breaking news
Adilabad
-
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలన్నా రు. అలాగే మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఉపాధి, భూభారతి సహా వివిధ విభాగాలకు సంబంధించి ఈ వారం మొత్తం 68 అర్జీలు అందినట్లుగా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తెల్లారిన కూలీల బతుకులు..!
జైపూర్: తెల్లవారితే గమ్యం చేరేవా రే.. పొట్టకూటి కోసం కట్టుకున్న వారిని.. కన్నవారిని విడిచి రాష్ట్రం దాటొచ్చిన వలస కూలీల బొలేరో వాహనంపైకి ప్రమాదం బొగ్గులారీ రూపంలో దూసుకొచ్చింది. గాఢనిర దలో ఉన్న కూలీలంతా ఒక్కసారిగా ఉల్కికిపడ్డారు. ఏం జరిగిందో నని నిద్ర నుంచి తేరుకునే సరికే ప్రమాదం జరిగిపోయింది. ముగ్గురు మహిళా కూలీలు మృత్యువాత పడగా.. మరో 16మందిని క్షతగ్రాత్రులను చేసింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి 20మంది కూలీలు ఆదివారం రాత్రి 10గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు బొలేరో వాహనంలో బయల్దేరారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలోని మంచిర్యాల–చెన్నూర్ 63వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున 3.30 గంటలకు బొలేరో వాహనాన్ని శ్రీరాంపూర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న బొగ్గులారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా బొలేరో వాహనాన్ని ఢీకొట్టగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. దీంతో బొలేరో వాహనంలో ఉన్న 16మంది మహిళా కూలీలు, నలుగురు పురుషులు ఒకరిపైనొకరు పడి ఒత్తిడికి గురయ్యారు. చంద్రపూర్ జిల్లా సావ్లీ మండలం చాందిలిబుజ్ గ్రామానికి చెందిన మీనా(45)కు ఛాతిపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. ఇదే మండలంలోని దిగోరి గ్రామానికి చెందిన మందారీ లీలాబాయ్(65), బెంబిల్ గ్రామానికి చెందిన సోయం విమల్బాయ్(57)కు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా చనిపోయారు. క్షతగాత్రులు వీరే.. సాధనవికాస్ టేకం రేఖవిజయ్ గాత్రే, మమతలక్ష్మ ణ్, శకుంతలపుప్పేశ్వర్ టేకం, మేఘాకార్తీక్ శ్రీరామి, పౌర్ణిమ సురేశ్, ఆత్రం సుమన్‌బాయి, తొడాసే సలోనిఅర్జున్, టేకం వికాస్విశ్వనాథ్, నీలిమస్వప్నిల్, మాయ మాఘు సరిత జితేంద్ర మోర్లే, కల్పన దీపక్ గద్దె, విజయ్ సంతోశ్ బొడ్కావర్ గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అందరినీ 108వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్‌కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై శ్రీధర్ తెలిపారు. వరి నాట్ల కోసం వలస ప్రతిఏటా వరి నాట్ల సీజన్లో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన మహిళా కూలీలు తెలంగాణలోని పెద్దపల్లి, కరీంగనర్ ప్రాంతాలకు వలస వస్తారు. కూలీలంతా బొలెరో వాహనంలో వస్తుండగా ఊహించని విధంగా లారీ రూపంలో మృత్యువు దూసుకు వచ్చింది. బొలెరో వాహనాన్ని లారీ వేగంగా ఢీకొట్టడం కూలీల కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ముగ్గురు చనిపోవడం, కూలీలు తెచ్చుకున్న వంట సామగ్రి, వస్తువులు చెల్లాచెదురు కావడం చూసి కంటతడి పెట్టారు. లేటేవార్ మీనా మృతిచెందగా ఆమె భార్త అనిల్ లేటేవార్ కూడా ఇదే వాహనంలో ఉన్నాడు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దిక్కుతోచని స్థితిలో కన్నీరుపెడుతూ సంఘటన స్థలంలో ఉన్నారు. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం
సారంగపూర్: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ధని, జామ్, ఆలూరు గ్రామాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి గ్రామ పంచాయతీ సర్పంచులే కీలకమన్నారు. గత కొంతకాలంగా సర్పంచులు లేక అభివృద్ధి కుంటుపడిందని, ఇకపై గ్రామాల బాధ్యతలను సర్పంచులు స్వీకరించారని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి తనవంతు కృషి ఎల్లవేళలా అందిస్తానన్నారు. నిర్మల్ రూరల్: మండలంలోని 20గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు పదవీ బాధ్యతలు చేపట్టాయి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చిట్యాల, అనంతపేట, తలువేద గ్రామాల్లో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరై నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం
కై లాస్‌నగర్: నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సాత్నాల మండలంలోని తోయగూడ గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవా రం జిల్లా పంచాయతీ అధికారి రమేశ్‌ను కలిసి ఫి ర్యాదు చేశారు. సర్పంచ్ చౌహాన్ అనసూయకు బ దులుగా వార్డుమెంబర్ అయిన ఆమె కుమారుడు చౌహాన్ చరణ్‌సింగ్ ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. అలాగే 5వ నంబర్ వార్డుమెంబర్ ఈర్వే వందనకు బదులు ఆమె భర్త రవీందర్ ప్ర మాణ స్వీకారం చేశారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన సదరు వ్యక్తులతో పాటు అందుకు సహకరించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్‌రెడ్డి, గ్రామస్తులు ఆర్.దినేష్, సీహెచ్.ప్రవీణ్, ఉపేందర్ కుమార్ తదితరులున్నారు. ప్రమాణ స్వీకారం వివాదాస్పదం సాత్నాల: తోయగూడ సర్పంచ్ చౌహాన్ అనసూ య ప్రమాణ స్వీకారం వివాదాస్పదంగా మారింది. సర్పంచ్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఉచ్ఛరణలో తడబాటుకు గురికావడంతో ఇదే పాలకవర్గంలో వార్డు సభ్యుడిగా ఉన్న ఆమె తనయుడు ఆ మాటలను ఉచ్ఛరించడంపై గ్రామస్తులు ఆక్షేపణ వ్యక్తం చేశారు. డీపీవోకు ఫిర్యాదు చేశారు. -
70వ సారి యువకుడి రక్తదానం
నెన్నెల: మండల కేంద్రం నెన్నెలకు చెందిన శ్రీరాంభట్ల సుశాంత్శర్మ సోమవారం 70వ సారి రక్తదా నం చేసి ప్రాణదాతగా నిలిచాడు. గోదావరిఖని ఏరి యా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో తలసే మియాతో బాధపడుతున్న రవికి ఓ నెగిటివ్ రక్తం అవసరం ఏర్పడింది. మంచిర్యాల బ్లడ్‌బ్యాంకు వా రు ఫోన్ చేయగా వెళ్లి దానం చేశాడు. ఇప్పటికే 20 సార్లు రక్తకణాలు కూడా దానం చేశాడు. అ త్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉన్న వారు 8555 899987 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. రక్తదానం చేస్తున్న సుశాంత్ శర్మ -
విద్యతోనే మంచి భవిష్యత్తు
నేరడిగొండ: విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. రోటరీ క్లబ్ సౌజన్యంతో మండలంలోని కుంటాల బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సోమవారం స్వెట్టర్లు, షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలని సూచించారు. పాఠశాల నుంచి ‘ఇన్స్పైర్ అవార్డు’కు ఎంపికై న విద్యార్థిని వి.చిట్టికి ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. పాఠశాలలో ‘మైండ్‌స్పార్క్’ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రధానోపాధ్యాయుడు అంబారావు, ఐసీటీ ఇన్స్ట్రక్టర్ కృష్ణవేణిలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ కళ్యాణ్, కార్యదర్శి లక్ష్మి, మెంబర్ ఝాన్సీ, బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ బాల కోట్రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
గుండాల పంచాయతీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో
ఇచ్చోడ: మండలంలోని గుండాల పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రామంలో కాకుండా మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ గ్రామంలో 2018 సంవత్సరంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవల్లో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో గ్రామంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎస్పీ అనుమతి ఇవ్వలేదు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సర్పంచ్ షరీఫాబితో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ఎంపీడీవో నరేశ్ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళలో చలి తీవ్రతతో పాటు గాలిలో తేమశాతం పెరగనుంది. మౌలిక వసతుల కల్పనకు కృషి ఇంద్రవెల్లి: గ్రామంలో మౌలి క వసతుల కల్పనతో పాటు పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా. మండలకేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తా. అలాగే గ్రామ మధ్యలో ఉన్న వాగు వరద ఇళ్లలోకి రాకుండా తగు చర్యలు చేపడతా. – రాథోడ్ మోహన్‌సింగ్, సర్పంచ్, ఇంద్రవెల్లి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా నేరడిగొండ: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో జిల్లాలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా. అలాగే మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్ల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తా. వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ వద్ద మరుగుదొడ్లు నిర్మిస్తాం. – ఏలేటి నీలిమ రవీందర్‌రెడ్డి, సర్పంచ్, నేరడిగొండ హామీలన్నీ నెరవేరుస్తా.. ఉట్నూర్‌రూరల్: అందరి సహకారంతో గ్రామంలోని ఆయా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ ప్రాధాన్యత ప్రకారం నెరవే రుస్తా. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పాటుపడతా. – అనిత, సర్పంచ్, ఉట్నూర్ -
ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ కోసం..
తాంసి: ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వేలైన్ కోసం ఏళ్లుగా ప్రతిపాదన పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ రైల్వేలైన్ నిర్మాణ కోసం జిల్లాలోని ఓ నూతన పంచాయతీ తొలి తీర్మానం చేసి ఆమోదించింది. భీంపూర్ మండలంలోని వడూర్ పంచాయతీలో సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం సర్పంచ్ కుడుకల దత్తు యాదవ్ అధ్యక్షతన తొలి గ్రామసభ నిర్వహించారు. ఇందులో ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ నిర్మాణం కోసం కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానం చేశారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన ప్రతిని పాలకవర్గ సభ్యులు ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణ సాధన సమితి అధ్యక్షుడు నారాయణ యాదవ్‌కు అందజేయడంతో పాటు ఉన్నతాధికారులకు సైతం పంపారు. -
బాధలోనూ.. బాధ్యతలు స్వీకరణ
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న బండారి పుష్ప, భర్త బండారి రవీందర్ నామినేషన్ల ప్రక్రియ పూర్తై గుర్తులు కేటాయించాక అనివార్య కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సోమవారం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రమాణం చేసేందుకు వచ్చిన సర్పంచ్ బండారి పుష్ప ఎంతో బాధతో బాధ్యతలు స్వీకరించింది. ఆ సమయంలో ఆమెతో పాటు వచ్చిన కుటుంబీకులు, పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టడం కలిచివేసింది. సర్పంచ్‌గా రాణించి రవీందర్ ఆశయసాధనకు కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో బండారి రవీందర్ ఫొటోతో ఆ నలుగురు సినిమాలోని ‘నేనే గెలిచాను.. నేనే గెలిచాను.. కాదు నన్ను గెలిపించారు.. ఈ ప్రపంచాన్ని గెలిపించేది.. డబ్బుకాదు ప్రేమే’ అంటూ రవీందర్ దంపతుల ఫొటోతో ఉన్న వీడియోలు వైరలయ్యాయి. -
రోడ్డెక్కిన రైతులు
కై లాస్‌నగర్: సోయా కొనుగోళ్లు చేపట్టాలనే డిమాండ్‌తో బేలలో రైతులు సోమవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు తెలపగా.. వ్యాపార, వాణిజ్య సముదా యాలు తెరుచుకోలేదు. రైతుల నిరసనకు సంఘీభావం ప్రకటించారు. దీంతో మండల కేంద్రం నిర్మానుష్యంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ రైతులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. రెండు గంటల పాటు రహదారిని దిగ్బంధనం చేశారు. రాకపోకలు స్తంభించి కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జిల్లాలో వానాకాలం సీజన్లో దాదాపు 70వేల ఎకరాల్లో సోయా సాగు కాగా, 7లక్షల క్వింటాళ్ల మేర దిగుబడులు వచ్చాయని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. మార్క్‌ఫెడ్ లక్ష 20వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి చేతులెత్తేసిందన్నారు. అధిక వర్షాలతో రంగు మారిన పంటను కొనుగోలు చేసి రైతుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు రావుత్ మనోహర్, గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, రాందాస్ నాక్లే, తేజ్రావ్ మస్కే, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పాన్ ఇండియా ప్రస్థానం!
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ బ్రిటీష్ కాలంలో పురుడుపోసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు బొగ్గుట్టలో 1889లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా ఏర్పడింది. 1927లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, 1961లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం, 1991లో ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో బొగ్గుగనులు ఒక్కొక్కటిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో సుమారు 450 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు నిక్షేపాలను భూగర్భశాఖ అధికారులు గుర్తించారు. 1889లో 59,671 టన్నుల బొగ్గు ఉత్పత్తితో కంపెనీ ప్రస్థానం మొదలైంది. జాతీయీకరణ తర్వాత సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం, కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉంది. కార్మికుల త్యాగాలతో మనుగడ.. సింగరేణి సంస్థ మనుగడకు కార్మికుల త్యాగాలే కారణమని చెబుతుంటారు. ప్రకృతికి విరుద్ధంగా ప్రాణాలకు తెగించి భూగర్భంలోకి దిగి చెమటోడ్చి పనిచేశారు. ఆ కష్టమే నేడు సంస్థ సింగరేణి స్థిరత్వానికి పునాదిగా నిలిచాయి. యాంత్రీకరణతో ప్రమాదాలు కొంతమేర తగ్గినా అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు లక్షా పైచిలుకు కార్మికులు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 40వేలకు చేరింది. పరిమిత స్థాయిలో వేడుకలు గతంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించగా, ఈసారి పరిమిత స్థాయిలో జరుపనున్నారు. నిధులను సైతం భారీగా తగ్గించారు. జీఎం కార్యాలయాల్లోనే వేడుకలు నిర్వహించనున్నారు. దీనిపై కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధులు తగ్గించినట్లుగా చెబుతున్నా.. గతం నుంచి వస్తున్న సంప్రదాయాలకు విలువ తగ్గిందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ప్రస్థానం పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఆటుపోట్లను తట్టుకుంటూ దేశంలోని నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. కార్మికుల చెమట చుక్కలతో నిలిచిన సంస్థ.. నేడు బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా సంక్షేమ కార్యక్రమాల ద్వారా గుర్తింపు సాధించింది. డిసెంబర్ 21న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.సింగరేణి వివరాలు కంపెనీ విస్తరణ : ఆరు జిల్లాలు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం భూగర్భ గనులు : 22 ఓపెన్ కాస్టు గనులు : 17 ఉద్యోగుల సంఖ్య: 42,000 నూతన బొగ్గుబావుల ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నా పర్యావరణ నిబ ంధనలు, అటవీశాఖ అనుమతులు, పర్మిషన్లు, భూసేకరణ సవాల్‌గానే మారింది. దీంతో బొ గ్గు ఉత్పత్తితోపాటు ప్రత్యామ్నాయ రంగాలపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మూతపడిన భూగర్భ గనుల్లో మిగిలిపోయిన బొగ్గును ఓపెన్‌కాస్ట్‌ల ద్వారా తవ్వడంతోపాటు ఇతర రంగాల వైపు అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాల కోసం ఇతర ఖనిజాల అన్వేషణపై కూడా ఫోకస్ పెట్టింది. అలాగే పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులు పెడుతోంది. రాజస్తాన్‌లో 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు లభించాయి. అదే రాష్ట్రంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదం లభించింది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, నైనీ బ్లాక్ వద్ద 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్, మణుగూరులో జియో థర్మల్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం, బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. కర్ణాటకలో బంగారు గనుల కోసం ప్రణాళికలు సిద్ధమవుతుండగా.. అనుబంధంగా 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంపైనా దృష్టి సారించింది. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ కార్యాలయ ఏవో దామోదర స్వామి అన్నారు. కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో పాల్గొని ఏజెన్సీ పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి కల్పించాలని కొందరు, పింఛన్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని మరికొందరు అర్జీలు సమర్పించారు. దుర్గం శేఖర్‌పై మరో కేసుఆదిలాబాద్టౌన్: దుర్గం ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దుర్గం శేఖర్‌పై మరో కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. రిమ్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో అరెస్టు చేసి విచారిస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి స్టేషన్ నుంచి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఇంట్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని భాగ్యనగర్‌లో నివాసం ఉండే ఎర్రంవార్ విజయ్ ఇంట్లో ఆది వారం రాత్రి చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు చొరబ డ్డారు. బీరువా పగలగొట్టి నగదుతో పాటు బంగారం ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.లక్ష 80 వేల వరకు ఉంటుందని బాధితుడు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నాగరాజు పేర్కొన్నారు. -
మేజర్.. పల్స్
తెల్లారిన కూలీల బతుకులు..! మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డు సమీపంలో బొలేరో వాహనాన్ని బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృత్యువాత పడ్డారు.పాన్ ఇండియా ప్రస్థానం! సింగరేణి ప్రస్థానం పాన్ ఇండియా స్థాయికి చేరింది. నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం.మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కై లాస్‌నగర్: ఎట్టకేలకు పల్లెకు కళ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఆయా జీపీల్లో నూతన పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుమెంబర్లుగా గెలుపొందిన వారిలో ఒక సర్పంచ్, కొందరు వార్డు సభ్యులు మినహా మిగిలిన వారంతా సోమవారం ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. కుటుంబీకులు, అభిమానులు, బంధువులతో కలిసి నిర్ణీత సమయానికి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారిని అధికారులు పూలమాల, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. నూతన పాలకవర్గాలు కొలువుదీరడంతో 22 నెలల పాటు పంచాయతీల్లో కొనసాగిన స్పెషలాఫీసర్ల పాలనకు తెరపడింది. బాధ్యతల స్వీకరణకు ముందు గ్రామాల్లో పలువురు సర్పంచ్‌లు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. పండుగలా సాగిన పాలకవర్గాల ప్రమాణ స్వీకారంతో పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. కాగా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మెజార్టీ వార్డు సభ్యులు వేర్వేరు పార్టీల మద్దతుదారులు గెలుపొందిన చోట్ల ప్రమాణ స్వీకార ప్రక్రియ ఆలస్యంగా సాగింది. సర్పంచ్‌లు తొలుత ప్రమాణ స్వీకారం చేయగా, ఆలస్యంగా వచ్చిన సభ్యులతో అధికారులు అనంతరం ప్రమాణం చేయించారు. కాగా కొన్ని చోట్ల సర్పంచ్‌లుగా గెలుపొందిన తల్లుల స్థానంలో కొడుకులు, భార్యల స్థానంలో భర్తలు ప్రమాణ స్వీకారం చేసినట్లుగా తెలిసింది. వారి స్థానాల్లో ప్రజాప్రతినిధుల్లా కుటుంబీకులు కూర్చున్నట్లుగా సమాచారం. ప్రమాణ స్వీకారానికి దూరంగా ఓ సర్పంచ్.. 32 మంది వార్డు సభ్యులు జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు ఉండగా తలమడుగు మండలం రుయ్యాడి పంచాయతీ సర్పంచ్ ఎన్నిక జరగలేదు. గుడిహత్నూర్ మండలం శాంతా పూర్ సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తితో పాటు 2,6,7,8 వార్డుమెంబర్లు కాశీ తీర్థయాత్రకు వెళ్లడంతో ప్రమాణ స్వీకారం చేయలేదు. జిల్లాలో మొత్తం 3,870 వార్డు స్థానాలకు గాను 3,857 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇందులో 3,825 మంది ప్రమాణ స్వీకారం చేయగా మరో 32 మంది వివిధ కారణాలతో ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. రుయ్యాడిలో ఐదు వార్డు స్థానాలకు, జైనథ్ మండలం కూర గ్రామంలో 3 వార్డులకు, ఉట్నూర్ మండలం నర్సాపూర్ పంచాయతీలోని 7,8,9 వార్డులకు, బేల మండలం సదల్‌పూర్‌లో ఒక స్థానానికి నామినేషన్ రాలేదు. బజార్హత్నూర్ మండలం గేర్జాయిలో ఒకరు, దహెగాంలో ఒకరు, బోథ్ మండలం కుచులాపూర్‌లో 1,2 వార్డుమెంబర్లు వ్యక్తిగత కారణాలతో ప్రమాణం చేయలేదు. కరత్వాడలో ఇద్దరు, బాబెరతండాలో ఐదుగురు ఆసుపత్రులకు వెళ్లడం ద్వారా ప్రమాణ స్వీకారం చేయలేదు. గుడిహత్నూర్ మండలం మన్నూర్‌లో 2వవార్డు, ఉమ్రిలో 3,6 వార్డులు, డొంగర్‌గావ్‌లో 7వ వార్డు, కమలాపూర్‌లో 1,5,6,8 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు. నార్నూర్ మండలం చోర్‌గావ్‌లో 2,3 వార్డులు, ఖైర్దట్వాలో 2వ వార్డు మెంబర్ అందుబాటులో లేరు. సాత్నాల మండలం పార్డి–కేలో 2,3, పార్డి–బిలో ఒకరు, సాంగ్విలో ఐదుగురు చొప్పున వార్డు సభ్యులు వ్యక్తిగత కారణాలతో ప్రమాణ స్వీకారం చేయలేదు. ఉట్నూర్ మండలంలో బాబాపూర్‌లో 4వ వార్డు, జైత్రాం తండాలో 8వవార్డు సభ్యులు అనారోగ్య కారణాలతో ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఓటరు దేవుళ్ల ఆశీర్వాదంతో గెలుపొందిన సర్పంచ్‌లు సోమవారం పల్లె పగ్గాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మేజర్ జీపీల్లో గ్రామ ప్రథమ పౌరులుగా కొలువుదీరిన వారు పంచాయతీల అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారో ‘సాక్షి’తో వెల్లడించారు ఇలా..ప్రమాణ స్వీకారం చేసిన వార్డు సభ్యులు : 3,825 -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
ఖానాపూర్: పల్లె అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలపై పాలకవర్గాలు దృష్టి సారించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ నూతన సర్పంచులకు సూచించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సమష్టిగా పనిచేసి గ్రామాలను ఉత్తమ పంచా యతీలుగా తీర్చిదిద్దాలన్నారు. మండలంలోని మ స్కాపూర్ సర్పంచ్ దొనికేని లక్ష్మి, తర్లపాడ్ సర్పంచ్ పొలంపెల్లి సచిన్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోమవారం హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు దయానంద్, మాజిద్, తోట సత్యం, వెంకటేశ్, నర్సయ్య, తదితరులున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారుల ప్రతిభ
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రస్థాయి పోటీల్లో ఎక్సైజ్ అధికారులు ప్రతిభ కనబ ర్చారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని రైల్వే ని లయం ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రొహిబి షన్ ఎకై ్సజ్, గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆసిఫాబాద్ డీపీఈవో జ్యోతికిరణ్ బాడ్మింటన్‌లో ప్రథమ బహుమతి సాధించగా, చెస్, క్యారమ్ పోటీల్లో ఇచ్చోడ సీఐ జుల్ఫేఖార్ అహ్మద్ రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించారు. వీరిని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.రఘురాం అభినందించారు. వీరు బహుమతులు అందుకోవడంపై ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నిరసనకైలాస్నగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని వ్య తిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
క్రీడల్లోనూ రాణించాలి
ఆదిలాబాద్‌రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని బంగారుగూడ బాలికల మైనార్టీ రెసిడెన్షియల్లో ఉమ్మడి జిల్లాస్థాయి గేమ్స్–స్పోర్ట్స్ మీట్ 2025–26 ఆదివారంతో ముగిసింది. కార్యక్రమానికి కలెక్టర్ అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమితో నిరుత్సాహ పడకుండా నిరంతరం కృషి చేస్తే విజయం సాధించవచ్చన్నారు. కాగా, ఖోఖో, పరుగుపందెం, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడా పోటీల్లో సుమారు 550 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలతో పాటు మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కలీం, తదితరులు ఉన్నారు. -
తడిసి మోపడాయే!
బోథ్: పల్లె పోరు ముగిసింది.. పంచాయతీల్లో సర్పంచ్‌గా గెలుపొందిన వారు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఆ గెలుపు వెనుక ఉన్న ‘ఖర్చు’ భారీగానే ఉంది. సేవ చేయడం పక్కన పెడితే, విజయం కోసం అభ్యర్థులు చేసిన ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఓడిన వారి పరిస్థితి వర్ణనాతీతమే. లక్షల్లో కుమ్మరించిన అభ్యర్థులు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషించింది. జిల్లాలో అనేక చోట్ల ఓటుకు రూ.500 నుంచి రూ.2వేల వరకు పంచినట్లు తెలిసింది. దావత్ల అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఈసారి ప్రచారానికి సోషల్ మీడియా టీమ్స్, ఫ్లెక్సీలు, ఆటో ప్రచారాల కోసం కూడా రూ.లక్షల్లోనే వెచ్చించారు. విజయం సాధించిన అభ్యర్థుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నా లోలోపల మాత్రం ఖర్చు సెగలు పుట్టిస్తోంది. రాబోయే ఐదేళ్లలో పంచాయతీ నిధులు ఈ ఖర్చులో పదో వంతు కూడా తిరిగి రావు అన్నది నగ్న సత్యం. మరి అభ్యర్థులు ఆ ఖర్చును ఎలా భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
ఖోఖోకు మరింత ప్రాచుర్యం
ఉట్నూర్‌రూరల్: కామన్వెల్త్ క్రీడల్లో చోటు లభించడంతో ఖోఖోకు మరింత ప్రాచుర్యం లభిస్తోందని రాష్ట్ర ఖోఖో అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన తెలంగాణ జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక తుది పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆసియా క్రీడల్లోనూ ఖోఖోకు చోటు కల్పించేందుకు ఫెడరేషన్ కృషి చేస్తోందన్నారు. ఎంపికైన వారు బెంగుళూరులో డిసెంబర్ 31 నుంచి జనవరి 5 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుల జాబితా ప్రకటించారు. బాలుర విభాగంలో ఎం.నిఖిల్, ఎస్.శంకర్, ఆకాశ్, యాదవ్ షావ్, శ్రావణ్‌కుమార్, కార్తిక్కుమార్, జగన్, వెంకటసాయి, పార్థసారథి, సీహెచ్ మాసియా, సంపత్‌నాయక్, శ్యాం, సతీశ్‌కుమార్, నిఖిల్, జె.అనిల్, జైస్వాల్, అరవింద్, త్రిశాల్లు ఎంపిక కాగా.. బాలికల జట్టులో సోని, శ్రీలత, వైష్ణవి, నాగేశ్వరి, సీహెచ్ జంగుబాయి, శ్రీలక్ష్మి, శశిరేఖ, స్వేత, లహరి, చందన, వైష్ణవి, కీర్తన, మేఘన, నవ్యశ్రీ, హర్షిణి, సత్యశీల, మైథిలి, మహలక్ష్మిలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా గిరిజన క్రీడల అధికారి కే. పార్థసారథి, ఖోఖో అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి దయానంద్‌రెడ్డి, రాము, గంగా, హేమంత్, శ్రీనివాస్, రవీందర్, శంకర్, గణేశ రవి, కోచ్‌లు శివకృష్ణ, తిరుమల ఉన్నారు. -
రాజీ మార్గంతో కేసుల సత్వర పరిష్కారం
ఆదిలాబాద్‌టౌన్: రాజీ మార్గంతోనే కేసులు సత్వరం పరిష్కారమవుతాయని జిల్లా జడ్జి ప్ర భాకరరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివా రం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పెండింగ్ కేసులు పరిష్కరించాలనే లక్ష్యంతో హైకోర్టు ఆదేశా ల మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. కేసుల కారణంగా కక్షిదారులు కో ర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృథా చే సుకోకుండా రాజీ మార్గం ద్వారా పరిష్కరి స్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. ఇందులో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, న్యాయమూర్తులు లక్ష్మికుమారి, హుస్సేన్, డీఎస్పీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అది మా భూమే.. కాదు మా భూమే
సాత్నాల: మండలంలోని దుబ్బగూడలో పేదల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఆత్రం లేతుబాయి అ నే గిరిజన మహిళ దానం చేసిన భూమి వివా దాస్పదంగా మారింది. ఆ భూమిలో ఆదివాసీలు ఇళ్ల ని ర్మాణాలు ప్రారంభించగా అటవీశాఖ అధికారులు అడ్డుపడ్డారు. ఈ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వస్తుందని,ఇందులో నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మా త్రం అది పట్టా భూమి అని చెబుతున్నారు. లేతుబాయి పేరిట మూడెకరాలకు పట్టా ఉందని అందులో ఎకరం ఇందిరమ్మ ఇళ్ల కోసం దానం చేశారని పేర్కొన్నారు. అందులో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందు కు ఎలాంటి అవరోధం లేదని అంటున్నారు. లబ్ధి దారులు ఇళ్లు నిర్మించుకోవాలని సూచిస్తుండగా.. అటవీశాఖ అధికారులు మాత్రం అది ముమ్మాటికి తమ భూమేనని అనుమతుల్లేకుండా నిర్మాణాలు చే పట్టడం అక్రమమే అవుతుందని పేర్కొనడం గమనార్హం. ఇరుశాఖల భిన్నమైన ప్రకటనలతో ఆది వా సీల ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అందుకో సం తెచ్చిన సామగ్రి అలంకారప్రాయంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
● పత్తి విక్రయాల్లో అక్రమాలు ● సీసీఐ కొనుగోళ్లపై ఇటీవల విజిలెన్స్ తనిఖీ ● దళారులతో కుమ్మకై ్కన అధికారుల్లో గుబులు ● గతేడాది జరిగిన అక్రమాల్లో ఇద్దరిపై వేటు
ఆదిలాబాద్‌టౌన్: పత్తి కొనుగోళ్ల సమయంలో రైతులకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. దళారులు, వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అనంతరం సీసీఐకి మద్దతు ధరతో విక్రయించి లబ్ధి పొందుతున్నారు. కొంత మంది మార్కెటింగ్, సీసీఐ అధికారులు వారితో కుమ్మక్కు కావడంతోనే ఈ తతంగం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పత్తి కొనుగోళ్లపై వ్యవసాయ మార్కె ట్, జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేశారు. తూకం, తేమశాతం విషయంలో రైతులు మోసపోతున్న తీరును గుర్తించారు. కొనుగోళ్లలో అక్రమాలు.. పత్తి కొనుగోళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిఘా పెట్టింది. ఇటీవల జిల్లాలో తనిఖీలు చేపట్టారు. పలు లోపాలను గుర్తించారు. ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. గతేడాది కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై ఇద్దరు వ్యవసాయ, మార్కెట్ అధికారులపై వేటుపడిన విషయం తెలిసిందే. తా జాగా ఈఏడాదికి సంబంధించి జిన్నింగ్ మిల్లులు, సీసీఐ అధికారుల పాత్రపై ఆరా తీశారు. అయితే సాంకేతికత ఉపయోగించినా అక్రమాలకుపాల్పడు తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల పేరిట విక్రయాలు.. దళారులు రైతుల పేరిట విక్రయాలు జరిపి అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 7లక్షల 10వేల వరకు కొనుగోలు చేయగా, సీసీఐ 30వేల క్వింటాళ్లను కొనుగోలు చేసింది. ప్రైవేట్‌లో పత్తికి ధర లేకపోవడంతో రైతులు సీసీఐకి విక్రయిస్తున్నారు. అయితే సీసీఐ అధికారులు తేమ పేరిట కొర్రీలు పెట్టడంతో గత్యంతరం లేక కొంత మంది ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో కాంటాలు ఏర్పాటు చేసుకొని విక్రయాలు జరుపుతున్నారు. ఆ పత్తినే వాహనాల్లో నింపి యార్డులకు తీసుకొచ్చి సీసీఐకి విక్రయించి లబ్ధి పొందుతున్నారు. రైతుల పట్టాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అధికారుల్లో గుబులు.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మార్కెట్లో తనిఖీలు చేపట్టడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. గతేడాది ఓ ఏవోతో పాటు వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కౌలు రైతుల పేరిట నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లు పత్రాలు జారీ చేయడం, కొంత మంది రైతుల పేరిట వ్యాపారులు వందల క్వింటాళ్లు సీసీఐకి పత్తిని విక్రయించారు. ఈ ఏడాది కూడా దళారులు రైతుల పట్టాలు తీసుకొచ్చి పత్తిని విక్రయిస్తుండడం గమనార్హం. ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీ సమయంలో కాంటాలు, సీసీ కెమెరాలు, ప్రైవేట్, సీసీఐ కొనుగోళ్లు, రైతులకు జరుగుతున్న మోసాలు, తదితర వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించారు. నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
సిరికొండ: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆది వారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. అలాగే బాధితుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. అనంతరం మండలంలోని కన్నాపూర్‌లో గ్రామస్తులకు దుప్పట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఎస్సై పూజ, సిబ్బంది పాల్గొన్నారు. -
‘బాల చెలిమి’ విజేతలకు బహుమతి ప్రదానం
జైనథ్: చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలచెలిమి కథల పోటీలో జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. జైనథ్ మండలకేంద్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు వి జేతలుగా ఎంపికయ్యారు. పిల్లల కథల విభాగంలో మండలంలోని కూర గ్రామానికి చెందిన గీస శ్రీజ రాసిన ‘వ్యవసాయం’, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన తల్లెల కీర్తి రాసిన ‘మట్టి గణపతి’ కథలు ఎంపికవగా.. పెద్దల విభాగంలో లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు పోరెడ్డి అశోక్ రాసిన ‘గూడు మార్చిన కాకి’ ఉత్తమ కథగా నిలిచా యి. విజేతలకు హైదరాబాద్‌లో ఆదివారం బ హుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, బాల చెలిమి సంపాదకులు వేద కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
.. అనే నేను
కై లాస్‌నగర్: జిల్లాలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లతో పాటు వార్డుమెంబర్లుగా ఎన్నికై న వారంతా మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నూతన పాలకవర్గాలకు స్వాగతం పలికేలా పలు చోట్ల పంచాయతీ భవనాలకు కార్యదర్శులు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. అయితే కొత్త పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో అంగన్వాడీలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలిక పంచాయతీలను ఏర్పాటు చేశారు. పలుచోట్ల వాటిని కూడా అలంకరించారు. సోమవారం ఉదయం 10గంటలకు జిల్లాలోని 473 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రమాణ స్వీకార ప్రక్రియ షురూ కానుంది. పంచాయతీరాజ్ ఏఈలు, ఈజీఎస్ ఏపీవోలు, హౌసింగ్ ఏఈలు, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీవోలు, పీజీ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ వంటి వారిని పంచాయతీకో ప్రత్యేకాధికారిగా నియమించారు. తొలుత సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఉపసర్పంచ్లు, వార్డుమెంబర్లు అక్షరమాల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పలుచోట్ల నిర్వహించనున్న కార్యక్రమాలకు ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే దాదాపు 22 నెలల తర్వాత పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువు దీరినట్లవుతుంది. సర్పంచ్ల పాలన అందుబాటులోకి రానుంది. అలాగే పెండింగ్ నిధులు కూడా విడుదల కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రాష్ట్ర విద్యాసదస్సు జయప్రదం చేయండి
ఆదిలాబాద్‌టౌన్: టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్ట న్న, అశోక్ కోరారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సదస్సు పోస్టర్‌ను ఆదివారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈనెల 28, 29 తేదీల్లో జనగాం జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలి పారు. మొదటి రోజు నిర్వహించే సదస్సుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరువుతారని పేర్కొన్నారు. జిల్లా నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో సంఘం నాయకులు శ్రీనివాస్, స్వామి, ఇస్తారి, గౌస్ మోయినొద్దీన్, శివన్న తదితరులు పాల్గొన్నారు. -
లెక్క చెప్పకుంటే చిక్కులే!
కై లాస్‌నగర్: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ము గిసింది. అయితే పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి తాను చేసిన ఖర్చుల వివరాలను 45 రోజుల్లోగా సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. గడువులోపు సమర్పించకుంటే పదవీ కోల్పోయే అవకాశముందని స్పష్టం చేసింది. వివరాల సమర్పణకు తొలిసారిగా ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. టీఈ–ఫోల్ వెబ్ పోర్టల్‌లో పొందుపర్చాలని సూచించింది. సకాలంలో సమర్పించకుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులయ్యే అవకాశముందని స్పష్టం చేసింది. వ్యయ వివరాల సమర్పణ ఇలా.. ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు చేయాల్సిన ఖర్చులను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈసీ నిబంధనల ప్రకారం 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన వారు రూ.30వేలు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఐదు వేలకుపైబడి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ పదవీకి రూ.2.50లక్షలు, వార్డుసభ్యుల పదవికి రూ.50వేల వరకు ఖర్చు చేయవచ్చని ఈసీ నిర్ణయించింది. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ఖర్చులను వెల్లడించాల్సి ఉంటుంది. ఫారం–1లో అభ్యర్థులు చేసిన మొత్తం వ్యయం, ఫారం–2లో రోజు వారీగా చేసిన ఖర్చుల వివరాలు, ఫారం–3లో దేని కోసం ఎంత ఖర్చు చేశారు వంటివి నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలను సమర్పించినట్లుగా ఫారం–4 అందజేసి రశీదు పొందాలి. ఈమేరకు ఈసీ స్పష్టమైన గడువు కూడా నిర్దేశించింది. తొలి విడతలో పోటీ చేసిన అభ్యర్థులు వచ్చే ఏడాది జనవరి 21, రెండో విడత వారు జనవరి 27, మూడో విడత వారు జనవరి 30వ తేదీ వరకు వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు రాతపూర్వకంగా అందజేయాల్సి ఉంటుంది. గడువులోపు ఇవ్వకుంటే వేటు.. పంచాయతీరాజ్ చట్టం–2018 సెక్షన్– 23 ప్రకారం గడువులోపు ఈ వివరాలను సమర్పించకుంటే గెలిచిన అభ్యర్థులు పదవీ కోల్పోవడంతో పాటు మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఓడిన అభ్యర్థులు మూడేళ్ల వరకు ఇతర ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఎంపీడీవోలకు అందిన ఈ వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన జిల్లా కమిటీ పరిశీలించి టీఈ– ఫోల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు.జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వివరాలు విడత సర్పంచ్‌లు వార్డు తొలి 525 1995 రెండో 520 2496 మూడో 421 2103 -
● మట్టితో గృహోపకరణాల తయారీ ● టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ
శిక్షణ పొందుతున్న మహిళలుమట్టితో రూపుదిద్దుకున్న నంది కళాకృతి కేంద్ర టెక్స్టైల్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ హ్యాండీక్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. నవంబర్ 23న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 23తో ముగియనుంది. ఇందులో భాగంగా మట్టితో తయారు చేసే 25 రకాల వస్తువులను సృజనాత్మకంగా డిజైన్ చేసేలా శిక్షణ ఇస్తున్నారు. మహిళలు ఉత్సాహంగా వాటిని భిన్న ఆకృతుల్లో తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. శిక్షణతో పాటు స్టైఫండ్ రూపంలో రూ.7,500 అందుతుండడంతో పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. శిక్షణతో పాటు మార్కెటింగ్ మెలకువలు శిక్షణతో పాటు వారు తయారు చేసిన వాటికి ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనే విషయంపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. సృజనాత్మకంగా తయారు చేసిన కళాకృతులను హస్తకళ మేళాలు జరిగినప్పుడు ప్రదర్శించేలా నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందిస్తున్నారు. అంతేకాకుండా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి రుణాలు ఇప్పించేలా సైతం పరిశ్రమల శాఖతో తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. మట్టితో తీర్చిదిద్ది.. రంగులద్ది.. మహిళలు ముందుగా బంక మట్టి, ఎర్రమట్టి, టెర్రాకోట మట్టితో కళాకృతులను తయారు చేస్తున్నారు. వాటిని మూడు రోజులపాటు ఎండబెట్టి, అనంతరం 3 నుంచి 4 గంటల పాటు బట్టిలో కాలుస్తున్నారు. బయటకు తీసిన తర్వాత వాటిని శుభ్రం చేసి ఆయిల్ పెయింట్ వేస్తున్నారు. వాటిపై ప్రత్యేక డిజైన్లు వేస్తూ తీర్చిదిద్దుతున్నారు. -
బాల మేధస్సు భళా!
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టారు. భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు పునాది వేసుకున్నారు. నూతన ఆవిష్కరణలు తయారు చేసి ఔరా అనిపించారు. పర్యావరణం, ప్రమాదాలు, కాలుష్య నివారణ, పనికి రాని వస్తువులతో ఉపయోగాలు ఇలా అనేక అంశాలతో వినూత్న రీతిలో ప్రాజెక్ట్‌లు రూపొందించారు. మానవాళికి ఉపయోగపడే విధంగా నమూనాలు ప్రదర్శించారు. వాటిని తిలకించిన వారు బాల మేధావులు.. భళా అంటూ అభినందించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు సైన్స్‌ఫేర్, ఇన్స్పైర్ మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చి ప్రదర్శించారు. శనివారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. వచ్చే నెల 6, 7, 8వ తేదీల్లో కామారెడ్డి జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు జరుగనున్నాయి. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలు తయారు చేసి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. పాఠశాలల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించాలన్నారు. సైన్స్, గణితం అంటే భయం పొగొట్టేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్, డీఈవో ఎస్.రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, సైన్స్ అఽఽధికారి ఆరె భాస్కర్, సెక్టోరల్ అధికారులు రఘురమణ, తిరుపతి, సుజాత్‌ఖాన్, ఎంఈఓ సోమయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొమ్ము కృష్ణకుమార్, శ్రీనివాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సైబర్ మోసాలపై ప్రజలను చైతన్యవంతం చేసేలా ముద్రించిన ప్రచార పోస్టర్‌ను శనివా రం తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్రమత్తతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు 1930కు సమాచారమందించాలని సూచించారు. గంటలోపు ఫిర్యాదు చేసిన వారి నగదు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా థర్డ్‌పార్టీ అప్లికేషన్లను వినియోగిస్తూ మొబైల్ ఫోన్లో వాటికి అనుమతులు ఇవ్వడంతో డాటా చోరీకి గురవుతుందన్నారు. వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లి బ్లాక్ మెయిల్‌కు పాల్పడే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. సోషల్ మీడియాలో జాబ్‌ఫ్రాడ్, వర్క్‌ఫ్రం హోం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, బిజినెస్ ఫ్రాడ్, ఏఐ ఆధారిత వీడియో సందేశాలతో కూడిన ఫ్రాడ్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలు జరుగుతున్నట్లుగా తెలిపారు. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
భీమారం: గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన కొత్తపల్లి గ్రామానికి చెందిన రత్న వేణుగోపాల్‌రెడ్డి (43) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై శ్వేత తెలిపిన వివరాలు.. భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసై రోజూ మద్యం సేవిస్తుండగా భార్య లత హెచ్చరించింది. దీంతో మనస్తాపానికి గురై మద్యం సేవించిన మత్తులో భార్యతో గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి 10.30 గంటలకు ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా శనివారం మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూర్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతిదిలావర్పూర్: మండల కేంద్రం దిలావర్పూర్ సమీపంలో నిర్మల్ –భైంసా రహదారిపై టోల్‌ఫ్లాజా సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్యారంగుల తిమ్మయ్య(45) అనే వ్యక్తి మృతి చెందినట్లు దిలావర్పూర్ ఎస్సై రవీందర్ వెల్లడించారు. భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన తిమ్మయ్య తన ద్విచక్రవాహనంపై నిర్మల్ వెళ్తుండగా సాయంత్రం దిలావర్పూర్ సమీపంలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఎన్హెచ్ఏఐ అంబులెన్స్‌లో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తప్రావం కాగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
రైల్వేలైన్ డీపీఆర్ ఆమోదించండి
నిర్మల్: నిర్మల్ జిల్లా మీదుగా ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వేలైన్‌కు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) పూర్తయిందని, త్వరగా ఆమోదించా లని ఆదిలాబా ద్ ఎంపీ నగేశ్ రైల్వేబోర్డును కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో శనివారం రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్‌ను కలిశారు. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ కోసం దక్షిణ మధ్య రైల్వే డీపీఆర్ పూర్తిచేసి బోర్డుకు పంపిందని తెలిపారు. ఈ నివేదికను త్వరగా ఆమోదించాలని విన్నవించారు. రెబ్బెన వద్ద ఎల్సీ–71 రోడ్ ఓవర్ బ్రిడ్జి కోసం టెండర్లను ప్రారంభించాలని కోరారు. డీపీఆర్ ఆమోదంపై రైల్వేబోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ నగేష్ తెలిపారు. ఇప్పుడే కీలకంజిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణంలో ఇదే కీలక ప్రక్రియ. మూడు జిల్లాలను కలుపుతూ 136.50కిలోమీటర్ల ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్ నిర్మాణానికి రూ.4,300కోట్ల అంచనాతో డీపీఆర్ పూర్తి చేశారు. ఇందులో రైల్వేబోర్డు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం పంపిస్తే ఇక రైల్వేలైన్‌కు పచ్చజెండా ఊపినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. -
నేరాల అదుపునకు కృషి చేయాలి
ఇంద్రవెల్లి: పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ నేరాల అదుపునకు కృషి చేయాలని ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయల్ 100, పోలీస్ అక్క కార్యక్రమాల అమలుపై పలు సూచనలు చేశారు. విధి నిర్వహణ లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటారు. ఇందులో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, కానిస్టేబుళ్లు ఉన్నారు. -
విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి
నిర్మల్‌టౌన్: విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో కూడా ప్రతిభ కనబర్చాలని అదనపు కలెక్టర్ ఫైజా న్ అహ్మద్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పతకాన్ని ఆవిష్కరించి, క్రీడలను ప్రారంభించారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ క్రీడలు ఉన్నాయి. ఈ క్రీడల్లో 50 మంది బాలికలు, 100 బాలురు పాల్గొన్నారు. పోటీలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, పీడీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్: బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత అని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆర్పీఎల్ పాఠశాలలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడపిల్లల రక్షణ, సంరక్షణ కోసం జేజేబీ కోర్టు, చైల్ట్ లైన్, ఐసీపీఎస్, ష్యూర్ ఎన్జీవోలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆపదలో ఉన్నవారు ధైర్యంగా 1098, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బ్యాగులను బహుమతిగా అందజేశారు. ఇందులో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సతీశ్‌కుమార్, ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ వినోద్, సూపర్వైజర్ సంపత్, కిరణ్, హెచ్ఎంలు బొర్రన్న, మల్లయ్య, ఆరీఫ్, ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన విద్యార్థులు
బోథ్:నాసిరకం భోజనం తినలేకపోతున్నామంటూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో భో జ నంలో పురుగులు వస్తున్నాయంటూ పలువురు వి ద్యార్థులు శనివారం హాస్టల్ నుంచి బయటకు వ చ్చారు. బస్టాండ్ వైపునకు వెళ్లారు. విషయం తెలు సుకున్న స్థానిక ఎస్సై శ్రీసాయి అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. తిరిగి వసతి గృహానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏటీడబ్ల్యూవో సుచరితన్రెడ్డి ఎస్సైతో చర్చించారు.గతంలో కూడా కొంతమంది విద్యార్థులు భోజనంలో పు రుగులు వస్తున్నాయని తెలిపారని పేర్కొన్నారు. కొందరు మాత్రం ఎలాంటి పురుగులు రావడం లేదని పేర్కొన్నారని తెలిపారు. కాగా, క్రమశిక్షణగా ఉండాలని, ఫోన్లు వాడవద్దని వార్డెన్ నాందేవ్ అనడంతోనే సీని యర్లు ఇలా చేశారని మిగతా విద్యార్థులు పేర్కొన్నా రు. ఎస్సైతో పాటు ఏటీడబ్యూవో హాస్టల్‌ను సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. వసతిగృహాన్ని సందర్శించిన డీడీ ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఐటీడీఏ డీడీ అంబాజీ శనివారం ఉదయం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో నిల్వ ఉన్న సరుకులు, రికార్డులను పరిశీలించారు. క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట వార్డెన్ నాందేవ్ ఉన్నారు. కాగా, డీడీ వచ్చిన వెళ్లిన తర్వాత విద్యార్థులు ఆందోళనకు దిగడం గమనార్హం. -
చూస్తారు.. క్షణాల్లో గీస్తారు!
ఇచ్చోడలోని తెలంగాణ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ బాలుర పాఠశాల విద్యార్థుల ప్రతిభ ఔరా అనిపిస్తోంది. ఈ పాఠశాలకు చెందిన పలువురు చిత్రలేఖనంలో రాణిస్తున్నారు. లైవ్ఆర్ట్స్లో అద్బుతమైన చిత్రాలు గీస్తున్నారు. వారు చూసిన దృశ్యాన్ని క్షణాల వ్యవధిలోనే బొమ్మలాగా మార్చేస్తూ అబ్బురపరుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన సైన్స్‌ఫేర్‌కు హాజరైన శ్రీకాంత్, మనోజ్, ప్రవీణ్, అభిరాం, అఖిల్‌లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల చిత్రాలను గీసి శభాష్ అనిపించుకున్నారు. ఆర్ట్స్టీచర్ కృష్ణ పర్యవేక్షణలో వీరు ఈ కళానైపుణ్యం సాధించారు. – ఆదిలాబాద్‌టౌన్ -
నామినేటెడ్ వచ్చేనా..!?
సాక్షి, ఆదిలాబాద్: అధికార కాంగ్రెస్‌లో మరోసారి నామినేటెడ్ పదవులపై చర్చ మొదలైంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జిల్లాలోని పలు నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇప్పుడు.. అప్పుడు అంటూ అధిష్టానం దాటవేసుకుంటూ రావడంతో ముఖ్యనేతలు, కార్యకర్తల్లో నిరాశ నెలకొంది. సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో మంచి ఫలితాలు సాధించామని పార్టీ ముఖ్య నేతలు ఆనందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఇకనైనా ఈ పదవులను భర్తీచేస్తే పార్టీ బలోపేతానికి దోహదపడినట్లవుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సంబరమే తప్పితే ముఖ్య పదవుల పరంగా అందని ద్రాక్షలాగా పదేపదే వాయిదా పడుతుండటంతో పార్టీ శ్రేణుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కష్టపడి పనిచేసే నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం కొరవడుతుందన్న అభిప్రాయం వారిలో లేకపోలేదు. జిల్లా స్థాయిలో పలు నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిపై దృష్టి సారించకపోవడంపై నిరుత్సాహం వ్యక్తమవుతోంది. జిల్లాస్థాయిలో పార్టీ పరంగా రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన నేతలు లేకపోవడంతో ఈ దుస్థితి ఉందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. ఈ సారైన భర్తీ అయ్యేనా.. ఆదిలాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఔడా)ని ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా ఆ చైర్మన్ పదవీ ఎవరికి కేటాయించకపోవడంతో అసలు ఆ అథారిటీ ఎందుకు ఏర్పాటు చేశారు.. ఆ వ్యవస్థ కూడా ఇప్పటి వరకు సరైన దశలో లేకపోవడంపై చర్చ సాగుతోంది. చైర్మన్‌ను నియమించి వ్యవస్థను అందుబాటులోకి తేవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ఉట్నూర్ ఐటీడీఏకు సంబంధించి ఆదిమ గిరిజన సంక్షేమ సలహా మండలి (ఏటీడబ్ల్యూఏసీ) చైర్మన్‌ను నియమించాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉందని చెప్పుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించిన సమయంలో ఎంపీ గోడం నగేశ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సీఎం కూడా త్వరలోనే ఈ పదవీని భర్తీ చేస్తామని పేర్కొనడం గమనార్హం. దీంతో ఈ పదవీ ఎవరికి దక్కుతుందా ..అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చర్చ సాగుతోంది. డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ ఓ ముఖ్యనేతకు ఈ పదవీ ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతుంది. అలాగే పలు దేవాలయాలకు సంబంధించిన పాలకమండళ్లను సైతం నియమించాలని, పార్టీలో నేతలు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తే పార్టీ అభ్యున్నతికి పాటుపడే అవకాశముంటుందని అభిప్రాయపడుతున్నారు. -
ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలు
కుంటాల: మండలంలోని కల్లూరు –కుంటాల రహదారిపై శనివారం సాయంత్రం ఆదర్శ పా ఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడడంతో వారికి గాయాలయ్యాయి. స్థానిక ఆ దర్శ పాఠశాల నుంచి ఓ ఆటోలో 12 మంది వి ద్యార్థులు కల్లూరు వెళ్తుండగా వెంకూర్ స మీపంలో ఆటో బోల్తాపడింది. నర్సాపూర్ (జి) మండలంలోని బూర్గుపల్లి (కె) గ్రామానికి చెందిన జాదవ్ అక్షర, వైష్విక, చాక్పెల్లి గ్రామానికి చెందిన రశ్మిత, కుంటాల మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన పడకంటి స్వాతికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం భైంసా, కల్లూరు తరలించారు. ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు సాయపడ్డారు. కనిపించకుండా పోయి.. శవమై తేలి బోథ్: సొనాల మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కా ర్మికుడు బత్తుల రాము(38) గ త మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు. కాగా శని వారం రాత్రి సొనాల గ్రామ డంపింగ్ యార్డు వద్ద శవమై క నిపించాడు. పక్కనే ఉన్న చెట్టుకు తాడు కట్టి ఉంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఎస్సై శ్రీసాయి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిఽశీలించారు. పంచనామా నిర్వహించి మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కాగా భార్య బత్తుల రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉప సర్పంచ్ రాజీనామామంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దానయ్య తన ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఎంపీడీఓ సాయివెంకటరెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. ఈ నెల 11న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం వార్డు సభ్యుల అంగీకారంతో ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఏం జరిగిందో గానీ రాజీమానా చేయగా.. ఇంకా ఆమోదం కా లేదు. పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఉప సర్పంచ్‌గా దానయ్య ప్రమాణ స్వీకారం చేయాలని అంటున్నారు. ప్రమాణ స్వీకారం చేయకముందే రాజీనామా చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. -
ధ్యానం.. జీవనరాగం
ఆదిలాబాద్: ధ్యానం అంటే కేవలం కళ్లు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదని, ఆలోచనలు నియంత్రించుకోవడం, మనసును శాంతపరచుకోవడం, స్వీయ అవగాహన పెంపొందించుకోవడమేనని ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు. మరోవైపు పరిశోధనలు సైతం ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గడం, ఏకాగ్రత పెరగడం, నిర్ణయక సామర్థ్యం మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. నేడు ప్రపంచ ధ్యాన దినోత్సవం నేపథ్యంలో కథనం.. ఎన్నో ప్రయోజనాలు.. ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసు ప్రశాంతమై ఆలోచనలపై నియంత్రణ సాధ్యమవుతుంది. ఆందోళన, కోపం, నిరాశ వంటి భావాలు క్రమంగా తగ్గుతాయి. ధ్యానం ఏకాగ్రతను పెంపొందిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టత, ఆత్మవిశ్వాసం పెరగడం ధ్యానం వల్ల కలిగే మరో లాభం. ఆరోగ్యంపరంగా కూడా ధ్యానం కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచడం, హృదయ ఆరోగ్యం మెరుగుపడటం, నిద్ర సమస్యలు తగ్గడం వంటి లాభాలు ధ్యానం ద్వారా సాధ్యమవుతాయి. రోగనిరోధక శక్తి పెరగడంలో కూడా ధ్యానం సహకరిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం కదలకుండా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. మొదట్లో కొద్దిసేపు మాత్రమే ధ్యానం చేసి దాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఐదు నిమిషాలతో ప్రారంభించి, క్రమంగా పది లేదా ఇరవై నిమిషాలకు పెంచుకోవచ్చు. -
డెంటల్ డాక్టర్ల క్రికెట్ లీగ్
నిర్మల్‌టౌన్: తెలంగాణ డెంటల్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం, కొండాపూర్ సమీపంలోని గ్రౌండ్లో రాష్ట్రస్థాయి డెంటల్ డాక్టర్ల క్రికెట్ లీగ్ మ్యాచ్ సీజన్ –5 నిర్వహించారు. ఈ పోటీలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. ఇందులో ఆ దిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, ని జామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను నిర్మల్ డాక్టర్స్ అసోసియేష న్ అధ్యక్షుడు ము రళి, సీనియర్ డాక్టర్ అప్పాల చక్రధరి, రమేశ్ రెడ్డిలు ముందుగా టాస్ వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ వెంకటరమణ, డాక్టర్ అసోసియేషన్ మెంబర్స్ రామకృష్ణ, నమిత, సుభాశ్ రావు పాల్గొన్నారు. -
‘మున్సిపల్’లో విజిలెన్స్ తనిఖీలు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ విభాగం కరీంనగర్ ఇన్స్పెక్టర్ సంతో షం రవీందర్, తహసీల్దార్ దినేశ్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఆరుగురు అధికారులతో కూడిన బృందం సుదీర్ఘంగా పరిశీలన జరిపింది. తొలుత మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజును మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం గ్రూపులుగా విడిపోయిన అధి కారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని ఇంజినీరింగ్, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఎస్టాబ్లిష్ మెంట్, రెవెన్యూ, అకౌంట్స్ విభాగాలతో పాటు స్టోర్‌రూంను సైతం పరిశీలించారు. ఆయా విభాగాల్లో చేపట్టిన పనులు, చేసిన కొనుగోళ్లు, చెల్లించిన బిల్లులు, నిధుల వ్యయం వంటి అంశాలపై ఆరా తీశారు. సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించా రు. ఆయా విభాగాధిపతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11.30గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 7గంటల వరకు కొనసాగడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ తనిఖీలతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందోననే ఆందోళన పలువురిలో కనిపించడం గమనార్హం. విచారణ నివేదికను రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఈ)కి అందజేస్తామని ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. వారి వెంట సాయిరాం,కె.శ్రీనివాస్, తదితరులున్నారు. ‘సాక్షి’ కథనాల ఆధారంగా.. ఆదిలాబాద్ మున్సిపల్లోని ఆయా విభాగాల్లో అక్రమాలను వివరిస్తూ ‘సాక్షి’లో ఇటీవల పలు వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ చూపుతూ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. పట్టణంలోని విద్యుత్ దీపాల నిర్వహణకు సంబంధించి రూ.1.26 కోట్లతో చేపట్టిన టెండర్లలో తప్పిదాలు, లాండసాంగ్వి పంప్‌హౌస్ వద్ద చేపట్టిన పనులు, టెండర్లలో అక్రమాలు, అలాగే టెండర్లు లేకుండానే బ్లీచింగ్ పౌడర్, రెయిన్ కోట్లు కొనుగోళ్లు, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఆలస్యంగా పనులు చేపట్టి, బిల్లులు స్వాహా చేసిన వైనం, హరితహారం అమల్లో లోపాలు, అక్రమ లేఅవుట్ల దందా వంటి విభాగాల్లో అక్రమాలను ‘సాక్షి’ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అలాగే కార్మికులు పనిచేయకున్నా చేసినట్లుగా చూపించడంపై కూడా ఆరా తీసినట్లుగా సమాచారం. కాగా, కార్యాలయంలో అందించిన నివేదికలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేకపోవడంతో తన బాగోతం బయటపడి ఎలాంటి చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందనే దానిపై ఆందోళనకు గురైన ఓ అధికారి కవరేజీ కోసం వెళ్లిన విలేకరులపై తన అక్కసు వెల్లగక్కడం గమనార్హం. పరుష పదజాలంతో దూషిస్తూ ‘గెటౌట్ ఫ్రం మై ఆఫీస్’ అంటూ హెచ్చరించడం చర్చనీయాంఽశంగా మారింది. మీడియా ప్రతినిధులపైనే నోరు పారేసుకున్న సదరు అధికారి ఇక సామాన్యులకు ఎలాంటి సేవలందిస్తారనే దానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి
ఆదిలాబాద్‌రూరల్: అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని మామిడిగూడ బాలి కల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు శనివారం స్వెట్టర్లు, షూ, సాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీడీ అంబాజీ, ఏటీడీవో నిహారిక, గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 1నుంచి జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు కై లాస్‌నగర్: జిల్లాలో ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందు కోసం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 31వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి ఆయన పాల్గొన్నారు. వాహనదారులు రహదారి నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. రహదారి భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఎస్పీ అఖి ల్ మహాజన్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, ఆర్టీసీ ఆర్ఎం భ వానీ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
కల్తీ గుర్తించవచ్చు
ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాలతో పాటు అన్ని వస్తువులు కల్తీమయం అవుతున్నాయి. చాలా మంది వీటిని తిని అనారో గ్యం బారిన పడుతున్నారు. ఈ కల్తీ వస్తువులను గుర్తించేందుకు మేం ప్రయోగం చేశాం. పాలను కర్రచెక్కపైన జారవిడిస్తే నీళ్లు కలుపని పాలు చెక్కకు అతుక్కుంటాయి. కల్తీ పాలు వెళ్లిపోతాయి. నెయ్యిలో అయోడిన్ వేయడం ద్వారా రంగు మారితే కల్తీ అయినట్లే. కల్తీ నెయ్యిని అగ్గిపుల్లతో వెలిగి స్తే అది వెలుగదు. ఆయిల్లో నైట్రిక్యాసిడ్ వేస్తే కల్తీ నూనె ఎర్రటి రంగులోకి మారుతుంది. – చైతన్య, బి.నిత్య, శ్రీచైతన్య స్కూల్, ఆదిలాబాద్ -
సర్పంచ్‌గా ఓడినా హామీ నెరవేర్చారు..
కై లాస్‌నగర్(బేల): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓడినా ప్రజలకు ఇచ్చినా హామీని నెరవేర్చారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సామ రూపేష్‌రెడ్డి పోటీ చేశారు. తనను గెలిపిస్తే బాజీరావు మహరాజ్ ఆలయం వద్ద బోరు వేయిస్తానని హామీనిచ్చారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్‌రెడ్డి సహకారంతో ఆలయం వద్ద శనివారం బోరు వేయించారు. ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్‌తో కలిసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బెదుర్కర్ రవీందర్ పటేల్, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు వినోద్, మంచికంటి సాయి, ఊషన్న, సతీష్, సునిల్ పాల్గొన్నారు. కొత్తూరులో.. నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మహ్మద్ జలీల్ ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు. భీరన్న దేవుడి గుడి నిర్మాణం కోసం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు విలువ చేసే మెటీరియల్ అందజేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. -
● పల్లె ఓటమిని దిగమింగుకుని.. ● పార్టీ టికెట్ కోసం యత్నాలు షురూ ● వ్యూహాలు సిద్ధం చేస్తున్న ఆశావహులు ● ముఖ్యనేతల ప్రసన్నం కోసం ఆరాటం
కై లాస్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైన అభ్యర్థులు పరిషత్ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో సర్పంచ్ పదవి దక్కించుకోవాలని భావించినా ఓటర్ల మద్దతు కూడగట్టుకోలేకపోయారు. కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతో పరిషత్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడాత్వరలోనే ఉంటాయనే ప్రచారంతో మరోసారి బరిలో నిలవాలని తపిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లను ఆశిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్య నేతల అనుగ్రహం కోసం ఆరాటపడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. టికెట్ తమకే అంటూ తమ అనుచరులతో చర్చిస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓటమిని దిగమింగుకుని.. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన గ్రామ, మండల ద్వితీయస్థాయి నాయకులు ఆయా పార్టీల మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేశారు. పార్టీ అండ లభించని వారు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. గ్రామ ప్రథమ పౌరుడి హోదా దక్కించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. గెలుపే లక్ష్యంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. నోటిఫికేషన్ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు మద్యాన్ని ఏరులై పారించారు. పలు గ్రామాల్లో ఓటుకు రూ.300 నుంచి రూ.500 వరకు పంచారు. ఇసుక దందా సాగే పెన్‌గంగ పరీవాహక, రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని గ్రామాల్లో అయితే ఓటుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు పంపిణీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే విందులు సైతం జోరుగానే సాగాయి. ఇలా సర్పంచ్ అభ్యర్థులు కనిష్టంగా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.30లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. అయినా కొంతమందిని అదృష్టం వరించకపోవడంతో ఓటమి పాలయ్యా రు. అయితే త్వరలోనే పరిషత్ ఎన్నికలు ఉన్నట్లుగా ప్రచారం మొదలవడంతో ఓటమిని దిగమింగుకుని పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు. రిజర్వేషన్ అనుకూలిస్తే పార్టీ పరంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు షురూ చేశారు. ఓడినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పార్టీ టికెట్ లభిస్తే సానుభూతితో పాటు పార్టీ పరంగా మద్దతు దక్కి గెలువవచ్చనే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యనేతల అనుగ్రహం పొందేలా.. పరిషత్ ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండటంతో పోటీచేసే అభ్యర్థులకు ముఖ్యనేతల అనుగ్రహం తప్పనిసరి. ఈ క్రమంలో పోటీకి సై అంటున్న ఆశావహులు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వంటి ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ఆయా పార్టీల జిల్లా అ ధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అ నుగ్రహం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎలాగైనా వారి మద్దతు కూడగట్టుకోవాలని భా వి స్తున్నారు. నిన్న మొన్న టివరకు పంచాయతీ ఎన్నికల్లో బీజీగా గడిపిన వారు ప్రస్తుతం పొద్దెక్కగానే నే తల ఇళ్ల ముందట వాలిపోతున్నారు. నిత్యం వారికి టచ్‌లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల షె డ్యూల్ ఇంకా రానప్పటికీ రాజకీయ పార్టీల నేతలు మాత్రం గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో ప డ్డారు. గ్రామాల్లో ప్రజల మద్దతు ఉన్న అభ్యర్థుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహులు అందులో తమ పేరు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఎన్నికలకు ముందే పరిషత్ రాజకీయం వేడెక్కింది. -
సేంద్రియ సాగుతో అధిక దిగుబడి
నార్నూర్: సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి శ్రీధర్ స్వామి అన్నారు. గాదిగూడలోని రైతువేదిక భవన్లో సీపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. అనంతరం జొన్న విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు సాగులో డీఏపీ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకంతో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించవచ్చన్నారు. ఇందులో ఏడీఏ గణేశ్ రాథోడ్, ఎన్ఎఫ్ఎస్ఎం ప్రతినిధి కృష్ణవేణి, ఏవో యాకన్న, సీపీఎఫ్ ప్రోగ్రాం అధికారి రాథోడ్ దిలీప్, ఏఈఓ లు పాల్గొన్నారు. -
ఎవరీ ప్రభంజన్
జన్నారం: ప్రభంజన్ జన్నారం మండలంలోని మారుమూల గ్రామాలైన ఆదివాసీ గిరిజనుల సమస్యల పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేవాడు. గతంలో జన్నారంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో కూడా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపాడు. గత కొంతకాలంగా అందరితో ఉన్న వ్యక్తి మావోయిస్టు అర్బన్ ఏరియా కోఆర్డినేటర్ అనే వార్త రావడంతో మండలంలో చర్చనీయాంశమైంది. ఆయన కు పొనకల్‌లోని గాంధీనగర్‌లో సొంత ఇల్లు ఉంది. తల్లిదండ్రులు లక్ష్మి, కాంతన్న, చెల్లెలు ఉన్నారు. చెల్లెలికి వివాహం కాగా, తల్లిదండ్రులతో ఆయన గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. -
మావోయిస్టుల లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల, కుమురంభీం(కేబీఎం) డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ హైదరాబాద్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయా రు. శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోగా.. ఆ వివరాలను ప్రెస్మీట్లో వెల్లడించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ చిత్తరంజన్ కూడా పాల్గొన్నారు. సీపీఐ(మావోయిస్టు)కి చెందిన 41మంది 24ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో ఇద్దరే తెలంగాణకు చెందిన వారు కాగా, 24ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కేబీఎం కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, పార్టీ సభ్యుడు జన్నారానికి చెందిన ప్రభంజన్ ఉన్నారు. మిగతా వారంతా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వివిధ కేడర్‌లో పని చేస్తున్న వారు ఉన్నారు. అజ్ఞాతం వీడేందుకేనా..? వచ్చే మార్చి నెలాఖరు వరకు మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు తమ పార్టీ కేడర్‌ను ఇతర ప్రాంతాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు చోట్ల ఆశ్రయం పొందుతున్నారు. మనుగడ క్లిష్టంగా మారడంతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అలా ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూ ఏజెన్సీ అటవీ ప్రాంతంలోకి కొందరు మావోయిస్టులు వచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వారిని గుర్తించి అత్యంత గోప్యంగా పోలీసులు ఆయుధాలతో సహా హైదరాబాద్‌కు తరలించారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ నుంచి ములుగు ఇతర ప్రాంతాల మీదుగా సిర్పూర్ యూ మండలం కకర్బుడ్డి, బాబ్జీపేట పరిసరాల్లో సంచరిస్తున్నారు. పెద్దదోబ, చిన్నదోబ పరిధిలో అటవీ సమీపంలోని ఓ చేనులో ఉన్న గుడిసెలో తల దాచుకున్నారు. గత కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్నారు. వీరంతా ఇక్కడికి ఎలా చేరుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ అంతర్రాష్ట్ర సరిహద్దులతోపాటు జిల్లాలు, కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. ఈ తనిఖీలను దాటి ఎప్పుడు, ఎలా వచ్చారనేది మిస్టరీగా మారింది. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలో బలగాలు గుర్తించిన మావోయిస్టులే అజ్ఞాతం వీడారనేది ఉన్నతాధికారులు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. -
గుణాత్మక విద్య అందించాలి
నార్నూర్: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్య మైన భోజనంతో పాటు గుణాత్మక విద్య అందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మ ర్మాట్ అన్నారు. మండలంలోని గిరిజన ఆశ్రమ (బా లికలు), ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు. రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీ లించారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హా జరుశాతం పెంచాలన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఉదయం వేడి నీళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆశ్ర మ పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు అందజేత ఉట్నూర్‌రూరల్: విద్యార్థినులు సాంకేతిక విద్యలోనూ రాణించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఉట్నూర్ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలకు శుక్రవారం ఉచి తంగా కంప్యూటర్లు అందజేశారు. ఇందులో ఫౌండేషన్ సంస్థ అధినేత ఎండీ.బాబర్, రాష్ట్ర సమన్వయకర్త ఎండీ.సాబీర్ హుస్సేన్, ఐటీడీఏ ఉపసంచాలకులు అంబాజీ యాదవ్, ఏసీ ఎంవో జగన్, ఏటీడీవో సదానందం, ఎంఈవో ఆశన్న, ప్రిన్సిపాల్ మాణిక్ రావు, గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధి కారులు పాల్గొన్నారు. -
హెచ్‌పీవీతో క్యాన్సర్‌కు చెక్
ఆదిలాబాద్‌టౌన్: గర్భాశయ క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిల్లోమ వైరస్ (హెచ్‌పీవీ) టీకా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2026 జనవరి మొదటి వారంలో వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపడుతుంది. చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతూ తనువు చాలిస్తున్నారు. బాధితుల్లో 50 శాతం వరకు మృత్యువాత పడుతున్నారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. మొదట్లోనే నివారించేందుకు ఈ టీకా దోహద పడనున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.4వేల నుంచి రూ.10వేల వరకు ఉండడంతో పేదలకు అందడం లేదు. విషయాన్ని గమనించిన ప్రభుత్వాలు కిశోర బాలికలకు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వైద్యాధికారులు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తిచేశారు. క్యాన్సర్‌ను అరికట్టేందుకు.. వచ్చేనెల మొదటి వారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 14ఏళ్లు నిండిన కిశోర బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. ఈ వ్యాక్సిన్‌తో గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రాకుండా దోహద పడుతుంది. దీంతో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని వైద్యాధికారులు చెబుతున్నారు. హెచ్‌పీవీ–16, హెచ్‌పీవీ–18 అనేవి ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలు. ఇవి గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తాయి. బాధితుల్లో 50 శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 47 మంది బాధితులు.. జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్‌తో 47 మంది బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాగే వివిధ రకాల క్యాన్సర్‌తో 103 మంది బాధితులు ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. అనధికారికంగా వీరి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. కిశోర బాలికలకు హెచ్‌పీవీ టీకా ఒకే డోస్ వేయనున్నారు. ఈమేరకు ఆయా గ్రామాల్లో ఆశ కార్యకర్తల ద్వారా సర్వే చేసి వివరాలు సేకరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 11,730 మంది కిశోర బాలికలు ఉన్నట్లు గుర్తించారు. వీరు 9,10 తరగతులు చదువుతున్నారు. అన్ని పీహెచ్‌సీలతో పాటు రిమ్స్‌లోని పీపీ యూనిట్లో ఈ వ్యాక్సిన్ వేయనున్నారు.ఏర్పాట్లు చేస్తున్నాం..వచ్చే నెల మొదటి వారంలో కిశోర బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. జిల్లాలో 14ఏళ్లు నిండిన కిశోరబాలికలు 11,730 మంది ఉన్నారు. హెచ్‌పీవీతో గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా అరికట్టవచ్చు. దీంతో ఎలాంటి ప్రమాదం లేదు. – వైసీ శ్రీనివాస్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి -
విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఆదిలాబాద్‌టౌన్: నూతన ఆవిష్కరణలు రూపొందిస్తూ విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో శుక్రవారం ఇన్స్పైర్ మేళా, జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను తిలకించి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రయోగం వైపు తీసుకెళ్లాలని సూచించారు. వారిలో ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీయాలని పేర్కొన్నారు. సైన్స్ నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఆరె భాస్కర్, ఎంఈవో సోమయ్య, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి రఘురమణ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, విద్యాశాఖ ఏడీ వేణుగోపాల్ గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృష్ణకుమార్, శ్రీనివాస్, అశోక్, రవీంద్ర, దినేష్ చౌహాన్, గోపీకృష్ణ, సతీశ్, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
● పల్లె పాలనలో అత్యధికులు కొత్తవారే ● మెజార్టీ గ్రామాల్లో మొదటిసారిగా ఎన్నికై న సర్పంచ్‌లు ● నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ● గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ● సకాలంలో అందని బిల్లులు
జిల్లాలో..మొత్తం గ్రామ పంచాయతీలు : 473 ఇందులో తొలిసారి సర్పంచ్‌గా ఎన్నికై న వారు : 385 కై లాస్‌నగర్: పల్లెపోరు ముగిసింది. మరో రెండు రోజుల్లో కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. నూతన సర్పంచ్ల పాలన అందుబాటులోకి రానుంది. అయితే ఈ సారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే. పాలన అనుభవం, రాజకీయ నేపథ్యం లేని వారే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వీరు అనేక హామీలిచ్చారు. అయితే ప్రస్తుతం గ్రామాల్లో సమస్యలు పేరుకుపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల నుంచి నిధులు విడుదల నిలిచిపోవడంతో వీరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఏ విధంగా పాలన సాగిస్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వీరికి పల్లెపాలన సవాల్‌గా మారనుంది. నిలిచిన నిధుల విడుదల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం (ఎఫ్ఎఫ్సీ), రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ ఎఫ్‌సీ)నిధులను గ్రామాల్లోని జనాభా దామాషా ప్రకారం కేటాయిస్తుంది. అయితే పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో రెండేళ్లుగా ఈ నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీల ఖజానాలు నిండుకున్నాయి. నయాపైసా లేకపోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి. అత్యవసర పనులకు పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయాల్సిన దుస్థితి. సమస్యలు స్వాగతం.. జిల్లాలో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలకనున్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ సైతం చేపట్టలేని దుస్థితి. ట్రాక్టర్ కిస్తీలు సైతం రెండేళ్లుగా చెల్లించడం లేదు. నెలల తరబడి పేరుకుపోవడంతో వాటికి బ్యాంకులు అదనంగా వడ్డీలు వేస్తున్నాయి. వీటితో పాటు కరెంట్ బిల్లులు సైతం పెను భారంగా మారాయి. డీజిల్‌కు సైతం డబ్బుల్లేక పలు జీపీల్లో ట్రాక్టర్లు మూలనపడి ఉన్నాయి. ఇక నీటి సరఫరాకు సంబంధించి మోటార్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన డ్రెయినేజీలను శుభ్రం చేయలేని పరిస్థితి ఉంది. ఇలా పలు సమస్యలతో పంచాయతీలు సతమతమవుతున్నాయి. వీటిని పరిష్కరించడం కొత్త సర్పంచ్‌లకు సవాల్‌గా మారనుంది. అలాగే ఎన్నికల సందర్భంగా ఆలయాలు, లైబ్రరీలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇస్తామని, పంట చేలకు రోడ్లు వేయిస్తామని, గ్రామంలో అన్ని చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీలిచ్చారు. నిధుల కొరతతో చిన్నపాటి సమస్యలే పరిష్కరించలేని పరిస్థితి ఉండగా హామీల అమలు వారికి కత్తిమీద సాముగానే మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంపరేషాన్లో కార్యదర్శులు..ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులే అన్నీ తామై వ్యవహరించారు. ప్రభుత్వాల నుంచి నిధుల విడుదల నిలిచిపోవడంతో గ్రామాల్లో అత్యవసర పనులకు వారే తమ జేబుల్లో నుంచి వెచ్చించారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా కొత్త పాలకవర్గాలు రానుండటంతో ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలవుతాయని భావిస్తున్నారు. అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు పెండింగ్ బిల్లులను తమకు చెల్లిస్తారా లేదా అనే దానిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు అడ్డుపడితే తమ పరిస్థితేంటనే దానిపై మదనపడుతున్నారు. -
వీకెండ్ వండర్స్‌లో పాల్గొనండి
కై లాస్‌నగర్: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్‌లో జిల్లావాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజేతలుగా నిలువాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. ఈ మేరకు కాంటెస్ట్ ప్రచార పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బాహ్య ప్రపంచానికి తెలియని వండర్స్‌ను కనుగొనడం, ప్రకృతి వన్యప్రాణి, ఆర్ట్, కల్చర్, హెరి టేజ్, వాటర్బాడీఎస్ రూరల్ ఏరియాలో బస, ఆధ్యాత్మికత, సాహసం (అడ్వంచర్) వంటి అంశాలపై మూడు ఫొటోలతో వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు. కనెక్టివిటీ, దూరం, రవాణా, గూగుల్ లొకేషన్ వంటి సమాచారంను 100 పదాలతో ప్రదేశం, సందర్శించిన సమయం, బస, బడ్జెట్, సేఫ్టీకి సంబంధించిన వివరణను 60 సెకన్ల వీడియోలో పొందుపర్చాలని తెలిపారు. ఆసక్తి గల వారు 5 జనవరి 2026లోగా HTTPS:// FORMS.IFORMS.GLE/VVJB7NZWBUZ7NWJY6లో సమర్పించాలని పేర్కొన్నారు. మొదటి బహుమతిగా రూ.50వేలు, రెండో బహుమతి రూ.30వేలు, మూడో బహుమతి రూ.20వేలతో పాటు 10 కన్సలోషన్ బహుమతులను సంక్రాంతి రోజున అందజేయనున్నట్లు తెలి పారు. అలాగే రెండు రోజులు ఉచితంగా హరిత హోటల్స్‌లో బస సదుపాయం కల్పించనున్నుట్ల పేర్కొన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఆర్డీవో రవీందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌పై కాసుల వర్షం కురిసింది. కేవలం నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలిసినప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 8.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.ఇంగ్లిష్ కోసం లక్నోతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తీవ్రంగా శ్రమించింది. కాగా ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ కారణంగా అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనని, కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని ముందుగానే ప్రకటించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి విడిచిపెట్టింది.హనీమూన్ వాయిదా?అయితే ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడంతో కేవలం నాలుగు మ్యాచ్‌ల ఆడాలన్న తన నిర్ణయాన్ని ఇంగ్లిష్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న వివాహం తర్వాత వెంటనే హనీమూన్‌కు వెళ్లాలనుకున్న ప్లాన్‌ను వాయిదా వేసి..నేరుగా లక్నో క్యాంప్‌లో చేరాలని అతను భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయినప్పటికి అతడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. ఇదే విషయంపై పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ నెస్ వాడియా స్పందించారు. ఇంగ్లిష్ తీరును అతడు తప్పుబట్టాడు."మేము జోష్ ఇంగ్లిష్‌ను రిటైన్ చేసుకోవాలనుకున్నాము. కానీ అతడు రిటెన్షన్ గడువు ముగియడానికి కేవలం 45 నిమిషాల ముందు తన వ్యక్తిగత కారణాల గురించి తెలియజేశాడు. తన పెళ్లి, హానీమూన్ కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లకే మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పాడు. అందుకే అతడిని వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఏమాత్రం ప్రొఫెషన్లిజం కాదు. కానీ నేను అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతడు అద్భుతమైన ఆటగాడు. ఆస్ట్రేలియా తరపున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. మరి ఇప్పుడు ఐపీఎల్లో అన్ని మ్యాచ్‌లు ఆడుతాడో లేదో చూద్దం" అని వాడియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లిష్‌ను రూ. 2.60 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగొలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం అతడు చేశాడు. 11 మ్యాచ్‌లు ఆడి 162.57 స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు అతడు ఏకంగా రూ.8.60 కోట్లు అందుకోనున్నాడు. అంటే దాదాపు 230.77% పెరుగుదల అనే చెప్పాలి.చదవండి: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో -
పరీక్ష సమస్య కాదు..
టెట్ ఉత్తీర్ణకు నిర్వహించే పరీక్ష సమస్య కాదు. బోధనతోపాటు పరీక్ష రాయడానికి ఇబ్బంది లేదు. టెట్ ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రిపేర్ కావడానికి సెలవులు అవసరం లేదు. ఇవన్నీ గతంలో పాసైనవే. టైం దొరికనప్పుడుల్లా యూట్యూబ్‌లో వీడియోలు సేకరిస్తూ పరీక్షకు సన్నద్దమవుతున్నా. 15 నుంచి 30 సంవత్సరాలు సేవలందించిన సీనియర్ ఉపాధ్యాయులను పరీక్షించడం సహేతుకం కాదు. ప్రతీ ఉపాధ్యాయుడు ప్రభుత్వం బోర్డులు నిర్వహించిన పరీక్షలన్ని పాసయ్యాడు. – మురళీధర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గర్మిళ్ల -
సర్పంచ్‌గా ‘మాస్టారు’
చెన్నూర్‌రూరల్: మండలంలోని లంబడిపల్లి గ్రామ స ర్పంచ్‌గా విద్యావంతుడు, యువకుడు నగావత్ మ హేశ్నాయక్ ఎంపికయ్యా డు. ఆయన ఎంఏ, బీఈడీ పూర్తి చేసి జైపూర్‌లోని గు రుకుల జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అ ధాపకుడిగా పని చేస్తున్నాడు. నాలుగున్నర ఏ ళ్లుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న మహేశ్ స ర్పంచ్ జనరల్ రిజర్వు కావడంతో ఉద్యోగా నికి రిజైన్ చేసి ఎన్నికల్లో పోటీ చేశాడు. సమీప ప్రత్యర్థిపై 55ఓట్ల తేడాతో గెలుపొందాడు. ప్రజలు తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించినందుకు గ్రామాభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడుతానన్నారు. -
ఆ కుటుంబాలకే పల్లె పగ్గాలు
భైంసారూరల్: నిర్మల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఈసారి భిన్నమైన తీర్పు ఇచ్చారు. యువతను, చదువుకున్నవారిని ఎన్నుకున్నారు. అయితే కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం.. సంప్రదాయాన్ని కొనసాగించారు. గత పాలకుల కుటుంబీకులకే మరో అవకాశం కల్పించారు. వరుసగా రెండోసారి.. భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కథ్గాం గ్రామానికి సర్పంచ్‌గా వరుసగా దెగ్లూర్ రాజు రెండోసారి ఎన్నికయ్యాడు. భైంసాలో దంతవైద్యుడిగా పనిచేస్తూ మొదటిసారి సర్పంచుగా ప్రజాజీవితంలోకి వచ్చాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాజు ప్రస్తుతం గ్రామంలో ప్రజాప్రతినిధిగానే కొనసాగుతున్నారు. మొదటిసారి జిల్లాలో ఉత్తమ పంచాయతీగా అవార్డు సైతం అందుకున్నాడు. అప్పటి కలెక్టర్లు ప్రశాంతి, ముషారఫ్ అలీ ఫారూఖీ, వరణ్‌రెడ్డి రాజు చేసిన సేవలను ప్రసంసించారు. పల్లె ప్రకృతి వనం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను నిర్వహించి కలెక్టర్ల మెప్పు పొందారు. రెండోసారి వరుసగా సర్పంచుగా ఎన్నికయ్యాడు. మహాగాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి అప్పాల రాజ్యలక్ష్మి ఎన్నికై ంది. గడిచిన ఐదేళ్లలో అప్పాల రాకేశ్ సర్పంచ్‌గా పనిచేశారు. రిజర్వేషన్ మహిళకు కేటాయించడంతో భార్యను పోటీలో దింపి సర్పంచ్‌గా గెలుపించుకున్నారు. అప్పుడు రాకేశ్ ఇప్పుడు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి సర్పంచ్‌గా పని చేస్తున్నారు. -
ఆర్జీయూకేటీ విద్యార్థునులకు ప్రిన్స్టన్ స్కాలర్షిప్
బాసర:ప్రతిభావంతమైన విద్యార్థినులకు విద్యాసాధికారత కల్పించేందుకు ప్రిన్స్టన్ ఫౌండేషన్ ఏటా ఉపకారవేతనాల అందిస్తోంది. ఈఏ డాది ఉపకార వేతనాలు ఆర్జీయూకేటీ విద్యార్థినులు స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు. ఇన్చార్జి వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ ఈ స్కాలర్షిప్ విద్యార్థినులకు ఆర్థిక సహాయం, ఇంటర్న్‌షిప్, మెంటరింగ్‌తో ఉన్నత విద్యలో అవకాశాలు కల్పిస్తాయని వివరించారు. ఇది కళాశాలలో విద్యార్థినుల సాధికారత, విద్యా నిబద్ధతకు నిదర్శనమని అన్నా రు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లడుతూ విద్యార్థులు అకడమిక్ రంగంలో కఠిన శ్రమ, క్రమశిక్షణ, శ్రద్ధ చూపుతున్నారన్నారు. తాజా ఎంపికే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, జేఎన్‌యూ, శ్రీరామ్ కామర్స్ కాలేజీల విద్యార్థినులతో ఆర్జీయూకేటీ విద్యార్థినులు పోటీపడ్డారని వివరించారు. స్కాలర్‌షిప్‌నకు ఎంపికై న విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఎస్.విఠల్, మహేశ్, శేఖర్, ఉపకార వేతన కార్యాలయ సిబ్బంది జి.శ్వేత, చిన్నారెడ్డి, హిమబిందు, వినోద్ పాల్గొన్నారు. -
నాడు పతులు.. నేడు సతులు
ఆసిఫాబాద్‌రూరల్: ఆసిఫాబాద్ మండలంలో పలువురు గతంలో సర్పంచులుగా పనిచేయగా.. ప్రస్తుతం వారి సతీమణులు ఆ పదవులు చేపట్టనున్నారు. 2019లో ఎల్లారం పంచాయతీ సర్పంచ్‌గా సీతారాం ఎన్నికయ్యారు. గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఈసారి ఆయన భార్య నీలబాయిని ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కౌటగూడలో 2019లో లక్ష్మీనారాయణ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈసారి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ రావడంతో భార్య స్వప్పను బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలపగా ఆమె విజయం సాధించారు. పాడిబండ పంచాయతీలో గతంలో దినకర్ సర్పంచ్‌గా ఎన్నిక కాగా, ఈసారి ఎస్టీ మహిళ రిజర్వేషన్‌తో అతడి భార్య ఈశ్వరీ విజయం సాధించారు. గుండిలో పంచాయతీలో మాత్రం 2019లో అరుణ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీసీ పురుషులకు రిజర్వేషన్ రావడంతో ఆమె భర్త రవీందర్ బరిలోకి దిగి ఏడు ఓట్లతో గెలుపొందారు. -
టీచర్లకు ‘టెట్’షన్
మంచిర్యాలఅర్బన్:జాతీయ విద్యా విధానం ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పాస్ కావాలని సెప్టెంబర్ 1న ఉత్తరవులు వచ్చాయి. జనవరి 3 నుంచి 20 వరకు ఆన్లైన్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తూనే.. టెట్‌కు సన్నద్ధమవుతున్నారు. అయిదేళ్లకుపైగా సర్వీస్ ఉన్నవారు రెండేళ్లలో టెట్ అర్హత సాధించాల్సి ఉంది. దీంతో అందరిలో టెన్షన్ కనిపిస్తోంది. సాధన పోరాటం.. తరగతి గది విధుల మధ్య ఖాళీ సమయాల్లో టెట్ కోసం ఆన్లైన్ తరగతులు వింటున్నారు. కొందర సాయంత్రం వేళ శిక్షణ కేంద్రాల్లో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. సెలవు రోజుల్లో ఇంట్లో ఆన్లైన్ కోచింగ్‌లతో సిద్ధపడుతున్నారు. ఈ ప్రయత్నాలు వారి రోజువారీ బాధ్యతలతో సమతుల్యం చేసుకోవడం సవాల్‌గా మారాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు పది వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సగానిపైగా టెట్ అర్హత లేనివారే. మంచిర్యాల జిల్లాలో 2,507 మంది ఉండగా, 1,562 మందికి టెట్ లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 2,636 మంది ఉపాధ్యాయుల్లో 1,845 మందికి అర్హత లేదు. ఆసిఫాబాద్‌లో 2,030 మంది ఉండగా, 1,015 మందికి టెట్ లేదు. నిర్మల్ జిల్లాలో 2,600 మంది ఉండగా, 1,500 మంది టెట్ లేకుండా పనిచేస్తున్నారు. జిల్లా మొత్తం టెట్ అర్హత మంచిర్యాల 2,507 1,562 ఆదిలాబాద్ 2,636 1,845 నిర్మల్ 2,600 1,500 ఆసిఫాబాద్ 2,030 1,015 -
ముచ్చటగా మూడోసారి
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని మాలన్గొందిలో ముచ్చటగా మూడోసారి ఆ కుటుంబాన్ని సర్పంచ్ గిరి వరించింది. 2014లో తిరుపతి సర్పంచ్‌గా ఎన్నిక కాగా, 2019లో మడావి భార్య సీత విజయం సాధించారు. ఈసారి మళ్లీ 300 మెజర్టీతో మడావి సీత సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సీసీరోడ్డు, డ్రెయినేజీల నిర్మాణంతోపాటు భీమన్న ఆలయం అభివృద్ధి చేస్తున్న కృషిని గుర్తించి తమను ఎన్నుకుంటున్నారని వారు తెలిపారు. అలాగే చిర్రకుంట పంచాయతీ సర్పంచ్‌గా 2019లో పార్వతిబాయి ఎన్నిక కాగా, ఈసారి కూడా బీజేపీ మద్దతుతో ఆమె గెలుపొందారు. వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. వరించిన అదృష్టం ఆసిఫాబాద్ మండలంలోని అడదస్నాపూర్ పంచాయతీలో టాస్ ద్వారా విజేతలను నిర్ణయించారు. పంచాయతీలో మొత్తం 445 ఓటర్లు ఉండగా 382 పోలయ్యాయి. నోటాకు మూడు ఓట్లు పడగా, చెల్లనివి 22 ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థులు నీలాకుమారి, కమలాబాయికి సమానంగా 154 చొప్పున ఓట్లు వచ్చాయి. మూడుసార్లు రీకౌటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో చివరికి టాస్ వేయగా నీలాకుమారిని అదృష్టం వరించింది. -
అప్పుడు భర్త... ఇప్పుడు భార్య...
● కధం కుటుంబానికి నాలుగు సార్లు.. లోకేశ్వరం:రాజకీయాల్లో ఒకసారి అడుగు పెట్టాక ఆ అభ్యర్థి తన కంటూ ఏదో ఒక పదవిని దక్కించుకునేందుకు ప్రతిఎన్నికల్లోనూ పోటీ అవకాశాలు వెతుక్కుంటారు. ఒక్కసారి సీటు దక్కించుకోవలంటే పోటాపోటీగా పోరాడాల్సి ఉంటుంది. లోకేశ్వరం మండలం హవర్గ గ్రామానికి చెందిన కధం లక్ష్మి 2000లో మొదటిసారిగా మన్మద్ ఎంపీటీసీగా గెలుపొంది. ఈపరిదిలోని మన్మద్, బిలోలి, హవర్గ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. భూజంగ్‌రావు 2014లో మండల కోఆప్షన్‌గా పని చేశారు. మళ్లీ 2019, 2025 భూజంగ్‌రావు సర్పంచ్‌గా గెలుపొందారు. లక్ష్మి ఒకసారి, భూజంగ్‌రావు మూడు సార్లు వివిధ పదవులు పొందారు. కధం భుజంగ్‌రావు 2019, 2025 ఎన్నికల్లో సర్పంచ్ కధం లక్ష్మి 2000 ఎన్నికల్లో మన్మద్ ఎంపీటీసీ -
రెండు బైక్‌లు ఢీ
కాసిపేట: మండల కేంద్రంలోని కాసిపేట పెట్రోల్‌బంక్ కోమటిచేను శివారు ప్రాంతంలో రహదారిపై గురువారం సాయంత్రం ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని 108అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలపై వేగంగా వచ్చి ఢీకొన్నారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను అంబులెన్స్‌లో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మృతి చెందగా, మరొకరు విషమంగా ఉన్నట్లు 108అంబులెన్స్ ఈఎంటీ నరేష్, పైలెట్ పాషాలు తెలిపారు. మృతుడు మందమర్రి మండలం క్యాతన్‌పల్లికి చెందిన దురిశెట్టి హరిప్రసాద్(26)గా, విషమంగా ఉన్న వ్యక్తి మందమర్రి శ్రీపతినగర్‌కు చెందిన రమేశ్గా గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. -
జీజీహెచ్‌లో దయ్యం ఉన్నట్లు ప్రచారం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆ సుపత్రిలో ఒక రహస్యమైన నీడ కనిపిస్తున్నట్లు ఒక వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓపీ విభాగంలోని ల్యాబ్ వైపున బుధవారం అర్ధరాత్రి 12:36గంటలకు ఒక రహస్యమైన నీడ కనిపించినట్లు వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ ఔట్ పోస్టు పోలీసులకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఫేక్ వీడియోను తయారు చేసినా, వాటిని షేర్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఆసుపత్రి వారు చేస్తే, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రజలు నమ్మొద్దని కోరారు. -
పట్టభద్రులకే ‘పట్టం’...!
తాండూర్: తాండూర్ మండలంలోని 15గ్రామ పంచాయతీల్లో ఓట ర్లు పలువురు పట్టభద్రులకే పట్టం కట్టారు. మండలంలోని ద్వారకాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికై న మాసాడి తిరుపతి ఎంకాంలో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో 89ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. బోయపల్లి సర్పంచ్‌గా గెలుపొందిన సుందిళ్ల శంకరమ్మ గృహిణిగానే తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె కూడా బీఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 148ఓట్ల మె జార్టీతో ఎన్నికల్లో విజయం సాధించారు. కాసిపేట సర్పంచ్‌గా ఎన్నికై న ము దాం వనజ సైతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గృహిణిగా తన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మండలంలోనే అత్యధికంగా 805ఓట్ల భారీ మెజార్టీ తో విజయాన్ని కై వసం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు సర్పంచ్‌లు ఇంటర్మీడియెట్, మరో ఐదుగురు పదో తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. -
అందుబాటులో ఉన్న పుస్తకాలతో..
పాఠశాల విధులు నిర్వహిస్తూనే అందుబాటులో ఉన్నా పుస్తకాలు చదువుతున్నా. టెట్ రాసేందుకు అనుకున్నంత సమయం లేకుండాపోయింది. నిన్నటి వరకు ఎన్నికల విధులు నిర్వహించాం. ఇటూ ప్రిపేర్ కావడం ఆందోళనగా ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులరాలుగా 31 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేశాను. ఇప్పుడు ఎగ్జామ్ రాయమనడం అన్యాయం. గణితం ఉపాధ్యాయులు హిందీ, హిందీ టీచర్లు సోషల్ రాయమనడం అంతా గజబీజీగా ఉంది. టెట్ తప్పనిసరి నిబంధన సమంజసంగా లేదు. – శారా సంగీత, జీహెచ్ఎస్, పాత మంచిర్యాల -
యూపీఎస్సీ ఫలితాల్లో పొన్నారి యువకుడి ప్రతిభ
తాంసి: మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన సాయికిరణ్ బుధవారం సాయంత్రం విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటాడు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) విభాగంలో ఆలిండియా 82వ ర్యాంక్ సాధించాడు. గత జూన్ 8న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యాడు. ఆగస్టు 10న మెయిన్స్ పరీక్ష రాశాడు. నవంబర్ 7న ఇంటర్వ్యూకు హాజరై యూపీఎస్సీకి ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నోము ల అనసూయ–గంగన్న దంపతుల కుమారుడు చిన్నప్పటి నుంచి చదువులో ముందుంటూ పదోతరగతి వరకు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. హైదరాబాద్‌లోని ప్రై వేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తిచేసి ఇంజినీరింగ్ విద్యను కరీంనగర్‌లోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో 2021లో పూర్తిచేశాడు. సివిల్స్ సాధనే లక్ష్యంగా 2021 నుంచి యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పరీక్షలో చేజారినా నిరాశ చెందకుండా పట్టుదలతో పరీక్షలకు సిద్ధమయ్యాడు. రెండోసారి కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్లినా రిజర్వ్ స్థానానికే పరిమితమయ్యాడు. మూడో ప్రయత్నంలో ఐఈఎస్ విభాగంలో ఆలిండియా స్థాయిలో 82వ ర్యాంక్ సాధించాడు. యూపీఎస్సీ ఫలితాల్లో రైతు కుటుంబానికి చెందిన సాయికిరణ్ ప్రతిభ కనబర్చడంతో గ్రామస్తులు అభినందించారు. -
వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే..
ఓవైపు వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే వీలు దొరికనప్పుడల్లా టెట్ ప్రిపేర్ అవుతున్నా. ఇంట్లో పుస్తకాలు చదువుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం 1996డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యాను. అప్పుడు బీఎస్సీ బీఎడ్ అర్హతతో ఉద్యోగంలోకి వచ్చాం. తర్వాత క్రమంలో వృత్తిపరమైన పదోన్నతలు కోసం డిపార్?ట్మంటల్ టెస్టుల రాసి ఉన్నాం. ప్రస్తుతం 2010 ఆర్టీఈ చట్టం ద్వారా ఉపాధ్యాయ వృత్తికి టెట్ పరీక్ష తప్పనసరి చట్టం చేయబడింది. 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా టెట్ కావాలని అడగడం సరికాదు. – సుజాత, స్కూల్‌అసిస్టెంట్ (బయోలజీ) జెడ్పీహెచ్ఎస్(బాయ్స్) లక్సెట్టిపేట -
పరీక్ష సులువే..
రోజువారీ తరగతి గదిలో బోధన చేస్తున్న తమకు ప రీక్ష రాయటం సులువే. ఏ మాత్రం ఖాళీ సమయం దొ రికినా పుస్తకాలు తిరిగేస్తూ పరీక్షపై దృష్టి పెడుతున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికలతో కొంత అటంకం ఏర్పడింది. క్రిస్మస్ సెలవులు.. ఏ ఒక్క హాలిడే వచ్చినా సద్వినియోగం చేసుకుంటా. టెట్ అ ర్హత పరీక్ష అనేది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునే వారి కోసం ఉద్దేశించింది. ఎంతో అనుభవం గడించిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలో అర్హత సాధించాలనే నిబంధన అసంబద్దం. – బోయిని శ్రీనివాస్, జెడ్పీహెచ్ఎస్ తాళ్లపేట్ -
ఆ బస్సుకు ఏటా పూజలు
కడెం: ఏదైనా ఓ గ్రామానికి నూతనంగా బస్సును ప్రారంభిస్తే ఆ బస్సుకు పూజలు నిర్వహించి.. స్వాగతం పలకడం సాధారణం. కానీ నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ బస్సుకు ఏటా పూజలు నిర్వహిస్తుంటారు అక్కడి ప్రజలు. మండల కేంద్రం నుంచి మారుమూల గంగాపూర్ గ్రామానికి వెళ్లాలంటే ఒక్కటే దారి. నవబ్‌పేట్ సమీప ఆటవీప్రాంతం గుండా వాగులు, వంకలు దాటి 14 కిలోమీటర్లు వెళ్లాలి. లేదంటే కడెం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌లో తెప్పపై వెళ్లాలి. ఎత్తెన గుట్టలు, రాళ్లు, రప్పలతో రోడ్డు సరిగా లేకున్నా ఆర్టీసీ ఏళ్లుగా బస్సు నడుపుతోంది. రోజుకు రెండు ట్రిప్పులు వస్తుంది. వర్షాకాలం మాత్రం బస్సును నిలిపివేస్తారు. చలికాలంలో ప్రారంభిస్తారు. ఇలా ప్రారంభించిన ప్రతీసారి బస్సు అలంకరించి, పూజలు చేసి స్వాగతం పలుకుతారు. గంగాపూర్, కొర్రతండా, రాణిగూడ పంచాయతీల ప్రజలు గ్రామాలు దాటి బయట ప్రపంచానికి రావాలంటే సరైన రవాణా వ్యవస్థ లేదు. దీంతో ఆర్టీసీ బస్సుతో వీరికి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. -
అక్రమ కేసులతో వేధిస్తున్న కేంద్రం
ఆదిలాబాద్: గాంధీ కుటుంబాన్ని వేధించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులతో ఇ బ్బందులకు గురి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం బీజేపీ కార్యాలయం ఎదుట నిరస న తెలిపారు. నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు నాయకులు, పోలీసుల మ ధ్య తోపులాట జరిగింది. అనంతరం నరేశ్ జాదవ్ మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో పదేళ్లుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. కోర్టు కూడా దీనిని తప్పు పట్టిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతి పక్షాలను అణిచివేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ ఎంపీ సోయం బాపూరావు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, గుడిహత్నూర్ మండలాధ్యక్షుడు మల్యాల క రుణాకర్, టౌన్ అధ్యక్షుడు గుడిపెల్లి నగేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్‌గౌడ్ పాల్గొన్నారు. -
సర్వేకు సహకరించాలి
ఆదిలాబాద్‌టౌన్: కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలో ఈనెల 18 నుంచి 31వరకు కుష్ఠు సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పట్టణ ఆ రోగ్యకేంద్రంలో వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్య మాన్ని ప్రారంభించి మాట్లాడారు. 2027నాటి కి భారత్‌ను కుష్టురహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కుష్టు రోగులను గుర్తించేందు కు నిర్వహిస్తున్న ఈ సర్వేలో భాగంగా ప్రజలు తమ ఇళ్లకు వచ్చే ఆశ కార్యకర్తలకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. శరీరంపై పాలిపోయిన, రాగి రంగు మొద్దుబారిన మచ్చలు కనిపిస్తే కుష్టుగా అనుమానించాల్సిన అవసరముందని తెలిపారు. ఆశ కార్యకర్తలు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించా లని ఆదేశించారు. ప్రోగ్రాం ఆఫీసర్ శిరీన్, వై ద్యాధికారి సౌమ్య, డీపీఎంవోలు వామన్‌రావు, రమేశ్, ఎల్టీలు నిజామొద్దీన్, సంతోష్, సీవో రాజారెడ్డి, ఆశ కార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉందని, నూతన సర్పంచులు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, సభలు, ఊరేగింపులు నిర్వహించరాదని తెలిపారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలపై బోథ్, బజార్హత్నూర్ మండలాల్లో 11 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బోథ్ మండలం ధన్నూర్(బీ)లో 40 బాటిళ్ల మద్యం తరలిస్తున్న సామ ప్రవీణ్‌రెడ్డి, సామ సా యికిరణ్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఓ అభ్యర్థికి అనుకూలంగా ఓటర్లకు రూ.500 నగ దు, బ్యాలెట్ పత్రం అందజేసిన గొర్ల గంగయ్య, లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బోథ్‌లో ఎండీ జుబేర్ నుంచి ఒక ఫుల్‌బాటిల్ మద్యం, రూ.6,730 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సొనాల మండలం గుట్టపక్కతండాకు చెందిన పలువురు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించడంతో సుభా ష్‌తో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కౌట(బీ) గ్రామంలో రోడ్డు పక్కన మద్యం సేవించిన రమణయ్య, ఒరగంటి రాజు, దీకొండ ముఖేశ్‌పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిగిని గ్రామంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థికి అనుకూలంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన నితిన్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కౌట(బీ) గ్రామానికి చెందిన నిందితుడు కొండల జైపాల్ మద్యం సేవించి ఓటు వేసి బ్యాలె ట్ పేపర్‌ను చించినట్లు తెలిపారు. ప్రిసైడింగ్ అధి కారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పే ర్కొన్నారు. కౌట(కే)లో ఎన్నికలు పూర్తయిన తర్వా త బ్యాలెట్ బాక్సులతో తిరిగి వెళ్తున్న మొబైల్ పార్టీ ని అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించిన ఎం. రాజేశ్వర్, ఉత్తమ్, కె.రాజేశ్వర్, వెంకటి, పంచపూలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సొనాల మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన గెలిచిన అభ్యర్థి అనుచరులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. బజార్హత్నూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదైనట్లు తెలిపారు. చందునాయక్‌తండాలో ఓటు వేసి ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు ఇ బ్బందులు కలిగించిన రాబ్డే సురేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదే పోలింగ్ కేంద్రంలో 100, 200 మీటర్ల పరిధిలో గుమిగూడిన రవీందర్, రాజేందర్, ప్రకాశ్, కై లాశ్, సుభాష్, చౌహాన్ రవి, కవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
బేలలో సోయా రైతుల ఆందోళన
కైలాస్‌నగర్(బేల): సోయా పంటను కొనుగోలు చే యాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద గల జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నాలుగు గంటల పాటు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలు పూర్తిగా నిలిచాయి. జైనథ్ సీఐ శ్రవణ్, ఎస్సై ప్రవీణ్, డీటీ వామన్ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. కొనుగోళ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పలువురు రైతులు కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చే శారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో ఫోన్లో మాట్లాడించారు. కలెక్టర్‌ను కలిసి సమస్య తెలిపేందుకు అవకాశం క ల్పిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. పంట ను విక్రయించేందుకు బేలలోని సబ్ మార్కెట్‌యార్డుకు వచ్చి నెలవుతున్నా కొనుగోలు చేయడం లేదని తెలిపారు. నాణ్యత లోపం, కొనుగోలు పరిమితి పూర్తయిందనే సాకుతో కొనుగోళ్లు నిలిపివేశారని పేర్కొన్నారు. తీవ్రమైన చలిలో మార్కెట్ యార్డులో పంటను ఉంచి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయారు. తమ పంటనంతా కొనుగోలు చేయాలని, ఆ దిశగా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. -
సమన్వయంతో పనిచేయాలి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌ను విజయవంతం చేసేందుకు కమిటీ బాధ్యులంతా సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో ఎస్.రాజేశ్వర్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న సైన్స్‌ఫేర్, ఇన్స్పైర్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించా రు. కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనా త్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలకు దోహదపడే సైన్స్‌ఫేర్‌ను నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని వివిధ కమిటీల బాధ్యులకు సూచించారు. జిల్లా సైన్స్ అధికారి భాస్కర్, వివిధ కమిటీల కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను సాధించాలి
కై లాస్‌నగర్: ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్ సాగు, యూరియా ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ లాంటి అంశాలపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,500 ఎకరాల సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 386 ఎకరాల్లోనే సాగైనట్లు తెలిపారు. మండలాల అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించి ఆయిల్‌పామ్ మొక్కల నాన్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, నాన్ సబ్సిడీ డీడీలను ఈ నెలాఖరులోపు అందించాలని ఆదేశించారు. కంపెనీలు రైతులకు అండగా నిలువాలని, క్షేత్రస్థాయి సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతుల యూరియా ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. ఈ నెల 20నుంచి అందుబాటులోకి రానున్న యాప్‌లో వివరాల నమోదుపై వలంటీర్లు, ఏఈవోల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డీలర్, స్టాక్ వివరాలు యాప్‌లో కనిపిస్తాయని, రైతులు ఇంటివద్ద నుంచే యూరియా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మొబైల్ నంబర్ ఓటీపీతో లాగిన్ అవుతుందని, పట్టా పాస్‌బుక్, పంట తదితర వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 24గంటల్లోపు సరుకును రైతులు తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఏవో శ్రీధర్, జిల్లా ఉద్యానవన అధికారి నర్సయ్య, జిల్లా సహకార అధికారి మోహన్, వ్యవసాయ, ఉద్యానవన విస్తరణాధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పల్లె పోరు.. యువత జోరు
కై లాస్‌నగర్: దాదాపు రెండేళ్లుగా ఎదురుచూసిన పంచాయతీ ఎన్నికలు ముగి శాయి. మూడు విడతలుగా జరిగిన ఎ న్నికల్లో పల్లె ఓటర్లు పంచాయతీ పాలకులను ఎన్నుకున్నారు. అయితే ఈ ఎ న్నికల బరిలో నిలిచిన యువతకు ఓట ర్లు అగ్రతాంబూలం ఇచ్చారు. తమ తీర్పుద్వారా వారికి పెద్దపీట వేశారు. మెజార్టీ గ్రామాల్లో యువతనే తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. ఈ పరి ణామం రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలు కుతోంది. రాజకీయాలపై యువత ధోరణిలో వస్తు న్న మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. మరో వై పు ప్రజలు కూడా నవతరాన్ని రాజకీయాల్లోకి ఆ హ్వానిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో పలువు రు అభ్యర్థులు తొలిప్రయత్నంలో విజయబావుటా ఎగరేసి పల్లెపాలన పగ్గాలు అందుకోవడం విశేషం. తొలిమెట్టు సర్పంచ్.. రాజకీయాల్లో రాణించేందుకు సర్పంచ్ పదవిని అంతా తొలిమెట్టుగా భావిస్తుంటారు. ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో రాణించిన, ప్ర స్తుతం ఆయా పదవుల్లో కొనసాగుతున్న వారిలో ఎంతోమంది ఇలా సర్పంచులుగా సేవలందించినవారే. అలాంటి సర్పంచ్ పదవులపై యువత ప్ర త్యేక దృష్టి సారించింది. రాజకీయాలంటేనే అంతగా ఆసక్తి చూపని వారు ఈసారి పోటీకి జై కొట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించిన యువతరం తమ ఊరి బాగుకోసం ముందడుగు వేసింది. నిత్యం ఊరిలో, ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి దృష్టి సారించారు. కష్టసుఖాల్లో తోడుగా నిలిచారు. పోటీకి దిగిన తొలి ప్రయత్నంలోనే ప్రజల మెప్పు పొంది ఊరి సర్పంచులుగా వి జయం సాధించారు. సర్పంచ్ సాబ్.. అని పిలిపించుకుంటున్నారు. అత్యధిక గ్రామాల్లో 25 నుంచి 35 ఏళ్లలోపు యువతీయువకులు సర్పంచులుగా ఎన్ని క కావడం రాజకీయాలపై యువతలో వస్తున్న మా ర్పునకు నాందిగా నిలుస్తోంది. డబ్బుతో ముడిపడి న ప్రస్తుత రాజకీయాల్లో చేతి చమురు వదిలించుకుంటేనే గాని పదవి దక్కదనే భావన పూర్తిగా వ్యతి రేకమని నిరూపించారు. గ్రామంలో పట్టు పెంచుకునేలా ప్రజలకు చేదోడు.. వాదోడుగా నిలిస్తే విజ యం అసాధ్యమేమి కాదని తమ గెలుపుతో సత్తా చాటారు. ఇదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరింత మంది యూ త్ పోటీ పడే అవకాశం లేకపోలేదు. ఇది మంచి రాజకీయ పరిణామంగా చెప్పవచ్చు. పాలనపై సర్వత్రా ఆసక్తి.. రాజకీయాల్లోకి కొత్తగా అడుగిడి ఎన్నికల్లో అంతగా ఖర్చు చేయకున్నా చాలామంది యువతీయువకులు ఈసారి సర్పంచులుగా ఎన్నికయ్యారు. వారి కు టుంబాలకూ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అంతగా లే దు. ఇందులో స్వతంత్రులూ ఎక్కువ మందే ఉన్నా రు. అలాంటి వారు పల్లె పాలనలో ఎలాంటి ముద్ర వేస్తారనేదానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తమపై నమ్మకముంచి గెలిపించిన ప్రజల మన్ననలను పొందేలా పరిపాలిస్తామని పలువురు యువ సర్పంచులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
మరోసారి పత్తి ధరలో కోత
ఆదిలాబాద్‌టౌన్: నాణ్యత తగ్గిందని మరోసారి పత్తి ధరలో కోత విధించేందుకు సీసీఐ రంగం సి ద్ధం చేసింది. గతనెల 27నుంచి క్వింటాల్‌కు రూ.50 తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రూ.50 తగ్గిస్తూ ఈనెల 22నుంచి అమలు చేసేందు కు నిర్ణయం తీసుకుంది. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే పత్తికి గిట్టుబాటు ధ ర లేదని రైతులు ఆందోళన చెందుతుండగా ప్రభుత్వరంగ సంస్థ తీసుకున్న నిర్ణయంతో వారు దిగా లు చెందుతున్నారు. పత్తి నాణ్యతలో ప్రమాణాలు తగ్గాయని బీబీ స్పెషల్ నుంచి మెక్మోడ్కు మారిందని సీసీఐ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.8,060 ఉండగా, ఈనెల నుంచి నుంచి మద్దతు ధరలో రూ.50 తగ్గనుంది. దీంతో సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,010 చెల్లించేందుకు నిర్ణయించింది. పత్తి క్వింటాల్ మద్దతు ధర రూ.8,110 ఉండగా, గత నెలరోజుల్లోనే రూ.100 తగ్గించారు. తేమ పేరిట కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసిన సీసీఐ మరోసారి ధర రూ.50 తగ్గించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7.33లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు జిల్లాలో ఐదు మార్కెట్ యార్డులున్నాయి. వీటి పరి ధిలో 7లక్షల 33వేల 763 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఇందులో సీసీఐ 7లక్షల 3వేల 763 క్వింటా ళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు 30 వే ల క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పత్తి పంట దెబ్బతింది. సీసీఐకి విక్రయించిన చాలామంది రైతులకు మద్ద తు ధర లభించలేదు. తేమ పేరిట ధర తగ్గించడంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొంత మంది రైతులకు సంబంధించిన పత్తిని తేమ పేరిట కొనుగోలుకు నిరాకరించడంతో గత్యంతరం లేక వారు ప్రైవేట్‌కు తక్కువ ధరకే విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇదివరకే రూ.50 కోత విధించగా, మరోసారి కోత విధించేందుకు నిర్ణయం తీసుకోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసింది 7,33,763 క్వింటాళ్లు సీసీఐ కొనుగోలు చేసింది 7,03,763 క్వింటాళ్లు ప్రైవేట్ కొనుగోలు చేసింది 30వేల క్వింటాళ్లు ప్రస్తుత మద్దతు ధర రూ.8,060 22నుంచి అమలులోకి రానున్న ధర రూ.8,010 -
ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామపంచాయతీ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలి సరిహద్దున ఉన్న ఘాట్‌రోడ్డు మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 25 జెడ్ 0067) గురువారం ఉదయం ఆదిలాబాద్ నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరందోలికి వెళ్లింది. తిరిగి ఆదిలాబాద్‌కు వస్తుండగా ఘాట్‌రోడ్డుపై బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ సంతోష్ అప్రమత్తతతో బస్సు ఘాట్ పైనుంచి లోయలోకి పడిపోకుండా పొదల్లోకి మళ్లించాడు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. సంజీవ్ (ఉమ్రీ), రమాదేవి, నాందేవ్ (మహారాజ్‌గూడ)లకు గాయాలయ్యాయి. వారికి గాదిగూడ మండలం ఝరి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్‌కు మార్చారు. నార్నూర్ సీఐ అంజమ్మ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపట్టారు. హ్యాండ్ బ్రేక్ కూడా ఫెయిలైంది.. పరందోలి గ్రామం నుంచి ఉదయం 9:30 గంటలకు 30 మందితో బయలుదేరామని డ్రైవర్ సంతోష్ తెలిపాడు. ఘాట్పైకి రాగానే ఆకస్మికంగా బ్రేకులు పనిచేయలేదని పేర్కొన్నాడు. దీంతో బస్సు కుడివైపు లోయలోకి పడేదని, వెంటనే అప్రమత్తమై ఎడమవైపు తిప్పి పొదల్లోకి తీసుకెళ్లానని పేర్కొన్నాడు. పత్తి చేలలో బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సు హ్యాండ్ బ్రేక్కూడా పనిచేయలేదని డ్రైవర్ తెలిపాడు. -
మొదటిసారి ఓటేసిన..
ఐదేళ్లు.. పదేళ్లు కాదు.. ఏకంగా 69 ఏళ్ల తర్వాత ఆ ఊరంతా తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఏకగ్రీవ ఆనవాయితీకి బ్రేక్ పడింది. తలమడుగు మండలం బరంపూర్ వాసులు బుధవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికలో తొలిసారిగా ఓటేసి సిరా గుర్తు చూపారు. – తలమడుగు నాకిప్పుడు 70 ఏండ్లు దాటి నయ్. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీపీ, సహకార సంఘాల ఎన్నికల్లోనే ఓటేసిన. మా ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. మొదటిసారి ఓటేయ డం సంతోషంగా ఉంది. – మేకల బాపు -
నిఘా నీడన ఎన్నికలు..
ఆదిలాబాద్‌టౌన్: మూడో విడత ఎన్నికలో ని ఘా నీడన సాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప టిష్ట బందోబస్తు మధ్య నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో పాటు అదనపు ఎస్పీ, డీఎ స్పీలు, సీఐలు, ఎస్సైలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాల వద్ద గుమిగూడిన 80 మందిపై కేసులు నమోదు చేశారు. సుంకిడి, తలమడుగు, రుయ్యాడి, దేవాపూర్, బరంపూర్, బోథ్, సొ నాల, గుడిహత్నూర్ తదితర గ్రామాల్లో ఎన్ని కల ప్రక్రియను ఎస్పీ పరిశీలించారు.ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలుపొందిన వారు విజ యోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని, బా ణసంచా పేల్చవద్దని అభ్యర్థులకు సూచించా రు. నిబంధనలను అతిక్రమిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరు మండలాల్లో నిర్వహించిన ఎన్నికలకు 938 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
పోలింగ్ సరళి ఇలా..
ఓటు హక్కు వినియోగించుకున్న యువతి బోథ్‌లో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఓటర్లుకై లాస్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. జిల్లాలోని 472 (రుయ్యాడి మినహా) గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. తుది విడతలో భాగంగా బోథ్ ని యోజకవర్గంలోని బజార్హత్నూర్, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్, సొనాల, తలమడుగు మండలాల్లోని 120 సర్పంచ్, 479 వార్డు స్థానాలకు ఎ న్నికలు జరిగాయి. తలమడుగు మండలం బరంపూర్‌లో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాలకు వ చ్చిన ఓటర్లకు అధికారులు పూలు చల్లుతూ స్వా గతం పలికారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రా రంభం కాగా చలితీవ్రత కారణంగా తొలి రెండు గంటల్లో మందకొడిగా సాగింది. తర్వాత ఓటర్లు కేంద్రాలకు తరలిరావడంతో పోలింగ్ పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా కేంద్రాల లోపల ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు హక్కు వి నియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో ప లుచోట్ల మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వృద్ధుల నుంచి యువత వరకు ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 82.56 శాతం పోలింగ్ నమోదైంది. మలి విడతతో పోల్చితే 4.12 శాతం తగ్గింది. ఆయా మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి పోలింగ్ సరళిపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి రెండు గంటలు నామమాత్రమే... ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలుచోట్ల మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. ఆయా మండలాల పరిధిలో 1,24,880 మంది ఓటర్లు ఉండగా, 1,03,104 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 60,744 మంది పురుష ఓటర్లకు గాను 50,597 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 64,134 మందికి గాను 52,507 మంది ఓటు వేశారు. చలి తీవ్రత కారణంగా ఓటర్లు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9గంటల వరకు కేవలం 19.37 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. తర్వాత పుంజుకుంది. తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను కుటుంబీకులు ఆటోలు, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి ఓటు వేయించారు. వారికి కేంద్రాల్లో వీల్‌చైర్ సౌకర్యం కల్పించారు. పోలింగ్ ముగిసే నిర్ణీత సమయం ఒంటి గంట వరకు 77.95 శాతం నమోదైంది. అప్పటికే పలు చోట్ల కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చివరకు 82.56 శాతం నమోదైంది. ప్రతి రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్ శాతం వివరాలను ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ఎన్నికలు జరిగిన ఆయా మండలాల్లోని పలు పో లింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా , ఎస్పీ అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ఎన్నికల సాధారణ పరిశీలకులు వెంకన్న వేర్వేరుగా పరిశీ లించారు. పోలింగ్ ప్రక్రియపై ఆరా తీశారు. రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు..తుది విడతలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు మండలం ఎన్నికలు మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు పోలింగ్ బజార్హత్నూర్ 26 21,980 17,560 8,786 8,774 79.89 బోథ్ 18 25,364 20,282 9,805 10,477 79.96 గుడిహత్నూర్ 20 22,695 18,360 9,102 9,258 80.90 నేరడిగొండ 23 19,719 16,630 7,963 8,667 84.33 సొనాల 12 10,804 9,131 4,558 4,573 84.51 తలమడుగు 20 24,318 21,141 10,383 10,758 86.9421.88 53.57 74.51 15.71 47.73 74.32 19.11 58.11 79.00 17.85 50.94 76.84 17.86 55.56 81.25 23.07 61.19 83.32పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత భోజన వి రామం అనంతరం సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. తొ లుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియ పలు చోట్ల రాత్రి వరకు కొనసాగింది. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడయ్యాయి. మిగతా పంచాయతీల ఫలితాలు ఆలస్యమయ్యాయి. గెలుపొందిన సర్పంచులు తమ అనుచరులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. -
మహాత్ముడి పేరు తొలగింపు సరికాదు
కైలాస్‌నగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముడి పేరు తొలగించడం సరికాదని డీసీసీ అధ్యక్షు డు డాక్టర్ నరేశ్ జాదవ్ అన్నారు. గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌చౌక్‌లో గాంధీజీ చిత్రపటాలతో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కక్షపూరితంగా గాంధీజీ పేరును ఉపాధిహామీ పథకం నుంచి కుట్రపూరితంగా మా ర్చిందన్నారు. పథకం పేరును యథావిధిగా కొనసాగించాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రత రం చేస్తామని హెచ్చరించారు. ఇందులో డీసీ సీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు సాజిద్‌ఖాన్, సుజాత, సంజీవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, చరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడతలో గులాబీ గుబాళింపు
కై లాస్‌నగర్: జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. ఈ విడతలో రుయ్యాడి మినహా 120 సర్పంచ్, 479 వార్డు స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. తొలి, రెండో విడతలో సత్తా చాటిన అధికార కాంగ్రెస్ మూడో విడతలో చతికిలపడింది. తృతీయ స్థానానికి పరిమితమైంది. బోథ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇలాఖా కావడంతో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో విజయఢంకా మోగించారు. రెండో విడతలో సత్తా చాటిన బీజేపీ కేవలం సింగిల్ డిజిట్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక స్వతంత్రులుగా బరిలో దిగిన చాలా మంది పలుచోట్ల సత్తా చాటారు. ప్రధాన రాజకీయ పార్టీలకు గట్టిపోటీనిస్తూ సర్పంచ్‌లుగా గెలుపొందారు. పలుచోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు, స్వతంత్రుల నడుమ హోరాహోరీ పోరు సాగింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డారు. మెజార్టీ స్థానాలను కై వసం చేసుకున్న గులాబీ పార్టీ తన పట్టు నిలుపుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్‌లో పలుచోట్ల జయాపజయాలు స్వల్ప ఓట్లతో దోబూచులాడాయి. గుడిహత్నూర్ మండలం ముత్నూర్ తండాలో రెండు ఓట్ల తేడాతో సర్పంచ్‌గా జాదవ్ రాంజీ ఎన్నికయ్యారు. ఈ విడతలతో ఏకగ్రీవాలతో కలిపి మొత్తంగా బీఆర్ఎస్ అత్యధికంగా 71సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోగా స్వతంత్రులు 48 చోట్ల విజయం సాధించారు. ఇక అధికార కాంగ్రెస్ మద్దతుదారులు 25 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు కేవలం ఏడు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం రాత్రి వరకు కొనసాగింది. సర్పంచ్ల ఫలితాలను అధికారికంగా ప్రకటించిన అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో ఉపసర్పంచ్‌ల ఎన్నిక నిర్వహించారు. మెజార్టీ ఉపసర్పంచ్ స్థానాలను సైతం బీఆర్ఎస్ తన ఖాతాలోనే వేసుకుంది. గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఆర్వోలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తమ అభిమాన నాయకులు గెలుపొందడంతో వారి అనుచరులు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. మండలం ఎన్నికలైన జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు బజార్హత్నూర్ 31 05 17 03 06 బోథ్ 21 03 10 01 07 గుడిహత్నూర్ 26 01 10 01 14 నేరడిగొండ 32 06 23 00 03 సొనాల 12 03 04 01 04 తలమడుగు 28 06 07 01 14 -
ఆటంటే మక్కువ.. నిత్య సాధన
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణానికి చెందిన పలువురు ఫుట్‌బాల్ క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. పట్టణంలోని ప్రైవేట్ క్రీడా మైదా నంలో రోజూ ఉదయం, సాయంత్రం సాధన చేస్తూ ఆటపై తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన సీఎం క ప్ జిల్లాస్థాయి పోటీల్లో వీరు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆ తర్వాత నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో కడుకుంట్ల సాయికిరణ్, అల్లం సాయికుమార్, మాదాసు రంజిత్‌కుమార్, గర్కా గోపాలకృష్ణ, కెల్లేటి మనేశ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పలువురు అభినందించారు. నిత్యం సాధన చేస్తున్నాం నిరంతరం సాధన చేస్తే ప్రతి ఒక్కరూ ఫుట్‌బాల్ పోటీల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. భవిష్యత్‌లో మేము రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం. 16మంది జట్టుగా ఉన్న మేము నిత్యం సాధన చేస్తున్నాం. అందరూ పూర్తిస్థాయిలో సహకారమందిస్తేనే ఎంతోమంది క్రీడాకారులు రాణిస్తున్నారు. – కడుకుంట్ల సాయికిరణ్ -
ఒక్క పైసా రాలే
పిల్లల వివాహాలు, చదువులు, వైద్యఖర్చులకు రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ ఉపయోగపడుతాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్‌ను అందించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని బిల్లులిస్తే ఏళ్లు గడిచినా రావడం లేదు. వచ్చినా సగం డబ్బులే చెల్లిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం రూ.700 కోట్లు విడుదల చేశామంటున్నా ఒక్క పైసా రాలేదు. – ఎస్.సుధాకర్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
సీసీఐ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం
ఆదిలాబాద్: సీసీఐ ఉద్యోగుల బకాయిలు చెల్లి స్తామని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజయ్ భాంగ్రా అన్నారు. ఆదిలా బాద్ సీసీఐ ఉద్యోగుల సమస్యలపై స్థానిక ఎంపీ గోడం నగేశ్ ఢిల్లీలో చైర్మన్‌ను మంగళవారం కలిసి వినతి పత్రం సమర్పించగా ఆయన స్పందించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగులకు సంబంధించి వీఎస్ఎస్ బెని ఫిట్స్, బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేలా కృషి చేస్తామన్నారు. స్థానికంగా అధికారులు లేకపోతే ఢిల్లీ నుంచే నేరుగా ఆదేశాలిచ్చి, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఎంపీ వెంట ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్, నిరంజన్ రావు ఉన్నారు. -
జేసీబీ యజమాని ఆత్మహత్యాయత్నం
జన్నారం: జేసీబీ యజమాని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలం కల్లెడకు చెందిన వెంబడి శేఖర్ మండలంలోని బాదంపల్లిలో తన అత్తగారింటిలో ఉంటూ జేసీబీ నడుపుకొంటున్నాడు. ఈనెల 14న పుట్టిగూడ సమీపంలో బాల్నాయక్ పొలంలో జేసీబీతో వ్యవసాయ బావి తవ్వాడు. బావి నుంచి వచ్చిన మట్టిని ఇందిరమ్మ ఇళ్ల కోసం తరలించాడు. ఈక్రమంలో అటవీ అధికారులు వచ్చి జేసీబీకి తాళం వేశారు. రైతు బాల్నాయక్ పట్టా పాస్‌బుక్ తీసుకెళ్లి చూపించగా తిరిగి తాళాలు ఇచ్చారు. మంగళవారం అటవీ అధికారులు మళ్లీ వచ్చారు. జేసీబీ ని సీజ్ చేసేందుకు తాళాలు ఇవ్వాలని శేఖర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపంతో అతడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు పెట్రోల్ బాటిల్ లాక్కుని అతడిపై నీళ్లు పోశారు. ఈ విషయమై సెక్షన్ అధికారి బోజ్యనాయక్ను సంప్రదించగా, ఇకో సెన్సిటివ్ జోన్ నిబంధనల ప్రకారం మొరం తరలించడం నేరమని తెలిపారు. పట్టా భూమిలో మొరం తీసే అనుమతి లేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జేసీబీని సీజ్ చేసేందుకు వస్తే రాద్ధాంతం చేస్తున్నాడని వివరించారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌టౌన్/బోథ్/గుడిహత్నూర్: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈమేరకు ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల ని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎన్నికలు ని ర్వహించే బోథ్ నియోజకవర్గంలోని గుడిహత్నూర్, బోథ్ పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆరు మండలా ల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్టా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ (144) సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. 33 సమస్యాత్మక కేంద్రాల్లో స్పెషల్ పార్టీ బలగాలు, 10 షాడో పోలింగ్ స్టేషన్లలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 మంది ఎస్సై స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమస్యాత్మక ప్రాంతాల్లో స్టాటిక్ఫోర్స్ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. బందోబస్తులో ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 మంది ఎస్సైలతో పాటు మహిళ సిబ్బంది, హోంగార్డులు, రిజర్వు, సాయుధ సి బ్బంది, స్పెషల్ పార్టీ ఫోర్స్ ఉంటుందని వివరించారు. జీపీ ఎన్నికల్లో ఇప్పటివరకు జిల్లాలో 756 వ్యక్తులను బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన 70 కేసుల్లో 200 మందికి పైగా ఉన్నట్లు వివరించారు. అలాగే 20 ఆయుధాలను సేఫ్ డిపాజిట్ చేసినట్లు చెప్పారు. రూ.20లక్షల విలువ చేసే 2,250 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా, కించపర్చేలా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచారం ముగిసిన సందర్భంలో బయట వ్యక్తులు గ్రామాల్లో ఉండరాదన్నా రు. ఎలాంటి సమాచారమైనా డయల్ 100కు ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రా రంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బోథ్ మండలకేంద్రంలో పోలీసులు సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నేరడిగొండ: మండలంలోని లింగట్ల, బొందిడి గ్రామాల్లో ఎన్నికల నియమావళిపై పోలీసులు అవగాహన కల్పించారు. ఓటర్లు నిర్భయంగా ఓ టు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సూ చించారు. ఇందులో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ రమేశ్, ఎస్సై ఇమ్రా న్, తదితరులున్నారు. -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
గుడిహత్నూర్: ఎన్నికలు పకడ్బందీగా నిర్వహి ంచాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రానికి విచ్చేసిఅధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఆయన వెంట తహసీ ల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో ఇంతియాజ్, ఎంఈవో ఉదయ్‌రావ్, అధికారులు ఉన్నారు. తలమడుగు: మండల కేంద్రంలో ఏ ర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ రాజమోహన్, సిబ్బంది తదితరులున్నారు. -
ప్రోత్సాహం లేక జాతీయ స్థాయిలోనే ఆగిపోయా..
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ గిరిజన క్రీడా పాఠశాలలో 2002 నుంచి 2005 వరకు చదువుకున్నాను. కోచ్ రఘునాథ్‌రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయిలో గద్వాల్లో, జాతీయ స్థాయిలో జమ్ముకశ్మీర్‌లో ఆడి మొదటి స్థానంలో నిలిచాను. 2005లో 10వ తరగతి పూర్తి చేసుకున్న సమయంలో ఉట్నూర్ క్రీడా పాఠశాలను ఎత్తివేశారు. అనంతరం ఇంటర్ ఆదిలాబాద్‌లోని ఫుట్‌బాల్ అకాడమీలో చేరడానికి వెళ్లగా దానినీ ఖమ్మం జిల్లాకు తరలించారు. దీంతో ఉట్నూర్‌కు వచ్చి ఇంటర్ పూర్తి చేశాను. ప్రభుత్వాలు అవకాశం కల్పించకపోవడంతో 2005లో నేషనల్ స్థాయిలోనే ఆగిపోయాను. ప్రస్తుతం ఉట్నూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పీడీగా పని చేస్తున్నాను. ప్రభుత్వాలు దృష్టి సారించి ఆదిలాబాద్, ఉట్నూర్‌లో ఫుట్‌బాల్ అకాడమీలు ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశముంది. క్రీడా పాఠశాలల్లో ఫుట్‌బాల్ అకాడమీని తిరిగి ఏర్పాటు చేసి నాకు అవకాశం కల్పిస్తే గిరిజన విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా తప్పనిసరిగా కృషి చేస్తా. – పాండురంగ్, జాతీయస్థాయి క్రీడాకారుడు -
దశాబ్దాల సేవలకు గుర్తింపేది?
కై లాస్‌నగర్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించారు. ఉద్యోగ జీవితమంతా ఉరుకులు, పరుగుల మధ్య విధులు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ అనంతరం తమ కుటుంబంతో కలిసి శేషజీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్మైంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక అనుకున్న కార్యక్రమాలను పూర్తిచేయలేని దుస్థితితో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే నాణ్యమైన వైద్యసేవలు పొందలేని పరిస్థితి ఉంది. పెన్షన్ సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు నానా అవస్థలు పడుతున్నారు. తమకు రావాల్సిన ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పలుసార్లు ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 8వేల మంది రిటైర్డ్ ఉద్యోగులున్నారు. బుధవారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పెన్షనర్ల సమస్యలు ఓసారి పరిశీలిస్తే.. బెనిఫిట్స్ విడుదలలో తీవ్ర జాప్యం రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం జీపీఎఫ్, జనరల్ ఇన్సురెన్స్, గ్రాట్యూటీ, కముటేషన్ లాంటి బెనిఫిట్స్‌ను ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. అయితే వీటి విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పెన్షన్ మాత్రమే అందిస్తున్న ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పించడం లేదు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు తమ పిల్లల వివాహాలు, ఉన్నత చదువులు, ఇంటి నిర్మాణాలు లాంటివి చేపట్టేందుకు ఆర్థికంగా అవస్థలు పడాల్సి వస్తోంది. వీటికి తోడు బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఆకస్మాత్తుగా వచ్చే రుగ్మతలకు అవసరమైన వైద్య చికిత్స కోసం ఇబ్బంది పడుతున్నారు. నగదు రహిత వైద్యసేవలు అందించాలనే డిమాండ్ వారిలో వ్యక్తమవుతోంది. రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లు.. -
ఎన్నికల సిబ్బంది కష్టాలు
రోడ్డుపై కూర్చున్న ఉద్యోగులు, సిబ్బందిమూడో విడత ఎన్నికల విధుల నిర్వహణ కోసం మండలానికి మంగళవారం చేరుకున్న సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం కూర్చోవడానికి సరిపడా కుర్చీలు, బల్లలు కరువయ్యాయి. దీంతో చాలా మంది రోడ్డు పక్కన, చెట్ల నీడన నేలపైన కూర్చొని రికార్డులు, సామగ్రిని సరిచూసుకోవాల్సి వచ్చింది. ఏర్పాట్ల తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. – నేరడిగొండ -
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొడతా ఆసిఫాబాద్‌రూరల్: నేను మా కోచ్ రవికుమార్ సూ చనలు, పలహాలు పాటిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో మూ డుసార్లు, జాతీయ స్థాయి పోటీల్లో 2023, 2024లో పాల్గొన్నాను. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో జాబ్ సాధి స్తా. ఇదే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాను. – దుర్గాదేవి, పదో తరగతి (గిరిజన బాలికల గురుకుల పాఠశాల) రోజూ సాధన చేస్తున్నాను ఆసిఫాబాద్‌రూరల్: నేను ఫుట్‌బాల్ పోటీల్లో 2023, 2025లో రెండుసార్లు జాతీయ స్థాయిలో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించాను. భవిష్యత్‌లో ఫుట్‌బాల్ కోచ్‌గా గిరిజన బాలికలను మంచి క్రీడాకారిణులుగా తీర్చిదద్దడమే నా లక్ష్యం. ఇదే లక్ష్యంతో రోజూ సాధన చేస్తున్నాను. – భూమిక, ఎనిమిదో తరగతి (గిరిజన బాలికల గురుకుల పాఠశాల) ఇండియా కోచ్ కావాలని ఉంది ఆసిఫాబాద్‌రూరల్: ఇప్పటివరకు 10మంది జాతీ య, 30మంది రాష్ట్ర స్థా యిలో ఆడి ఐదు బంగారు పతకాలు సాధించారు. వి ద్యార్థినులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నాను. 2014లో మ ధ్యప్రదేశ్‌లో తెలంగాణ కోచ్‌గా ఎంపికయ్యా ను. ఇండియా కోచ్‌గా ఎంపికవ్వడమే లక్ష్యం. – రవికుమార్, ఫుట్‌బాల్ కోచ్ (గిరిజన బాలికల గురుకుల పాఠశాల) కోచ్‌ల సహకారంతోనే.. ఫుట్‌బాల్ ఆటపై ఉన్న ఆసక్తితో మేము వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరుస్తున్నాం. కోచ్‌లు ఇమ్రాన్, అంబాజీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మిగతావారు కూడా ఈ క్రీడలో రాణించేలా కృషిచేస్తాం. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న క్రీడతో ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించవచ్చు. – అల్లం సాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు విద్యార్థులు చదువుతోపాటు ఫుట్‌బాల్ ఆటలోనూ రాణిస్తున్నారు. కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ పొంది రాటుదేలుతున్నారు. బాల్ కొడితే గోల్ పడాల్సిందే.. అన్న రీతిలో వివిధ స్థాయిల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి పతకాలు కొల్లగొడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలువురు ఫుట్‌బాల్ క్రీడాకారులపై కథనం.. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే మరింత రాణించొచ్చు మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న గాలిపెల్లి అను ఫుట్‌బాల్ ఆటలో రాణిస్తోంది. మందమర్రి మండలానికి గుర్తింపు తెస్తోంది. గత నెల 15 నుంచి 17వరకు నల్గొండ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. డిసెంబర్ 17నుంచి 19వరకు జార్ఖండ్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నీమ్, పీడీ చిన్నక్క అను కి ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థిని చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తుందని అభినందించారు. అను మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఫుట్‌బాల్‌లో రాణిస్తున్నానని తెలిపింది. విద్యార్థులను పేరెంట్స్ ప్రోత్సహిస్తే వారు వారికి నచ్చిన క్రీడల్లో సత్తా చాటుతారని పేర్కొంది. రాటుదేలుతూ.. రాణిస్తూ..కాగజ్‌నగర్ టౌన్: సిర్పూర్(టీ) కాగజ్‌నగర్‌లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఫుట్‌బాల్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. స్టేట్ లెవల్ మహిళా కోచ్ మాసవేని వనిత శిక్షణలో రాటుదేలుతున్నారు. మైదానంలోకి దిగారంటే గోల్ కొట్టాల్సిందే.. అనే రీతిలో వివిధ స్థాయిల్లో నిర్వహించే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. 30మంది విద్యార్థులు, 30 మంది విద్యార్థినులు రోజూ ఉదయం 5.30నుంచి 6.30 గంటల వరకు, సెలవు దినాల్లోనూ 4 నుంచి 5గంటల వరకు సాధన చేస్తున్నారు.రాష్ట్రస్థాయిలో రాణించిన రాజేశ్వరి దహెగాం: మండలంలోని చినరాస్పెల్లి గ్రామానికి చెందిన ఎల్కరి రాజేశ్వరి ఫుట్‌బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయిలో రాణించింది. జిల్లా స్థాయిలో రాణించడంతో రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. చినరాస్పెల్లి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుకుంటోంది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తోంది. నవంబర్ 14నుంచి 16వరకు నల్గొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఆడి మంచి పేరు తీసుకురావాలన్నదే తన లక్ష్యంగా రాజేశ్వరి పేర్కొంది. డేట్ అకాడమీని ఓపెన్ చేస్తే బాగుంటుంది ప్రభుత్వం ప్రతీ మండలానికి ఒక డేట్ అకాడమీ సెంటర్‌ను ఓపెన్ చేస్తే మరింత మంది క్రీడాకారులను తయారు చేయవచ్చు. ప్రతీ జిల్లాలో ఆయా క్రీడలకు సంబంధించిన కోచ్‌లను ప్రభుత్వం నియమించాలి. 2010 నుంచి కోచ్‌ల నియామకం నిలిచింది. కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. మా పాఠశాల నుంచి ఎనిమిది మంది వరకు నేషనల్ క్రీడాకారులున్నారు. నేషనల్ స్థాయిలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేకున్నా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. పాఠశాలలో నిత్యం ఉదయం 5.30 నుంచి 6.30గంటల వరకు, సెలవు దినాల్లో నాలుగు గంటలపాటు ప్రాక్టీస్ చేయిస్తున్నాం. – మాసవేని వనిత, ఈఎంఆర్ఎస్, కాగజ్‌నగర్, స్టేట్ లెవెల్ మహిళా విభాగం కోచ్ జాతీయస్థాయికి ఎదిగిన అక్షరమంచిర్యాలఅర్బన్: ఇటీవల ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీల్లో స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రేగూరి అక్షర మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికై ంది. అక్షర ఫుట్‌బాల్ అంటే ఆసక్తి చూపడంతో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మొదటిసారి నిర్వహించిన పోటీల్లో మైదానంలోకి అడుగుపెట్టిన అక్షర మండల స్థాయి, జిల్లా, జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా జట్టులో చోటు సాధించింది. నల్గొండ జిల్లాలో అండర్–17లో బాలికల విభాగంలో నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. డిసెంబర్ 18 నుంచి 22వరకు జార్ఖండ్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. బాల్ కొడితే గెలుపే.. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిజామాబాద్, రామకృష్ణాపూర్, సిద్దిపేటలో నిర్వహించిన అండర్–14 విభాగంలో మొదటి స్థానం సాధించాను. ఒడిశాలో నిర్వహించిన ఈఎంఆర్ఎస్ పరిధిలో నేషనల్ లెవెల్లో పాల్గొన్నాను. ఫుట్‌బాల్ ఆటలో మరిన్ని మెళకువలు నేర్చుకుని నేషనల్లో ఆడి సత్తా చాటాలనుంది. – రితక పీడీ శిక్షణ ఇవ్వడంతోనే.. నేను ఆరో తరగతిలో పాఠశాలలో చేరాను. ప్రస్తుతం పదోతరగతి చదువుతున్నాను. పీడీ మేడం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం కోచింగ్ ఇస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర, నేషనల్ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఇటీవల కొత్తగూడెంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి, ఒడిశాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. – అజ్మీర మురళీకృష్ణ ఇండియా తరఫున ఆడాలన్నదే లక్ష్యం పాఠశాల స్థాయి నుంచి జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. అండర్–14 విభాగంలో గతేడాది కొల్లాపూర్‌లో నిర్వహించిన స్టేట్ లెవెల్ పోటీల్లో ఆడి నేషనల్‌కు ఎంపికయ్యారు. నవంబర్‌లో ఒడిశాలో నిర్వహించిన ఎస్జీఎఫ్ పోటీల్లో టీంలో బెస్ట్ ప్లేయర్‌గా ఆడాను. భారత్ తరఫున ఆడాలన్నదే లక్ష్యం. – ఎలబోయిన అభిలాష్ కొడితే గోల్ పడాల్సిందే ఫుట్‌బాల్ ఆటలో దిగానంటే బాల్ కొడితే గోల్లో పడాల్సిందే. ఎస్జీఎఫ్, ఖేలో ఇండియా పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి నేషనల్ స్థాయిలో ఆడి గుర్తింపు పొందాను. నేషనల్ స్థాయిలో ఆడుతాను. మా పీడీ చొరవతో ఎంతోమంది నిరుపేద విద్యార్థులు రాణిస్తున్నారు. నాకు కూడా మంచి కోచ్ కావాలని ఉంది. – నిఖిత అందరూ ఆడడం చూసి.. పాఠశాలలో అందరూ ఆడడం చూసి ప్రాక్టీస్ చేసి నేషనల్ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఆడాను. వనపర్తిలో నిర్వహించిన స్టేట్‌లెవెల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చాను. రామకృష్ణాపూర్, ఒడిశాలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాను. ఇండియా ఫుట్‌బాల్ జట్టులో ఆడాలన్నదే నా లక్ష్యం. – అజ్మీర హారిక ఉన్నత స్థాయిలో స్థిరపడాలని.. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. పాఠశాలలో సాయంత్రం వేళ నా స్నేహితులు ఫుట్‌బాల్ ఆడుతుంటే చూసి గతేడాది నుంచి నేనూ గ్రౌండ్‌కు వెళ్లి శిక్షణ పొందుతున్నాను. గతేడాది వనపర్తిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. నేషనల్ లెవెల్లో అడి ఉన్నతస్థాయిలో స్థిరపడాలని ఉంది. – దీక్షిత ఆర్మీలో చేరి దేశసేవ చేయాలని.. మాది పేద కుటుంబం. ఫుట్‌బాల్ ఆటల్లో మంచి ప్రతిభ కనబర్చి ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని ఉంది. గతేడాది ఖేలో ఇండియా గేమ్స్‌లో రామకృష్ణాపూర్లో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాను. అండర్–14, 17 విభాగంలో ఒడిశాలో నిర్వహించిన ఖేలో ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నాను. – పవార్ అశ్విని రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను మాది మధ్య తరగతి వ్యవసాయం కుటుంబం. నేను ఆరో తరగతిలో ఏకలవ్య పాఠశాలో చేరాను. అప్పటినుంచి క్రీడలు అంటే చాలా ఇష్టం. దీంతో ఫుట్‌బాల్ కోచ్ సహకారంతో ఆటలో శిక్షణ పొంది నేషనల్ స్థాయిలో ఆడుతున్నాను. ప్రతీరోజు పాఠశాలలో ఉదయం గంట సాయంత్రం 2గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాం. – అల్లం రాణి -
వైద్యసేవలు అందించాలి
రిటైర్డయిన వారిలో అత్యధికులు 60 నుంచి 70 ఏళ్ల వయస్సు పైబడిన వారే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వెల్నెస్ సెంటర్లకు పోతే అక్కడ సరైన వైద్యం అందడం లేదు. ఈ కేంద్రాల్లో నిపుణులైన వైద్యులను నియమించాలి. ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులన్నింటిలో నగదు రహిత వైద్య సేవలు అందించాలి. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి. – సాయిరి శశికాంత్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
పత్తి కొనుగోళ్లపై రాష్ట్ర విజిలెన్స్ ఆరా
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్ర విజిలెన్స్ అధికారులు జిల్లాకేంద్రంలో పత్తి కొనుగోళ్లపై ఆరా తీశారు. స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 8 మందితో కూడిన అధికారుల బృందం సభ్యులు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్న పత్తి వివరాలు సేకరించారు. తూకంలో తేడాలను పరిశీ లించారు. రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నా రు. కాంటాలు, సీసీఐ కొనుగోలు చేసిన పత్తి వివరాలు, మార్కెట్ యార్డులో లైసెన్సులు, సీసీ కెమెరాల పనితీరుతో పాటు పింజపొడవు, తేమ శాతం పరిశీలించారు. 1వ కాంటాను పరిశీలించి 5 కిలోల తేడాను గమనించారు. అధికారులను ప్రశ్నించారు. కాంటా బయట ఉండడంతో తేడాలు వస్తాయని అధికారులు తెలిపారు. కిసాన్ యాప్ ఏవిధంగా పనిచేస్తుందని అడిగి తెలుసుకున్నారు. తనిఖీ సమయంలో ఓ పత్తి బండి మార్కెట్ యార్డులో తేమ శా తం తక్కువ ఉండగా, జిన్నింగ్‌లో ఎక్కువగా రావడంతో సదరు రైతు ఆ బండిని తీసుకొని మార్కెట్ కు వచ్చాడు. అక్కడే ఉన్న అధికారులకు విషయాన్ని తెలియజేశాడు. దీంతో వారు జిన్నింగ్‌కు వెళ్లి ప రిశీలించారు. జాగృతి నాయకులు వేణుగోపాల్ యాదవ్ రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఫింగర్‌ప్రింట్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పత్తి, సోయా కొనుగోళ్లకు ఫింగర్‌ప్రింట్ నిబంధన తొలగించా లని, కుటుంబ సభ్యుల్లో ఎవరైన ఒకరు వచ్చి విక్రయించేలా చర్యలు చేపట్టాలని కోరారు. విజిలెన్స్ అధికారుల్లో అనిల్ కుమార్, దినేష్చంద్ర, వరుణ్‌ప్రసాద్, ప్రశాంత్‌రావులు ఉన్నారు. వీరి వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్కెటింగ్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఏవో నగేష్‌రెడ్డి, రైతులు ఉన్నారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు కీలకనేత
ఆసిఫాబాద్: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బడే చొక్కారావు ఆసిఫాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు సిర్పూర్లో మరో 15మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో 9మంది మహిళలు కాగా ఆరుగురు పురుషులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయుస్టులపై కేంద్రం కన్నెర్రజేసింది. 2026 మార్చి 31లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడంతో సాయుదబలగాలు వారిపై విరుచుకపడుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా ఆపార్టీ కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీకి చెందిన కీలక నేత బడే చొక్కారావు పోలీసులకు చిక్కడంతో ఆపార్టీకి దెబ్బమీద దెబ్బ తాకినట్లయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
● మిగిలిన ఆరు మండలాల్లో రేపే ఎన్నికలు ● బీఆర్ఎస్ ఇలాఖాలో ఫలితాలు ఆసక్తికరం ● కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగేనా? ● గులాబీ పార్టీ మార్క్ చూపెట్టేనా ● బీజేపీ ప్రభావం చాటుకునేనా..
సాక్షి,ఆదిలాబాద్: పంచాయతీ సంగ్రామం చివరి దశకు వచ్చింది. మూడో విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు రెండు విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. బీఆర్ఎస్ అధికార పార్టీకి పోటీనిచ్చింది. బీ జేపీ ప్రభావం చాటుకుంది. చివరి విడత ఎన్నికలు బోథ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కొనసాగనున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా.. నేనా అన్నట్టు పోటీ పడగా, బీజేపీ స్వల్ప స్థానాలతో ప్రభావం చాటుకుంది. గులాబీ ఇలాఖాలో జరుగుతున్న చివరి ఫేజ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తుందా.. బీఆర్ఎస్ ఇక్కడ అధిక స్థానాల్లో గెలుపొంది జిల్లాలో ఆధిపత్యం కొనసాగిస్తుందా.. ఈ రెండు పార్టీలకు బీజేపీ ఏమైనా చెక్ పెడుతుందా.. అనేది రేపటి ఫలితాలతో స్పష్టం కానుంది. స్వతంత్రులపై ఫోకస్.. రెండు విడతల్లో రాజకీయ పార్టీ మద్దతుదారులతో పాటు స్వతంత్రులు కూడా అధిక సంఖ్యలో గెలు పొందారు. గెలిచిన వారిలో 60కి పైగా స్వతంత్ర సర్పంచులు ఉండగా, వారు ఇప్పుడు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. అధి క శాతం ఇండిపెండెంట్లు అధికార కాంగ్రెస్ వైపే వెళ్లే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. మరోవైపు ఆదిలాబాద్ నియోజకవర్గంలో స్వతంత్రులను బీజేపీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ ముఖ్య నాయకులు దృష్టి సారించారు. ప్రతిష్టాత్మకంగా.. మూడో విడత ఎన్నికలను కొంత మంది నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ఇద్దరిదీ నేరడిగొండ మండలం. దీంతో ఈ మండలంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను సాధించేందుకు ఇరువురు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ జాదవ్ స్వగ్రామం రాజురాలో సర్పంచ్ ఏకగ్రీవం కాగా, గజేందర్ స్వగ్రామం బొందిడిలో ద్విముఖ పోటీ నెలకొంది. బజార్హత్నూర్ మండలంలో కాంగ్రెస్‌కు అత్యధిక సర్పంచ్ స్థానాలను సాధించేందుకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత మండలంలో ఆయన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికార పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ సోయం బాపూరావు తన సొంత మండలమైన బోథ్‌తో పాటు ఈ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుపొందించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తలమడుగులో కాంగ్రెస్‌కు చెందిన మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి అత్యధిక సర్పంచ్ స్థానాలు కై వసం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మండలంలో గట్టి ప్రభావం చూపడం ద్వారా అధికార పార్టీలో తన సత్తా చాటుకునేలా ముందుకు సాగుతున్నారు. ఇక బీజేపీ ఎంపీ గోడం నగేశ్ తన సొంత మండలం బజార్హత్నూర్తో పాటు బోథ్ నియోజకవర్గంలో పార్టీ పరంగా మద్దతుదారులు అత్యధికంగా గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుడిహత్నూర్ మండలంకు చెందిన కమలం పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ తన సొంత మండలంతో పాటు నియోజకవర్గంలో పార్టీ మద్దదారుల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ఏ మేరకు సఫలీకృతమవుతారో వేచి చూడాల్సిందే. మొత్తంగా చివరి విడత ఎన్నికలు పార్టీలపరంగా ఆసక్తికరంగా మారాయి. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఇలా.. విడత మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్వతంత్రులు మొదటి 166 61 59 10 36 రెండో 156 56 30 45 25 మొత్తం 322 117 89 55 61 -
పంచాయతీల అభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెప్పించి జిల్లాలోని ఆయా పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రెండో విడత ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన 54 మంది గెలుపొందడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సంబరా లు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎ న్నికై న సర్పంచ్‌లను సన్మానించి అభినందనలు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి, ప్ర జా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఇందులో నాయకులు దయాకర్, సంతోష్, కార్తీక్, సన్నీ, రవి, దినేష్ మటోలియా, లాలా మున్నా, దత్తు పాల్గొన్నారు. -
క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్
ఆదిలాబాద్‌టౌన్: మహిళలు, యువతుల్లో సర్వేకల్ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం వ్యాక్సిన్ అందిస్తుందని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సమావేశ మందిరంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై వైద్యాధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవనశైలిలో మార్పులు, వివిధ రుగ్మతలతో మహిళలు, యువతులు సర్వేకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. 14 ఏళ్లలోపు బాలికలు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రతీ పీహెచ్సీలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఈనెల 18 నుంచి 31 వరకు కుష్ఠు వ్యాధి గుర్తింపు ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌వో సాధన, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
చాపకింద నీరులా కుష్ఠు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో కుష్ఠు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. వ్యాధి నిర్మూలనకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. 2027 వరకు కుష్ఠు రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవగాహన లేమితోనే జనం వ్యాధి బారిన పడుతున్నారు. స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. నిర్ధారణ పరీక్షలు చేసినప్పుడు మాత్రమే కేసులు బయట పడుతున్నా యి. మార్చిలో నిర్వహించిన సర్వేలో కొత్తగా 45 మందిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 56 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంటున్నారు. అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సరైన సమయంలో చికిత్స పొందితే నయం అవుతుందని పేర్కొంటున్నారు. 18 నుంచి సర్వే.. జిల్లాలో ఈనెల 18 నుంచి 31 వరకు 14 రోజుల పాటు కుష్ఠు గుర్తింపు ఉద్యమ కార్యక్రమం నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకు ఆశ కార్యకర్తలు ఈ సర్వే చేపడుతారు. ఇంటింటికి తిరుగుతూ కుటుంబీకుల వివరాలు సేకరిస్తారు. శరీరంపై ఉన్న మచ్చలను గుర్తించి సమీపంలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసేలా చూస్తారు. పట్టణంలో రోజుకు 25, గ్రామీణ ప్రాంతాల్లో 20 ఇళ్లను సర్వే చేపడతారు. పర్యవేక్షణ కోసం 200 మంది సూపర్వైజర్లను నియమించారు. వైద్యాధికారులు, సిబ్బందికి సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తగ్గుముఖం పట్టని వైనం.. ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం లెప్రీయ అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాప్తి చెందుతోంది. సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే ఒకరినుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంపై ఒకటి నుంచి ఐదు స్పర్శలేని మచ్చలుంటే పాసిబ్యాసెల్లరింగ్ అని పేర్కొంటారు. దీని నివారణకు ఆరు నెలల వరకు చికిత్స అందిస్తారు. ఆరు కంటే ఎక్కువ మచ్చలుండి, నరాలు ఉబ్బితే మల్టీ బ్యాసిలరిగా నిర్ధారిస్తారు. దీని నివారణకు ఏడాఇ వరకు చికిత్స అందిస్తారు. తొలి దశలో వ్యాధిని నిర్ధారించుకొని చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు మచ్చలు స్పర్శ లేకుండా ఉంటే వ్యాధిగా నిర్ధారిస్తారు. మార్చిలో చేపట్టిన సర్వేలో 45 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించారు. జిల్లాలో 10వేల మందిలో ఒకరికి వ్యాధి సోకితే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుతం బజార్హత్నూర్, సొనాల, తాంసి, గిమ్మ, జైనథ్, పీహెచ్‌సీల పరిధిలో ఒక శాతం కంటే ఎక్కువగా కేసులు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. సర్వే పకడ్బందీగా చేపడతాం.. కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను పకడ్బందీగా చేపడతాం. ఈనెల 18 నుంచి 31 వరకు ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 56 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. 2027 నాటికి వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో సంవత్సరం కేసులు 2022–23 71 2023–24 83 2024–25 73 2025–26 45 (మార్చి నుంచి ఇప్పటివరకు) -
అక్రమ రిజిస్ట్రేషన్ల నియంత్రణకు చర్యలు
కై లాస్‌నగర్: ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సోమవారం ఆయ న సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అధికారుల పనితీరు, రిజిస్ట్రేషన్ల వివరాలపై ఆరా తీశారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందితో మా ట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ రిజిస్ట్రేషన్లను నియంత్రించేలా నిషేధిత భూముల జాబితా లను రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు రోజుల క్రితం అందజేసినట్లుగా తెలిపారు. రెవెన్యూ, వక్ఫ్‌బోర్డ్, దేవాదాయ శాఖల నిషేధిత భూముల వివరాలన్నీ అందులో ఉన్నట్లుగా వివరించారు. ఎల్ఆర్ఎస్ అమల్లోకి వచ్చాక అక్రమ రిజిస్ట్రేషన్లు తగ్గాయన్నారు. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేసి ఇబ్బందుల పాలు కావద్దని సూచించారు. రిజిస్ట్రేషన్లలో జాప్యం కాకుండా స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చినట్లుగా తెలిపారు. అనధికార లేఔట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తే సబ్రిజిస్ట్రార్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు బాధ్యుడైన ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్‌పై వేటు వేసినట్లు స్పష్టం చేశారు. అలాగే రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ల నియామకం, కార్యాలయాల నూతన భవన నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లుగా వివరించారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ జి.ప్రసన్న, సబ్రిజిస్ట్రార్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇందులో సబ్రిజిస్ట్రార్లు, ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
వంద శాతం పోలింగ్ నమోదు లక్ష్యం
కైలాస్‌నగర్: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం గూగుల్ మీట్ ద్వారా తుది విడత ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరు మండలాల్లోని ఆయా గ్రామాల్లో వంద శాతం పోలింగ్ సాధించేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఓటర్ స్లిప్‌ల పంపిణీ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. వార్డువారీగా ఎలక్ట్రో రల్ జాబితాను బీఎల్ఓల వద్ద ఉంచాలని, సహాయక కేంద్రాల ద్వారా ఓటర్లకు పోలింగ్ కేంద్రం, వార్డు, సీరియల్ నంబర్ వివరాలు అందించాలన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రతీ పోలింగ్ కేంద్రంలో వీల్చైర్లు, ఆటో సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. సమస్యాత్మక పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సామగ్రిని రిటర్నింగ్, ప్రెసిడింగ్ అధికారులు పూర్తిగా పరిశీలించుకుని కేంద్రాలకు వెళ్లాలన్నారు. పోలింగ్ నమోదు వివరాలను నిర్ణీత సమయంలో టి–పోల్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. సిబ్బందికి భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డీపీవో రమేశ్, ఆర్డీవో స్రవంతి, డీఎల్పీవో ఫణిందర్, మాస్టర్ ట్రైనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జోనల్, సెక్టర్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
నిర్భయంగా ఓటేయండి
తలమడుగు: ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హ క్కు వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. మండలంలోని సుంకిడి, తలమడుగు, బరంపూర్, కజర్ల, దేవాపూర్ గ్రామాల్లో సోమవారం ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు విడతల్లో 140 మందిపై 60 కేసులు నమో దు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో రూరల్ సీఐ కె ఫణిదర్, ఎస్సైలు రాధిక, జీవన్‌రెడ్డి, సిబ్బంది తదితరులున్నారు. గుడిహత్నూర్: ఎన్నికల నిబంధనలు పాటిస్తూ నిర్భయంగా ఓటేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం సా యంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇందులో ఏఎస్పీ కాజల్ సింగ్, సీఐ రమేశ్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. నేరడిగొండ: మండలకేంద్రంతో పాటు వడూర్, బుగ్గారం(బి), కొరిటికల్(బి)లలోని సమస్యాత్మ క పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ప్ర లోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్, ఎస్సై ఇమ్రాన్, సిబ్బంది ఉన్నారు. -
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
ఆదిలాబాద్‌టౌన్: లేబర్కోడ్ల రద్దు కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. యూనియన్ 18వ మహాసభల సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కార్మిక పోరాట పతాక జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలంటే ఐక్య పోరాటాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న అఖిల భారత మహాసభల్లో దేశ నలు మూలల నుంచి కార్మిక ప్రతినిధులు పాల్గొని కార్మిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చిస్తారని తెలిపారు. ఈ మహాసభలను వి జయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆశన్న, నాయకులు స్వా మి, నవీన్‌కుమార్, మల్లేశ్, దేవిదాస్, సురేందర్, దత్తాత్రి, మంజుల, గంగారాం, ఆశన్న, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉపసర్పంచ్ ఎన్నికపై డీపీవోకు ఫిర్యాదు
కై లాస్‌నగర్: తమ గ్రామ ఉపసర్పంచ్ ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని తాంసి మండలంలోని కప్పర్ల పంచాయతీ వార్డుమెంబర్లు ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన పలువురు వార్డుమెంబర్లు సోమవారం డీపీవో రమేశ్‌ను ఆయన కార్యాలయంలో కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. గ్రామంలో 12 వార్డులుండగా ఉపసర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థికి కేవలం ఐదుగురు సభ్యుల మద్దతు మాత్రమే ఉందన్నారు. మిగతా ఏడుగురు సభ్యుల ప్రమేయం లేకుండా ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు. వార్డు మెంబర్లందరి సమక్షంలోనే ఉపసర్పంచ్ ఎన్నిక జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము ప్రమాణస్వీకారం చేయమని, అవసరమైతే మూకుమ్మడి రాజీనామా చేస్తామని తెలిపారు. డీపీవోను కలిసిన వారిలో వార్డు సభ్యులు సంగీత, అర్చన, వనిత, అనసూయ, షేక్ లతీఫ్, రమేశ్, శ్రీకాంత్ ఉన్నారు. -
నాడు ఎంపీటీసీలు.. నేడు సర్పంచులు
నిర్మల్ జిల్లా: పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. దహెగాం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు రాపర్తి జయలక్ష్మి బీజేపీ మద్దతుతో బరిలో నిలిచి సమీప అభ్యర్థి తుమ్మిడె మల్లీశ్వరిపై 242 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. మండలంలోని ఇట్యాల పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా గజ్జెల జయలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి బీఆర్ఎస్ మద్దతుదారు పొన్న కళావతిపై 109 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచారు. ముత్యాల కుటుంబానికి మూడోసారి..లోకేశ్వరం: మండలంలోని బాగాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ముత్యాల శ్రీవేద ఒకే ఓటుతో ఎన్నికల్లో విజయం సాధించింది. 1972లో లోకేశ్వరం, నగర్, భాగాపూర్ గ్రామాలకు ఆమె తాత ముత్యాల నారాయణ్‌రెడ్డి సర్పంచ్‌గా ఐదేళ్ల పాటు పని చేశారు. నారాయణ్‌రెడ్డి చిన్న కోడలు ముత్యాల రజిత 2013లో సర్పంచ్‌గా గెలుపొందారు. 2018లో డీఎస్సీలో రజిత స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ముధోల్ మండలం ఎడ్బిడ్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఇప్పుడు బీటెక్ చదివిన శ్రీవేద గెలుపుతో ముత్యాల కుటుంబానికి మూడోసారి సర్పంచ్ పదవి దక్కినట్లయింది. -
తొలి ఓటు.. సంబురం
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025బేల మండలం మసాల(కె) గ్రామంలో ఓటరు చేతివేలికి సిరా చుక్క పెడుతున్న సిబ్బందిఓటు వేయడానికి అంధురాలైన తన అత్తను తీసుకొస్తున్న కోడలు బేలలోని పోలింగ్ కేంద్రంలో క్యూలో ఓటర్లు20న కొలువుదీరనున్న కొత్త పంచాయతీ పాలకవర్గాలుకైలాస్నగర్: పంచాయతీ ఎన్నికలు మూడు వి డతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొ దటి, రెండో విడత ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా తుది విడత ఎన్నికలు ఈ నెల 17న నిర్వహించనున్నారు. ఈ మూడు విడతల్లో ఎన్నికై న పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసేలా తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గెజిట్ విడుదల చేసింది. ఈమేరకు ఆ శాఖ డైరెక్టర్ జి.శ్రీజన ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20న ఆదిలాబాద్ జిల్లాలోని 473 గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అదే రోజున సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరు మండలాల్లో నిషేధాజ్ఞలు అమలుకై లాస్‌నగర్: మూడో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న బోథ్, సొనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపా రు. అభ్యర్థులు ఈ నెల 15న సాయంత్రం 5 గంటల్లోపు ప్రచారం ముగించాలని పేర్కొన్నా రు. తర్వాత నుంచి నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నందున ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన వెంటనే మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసివేయాలని తెలిపారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ప్రజ లు సహకరించాలని కోరారు. కోడ్ ఉల్లంఘనపై 27 కేసులుకై లాస్‌నగర్: జిల్లాలోని ఎనిమిది మండలాల్లో జరిగిన గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నిక ల సందర్భంగా కోడ్ ఉల్లంఘనపై 27 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలిపారు. భీంపూర్‌లో ఒకటి, ఆదిలా బాద్ రూరల్‌లో 8, మావలలో 2, తాంసిలో 3, బేలలో 4, జైనథ్‌లో 9 కేసుల చొప్పున ఆరు పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తు న్న పోలీసులకు అడ్డుపడిన, నియమావళిని ఉ ల్లంఘించిన,మద్యం, బహుమతులు పంపిణీ చేస్తూ, ఎన్నికల ప్రచారం పర్వం ముగిశాక ప్ర చారం చేసిన 66 మందిపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. పల్లె తొలిపౌరుడిని ఎన్నుకునేందుకు యువత ఆసక్తి చూపింది. స్థానికంగా ఉన్న వారితో పాటు దేశ, విదేశాల్లో ఉన్న వారు కూడా సొంతూరుకు విచ్చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు వేసి సంబురపడ్డారు. మనోగతం వారి మాటల్లోనే.. –తాంసి -
వలస ఓటర్లకు గాలం
నేరడిగొండ: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాం వదులుకోవడం లేదు. గెలుపుకోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఎలాగైనా పోలింగ్ రోజు రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడెక్కడా ఉన్నారో వివరాలు సేకరించి ఫోన్లు చేస్తూ ఓటు వేసుందుకు రావాలని కోరుతున్నారు. కొంత మంది స్వయంగా కలిసి ఎన్నికల్లో ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రయాణ ఖర్చులు భరిస్తామని, ఓటుకు కొంత మొత్తం ముట్టజెబుతామని బేరసారాలు సాగిస్తున్నారు. ఓటర్లంతా ఒకే దగ్గర ఉంటే వాహనాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. సర్పంచ్‌కు నీఇష్టం..వార్డుకు మాత్రం నాకే ఓటెయ్ మూడో విడత ప్రచారం జోరందుకుంది. మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ బలపరిచే సర్పంచ్ అ భ్యర్థులు గెలుపే లక్ష్యంగా పార్టీ మద్దతుదారులైన వార్డు సభ్యులకు కొంతమేర ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా గ్రామాల్లో ఓటర్లు వార్డు సభ్యుల అభ్యర్థులకు అనుకూలంగా ఉండి, సర్పంచ్ అభ్యర్థిపై నిరుత్సాహంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వార్డు సభ్యుల అభ్యర్థులు, సర్పంచ్‌కి నీయిష్టం.. వార్డులో నాకు తప్పనిసరిగా ఓటు వేయ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలా వరకు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. -
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జిల్లాలో రెండో విడత నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. మండలం ఎన్నికలైన మొత్తం పోలైన పురుషులు మహిళలు పోలింగ్ ఆదిలాబాద్‌రూరల్ 27 26925 23393 11601 11792 86.88 బేల 30 27071 22970 11737 11233 84.85 భీంపూర్ 21 17831 15135 7427 7708 84.88 భోరజ్ 16 14414 12868 6398 6470 89.27 జైనథ్ 16 19145 16791 8342 8449 88.21 మావల 03 4386 3700 1788 1912 84.36 సాత్నాల 15 9896 8685 4353 4332 87.76 తాంసి 11 12880 11260 5527 5733 87.4220.05 58.00 83.96 19.63 59.09 82.66 24.93 59.99 81.16 23.60 55.49 87.09 19.42 56.45 85.87 16.46 53.06 77.43 28.00 63.46 85.85 24.26 57.30 83.38 పోలింగ్ శాతం సరళి ఇలా..పల్లె చైతన్యం వెల్లివిరిసింది. జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రామ ప్రథమ పౌరులతో పాటు వార్డుమెంబర్లు ఎన్నికయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించగా.. అనంతరం కౌంటింగ్ చేపట్టారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. హోరా హోరీ పోరులో విజేతలుగా నిలిచిన వారి సంబురం అంబురాన్నంటింది. అనంతరం ఉపసర్పంచ్‌ల ఎన్నిక తంతును అధికారులు పూర్తి చేశారు. – కై లాస్నగర్ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్‌రూరల్, బేల, భోరజ్, సాత్నాల, జైనథ్, మావల, బోథ్ నియోజకవర్గంలోని తాంసి, భీంపూర్ మండలా ల్లోని 139 పంచాయతీలు, 1,146 వార్డుస్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరిగాయి. పల్లె ఓటర్లు వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. నిర్ణీత సమయం లోపు క్యూలో ఉన్న వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. యువతతో పాటు మహిళలు, పురుషులు, వృద్ధులు స్వచ్ఛందంగా కేంద్రాల కు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నా రు. మొత్తంగా ఈ విడతలో 86.68 పోలింగ్ శాతం నమోదైంది. ఆదిలాబాద్ రూరల్, భీంపూర్, మావ ల మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు పరిశీలించా రు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నెమ్మదిగా మొదలై.. తర్వాత పుంజుకుని ఆయా మండలాల పరిధిలో మొత్తం 1,32,438 మంది ఓటర్లు ఉండగా, 1,14,802 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 64,577 మంది పురుష ఓటర్లకు గాను 57,173 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 67,861 మందికి గాను 57,629 మంది ఓటు వేశారు. చలి తీవ్రత కారణంగా తొలుత పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఉదయం 7నుంచి 9గంటల వరకు కేవలం 21.80 శాతం మాత్రమే నమోదైంది. క్రమేణ పుంజుకుంది. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా కదలివచ్చారు. వృద్ధులు, దివ్యాంగులను కుటుంబీకులు ఆటోలు, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి ఓటు వేయించారు. వారికి కేంద్రాల్లో వీల్‌చైర్ సౌకర్యం కల్పించారు. 9గంటల తర్వాత అన్ని చోట్ల ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 11 గంటల వరకు 58.17 శాతం నమోదైంది. పోలింగ్ ముగిసే నిర్ణీత సమయం ఒంటి గంట వరకు 83.80 శాతం నమోదైంది. అప్పటికే పలు చోట్ల క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో మధ్యాహ్నం 3గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. చివరకు 86.68 శాతం నమోదైంది. ప్రతి రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్ సరళిని ప్రకటించారు. రాత్రి వరకు సాగిన లెక్కింపు..మావల, ఆదిలాబాద్ రూరల్, సాత్నాల, బేల, భోరజ్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియపై ఆరా తీశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ తీరును పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రి య చేపట్టారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. తర్వాత స ర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఈ ప్రక్రి య రాత్రి వరకు కొనసాగింది. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడయ్యాయి. మిగతా చోట్ల ఆలస్యమయ్యాయి. గెలుపొందిన సర్పంచులు తమ అనుచరులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. -
మలి విడతలోనూ ‘హస్తం’ జోరు
కై లాస్‌నగర్: జిల్లాలో నిర్వహించిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ విడతలో 139 సర్పంచ్, 1,146 వార్డుమెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మె జార్టీ స్థానాల్లోనూ హస్తం పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. పలు చోట్ల అధికార కాంగ్రెస్, బీజేపీలు బలపర్చిన అభ్యర్థుల నడుమ నువ్వా నే నా అన్నట్లుగా పోటీ సాగింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు పోటీ పడ్డారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలా లు, బోథ్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఎన్నికలు జరగ్గా బీజేపీ స్థానికంగా తన బలాన్ని చాటుకుంది. అధికార కాంగ్రెస్‌కు గట్టిపోటీనిచ్చి రెండో స్థానానికి ఎగబాకింది. పలుచోట్ల ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో జయాపజయాలు పదుల సంఖ్యల ఓట్లతో దోబూచులాడాయి. కొన్ని చోట్ల రెండు, మూడు ఓట్ల తేడాతోనూ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి మొత్తంగా కాంగ్రెస్ 56 సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోగా, బీఆర్ఎస్ 30 చోట్ల విజయం సాధించింది. బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబా ద్ నియోజకవర్గంలో ఆ పార్టీ బలం పుంజుకుంది. కమలం పార్టీ మద్దతుదారులు 45 మంది గెలుపొందారు. స్వతంత్రులు సైతం మూడు పార్టీలకు గట్టి పోటీనిచ్చారు. 25మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. సర్పంచ్ల ఫలితాల ను అధికారికంగా ప్రకటించిన అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో ఉ ప సర్పంచ్ల ఎన్నిక నిర్వహించారు. గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డుమెంబర్లకు ఆర్వోలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అభిమాన నాయకులు గెలుపొందడంతో అనుచరులు టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పూ లమాలలతో సత్కరించారు.ఆయా మండలాల్లో పార్టీల మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ల వివరాలు.. మండలం ఎన్నికలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఆదిలాబాద్‌రూరల్ 31 09 02 11 09 బేల 31 13 08 08 02 జైనథ్ 17 07 02 05 03 సాత్నాల 17 04 04 09 00 భోరజ్ 17 04 03 04 06 మావల 03 01 00 01 01 భీంపూర్ 26 12 07 04 03 తాంసి 14 06 04 03 01ప్రముఖుల సొంతూళ్లలో.. సాక్షి,ఆదిలాబాద్: రెండో విడత ఎన్నికల్లో ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వగ్రామం జైనథ్ మండలం అడలో బీజేపీ కి చెందిన కుర్సంగే నిర్మ ల ఏకగ్రీవం అయ్యారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు జోగు రామన్న స్వగ్రామమైన జైనథ్ మండలం దీపాయిగూడలో బీఆర్ఎస్కు చెందిన మౌనిషా రెడ్డి గెలుపొందారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి స్వగ్రామమైన వడూర్‌లో అన్ని పార్టీలు బలపర్చిన దత్తు యాదవ్ విజేతగా నిలిచారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళలో చలితీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూశా.. సాత్నాల: ఎన్నికల్లో ఓటు వేయాలని ఎంతో కాలంగా ఆత్రుతగా ఎదురుచూశాను. ఈ సారి అవకాశం వచ్చింది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నా. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని గుర్తించాను. ఇక ప్రతీ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకుంటా. – బావునే స్వేచ్ఛ, గిమ్మ, భోరజ్ (మం) -
పెద్దమ్మా.. ‘గుర్తు’ంచుకో
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళలతో చలి తీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. సమయం : శనివారం సాయంత్రం 6 గంటలు.. ‘అవ్వా.. బాపు ఉన్నాడా.. ఏం చేస్తున్నారు..’ అంటూ గేటు తీసుకుంటూ ఐదారుగురితో కలిసి లోనికి వచ్చాడు ఓ సర్పంచ్ అభ్యర్థి. అయ్యో నువ్వా బిడ్డా.. రా.. రా.. కూర్చో.. ఇప్పుడే బాయి కాడికి పోయి వచ్చినం.. బాబాయ్‌కి కుర్చీ ఇవ్వు అంటూ మనుమనితో అనంగనే.. టైమ్ లేదు పెద్దమ్మ.. రేపే కదా పోలింగ్.. చివరగా అందరినీ కలుస్తున్న.. మన గుర్తు మర్చిపోవద్దు.. అంటూ చేతిలో ఉన్న ఓటరు జాబితా తీసి మనింట్ల ఐదో ట్లు ఉన్నయ్ కదా.. అని టిక్ మార్కు పెట్టుకున్నడు.. వెంటనే వెనకాల బ్యాగ్ పట్టుకొని ఉన్న వ్యక్తి రూ.500 నోట్లు పది ఇచ్చిండు.. మాకెందుకు బిడ్డా పైసలు.. మేము దూరపోల్లమా.. అంటూనే రూ.5వేలు తీసుకొని నువ్వు మల్లమల్ల చెప్పాల్నా.. మాయి పక్కా నీకే బిడ్డా.. అంది. అది కాదు పెద్దమ్మ ఆపోసిటోళ్లు కూడా వస్తరు.. వాళ్లిచ్చినా తీసుకోండి.. కానీ ఓటు మనకే పడా లే.. అన్న అభ్యర్థి మాటలు పూర్తి కాకుండా నే.. నువ్వు ఉండంగ వేరే వాళ్లకు ఎట్లేత్తం బిడ్డా.. వాళ్లు పది వెలిచ్చినా ఎయ్యం.. నువ్వు మనోనివి.. ఆపద.. సంపదకి వచ్చేటోనివి.. నిన్న కోడలు కూడా ఇంటికొచ్చి బొట్టు పెట్టి చెప్పింది.. అని చెప్పంగనే.. గట్లనే పెద్దమ్మ యాది మరువద్దు.. మీ అందరి దీవెనలు ఉండాలె.. తమ్ముడు.. మరదలు.. చిన్నోడు.. బాపు.. నువ్వు అంతా కలిసి ఎగిలి వారంగనే వచ్చి ఓటేయండి. మనోళ్లందరికీ చెప్పండి.. గుర్తు మరిచిపోవద్దు.. మళ్లా కొడుకు రాలేదనుకోవద్దు.. ఇప్పటికే లేట్ అయింది.. పంచుడు మన కానుంచే మొదలు పెట్టిన.. ఇంకా పది వార్డులున్నయ్.. యూత్ పిలగన్లకు దావత్ నడుస్తంది.. తమ్ముడు ఆడనే ఉన్నడు.. ఈ ఒక్క రాత్రి జాగారమే.. మరిచిపోకు పెద్దమ్మ.. బాపు పోయస్తనే.. అనగానే బైక్‌పై ఉన్న బాక్స్‌లో నుంచి ఓ వ్యక్తి క్వాటర్.. లీటర్ థంసప్ బాటిల్ ఇయ్యంగనే పెద్దాయన మొఖం ఎలిగిపోయింది.. అన్నకు జై.. గుర్తూ గుర్తుంచుకో.. అంటూ వచ్చిన వాళ్లు జై కొడుతూ వెళ్లిపోయారు. ఇలా చివరి రోజు అభ్యర్థుల ప్రచార పర్వం సాగింది. మద్యం, డబ్బు, విందులతో పల్లె పండుగ చేసుకుంది. – సాక్షి, ఆదిలాబాద్ డెస్క్ -
పట్టాలెక్కనున్న ఆశల రైలు
నిర్మల్: ఈ ప్రాంతప్రజల ఆశల రైలు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ..!? అన్న ప్రజల ఆకాంక్షలను ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ ఒత్తిడి పెంచుతున్నా రు. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ ప్రాంతంలోని దాదాపు ఏడు లక్షల మంది జనాభాతోపాటు, దే శంలోని రెండు మహానగరాలైన హైదరాబాద్, నాగ్‌పూర్ మధ్య అనుసంధానానికి రైల్వేలైన్ నిర్మాణం వేగవంతం చేయాలంటూ ఇటీవలే రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కోరారు. లోక్‌సభ సమావేశాల్లో రైల్వేలైన్ గురించి చర్చించడంతోపా టు తాజాగా శనివారం రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ కలిశారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వేలైన్‌కు సంబంధించిన డీపీఆర్ రైల్వేశాఖకు చేరిందని, దీన్ని త్వరగా ఆమోదించి లైన్నిర్మాణం చేపట్టాలని మరోసారి విన్నవించారు. రూ.4,300 కోట్ల అంచనా.. పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ లైన్ వేస్తామంటూ ప్రజలను గందరగోళానికి గురిచేయకుండా, కేవలం ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు లైన్ నిర్మిస్తే సరిపోతుందని ఎంపీ నగేశ్ మరోమారు రైల్వేమంత్రికి వివరించారు. గతంలోనూ ఈమేరకే చేసిన వినతిప్రకారం దక్షిణమధ్య రైల్వే 136.50 కిలోమీటర్ల ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్ ని ర్మాణానికి రూ.4,300 కోట్ల అంచనాతో డీపీఆర్ పూ ర్తిచేసింది. సోన్వద్ద గోదావరిపై బ్రిడ్జితోపాటు ఘా ట్రోడ్లలో ఎనిమిది చోట్ల టన్నెళ్ల నిర్మాణాలు చే పట్టాలని ఇందులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇప్పటికే రైల్వేశాఖకు చేరిందని, దీన్ని త్వరగా ఆమోదించేలా చూడాలని ఎంపీ నగేశ్ మంత్రిని కోరారు. రైల్వేబోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) పూర్తయినా మరో రెండు దశలు పూర్తయితేనే రైల్వేలైన్‌కు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుంది. ప్రస్తుతం ఒక అడుగు ముందుకు పడింది. ఈ డీపీఆర్‌ను రైల్వేబోర్డు ఆమోదించి, ఆర్థికశాఖ క్లియరెన్స్ కోసం పంపిస్తే సరిపోతుంది. రైల్వేబోర్డు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఒప్పుకుంటే దాదాపు నిర్మల్ మీదుగా రైల్వేలైన్‌కు పచ్చజెండా ఊపినట్లే. ఆయా ప్రక్రియలను త్వరగా పూర్తిచేసి, ప్రజల ఆకాంక్ష మేరకు లైన్ నిర్మాణం చేపట్టాలని మరోమారు రైల్వేమంత్రిని కోరినట్లు ఎంపీ నగేశ్ ‘సాక్షి’కి తెలిపారు. త్వరగా పనులు ప్రారంభించాలని.. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ పూర్తయింది. మిగితా ప్రకియలనూ త్వరగా పూర్తిచేసి లైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కోరాం. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. –గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ ప్రతిపాదిత రైల్వేలైన్ వివరాలు.. రైల్వేలైన్ : ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లబ్ధిపొందే డివిజన్లు : ఆర్మూర్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, ఆదిలాబాద్ లబ్ధిపొందే ప్రజలు : దాదాపు 7లక్షలు లైన్ నిర్మాణ అంచనా : రూ.4,300 కోట్లు లైన్ నిర్మాణ దూరం : 136.50 కిలోమీటర్లు -
నిఘా నీడన గ్రామాలు
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకం. పోలీసుల సూచనతో ఆయా గ్రామాల్లో వీటి ఏర్పాటుకు పల్లెజనం ముందుకు వస్తున్నారు. ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ప్రశాంతంగా ‘నవోదయ’ ప్రవేశ పరీక్షకై లాస్‌నగర్: జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్‌లోని ఐదు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్, మావలలోని చావర అకాడమీ ఉన్నత పాఠశాల, బోథ్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఉట్నూర్‌లోని పూలా జీబాబా ఏ, బీ కేంద్రాల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు.1291 మందికి గాను 942 మంది హాజరైనట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. కై లాస్‌నగర్: జిల్లాలో రెండో విడత పల్లె సమరానికి సర్వం సిద్ధమైంది. ఈమేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎనిమిది మండలాల్లో 156 పంచాయతీలు, 1,260 వార్డులుండగా అందులో 17 సర్పంచ్, 114 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 139 సర్పంచ్, 1,146 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో సర్పంచ్ పదవుల కోసం 520మంది బరిలో నిలువగా వార్డుమెంబర్ స్థానాలకు 2,496 మంది పోటీ పడుతున్నారు. వీరి భవితవ్యాన్ని 1,32,438 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,146 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,375 మంది పీవోలు, 1509 మంది ఓపీవోలను నియమించారు. ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రానికో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని నియమించారు. పోలింగ్ ప్రారంభం నుంచి ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహణ వరకు జరిగే ప్రక్రియను వీరే పర్యవేక్షించనున్నారు. నాలు గు, ఐదు పోలింగ్ కేంద్రాలను కలిపి ఒక జోనల్ ఆఫీసర్ చొప్పున 34 మందిని నియమించా రు. మొత్తం పోలింగ్ కేంద్రాలను 36రూ ట్లుగావిభజించి ఒక్కో రూట్‌కు ఓ రూట్ ఆఫీ సర్‌ను నియమించారు. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ .. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. నిర్దేశిత సమయంలోపు కేంద్రాలకు వచ్చిన ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ ముగిశాక గంట పాటు భోజన విరామం ఉంటుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపడుతారు. ప్రతీ రెండు గంటలకోసారి పోలింగ్ సరళిని ప్రకటిస్తారు. సర్పంచ్ అభ్యర్థులకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, వార్డుమెంబర్ అభ్యర్థులకు వైట్‌కలర్ బ్యాలట్ అందిస్తారు. ప్రతీపోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. సర్పంచ్, వార్డుమెంబర్లకు సంబంధించిన రెండు ఓట్లు ఇదే బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ ము గిసి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఉపసర్పంచ్ ఎన్నికను చేపడుతారు. ఆయా మండలాల్లోని ఓట ర్లకు ఇప్పటికే బీఎల్వోల ద్వారా ఫొటోలతో కూడి న ఓటరు పోల్ చీటీలను పంపిణీ చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా ఆయా మండలాల పరిధిలోని 36 లోకేషన్స్‌లో గల 65 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా తగు చర్యలు చేపట్టారు. 17 లోకేషన్స్‌లోని 33 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేయగా, 19 లోకేషన్స్‌లోని 32 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు పోలింగ్ సరళిని పర్యవేక్షించేలా అనుసంధానం చేశారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బంది శనివా రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకుని ప్రత్యేక వాహనాల్లో బందోబస్తు నడుమ తరలివెళ్లారు. ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్ మండల కేంద్రాల్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బంది, పోలీసులకు పలు సూచనలు చేశారు. మొక్కజొన్న కొనుగోళ్లు క్లోజ్ జిల్లాలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అధికారులు మూసివేశారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలిపకడ్బందీ ఏర్పాట్లు ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ రూరల్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎన్నికల విధులకు హాజరు కానున్న పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం పలు సూచనలు చేశారు. ఎని మిది మండలాల్లో నిర్వహించనున్న ఎన్నికలకు 962 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు. జిల్లాలో ఇప్పటికే 598 మందిని బైండోవర్ చేశామని, అలాగే 20 మంది నుంచి ఆయుధాలను సేఫ్ డిపాజిట్ కింద తీసుకున్నట్లు తెలిపా రు. ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 ఎస్సైలతో పాటు మహిళా సిబ్బంది, హోంగార్డ్స్, రిజర్వ్, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలతో బందోబస్తు ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై విష్ణువర్ధన్, తదితరులున్నారు. మండలం ఎన్నికలు జరిగే బరిలో నిలిచిన పోలింగ్ ఓటర్లు పంచాయతీలు అభ్యర్థులు కేంద్రాలు ఆదిలాబాద్ రూరల్ 27 98 228 26,925 బేల 30 103 246 27,071 భీంపూర్ 21 74 168 17,831 భోరజ్ 16 60 130 14,414 జైనథ్ 16 60 136 19,035 మావల 3 11 28 4,386 సాత్నాల 15 54 116 9,896 తాంసి 11 60 34 12,880సాత్నాల: ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈమేరకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. సిబ్బందికి ప లు సూచనలు చేశారు. ఇందులో ఏపీడీ కు టుంబరావు, తహసీల్దార్ జాదవ్ రామారావు, ఎంపీడీవో వెంకట్ రాజు, తదితరులున్నారు. -
ఓటమి.. నైరాశ్యం
సాక్షి, ఆదిలాబాద్: ఇటీవల ఇంద్రవెల్లిలో ఓ వార్డు సభ్యుడిగా పోటీ చేసిన యువ సామాజిక కార్యకర్త ఓటమిపాలయ్యాడు. తన అంచనాల ప్రకారం గెలు పు ఖాయమనుకున్నాడు. అనుకున్నదొకటైతే.. అ య్యింది మరొకటి అన్నట్లు పరాజయం తలుపుతట్టింది. ఎందుకిలా జరిగిందని లెక్కలు వేశాడు. ఎ క్కడ ఓట్లు చేజారాయనే సమీకరణలు తీశాడు. ఒకవేళ ఆ ఓట్లు పడి ఉంటే తన గెలుపు ఖాయమని అనుకున్నాడు. తనకు వారు ఓటు వేయలేదని నిర్ధారించుకున్నాడు. విషయాన్ని జీర్ణించుకోలేకపోయా డు. నా ఓటమికి నువ్వే కారణమంటూ నేరుగా వేలెత్తి చూపాడు. మొదటి విడత పంచాయతీ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంద్రవెల్లిలో జరిగిన ఈ ఘట న ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఔరా అనుకునే పరిస్థితి తలెత్తింది. ఓటమి చెందిన చోటే గెలుపును వెతుక్కోవాలంటారు.. ఇది ఏ రంగానికై నా వర్తిస్తుందని పెద్దలు చెబుతుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన యువత తొలిసారి పరాజయం చవిచూస్తే ఓర్పు ప్రదర్శించాలి తప్ప నిరాశకు గురికావద్దు. విజయం దిశగా మరో ప్రయత్నం చేయాలి. అంతేకానీ ఇతరులను నిందించడం సరికాదు. ఇంద్రవెల్లిలో జరిగిన ఘట న ఓటర్లను విస్తుపోయేలా చేసింది. ఆ వార్డులో ఓ సామాజికవర్గం వారు అధిక సంఖ్యలో ఉండటం, గెలిచిన వ్యక్తి అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఓటమి చెందిన అతడికి సందేహాలు తలెత్తాయి. ఆ సామాజికవర్గం వ్యక్తులు తనకు ఓటు వేయలేదని అనుమానించాడు. ఇంకేముంది ఆ వర్గానికి చెందిన పెద్దను ఫోన్లో దూషించాడు. ఈ పరిణామాన్ని ఊహించని ఆ పెద్ద తన అనుచరులతో కలిసి శనివారం మార్కెట్ బంద్ చేయించి నిరసన తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. ఓడిపోతే ఇలా అంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంకెన్నెన్నో .. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యా యి. ఫలితాలు వచ్చాయి. సర్పంచ్‌లు ఎవరనేది తేలిపోయింది. ఉప సర్పంచ్ల ఎన్నిక కూడా జరి గిపోయింది. పార్టీల బలాబలాలు స్పష్టమయ్యా యి. ఓటమి చెందిన వారు మాత్రం తాము ఖర్చు చేసిన డబ్బులకు సంబంధించి లెక్కలు కడుతున్నా రు. ఎక్కడెక్కడైతే డబ్బులు పంచారో ఆ ఓట్లు పడ్డా యా లేదా అనే సమీకరణాలు వేసుకుంటున్నారు. కొంతమంది ఈ ఎన్నికల ద్వారా ఆర్థికంగా చతికిలపడ్డారు. అయినప్పటికీ పలువురు ఓర్పు ప్రదర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు రెండో విడత, ఈనెల 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చిత్రవిచిత్రాలు ఇంకెన్ని చోటు చేసుకుంటాయో చూడాల్సిందే. -
వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు
కై లాస్‌నగర్: జిల్లాలో కొంతమంది తన పేరిట దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించి యజ మానులను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మార్వాడీ ధర్మశాలలో ‘సురక్షిత ఆహారం–ఆరోగ్యం’ అంశంపై హోట ళ్లు, బేకరీలు, కిరాణ, స్వీట్మార్ట్ యజ మానులు, వినియోగదారులతో శనివారం అవగాహ న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. సురక్షిత ఆహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆహార పదార్థాల తయారీలో నిషేధిత రంగులు వాడకూడదన్నారు. ఇందులో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దినేష్ మాటోలియా, కందుల రవీందర్, కోశాధికారి మనోహర్ కుపాట్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ పంచాయతీలు.. చాలా హాట్ గురూ!
కై లాస్‌నగర్: జిల్లాలోని పెన్‌గంగ పరీవాహక ప్రాంతంతో పాటు పలు మండల కేంద్రాలు, పట్టణాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఖరీదైనవిగా మారాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజకీయ పలుకబడితో ఇసుక, రియల్ దందాలను శాసించే అధికారం వస్తోందనే భావనతో పలువురు బరిలోకి దిగారు. రూ. లక్షల్లో అక్రమ ఆదాయం సమకూరే అవకాశముండటంతో సర్పంచ్, వార్డుమెంబర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. పదవీ ద క్కితే ఐదేళ్ల పాటు తిరుగుండదు. ఆదాయానికి కొదవుండదు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. రూ.లక్షలు గుమ్మరిస్తున్నారు. మద్యాన్ని గ్రామాల్లో ఏరులుగా పారిస్తున్నారు. పోటాపోటీగా కుల సంఘాలతో ఒప్పందాలు, యువకులకు దావత్‌లు, ఇంటింటా డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ పోల్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేపడుతున్నారు. అక్రమ దందాలతో ఆదాయం.. పెన్‌గంగ నది పరీవాహకంలోని భీంపూర్, బేల, జైనథ్, భోరజ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసు క దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆయా గ్రామాల్లో పేరుకుపోయిన ఇసుక నిల్వలకు వీడీసీల ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తున్నారు. ఇసుక లభ్యత ప్ర కారం ఒక్కో గ్రామంలోని నిల్వలకు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు వేలం ద్వారా అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారంలో సర్పంచ్ల పాత్రనే కీల కం. రాజకీయ పలుకుబడి ఉండటంతో తమ అక్రమ దందాకు అడ్డు రాకుండా ఉండేందుకు గా ను ఆయా గ్రామాల సర్పంచ్‌లకు ఇసుక నిల్వలను దక్కించుకున్న వారు రూ.లక్షల్లో ముట్టజెబుతున్నారు. ఇది బహిరంగ రహస్యమే కావడంతో ఇసు క నిల్వలు కలిగిన గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ దందా అధికంగా సాగే మావల, బేల, నేరడిగొండ, బోథ్, ఆదిలాబాద్ రూరల్ వంటి మండలాల్లోని పలు గ్రామాల్లోనూ సర్పంచ్ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కొత్తగా వెంచర్లు, లేఅవుట్లను ఏర్పాటు చేయాలంటే సర్పంచ్ అనుమతి తీసుకోక తప్పదు. ఇందుకోసం లేఅవుట్లలోని ప్లాట్ల సంఖ్య, విక్రయ ధర ఆధారంగా వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎన్నికలు ఖరీదుగా మారాయి. ఖర్చుకు వెనుకాడని వైనం .. అక్రమ దందాలతో ఆదాయం వచ్చే ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవిని ఎలాగైనా సొంతం చేసుకో వాలని పలువురు ఆరాటపడుతున్నారు. గతంలో ఈ దందాలో ఆరితేరిన వారు రిజర్వేషన్ కలిసివచ్చి న చోట సర్పంచ్ బరిలో ఉండగా.. అనుకూలించని చోట ఉప సర్పంచ్ పదవీనైనా దక్కించుకుని చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వార్డుమెంబర్లుగా బరిలోకి దిగారు. సర్పంచ్ పదవి కోసం రూ.10 లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఖ ర్చు చేస్తుండగా.. వార్డుమెంబర్ స్థానం కోసం రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు వెచ్చిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు చూసి ఆయా గ్రామస్తులే ఆశ్చర్య పోతుండడం గమనార్హం. బేల, మావల, నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్ -
‘రైతు భరోసా’ విడుదల చేయాలి
ఇచ్చోడ: రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాలని రైతు స్వ రాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెం బొర్రన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇచ్చోడలో రైతులతో కలిసి మాట్లాడారు. ఈ ఏడాది భారీ వర్షాలతో పత్తి, సోయా తదితర పంటల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. యాసంగి సాగుకు పెట్టుబడి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపా రు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రైతులు గంగయ్య, ఎల్ల య్య, ముక్రామ్, జమాల్ తదితరులున్నారు. -
రోడ్డెక్కిన సోయా రైతులు
బోథ్: మూసివేసిన సోయా కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని రహదారిపై సుమారు గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. తమ వద్ద ఇంకా పంట నిల్వలు ఉన్నాయని, ఇప్పుడే కేంద్రాలను మూసివేస్తే ప్రైవేట్‌లో తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సీఐ గురుస్వామి, ఎస్సై శ్రీ సాయిలు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మార్క్‌ఫెడ్, జిల్లా స్థాయి అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సోమవారం లోపు కొనుగోలు కేంద్రాలను తెరవకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు పోతన్న, శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పచ్చదనం కనుమరుగు
రాజరాజేశ్వరనగర్లో నరికివేసిన పచ్చని చెట్లు కై లాస్‌నగర్: పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం పేరిట ఏట కోట్ల రూపాయలు వెచ్చిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. మరోవైపు ఏపుగా పెరిగిన ఆ చెట్లను విద్యుత్ శాఖ ఇష్టారాజ్యంగా నరికివేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం విద్యుత్ వైర్లు ఉన్న ప్రాంతాల్లోని చెట్ల కొమ్మలు తొలగించాలంటే ఆ పనులు చేపట్టే కాంట్రాక్టర్ విధిగా అటవీశాఖ అనుమతి తీసకోవాలి. అయితే పట్టణంలోని రాజరాజేశ్వరనగర్లో ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్, సంబంధిత ఏఈ అత్యుత్సాహం ప్రదర్శించారు. అటవీశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే అవెన్యూ ప్లాంటేషన్‌లో పదుల సంఖ్యలో ఉన్న వృక్షాలను కట్టర్ సాయంతో మొదళ్లకు నరికివేశారు. ఫలితంగా ఈ ప్రాంతంలో ఏళ్ల తరబడి ఉన్న పచ్చదనం కనుమరుగైంది. పర్యావరణ పరిరక్షణ నినాదం ప్రశ్నార్థమవుతోంది.అనుమతి తీసుకోలేదు.. చెట్ల నరికివేతకు సంబంధించి విద్యుత్‌శాఖ అధికారులు కానీ, కాంట్రాక్టర్ కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. విష యం తెలియగానే టాస్క్‌ఫోర్స్ బృందం అక్కడికి వెళ్లి చెట్లను తొలగిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్‌తో పాటు విద్యుత్ శాఖ అధికారులపై వాల్టా చట్ట ప్రకారం కేసు నమోదు చేశాం. – గులాబ్‌సింగ్, ఎఫ్ఆర్వో విచారణ జరుపుతున్నాం.. 33/11 కేవీ వైర్లకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించాం. నిబంధనల ప్రకారం కొమ్మలనే తొలగించాల్సి ఉండగా చెట్లను నరికివేసినట్లుగా మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరుపుతున్నాం. – జాదవ్ శేష్‌రావు, ఎస్ఈ -
ఉత్కంఠ విజయం
ఒక్క ఓటుతో గట్టెక్కిన సత్తన్న నార్నూర్ మండలంలోని ఖైర్దాట్వ పంచాయతీలో కనక సత్యనాయణ, మాడావి జైవంత్‌రావు సర్పంచ్‌గా పోటీ చేశా రు. సత్యనారాయణకు 113 ఓట్లు రాగా, జైవంత్రావుకు 112 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటే ఒకరిని అందలం ఎక్కించి విజేతగా నిలిపింది. అదృష్టం.. నర్వటే వైపేఇచ్చోడ మండలం దాబా (బి) పంచాయతీ సర్పంచ్‌గా నర్వటే ఈశ్వర్‌ను అదృష్టం వరించింది. ఈ పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్‌గా కేటాయించగా నర్వటే ఈశ్వర్, మా నే రామేశ్వర్, సింధుబాయి బరిలో నిలిచారు. మొత్తం 494 ఓట్లు ఉండగా 434 పోలయ్యాయి. నర్వటే రామేశ్వర్‌కు 176, మానే రామేశ్వర్‌కు 176 ఓట్లు సమంగా రాగా, మరో అభ్యర్థి సింధుబాయికి 104 ఓట్లు, 8 చెల్లని ఓట్లు పోల య్యాయి. ఎన్నికల అధికారులు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయగా.. నర్వటే రామేశ్వర్‌ను సర్పంచ్ గిరి దక్కింది. ఇక్కడ చెల్లని ఓట్లు గెలుపోటముల్లో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. -
ఎన్నికల నియమావళి పాటించాలి
తాంసి: ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని వడ్డాడి గ్రామంలో ఓటర్లతో శుక్రవారం మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా ఉండకూడదని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే 100 డయల్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. అ లాగే ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీ లకు అనుమతి లేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మూడో విడత ఎన్నికలు పూర్తి అయిన తరువాత అనుమతితో ర్యాలీలు చేసుకోవాలని తెలిపారు. ఇందులో రూరల్ సీఐ ఫణిందర్, స్థానిక ఎస్సై జీవన్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. లాండసాంగ్విలో..ఆదిలాబాద్‌రూరల్: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలో ని లాండసాంగ్వి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో ఎస్పీ పా ల్గొని మాట్లాడారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. -
డోంట్ కేర్!
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులు టెండర్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఉన్నతాధికారులు మందలించినా.. పనుల్లో జరిగిన లోపాలపై విచారణలు జరిగినా.. సదరు అధికారుల తీరులో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. తాజాగా అమృత్ సరోవర్ స్కీం కింద చేపట్టిన పనులే ఇందుకు నిదర్శనం. రూ.25లక్షల విలువైన పనులను మరోసారి ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌తో చేయిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఆగమేఘాలపై చేపట్టిన పనులతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశమేంటంటే... భూగర్భ జలాలు సంరక్షించడంతో పాటు వాటిని మరింతగా పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.25 లక్షల నిధులు కేటాయించింది. వీటి ద్వారా వీటి ద్వారా పట్టణంలోని చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకోసం చేపట్టిన పనులతో పాటు ఫొటోలతో కూడిన వివరాలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో పట్టణంలోని కుమ్మరికుంట, బాలాజీనగర్ చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. పూడికతీత పనులు చేస్తున్నాం..పట్టణంలోని రెండు చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నాం. వీటికి టెండర్లు నిర్వహించని మాట వాస్తవమే. డిపార్ట్మెంట్ ద్వారానే పనులు చేస్తున్నాం. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా జరిగేలా చూస్తాం. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ -
స్వతంత్రులపై ఫోకస్
సాక్షి,ఆదిలాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన చోట మేజర్ పంచాయతీల్లో ఫలితాలు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ప్రతికూలంగా రావడం చర్చనీయాంశంగా మారింది. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇక్కడ స్వతంత్రులు విజేతలుగా గెలిచారు. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ‘హస్తం’కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. నువ్వా.. నేనా అన్నట్టుగా ఫలితాలు నిలిచాయి. ఈ రెండు పార్టీల తర్వాత స్వతంత్రులు అధిక సంఖ్యలో గెలుపొందడం గమనార్హం. ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లోనే స్వతంత్రులు ఎక్కువగా గెలిచారు. వారు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. రెండో విడత ఏకగ్రీవాలు ఇలా.. రెండో విడత ఎన్నికలు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 6, బోథ్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో జరగనున్నాయి. ఇక్కడ 17 జీపీల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ముగ్గురు, బీఆర్ఎస్ నుంచి ఒకరు ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఉండగా, ఏడుగురు స్వతంత్రులు ఉండటం గమనార్హం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆదిలాబాద్‌రూరల్, బేల నుంచి ఏకగ్రీవమైన సర్పంచులు వారు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనే విషయంలో ఇప్పుడే నిర్ణయం వెలువర్చడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా అటువైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పరపతితో ఆయా పార్టీల వైపు మొగ్గుచూపుతారా.. లేదా అనేది కూడా చూడాల్సిందే. మొత్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా, రెండో విడత పంచాయతీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది.మొదటి విడత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బలపర్చిన, స్వతంత్రులుగా గెలిచిన సర్పంచ్ల వివరాలు మొత్తం పంచాయతీలు 166 కాంగ్రెస్ 61 బీఆర్ఎస్ 59 బీజేపీ 10 స్వతంత్రులు 36 -
● ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం ● మందు, విందులతో ఓటర్లకు గాలం
కై లాస్‌నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల రెండో వి డత ప్రచార పర్వం ముగిసింది. ఈ విడతలో జిల్లాలోని ఆదిలాబాద్‌రూరల్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరజ్, తాంసి, భీంపూర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అనుచరులతో కలిసి వారం పాటు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ము గియడంతో ఆయా పల్లెలన్నీ సైలెంట్‌గా మారాయి. మరోవైపు ప్రలోభాలు షురూ అయ్యాయి. ఓటర్లకు మందు, విందులు ఏర్పాటు చేసే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. పోలింగ్‌కు ఒకరోజు సమయం ఉండడంతో పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించారు. డిసెంబర్ 6న.. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 30న వెలువడింది. ఆ రోజు నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించారు. 3న పరిశీలన చేపట్టి అర్హులైన అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచి న అభ్యర్థులకు ఈనెల 6న గుర్తులు కేటాయించా రు. దీంతో వారు ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వారం పాటు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రలోభాలకు ఎర.. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ప్రతీ ఓటరును వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. డబ్బులు, మద్యం పంపిణీ చేపడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు పంచుతున్నారు. మరోవైపు మద్యం పంపకాలు, విందులు జోరందుకున్నాయి. శనివారం ఒక్కరోజే సమయం ఉండటం, తెల్లవారితే పోలింగ్ ఉండనుండడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఓ టర్లను పూర్తిస్థాయిలో ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా యువతకు గాలం వేసేందుకు ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేస్తున్నారు.రెండో విడతలో..ఎన్నికలు జరిగే మండలాలు 8గ్రామపంచాయతీలు 156వార్డు స్థానాలు 1,260 -
గంటల వారీగా పోలింగ్ శాతం
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఇంద్రవెల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న యువతి కై లాస్‌నగర్: జిల్లాలో తొలివిడత ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఇచ్చోడ, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ మండలాల్లోని 133 పంచాయతీలు 433 వార్డు స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరిగాయి. పల్లె ఓటర్లు తమ ఓటు చైతన్యాన్ని ప్రదర్శించారు. గజగజ వణికిస్తున్న చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా పలుచోట్ల ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. నిర్ణీత సమయం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ ముగియాల్సి ఉండగా అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిలబడిన ఓటర్లందరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో పలుచోట్ల మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వృద్ధుల నుంచి యువత వరకు ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో ఆయా మండలాల పరిధిలో 77.52 శాతం పోలింగ్ నమోదైంది. ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి పోలింగ్ సరళిపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మందకొడిగా మొదలై...ఆపై పుంజుకుని ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. ఆయా మండలాల పరిధిలో 1,52,626 మంది ఓటర్లు ఉండగా, 1,05,468 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 75,139 మంది పురుష ఓటర్లకు గానూ 52,211 మంది, 77,476 మంది మహిళా ఓటర్లకు గానూ 53,255 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు ఆరుగురికి గానూ ఇద్దరు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలుత పోలింగ్ మందకొడిగా సాగింది. చలి తీవ్రత కారణంగా ఓటర్లు ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ నెమ్మదిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 10.67 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆతర్వాత ఓటర్లు కేంద్రాలకు తరలిరావడంతో పోలింగ్ శాతం క్రమేణ పుంజుకుంది. తొలిసారిగా ఓటుహక్కు పొందిన యువత ఉత్సాహంగా కదలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను కుటుంబ సభ్యులు ఆటోలు, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి ఓటు వేయించారు. వారికి పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్ సౌకర్యం కల్పించారు. 9 గంటల తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల బారులు కన్పించాయి. దీంతో పోలింగ్ ఊపందుకుంది. 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే నిర్ణీత సమయం ఒంటిగంట వరకు 69.10 శాతం నమోదైంది. అప్పటికే పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చివరకు 77.52 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతీ రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్ సరళిని ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ సిరికొండ మండలం సుంకిడి, ఇచ్చోడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంద్రవెల్లి మండలం ముత్నూర్, ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు..మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు పోలింగ్ శాతం ఇచ్చోడ 33,166 26,670 13,233 13,437 00 80.41 గాదిగూడ 13,027 10,725 5,370 5,355 00 82.33 ఇంద్రవెల్లి 29,648 22,792 11,302 11,490 00 76.88 నార్నూర్ 19,359 15,643 7,962 7,681 00 80.8 సిరికొండ 9,639 8,390 4,184 4,206 00 87.04 ఉట్నూర్ 47,787 34,092 17,056 17,033 03 71.34 మండలం 9 గంటలకు 11 గంటలకు ఒంటిగంటకు పోలింగ్ ముగిసిన తర్వాత ఇచ్చోడ 9.70 35.61 70.38 80.41 గాదిగూడ 14.29 53.77 78.18 82.33 ఇంద్రవెల్లి 6.17 33.14 57.60 76.88 నార్నూర్ 11.99 45.11 78.22 80.8 సిరికొండ 20.87 60.21 85.12 87.4 ఉట్నూర్ 10.56 38.59 65.95 71.34 రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు.. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. 25 ఓట్లను ఒక బెండల్గా వేరు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. చిన్న పంచాయతీల్లో విజేతలను ప్రకటించారు. గెలుపొందిన సర్పంచులు తమ అనుచరులతో కలిసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. ఇదిలా ఉండగా ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీల్లో సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. -
వేతనంలో కోత విధించొద్దు
ఆదిలాబాద్‌టౌన్: అంగన్వాడీ టీచర్ల వేతనంలో కోత విధించవద్దని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు అన్నారు. గురువారం ఐసీడీఎస్ పీడీ మిల్కాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల అంగన్వాడీల రాష్ట్ర మహాసభలకు వెళ్లిన వారి ఒకరోజు వేతనంలో నుంచి కోత విధించినట్లు తెలిపారు. టీచర్లు, ఆయాలు సెలవు పెట్టినప్పటికీ ఒకరోజు వేతనాన్ని తగ్గించారని పేర్కొన్నారు. కోత విధించిన ఒకరోజు వేతనాన్ని తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, తదితరులు ఉన్నారు. -
మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు
ఆదిలాబాద్‌టౌన్: పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 14న ప్రథమ భాష, 18న ద్వితీయ భాష, 23న ఇంగ్లిష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజికల్ సైన్స్, 7న బయోసైన్స్, 13న సాంఘిక శాస్త్రం, 15న ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని డీఈవో వివరించారు. 32 ఏకగ్రీవ స్థానాలు బీఆర్ఎస్వేబోథ్: బోథ్ నియోజకవర్గంలో 47 పంచాయతీలు ఏకగ్రీవం కాగా అందులో 32 మంది బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే ఉన్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో 32 పంచాయతీలను ఏకగ్రీవంగా కై వసం చేసుకున్న సర్పంచులను అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలనకై లాస్‌నగర్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సరళిని పరిశీ లించేందుకు 21 పోలింగ్ కేంద్రాల్లోని 41 ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలను కలెక్టరేట్ సమావేశ మందిరంలోని ప్రొజెక్టర్‌కు అనుసంధానం చేశారు. కలెక్టర్ రాజర్షిషా, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్ర ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. -
రసకందాయం
సాక్షి,ఆదిలాబాద్:మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత మలి రెండు విడతల సంగ్రామం రసకందాయంగా మారింది. జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గాల్లో ఆ శాసన సభ్యులు తమ పట్టు నిలుపుకునేందుకు మద్దతు దారులను గెలిపించుకునేందుకు శాయశక్తులు ఒడ్డోడుతుండగా, తొలి ఫలితాలు వారికి కొంత కంటగింపుగా మారాయి. మొదటి విడతలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా, ఈనెల 14న రెండో విడతలో బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉన్నచోట ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ఆరు మండలాల్లోని 166 గ్రామపంచాయతీల్లో జరిగాయి. ఈ ఫలితాలు రెండో విడత ఎన్నికలను రసకందాయంలో పడేశాయి. ఈనెల 14న జరగనున్న మలి పోరులో 156 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 17 ఏకగ్రీవం అయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాలు, బోథ్ నియోజకవర్గంలోని 2 మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ పరిస్థితి.. మొదటి విడత ఎన్నికలు జరిగిన మండలాల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన అనిల్ జాదవ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో జరిగిన మొదటి విడత ఎన్నికల్లో ఇచ్చోడలో బీఆర్ఎస్ అధిక స్థానాలు సాధించింది. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలను దక్కించుకున్నాయి. సిరికొండలో కాంగ్రెస్ దూకుడు చూపగా, ఏ పార్టీకి మద్దతు ఇవ్వని మరికొంత మంది గెలుపొందారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌కు చెందిన వెడ్మ బొజ్జు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మొదటి విడతలో ఈ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఉట్నూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాలు సాధించారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ మద్దతుదారులు కూడా గెలుపొందారు. ఏ పార్టీకి సంబంధం లేనివారు కూడా గెలుపొందారు. ఆసిఫాబాద్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈ నియోజకవర్గంలోని నార్నూర్, గాదిగూడలో మొదటి విడత ఎన్నికలు జరిగాయి. నార్నూర్‌లో బీఆర్ఎస్ మద్దతుదారుల ప్రభంజనం కనిపించినప్పటికీ, గాదిగూడలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ మద్దతుదారులు కూడా గెలుపొందారు. రెండో విడత ఎన్నికల వివరాలు.. మండలాలు: ఆదిలాబాద్‌రూరల్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరజ్ తాంసి, భీంపూర్ జీపీల సంఖ్య: 156 ఏకగ్రీవం : 17 వార్డుల సంఖ్య : 1116 ఏకగ్రీవం: 1104 పోటీ నెలకొన్నవి: 139 (జీపీలు), 12 (వార్డులు) -
వణుకుతున్న ‘ఆదిలాబాద్’
ఆసిఫాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలికి వణుకుతోంది. ఈ సీజన్లో గురువారం అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 5.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.ఇదే జిల్లాలోని కెరమెరిలో 5.7, తిర్యాణిలో 5.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి– టి గ్రామంలో 6.1, బోథ్ మండలం పొచ్చరలో 6.4, భోరజ్ మండల కేంద్రంలో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తీవ్రంగా చలిగాలులు వీస్తున్నాయి. -
‘రూని’కి ఘన నివాళి
ఆదిలాబాద్‌టౌన్: రూని సేవలు పోలీసు వ్యవస్థకు గర్వకారణమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. దశాబ్దానికి పైగా పోలీసు సేవల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన జాగిలం రూని బుధవారం ఉదయం మృతి చెందింది. 2012 బ్యాచ్‌కు చెందిన రూని హత్యకేసులు, దొంగతనాలు వంటి 250కు పైగా కేసుల్లో కీలక పాత్ర పోషించి 20 మంది నేరస్తులను పట్టించడంలో సహకరించినట్లు తెలిపారు. పోలీసు శాఖ తరఫున అంత్యక్రియలు నిర్వహించగా, పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ 2011లో జన్మించిన రూని 2012లో విధులు ప్రారంభించి 2021లో విరమణ చేసిందని తెలిపారు. నాలుగేళ్ల విశ్రాంతి అనంతరం మృతి చెందినట్లు పేర్కొన్నారు. అంత్యక్రియల్లో డాగ్ స్క్వాడ్ సిబ్బంది, హ్యాండ్లర్ గంగన్న, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
● పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ● జిల్లాలో 6.2 డిగ్రీల సెల్సియస్ నమోదు
చలి గుప్పిట్లో.. ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. బుధవారం రికార్డుస్థాయిలో 6.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తుంది. వేకువజామున పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చలి మంటలు కాగుతూ జనం ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో అత్యల్పంగా భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో 6.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. సొనాలలో 7.6, భోరజ్‌లో 7.9, తాంసిలో 8, రాంనగర్లో 8.2, నేరడిగొండలో 8.6, ఆదిలాబాద్ పట్టణంలో 8.7, బోథ్‌లోని పొచ్చరలో 8.9, బజార్హత్నూర్లో 8.9, జైనథ్‌లో 9.1, బరంపూర్‌లో 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
ఆదిలాబాద్‌టౌన్: టీబీ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్ డాక్టర్ స్నేహ శుక్లా అన్నారు. పట్టణంలోని కేఆర్కే కాలనీలో గల ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. టీబీ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఎక్స్‌రే పనితీరును పరిశీలించారు. మందులు పంపిణీ చేస్తున్నారా, క్షేత్రస్థాయికి వెళ్లి రోగుల పరిస్థితిని తెలుసుకుంటున్నారా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌తో పాటు వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. సేవలు ఎలా అందుతున్నాయి, జిల్లాలో ఎంత మంది క్షయ రోగులు ఉన్నారు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, తదితర విషయాలను తెలుసుకున్నారు. ఇందులో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుమలత, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, ఏసీఎస్ఎం కన్సల్టెంట్ సురేశ్ తదితరులున్నారు. -
పకడ్బందీ ఏర్పాట్లు
ఆదిలాబాద్‌టౌన్: పంచాయతీ ఎన్నికలకు పోలీ సుశాఖ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మొదటి విడత ఆరు మండలాల ఎన్నికలకు సంబంధించి బుధవారం ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ తదితర ప్రాంతా ల్లో బందోబస్తును పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలివిడతకు 936 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. 38 సమస్యాత్మక కేంద్రాల్లో స్పెష ల్ పార్టీ బలగాలు, 10 షాడో పోలింగ్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో 599 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. 20 ఆయుధాల ను సేఫ్ డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్లస్టర్ రూమ్ మొ బైల్స్‌తో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బందోబస్తులో ముగ్గురు అదన పు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 21 మంది సీఐ లు, 48 మంది ఎస్సైలతో పాటు మహిళా సిబ్బంది, హోంగార్డులు, రిజర్వు, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలు ఉంటాయని వివరించారు. ఇప్పటివరకు జిల్లాలోని 38 గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రలోభాలకు గురికావొద్దు.. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. పోలింగ్ కేంద్రం పరి ధిలో 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపా రు.సోషల్‌మీడియా,ఇతర సామాజిక మాధ్యమా ల్లో ఇతరులను రెచ్చగొట్టేలా, కించపర్చేలాపోస్టులు పెట్టవద్దని, వీటిపై పోలీసు నిఘా ఉంటుంద ని పేర్కొన్నారు. ఎలాంటి సమాచారమైనా డయ ల్ 100 ద్వారా అందించాలని సూచించారు. డ బ్బు, మద్యం, బహుమతులు వంటివి పంచే క్ర మంలో పోలీసులకు తెలియజేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలిఇచ్చోడ: పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా ప్రత్యేక కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజ న్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశా ల ఆవరణలో బందోబస్తుకు కేటాయించిన పోలీ సు సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, ఇచ్చోడ ఎస్‌హెచ్‌వో రాజు, సిబ్బంది ఉన్నారు. -
అందరికీ అభయం.. ఓటేసేదెవరికో?
కై లాస్‌నగర్: పంచాయతీ ఎన్నికల తొలి విడత అభ్యర్థుల భవితవ్యం గురువారం తేలనుంది. ఓ టర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే తీవ్రంగా శ్రమించారు. రెండు, మూడో విడత ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో బరిలో నిలి చిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమను ఆశీర్వదించాలని సర్పంచ్‌గా ఎన్నుకుంటే ఐదేళ్ల పాటు మీకు అండగా ఉండి సేవచేస్తామని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటూ అనేక హామీలు గుప్తిస్తున్నారు. ముఖ్యంగా యువ త మద్దతు చేజారకుండా ఉండేందుకు నామినేషన్ల ప్రారంభం నుంచే మందు, విందులతో ముంచెత్తుతున్నారు. అయితే ప్రచారానికి వెళ్లిన ప్రతీ అభ్యర్థిని నిరాశ పర్చకుండా మా మద్దతు నీకేనంటూ ఓటర్లు అభయమిస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చి ఓటు వేయమని వేడుకుంటున్న వారికి మీరు అంతగా చెప్పాలా.. తప్పకుండా మా ఓట్లన్నీ మీకేనంటూ నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే అంశం సర్పంచ్ అభ్యర్థులను కలవరానికి గురి చేస్తుంది. ఓటరు నాడీ వారికి అంతు చిక్కడం లేదు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతీ అభ్యర్థికి మా సపోర్టు నీకేనంటూ చెబుతుండటంతో బ్యాలెట్ పేపర్‌పై ఎవరికి మద్దుతునిస్తారనే సందిగ్ధంగా మారింది. అభ్యర్థులు పోటాపోటీగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తుండగా ఓటరు ఎవరకి పట్టం కడతారన్నది అంతకు చిక్కడం లేదు. ‘అన్నా.. నమస్తేనే. బాపూ.. ఏంజెత్తన్నవ్.. పాణం మంచిగుందా. అక్కా.. బాగున్నారా... అంటూ వరుసలు కలుపుతూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు. ‘ఈ సారి సర్పంచ్‌గా పోటీ చేస్తున్ననే.. జర మీ అందరి సపోర్ట్ కావాల్నే.. పోయిన సారి వాళ్లకు అవకాశం ఇచ్చారు. ఈ తాప జెరంత నాపై దయచూపండే.. మీతో పాటు ఇంటోళ్లవి, దోస్తుల ఓట్లు అందరివీ మనకే పడేలా చూడండే.. అంటూ అభ్యర్థులు చేతులు జోడిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే ఓటర్లు కూడా అలాగే స్పందిస్తున్నారు.. ‘అరే.. నువ్వు భలే ఉన్నవే.. అంతగా బతిమిలాడల్నా... నీకు కాకపోతే ఇంకోళ్లకే.. నాతో పాటు మా ఇంటోళ్ల ఓట్లన్నీ నీకే.. బేఫికర్‌గా ఉండు. ఈ సారి నువ్వే గెలుస్తున్నవ్ పో.. ’అంటూ ఇంటికి వచ్చే అభ్యర్థులందరికీ ఓటరు ఇస్తున్న అభయమిది. పల్లెపోరులో భాగంగా ప్రతీ ఊరిలో ఎన్నికల ప్రచార పర్వంలో ఎక్కువగా వినిపిస్తున్న మాటలివే. నేడు తొలివిడత ఎన్నికలు జరుగుతుండగా ఓటరు ఎవరిని ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సిందే. -
పట్టు నిలిచేనా..?
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో రాజకీయం విభిన్నం.. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం ఉంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తింపుపై జరిగేవి కాకపోయినప్పటికీ ఈ నేతలకు తాము బలపర్చిన అభ్యర్థుల గెలుపు ప్రతిష్టాత్మకం. ఫలితాలు తారుమారైతే తమ పట్టు జారిందనే విమర్శలతో పాటు పార్టీ పరిస్థితిపై మరో రకంగా కార్యకర్తల్లో చర్చ సాగుతుందనే అభిప్రాయం స్థానిక ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అందుకే పార్టీ పరంగా ఈ ఎన్నికలు జరగకపోయినా వారు మా త్రం తాము బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో ప్రభావం చూపెట్టడం ద్వారా మిగతా రెండు విడతల్లోనూ గట్టి ఫలితాలు సాధించాలని ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మూడు నియోజకవర్గాలు.. ఆరు మండలాలు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు నేడు ఆరు మండలాల్లో జరగనున్నాయి. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, సిరికొండ, ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్, గాదిగూడ మండలాల్లో పోరు సాగుతుంది. ఇవన్నీ ఎస్టీ రిజర్వుడ్ పంచాయతీలే. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ఖా నాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి ఈ విడత కీలకం కానుంది. బోథ్‌లో.. బోథ్ నియోజకవర్గంలో ఈ ఎన్నికలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదటి విడతలో ఈ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో జరుగుతున్నాయి. ఇక్కడ మంచి ఫలితాలు సాధిస్తే మలి విడతలో జరిగే మిగతా మండలాల్లో పట్టు సాధించవచ్చనేది ఆయన ప్రయత్నం. రెండు మండలాల్లో 52 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా, 12 జీపీలు ఏకగ్రీవాలయ్యా యి. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సమఉజ్జీ లుగా ఉండగా, బీజేపీ తాము ఉన్నామంటే ఉన్నామనే విధంగా ఇప్పటివరకు పరిస్థితి ఉంది. ఇక ఎ న్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం. ఖానాపూర్‌లో.. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎన్నికలు కాంగ్రెస్ ఎమ్మెలే వెడ్మ బొజ్జుకు అత్యంత కీలకంగా మారింది. ఇటీవలే ఆయన పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియామకం అయ్యారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గంలో పార్టీ బలపర్చిన అభ్యర్థుల గె లుపు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. తొలి వి డత ఎన్నికలు జరిగే రెండు మండలాల్లో 11 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులతో పాటు ఏ పార్టీకి సంబంధం లేని వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ ఉన్నామంటే ఉన్నామనే విధంగా ఏకగ్రీవంలో కనిపించింది. బీఆర్ఎస్కు ఇక్కడ ఏకగ్రీవాల్లో చో టు లభించలేదు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో ఫలి తాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఆసిఫాబాద్‌లో.. ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తనకున్న గట్టి పట్టును ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా ఆమె ముందుకు కదులుతున్నారు. ఈ నియోజ కవర్గంలోని రెండు మండలాల్లో తొలివిడత ఎన్నికలు జరుగుతుండగా, ఇక్కడ 10 ఏకగ్రీవాలకు గాను ఏకపక్షంగా బీఆర్ఎస్ ముందుంది. కాంగ్రెస్ ఉనికి చాటుకునేంత పరిస్థితి మాత్రమే ఉంది. ఇక ఎన్ని కల ఫలితాలపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండలం తరోడ గ్రామ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మూలమలుపులో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జైనథ్ నుండి ఆదాలాబాద్ వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పింది. షేక్ మొహినుద్దీన్, షేక్ మోహిన్, కదం కీర్తి సాగర్లు ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు పోలీసులు.ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అధికమయ్యాయి. డిసెంబర్ 7వ తేదీ నాలుగు యువకులు కారులో ప్రయాణిస్తుండగా, మంచు కారణంగా దృశ్యమానం తగ్గిపోవడంతో వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు శ్రీపతి అశ్రిత్ రెడ్డి, పప్పుల శివమణి) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో, కీసరా నుంచి తర్నాకకు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో హర్షవర్ధన్ (మల్కాజిగిరి నివాసి) మృతి చెందాడు. గతనెల 3వ తేదీన రంగారెడ్డి చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్– తాండూర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం బాధితుల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. -
సంతానం కలగడంలేదని ఒకరు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ ఫ్యాక్టరీ వెనుకాల ఈ నెల 8న రాత్రి రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు జీర్పీ హెడ్ కానిస్టేబుల్ జస్వాల్ సింగ్ మంగళవారం తెలిపారు. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన సాగే శ్రీనివాస్ (35) మంచిర్యాలలో ఇంటర్ నెట్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయి 14 సంవత్సరాలు కావస్తున్నా సంతానం కలుగడంలేదని రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం రాత్రి బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్లే గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సరిత ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.. ఎన్నికల నియమావళిని ప్రతిఒక్కరూ పాటించా లి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు.. గొడవలకు దారి తీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొ ద్దు.. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హె చ్చరించారు. మంగళవారం ‘సాక్షి’కిచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: తొలివిడత ఎన్నికలకు ఎలాంటి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.? ఎస్పీ: మొదటి విడత ఎన్నికలు ఆరు మండలాల్లో ఈ నెల 11న జరగనున్నాయి. 920 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశాం. ఒక్కో మండలాన్ని డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు పర్యవేక్షిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. సాక్షి: పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి నిబంధనలు పాటించాలి..? ఎస్పీ: పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ సెక్ష న్ అమలులో ఉంటుంది. 200 మీటర్ల వరకు ప్రత్యేక నిబంధనలు పాటించాలి. ఓటర్లు క్యూ లో ఉండి ఓటు హక్కు వినియోగించుకోవాలి. సాక్షి: ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.? ఎస్పీ: తొలివిడతలో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైంది. ఎవరూ ప్రచారం చేయొద్దు. బయట వ్యక్తులు గ్రామాల్లో ఉండకూడదు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేసినా, గొడవలకు దారితీస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి భద్రత చర్యలు చేపడుతున్నారు..? ఎస్పీ: సమస్యాత్మక కేంద్రాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నాం. సాక్షి: సోషల్ మీడియాపై ఎలా నిఘా సారిస్తున్నారు? ఎస్పీ: సోషల్ మీడియాలో ఇతరులను రెచ్చగొట్టేలా,కించపర్చేలా పోస్టులు పెట్టవద్దు. ఎవరైనా అతిక్రమిస్తే గ్రూప్ అడ్మిన్లతో పాటు మెంబర్లపై సైతం కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక బృందంద్వారా సోషల్ మీడియాపై నిఘా పెట్టాం. సాక్షి: విజయోత్సవ ర్యాలీ చేపట్టవచ్చా..? ఎస్పీ: ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీకి అనుమతి లేదు. సంబంధిత అధికా రుల అనుమతితో నిర్ధారించిన రోజున జరుపుకోవచ్చు. టపాసులు కూడా పేల్చ రాదు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి. -
బాధ్యత మరవని గిరిజనులు
దండేపల్లి: ఊళ్లోనే పోలింగ్ కేంద్రం ఉన్నప్పటికీ కొందరు, కొన్ని సందర్భాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. కానీ దండేపల్లి మండలం కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఊట్ల గ్రామ ఆదివాసీ గిరిజనులు ఏ ఎన్నికలు వచ్చినా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడిపల్లి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటెయ్యాలి. ఆగ్రామంలో సుమారు 50 మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఎమ్మెల్యే, ఎంపీ, పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏం జరిగినా.. దూరం అని భావించకుండా ఓటు వేయడం మాత్రం మరువడం లేదు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశతో బాధ్యతగా ఓటేసి పాలకులను ఎన్నుకుంటున్నారు. -
కలప పట్టివేత
జన్నారం: మండలంలోని దేవునిగూడలో అక్రమంగా నిలువ ఉంచిన కలపను మంగళవారం పట్టుకున్నట్లు ఇందన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ సిబ్బందితో కలిసి వెళ్లి దేవునిగూడ గ్రామానికి చెందిన గవ్వల మురళి ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా నిలువ ఉంచిన 8 టేకు దుంగలు లభ్యమైనట్లు తెలిపారు. కర్రతో పాటు కోత మిషన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కలప విలువ రూ.30 వేల వరకు ఉంటుందన్నారు. నిందితుడు మురళిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో డీఆర్వో కుమారస్వామి, సెక్షన్ అధికారులు రవి, మధుకర్, పురుషోత్తం, ఎఫ్‌బీవోలు తన్వీర్‌పాషా, లవన్, తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ దీక్షతోనే రాష్ట్రం ఏర్పాటు..
ఆదిలాబాద్‌టౌన్: నాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్రం తలొగ్గి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విజయ్ దివస్ నిర్వహించారు. తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేశారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఢిల్లీ మెడలు వంచడంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. కార్యక్రమలో పార్టీ నాయకులు అజయ్, సాజిదొద్దీన్, ప్రహ్లాద్, రమేశ్, స్వరూప, మమత తదితరులు పాల్గొన్నారు. -
24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
కై లాస్‌నగర్(బేల): బేల మండలంలోని శ్రీ దుర్గా వైన్స్‌లో ఈనెల 7న జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించినట్లు జైనథ్ సీఐ జి.శ్రావణ్ తెలిపారు. మంగళవారం పో లీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తక్కువ సమయంలో ఎ క్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో చో రీలకు పాల్పడుతున్న టేకం జశ్వ, షిండే అజ య్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.15 వేల విలువైన మద్యం, రూ.2లక్షల 40వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో బేల ఎస్సై ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
జట్టు విజయంలో కీలకం
రాథోడ్ రవీందర్–కవిత దంపతుల కుమారుడు ప్రదీప్ ఇప్పటివరకు రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. డిసెంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ఐ అండర్–19 టోర్నీలో జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. గతంలో మహారాష్ట్రలోని సతారాలో నిర్వహించిన జూనియర్ నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు. 2024లో యూపీలోని అయోధ్యలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 17 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. మేడ్చల్ వేదికగా నిర్వహించిన జూనియర్ రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో, మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొని మెప్పించాడు. నిజామాబాద్‌లో నిర్వహించిన 42వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో, పటాన్చెరులో నిర్వహించిన జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలోనూ ఆడియువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాథోడ్ ప్రదీప్ -
కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం
ఆదిలాబాద్‌టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ అన్నారు. మెదక్‌లో మంగళవారం నిర్వహించిన సీఐటీయూ ఐదో రాష్ట్ర మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు పొంద డం లేదని పేర్కొన్నారు. వారిని వెంటనే ఆదుకో వాలన్నారు. అలాగే స్కీమ్, కాంట్రాక్ట్ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సునీత, మల్లేశ్, అగ్గిమల్ల స్వామి, నవీన్‌కుమార్, వెంకటమ్మ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్: ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో తొలివిడత పోలింగ్ ఏర్పాట్లను మంగళవా రం పరిశీలించారు. తాడిహత్నూర్ జెడ్పీఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. నార్నూర్, గాదిగూడలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నార్నూర్ ఎంపీపీఎస్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే గాదిగూడ కేజీబీవీ వసతి గృహం తనిఖీ చేశారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎంపీడీవోలు పుల్లారావు, శ్రీనివాస్, తహసీల్దార్ రాజలింగు తదితరులున్నారు. -
● మొదటి విడతకు సర్వం సిద్ధం ● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ● ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా పకడ్బందీ చర్యలు ● అందుబాటులో టోల్‌ఫ్రీ నం.18004251939 ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ రాజర్షిషా
కై లాస్‌నగర్: ‘తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. సిబ్బందికి మూడు విడతల్లో శిక్షణ అందించాం.. బుధవారం మధ్యాహ్నం వరకు వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..’ అని కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షిషా అన్నారు. మంగళవారం ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.సాక్షి: ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..? కలెక్టర్: ఈ నెల 11న జిల్లాలోని గాదిగూడ, నా ర్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డుమెంబర్ స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పీవో, ఓపీవోల మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసి విధులు కేటాయించాం. వారు బుధవారం ఉదయం 9.30 గంటలకు ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకొని ఎన్నికల సామగ్రి తీసుకుంటారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సాక్షి: ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? కలెక్టర్: ఆరు మండలాల పరిధిలో 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఇందులో 46 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 33 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పకడ్బందీగా సాయుధ, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. సాక్షి: మద్యం, డబ్బు ప్రలోభాలను ఏవిధంగా కట్టడి చేస్తారు? కలెక్టర్: ఇప్పటికే ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల పరిధిలోని వైన్స్‌లను మూసివేయాలని ఆదేశించాం. ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. ఎక్కడైనా డబ్బులు, మద్యం పంచినట్లయితే ప్రజలు డయల్ 100, టోల్‌ఫ్రీ నం.18004251939 కు సమాచారం అందించాలి. సాక్షి: రోడ్డు సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది.. వాటిపై ఏవిధంగా దృష్టి సారించారు..? కలెక్టర్: ఆరు మండలాల పరిధిలో కేవలం ఉట్నూర్ మండలంలోని ఒక పోలింగ్ కేంద్రానికే ఈ పరిస్థితి ఉన్నట్లుగా గుర్తించాం. సిబ్బంది వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. సాక్షి: ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.. ఈ పరిస్థితిని ఏవిధంగా అధిగమిస్తారు..? కలెక్టర్: ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు నిధులు విడుదల చేసింది. ఈసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రతీ మండలానికి అవసరమైన నిధులు కేటాయించాం. వారికి సరిపడా అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. సాక్షి: పోలింగ్ శాతం పెంపునకు ఏ విధంగా ముందుకెళ్తున్నారు..? కలెక్టర్: అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో పోల్ చీటీలను ఓటర్లకు అందించాం. ఇప్పటివరకు 95 శాతం ప్రక్రియ పూర్తయింది. ఒకరోజు సమయం ఉండడంతో ప్రతిఒక్కరికీ అందజేస్తాం. గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన 18 గుర్తింపుల్లో ఏదైన ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లి ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ అందించాం. -
‘బాండ్’ మోగిస్తున్న సర్పంచ్ అభ్యర్థి
నెన్నెల: నెన్నెల మండల కేంద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి దుగ్యాల బాపు బాండ్ పేపర్‌పై హామీలతో ప్రచారం చేస్తున్నారు. నెన్నెల సర్పంచ్‌గా గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనులు, పేదలకు అందించే ఆర్థికసాయం వివరిస్తూ రూ.50 విలువైన బాండ్ పేపర్‌పై నోటరీ చేయించి అందరికీ పంచుతున్నారు. అత్యవసర వైద్యం, అంత్యక్రియలు, పేదింటి ఆడబిడ్డల పెళ్లికి రూ.5వేలు, ఆటో ఏర్పాటు చేసి గర్భిణులు, రోగులను ఆస్పత్రికి ఉచిత తరలింపు, ఊరి భద్రత కోసం వీధుల్లో సీసీ కెమెరాలు, విద్యార్థులకు స్కూల్‌బ్యాగులు, నోట్‌పుస్తకాలు తదితర హామీలు ఇస్తున్నారు. గెలిచిన తర్వాత ఇందులో ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా సర్వేనంబరు 161, 155లో తన పేరిట ఉన్న రెండెకరాల 11గుంటల భూమి పంచాయతీ అప్పగిస్తానని, లేనిపక్షంలో ప్రజలు తనను కాలర్‌పట్టి నిలదీయవచ్చని పేర్కొన్నారు.


