ఒలింపిక్ విజేత మాక్స్ విట్లాక్ దూరమవ్వడంతో అతడి స్థానంలో లాంగ్టన్కు అవకాశమిచ్చారు.వరుసగా నాలుగో కామన్వెల్త్ గేమ్స్ పురుషుల టీం టైటిల్ కోసం ఇంగ్లండ్ ప్రయత్నిస్తున్న సమయంలో చివరి రౌండ్లో లాంగ్టన్ గాయపడడం ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆ తర్వాత లాంగ్టన్ లేకుండానే పోటీలు పూర్తి చేసిన ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకం గెలుచుకోగా, కెనడా, ఆస్ట్రేలియా జట్లు స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. Photo Credit: CWG 2026 Twitterఇక గాబ్రియెల్ లాంగ్టన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇంగ్లండ్ టీమ్ ప్రకటించింది. అతడి పరిస్థితి మెరుగ్గానే ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపింది. లాంగ్టన్ గాయాలతో పోటీకి దూరమైనప్పటికీ, తన జట్టు సిల్వర్ మెడల్ సాధించడంతో సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నట్లు ఇంగ్లం్ టీమ్ వెల్లడించింది. 🚨NEWS: English gymnast Gabriel Langton has been rushed to hospital after suffering a major fall during the Commonwealth Games pic.twitter.com/bXsMusO5fF— Basil the Great (@BasilTheGreat) July 25, 2026చదవండి: ఆటలోనే కాదు ఆ విషయంలోనూ మెస్సీ కింగే! -
ఆటలోనే కాదు ఆ విషయంలోనూ మెస్సీ కింగే!
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ అరుదైన ఫీట్ సాధించాడు. మైదానంలో తన ఆటతో కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్న మెస్సీ తాజాగా తన జెర్సీ విషయంలోనూ కింగ్ అని నిరూపించుకున్నాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ సమయంలో మెస్సీ 10వ నంబర్ జెర్సీలు అత్యధికంగా అమ్ముడయ్యాయని ఫిఫా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఫిఫా 2026లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై గెలిచి 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా ప్రపంచకప్‌ను అందుకుంది. ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను నడిపించాడు. 8 మ్యాచ్‌లాడిన మెస్సీ 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌లు చేసి టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచి సిల్వర్ బూట్ కైవసం చేసుకున్నాడు. అంతేకాదు ఏడు వరుస ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్ కొట్టిన తొలి ఆటగాడిగాను మెస్సీ రికార్డులకెక్కాడు. 2022లో అర్జెంటీనాను చాంపియన్‌గా నిలిపిన మెస్సీ ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని భావించాడు. కానీ ఫైనల్లో స్పెయిన్ చేతిలో చతికిలపడిన అర్జెంటీనా రన్నరప్‌కే పరిమితమైంది. 39 ఏళ్ల మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ (2030) ఆడేది అనుమానమే. 🚨 FIFA has officially announced that Lionel Messi's jersey was the best-selling jersey of the 2026 FIFA World Cup! 👕🐐🇦🇷 pic.twitter.com/nnLVWtVK7L— FC Barcelona Fans Nation (@fcbfn_live) July 25, 2026Read: హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్‌ప్లాన్! -
చరిత్ర సృష్టించిన అనాహత్.. తొలి ప్లేయర్‌గా రికార్డు
ఒంటారియో (కెనడా): భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్... ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11–3, 11–7, 11–9తో రుఖయ్య సలీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. తద్వారా భారత్ నుంచి తొలి ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌గా అవతరించింది. 2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. గతేడాది కైరోలో జరిగిన ఈ టోర్నమెంట్లో కాంస్యం నెగ్గిన అనాహత్... ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో చాంపియన్‌గా నిలిచిన అనాహత్‌కు పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. BIG BIG BIGGG NEWS 🔥🔥🔥🔥ANAHAT SINGH IS WORLD JUNIOR CHAMPION 🏆 🇮🇳THE QUEEN FROM INDIA IS AT THE TOP OF WORLD TODAY!Anahat defeated Ruqayya Salem 🇪🇬 3-0 to become the first Indian to win the Junior Squash World Championship 🏆 First Non Egyptian player to win Jr World… pic.twitter.com/eA0rouqE2f— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) July 25, 2026Read: సిరీస్ విజయం.. టీ20ల్లో నంబర్‌వన్‌గా టీమిండియా -
ఝండూ పవర్
గ్లాస్గో: పారా పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకంతో బోణీ చేస్తూ కామన్వెల్త్ క్రీడల పతకాల జాబితాలో భారత్ కూడా చేరింది. పురుషుల హెవీ వెయిట్ కేటగిరీలో భారత్‌కు చెందిన ఝండూ కుమార్ కాంస్యం (130.9 పాయింట్లు) సొంతం చేసుకున్నాడు. ఈ పోటిల్లో భారత్‌కు ఇదే తొలి పతకం తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువెత్తి ఝండూ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. మొదటి ప్రయత్నంలో 181 కేజీల బరువెత్తిన అతను రెండో ప్రయత్నంలో దానిని మరింత మెరుగుపర్చుకున్నాడు. చివరి ప్రయత్నంలో 196 కేజీల కోసం ప్రయత్నించినా అతను విఫలమయ్యాడు. ఈ ఈవెంట్లో రిలువాన్ ఇద్రీస్ (208 కేజీలు; నైజీరియా) స్వర్ణం గెలుచుకోగా, మాథ్యూ హార్డింగ్ (199 కేజీలు; ఇంగ్లండ్)కు రజతం దక్కింది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో ఆరుగురు భారత పవర్‌లిఫ్టర్లు పతకం సాధించడంలో విఫలమయ్యారు. పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల లైట్ వెయిట్ విభాగంలో భారత్ లిఫ్టర్ అశోక్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకున్నాడు. ఇతర ఫలితాలు→ భారత బాక్సర్ సచిన్ సివాచ్ (62 కేజీలు) 4–1తో అహ్మదీ (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. → మహిళల బౌల్స్ పెయిర్ ఈవెంట్లో భారత జోడి రూపా రాణి – పింకీ సింగ్ ‘టైబ్రేకర్’లో టోంగాపై గెలిచింది. → పురుషుల స్విమ్మింగ్ (400 మీ. ఫ్రీస్టయిల్)లో భారత స్విమ్మర్లు ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. దక్షణ్ శశికుమార్ 15వ, ఆర్యన్ 6వ స్థానంతో ముగించారు. → మహిళల 3X3 వీల్ చెయిర్ బాస్కెట్‌బాల్ ఈవెంట్ తొలి మ్యాచ్‌లో భారత్ 1–16 తేడాలో వేల్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది. → పురుషుల బౌల్స్ ఈవెంట్ సింగిల్స్‌లో భారత ఆటగాడు పుతుల్ సోనోవాల్ 4–8, 8–9 స్కోరుతో ఇజ్జత్ జుల్కెప్లె (మలేసియా) చేతిలో ఓడాడు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లి క్లోజ్ ఖాతాలో 19వ కామన్వెల్త్ పతకం చేరింది. తద్వారా ఈ పోటీల్లో అత్యధిక పతకాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు షూటర్లు ఫిల్ ఆడమ్స్, గౌల్ట్ (18 పతకాలు) పేరిట ఉంది.అవమాన కుమార్!!! అతని అసలు పేరు అవినాశ్ కుమార్. అయితే ఐదేళ్ల వయసులో పోలియోబారిన పడి నడుం కిందిభాగం చచ్చుబడిపోయింది. ‘నువ్వు తండ్రికి భారంగా పుట్టావు. అతడి పరువు తీశావు’ అంటూ కొందరు బంధువులు ఝండ్ (అవమానం) అంటూ పిలవడం మొదలుపెట్టారు. చిన్నప్పుడు రికార్డుల్లో కూడా ఇదే పేరు నమోదు కావడంతో చివరకు అసలు పేరు పోయి అతను ఝండూ కుమార్‌గా మారాడు! స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా హర్నౌత్. తండ్రి కూరగాయలు అమ్మగా వచ్చే ఆదాయంతో జీవనం సాగే పరిస్థితుల్లో అతను చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే కఠోర శ్రమతో, పట్టుదలతో వాటిని అధిగమించాడు. కుటుంబ పోషణకు తాను కూడా కూరగాయాలు అమ్మాడు. ఉదయం 4 గంటలకే 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హోల్‌సేల్ మార్కెట్లో కూరగాయలు తెచ్చుకొని హర్నౌత్లో ఫుట్‌పాత్‌పై అమ్మడం అతని రోజూవారీ దినచర్య. 4 గంటల వరకు అమ్మకం ముగించి ఆ తర్వాత జిమ్‌కు వెళ్లడం, ప్రాక్టీస్ చేయడంతోనే పవర్‌లిఫ్టింగ్‌లో అతను రాటుదేలాడు. కాళ్లు లేకపోయినా శారీరక సౌష్టవం పెంచుకోగలననే నమ్మకంతో తన ట్రైసైకిల్‌ను దాదాపు కిలోమీటర్ తోసుకుంటూ జిమ్‌కు వెళ్లి ఝండూ సాధన చేశాడు. అయితే ఆర్థిక సమస్యలు మరింత పెరగడంతో బ్యాటరీ ఈ–రిక్షా నడిపి కొంత ఆదాయం పొందే ప్రయత్నం చేశాడు. గాందీనగర్‌లోని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో అవకాశం లభించడంతో అతని జీవితం మారింది. ఏడాది క్రితం 205 కిలోల బరువెత్తి కొత్త జాతీయ రికార్డు సాధించిన ఝండూ ఆ తర్వాత 206 కేజీలతో దానిని సవరించాడు. ప్రపంచ కప్‌లో కాంస్యం, ఆసియా ఓషియానియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఝండూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. -
ఫైనల్‌కు దూసుకెళ్లిన అనాహత్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు
ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అనాహత్ 3-1 (11-3, 8-11, 11-4, 11-6) తేడాతో మూడో సీడ్ బార్బ్ సమెహ్ (ఈజిప్ట్)పై విజయాన్ని అందుకుంది. తద్వారా 21 ఏళ్ల తర్వాత ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన రెండో క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ రికార్డులకెక్కింది. 2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న అనాహత్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది కూడా పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పనుంది. గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అనాహత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే నాలుగు గేమ్‌ల పాటు జరిగిన మ్యాచ్‌లో అనాహత్ తొలి గేమ్‌ను 11-3తో గెలుచుకోగా, రెండో గేమ్‌ను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు, నాలుగు గేముల్లో విజృంభించిన అనాహత్ గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. మ్యాచ్ విజయం అనంతరం అనాహత్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. బ్రిటీష్ జూనియర్ ఓపెన్‌లో ఇదే బార్బ్‌ను ఎదుర్కొన్నా, అప్పుడు పరిస్థితులు నాకు కఠినంగా ఉన్నాయి. కానీ ఈసారి ఆ తప్పిదం చేయకూడదని మొదటి నుంచి గెలుపు కోసమే ప్రయత్నించాను. అయితే క్వార్టర్స్‌లో నమోదు చేసిన ప్రదర్శనను ఇక్కడ పునరావృతం చేయడంలో విఫలమైనప్పటికీ సెమీస్‌లో విజయం నాకు సంతృప్తినిచ్చింది. ఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా నా తల్లిదండ్రులను, కోచ్‌లను హ్యాపీ చేయగలిగాను. కానీ ఫైనల్ గెలిస్తేనే నాకు ముగింపు’ అని చెప్పుకొచ్చింది. ANAHAT SINGH STORMS INTO THE FINALS OF JUNIOR WORLD C’SHIP 🏆🤩India’s Anahat defeated Barb Sameh of Egypt 🇪🇬 3-1 (11-3, 8-11, 11-4, 11-6) in the Semi Final!She became the second ever Indian to reach into the World Junior C’ship Final ✅WELL DONE! 🔥 pic.twitter.com/2wEfv2sDAK— The Khel India (@TheKhelIndia) July 25, 2026Read: రెండో టీ20కి భారత తుదిజట్టు అంచనా.. అతడిపై వేటు! -
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
ఎఫ్ఐహెచ్ యూత్ హాకీ5స్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత సబ్‌జూనియర్ బాలుర జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 7-3 తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే రోజు ఆతిథ్య ఒమాన్‌ను 10-1తో చిత్తు చేసి వరుస విజయాలతో అదరగొట్టింది.పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోమిత్ పాల్, కరణ్ గౌతమ్, కెప్టెన్ కేతన్ కుష్వాహా తొలి అర్ధభాగంలోనే గోల్స్ చేసి భారత్‌కు 3-0 ఆధిక్యం అందించారు. అనంతరం ప్రహ్లాద్ రాజ్‌భర్, షారుఖ్ అలీ, రాహుల్ యాదవ్, కేతన్ కుష్వాహా మరోసారి గోల్స్ చేయడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది.అంతకుముందు ఒమాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేతన్ కుష్వాహా నాలుగు గోల్స్‌తో మెరవగా, షారుఖ్ అలీ, కరణ్ గౌతమ్, ప్రహ్లాద్ రాజ్‌భర్ తలో రెండు గోల్స్ చేసి భారత్‌కు 10-1 తేడాతో భారీ విజయాన్ని అందించారు.మరోవైపు బాలికల ఎలైట్ పూల్ మ్యాచ్‌లో భారత సబ్‌జూనియర్ జట్టు చైనాతో పోరాడినా 3-6 తేడాతో ఓటమి పాలైంది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి స్కోరు 3-3తో సమంగా ఉన్నప్పటికీ, రెండో అర్ధభాగంలో చైనా ఆధిపత్యం చెలాయించి విజయాన్ని అందుకుంది.ఈ టోర్నీ ద్వారా ప్రారంభ ఎఫ్ఐహెచ్ యూత్ హాకీ5స్ ప్రపంచకప్‌కు ఆసియా జట్ల ఎంపిక కూడా జరగనుంది. -
కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త చరిత్ర
దక్షిణాఫ్రికా స్టార్ స్విమ్మర్ చాడ్ లే క్లోస్ (Chad le Clos) కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ప్రస్తుత ఎడిషన్‌లో (commonwealth Games 2026) ఈ ఘనత సాధించాడు.పురుషుల 4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో కాంస్య పతకం గెలవడంతో అతడు తన ఖాతాలో 19వ కామన్వెల్త్ పతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ పతకంతో ఆస్ట్రేలియా షూటర్ ఫిల్ అడమ్స్, ఇంగ్లండ్ షూటర్ మిక్ గాల్ట్ పేరిట ఉన్న 18 పతకాల రికార్డును అధిగమించాడు.34 ఏళ్ల క్లోస్ ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్‌లో 7 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలు సహా మొత్తం 19 పతకాలు సాధించాడు. 2010లో న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన అతడు అప్పుడే ఐదు పతకాలు గెలిచి సంచలనం సృష్టించాడు. రికార్డు పతకం సాధించిన అనంతరం క్లోస్ భావోద్వేగానికి గురయ్యాడు.ప్రస్తుత ఎడిషన్‌లో క్లోస్ పోటీలు ఇంకా ముగియలేదు. అతడు 50 మీటర్లు, 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లలో బరిలోకి దిగాల్సి ఉంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో నాలుగు పతకాలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 16 టైటిళ్లు గెలిచిన ఈ స్టార్ స్విమ్మర్.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
భారత్‌లో పర్యటించనున్న బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు..?
భారత్‌లో ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో ఓ అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ ఆడే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (CBF) ఇప్పటికే సెప్టెంబర్ 25న టౌన్స్‌విల్లే, సెప్టెంబర్ 29న బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు ఖరారు చేసింది. వీటికి అదనంగా అక్టోబర్ తొలి వారంలో భారత్‌లో మరో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని ESPN Brasil వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు ప్రత్యర్థి జట్టును ఇంకా ఖరారు చేయలేదు.ఈ మ్యాచ్‌కు కోల్‌కతా వేదికగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2026 ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా అమెరికాలో జరిగిన చర్చల తర్వాత ఈ ప్రణాళిక రూపుదిద్దుకుందని సమాచారం.ప్రపంచకప్ సమయంలో కోల్‌కతాలో వేలాది మంది అభిమానులు బ్రెజిల్ జెర్సీలు ధరించి సందడి చేయడం.. నెయ్మార్, వినీసియస్ జూనియర్ చిత్రాలతో నగరం కళకళలాడడం CBF దృష్టిని ఆకర్షించిందని తెలుస్తోంది.అన్ని చర్చలు విజయవంతంగా పూర్తైతే, తుది ఒప్పందంపై సంతకాలు జరిగి బ్రెజిల్ జట్టు భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో భారత ఫుట్‌బాల్ అభిమానులకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం లభించనుంది. -
30 ఏళ్లకే వీడ్కోలు.. ఊహించని ట్విస్ట్‌తో మాజీ చాంప్ రీఎంట్రీ!
మాజీ యూఎస్ ఓపెన్ చాంపియన్, ఆస్ట్రియా మాజీ టెన్నిస్ ప్లేయర్ డొమినిక్ థీమ్ మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు. కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 30 ఏళ్ల వయసులో థీమ్ అనూహ్యంగా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే రెండేళ్ల తర్వాత మాజీ చాంపియన్ రీఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి దాగుంది. అదేంటంటే థీమ్ ఈసారి టెన్నిస్ ప్లేయర్‌గా కాకుండా ఫుట్‌బాలర్‌గా అడుగుపెట్టనుండడమే!Photo Credit: Twitterఆస్ట్రియా ఫుట్‌బాల్ లీగ్‌లో డొమినిక్ థీమ్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. పలు నివేదికలు అందించిన సమాచారం మేరకు డొమినిక్ థీమ్ ఇప్పటికే ఆస్ట్రియాకు చెందిన అమెచ్యూర్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన బాడెనర్ ఏసీ తరఫున తన పేరును రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత తన హోమ్టౌన్ క్లబ్ ఎస్సీ లిచ్టెన్వర్త్ (బాడెనర్ క్లబ్లో జాయిన్ కాకముందు) తరఫున పది మ్యాచ్‌లు ఆడిన డొమినిక్ థీమ్ ఒక గోల్ కూడా చేయడం విశేషం. టెన్నిస్‌లో స్టార్ ఆటగాడి హోదా పొందినప్పటికీ, ఫుట్‌బాల్‌లో మాత్రం ఒక సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అందుకే అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్‌బాల్ క్లబ్ కూడా ఇప్పటికీ డ్రెసింగ్ రూమ్‌లో ప్రత్యేక లాకర్ లేదా ఇతర సదుపాయాలు ఇవ్వలేదు.Photo Credit: Twitterవరుస గాయాలతో వీడ్కోలు..2020 యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన డొమినిక్ థీమ్ 2024లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటికీ 30 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న డొమినిక్ థీమ్ అనూహ్యంగీ వీడ్కోలు పలకడం వెనుక వరుస గాయాలు అతడిని ఇబ్బంది పెట్టడమే. 2020లో యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత 2021లో ఏడుసార్లు మణికట్టు గాయానికి గురవ్వడంతో రెండేళ్ల పాటు ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. Photo Credit: Twitterకెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్న సమయంలో వరుస గాయాలకు తోడు 2024లో యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే డొమినిక్ థీమ్ ఇంటిబాట పట్టాడు. దీంతో టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని ఆరోజే నిర్ణయం తీసుకున్నాడు. ఇక వియన్నా ఓపెన్‌లో తొలి రౌండ్లో ఇటలీకి చెందిన లూసియానో దార్దేరి చేతిలో రెండు సెట్లలోనే డొమినిక్ థీమ్ పరాజయం చవిచూశాడు. టెన్నిస్‌లో థీమ్‌కు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం. 30 ఏళ్ల వయసులో పీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో టెన్నిస్‌ను వదిలేసిన డొమినిక్ థీమ్ రెండేళ్ల తర్వాత సరికొత్తగా మారి ఫుట్‌బాల్ ఆటలో అడుగుపెడుతున్నాడు. మరి ఫుట్‌బాల్‌లో డొమినిక్ థీమ్ మెరుస్తాడా లేదా అన్నది చూడాలి.చదవండి: ‘హ్యాండ్‌షేక్’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్! -
కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్ హెవీవెయిట్ కేటగిరీలో ఝండు కుమార్ కాంస్యంతో మెరిశాడు. గ్రూప్-బి నుంచి బరిలోకి దిగిన ఝండు తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువును ఎత్తి 130.9 పాయింట్లు స్కోరును సాధించాడు. ఇప్పటివరకు ఝండు కెరీర్లో అత్యుత్తమంగా ఉన్న 198 కేజీల బరువును అధిగమించనప్పటికీ తాజా కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం కాంస్యాన్ని ఒడిసిపట్టాడు. మూడో ప్రయత్నంలో 196 కేజీల బరువు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ తన కంటే ఎక్కువగా ఎవరు బరువు ఎత్తకపోవడంతో గ్రూప్-బి నుంచి తొలి స్థానంలో, ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచి పతకం ఖాయం చేసుకున్నాడు. ఇక నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 208 కిలోల బరువు ఎత్తి 132.8 పాయింట్లు సాధించి పోడియంపై తొలి స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నాడు. ఇక 199 కిలోల బరువు ఎత్తిన ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ 131 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి వెండిని కైవసం చేసుకున్నాడు. ఇక కాంస్య పతకం గెలుచుకున్న అనంతరం ఝండు కుమార్ మాట్లాడాడు.‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. భారత్‌కు ఇది చాలా ముఖ్యం. ఈ గేమ్స్‌లో నాదే దేశానికి తొలి పతకం కావడాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. జాతీయ జెండాను పోడియంపై చూసినప్పుడు గర్వంగా ఫీలయ్యాను. థాంక్యూ ఇండియా. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను పతకం గెలిచిన విషయాన్ని ముందుగా ఇంట్లో అమ్మానాన్నలకు చెప్తాను. అలాగే, చిన్నప్పటి నుంచి నాకు అండగా నిలిచిన నా స్నేహితుడు గౌతమ్ భయ్యాకు కూడా విషయాన్ని చెప్పాలి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ-రిక్షా నుంచి వెయిట్‌లిఫ్టర్ దాకాపేదరికం విజయకాంక్షను పెంచుతుందనే మాట పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ సాధించిన ఘనత ద్వారా మరోసారి నిరూపితమైంది. హర్నౌత్‌కు చెందిన ఒక కూరగాయల వ్యాపారి కుమారుడైన ఝండు ఒక ఈ-రిక్షా డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. హర్నౌత్లోని ది రాక్ స్టార్ జిమ్ యజమాని గౌతమ్ సింగ్ రాకతో ఝండు జీవితం పూర్తిగా మారిపోయింది. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్ (కేఐపీజీ)లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. మార్చి 23న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్లో జరిగిన పురుషుల 72 కేజీల విభాగంలో, ఆ పవర్‌లిఫ్టర్ 206 కేజీల బరువును ఎత్తి తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మార్చి 17-18 తేదీలలో నోయిడాలో జరిగిన పారా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ఝండు 205 కేజీల బరువును ఎత్తి, సుధీర్ కుమార్ యొక్క 192 కేజీల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.పుట్టుకతో పోలియో28 ఏళ్ల అతనికి పుట్టుకతోనే పోలియో సోకిన కాళ్లు ఉన్నాయి. అతని పారా స్పోర్ట్స్ ప్రయాణం 2017లో ప్రారంభమైంది. మొదట్లో, అతను షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పోటీపడ్డాడు. ఆ సమయంలో, అతనికి పారా పవర్‌లిఫ్టింగ్ గురించి తెలియదు. F-55 కేటగిరీలో, ఝండు అనేక షాట్పుట్డి, డిస్కస్ త్రో ఈవెంట్లలో పాల్గొని విజయం సాధించాడు, కానీ అతని గమ్యం వేరే చోట ఉండటంతో, విధి అతన్ని ఆ దిశగా నడిపించింది.కష్టాలతో కూడిన ప్రయాణం తర్వాత, అతను గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(NCOE)కి చేరుకున్నాడు. ప్రముఖ పారా కోచ్ రాజిందర్ సింగ్ రాహేలు మార్గదర్శకత్వంలో పవర్ వెయిట్‌లిఫ్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. డిసెంబర్ 2023లో, KIPG తొలి ఎడిషన్‌లో పవర్‌లిఫ్టింగ్ విభాగంలో ఝండు కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2028 లాస్ ఏంజెలెస్ పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని ఝండు కుమార్ పేర్కొన్నాడు.ప్రధాని మోదీ అభినందనలుకామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన ఝండు కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. 'కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన ఝండు కుమార్‌కు అభినందనలు. అతడి అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికను తెరవడం గొప్ప విషయం. అతడి విజయం అపారమైన శక్తికి, అతడి సంకల్పానికి, ఎన్నో ఏళ్ల తరబడి క్రమశిక్షణకు నిదర్శనం. తన జీవితంలో ఎదురైన ప్రతీ సవాల్‌ను అధిగమించి ఇవాళ అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశానికి గర్వకారణంగా నిలిచి భారతీయులందరికి స్ఫూర్తిగా నిలిచాడు.' అని మోదీ కొనియాడారు. A spectacular performance by Jhandu Kumar, who has opened India’s medal tally at the #CWG2026 by winning a Bronze in the Men’s Heavyweight Para Powerlifting event! Congratulations to him. His achievement is a powerful reflection of immense strength, unwavering determination and… pic.twitter.com/kMdkU6RRAF— Narendra Modi (@narendramodi) July 25, 2026 🇮🇳 BRONZE FOR BHARAT! 🥉 Jhandu Kumar opens India’s #CWG2026 medal tally with a massive 190kg lift in Men’s Heavyweight Para Powerlifting. The entire nation is proud! 🇮🇳 #Cheer4Bharat pic.twitter.com/pyZSOZw0uI— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 24, 2026చదవండి: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
త్రుటిలో చేజారె...
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ తొలి రోజు శుక్రవారం భారత్ పతకాల బోణీ కొట్టలేకపోయింది. పారా స్విమ్మింగ్ ఎస్13 (దృష్టిలోపం) కేటగిరీ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ రవి వీర వెంకట భవాని కార్తీక్ బుడిగిన నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. రవి 100 మీటర్ల లక్ష్యాన్ని 57.57 సెకన్లలో ముగించి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో స్విమ్మర్ ఇమామ్ అలీ (1ని:03.73 సెకన్లు) ఏడో స్థానంలో నిలిచాడు. నాథన్ హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా; 54.54 సెకన్లు), స్టీఫెన్ క్లెగ్ (స్కాట్లాండ్; 55.16 సెకన్లు), మాథ్యూ రెడ్‌ఫెర్న్ (ఇంగ్లండ్; 56.86 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. పారా పవర్‌లిఫ్టింగ్‌లోనూ భారత్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల లైట్ వెయిట్ కేటగిరీలో భారత లిఫ్టర్లు అశోక్ (143.8 పాయింట్లు) నాలుగో స్థానంలో, పరమ్‌జీత్ కుమార్ (135.6 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచారు. మహిళల లైట్ వెయిట్ కేటగిరీలో భారత లిఫ్టర్ సుమన్ దేవి (88.4 పాయింట్లు)... హెవీ వెయిట్ కేటగిరీలో కస్తూరి రాజమణి చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. జాదుమణి శుభారంభం పురుషుల బాక్సింగ్ 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ జాదుమణి సింగ్ శుభారంభం చేశాడు. ఆరోన్ కులెన్ (స్కాట్లాండ్)తో జరిగిన తొలి రౌండ్లో జాదుమణి 5:0 స్కోరుతో ఘనవిజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల స్విమ్మింగ్‌లో రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. లాన్ బౌల్స్‌లో భారత మహిళల జట్టు పెయిర్స్ ఈవెంట్లో 2–0తో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ టైబ్రేక్‌లో సెసిల్ అలెగ్జాండర్ (ఫాల్్కలాండ్ ఐలాండ్స్)పై గెలుపొందాడు. తొలి స్వర్ణం ఇంగ్లండ్ ఖాతాలో కామన్వెల్త్ గేమ్స్ తొలి స్వర్ణ పతకం ఇంగ్లండ్ ఖాతాలోకి వెళ్లింది. పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్ లైట్ వెయిట్ కేటగిరీలో ఇంగ్లండ్ లిఫ్టర్ మార్క్ స్వాన్ విజేతగా నిలిచాడు. మార్క్ స్వాన్ 153.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రొలాండ్ ఇజురికి (నైజీరియా) రజతం, బోనీ గుస్టిన్ (మలేసియా) కాంస్యం సాధించారు. మహిళల పారా పవర్‌లిఫ్టింగ్ లైట్ వెయిట్ కేటగిరీలో ఎస్తెర్ న్వొర్గో (నైజీరియా; 119 పాయింట్లు) స్వర్ణం, ఎస్తెర్ ఒయెమా (నైజీరియా; 115.5 పాయింట్లు) రజతం, ఒలీవియా (ఇంగ్లండ్; 106.6 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. జూడో ప్లేయర్ తులికపై వేటుకామన్వెల్త్ గేమ్స్ జూడో క్రీడాంశంలో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో +78 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన తులిక మాన్‌పై ఈసారి వేటు పడింది. డోపింగ్ నిబంధనలను ఆమె ఉల్లంఘించడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తులికపై సస్పెన్షన్ విధించింది. నిబంధనల ప్రకారం క్రీడాకారులు ఏడాది కాలంలో కనీసం మూడుసార్లు తాము ఎక్కడెక్కడ ఉన్నామో అనే సమాచారం ‘నాడా’కు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మూడుసార్లు విఫలమైతే వారిపై నిషేధం విధిస్తారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ పోటీపడ్డ తులిక ఏడాది కాలంలో తన ఆచూకీ వివరాలన ‘నాడా’కు సమర్పించకపోవడంతో ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. కామన్వెల్త్ గేమ్స్ జూడో ఈవెంట్ ఈనెల 31న మొదలుకానుండగా... భారత జూడో ప్లేయర్లు ఈనెల 27న గ్లాస్గోకు బయలుదేరుతారు. పురుషుల 73 కేజీల విభాగంలో భారత జూడో ప్లేయర్ అరుణ్ కుమార్ డోపింగ్ పరీక్షలో విఫలమవ్వడంతో గురువారం జట్టు నుంచి అతడిని తొలగించారు. శుక్రవారం తులికపై వేటు పడటంతో భారత్ నుంచి 14 మందికి బదులుగా 12 మంది జూడో ప్లేయర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడతారు. -
‘ఫిడే’ తాత్కాలిక అధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్
న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు మరో గౌరవం లభించింది. ప్రస్తుతం అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్ ఇక నుంచి ‘ఫిడే’ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం ‘ఫిడే’ అధ్యక్షుడిగా ఉన్న అర్కాడీ డ్వార్కోవిక్పై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా తాను అధ్యక్షుడిగా కొనసాగితే ‘ఫిడే’ రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో డ్వార్కోవిక్ ‘ఫిడే’ అధ్యక్ష బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. డ్వార్కోవిక్ నిర్ణయాన్ని ‘ఫిడే’ కౌన్సిల్ ఆమోదించడంతోపాటు ఆనంద్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సమ్మతించింది. డ్వార్కోవిక్పై ఆంక్షలు ఎత్తివేశాక మళ్లీ ఆయన ‘ఫిడే’ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. ఆనంద్ 2022 నుంచి ‘ఫిడే’ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. -
భారత్‌కు రజతం
హాంగ్జౌ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పతకాల బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సంయం విజ్ భారత్‌కు రజత పతకాన్ని అందించింది. చండీగఢ్‌కు చెందిన 22 ఏళ్ల సంయం 243.4 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. యావో కియాన్జున్ (చైనా; 243.6 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... హనియె (ఇరాన్; 221 పాయింట్లు) కాంస్యం దక్కించుకుంది. భారత్‌కే చెందిన సురుచి సింగ్ 137.6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. -
సెమీస్‌లో అనాహత్
ఒంటారియో (కెనడా): ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ వరుసగా రెండో ఏడాది పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. తాజా ఈవెంట్లో టాప్ సీడ్ అనాహత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో అనాహత్ 11–7, 11–5, 6–11, 11–9తో హబీబా రిజ్క్ (ఈజిప్ట్)పై గెలుపొందింది. సెమీఫైనల్లో మూడో సీడ్ బార్బ్ సమెహ్ (ఈజిప్ట్)తో అనాహత్ తలపడుతుంది. గత ఏడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అనాహత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. అనాహత్ ఫైనల్ చేరితే 2005లో జోష్నా చినప్ప తర్వాత ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా అనాహత్ గుర్తింపు పొందుతుంది. -
CWG 2026: భారత్‌కు షాక్.. స్టార్ జుడో ప్లేయర్‌పై వేటు
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పారా స్విమ్మర్స్ అదరగొట్టారు. ఈతగాళ్లు కార్తీక్ బుడిగిన, అలీ ఇమామ్‌లు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ S13 విభాగంలో హీట్స్ రేసులో కార్తీక్ 57.10 సెకన్ల సమయంలో మూడో స్థానంలో నిలవగా.. అలీ ఇమామ్ 1:05.32 సెకన్ల టైమింగ్‌తో చివరి క్వాలిఫైయింగ్ స్థానాన్ని దక్కించుకుని ఫైనల్లో అడుగుపెట్టారు. మరోవైపు 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ లో శ్రీహరి నటరాజ్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరగనున్న సెమీఫైనల్స్‌లో శ్రీహరి పాల్గోనున్నాడు.భారత్‌కు షాక్భారత్కు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ జుడుకో తులికా మాన్ కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైంది. డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. గతేడాది నుంచి ఆమె డోపింగ్ టెస్ట్‌లకు హాజరు కాకపోవడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్-2022లో తులిక సిల్వర్ మెడల్ సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా మరో భారత జుడో ప్లేయర్ అరుణ్ కుమార్ కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యాడు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అతడిపై నాడా నిషేధం విధించింది. -
ప్లాన్ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్ అప్పుడే!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ రిటైర్మెంట్పై ఒక స్పష్టత వచ్చింది. అర్జెంటీనా జట్టులో స్థిరత్వం వచ్చే వరకు తాను జట్టులో కొనసాగుతానని, ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్లు మెస్సీ తన అభిప్రాయాన్ని అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ)కు వెల్లడించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో 2030 ఫిఫా ప్రపంచకప్‌కు తాను అందుబాటులో ఉండనని మెస్సీనే పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశాడు. రాబోయే నాలుగేళ్లలో మెస్సీతో పాటు జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా కెరీర్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. దీంతో జట్టులో సీనియర్లంతా ఒకేసారి రిటైర్ అయితే ఆ ప్రభావం యువ ఆటగాళ్లపై ఎక్కువగా ఉంటుందని అర్జెంటీనా ఫుట్‌బాల్ తెలిపింది. అందుకోసం మెస్సీని కొంతకాలం పాటు జట్టుతో కొనసాగాలని అతడితో తెలిపినట్లు సమాచారం. దీనికి మెస్సీ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక మెస్సీ వీడ్కోలు మ్యాచ్‌ను కూడా ఘనంగా ప్లాన్ చేసినట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే ఆ వివరాలు బయటికి వెల్లడిస్తామని అర్జెంటీనా ఫుట్‌బాల్ తెలిపింది.ఇక 2026 ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ 39 ఏళ్ల వయసులోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 8 గోల్స్ చేయడంతో పాటు 4 అసిస్ట్‌లతో టోర్నీలో రెండో అత్యధిక గోల్ స్కోరర్‌గా నిలిచి సిల్వర్ బూట్ అందుకున్నాడు. 10వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగిన మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా మెస్సీ (21 గోల్స్) రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఎంబాపె (ఫ్రాన్స్, 22 గోల్స్) ఉన్నాడు. ఇక రెండు దశాబ్దాల కెరీర్లో 2014 ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా ఓటమి తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలకాలనుకున్నాడు. కానీ చిన్న వయసు కావడంతో ఆలోచనను విరమించుకున్న మెస్సీ ఆ తర్వాత అర్జెంటీనాకు అద్భుత విజయాలు అందించాడు. 2021 కోపా అమెరికా కప్‌తో పాటు 2022 ఫిఫా ప్రపంచకప్‌ను అందించి అర్జెంటీనా ఖాతాలో మూడో ఫిఫా టైటిల్‌ను చేర్చాడు. 2024 కోపా అమెరికా కప్‌ను మరోసారి గెలిచిన అర్జెంటీనా 2026 ఫిఫాలో ఫైనల్ చేరినప్పటికీ తుదిమెట్టుపై బోల్తా కొట్టింది. -
గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్!
ప్రపంచంలో మనకు తెలియని ఆటలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్.. ఇవన్నీ ప్రపంచ క్రీడలుగా విశిష్టతను పొందాయి. కానీ ఒలింపిక్స్ లేదా కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు మాత్రం మనకు తెలియని కొత్త గేమ్స్ కూడా పరిచయమవుతాయి. అలా పరిచయం అయిందే లాన్ బౌల్స్ క్రీడ. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బౌల్స్‌లో భారత్ ఒక స్వర్ణంతో పాటు మరో రజతం గెలవడం ద్వారా మన దేశంలో ఈ ఆట తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఆట చూడ్డానికి చిన్నప్పుడు మనం ఆడే గోళీలాట మాదిరే ఉంటుంది. కానీ గోళీలాటకు కాస్త భిన్నంగా లాన్ బౌల్స్ ఆట ఉంటుంది.లాన్ బౌల్స్ అనేది ఇంచుమించుగా బౌలింగ్ క్రీడ మాదిరి ఉంటుంది. ఒక ఎండ్ నుంచి రౌండ్ గా ఉన్న బంతులను మరో ఎండ్ లో ఉన్న టార్గెట్ మీదకు వదలాలి. ఎవరిదైతే టార్గెట్ కు దగ్గరగా చేరుకుంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక్కడ టార్గెట్ ను జాక్ గా పిలుస్తారు. ఉదాహరణకు ’బి‘ టీం కంటే కూాడా ’ఎ‘ టీమ్ టార్గెట్ కు సమీపంగా రెండు బాల్స్ ను విసిరితే అప్పుడు ఎ టీంకు రెండు పాయింట్లు లభిస్తాయి. అంటే టార్గెట్ కు ఏ టీంవి ఎక్కువ దగ్గరగా ఉంటే అన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట. రూల్స్ ఇలా..ఈ ఆటను సింగిల్స్, డబుల్స్ తో పాటు ముగ్గురు/ నలుగురితో కూడిన జట్టుగానూ ఆడొచ్చు. టీమ్ ఈవెంట్లలో తొలుత బంతిని విసిరే బౌలర్ ను 'లీడ్' అని పిలుస్తారు. ఇక చివర్లో రోల్ చేసే ప్లేయర్‌ను 'స్కిప్' అంటారు. ఇరు జట్లు లేదా ఇద్దరు ప్లేయర్లు తమ బౌల్స్‌ను రోల్ చేయడం పూర్తయిన తర్వాత.. పాయింట్లను లెక్కిస్తారు. జాక్ కు బౌల్ దగ్గరగా వెళ్లడం లేదా తాకడమే ఈ ఆట లక్ష్యం. సింగిల్స్ విభాగంలో ఎవరైతే తొలుత 21 పాయింట్లకు చేరుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక టీమ్ ఈవెంట్స్‌లో మాత్రం రౌండ్లన్నీ పూర్తయ్యాకనే విజేత ఎవరనేది తేలుస్తారు. జాకు బంతి తగిలిందా? ఎంత దూరంలో నిలిచింది అనేదే ఇక్కడ ప్రధానం. దాని ఆధారంగానే పాయింట్లను నిర్ణయిస్తారు.ఇక లాన్ బౌల్స్ గేమ్‌లో భారత్ శుభారంభం చేసింది. లాన్ బౌల్స్ మహిళల పెయిర్స్ ఈవెంట్లో భారత్ తొలి రౌండ్లో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీ రూపా రాణి–పింకీ ‘టైబ్రేక్’లో మాల్టాను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ పుతుల్ సోనోవాల్ 5–4, 3–7, 1–0తో ‘టైబ్రేక్’లో 2023 ప్రపంచ చాంపియన్ రియాన్ బెస్టెర్ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు. Winning Start for Team India at CWG 2026!🇮🇳🔥Pinki Singh & Rupa Rani Tirkey defeated Malta in a thrilling tie-breaker in the women's pairs lawn bowls event.pic.twitter.com/EiffSZLrXn— Sports Apna 🇮🇳 (@sportsapna1) July 23, 2026Read: విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్ -
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం.. లాన్ బౌల్స్‌లో భారత్ శుభారంభం
గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ గురువారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ తరఫున వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, లవ్లీనా బొర్గొహైన్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించారు. మువ్వన్నెల జెండాను చేతపట్టి వీరిద్దరు ముందు నడవగా, వారిని భారత జట్టు అనుసరించింది. ఇక గేమ్స్ ప్రారంభానికి ముందే బాక్సర్ లవ్లీనా భారత్‌కు పతకం ఖాయం చేయగా, లాన్ బౌల్స్ గేమ్‌లో భారత్ శుభారంభం చేసింది.లాన్ బౌల్స్ మహిళల పెయిర్స్ ఈవెంట్లో భారత్ తొలి రౌండ్లో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీ రూపా రాణి–పింకీ ‘టైబ్రేక్’లో మాల్టాను ఓడించింది. తొలి సెట్‌ను భారత్ 7–1, రెండో సెట్‌ను మాల్టా 4–3తో గెలుచుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. చివరి బౌల్లో రాణించి పింకీ జట్టును గెలిపించింది. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ పుతుల్ సోనోవాల్ 5–4, 3–7, 1–0తో ‘టైబ్రేక్’లో 2023 ప్రపంచ చాంపియన్ రియాన్ బెస్టెర్ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు. డోపింగ్‌లో పట్టుబడిన భారత ప్లేయర్లు డోపింగ్‌లో పట్టుబడటంతో భారత జూడో క్రీడాకారుడు అరుణ్ కుమార్ కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యాడు. 73 కేజీల విభాగంలో అతను బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఇటీవల నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను నిషేధిత ఉత్రే్పరకం వాడాడని తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అరుణ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. దాంతో గ్లాస్గోకు వెళ్లాల్సిన భారత టీమ్ నుంచి అతడిని తప్పించారు. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో పలువురు ఆటగాళ్లు డోపింగ్ నిబంధనలు ఉల్లఘించడంతో భారత్‌కు కేటాయించిన కోటాను 16 నుంచి 11కు తగ్గిస్తూ కామన్వెల్త్ క్రీడల నిర్వాహక మండలి నిర్ణయం తీసుకుంది. అజిత్ (71 కేజీలు), సాయిరాజ్ పరదేశి (88 కేజీలు), హర్చరణ్ సింగ్ (110 కేజీలు), వంశితా వర్మ (86 కేజీలు) డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. A proud moment for India! Led by Flag Bearer Mirabai Chanu and Ceremonial Baton Bearer Lovlina Borgohain, #TeamIndia proudly marches into the Opening Ceremony as the Commonwealth Games 2026 officially begin. Pic credit: @PTUshaOfficial#Cheer4Bharat #CWG2026… pic.twitter.com/w41GmdsmB2— Doordarshan Sports (@ddsportschannel) July 24, 2026 -
‘ఒలింపిక్ పతకమే లక్ష్యం’
న్యూఢిల్లీ: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా భారత మహిళల హాకీ జట్టు సాధన కొనసాగుతోందని జట్టు హెడ్ కోచ్ జోయర్డ్ మరీన్ అన్నాడు. అతడి నేతృత్వంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మన జట్టు అత్యుత్తమంగా నాలుగో స్థానం దక్కించుకుంది. ఇప్పుడు టాప్–3లో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మరీన్ వెల్లడించాడు. 2017 నుంచి 2021 వరకు భారత మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అతడు... తిరిగి ఈ ఏడాది ఆరంభంలో ఆ బాధ్యతలు చేపట్టాడు. అతడి శిక్షణలో ఇటీవల నేషన్స్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు వచ్చే సీజన్లో ప్రొ లీగ్‌కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో మరీన్ మాట్లాడుతూ... ‘మా అతిపెద్ద లక్ష్యం 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం లాంటి ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే ముందు బేస్ క్యాంప్‌కు చేరుకోవాలి. ఉన్నత లక్ష్యాలను అందుకోవాలంటే చిన్న చిన్న గమ్యాలను నిర్దేశించుకొని వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలి. ప్రస్తుతం మా జట్టు అదే పనిలో ఉంది. మంచి శిక్షణ బృందాన్ని సమకూర్చడం... సరైన ఆటగాళ్లను ఎంపిక చేయడం... ప్రతిభావంతులను గుర్తించడం... సీనియర్, జూనియర్లను సరిగ్గా వినియోగించుకోవడం ఇవన్నీ అందులో భాగమే. భారత మహిళల హాకీలో అత్యున్నతమైన ఒలింపిక్ పతకాన్ని సాధించేందుకు ప్లేయర్లలో మానసిక స్థయిర్యం, ప్రేరణ నింపుతున్నాం. ఎవరెస్ట్, కిలిమంజారో వంటి శిఖరాలను అధిరోహించిన పర్వాతారోహకుడు హేమంత్ గుప్తాతో ప్లేయర్లకు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి వారిలో స్ఫూర్తి నింపాం. జట్టుగా కలిసి పనిచేస్తే వచ్చే ఫలితాలను వివరించాం. క్రమశిక్షణ, నిరంతర సాధనతో ఎలాంటి లక్ష్యాలనైనా అందుకోవచ్చు’ అని వివరించారు. వ్యక్తిగత లక్ష్యాలను పక్కపెట్టి... జట్టుగా ముందుకు సాగినప్పుడే పెద్ద టోర్నీల్లో విజయాలు సాధించగలమని మరీన్ వెల్లడించాడు. -
హైదరాబాద్ హెడ్ కోచ్‌గా అనిరుధ్ సింగ్
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ కొత్త సీజన్ (2026–27)లో పాల్గొనే వేర్వేరు హైదరాబాద్ జట్లకు కోచ్ బృందాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. సీనియర్ టీమ్ హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ అనిరుధ్ సింగ్‌ను ఎంపిక చేశారు. 46 ఏళ్ల అనిరుధ్ 2000–2010 మధ్య 47 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత శిక్షణ వైపు వెళ్లిన అతను ఛత్తీస్‌గఢ్ రంజీ టీమ్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. సీనియర్ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా మరో మాజీ బ్యాటర్ బావనక సందీప్‌ను హెచ్‌సీఏ ఎంపిక చేసింది. సందీప్‌కు కూడా 58 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం ఉంది. సీనియర్ టీమ్‌కు మాజీ పేసర్ ఆల్ఫ్రెడ్ అబ్సలమ్ బౌలింగ్ కోచ్‌గా, అభినవ్ కుమార్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు గత సీజన్లో సీనియర్ టీమ్‌కు కోచ్‌గా పని చేసిన డీబీ రవితేజకు ఈసారి హైదరాబాద్ అండర్–23 టీమ్ హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించారు. ఈ టీమ్‌కు బెన్ జాన్సన్ బౌలింగ్, రొనాల్డ్ రోడ్రిగ్స్ ఫీల్డింగ్ కోచ్‌లుగా పని చేయనున్నారు. హైదరాబాద్ అండర్–19 టీమ్ కోసం కోచ్‌లనూ హెచ్‌సీఏ ప్రకటించింది. అభిజిత్ ఛటర్జీ హెడ్ కోచ్‌గా, పి.శశాంక్ నాగ్ బ్యాటింగ్, అబ్దుల్ ఖాదర్ ఫీల్డింగ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. హైదరాబాద్ అండర్–16 జట్టుకు ఎస్.కిరణ్ కుమార్ హెడ్ కోచ్‌గా, మొహమ్మద్ ముషారఫ్ ఖాన్ బౌలింగ్ కోచ్‌గా, నితిన్ ఆంథోనీ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. -
గౌతమ్‌కు నాలుగు పతకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు నాలుగు పతకాలతో మెరిశాడు. గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ పోటీల్లో గౌతమ్ 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ (25.47 సెకన్లు), 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ (31.18 సెకన్లు) విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 50 మీటర్ల ఫ్రీస్టయిల్ (24.80 సెకన్లు) ఈవెంట్లో, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ (58.40 సెకన్లు) ఈవెంట్లో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. గౌతమ్ ప్రస్తుతం విక్కీ స్విమ్మింగ్ అకాడమీలో హెడ్ కోచ్ శివేందర్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకే చెందిన టీఎస్ తేజస్ (100, 200 మీటర్ల ఫ్రీస్టయిల్), మెరుపుల లిఖిత గౌడ్ (800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్) రెండు బంగారు పతకాల చొప్పున సాధించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన జోనా షిజు బాలికల 200, 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లో పసిడి పతకాలు దక్కించుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి 472 పాయింట్లతో ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. -
అమ్మ బాటలో...
సాక్షి క్రీడా విభాగం : దాదాపు మూడు దశాబ్దాల క్రితం భారత మహిళల హాకీ జట్టు... నెదర్లాండ్స్ వేదికగా ప్రపంచకప్ బరిలోకి దిగింది. ఆ టోర్నమెంట్లో భారత జట్టు 12వ స్థానంతో సరిపెట్టుకోగా... జట్టుకు సారథిగా వ్యవహరించిన ప్రీతమ్ రాణి సివాచ్ దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసింది. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత అదే నెదర్లాండ్స్ వేదికగా... పురుషుల హాకీ ప్రపంచకప్ జరగనుండగా... ప్రీతమ్ సివాచ్ కుమారుడు యశ్దీప్ సివాచ్ భారత జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో హాకీ ప్రపంచకప్‌లో ఆడిన తొలి భారత తల్లీకుమారులుగా ప్రీతమ్, యశ్దీప్ రికార్డుల్లోకెక్కనున్నారు. ఆగస్టు 14 నుంచి 30 వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం 20 మందితో కూడిన భారత జట్టును ఇటీవల ప్రకటించగా... అందులో 25 ఏళ్ల డిఫెండర్ యశ్దీప్ సివాచ్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘ఇది నాకెంతో ప్రత్యేకమైంది. వరల్డ్‌కప్ ఆడే భారత జట్టులో చోటు దక్కిన వెంటనే ఈ విషయం మొదట అమ్మకు చెప్పా. ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే 1998లో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఆమె భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అలాంటిది అక్కడే నేను వరల్డ్‌కప్ ఆడనుండటం చాలా ప్రత్యేకమైన విషయం’ అని అన్నాడు. తన కాలంలో భారత మహిళల జట్టు అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతమ్... 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో చారిత్రాత్మక స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్నారు. ఇంటి నిండా ఫొటోలే... యశ్దీప్ పుట్టక ముందే ప్రీతమ్ ప్రపంచకప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రీతమ్... తన కెరీర్‌కు సంబంధించిన విశేషమైన సందర్భాల ఫొటోలను ఇంటి నిండా అతికించారు. చిన్నప్పటి నుంచి అవి చూస్తూ పెరిగిన యశ్దీప్ ఇప్పుడు అత్యున్నత స్థాయిలో బ్లూ జెర్సీలో వరల్డ్‌కప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ‘మా ఇంటి నిండా అమ్మా హాకీ ఆడే ఫొటోల ఆల్బమ్‌లు ఉన్నాయి. టోర్నమెంట్లలో పాల్గొన్నవి, ట్రోఫీలు అందుకున్నవి, జట్టు సభ్యులతో కలిసి దిగినవి... ఇలా లెక్కలేనన్ని ఫొటోలు ఉన్నాయి. సోదరి కనిక చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగాను. అమ్మ సహచరులు చాలా మంది నుంచి ఎన్నో విలువైన సలహాలు పొందాను’ అని యశ్దీప్ వెల్లడించాడు. చిన్నప్పుడు స్విమ్మింగ్‌పై మక్కువ చూపిన అతడు... 2010లో న్యూ ఢిల్లీ వేదికగా జరిగిన హాకీ ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసిన తర్వాత హాకీపై దృష్టి సారించాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల సూచనతో మెరుగైన శిక్షణతో అంచలంచెలుగా ఎదిగిన యశ్దీప్... తన ప్రతిభతో భారత జూనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడ నిలకడైన ప్రదర్శన కనబర్చడంతో అతడికి సీనియర్ జట్టులో చోటు దక్కింది. తల్లిదండ్రులతో.. తల్లిని మించిన తనయుడవ్వాలి! తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగనున్నప్పటికీ... ఎలాంటి బెరుకు లేకుండా ఆడాలనుకుంటున్నట్లు యశ్దీప్ వెల్లడించాడు. ఇప్పటికే ఆ్రస్టేలియాలో క్లబ్‌ల తరఫున ఆడిన అనుభవం ఉన్న యశ్దీప్... హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ సూచనలు తనకెంతో మేలు చేశాయని చెప్పాడు. ‘హెడ్ కోచ్ ఎప్పుడూ ఆటను మార్చుకోమని ఒత్తిడి చేయలేదు. నా సహజసిద్ధమైన ఆటతీరు కొనసాగించమని చెప్పారు. భువనేశ్వర్‌లో జరిగిన ప్రొ లీగ్ సందర్భంగా ప్రత్యర్థి ఎవరైనా మనకు అవసరం లేదు... మన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన చెప్పిన మాటలు ఎంతో ప్రభావం చూపాయి’ అని యశ్దీప్ అన్నాడు. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, సీనియర్ ప్లేయర్లు అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్ తనకు ఎంతో అండగా నిలిచారని చెప్పాడు. చిన్నప్పటి నుంచి వారి ఆట చూస్తూ పెరిగి... ఇప్పుడు వారితోనే కలిసి ప్రపంచకప్ ఆడనుండటం ఆనందంగా ఉందని ఈ డిఫెండర్ వెల్లడించాడు. 2021లో జూనియర్ ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో సభ్యుడైన యశ్దీప్... సీనియర్ స్థాయిలో పోటీ మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు. ‘ఇప్పుడు నన్నంతా ప్రీతమ్ రాణి సివాచ్ కుమారుడు అని గుర్తిస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు యశ్దీప్ సివాచ్ తల్లి ప్రీతమ్ రాణి అనే స్థాయికి ఎదగాలనేదే నా లక్ష్యం’ అని యశ్దీప్ వివరించాడు. కుటుంబం మొత్తం ప్లేయర్లే! యశ్దీప్ సివాచ్ కుటుంబం మొత్తం హాకీ క్రీడాకారులే. అతడి తండ్రి కుల్దీప్ మంచి హాకీ ప్లేయర్. దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న కుల్దీప్ను గాయాలు వెనక్కి లాగాయి. దీంతో అతడు తన భార్య ప్రీతమ్ సివాచ్ పేరిట హరియాణాలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీలో యువ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడంలో మునిగిపోయాడు. ఇక యశ్దీప్ సోదరి కనిక ఇప్పటికే భారత జూనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. నిలకడగా రాణిస్తున్న కనిక... సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాధన చేస్తోంది. ప్రీతమ్ మిడ్‌ఫీల్డర్ కాగా... కనిక ఫార్వర్డ్ ప్లేయర్. వీరిద్దరికీ భిన్నంగా తండ్రి కుల్దీప్ సూచనతో యశ్దీప్ డిఫెండర్‌గా కొనసాగుతున్నాడు. ‘మా అమ్మా, సోదరికి గోల్స్ చేయడం అంటే ఇష్టం కానీ. నాకు వాటిని సమర్థవంతంగా అడ్డుకోవడం ఇష్టం. దాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తా. నేను చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్‌కు పెద్ద ఫ్యాన్‌ను. అందుకే నాకు స్కోర్ చేయడం కన్నా దాన్ని అడ్డుకోవడం ఇష్టం. మా నాన్న మంచి డిఫెండర్... చిన్నప్పటి నుంచి నన్ను కూడా అదే దిశగా ప్రోత్సహించారు’ అని యశ్దీప్ వెల్లడించాడు. -
క్వార్టర్ ఫైనల్లో అనాహత్
ఒంటారియో (కెనడా): ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్, టాప్ సీడ్ అనాహత్ సింగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అనాహత్ 11–4, 11–8, 11–3తో డాసీ యె సాన్ లీ (మలేసియా)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ హబీబా రిజ్క్ (ఈజిప్ట్)తో అనాహత్ తలపడుతుంది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అనాహత్ కాంస్య పతకం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఆసియా అండర్–19 చాంపియన్, భారత ప్లేయర్ ఆర్యవీర్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆర్యవీర్ 4–11, 1–11, 5–11తో యాసీన్ షలాబీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం
కామన్వెల్త్ గేమ్స్-2026 ఆరంభానికి ముందే భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. బాక్సర్ లవ్లీనా బొర్గొహేన్ నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో బై లభించడంతో ఆమెకు సెమీస్‌కు అర్హత సాధించింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని లవ్లీనా ఖరారు చేసుకుంది. జూలై 31న 75 కిలోల మహిళా విభాగంలో జరిగే సెమీస్ పోటీలో లవ్లీనా తువాలుకు చెందిన తఫాకిని ఎదుర్కోనుంది. కాగా డ్రాలో కేవలం ఐదుగురు అథ్లెట్లు మాత్రమే ఉండటంతో.. బోర్గోహైన్‌తో సహా ముగ్గురు బాక్సర్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించగా, మిగిలిన ఇద్దరు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున 124 మంది అథ్లెట్లు పాల్గోనున్నారు. గురువారం సాయంత్రం కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. -
పోరాడి ఓడిన సింధు.. చైనా ఓపెన్‌లో నిరాశ
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రీక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో ప్రపంచ నాలుగో ర్యాంకర్, చైనా క్రీడాకారిణి చెన్ యుఫేయి 16-21, 22-20, 21-18 తేడాతో సింధును ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.గంటా 29 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు అద్భుత పోరాటం చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల జపాన్ ఓపెన్ సెమీఫైనల్లో యుఫేయిపై గెలిచిన సింధు, అదే జోరును కొనసాగించాలని ప్రయత్నించినా ఈసారి యుఫేయి ప్రతీకారం తీర్చుకుంది.మొదటి గేమ్‌లో వెనుకబడిన స్థితి నుంచి వరుసగా ఏడు పాయింట్లు సాధించిన సింధు, 21-16తో గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో 20-16 ఆధిక్యంలో ఉండి నాలుగు మ్యాచ్ పాయింట్లు దక్కించుకున్నప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోయింది. వరుస తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న యుఫేయి 22-20తో రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది.మూడో గేమ్‌లోనూ ఇద్దరు ప్లేయర్లు సమానంగా పోరాడారు. విరామ సమయానికి సింధు 11-8తో ఆధిక్యంలో ఉన్నా, ఆ తర్వాత యుఫేయి వరుస పాయింట్లు సాధిస్తూ మ్యాచ్‌పై పట్టు సాధించింది. చివరకు 21-18తో గేమ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. -
కామన్వెల్త్ సమరానికి సమయం
ఒకప్పుడు ఒలింపిక్ క్రీడల తర్వాత భారీతనంలో దాదాపు అదే స్థాయిలో జరిగిన కామన్వెల్త్ క్రీడలు కొంత కాలంగా కళ తప్పాయి. పేరుకే పెద్ద సంఖ్యలో దేశాలు పాల్గొంటున్నా... ఆకర్షణలో మాత్రం ప్రతీ సారి ఆటల స్థాయి కుంచించుకుపోతోంది. నిర్వహణాపరమైన ఆర్థిక సమస్యలతో పాటు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ఏదో ఒక సాకుతో దూరమవుతుండటంతో ఈ గేమ్స్ అభిమానుల్లో ఆసక్తిని తగ్గిస్తున్నాయి. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒక లాంఛనానికే పరిమితమైనట్లుగా ఇప్పుడు మళ్లీ క్రీడలు వచ్చేశాయి. పుష్కరకాలం క్రితం ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన స్కాట్లాండ్ నగరం గ్లాస్గో మళ్లీ కామన్వెల్త్ క్రీడలకు వేదికగా నిలిచింది.గ్లాస్గో: 23వ కామన్వెల్త్ గేమ్స్(సీడబ్ల్యూజీ)కు రంగం సిద్ధమైంది. నేడు ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ఆగస్టు 2న ముగుస్తాయి. ఒకప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యం పాలనలో ఉన్న వలస దేశాలు పాల్గొనే ఈ క్రీడలను 2014లో నిర్వహించిన గ్లాస్గో మరోసారి పోటీలకు సిద్ధమైంది. 11 రోజుల పాటు జరిగే క్రీడల్లో 74 దేశాలకు చెందిన 3 వేలకు పైగా ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్న పెద్ద దేశాల జాబితాలో భారత్, ఆ్రస్టేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికావంటివి ఉండగా... ఎక్కువగా చిన్న దేశాలే పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నాయి. నిజానికి 2022లో ఆతిథ్య హక్కులు ఆ్రస్టేలియా దేశంలోని విక్టోరియాకు దక్కగా... భారీ ఖర్చును తాము భరించలేమంటూ ఏడాది కాలం తర్వాత విక్టోరియా అనూహ్యంగా తప్పుకుంది. దాంతో 2026 పోటీలు వాయిదా పడటం లేదా అసలు జరగకపోవచ్చనే సందేహాలు రేకెత్తాయి. అయితే చివరి నిమిషంలో పోటీల నిర్వహణకు స్కాట్లాండ్ ముందుకు వచ్చింది. అయితే ఖర్చును బాగా తగ్గించుకోవడంలో భాగంగా ఈవెంట్ల సంఖ్యను తగ్గించడం, వేదికల సంఖ్యను తగ్గించే విషయంలో పలు షరతులు పెట్టింది. సీడబ్ల్యూజీ నిర్వహణా కమిటీకి ఇవన్నీ ఒప్పుకోక తప్పలేదు. దాంతో ఎలాంటి కొత్త స్టేడియాల నిర్మాణంలాంటివి లేకుండా ఇప్పటికే ఉన్న నాలుగు వేదికల్లో సీడబ్ల్యూజీ పోటీలు ఖరారయ్యాయి. 2022లో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల నిర్వహణా ఖర్చుతో పోలిస్తే దాదాపు 60 శాతం తక్కువ మొత్తం బడ్జెట్లో ఈ సారి పోటీలు జరగనుండటం విశేషం. 10 క్రీడల్లో పోటీలు... 3్ఠ3 బాస్కెట్‌బాల్, 3్ఠ3 వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, బౌల్స్, పారా బౌల్స్, బాక్సింగ్, జూడో, నెట్‌బాల్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్‌లిఫ్టింగ్ గేమ్స్ విలేజ్ లేకుండా... ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లంతా ఒకే చోట ఉండేలా అన్ని సౌకర్యాలతో ప్రత్యేకంగా గేమ్స్ విలేజ్‌ను నిర్మించడం పరిపాటి. కానీ ఖర్చు తగ్గింపులో భాగంగా ఈ సారి గేమ్స్ విలేజ్‌కు కూడా నిర్వాహకులు మంగళం పాడారు. ఈ పోటీల కోసం వేర్వేరు హోటల్స్‌లో క్రీడాకారులకు బస ఏర్పాటు చేశారు. అక్కడినుంచి స్టేడియాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. పోటీలు నాలుగు వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. 2022లో నిర్వహించి ఇప్పుడు తొలగించిన క్రీడలు బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, టి20 క్రికెట్, బీచ్ వాలీబాల్, డైవింగ్, మౌంటెన్ బైకింగ్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, రోడ్ సైక్లింగ్, రగ్బీ సెవెన్స్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్ అండ్ పారా టేబుల్ టెన్నిస్, ట్రయాథ్లాన్ అండ్ పారా ట్రయాథ్లాన్.బరిలో నీరజ్ చోప్రా ...పారా స్పోర్ట్స్‌తో కలిసి 13 పతకాంశాల్లో భారత్ నుంచి 125 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్ విభాగంలో అత్యధికంగా 32 మంది బరిలోకి దిగుతున్నారు. బాక్సింగ్ (14), జూడో (14), వెయిట్‌లిఫ్టింగ్ (12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పతకం సాధించగల సత్తా ఉన్న స్టార్ ఆటగాళ్ల జాబితాను చూస్తే... జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గొహైన్ వంటి ఒలింపిక్ పతక విజేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారీగా తగ్గనున్న భారత్ పతకాలు... 2022 బర్మింగ్‌హామ్ క్రీడల్లో భారత్ మొత్తం 61 పతకాలు (22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు) గెలుచుకుంది. అయితే ఈ సారి పతకాలు పెద్ద సంఖ్యలో తగ్గే అవకాశం ఉంది. గత పోటీల్లో 30 పతకాలు అందించిన క్రీడలను ఈ సారి పూర్తిగా తొలగించడమే అందుకు కారణం. 2022లో రెజ్లింగ్ (12), బ్యాడ్మింటన్ (6), టేబుల్ టెన్నిస్ (7), స్క్వాష్ (2), హాకీ (2), టి20 క్రికెట్ (1)లలో భారత్ పతకాలు గెలుచుకుంది. ఇప్పుడు ఇవన్నీ లేకుండా పోయాయి. దాంతో ప్రధానంగా అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్లలోనే మన జట్టు పతకాలు ఆశిస్తోంది. -
మూడో స్థానంతో ముగించిన అర్జున్
చెన్నై: క్వాంట్‌బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశికి మూడో స్థానం దక్కింది. అలీరెజా ఫిరోజ (ఫ్రాన్స్)తో జరిగిన చివరి (7వ) రౌండ్ గేమ్‌ను అర్జున్ ‘డ్రా’గా ముగించాడు. 8 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఓవరాల్‌గా 2 విజయాలు, 5 డ్రాలతో 4.5 పాయింట్లు సాధించిన అలీరెజా చాంపియన్‌గా నిలిచాడు. 2 విజయాలు 4 డ్రాలు, ఒక ఓటమితో అర్జున్ (4 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు. దిమిత్రీ ఆండ్రీకిన్ (రష్యా – 4 పాయింట్లు)కు రెండో స్థానం లభించింది. ఇతర భారత ఆటగాళ్లు ప్రాణేశ్ (5వ), నిహాల్ సరీన్ (6వ), వరల్డ్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజు (8వ)తో నిరాశపర్చారు. -
ఖేలో ఇండియా 2026.. హైదరాబాద్‌లో మైదానాల పరిశీలన
ఖేలో ఇండియా గేమ్స్ 8వ ఎడిషన్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తెలంగాణ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( (SAI) ఉన్నతాధికారుల బృందం మంగళవారం హైదరాబాద్‌లోని వివిధ క్రీడా ప్రాంగణాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమీక్షించింది. ఈ బ్యాచ్‌లో సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ జ్యోతితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు మధు హర్ష, గోపాల్ కందపాల్, మోహిత్‌లు ఉన్నారు. ఈ బృందం గచ్చిబౌలి జీఎంసీబీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, షూటింగ్ రేంజ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్, సైక్లింగ్ వేలోడ్రోమ్, ఎల్బీ స్టేడియంలను పరిశీలించింది. హైదరాబాద్‌లోని క్రీడా వసతుల పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు అనుగుణంగా అవసరమైన చోట మరమ్మతులు, మౌలిక సదుపాయాల మెరుగుదల చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
చైనా ఓపెన్‌లో సింధు శుభారంభం
చైనా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత యువ సంచలనం ఉన్నతి హుడాపై 21-14, 9-21, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సింధుకు ఉన్నతి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్ ఆరంభంలో ఉన్నతి 7-7తో సమంగా నిలిచింది. అయితే సింధు వరుసగా పాయింట్లు సాధించి సింధు 21-14తో గేమ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో గేమ్‌లో ఉన్నతి అద్భుత ప్రదర్శన చేస్తూ 21-9తో గేమ్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను సమం చేసింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తెలుగు తేజం సింధు సత్తాచాటింది. సింధు ఆరంభం నుంచే ఆధిక్యం ప్రదర్శించి, 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ప్రి-క్వార్టర్స్‌లో (రౌండ్ ఆఫ్ 16) నాలుగో సీడ్, చైనా స్టార్ ఆటగాడు చెన్ యుఫీతో సింధు తలపడనుంది.మరోవైపు భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి కూడా ప్రి-క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. తొలి రౌండ్లో ఇండోనేషియాకు చెందిన అల్వి ఫర్హాన్‌పై 17-21, 21-5, 21-17 తేడాతో ఆయుష్ గెలుపొందాడు. అయితే డబుల్స్ విభాగాల్లో భారత షట్లర్లకు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. హరిహరన్ అమశకరుణన్ - ఎం.ఆర్. అర్జున్ జోడీ, రోహన్ కపూర్-గద్దె రుత్విక శివాని ద్వయం ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. -
ఎనిమిదో వింత.. ఫిఫా కప్పుతో వస్తే టమాటలతో సత్కారమా!
ఒక దేశం తరఫున క్రీడాకారులు లేదా జట్లు ఏదైనా చాంపియన్‌షిప్ లేదా ట్రోఫీలు కొల్లగొడితే సత్కారాలు, సన్మానాలతో హడావిడి చేస్తుంటారు. మన భారత్ కూడా ఇందుకు అతీతమేమి కాదు. కానీ స్పెయిన్‌లోని ఒక ప్రావిన్స్‌లో మాత్రం అక్కడి నుంచి ఏ ఆటగాడు ఎంత పెద్ద ఘనత సాధించినా పూలతో స్వాగతాలు, శాలువాలతో సన్మానాలు గట్రా చేయరు. దీనికి బదులుగా అక్కడి సంప్రదాయం ప్రకారం ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటలను ఇచ్చి సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఫిఫా గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యులైన మిడ్ఫీల్డర్స్ గావీ, పాబియానా రూయిజ్లను ఇదే తరహాలో సత్కరించడంతో వినూత్న సంప్రదాయం వెలుగులోకి వచ్చింది.ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో 20 లక్షలకు పైగా అభిమానులు ఒక్కచోట చేరి స్పెయిన్ విజయోత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. 16 ఏళ్ల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టు ఆటగాళ్లకు అభిమానులు నీరాజనాలు పట్టారు. దీనికి సంబంధించిన సెలబ్రేషన్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. అయితే స్పెయిన్ మిడ్ ఫీల్డర్స్ ఫాబియన్ రూయిజ్, పాబ్లో గవీరా (గవీ)లకు తమ ఫ్రావిన్స్ అయిన లాస్ పలాసియోస్ వై విల్లాఫ్రాంకా పాలకమండలి కూడా వినూత్నరీతిలో స్వాగతం పలికింది. ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటాలను వారికి అందించడం వైరల్‌గా మారింది.పురాతన సంప్రదాయం..కాగా ఈ ప్రావిన్స్‌లో టమాట పంట అధికంగా ఉంటుందట. అందుకే ఆ ప్రావిన్స్ నుంచి ఎవరు ఎలాంటి గొప్ప పనులు లేదా ప్రావిన్స్‌కు గౌరవం తెచ్చే పనులు చేస్తే టమాటాలను గిఫ్ట్‌గా అందిస్తారట. ఇలా చేస్తే వారి వ్యాపారం బాగుంటుందని వారి నమ్మకం. తాజాగా ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న రూయిజ్, గావీలను ఇలా సత్కరించారు. అంతేకాదు వీరి ప్రావిన్స్‌లోని నగ2రంలో ఉన్న రెండు ఫుట్‌బాల్ మైదానాలకు వీరిద్దరు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ స్టేడియాలకు మారిస్మస్, సాన్ సెబాస్టియన్ అనే పేర్లు ఉన్నాయి. ఫాబియానా రూయిజ్ లాస్ పాలాసియోస్ తరఫున ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించగా, ఆరేళ్ల వయసులోనే గావి లాలి లైయరా బాలోంపె తరఫున ఫుట్‌బాల్ ఆడడం ప్రారంభించాడు. ఇక ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయాన్ని సాధించి రెండోసారి ఫిఫా టైటిల్‌ను అందుకుంది. ▶️Esto ya es tradicional en Los Palacios y Villafranca🍅Gavi y Fabián Ruiz reciben su peso en tomates📹@AlvarooSVQ @ZonaMixta__ pic.twitter.com/PyPKDOk99U— BeSoccer (@besoccer_ES) July 21, 2026 Read: అచ్చొచ్చిన గేమ్స్ తొలగింపు.. కామన్వెల్త్లో భారత్ షెడ్యూల్ ఇదే -
అచ్చొచ్చిన గేమ్స్ తొలగింపు.. కామన్వెల్త్లో భారత్ షెడ్యూల్ ఇదే
రెండు నెలల పాటు సాగిన ఫిఫా ప్రపంచకప్ యావత్ క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఫిఫా టోర్నీ అలా ముగిసిందో లేదో మరో ప్రపంచ క్రీడా వేడుకకు సమయం ఆసన్నమైంది. మినీ ఒలింపిక్స్‌గా భావించే కామన్వెల్త్ గేమ్స్‌కు నేటి నుంచే తెరలేవనుంది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌కు గ్లాస్కో ఆతిథ్యమిస్తోంది. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ గురువారం నుంచి తమ ఆటను ప్రారంభించనుంది. జూలై 23 నుంచి ఆగస్టు 11 వరకు సాగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఏ విభాగాల్లో పోటీ పడుతుందనేది ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా మూడు విభాగాల్లో భారత్‌కు ఈసారి అధిక పతకాలు వచ్చే అవకాశాలున్నాయి. అథ్లెటిక్స్, బాక్సింగ్‌తో పాటు వెయిట్‌లిఫ్టింగ్ ఇందులో ఉన్నాయి. వ్యక్తిగత విభాగాల్లో నీరజ్ చోప్రా మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్, రన్నర్ గుల్వీర్ సింగ్‌పై కూడా భారీ ఆశలు ఉన్నాయి. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 48 కేజీల విభాగంలో పోటీ పడుతున్న మీరాబాయి చానుపై భారీ అంచనాలున్నాయి. ఈసారి ఆమె స్వర్ణం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మీరాబాయితో పాటు బింద్యారాని దేవి, గ్యానేశ్వరీ యాదవ్‌ల నుంచి కూడా పతకాలు ఆశించొచ్చు. ఇక బాక్సింగ్ విభాగంలో లవ్లీనా బొర్గొహైన్, వరల్డ్ చాంపియన్ జాన్మిన్ లంబోరియాతో పాటు సాక్షి చౌదరీ, ప్రీతి పవార్లపై భారీ అంచనాలున్నాయి. జూడోలో తులికామన్తో పాటు లాన్‌బౌల్స్‌లో బరిలోకి దిగుతున్న జట్టుపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్‌బౌల్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, వెండి పతకం లభించింది. ఈసారి భారత్ లాన్స్బౌల్తోనే కామన్వెల్త్ గేమ్స్‌ను ఆరంభించనుంది.👉2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సీజన్లో భారత్ 66 పతకాలు (26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు) సాధించింది. 2022 బర్మింగ్హమ్ గేమ్స్‌లోనూ భారత్ 61 పతకాలతో సత్తా చాటింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలున్నాయి.👉 భారత్‌కు అచ్చొచ్చిన రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, స్క్వాష్, మహిళల టీ20 క్రికెట్, ట్రయాథ్లాన్ వంటి క్రీడలను గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించారు. ఇది భారత స్వర్ణ పతకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఎడిషన్‌లో భారత్ గెలిచిన 22 స్వర్ణాలలో 13 స్వర్ణాలు ఈ తొలగించిన క్రీడల నుంచే వచ్చాయి.కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ షెడ్యూల్గురువారం, 23 జూలైలాన్ బౌల్స్: పురుషుల, మహిళల సింగిల్స్ గ్రూప్ దశ (మధ్యాహ్నం 2:00 గంటలకు)శుక్రవారం, 24 జూలైలాన్ బౌల్స్: పురుషుల సింగిల్స్ & మహిళల పెయిర్స్ గ్రూప్ దశ (మధ్యాహ్నం 1 గంటకు)బాక్సింగ్: మధ్యాహ్నం 3:30 గంటలకు - ప్రిలిమినరీ బౌట్స్ (రౌండ్ ఆఫ్ 32 / రౌండ్ ఆఫ్ 16)ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: సాయంత్రం 4:30 గంటలకు - పురుషుల టీమ్ ఫైనల్ & వ్యక్తిగత క్వాలిఫికేషన్పారా పవర్‌లిఫ్టింగ్: పురుషుల & మహిళల లైట్‌వెయిట్ ఫైనల్స్ (సాయంత్రం 5:30 గంటలకు), పురుషుల & మహిళల హెవీవెయిట్ ఫైనల్స్ (రాత్రి 10:30 గంటలకు)స్విమ్మింగ్ / పారా స్విమ్మింగ్: పురుషుల S13 100మీ ఫ్రీస్టైల్ ఫైనల్ & 4x100మీ ఫ్రీస్టైల్ రిలే ఫైనల్ (రాత్రి 11:30 గంటలకు )శనివారం, 25 జూలైలాన్ బౌల్స్: గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1:00 గంటకు)బాక్సింగ్: మొదటి రౌండ్ / రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు (మధ్యాహ్నం 3:30 గంటలకు) ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: మహిళల టీమ్ ఫైనల్ & వ్యక్తిగత క్వాలిఫికేషన్ (సాయంత్రం 4:30 గంటలకు) 3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్: భారత మహిళలు వర్సెస్ స్కాట్లాండ్ (గ్రూప్ స్టేజ్-రాత్రి 9:30 గంటలకు)స్విమ్మింగ్: పురుషుల S14 200మీ ఫ్రీస్టైల్ ఫైనల్ & 50మీ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ (రాత్రి 11:30 గంటలకు)ఆదివారం, 26 జూలైలాన్ బౌల్స్: గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1:00 గంటకు)వెయిట్ లిఫ్టింగ్: పురుషుల 60 కేజీల ఫైనల్ (మధ్యాహ్నం 2:00 గంటలకు), మహిళల 48 కేజీల ఫైనల్ (సాయంత్రం 6.30 గంటలకు), పురుషుల 65 కేజీల ఫైనల్ (రాత్రి 11.00 గంటలకు)బాక్సింగ్: రెండవ రౌండ్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 3:30 గంటలకు)ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: పురుషుల వ్యక్తిగత 'ఆల్-రౌండ్' ఫైనల్ (సాయంత్రం 4:30 గంటలకు), మహిళల వ్యక్తిగత 'ఆల్-అరౌండ్' ఫైనల్ (రాత్రి 10:30 గంటలకు)సోమవారం, 27 జూలైలాన్ బౌల్స్: గ్రూప్ దశ (మధ్యాహ్నం 1:00 గంటకు); సెమీ-ఫైనల్స్ (రాత్రి 8:30 గంటలకు)అథ్లెటిక్స్ & పారా అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల 400మీ హర్డిల్స్ (రౌండ్ 1), లాంగ్ జంప్ (క్వాలిఫైయింగ్), పురుషుల 110మీ హర్డిల్స్ (రౌండ్ 1), రాత్రి 11:00 గంటలకు - పురుషుల హై జంప్ ఫైనల్, 110మీ హర్డిల్స్ ఫైనల్, మహిళల షాట్ పుట్ F57 ఫైనల్స్విమ్మింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు - పురుషుల 200మీ బటర్‌ఫ్లై హీట్స్; రాత్రి 11:30 గంటలకు - ఫైనల్వెయిట్లిఫ్టింగ్: సాయంత్రం 5:30 గంటలకు - మహిళల 53కిలోల & 58కిలోల విభాగాల ఫైనల్స్, పురుషుల 79కిలోల విభాగం ఫైనల్ (అర్ధరాత్రి 12:30)3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్: రాత్రి 9:30 గంటలకు - భారత్ మహిళల జట్టు vs నైజీరియా (గ్రూప్ దశ)మంగళవారం, 28 జూలైలాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటకు - పతక పోరు మ్యాచ్‌లు (పురుషుల సింగిల్స్ & మహిళల పెయిర్స్), సాయంత్రం 7:30 గంటలకు- పురుషుల పెయిర్స్ & మహిళల సింగిల్స్ గ్రూప్ దశఅథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల 400మీ రౌండ్ 1, రాత్రి 11:00 గంటలకు - మహిళల హై జంప్ ఫైనల్, పురుషుల 100మీ సెమీ-ఫైనల్స్ & ఫైనల్స్వెయిట్లిఫ్టింగ్: సాయంత్రం 6:30 గంటలకు- మహిళల 63కిలోల విభాగం ఫైనల్; రాత్రి 11:00 గంటలకు - మహిళల 69 కేజీల ఫైనల్బుధవారం, 29 జూలైలాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - పురుషుల జంటలు & మహిళల సింగిల్స్ గ్రూప్ దశవెయిట్లిఫ్టింగ్: మధ్యాహ్నం 2:00 గంటలకు - మహిళల 77 కేజీల ఫైనల్; సాయంత్రం 6:30 గంటలకు - పురుషుల 94 కేజీల ఫైనల్అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల షాట్‌పుట్ క్వాలిఫైయింగ్, పురుషుల 200 మీటర్ల రౌండ్ 1, రాత్రి 11:00 గంటలకు- పురుషుల లాంగ్ జంప్ ఫైనల్, మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్గురువారం, 30 జూలైలాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - పురుషుల పెయిర్స్ & మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ ట్రాక్ సైక్లింగ్: మధ్యాహ్నం 2:30 గంటలకు - క్వాలిఫైయింగ్ రౌండ్లు; రాత్రి 8:30 గంటలకు- టీమ్ పర్స్యూట్ & టీమ్ స్ప్రింట్ ఫైనల్స్అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫైయింగ్, పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫైయింగ్, పురుషుల డెకాథ్లాన్, రాత్రి 11:00 గంటలకు - మహిళల డిస్కస్ త్రో ఫైనల్, మహిళల 5000మీ ఫైనల్, పురుషుల షాట్ పుట్ ఫైనల్వెయిట్లిఫ్టింగ్: సాయంత్రం 6:30 గంటలకు - మహిళల +86 కేజీల ఫైనల్; రాత్రి 11:00 గంటలకు- పురుషుల +110 కేజీల ఫైనల్శుక్రవారం, 31 జూలైజూడో: మధ్యాహ్నం 3:30 గంటలకు - ప్రిలిమినరీ రౌండ్లు; రాత్రి 8:30 గంటలకు- ఫైనల్బాక్సింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు - సెమీ-ఫైనల్ బౌట్లుఅథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - మిక్స్డ్ 4x400మీ రిలే హీట్స్, రాత్రి 11:00 గంటలకు- పురుషుల జావెలిన్ త్రో ఫైనల్, పురుషుల 400మీ హర్డిల్స్ ఫైనల్, పురుషుల 200మీ ఫైనల్శనివారం, 1 ఆగస్టులాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - గ్రూప్ స్టేజ్ ; రాత్రి 9:00 గంటలకు-సెమీ-ఫైనల్స్అథ్లెటిక్స్ & పారా అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు- పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్, మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ ఫైనల్, పురుషుల 400 మీటర్ల ఫైనల్, రాత్రి 11:00 గంటలకు- పురుషుల పోల్ వాల్ట్ ఫైనల్, పురుషుల 5000 మీటర్ల ఫైనల్, మిక్స్డ్ 4x400 మీటర్ల రిలే ఫైనల్బాక్సింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు& రాత్రి 9:00 గంటలకు - గోల్డ్ మెడల్ ఫైనల్స్ట్రాక్ సైక్లింగ్: రాత్రి 7:30 గంటలకు- వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్ & 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్ ఫైనల్ఆదివారం, 2 ఆగస్టుట్రాక్ సైక్లింగ్: మధ్యాహ్నం 1:30 గంటలకు - 1000 మీటర్ల టైమ్ ట్రయల్ ఫైనల్ & 40 కిలోమీటర్ల పాయింట్స్ రేస్జూడో: మధ్యాహ్నం 2:30 గంటలకు- హెవీవెయిట్ ప్రిలిమినరీ రౌండ్స్; సాయంత్రం 7:30 గంటలకు - పతకాల మ్యాచ్లుముగింపు వేడుకలు-రాత్రి 10.30 గంటల నుంచి👉 భారత్‌లో కామన్వెల్త్ గేమ్స్‌కు సంబంధించిన మ్యాచ్‌లన్నీ సోనీ నెట్‌వర్క్‌తో పాటు సోనిలివ్, దూరదర్శన్, డీడీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.2030లో భారత్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వ నుంది. ఈ నేపథ్యంలో ఈసారి గ్లాస్గో పోటీల చివరి రోజు తదుపరి గేమ్స్ పతాకాన్ని భారత్‌కు అందిస్తారు. ఈ సందర్భంగా 20 నిమి షాలపాటు సంగీతం, నృత్యంతో పాటు సంప్రదాయక ప్రదర్శనల ద్వారా మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి భారత్ చాటి చెప్పనుంది. దీంట్లో భాగంగా జరిగే కార్యక్రమంలో రష్మిక, మహదేవన్ పాల్గొంటారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న సంగతి తెలిసిందే. -
ఫిఫా అధ్యక్షుడికి ఐరాస అత్యున్నత పదవి..?
2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగల నాయకత్వ లక్షణాలు ఇన్ఫాంటినోకు ఉన్నాయని ప్రశంసిస్తూ, ఆయన ఐక్యరాజ్యసమితి (UN) తదుపరి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు నివేదికలు వెల్లడించాయి.అయితే, ట్రంప్ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఇన్ఫాంటినో యూఎన్ ప్రధాన కార్యదర్శి కాలేరు. ఆ పదవికి ఎంపిక కావాలంటే ముందుగా 15 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) మద్దతు అవసరం. ఐదు శాశ్వత సభ్య దేశాల్లో (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా) ఏ ఒక్క దేశం వీటో విధించినా అభ్యర్థిత్వం నిలిచిపోతుంది.భద్రతా మండలి ఆమోదం లభించిన తర్వాతే అభ్యర్థి పేరును యూఎన్ సర్వసభ్య సమావేశం (General Assembly) తుది ఆమోదానికి పంపుతుంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుండటంతో, కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.ఇప్పటివరకు జియానీ ఇన్ఫాంటినో ఈ పదవికి పోటీ చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసినట్లు లేదా ట్రంప్‌తో అధికారికంగా చర్చలు జరిపినట్లు ఎలాంటి నిర్ధారణ లేదు.ఇక యూఎన్ ప్రధాన కార్యదర్శి రేసులో చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.కాగా, ప్రపంచకప్ విజయవంతంగా నిర్వహించిన తర్వాత భవిష్యత్తులో మరోసారి టోర్నీని అమెరికాలో నిర్వహించాలని ట్రంప్ ఫిఫాను కోరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ముగిసిన ఫైనల్లో అర్జెంటీనాపై గెలిచి స్పెయిన్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. విజేతకు ట్రంప్ చేతుల మీదుగా ట్రోఫీని బహుకరించారు. ఈ టోర్నీని అమెరికా,కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. -
అర్జెంటీనా చీటింగ్.. కాక రేపుతున్న రొనాల్డో 'లైక్' వివాదం
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్‌లో చేతిలో ఓటమి చవిచూసిన అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. అయితే టోర్నీ ఆరంభం నుంచి అర్జెంటీనాకు అనుకూలంగానే వ్యవహరించదన్న విమర్శలు బహిరంగంగా వ్యక్తమయ్యాయి. ఫిఫాలో అర్జెంటీనాతో ఆడిన జట్లలో చాలా జట్లు ఇదే ఆరోపణలు చేశాయి. ఈ వివాదం సోషల్ మీడియాకు కూడా పాకింది. ఫైనల్‌కు అర్జెంటీనా చేరుకునే క్రమంలో ఫిఫా పక్షపాత ధోరణితో వ్యవహరించిందనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపించాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోకు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో లైక్ చేయడమే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.దీంతో ఫిఫా వ్యవహారంపై వచ్చిన విమర్శలకు రొనాల్డో కూడా మద్దతు తెలిపాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారంపై జాతీయ మీడియా నిర్వహించిన ఫ్యాక్ట్‌చెక్‌లో భిన్నమైన విషయం వెలుగులోకి వచ్చింది. రొనాల్డో అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోకు లైక్ చేసిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని తెలిపింది. అయితే దీనిలో కూడా రెండు అంశాలు దాగున్నాయి. ఒకవేళ రొనాల్డో మొదట లైక్ చేసి ఆ తర్వాత దానిని తొలగించి ఉండొచ్చు. అదీ కాకపోతే మాత్రం ఇది పాత స్క్రీన్‌షాట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.ఈసారి ఫిఫాలో 48 జట్లు పోటీపడితే అర్జెంటీనాకు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా వీఏఆర్ (VAR) నిర్ణయం రాలేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టుకు ఫిఫా అనుకూలంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రౌండ్ ఆఫ్-16లో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం వీఏఆర్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తమ జట్టు చేసిన గోల్‌ను అనర్హంగా ప్రకటించడం వల్లే ఓటమి ఎదురైందని మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ కెప్టెన్‌తో పాటు ప్రధాన కోచ్ కూడా ఆరోపించారు. అయితే ఈ విమర్శలను ఫిఫా ఖండిస్తూ, మ్యాచ్‌ల నిర్వహణలో ఎలాంటి పక్షపాతం ప్రదర్శించలేదని స్పష్టం చేసింది.ఇక ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ ప్రయాణం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డోకు ఇదే చివరిదనే ప్రచారం కూడా జరిగింది. ఈసారి ఫిఫాలో రొనాల్డో కూడా పెద్దగా మెరవలేదు. ఇప్పటిదాకా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించని రొనాల్డో వయసు 41 ఏళ్లు. దీంతో వచ్చే ఫిఫా (2030) నాటికి రొనాల్డో ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశముంది.Read: అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా! -
‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్లు తన్నుకున్న సంగతి తెలిసిందే. అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ స్పెయిన్ ఆటగాళ్ల మీదకు కోపంతో దూసుకొచ్చాడు. తన ఎదురుగా ఉన్న ఎరిక్ గార్సియాపై పిడిగుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన మరో ప్లేయర్ గావి గొంతు పట్టుకొని అతడిని నేలపై పడేశాడు. విచక్షణ కోల్పోయి పశువులా ప్రవర్తించిన లియాండ్రో పరేడెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. లియాండ్రోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తులు కూడా వచ్చాయి. అయితే లియాండ్రోపై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది ఫిఫా ఇంకా తెలపనప్పటికీ స్పెయిన్ స్టార్ గావి మాత్రం లియాండ్రోను శిక్షించవద్దని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ‘లియాండ్రో ఓటమి నైరాశ్యంలో సైకోలా మారిపోయి మాపై దాడి చేశాడు. కానీ ఫుట్‌బాల్ ఆటలో ఇలాంటి గొడవలు సహజమని, ఓటమి బాధలో ఒక్కోసారి ఆటగాళ్లు లయతప్పి తాము ఏం చేస్తున్నామో కూడా మరిచిపోతారు. అందుకే లియాండ్రోను కఠినంగా శిక్షించవద్దని కోరుతున్నా. అంతగా శిక్ష వేయాలనుకుంటే అతడు భవిష్యత్తులో ఆడబోయే మ్యాచ్‌ల్లో ఆట మధ్యలో మైదానం నుంచి తొలగిస్తే సరిపోతుంది.’ అని తెలిపాడు. నిజానికి పరేడెస్ హింసాత్మక చర్యకు పాల్పడడం వల్ల అతడు కనీసం మూడు మ్యాచ్‌లు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే ఫైనల్లో ఆట అదనపు సమయం 106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన గోల్‌తో, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో నాటకీయ విజయాన్ని అందుకుంది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ రెండో ఫిఫా టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫిఫా చాంపియన్స్‌గా నిలిచిన తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన స్పెయిన్‌కు ఘన స్వాగతం లభించింది. 20 లక్షల మంది అభిమానుల సమక్షంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో విజయోత్సవ సంబరాలు జరిగాయి. 💣🇦🇷 GAVI SOBRE LA AGRESIÓN QUE RECIBIÓ DE PAREDES EN LA FINAL ESPAÑA-ARGENTINA:💥 “No creo que deba ser suspendido. Lo lógico hubiese sido expulsarle en el partido”👊🏼 “No es una imagen para los niños pero creo que hay esa parte de fútbol que es un poco más violenta”📹… pic.twitter.com/ZaSrjPUmQm— Zona Mixta (@ZonaMixta__) July 21, 2026Read: హండ్రెడ్ లీగ్‌లో ముంబై, సన్‌రైజర్స్ అరుదైన ఫీట్! -
తొలి రౌండ్లోనే ప్రణయ్, దేవిక నిష్క్రమణ
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు తొలి రోజు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్... మహిళల సింగిల్స్‌లో దేవిక సిహాగ్ తొలి రౌండ్లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. థాయ్‌లాండ్ ఓపెన్ చాంపియన్ దేవిక 19–21, 21–19, 13–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2023 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ప్రణయ్ 10–21, 14–21తో లియోంగ్ జున్ హావో (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు.నేడు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ పీవీ సింధు భారత్‌కే చెందిన ఉన్నతి హుడాతో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యుషి తనాకా (జపాన్)తో లక్ష్య సేన్; అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో ఆయుశ్ తలపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా)లతో గద్దె రుత్విక శివాని–రోహన్ ... గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా)లతో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల పోటీపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా)లతో హరిహరన్–అర్జున్ ఆడతారు. -
అర్జున్‌కు తొలి ఓటమి
చెన్నై: భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీలో తొలి పరాజయం చవిచూశాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్‌తో మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో అర్జున్ 60 ఎత్తుల్లో ఓడిపోయాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌కు మూడో ఓటమి ఎదురైంది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ప్రాణేశ్ 39 ఎత్తుల్లో గుకేశ్‌ను ఓడించాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ నేడు ముగుస్తుంది. ఆరో రౌండ్ తర్వాత అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 3.5 పాయింట్లతో అర్జున్, నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. 1.5 పాయింట్లతో గుకేశ్ చివరిదైన ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. నేడు జరిగే చివరిదైన ఏడో రౌండ్లో అలీరెజా ఫిరూజాతో అర్జున్; నిహాల్ సరీన్‌తో ప్రాణేశ్; నీమెన్ (అమెరికా)తో గుకేశ్; నొదిర్‌బెక్‌తో ఆంద్రెకిన్ (రష్యా) తలపడతారు. టైటిల్ రేసులో అర్జున్, అలీరెజా, నొదిర్బెక్ ఉన్నారు. -
హర్మన్‌ప్రీత్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: వచ్చే నెలలో నెదర్లాండ్స్‌లో జరిగే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. ఆగస్టు 14 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో ఉన్నాయి. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘డి’లో ఇంగ్లండ్, పాకిస్తాన్, వేల్స్ జట్లతో కలిపి భారత్‌కు చోటు కల్పించారు. ఆగస్టు 15న జరిగే తొలి మ్యాచ్‌లో వేల్స్‌తో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత 17న ఇంగ్లండ్‌తో, 19న పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. 1975లో ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత భారత జట్టు మరోసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరలేదు. 2023లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత పురుషుల హాకీ జట్టు: హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్ ), మోహిత్, సూరజ్ కర్కేరా, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్దీప్ సివాచ్, రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లలాగే, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్, దిల్‌ప్రీత్ సింగ్, శిలానంద్ లాక్రా, సుఖ్జీత్ సింగ్, మన్దీప్ సింగ్, అభిషేక్. -
గ్లాస్గో పిలుస్తోంది!
గ్లాస్గో (స్కాట్లాండ్): ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి తెరపడి మూడు రోజులు గడిచాయో లేదో క్రీడాభిమానులను అలరించేందుకు మరో మెగా క్రీడా ఈవెంట్ సిద్ధమైంది. బ్రిటిష్ పాలిత దేశాల మధ్య నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్ గేమ్స్ బుధవారం ప్రారంభమవుతాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికగా ఆగస్టు 2వ తేదీ వరకు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి. ఈ క్రీడలకు మస్కట్‌గా యునికార్న్ (ఒంటికొమ్ము గుర్రం)ను ఎంపిక చేశారు. దీనికి ‘ఫినీ’ అని పేరు పెట్టారు. 74 దేశాల నుంచి 3000 మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటారు. భారత్, ఆ్రస్టేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేతలు ఈ క్రీడల్లో బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యహక్కులు ఆ్రస్టేలియాలోని విక్టోరియా నగరానికి కేటాయించారు. అయితే 2023లో ఈ క్రీడలు నిర్వహించలేమంటూ ఆ్రస్టేలియా ప్రకటించింది. దాంతో ఈ క్రీడల నిర్వహణకు మరోసారి గ్లాస్గో ముందుకొచ్చింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ కూడా గ్లాస్గోలోనే జరిగాయి. ఓవరాల్‌గా స్కాట్లాండ్లో కామన్వెల్త్ క్రీడలు స్కాట్లాండ్లో జరగనుండటం ఇది నాలుగోసారి. అంతకుముందు 1970, 1986లో స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చింది. 2022 బర్మింగ్‌హామ్‌లో 20 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. ఈసారి 10 క్రీడాంశాల్లోనే (3x3 బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జూడో, నెట్‌బాల్, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, లాన్ బౌల్స్) నిర్వహించనున్నారు. భారత్ నుంచి 125 మంది క్రీడాకారులు 10 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జరగనున్నాయి. -
మెస్సీ సేనకు ఘనస్వాగతం.. కానీ చిన్న ట్విస్ట్!
ఫిఫా ప్రపంచకప్ 2026లో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మెస్సీ సేన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. ముందుగా బ్యూనస్ ఎయిర్స్‌లోని ఐజా అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బందికి మూడు ప్రత్యేక ఓపెన్‌టాప్ బస్సులను ఏర్పాటు చేశారు. Phot Credit: FIFA Twitterఈ క్రమంలో ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ బ్యూనస్ ఎయిర్స్కు చేరుకునే దారిలో అభిమానులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనంతో రాజధాని వీధులు నిండిపోయాయి. మ్యూజిక్ చాంటింగ్స్, ర్యాప్ సాంగ్స్‌తో వీధులన్నీ హోరెత్తిపోయాయి. భారీగా తరలివచ్చిన అభిమానులను చూసిన అర్జెంటీనా ఆటగాళ్లు బస్ క్యాబిన్ డోర్లను ఓపెన్ చేసి బయటకు వచ్చి అభివాదం చేశారు. చేతిలో ఫిఫా ట్రోఫీలకు బదులు వాళ్లు సాధించిన సిల్వర్ మెడల్స్, సిల్వర్ ట్రోఫీలను చూసే అభిమానులు మురిసిపోయారు. ట్రోపీలు ఎవడికి కావాలి.. మీ ఆటతో మనసులు గెలిచారు అని అభిమానులు తమ సందేశాలు వినిపించారు.'కమాన్ అర్జెంటీనా' అని నినాదాలతో హోరెత్తించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. Phot Credit: FIFA Twitterఅర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ జట్టుతో ప్రయాణం చేయలేదు. తన కుటుంబం కూడా తనతోనే ఉండడంతో మెస్సీ అమెరికాలోనే ఉండిపోయాడు. ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఆడుతున్న మెస్సీ కొంత బ్రేక్ తర్వాత మళ్లీ ఆ క్లబ్‌తో జాయిన్ అవ్వనున్నాడు. దీంతో ఫిఫా ప్రపంచకప్ తర్వాత మెస్సీ స్వదేశానికి వస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తమ ఆరాధ్య దైవాన్ని లైవ్‌లో చూడాలని ఆశించిన అభిమానులకు భంగపాటు ఎదురైంది. Phot Credit: FIFA Twitterఅయితే తాను రాకున్నా తాను సాధించిన సిల్వర్ బూట్‌ను మాత్రం అభిమానులకు కానుకగా జట్టుతో పాటే పంపించాడు. గోల్‌కీపర్ ఎమిలియో మార్టినేజ్ సహా నికోలస్ ఒటమెండి, మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్, అలెక్సిక్మాక్ అలిస్టర్, నికోలస్ గొంజలెజ్, సహా అర్జెంటీనా ఆటగాళ్లు తమను చూసేందుకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి అభివాదం చేస్తూ కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Phot Credit: FIFA Twitterఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా ఫైనల్లో స్పెయిన్ చేతిలో 1-0తో పరాజయం చవిచూసింది. ఫెర్నాండేజ్ రెడ్‌కార్డుకు గురవ్వడంతో పది మందితోనే ఆడిన అర్జెంటీనా మ్యాచ్‌ను లాక్కొచ్చింది. ఫిఫా టోర్నీ అంతటా అర్జెంటీనా జట్టును తన భుజస్కందాలపై మోసిన మెస్సీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. అయితే టోర్నీ ఆసాంతం అసాధారణ ఆటను కనబరిచిన మెస్సీ 8 గోల్స్‌తో సిల్వర్ బూట్‌ను సొంతం చేసుకున్నాడు. వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030)లో మెస్సీ ఆడడం అనుమానమే కాబట్టి తమ ఆరాధ్య ఆటగాడిని చివరిసారి అర్జెంటీనా జాతీయ జెర్సీలో చూడాలని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. 🇦🇷💙 ¡GRACIAS POR TODO, SELECCIÓN!📹 @Argentina pic.twitter.com/fzzLE6k1Be— TyC Sports (@TyCSports) July 21, 2026Despite the World Cup final loss, thousands of Argentine fans were there to welcome their heroes home. Respect. 🫡 🇦🇷🩵 pic.twitter.com/Bo9UfU60nL— MC (@CrewsMat10) July 20, 2026Argentina 🩵 pic.twitter.com/gn9ZhMuDP3— Selección Argentina in English (@AFASeleccionEN) July 20, 2026Read: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు
జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్‌గా పీవీ సింధు నిలిచిన సంగతి తెలిసిందే. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు తన విజయం వెనుక ఎవరు దాగున్నారనే విషయాన్ని బయటపెట్టింది. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న సమయంలో కోహ్లి తనకు ధైర్యం చెప్పాడని, అతడిచ్చిన సలహాతోనే ఇవాళ తనను చాంపియన్‌గా నిలబడేలా చేసిందంటూ సింధు అతడిని ప్రశంసలతో ముంచెత్తింది. కోహ్లితో పాటు తనకు కష్టకాలంలో అండగా నిలిచిన భర్త వెంకటసాయి దత్తకు కూడా సింధు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ‘ కొంతకాలం కిందట నేను ఫామ్‌లేమితో సతమతమయ్యాను. ఈ సమయంలో కోహ్లిని కలిసి.. మీరు కూడా ఒక దశలో ఫామ్ కోల్పోయి సెంచరీ కోసం పరితపించారు. ఆ సమయం ఎలా గడించింది, దానిని మీరు ఎలా అధిగమించారు’ అని అడిగాను. దీనిని కోహ్లి చాలా సింపుల్‌గా తేల్చేశాడు. ఒక ఆటగాడిగా పరుగులు చేయడమే నా పని. దాంట్లోనే నా ఆనందాన్ని వెతుక్కుంటా’ అని పేర్కొన్నాడు. ఆ సమయంలో కోహ్లి అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. కానీ నా బొటనవేలికి గాయం కావడంతో డాక్టర్ మూడు నెలలు విరామం తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో నా భర్త వెంకట దత్త సాయి మానసిక ప్రశాంతత కోసం నన్ను అట్లాంటాకు తీసుకెళ్లారు. గాయాలు, ఫామ్‌పై పెరుగుతున్న సందేహాల నేపథ్యంలో దత్త నాకు కోహ్లి చెప్పిన మాటలను గుర్తుచేసుకోమన్నాడు. అప్పుడు తెలిసింది నాకు కోహ్లి సీక్రెట్. విరాట్ చెప్పిన మాటలు ఇప్పటికీ నా మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్య సంభాషణ ఒక ప్రత్యేకమైనదిగానే ఉంచాలనుకుంటున్నా. ఆ తర్వాత కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ అవేంటనేవి మా మధ్యే ఉండడం అవసరమనిపించింది’ అని సింధూ పేర్కొంది. ఆదివారం జరిగిన జపాన్ ఓపెన్ ఫైనల్లో అకానే యమగూచిపై విజయం సాధించిన సింధు 19 నెలల తర్వాత ఒక బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.Read: ‘రోహిత్, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’ -
స్పెయిన్ నంబర్‌వన్.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచలనం
ఫిఫా ప్రపంచకప్ 2026 టైటిల్ గెలుచుకున్న స్పెయిన్ జట్టు మరోసారి నంబర్‌వన్ ర్యాంకును అందుకుంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఫిఫా అధికారికంగా ర్యాంకులను విడుదల చేసింది. చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోగా, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానానికి పడిపోయింది. Photo Credit: FIFA Twitterర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఈసారి ఫిఫాలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న మొరాకో, నార్వే జట్లు మాత్రం సంచలనం సృష్టించాయి. ఫిఫా చరిత్రలోనే మొరాకో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుంది. క్వార్టర్స్‌లో ఓడిన మొరాకో ఆరో స్థానంలో నిలిచింది. ఎర్లింగ్ హాలండ్ సారథ్యంలోని నార్వే కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. ఈ ఫిఫాలో క్వార్టర్స్ చేరుకొని చరిత్ర సృష్టించిన నార్వే 12 స్థానాలు ఎగబాకి 19వ స్థానం (టాప్-20)లో నిలిచింది.Photo Credit: FIFA Twitterఇక కాంస్యం గెలిచిన ఇంగ్లండ్ మూడో స్థానంలో, ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టిన పోర్చుగల్ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోగా, అదే సమయంలో బ్రెజిల్ ఐదో స్థానానికి చేరుకుంది. ఇక బెల్జింయం, నెదర్లాండ్స్, మెక్సికో వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు దక్కించుకున్నాయి. ఫిఫా 2026లో పేలవ ప్రదర్శన కనబరిచిన మాజీ చాంపియన్ జర్మనీ మాత్రం టాప్-10లో చోటు కోల్పోయి 12వ స్థానంలో నిలవగా, క్రొయేషియా 13వ స్థానంలో ఉంది. ఇక ఈసారి ఫిఫాలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న అనామక జట్టు కేప్‌వెర్డె 8 స్థానాలు ఎగబాకి 64వ స్థానంలో నిలిచింది. ఈ ఫిఫాలో కేప్‌వెర్డె ప్రిక్వార్టర్స్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే.చదవండి: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ తొలిసారి స్పందించాడు. వరుసగా రెండోసారి ఫిఫా గెలవాలనుకున్న అతడి కలలను స్పెయిన్ ఆవిరి చేయడంతో మైదానంలోనే చిన్న పిల్లాడిలా మారిపోయి వెక్కివెక్కి ఏడ్చాడు. ఇది చూసిన అభిమానులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఫైనల్ ముగిసిన ఒకరోజు తర్వాత మెస్సీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ లేఖను పంచుకున్నాడు. 'ఫలితం చూసిన తర్వాత చాలా బాధేసింది. ఈ గాయం మానడానికి సమయం పడుతుంది. కానీ ఏదైనా అంతా మంచే జరగాలనే దానికే నేను కట్టుబడి ఉంటాను.' అని మెస్సీ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు.'ప్రతీ మ్యాచ్‌లో ప్రాణం పెట్టి ఆడామనే అనుకుంటున్నాం. ఈ ఫిఫా టోర్నీలో మా దేశ ప్రజలు ప్రతీ విషయంలో మాకు అండగా నిలవడంతో వారి మద్దుతుతోనే కష్టపడ్డాం. ఫైనల్ దాకా చేరుకున్నాం. జట్టు కృషి, ప్రయత్నం కలగలిసి అర్జెంటీనాను ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలబెట్టిందని బలంగా చెప్పగలను. ఇవాళ ఓటమితో మనం సాధించిన విజయాన్ని చెప్పుకోవడం కష్టమే. కానీ వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్పుల్లో అర్జెంటీనా ఫైనల్ చేరిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి (అర్జెంటీనాతో పాటు మిగతా దేశాలు) పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నా. మనమంతా ఎప్పటికీ ఇలానే ఐక్యంగా ఉంటూ అర్జెంటీనా ఖ్యాతిని కాపాడుకుందాం. ఇక చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌కు కూడా నా ప్రత్యేక అభినందనలు' తెలుపుతూ లేఖను ముగించాడు.2026 ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మరోసారి అన్నీ తానై నడిపించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్టర్ ఫైనల్ వరకు) కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. 9 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో సిల్వర్ బూట్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో దుర్భేద్యమైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్లను అడ్డుకోవడమే సరిపోవడంతో మెస్సీ కూడా ఏం చేయలేకపోయాడు. ఒకవేళ ఈసారి అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెలిచి ఉంటే, ఆ మరుక్షణమే మెస్సీ ఆటకు వీడ్కోలు పలికేవాడేమో. ప్రస్తుతం తన రిటైర్మెంట్పై మౌనమే వహించినప్పటికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడడం అనుమానమే. కాబట్టి ఫుట్‌బాల్‌లో ఒక శకం దాదాపు ముగిసినట్లే. 🚨🚨📲 Leo Messi on IG: "The pain is immense, and it will take time for this wound to heal. "But I also choose to hold on to all the good things, the matches we turned around by giving everything, moments that will remain in our memories forever and the support of an entire… pic.twitter.com/3ZL4yFKhmA— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) July 20, 2026 ESTE ULTÚIMO TANGO Una de las cosas más hermosas del fútbol es tener a Lionel Andrés Messi y su participación en todos los Mundiales. Gracias por todo lo que has logrado con la selección: récords, logros y campeonatos Gracias por cada momento de alegría que compartimos con la… pic.twitter.com/6GYfKBKpnz— AR (@ionlylei) July 20, 2026Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm— Messi Anıları (@messianilari) July 19, 2026చదవండి: బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం! -
కిక్ ఎక్కించింది...
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్ క్రీడ మెగా ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున తెరపడింది. 39 రోజులపాటు 48 జట్ల మధ్య 104 మ్యాచ్‌లు జరిగాయి. స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ ఏకపక్షంగా ముగిసినా... మ్యాచ్ విరామ సమయంలో జరిగిన కార్యక్రమాలు కట్టిపడేశాయి. షకీరా, మడోన్నా, బీటీఎస్, స్పీడ్, జస్టిన్ బీబెర్లాంటి స్టార్స్‌తో కార్యక్రమం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లను ఏకంగా 68,10,966 ప్రేక్షకులు మైదానంలోకి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించడం ఓ కొత్త రికార్డు. నాలుగేళ్ల తర్వాత జరిగే 24వ ప్రపంచకప్ టోర్నీకి 2030లో స్పెయిన్, పోర్చుగల్, మొరాకో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2030లో ప్రపంచకప్ టోర్నీకి 100 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో తొలి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఉరుగ్వే, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా, పరాగ్వే మూడు సెంటీనరీ మ్యాచ్‌లకు వేదికగా నిలుస్తాయి. ఫలితంగా స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా దేశాలు 2030 ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. 2030 ప్రపంచకప్‌ను 64 దేశాలతో నిర్వహించాలని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం రాబోయే రోజుల్లో తీసుకుంటారు. -
సాహోరే స్పెయిన్
అంచనాలకు మించి మెరిపించిన స్పెయిన్ జట్టు రెండోసారి జగజ్జేతగా నిలిచింది. తుది సమరంలో ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడుతూ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆట కట్టించింది. సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఒక్కొక్కరు కాదు జట్టుగా ఆడితే ప్రపంచాన్ని జయించవచ్చని స్పెయిన్ నిరూపించింది. మొదట్లో వెనుకబడినా చివర్లో చెలరేగిపోతూ విజయాన్ని లాగేసుకుంటున్న అర్జెంటీనాకు తుది పోరులో స్పెయిన్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. నిర్ణిత 90 నిమిషాల్లో గోల్ చేయలేకపోయినా... అదనపు సమయంలో స్పెయిన్ సక్సెస్ సాధించింది. 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా తమ జోరును కొనసాగించి అర్జెంటీనాకు నిరాశను మిగిల్చింది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ విశ్వవిజేత కావడంతో ఆ దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. సోమవారం స్వదేశానికి వచ్చిన ప్రపంచకప్ వీరులకు ఆ దేశం బ్రహ్మరథం పట్టింది. తిరుగులేని ఆధిక్యం... ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట ఆరంభమైన దగ్గరి నుంచి దాదాపు మ్యాచ్ ముగిసే వరకు బంతి స్పెయిన్ నియంత్రణలోనే ఉంది. ఈజిప్‌్ట, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌ల తరహాలో అర్జెంటీనా ఆఖర్లో కోలుకుంటుందని అందరూ భావించినా... స్పెయిన్ అసలు అలాంటి అవకాశమే ఇవ్వలేదు. తుది పోరులో జట్టు సభ్యులు ఒకరికొరకు ఏకంగా 853 పాస్‌లు ఇచ్చుకున్నారంటే, ప్రత్యర్థికంటే కనీసం 400 సార్లు ఎక్కువగా బంతిని ‘టచ్’ చేశారంటేనే స్పెయిన్ ఎలా బంతిపై పట్టు నిలబెట్టుకుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్లు కుబార్సి, లాపోర్ట్, రోడ్రి మధ్యనే బంతి తిరుగాడింది. ఇద్దరు డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్ కలిపి ఫైనల్లో 359 సార్లు బంతిని ‘టచ్’తో తమ మధ్యే ఉంచుకున్నారు. టోర్నీ మొత్తంలో ఒకే ఒక గోల్ ఇవ్వడం జట్టు ఆధిపత్యాన్ని సూచిస్తోంది. టీమ్ మొత్తం 20 షాట్లు ఆడగా... 12 నేరుగా లక్ష్యంవైపే వెళ్లాయి. ఫైనల్ స్కోర్ 1–0తో చూస్తే మ్యాచ్ హోరాహోరీగా సాగిందేమో అనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఒక జట్టు మాత్రమే పూర్తి ఏకపక్షంగా మ్యాచ్‌లో నిలిచింది. ఏకైక గోల్ సాధించిన ఫెరాన్ టోరెస్‌తో పాటు ఈ గోల్లో అతనికి సహకరించిన పెడ్రో పొరోస్, నికో విలియమ్స్... ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన మికెల్ మెరీనో, కెపె్టన్ రోడ్రి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక గోల్‌కీపర్ యునై సైమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడు మ్యాచ్‌లలో ‘క్లీన్ షీట్’తో అతను జట్టును కాపాడిన తీరు నిజంగా సూపర్.వరుస టైటిల్స్ జోరు... రెండేళ్ల క్రితం బెర్లిన్‌లో యూరోపియన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న స్పెయిన్ ఇప్పుడు ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2008లో కూడా సరిగ్గా ఇదే తరహాలో యూరోప్ విజేతగా నిలిచిన రెండేళ్లకు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. నేషన్స్ లీగ్, అండర్–23 ఒలింపిక్ స్వర్ణం, అండర్–19 యూరోపియన్ చాంపియన్‌షిప్‌లతో కలిపితే గత ఐదేళ్లలో స్పెయిన్ పురుషుల జట్టు 5 పెద్ద టోరీ్నల్లో విజేతగా నిలవడం విశేషం. వీటికి తోడు 2023లో మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కూడా సాధించిన స్పెయిన్...రెండు విభాగాల్లో ఒకే సారి ప్రపంచ కప్‌ను తమ వద్ద ఉంచుకున్న తొలి జట్టుగా నిలిచింది. దీనిని బట్టి చూస్తే ఫుట్‌బాల్‌లో స్పెయిన్ ఎంత నిలకడగా, ఘనంగా రాణిస్తుందో అర్థమవుతుంది. చేతులెత్తేసిన అర్జెంటీనా... వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయం 90 నిమిషాల వరకు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఒక్క షాట్ కూడా ప్రయత్నించని మొదటి జట్టుగా అర్జెంటీనా నిలిచింది! 117వ నిమిషంలో గానీ తొలి షాట్ కొట్టని జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశించగలమా! స్పెయిన్‌తో తుది పోరులో అర్జెంటీనా పరిస్థితి ఇలాగే కనిపించింది. అసలు ఇలాంటి ఆటను అభిమానులెవరూ ఊహించలేదు. మెస్సీపైనే అందరి దృష్టీ ఉండగా... ఇతర ఆటగాళ్లెవరూ జట్టు కోచ్ స్కలోని అంచనాలు నిలబెట్టలేకపోయారు. మ్యాక్ అలిస్టర్, రోడ్రిగో డి పాల్, లియాండ్రో పెరేడ్స్ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యారు. అసలు సమరంలో మెస్సీని నిలువరించడంలో స్పెయిన్ పూర్తిగా సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాల ముందు మెస్సీ కొట్టిన కార్నర్ కిక్‌ను సబ్‌స్టిట్యూట్ గ్విలియోనా సిమోన్ క్రాస్ బార్ మీదుగా పంపించి వృథా చేయడం జట్టు పరిస్థితికి అద్దం పట్టింది. ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డుతో మైదానం నుంచి ని్రష్కమించడంతో చివర్లో 10 మందితోనే ఆడటం కూడా అర్జెంటీనా జట్టుకు చేటు చేసింది. నిజానికి స్పెయిన్ విజయం మ్యాచ్ ఆరంభంలోనే ఖాయమయ్యేది! అయితే అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్జినెజ్ అసాధారణ ప్రదర్శనతో గెలుపు ఆలస్యమైంది. ఫైనల్లో రికార్డు స్థాయిలో 12 షాట్లను అతను అడ్డుకోగలిగాడు.భవిష్యత్తు కూడా వారిదే...ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక్క గోల్ ఇవ్వడం... దాదాపు లోపాలు లేని ఆట... ఇద్దరు 19 ఏళ్ల కుర్రాళ్లను సమర్థంగా వాడుకోవడంతో పాటు వారి చుట్టూ సీనియర్లతో కలిపి జట్టును సన్నద్ధం చేయడం... టోర్నీ ఆరంభానికి ముందే తాము అనుకున్న ప్రణాళికకు పూర్తి కట్టుబడి దానినే అమలు పర్చడం... స్పెయిన్‌ను రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిపాయి. ఈ జట్టు ఎలాంటి థ్రిల్లర్ సినిమాను తలపించే అనూహ్య మలుపుల తరహా ఆట ఆడలేదు. కానీ ఏం చేయాలనే దానిపై జట్టుకు చాలా స్పష్టత ఉంది. మిడ్‌ఫీల్డర్లు సత్తా చాటి దూసుకుపోగా, డిఫెండర్లు అయిన అద్భుత ఆటను ప్రదర్శించారు. ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో హీరో జట్టు నుంచి వచ్చాడు. ఏడుగురు ప్లేయర్లు గోల్ స్కోరర్లు కావడం విశేషం కాగా క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), డిబ్రూయిన్ (బెల్జియం), ఎంబాపె (ఫ్రాన్స్), మెస్సీల వంటి స్టార్లను స్పెయిన్ డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. టోర్నీ మొత్తంలో కలిపి ప్రత్యర్థులకు 43 సార్లు మాత్రమే షాట్లకు అవకాశం చిక్కింది. స్పెయిన్ గెలుపు ఇక్కడితోనే ఆగిపోదు. వచ్చే దశాబ్దంలో ఫుట్‌బాల్‌ను శాసించగల సామర్థ్యం టీమ్‌లో ఉంది. 19 ఏళ్ల ఇద్దరు కుర్రాళ్లు భవిష్యత్తులో టీమ్‌ను ముందుకు తీసుకెళ్లగలరు. ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ కుబార్సి అద్భుతంగా ఆడుతుండగా... లమీన్ యామల్ విలువేమిటో ప్రపంచం ఇప్పటికే చూసింది. ఈ వయసులోనే వీరిద్దరు వరల్డ్ కప్ నెగ్గిన బృందంలో సభ్యులుగా ఉన్నారు.2026 ప్రపంచకప్ అవార్డులుగోల్డెన్ బూట్ (టోర్నీ టాప్ స్కోరర్): కిలియన్ ఎంబాపె (ఫ్రాన్స్; 10 గోల్స్). 2022 ప్రపంచకప్‌లోనూ ఎంబాపెకే గోల్డెన్ బూట్ అవార్డు లభించింది. వరుసగా రెండు ప్రపంచకప్‌లలో గోల్డెన్ బూట్ గెల్చుకున్న ఏకైక ప్లేయర్ ఎంబాపెనే. గోల్డెన్ బాల్ (టోర్నీ బెస్ట్‌ప్లేయర్): స్పెయిన్ కెప్టెన్ రోడ్రి. గోల్డెన్ గ్లౌవ్ (టోర్నీ బెస్ట్ గోల్‌కీపర్): స్పెయిన్ గోల్‌కీపర్ సిమోన్. మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో సిమోన్ ఒక్క గోల్ మాత్రమే సమరి్పంచుకున్నాడు. బెస్ట్ యంగ్ ప్లేయర్: కుబార్సి (స్పెయిన్). ఫెయిర్‌ప్లే అవార్డు: నెదర్లాండ్స్ – సాక్షి క్రీడా విభాగం -
బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం!
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలవడంతో ఆ జట్టు సంబరాలు మాములుగా లేవు. 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా టైటిల్ గెలవడంతో స్పెయిన్‌లో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇక స్పెయిన్ ఆటగాళ్ల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే ఈ ఫిఫా టోర్నీలో ఒక బుడ్డోడు మాత్రం యమా క్రేజ్ సంపాదించాడు. ఆ బుడ్డోడు ఎవరో కాదు స్పెయిన్ స్టార్ లామినె యమాల్ చిన్న తమ్ముడు కీన్. సవతి తల్లికి పుట్టినోడయినప్పటికీ కీన్‌ను యమాల్ సొంత తమ్ముడిలా, కొడుకులా భావిస్తుంటాడు. మూడేళ్ల వయసున్న కీన్ 2026 ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు తన తల్లితో కలిసి హాజరయ్యాడు. ప్రతీ మ్యాచ్‌ను స్టాండ్స్ నుంచి వీక్షించిన కీన్ తన అన్న ఆటను తెగ ఎంజాయ్ చేసేవాడు. Photo Credit: FIFA Twitterఅంతేకాదు స్పెయిన్ తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత యమాల్ తన సోదరుడిని ఒడిలో తీసుకొని ఆడుకోవడం ఆనవాయితీగా చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా యమాల్ దీనిని కంటిన్యూ చేశాడు. తన అన్న కప్ గెలవడంతో తమ్ముడికి సంతోషం ఆగలేదు. గ్రౌండ్ అంతా తనదే అన్నట్లుగా మైదానం నలుమూలలా పరిగెడుతూ సందడి చేశాడు. Photo Credit: FIFA Twitterఈ సందర్భంగా అన్న లామినె యమాల్‌ను కూడా కాసేపు ఆట పట్టించాడు. ట్రోఫీ సెలబ్రేషన్స్ అనంతరం కప్పు తన చేతిలోకి తీసుకున్న యమాల్ తన కుటుంబం దగ్గరకు వచ్చి తమ్ముడితో కలిసి ఫొటోలుకు ఫోజివ్వడం వైరల్‌గా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫిఫా పైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. Lamine Yamal ve kardeşi. pic.twitter.com/gpcwLCiKvz— Pusholder (@pusholder) July 20, 2026 Lamine Yamal celebrating with his brother 🤗 pic.twitter.com/sd8Jg8smgZ— B/R Football (@brfootball) July 19, 2026 It's Keyne's world and we're just living in it 🤣 pic.twitter.com/Qk4I9BAuX4— B/R Football (@brfootball) July 19, 2026చదవండి: దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్‌కు మరో అవమానం! -
మెస్సీ అలా.. లామినే ఇలా; చివరికి!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఓటమి బాధను తట్టుకోలేక అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ స్పెయిన్ ఆటగాళ్లతో తగాదా పెట్టుకున్నాడు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ ఒకవైపు మెస్సీ.. మరోవైపు లామినె యమాల్ మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు. ఓటమి షాక్ నుంచి తేరుకోని మెస్సీ మైదానంలోనే నిరాశతో కూర్చుండిపోయాడు. తనలో తాను కుమిలిపోతు కన్నీటిపర్యంతమయ్యాడు. Photo Credit: FIFA Twitterమరోపక్క యమాల్ కూడా తన పక్కనే అంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ తన దేశం గెలిచిందన్న సంతోషంతో అతను ప్రార్థనల్లో మునిగిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించకుండా యమాల్ తన పనిలో నిమగ్నమై ఉండడం చూస్తే అతడి ఆత్మవిశ్వాసం ఎలాంటిదో అర్థమవుతోంది. ఇంత గొడవలో కూడా మెస్సీ, యమాల్ మధ్య జరిగిన ఒక భావోద్వేగ ఘటన ఆసక్తిగా మారింది.MIENTRAS LAMINE YAMAL REZABA... 😳 pic.twitter.com/9SPl4s4Gep— Diario Olé (@DiarioOle) July 20, 2026Photo Credit: FIFA Twitterఒకరినొకరు ఆలింగనం..లామినే యమాల్ తన ప్రార్థన పూర్తి చేసుకొని లేచిన తర్వాత తన ఎదురుగా పెద్ద గొడవ జరుగుతున్న దృష్ట్యాలను చూశాడు. కానీ దానిని పట్టించుకోకుండా యమాల్ నేరుగా మెస్సీ వద్దకు వచ్చాడు. అప్పటికే నిరాశలో కూరుకుపోయిన మెస్పీని ఓదార్చి పైకి లేపాడు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. ఇది చూసిన అభిమానులు.. 'క్యా సీన్‌హై' అనకుండా ఉండలేకపోయారు. వీరిద్దరు ఆలింగనం చేసుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. 'నిజమైన క్రీడా స్ఫూర్తికి మెస్సీ, యమాల్ అర్థం చెప్పారంటూ' కామెంట్లు చేశారు.అసలేం జరిగింది?ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఓటమి బాధలో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లవైపు చూస్తూ స్పెయిన్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం వారికి కంటికి ఇంపుగా అనిపించలేదు. దీంతో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఒక్కసారిగా స్పెయిన్ ఆటగాళ్లవైపు దూసుకొచ్చాడు. Thank you, Leo. Legends are remembered, but you will never be forgotten. 🐐https://t.co/K8dqX5Tvlo— ketansusuw ✿ (@tansuuuw) July 20, 2026ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. Read: మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే! -
మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే!
మెస్సీ ఒక ఉత్పాతం, మౌన ముని. ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురైనా తన ఆటతోనే సమాధానం చెప్పాడు తప్ప హద్దులు మీరిన సందర్భాలు చాలా తక్కువ. నిజానికి మెస్సీకి కోపం కూడా ఎక్కువే. కానీ దాని అవసరం ఎంతమేర ఉంటుందో అంతే చూపిస్తుంటాడు. కాబట్టే ఇవాళ ప్రపంచంలో ప్రతీ మూలన అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో ఫుట్‌బాల్ పీలే, మారడోనా సహా ఎందరో దిగ్గజ ఆటగాళ్లను అందించినప్పటికీ ఈ తరంలో మాత్రం మెస్సీనే దిగ్గజ ఆటగాడు. ఇంకా చెప్పాలంటే అతడో ఆరాధ్య దైవం.అలాంటి ఈ తరంలో ఫుట్‌బాల్ తెలిసినోడిని నిద్రలో నుంచి లేపి ఒక ఆటగాడి పేరు చెప్పమంటే మొదట వినిపించే పేరు లియోనల్ మెస్సీ. రెండు దశాబ్దాలుగా తన ఆటతో ఫుట్‌బాల్ అభిమానుల గుండెల్లో గుడి కట్టేసుకున్న మెస్సీ చూడాల్సినవన్నీ చూశాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు, ఆరుసార్లు యూరోపియన్ గోల్డెన్ షేస్, ఎనిమిది సార్లు ఫిఫా బెస్ట్ ప్లేయర్, అలాగే 2025లో ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్‌గాను నిలిచాడు. తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా ప్రపంచకప్‌ను కూడా నాలుగేళ్ల కిందట ఖతార్‌లోనే అందుకున్నాడు. మరి ఇన్ని చూసినా ఈసారి ఫిఫాలో కూడా మెస్సీ నామజపమే ఎందుకు నడిచిందనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. అదంతా మెస్సీ మాయ.Photo Credit: FIFA Twitterమెస్సీ బరిలో ఉన్నాడంటే చాలు అభిమానులకు ఎక్కడలేని జోష్ వస్తుంది. 2026 ఫిఫా ప్రపంచకప్‌లోనూ అదే రిపీట్ అయింది. ఈసారి ఫిఫాలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మరోసారి అన్నీ తానై నడిపించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్టర్ ఫైనల్ వరకు) కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. అయితే అతడి స్పీడుకు ఈసారి ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె (10 గోల్స్, 4 అసిస్ట్‌లు) బ్రేకులు వేశాడు. అయితే క్వార్టర్స్, సెమీస్‌లో గోల్ చేయనప్పటికీ కీలక అసిస్ట్‌లు అందించి జట్టు వెన్నంటే ఉన్నాడు. కానీ కీలకమైన ఫైనల్లో మెస్సీ ఏం చేయలేకపోయాడు. దుర్బేద్యమైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్లను అడ్డుకోవడంతోనే మెస్సీకి సరిపోయింది. మ్యాచ్‌లో మెస్సీ రెండు క్రాస్‌లతో పాటు ఒక్కసారి మాత్రమే గోల్‌పోస్ట్ వైపు షాట్ ఆడినప్పటికీ స్పెయిన్ గోల్ కీపర్ ఉనైయి సిమోన్ దానిని కూడా సమర్థంగా అడ్డుకున్నాడు. మ్యాచ్‌లో స్పెయిన్ 20 సార్లు తమ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తే.. అర్జెంటీనా మాత్రం రెండుసార్లు మాత్రమే ప్రయత్నం చేయడం గమనార్హం.Photo Credit: FIFA Twitterఇక మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ కన్నీటిపర్యంతమవడం వెనుక ఒక కారణముంది. ఈసారి ఫిఫా ఆరంభం నుంచి అర్జెంటీనా ఆటపై వివాదాలు నెలకొన్నప్పటికీ మెస్సీ మాత్రం తన ఆటను చాలా సందర్భాల్లో నిజాయితీగానే ఆడాడు. ఫైనల్లో కూడా తను చేయాల్సిందంతా చేశాడు. కానీ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన స్పెయిన్ ముందు అర్జెంటీనా పూర్తిగా తేలిపోవడంతో మెస్సీ కూడా చేష్టలుడిగి ఉండిపోయాడు.ఇక 1962 తర్వాత వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్‌లు గెలవాలన్న కల కూడా చెదరడం మెస్సీ కన్నీటికి మరో కారణం. 39 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడుతూ ఆటను కొనసాగించిన మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. మంచి ఫామ్‌లో ఉన్నందున ఈసారి ఎలాగైనా అర్జెంటీనాకు రెండోసారి ఫిఫా టైటిల్‌ను అందించాలని మెస్సీ కలగన్నాడు. బరిలోకి దిగిందే తడవుగా ప్రత్యర్థులతో పోరాట సింహంలా తలపడ్డాడు. 8 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేసిన మెస్సీ సిల్వర్ బూట్‌ను కూడా గెలుచుకున్నాడు. Photo Credit: FIFA Twitterఅవార్డులు కొత్త కానప్పటికీ ఈసారి మెస్సీ ఫిఫా టైటిల్‌ను గెలిచిన మరుక్షణమే ఆటకు వీడ్కోలు పలికేవాడేమో. ప్రస్తుతం తన రిటైర్మెంట్పై మౌనమే వహించినప్పటికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడడం డౌటే. కాబట్టి ఫుట్‌బాల్‌లో ఒక శకం దాదాపు ముగిసినట్లే. Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm— Messi Anıları (@messianilari) July 19, 2026Lionel Messi gets emotional as Argentina fans shower him with love and support 🥹 pic.twitter.com/kff4YYJBwu— Instablog9ja (@instablog9ja) July 20, 2026 ESTE ULTÚIMO TANGO Una de las cosas más hermosas del fútbol es tener a Lionel Andrés Messi y su participación en todos los Mundiales. Gracias por todo lo que has logrado con la selección: récords, logros y campeonatos Gracias por cada momento de alegría que compartimos con la… pic.twitter.com/6GYfKBKpnz— AR (@ionlylei) July 20, 2026 -
నాలుగేళ్లలో సీన్ రివర్స్.. విలన్‌గా మారిన అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ విజయంతో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మైదానంలో నిరాశతో కూర్చుండిపోయాడు. వరుసగా రెండోసారి అర్జెంటీనాకు ఫిఫా ప్రపంచకప్ అందించాలన్న కల చెదరడంతో ఏం చేయలేక కన్నీటిపర్యంతమయ్యాడు. ఈసారి ఫిఫా టోర్నీ ఆరంభం నుంచి ఫుల్‌జోష్‌లో కనిపించిన అర్జెంటీనా.. ఫైనల్ వరకు హీరోగానే నిలిచినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఓటమి బాధను తట్టుకోలేక స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగడం ఆ జట్టును విలన్‌గా మార్చేసింది. ఫిఫా ఆరంభం నుంచి ఎన్ని వివాదాలు జరిగినా ప్రపంచమంతా అర్జెంటీనా గెలవాలని బలంగా కోరుకుంది. కానీ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన గొడవ అర్జెంటీనాను హీరో నుంచి జీరోకు పడిపోయేలా చేయడమే గాక, టోర్నీ విలన్‌గా మారిపోయింది.Photo Credit: FIFA Twitter2022 ఖతార్ ప్రపంచకప్‌లో తమ ఆటతీరుతో అందరి మన్ననలు పొందిన అర్జెంటీనా నాలుగేళ్ల తర్వాత జరిగిన ఫిఫా 2026లో మాత్రం వారి ప్రయాణం మొత్తం వివాదాలతోనే నడిచింది. ఈజిప్ట్‌పై చివరి నిమిషంలో 3-2 తేడాతో విజయం సాధించినప్పటికీ, ఈ మ్యాచ్ విజయం అర్జెంటీనాను మరింత వివాదంలోకి నెట్టేసింది. అర్జెంటీనా గెలవడానికే ఫిఫా నిర్వహిస్తున్నారని, రిఫరీ ఎవరైనా అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటున్నాయని, అంతమాత్రాన ఫిఫా ప్రపంచకప్ నిర్వహించడం ఎందుకని, టైటిల్‌ను అర్జెంటీనాకు ఇచ్చేయాలనే విమర్శలు వచ్చాయి. ఇలా టోర్నీలో అర్జెంటీనా సాధించిన ప్రతీ విజయం వెనుక ఒక మెలిక ఉండడం పరిపాటిగా మారిపోయింది.Photo Credit: FIFA Twitterఈసారి టోర్నీ అంతటా వివాదాలు, సోషల్ మీడియాలో చర్చలు ఉన్నప్పటికీ, మెస్సీ మాత్రం తన ఆదర్శప్రాయమైన ప్రవర్తనతో జట్టును నడిపించాడు. అంతా చేజారిపోయినట్లు అనిపించిన మ్యాచ్‌ల్లో కూడా తన మ్యాజిక్‌తో అర్జెంటీనావైపు మొగ్గేలా చేశాడు. మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. కాబట్టి తర్వాతి ఫిఫాకు ఈ దిగ్గజం లేకుండానే అర్జెంటీనా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. మెస్సీకి ఒక పరిపూర్ణమైన ముగింపు కల్పించే అవకాశం అర్జెంటీనాకు లభించినప్పటికీ ఫైనల్ తర్వాత జరిగిన ఒక్క గొడవ ఆ జట్టు ఆటగాళ్లను విలన్లుగా మార్చేసింది.Read: కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది? -
కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది?
ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ఫిఫా విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓటమి షాక్‌లో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లు సహనం కోల్పోయి స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగారు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. దీంతో అప్పటివరకు రణరంగంలా కనిపించిన మైదానం యుద్ధభూమిని తలపించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ గొడవను ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఘర్షణకు కారణమైన లియాండ్రో పరెడేస్పై రెడ్ కార్డు చూపించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో రెడ్ కార్డు అందుకున్న రెండో ఆటగాడిగా పరేడెస్ నిలిచాడు. అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జెంటీనా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కూడా రెడ్ కార్డు అందుకున్నాడు. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో ఆఖరి అంకం దాకా హీరోగా నిలిచిన అర్జెంటీనా ఈ ఒక్క ఘటనతో విలన్‌గా మారిపోయింది. 🚨🥊 Full scenes after final whistle.@MickyJnr__ 🎥 pic.twitter.com/ZXCvAFkHwy— Fabrizio Romano (@FabrizioRomano) July 20, 2026Read: అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా? -
సైలెంట్‌గానే.. చరిత్ర సృష్టించాడు!
స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ రోడ్రి అరుదైన ఘనత సాధించాడు. ‘కంప్లీట్ ఫుట్‌బాల్’ వీరుల జాబితాలో 30 ఏళ్ల ఈ మిడ్‌ఫీల్డర్ చేరిపోయాడు. కాగా న్యూయార్క్ వేదికగా భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్లో స్పెయిన్ అర్జెంటీనాపై 1-0 గోల్ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించాడు!ఈ క్రమంలో రోడ్రి ఖాతాలో తొలిసారి వరల్డ్‌కప్ టైటిల్ చేరింది. ఇంతకు ముందు అతడు UEFA చాంపియన్స్ లీగ్, బాలన్ డి ఓర్ అవార్డులు కూడా గెలిచాడు. ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మూడు అవార్డులను గెలిచిన పదకొండో ప్లేయర్‌గా రోడ్రి చరిత్రకెక్కాడు.ఈ జాబితాలో సర్ బాబీ చార్ల్టన్, ఫ్రాంజ్ బెకెన్బ్యూయర్, గెడ్ ముల్లర్, పవోలో రోసి, జినెదైన్ జిదానే, రివాల్డో, రొనాల్డినో, కకా, లియోనల్ మెస్సీ, డెంబెలె రోడ్రి కంటే ముందు వరుసలో ఉన్నారు.గోల్డెన్ బాల్అదే విధంగా.. బాలన్ డి ఓర్, వరల్డ్‌కప్, చాంపియన్స్ లీగ్‌లతో పాటు గోల్డెన్ బాల్ గెలిచిన నాలుగో ఆటగాడిగానూ రోడ్రి నిలిచాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో రోడ్రి గోల్ కొట్టలేకపోవచ్చు. కానీ సహచరులు గోల్ కొట్టేలా అవకాశాలు కల్పించాడు. టోర్నీ ఆసాంతం అత్యుత్తమంగా రాణించి జట్టు విజయంలో కీలకంగా మారాడు. దీంతో అతడిని గోల్డెన్ బాల్ వరించింది.ఈ అవార్డు అందుకున్న తొలి స్పెయిన్ ఆటగాడు కూడా రోడ్రి కావడం విశేషం. కాగా 2015లో జాతీయ జట్టులోకి వచ్చిన రోడ్రి.. 2022లోనే తొలిసారి వరల్డ్‌కప్ ఆడాడు. ఇక ఈసారి ఏకంగా కెప్టెన్‌గా స్పెయిన్‌కు టైటిల్ అందించాడు. పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సి వంటి సారథులు ఎక్కువగా గోల్స్ చేస్తూ వార్తల్లో ఉంటారు. అత్యుత్తమ మిడ్ ఫీల్డర్కానీ రోడ్రి ఆట మాత్రం ఇందుకు భిన్నం. ఆరు అడుగులకుపైగా ఎత్తు ఉండే అతడు.. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ బంతిని పాస్ చేయడంలో దిట్ట. సహచరులు గోల్స్ కొట్టేలా అవకాశాలు సృష్టించే రోడ్రి ప్రపంచంలోని అత్యుత్తమ మిడ్ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో రోడ్రి ఏకంగా 790 పాస్‌లు అందించాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పాస్‌లు ఇచ్చిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. అర్జెంటీనాతో ఫైనల్లో రోడ్రి 101 పాస్‌లు కంప్లీట్ చేయడం విశేషం. చదవండి: స్పెయిన్ 20.. అర్జెంటీనా0: తెర వెనుక హీరో అతడే! -
స్పెయిన్ 20.. అర్జెంటీనా 0: తెర వెనుక హీరో అతడే!
స్పెయిన్.. 2008- 2021 మధ్య ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏలడమే కాదు. ఆట తీరును కూడా మార్చివేసింది. 1988- 96 మధ్య బార్సిలోనా జట్టు ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘టికీ-టాకా’ అస్త్రాన్ని పూర్తిగా వాడుకోవడంలో స్పెయిన్ సఫలమైంది.ఇందులో భాగంగా షార్ట్, క్విక్ పాసులతో పాదరసంలా కదులుతూ ఆటగాళ్లు ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ.. ప్రత్యర్థిని పూర్తిగా అలసిపోయేలా చేస్తారు. ఆ తర్వాత గోల్స్ వేట మొదలుపెడతారు.చిన్న, వేగవంతమైన పాసులతో బంతిని కదిలించడం.. నిర్దిష్ట జోన్లలో నిలిచి ఎల్లప్పుడూ పాసింగ్ ఆప్షన్లు కల్పించడం, ఆటగాళ్లు త్రిభుజాకారంలో నిలిచి తక్కువ దూరంలోనే బంతిని పాస్ చేసుకోవడం ఇందులోని ముఖ్య వ్యూహాలు.ఆ తర్వాత అందుకే విఫలంయూరో 2008, ఫిఫా వరల్డ్‌కప్-2010, యూరో 2012 టైటిళ్లను స్పెయిన్ టికీ-టాకా వ్యూహంతోనే దక్కించుకుంది. తమ ప్రత్యేక శైలితో ఆట తీరును మరో స్థాయికి తీసుకువెళ్లిన స్పెయిన్.. ఆ తర్వాత ప్రత్యర్థుల చేతిలో భంగపడింది. ఎల్లప్పుడూ ఎక్కువగా పాస్లపైనే దృష్టి పెట్టి గోల్స్ కొట్టడంలో విఫలమై 2018, 2022 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిరాశగా వెనుదిరిగింది. ప్రత్యర్థి జట్లు తమ డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేసుకుని స్పెయిన్ వ్యూహానికి ఇలా చెక్ పెట్టాయి.ఫూయెంటె రాకతో..దీంతో ఒకప్పుడు బలంగా భావించిన ‘టికీ- టాకా’ అస్త్రం.. ఆ తర్వాత ప్రత్యర్థుల అప్రమత్తతో వారి బలహీనతగా మారిపోయింది. అయితే, లూయీస్ డి లా ఫూయెంటె (Luis de la Fuente) స్పెయిన్ కోచ్‌గా వచ్చిన తర్వాత మరోసారి ఈ వ్యూహాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేశాడు. సరికొత్త హంగులతో టికీ-టాకా 2.0ను తీసుకువచ్చాడు.ఇందులో భాగంగా కేవలం బంతిని నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా.. వేగంగా ఫార్వర్డ్ చేసి గోల్స్ సాధించే శక్తివంతమైన జట్టుగా మారింది స్పెయిన్. కేవలం బంతిని పాస్ చేయడమే కాకుండా.. ప్రత్యర్థి మోహరింపుల్లోని గ్యాప్‌లను గుర్తించి అటాక్ చేయడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం లమీన్ యమాల్, విలియమ్స్ వంటి యువ ఆటగాళ్ల సేవలను వాడుకుంది.తద్వారా కేవలం బంతిని కంట్రోల్ చేయడమే కాకుండా.. కౌంటర్ అటాక్‌లు చేయడంలో సఫలమై.. తమ అమ్ములపొదిలోని టికీ-టాకా అస్త్రానికి మరింత పదునుపెట్టింది. ముఖ్యంగా సెమీ ఫైనల్లో ఫ్రాన్స్‌పై ఈ వ్యూహాన్ని సమర్థవంతంగా ఉపయోగించి అనుకున్న ఫలితాన్ని రాబట్టింది స్పెయిన్. ఆ మ్యాచ్‌లో పెడ్రో పోరో సాధించిన గోల్ ఆధునిక టికీ-టాకా వ్యూహానికి నిదర్శనం.స్పెయిన్ 20.. అర్జెంటీనా 0ఈ టోర్నీలో స్పెయిన్ మొత్తంగా పద్నాలుగు గోల్స్ సాధించగా.. ప్రత్యర్థి ఒకే ఒక గోల్ కొట్టే అవకాశం ఇచ్చింది. దీనిని బట్టి స్పెయిన్ సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక వరల్డ్‌కప్-2026 ఫైనల్లో స్పెయిన్ గోల్ కోసం ప్రయత్నించే క్రమంలో 20 షాట్లు కొట్టింది. ఇందులో 12 గోల్ పోస్ట్ దిశగా వెళ్లాయి. మొత్తంగా 817 పాస్‌లు ఇచ్చుకున్నారు ఆటగాళ్లు. అదే సమయంలో అర్జెంటీనా మాత్రం గోల్ పోస్ట్ దిశగా ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయింది. రోడ్రి వరల్డ్ రికార్డుఇక మైదానంలో పక్కాగా వ్యూహాలను అమలు చేసిన స్పెయిన సారథి రోడ్రి.. ఈ సీజన్లో ఏకంగా 790 పాస్‌లు ఇచ్చాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పాస్‌లు ఇచ్చిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇక స్పెయిన్ డిఫెండర్లు క్యూబార్సి 668, లాఫోర్టే 618 పాసులు చేశారు. ఓవరాల్‌గా జట్టుగా స్పెయిన్ 4945 సార్లు బంతిని పాస్ చేసింది. తెర వెనుక హీరో అతడే!దీనిని బట్టి స్పెయిన్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిందన్న విషయం సుస్పష్టం. ఏదేమైనా ఫూయెంటె టికా-టాకాకు పునర్వైభవం తెచ్చి జట్టు రెండోసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచేలా చేశాడు. తెర ముందు గోల్ కొట్టి ఫెరాన్ టోరెస్ హీరో కాగా.. తెర వెనుక తన పదునైన వ్యూహాలతో ఫూయెంటె హీరోగా నిలిచాడు.చదవండి: మెస్సీ చేయలేనిది... రొనాల్డో సాధించాడు!Spain 🤝 Mexico City #FIFAFanFestival #FIFAWorldCup pic.twitter.com/PxkGAyW6tC— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 -
మెస్సీ చేయలేనిది.. రొనాల్డో సాధించాడు!
ఒక్క మ్యాచ్‌తో అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ కల చెదిరిపోయింది. వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడాలన్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా 1-0 గోల్ తేడాతో ఓటమిపాలైంది. స్పెయిన్ స్టార్ టోరెస్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి అదనపు సమయంలో గోల్ కొట్టి అర్జెంటీనా హృదయం ముక్కలు చేశాడు.ఇక వరల్డ్‌కప్-2026 ఫైనల్ తన కెరీర్లో చివరి మ్యాచ్ అని మెస్సీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే.. స్పెయిన్‌తో ఫైనల్లో గోల్ కొట్టడంలో మెస్సీ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లకు ఇచ్చే అవార్డు) కూడా మెస్సీ కోల్పోయాడు. ఫ్రాన్స్ కెప్టెన్ కెలియన్ ఎంబాపె ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.ఆసక్తికర చర్చ.. మెస్సీకి అదొక పీడకలఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. స్పెయిన్ విషయంలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సాధించింది.. మెస్సీ మాత్రం సాధించలేకపోయాడంటూ సాకర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి మెస్సీ కెరీర్లో స్పెయిన్‌తో మ్యాచ్ ఓ పీడకలలా మిగిలిపోయింది. ఫైనల్లో మెస్సీతో పాటు అతడి జట్టులో ఒక్క సభ్యుడు కూడా గోల్ కొట్టలేక టైటిల్‌ను కోల్పోయారు.ఒకే ఒక్కసారిఇక మెస్సీ ఇప్పటికి నాలుగుసార్లు స్పెయిన్‌తో మ్యాచ్ ఆడాడు. తాజా వరల్డ్‌కప్ ఫైనల్ మినహాయిస్తే.. మిగిలిన మూడు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు. అయితే, ఈ నాలుగు సందర్భాల్లోనూ మెస్సీ స్పెయిన్‌పై కేవలం ఒకే ఒక్క గోల్ సాధించాడు. 2009లో స్పెయిన్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ గోల్ కొట్టాడు.అయితే, ఈ మ్యాచ్‌లో స్పెయిన్ 2-1 గోల్ తేడాతో గెలిచింది. ఇక ఆ తర్వాత మళ్లీ మెస్సీ స్పెయిన్‌పై గోల్ కొట్టలేదు. కీలక ప్రపంచకప్ ఫైనల్లోనూ మరోసారి అతడి ఈ బలహీనత బయటపడింది.మెస్సీ చేయలేనిది.. రొనాల్డో సాధించాడు!ఇక రొనాల్డో విషయానికొస్తే.. ఈ పోర్చుగల్ స్టార్ స్పెయిన్‌తో పదకొండుసార్లు తలపడ్డాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా నాలుగు గోల్స్ సాధించాడు. వరల్డ్‌కప్-2018లో హ్యాట్రిక్‌తో మెరిసి 3-3తో మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించారు. ఇక 2025 నేషన్స్ లీగ్ ఫైనల్లో స్పెయిన్- పోర్చుగల్ మ్యాచ్ 2-2తో డ్రా కాగా... రొనాల్డో పెనాల్టీ షూటౌట్లో గోల్ కొట్టి తన జట్టును గెలిపించాడు.అంతేకాదు.. ఈ మాజీ రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు యూరో 2004, వరల్డ్‌కప్ 2010, యూరో 2012.. ఫిఫా వరల్డ్‌కప్-2026 రౌండ్ ఆఫ్ 16లో కూడా స్పెయిన్‌తో తలపడ్డాడు. అయితే, ఆయా సందర్భాల్లో గోల్ మాత్రం కొట్టలేకపోయాడు.తీరని కలఏదేమైనా.. సమకాలీన ఫుట్‌బాలర్లలో మెస్సీ- రొనాల్డో.. ఇద్దరూ ఎవరికివారే సాటి. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా.. రొనాల్డో గెలవలేని వరల్డ్‌కప్ ట్రోఫీని.. మెస్సీ 2022లో సొంతం చేసుకున్నాడు. అయితే, స్పెయిన్ విషయంలో మాత్రం మెస్సీ కంటే రొనాల్డో మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఇక మెస్సీకి వరల్డ్‌కప్ మెగా ఫైనల్లోనూ స్పెయిన్ ఒక పజిల్లా మిగిలిపోయింది. గోల్ కొట్టలేక.. ఓటమి బాధతో కన్నీళ్లతో మెస్సీ మైదానాన్ని వీడాడు.చదవండి: స్పెయిన్ హీరో.. ఎవరీ టోరెస్? -
ఫిఫా వరల్డ్‌కప్ హీరో.. ముందుగా భారత్‌లోనే మెరిశాడు!
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో స్పెయిన్ యువ సంచలనం లమీన్ యామల్ ఆది నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు ఈ టీనేజర్.ముఖ్యంగా ఫ్రాన్స్‌తో సెమీ ఫైనల్లో కీలక సమయంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి.. అతి పిన్న వయసులోనే వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, అర్జెంటీనాతో ఫైనల్లో మాత్రం ఫెరాన్ టోరెస్ స్పెయిన్ హీరోగా అవతరించాడు.అదనపు సమయంలోని 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గోల్ కొట్టి స్పెయిన్‌ను గెలిపించాడు టోరెస్. నికో విలియమ్స్ ఇచ్చిన హెడర్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనా ఆశలపై నీళ్లు చల్లాడు. తద్వారా స్పెయిన్ వరల్డ్‌కప్ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు.ఎవరీ టోరెస్?26 ఏళ్ల టోరెస్ బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్లో ఫార్వర్డ్ ప్లేయర్. స్పెయిన్‌లోని ఫెయెస్లో 2000, ఫిబ్రవరి 29న జన్మించాడు. ఆరేళ్ల వయసులోనే వాలెన్షియా అకాడమీలో చేరాడు. యూత్ జట్టు తరఫున రాణించి.. 2017లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. వాలెన్షియా తరఫున2017- 2020 మధ్యలో 71 మ్యాచ్‌లలో ఆరు గోల్స్ సాధించాడు.మాంచెస్టర్ సిటీ తరఫున 2020-2022 మధ్య కాలంలో 28 మ్యాచ్‌లలో తొమ్మిది గోల్స్ కొట్టిన టోరెస్.. ప్రీమియర్ లీగ్, ఈఎఫ్ఎల్ కప్ గెలిచిన జట్టులు సభ్యుడు.ఇక ఆ తర్వాత అంటే 2021-22 సీజన్లో బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్లో చేరాడు టోరెస్. లా లిగా, కోపా డెల్ రెయ్, సూపర్కోపా కప్పులు గెలిచాడు. ప్రస్తుతం పారిస్ సెయింట్ జర్మేన్ జట్టుకు ఆడుతున్నాడు.భారత్‌లోనే ముందుగా మెరిశాడుస్పెయిన్ అండర్-17 జట్టు తరఫున 2017లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో టోరెస్ పాల్గొన్నాడు. స్పెయిన్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇంగ్లండ్‌తో టైటిల్ పోరులోనూ సత్తా చాటాడు.కోల్‌కతాలో ఇంగ్లండ్- స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా.. ఇంగ్లండ్ 5-2 గోల్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. దీంతో స్పెయిన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ టోర్నీ గ్రూప్ దశలో స్పెయిన్ మూడు విజయాలు సాధించింది. అనంతరం నాకౌట్ దశలో ఫ్రాన్స్, మాలి జట్లపై గెలిచింది.ఈ ఈవెంట్లో టోరెస్ రెండు గోల్స్ కొట్టడంతో పాటు.. రెండు అసిస్ట్‌లు ఇచ్చి తన వంతు పాత్ర పోషించాడు. కాగా టోరెస్ స్పెయిన్ తరఫున 2020లో అరంగేట్రం చేశాడు. అండర్-17, 19, 21 స్థాయిల్లో ఆడి ఈ స్థాయికి చేరుకున్నాడు. ముద్దుపేరు తెలుసా?ఇక లీప్ సంవత్సరంలో జన్మించిన టోరెస్ నాలుగేళ్లకోసారి తన పుట్టినరోజు జరుపుకొంటాడు. అతడి ముద్దుపేరు ‘ది షార్క్’. గోల్ కొట్టినపుడు అతడు షార్క్ ఫిన్ (షార్క్ వెనుక భాగంలో కనిపించే త్రికోణాకారపు రెక్క లాంటిది) సింబాలిక్‌గా సెలబ్రేట్ చేసుకోవడమే ఇందుకు కారణం. షార్క్ ఫిన్‌ను శక్తి, ప్రత్యేక గుర్తింపు, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తారు. నీటి మీద ఫిన్ కనిపిస్తే అది ప్రమాద సూచనగా భావిస్తారు. తన ముద్దుపేరు మీదుగా టోరెస్ ఓ క్లాత్ బ్రాండ్ కూడా తీసుకువచ్చినట్లు సమాచారం.చదవండి: గోల్డెన్ బూట్, గోల్డోన్ గ్లోవ్, గోల్డెన్ బాల్.. ప్రైజ్ మనీ ఉంటుందా?Spain 🤝 Mexico City #FIFAFanFestival #FIFAWorldCup pic.twitter.com/PxkGAyW6tC— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 -
ఒక్క గోల్.. 12 ఏళ్ల తర్వాత అదే చరిత్ర!
ఫుట్‌బాల్‌లో ఒక గోల్ అంటే కేవలం స్కోర్ బోర్డుపై పెరిగే ఒక సంఖ్య కాదు.. కోట్లాది మంది అభిమానుల ఆశలు, భావోద్వేగాలను మార్చే క్షణం. ముఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్ లాంటి అత్యున్నత వేదికపై ఒక్క గోల్ కూడా ఓ జట్టును చరిత్రలో నిలబెడుతుంది. కొన్ని ఫైనల్స్‌లో అయితే 90 నిమిషాల ఉత్కంఠకు తెరదించేది ఒకే ఒక్క గోల్. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. ఒకే దెబ్బతో ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సందర్భాలు ఫిఫా చరిత్రలో అరుదుగా నమోదయ్యాయి.ఒక్క గోల్.. ఒక్క క్షణం.. కానీ ఆ క్షణమే ఓ జట్టును చరిత్రలో శాశ్వతంగా నిలబెడుతుంది. అందుకే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో 1-0 విజయాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే మ్యాచ్ ఫలితం 1-0తో తేలింది. ఈ ప్రతి విజయానికీ ఓ ప్రత్యేక కథ ఉంది.బ్రెహ్మే పెనాల్టీతో జర్మనీ చాంపియన్1990 ఇటలీ ప్రపంచకప్ ఫైనల్లో వెస్ట్ జర్మనీ, అర్జెంటీనా తలపడ్డాయి. అప్పటికే ఇరు జట్లు గట్టి పోరాటం సాగించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. గోల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు 85వ నిమిషంలో కీలక క్షణం వచ్చింది. జర్మనీకి లభించిన పెనాల్టీని ఆండ్రియాస్ బ్రెహ్మే గోల్‌గా మలిచాడు. ఆ ఒక్క గోల్‌తో వెస్ట్ జర్మనీ ప్రపంచకప్‌ను ముద్దాడింది.ఇనియెస్టా గోల్‌తో స్పెయిన్ కల సాకారం2010 దక్షిణాఫ్రికా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. 116వ నిమిషంలో ఆండ్రెస్ ఇనియెస్టా చేసిన అద్భుతమైన గోల్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. అదే స్పెయిన్‌కు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను అందించింది. ఒక్క గోల్.. స్పెయిన్ ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణాక్షరాలుగా నిలిచిపోయింది.గోట్జే దెబ్బతో అర్జెంటీనాకు నిరాశ2014 బ్రెజిల్ ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ, అర్జెంటీనా మరోసారి ప్రపంచ వేదికపై తలపడ్డాయి. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా టైటిల్‌పై కన్నేయగా.. జర్మనీ పటిష్ఠ రక్షణతో పోరాడింది. మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లిన తర్వాత 113వ నిమిషంలో మారియో గోట్జే చేసిన గోల్ జర్మనీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఫైనల్ ముగిసే సమయానికి స్కోర్ బోర్డుపై నిలిచింది 1-0.2026.. స్పెయిన్ మరోసారి అదే ఘనత12 ఏళ్ల తర్వాత.. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే తరహా ఫలితం నమోదైంది. స్పెయిన్, అర్జెంటీనా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో నిర్ణీత 90 నిమిషాల్లో గోల్స్ నమోదు కాలేదు. అదనపు సమయంలో 106వ నిమిషంలో ఫెర్రాన్ టోరెస్ చేసిన కీలక గోల్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ ఒక్క గోల్‌తో స్పెయిన్ ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఫైనల్‌ను 1-0తో గెలిచిన అరుదైన జట్ల జాబితాలో స్పెయిన్ చేరింది.ఎందుకంత ప్రత్యేకం? ప్రపంచకప్ ఫైనల్లో జట్లు సాధారణంగా ఎంతో జాగ్రత్తగా ఆడతాయి. చిన్న తప్పిదం కూడా ట్రోఫీని దూరం చేయగలదనే ఒత్తిడి ఆటగాళ్లపై ఉంటుంది. అందుకే ఫైనల్స్‌లో భారీ స్కోర్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. 1-0 విజయాల్లో గెలిచిన జట్లు కేవలం దాడిలోనే కాదు.. రక్షణలోనూ తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా.. వచ్చిన ఒక్క అవకాశాన్ని గోల్‌గా మార్చుకుని ప్రపంచ చాంపియన్లుగా నిలిచాయి. -
గోల్డెన్ బూట్ అతడికే!.. గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్ ఎందుకిస్తారో తెలుసా?
సాకర్ మెగా సంబరం ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ముగిసింది. టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విజేతగా అవతరించింది. న్యూయార్క్ వేదికగా మెస్సీ బృందాన్ని 1-0 గోల్ తేడాతో ఓడించి రెండోసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.అదనపు సమయంలోని 106వ నిమిషంలో స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్ కొట్టడంతో స్పెయిన్ చాంపియన్‌గా నిలవగా.. అర్జెంటీనా హృదయం ముక్కలైంది. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ టోర్నీలో ఆసాంతం అద్భుత ప్రదర్శ కనబరిచిన స్పెయిన్ వ్యక్తిగత బహుమతుల జాబితాలోనూ సత్తా చాటింది.ఈసారి ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్‌ను ఫాన్స్ కెప్టెన్ కెలియన్ ఎంబాపె గెలుచుకోగా.. మిగతా అవార్డులను మాత్రం స్పెయిన్ ఆటగాళ్లు కైవసం చేసుకున్నారు. అయితే, గోల్డెన్ బూట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్ అవార్డుల గురించి మీకు తెలుసా?.. విజేతలను ఎలా నిర్ణయిస్తారు?.. ప్రైజ్‌మనీ ఉంటుందా?... పూర్తి వివరాలు మీకోసం గోల్డెన్ బూట్ విజేత ఎంబాపె (Kylian Mbappe- ఫ్రాన్స్)ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ఎడిషన్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడికి దీనిని ప్రధానం చేస్తారు. ఈసారి ఎంబాపె పది గోల్స్ కొట్టడంతో పాటు నాలుగు అసిస్ట్‌లు అందించి గోల్డెన్ బూట్ గెలిచాడు. గత ప్రపంచకప్ అంటే 2022లోనూ ఎంబాపేకే ఈ అవార్డు దక్కింది.గోల్డెన్ బూట్ సుమారు కిలో మేర బరువు ఉంటుంది. దీనిని ఇత్తడి మిశ్రమ లోహంతో తయారు చేసి.. దానిపై మందపాటి బంగారు పొరను ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు. గణాంకాల ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. దీనిని 1930లోనే ప్రవేశపెట్టినప్పటికీ.. 1982 నుంచి భౌతికంగా అందిస్తున్నారు. ఫ్రాన్స్ ఆటగాడు జస్ట్ ఫౌంటైన్ 1958 ప్రపంచకప్ టోర్నీలో 13 గోల్స్ కొట్టగా.. ఇప్పటికీ ఆ విషయంలో ఎవరూ అతడి దరిదాపుల్లోకి రాలేదు.గోల్డెన్ బాల్ విజేత రోడ్రి (Rodri- స్పెయిన్)ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఫిఫా టెక్నికల్ స్టడీ గ్రూప్ (FSG)ఈ అవార్డు విజేతను నిర్ణయిస్తుంది. టోర్నీలోని ప్రతీ మ్యాచ్‌ను విశ్లేషించి.. సదరు మ్యాచ్‌లలో ప్రభావం చూపిన ఆటగాడికి దీనిని అందజేస్తారు.జట్టు తరఫున గోల్స్, అసిస్ట్స్ చేయడం.. డిఫెన్స్‌తో ఆకట్టుకుకోవడం.. నాయకత్వ బృందంలో కీలకంగా వ్యవహరించడం.. ఇలా మొత్తంగా ఏ విధంగానైనా సరే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాడికి గోల్డెన్ బాల్ దక్కుతుంది. ఇక ఈ అవార్డు విజేతను నిర్ణయించే FSGలో ఫిఫా గ్లోబల్ ఫుట్‌బాల్ డెవలప్మెంట్ చీఫ్‌తో పాటు.. మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు, టెక్నికల్ డైరెక్టర్లు, సాకర్ అనలిస్టులు.. అదే విధంగా మీడియా ప్రతినిధులు కూడా భాగంగా ఉంటారు.విజేత జట్టు తరఫు ఆటగాడికేనా?అయితే, ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టు ఆటగాడికి మాత్రమే ఈ అవార్డు లభిస్తుందనుకుంటే పొరపాటు. 2014 ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా జర్మనీ చేతిలో ఓడినప్పటికీ అత్యుత్తమ ఆటగాడిగా లియోనల్ మెస్సీకి ఈ అవార్డు దక్కింది. ఇక గోల్డెన్ బాల్‌తో పాటు సిల్వర్, బ్రాంజ్ బాల్స్ విజేతలను కూడా సాంకేతిక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.తొలుత 1986లో దీనిని ప్రవేశపెట్టగా.. అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా గోల్డెన్ బాల్ అందుకున్నాడు. ఇక మెస్సీ ఒక్కడే 2014, 2022 టోర్నీలలో అత్యధికంగా రెండుసార్లు ఈ అవార్డు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు.గోల్డెన్ గ్లోవ్ విజేత ఉనై సైమన్ (Unai Simon- స్పెయిన్)ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన గోల్కీపర్కి ఈ అవార్డు అందజేస్తారు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన నైపుణ్యాలు, నిలకడైన ఆట తీరుతో ప్రభావం చూపిన ఆటగాడిని FSG ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది.అత్యుత్తమ డిఫెన్స్‌తో ప్రత్యర్థులను అడ్డుకోవడం.. వారు గోల్స్ కొట్టకుండా ఆపడం.. జట్టు విజయంపై ఎలాంటి ప్రభావం చూపారన్న ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని విజేతను నిర్ణయిస్తారు. ఈసారి ఏడు క్లీన్ షీట్స్‌తో సైమన్ గోల్డెన్ గ్లోవ్ గెలిచాడు. గోల్డెన్ గ్లోవ్‌ను తొలుత 1994లో బెల్జియం ప్లేయర్ మిచెల్ ప్రెడ్హోమ్ గెలుచుకున్నాడు.7 clean sheets. adidas Golden Glove winner. ⭐@adidasfootball pic.twitter.com/mME9QEIgNj— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 ప్రైజ్‌మనీ ఇస్తారా?ఈ అవార్డులన్నీ ఆటగాళ్ల గుర్తింపునకు మాత్రమే. వారి ప్రదర్శనకు ప్రతిఫలంగా ట్రోఫీలు అందజేస్తారు. వీటికి ఫిఫా నుంచి ఎలాంటి ప్రైజ్‌మనీ ఉండదు. అయితే, స్పాన్సర్ల ద్వారా ఆటగాళ్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది. -
రాజా రిత్విక్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: మెనూరెస్ అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ టోర్నీలో రాజా రిత్విక్ నిర్నీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని సంపాదించాడు. ఈ టోర్నీలో రిత్విక్ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో టాప్ సీడ్, ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమి లగార్డెను రిత్విక్ ఓడించాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ రోహిత్ కృష్ణ (తమిళనాడు) ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. రోహిత్ కృష్ణ, రిత్విక్ ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానం దక్కించుకున్నా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా రోహిత్ కృష్ణకు టైటిల్ ఖరారైంది. -
శభాష్ సింధు
19 నెలల నిరీక్షణకు తెరదించుతూ అంతర్జాతీయ వేదికపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయగర్జన చేసింది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 44 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ ఓపెన్‌లో టైటిల్ గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఈ తెలుగు తేజం రికార్డు సృష్టించింది. 1983లో ఇదే టోర్నీలో భారత దిగ్గజం ప్రకాశ్ పదుకొనె పురుషుల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. టోక్యో: తన ప్రియమైన ప్రత్యర్థి అకానె యామగుచిపై భారత స్టార్ పీవీ సింధు పైచేయి సాధించింది. ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు విజేతగా నిలిచింది. 50 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21–17, 21–17తో ప్రపంచ మూడో ర్యాంకర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అకానె యామగుచి (జపాన్)పై జయభేరి మోగించింది. విజేత సింధుకు 66,500 డాలర్ల (రూ. 64 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ యామగుచికి 32,300 డాలర్ల (రూ. 31 లక్షల 16 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సింధు, యామగుచి ఇప్పటి వరకు 30 సార్లు తలపడ్డారు. సింధు 16 సార్లు... యామగుచి 14 సార్లు విజయం సాధించారు. సింధు ఓవరాల్ కెరీర్లో ఇది 25వ సింగిల్స్ టైటిల్. ఈ ఏడాది మాత్రం ఆమెకిదే తొలి టైటిల్ కావడం గమనార్హం. 2024 నవంబర్‌లో లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో చివరిసారి సింధు టైటిల్ గెలుచుకుంది. ఆధిక్యం దోబూచులాడుతూ... ఆరోసారి జపాన్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన యామగుచిపై తుదిపోరులో సింధు ఆటతీరు చూశాక స్పష్టమైన ప్రణాళికతో వచ్చినట్లు అనిపించింది. అవసరమైనపుడు ర్యాలీలను తక్కువ షాట్లలో ముగిస్తూ... కొన్నింటిని సుదీర్ఘంగా కొనసాగిస్తూ సింధు పైచేయి సాధించింది. కొన్ని ర్యాలీలు 38 షాట్లు, 37 షాట్లు, 31 షాట్ల వరకు కొనసాగాయి. ఆరంభంలో సింధు 9–5తో ముందంజ వేసింది. ఆ తర్వాత 9–11తో వెనుకబడింది. స్కోరు 11–12 వద్ద సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 16–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత యామగుచి పుంజుకోవడంతో స్కోరు 17–17తో సమైమంది. ఈ దశలో సింధు మరోసారి విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 21–17తో తొలి గేమ్‌ను 23 నిమిషాల్లో దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో సింధు కళ్లు చెదిరే స్మాష్‌లు సంధించింది. 8–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత యామగుచి తేరుకొని ఆధిక్యాన్ని 8–7కు తగ్గించింది. ఈ దశలో సింధు మళ్లీ మెరిసింది. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 14–7తో దూసుకెళ్లింది. అనంతరం యామగుచి కోలుకోవాలని ప్రయత్నించినా సింధు కీలకదశలో పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను 27 నిమిషాల్లో సొంతం చేసుకొని మ్యాచ్‌తోపాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ‘చాలా ఆనందంగా ఉంది. మాటలు రావడం లేదు. నా కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. ఎందుకంటే ఈ విజయం నాకెంతో అవసరం. 19 నెలల తర్వాత టైటిల్ సాధించాను. ఈ గెలుపు నాలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అనవసర తప్పిదాలు చేయకుండా, సంయమనం కోల్పోకుండా ఆడినందుకు మంచి ఫలితం వచ్చింది. కొత్త కోచ్ ఇర్వన్సి ఆది ప్రతమ, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ వేన్ లోంబార్డ్, సహాయక సిబ్బంది, తల్లిదండ్రులు, నా భర్త వెంకటదత్త సాయికి ధన్యవాదాలు’ అని విజయానంతరం సింధు వ్యాఖ్యానించింది. -
స్పెయిన్‌పై కాసుల వర్షం.. రూ. 420 కోట్ల ప్రైజ్‌మనీ!
ఫిఫా ప్రపంచకప్-2026 ఛాంపియన్స్‌గా స్పెయిన్ అవతరించింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి రెండోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని స్పెయిన్ ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు 30 నిమిషాల ఎక్స్ట్రా టైమ్ కేటాయించారు. ఈ క్రమంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ప్రపంచకప్ ట్రోఫీ 2010 తర్వాత తిరిగి స్పానిష్ జట్టు సొంతమైంది.స్పెయిన్‌పై కాసుల వర్షంఇక విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీ దక్కింది. రోడ్రి సారథ్యంలోని స్పెయిన్‌కు దాదాపు 50 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.420 కోట్లు ) నగదు బహుమతి లభించింది. అదేవిధంగా రన్నరప్ అర్జెంటీనాకు 33 మిలియన్ డాలర్లు (సుమారు రూ.రూ.277 కోట్లు) అందింది. మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు ప్రైజ్‌మనీగా 29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 243 కోట్లు) సొంతం చేసుకుంది. అదేవిధంగా నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు 27 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 225 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. ఫిఫా ప్రపంచ కప్ 2026లో అవార్డు విజేతలు వీరేగోల్డెన్ బూట్ - కైలియన్ ఎంబాపే (ఫ్రాన్స్)గోల్డెన్ బాల్ - రోడ్రి (స్పెయిన్)గోల్డెన్ గ్లోవ్ - ఉనై సైమన్ (స్పెయిన్)బెస్ట్ యంగ్ ప్లేయర్ - పావ్ కుబార్సి (స్పెయిన్) -
FIFA World Cup 2026: జగజ్జేత స్పెయిన్
న్యూయార్క్: ఒకవైపు పటిష్టమైన డిఫెన్స్... మరోవైపు పాదరసంలాంటి కదలికలతో అటాకింగ్... వెరసి స్పెయిన్ జట్టు రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ముగిసిన ఫైనల్లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టును ఓడించింది. అదనపు సమయంలోని 106వ నిమిషంలో సబ్సిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్‌తో స్పెయిన్ జట్టు విజయం అందుకుంది. పెడ్రో పోరో కుడి వైపు నుంచి కొట్టిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో నికో విలియమ్స్ హెడర్ షాట్‌తో వెనక్కి పంపించాడు. అక్కడే ఉన్న ఫెరాన్ టోరెస్ అర్జెంటీనా గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. దాంతో స్పెయిన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత అదనపు సమయంలో మిగిలిన క్షణాల్లో అర్జెంటీనాను నిలువరించి స్పెయిన్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 2010లో స్పెయిన్ తొలిసారి ప్రపంచకప్ గెలిచింది. నెదర్లాండ్స్‌తో ఆనాడు జరిగిన ఫైనల్లోనూ స్పెయిన్ అదనపు సమయంలోని రెండో అర్ధభాగంలో ఇనియెస్టా చేసిన గోల్‌తో విజయం అందుకుంది. 16 ఏళ్ల తర్వాత అలాంటి దృశ్యమే పునరావృతమైంది. అంతకుముందు నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్ చేయలేదు. 90+3వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డుకు గురయ్యాడు. దాంతో అదనపు సమయంలో 30 నిమిషాలు అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ సువర్ణావకాశాన్ని స్పెయిన్ సద్వినియోగం చేసుకుంది. పదే పదే దాడులు చేస్తూ 106వ నిమిషంలో ఫలితాన్ని సాధించింది. మ్యాచ్ మొత్తంలో అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియో మార్టీనెజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 12 సార్లు స్పెయిన్ ఆటగాళ్లు గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను నిలువరించాడు. అయితే 13వ ప్రయత్నంలో మాత్రం మార్టీనెజ్ ఏమీ చేయలేకపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో 19 గోల్స్ కొట్టిన అర్జెంటీనా తుది పోరులో పూర్తిగా నిరాశపరిచింది. స్పెయిన్ ఫార్వర్డ్ ఆటగాళ్లను అడ్డుకోవడంలోనే అర్జెంటీనాకు సరిపోయింది. -
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్-2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించిన స్పెయిన్.. 16 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ తుది పోరులో జట్లు కూడా నిర్ణీత 90 నిమిషాల్లో కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు కేటాయించారు. ఈ క్రమంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఫెర్రాన్ టోర్రెస్ మెరుపు గోల్ కొట్టి తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.ఆధిక్యంలో స్పెయిన్తుది పోరులో స్పెయిన్ ఖాతా తెరిచింది. 106 నిమిషాల తర్వాత తొలి గోల్ నమోదైంది. స్పెయిన్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసినప్పటికి ఇరు జట్లు కూడా ఇంకా కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. దీంతో విజేత ఎవరో తేల్చడానికి ఎక్స్ట్రా టైమ్ 30 నిమిషాలు కేటాయించారు.ఖాతా తెరవని ఇరు జట్లుసెకెండ్ హాఫ్లోనూ 75వ నిమిషం వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. స్పెయిన్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. డాని ఓల్మో, అలెక్స్ బేనా స్ధానాల్లో వింగర్ నికోలస్, మైకెల్ మెరినో జట్టులోకి వచ్చారు. కాగా ఈ తుది పోరులో రెండో హైడ్రేషన్ బ్రేక్ సమయం ముగిసే వరకు కూడా అర్జెంటీనా జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా కనీసం ఒక్క షాట్ కూడా నమోదు చేయలేకపోయింది.హోరాహోరీగా తలపడుతున్న స్పెయిన్న్యూజెర్సీ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా, స్సెయిన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇరు జట్లు ఎటాకింగ్ గేమ్ ఆడినప్పటికి ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. మ్యాచ్ ప్రారంభంలోనే స్పెయిన్ సంచలన యువ ఆటగాడు లమిన్ యమల్‌కు గోల్ కొట్టే అద్భుత అవకాశం లభించింది. అయితే అర్జెంటీనా డిఫెన్స్ సమర్ధవంతంగా అడ్డుకోవడంతో అతడు తనకు లభించిన ఛాన్స్‌ను చేజార్చుకున్నాడు. అయితే ఈ తుది పోరులో అర్జెంటీనాకు భారీ షాక్ తగిలింది.స్టార్ డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ తీవ్రమైన గాయానికి గురై మైదానాన్ని వీడాడు. ఇక ఫస్ట్ హాఫ్ ముగిసిన అనంతరం విరామ సమయంలో గ్లోబల్ పాప్ స్టార్స్ జస్టిన్ బీబర్, షకీరా తమ సంగీత ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించారు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. -
అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా?
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా భారీ బెట్టింగ్‌లు నమోదవుతున్నాయి. అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకుంటుందంటూ కొంతమంది పందేలు కాస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఈసారి స్పెయిన్ టైటిల్ అందుకొని 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందంటూ భారీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉండడం గమనార్హం. ప్రపంచం మొత్తం బెట్టింగ్‌లు వేసినప్పటికీ, కెనడియన్ రాపర్ డ్రేక్ గ్రహమ్ వేసే పందెం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. గతంలో డ్రేక్ మద్దతు ఇచ్చిన జట్లు లేదా ఆటగాళ్లు ఓడిపోవడం జరిగింది. తాజాగా అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెలవదంటూ డ్రేక్ 1.5 అమెరికన్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 14.5 కోట్ల రూపాయలు) పందెం కాయడం సంచలనం కలిగించింది. మరి డ్రేక్ శాపం ఫలిస్తుందా అన్నది ఫైనల్ తర్వాత తేలనుంది.'డ్రేక్ శాపం' అంటే?👉డ్రేక్ శాపం అనేది ఒక క్రీడా మూఢనమ్మకం. దీని ప్రకారం, డ్రేక్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన అథ్లెట్లు, ఫైటర్లు లేదా జట్లు తరచుగా కీలకమైన మ్యాచ్‌లలో ఓడిపోవడాన్ని అభిమానులు గమనించారు.👉చాలా సందర్భాల్లో, ఆటగాళ్లు కెనడియన్ ర్యాపర్‌తో ఫోటోలు దిగిన తర్వాత ఆయా జట్లు ఓటమిని చవిచూశాయి.👉ఈ మూఢనమ్మకం కారణంగా, చాలా మంది క్రీడాభిమానులు డ్రేక్ మద్దతును అపశకునంగా భావిస్తారు.👉ఇప్పుడు అతను అర్జెంటీనాపై తన పందెం వేయడంతో, ఈ చర్య ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఆ జట్టు మద్దతుదారులలో ఆందోళనను రేకెత్తించింది.లెక్కచేయని అర్జెంటీనా ఫ్యాన్స్..అయితే అర్జెంటీనా అభిమానులు మాత్రం డ్రేక్ పందేన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. 2022 ఖతార్ ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా ఓడిపోతుందంటూ డ్రేక్ గ్రహమ్ ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 కోట్లు) పందెం కాసి చేతులు కాల్చుకున్నాడు. డ్రేక్ శాపానికి తిరుగుండదని బీరాలు పలికాడు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఆ ప్రపంచకప్‌లో మెస్సీ సేన ఫిఫా టైటిల్ గెలవడంతో డ్రేక్ అంచనా తప్పి అపఖ్యాతి పాలయ్యాడు. అయితే తాజాగా ఫిఫా 2026 టోర్నీలో అర్జెంటీనా మరోసారి ఫైనల్ చేరిన క్రమంలో డ్రేక్ మరోసారి భారీ పందెం కాసినప్పటికీ ఈసారి కూడా అతడి అంచనా తప్పుతుందని అర్జెంటీనా అభిమానులు బల్లగుద్ది జోస్యం చెబుతున్నారు. ఈసారి కూడా మెస్సీ సేన డ్రేక్ మూడ నమ్మకాన్ని బద్దలుకొట్టి నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను ఎగురేసుకుపోతుందని పేర్కొన్నారు.మెస్సీ సేనకు వ్యతిరేకంగా..ఆరంభం నుంచి ఈసారి ఫిఫా టోర్నీలో అర్జెంటీనా గెలవకూడదనే ప్రయత్నాలు కొనసాగుతూ వచ్చాయి. ఆరంభ పోటీల్లో అనామక జట్టు కేప్‌వెర్డె.. అర్జెంటీనాను ఓడిస్తుందంటూ ఒక ఆధ్యాత్మికవేత్త చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. కానీ రియాల్టీకి వచ్చేసరికి అర్జెంటీనా సునాయాసంగా కేప్వెర్డెను ఓడించింది. ఈసారి ఫిఫాలో విస్తృతంగా ప్రచారం జరిగిన మరో మూడనమ్మకం ఏంటంటే.. ప్రముఖ యూట్యూబర్ ఐషో స్పీడ్ తాను మద్దతు ఇచ్చిన ప్రతీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, అతడికి అపశకునం అనే బిరుదు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా మ్యాచ్‌కు ఐషోస్పీడ్ అర్జెంటీనా జెర్సీ ధరించి వారికి మద్దతు ఇచ్చాడు. కానీ మెస్సీ సేన ఐషో స్పీడ్ అపశకునాన్ని సైతం ఛేదించి సెమీస్‌లో అడుగుపెట్టింది. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు మెట్‌లైఫ్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.Read: ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం! -
పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు
జపాన్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత షట్లర్, తెలుగుతేజం పీవీ సింధుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. జగన్ స్పందిస్తూ.. 'జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా రికార్డులకెక్కి, తన కెరీర్లో మరో కిరీటాన్ని చేర్చుకున్న సింధుకు అభినందనలు. మీ ప్రదర్శన భారతదేశానికి గర్వకారణం. భవిష్యత్తులో సింధు మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా' అని ట్వీట్ చేశారు.జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీ విజేతగా పీవీ సింధు నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-17, 21-17తో అకానె యమగూచిపై రెండు వరుస గేముల్లో విజయం సాధించింది. కాగా సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కాగా భారత్ తరఫున జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కింది. కొంతకాలంగా సరైన ఫామ్‌లేమితో సతమతమవుతున్న సింధు 19 నెలల తర్వాత ఒక మేజర్ టోర్నీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.Congratulations to PV Sindhu on adding one more crown to her illustrious career by becoming the first Indian woman shuttler to win the Japan Open title. A proud moment for India. Wishing her many more glorious victories ahead.@Pvsindhu1— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2026 -
ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం!
ఫిఫా ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ తలపడనుంది. ఈసారి ఫిఫాలో జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు అర్జెంటీనా జట్టు, సహాయక సిబ్బందితో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను షేర్ చేసుకున్న మెస్సీ తన చివరి సందేశాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఫిఫా టోర్నీ ఆద్యంతం తనకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, కోచ్, సహాయక సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక లేఖను రాసుకొచ్చాడు. ఈ ఫిఫాలో ఫైనల్ చేరే క్రమంలో కేవలం విజయాలు మాత్రమే కాకుండా జట్టు ప్రయాణం కూడా తమను గొప్పదిగా నిలబెట్టిందని మెస్సీ తెలిపాడు. 'ఇన్ని సంవత్సరాల మా ప్రయాణంలో అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే.. మేము టైటిల్స్ గెలవడమే కాదు, ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులను పొందాము. అర్జెంటీనా జట్టులోని ఆటగాళ్లతో కలిసి రోజువారి పనులను పంచుకోవడం, కలిసి పోటీ పడడం, కష్ట సమయాల్లో అండగా నిలబడడం, ఇలా ప్రతి అడుగును మనస్ఫూర్తిగా ఆస్వాదించాం. నా ప్రయాణంలో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, సహాయక, సాంకేతిక సిబ్బంది, అర్జెంటీనా దేశ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిఫా టైటిల్ గెలుస్తామా లేదా అన్న సంగతి పక్కనబెడితే ఇప్పటికే జట్టుగా మరిచిపోలేని, చెరిగిపోని జ్ఞాపకాలను చరిత్రగా లిఖించుకున్నాం. కమాన్ అర్జెంటీనా.’ అని భావోద్వేగంతో పేర్కొన్నాడు. అర్జెంటీనా కెప్టెన్ ఇచ్చిన సందేశం ఆ జట్టు ఒక కుటుంబంలా కలిసి నడుస్తూ ధృడమైన బంధాన్ని చాటిచెబుతుంది. స్పెయిన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా వారసత్వం మాత్రం సురక్షితంగా ఉంటుందని మెస్సీ పరోక్షంగా పేర్కొన్నాడు.ఇక ఫిఫా ఫైనల్ మెస్సీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ మెస్సీ ఇచ్చిన తాజా సందేశం వైరల్‌గా మారింది. ఫైనల్‌కు ముందే ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం వెనుక మెస్సీ తన రిటైర్మెంట్ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో మెస్సీ ఏడు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 8 మ్యాచ్‌ల్లో 10 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. భారత కాలమాన ప్రకారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలుకానుంది. Excited for finals but Lionel messi will play his last match for argentina pic.twitter.com/clW43BWtQV— `mr. villa (@Luccydevil07) July 19, 2026Read: సింధుదే జపాన్ ఓపెన్.. తొలి భారత షట్లర్‌గా రికార్డు -
సింధుదే జపాన్ ఓపెన్.. తొలి భారత షట్లర్‌గా రికార్డు
భారత టాప్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీ విజేతగా పీవీ సింధు నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-17, 21-17తో అకానె యమగూచిపై రెండు వరుస గేముల్లో విజయం సాధించింది. కాగా సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం.సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కాగా భారత్ తరఫున జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కింది. కొంతకాలంగా సరైన ఫామ్‌లేమితో సతమతమవుతున్న సింధు 19 నెలల తర్వాత ఒక మేజర్ టోర్నీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.తొలి గేమ్ ఆరంభంలో సింధుకు యమగూచి గట్టిపోటీనిచ్చింది. చెరో పాయింట్‌తో నువ్వా నేనా అన్నట్లు సాగారు. కాని చివర్లో ఫుంజుకున్న సింధు వరుస పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను గెలుచుకుంది.ఇక రెండో గేమ్ ఆరంభం నుంచే పీవీ సింధు దూకుడు ప్రదర్శించడంతో యమగూచి వద్ద సమాధానం లేకుండా పోయింది. జపాన్ ఓపెన్ టైటిల్ పోరుకు ముందు యమగూచిపై సింధు రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఏడాది జపాన్ ఓపెన్‌కు ముందు మూడుసార్లు తలపడితే ఇందులో రెండుసార్లు యమగూచినే విజయం సాధించింది. మలేషియా ఓపెన్‌లో యమగూచి మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ వెళ్లడంతో సింధుకు విజయం వరించింది. థాయ్‌లాండ్ ఓపెన్ క్వార్టర్స్‌లో సింధుపై యమగుచి గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ లోనూ సింధుపై యమగూచి పైచేయి సాధించింది. దీంతో జపాన్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధుపై ఒత్తిడి నెలకొంది. కానీ టైటిల్ పోరులో ఎక్కడా దానిని బయటపెట్టని సింధు యమగూచికి తన సొంతగడ్డపై షాక్ ఇస్తూ విజయం సాధించి మెయిడెన్ జపాన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. PV Sindhu Is The Champion Of The Japan Open 2026 ❤️🏆This Is Sindhu's 1st S750 Title And Her 1st World Tour Title Since The 2024 Syed Modi International .Sindhu Will Enter The Top 8 In The World Rankings Next Week .#JapanOpen2026 https://t.co/3ujCCQggQP pic.twitter.com/7evCCTdnJx— Badminton Media (@BadmintonMedia1) July 19, 2026 PODIUM PICTURES ❤️💙🤌 PV Sindhu becomes the first ever Indian to win the Japan Open Title 🏆Her 1st Super 750 🏆Her 1st 🏆 Since Syed Modi 24 and 1st 🏆 outside India Since Singapore Open 226th World Tour 🏆Congratulations Sindhu 👏🎊 Onwards and Upwards 🔥🔥 pic.twitter.com/ZuyOybcZyl— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) July 19, 2026Read: పరుగు తేడాతో విజయం.. లాస్ ఏంజిల్స్‌దే మేజర్ లీగ్ టైటిల్ -
పాక్‌తో టైటిల్ కంబాట్.. కళ్లన్నీ 40 ఏండ్ల సంగ్రామ్ పైనే!
భారత రెజ్లింగ్ దిగ్గజం, మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ సంగ్రామ్ సింగ్ తన కెరీర్లోనే కీలక పోరుకు సిద్ధమవుతున్నాడు. ప్రతిష్టాత్మక స్ట్రైక్ ఆసియా చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పాకిస్తాన్ రెజ్లర్ అబిద్ అలీతో తలపడనున్నాడు. రెండు దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్న ఈ పోరు భారత కాలమనా ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. PC: MMA Twitterఈ టైటిల్ ఫైట్ కంబాట్ క్రీడా వర్గాల్లో భారీగా అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ ఫైట్‌లో గెలిచిన వారికి స్ట్రైక్ ఆసియా చాంపియన్ కిరీటం దక్కనుంది. 40 ఏండ్ల వయసులో ప్రొఫెషనల్ రెజ్లర్ నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ప్లేయర్‌గా మారిన సంగ్రామ్ సింగ్ ఇప్పటివరకు తన అన్ని కంబాట్స్లోనే గెలిచి అజేయంగా నిలిచాడు. ఎంఎంఏ కెరీర్ ఆరంభించిన తర్వాత జార్జియాలో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు చెందిన అలీ రజా నాసిర్‌ను కేవలం 90 సెకన్లలో ఓడించి ప్రపంచ వేదికపై తన ఉనికిని ఘనంగా చాటుకున్నాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో ట్యూనీషియాకు చెందిన హకీమ్ ట్రాబెల్సీపై, అర్జెంటీనాలో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోరియన్ కౌడియర్పై వరుస విజయాలు నమోదు చేశాడు. అర్జెంటీనా గడ్డపై ప్రొఫెషనల్ ఎంఎంఏ బౌట్లో గెలిచిన తొలి భారతీయుడిగా సంగ్రామ్ సింగ్ రికార్డులకెక్కాడు. దీంతో అతడి అజేయ ప్రొఫెషనల్ రికార్డు 3-0కి విస్తరించింది. PC: MMA Twitterకాగా టైటిల్ పోరుకు ముందు సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ.. 'నేను కేజ్‌లోకి అడుగుపెట్టిన ప్రతీసారి నాకోసం ఆడను. 140 కోట్ల మంది భారతీయుల కోసమే పోరాడతాను. క్రీడ ఏదైనా సరే, భారత్, పాకిస్తాన్ మధ్య పోరు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. టైటిల్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నా' అని సంగ్రామ్ సింగ్ పేర్కొన్నాడు. ఆదివారం జరగనున్న పోరులో సంగ్రామ్ గెలిస్తే స్ట్రైక్ ఆసియా చాంపియన్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు భారత్ నుంచి ప్రపంచ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనున్నాడు. -
ఎంబాపె ప్రపంచ రికార్డు.. మెస్సీకి కష్టమేనా!
ఫిఫా ప్రపంచకప్‌లో మూడో స్థానం కోసం ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో ఫ్రాన్స్ ఓటమి పాలైనప్పటికీ, ఆ జట్టు స్టార్ ఆటగాడు కైలియన్ ఎంబాపె మాత్రం ప్రపంచ రికార్డుతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసిన ఎంబాపె ఈ ఫిఫా టోర్నీలో తన గోల్స్ సంఖ్యను పదికి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపె (10 గోల్స్, 4 అసిస్ట్‌లు) మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. మెస్సీ 8 గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇవాళ జరగనున్న ఫిఫా ఫైనల్లో మెస్సీ కనీసం రెండు గోల్స్, ఒక అసిస్ట్ చేస్తే గోల్డెన్ బూట్ అతడి సొంతమవుతోంది. లేదంటే ఎంబాపె దానిని ఎగరేసుకుపోతాడు. Photo Credit: FIFA Twitterఇక ఫిఫాలో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలోనూ మెస్సీని ఎంబాపె దాటేశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు 20 గోల్స్‌తో ఉన్న ఎంబాపె మరో రెండు గోల్స్ నమోదు చేయడంతో తన సంఖ్యను 22కు పెంచుకున్నాడు. ఇక అర్జెంటీనా స్టార్ మెస్సీ 21 గోల్స్‌తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ గోల్ చేయకుంటే మాత్రం ఎంబాపె టాప్‌లో ఉంటాడు. ఈ ఫిఫా అనంతరం ఒకవేళ మెస్సీ రిటైర్ అయితే మాత్రం ఎంబాపె ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగానూ రికార్డులకెక్కనున్నాడు.స్పెయిన్‌తో సెమీస్‌లో సమన్వయ లోపం వల్ల ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన ఫ్రాన్స్ మూడో ప్లేస్ కోసం జరిగిన పోరులో మాత్రం గెలిచేందుకు శాయాశక్తులా ప్రయత్నించింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-4 తేడాతో ఫ్రాన్స్‌పై విజయం సాధించి బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ తరఫున బుకాయో సాకా (37వ, 45+1వ, 87వ నిమిషం) హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవగా, డెక్లన్ రైస్ (3వ నిమిషం), ఎరిక్ కోన్సా (18వ నిమిషం), జూడ్ బెల్లింగ్ హమ్ (90+8వ నిమిషం) గోల్స్ సాధించారు. ఫ్రాన్స్ తరఫున కైలియన్ ఎంబాపె (48, 66వ నిమిషం) డబుల్ గోల్స్‌తో మెరవగా, బ్రాడ్లీ బార్కోలా (54వ నిమిషం), ఉస్మాన్ డెంబెలె (90+6వ నిమిషం) గోల్స్ చేశారు.గోల్డెన్ బూట్ రేసులో ఉన్న ఆటగాళ్ల జాబితా:👉కైలియన్ ఎంబాపే: గోల్స్: 10, అసిస్ట్‌లు: 4👉లియోనెల్ మెస్సీ : గోల్స్: 8, అసిస్ట్‌లు: 4👉ఎర్లింగ్ హాలాండ్ : గోల్స్: 7, అసిస్ట్‌లు: 0👉జూడ్ బెల్లింగ్‌హామ్ : గోల్స్: 7, అసిస్ట్‌లు: 1👉హ్యారీ కేన్ : గోల్స్: 6, అసిస్ట్‌లు: 1👉ఉస్మాన్ డెంబెలె : గోల్స్: 6, అసిస్ట్‌లు: 2Kylian Mbappé has now scored the MOST goals in World Cup history with his 22nd 🇫🇷He leads the Golden Boot race with 10 goals this tournament. pic.twitter.com/mVlvHDZvkz— B/R Football (@brfootball) July 18, 2026 Kylian Mbappe now has 14 goal contributions in this World Cup - a record for most in a single tournament ☝️ pic.twitter.com/laTGyeN4IQ— B/R Football (@brfootball) July 18, 2026చదవండి: టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా -
గెలవకపోయినా... మనసులు గెలిచి....
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన మెగా ఈవెంట్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. నాలుగేళ్లకోసారి వచ్చే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ప్రతీసారి ఎన్నో అద్భుత ఘట్టాలను, అనేక చిరస్మరణీయ క్షణాలను మనకు చూపిస్తుంది... అసాధారణ వ్యక్తిగత ప్రదర్శనలు, టీమ్ ఘన విజయాలు... ఇలా సగటు అభిమాని మరచిపోలేని ఎన్నో దృశ్యాలు కనుల ముందు కదలాడుతాయి. 2026 ‘ఫిఫా’ ప్రపంచ కప్‌కు సంబంధించి అలాంటి కొన్ని విశేషాలను చూస్తే...ఖతర్నాక్ కేప్‌వెర్డె ప్రపంచకప్‌లో ఎప్పుడూ చెలరేగే బలమైన టీమ్‌లతో పాటు కొన్ని చిన్న టీమ్‌లు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ఈసారి ఆ జాబితాలో కేప్‌వెర్డె అందరికంటే ముందుంది. సుమారు 5 లక్షల జనాభా గల ఈ అతి చిన్న దేశం కూడా అసాధారణ ఆటతో తమదైన ముద్ర వేసింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడలేదు. తమకంటే ఎంతో బలమైన స్పెయిన్, ఉరుగ్వే, సౌదీ అరేబియాలతో మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించి నాకౌట్‌కు అర్హత సాధించింది. రౌండ్–32లో అర్జెంటీనా చేతిలో ఓడినా 2 గోల్స్ కొట్టి సంతృప్తిగా ముగించింది.అన్నింటికంటే టీమ్ గోల్ కీపర్ జోస్ వొజిన్హా ఆట టోర్నికై హైలైట్‌గా నిలిచింది. 40 ఏళ్ల వయసులో అత్యంత చురుగ్గా ఉంటూ గోల్ పోస్ట్ ముందు అడ్డుగోడగా అతను నిలిచిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. స్పెయిన్‌లాంటి జట్టు 7 గోల్ ప్రయత్నాలను నిలువరించిన అతను అర్జెంటీనా 8 గోల్ ప్రయత్నాలను కూడా సమర్థంగా అడ్డుకోగలిగాడు. దాంతో ఒక్కసారిగా అతని ప్రజాదరణ పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 50 వేల నుంచి రాత్రికి రాత్రే 1 కోటి 30 లక్షలకు చేరుకోవడం విశేషం. అంతే కాదు...కొత్తగా బయటపడిన సముద్ర జీవికి కేప్‌వెర్డె గోల్ కీపర్ గౌరవంగా ‘అల్డిసా వొజిన్హాయ్’ అని పేరు పెట్టడం విశేషం. ఈజిప్ట్...అర్జెంటీనాను వణికించి...‘ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్’లో ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచినా... ఈజిప్ట్ జట్టు ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేయలేకపోయింది. గతంలో మూడుసార్లు లీగ్ దశకే పరిమితమైన టీమ్ ఈసారి నాకౌట్లోకి అడుగు పెట్టింది. కోచ్ హొసామ్ హసన్ టీమ్‌కు సమర్థంగా దిశానిర్దేశం చేయగా, మైదానంలో స్టార్ ఆటగాడు మొహమ్మద్ సలా తనపై నమ్మకం నిలబెట్టేలా రాణించాడు. ఈ టో ర్నిలో అర్జెంటీనాతో ఆడిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈజిప్ట్ అద్భుత ఆట కనబర్చింది.ఈ పోరును ఫుట్‌బాల్ అభిమానులెవరూ మర్చిపోలేరు. మెస్సీ కొట్టిన పెనాల్టీ కిక్‌ను గోల్ కీపర్ ముస్తఫా షబీర్ అడ్డుకున్న తీరు సూపర్. 78 నిమిషాలు పాటు కౌంటర్ అటాకింగ్‌తో డిఫెండింగ్ చాంపియన్‌ను ముచ్చెమటలు పట్టించి టీమ్ 2–0తో ముందంజలో నిలిచింది. అయితే అనూహ్యంగా 13 నిమిషాల వ్యవధిలో 3 గోల్స్ ఇచ్చి ఈజిప్ట్ ఓటమిపాలైంది. రిఫరీ పక్షపాతంతో వ్యవహరించాడని, అతని తప్పుడు నిర్ణయాలే తమ ఓటమికి కారణమయ్యామని ఆరోపించిన ఈజిప్ట్... చివరకు నాకౌట్ చేరి సంతృప్తితో సగర్వంగా ని్రష్కమించింది.నార్వేను నడిపించిన హాలాండ్...ప్రపంచ కప్‌కు సంబంధించిన నార్వే బలమైన జట్టేమీ కాదు. చివరిసారిగా ఆ జట్టు ఈ మెగా టో ర్నికి అర్హత సాధించినప్పుడు (1998) ప్రస్తుత జట్టులోని సగం మంది పుట్టనే లేదు. ఈసారి మాత్రం నార్వే టీమ్ క్వార్టర్ ఫైనల్ దశకు చేరి అందరి దృష్టినీ ఆకర్షించింది. టాప్ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ అందుకు ఒక కారణం కాగా... ప్రిక్వార్టర్స్‌లో ఆ జట్టు చేసిన సంచలన ప్రదర్శన, ఆపై ఆటగాళ్ల ప్రత్యేక సంబరాలు మరో కారణం. అద్భుతమైన ఆట, మైదానంలో చురుకుదనంతో పాటు తనదైన సరదా శైలితో హాలాండ్ సహచరులకంటే భిన్నంగా నిలిచాడు.ముఖ్యంగా బ్రెజిల్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో హాలాండ్ చేసిన రెండు గోల్స్ అతడిని గ్లోబల్ హీరోగా మార్చాయి. ఆ తర్వాత నార్వే ఆటగాళ్లందరూ కలిసి రోయింగ్ తరహాలో చేసే ‘వైకింగ్ రో సెలబ్రేషన్’ అయితే ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా... స్వదేశంలో ఆ జట్టుకు లభించిన ఘన స్వాగతం, భారీ తరహాలో సాగిన ఓపెన్ పరేడ్ ఈ టో ర్నిలో జట్టు విజయాల విలువను చూపించాయి. -
ఫిఫా ప్రపంచకప్.. మూడో స్ధానం ఇంగ్లండ్‌దే
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీని ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈ టోర్నీలో భాగంగా మయామి వేదికగా మూడో స్ధానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై 6-4 తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. ఈ 'బ్రాంజ్ ఫైనల్' పోరు ఫస్ట్ హాఫ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 2 నిమిషాలకే కెప్టెన్ డెక్లాన్ రైస్ ఒక అద్భుతమైన లాంగ్-రేంజ్ గోల్‌తో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 18వ నిమిషంలో ఎజ్రీ కొన్సా గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అనంతరం బుకాయో సాకా వరుసగా రెండు గోల్స్‌ను సాధించి ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇంగ్లండ్‌ను 4-0తో తిరుగులేని స్థితిలో నిలిపాడు. తొలి ఆర్ధ భాగంలో ఫ్రాన్స్ ఎలాంటి గోల్ చేయకపోవడంతో ఇంగ్లండ్ సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు.కానీ సెకెండ్ హాఫ్‌లో మాత్రం ఫ్రాన్స్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. కెప్టెన్ ఎంబాపే 48వ నిమిషంలో ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందించాడు. వెంటనే 54వ నిమిషంలో ఫ్రాన్స్ ఫార్వర్డ్ బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ సాధించాడు. ఆ తర్వాత 66వ నిమిషంలో ఎంబాపే మరో గోల్ కొట్టడంతో స్కోరు 4-3కి చేరింది. దీంతో ఇంగ్లండ్ డౌగౌట్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావారణం నెలకొంది. అయితే ఫ్రాన్స్ జట్టు మ్యాచ్‌ను సమం చేసేలా కనిపించిన సమయంలో, ఇంగ్లండ్ స్టార్ బుకాయో సాకా మరోసారి సత్తాచాటాడు. 87వ నిమిషంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచి తన హాట్రిక్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ గోల్‌తో ఇంగ్లండ్ 5-3 ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలో ఫ్రాన్స్ మళ్లీ గోల్ సాధించి పోటీలో నిలిచింది. కానీ మ్యాచ్ ఆఖరి నిమిషంలో ఇంగ్లండ్ మిడ్ ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ మరో గోల్ కొట్టి తన జట్టు విజయాన్ని 6-4తో ఖరారు చేశాడు. ఈ అద్భుత విజయంతో ఇంగ్లండ్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. 1966 తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఓ మెడల్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. -
ఇజ్రాయెల్ సెటిలర్ల దాడి.. పాలస్తీనా ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి
పాలస్తీనా క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆక్రమిత పశ్చిమ తీరం (వెస్ట్ బ్యాంక్)లో ఇజ్రాయెల్ సెటిలర్లు, సైన్యం జరిపిన దాడిలో గాయపడిన పాలస్తీనా యువ ఫుట్‌బాల్ ప్లేయర్ ఫాదీ హమ్దల్లా అల్-నస్సాన్ (17) శనివారం రాత్రి మరణించాడు. ఫాదీ తీవ్రమైన గాయాలతో వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు.ఏమి జరిగిందంటే?జూలై 11న వెస్ట్ బ్యాంక్‌లోని ఫాదీ హమ్దల్లా గ్రామంపై ఇజ్రాయెల్ సెటిలర్లు, బలగాలు దాడులు జరిపాయి. ఈ దాడిలో మహిళల అరుపులు విని వారిని రక్షించడానికి వెళ్లిన ఫాదీపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపాయి. తీవ్రంగా గాయపడిన ఫాదీని అస్పత్రికి తరలించారు.గాయం తీవ్రమవడంతో వైద్యులు అతడి కాలును తొలగించాల్సి వచ్చింది, అయినప్పటికీ పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఈ ఘటనపై పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది.2023 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 568 ఫుట్‌బాల్ ప్లేయర్లు మరణించినట్లు పీఫ్ఎ అధికారికంగా తెలిపింది. కాగా ఫాదీ అల్-నస్సాన్ స్థానిక 'అల్-ముఘయ్యిర్' క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు, పాలస్తీనా జాతీయ యువ ఫుట్‌బాల్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. -
ఫైనల్ 'కిక్'
39 రోజులు, 103 మ్యాచ్‌ల తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మెస్సీ మెరుపులతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా? టీనేజ్ సంచలనం లమీన్ యామల్ నైపుణ్యం 2010 విశ్వవిజేత స్పెయిన్‌కు రెండోసారి ప్రపంచకప్ అందిస్తుందా? అటాకింగ్ ఆటతీరుతో ఈ ప్రపంచకప్‌ను ఊపేసిన అర్జెంటీనా ఆటగాళ్లు అదే జోరును తుది పోరులో కొనసాగిస్తారా? అడ్డుగోడలా నిలబడుతూ ప్రత్యర్థి జట్లకు గోల్ కొట్టడమే గగనంలా చేసిన స్పెయిన్ డిఫెన్స్ తుది పోరులోనూ విజయవంతం అవుతుందా? వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకొని ఇటలీ, బ్రెజిల్ సరసన అర్జెంటీనా నిలుస్తుందా? అర్జెంటీనా ఆశలను వమ్ము చేసి ప్రపంచకప్‌తో స్పెయిన్ పూర్వ వైభవం సాధిస్తుందా? వీటన్నింటికి సమాధానం నేడు అర్ధరాత్రి తర్వాత లభిస్తుంది. న్యూయార్క్: ఒక్క పరాజయం లేకుండానే అంతిమ సమరానికి అర్హత సాధించిన అర్జెంటీనా, స్పెయిన్ జట్లు ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఆఖరి పోరులోనూ గెలిచి టోర్నీని అజేయంగా ముగించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌పై యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మైదానంలో ప్రత్యక్షంగా 80 వేల మంది... ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు టీవీల ద్వారా ఈ తుది పోరును వీక్షించనున్నారు.2022లో ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని 17 మంది ప్లేయర్లు ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ ఆడుతున్నారు.ముఖ్యంగా 39 ఏళ్ల లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా ఈ టోర్నీలో అద్భుత ఆటతీరుతో అలరిస్తోంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల్లో నుంచి విజయకేతనం ఎగురవేస్తోంది. చివరి క్షణం ముగిసేవరకు తమను తక్కువ అంచనా వేయొద్దని.... అవకాశం దొరికితే ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా తమలో ఉందని మెస్సీ బృందం నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ గెలుపు కిక్ తమదే కావాలని అర్జెంటీనా పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. మరోవైపు 2010లో ఏకైకసారి ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులోని ఆటగాళ్లెవరూ ప్రస్తుత ప్రపంచకప్‌లో లేరు. అయితే 2024లో యూరోపియన్ చాంపియన్‌షిప్ గెల్చుకున్న స్పెయిన్ జట్టులోని 16 మంది ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడుతున్నారు. స్పెయిన్ భవిష్యత్ ఆశాకిరణం, 19 ఏళ్ల యామల్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. చివర్లో చెలరేగుతూ... ఫైనల్ చేరే క్రమంలో అర్జెంటీనా జట్టు 19 గోల్స్ సాధించింది. ప్రత్యర్థి జట్లకు 7 గోల్స్ సమ ర్పించుకుంది. అర్జెంటీనా చేసిన 19 గోల్స్‌లో 12 గోల్స్ మ్యాచ్‌లో 75 నిమిషాలు ముగిశాకే వచ్చాయి. ముందుగా నెమ్మదిగా ఆడటం... ప్రత్యర్థి జట్టు గోల్ చేశాక అర్జెంటీనా జోరు పెంచుతూ తమ సత్తా చాటుకుంటోంది. చివర్లో సబ్‌స్టిట్యూట్‌గా వస్తున్న ఆటగాళ్లు కూడా గోల్స్ చేస్తూ అర్జెంటీనాను గట్టెక్కిస్తున్నారు. మరోవైపు స్పెయిన్ జట్టు పూర్తి డిఫెన్స్ ఆటతీరుకు ప్రాధాన్యమిస్తోంది. అవకాశం దొరికినపుడు గోల్ చేసి ఆ తర్వాత ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయతీరానికి చేరుతోంది. ఈ టోర్నీలో స్పెయిన్ జట్టు 13 గోల్స్ సాధించి... ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ మాత్రమే సమ ర్పించుకుంది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో స్పెయిన్ గోల్‌పోస్ట్‌పై ప్రత్యర్థి జట్లు 11 సార్లు మాత్రమే షాట్లు కొట్టడం గమనార్హం.విజేత జట్టుకు రూ. 481 కోట్లు ఈసారి ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 5 కోట్ల డాలర్లు (రూ. 481 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించనుంది. రన్నరప్ జట్టుకు 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 317 కోట్లు) దక్కుతాయి. మూడో స్థానం పొందిన జట్టు ఖాతాలో 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 279 కోట్లు) చేరుతాయి. నాలుగో స్థానం సంపాదించిన జట్టుకు 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 259 కోట్లు) లభిస్తాయి. 5 నుంచి 8 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 182 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 9 నుంచి 16 స్థానాల మధ్య నిలిచిన జట్లకు 1 కోటీ 50 లక్షల డాలర్ల చొప్పున (రూ. 144 కోట్లు చొప్పున) లభిస్తాయి. 17 నుంచి 32 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 10 లక్షల డాలర్ల చొప్పున (రూ. 105 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 33 నుంచి 48 స్థానాల్లో నిలిచిన జట్ల ఖాతాలో 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 86 కోట్లు) లభిస్తాయి. 37 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ జట్టు వరుసగా 37 మ్యాచ్‌ల్లో పరాజయం రుచి చూడలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు స్పెయిన్ 27 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో స్పెయిన్ గెలిస్తే ఇటలీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతుంది. ఇటలీ జట్టు 2018 నుంచి 2021 వరకు వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓడిపోలేదు.3 మెస్సీ బృందం ఈసారి టైటిల్ గెలిస్తే ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. అర్జెంటీనా ఇప్పటికి మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. బ్రెజిల్ జట్టు అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇటలీ, జర్మనీ జట్లు నాలుగుసార్లు చొప్పున సాధించాయి. 1 ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌ను 1992లో ప్రవేశపెట్టాక వరల్డ్‌కప్ టైటిల్ కోసం ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. 4 ఫైనల్లో స్పెయిన్‌పై అర్జెంటీనా గెలిస్తే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో బ్రెజిల్ (2002, 1970), ఉరుగ్వే (1930), ఇటలీ (1934) మాత్రమే ఈ ఘనత సాధించాయి.3 అర్జెంటీనా ఫైనల్లో విజయం సాధిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) మాత్రమే ఈ ఘనత సాధించాయి.1 మూడు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఒక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన తొలి ప్లేయర్‌గా మెస్సీ గుర్తింపు పొందనున్నాడు. 2014 ప్రపంచకప్ ఫైనల్స్‌లో మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా జట్టు జర్మనీ చేతిలో ఓడిపోయింది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలిచింది. -
విజేతకు ఇచ్చేది నమూనా ట్రోఫీనే!
ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ వరల్డ్ కప్ ట్రోఫీ రూపకల్పన ఆసక్తికరంగా జరిగింది. మైదానంలో ప్లేయర్ల పోరాటం... స్టాండ్స్‌లో అభిమానుల ఆనందం... విజయం సాధించిన అపురూప క్షణం... ఈ మూడు భావోద్వేగాలకు ప్రస్తుతం విజేతకు అందిస్తున్న ట్రోఫీ ప్రతిరూపం. ఇటలీకి చెందిన ప్రఖ్యాత శిల్పి సిల్వియో గజానిగా దీన్ని రూపొందించారు. 1930లో జరిగిన తొలి వరల్డ్ కప్ సమయంలో రూపొందించిన ట్రోఫీ గ్రీకు దేవత ‘నైక్’ను పోలి ఉండేది. 1970లో బ్రెజిల్ మూడోసారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అనంతరం అసలు ట్రోఫీని శాశ్వతంగా సొంతం చేసుకుంది. దీంతో కొత్త డిజైన్ రూపకల్పన అనివార్యమైంది. పలు ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వేల డిజైన్లు... వందల మోడల్స్... పదుల సంఖ్యలో నమూనాలు తీర్చిదిద్దిన తర్వాత జ్యూరీ చివరకు ప్రస్తుతం ఉన్న ట్రోఫీకి పచ్చజెండా ఊపింది. ఫైనల్లో విజయం సాధించిన జట్టు కెప్టెన్‌కు అందించే అసలు ట్రోఫీ ఎత్తు 36 సెంటీమీటర్లు, ఇది 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అయితే ఈ ట్రోఫీని విజేతకు శాశ్వతంగా అందించరు. సంబరాల అనంతరం ‘ఫిఫా’ దాన్ని తిరిగి తీసుకుంటుంది. దాని స్థానంలో బంగారు పూత పూసిన నమూనా ట్రోఫీని మాత్రమే విజేత జట్టుకు ఇస్తారు. తదుపరి వరల్డ్‌కప్ వరకు అసలైన ట్రోఫీ స్విట్జర్లాండ్‌లోని ‘ఫిఫా’ ప్రధాన కార్యాలయంలో ఉంటుంది. అయితే గతంలో మూడుసార్లు వరల్డ్‌కప్ నెగ్గిన జట్టు ఈ ట్రోఫీని శాశ్వతంగా తమ వద్ద ఉంచుకునేది... ప్రస్తుతం దీనికి ‘ఫిఫా’ అనుమతించడం లేదు. 1974 వరల్డ్‌కప్‌లో మొదటిసారి వాడిన ప్రస్తుత డిజైన్‌ను ఇప్పటి వరకు 14 సార్లు ఉపయోగించారు. 2038 వరకు ఇదే ట్రోఫీని కొనసాగించాలని ‘ఫిఫా’ నిర్ణయించింది. కప్‌ను కరిగించేశారు! వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచి బ్రెజిల్ 1970లో సొంతం చేసుకున్న ‘జూల్స్ రిమేట్ ట్రోఫీ’ ఇప్పుడు లేదు. ఈ కప్ రెండుసార్లు చోరికి గురైంది. 1966లో తొలిసారి ప్రేక్షకుల కోసం లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ సమయంలో దీనిని ఎవరో చోరి చేశారు. అయితే ‘పికిల్స్’ పేరు గల జాగిలం సౌత్ లండన్‌లో దీనిని గుర్తించడంతో ప్రపంచకప్ దొరికింది. ఆ తర్వాత 1983లో బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య ప్రధాన కార్యాలయం నుంచి ఎవరో ఈ ప్రపంచకప్‌ను ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన వ్యక్తులు బంగారు ప్రపంచకప్‌ను కరిగించేశారని.. అందుకే ఎంత వెతికినా ప్రపంచకప్ జాడ దొరకలేదని చెబుతుంటారు. -
దొంగాట కూడా... మెరుపుల మధ్య మరకలు
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో వివాదాలు కొత్త కాదు. ప్రతీసారి ఈ మెగా ఈవెంట్లో ఎన్నో అంశాలు తీవ్ర చర్చకు దారి తీస్తాయి. ఆటగాళ్ల ప్రవర్తను సంబంధించి కొన్ని వివాదాలు ఉంటే, మరికొన్ని రిఫరీల నిర్ణయాలు, వారి వ్యవహార శైలిపై సందేహాలు రేకెత్తిస్తాయి. ఇప్పుడు కూడా పలు ఘటనలు ప్రపంచకప్ నిర్వహణలో పారదర్శకత లేకుండా ‘ఫిఫా’ నిజాయితీని శంకించేలా కనిపించాయి. రొనాల్డోకు ప్రపంచకప్ అవకాశం... వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు దారాషియాను దురుసుగా అడ్డుకున్నందుకు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై మూడు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీని ప్రకారం అతడు చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌తో పాటు వరల్డ్ కప్ తొలి రెండు మ్యాచ్‌ల నుంచి తప్పుకోవాలి. అయితే రొనాల్డో స్థాయి, అతని స్టార్ హోదాను దృష్టిలో ఉంచుకొని ‘ఫిఫా’ సడలింపు ఇచ్చింది. 226 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్లో అతను ఇలా ఎప్పుడూ చేయలేదు కాబట్టి నిషేధాన్ని ‘ఏడాది పాటు నిలిపివేస్తున్నట్లు’ ప్రకటించింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. రొనాల్డో రెండు మ్యాచ్‌లు ఆడకపోతే ఆ మ్యాచ్‌లపై ఆసక్తి తగ్గిపోతుందనే ‘ఫిఫా’ ఈ నిర్ణయం తీసుకుంది. బాలోగాన్ కోసం ట్రంప్ సిఫారసు... అమెరికా ఆటగాడు ఫొలారిన్ బాలోగాన్ విషయంలో ‘ఫిఫా’ వ్యవహారం అందరినీ ఆశ్చర్యపర్చింది. బోస్నియా హెర్జెగోవినాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు బాలోగన్ రెడ్ కార్డుకు గురయ్యాడు. దాంతో బెల్జియంతో జరిగే ప్రిక్వార్టర్స్ పోరులో అతను ఆడటానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఆతిథ్య జట్టు ఆటగాడు అలా తప్పుకోవడం బాగుండదని, ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినోకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా ఫోన్ చేసి అడిగాడు. దాంతో ఇన్ఫాంటినో వెంటనే స్పందించిన బాలోగాన్ నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. మైదానంలో ఆటపై బయటి వ్యక్తి ఇలా కోరడం గతంలో ఎన్నడూ జరగలేదు. తగిన సమాధానం ఇవ్వకుండా ‘ఫిఫా’ తమ నిర్ణయాన్ని అమలు చేసింది.టోర్నీ ‘డ్రా’తోనే పక్షపాతం... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా టెన్నిస్ పద్ధతిలో ‘ఫిఫా’ తెలివిగా మ్యాచ్‌ల ‘డ్రా’ను ప్రకటించింది. గతంలో ఓపెన్ ‘డ్రా’ ద్వారా చూస్తే నాకౌట్ దశకు ముందే పెద్ద జట్లు ప్రత్యర్థులుగా తలపడే అవకాశం వచ్చేది. ఈసారి ఎంచుకున్న ‘డ్రా’ ప్రకారం ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న స్పెయిన్...నంబర్ టూ అర్జెంటీనాను ఫైనల్ వరకు ఎదుర్కొనే అవకాశమే లేదు. మూడో స్థానంలోని ఫ్రాన్స్, నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ మధ్య సెమీస్‌కు ముందు మ్యాచ్ జరగదు. ‘ఫిఫా’ తెలివితేటలు బాగా పని చేశాయని చివరకు తేలింది. చరిత్రలో తొలిసారి టాప్–4 టీమ్‌లు వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సోమాలియా రిఫరీకి నో ఎంట్రీ... ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ రిఫరీల్లో ఒకడిగా సోమాలియాకు చెందిన ఒమర్ అబ్దుల్ కదిర్‌కు పేరు ఉంది. అందుకే అతడిని ‘ఫిఫా’ వరల్డ్ కప్ రిఫరీల జాబితాలో చేర్చింది. అయితే తమ దేశంలోకి ప్రవేశించించేందుకు నిషేధం ఉన్న దేశాల్లో సోమాలియా ఒకటి. కాబట్టి కదిర్‌ను అమెరికాలో అడుగుపెట్టనిచ్చేది లేదని వైట్‌హౌస్ అధికారులు స్పష్టం చేశారు. అతడికి వీసా ఉండటంతో పాటు వ్యక్తిగతంగా కాకుండా అధికారిక హోదాలో వరల్డ్ కప్ కోసం అతను వచ్చినా సరే అమెరికా ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇలాంటి స్థితిలో రిఫరీకి కనీసం అండగా నిలవకుండా మౌనం వహించడం ‘ఫిఫా’ అమెరికాకు ఎంతగా తలవంచిందో అర్థమవుతుందని విమర్శలు వెలువెత్తాయి. అర్జెంటీనా... ‘ఫిఫా’ భాయ్ భాయ్‘ఫిఫా’ ఎలాగైనా అర్జెంటీనా జట్టును మళ్లీ విజేతగా నిలపాలని చూస్తున్నట్లుంది... ఆ జట్టుకు మా ముందస్తు అభినందనలు... ప్రిక్వార్టర్స్ మ్యాచ్ తర్వాత ఈజిప్ట్ ఆటగాళ్ల స్పందన ఇది. ప్రతీ మ్యాచ్‌లో రిఫరీలు ఆ జట్టుకు మద్దతుగా నిలిచారని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. వరుసగా ఈజిప్ట్ , స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లలో అర్జెంటీనాకు అనుకూలంగా అంతా జరిగిందని ప్రపంచం మొత్తం విమర్శించింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) ద్వారా అయితే అర్జెంటీనాకే పూర్తిగా అండగా నిలవడం కనిపించింది. కనీసం దాపరికం కూడా లేకుండా బహిరంగంగా ‘ఫిఫా’ అన్ని పరిమితులు దాటేసిందని ఇతర జట్ల అభిమానులు, విశ్లేషకులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలన్నీ అర్జెంటీనా విజయాల స్థాయిని తగ్గించాయి అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ కాలు తగిలి ప్రత్యర్థి కెప్టెన్ ఐసా మందీ కింద పడ్డాడు. రీప్లేలో కూడా ఇది కనిపించింది. రెడ్ కార్డ్ స్థాయి శిక్షకు గురయ్యే ఈ ఘటనలో మెస్సీపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో తప్పు లేదని కనిపిస్తున్నా అంపైర్ ఎల్లో కార్డ్ ఇచ్చాడు. మ్యాచ్‌లో అది అతడికి రెండో ఎల్లో కార్డ్ కావడంతో బ్రీల్ ఎంబోలో మైదానం వీడగా... అప్పటి వరకు 1–1తో మెరుగైన స్థితిలో కనిపించిన స్విట్జర్లాండ్ 10 మందితోనే ఆడి ఓటమి పాలైంది. ఈజిప్ట్ తో జరిగిన మ్యాచ్‌లోనైతే రిఫరీ మరీ పక్షపాతంగా వ్యవహరించినట్లు తేలింది. 58వ నిమిషంలో ఈజిప్ట్ ప్లేయర్ ముస్తఫా జికో చేసిన గోల్‌ను రిఫరీ ‘ఫౌల్’గా తేల్చడం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అదే మ్యాచ్ చివర్లో సలా తప్పు లేదని తేలినా... అర్జెంటీనాకు రిఫరీ పెనాల్టీ ఇచ్చేశాడు. ఓటమి ఖాయమనిపించిన స్థితిలో 14 నిమిషాల వ్యవధిలో 3 గోల్స్ చేసి అర్జెంటీనా మ్యాచ్‌ను గెలుచుకుంది. అర్జెంటీనా గోల్ కొట్టడంలో విఫలమైనప్పుడు బాధపడుతూ, గోల్ కొట్టగానే సంబరాలు చేసుకుంటున్న ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినో దృశ్యాలు ప్రపంచం అవాక్కయ్యేలా చేశాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ చేసిన గోల్ చర్చకు దారి తీసింది. అది ‘ఆఫ్‌సైడ్’ గోల్ అయినా... పూర్తిగా రివ్యూ చేయకుండా, అసలు వీఏఆర్‌లో ఆఫ్‌సైడ్ గ్రాఫిక్స్ కూడా చూడకుండా రిఫరీ తన నిర్ణయం ప్రకటించాడని అంతా ఆరోపించారు. -
‘మన’ ఆట ఎప్పుడో?
మరో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ వచ్చింది... ఆదివారంతో ముగిసిపోతోంది కూడా! మెస్సీ మాయలో తరించాం... ఎంబాపె, హాలాండ్, డెంబెలె, మార్టినెజ్ మెరుపులకు జేజేలు పలికాం... మిగతా ఆటగాళ్ల విన్యాసాలను కూడా ఓహో అంటూ చప్పట్లు కొట్టాం... కానీ ఇలా ఎప్పటి వరకు? పరాయి దేశపు ఆటగాడికి అభిమాన ప్రేక్షకుడిలా ఆటను ఆస్వాదిస్తున్నాం తప్ప ‘మనోడు’ అంటూ ఒక్కడూ మైదానంలో కనిపించడం లేదు. ‘ఫిఫా’ వరల్డ్ కప్ మొదలై 96 ఏళ్లు అయినా భారత జట్టుకు ప్రాతినిధ్యమే లేదు. మైదానంలో దిగేందుకు కనీసం ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన 1950 వరల్డ్ కప్‌లో మాత్రం భారత్‌గా నేరుగా అవకాశం లభించింది. వేర్వేరు రాజకీయ కారణాలతో పలు జట్లు తప్పుకోవడంతో ఆడేందుకు భారత్‌ను కూడా ‘ఫిఫా’ ఎంపిక చేసింది. అయితే తగిన ప్రాక్టీస్ లేక, జట్టు ఎంపికలో గందరగోళవంటి సమస్యలతో చివరి నిమిషంలో జట్టును పంపడం లేదని భారత ఫుట్‌బాల్ సమాఖ్య ప్రకటించింది. ఆ తర్వాత మన అడుగులు ఒక్కసారి కూడా అటు వైపు పడలేదు. 2026 టోర్నీలో ప్రపంచ కప్‌ను 32 నుంచి 48 జట్లకు పెంచినా... అర్హతా ప్రమాణాలకు మనం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాం. మన దేశంలో ఫుట్‌బాల్ స్థాయి నానాటీకీ పడిపోతున్న ఈ స్థితిలో వరల్డ్ కప్‌లో ఆటను కోరుకోవడం అత్యాశే కావచ్చు. ప్రస్తుతం ‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 138వ స్థానంలో ఉంది. ఆసియా ఖండంలోనైతే ఈ ర్యాంక్ 27గా ఉంది. వరల్డ్ కప్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో 1986, 1994, 1998లలో... ఆ తర్వాత 2002 నుంచి 2026 వరకు భారత జట్టు వరుసగా ఆసియా ఖండం నుంచి అర్హత సాధించే లక్ష్యంతో క్వాలిఫయింగ్ టోర్నమెంట్లు ఆడింది. అయితే ఒక్కసారి కూడా జట్టు కావాల్సిన విజయాలు సాధించి ముందంజ వేయలేకపోయింది. ఇన్నేళ్లలో ఆసియాలోని 22 జట్లతో తలపడిన భారత్ వరల్డ్ కప్ కోరిక మాత్రం తీరలేదు. 2026 టోర్నీలో ఆసియా నుంచి 9 జట్లకు చాన్స్ లభించినా భారత్ మాత్రం వీటిలో లేదు. ఈ ఖండం నుంచి ఇరాన్, ఇరాక్, జపాన్, జోర్డాన్, ఖతర్, సౌదీ అరేబియా, కొరియా, ఉజ్బెకిస్తాన్, ఆ్రస్టేలియా బరిలోకి దిగాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్‌లపై మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒకటే మ్యాచ్ గెలిచి అర్హత సాధించే అవకాశాలు చేజార్చుకుంది. మరోవైపు ఒలింపిక్స్‌లో మాత్రం భారత్‌కు అవకాశం దక్కింది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరడం మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన. అయితే 1992 నుంచి నిబంధనలు మార్చి అండర్–23 టీమ్‌లను మాత్రమే ఒలింపిక్స్‌కు పంపాలని నిర్ణయించగా...ఆ తర్వాత భారత్ ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుతం మన దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు అసలు ఏమాత్రం ఆదరణ లేని స్థితి, కనీస సౌకర్యాలు లేకపోవడం, నాసిరకం ప్రమాణాలకు తోడు ఏమాత్రం ముందు చూపు లేని జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చేతగానితనం వెరసి వరల్డ్ కప్‌లో మన జట్టు గురించి కనీసం ఆలోచించకుండా చేస్తోంది. జట్టుగా కాకున్నా కొందరు ఆటగాళ్లయినా కనీసం తమ వ్యక్తిగత సామర్థ్యంతో విదేశీ లీగ్‌లలో ఆడటం, స్థాయిని పెంచుకోవడం లాంటివి కూడా కనిపించడం లేదు. 2030లో జరిగే వరల్డ్ కప్‌లో మళ్లీ జట్ల సంఖ్యను 64కు పెంచాలని ‘ఫిఫా’ యోచిస్తోంది. దాని కోసమైనా ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమై క్వాలిఫయింగ్ కోసం ఒక ప్రయత్నం చేయవచ్చు. తాజా స్థితిలో మాత్రం ప్రపంచకప్‌లో మన హాజరు ఇంకా సుదూర స్వప్నమే! -
100 మ్యాచ్‌లకు ఒక బంతి... ఆఖరి 4 మ్యాచ్‌లకు మరో బంతి
‘ఫిఫా’ వరల్డ్‌కప్‌లో రెండు రకాల బంతులను వినియోగించారు. టోర్నమెంట్ తొలి 100 మ్యాచ్‌లకు... ఆతిథ్య దేశాలైన అమెరికా, మెక్సికో, కెనడా జెండాల రంగులను ప్రస్ఫుటించేలా ఎరుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులతో కూడిన ‘ట్రియోండా’ బంతిని వాడగా... మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు (2 సెమీఫైనల్స్, మూడో స్థానం మ్యాచ్, ఫైనల్) బంతి రంగులో మార్పులు చేశారు. స్పానిష్ లో ‘ట్రియోండా’ అంటే ‘త్రీ వేవ్స్’... ఆతిథ్యమిస్తున్న మూడు దేశాలకు ప్రతీక అని అర్థం. ఫ్రాన్స్–స్పెయిన్... ఇంగ్లండ్–అర్జెంటీనా మధ్య జరిగిన సెమీఫైనల్స్‌తో పాటు ఫ్రాన్స్–ఇంగ్లండ్ మధ్య మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో బంగారు, నలుపు రంగులతో కూడిన బంతిని వినియోగించారు. అడిడాస్ సంస్థ రూపొందించిన ఈ బంతితోనే ఫైనల్ కూడా జరగనుంది. ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చిన 16 నగరాలకు గుర్తుగా దీన్ని రూపొందించడం విశేషం. ‘ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ‘ఫిఫా’ ప్రపంచకప్‌కు స్వాగతించిన 16 నగరాలను ట్రియోండా గౌరవిస్తోంది. చివరి నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన నగరాల పేర్లు బంతిపై ప్రముఖంగా కనిపించే విధంగా రూపొందించాం. మిగిలిన 12 ఆతిథ్య నగరాల పేర్లను కూడా పొందుపరిచాం. తద్వారా టోర్నీ విజయవంతం కావడానికి వారు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటున్నాం’ అని ‘ఫిఫా’ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనల్ బంతిలో అత్యాధునిక ఏఐ సాంకేతికత ఉందని... అది కచ్చితమైన డేటా అందిస్తూ... రిఫరీలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుందని ‘ఫిఫా’ వెల్లడించింది. -
కామన్వెల్త్ గేమ్స్ ఫ్లాగ్ బేరర్స్‌గా మీరాబాయి, లవ్లీనా
భారత దిగ్గజ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్కు గొప్ప గౌరవం దక్కింది. కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో వీరిద్దరూ భారత ఫ్లాగ్ బేరర్స్‌గా ఎంపికయ్యారు. భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. కామన్వెల్త్ గేమ్స్ భారత్ నుంచి వివిధ క్రీడల్లో మొత్తం 124 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందానికి మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించనున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కోలో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ నెల 23న ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ ప్రారంభ వేడుకల్లో మీరాబాయి, లవ్లీనా జాతీయ జెండా చేతబూని భారత బృందాన్ని నడిపించనున్నారు. ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష మాట్లాడుతూ.. మీరాబాను, లవ్లీనా భారత క్రీడ రంగానికి చేసిన అద్భుతమైన సేవలకు ఇది నిదర్శనమన్నారు. 'మీరాబాయి, లవ్లీనా ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం గర్వకారణంగా ఉంది. వారిద్దరూ అంతర్జాతీయ వేదికపై ఎన్నోసార్లు తమను తాము నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్‌లో లో కామన్వెల్ గేమ్స్ కోసం శిక్షణ పొందుతున్నారు.'అని ఉష తెలిపారు. Read: సిరీస్ విజయంపై గురి.. లార్డ్స్‌లో టీమిండియాకు ఘన చరిత్ర! -
ఫిఫా ఫైనల్ ఆఖరిదా?.. రిటైర్మెంట్పై మెస్సీ స్పందన!
ఫిఫా ప్రపంచకప్ 2026 తర్వాత అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడా? ఆదివారం స్పెయిన్‌తో జరగనున్న ఫిఫా ఫైనల్ మెస్సీ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ ముగిసిన తర్వాత ప్రెస్‌మీట్‌కు హాజరైన మెస్సీకి తన రిటైర్మెంట్పై ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. ‘మీ జర్నీ ఒక వీడియో గేమ్‌లా ఉంది. ఫిఫా ఫైనల్ మీకు చివరిది కానుందా’ అని ప్రశ్నించారు. దీనిపై మెస్సీ స్పందిస్తూ.. ‘నేను నా చివరి మ్యాచ్‌ను గత వరల్డ్‌కప్ (ఖతార్ 2022)లోనే ఆడేశాను. అక్కడ ఫిఫా టైటిల్ గెలవడంతోనే నా కెరీర్లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాను. ఇప్పుడు నా ఆట ముగిసిపోయింది’అని అర్ధంకాని రీతిలో జవాబివ్వడంతో రిపోర్టర్లు తలలు పట్టుకోవడం గమనార్హం. దీంతో మెస్సీ రిటైర్మెంట్పై మరోసారి గందరగోళం నెలకొంది. అయితే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలుకుతాడా లేదా అన్నది ఆదివారమే తేలనుంది. ఇదే విషయమై అర్జెంటీనా జట్టు కోచ్, మేనేజర్ లియోనల్ స్కలోనిని కూడా అడిగారు.ఆయన కూడా ‘నాకైతే ఏ సమాచారం లేదు. నిజాయితీగా చెప్పాలంటే మెస్సీ తన నిర్ణయంతో మమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చు.. చేయకపోవచ్చు. రిటైర్మెంట్ అంశం పూర్తిగా అతడికే వదిలేశాం’ అని తెలివిగా సమాధానం చెప్పుకొచ్చారు. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో మెస్సీ అత్యున్నత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లోనే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకెళ్తున్నాడు. అయితే ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె (7 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 3 అసిస్ట్‌లు) మెస్సీతో సమానంగా ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైనల్లో మెస్సీ గోల్ చేస్తే గోల్డెన్ బూట్ అతడి సొంతమవుతుంది. ఒకవేళ మెస్సీ గోల్ చేయకుంటే ఎంబాపెకు గోల్డెన్ బూట్ దక్కే అవకాశముంది. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ ఓవరాల్‌గా 21 గోల్స్‌తో ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మెస్సీ వెనుకే ఎంబాపె (ఫ్రాన్స్, 20 గోల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. 🗣️ “Your career is like a video game, you keep unlocking new levels until you reach the final”.😬🇦🇷 Leo Messi: “I already completed the game at the last World Cup in Qatar”. pic.twitter.com/CD2eZLhlv0— Fabrizio Romano (@FabrizioRomano) July 18, 2026Read: ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు! -
ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టడం వల్ల భారీ క్రేజ్ నెలకొంది. అటు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టిన స్పెయిన్ కూడా కప్ కొట్టాలనే కసితో ఉంది. మరి కొదమసింహాల్లా లాంటి ప్రత్యర్థుల మధ్య పోటీ జరుగుతున్న వేళ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటకుండా ఉంటాయా చెప్పండి. ఫైనల్ మ్యాచ్‌కు ముందే టికెట్ల ధరల రూపంలో ఫిఫా రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి ఒక్క టికెట్ ధర ఏకంగా రూ.27 లక్షలు పలికింది. 96 ఏళ్ల ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన అత్యున్నత శ్రేణి (హాస్పిటాలిటీ) టికెట్ ధర ఏకంగా రూ. 27 లక్షలు పలుకుతోంది. ఈ ప్రీమియం హాస్పిటాలిటీ ప్యాకేజీలు కేవలం మ్యాచ్ వీక్షణకే పరిమితం కావు. విదేశీ వీఐపీలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆకర్షించేలా స్టేడియంలో ప్రత్యేక విలాసవంతమైన లాంజ్‌లు, ఫైన్ డైనింగ్, విభిన్న లగ్జరీ సేవలను ఫిఫా అందిస్తోంది. అయితే, ఇది కేవలం వీఐపీ ప్యాకేజీ ధర మాత్రమేనని, సామాన్య అభిమానుల కోసం అందుబాటులో ఉండే సాధారణ మ్యాచ్ టికెట్ల ధరలు దీనికంటే చాలా తక్కువగా ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.అమెరికా క్రీడా చరిత్రలో 2024లో జరిగిన ‘సూపర్‌బౌల్’ చాంపియన్‌షిప్‌లో శాన్ ఫ్రాన్సిస్కో 49ఈఆర్ఎస్ వర్సెస్ కాన్సాస్ సిటీ అత్యంత ఖరీదైన మ్యాచ్‌గా నిలిచింది. అప్పట్లో దీని సగటు టికెట్ ధర రూ. 9.6 లక్షలుగా నమోదైంది. ఇప్పుడు ఫిఫా ఫైనల్ టికెట్ ధర ఆ రికార్డును దాదాపు మూడు రెట్లు అధిగమించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఇక ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 6,943 డాలర్లు (సుమారు రూ.6 లక్షలు)గా ఉంది. యావరేజ్ టికెట్ ధర 11,327 డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు)గా ఉంది. అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 7,200 డాలర్లు ( సుమారు రూ. 6.93 లక్షలు)గా ఉంది. సెమీస్‌తో పోలిస్తే ఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 93 వేలు తక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం మీద ఈసారి ప్రపంచవ్యాప్తంగానూ ఫిఫా ప్రపంచకప్ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఎన్నడూ లేనంతగా ఫిఫా చరిత్రలో టీఆర్పీ రేట్లన్నీ బద్దలయ్యాయి.Read: ఫిఫా కీలక నిర్ణయం.. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి! -
ఫిఫా కీలక నిర్ణయం.. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి!
ఫిఫా ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా పైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిఫా టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఆటగాళ్లు మెడల్స్ అందుకోనున్నారు. విన్నర్ జట్టుకు లభించే ప్రైజ్‌మనీనే భారీగా ఉంటుంది. ఒక్కో ఆటగాడు భారీ మొత్తాన్ని దక్కించుకుంటారు. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులోని ఆటగాళ్లకు 96 ఏళ్ల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఫిఫా ప్రత్యేక గిఫ్ట్ అందించనుంది. ఫిఫా 2026లో చాంపియన్‌గా నిలిచిన జట్టు ఆటగాళ్లకు ఉంగరాలు ప్రదానం చేయనున్నారు. టైటిల్ గెలిచిన జట్లకు ఉంగరాలు ఇవ్వడం నార్త్ అమెరికాలో 19వ శతాబ్దం నుంచి ఒక సంప్రదాయంగా వస్తోంది.ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఫిఫా గెలిచిన జట్టులోని ఆటగాళ్లుకు 30 ప్రత్యేక ఉంగరాలను ఇప్పటికే తయారు చేయించి ఉంచారు. నార్త్ అమెరికా సంప్రదాయం ప్రకారం గెలిచిన జట్టు గుర్తింపును ప్రతిబింబించేలా ఈ ఉంగరాలను ఆటగాళ్ల వేలికి తొడగనున్నట్లు ఫిఫా తెలిపింది. అయితే ఆ ఉంగరాల ధర ఎంత ఉంటుందనేది మాత్రం ఫిఫా వెల్లడించలేదు.1893 నుంచి రింగుల ప్రదానంనార్త్ అమెరికాలో చాంపియన్లుగా నిలిచిన జట్లు లేదా వ్యక్తులకు రింగుల ప్రదాన సంప్రదాయం అనేది 1893 నుంచి కొనసాగుతోంది. ఆ సంవత్సరంలో మాంట్రియల్ హాకీ క్లబ్‌కు డొమినియన్ హాకీ ఛాలెంజ్ కప్ లభించింది. దీనినే ఇప్పుడు స్టాన్లీ కప్ అని పిలుస్తారు. ఆ జట్టు పైభాగంలో చిన్న హాకీ స్టిక్‌లు జతచేయబడిన సాధారణ పట్టీలను కూడా తయారు చేయించుకుంది.ఇక మేజర్ లీగ్ బేస్‌బాల్ జట్లు 1920ల్లో ఛాంపియన్షిప్ రింగులను ఇవ్వడం ప్రారంభించగా.. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) ఛాంపియన్‌షిప్‌లో మాత్రం 1940 నుంచి ఆ టోర్నీలో విజేతగా నిలిచిన జట్లకు రింగులను అందిస్తూ వస్తున్నారు. 1960ల నుంచి కొనసాగుతున్న సూపర్ బౌల్ శకంలో విజేతగా నిలిచిన ఎన్ఎఫ్ఎల్ జట్లు రింగులు అందుకుంటున్నాయి. జట్లతో పాటు వివిధ క్రీడల్లో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న దిగ్గజాలతో పాటు ప్రపంచ వేదికపై తమ దేశానికి (నార్త్ అమెరికా) ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు కూడా లభించే ప్రోత్సాహక ప్యాకేజీలో భాగంగా యూఎస్ ఒలింపియన్లు, పారాలింపియన్లు ఉంగరాలను అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది.చదవండి: ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా అతడే.. అర్జెంటీనాకు పీడకల! -
యామల్ ఒక్కడే కాదు.. ఈ ముగ్గురూ ఇప్పుడు మెస్సీకి ‘ప్రత్యర్థులే’!
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. న్యూజెర్సీ వేదికగా భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా- స్పెయిన్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ, స్పెయిన్ యువ సంచలనం లమీన్ యామల్‌పైనే నిలిచాయి.లాలపోసి జోల పాడాడునిజానికి కెరీర్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఏ ఆటగాడైనా... తన అభిమాన ప్లేయర్‌ను దగ్గర నుంచి చూడాలనో లేక అతడితో ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్ తీసుకోవాలనో కోరుకుంటాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చిన్నప్పుడు ఆశిష్ నెహ్రా చేతుల మీదుగా అవార్డు తీసుకొని మురిసిపోగా... శ్రేయస్ అయ్యర్ బాల్‌బాయ్‌గా ఉన్నప్పుడు ఇర్ఫాన్ పఠాన్ మాటలతో స్ఫూర్తిపొందాడు. ఇలా ఎవరైనా ఊహ వచ్చాకే తమ అభిమాన ఆటగాళ్లతో అనుబంధం పెంచుకుంటారు. కానీ, స్పెయిన్ ఫుట్‌బాల్ యువ సంచలనం లమీన్ యామల్ అనుభవం మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ఊహ తెలియక ముందే యామల్‌ను అతడి అభిమాన ప్లేయర్ ముద్దాడాడు. ఐదు నెలల వయసులోనే లాలపోసి జోల పాడాడు. ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా! కాదు నిజమే. అపుడు ఐదు నెలల పసికందు.. ఇపుడు ప్రత్యర్థిదాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటున్న ఓ యువ ఆటగాడు... ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదు నెలల పసికందును ఎత్తుకొని ముద్దుచేశాడు. కట్ చేస్తే... ఆ ఎత్తుకున్న వ్యక్తి ప్రస్తుతం అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ కాగా... ఆ ముద్దులొలికే బాబు స్పెయిన్ స్టార్ ప్లేయర్ లమీన్ యామల్. యూనిసెఫ్, బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో 2007లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు నెలల యామల్‌కు మెస్సీ స్నానం చేయించాడు. ఆ రోజు మెస్సీ చేతుల్లో ఆడుకున్న ఆ చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్ద వాడై అతడితోనే తలపడేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా వేదికగా ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫైనల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు అమీతుమీ తేల్చుకోనున్న నేపథ్యంలో... 19 ఏళ్ల నాటి ఫొటో సోషల్ మీడియాను ఊపేస్తోంది.అయితే ఏఐ యుగంలో ఈ ఫోటో నకిలీ అయి ఉంటుందని ప్రచారం జరగగా... యూనిసెఫ్ ప్రతినిధులు ఈ ఫొటో వెనక ఉన్న చరిత్రను తాజాగా వెల్లడించారు. 2008 యూనిసెఫ్ క్యాలెండర్ కోసం ఈ ఫొటోషూట్ నిర్వహించినట్లు తెలిపారు. హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తున్న ఈ నిజజీవిత కథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. యామల్ ఒక్కడే కాదు..ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. యామల్ ఒక్కడే కాదు.. ఫైనల్లో మెస్సీ బృందంతో తలపడనున్న స్పెయిన్ జట్టులో మరో ముగ్గురు కూడా మెస్సీతో చిన్ననాడే ఫొటోలకు ఫోజులిచ్చారు. వారు మరెవరో కాదు.. డానీ ఒల్మో (Dani Olmo), జోవాన్ గ్రేసియా (Joan Garcia), గవీ (Gavi).బార్సిలోనా మిడ్‌ఫీల్డర్ గవీకి మెస్సీ రోల్ మోడల్. ఇప్పుడు తన ఆరాధ్య ఫుట్‌బాలర్‌కు ప్రత్యర్థిగా అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక స్పెయిన్ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్‌గా, సెంట్రల్ మిడ్‌ఫీల్డర్‌గా డానీ పాత్ర కీలకం. బార్సిలోనాలో చాలా ఏళ్ల క్రితమే అతడు మెస్సీతో కలిసి ఫొటో దిగాడు. ఇప్పుడు తన అనుభవాన్ని డానీ.. తన రోల్ మోడల్ మెస్సీకి వ్యతిరేకంగా ఉపయోగించబోతున్నాడు. ఇక జోవాన్ గ్రేసియా స్పెయిన్ గోల్ కీపర్. చిన్నపుడు మెస్సీతో కలిసి అతడు సందడి చేశాడు. ఇప్పుడు మెస్సీ గోల్ కొట్టకుండా ఆపే అడ్డుగోడలా నిలబడేందుకు సిద్ధమయ్యాడు. ఇది విధి రాసిన కథఈ నేపథ్యంలో.. ‘ఇది విధి రాసిన కథ.. మెస్సీ చేతుల్లో నాడు ఒదిగిపోయిన చిన్నారులు నేడు.. అతడికే ప్రత్యర్థిగా మారడం నిజంగా నమ్మలేని విషయం’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా యామల్ ఫొటో నిజమే అని యూనిసెఫ్ ధ్రువీకరించగా.. మిగతా ముగ్గురితో ఉన్న ఫొటోలు మాత్రం బార్సిలోనా ఇండిపెండెంట్ న్యూస్ చానెల్ బార్కా యూనివర్సల్ ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో తెరమీదకు వచ్చాయి.చదవండి: రోహిత్, జైస్వాల్ కోసం నాడు గిల్ అలా చేశాడు! -
వైభవ్‌పై ఫార్ములా-1 స్టార్ రేసర్ ప్రశంసలు
భారత క్రికెట్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై ఫార్ములా-1 సంచలనం, రేసింగ్ బుల్స్ డ్రైవర్ అర్విడ్ లిండ్బ్లాడ్ (Arvid Lindblad) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రీడల్లో చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లలో వైభవ్ కూడా ఒకడని కొనియాడాడు.ఇటీవల ఇంగ్లండ్-భారత్ తొలి వన్డే సందర్భంగా స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన లిండ్బ్లాడ్.. సాంకేతికత అభివృద్ధి, చిన్న వయసులోనే మెరుగైన సమాచారం అందుబాటులోకి రావడం వల్ల యువ ఆటగాళ్లు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని చెప్పాడు."ఇది అన్ని క్రీడల్లో కనిపిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. చిన్న వయసులోనే సరైన సమాచారం, శిక్షణ లభిస్తోంది. అందుకే చాలా చిన్న వయసులోనే ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ, ఫుట్‌బాల్‌లో లమీన్ యమాల్ అందుకు మంచి ఉదాహరణలు. వైభవ్ చాలా చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ప్రపంచ క్రీడల స్వభావంగా మారింది" అని లిండ్బ్లాడ్ వ్యాఖ్యానించాడు.ఇదే సందర్భంగా తన భారతీయ మూలాల గురించి కూడా అతడు మాట్లాడాడు. తన అమ్మమ్మ, తాతయ్య పంజాబ్‌కు చెందిన వారని, భారతీయ సంస్కృతితో తనకు బలమైన అనుబంధం ఉందని తెలిపాడు. గతేడాది ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఎంతో ప్రత్యేకమని గుర్తు చేసుకున్నాడు. అలాగే తన అమ్మమ్మ వండే భారతీయ వంటకాలు తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.ఫార్ములా-1లో అడుగుపెట్టడం తన చిన్ననాటి కల అని, ఈ ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్‌లో అరంగేట్రం చేసిన సమయంలో భావోద్వేగానికి గురయ్యానని లిండ్బ్లాడ్ వెల్లడించాడు. చిన్నప్పుడు తండ్రితో కలిసి తొలిసారి వెళ్లిన సిల్వర్‌స్టోన్ ట్రాక్‌లోనే ఎఫ్1 డ్రైవర్‌గా రేస్ చేయడం జీవితంలో మరపురాని క్షణమని పేర్కొన్నాడు.అలాగే బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కలవడం ఆనందంగా అనిపించిందని చెప్పిన లిండ్బ్లాడ్, ఫార్ములా-1 కార్లు నడిపినా ఇప్పటికీ రోడ్డు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తీసుకోలేదని సరదాగా వ్యాఖ్యానించాడు. -
జాతీయ మహిళా షూటర్ ఆచూకీ లభ్యం
రెండు రోజుల కిందట అదృశ్యమైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాతీయ స్థాయి షూటర్ దమయంతి సేన్ (15) సురక్షితంగా ఇంటికి చేరింది. శనివారం ఉదయం హౌరా పోలీసులు ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు.హౌరాలోని రామ్కృష్ణపూర్ ఫెర్రీ జెట్టీ సమీపంలో ఒంటరిగా తిరుగుతుండగా గమనించిన మార్నింగ్ వాకర్స్ వెంటనే దమయంతి తండ్రి ధ్రువజ్యోతి సేన్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని, పోలీసుల సహకారంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లారు.గురువారం ఇంటి నుంచి ఒక పని కోసం వెళ్లిన దమయంతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు చేపట్టిన దర్యాప్తులో దమయంతి హౌరా రైల్వే స్టేషన్‌లోని 4, 5 ప్లాట్‌ఫారమ్‌ల వద్ద సంచరించినట్లు తెలిసింది. దమయంతి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, క్రీడా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.కారణాలు ఏంటి..?అయితే దమయంతి అదృశ్యానికి గల అసలు కారణాలపై పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదువుల ఒత్తిడి, షూటింగ్ శిక్షణకు సంబంధించిన ఒత్తిడి వంటి అంశాలను కూడా విచారణలో పరిశీలిస్తున్నారు. దీనిపై పోలీసులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు. -
స్పెయిన్ యువ సంచలనం పేరు వెనుక ఆసక్తికర కథ
స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ పేరు వెనుక ఓ భావోద్వేగ కథ ఉంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఈ యువ ఆటగాడి పూర్తి పేరు లమీన్ యమాల్ నస్రౌయి ఎబానా (Lamine Yamal Nasraoui Ebana).స్పెయిన్ సంప్రదాయం ప్రకారం తండ్రి ఇంటి పేరు నస్రౌయి, తల్లి ఇంటి పేరు ఎబానా. అయితే ఫుట్‌బాల్ ప్రపంచంలో అతను లమీన్ యమాల్ పేరుతోనే గుర్తింపు పొందాడు.యమాల్ తండ్రి మౌనిర్ నస్రౌయి మొరాకోకు చెందినవాడు. తల్లి షీలా ఎబానా ఈక్వటోరియల్ గినియాలో జన్మించారు. యమాల్ పుట్టినప్పుడు ఇద్దరూ చాలా చిన్న వయసులో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన ఇద్దరు స్నేహితుల పేర్లు లమీన్ మరియు యమాల్. వారి సహాయానికి కృతజ్ఞతగా తమ కుమారుడికి 'లమీన్ యమాల్' అని పేరు పెట్టినట్లు స్పానిష్ మీడియా వెల్లడించింది. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. (Story Behind Lamine Yamal Name)'లమీన్' అనే పేరు అరబిక్‌లో నమ్మకమైన వ్యక్తి, నిజాయితీ గలవాడు అనే అర్థం ఇస్తే, 'యమాల్' (జమాల్) అంటే అందం, సొగసు, ఆకర్షణ అనే అర్థాలు ఉన్నాయి.2007లో జన్మించిన యమాల్, చిన్నతనంలోనే బార్సిలోనా లా మాసియా అకాడమీలో చేరి అసాధారణ ప్రతిభతో ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు స్పెయిన్ జాతీయ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగిన యమాల్, తన పేరులో దాగి ఉన్న ఈ భావోద్వేగ కథతో మరోసారి అభిమానులకు చేరువయ్యాడు.ఇదిలా ఉంటే, జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనా-స్పెయిన్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మ్యాచ్ నేపథ్యంలో యమాల్, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ మధ్య కొన్ని యాదృచ్ఛిక విషయాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. వీరిద్దరికి 19 సంఖ్యతో ముడిపడిన అనుబంధం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.2007లో యునిసెఫ్ నిర్వహించిన ఛారిటీ ఫోటోషూట్‌లో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, ఆరు నెలల చిన్నారి యమాల్‌కు స్నానం చేయించాడు. అదే చిన్నారి ఇప్పుడు 2026 ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీకి ప్రత్యర్థిగా నిలబడ్డాడు.ఈ ఫోటోషూట్‌కు సరిగ్గా 19 ఏళ్ల తర్వాత జులై 19న జరిగే ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ-యమాల్ ఒకరినొకరు ఎదుర్కోనున్నారు.ప్రపంచకప్ ఫైనల్‌కు కొద్ది రోజుల ముందే (జూలై 13) యమాల్ తన 19వ పుట్టినరోజు జరుపుకున్నాడు.మెస్సీ, యమాల్ తమ మొదటి ప్రపంచకప్ గోల్‌ను 18 ఏళ్ల వయసులో, 19వ నంబర్ జెర్సీ ధరించి నమోదు చేయడం మరింత ఆశ్చర్యకరం. -
19తో ముడిపడ్డ మెస్సీ-యమాల్ అనుబంధం
ఫిఫా వరల్డ్‌కప్ 2026 తుది అంకానికి చేరింది. అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్‌కు చేరాయి. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఈ రెండు జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇరు జట్లకు చెందిన స్టార్ ఆటగాళ్లు లియోనల్ మెస్సీ (అర్జెంటీనా), లమీన్ యమాల్ (స్పెయిన్) మధ్య కొన్ని యాదృచ్ఛిక విషయాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా 19 సంఖ్యతో మెస్సీ-యమాల్‌కు ముడిపడిన అనుబంధం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.2007లో యునిసెఫ్ నిర్వహించిన ఛారిటీ ఫోటోషూట్‌లో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, ఆరు నెలల చిన్నారి యమాల్‌కు స్నానం చేయించాడు. అదే చిన్నారి ఇప్పుడు 2026 ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీకి ప్రత్యర్థిగా నిలబడ్డాడు.ఈ ఫోటోషూట్‌కు సరిగ్గా 19 ఏళ్ల తర్వాత జులై 19న జరిగే ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ-యమాల్ ఒకరినొకరు ఎదుర్కోనున్నారు. ప్రపంచకప్ ఫైనల్‌కు కొద్ది రోజుల ముందే (జూలై 13) యమాల్ తన 19వ పుట్టినరోజు జరుపుకున్నాడు.మెస్సీ, యమాల్ తమ మొదటి ప్రపంచకప్ గోల్‌ను 18 ఏళ్ల వయసులో, 19వ నంబర్ జెర్సీ ధరించి నమోదు చేయడం మరింత ఆశ్చర్యకరం.ఒకప్పుడు తాను స్నానం చేయించిన చిన్నారి... ఇప్పుడు ప్రపంచకప్ కిరీటం కోసం తనతో పోటీపడటాన్ని మెస్సీ సహా ప్రపంచమంతా నమ్మలేకపోతుంది. ఈ విషయాలు ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన యాదృచ్ఛికాలుగా నిలిచిపోతాయి. -
బుడాపెస్ట్ సిరీస్‌లో భారత రెజ్లర్ల హవా
హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న పోల్యాక్ ఇమ్రే, వర్గా జానోస్ & కొజ్మా ఇస్త్వాన్ మెమోరియల్ సీనియర్ ర్యాంకింగ్ సిరీస్-2026లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. మూడో రోజు పోటీల్లో మాజీ అండర్-17 ప్రపంచ చాంపియన్ నేహా మహిళల 59 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలవగా, మాన్సీ 62 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకుంది.59 కేజీల ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగైల్ ఈ.నెట్ పై నేహా 6-4 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని అందుకుంది. ఈ విజయంతో టోర్నీలో భారత్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. తొలి రోజు ఒలింపిక్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.మహిళల 62 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన మాన్సీ, కెనడాకు చెందిన అనా పి. గోడినెజ్ గోన్జాలెజ్తో తలపడింది. అయితే గాయం కారణంగా మ్యాచ్‌ను పూర్తి చేయలేక రజత పతకంతో సరిపెట్టుకుంది.అదే విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సవిత కజకిస్థాన్‌కు చెందిన ఇరీనా కుజ్నెత్సోవాపై 14-5తో ఘన విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.మూడో రోజు ముగిసే సరికి భారత్ ఖాతాలో మొత్తం 8 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.భారత్ పతకాల వివరాలు:మహిళలు* 59 కేజీలు: నేహా – స్వర్ణం* 55 కేజీలు: హన్సికా లాంబా – రజతం* 62 కేజీలు: మాన్సీ – రజతం* 62 కేజీలు: సవిత – కాంస్యంపురుషుల ఫ్రీస్టైల్* 57 కేజీలు: అమన్ సెహ్రావత్ – స్వర్ణం* 61 కేజీలు: దీపక్ – కాంస్యం* 65 కేజీలు: విశాల్ కలీరామన్ – కాంస్యం* 125 కేజీలు: రజత్ రూహల్ – కాంస్యం -
జపాన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండేళ్ల తర్వాత మరోసారి వరల్డ్ టూర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి, చైనా స్టార్ చెన్ యుఫేయిపై 21-19, 15-10తో విజయం సాధించి తొలిసారి ఈ టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది.ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధు దూకుడుగా ఆడి ఆధిక్యం సాధించింది. యుఫేయి గట్టి పోటీ ఇచ్చినా కీలక సమయంలో సింధు వరుస పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇద్దరి మధ్య జరిగిన 51 షాట్ల సుదీర్ఘ ర్యాలీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.రెండో గేమ్‌లో కూడా సింధు అదే జోరు కొనసాగించింది. అయితే హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్న చెన్ యుఫేయి మ్యాచ్‌ను మధ్యలోనే విరమించుకోవడంతో సింధు విజేతగా నిలిచింది. ఈ విజయంతో యుఫేయిపై వరుసగా ఐదు ఓటముల తర్వాత సింధు ప్రతీకారం తీర్చుకుంది.2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు ఏ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరలేదు. రెండేళ్ల నిరీక్షణకు తెరదించిన ఆమె జపాన్ ఓపెన్ ఫైనల్లో ఆతిథ్య జపాన్‌కు చెందిన అకానే యమగుచి లేదా ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వార్దానితో తలపడనుంది.ఈ టోర్నీలో ఇప్పటికే ప్రపంచ నంబర్-5 హాన్ యూయేను ఓడించిన సింధు, సెమీఫైనల్లో మరో అద్భుత ప్రదర్శనతో టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. -
మూడో స్థానం కోసం ఫ్రాన్స్, ఇంగ్లండ్ మధ్య పోరు
ఫిఫా ప్రపంచకప్-2026లో ఫైనల్‌కు చేరాలన్న కల నెరవేరకపోయినా, టోర్నీని విజయంతో ముగించాలని ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. శనివారం జరిగే మూడో స్థానం ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో ఈ రెండు యూరోపియన్ దిగ్గజాలు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ అర్దరాత్రి (జులై 19) 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్, అర్జెంటీనా చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ (మూడో స్థానం) ఆడాల్సి రావడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు స్పష్టం చేశారు."ఈ మ్యాచ్ ఆడాలని ఎవరూ కోరుకోలేదు"ఫ్రాన్స్ డిఫెండర్ ఇబ్రహిమా కొనాటే మాట్లాడుతూ, "మేమంతా ఫైనల్లో ఆడాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు ఇలా మారాయి. ఇప్పుడు మూడో స్థానం కోసం అయినా గెలిచి టోర్నీని ముగించాలని చూస్తున్నాం" అని తెలిపాడు.తుచెల్పై విమర్శలు.. జట్టులో మార్పులుఅర్జెంటీనాతో సెమీఫైనల్లో వ్యూహాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లండ్ కోచ్ థామస్ తుచెల్, ఈ మ్యాచ్‌లో జట్టులో మార్పులు చేస్తామని వెల్లడించారు."ఈ మ్యాచ్ ఆడాలని ఎవరికీ ఉండదు. కానీ ఇది ప్రపంచకప్ అధికారిక మ్యాచ్. గత 60 ఏళ్లలో ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమ ప్రపంచకప్ ఫలితం సాధించే అవకాశం. ఆటగాళ్ల పోరాట పటిమను మరోసారి చూపించాల్సిన సమయం ఇది" అని తుచెల్ అన్నారు.సెమీఫైనల్లో చివరి నిమిషాల్లో ఆధిక్యాన్ని కోల్పోవడంపై బాధ్యత తనదేనని కూడా ఆయన అంగీకరించారు.గోల్డెన్ బూట్ రేసులో ఎంబపేఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబపే ఈ మ్యాచ్‌లో మరో లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 గోల్స్ చేసిన అతడు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీతో సమానంగా ఉన్నాడు. అయితే నాలుగు అసిస్టులతో మెస్సీ ఆధిక్యంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ తలో ఆరు గోల్స్‌తో పోటీలో ఉన్నారు.ఇదిలా ఉంటే, అర్జెంటీనా-స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
పీలే జెర్సీకి రూ. 47 కోట్లు
న్యూయార్క్: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే జెర్సీకి భారీ ధర పలికింది. స్వీడన్ ఆతిథ్యమిచ్చిన 1958 ప్రపంచకప్ ఫైనల్లో బ్రెజిల్ 5–2 గోల్స్‌తేడాతో స్వీడన్‌ను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. టైటిల్ పోరులో పీలే జెర్సీ నంబర్–10 ధరించి బరిలోకి దిగి రెండు గోల్స్ కూడా సాధించాడు. 1958 ఫైనల్లో పీలే ధరించి ఆడిన జెర్సీని న్యూయార్క్‌లోని ఆన్లైన్ వేలం సంస్థ సోథెబై వేలానికి పెట్టింది. వేలంలో ఓ అజ్ఞాత అభిమాని పీలే జెర్సీని 49 లక్షల డాలర్లకు (రూ. 47 కోట్లు) సొంతం చేసుకున్నాడు. 2022లో మృతి చెందిన పీలే 1958, 1962, 1970 ప్రపంచకప్ టైటిల్స్ గెలిచిన బ్రెజిల్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గాయం కారణంగా పీలే 1962 ఫైనల్లో ఆడలేదు. 1958 జట్టు సహచరుడు దీదాకు పీలే తన జెర్సీని బహుమానంగా ఇచ్చాడు. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు ఈ జెర్సీ దీదా కుటుంబసభ్యులతో ఉంది. 2004లో బ్రెజిల్ మ్యూజియం అధికారులు దీనిని తీసుకోగా.. ఆ తర్వాత వేరే వ్యక్తులు దీనిని తమ సొంతం చేసుకొని చివరకు వేలంలో పెట్టారు. -
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు ట్రంప్
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగనున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. ఈ సమాచారాన్ని వైట్‌హౌస్ అధికారికంగా ధృవీకరించింది.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్ శుక్రవారం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఫిఫా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.ఇప్పటికే ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో కూడా ఫైనల్ అనంతరం ట్రంప్‌తో కలిసి విజేత జట్టుకు ప్రపంచకప్ ట్రోఫీ అందజేస్తామని ప్రకటించారు.అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన 102 మ్యాచ్‌లకు ట్రంప్ గానీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గానీ హాజరుకాలేదు. అయితే అమెరికా జట్టు ఆడిన కొన్ని మ్యాచ్‌లకు కేబినెట్ సభ్యులు హాజరయ్యారు.అమెరికా చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన, అత్యంత భద్రతతో నిర్వహించిన, అత్యంత విజయవంతమైన ప్రపంచకప్‌కు ట్రంప్ హాజరుతో ఘన ముగింపు లభిస్తుందని లెవిట్ పేర్కొన్నారు.ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే, ఇటీవల అమెరికా ఆటగాడు ఫోలారిన్ బాలోగన్ రెడ్‌కార్డు సస్పెన్షన్ వ్యవహారంలో ట్రంప్ ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినోతో మాట్లాడిన విషయం వివాదాస్పదమైంది. ట్రంప్ విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్ణయ ప్రక్రియలో తాను జోక్యం చేసుకోలేదని ఇన్ఫాంటినో స్పష్టం చేశారు.అనంతరం బాలోగన్పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా తాత్కాలికంగా ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ, ప్రీక్వార్టర్‌లో బెల్జియం చేతిలో అమెరికా 1-4 తేడాతో ఓటమి పాలైంది. -
15 ఏళ్ల జాతీయస్థాయి క్రీడాకారిణి అదృశ్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జాతీయ స్థాయి మహిళా షూటర్ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హౌరాలోని తమ ఇంటినుంచి గురువారం సాయంత్రం బయటకు వెళ్లిన దమయంతి సేన్ అనే 15 ఏళ్ల షూటర్.. అటు తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి అవసరాల కోసం సరుకులు తేవడానికి వెళ్లిన ఆమె.. చివరిసారి రైల్వే స్టేషన్లో కనిపించింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమార్తె ఎందుకు తిరిగి రాలేదో అనే విషయం అర్థం కాక సతమతమవుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆమె చివరిసారి హౌరా రైల్వే స్టేషన్లో కనిపించిన దృశ్యాలు తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర షూటింగ్ క్రీడా వర్గాల్లో కూడా తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. తమతో ఎటువంటి విభేదాలు కూడా దమయంతికి లేవని, ఎందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదో తెలియడం లేదంటున్నారు. పింక్ టీ షర్ట్ ధరించి ఉన్న తమ అమ్మాయి ఎక్కడైనా, ఎవరికైనా కనిపిస్తే దయచేసి సమాచారం తెలపాలని వారు విన్నవించుకున్నారు. జాతీయ ట్రయల్స్‌కు ఎంపికైన తర్వాత దమయంతి ప్రతిరోజూ ప్రాక్టీస్ కోసం తెల్లవారుజామునే లేస్తూ, ఒక కఠినమైన దినచర్యను పాటించేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కుటుంబంలో ఇటీవల ఎలాంటి విభేదాలు లేవని వారు చెప్పారు.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌరా స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో గురువారం ఆమె నాలుగు, ఐదు ప్లాట్‌ఫారాల మధ్య తిరుగుతున్నట్లు కనిపించిందన్నారు. సీసీ కెమెరాలో ఆమె దొరికిన తర్వాత, ఆమె కదలికలను నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆమె వద్ద మొబైల్ ఫోన్ కూడా ఉన్నట్లు తెలిపారు. షూటింగ్ వర్గాల్లో కలకలం..పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైఫిల్ షూటర్ దమయంతి సేన్ ఇటీవల ప్రతిష్టాత్మకమైన జాతీయ జట్టు ఎంపిక ట్రయల్స్‌కు ఎంపికై తన క్రీడా జీవితంలోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంది. సెంట్రల్ హౌరాకు చెందిన దమయంతి.. కోల్‌కతాలోని ప్రముఖ ఒలింపియన్ జాయ్దీప్ కర్మాకర్ రైఫిల్ షూటింగ్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి జూనియర్ షూటింగ్ స్క్వాడ్ ట్రయల్స్‌కు అర్హత సాధించడం ఆమె సాధించిన అతిపెద్ద ఘనత. ఈ ఎంపిక ద్వారా ఆమె భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అత్యంత కీలకమైన అవకాశాన్ని దక్కించుకుంది ఈ తరుణంలో ఆమె మిస్సింగ్ వార్త రాష్ట్రంలోని షూటింగ్ వర్గాల్లో కలకలంగా మారింది. -
15 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలిసారి సెమీస్‌లో సింధు
జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీలో భారత టాప్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మాజీ నంబర్‌వన్ నొజోమి ఒకుహరా రిటైర్డ్ కావడంతో సింధుకు సెమీస్‌కు వాకోవర్ లభించింది. దీంతో 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పీవీ సింధు తొలిసారి జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరింది. ఈ నేపథ్యంలో సైనా నెహ్వాల్ (2011) తర్వాత జపాన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన రెండో క్రీడాకారిణిగా సింధు రికార్డులకెక్కింది. సెమీస్‌లో సింధు చైనాకు చెందిన చెన్ యూఫీని ఎదుర్కోనుంది. అయితే క్వార్టర్స్‌లో ఒకుహరా, సింధు తలపడతారని తెలియగానే హోరాహోరీ పోరు తప్పదని అభిమానులంతా భావించారు. ఈ ఇద్దరు ఇప్పటివరకు వివిధ బీడబ్ల్యూఎఫ్ టోర్నీల్లో 17 సార్లు తలపడితే సింధూ 9-8తో ఒకుహరాపై ఎడ్జ్ అడ్వాంటేజ్‌తో పైచేయిలో ఉంది. జపాన్ ఓపెన్‌లో సింధు మొదటినుంచి మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌ను చిత్తు చేసిన సింధు ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యును 35 నిమిషాల్లోనే చిత్తు చేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.2026 సీజన్లో పీవీ సింధు స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తుంది. మలేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో సెమీస్ చేరిన సింధు ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 టోర్నీలోనూ సెమీస్‌లో అడుగుపెట్టినప్పటికీ జపాన్ స్టార్ యమాగుచి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక జపాన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన సింధు ఈసారి టైటిల్ కొట్టాలనే ధృడ సంకల్పంతో ఉంది. తన స్థిరమైన ప్రదర్శన కారణంగా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో మూడేళ్ల తర్వాత పీవీ సింధు టాప్-10లో మరోసారి చోటు దక్కించుకోవడం విశేషం. #News 🏸 PV Sindhu advances to the Japan Open semifinals after receiving a walkover from Japan's Nozomi Okuhara.She will next face former Olympic champion Chen Yufei. 🇮🇳🔥#PVSindhu #JapanOpen #Badminton pic.twitter.com/HNSxbf5eVb— The Bridge (@the_bridge_in) July 17, 2026Read: రోహిత్ భవితవ్యంపై టీమిండియా కోచ్ స్పందన! -
అర్జెంటీనా ఫ్యాన్స్ దుశ్చర్య.. ఇంగ్లండ్‌కు అవమానం!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరిన తర్వాత ఆ దేశ అభిమానుల సంబురాలు శ్రుతిమించాయి. ఆట వరకు గెలుపోటములు సహజమైనప్పటికీ అర్జెంటీనా ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లండ్ జాతీయ జెండాను కిందపడేసి కాళ్లతో తొక్కి ఓవరాక్షన్‌కు పాల్పడ్డారు. విషయంలోకి వెళితే.. అర్జెంటీనా సెమీస్ గెలిచిన తర్వాత ఆ దేశంలో అభిమానుల సంబురాలు మిన్నంటాయి. అర్జెంటీనా రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లోకి భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్.. నృత్యాలు, అరుపులతో చెవుల మోత మోగించారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో కొంతమంది అభిమానులు హద్దు మీరారు. ఇంగ్లండ్ జాతీయ జెండాను పోలిన ఒక పప్పెట్‌ను కిందపడేసి, దానిపై ఇంగ్లండ్ జాతీయ జెండాను ఉంచారు. ఇంగ్లండ్ జెండాపై ఉమ్మివేయడంతో పాటు చాలా మంది ఆ జెండాను కాళ్ల కిందేసి తొక్కిన దృశ్యాలు, వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానుల చర్య పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. ‘అభిమానం ఉండడం మంచిదే కానీ అది హద్దుమీరకూడదు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఫిఫా సెమీస్‌లో విజయం తర్వాత మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది. సెలబ్రేషన్స్ సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్‌ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.మ్యాచ్ విషయానికొస్తే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయాన్ని అందుకొని వరుసగా రెండో ఫిఫాలో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది. Argentina fans spat on and trampled the England flag under their feet. pic.twitter.com/pfPzzgZkIV— The Resonance (@Partisan_12) July 16, 2026చదవండి: ‘రోహిత్ రిటైర్మెంట్పై కోహ్లి రియాక్షన్ వైరల్!’ -
అపశకునం ముద్ర.. ఫైనల్‌కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు!
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనుంది. ఏ టోర్నీలో అయినా తమ దేశం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే సదరు దేశాధ్యక్షుడు లైవ్‌లో చూడాలని ఆశించడం సహజం. కానీ అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తున్నారు. మూడ నమ్మకాల నెపంతో అర్జెంటీనా ఆడనున్న ఫిఫా పైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో కాకుండా ఇంట్లోనే టీవీలో వీక్షించాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఒక అర్జెంటీనా అధ్యక్షుడు లైవ్‌లో ఫిఫా మ్యాచ్ చూడడం వల్ల అర్జెంటీనా ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో సదరు అధ్యక్షుడిపై ‘అపశకునం’ ముద్ర వేశారు. దీంతో ఆ సెంటిమెంట్‌కు భయపడి తాజా ఫిఫా ఫైనల్‌కు జావియర్ మిలే దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఫిఫా ఫైనల్‌కు జావియర్ మిలే దూరమవ్వడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. మూడనమ్మకమా లేదా సెంటిమెంట్.. ఇలా ఏది అనుకున్నా తాను మాత్రం ఫైనల్ మ్యాచ్‌ను మాత్రం టీవీలోనే వీక్షిస్తానని అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే అధికారులకు తెగేసి చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. మెస్సీకి వీరాభిమాని అయిన అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఆడిన ఏడు మ్యాచ్‌లను తన ఇంటిలోనే వీక్షించారు. ఈ ఏడింటిలో ఒక్క ఓటమి, డ్రా కానీ చేసుకోని అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టింది. మరో విశేషమేమిటంటే జావియర్ మిలే తన హెవి జాకెట్‌ను ధరించి ఈ మ్యాచ్‌లన్నింటిని వీక్షించారట. కాబట్టి ఫైనల్ మ్యాచ్‌కు కూడా అదే హెవీ జాకెట్‌ను ధరించనున్నట్లు అర్జెంటీనా అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్‌లో మూడ నమ్మకాలు కొత్తవేమి కావు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ సందర్భంగా అర్జెంటీనా అభిమానులు మూడ నమ్మకాల పేరిట కాబాలస్ (ప్రీజర్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల ఫొటోలు ఉంచడం) సహా చాలా మంది అభిమానులు అర్జెంటీనా గెలవాలంటూ తాము నమ్మే దైవాన్ని ప్రార్థించడం వైరల్‌గా మారింది.తాజాగా ఒక దేశాధ్యక్షుడే ఇవాళ మూడ నమ్మకం పేరుతో ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో కాకుండా ఇంట్లోనే చూస్తానని చెప్పడం ఆసక్తికర విషయంగా మారిపోయింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు కావడంతో జావియర్ మిలేకు ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆహ్వానం కూడా వచ్చింది. 'మీ స్నేహితుడు ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోలతో కలిసి ఆదివారం ఫిఫా పైనల్ చూసేందుకు న్యూజెర్సీ వెళ్తున్నారా' అని అడిగితే.. 'లేదు అస్సుల వెళ్లను.. ఒలివోస్లోని నా ఇంటి నుంచే ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తాను' అని అర్జెంటీనా అధ్యక్షుడు బదులివ్వడం విశేషం.అధ్యక్షుడిపై అపశకునం ముద్రతమ జట్లకు దురదృష్టం వెంటాడుతుందేమోనని అర్జెంటీనా అధ్యక్షులు చాలా కాలంగా కీలకమైన ప్రపంచకప్ మ్యాచ్‌లకు హాజరయ్యే విషయంలో జాగ్రత్త వహిస్తూ వస్తున్నారు. ఈ మూఢనమ్మకం 1990 టోర్నమెంట్ నాటిది. అప్పుడు అర్జెంటీనా అధ్యక్షుడిగా ఉన్న కార్లోస్ మెనెమ్.. ఆనాటి ప్రపంచకప్‌లో కామెరూన్, అర్జెంటీనా మ్యాచ్‌కు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టు కామెరున్ జట్టుతో పోరులో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. దీంతో అధ్యక్షుడు మెనెమ్పై “ముఫా (అపశకునం) అని ముద్ర వేశారు. అప్పటి నుంచి ఫిఫా ప్రపంచకప్ ఎక్కడ జరిగినప్పటికీ ఏ అర్జెంటీనా అధ్యక్షుడు కూడా జాతీయ జట్టు మ్యాచ్‌కు హాజరుకాకపోవడం విశేషం.చదవండి: అర్జెంటీనాతో ఫైనల్.. స్పెయిన్‌ను వణికిస్తున్న గాయం! -
అర్జెంటీనాతో ఫైనల్.. స్పెయిన్‌ను వణికిస్తున్న గాయం!
ఫిఫా ప్రపంచకప్ 2026 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ అమీతుమీకి సిద్ధమైంది. అయితే 16 ఏళ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని కలలు కంటున్న స్పెయిన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లామినె యమాల్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. స్పెయిన్ ప్రాక్టీస్ సమయంలో లామినె తొడకు పెద్ద కట్టు వేసుకున్న ఫొటోలు బయటికి వచ్చాయి. తొడ నొప్పితో బాధపడుతున్న యమాల్‌కు ఫిజియో చికిత్స చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. నొప్పితో బాధపడిన యామినే లమాల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయాడు. ఫ్రాన్స్‌తో జరిగిన సెమీస్‌లో ఆట 22వ నిమిషంలో లుకాస్ డిగ్నే పెనాల్టీ బాక్స్ వద్ద లామినె యమాల్‌ను కిందపడేయడంతో అతని ఎడమ తొడకు తీవ్ర గాయమైంది. అయితే నొప్పిని భరిస్తూనే యమాల్ మ్యాచ్ మొత్తం కొనసాగాడు. స్పెయిన్ విజయం తర్వాత హోటల్ రూమ్‌కు చేరిన అనంతరం లామినె తొడనొప్పి మరింత తీవ్రతరమైనట్లు సమాచారం.దీంతో స్పెయిన్ జట్టు బస చేస్తున్న డల్లాస్‌లోని హోటల్‌కే వైద్య సిబ్బందిని పిలిపించి లమాల్కు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే అతడి ఎడమ తొడకు భారీ కట్టు కట్టినట్లు తెలుస్తోంది. తొడ గాయంతో ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయిన లామినె యమాల్ అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 19 ఏళ్ల లామినె యమాల్ స్పెయిన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ మాత్రమే చేసినప్పటికీ జట్టుపై అతడి ప్రభావం చాలానే ఉంటుంది. 🚨 BREAKING: Lamine Yamal is not training with Spain due to discomfort. pic.twitter.com/jv8d9OsnIr— barcacentre (@barcacentre) July 16, 2026Read: టీ20లపై మోజు.. వన్డేలు ఆడడం మరిచిన విండీస్! -
క్వార్టర్ ఫైనల్లో సింధు
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21–16, 21–14తో ప్రపంచ 5వ ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై సంచలన విజయం సాధించింది. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. హాన్ యువెపై సింధుకిది ఎనిమిదో విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడుతుంది. వీరిద్దరు ఇప్పటి వరకు 20 సార్లు ముఖాముఖి తలపడ్డారు. 11 సార్లు సింధు, 9 సార్లు ఒకుహారా గెలుపొందారు. ఈ ఏడాది సింధు పది టోర్నీల్లో బరిలోకి దిగగా... ఆరు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీ తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల కథ ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ ద్వయం 20–22, 17–21తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంట ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
సాహో అర్జెంటీనా
జగజ్జేత జట్టు ఆట ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు మరోసారి ప్రపంచానికి చూపించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరడం... ఎలాంటి స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడటం... ప్రత్యర్థి జట్ల ఆశలను చివరి క్షణాల్లో గల్లంతు చేయడం... ఏ లక్ష్యంతోనైతే అడుగు పెట్టామో దానిని ఎలా సాధించాలో ... తమను చూసి నేర్చుకోవాలని అర్జెంటీనా చాటి చెప్పింది. మరోవైపు ఇంగ్లండ్‌కు మూడోసారి కూడా ప్రపంచకప్ సెమీఫైనల్ పీడకలగా మారిపోయింది. ఆధిక్యంలో ఉన్నామన్న ధీమాతో... మేటి జట్లను తక్కువ అంచనా వేస్తే చివరకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఇంగ్లండ్‌కు మరోసారి అనుభవమైంది. అట్లాంటా: వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందేందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ఒక్క విజయం దూరంలో నిలిచింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ముగిసిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. అర్జెంటీనా తరఫున ఎంజో ఫెర్నాండెజ్ (85వ నిమిషంలో), సబ్‌స్టిట్యూట్ లాటారో మార్టినెజ్ (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్ జట్టుకు ఆంథోనీ గోర్డాన్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. కెప్టెన్ మెస్సీ అందించిన పాస్‌లతోనే అర్జెంటీనా రెండు గోల్స్ నమోదు చేయడం విశేషం. 85వ నిమిషం వరకు 0–1తో వెనుకబడిన అర్జెంటీనా ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి మరో అద్భుతం నమోదు చేసింది. ఈజిప్ట్ తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–2తో వెనుకబడ్డాక 13 నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా మూడు గోల్స్ కొట్టి అనూహ్య విజయం అందుకున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి న్యూజెర్సీ వేదికగా జరిగే ఫైనల్లో ప్రస్తుత యూరోపియన్ చాంపియన్, 2010 ప్రపంచకప్ విజేత స్పెయిన్ జట్టును అర్జెంటీనా ‘ఢీ’కొంటుంది. తుది పోరులో అర్జెంటీనా విజయం సాధిస్తే... ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టైటిల్స్ గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. ప్రపంచకప్‌లో ఏడోసారి ఫైనల్‌కు చేరుకున్న అర్జెంటీనా మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా, మూడుసార్లు (1930, 1990, 2014) రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్ చేరుకునే క్రమంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన అర్జెంటీనా కీలక సమరంలోనూ సత్తా చాటింది. 55వ నిమిషంలో ఇంగ్లండ్‌కు గోల్ సమర్పించుకున్న అర్జెంటీనా ఆ తర్వాత అసలు సిసలు ఆటతీరును కనబరిచింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. అవకాశం దొరికినపుడల్లా ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ దిశగా దూసుకెళ్లాడు. 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఇంగ్లండ్ మరీ రక్షణాత్మకంగా ఆడింది. ఎలాగైనా అర్జెంటీనాను గోల్ చేయనీకుండా నిలువరించాలన్న ధ్యేయంతో కనిపించింది. గోల్‌కీపర్‌తో కలిపి రక్షణశ్రేణిలో తొమ్మిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు కనిపించారు. మరోవైపు స్కోరును సమం చేయాలన్న కసితో అర్జెంటీనా దాడుల్లో పదును పెంచింది. రెండుసార్లు దాదాపు గోల్ అయినట్లే కనిపించింది. ఇంగ్లండ్ గోల్‌కీపర్ పిక్ఫర్డ్ అప్రమత్తతతో రెండుసార్లు గోల్ కాకుండా నిలువరించాడు. 69వ నిమిషంలో నికో గొంజాలెజ్ షాట్‌ను... 76వ నిమిషంలో మాక్ అలిస్టర్ షాట్‌ను పిక్ఫర్డ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత అలిస్టిర్ కొట్టిన షాట్ ఒకటి ఇంగ్లండ్ గోల్‌పోస్ట్‌కు తగిలి వెనక్కి వచ్చింది. ఓవరాల్‌గా 55 నిమిషం నుంచి 85వ నిమిషం వరకు బంతి అర్జెంటీనా ఆధీనంలో 88 శాతం, ఇంగ్లండ్ ఆ«దీనంలో 12 శాతం ఉండటం గమనార్హం. ఎట్టకేలకు 85వ నిమిషంలో అర్జెంటీనా స్కోరు సమం చేయడంలో సఫలమైంది. మెస్సీ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియా పైభాగంలో అందుకున్న ఎంజో ఫెర్నాండెజ్ కళ్లు చెదిరే కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఆ తర్వాత 90+2 నిమిషంలో మెస్సీ అందించిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియా లోపల ఇద్దరు ఇంగ్లండ్ డిఫెండర్లకంటే ఎత్తుకు ఎగిరిన మార్టినెజ్ హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో అర్జెంటీనా 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. స్టాపేజ్ సమయంలోని మిగిలిన సమయంలో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి అర్జెంటీనా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో ఇంగ్లండ్ కేవలం ఐదుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టింది. ఈ టోర్నీలో ఆరు గోల్స్ చొప్పున కొట్టి నిలకడగా రాణించిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెలింగ్‌హమ్ కీలకమైన సెమీస్‌లో ఆకట్టుకోలేకపోయారు. 1966లో చివరిసారి ఫైనల్ చేరి టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత మూడుసార్లు (1990, 2018, 2026) సెమీఫైనల్లో ఓడిపోయింది. 19 ప్రస్తుత ప్రపంచకప్‌లో అర్జెంటీనా చేసిన గోల్స్. ఒకే ప్రపంచకప్‌లో అర్జెంటీనా సాధించిన అత్యధిక గోల్స్ ఇవే కావడం విశేషం. 1930 లో అర్జెంటీనా 18 గోల్స్ నమోదు చేసింది.6 ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా ఆడిన ఆరు సెమీఫైనల్స్‌లోనూ (1930, 1986, 1990, 2014, 2022, 2026) నెగ్గింది. అర్జెంటీనా తొలిసారి విజేతగా నిలిచిన 1978 ప్రపంచకప్ లో సెమీస్ జరగలేదు. 8 జట్లను 2 గ్రూప్‌లుగా విభ జించారు. గ్రూప్ విన్నర్స్‌గా అర్జెంటీనా, నెదర్లాండ్స్ ఫైనల్లో ఆడాయి. -
19 ఏళ్ల క్రితం స్నానం చేయించిన 'ఆ' చిన్నారే ఫైనల్లో మెస్సీ ప్రత్యర్ది
ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న అరుదైన ఘటనకు 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ వేదిక కానుంది. 19 ఏళ్ల క్రితం తాను స్నానం చేయించిన చిన్నారినే అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ, ప్రపంచకప్ ఫైనల్లో ఎదుర్కోనున్నాడు. కాలం రాసిన ఈ అద్భుత కథ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.2007లో యునిసెఫ్ నిర్వహించిన ఓ సేవా కార్యక్రమంలో భాగంగా "డియారియో స్పోర్ట్" అనే పత్రిక ఓ ఫొటోషూట్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, యాదృచ్ఛికంగా ఎంపికైన శిశువు, నేటి స్పెయిన్ సూపర్ స్టార్ "లామినే యమాల్"కు ప్లాస్టిక్ టబ్‌లో స్నానం చేయిస్తూ ఫొటోలకు పోజులిచ్చాడు.ఆ చిన్నారి భవిష్యత్తులో ప్రపంచ ఫుట్‌బాల్‌లో సంచలనంగా మారతాడని, ఒకరోజు ప్రపంచకప్ ఫైనల్లో తన ప్రత్యర్థిగానే నిలుస్తాడని మెస్సీ ఊహించి ఉండడు.ఈ ఫొటోలు చాలా సంవత్సరాలు వెలుగులోకి రాలేదు. అయితే 2024లో యమాల్ తండ్రి వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మెస్సీ చేతుల్లో కనిపించిన ఆ శిశువే స్పెయిన్ యువ సంచలనం లామినే యమాల్ అని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం యమాల్ స్పెయిన్ జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా ఎదిగాడు. అద్భుతమైన డ్రిబ్లింగ్, సృజనాత్మక ఆటతీరుతో క్లబ్, దేశం తరఫున వరుస రికార్డులు నెలకొల్పుతూ ప్రపంచ ఫుట్‌బాల్ భవిష్యత్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. 2026 ప్రపంచకప్‌లోనూ అతని ప్రదర్శన స్పెయిన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.మరోవైపు 39 ఏళ్ల వయసులోనూ మెస్సీ తన మాంత్రిక ఆటతో అర్జెంటీనాను మరోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో చివరి నిమిషాల్లో అందించిన రెండు అద్భుత అసిస్టులతో అర్జెంటీనా విజయానికి మార్గం సుగమం చేశాడు.ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్లో ఒకవైపు మరో ప్రపంచకప్ కోసం పోరాడుతున్న మెస్సీ, మరోవైపు కొత్త యుగానికి నాంది పలకాలని భావిస్తున్న యువ సంచలనం యమాల్ నిలవనున్నారు.19 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఓ యాదృచ్ఛిక ఫొటో కథ, ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత భావోద్వేగభరితమైన ఫైనల్‌కు నేపథ్యంగా మారింది. రెండు తరాల మధ్య జరిగే ఈ పోరు ఫుట్‌బాల్ క్రీడలో చారిత్రక ఘట్టంగా నిలవనుంది. -
ఫిఫా వరల్డ్‌కప్.. అర్జెంటీనాకు భారీ షాక్!
ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అట్లాంటా వేదికగా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది.ఇక సెలబ్రేషన్స్ చేసుకునే సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్‌ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.చిరకాల ప్రత్యర్థులుఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది. కాగా క్రికెట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ల మాదిరే ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా- ఇంగ్లండ్ మ్యాచ్‌లకూ అదే స్థాయిలో ఆదరణ ఉంటుంది. ఇందుకు ఇరుదేశాల మధ్య ఉన్న రాజకీయ వివాదాలు.. తదనుగుణంగా చెలరేగే భావోద్వేగాలు కారణం అని చెప్పవచ్చు.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.24 ఏళ్ల తర్వాత తొలిసారిఅయితే, ఫాక్లాండ్ దీవుల విషయంలో ఇప్పటికీ ఇరుదేశాల మధ్య ఒక రకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో దాదాపు 24 ఏళ్ల తర్వాత అర్జెంటీనా- ఇంగ్లండ్ తొలిసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీ సెమీ ఫైనల్లో తలపడే అవకాశం వచ్చింది.భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా స్థాయికి తగ్గట్లు రాణించింది. అర్జెంటీనా తరఫున 85వ నిమిషంలో ఎన్జో ఫెర్నాండెజ్, అదనపు సమయం (90+2వ నిమిషం)లో మార్టినేజ్ చెరో గోల్ గొట్టారు.ఇక వీరిద్దరు గోల్స్ సాధించడంలో కెప్టెన్ మెస్సీ సహకారం అందించాడు. మరోవైపు.. ఇంగ్లండ్ తరఫున ఆంటోనీ గార్డన్ 55వ నిమిషంలోనే గోల్ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ గోల్ సాధించడంలో సఫలం కాలేకపోయింది. దీంతో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.షాక్ తప్పదా?ఈ నేపథ్యంలో ఓవైపు టైటిల్ సమరానికి మరోసారి అర్హత సాధించడం.. మరోవైపు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను ఓడించిన సంబరంలో అర్జెంటీనా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫాక్లాండ్ దీవులు తమవే అన్నట్లుగా బ్యానర్ ప్రదర్శించారు.Argentina Team with The Falkland Islands Banner 😂😂😂! pic.twitter.com/NlSUZXXlsS— The Final Whistle (@Rufus_45) July 16, 2026అయితే, అర్జెంటీనా ఆటగాళ్లపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గానూ.. ముందుగా బ్యానర్ ప్రదర్శించిన ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.నిబంధనలు ఏం చెబుతున్నాయి?IFAB నిబంధనల ప్రకారం.. మైదానంలో పరికరాల ద్వారానైనా సరే ఆటగాళ్లు రాజకీయ, మతపరమైన విషయాలకు సంబంధించి.. అదే విధంగా వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించిన ప్రకటనలు చేయడం, ఫొటోలు ప్రదర్శించడం నిషిద్ధం.ఆటగాళ్ల లోదుస్తులపై సైతం కేవలం తయారీ లోగో మాత్రమే ఉండాలి. అది కాకుండా తమ రాజకీయ, మతపరమైన, వ్యక్తిగతమైన అభిప్రాయాలను ప్రదర్శించకూడదు. ఒకవేళ ఆటగాళ్లు ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే సదరు ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి టోర్నీ నిర్వాహకులు జరిమానా విధిస్తారు. జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ లేదంటే ఫిఫా ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది.అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ మద్దతుఅర్జెంటీనా ఉపాధ్యక్షురాలు విక్టోరియా విలారుయెల్ మాత్రం తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. ‘‘ఫాక్లాండ్స్ ఎప్పటికీ అర్జెంటీనావే! వాళ్లు స్టేడియంలోకి బ్యానర్ తీసుకురాకుండా నిషేధం విధించారు. కానీ ఈ భావం మా నరనరాల్లో, హృదయాల్లో నిండిపోయింది’’ అని పేర్కొన్నారు.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ రికార్డు బద్దలు¡Las Malvinas son Argentinas! 🇦🇷 Prohibieron llevarlas a la cancha y se olvidaron que las llevamos en la sangre y el corazón. pic.twitter.com/qB455HeqVX— Victoria Villarruel (@VickyVillarruel) July 15, 2026 -
గురి తప్పిన ఫ్రెంచ్ కిక్
ఒకరిద్దరి మెరుపులు ప్రతీసారి ఏ జట్టుకైనా విజయం అందించవని మరోసారి నిరూపితమైంది. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగితే... అడుగడుగునా సమన్వయం ప్రదర్శిస్తూ.. సమష్టిగా ముందుకు కదిలితే... ఎంతటి మేటి ప్రత్యర్థినైనా బోల్తా కొట్టించవచ్చని మళ్లీ రుజువైంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఈసారి కచ్చితంగా ఫ్రాన్స్ విజేతగా నిలుస్తుందని భావించినవారందరి అంచనాలను తారుమారు చేస్తూ స్పెయిన్ సంచలనం సృష్టించింది. కలిసికట్టుగా కళ్లు చెదిరే ఆటతీరుతో ఫ్రాన్స్ ఫైనల్ ఆశలను సెమీఫైనల్లోనే గల్లంతు చేసిన స్పెయిన్... 16 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. డాలస్: ప్రత్యర్థి స్థాయి చూసి భయపడలేదు... లయబద్దమైన ఆటతో ప్రత్యర్థినే భయపెట్టింది... ఆరంభం నుంచి అంతం వరకు మ్యాచ్‌పై నియంత్రణ కోల్పోలేదు... పకడ్బందీగా ఆడి ప్రత్యర్థినే ఆద్యంతం నియంత్రించింది... తొలి క్షణం నుంచే ప్రత్యర్థి గోల్‌పోస్ట్ దిశగా కదం తొక్కింది.... ప్రత్యర్థి ఆటగాళ్లను ఎక్కడికక్కడే కట్టడి కూడా చేసింది. వెరసి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ అనూహ్యంగా టైటిల్ ఫేవరెట్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్ 2–0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ జట్టును బోల్తా కొట్టించింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒయర్జబాల్ (22వ నిమిషంలో), పెడ్రో పోరో (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ గెలుపుతో స్పెయిన్ 2010 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా ఓటమి లేకుండా వరుసగా 37వ మ్యాచ్‌ను ముగించింది. ఈ క్రమంలో ఇటలీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును స్పెయిన్ సవరించింది. ఎంబాపె తడబాటు...2018 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించి... 2022లో రన్నరప్‌గా నిలిచి... ఈసారి మ్యాచ్ మ్యాచ్‌కూ రాటుదేలే ఆటతీరుతో అదరగొట్టిన ఫ్రాన్స్ కీలకమైన సమరంలో ఉసూరుమనిపించింది. ఏమాత్రం పోరాటపటిమ కనబర్చకుండా స్పెయిన్ ‘కిక్’ఎక్కించే ఆటకు సమాధానం ఇవ్వకుండా ఫ్రాన్స్ చేతులెత్తేసింది. సెమీఫైనల్ చేరే క్రమంలో ఫ్రాన్స్ కెపె్టన్ కిలియన్ ఎంబాపె 8 గోల్స్... మరో స్టార్ ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలె 5 గోల్స్ చేసి సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు సెమీఫైనల్లోనూ మెరిపిస్తారని... ఫ్రాన్స్ జట్టును ఫైనల్‌కు చేరుస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఎంబాపె, డెంబెలె కీలక సమరంలో తేలిపోయారు. స్పెయిన్ డిఫెండర్లను దాటి ఆ జట్టు గోల్‌పోస్ట్ వరకు వెళ్లడంలో ఎంబాపె, డెంబెలె విఫలమయ్యారు. అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా అనుకూలంగా మల్చుకోలేకపోయారు. ఎంబాపెను నియంత్రించడంలో పూర్తిగా సఫలమైన స్పెయిన్ చివరకు మ్యాచ్ ఫలితాన్ని కూడా శాసించింది. ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడిన స్పెయిన్ 22వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సంపాదించింది. ‘డి’ ఏరియాలో లమీన్ యామల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లుకాస్ డిగ్నె మొరటుగా అడ్డుకున్నాడు.దాంతో రిఫరీ స్పెయిన్‌కు పెనాల్టీ కిక్ ఇవ్వగా... మికెల్ ఒయర్జబాల్ బంతిని లక్ష్యానికి చేర్చి స్పెయిన్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. ఈ టోర్నీలో ఒయర్జబాల్కిది ఐదో గోల్ కావడం విశేషం. అనంతరం 58వ నిమిషంలో డానీ ఓల్మో అందించిన పాస్‌ను పెడ్రో గోల్‌గా మలచడంతో స్పెయిన్ ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆలస్యంగానైనా ఫ్రాన్స్ పుంజుకుంటుందని, స్కోరును సమం చేస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నా... స్పెయిన్ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. -
ఫిఫా వరల్డ్‌కప్.. ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అట్లాంటా వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా.. స్పెయిన్‌తో తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని ఇంగ్లండ్ డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. మెస్సీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపలేకపోయాడు. ఇంగ్లండ్ కూడా ప్రథమార్ధంలో గోల్ సాధించలేకపోయింది.దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇరు జట్లు తమ ఖాతాను తెరవలేదు. అయితే సెకెండ్ హాఫ్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. యువ సంచలనం ఆంథోనీ గోర్డాన్ 58 నిమిషంలో ఒక సూపర్ గోల్‌తో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం దగ్గరపడుతున్నప్పటికి అర్జెంటీనా ఇంకా గోల్ సాధించకపోవడంతో డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఓటమి తప్పదని అంతా భావించారు.అర్జెంటీనా అదరహోఈ సమయంలో అర్జెంటీనా అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు అర్జెంటీనా ఆటగాళ్లు విశ్వరూపం ప్రదర్శించారు. 85వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ డి-బాక్స్ లాంగ్-రేంజ్ షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఈ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. అనంతరం అదనపు సమయం(90+2)లో లియోనెల్ మెస్సీ మ్యాజిక్ చేశాడు.మైదానం మధ్యలో నుంచి ఇంగ్లండ్ డిఫెన్స్‌ను తప్పించుకుంటూ మెస్సీ అందించిన ఒక అద్భుతమైన క్రాస్ పాస్‌ను.. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి నిమిషాల్లో ఇంగ్లండ్ మరో గోల్ సాధించకపోవడంతో మెస్సీ సేన వరుసగా రెండో సారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఆదివారం(జూలై 20) జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది. -
అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి బహిష్కరించండి..!
ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై మరోసారి వివాదం చెలరేగింది. రిఫరీలు, వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) నిర్ణయాల్లో అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ జట్టును టోర్నమెంట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో ఓ పిటిషన్ వైరల్ అవుతోంది. ఈ పిటిషన్‌కు ఇప్పటికే 75 లక్షల మందికిపైగా మద్దతు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.పిటిషన్ నిర్వాహకులు ఫిఫాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అర్జెంటీనాకు అనుకూలంగా రిఫరీ నిర్ణయాలు వస్తున్నాయని, దీంతో పోటీ సమానంగా జరగడం లేదని వారు ఆరోపించారు. "విజేత ముందే నిర్ణయించబడితే మిగతా జట్లు ఎందుకు పోటీ పడాలి? అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి తప్పించి ఇతర జట్లకు న్యాయం చేయాలి" అని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ వివాదం మధ్యనే అర్జెంటీనా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక ప్రత్యర్థిత్వం కారణంగా ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజా ఆరోపణలతో ఈ పోరుకు మరింత ఉత్కంఠ ఏర్పడింది.ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, అర్జెంటీనాపై చర్యలు తీసుకునే అంశంపై ఫిఫా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పిటిషన్లో చేసిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా నిర్ధారిత ఆధారాలు కూడా వెలుగులోకి రాలేదు. అందువల్ల ఇవి ప్రస్తుతం ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది. కాగా, భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్య రాత్రి రెండో సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లండ్‌తో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపుతో స్పెయిన్ ఇదివరకే ఫైనల్‌కు చేరుకుంది. -
ఫిఫా ఫైనల్లో స్పెయిన్.. ఆ జట్టును మాత్రం ఓడించలేకపోయింది!
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జట్టు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ దశ నుంచి సెమీస్ దాకా తాను తలపడిన అన్ని జట్లను చిత్తు చేసిన స్పెయిన్ కేప్వెర్డెను మాత్రం ఓడించకలేకపోయింది. గ్రూప్ దశలో కేప్‌వెర్డెతో మ్యాచ్‌ను స్పెయిన్ 0-0తో డ్రా చేసుకోవడం గమనార్హం. దీంతో అనామక జట్టుగా ఫిఫాలో ఎంట్రీ ఇచ్చిన కేప్‌వెర్డె టోర్నీ నుంచి నిష్క్రమించే సమయంలో హీరోలా మారిపోయింది. తన గోల్ కీపింగ్ నైపుణ్యంతో వోజిన్హా స్పెయిన్‌ను నిలువరించడంలో కీలకపాత్ర పోషించాడు. స్పెయిన్ ఆటగాళ్లు 27 సార్లు గోల్‌పోస్టుపై దాడులు చేసినప్పటికీ వాటన్నింటిని సమర్థంగా అడ్డుకొని 40 ఏళ్ల వయసులో వోజిన్హా సూపర్‌హీరోగా నిలిచాడు.Photo Credit: FIFA Twitterతాజాగా సెమీస్‌లో ఫ్రాన్స్‌పై గెలిచిన తర్వాత స్పెయిన్ ఫుట్‌బాల్ టీం ఒక కామెంట్ చేసింది. ‘ఈ ఫిఫాలో మేము అందరిని నిలువరిస్తే.. మమ్నల్ని మాత్రం కేప్‌వెర్డె నిలువరించింది. ఫ్రాన్స్‌తో సెమీస్ మ్యాచ్ కంటే కేప్‌వెర్డెతో మ్యాచ్ మాకు చాలా కష్టమనిపించింది’ అని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. తాజాగా స్పెయిన్ టీం చేసిన వ్యాఖ్యలతో కేప్‌వెర్డె మరోసారి వార్తల్లో నిలిచింది.స్పెయిన్ ప్రయాణం సాగింది ఇలా..ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశలో గ్రూప్-హెచ్లో స్పెయిన్ తొలి మ్యాచ్‌ను కేప్‌వెర్డెతో డ్రా చేసుకుంది. ఆ తర్వాత సౌదీ అరేబియాను 4-0తో చిత్తు చేసింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఉరుగ్వేను 0-1తో ఓడించిన స్పెయిన్ టేబుల్ టాపర్‌గా రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. రెండో రౌండ్లో ఆస్ట్రియాను 0-3తో ఓడించి స్పెయిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకు గోల్ చేయడంలో స్పెయిన్ విఫలమైంది. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మైకెల్ మిరినో స్టాపేజీ టైం (91వ నిమిషం)లో గోల్ చేసి పోర్చుగల్‌కు పీడకలను మిగిల్చాడు. పోర్చుగల్‌పై 1-0తో విజయం సాధించిన స్పెయిన్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక క్వార్టర్స్‌లో స్పెయిన్ బెల్జియంతో తలపడింది. తొలి హాఫ్ ముగిసేసరికి 1-1తో సమంగా నిలిచాయి. అయితే రెండో హాఫ్‌లో బెల్జియం గోల్‌కీపర్ సన్నె లామిన్స్ చేసిన చిన్ప తప్పిదం బెల్జియం కొంపముంచింది. స్పెయిన్ ఆటగాడు కుబార్సి కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో లామిన్స్ మిస్ చేయడం, ఇదే అదనుగా భావించిన మికెల్ మెరినో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించి మరోసారి హీరోగా నిలిచాడు. ఫలితంగా స్పెయిన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత జరిగిదంతా ఒక చరిత్రే. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. 🚨FACT: Cape Verde are the only team Spain faced at the 2026 World Cup that they DIDN’T beat pic.twitter.com/51p0mFj8ip— Polymarket Sports (@PolymarketSport) July 14, 2026Read: బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం! -
ఫిఫా వీఏఆర్పై ప్రపంచవ్యాప్త నిరసనలు.. ఆ దేశంలో మాత్రం!
2026 ఫిఫా వరల్డ్‌కప్‌లో వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. టెక్నాలజీ వినియోగంలో ఏకపక్ష నిర్ణయాలు, ఫౌల్స్ విషయంలో కొత్త నిబంధనలు, గోల్స్‌ను రద్దు చేయడంపై జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌ల ఫలితాలను మార్చేస్తున్న వీఏఆర్ వివాదం ఫిఫాలో పెద్ద రచ్చగా మారిపోయింది. ‘#Good Bye VAR’ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారిపోయింది.ఫిఫా ప్రవేశపెట్టిన వీఏఆర్‌ను చాలా దేశాలు వ్యతిరేకించడంతో పాటు దానిని బ్యాన్ చేయాలని కోరుతున్నాయి. కానీ స్వీడన్ ఇదే వీఏఆర్‌ను టెక్నాలజీని ఐదేళ్ల క్రితమే బ్యాన్ చేసిందన్న విషయం మీకు తెలుసా. కోవిడ్ సమయంలో స్వీడన్లో దేశీయంగా చాలా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో వీఏఆర్ టెక్నాలజీని వాడారు. కానీ దీనిపై అప్పట్లో ఆటగాళ్లు సహా అభిమానులు తిరుగుబాటు చేశారు. దీంతో వీఏఆర్‌ను బ్యాన్ చేయాలని ఆ దేశ ఫుట్‌బాల్ అసోసియేషన్ అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసింది.Photo Credit: FIFA Twitterఇప్పటికీ స్వీడన్లో సంప్రదాయ అంపైరింగ్కే అక్కడి ఫుట్‌బాల్ లీగ్‌లు కట్టుబడి ఉన్నాయి. అయితే ఇవాళ ఫిఫాలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వీఏఆర్ వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ వీఏఆర్ టెక్నాలజీ అర్జెంటీనాకు వరంలా మారిపోయిందని, రిఫరీలు కూడా అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోయాయి.ప్రపంచకప్‌లో ముఖ్యంగా అర్జెంటీనా–ఈజిప్ట్, స్విట్జర్లాండ్–అర్జెంటీనా వంటి మ్యాచ్‌ల్లో VAR జోక్యంతో తీసుకున్న నిర్ణయాలు పెద్ద వివాదంగా మారాయి. ఈజిప్ట్‌కు లభించిన గోల్‌ను రద్దు చేయడం, పెనాల్టీపై వచ్చిన వివాదం, స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలోకు సిమ్యులేషన్ పేరుతో ఎర్రకార్డు చూపించడం వంటి ఘటనలు అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం రేపాయి. సోషల్ మీడియాలో అర్జెంటీనాను వ్యంగ్యంగా "VARgentina" అని పిలుస్తూ విమర్శలు వెల్లువెత్తాయి.వీఏఆర్ వివాదాలకు కారణాలు:👉నిబంధనల మార్పు: ఈ టోర్నీలో ఫౌల్స్, డైవింగ్ (తప్పుడు ప్రయత్నాలు) వంటి వాటిపై వీఏఆర్ కఠినంగా వ్యవహరిస్తోంది. స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో డైవింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించి, అతనికి రెడ్ కార్డ్ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఇది ఎంతదాకా వెళ్లిందంటే అర్జెంటీనా కోసమే ఫిఫాను నిర్వహిస్తే సరిపోతుందని.. కప్‌ను అర్జెంటీనాకే ఇచ్చేయాలని మైదానంలోని బహిరంగ నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది.👉గోల్స్ రద్దు: మైదానంలో ఆటగాళ్లు కష్టపడి చేస్తున్న గోల్స్‌ను రిఫరీలు వీఏఆర్ స్క్రీనింగ్ ద్వారా (బాల్ సెన్సార్ టచ్) పేరుతో రద్దు చేయడం అభిమానులను నిరాశపరిచింది.👉ఆటకు ఆటంకం: టెక్నాలజీ జోక్యం వల్ల ఆట సమయం వృథా అవుతోందని కొందరు, సరైన నిర్ణయాలు రావడం వల్ల వీఏఆర్ వల్ల ఉపయోగం ఎవరికి ఉంటుందనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.Photo Credit: FIFA Twitterఫిఫా ఏమందంటే?వీఏఆర్ నిర్ణయాలపై ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఫిఫా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గతంలో వీఏఆర్ నిర్ణయాలు రిమోట్ కంట్రోల్ (అంతర్జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ కేంద్రం) ద్వారా జరిగేవి. కానీ వీఏఆర్పై రచ్చ పెరిగిపోవడంతో, క్వార్టర్ ఫైనల్స్ నుంచి స్టేడియంలోనే ప్రత్యేకంగా వీఏఆర్ అధికారులను (VAR Team) ఫిఫా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా కూడా వీఏఆర్ వివాదాలకు మాత్రం తెరపడడం లేదు.చదవండి: ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు! -
ఓం భీమ్ బుష్.. 'కబాలాస్'ను నమ్ముకున్న అర్జెంటీనా ఫ్యాన్స్
ఫుట్‌బాల్ అంటే కేవలం ఆట కాదు.. కోట్లాది మంది అభిమానుల భావోద్వేగం. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ, వ్యూహాలు, ఫిట్నెస్ ఎంత ముఖ్యమో.. కొంతమంది అభిమానుల నమ్మకాల్లో అదృష్టం కూడా అంతే కీలకం. ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్-2026 సెమీఫైనల్ ముందు అర్జెంటీనా అభిమానులు తమ జట్టు విజయం కోసం ఆసక్తికరమైన ‘కబాలాస్’ను ఆశ్రయిస్తున్నారు.ఇంగ్లండ్‌తో కీలక పోరుకు ముందు.. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ పేర్లను కాగితాలపై రాసి ఫ్రీజర్‌లో పెట్టడం అర్జెంటీనాలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి ఆటగాళ్లు చల్లబడిపోవాలని, మైదానంలో తమ ప్రభావం చూపలేకపోవాలని ఇలా చేస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. కొందరు అభిమానులు ఏఐ సాయంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను మంచులో బంధించినట్లుగా చిత్రాలు రూపొందించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అసలు ‘కబాలాస్’ అంటే ఏమిటి?అర్జెంటీనా ఫుట్‌బాల్ సంస్కృతిలో ‘కబాలాస్ (Cábalas)’ అనేది చాలా కాలంగా కొనసాగుతున్న నమ్మకం. జట్టు గెలవాలంటే ఒకే టీ-షర్ట్ ధరించడం, మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎప్పుడూ ఒకే చోట కూర్చోవడం, ఒకే ఆహారం తినడం వంటి అలవాట్లను అభిమానులు అదృష్ట సూచికలుగా భావిస్తారు. కొంతమంది అభిమానుల నమ్మకం ప్రకారం.. ఒకసారి చేసిన పని జట్టుకు విజయం తెచ్చిపెడితే, తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే అదృష్టం కలిసి వస్తుందట. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌లో ఈ సంప్రదాయం భావోద్వేగంగా కొనసాగుతోంది.Photo Credit: FIFA Twitterకేన్, బెల్లింగ్హామ్లకు ‘ఫ్రీజర్ ట్రీట్మెంట్’ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ పోరు కావడంతో ఈసారి అర్జెంటీనా అభిమానుల కబాలాస్ మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యర్థి జట్టు కీలక ఆటగాళ్లను "ఐస్‌లో పెట్టడం" ద్వారా వారి ఆటను నిలువరించవచ్చని కొందరు నమ్ముతున్నారు. హ్యారీ కేన్ ఇంగ్లండ్ ప్రధాన గోల్ ఆయుధం కాగా.. జూడ్ బెల్లింగ్‌హామ్ మిడ్‌ఫీల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే వీరిద్దరినీ టార్గెట్‌గా చేసుకుని అభిమానులు ఈ ప్రతీకాత్మక చర్యలకు దిగారు.కోచ్‌లకూ ఉన్న నమ్మకాలుఅర్జెంటీనా ఫుట్‌బాల్‌లో ఇలాంటి నమ్మకాలు అభిమానులకే పరిమితం కాదు. మాజీ కోచ్ Carlos Bilardo కూడా ప్రత్యేక అలవాట్లు, నమ్మకాలతో ప్రసిద్ధి చెందారు. ప్రస్తుత కోచ్ Lionel Scaloni కూడా కొన్ని వ్యక్తిగత అలవాట్లను పాటిస్తారని చెబుతారు. మైదానంలోకి అడుగుపెట్టే విధానం, మ్యాచ్‌కు ముందు చేసే కొన్ని ఆచారాలు ఆయనకు అదృష్టాన్ని తెస్తాయని అభిమానులు భావిస్తుంటారు.అర్జెంటీనా-ఇంగ్లండ్.. ఆ మాత్రం ఉంటదిఅర్జెంటీనా-ఇంగ్లండ్ మ్యాచ్ అంటే కేవలం ఫుట్‌బాల్ పోటీ కాదు.. దానికి చరిత్ర, భావోద్వేగాలు కూడా జతకట్టాయి. 1986 ప్రపంచకప్‌లో Diego Maradona చేసిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ నుంచి ఈ రెండు దేశాల మధ్య పోటీ మరింత ప్రత్యేకంగా మారింది. ప్రపంచకప్ వేదికపై ఈ రెండు జట్లు ఎదురుపడితే అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ఈసారి కూడా సెమీఫైనల్‌కు ముందు అర్జెంటీనా అభిమానులు తమ కబాలాస్పై నమ్మకం పెట్టుకున్నారు.మైదానంలో విజయం మాత్రం ఆటగాళ్ల ప్రదర్శన, వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ.. ఫుట్‌బాల్‌లో అభిమానుల విశ్వాసాలు, సంప్రదాయాలు, భావోద్వేగాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో అర్జెంటీనా ఫ్యాన్స్ ‘ఫ్రీజర్ కబాలా’ మరోసారి చూపించింది.Concuerdo, las cábalas NO se comparten.En lo personal, yo soy bien supersticioso en el deporte y tengo un buen.¿Ustedes tienen? https://t.co/DLQ6MvhLBt— Iván Jacob (@ivanjacobvg) July 15, 2026 -
ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు!
ఫిఫా ప్రపంచకప్‌లో 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 2010లో చివరిసారి ఫిఫా ఫైనల్ చేరిన స్పెయిన్ ఆనాడు టోర్నీలో చాంపియన్‌గా అవతరించింది. మళ్లీ ఇన్నేళ్లకు స్పెయిన్‌కు ఫైనల్ ఆడే అవకాశం రావడం విశేషం. ఫ్రాన్స్‌తో సెమీస్‌కు ముందు స్పెయిన్ స్టార్ లామినే యమాల్ ఎంబాపెతో పాటు ఆ జట్టుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. 'భయపడేది మేము కాదు.. వాళ్లే మాకు భయపడతారు' అని యమాల్ అన్నట్లు ఫ్రాన్స్ కీలక సెమీస్‌లో అనవసర ఒత్తిడికి లోనయ్యి స్పెయిన్ చేతిలో పరాజయం చవిచూసింది. లామినే యమాల్.. ఎంబాపెకు చెప్పి మరీ దెబ్బతీశాడు. ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో గోల్ చేయనప్పటికీ యమాల్ తన సహచర ఆటగాళ్లు గోల్ చేయడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. సోమవారం 19వ పుట్టినరోజు జరుపుకున్న లామినే యమాల్‌కు ఫ్రాన్స్‌పై విజయంతో స్పెయిన్‌ను ఫైనల్ చేర్చి తన సహచరులు అతడికి బర్త్‌డే కానుకగా అందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లామినే యమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఫిఫా వంటి ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో మెస్సీకి ఎదురుపడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటిది ఈసారి ఫైనల్లో మెస్సీ ఎదురుపడితే ఆ మజానే వేరు. దాని కోసమే ఎదురుచూస్తున్నా. అది జరుగుతుందని ఆశిస్తున్నా' అని కామెంట్ చేశాడు.ఇది విన్న స్పెయిన్ అభిమానులు.. ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు అని కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒజర్బయాల్ (22వ నిమిషం), పెడ్రో పొర్రో (58వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఈసారి ఫిఫాలో ఫ్రాన్స్ ఒక్క గోల్ చేయకపోవడం ఇదే తొలిసారి. తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన ఫ్రాన్స్ సెమీస్‌లో స్పెయిన్‌పై మాత్రం గోల్ చేయడంలో విఫలమైంది. 🚨 Lamine Yamal: “Facing Leo Messi in a World Cup final would be fantastic. I hope so!”, told DAZN. pic.twitter.com/xWsAJ2zv9d— Fabrizio Romano (@FabrizioRomano) July 14, 2026LAMINE YAMAL SHOWS OFF HIS DIAMOND CHAIN 💎💸On his birthday, the Spain star arrived at the press conference wearing this dazzling chain ahead of tomorrow’s World Cup semifinal 🔥😱#LamineYamal #Spain #WorldCup2026 #Football #PressConference pic.twitter.com/V12ZXgb87Q— MARCA in English 🇺🇸 (@MARCAinENGLISH) July 13, 2026 -
నార్వే జట్టుకు నీరాజనం
ఓస్లో (నార్వే): ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఓడి ఇంటి బాట పట్టిన నార్వే ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. టోర్నీ ఆసాంతం అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన నార్వే... ఇంగ్లండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను బోల్తా కొట్టించడంతోపాటు ఈ టోర్నీ మొత్తం నార్వే అద్భుత ప్రదర్శన కనబర్చింది. స్టార్ స్ట్రయికర్ ఇర్లింగ్ హాలాండ్ ఏడు గోల్స్‌తో జట్టును ఒంటిచేత్తో నడిపించగా... మైదానం బయట అభిమానులంతా ‘వైకింగ్ రో’ సంబరాలతో ప్రత్యేకత చాటుకున్నారు.గ్రూప్ ‘ఐ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి 6 పాయింట్లతో నాకౌట్‌కు అర్హత సాధించిన నార్వే జట్టు... ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. రౌండ్–32లో ఐవరీ కోస్ట్‌పై విజయం సాధించిన నార్వే... ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను మట్టికరిపించింది. దీంతో నార్వే పేరు మారుమోగిపోయింది. ఆరున్నర అడుగుల స్ట్రయికర్ ఇర్లింగ్ హాలాండ్ 5 మ్యాచ్‌ల్లోనే ఏడు గోల్స్ సాధించడంతో పాటు... తన ప్రవర్తనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాడు. వరల్డ్‌కప్‌లో చక్కటి ప్రదర్శన అనంతరం సోమవారం స్వదేశానికి చేరుకున్న టీమ్‌కు... అభిమానులకు అనూహ్య స్వాగతం పలికారు. వేలాది మంది అభిమానులు విమానాశ్రయానికి చేరుకొని ‘వైకింగ్ రో’ సంబరాలతో హోరెత్తించారు. కనుచూపు మేరంతా అభిమానులతో విమానాశ్రయం జనసంద్రాన్ని తలపించగా... అనంతరం టీమ్ ప్లేయర్లు ఓపెన్ టాప్ బస్సులో ముందుకు సాగారు. దారి పొడవునా అభిమానులు ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలుపుతుండగా... నార్వే యువరాజు హాకాన్ డ్రమ్స్ వాయిస్తూ ‘వైకింగ్ రో’ సంబరాలకు నేతృత్వం వహించడం విశేషం. క్వార్టర్ ఫైనల్లోనూ చక్కటి ఆటతీరు కనబర్చిన నార్వే... అదనపు సమయంలో బెలింగ్‌హామ్ చేసిన గోల్‌తో ఇంగ్లండ్ జట్టు ముందంజ వేసింది. ఏంటీ వైకింగ్... వరల్డ్‌కప్ సమయంలో నార్వే ప్లేయర్లు, అభిమానులు, ప్రజలు ఇలా ప్రతీ ఒక్కరూ ‘వైకింగ్ రో’ సంబరాల్లో భాగస్వాములయ్యారు. ఇంతకూ ఏంటీ ‘వైకింగ్ రో’... ఎందుకు దానికి అంత ప్రత్యేకత అంటే... ఇది ప్రాచీన నౌకాయాన సంస్కృతికి నిదర్శనం. క్రీస్తు శకం 8వ శతాబ్ద కాలంలో సముద్రయానానికి ప్రత్యేకమైన పడవలు వినియోగించేవారు. లాంగ్షిప్స్ అని పిలుచుకునే తేలికపాటి చెక్క పడవలను నడపడంలో నార్వే ప్రజలు అప్పట్లో సిద్ధహస్తులు.సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వైకింగ్ యోధులంతా ఒక లయతో... క్రమశిక్షణతో కలిసికట్టుగా పడవలను ముందుకు నడిపేవారు. ఇది వారి బృంద స్ఫూర్తిని ప్రస్ఫుటించేంది. అయితే ఆధునిక కాలంలో వైకింగ్ పడవలు లేకపోయినా... తమ చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తున్న నార్వే ప్రజలు... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్లేయర్ల ‘టీమ్ స్పిరిట్’కు చిహ్నంగా మైదానంలో ‘వైకింగ్ రో’ సంబరాలు ప్రారంభించగా... అది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్‌గా మారిపోయింది. -
భారత జట్టుకు రెండో విజయం
బ్యాంకాక్: ఆసియా కప్ అండర్–18 మహిళల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 99–17తో ఒమన్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన జొన్నలగడ్డ విహా రెడ్డి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... నేత్ర బిరుదవోలు, శాన్వీ కొలిశెట్టి కూడా భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఒమన్‌తో మ్యాచ్‌లో విహా 13 నిమిషాలు, నేత్ర 16 నిమిషాలు, శాన్వీ 13 నిమిషాలు బరిలో ఉన్నారు. భారత్ తరఫున తారుశ్రీ 25 పాయింట్లు స్కోరు చేయగా... సాధన, ఏంజెలినా, మెహక్ శర్మ 12 పాయింట్ల చొప్పన సాధించారు. -
అర్జెంటీనాను ఆపతరమా!
అట్లాంటా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండో సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టుతో నేడు జరిగే పోరులో మాజీ విజేత ఇంగ్లండ్ తలపడనుంది. ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా జట్టు సెమీఫైనల్ చేరుకున్న ఆరు పర్యాయాలు విజయం సాధించి ఫైనల్లోకి దూసుకొచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు 60 ఏళ్ల క్రితం ఒకే ఒక్కసారి ఫైనల్ చేరుకొని ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. 1966 తర్వాత ఫైనల్ చేరేందుకు ఇంగ్లండ్‌కు రెండుసార్లు అవకాశం వచ్చింది. కానీ ఆ రెండుసార్లు (1990, 2018) ఇంగ్లండ్ సెమీఫైనల్లోనే వెనుదిరిగింది. ఎనిమిదేళ్ల తర్వాత ఫైనల్లో అడుగు పెట్టేందుకు ఇంగ్లండ్‌కు మరో చాన్స్ వచ్చింది. ఇంగ్లండ్, అర్జెంటీనా జట్లు ఇప్పటి వరకు 14 సార్లు తలపడ్డాయి. 6 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది. 3 మ్యాచ్‌ల్లో అర్జెంటీనా నెగ్గింది. 5 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు 5 సార్లు పోటీపడ్డాయి. 3 సార్లు ఇంగ్లండ్... 2 సార్లు అర్జెంటీనా నెగ్గాయి. 2002 ప్రపంచకప్ తర్వాత మళ్లీ అర్జెంటీనాతో ఇంగ్లండ్ ‘ఢీ’కొంటోంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో రెండు జట్లు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ 8 గోల్స్ సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెలింగ్‌హమ్ 6 గోల్స్ చొప్పున సాధించి జోరుమీదున్నారు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడని అర్జెంటీనాకు ఇంగ్లండ్ షాక్ ఇస్తుందా... లేక నాలుగోసారి సెమీస్‌లో నిష్క్రమిస్తుందా వేచి చూడాలి. -
సెమీస్‌లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. డల్లాస్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో 2-0 తేడాతో పటిష్టమైన ఫ్రాన్స్‌ను స్పెయిన్ మట్టికరిపించింది. ఈ అద్భుత విజయంతో స్పెయిన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫిఫా చర్రితలో స్పెయిన్ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇది రెండో సారి.ఒయర్జబాల్ పెనాల్టీ గోల్ఈ మ్యాచ్ 21వ నిమిషంలో స్పెయిన్ టీనేజ్ సంచలనం లామైన్ యమల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నె బాక్స్‌లో ఫౌల్ చేయడంతో స్పెయిన్‌కు పెనాల్టీ లభించింది. ఈ సువర్ణ అవకాశాన్ని స్పెయిన్ స్టార్ ఫార్వర్డ్ మికెల్ ఒయర్జబాల్ గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. సెకెండ్ హాఫ్‌లో కూడా "లా రోజా" జట్టు తమ జోరును కొనసాగించింది. 58వ నిమిషంలో పెడ్రో పోర్రో సూపర్ స్ట్రైక్‌తో మరో గోల్ కొట్టి స్పెయిన్ విజయాన్ని ఖాయం చేశాడు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో కిలియన్ ఎంబాపె సారథ్యంలోని ఫ్రాన్స్ జట్టు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వరుస తప్పిదాల కారణంగా ఫ్రాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్‌లోనే ఫ్రాన్స్ స్టార్ సెంటర్-బ్యాక్ ఆటగాడు విలియం సాలిబా గాయంతో మైదానాన్ని వీడటం కూడా ఆజట్టును దెబ్బ తీసింది. ఈ టోర్నమెంట్లో ఫ్రాన్స్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం ఇదే మొదటిసారి. -
రెండు గేముల్లోనే ప్రత్యర్థి చిత్తు.. పీవీ సింధు శుభారంభం
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత టాప్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం రౌండ్ ఆఫ్ 32లో విజయం సాధించిన సింధు రెండో రౌండ్లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21-14, 21-11తో మలేషియాకు చెందిన వోంగ్ లింగ్ చింగ్‌ను రెండు గేముల్లోనే చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 7-4తో ఆదిలోనే లీడ్‌లోకి వెళ్లింది. మిడ్ గేమ్‌కు వచ్చేసరికి 11-6తో మరింత జోరు పెంచిన సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఆద్యంతం దూకుడును ప్రదర్శించిన సింధు బ్యాక్‌హాండ్, నెట్ డ్రిబిల్స్, డెఫ్ట్ డ్రాప్స్, హాఫ్ స్మాషస్ షాట్లతో చెలరేగి రెండు గేముల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది.మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే మిక్సడ్ డబుల్స్ తొలి రౌండ్లో ధ్రువ్ కపిలా-తనీషా క్రాస్టో జంట 21-16, 21-14తో స్కాట్లాండ్కు చెందిన అలెగ్జాండర్ డున్-జూలీ మాక్‌ఫెర్సన్ జోడీని ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో రోహన్ కపూర్-రుత్వికా శివాని తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. పురుషుల విభాగంలో డబుల్స్ విభాగంలో బరిలో ఉన్న సాత్విక్-చిరాగ్ జోడీ డెన్మార్క్‌కు చెందిన డానియెల్ లుండ్‌గార్డ్-మాడ్స్ వెస్టెర్గార్డ్ జంటను ఎదుర్కోనుంది. #JapanOpenSuper750 #JapanOpen2026 PV Sindhu comfortably into the round of 16. Wong Ching Ling is a better player than the scoreline suggests, but Sindhu clinical today. 21-14, 21-11. Much tougher test awaits in the next round, against Han Yue or Tomoka Miyazaki.📹 BWF YT pic.twitter.com/TuvNLyCOok— Vinayakk (@vinayakkm) July 14, 2026Read: ఢిల్లీ హైకోర్టులో క్రికెటర్ అభిషేక్ శర్మకు ఊరట -
ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్‌తో బరిలోకి అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జూన్ 16న అట్లాంటా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. అయితే ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రత్యేక జెర్సీ కిట్‌తో బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేవీ బ్లూ జెర్సీతోనే అర్జెంటీనా ఫిఫా చరిత్రలో రెండు అద్భుతాలకు నాంది పలికిందిఇంగ్లండ్పై మానసికంగా పైచేయి సాధించాలనే ఉద్దేశంతో సెమీస్ రోజున అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీని ధరించనున్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే అర్జెంటీనా ఫిఫా నుంచి అనుమతి కూడా పొందింది. ప్రతీ ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఒక మ్యాచ్‌ను నేవీ బ్లూ జెర్సీతో ఆడడం ఆనవాయితీగా చేసుకుంది. ఈ ఫిఫాలో ఇప్పటికే జోర్డాన్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీతో బరిలోకి దిగారు. Photo Credit: FIFA Twitterఇంగ్లండ్‌తో సెమీస్ సందర్భంగా తమకు రెండోసారి నేవీ బ్లూ జెర్సీ ధరించే అవకాశం ఇవ్వాలని అర్జెంటీనా ఫిఫాను అభ్యర్థించింది. తాజాగా ఫిఫా నుంచి అనుమతి రావడంతో అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీకి లైన్ క్లియర్ అయింది. సెమీస్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీ, నల్లరంగు షార్ట్‌ను ధరించనుండగా.. ఇంగ్లండ్ వైట్ అండ్ వైట్‌లో బరిలోకి దిగనుంది.జెర్సీ వెనుక పెద్ద కథే..అర్జెంటీనా ప్రతి ఫిఫాలో నేవీ బ్లూ జెర్సీతో ఒక మ్యాచ్ ఆడడం వెనుక పెద్ద కథే దాగుంది. 1986 ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ తలపడ్డాయి. అప్పట్లో ఇద్దరి జెర్సీ రంగు దాదాపు ఒకే విధంగా ఉండడంతో జట్ల మధ్య తేడా ఉండాలని అర్జెంటీనా నేవీ బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లోనే మారడోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్' తో పాటు 'గోల్ ఆఫ్ ది సెంచరీ' నమోదు చేశాడు.Photo Credit: FIFA Twitterఆ మ్యాచ్‌కు గుర్తుగా తాజా ఫిఫాలో సెమీస్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో తలపడుతున్న వేళ అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతో ఆడాలని నిర్ణయించుకుంది. ఇది మానసికంగా ఇంగ్లండ్‌పై తమకు విజయం సాధించినట్లవుతుందని అర్జెంటీనా అభిప్రాయపడుతుంది. 1986 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో రెండుసార్లు అర్జెంటీనా, ఇంగ్లండ్‌లు తలపడ్డాయి. ఈ రెండుసార్లు కూడా అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతోనే బరిలోకి దిగడం విశేషం. 1998 ఫిఫాలో పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-3తో ఇంగ్లండ్‌పై విజయాన్ని అందుకుంది. ఇక 2002 ఫిఫాలో డేవిడ్ బెక్‌హమ్ మెరుపులతో ఇంగ్లండ్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరుజట్లు నాకౌట్ మ్యాచ్‌లో తలపడనుండడంతో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.Photo Credit: FIFA Twitterహ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్'హ్యాండ్ ఆఫ్ గాడ్' అనేది 1986 ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు డియెగో మారడోనా ఇంగ్లాండ్‌పై చేసిన వివాదాస్పద గోల్. అతను ఇంగ్లాండ్ గోల్ కీపర్ కంటే ఎత్తున ఎగిరి, బంతిని తన ఎడమ చేతితో గోల్ పోస్ట్‌లోకి నెట్టాడు. రిఫరీలు దీన్ని గమనించకపోవడంతో గోల్ చెల్లుబాటయింది. ఆ తర్వాత మారడోనా కొట్టిన గోల్‌ను హ్యాండ్ ఆఫ్ గాడ్‌గా అభివర్ణించారు.Photo Credit: FIFA Twitterగోల్ ఆఫ్ ది సెంచరీఫుట్బాల్ చరిత్రలో అత్యుత్తమమైన గోల్‌గా పేరొందిన "గోల్ ఆఫ్ ది సెంచరీ"ని 1986 జూన్ 22న అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా సాధించాడు. మెక్సికోలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, మారడోనా దాదాపు 60 మీటర్ల దూరం నుంచి ఐదుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లను దాటుకుంటూ వెళ్లి ఈ అద్భుతమైన గోల్ చేయడం చరిత్రలో నిలిచిపోయింది. అందుకే దీనిని గోల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు.చదవండి: చెన్నై వేదికగా తొలి మ్యాచ్.. బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల -
ఫిఫా టీమ్ నుంచి తొలగింపు.. రిఫరీ అనుమానాస్పద మృతి!
ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచకప్ మాయలో పడిపోయిన వేళ ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. నెదర్లాండ్స్ రిఫరీ రాబ్ డిపెరింక్ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిజానికి 2026 ఫిఫా ప్రపంచకప్ టీమ్‌లో రాబ్ డిపెరింక్ సభ్యుడిగా ఉండాల్సింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) టీమ్‌లో రాబ్ విధులు నిర్వర్తించాల్సింది. కానీ అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో ఫిఫా టీమ్ నుంచి తప్పించారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును క్లోజ్ చేసినప్పటికీ, తాజాగా డచ్ రిఫరీ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. తనపై అకారణంగా ఆరోపణలు చేశారనే కారణంతో ఆత్యహత్మకు పాల్పడ్డాడా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఇక రాబ్ డిపెరింక్ మృతి విషయాన్ని డచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారికంగా ధ్రువీకరించింది. 2017 నుంచి రాబ్ డిపెరింక్ నెదర్లాండ్స్ రిఫరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2024 యూరో చాంపియన్‌షిప్‌లో రాబ్ వీఏఆర్ బృందంలో పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే 2026 ఫిఫా ప్రపంచకప్ రోస్టర్‌లో వీఏఆర్ టీమ్‌లో రిఫరీగా పేరును చేర్చడం జరిగింది. ఈలోగా అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు రాబ్ డిపెరింక్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాబ్‌ను ఫిఫా టీమ్ నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని, అకారణంగా తనను అరెస్టు చేశారని, ఫలితంగా ఫిఫా 2026లో వీఏఆర్ టీమ్‌లో రిఫరీగా విధులు నిర్వర్తించే సువర్ణావకాశాన్ని కోల్పోయినట్లు తన గోడును వెల్లబోసుకున్నాడు.చదవండి: ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీస్.. ఫైనల్ చేరేదెవరు? -
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీస్.. ఫైనల్ చేరేదెవరు?
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 16 ఏళ్ల తర్వాత ఫిఫాలో ఫైనల్ చేరాలని స్పెయిన్ భావిస్తుంటే.. మరోవైపు వరుసగా మూడో ఫిఫాలోనూ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఫ్రాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదనిపిస్తోంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో జర్మనీ (1982, 1986, 1990), బ్రెజిల్ (1994, 1998, 2002) జట్ల తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్ చేరాయి. తాజాగా వరుసగా మూడోసారి ఫిఫా ఫైనల్ చేరడం ద్వారా మూడో జట్టుగా గుర్తింపు పొందాలని ఫ్రాన్స్ ఉబలాటపడుతోంది. టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ఫ్రాన్స్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అజేయంగా సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది.కెప్టెన్ ఎంబాపె (8 గోల్స్), డెంబెలె (5 గోల్స్), బార్కోలా (2 గోల్స్), డిజైర్ డుయి (1 గోల్) అద్భుత ఆటతీరుకు ప్రత్యర్థి జట్లు ఓటమివైపు నిలవాల్సి వస్తోంది. మరోవైపు స్పెయిన్ కూడా ఓటమి లేకుండానే సెమీఫైనల్‌కు చేరుకుంది. ఫ్రాన్స్ మాదిరిగానే స్పెయిన్ ఏ ఒకరిద్దరి ఆటతీరుపైనే ఆధార పడటం లేదు. మికెల్ ఒయర్జబాల్ (4 గోల్స్), మికెల్ మెరీనో (2 గోల్స్), బయేనా (1 గోల్), రూయిజ్ (1 గోల్), పెడ్రో (1 గోల్), లమీన్ యమాల్ (1 గోల్) సమష్టి ప్రదర్శనతో స్పెయిన్ అనూహ్యంగా టైటిల్ రేసులోకి వచ్చింది. Photo Credit: FIFA Twitterముఖాముఖి పోరులో ఫ్రాన్స్‌పై స్పెయిన్‌దే పైచేయిగా ఉంది. రెండు జట్లు ఇప్పటి వరకు 38 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 18 మ్యాచ్‌ల్లో స్పెయిన్, 13 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ గెలిచాయి. ఏడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఫ్రాన్స్, స్పెయిన్ ఒక్కసారే ప్రత్యర్థులుగా నిలిచాయి. 2006 ప్రపంచకప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1తో స్పెయిన్‌ను ఓడించింది. చదవండి: సీఎస్కే హెడ్‌కోచ్ పదవి.. రేసులో ఊహించని పేర్లు! -
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల హవా.. 15 పతకాలు ఖరారు
ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా అండర్-19, అండర్-23 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. అండర్-23 పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకోగా, మరో ఏడుగురు సెమీఫైనల్లో ఓడినా కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు.మహిళల అండర్-23 విభాగంలో నిషా (54 కేజీలు) దక్షిణ కొరియాకు చెందిన హ్యేజూ లీపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. నికితా చంద్ (60 కేజీలు) జపాన్‌కు చెందిన సారీ కొకుఫును ఓడించగా, కాజల్ (65 కేజీలు) కిర్గిజ్స్తాన్కు చెందిన గుల్జినా మెల్స్వెక్పై ఏకపక్ష విజయం సాధించింది.ముస్కాన్ (75 కేజీలు) ఉజ్బెకిస్థాన్‌కు చెందిన టోయిరోవా ఓయ్షాపై 5-0 తేడాతో గెలవగా, ప్రియాంక (80 కేజీలు) కజకిస్థాన్‌కు చెందిన పనార్ సెయిట్ఖాంకిజీపై అదే 5-0 స్కోరుతో విజయం సాధించింది. ఈ మూడు బౌట్లలో భారత బాక్సర్ల ఆధిపత్యం కారణంగా రిఫరీ పోటీలను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.పురుషుల అండర్-23 విభాగంలో విశ్వనాథ్ సురేశ్ (50 కేజీలు) ఫిలిప్పీన్స్ ప్రత్యర్థిని 5-0తో చిత్తు చేశాడు. గంగా (55 కేజీలు) జపాన్ బాక్సర్‌పై 3-2 స్ప్లిట్ డెసిషన్‌తో గెలిచి ఫైనల్‌కు చేరాడు. వంశజ్ (65 కేజీలు) కిర్గిజ్స్తాన్ ప్రత్యర్థిపై 4-1 తేడాతో విజయం సాధించి బంగారు పతక పోరుకు అర్హత సాధించాడు.భారత్ ఖాతాలో చేరిన ఏడు కాంస్య పతకాలుమహిళల అండర్-23 విభాగంలో తను (51 కేజీలు), ప్రాచి (57 కేజీలు), శివాని (70 కేజీలు), నైనా (80 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో హితేష్ (70 కేజీలు), నీరజ్ (75 కేజీలు), ఇషాన్ కటారియా (90 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.ఫైనల్‌కు చేరిన ఎనిమిది మందితో కలుపుకుంటే భారత్‌కు మొత్తం 15 పతకాలు (8 స్వర్ణాలు లేదా రజతాలు) ఖరారయ్యాయి. -
భారీ మార్పునకు ఫిఫా ప్లాన్.. భారత్‌కు బిగ్ చాన్స్!
ఫిఫా ప్రపంచకప్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. 48 జట్లు బరిలోకి దిగితే అందులో నుంచి నాలుగు జట్లు సెమీస్‌లో ప్రవేశించాయి. తొలి సెమీస్‌లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇక అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఫిఫా ప్రపంచకప్ సూపర్ సక్సెస్ అయింది. 2022తో పోలిస్తే ఈసారి ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెరిగింది. ముఖ్యంగా క్రికెట్‌ను ఎక్కువగా అభిమానించే భారత్ లాంటి దేశాల్లోనూ ఈసారి ఫిఫా క్రేజ్ మాములుగా లేదు. కేరళ, బెంగాల్‌కు తోడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఫిఫాకు సంబంధించి ప్రత్యేక హోర్డింగ్‌లు, స్టార్ ఆటగాళ్ల కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీల్లో ఒకటిగా నిలిచిన ఫిఫాను మరింత విస్తరించే యోచనలో ఫిఫా సమాఖ్య అడుగులు వేస్తోంది. 2030 ఫిఫా ప్రపంచకప్ నాటికి టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్య 48 నుంచి 64కు పెంచాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోతో ఫిఫా సమాఖ్య బృందం సమావేశమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇలా చేయడం వల్ల ఫుట్‌బాల్‌లో అతిపెద్ద వేదిక అయిన ఫిఫాలో పోటీపడాలనే కల ప్రతీ దేశానికి కలుగుతుందని గియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. ఒకవేళ వచ్చే ప్రపంచకప్ లేదా ఆ తర్వాత జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇది జరిగితే భారత్‌కు అవకాశమెంత ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఏళ్ల నుంచి ఫిఫాలో ఆడాలన్న భారత్ కల నెరవేరుతుందా? దీనికి సంబంధించిన అవకాశాలెంత అనేది ఒకసారి పరిశీలిద్దాం.అలా అయితేనే భారత్‌కు చాన్స్!వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030) నాటికి 64 జట్లు పాల్గొంటే ఆసియా ఖండం నుంచి భారత ఫుట్‌బాల్ జట్టుకు అవకాశం ఉంటుందా అంటే చెప్పలేం. అది రాబోయే నాలుగేళ్లలో మన జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) ర్యాంకింగ్స్‌లో భారత్ 24వ స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ 2030 ఫిఫా నాటికి 64 జట్లకు అవకాశం కల్పిస్తే ఆసియా ఖండం నుంచి క్వాలిఫై అయ్యే జట్ల సంఖ్య 11 లేదా 12కు పెరగనుంది. ఫిఫా ర్యాంకింగ్స్ ఆధారంగా జపాన్, సౌత్ కొరియా, ఇరాన్, ఆస్ట్రియా, సౌదీ అరేబియాలు నేరుగా టాప్ ఐదు స్థానాలకు అర్హత సాధిస్తాయి. ఖతార్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, యూఏఈ, జోర్డాన్ జట్లు మిగతా నాలుగు స్థానాలకు పోటీ పడనున్నాయి. ఒకవేళ 11 లేదా 12 జట్లకు అవకాశం కల్పిస్తే భారత్ ఈ స్థానాలకు పోటీ పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు స్థానాలకు కూడా ఒమన్, బహ్రెయిన్, సిరియా, చైనా, వియత్నాం, థాయ్‌లాండ్‌ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఉండనుంది. అది కూడా భారత్ ప్రస్తుతమున్న 24వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంకుకు చేరుకుంటేనే ఫిఫాకు అర్హత సాధించే అవకాశముంటుంది. ఎందుకంటే ఫిఫా ప్రపంచకప్ అర్హతకు ఆసియా ఖండం నుంచి 15 అత్యుత్తమ జట్లకు మాత్రమే క్వాలిఫయింగ్ పోటీలకు అర్హత కల్పించడం జరుగుతుంది. ఈ లెక్కన 2030లో భారత్ ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే వచ్చే నాలుగేళ్లలో మెరుగైన ప్రదర్శనతో టాప్-15లో చోటు దక్కించుకోవాల్సిన అవసరముంది.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో 32 దేశాలు పాల్గొన్నాయి. తాజా ప్రపంచకప్‌లో ఆ సంఖ్యను 48కి పెంచారు. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా ప్రపంచకప్ ఖండాంతరాలను దాటి విశ్వవ్యాప్త క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్న తరుణంలో ఫిఫా జట్ల సంఖ్యను మరింత పెంచాలనే నిర్ణయానికి రావడం అభినందించాల్సిన అంశం.Read: సీఎస్కే కోచ్ పదవికి స్టీఫెన్ ప్లెమింగ్ గుడ్ బై -
వింబుల్డన్ విజేతగా సినెర్.. ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
లండన్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ హోదాకు తగ్గట్టు ఆడిన యానిక్ సినెర్ వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టాప్ సీడ్ సినెర్ (ఇటలీ) పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.మూడు గంటల 46 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సినెర్ 6–7 (7/9), 7–6 (7/2), 6–3, 6–4తో ప్రపంచ మూడో ర్యాంకర్, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. గత ఏడాది కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)పై నాలుగు సెట్లలో గెలిచిన సినెర్... ఈ ఏడాది కూడా ఫైనల్ పోరులో నాలుగు సెట్లలోనే విజయం అందుకున్నాడు. ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?విజేత సినెర్‌కు 35 లక్షల పౌండ్లు (రూ. 46 కోట్లు), రన్నరప్ జ్వెరెవ్‌కు 18 లక్షల పౌండ్లు (రూ. 23 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదిలా ఉంటే... గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన జ్వెరెవ్ అదే ఫలితాన్ని వింబుల్డన్‌లో పునరావృతం చేయలేకపోయాడు. పదో ప్రయత్నంలో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన జ్వెరెవ్ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి జోరు మీద ఉన్నట్లు కనిపించాడు. కానీ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో సినెర్ గెలిచి స్కోరును సమం చేశాడు. మూడో సెట్లోని ఎనిమిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినెర్... తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–3తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్లోని ఏడో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సినెర్... ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని 6–4తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను హస్తగతం చేసుకున్నాడు. సినెర్ కెరీర్లో ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్. పదో ప్లేయర్గాఓపెన్ శకంలో (1968 నుంచి) వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కనీసం వరుసగా రెండేళ్లు సాధించిన పదో ప్లేయర్‌గా యానిక్ సినెర్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రాడ్ లేవర్, జాన్ న్యూకోంబ్, జాన్ బోర్గ్, జాన్ మెకన్రో, బోరిస్ బెకర్, పీట్ సంప్రాస్, రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్, అల్కరాజ్ ఉన్నారు. -
సెమీస్ సమరం.. ఎవరి బలమెంత?
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈసారి గ్రూప్ దశలో 48 జట్లు పాల్గొన్నాయి. రౌండ్ ఆఫ్ 32, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో వడపోత తర్వాత నాలుగు జట్లు మిగిలాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అర్జెంటీనా దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టగా, 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా వరుసగా మూడోసారి (2018, 2022, 2026) సెమీస్‌కు దూసుకొచ్చింది. ఇక 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ (2010 విజేత) సెమీస్‌లో అడుగుపెడితే, అటు మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా తన దూకుడైన ఆటతీరుతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇప్పటిదాకా తమకు ఎదురైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ వచ్చిన ఈ నాలుగు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో సెమీస్‌లో తలపడనున్నాయి. గత ఫిఫా ప్రపంచకప్ లాగే ఈసారి ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ పోరును చూస్తామా లేక స్పెయిన్, ఇంగ్లండ్ ఆట చూస్తామా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో సెమీస్‌లో ఎవరితో ఎవరు తలపడనున్నారనేది ఒకసారి పరిశీలిద్దాం. ఒస్మోన్ డెంబ్లీ, ఫ్రాన్స్ (Phot Credit: FIFA Twitter)జట్ల బలాబలాలు👉ఫ్రాన్స్ తరఫున ఎంబాపె అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఫిఫాలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంబాపె తర్వాత ఒస్మోన్ డెంబ్లీ కూడా ఫ్రాన్స్‌కు బలమైన ఆటగాడు. ఫార్వార్డ్ ప్లేయర్ అయిన డెంబ్లీ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్, రెండు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు.👉ఇక స్పెయిన్ తరఫున కెప్టెన్ రొడ్రితో పాటు యామినే లమాల్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మైకెల్ ఒయర్జబాల్ (ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్), గోల్ కీపర్ ఉనైయి సిమోన్లు కూడా తమదైన ఆటతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.మైకెల్ ఒయర్జబాల్, స్పెయిన్ (Phot Credit: FIFA Twitter)👉ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీకేన్ ఈసారి ఎలాగైనా ఫిఫా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తరఫున ఈసారి ఫిఫాలో ఆరు మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ చేసి ఆ జట్టు తరఫున గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. హ్యారికేన్కు తోడుగా జూడ్ బెల్లింగ్హమ్ కూడా కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. బెల్లింగ్హమ్ కూడా ఆరు గోల్స్ చేసి హ్యారికేన్తో సమానంగా ఉన్నాడు.👉డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాకు కర్త, కర్మ, క్రియ.. లియోనల్ మెస్సీ. మెస్సీ ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సీతో పాటు ఎమిలో మార్టినేజ్, జులియన్ అల్వరెజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్‌లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.జూడ్ బెల్లింగ్హమ్, ఇంగ్లండ్ (Phot Credit: FIFA Twitter)తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ఫ్రాన్స్, స్పెయిన్ జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం జులై 15న (బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు) జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. స్పెయిన్‌దే పైచేయి. 38 మ్యాచ్‌ల్లో స్పెయిన్ 18 గెలవగా.. ఫ్రాన్స్ 13 గెలిచింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఫిఫా ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2016 ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది.అలెక్సిస్ మాక్ అలిస్టర్, అర్జెంటీనా (Phot Credit: FIFA Twitter)రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్ఫిఫాలో రెండో సెమీ-ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జులై 16 (భారత కాలమాన ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 గంటలు) అట్లాంటా వేదికగా జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడగా.. వీటిలో ఇంగ్లండ్ మూడు, అర్జెంటీనా రెండు గెలిచాయి. 40 ఏళ్ల క్రితం (1986 ఫిఫా) ఇరుజట్ల మధ్య జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా పైచేయి సాధించింది.సెమీఫైనల్ షెడ్యూల్:👉తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్, బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అర్లింగ్టన్, టెక్సస్👉రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్, గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అట్లాంటాSemi-final match-ups 👀#FIFAWorldCup pic.twitter.com/2WWvIw4E06— FIFA World Cup (@FIFAWorldCup) July 12, 2026చదవండి: శతకంతో ప్రపంచ రికార్డు.. తొలి మహిళా క్రికెటర్‌గా యస్తిక భాటియా -
‘అంతా ఫిక్సింగ్.. వాళ్లను గెలిపించడం కోసమే ఇదంతా’
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, రెండో సెమీస్‌లో అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ ఫార్వార్డ్ ప్లేయర్ మొస్తాఫా జీకో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిఫా టోర్నీ ముందే ఫిక్స్ అయిందని, అర్జెంటీనాను గెలిపించడం కోసమే టోర్నీ నిర్వహిస్తున్నట్లుగా తనకు అనిపిస్తోందని పేర్కొన్నాడు. అర్జెంటీనాతో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్ 2-3 తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి మెస్సీపై కూడా జీకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బహుశా మెస్సీ గొప్ప ఆటగాడే కావొచ్చు, కానీ తాను ప్రధానంగా పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నుంచి స్ఫూర్తి పొందుతానని పేర్కొన్నాడు.ఇక ప్రిక్వార్టర్స్‌లో ఓటమి అనంతరం ఈజిప్ట్ జట్టు అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. మ్యాచ్ మొత్తం రిఫరీ అంపైరింగ్‌ను నిష్పక్షపాతంగా నిర్వహించలేదని, తమ జట్టుకు అన్యాయం జరిగిందని జీకో ఆరోపించాడు. తాము మెరుగైన ప్రదర్శన చేశామని, కానీ విజయం అనేది తమ చేతుల్లో లేదన్నాడు. టోర్నీ మొత్తం ముందే ఫిక్స్ అయిందని, రిఫరీ చేతుల మీదుగా ఫిక్సింగ్ నడుస్తోందని తెలిపాడు. అర్జెంటీనా కోసమే ఫిఫా నిర్వహిస్తున్నట్లు అందరికీ స్పష్టంగా అర్థమవుతోందని జీకో పేర్కొన్నాడు. 😂🏆 The Swiss players looked completely stunned, almost as if they were saying:"Just hand the trophy to Argentina already!" 🤣The reactions on their faces said it all — a mix of disbelief, frustration, and pure shock. Football always delivers these priceless moments! 😅⚽…— KUMAR (@MyCric101) July 13, 2026చదవండి: ‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్! -
అర్జెంటీనా... అదే దూకుడు
కాన్సస్ సిటీ: ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా చేరువైంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం జరిగిన చివరిదైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో అర్జెంటీనా రెండు గోల్స్ సాధించి ప్రపంచకప్ చరిత్రలో ఏడోసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషంలో), జూలియన్ అల్వారెజ్ (112వ నిమిషంలో), లౌటారో మార్టినెజ్ (120+1వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్విట్జర్లాండ్ జట్టుకు డాన్ ఎండోయో (67వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 72వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో ‘రెడ్ కార్డు’కు గురయ్యాడు. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం స్విట్జర్లాండ్ పదిమంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ టోర్నీలో మొదటి ఐదు మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన మెస్సీ ఈ మ్యాచ్‌లో మాత్రం గోల్ చేయలేదు. అయితే అలెక్సిస్ తొలి గోల్ చేసేందుకు మెస్సీ సహాయపడ్డాడు. గత మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అర్జెంటీనా ఏమాత్రం ఆందోళన చెందకుండా విజయమే లక్ష్యంగా చివరి క్షణం వరకు పోరాడింది. ఈ పోరాట ఫలితమే అర్జెంటీనా జట్టుకు సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసింది. స్విట్జర్లాండ్‌తో పోరులో అర్జెంటీనా 22 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసి ఏడుసార్లు గోల్ లక్ష్యంగా షాట్లు కొట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో అర్జెంటీనా తలపడుతుంది. గతంలో సెమీఫైనల్ చేరుకున్న ఆరు పర్యాయాలు (1930, 1978, 1986, 1990, 2014, 2022) అర్జెంటీనా జట్టు ఫైనల్లోకి ప్రవేశించడంతోపాటు మూడుసార్లు విజేతగానూ నిలిచింది. ఏడోసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. 12 ప్రపంచకప్‌లో వరుసగా 12 మ్యాచ్‌ల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన తొలి జట్టుగా అర్జెంటీనా రికార్డు నెలకొల్పింది. 72 ఏళ్లుగా ఉరుగ్వే (1930 నుంచి 1954 వరకు; వరుసగా 11 మ్యాచ్‌ల్లో ) పేరిట ఉన్న రికార్డును అర్జెంటీనా బద్దలు కొట్టింది.4 అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య 1992లో వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక... తొలిసారి ప్రపంచకప్‌లో టాప్–4 జట్లు సెమీఫైనల్ చేరాయి. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్ తొలి స్థానంలో, స్పెయిన్ రెండో స్థానంలో, అర్జెంటీనా మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి.బెలింగ్‌హమ్ ‘డబుల్’ ధమాకా...నార్వేను ఓడించి సెమీస్‌లోకి ఇంగ్లండ్ మయామి స్టేడియంలో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో నార్వే జట్టును ఓడించి ప్రపంచకప్‌లో నాలుగోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేత ఎవరో తేలేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో ఇంగ్లండ్ ఒక గోల్ సాధించి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నమోదు చేసిన రెండు గోల్స్ జూడ్ బెలింగ్‌హమ్ (45+2వ నిమిషంలో, 93వ నిమిషంలో) సాధించడం విశేషం. నార్వే జట్టుకు ఆండ్రీస్ షాజెల్డర్ప్ (36వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 56వ నిమిషంలో నార్వే ప్లేయర్ టార్బన్ హెగెమ్ చేసిన గోల్‌ను రిఫరీ వీడియో రీప్లే సమీక్షించాక నిరాకరించారు. ‘డి’ ఏరియాలో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఫౌల్ చేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్‌తో అదరగొట్టిన నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఎర్లింగ్ను ఇంగ్లండ్ ప్లేయర్లు వ్యూహత్మంగా కట్టడి చేశారు. ఫలితంగా ఎర్లింగ్ కేవలం రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టాడు. దాంతో నిర్ణీత సమయం ముగిశాక నార్వే కోచ్ ఎర్లింగ్ను వెనక్కి పిలిచి అతని స్థానంలో లార్సన్ను సబ్‌స్టిట్యూట్‌గా ఆడించారు. 1966లో ఏకైకసారి ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించగా... 1990 సెమీఫైనల్లో జర్మనీ చేతిలో... 2018 సెమీఫైనల్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. -
వింబుల్డన్ విజేత యానిక్ సినెర్.. జ్వెరెవ్‌పై సంచలన విజయం
లండన్: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, ఇటలీ స్టార్ యానిక్ సినెర్ మరోసారి లండన్ గడ్డి కోర్టుపై తన ప్రతాపం చూపించారు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఓపెన్-2026 పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సిన్నర్ కైవసం చేసుకున్నారు. ఆదివారం రాత్రి హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ సిన్నర్.. జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై అద్భుత విజయం సాధించారు. దాదాపు 3 గంటల 45 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో సిన్నర్ 6-7(7), 7-6(2), 6-3, 6-4 తేడాతో జ్వెరెవ్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడారు.హోరాహోరీగా తొలి రెండు సెట్లుమ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు ఆటగాళ్లు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. మొదటి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో ఆట టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఉత్కంఠభరితమైన ఈ టైబ్రేకర్‌లో జ్వెరెవ్ 7-6(7)తో తొలి సెట్ గెలిచి సినెర్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అయితే, వెంటనే పుంజుకున్న సినెర్ రెండో సెట్లో అద్భుతమైన బేస్‌లైన్ ఆటతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఈ సెట్ కూడా టైబ్రేకర్ వైపు వెళ్లగా, ఈసారి సిన్నర్ ఏకపక్షంగా 7-6(2)తో సెట్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను సమం చేశారు.సిన్నర్ పంజా.. జ్వెరెవ్‌కు మోకాలి గాయంమూడో సెట్లో ఆట తీవ్రత మరింత పెరిగింది. ఈ క్రమంలోనే జర్మనీ స్టార్ జ్వెరెవ్‌కు మోకాలికి స్వల్ప గాయమైంది. వైద్య సహాయం తీసుకున్న అనంతరం జ్వెరెవ్ కోర్టులోకి తిరిగి వచ్చినప్పటికీ, సినెర్ తన దూకుడును తగ్గించలేదు. శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో పట్టు బిగించి మూడో సెట్‌ను 6-3తో సులువుగా సొంతం చేసుకున్నారు.ట్రోఫీని తెచ్చిపెట్టిన నాలుగో సెట్నాలుగో సెట్లో ఇద్దరు ఆటగాళ్లు స్కోరును 4-4తో సమం చేసే వరకు పట్టు వదల్లేదు. అయితే, కీలకమైన తొమ్మిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిన్నర్ 5-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత తన సొంత సర్వీస్ గేమ్‌ను ఏమాత్రం తడబడకుండా గెలుచుకుని, సెట్‌ను 6-4తో ముగించి విజయకేతనం ఎగురవేశారు.చరిత్ర సృష్టించిన సిన్నర్ఈ విజయంతో సినెర్ తన కెరీర్లో 5వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించారు. అలాగే, ఓపెన్ ఎరాలో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను వరుసగా రెండో ఏడాది నిలబెట్టుకున్న (Retained) 10వ ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కారు. రన్నరప్‌గా నిలిచిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు ఈసారి కూడా గ్రాండ్ స్లామ్ కల చేజారినట్లయింది.Defence complete. Jannik Sinner defeats Alexander Zverev 6-7(7), 7-6(2), 6-3, 6-4 to win his second Wimbledon trophy. #Wimbledon pic.twitter.com/TejFI5DdbW— Wimbledon (@Wimbledon) July 12, 2026 -
ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా
చరిత్రాత్మక లార్డ్స్ టెస్ట్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్మాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 341-7 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌కు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యస్తిక భాటియా (113) సూపర్ సెంచరీతో, ఆఖర్లో రిచా ఘోష్ (50 నాటౌట్) మెరుపు అర్ద శతకంతో చెలరేగారు. స్మృతి మంధాన (70) అర్ద సెంచరీతో సత్తా చాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 5 వికెట్లతో రాణించింది.అంతకుముందు క్రాంతి గౌడ్ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరుగతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనత, సెంచరీ చేసి క్రాంతి గౌడ్, యస్తిక భాటియా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తమ పేర్లను చిరస్థాయిగా లిఖించుకున్నారు. లార్డ్స్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గా క్రాంతి.. తొలి సెంచరీ చేసిన బ్యాటర్ యస్తిక రికార్డు సృష్టించారు. -
‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్!
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఆగ్రహం ప్రదర్శించాడు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్పే మెస్సీ తొలిసారి కంట్రోల్ తప్పాడు. స్విట్జర్లాండ్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘మర్యాదగా మాట్లాడండి’ అంటూ మ్యాచ్ రిఫరీకి మెస్సీ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. స్విట్జర్లాండ్ ఫ్రీ కిక్కు సిద్ధమవుతున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు డిఫెన్సివ్ వాల్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మెస్సీని నిబంధనల ప్రకారం కొంత వెనక్కి వెళ్లాలని పోర్చుగల్ రిఫరీ జోవో పిన్హీరో సూచించారు. అయితే రిఫరీ మాట్లాడిన తీరు నచ్చకపోవడంతో మెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. ‘నాతో మర్యాదగా మాట్లాడండి. నన్ను అగౌరవపరచొద్దు. నేను మీతో గౌరవంగా మాట్లాడాను.. మీరు కూడా అలాగే మాట్లాడండి’ అంటూ మెస్సీ రిఫరీకి చెబుతున్నట్లు మైక్‌లో రికార్డయ్యాయి. ఈ ఫిఫాలో ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం గోల్ సాధించలేదు. అయితే ఒక అసిస్ట్‌తో మెస్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికొస్తే స్విట్జర్లాండ్‌పై విజయంతో అర్జెంటీనా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై విజయం సాధించింది. ఆట అదనపు సమయంలో రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా స్విట్జర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషం), జులియన్ అల్వరెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) అదనపు సమయంలో గోల్ చేశాడు. స్విట్జర్లాండ్ తరఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. “HABLÁ BIEN, NO FALTES EL RESPETO. A MÍ HÁBLAME BIEN”.Lionel #Messi, al árbitro portugués. 🤬🇦🇷 pic.twitter.com/fxMHSPMvLe— treintaytres (@GRUPOTRESTRES) July 12, 2026చదవండి: అర్జెంటీనా దిగ్గజం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన -
అర్జెంటీనా దిగ్గజం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (89) భారత కాలమన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టడంలో ఆంటోనియో రాటిన్ కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపె ట్టింది. ఆంటోనియో మృతి పట్ల అర్జెంటీనా జట్టు సంఘీభావం ప్రకటించి ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. స్విస్‌తో మ్యాచ్‌కు అర్జెంటీనా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు.రెడ్, యెల్లో కార్డులకు ఆద్యుడు1966లో ఇంగ్లండ్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆంటోనియో రాటిన్‌ను జర్మన్ రెఫరీ రుడాల్ఫ్ క్రీట్‌లీన్ బలవంతంగా మైదానం నుంచి బయటకు పంపడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో కార్డుల విధానం లేకపోవడంతో ఆంటోనియో మైదానం వీడకుండా తనకు అన్యాయం చేశారంటూ మైదానంలోనే కూర్చొని నిరసనకు దిగారు. ఈ సంఘటన ఫుట్‌బాల్ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చింది. బ్రిటన్ రాణి కోసం ప్రత్యేకంగా పరిచిన రెడ్ కార్పెట్‌పై కూర్చొని నిరసన తెలపడంతో పెద్ద చర్చకు దారితీసింది.దెబ్బకు దిగొచ్చిన ఫిఫాదీంతో మరుసటి (1970) ప్రపంచకప్ నుంచి రెడ్, ఎల్లో కార్డుల విధానాన్ని ఫిఫా అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఆటగాళ్లకు రెఫరీ నిర్ణయాలు స్పష్టంగా తెలియజేయబడటానికి మార్గం సుగమం అయ్యింది. ఇక రాటిన్ తన కెరీర్‌ను 'బోకా జూనియర్స్' క్లబ్‌కు అంకితం చేశారు, అక్కడ 1956 నుంచి 1970 వరకు 382 మ్యాచ్‌లు ఆడి, నాలుగు లీగ్ టైటిళ్లను గెలుచుకున్నారు. 1962, 1966 ప్రపంచకప్పుల్లో అర్జెంటీనా తరఫున ప్రాతినిధ్యం వహించారు.ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత ఆంటోనియో రాటిన్ కోచ్‌గా, రాజకీయ నాయకుడిగా కూడా ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. మైదానంలో తన అంకితభావం, దేశం పట్ల గర్వంతో ఆడిన గొప్ప ఆటగాడిగా ఫుట్‌బాల్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతితో, ఫుట్‌బాల్ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయింది. రాటిన్ క్రీడా ప్రస్థానం, ఆయన చేసిన మార్పులు, ఫుట్‌బాల్‌కు ఆయన అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు. 🇦🇷 Argentina wearing black armbands vs Switzerland today Rest in peace, Antonio Rattín The Albiceleste are honouring the Boca Juniors and Argentina legend, who passed away yesterday at 89.Captain of the 1966 World Cup team, his famous sending-off vs England helped inspire… pic.twitter.com/DAbbwUI0qc— Sports Freak (@OfficialSfreak) July 12, 2026 A los 89 años falleció Antonio Rattin símbolo del fútbol argentino y de Boca. Un 5 con garra, capitán de la Selección en el Mundial 66 donde lo expulsaron vs Inglaterra en Wembley y al retirarse estrujo el banderin del corner con la bandera británica. Respetado x rivales. QEPD pic.twitter.com/yQpmU34Aex— Archivo Dany Páez⚪️🔴⚪️ (@DanyPaez1975) July 11, 2026 Falleció Antonio Rattín a los 89 años ⚫👉 Recordamos el día que humilló a los ingleses: estrujó la bandera británica y se sentó en la alfombra real en las semifinales del mundial de 1966 ⚽ pic.twitter.com/w5RHTRyaYX— El Destape (@eldestapeweb) July 11, 2026Read: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్న మెస్సీ తాజాగా స్విట్జర్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మరో ప్రపంచ రికార్డు అందుకున్నాడు. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో గోల్ చేయనప్పటికీ మెస్సీ అరుదైన ఫీట్ సాధించాడు. అలెక్సిస్ మాక్ అలిస్టర్‌కు 10వ నిమిషంలో పిన్‌పాయింట్ కార్నర్ నుంచి అసిస్ట్ అందించాడు. ఈ నేపథ్యంలో ఫిఫా చరిత్రలో అత్యధిక అసిస్ట్‌లు అందించిన ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు. అలిస్టర్‌కు అందించిన అసిస్ట్ మెస్సీకి పదోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా (8 అసిస్ట్‌లు) రికార్డును బద్దలు కొట్టిన మెస్సీ 10 అసిస్ట్‌లతో తొలి స్థానంలో నిలిచాడు. 1966 ఫిఫా ప్రపంచకప్ నుంచి చూసుకుంటే మారడోనా (1982, 1986, 1990, 1994 ఫిఫా వరల్డ్‌కప్స్) కలిపి 8 అసిస్ట్‌లు సాధించాడు. తాజాగా 32 ఏళ్ల తర్వాత మారడోనా రికార్డును మెస్సీ బద్దలుకొట్టడం విశేషం. మారడోనా 8 అసిస్ట్‌లతో రెండో స్థానంలో, ఇక మూడో స్థానంలో జర్మనీ ప్లేయర్ పియెర్రె లిట్బార్స్కీ, పోలండ్ ప్లేయర్ జార్జ్ లాటో చెరో ఏడు అసిస్ట్‌లతో సంయుక్తంగా ఉన్నారు. ఆరు అసిస్ట్‌లతో డేవిడ్ బెక్‌హమ్ (ఇంగ్లండ్), పీలే (బ్రెజిల్), థామస్ ముల్లర్ (జర్మనీ) నాలుగో స్థానంలో నిలిచారు. ఇక 1962లో వరుసగా రెండోసారి చాంపియన్స్‌గా నిలిచిన బ్రెజిల్ సరసన చేరేందుకు అర్జెంటీనా మరో రెండు అడుగుల దూరంలో ఉంది. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో పెనాల్టీ షూటౌట్లో ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన అర్జెంటీనా మూడోసారి ఫిఫా ట్రోఫీ అందుకుంది. ఇక నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను అందుకోవాలనే దృడ సంకల్పంతో ఉంది. జూలై 14న తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, జూలై 16న రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో అర్జెంటీనా తలపడనున్నాయి. జూలై 20న ఫిఫా పైనల్ జరగనుంది.Lionel Messi reaction to Julian Alvarez goal, what a moment 🥹🩵 pic.twitter.com/D977815flQ— MC (@CrewsMat10) July 12, 2026Argentina keep on getting it done 🇦🇷 pic.twitter.com/JHfpxUNlWt— B/R Football (@brfootball) July 12, 2026 -
స్విట్జర్లాండ్ ప్లేయర్ హైడ్రామా.. మరో వివాదంలో అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా మరోసారి వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రిఫరీ తప్పుడు నిర్ణయాలతో అర్జెంటీనా విజయాలు సాధిస్తుందని ప్రత్యర్థి జట్లు ఆరోపణలు గుప్పించాయి. తాజాగా క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యి మైదానం నుంచి బహిష్కరణకు గురి కావడం అర్జెంటీనాను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. నిజానికి ఇక్కడ స్విట్జర్లాండ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో నటనను అద్భుతంగా పండించాడు. కానీ డ్రామా పండకపోవడంతో పాటు తప్పిదానికి మూల్యంగా రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో స్విట్జర్లాండ్ 10 మందికే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది.ఎంబోలోకు రెడ్‌కార్డ్ ఎందుకంటే?విషయంలోకి వెళితే.. ఆట రెండవ అర్ధభాగంలో స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. ఎంబోలోపై అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ అనాలోచిత ఫౌల్ చేసిన కారణంగా మొదట అతడికి యెల్లో కార్డ్ చూపించాడు. అయితే, వీఏఆర్ బృందం జోక్యం చేసుకుని, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్‌కు యెల్లో కార్డు ఇవ్వడం అన్యాయమని, దానిని రద్దు చేయాలని సూచించింది. దీంతో రిఫరీ జోవో పిన్హీరో మైదానం డగౌడ్‌లో ఉన్న మానిటర్‌లోని ఫుటేజీని సమీక్షించారు. ఫుటేజీలో పరేడెస్ ఎలాంటి తప్పిదం చేయలేదని, పరేడెస్ రాకముందే ఎంబోలో కిందపడినట్లుగా నటించినట్లు తేలింది. దీంతో పరేడెస్ యెల్లో కార్డ్ రద్దు చేసిన రిఫరీ ఆ తర్వాత ఎంబోలోకు రెడ్ కార్డ్ చూపించాడు. ఆటలో అంతకముందే ఒక ఫౌల్ చేసిన కారణంగా ఎంబోలో యెల్లో కార్డుకు గురయ్యాడు. తాజాగా తనను కిందపడేశాడంటూ ఆరోపించడం, ఆ తర్వాత ఫుటేజీలో అదంతా నటన అని తేలడంతో ఎంబోలోకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. ఈ సమయంలో మైదానంలో ఒక్కసారిగా హైడ్రామా చోటుచేసుకుంది. రిఫరీ నిర్ణయాన్ని తప్పుబ్టటిన స్విస్ జట్టు నిరసనకు దిగింది. అయితే అదే సమయంలో ఎంబోలో తాను తప్పు చేశానని అంగీకరించడంతో, మ్యాచ్ రిఫరీ అనవసరంగా సీన్ చేయొద్దని, మైదానం నుంచి బయటకు వెళ్లాలని హెచ్చరించాడు. దీంతో చేసేదేం లేక ఎంబోలో ఏడుస్తూ మైదానం వీడాడు. ఈసారి ఫిఫా మొదలైనప్పటి నుంచి వీఏఆర్ సమీక్షలపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. IFAB (అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డ్) ఆట నియమాల ప్రకారం, అనుకరణ అనేది ఖచ్చితంగా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తన వర్గంలోకి వస్తుంది. మ్యాచ్ అధికారులను మోసం చేయడానికి ప్రయత్నించినట్లు రుజువైతే, ఆటగాడికి తప్పనిసరిగా హెచ్చరిక (పసుపు కార్డు) ఇవ్వాలని నియమావళి నిర్దేశిస్తుంది. Breel Embolo crying after receiving the RED CARD in Argentina vs Switzerland FIFA World Cup Quarterfinal game pic.twitter.com/1vpcl43Xod— Daily Foot Vibes (@dailyfootvibes) July 12, 2026Read: చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్.. సెమీఫైనల్లో అర్జెంటీనా


