కై లాస్‌నగర్: జిల్లాలో గృహ అవసరాలతో పాటు వి ద్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్‌తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్త వం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవస రం లేదన్నారు. ప్రతిరోజూ బుకింగ్, సరఫరా వివరాలపై నివేదిక సమర్పించాలని డీలర్లను ఆదేశించారు. గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్ల ను వాణిజ్య అవసరాలకు మళ్లించినా లేదా అక్రమంగా నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టేందుకు పౌర సరఫరాల అధికారులు, డీటీలు, ఎస్సైలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే నిత్యావస ర వస్తువుల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో సరఫరా చేయాలని, డెలివరీ బాయ్స్ సిలిండర్లను దారి మళ్లించకుండా డీలర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే సిలిండర్లలో గ్యాస్ తూకం కచ్చితంగా ఉండాలని, తూని కల కొలతల శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సురేందర్‌రావు, అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటి ల్, ఆర్డీవో స్రవంతి, జిల్లా పౌర సరఫరాల అధికారి నందిని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


