ఇలవేనిల్‌కు రెండు స్వర్ణాలు | Elavenil Valarivan won two gold medals | Sakshi
Sakshi News home page

ఇలవేనిల్‌కు రెండు స్వర్ణాలు

Feb 8 2026 2:41 AM | Updated on Feb 8 2026 11:54 AM

Elavenil Valarivan won two gold medals

న్యూఢిల్లీ: ఆసియా సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఒలింపియన్‌ ఇలవేనిల్‌ వలారివన్‌ రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో ఇలవేనిల్‌ వ్యక్తిగత విభాగంలో, టీమ్‌ విభాగంలో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. 

ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్‌ 252 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మేఘన సజ్జనార్‌ 229.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని సంపాదించింది. ఇలవేనిల్, మేఘన, ఆర్యా బోర్సెలతో కూడిన భారత బృందం 1892.6 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement