గుండెను కోసే గాయం… | From Heartbreak To Healing, How Science Helped Ajay Overcome The Pain Of A Devastating Breakup, Read Story | Sakshi
Sakshi News home page

గుండెను కోసే గాయం…

Feb 13 2026 11:47 AM | Updated on Feb 13 2026 12:16 PM

Your life is more valuable than a temporary pain

ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి అయితే, అది విఫలమైనప్పుడు కలిగే బాధ ఒక నరకం. "ఆమె లేకపోతే నా ప్రపంచం శూన్యం", "ఆమె లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను" అనే భావన ఒక వ్యక్తిని ఆత్మహత్య అనే అగాధం వైపు నడిపిస్తుంది.

'అజయ్' (పేరు మార్చాను) అనే 26 ఏళ్ల యువకుడి జీవితంలో జరిగిన సంఘర్షణ ద్వారా ఈ మరణపు అంచులను స్పృశించే మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం.

‘‘నేను మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటున్నాను, నన్ను మర్చిపో' అని ఆమె పంపిన పది పదాల ఆఖరి మెసేజ్ చదవడానికి నాకు గంట పట్టింది సర్. నా కళ్ల ముందు ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపించింది. అప్పటిదాకా నా భవిష్యత్తు గురించి నేను వేసుకున్న ప్లాన్స్, ఆమెతో కలిసి కన్న కలలు అన్నీ ఒక్క నిమిషంలో బూడిద అయిపోయాయి.

ఆమె వెళ్ళిపోయింది కానీ, ఆమె జ్ఞాపకాలు నా రూమ్ నిండా దెయ్యాల్లా తిరుగుతున్నాయి. ఆమె వాడిన పర్ఫ్యూమ్ వాసన వచ్చినా, ఆమెకు ఇష్టమైన పాట విన్నా నా ఒళ్ళు వణికిపోతోంది. ఫోన్ లో ఆమె పాత మెసేజ్ లు, వాయిస్ నోట్స్ చదువుతూ రాత్రంతా పిచ్చోడిలా ఏడుస్తుంటాను.

ఆమె ఆన్లైన్ లో ఉంటే.. ఎవరితో మాట్లాడుతోంది? నాకంటే మంచివాడు దొరికాడా? తనకి నా బాధ అస్సలు గుర్తు లేదా? అని నా మెదడు నన్ను వెయ్యి ప్రశ్నలతో వేధిస్తోంది.

ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన ఎంగేజ్మెంట్ ఫోటో చూసినప్పుడు.. నా ప్రాణం పోయిందనిపించింది సర్. 'ఆమె లేని ఈ లోకం నాకెందుకు?' అనే ఆలోచన నా మనసులో ఒక వైరస్ లా నాటుకుపోయింది. నేను చనిపోతేనే ఆమెకు నా విలువ తెలుస్తుందని, నా సమాధి దగ్గరకు వచ్చి ఆమె ఏడుస్తుంటే చూడాలని ఒక రకమైన వికృతమైన కోరిక.

నేను ఫెయిల్యూర్ ని అని, నా ప్రేమను కూడా నేను కాపాడుకోలేకపోయానని నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఫ్యాన్ కు తాడు వేసుకుని గంట సేపు చూస్తూ కూర్చున్నాను సార్.. కానీ నా తల్లిదండ్రుల ముఖాలు గుర్తొచ్చి ఆగిపోయాను. అయినా నా మనసు వినడం లేదు.. 'నువ్వు బ్రతకడం వేస్ట్' అని ఒకటే అరుస్తోంది.

ఆకలి చచ్చిపోయింది. ఆఫీసులో పని మీద ఏకాగ్రత లేదు, బాస్ తిడుతున్నా నాకు ఏమీ అనిపించడం లేదు. నిద్ర లేని కళ్లు, చిందరవందరగా ఉన్న గది.. నేను నాలా లేను సార్. బ్రతికి ఉన్న శవంలా ఉన్నాను.

ఆమె నా కాల్స్ ఎత్తడం లేదు, బ్రతిమాలినా కనీసం ఒక్కసారి కూడా మాట్లాడటం లేదు. ఇంత నిర్లక్ష్యం చూశాక కూడా ఆమె కోసం నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలియడం లేదు సార్" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అజయ్.

అజయ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. నాలుగేళ్లుగా తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దాంతో అజయ్ జీవితం నరకంలా మారింది. అజయ్ పడే బాధ కేవలం ఎమోషనల్ కాదు, అతని మెదడులో జరుగుతున్న రసాయనిక మార్పుల వల్ల కలిగే శారీరక హింస.

బ్రేకప్ అంటే కేవలం ఒక వ్యక్తి దూరమవ్వడం కాదు.. శరీరాన్ని, మనసును మొద్దుబారిన కత్తితో కోసినట్లు ఉంటుంది. ఆ నొప్పి కంటికి కనిపించదు, కానీ ప్రతి సెకను చంపేస్తుంటుంది.

బ్రేకప్ అనేది ఒక 'డ్రగ్ విత్ డ్రాయల్' (The Neurological Agony) అజయ్ అనుభవిస్తున్న ఈ స్థితి వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలను గమనిస్తే, ఇది కేవలం బలహీనత కాదని అర్థమవుతుంది.

🔹ది బ్రైన్ ఇన్ విత్ డ్రాయల్ (The Addictive Loop): ప్రేమలో ఉన్నప్పుడు మెదడులో Dopamine (Happy Hormone),  Oxytocin (The Cuddle Hormone) విపరీతంగా విడుదలవుతాయి. బ్రేకప్ అయినప్పుడు, మెదడు ఒక్కసారిగా ఈ హార్మోన్ల సరఫరాను ఆపేస్తుంది. ఇది ఒక మాదక ద్రవ్యానికి బానిసైన వ్యక్తికి ఆ డ్రగ్అందకపోతే ఎంత బాధ కలుగుతుందో (Withdrawal Symptoms), అంతటి నొప్పిని కలిగిస్తుంది.

🔹సోషల్ పెయిన్ ఈజ్ ఫిజికల్ పెయిన్: సైకాలజీ ప్రకారం, మనసు పడే బాధను మెదడులోని Anterior Cingulate Cortex అనే భాగం గుర్తిస్తుంది. విచిత్రం ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని కొట్టినప్పుడు కలిగే శారీరక నొప్పిని గుర్తించే మెదడు భాగమే, మనసు గాయపడినప్పుడు కూడా స్పందిస్తుంది. అంటే, అజయ్
అనుభవిస్తున్న మనోవేదన ఒక ఎముక విరిగినప్పుడు కలిగే నొప్పి కంటే తక్కువేమీ కాదు.

🔹The Amygdala Hijack: అజయ్ మెదడులోని Amygdala (భయం, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసే భాగం) పూర్తిగా అతని లాజికల్ మెదడును (Prefrontal Cortex)డామినేట్ చేస్తోంది. అందుకే అతనికి సూసైడ్ అనేది ఒకే ఒక్క పరిష్కారంలా కనిపిస్తోంది. దీన్నే 'టన్నెల్ విజన్' అంటారు. 

🔹Obsessive Rumination: ‘‘నా తప్పు ఏంటి? ఆమె ఎందుకు మారింది?’’ అని పదే పదే ఆలోచించడం వల్ల మెదడులో Default Mode Network (DMN) అతిగా పని చేస్తుంది. దీనివల్ల బాధితుడు తన గతాన్ని వదలలేక పోతాడు.

🔹The Revenge Fantasy: చాలా మంది "నేను చనిపోతే ఆమె బాధపడుతుంది" అని అనుకుంటారు. ఇది ఒక తప్పుడు రివెంజ్ ఫాంటసీ. చనిపోయిన తర్వాత వారు చూసే బాధను చూడటానికి మీరు ఉండరు అనే నిజాన్ని మెదడు ఆ సమయంలో గ్రహించలేదు. ఇది కేవలం క్షణికావేశంలో మెదడు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం (Executive Dysfunction).

దీనివల్ల కలిగే తీవ్ర నష్టాలు… 
🔸Clinical Depression: కేవలం బాధగా ఉండటం కాదు, ఇది తీవ్రమైన క్లినికల్ డిప్రెషన్ కు దారితీసి మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. 
🔸Self-Harm: తనని తాను కోసుకోవడం లేదా ఆత్మహత్యకు ప్రయత్నించడం ద్వారా మానసిక నొప్పి నుండి ఉపశమనం పొందాలని చూడటం. 
🔸Future Anxiety: "నేను మళ్ళీ ఎవరినీ ప్రేమించలేను", "ఎవరు వచ్చినా నన్ను వదిలేస్తారు" అనే భయంతో మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకోవడం.

ఆవేదన నుండి ఆనందం వైపు (The Path to Recovery) అజయ్ ను ఆత్మహత్య నుండి కాపాడి, అతని జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వడానికి మేము Multimodal Therapy ఉపయోగించాము. అజయ్ దగ్గర ఉన్న పదునైన వస్తువులను, ప్రమాదకరమైన మెడిసిన్స్‌ను తొలగించమని అతని స్నేహితులకు చెప్పాము. ఒంటరిగా ఉండనివ్వలేదు.

"ఈ బాధ శాశ్వతం కాదు, ఇది కేవలం మెదడులోని రసాయనాల చర్య" అని అతనికి అర్థమయ్యేలా వివరించాము. అతని ఫోన్ నుండి ఆమె ఫోటోలు, నంబర్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేయించాము.

అజయ్ లో డోపమైన్, సెరోటోనిన్ పెంచడానికి రోజూ జిమ్ కి వెళ్లేలా చూశాము. తన పాత హాబీలను మళ్ళీ మొదలుపెట్టేలా ప్రోత్సహించాము. CBT, NLPt, Grief Counseling ద్వారా అతని ఆలోచనలను మార్చుకునేలా చేశాం .

The Transformation 
ఆరు నెలల చికిత్స తర్వాత, అజయ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఆఫీసులో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అందుకున్నాడు.🏆
"సార్, ఆ రోజు మీ దగ్గరకు రాకపోయి ఉంటే నేను ఒక జ్ఞాపకంగా మిగిలిపోయేవాడిని. ఇప్పుడు నా జీవితం నాది. ప్రేమ కంటే నా ప్రాణం, నా కెరీర్ చాలా పెద్దవని నాకు అర్థమైంది" అని నవ్వుతూ చెప్పాడు.

అజయ్ కథ మీ కథేనా? బ్రేకప్ బాధ మీ ప్రాణం తీస్తోందా?  గుర్తుంచుకోండి.. మీరు ప్రేమించిన వ్యక్తి మీ జీవితం కావచ్చు, కానీ వాళ్ళు మీ ఊపిరి కాదు. ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన మీ జీవితం ముగిసిపోదు. ఆ నల్లని మేఘాల వెనుక ప్రకాశవంతమైన సూర్యుడు ఉన్నాడని గుర్తించండి. 

మీ మనసు గాయాన్ని మాన్పించడానికి, మీకు మళ్ళీ బ్రతకాలనిపించేలా చేయడానికి శాస్త్రీయమైన చికిత్స ఉంది.

మీ వివరాలు 100 శాతం గోప్యంగా ఉంటాయి. సహాయం కోసం ఈ రోజే  సంప్రదించండి.
— మీ సైకాలజిస్ట్,
Psy. Vishesh
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement