ప్రేమించుకోవడం కంటే దాన్ని కడదాక నిలబెట్టుకోవడం గొప్ప. ప్రేమికులు అవ్వగలిగినంత ఈజీగా..మంచి ఆలుమగలు అనిపించుకోలేరు చాలామంది. వివాహ బంధంలో మనస్పర్థలనేవి కామన్..వాటిని అధిగమించి అన్నివేళలా ఒకరికొకరుగా సాగడం కొందరికే సాధ్యం. అలాంటి వాళ్లు ప్రేమికులుగానూ..దపంతులుగానూ గెలిచి..అందరికీ ఆదర్శంగాన నిలుస్తుంటారు. ఈ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే నేపథ్యంలో ప్రేమను కడదాక ఉంచుకుని..విజయవంత చేసుకుని..అందరిచేత గొప్ప సెలబ్రిటీ జంటగా పిలిపించుకుంటున్న రితేష్ జెనీలియా క్యూట్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!.
రితేష్-జెనీలియాలు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు. పెళ్లై 14 ఏళ్లు అయినా..ఏ ఈవెంట్లో అయినా..జంటగా కనిపించి సందడి చేస్తుంటారు. దపంతులంటే వీళ్లలా ఉండాలి అనేలా ఎంతో అన్యోన్యంగా అందంగా కనిపించే ఈ జంట లివ్‌ఇన్‌రిలేషన్‌షిప్‌కి దూరం అంటే ఒప్పుకుంటారా..!?. ఔను..! ఇది నిజం. సినిమా షూటింగ్‌లు నిమిత్తమైన ఇరువురు వేరుగా.. స్నేహితులతోనే ఉండేవారట.
అంతేగాదు అందరిలా డేటింగ్ చేయకుండా హద్దుల్లో ఉంటూనే ఒకరినొకరు అర్థం చేసుకుని మరి వివాహం చేసుకున్న ఈ జంట అన్యోన్య దాంపత్యం గురించి పలు విషయాలు సానియా మీర్జా పాడ్‌కాస్ట్‌లో షేర్ చేసుకున్నారు కూడా. తాము ఎప్పుడు పెళ్లికి ముందు ఒకే గదిలో కలిసి ఉండటం వంటివి చేయలేదని అన్నారు. కానీ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఎంత దూరంలో ఉన్నా..ఒకరి జీవితంలో ఒకరు ఉండేవాళ్లం. పెళ్లి అయ్యాకే..తాము కలిసి ఉన్నామని, అంతకుమునుపు షుటింగ్ సమయంలో కూడా స్నేహితులతోనే ఉండేవాళ్లమని అన్నారు.
అయినా ఇంతలా అన్యోన్యంగా ఎలా ఉండగలరు మీరు అని అందరు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. అయితే ఇద్దరి మధ్య చక్కటి అవగాహన..ప్రతీది అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే..బంధం స్ట్రాంగ్‌గా ఉంటుందంటున్నారు ఇద్దరు. మధ్యలో జెనీలియా కల్పించుకుంటూ..తనకంతా రితేషేనని. తన ప్రేమ, ఇష్టం, కన్నీళ్లు ఏదైనా రితేష్ అని చెబుతుంది.
తనకు కంటనీరు రాక మునుపే రితేష్‌కి అర్థమైపోతుంది. తనతో ఉన్నవాళ్లకు ఎవ్వరైనా..రితేష్ ఎంతలా కనెక్ట్ అవ్వుతాడో ఇట్టే అర్థమైపోతుంది. అతని కేరింగ్ కూడా అద్భుతమని అంటోంది జెనీలియా. తనెప్పుడు నాతోనే ఉన్న అనుభూతే కలుగుతుంది, ఇంకా చెప్పాలంటే 24/7 అనోచ్చు అని నవ్వుతూ చెప్పింది జెనీలియా. అంతేగాదు ఆ పాడ్‌కాస్ట్ చివరలో మా ఆయన బంగారం అంటూ నవ్వేసింది ఈ అందాల హాసిని..
(చదవండి: నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!)


