అవిఘ్న ఖాతాలో రజతం
తెలంగాణ స్విమ్మర్ శివానికి మరో రెండు పతకాలు
సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్
రెండు స్వర్ణాలు నెగ్గిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ పావని సరయు రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో గచి్చ»ౌలి స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. రెండో రోజు ఆదివారం మహిళల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ (బ్యాక్‌స్ట్రోక్+బ్రెస్ట్ స్ట్రోక్+బటర్‌ఫ్లయ్+ఫ్రీస్టయిల్) విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్న పావని సరయు... 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగంలోనూ ‘టాప్’లో నిలిచింది.
బాలికల అండర్ 15–17 వయో విభాగం 200 మీటర్ల మెడ్లీ రేసును పావని 2 నిమిషాల 36.86 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే పోటీలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అవిఘ్న చింతల 2 నిమిషాల 37.69 సెకన్ల టైమింగ్‌తో రజత పతకం దక్కించుకుంది. కర్ణాటక స్విమ్మర్ హితశ్రీ (2 నిమిషాల 41.81 సెకన్లు) కాంస్యం గెలుచుకుంది.
బాలికల అండర్ 15–17 వయోవిభాగం 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో పావని 5 నిమిషాల 39.90 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకం నెగ్గింది. కర్ణాటక స్విమ్మర్లు హితశ్రీ (5 నిమిషాల 45.81 సెకన్లు), ప్రతీక్ష గౌడ (5 నిమిషాల 46.32 సెకన్లు) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
విజేతలకు భారత స్విమ్మింగ్ సమాఖ్య
(ఎస్‌ఎఫ్‌ఐ) ఉపాధ్యక్షుడు ఎం.సతీశ్ కుమార్, తెలంగాణ స్విమ్మింగ్ సంఘం (టీఎస్‌ఏ) అధ్యక్షుడు పి.చంద్రశేఖర్ రెడ్డి, టీఎస్‌ఏ సెక్రటరీ జి.ఉమేశ్, ఆంధ్రప్రదేశ్ స్విమ్మింగ్ సంఘం (ఏపీఎస్‌ఏ) సెక్రటరీ ఎ.మోహన్, తెలంగాణ ట్రయాథ్లాన్ సంఘం అధ్యక్షుడు మదన్ మోహన్, జీహెచ్‌ఎంసీ ఏడీఎస్ కె.శ్రీనివాస్ గౌడ్, టీఎస్‌ఏ సంయుక్త కార్యదర్శి ఎస్.గిరిధర్ రావు పతకాలను అందజేశారు.
శివాని జోరు
ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే రెండు పసిడి పతకాలు నెగ్గిన తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా తాజాగా మరో రెండు పతకాలు గెలిచింది. బాలికల అండర్ 13–14 వయో విభాగంలో 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో శివాని 2 నిమిషాల 39.99 సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం గెలుచుకుంది. అలకనంద రాజు (2 నిమిషాల 39.79 సెకన్లు; కేరళ), మాన్య వాధ్వా (2 నిమిషాల 42.94 సెకన్లు) వరుసగా స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు.
» బాలికల అండర్ 13–14 వియో విభాగం 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శివాని 33.19 సెకన్ల టైమింగ్‌తో రజతం నెగ్గింది. శ్రేయ బినిల్ (32.66 సెకన్లు; కేరళ) పసిడి గెలుచుకోగా... తెలంగాణకే చెందిన నందిగామ శివకుమారి (33.76 సెకన్లు) కాంస్య పతకం సాధించింది.
» బాలుర అండర్ 13–14 వయో విభాగం 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో తెలంగాణకు చెందిన సచిన్ సాత్విక్ 2 నిమిషాల 27.41 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. కర్ణాటక స్విమ్మర్ ఆరవ్ 2 నిమిషాల 24.38 సెకన్ల టైమింగ్‌తో పసిడి దక్కించుకోగా... కర్ణాటకకే చెందిన సాతి్వక్ సింగ్ 2 నిమిషాల 2.84 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకం గెలుచుకున్నాడు.
» బాలుర అండర్ 13–14 వయో విభాగం 400 మీటర్ల పోటీలో సచిన్ సాతి్వక్ 5 నిమిషాల 21.77 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం నెగ్గాడు. కర్ణాటక స్విమ్మర్లు ఆరవ్ (5 నిమిషాల 6.52 సెకన్లు), వైభవ్ (5 నిమిషాల 17.98 సెకన్లు) తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు.
» బాలికల అండర్ 15–17... 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో తెలంగాణ స్విమ్మర్ అద్దంకి మోక్షిత పసిడి నెగ్గింది. మోక్షిత 1 నిమిషం 9.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఇషాని (1 నిమిషం 11 సెకన్లు; కేరళ), హితశ్రీ (1 నిమిషం 11.90 సెకన్లు; కర్ణాటక) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
» బాలుర అండర్ 11–12 వయో విభాగం 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగంలో తెలంగాణ స్విమ్మర్ అర్జున్ సందీప్ కాస్వాన్ 2 నిమిషాల 38.68 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. లోహితాశ్వ నగేశ్ (2 నిమిషాల 34.63 సెకన్లు; కర్ణాటక), రోహిత్ (2 నిమిషాల 37.96 సెకన్లు; తమిళనాడు) వరుసగా పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
» బాలికల అండర్ 13–14 వయో విభాగం 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో తెలంగాణ స్విమ్మర్ వేములపల్లి దిత్యా చౌదరీ 1 నిమిషం 18.75 సెకన్లలో పోటీని ముగించి మూడో స్థానంతో కాంస్యం గెలుచుకుంది. మాన్య వాధ్వా (1 నిమిషం 9.65 సెకన్లు; కర్ణాటక), ఆద్య భరద్వాజ్ (1 నిమిషం 10.58 సెకన్లు; కర్ణాటక) వరుసగా స్వర్ణ, రజతాలు హస్తగతం చేసుకున్నారు.
» బాలికల అండర్ 11–12 వయో విభాగం 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ పోటీల్లో తెలంగాణకు చెందిన కోపల్లి హవీష 1 నిమిషం 22.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. నయన (1 నిమిషం 14.72 సెకన్లు; కర్ణాటక), ధ్రుతి (1 నిమిషం 17.52 సెకన్లు; కర్ణాటక) వరుసగా పసిడి, రజత పతకాలు నెగ్గారు.
»బాలికల అండర్ 15–17 వయో విభాగం 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో తెలంగాణ స్విమ్మర్ లిఖిత మెరుపుల 2 నిమిషాల 48.63 సెకన్లలో పోటీని ముగించి రజత పతకం గెలుచుకుంది. కర్ణాటక స్విమ్మర్లు వైష్ణవి (2 నిమిషాల 45.81 సెకన్లు), బీఎస్ జన్య (2 నిమిషాల 52.12 సెకన్లు) వరుసగా స్వర్ణ, కాంస్యాలు నెగ్గారు.
» బాలుర అండర్ 15–17 వయో విభాగం 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కర్ణాటకకు చెందిన రేణుకాచార్య హోడ్మణి విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతడు 9 నిమిషాల 4.66 సెకన్లలో లక్ష్యాన్ని చేని బంగారు పతకం కైవసం చేసుకోగా ... అక్షజ్ పరిగి (9 నిమిషాల 19.57 సెకన్లు; కర్ణాటక), నల్లూరి సాయి స్మరణ్ (9 నిమిషాల 54.27 సెకన్లు; తమిళనాడు) వరుసగా రజత, కాంస్యాలు నెగ్గారు.


