బజార్‌హత్నూర్: జిల్లాలో గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. జాతర్ల నుంచి కొత్తగూడ వరకు రూ.2కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, అందుగూడలో రూ.10లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి, ప్రభుత్వ పాఠశాలలో రూ.20 లక్షల ఐటీడీఏ నిధులతో చేపడుతున్న అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అందుగూడ, గిరిజాయి గ్రామాల్లో పూర్తయిన పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఉమార్డ, భూతాయి (కే) గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడారు. గ్రామపంచాయతీల ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం జీపీలకు పెండింగ్ ని ధులను విడతల వారీగా విడుదల చేస్తుందన్నారు. వాటిని గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలని కోరా రు. కార్యక్రమంలో సర్పంచులు ప్రవీణ్, అరవింద్, పెందూర్ సంగీత, మడవి సింధూజ, జైతు, దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జీవీ రమణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వెంకన్న, అల్కే గణేశ్, కొత్త శంకర్, రమణ, శ్రీనివాస్, నందినర్సయ్య, భోజారెడ్డి, ఈశ్వర్, సుఖ్‌దేవ్, రాజేశ్వర్ పాల్గొన్నారు.
పట్నాపూర్‌లో
విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ
బోథ్: మండలంలోని పట్నాపూర్‌లో నూతనంగా మంజూరైన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి శనివారం భూమిపూజ చేశారు. రూ.2.10 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శేషారావు, సర్పంచ్ సుగుణ, నాయకులు నాయకులు జీవీ రమణ, కిషన్, రాజేశ్వర్, అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


