breaking news
Adilabad District Latest News
-
ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)
-
కుప్టి బ్రిడ్జికి మరమ్మతులు షురూ
ఇచ్చోడ: ‘కుప్టి పాతబ్రిడ్జికి బుంగ’ శీర్షికన ఈనెల 8న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎట్టకేలకు బుధవారం మరమ్మతు పనులు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన 12 మంది సభ్యులు బ్రిడ్జి పై బుంగ పడిన ప్రదేశంలో మరమ్మతు చేస్తున్నారు. బ్రిడ్జికి ఉన్న 13 జాయింట్ల వద్ద పాత స్టీల్ రాడ్లు, కంకరను తొలగించి వాటిస్థానంలో కొత్త రాడ్లు బిగించి సిమెంట్, కంకరతో జాయింట్లను పూ డ్చాల్సి ఉంటుందని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. దాదాపుగా నెల రోజులపాటు పనులు కొనసాగనున్నట్లు ‘సాక్షి’కి వివరించారు. కుప్టి పాత బ్రిడ్జిని ఆర్అండ్బీ శాఖ అధికారులు నిర్మించారు. నేషనల్ హైవే అఽథారిటీ అధికారు లే మరమ్మతులు చేపట్టాలి. కానీ వారు పనులు ప్రా రంభించకుండా నిర్లక్ష్యం చేశారు. చివరి సమయంలో చేతులెత్తేసి మరమ్మతు పనులను కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వారికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. -
125 గంజాయి మొక్కలు స్వాధీనం
నేరడిగొండ: పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం నేరడిగొండ పోలీసులు బోరిగాం శివారులో తనిఖీలు చేపట్టారన్నారు. వారిని గమనించిన బోరిగాంకు చెందిన ఆడే కపిల్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని చేనులో పరిశీలించగా పత్తి పంట మధ్యలో 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 125 గంజాయి మొక్కలు కనిపించడంతో దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక గంజాయిని రహస్యంగా సాగు చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. పట్టుకున్న గంజాయి మొక్కల విలువ రూ.12.50 లక్షల వరకు ఉంటుందన్నారు. గంజాయి సాగుకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
అడవిపంది మాంసం పట్టివేత
బెల్లంపల్లి: అటవీశాఖ అధికారులు బుధవా రం అడవిపంది మాంసం పట్టుకున్నట్లు బెల్ల ంపల్లి రేంజ్ అధికారి సీహెచ్ పూర్ణచందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేర కు రేంజ్ పరిధిలోని ధర్మారావుపేట బీట్‌లో బుగ్గగూడ సమీపంలోని పత్తి చేనులో గాలింపు చర్యలు చేపట్టగా సంకుర్తల శ్రీకాంత్ ప ట్టుబడ్డాడు. అతన్ని విచారించగా అడవిపందిని వేటాడి చంపినట్లు అంగీకరించాడు. అతనితో పాటు మాంసం కొనుగోలు చేసేందుకు వచ్చిన శ్రీనివాస్, రంజిత్‌పై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. రైల్వే బ్రిడ్జిపై వ్యక్తి మృతదేహంబాసర : బాసర గోదావరి నది మొదటి రైల్వే బ్రిడ్జిపై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి (58) మృతి చెందినట్లు రైల్వే ఏఎస్ఐ మహబూబ్ ఖాన్ తెలిపారు. మృతుడు నీలిరంగు లుంగీ, సిల్వర్ రంగు టీషర్టు ధరించి ఉన్నాడని, చేతిపై ‘కే. లక్ష్మి’ అని పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నకిలీ నంబర్ ప్లేట్ అమర్చిన వ్యక్తి రిమాండ్ఆదిలాబాద్టౌన్: మహారాష్ట్రలోని కేళాపూర్కు చెందిన నంది దగాడే ద్విచక్ర వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్‌తో బుధవారం పట్టణంలో తిరుగుతుండగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన నంబర్ ఉండగా, ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన నంబర్‌ప్లేట్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అడవి పందుల బీభత్సంసిరికొండ: మండలంలోని కొండాపూర్ శివారులో మంగళవారం రాత్రి రైతు సాయిని రాయమల్లు మూడెకరాల మొక్కజొన్న చేనుపై అడవిపందులు దాడిచేసి ధ్వంసం చేశాయి. చేతికి అందివచ్చి న పంటలపై అడవి పందులు దాడులు చేస్తుండడంతో రైతులు రాత్రివేళ కాపలాగా వెళ్తున్నారు. -
బాలుడు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: చదువుకొమ్మన్ని మందలించినందుకు బా లు డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల మేరకు ఎక్బల్హైమద్ నగర్‌కు చెందిన మహ్మద్ అబ్బాస్–నూరి దంపతులకు ట్విన్స్ కుమారులు ఎండీ అమేర్, ఎండీ అమీర్(17). అమేర్ లారీ మీద పనికి వెళ్తుంటాడు. ఇంటర్ చదువుతున్న అమీర్ చదువు మానే సి అన్నతోనే వెళ్తానని కాలేజీకి డుమ్మా కొట్టేవాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నెల 6న ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ స భ్యులు స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్తితి విషమించి బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతితాండూర్: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టు కార్మి కుడు మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్‌రావు తెలి పారు. గోలేటీ సీహెచ్‌పీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న బోయపల్లికి చెందిన మేకార్తి రాజేశం (32) రోజువారీ విధుల్లో భాగంగా బుధవారం స్కూటీపై గోలేటికి వెళ్తుండగా బెల్లంపల్లి నుంచి గోలేటి వైపు వెళ్తున్న ఎర్టిగా వేగంగా స్కూటీని ఢీకొ ని రోడ్డు పక్కన బోల్తా పడింది. ఘటనలో రాజేశం తలకు తీవ్ర గాయాలు కావడంతో ముందుగా బెల్లంపల్లి ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
భారీ విగ్రహాలు తరలిస్తున్నారా.. జాగ్రత్త!
మంచిర్యాలఅర్బన్: వినాయక చవితి పర్వదినానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే మండపాల ఏర్పాటు, భారీ గణపతి విగ్రహాల తరలింపు పనులు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్, కోరుట్ల నుంచి భారీ విగ్రహాల తరలింపు కొనసాగుతోంది. విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు భారీ విగ్రహాల తరలింపులో దారిలో విద్యుత్ వైర్లు, ఫ్లైఓవర్లు, అడ్డంకులు లేకుండా ముందే రూట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రధాన రహదారులపై రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో, తెల్లవారుజామున విగ్రహాలను తరలించాలి. వాహనానికి ముందు, వెనుక హెచ్చరిక బోర్డులు, రెడ్ లైట్లు అమర్చాలి. విద్యుత్ వైర్లు అడ్డంగా ఉన్న చోట విద్యుత్‌శాఖ సిబ్బందిని వెంట ఉంచుకోవటం సురక్షితం. దారిలో వర్షం కురిస్తే రంగులు వెలిసిపోకుండా వాటర్‌ప్రూప్ కవర్లతో విగ్రహాన్ని కప్పి ఉంచాలి. దారిలో విద్యుత్ తీగలు తాకకుండా చూసుకోవాలి. వాహనానికి వెనుకభాగంలో కూర్చోవడం అత్యంత ప్రమాదకరం. -
బసవన్నల పండుగ చేద్దాం!
కెరమెరి/బోథ్: పండుగలన్నీ మానవజాతికి చెందినవే. కానీ పొలాల అమావాస్య మాత్రం ఎద్దులకు చెందిన ప్రత్యేక పండుగ. శ్రావణమాసంలో వచ్చే చివరి పండుగ పొలాల అమావాస్యను గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. గురువారం పండుగ నేపథ్యంలో బుధవారమే ఎడ్లను శుభ్రంగా కడిగి ఇళ్లకు తీసుకెళ్లారు. నేడు గురువారం ఎద్దుల కొమ్ములకు రకరకాల రంగులు వేస్తారు. వీపుపై జూలు, మెడలో గంటలతో పాటు బహుసుందరంగా వాటిని అలంకరిస్తారు. సాయంత్రం ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి ఐదుసార్లు ప్రదక్షణ చేయిస్తారు. అనంతరం గ్రామ పటేల్ తోరణం తెంపిన తర్వాత ఎడ్లను ఇళ్లకు తీసుకెళ్తారు. నైవేద్యంగా... ఆలయాల్లో ప్రదక్షణ అనంతరం ఎడ్లను ఇళ్లకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆ రోజు చేసిన వంటకాలు నైవేద్యంగా తినిపిస్తారు. ఎడ్లు తిన్న వాటిని కుటుంబ సభ్యులు ఆరగిస్తారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారమని పెద్దలు చెబుతున్నారు. ఎడ్లు లేని రైతులు కూడా తమ బంధువుల ఎడ్లను తీసుకవచ్చి పూజలు నిర్వహస్తారు. శుక్రవారం బడుగ.. పొలాల అమావాస్య మరుసటి రోజు బడుగ పండుగ జరుపుకుంటారు. శ్రావణమాసంలో నెల రోజులు మాంసాహారం ముట్టకుండా నియమ నిష్టలు పాటించి శుక్రవారం రోజు మాంసాహారం స్వీకరిస్తారు. ‘ఈగలు, దోమలు, రోగాలు, తీసుకపోరా బడుగ’ అంటూ ఇంటి నుంచి కేకలు వేస్తూ రాత్రి చేసిన పిండివంటల నైవేద్యాన్ని తీసుకొని గ్రామ పొలిమేర వరకు వెళ్తారు. అక్కడ జమ్మిచెట్టుకు పూజలు చేసి కలిసికట్టుగా నైవేద్యం ఆరగిస్తారు. ఆ రోజు నుంచి ఈగలు, దోమలు, వ్యాధులు పారిపోతాయని గ్రామీణ ప్రజల నమ్మకం. -
పర్యాటకరంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
కై లాస్‌నగర్: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కి ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ ఆదేశించారు. బుధవా రం ఆమె హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా ల్లోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను నియమించాలన్నారు. పర్యాటక ప్రాంతా ల్లో తాగునీరు, ఆహార పదార్థాలు, ముఖ్య పట్ట ణాల నుంచి రవాణా సౌకర్యం, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, భద్రత, పార్కింగ్, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు. సినీ చిత్రీకరణకు అనుకూలమైన ప్రాంతాలు గుర్తించి, అభివృద్ధి పర్చాలన్నారు. రానున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా లని, ఇందులో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని తెలిపారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, ఎస్. రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓటర్ల జాబితా సవరణ
కై లాస్‌నగర్/తాంసి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. తాంసి మండలంలోని ఘోట్కోరి, భీంపూర్ మండలంలోని పిప్పల్కోటితో పాటు ఆదిలాబాద్ పట్ట ణంలోని ప్రభుత్వ డైట్ కళాఽఽశాల, ఆర్పీఎల్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. బీఎల్వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీ లన ప్రక్రియపై ఆరా తీశారు. కొత్త ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు. ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల మేర కు గుర్తించి తొలగించాలన్నారు. పత్రాలు అందుబాటులో లేని సందర్భాల్లో తహసీల్దార్లు సంబంధిత వ్యక్తులకు మార్గదర్శకాలు అందించి, అవసరమైన పత్రాలను సేకరించి పూర్తిస్థాయిలో ధ్రువీకరించాలన్నారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా చైతన్యపర్చాలన్నారు. బీఎల్వోలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పొరపాట్లకు అవకాశం లేకుండా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయనకు స్థానికులు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన వెంట కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు ఆర్ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, తహసీల్దార్లు శ్రీనివాస్, జాద వ్ గణేశ్, రమేశ్, నాయబ్ తహసీల్దార్లు సూరజ్, ఇస్తారీ, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఎన్నికల సూపర్వైజర్లు, బీఎల్వోలు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు మతీన్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
● కబ్జాదారుల భరతం పడుతున్న పోలీసులు ● అక్రమార్కుల్లో గుబులు ● పరారీలో పలువురు
ఆదిలాబాద్‌టౌన్: భూమాఫియాపై పోలీసులు కొర డా ఝళిపిస్తున్నారు. పేదలు, సామాన్యుల భూములపై కన్నేసి కబ్జా చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించడం, బెదిరింపులు, మోసపూరిత లావాదేవీలకు పాల్పడుతున్న వారి భరతం పడుతున్నారు. ఎంతటి వారైనా లెక్కచేయడం లేదు. జిల్లాలో పేరుమోసిన రియల్టర్లను సైతం ఇటీవల కటకటాల వెనక్కి పంపడమే నిదర్శనం. ఎస్పీ అఖిల్ మ హాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. బాధితులకు న్యా యం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదులు పెరిగి అక్రమార్కుల బాగోతాలు బయటపడుతున్నాయి. తోకముడిచిన కబ్జాదారులు.. అఖిల్ మహాజన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నరవుతోంది. ఇప్పటికే ఇసుక మాఫియా, వడ్డీ వ్యాపారులు, ల్యాండ్ మాఫియా, నకిలీ పత్రాలు తయారు చేసే డాక్యుమెంట్ రైటర్లు, తదితర నేరాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. భూదందా పేరిట మోసాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులు, బడా వ్యాపారులను సైతం వదిలిపెట్టడం లేదు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతుంది. పలువురు ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకొని స్థానికంగా కనిపించకుండా పోతున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మాజీ కౌన్సిలర్‌ను వారం క్రితం అరెస్ట్ చేశారు. తాజాగా భోరజ్ మండలంలో భూ దందాకు సంబంధించి బడా వ్యాపారుల అరెస్టు అంశం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. -
ఉత్సాహంగా కబడ్డీ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు బుధవారం ఉత్సాహంగా సాగా యి. స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో జిల్లా అమెచ్యూర్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పో టీల్లో బాల, బాలికలు పాల్గొని సత్తా చాటారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, పీడీలు సాయి కుమార్, నాందేవ్ పాల్గొన్నారు. -
‘కాకతీయ’.. ఇదేం మాయ..!?
నిర్మల్: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని కలలను చిదిమేసింది. చేయని తప్పుకు పెద్దశిక్ష వేసింది. బీకాం కంప్యూటర్స్ ఆరో సెమిస్టర్ ఇంగ్లిష్ ఆన్సర్‌షీట్‌లో రెండు పేజీలు లేవంటూ రిజల్ట్ మెమోలో అన్ని సబ్జెక్టులకూ ‘మాల్ ప్రాక్టీస్’గా పేర్కొంది. ‘సార్.. నేనే తప్పూ చేయలేదు. నాకెందుకు ఈ శిక్ష..’ అంటూ కాలేజీలు, వర్సిటీల చుట్టూ తిరిగింది. ఎక్కడా న్యాయం జరగలేదు. నియమాలు, నిబంధనలు అంటూ వర్సిటీ చెబుతోంది. చేసేది లేక.. తండ్రి తన బిడ్డతో కలిసి ఇటీవల ‘మీరైనా న్యాయం చేయండి..’ అంటూ లోకాయుక్తాను ఆశ్రయించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామానికి చెందిన బర్కుంట గంగాభవాని నిర్మల్‌లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదివింది. ఏప్రిల్‌లో ఆరో సెమిస్టర్ పరీక్షలు రాసింది. నెల తర్వాత వచ్చిన ఫలితం ఒక్కసారిగా ఆమెను షాక్‌కు గురిచేసింది. అన్ని సబ్జెక్ట్‌ల గ్రేడ్ స్థానంలో ‘ఎంపీ’(మాల్ ప్రాక్టీస్) అని వచ్చింది. వర్సిటీ వరకు వెళ్లి ఆరా తీస్తే.. ఇంగ్లిష్ పరీక్ష జవాబు పత్రాలు పూర్తిగా లేవన్నారు. డిగ్రీ విద్యలో విలువైన ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయింది. ‘లోకాయుక్తా’... న్యాయం చేసేనా..!? తనకు న్యాయం చేయాలని కాకతీయ యూనివర్సిటీ చుట్టూ పలుమార్లు తిరిగినా న్యాయం జరగకపోవడంతో గంగాభవాని, తండ్రి గంగారాం ఇటీవల లోకాయుక్తాను ఆశ్రయించారు. మాల్‌ప్రాక్టీస్ ఆరోపణలు తొలగించి, విద్యాసంవత్సరం నష్టపోకుండా న్యాయం చేయాలని వేడుకున్నారు. పిల్లల భవిష్యత్‌తో ముడిపడిన ఇలాంటి వ్యవహారాల్లో యూనివర్సిటీ బాధ్యతాయుతంగా ఉండాలని, ఇలా మమ్మల్ని బాధపెట్టొద్దని తండ్రి గంగారాం వాపోతున్నాడు. -
ఒక్క క్షణం.. ఆలోచించండి..!
మంచిర్యాలక్రైం: సృష్టిలో వెలకట్టలేనిది ప్రాణం.. కానీ కొందరు క్షణికావేశంలో దానిని తృణప్రాయంగా వదిలేస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే మనోధైర్యం కోల్పోయి అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. తమవారితో పెనవేసుకున్న బంధాలను బలవంతంగా తెంచేసుకుంటూ.. కన్నవారికి, కట్టుకున్నవారికి ఆప్తులకు తీరని విషాదం మిగిల్చి వెళ్తున్నారు.. ఈ మధ్య కాలంలో జిల్లాలో అత్మహత్యల తీరు ఆందోళన కలిగిస్తోంది. అప్పులు, ఉద్యోగం రావడం లేదని, దంపతుల మధ్య గొడవలు, ప్రేమలో విఫలమయ్యామని.. ఇలాంటి చిన్నచిన్న కారణాలకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. సమస్యలు తమకే ఉన్నాయని, వాటిని అధిగమించలేమోనని ఆత్మస్థైర్యం కోల్పోతున్నా రు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 150 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆలోచిస్తే ఆనందమయం.. అర్ధంతరంగా చావు కొని తెచ్చుకునే సందర్భంలో ఒక్క క్షణం ఆలోచిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఇలా బతుకును జయించిన వారు ఉన్నారని, సానుకుల దృక్పథంతోనే జీవితానికి సార్ధకత అందుతుందని అంటున్నారు. మానసికంగా బలహీనమైన క్షణాల్లో తీసుకునే నిర్ణయమే జీవితానికి అటు.. ఇటుగా మారుతోందని, ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఆనందమయ జీవితాన్ని అందుకోవచ్చని, ఆత్మహత్యల వల్ల సాధించేది ఏమీలేదని, సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యం కూడగట్టుకుని ముందుకు సాగాలని పోలీస్ అధికారులు, చెబుతున్నారు. -
ఢిల్లీలో ఆకర్షణీయంగా తెలంగాణ స్టాల్
కాసిపేట: ఢిల్లీలోని బాలభవన్‌లో జరిగిన ఉల్లాస ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర స్టాల్ ఆకర్షణీయంగా నిలిచింది. స్టాల్లో తెలంగాణ రాష్ట్రం వాచకాలను టీఎల్ఎంను ప్రదర్శించినట్లు డీఆర్పీ బండ శాంకారి తెలిపారు. బుధవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బోనాలు, అక్షర బతుకమ్మ, బంజార నృత్యం ప్రదర్శించినట్లు తెలిపారు. వేదికపై భువనమ్మ కొండల్లో కోయిలపాటలు పాడా లి అనే అక్షరజ్ఞానం పాటలు పాడి అందరి మనన్నలు పొందినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో అధికారులు పురుషోత్తంనాయక్, మహ్మద్ నుమాన్, రంగారెడ్డి డెప్యూటీ డైరెక్టర్ అనిత, రాష్ట్ర కోఆర్డినేటర్ శైలజ , వాలంటీర్లు రాజేశ్వరి, రజిత, కవిత, పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్‌రూరల్: ెపండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మావల పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. రికార్డులతో పాటు పరిసరాలను పరిశీలించారు. రా త్రి వేళల్లో పటిష్టమైన గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరా లకు అడ్డుకట్ట వేసేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్, ఎస్సైలు రాజశేఖర్, సాయిలు ఉన్నారు. కాళోజీ సేవలు చిరస్మరణీయం ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ భాష, సంస్కృతి, ప్ర జా చైతన్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయమని ఎస్పీ అన్నారు. కాళోజీ జయంతి వేడుకలను జిల్లా పోలీ సు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ, కాళోజీ తన కలంతో ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించారని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్ రావు, డీఎస్పీ ఇంద్రవర్ధన్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మోహన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి, పోలీ సు కార్యాలయ ఏవో శివకుమార్ పాల్గొన్నారు. పదోన్నతితో మరింత బాధ్యత ఆదిలాబాద్‌టౌన్: పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్‌కాని స్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. బుధవారం పోలీ సు కార్యాలయంలో వారికి పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. ప్రమోషన్ పొందిన వారిలో వన్‌టౌన్ కానిస్టేబుల్ మహేందర్, గుడిహత్నూర్‌కు చెందిన ఎం.దేవిదాస్ ఉన్నా రు. వీరిని నిర్మల్ జిల్లాకు కేటాయించారు. అలాగే నేరడిగొండకు చెందిన కె.రమేశ్, తలమడుగుకు చెందిన ఎంఏ కరీమ్‌ను జగిత్యాల జిల్లాకు బదిలీ చేశారు. -
45 కాదు.. ఇక 25 రోజులకే
కై లాస్‌నగర్: వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వినియోగదారులు ఇకపై 45 రోజుల వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. 25 రోజులకు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించి సోమవారం నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఊరట కలగనుంది. కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే .. ఇటీవల పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా హోర్మూజ్ నుంచి ఇంధన రవాణాకు అంతరాయం ఏర్పడింది. సరిపడా గ్యాస్ సరఫరా కాకపోవడంతో జిల్లాలో వినియోగదారులు సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కొరత ఏర్పడుతుందో అని కొంతమంది అవసరం లేకున్నా ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. దీంతో వాస్తవంగా అవసరమైన వారికి గ్యాస్ లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వినియోగదారులందరికీ సిలిండర్లను అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ ఏడాది మార్చిలో బుకింగ్ గడువులో మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లోని వారికి 25 రోజులకే అవకాశాన్ని కల్పించగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి మాత్రం 45 రోజులకు పొడిగించింది. ఈ క్రమంలో గ్యాస్ వినియోగం అధికంగా ఉండే పెద్ద కుటుంబాలకు సిలిండర్ కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఇకపై 25 రోజులకే.. యుద్దం ముగియడంతో గ్యాస్ సరఫరా యథావిధంగా జరగడంతో పాటు బుకింగ్ సిలిండర్ల పెండింగ్ సైతం తగ్గిపోవడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా బుకింగ్ గడువును మార్పు చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులందరికీ ఒకే విధంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆరు నెలలుగా కొనసాగిన 45 రోజుల బుకింగ్ గడువును 25 రోజులకు కుదించడంతో గ్రామీణ ప్రాంతాల వారి ఇక్కట్లకు ఇక తెరపడింది.జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు 17 ఎల్పీజీ కనెక్షన్లు 2,14,413 ఉజ్వల 36,960 జనరల్, దీపం 1,77,453 నెలకు వినియోగమయ్యే సిలిండర్లు 80వేలు -
అందరికీ వాటాలే..?
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో కొంత మంది ఉద్యోగులు ఇష్టారీతి న వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రెగ్యులర్ డీఎఫ్‌వో లేకపోవడం, అలాగే ఆదిలాబాద్ డివిజన్‌కు సైతం ఇన్చార్జి అధికారే ఉండడంతో ఉద్యోగులు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా మా రింది. జిల్లాకేంద్రంలోని డివిజన్ కార్యాలయంలో కొన్నేళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కనుసన్నల్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే నలుగురు ఉద్యోగులు ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్న చందంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారని సమాచారం. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో పైనుంచి కింది వరకు వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మొత్తం 16 శాతం వరకు వారి స్థాయికి అనుగుణంగా వాటాలుగా వెళ్తున్నాయనేది ఆ శాఖలో బహిరంగ రహస్యమే. ఏళ్లుగా ఇక్కడే తిష్ట ఆదిలాబాద్ డివిజన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి ఏళ్లుగా అక్కడే తిష్ట వేశాడు. ఇటీవల డీఎఫ్‌వో కార్యాలయానికి బదిలీ అయినప్పటికీ ఆ కుర్చీని వదిలిపెట్టడం లేదు. కాసులు కురిపించే సెక్షన్ కావడంతో అధికారులను మచ్చిక చేసుకొని రాజకీయ నాయకులతో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తె లుస్తోంది. ఆ సెక్షన్‌కు కేటాయించిన ఉద్యోగికి సై తం చార్జి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నా రు. గతంలో ఈ ఉద్యోగి ఇచ్చోడ డివిజన్లో పనిచేస్తున్నప్పటికీ ఆదిలాబాద్‌లోనే తిష్ట వేశాడు. ఇచ్చోడ, ఆదిలాబాద్ డివిజన్ అకౌంట్స్ ఆయనే ఏళ్లుగా చూస్తున్నాడు. కమీషన్లతో రూ.లక్షల్లో సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆ ఉద్యోగికి కార్యాలయంలో పనిచేసే మరో నలుగురు సైతం వత్తాసు పలకడం గమనార్హం. అంతేకాకుండా తనకు ఓ రాజకీయ నాయకుడు బంధువని చెబుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు.. ఉన్నతాధికారుల ఆదేశాలను కొంతమంది ఉద్యోగులు బేఖాతరు చేస్తున్నారు. డివిజన్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు బదిలీ కాగా, ఒక ఉద్యోగి మాత్రమే తనకు కేటాయించిన డీఎఫ్‌వో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మరో ఉద్యోగి ఇప్పటివరకు రిలీవ్ కాలేదు. పాత స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల పీసీసీఎఫ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటేషన్‌లో ఉన్న ఉద్యోగులను వారి స్థానాలకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు ఎఫ్‌బీవోల డిప్యూటేషన్ రద్దు కాగా, వారికి కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరారు. అయితే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి డీఎఫ్‌వో కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. డిప్యూటేషన్ రద్దు చేసినప్పటికీ సదరు ఉద్యోగి అక్కడికి వెళ్లకుండా అక్కడే కొనసాగుతుండడం గమనార్హం.ఆదేశాలు జారీ చేశాంఎఫ్డీవో కార్యాలయం నుంచి డీఎఫ్‌వో కార్యాలయానికి ఇద్దరు ఉద్యోగులు బదిలీ అయ్యారు. ఒకరు ఇప్పటికే విధుల్లో చేరగా, మరొకరు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. సదరు ఉద్యోగికి పలుమార్లు తెలియజేశాం. నలుగురు ఎఫ్‌బీవోల డిప్యూటేషన్లు రద్దు కాగా, వారు సొంత స్థానాలకు వెళ్లారు. నిర్మల్‌కు చెందిన ఉద్యోగి డిప్యూటేషన్ ఉత్తర్వులు రద్దు చేశాం. ప్రస్తుతం ఆ ఉద్యోగి ఇక్కడే పనిచేస్తున్నారు. – ప్రేమలత, ఏవో, డీఎఫ్‌వో కార్యాలయం, ఆదిలాబాద్ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో పైనుంచి కింది స్థాయి వరకు అధికారులు వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్ స్థాయి అధికారికి 5శాతం, ఉన్నతాధికారులకు 3 శాతం, రేంజ్ క్లర్క్‌కు ఒక శాతం, డివిజన్లో పనిచేసే క్లర్క్‌లకు 2శాతం, సర్కిల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు 1.5 శాతం.. ఇలా వాటాలు పంచుకుంటారనే ప్రచారం సాగుతోంది. అదేవిధంగా మిగతావి ఎఫ్ఆర్వో స్థాయి అధికారికి 4 శాతం వరకు కమీషన్లు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే సంబంధిత సెక్షన్ క్లర్క్‌లకు వాటాలు ఉండడంతో కార్యాలయంలో పనిచేసే మిగతా ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు అదే సీట్లో ఉంటే వారే పంచుకుంటారా.. వాటా కోసం తమవంతు ఎప్పుడు అంటూ ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇలా కమీషన్లు రావడంతో కొందరు ఉద్యోగులు అకౌంట్ సెక్షన్లోనే ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. -
అరెస్టులతో బీఆర్ఎస్ను అడ్డుకోలేరు
ఆదిలాబాద్‌టౌన్: అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేరని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంబేడ్కర్ చౌక్‌లో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యూనుస్ అక్బాని, ప్రకాశ్, మెట్టు ప్రహ్లాద్, సాజిదొద్దీన్, అశోక్ స్వామి, రాజు, రమేశ్, నారాయణ, కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు. -
ఫీవర్రీ!
విజిట్‌లో తేటతెల్లం..పెరిగిన ఆవాస కాలం మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ వైపు సాగే పులుల వలసలకు బోథ్, సొనాల అటవీ శ్రేణులు అత్యంత కీలకంగా మారాయి. ఉట్నూర్ జిల్లా ఆసుపత్రిలో అన్ని వార్డులు రోగులతో కిటకిటలాడాయి. సరిపడా బెడ్లు లేకపోవడంతో ఒక్కో పడకపై ఇద్దరేసి చొప్పున ఉంచి చికిత్స అందిస్తున్నారు. నా పేరు అంజన. మాది ఝరి. మా పాపకు జ్వరం వచ్చింది. రిమ్స్‌లో డాక్టర్‌కు చూపిస్తే మందులు రాసి ఇచ్చారు. కొన్ని ట్యాబ్లెట్లు ఇవ్వగా, సిరప్ ప్రైవేట్ మెడికల్‌లో కొనుగోలు చేశాను.జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రులను ‘సాక్షి’ మంగళవారం ఉదయం విజిట్ చేయగా పలు చోట్ల కనిపించిన దృశ్యాలివి. జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కై లాస్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి మంగళవారం జిల్లా కు విచ్చేశారు. స్థానిక పెన్‌గంగ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎంల భద్రత వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. తాంసి, భీంపూర్, ఆదిలాబాద్‌అర్బన్ మండలాల్లో బుధవారం పర్యటించనున్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలనతో పాటు క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ అమలు తీరు స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో అధికారులతో సర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించనున్నారు.ఇక్కడ కనిపిస్తున్నది రిమ్స్ ఆస్పత్రిలోని ఓపీ విభావం.. మంగళవారం ఉదయం 10.30గంటల సమయం.. సీజనల్ జ్వరాలతో వచ్చిన రోగులు, వారి సహాయకులతో ఈ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ప్రిస్కిప్షన్ కోసం ఇలా బారులు తీరి దర్శనమిచ్చారు.ఆదిలాబాద్‌టౌన్: సీజనల్ వ్యాధులతో జనం విలవిల్లాడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో చిన్నా పెద్ద తేడా లేకుండా మంచం పడుతున్నారు. రిమ్స్‌తో పాటు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు డెంగీ విజృంభిస్తోంది. గడిచిన మూడు నెలల్లో 33 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. పీహెచ్‌సీల్లోనూ సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు తప్పని పరిస్థితి. మందుల కొరతతో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు.. జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో 6, ఆగస్టులో 20, సెప్టెంబర్‌లో 7 కేసులు నమోదైన ట్లు అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన వారం రోజుల్లో పట్టణంలోని బంగారుగూడ, రణదీ వెనగర్, కేఆర్కే కాలనీ, భుక్తాపూర్, ఇచ్చోడలోని ధర్మపురి, ఇంద్రవెల్లిలోని శంకర్‌గూడ, నేరడిగొండలోని తర్నంలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వేధిస్తున్న వైద్యుల కొరత.. జిల్లాలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 22 పీహెచ్‌సీలు ఉండగా, మొత్తం 50 వైద్యాధికార పో స్టులకు గాను 24 ఖాళీగా ఉన్నాయి. 26 మంది మా త్రమే పనిచేస్తున్నారు. ఆయా పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులకు పీజీ సీట్లు రావడంతో 16 మంది వెళ్లిపోయారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్బీఎస్కే, జన్మన్ వైద్యులతో సర్దుబాటు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. రిమ్స్‌లోనూ ఇదే పరిస్థితి. గైనిక్ విభాగం దారుణంగా ఉంది. కీలకమైన ఈవిభాగంలో ముగ్గురు, నలుగు రు వైద్యులు మాత్రమే ఉన్నారు. ఓపీ, ఇన్‌పేషెంట్ వార్డుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో పీజీలు, జూనియర్ డాక్టర్లతోనే సేవలు అందుతున్నాయి. -
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ ప్రశాంతం
ఆదిలాబాద్‌టౌన్: ఫీజురీయింబర్స్‌మెంట్ బకా యిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చేపట్టిన ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బోరంచు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, కొన్నేళ్లుగా ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే బిల్లులను విడుదల చేయాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు పాల్గొన్నారు. -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. మందుల కొరత.. రిమ్స్ ఆస్పత్రి ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉంది. ఇక్కడ ఓ పక్క వైద్యుల కొరత వేధిస్తుండగా, మరోవైపు సరిపడా మందులు అందుబాటులో లేని పరిస్థితి. అధికా రులు సరిపడా ఉన్నాయని చెబుతున్నా ఫా ర్మసిస్టులు మాత్రం పూర్తి స్థాయిలో ఇవ్వ డం లేదని రోగులు పేర్కొంటున్నారు. ఒకట్రెండు టాబ్లెట్లు చేతిలో పెట్టి, మిగతావి ప్రైవేట్ మెడికల్ నుంచి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో ఉన్న మూడు మెడికల్ షాపులకు గిరాకీ పెరిగింది. -
పర్యావరణహితంగా గణేశ్ నవరాత్రులు
కై లాస్‌నగర్: జిల్లాలో వినాయక నవరాత్రి వేడుకల ను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవ శాంతియుత సమన్వ య కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించా రు. ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలు, నిమజ్జనం, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్యసేవలు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘మట్టి గణ పతులను పూజిద్దాం–పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అనే సత్సంకల్పంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ప్రజలకు పంపిణీ చేసేందుకు 2,000 మట్టి వినా యక ప్రతిమలను అందుబాటులో ఉంచినట్లు తెలి పారు. కావాల్సిన వారు 81063 44637, 97018 88058 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఉచిత మట్టి విగ్రహాల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్ఎస్ చిత్రు, సబ్ కలెక్టర్ కే. ప్రణయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ అనూష, వైస్ చైర్మన్ రో హిత్, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, వివిధ శాఖల అధికా రులు, ఉత్సవ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. మండపాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఆదిలాబాద్‌టౌన్: గణేశ్ మండపాలకు ఆన్లైన్ రిజి స్ట్రేషన్ తప్పనిసరి అని ఎస్పీ అఖిల్‌మహాజన్ అన్నా రు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. మండపాల నిర్వహణ, నిమజ్జనం తేదీ, సమయం, మార్గం, ప్ర దేశం, నిర్వాహకులు, వలంటీర్ల వివరాలను పోలీ సుశాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. policeportal. tspolice.gov.in వెబ్సైట్లో వివరాలను పొందుపర్చాలని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి కై లాస్‌నగర్: ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రి య వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. బాధితులకు సంబంధించిన ప్రిలిమిన రీ నోటిఫికేషన్ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలన్నారు. గడువులోపు రైతులు, గ్రామస్తులతో మాట్లాడి భూసేకరణ రేట్లను ఖరారు చేయాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఇరిగేషన్ ఈఈ నరేశ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు. -
లక్ష మందితో ‘చలో హైదరాబాద్’
ఆదిలాబాద్‌టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లక్ష మందితో ఈనెల 10న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచి నా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. చలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వడం లేదని పే ర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు ముఖ్య మంత్రి మరో రెండేళ్లు ఓపిక పట్టండి అని అనడం విచారకరమని అన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తామని, అవసరమైతే అసెంబ్లీ వద్దకు వెళ్లి కలుస్తామని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీని వాస్‌రావు, జిల్లా జేఏసీ చైర్మన్ ఎ.నవీన్‌కుమార్, టీజీవో జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జేఏసీ నాయకులు దామోదర్ రెడ్డి, ఎ.వెంకట్, సదానందం, కట్కం రమేశ్, టి.లింగారెడ్డి, తిరుపతి, లచ్చిరాం, శ్యామ్, కృష్ణకుమార్, స్వామి, కిష్టన్న, అశోక్, శ్రీని వాస్, నరేందర్, వృకోధర్, సుదర్శన్, శ్యామ్యూల్, దిలీప్, చంద్రశేఖర్, సతీశ్, అంగన్వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ సర్వీస్‌లో కొనసాగించాలని వినతి వ్యవసాయ శాఖలో డిప్లొమో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న వారిని యథావిధిగా కొనసాగించాలని ఉద్యోగులు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జగదీశ్వర్‌కు వినతి పత్రం అందజేశారు. ఇందులో ఏఈవోలు తౌసిఫ్, ఆనంద్, రమేష్, జాహెద్ తదితరులున్నారు. -
లోటు వర్షపాతం
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ప్రస్తుతం 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 21 మండలాలు ఉండగా, 20 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఒక్క తలమడుగు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం ఉంది. పది రోజుల క్రితం మామూలు వర్షం తప్పితే మళ్లీ జాడలేకుండా పోయింది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. తగ్గుతున్న నీటిమట్టాలు.. ఈ సీజన్లో ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలు మినహా మిగతా అన్ని వారాల్లో అత్యధికంగా లోటు వర్షపాతమే నమోదైంది. అప్పుడు కురిసిన ఆ వర్షాలకు జలాశయాల్లో నీరు చేరింది. ప్రస్తుత పొడి వాతావరణం కారణంగా ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. నీటిమట్టాలు గణనీయంగా తగ్గుతున్నాయి. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్ట్‌ల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలో 298 చెరువులు ఉండగా, అన్ని చెరువులు సగం మాత్రమే నిండాయి. దీంతో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. బోరుబావుల పరిస్థితి అలాగే ఉంది. రా బోయే రోజుల్లో వర్షాలు పడకపోతే తాగునీటి ఎద్దడి కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు. పంటల పరిస్థితి.. జిల్లావ్యాప్తంగా 5లక్షల 94వేల ఎకరాల్లో పత్తి, సోయా, కంది, మొక్కజొన్న తదితర పంటలు ఈ వానాకాలంలో సాగయ్యాయి. అత్యధికంగా 4.37 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పంటలు పూత, కాత దశలో ఉండగా, డ్రైస్పెల్ కారణంగా పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది ఆదిలాబాద్ శివారు లాండసాంగ్వి గ్రామంలో రైతు రాజేందర్ పత్తి చేను. ఇప్పటికే పూత, కాతతో విరివిగా ఉండాల్సిన పంట ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. అనుకున్న స్థాయిలో కాయలు కాయకపోవడం, ఉన్న వాటికి సైతం సరిపడా తేమ లభించక ఎదుగుదల లోపించింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు సరిపడా వర్షాలు లేవు. ఇది పంటపై ప్రభావం చూపుతుంది. దిగుబడిపై రైతు ఆశలు సన్నగిల్లుతున్నాయి.వర్షపాతం వివరాలు.. (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు) సాధారణం : 897.5 మి.మీ.లు కురిసింది : 597.1 మి.మీ.లు లోటు : 33 శాతం -
● అక్షరక్రమంలో ముందున్నా చదువులో మాత్రం వెనుకంజ ● ఫలితమివ్వని పలు కార్యక్రమాలు ● నేడు అక్షరాస్యత దినోత్సవం
ఆదిలాబాద్‌టౌన్: అక్షరాస్యతే అభివృద్ధికి తొలిమె ట్టు.. చదువుతో సమాజంలో చైతన్యం వస్తుంది.. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది.. అక్షరక్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లా అక్షరాస్యతలో మా త్రం ఇంకా వెనుకబడే ఉంది. సర్కారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం కానరావడం లేదు. జిల్లాను అక్షరాస్యతలో ముందుంచేందుకు ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపడుతుంది. గతేడాది నుంచి జిల్లాలో అమలు చేస్తుంది. మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. అప్పటి వరకై నా లక్ష్యం నెరవేరుతుందా అనే చర్చ సాగుతోంది. గ్రామాలు, పట్టణాల్లోని మహిళా సంఘాల సభ్యులతో ఆయా కాలనీలు, వార్డుల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాలు నేర్పిస్తున్నారు. అ యితే కొంత మంది మాత్రమే ముందుకొచ్చి అక్షరా లు దిద్దిస్తున్నారు. ఇటీవల ఎన్ఐవోఎస్ పరీక్ష నిర్వహించగా 12,532 మంది హాజరైనట్లు అధికా రులు చెబుతున్నారు. ఇందులో 8,536 మంది ఉత్తీ ర్ణులయ్యారు. మరోసారి ఈనెల 20న పరీక్ష నిర్వహించేందుకు వయోజనవిద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. 1,27,491మంది నిరక్షరాస్యులు.. జిల్లాలో నిరక్షరాస్యులు లక్ష 27వేల 491 మంది ఉన్నట్లు వయోజన విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో పురుషులు 34,635 మంది ఉండగా, మహిళలు 82,827 మంది, ఇతరులు 29 మంది ఉన్నారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా.. జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ కార్యక్రమం చేపడుతున్నారు. గతేడాది అక్టోబర్ 27న కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడత జిల్లాలో 55 శాతం నిరక్షరా స్యులు 26,341 మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. 14,186 మందిని ఎన్ఐఓఎస్ పరీక్ష రాయించేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 12,532 మంది పరీక్ష రాయగా, ఇందులో 8,536 మంది ఉత్తీర్ణులైనట్లు వయోజన విద్యాశాఖ అధికారులు తెలిపారు. -
మళ్లీ తెరపైకి ‘హస్తం’ లొల్లి
సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉట్నూర్ పీఏసీ సమావేశంలో జరిగిన గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. కంది శ్రీనివాసరెడ్డి, అల్లూరి సంజీవ్‌రెడ్డి మధ్య అప్పట్లో జరిగిన వివాదంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుల సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో అప్పుడు కేవలం ‘కంది’కి మాత్రమే క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నుంచి షోకాజు నోటీసు జారీ అయ్యింది. దీనికి ఆయన స్పందిస్తూ సమాధానం కూడా ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశంపై తీవ్ర చర్చ సాగడం, రాష్ట్ర రాజకీయాలన్నీ అటువైపే దృష్టి సారించడంతో ఈ గొడవను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా ఈ అంశంలో మళ్లీ కందితో పాటు సంజీవ్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతనెల 17న ఉట్నూర్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విదితమే. పీఏసీ సభ్యులు కాని వారిని సమావేశానికి ఎవరు పిలిచారని సంజీవ్‌రెడ్డిని ఉద్దేశించి కంది ఆ సమావేశంలో ప్రశ్నించారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇన్చార్జి మంత్రి జూపల్లి ఆదేశాలతో సంజీవ్‌రెడ్డి ఆ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత సమావేశం జరిగింది. తాజాగా సంజీవ్‌రెడ్డికి కూడా.. ఈ గొడవకు సంబంధించి అప్పుడు కందితో పాటు ఆయన అనుచరులకు మాత్రమే పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం, ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తొలగింపు చర్యలు సంచలనం కలిగించాయి. ఇక ఆదిలాబాద్ అంశంలో నామమాత్రంగా వ్యవహారం ఉంటుందా అని అనుకునే లోపే తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పది రోజుల్లో ఇద్దరూ సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.గ్రూపు తగాదాలు..ఉట్నూర్ పీఏసీ సమావేశం తర్వాత బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ఏకంగా డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్పైనే అధిష్టానానికి ఫిర్యాదు చేయడం గ్రూపు తగాదా లను స్పష్టం చేసింది. ఏకంగా 40 వాహనాల్లో అనుచరులతో కలిసి హైదరాబాద్ వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి డీసీసీ అధ్యక్షుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్, అటు బోథ్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో అయోమయం వ్యక్తమైంది. తాజాగా పార్టీ మళ్లీ ఈ అంశంలో నోటీసు జారీ చేయడంతో ఆయా నేతల అనుచరులు మళ్లీ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటుండడం గమనార్హం. -
హక్కుల కోసం ఢిల్లీలో గర్జించిన గిరిజనులు
ఆదిలాబాద్‌టౌన్: ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో వేలాది మంది గిరిజనులు గళమెత్తారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని సాయి పార్క్‌లో సోమవారం ధర్నా, ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు, ఆరో షెడ్యూళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం, పెసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ చట్టం–2023తో ఆదివాసీ గ్రామసభల హక్కులకు భంగం కలిగే పరి స్థితి ఏర్పడిందన్నారు. మైనింగ్ పేరుతో ఆదివాసీ లను భూముల నుంచి తరలించడం నిలిపివేయాలని, అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్ జితిన్ చౌదరి, జాతీయ కన్వీనర్, మాజీ ఎంపీ ఫు లీన్ బిహారి బస్కే, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకర్, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, టీజేజీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, ఉపాధ్యక్షులు సక్కు, పెందూర్ గోవింద్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం బాపూరావు, కార్యదర్శి తొడసం శంబు, తదితరులు పాల్గొన్నారు. -
కుప్టి పాత బ్రిడ్జికి బుంగ..
ఇచ్చోడ: నేషనల్ హైవే అఽథారిటీ అధికారుల తప్పిదం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. 44వ జాతీయ రహదారి కుప్టి పాత బ్రిడ్జికి బుంగ పడటంతో వాహనాల రాకపోకాలను పూర్తిగా నిలిపివేశారు. పాత బ్రిడ్జికి రెండు వందల మీటర్ల దూరంలో డ్రైవర్షన్ ఏర్పాటు చేసి వాహనాలను నూతన బ్రిడ్జి వైపు మళ్లిస్తుండడంతో ఒక్కో వాహనం అక్కడి నుంచి పాస్ కావడానికి కనీసం గంట సమయం పడుతోంది. పూర్తిగా డౌన్ ఉన్న చోట డైవర్షన్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే వాహనాలు డైవర్షన్ నుంచి వన్‌వేలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతోంది. దీంతో జాతీయ రహదారిపై మూడు, నాలుగు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. ప్రారంభంకాని మరమ్మతులు..నెల రోజుల క్రితం కుప్టి పాత బ్రిడ్జి మధ్యలో బుంగ ఏర్పడింది. అధికారులు గుర్తించినప్పటికీ ఇప్పటి వరకూ మరమ్మతులు చేయకపోవడంతో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. అంతేకాకుండా బ్రిడ్జిపై 320 మీటర్ల పొడవున 12 జాయింట్ల వద్ద మరమ్మతులు చేపట్టాల్సి ఉందని స్థానిక ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో రెండు వైపులా రక్షణగా రెయిలింగ్ నిర్మించారు. అది అక్కడక్కడ కూలిపోవడంతో దాని స్థానంలో రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంతో కూడా బ్రిడ్జిపై భారం పడినట్లు, రక్షణ గోడ నిర్మించే సమయంలో బ్రిడ్జిపై నెల రోజుల నుంచి వన్‌వే చేయడంతో ఒకే వైపు నుంచి వాహనాలు రాకపోకలు సాగించడం కూడా బ్రిడ్జిపై బుంగ పడేందుకు కారణం కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామర్ధ్యంపై అనుమానాలు..కుప్టి వద్ద కడెం వాగుపై 1982లో బ్రిడ్జి నిర్మించారు. 10 నుంచి 20 టన్నుల బరువు ఉన్న వాహనాలే ఎక్కువగా రాకపొకలు సాగించేవి. కానీ పదేళ్లుగా ట్రాన్స్‌పోర్టులో మార్పులు రావడంతో భారీ కంటైనర్లు, వాహనాల్లో 55 టన్నుల వరకు లోడ్‌తో ఈ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కనెక్టివిటీ ఉన్న ఈ జాతీయ రహదారిలో కేంద్ర ప్రభుత్వం అనుమతితో భారీ లోడ్‌తో ఉన్న పుల్లర్ వాహనాలు సైతం ఈ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో 55 టన్నుల కంటే రెండు రెట్ల ఎక్కువ లోడ్ ఉంటున్నట్లు సమాచారం. దీంతో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జికి బుంగ పడటంతో బ్రిడ్జి సామర్ధ్యాలపై అనుమానాలకు తావిస్తోంది. బ్రిడ్జికి మరమ్మతులు చేసి రాకపోకలు సాగిస్తామని చెప్తున్న హైవే అథారిటీ అధికారులు మాత్రం బ్రిడ్జి నాణ్యత ప్రమాణాల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. మూడేళ్ల క్రితమే నిపుణుల నివేదిక..బ్రిడ్జి నాణ్యత ప్రమాణాలపై మూడేళ్ల క్రితమే నిపుణులు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు నివేదిక అందజేశారు. పాత బ్రిడ్జి పక్కన నూతనంగా బ్రిడ్జి నిర్మించాలని నివేదికలో పేర్కొనట్లు సమాచారం. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు మాత్రం నివేదికను బుట్టదాఖలు చేసి నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోక పోవడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కుప్టి బ్రిడ్జి విషయమై నేషనల్ హైవే అథారిటీ పీడీ వివరణ కోసం సాక్షి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
యువత కలల సాకారానికి చేయూత
ఆదిలాబాద్‌టౌన్: యువత కలలను సాకారం చేసే లా పోలీస్ శాఖ చేయూత అందిస్తుందని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణను సోమవారం జిల్లా కేంద్రంలోని డీటీసీలో ప్రా రంభించారు. శిక్షణ కోసం నిర్వహించిన పరీ క్షకు 3,500 మంది అభ్యర్థులు హాజరుకాగా, అందులో 300 మందికి పైగా ఎంపిక చేశారు. ఇందులో 100 మంది నిరుపేదలు, ఆదివాసీ యువతకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెంది న నిష్ణాతులైన శిక్షకులతో అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక పరీక్షలో ఉత్తీ ర్ణత సాధించిన వారికి తదుపరి దశలో డీటీసీ ప్రాంగణంలోనే ఉచిత భోజనం, వసతితో శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో అదనపు ఎస్పీ పి.మౌనిక, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ కె.నాగరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి, రూరల్ ఎస్సై వి.విష్ణువర్ధన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఊరును బాగు చేసిన ఎస్పీకి కృతజ్ఞతలు ఆదిలాబాద్‌రూరల్ మండలం చిట్యాలబోరిలో కల్తీ కల్లు, గుడుంబాలేకుండా చేయాలన్న గ్రామస్తుల తీ ర్మానం మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో వారు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ అనిత ఉన్నారు. -
బౌన్సర్లు కేరాఫ్ జైపూర్
జైపూర్: బౌన్సర్ అంటే కేవలం కండలు తిరిగిన శరీ రం కాదు.. క్రమశిక్షణ, అప్రమత్తత, బాధ్యతకు ప్రతిరూపం. షాపింగ్ మాల్స్ నుంచి ఫంక్షన్ హాళ్ల వరకు.. ప్రముఖుల కార్యక్రమాల నుంచి భారీ ఈవెంట్ల వరకు ఎక్కడ జన సందోహం ఉంటే అక్కడ వీరి విధులు కనిపిస్తాయి. అలాంటి బౌన్సర్లను తీర్చిదిద్దుతూ గ్రామీణ యువతకు ఉపాధి బాట చూపుతోంది జైపూర్ మండలం రసూల్‌పల్లిలోని ఒలంపియా జిమ్. వ్యాయామంతో శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు..అదే ఫిటెనెస్‌ను ఉపాధిగా మలుచుకుంటున్న యువతకు ఈజిమ్ అడ్డాగా మారుతోంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది యువకులు నేడు పట్టణ ప్రాంతాల్లో బౌన్సర్లుగా విధులు నిర్వహిస్తూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగం చేస్తూనే..ఒలంపియా జిమ్‌లో శిక్షణ పొందుతున్న వారంతా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూనే బౌన్సర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తమకు లభించే ఖాళీ సమయాన్ని జిమ్‌లో వ్యాయామానికి కేటాయిస్తూ ఫిట్నెస్ను కొనసాగిస్తున్నారు. యువతలో శారీరకధారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. వ్యసనాలకు దూరంగా.. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలన్నదే లక్ష్యం. జిమ్ ద్వారా క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభ, శారీరక సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన మార్గదర్శకత్వం లేక అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. నిరుపేద యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తాం. – ప్రవీణ్, ఒలంపియా జిమ్ నిర్వాహకుడు 15 ఏళ్ల క్రితం మొదలై..రసూల్‌పల్లికి చెందిన కుమ్మరి ప్రవీణ్ 15 ఏళ్ల క్రితం ఒలంపియా జిమ్‌ను ఏర్పాటు చేశాడు. మొదట చిన్నస్థాయిలో ప్రారంభమైన ఆయన ప్రయత్నం క్రమంగా విస్తరించి ప్రస్తుతం మంచిర్యాల పట్టణంలో రెండు, చెన్నూర్‌లో రెండు, రసూల్‌పల్లిలో ఒకటి మొత్తంగా ఐదు బ్రాంచ్‌ల వరకు చేరింది. జిమ్‌లో వ్యాయామంతో పాటు శారీరకధారుఢ్యం, క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌పై యువతకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం సుమారు 40 మంది యువకులు, 10 మంది యువతులు ఇక్కడ శిక్షణ పొందుతూ హైదరాబాద్, సూర్యాపేట, సిద్దపేట, వరంగల్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, బెంగళూర్ వంటి పట్టణాల్లో సేవలందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే కార్యక్రమాల్లో రద్దీని నియంత్రించడం, ప్రవేశ మార్గాలను క్రమబద్ధీకరించడం, ప్రముఖులు, నిర్వాహకులకు భద్రత కల్పించడం వంటి బాధ్యతలు చేపడుతున్నారు. షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ ఈవెంట్లలో అవసరాన్ని బట్టి భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. -
ఆవేదన విని.. భరోసా కల్పించి
కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్ఎస్.చిత్రు తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన. -
మహాలక్ష్మివాడలో నూతన పైపులైన్
కై లాస్‌నగర్: పట్టణంలోని మహాలక్ష్మివాడ, జైజవాన్‌నగర్, చిల్కూరిలక్ష్మినగర్, తాటిగూడ కాలనీవాసులకు నీటి సరఫరాలో తరచూ ఎదురవుతున్న ఇబ్బందులపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్సీసీ 400ఎంఎం డయా పంపింగ్ పైపులైన్ పాతది కావడంతో తరచూ సమస్యలు తలెత్తి నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ క్రమంలో పాత పైపులైన్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న ప నులను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూ ష సోమవారం పరిశీలించారు. పనుల ప్రగతి పై ఆరాతీశారు. త్వరితగతిన పూర్తయ్యేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. రాబో యే వేసవి దృష్ట్యా నీటిసరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం నూతన పైపులైన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా పే ర్కొన్నారు. ఈక్రమంలో మరో వారం వరకు నీటి సరఫరాలో ఇబ్బందులు తప్పవని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆమె వెంట వార్డు కౌన్సిలర్ సంజయ్, పబ్లిక్ హెల్త్ అధికారులు అర్షద్, అమృత్ తదితరులున్నారు. -
విద్యకు మరింత ఊతం
నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు మెరుగై న విద్య అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ ప బ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ఏర్పాటుకు ప్రాధాన్యమి స్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 73 ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎని మిది పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ మేరకు నిఽ దులు కేటాయిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు రూ.83.19 కోట్లు కేటాయించారు. ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల అభ్యసన ఫలి తాలను మెరుగుపరిచేలా నాణ్యమైన, సమగ్ర విద్యా వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి చేస్తా రు. ప్రస్తుతం ఉన్న జెడ్పీహెచ్‌ఎస్‌లు, మోడల్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారు. ప్రభుత్వ విద్యకు కొత్త రూపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల ను మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచడం ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశం. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, సురక్షితమైన పాఠశాల వాతావరణం అందించడంపై దృష్టి సారించనున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంపాఠ్యపుస్తకాల బోధనకే పరి మితం కాకుండా విద్యార్థుల మేధో, శారీరక, మానసిక, సా మాజిక, సాంస్కృతిక వికాసానికి వేదికగా నిలువనున్నా యి. క్రీడలు, కళలు, సైన్స్, సాంకేతికత, తదితర రంగా ల్లో విద్యార్థుల ప్రతిభను వెలి కితీసేలా అవకాశాలు కల్పించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు ప్ర త్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. నాణ్యమై న విద్యతో పాటు ఆధునిక సదుపాయాలు ప్రభు త్వ పాఠశాలల్లోనే అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులపై విద్యా ఖర్చుల భారం తగ్గనుంది.జిల్లా పాఠశాల నిధులు (రూ.కోట్లలో) కుమురంభీం ఆసిఫాబాద్ జెడ్పీహెచ్ఎస్ 8.40 కాగజ్‌నగర్ జెడ్పీహెచ్ఎస్ 10.09 మందమర్రి మోడల్ స్కూల్ 10.70 మంచిర్యాల కాసిపేట మోడల్ స్కూల్ 10.30 సీతారాంపల్లి జెడ్పీహెచ్ఎస్ 12 నిర్మల్ కుంటాల మోడల్ స్కూల్ 9 నర్సాపూర్(జీ) జెడ్పీహెచ్ఎస్ 12.50 ఆదిలాబాద్ యాపల్‌గూడ జెడ్పీహెచ్ఎస్ 10.20 ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలు, కేటాయించిన నిధులు -
‘మూగ’వేదన!
కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదుఆదిలాబాద్ పట్టణం బొక్కల్‌గూడకు చెందిన నయిముల్లాఖాన్ పుట్టుమూగ, చెవిటి. దివాంగుడైనా ప్రభుత్వపరంగా అందే ఆసరా పింఛన్ 2015లో నిలిచిపోయింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అనే కారణంతో అధికారులు పింఛన్‌ను నిలిపివేశారు. అప్పటి నుంచి పునరుద్ధరించాలని కోరుతూ బాధితుడు అధికారులకు విన్నవిస్తూనే ఉన్నాడు. తోటి దివ్యాంగుడి బాధను గుర్తించిన మిగతా మూగ, చెవిటి దివ్యాంగులు ఆయనకు అండగా నిలిచారు. మిత్రుడి ఆవేదనను సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ సైగలు, పేపర్‌పై రాసి కలెక్టర్ రాజర్షిషాకు సోమవారం వివరించాడు. భార్య, ఇద్దరు పిల్లలు కలిగిన బాధితుడి పింఛన్‌ను పునరుద్ధరించాలని విన్నవించాడు. – కై లాస్నగర్మిత్రుడికి అండగా తరలివచ్చిన సహచర దివ్యాంగులు (దరఖాస్తు పత్రం పట్టుకున్న వ్యక్తి నయిముల్లాఖాన్ )పోలీసు వ్యవస్థ బాధితుల పక్షాన ఉండాలి ఆదిలాబాద్‌టౌన్: బాధితుల పక్షాన పోలీసు వ్యవస్థ ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులకు సూచించారు. పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 33 మంది తరలివచ్చి తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఫోన్ ద్వారా సంబంధిత అధి కారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా విధులు చేపట్టాలి పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అన్నారు. కోర్టులో నేరస్తులకు శిక్ష పడేలా సమర్థవంతంగా కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారులు రాహుల్, కె.స్వామిని పోలీసు కార్యాలయంలో అభినందించారు. ప్రశంసా పత్రాలతో పాటు రివార్డులను అందజేశారు. ఆదిలాబాద్‌టౌన్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీతో పాటు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన గుణ పాఠం చెబుతారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీ సుల వ్యవహారాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. పట్టణంలో ని దస్నాపూర్ బ్రిడ్జివద్ద రాస్తారోకో చేపట్టారు. ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రి క్తత నెలకొంది. రాకపోకలునిలిచిపోయాయి. అనంతరం పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. శాంతి యుతంగా నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, జగదీష్, రమేష్, రాజన్న, అజయ్, సతీశ్, ధమ్మపాల్, శివ, అనిల్, గణేశ్, భోజన్న, రమణ, వెంకన్న, అఖి లేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
కాసిపేట–2 గనిలో పేలుడు
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిలో సోమవారం రెండో షిప్ట్‌లో మిస్‌ఫైర్ జరిగి నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... గనిలోని నార్త్ డిస్ట్రిక్ 22 లెవల్ 18 ఎక్స్ డీప్‌లో విధులు నిర్వహిస్తుండగా మ్యాన్‌హోల్ చేసే క్రమంలో డిటోనేటర్ పేలి సపోర్ట్మెన్్ కార్మికులు క్రాంతికుమార్, పుప్పాల శ్రీనివాస్, కోల్ కట్టర్ కార్మికులు రమేశ్, రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా మందమర్రి డిస్పెన్సరీకి అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో అమర్చిన డిటోనేటర్ 1 పేలకుండా ఉండటంతో కార్మికులు దగ్గరకు వెళ్లి పరిశీలిస్తున్న క్రమంలో పేలినట్లు తెలిసింది.చికిత్స పొందుతున్న క్రాంతికుమార్చికిత్స పొందుతున్న రమేశ్ -
పత్తి పంటను ఆశిస్తున్న ‘పిండినల్లి’
చెన్నూర్‌రూరల్: పత్తి పంటను ఆశించి రసం పీల్చే వాటిలో పిండినల్లి పురుగులు ప్రధానమైనవి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ పురుగులు పత్తి పంటను ఆశిస్తాయి. ఇవి చిన్నవిగా, మెత్తగా, లేత గులాబీరంగులో ఉంటాయి. కొమ్మలు, కాండం, మొగ్గలు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఫలితంగా మొక్కల్లో సాధారణంగా జరిగే ఆవశ్యక మూలకాలు, పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడి గిడసబారి పోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా చిన్నదిగా కనిపిస్తుంది. దీని నివారణకు చర్యలు చేపట్టాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ సూచించారు. నివారణచర్యలుపురుగు ఆశించిన మొక్కలను పీకి కాల్చి వేయాలి. ఇలా చేయడం ద్వారా దాని విస్తరణను అదుపులో ఉంచవచ్చు. పొలం గట్లపైన ఉండే కలుపు మొక్కలు మఖ్యంగా వయ్యారిభామ, తుత్తురబెండ, గడ్డిచామంతి, వంటి కలుపు మొక్కలను పీకి కాల్చి వేయాలి. జైగోగ్రామ బైకోలరేట్ మిత్ర పురుగులను హెక్టారుకు 500 నుంచి 1000 వరకు విడుదల చేయాలి. తద్వారా వయ్యారిభామ, కలుపు మొక్కలను నివారించవచ్చు. దీని ద్వారా పిండినల్లి ఉధృతి తగ్గించవచ్చు. పత్తి ఏరిన తర్వాత ఎండు కర్రలను పీకి కాల్చి వేయాలి. వేసవి దుక్కుల ద్వారా నేలలో దాగి ఉండే పిల్ల పురుగులను నియంత్రించవచ్చు. అంతర పంటగా అలసంద, బబ్బెర, సోయాబీన్, మినుము వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగుల సంఖ్యను వృద్ధి చేయవచ్చు. కంచె పంటగా లేదా రక్షక పంటగా రెండు వరుసల సజ్జ లేదా కందులను దట్టంగా పెంచాలి. దీని ద్వారా ప్రధాన పంట అయిన పత్తిలో పిండినల్లి ఉధృతి తగ్గించుకోవచ్చు. మొక్కలను పురుగు ఆశిస్తే లీటరు నీటిలో 10 మిల్లీలీటర్ల వేపనూనెతో పాటు ఒక గ్రాము సబ్బు పొడిని కలిపి 10 నుంచి 12 రోజుల తేడాతో మొక్కలపై పిచికారీ చేయాలి. దీంతో చీడ, పీడలు తగ్గుతాయి, తద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు. ఏవిధంగా ఆశిస్తుందిపిండినల్లి పురుగులు ముఖ్యంగా పొలంగట్లపై, పనికి రాని భూముల్లో పెరిగే కలుపు మొక్కల ద్వారా వ్యాపిస్తాయి. బెండ, టమాటా, వంగ, క్యాబేజీ, బొప్పాయి, నిమ్మ, జామ, మందార, గోగు, చామంతి, గడ్డి చామంతి, రామబాణం, వయ్యారిభామ, తుత్తర బెండ, సీతాఫలం, సుబాబుల్, గ్లైరిసిడియా వంటివి పిండినల్లికి అతిథి మొక్కలు. పురుగుపై తెల్లని మైనపు పొర ఉండటం చేత, అది పురుగు మందుల ప్రభావం నుంచి ఇతర సహజ మరణం నుంచి రక్షణ పొందుతుంది. ఈ పురుగు సాధారణంగా సంవత్సర కాలంలో 15 తరాలకు అభివృద్ధి చెందగలదు. అలాగే ఆడ పురుగు పెట్టే ఒక గుడ్ల సంచిలో దాదాపు 600 వరకు గుడ్లు ఉంటాయి. పంట పొలంలో సహజంగా పెరిగే మిత్ర పురుగులు అంతరించి పోవడం వలన పురుగు విసర్జించే తేనె వంటి ద్రవం కొరకు వచ్చే చీమల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు పిండినల్లి వ్యాపిస్తుంది. అంతే కాకుండా పురుగు సహజంగా పంట ఉత్పత్తుల ద్వారా, పత్తి కర్రల ద్వారా గాలి, నీటి కాలువలు, వర్షం, పక్షులు, పశువుల ద్వారా వ్యాపిస్తుంది. మనుషులు ఈ పురుగులు ఆశించిన ప్రాంతం నుంచి ఆశించని ప్రాంతానికి తిరగడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. -
సర్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
కై లాస్‌నగర్: సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రియ పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల ని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతోపాటు, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. ప్రస్తుత ప్రత్యేక సవరణ గతంలో నిర్వహించిన సవరణలకు భిన్నంగా అత్యంత సమగ్రంగా కొనసాగుతోందన్నారు. 2002, 1984 నాటి రికార్డులు, సంబంధిత పత్రాలను ఆధారంగా చేసుకుని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల సంఖ్యను పరిశీలించాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బీ ఎల్‌వోల పాత్ర కీలకమని, అధికారులు–బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, ఎస్.రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ తదితరులు పాల్గొన్నారు. 60వేల నోటీసుల పరిష్కారం కై లాస్‌నగర్: సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో లక్ష 50వేల మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అందులో 60వేల వరకు పరిష్కరించామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఈఆర్వోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో, ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఎక్కు వ పెండింగ్‌లు ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేస్తున్నట్లుగా తెలిపారు. డాక్యుమెంట్ అప్లోడింగ్, హియరింగ్ లాప్స్, దరఖాస్తుల సేకరణను ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల వద్ద కేవలం 99 మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లుగా వివరించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిరి శ్రీకాంత్, జలందర్‌రెడ్డి, సంఘ బాధ్యులు లచ్చారెడ్డి, దేవన్న, భీంరావు, అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పులుల సంరక్షణ
నిర్మల్‌టౌన్: పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమని ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, బాసర సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత భవనంలో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ‘ఫారెస్ట్ ప్రొటెక్షనన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టైగర్ ల్యాండ్‌స్కేప్’ అంశంపై అంతర్ జిల్లా సమన్వయ వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబ్డే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులుల సంచారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ప్రస్తుతం తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్‌ల నుంచి పులులు ఈ ప్రాంతంలోకి వస్తున్నాయన్నారు. పులుల సంరక్షణతో పాటు వాటి ఆవాస ప్రాంతాలను కాపాడడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓలు ప్రశాంత్ పాటిల్ (నిజామాబాద్), రాహుల్ జాదవ్ (మంచిర్యాల), నీరజ్ టెబ్రివాల్ (కామారెడ్డి), రవిప్రసాద్ (జగిత్యాల), డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి కేసులో యువకుడి అరెస్టు
బెల్లంపల్లి: గంజాయి కేసులో యువకుడిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో కె.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై రామకృష్ణ ఆదివారం జాతీయ రహదా రి పక్కన వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తున్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సల్గుపల్లికి చెందిన గోమాస ప్రకాష్ వద్ద 200 గ్రాముల గంజాయి లభించింది. మహా రాష్ట్రలోని బల్లార్షాలో తక్కువ ధరకు కొనుగో లు చేసి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి బైక్, గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య
ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో వేర్వేరు కారణాలతో నలుగురు బలవన్మరణం చెందారు. అనారోగ్యం, ఒంటరితనం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనారోగ్యంతో వివాహిత..తాంసి: అనారోగ్యంతో బాధపడుతున్న వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన ఇప్ప అనుసూయ(46) వివాహిత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈక్రమంలో జీవితంపై విరక్తితో ఆదివారం ఉదయం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. భర్త లస్మన్న ఫిర్యాదు మేరకు ఎస్సై పీర్సింగ్ నాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ ఒకరు..భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన ఎండీ.సమ్రీన్ (24) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై పీర్‌సింగ్‌నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..సమ్రీన్‌కు గతేడాది బాబు జన్మించాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. శనివారం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతదేహన్ని ఎస్సై పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి షేక్ సయ్యద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీర్‌సింగ్‌నాయక్ తెలిపారు. ఉరేసుకుని వ్యవసాయ కూలీ..తాంసి: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వ్యవసాయ కూలీ పంటచేనులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాంసి మండల కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాంసికి చెందిన బెల్లపు అనిల్(40) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా వెన్నుపూస, నరాల నొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లి చూపించుకున్నా నొప్పి తగ్గలేదు. శనివారం రాత్రి గ్రామ సమీపంలోని పంటచేల్లో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆదివారం ఉందయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జీవన్‌రెడ్డి ఘటనస్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. భార్య రమ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడితోపాటు దివ్యాంగురాలైన కూతురు ఉంది. భవనం పైనుంచి దూకి యువకుడు..కోటపల్లి: అనారోగ్య సమస్యలతో ఒంటరిగా ఉంటున్న యువకుడు మనస్తాపంతో భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. కోటపల్లి మండలంలోని నాగంపేటకు చెందిన దుర్గం మల్లయ్య, సుగుణ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు స్వామిరాం(26) డిగ్రీ పూర్తి చేశాడు. 2025లో ఎన్ఐటీ నాగ్‌పూర్‌లో సీటు రాగా, అనారోగ్య సమస్యలతో జాయిన్ కాలేదు. ఇంటి వద్దే ఉండి కుటుంబసభ్యులకు ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రవేశం పొందాడు. నాలుగు నెలలుగా కోచింగ్ తీసుకుంటున్నాడు. ఒక వైపు అనారోగ్య సమస్యలు, ఒంటరితనం భరించలేక ఆదివారం ఆదిలాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ భవనం మూడోఅంతస్తు నుంచి దూకాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, తండ్రి మల్లయ్య కోటపల్లి రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. కుమారుడు ఉద్యోగం సాధించి తమతో ఉంటాడని అనుకున్న తరుణంలో ఇలా జరగడంతో తండ్రి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. స్వామిరాం మృతితో నాగంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. -
రెండు అడుగుల దూరం నుంచి చూశా
15 రోజుల క్రితం గ్రామ శివారులోని చేను వద్దకు కూలీ పనులకు వెళ్లాం. సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో పొదలో పులి నక్కి ఉండటాన్ని రెండడగుల దూరం నుంచే చూశాను. పులి అని కేక వేసి స్పృహ తప్పి పడిపోయాను. గ్రామంలో మహిళలు కొద్ది రోజులుగా అటు వైపు పనులకు వెళ్లడం లేదు. – గోల్లి లక్ష్మి, కూలీ, అర్లి(టి) ప్రజలను అప్రమత్తం చేస్తున్నాంపులి సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులి ఇటు వైపు తరచూ వస్తోంది. టైగర్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మానిటరింగ్ చేస్తున్నాం. – రాథోడ్ అవినాష్, ఎఫ్ఆర్వో -
2009.23 ఎకరాల భూసేకరణ..
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. ఓ వైపు భూసేకరణ సర్వే ప్రక్రియ కొనసాగుతుండగా, మరోవైపు సేకరించనున్న భూములకు అధికారులు ప్రాథమిక నోటిఫికేన్లను జారీ చేస్తున్నారు. ఇప్పటికే మూడు గ్రామాలకు సంబంధించి జారీ కాగా నిషాన్ఘాట్లోని భూములకు సంబంధించి ఆదివారం విడుదల చేశారు. అత్యధికంగా సేకరించనున్న అనుకుంట భూములకు నేడో, రేపో జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సర్వే పూర్తై, నోటిఫికేషన్ కాల పరిమితికి చేరువైన గ్రామాల్లోని భూములపై ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను సైతం ఖరారు చేశారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేంతవరకు ఇదే స్పీడ్ కొనసాగితే త్వరలోనే ఎయిర్‌పోర్టు భూమిపూజ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రక్రియ వేగవంతం.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఎయిర్‌పోర్టుకు అసవరమైన భూమి గుర్తించేందుకు రెవెన్యూ, సర్వేయర్లతో కూడిన ఆరు ప్రత్యేక బృందాలను యంత్రాంగం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ బృందాలు సర్వే ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి. తుది దశకు చేరినట్లుగా తెలుస్తోంది. కాగా ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోకి వచ్చే కచ్కంటి గ్రామంలో 29.19 ఎకరాలు, టాక్లిలో 5.20 ఎకరాలు, అర్లి–బి మండల పరిధిలో 160.30 ఎకరాల భూమిని సేకరించేందుకోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే అత్యధికంగా పట్టణా నికి అనుకుని ఉన్న అనుకుంటలో 800 ఎకరాల భూమిని సేకరించేందుకు సోమ, మంగళవారాల్లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి అధికారులు నిర్ణయించారు. ఇక పట్టణ పరిధిలోని నిషాన్‌ఘాట్‌లో 428.16 ఎకరాల భూమికి అధికారులు ఆదివా రం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులోని రైతుల భూవిస్తీర్ణం, ఖాతాదారు పేరు వంటి వివరాల్లో ఏ మైనా తేడాలుంటే భూసేకరణ అధికారి, కలెక్టర్ కార్యాలయంలో అభ్యంతరాలు అందజేయాలని క లెక్టర్ రాజర్షి షా సూచించారు. కాగా నిర్వాసితులకు నోటీసులు అందిన తర్వాత వారం రోజుల్లో ఇక్కడ కూడా గ్రామ సభ నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ప్రక్రియను చేపడుతున్నట్లగా కలెక్టర్ వివరించారు.9,11 తేదీల్లో గ్రామసభలు భూసేకరణకు గాను ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాల్లో నిర్వాసిత రైతుల అభ్యంతరాలు, విజ్ఞప్తులను తెలుసుకునేందుకు గాను తొలుత ఈనెల 9న అర్లి–బి, 11న కచ్కంటిలో గ్రామసభలు నిర్వస్తున్నాం. నిర్వాసితులు తెలిపే అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. సర్వే పూర్తయిన కొద్ది నోటిఫికేన్లను జారీ చేసి అన్ని గ్రామాల్లో సభలను నిర్వహిస్తాం. ఏ గ్రామంలో ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకనుగుణంగా ఉన్నతాఽధికారులు నిర్ణయిస్తారు. – పి.జగదీశ్వర్‌రావు, ఆర్డీవో రక్షణాశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఎరోడ్రమ్లోని 369.49 ఎకరాలకు అనుబంధంగా మరో 2009.23 ఎకరాలతో కలిపి రక్షణ, పౌర విమానాయాన శాఖల ఆధ్వర్యంలో జాయింట్ యూజర్ ఫీల్డ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశాలకనుగుణంగా పౌర విమానయాన శాఖకు 400, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు 1609.23 ఎకరాల చొప్పున సేకరించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. ఈమేరకు రూ.1500 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. జిల్లాలో ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ఢిల్లీలో కలిసి కార్గో, ప్యాసింజర్, టెర్మినల్ వసతుల ఏర్పాటుకు సహకరించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నిర్వాసితులకు ఎంత పరిహారం చెల్లించాలనే దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందనట్లుగా అధికారులు చెబుతున్నారు. -
బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం ఎర్రవెల్లిలో నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ జాదవ్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా సమష్టిగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ ఎల్పీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
1/70 చట్ట పరిరక్షణకు పోరాటాలు
ఆదిలాబాద్‌టౌన్: ఆదివాసీల భూహక్కుల పరి రక్షణ కోసం ఉన్న 1/70 చట్టాన్ని కాపాడేందు కు తెలంగాణలోని ఆదివాసీ ప్రాంతాల్లో పోరా టాలు చేస్తామని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఆదివాసీ హక్కుల సభలో పాల్గొ ని రాష్ట్రంలోని ఆదివాసీల సమస్యలను ప్రస్తావించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్ట పరిరక్షణ, పేసా చట్టం అమలుపై ప్రభుత్వాల విధానాలు ఆదివాసీల హక్కులకు భంగం కలి గించేలా ఉన్నాయనివిమర్శించారు. ఆదివాసీల భూ ములు అన్యాక్రాంతం కాకుండా చట్టా న్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ యువతకు ఉ ద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంబంధించిన జీవో3ను పునరుద్ధరించాలన్నారు. ఈ సభ లో జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, కొట్నాక్ సక్కు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల నాటికి బాసర ముస్తాబు
భైంసా/బాసర: తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వచ్చే ఏడాది జూన్ 27 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏడాది ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా బాసరలో శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి రూ.354 కోట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు రూ.20 కోట్లతో చేపట్టనున్న పనులకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. బాసరను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులకు మెరుగైన వసతులు పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఘాట్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూంలు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన పుష్కర ప్రాంతాల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్‌లు, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లతో పనులు గోదావరి పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. బాసరతోపాటు గోదావరి నదీ తీర జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రజాభవన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యత, పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసర పుష్కర ఘాట్ల అభివృద్ధి, ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మ్యాపులు, ప్రతిపాదనలు, పనుల పురోగతిని మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి
● ఆదిలాబాద్ డిప్యూటీ ఆర్ఎం మల్లేశయ్యమంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ ప్రయాణికులకు మరింతగా మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ ఆదిలాబాద్ డిప్యూటీ ఆర్ఎం (ఆపరేష న్స్) మల్లేశయ్య సూచించారు. ఆదివారం మంచిర్యాల డిపో, బస్‌స్టేషన్, సిబ్బంది క్వార్టర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిపో సౌకర్యాలు, ప్రయాణికులకు అందుతున్న సేవలను ప రిశీలించి అధికారులకు పలు సూచనలు చేశా రు. ఛార్జీలు చెల్లించి ప్రయాణించే వారిని మ రింతగా ఆకర్షించి సంస్థకు రాబడి పెంపునకు దిశనిర్ధేశం చేశారు. ఆయన వెంట డిపో మేనేజర్ నరేష్కుమార్, అధికారులు ఉన్నారు. -
గడువులోపు పూర్తి చేయాలి
ఇంద్రవెల్లి: ఎస్ఐఆర్ ప్రక్రియ గడువులోపు పూర్తి చేయాలని ఉట్నూర్ సబ్‌కలెక్టర్ ప్రణ య్‌కుమార్ అన్నారు. ఇంద్రవెల్లి, శంకర్‌గూడ గ్రామాలను ఆదివారం సందర్శించారు. సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్ల నుంచి డాక్యుమెంట్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలతో మాట్లాడి ఇప్పటి వరకు చేపట్టిన సర్వే, నోటీసుల జారీ, డాక్యుమెంట్ల స్వీకరణ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా వ్యహరించాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ వారి నుంచి డాక్యుమెంట్లను నిబంధనల ప్రకారం స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ జాదవ్ రోమ, వార్డు సభ్యులు జాదవ్ విజయ్‌కుమార్, బీఎల్వోలు ఉన్నారు. -
సింగరేణిని దోచుకుంటున్నారు
మందమర్రిరూరల్: రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొ ప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలో ఆదివా రం నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గా ల ప్రజలకు న్యాయం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో అనేక హక్కులు కాలరా స్తోందన్నారు. మరో రెండేళ్ల తర్వాత కేసీఆర్ ప్ర భుత్వం వస్తుందన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీ గెలుపునకు టీబీజీకేఎస్ భిక్ష అని అన్నారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు కార్మికులకు అనేక హక్కులు సాధించా మని తెలిపారు. ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘంగా విఫలమైందని, ఆ నాయకులను ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్, క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ గొడిసెల సంధ్యారాణి, టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
సొంత బడిలో పేపర్లు దిద్దొద్దు
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల మూల్యాంకన విధానంలో కీలకమార్పు చోటు చేసుకోనుంది. ఇకపై జవాబు పత్రాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కాకుండా ఇతర స్కూళ్ల టీచర్లతో క్రాస్ వాల్యుయేషన్ చేయించనున్నారు. విద్యా ప్రమాణాలు మరింత ఖచ్చితంగా అంచనా వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు విద్యార్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా అంచనా వేయడమే లక్ష్యంగా ఈ విధానం అమలు చేయనున్నారు. పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల ఎస్ఏ–1, ఎస్ఏ–2 పరీక్షల జవాబు పత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించనున్నారు. ఈ క్రాస్ వా ల్యుయేషన్ విధానం ద్వారా పక్షపాతం లేకుండా మరింత పారదర్శకత తీసుకురావచ్చని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి అవసరమైన చోట అదనపు బోధన, రెమేడియల్ కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడనుంది. మండల కేంద్రాల్లోనే.. ప్రతి మండల కేంద్రంలో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఎంఈవో పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. తద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మరింత నిష్పక్షపాతంగా అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆన్లైన్లో మార్కులు నమోదు.. మూల్యాంకనం పూర్తయిన తర్వాత విద్యార్థుల మార్కులను తరగతి, సబ్జెక్టుల వారీగా నమోదు చేసి ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. రికార్డుల్లో ఏవైనా తేడాలు ఉంటే వాటిని సరిచేయనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. మండలాల వారీగా మూల్యాంకన ప్రక్రియను డీఈవో పరిశీలించనున్నారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేల్లో సర్కారు బడుల్లో చదివే 50 శాతం మంది విద్యార్థులకు చదవడం, రాయడం రావడం లేదనే కారణంతోనే ఈ విధానం చేపట్టినట్లు తెలుస్తోంది. డీఈవో పరిధిలో మొత్తం పాఠశాలలు 678 ప్రాథమిక 467 ప్రాథమికోన్నత 105 ఉన్నత 106 విద్యార్థులు 58వేలు -
ప్రత్యేక రైలును కొనసాగించాలి
కాగజ్‌నగర్‌టౌన్: ఇటీవల శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిపిన ప్రత్యేక రైలు (07235/36)ను పండుగల సీజన్ వరకు కొనసాగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు కాకుండా 11.20 గంటలకు బయల్దేరితే సిర్పూర్ కాగజ్‌నగర్‌కు సాయంత్రం 4.10 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయల్దేరి రాత్రి 10.25 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈరైలు నుంచి ఆదరణ లభిస్తే క్రమబద్ధీకరించి అప్‌గ్రేడ్ చేసి కుమురంభీం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలని ఉత్తర తెలంగాణ రైల్వేఫోరం సభ్యులు కోరుతున్నారు. ప్రస్తు తం కాజీపేట్ జంక్షన్లో 14 గంటల పాటు ఖాళీగా ఉన్న 17035/36 బల్లార్షా–కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు పొడగించాలని, బల్లార్షా నుంచి బయల్దేరే సమయం 5.20 గంటలకు మార్పు చేసి కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. చొరవ చూపాలి ఈ రెండు రైళ్ల మంజూరు విషయంలో ఎమ్మె ల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎంపీ నగేశ్ ప్రత్యేక చొరవ చూపాలి. కేంద్ర రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. ఎమ్మెల్యే హరీశ్‌బాబు గతంలో మాదిరిగా వీటిని పరిష్కరించాలి. – ఫణిరాజ్, ఉత్తర తెలంగాణ రైల్వే వినియోగదారుల ఫోరం ప్రతినిధి -
జాతీయస్థాయి పోటీల్లో ‘బాలకేంద్రం’ ప్రతిభ
ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని తెలుగు యూని వర్సిటీలో కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ జాతీయస్థాయి నృత్య పోటీల్లో ఆదిలాబాద్ బాలకేంద్రం చిన్నారులు ప్రతిభ కనబరిచారు. సబ్‌జూనియర్ కూచి పూడి విభాగంలో మందోళ్ల మహాశ్విని, పడాల ధన్విక, ముమ్మడి శ్రీ ఆధ్య ద్వితీయ స్థానంలో నిలిచారు. సీనియర్ విభాగంలో వేల్పుల శ్రేష్ఠ, గన్న ఆశ్రిత, పందిరి శ్రేయాన్షి, సామ మహతి, క్షీరసాగర్ జాహ్నవి, కనిందే మహాశ్రీ, జంగలి రిధిక్ష, గడ్డం శ్రీనిధి, ఠాకూర్ హర్షిణి రెండో స్థానంలో నిలిచారు. సోలో విభాగంలో గడ్డం శ్రీనిధి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. వీరంతా మలేషియాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికై నట్లు బాలకేంద్రం పర్యవేక్షకులు మిట్టు రవి తెలిపారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. గడిచిన వారంలో 10 సైబర్ ఫిర్యాదులు అందాయ ని పేర్కొన్నారు. బేల పరిధిలో బాధితుడికి టెలి గ్రా మ్ ద్వారా పెట్టుబడి పేరుతో పరిచయం చేసుకొని రూ.9850 ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. గుడిహత్నూర్‌లో ఆ న్‌లైన్ షాపింగ్ పేరిట ఇన్‌స్ట్రాగామ్‌లో వస్తువులు పంపుతామని నమ్మించి రూ.5,195 మోసం చే సినట్లు చెప్పారు. ఆదిలాబాద్ టూటౌన్ ప రిధిలో రమ్మిబ్లస్ట్ ఆన్‌లైన్‌గేమ్ ఆడుతూ బాధితుడు రూ.లక్ష వరకు డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిపారు. టూటౌన్ పరిధిలో క్రెడిట్కార్డుయాప్ వివరాలు, ఓటీ పీ నమోదుతో రూ.29,933 బాధితుడు పో గొట్టుకున్నట్లు పేర్కొన్నారు. తాంసి పరిధి లో బాధితుడు ఓఎల్ఎక్స్లో మొబైల్‌ఫోన్ ప్రకటన చూసి రూ.85 వేలు చెల్లించి మోసపోయిన ట్లు తెలిపారు. ఇచ్చోడలో డీలర్షిప్ పేరుతో రూ. 35వేలు, ఆదిలాబాద్‌రూరల్ స్టేషన్‌పరిధిలో నకిలీ లోన్‌యాప్ పేరుతో వేధింపులు, ఉ ట్నూర్లో పెట్టుబడి పేరిట రూ.24,500 బాధితులు మోసపోయినట్లు తెలిపారు.ఎవరైనా సైబర్ మోసా నికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని, సమీప పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. -
వసతికి చిక్కులు
స్థానిక ఐజా కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న మధుకర్ మూడు నెలల క్రితం ఎస్సీ హాస్టల్లో ప్రవేశం పొందాడు. అయితే స్కాలర్షిప్ ఆన్లైన్ నమోదు ప్రక్రియలో పేరు ఉంటేనే వసతిగృహంలో లెక్కించబడుతుంది. ఆన్లైన్ పోర్టల్‌లో కాలేజీ పేరు కనిపించకపోవడం, సాంకేతిక లోపాల వల్ల కాలేజీ ఐడీ, హాస్టల్ స్కాలర్షిప్ డేటా అప్డేట్కు ఆటంకంగా మారింది. మూడు నెలలు గడిచిపోవడంతో వార్డెన్లు హాస్టల్‌కు సంబంధించిన బిల్లులు సమర్పించాల్సి వస్తోంది. కానీ ఆన్లైన్ ప్రవేశం లేని విద్యార్థుల విషయంలో ఏంచేయాలో పాలుపోక వార్డెన్లు గందరగోళంలో పడ్డారు. ఆన్లైన్లో కళాశాలల పేరు లేకపోవడం.. ఆధార్‌లో తప్పుల కారణంగా జిల్లాలో 65 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంచిర్యాలఅర్బన్: ఎస్సీ వసతి గృహాల్లో ఇంటర్ ప్రవేశాలకు ఆధార్ కార్డులోని తప్పులు ఆటంకంగా మారాయి. పదో తరగతి ఒరిజినల్ మెమోలు రాకపోవడం, ఆధార్‌లో పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీలు తప్పుగా ఉండడంతో తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్లో స్కాలర్షిప్, హాస్టల్ ప్రవేశాలకు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇంటర్, వృత్తి విద్య కోర్సులు చదివే గ్రామీణ ప్రాంత ఎస్సీ విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేటలో రెండేసి హాస్టళ్లలో 100 నుంచి 150 మందికి మాత్రమే ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది. మీసేవ కేంద్రాల ద్వారా ఆధార్ సవరణలు జరగటానికి ఆలస్యం అవుతుండటంతో ఆన్లైన్ దరఖాస్తులు ముందుకు సాగడం లేదు. నమోదు ప్రక్రియ ఆలస్యమై హాస్టల్ సీట్లు నిండిపోతే చదువుకు దూరమవుతామోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో నమోదు చేసే వార్డెన్లకు ఆధార్‌కార్డుతో సరిపోలకపోవటంతో (మిస్మాచ్డ్) వెబ్సైట్లో కనిపించడంతో సమస్య పరిష్కారం తలకు మించిన భారంగా మారింది. బీసీ, ఎస్టీ తరహాలో ఎస్సీ ప్రవేశాలు కల్పిస్తే..పోర్టల్‌లో వివరాలను వెంటనే అప్డేట్ చేసి, కళాశాలల పేర్లు కనిపించేలా సంబంధిత అధికారులతోపాటు ఆయా కళాశాలల యాజమాన్యాలు చొరవ చూపాల్సి ఉంది. పోర్టల్‌లో సమస్య పరిష్కారమయ్యే వరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక అనుమతి ఇస్తే విద్యార్థులకు తాత్కాలిక ఇబ్బందులు తొలగుతాయి. స్కాలర్‌షిప్‌తో నిమిత్తం లేకుండా బీసీ, ఎస్టీ హాస్టళ్లలో ప్రవేశాలు కల్పించినట్లే ఎస్సీ వసతి గృహల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. పోర్టల్‌లో కళాశాలల నాట్‌ఫౌండ్ విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఈ– పాస్ ఆన్లైన్ పోర్టల్‌లో కళాశాలల పేర్లు కని పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కళాశాలల వివరాలు (మాస్టర్ డేటా) సిస్టమ్‌లో అప్డేట్ కాకపోవడంతో పోర్టల్‌లో నాట్‌ఫౌండ్ అని వస్తుండటంతో విద్యార్థులు అధికారుల చుట్టూ తిరగా ల్సి వస్తోంది. ఏటా ప్రభుత్వం మాస్టర్ డేటా ను అప్డేట్ చేస్తోంది. కొన్ని కళాశాలల యా జమాన్యాలు రెన్యూవల్ సమాచారం, అనుబంధ ఆఫిలియేషన్ పత్రాలను సమయానికి సమర్పించకపోవడం, సాంకేతిక కారణమో తెలియదుగానీ ఆలస్యమవుతోంది. స్కాలర్షిప్ దరఖాస్తులతోనే కళాశాలల, హాస్టల్ ప్రవేశాలు ముడిపడి ఉండటంతో విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. హాస్టల్ బిల్లుల సమర్పణకు సంబంధించి వార్డెన్లపై ఒత్తిడి పెరుగుతోంది. మూడు నెలల వసతి సౌకర్యం కల్పించిన వార్డెన్లు ఆన్లైన్లో పేరు లేకపోవడం వల్ల వెళ్లిపొమ్మనే పరిస్థితులుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. -
ముగిసిన ‘సర్’ ప్రత్యేక శిబిరాలు
కై లాస్‌నగర్: సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల సౌకర్యార్థం శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక శిబి రాలు ముగిశాయి. జిల్లాలోని 600 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉండి ఓటర్ల ము సాయిదా జాబితాలను ప్రదర్శించారు. కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన దరఖాస్తులతో పాటు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించారు. ఆదిలా బాద్‌లోని డైట్ కళాశాల, మావలలోని ఉన్నత పాఠశాల పో లింగ్ కేంద్రాల్లో సవరణ ప్రక్రియను కలెక్టర్ రాజర్షి షా ఆదివారం పరిశీలించారు. ఓటర్లు అందించిన దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. యాప్ లో నమోదుపై ఆరా తీశారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని బీఎల్వోలను ఆదేశించారు. ఓటర్ల వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
టైగర్.. టెన్షన్!
తాంసి: జిల్లాలో పులుల సంచారం పెరిగింది. ఇ టీవల వరుసగా ఎక్కడో ఓ చోట బెబ్బులి తారసపడుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుంచి పెన్‌గంగ దాటి వచ్చిన పులులు నెలల తరబడి జిల్లాలోనే తిష్ట వేస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల శివారులో సంచరిస్తూ పశువులపై పంజా విసురుతున్నాయి. ఈక్రమంలో పశువులకాపరులు, చేలకు వెళ్లేందుకు రైతులు,కూలీలు జంకుతున్నారు. సరిహద్దు మండలాల్లోనే.. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులులు జిల్లాలోని భీంపూర్, తాంసి, తలమడుగు, బజార్హత్నూర్తో పాటు బోథ్ మండలాల్లోనే ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ మండలాల్లో అటవీప్రాంతం ఎక్కువగా ఉండటంతో మాకాం వేస్తున్నట్లు తెలుస్తోంది. తరచూ సమీప గ్రామాల పంటచేలకు వస్తూ పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. అటవీశాఖ అప్రమత్తం.. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో వరుసగా పులులు సంచరిస్తుడటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. విషయం తెలియగానే బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేస్తూ పులి కదలికలు, జాడ కోసం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వేటగాళ్ల ద్వారా టైగర్‌కు ఎలాంటి అపాయం కలగకుండా ప్రత్యేక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు సైతం అవగాహన కల్పిస్తున్నారు. చేలకు గుంపులుగా వెళ్లాలని, అటవీ జంతువులు, పులి కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు. -
మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం
ఆదిలాబాద్‌టౌన్: మాదకద్రవ్యాలతో జీవితా లు నాశనం అవుతాయని డీఎల్ఎస్ఏ కార్యదర్శి హుస్సేన్ హుస్సేన్ అన్నారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలతో పాటు చట్టాలు, న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, ఓటీపీ, పాస్వర్డ్ తదితర వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూ చించారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం ద్వారా అందుతున్న న్యాయ సేవలు, ప్రజలకు లభించే ఉచిత న్యాయ సాయం తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
స్వయంగా రోడ్డెక్కి ట్రాఫిక్ క్లియర్ చేయించిన ఎమ్మెల్యే
విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆరోగ్యం బాగా లేకపోయిన 3 గంటల పాటు ఎండలో నిలబడి స్వయంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం కుప్టి బస్టాప్ సమీపంలో భారీ వాహనాల రాకపోకల కోసం జేసీబీ సాయంతో తాత్కాలిక దారి మళ్లింపు పనులు దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, హైవే అధికారులు సమస్యను పట్టించుకోక పోవడంతోనే నియోజకవర్గ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కుప్టి బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు త్వరలోనే హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి హైవే అధికారులతో సమావేశమవుతానని తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ సాయంత్రం చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించారు. -
కేసీఆర్ రాజీనామా చేయాలి
కై లాస్‌నగర్: పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీల అమలులో విఫలమయ్యారని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌జాదవ్ ఆరోపించారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగానూ విఫలమైన ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాతీర్పును ఎదుర్కొవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేడ్కర్‌చౌక్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి , ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మాని నిరుద్యోగం, రైతు సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి వంటి అంశాలపై చర్చకు రావాలని సవాలు విసిరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు సాజిద్‌ఖాన్, సుజాత, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భవ్య క్షేత్రంగా బాసర
భైంసా: గోదావరి తీరాన కొలువైన జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. దేశంలోనే ప్రఖ్యాతగాంచిన బాసరను భవ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆలయానికి రూ. 354 కోట్లు, పుష్కరఘాట్లకు రూ.20 కోట్లు మొత్తం రూ.374 కోట్ల నిధులు కేటాయించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలికవసతుల కల్పన, సుందరీకరణ తదితర ప నులు చేపట్టనున్నారు. పుష్కరఘాట్ల అభివృద్ధి, పు నరుద్ధరణతో పాటు పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్ తదితర వంటివి మెరుగుపర్చనున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉద యం 10.50 గంటలకు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భక్తులకు మరింత సేవలుసరస్వతీ అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అక్షరాభ్యాసం కోసం చిన్నారులతో వచ్చే కుటుంబాలతో క్షేత్రం నిత్యం సందడిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులతో భక్తులకు మెరుగైన వసతులు అందుబా టులోకి రానున్నాయి. ఆలయ అభివృద్ధితోపాటు సుందరీకరణ జరిగితే ఇక్కడ భక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది.స్థానికంగా వాణిజ్యం, రవాణా రంగాలకు కూడా పర్యాటకానికి ఊతం లభించనుంది. ఆలయ నమూనా చిత్రంబాసర సరస్వతీ అమ్మవారు మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆది వారం బాసర పర్యటన నేపథ్యంలో పకడ్బందీ గా ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం కలెక్టర్ పరిశీలించా రు. పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అధికారులు, తహసీల్దార్లు, ఆలయ ఈవో అంజనాదేవి ఉన్నారు. -
మథుర.. స్పెషల్
గిరిజన తెగకు చెందిన మథుర లబానాలకు జిల్లా పుట్టినిల్లుగా మారింది. సంచార జీవ నం క్రమంగా తగ్గి ఏజెన్సీ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయం, పశుపోషణ వీరి జీవనాధారం. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు వేషధారణతో ప్రత్యేక గుర్తింపు పొందిన వీరిపై ఈ వారం సండే స్పెషల్. – ఇచ్చోడశ్రీకృష్ణుడు ఇలవేల్పుగా..ప్రత్యేక వస్త్రధారణ మథుర మహిళలు సంప్రదాయ వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రంగురంగుల వస్త్రాలతోపాటు వెండి, ఇత్తడితో చేసిన ఆభరణాలు ధరిస్తారు. చేతులకు కడియాలు, చెవులకు పెద్ద సైజు రింగులు, మెడలో పూసల దండలు కనిపిస్తాయి. పొడవాటి జుట్టుతో కూడిన అలంకరణతో పాటు చీర కట్టు మరో ప్రత్యేకత.వీరు శ్రీకృష్ణుడిని పూజిస్తారు. కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. అలాగే హోలీ పండుగను రంగులతో పాటు సంప్రదాయ నృత్యాలతో ఘనంగా జరుపుకుంటారు. తమ పూర్వీకుల చరిత్రను, ప్రకృతిని, దేవుళ్లను కీర్తిస్తూ లబానా భాషలో పాటలు పాడుతారు. బండారాలోనూ భాగస్వాములవుతారు. తీజ్తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. శ్రావణమాసంలో రాఖీపౌర్ణమి నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగలో మహిళలు గోధుమలను వెదురు బుట్టలలో వేసి పెంచుతారు. తొమ్మిది రోజుల పాటు సంప్రదాయ కార్యక్రమాలను పెళ్లికాని యువతులు నిర్వహిస్తారు.సంస్కృతిని కాపాడుకుంటున్నాం..అనాదిగా వస్తున్న మథుర సంస్కృతిని తరాలుగా కాపాడుకుంటున్నాం. ఆధునికత పెరుగుతున్నా సంప్రదాయాలను కొనసాగిస్తున్నాం. భావితరాలకు అందిస్తున్నాం. – నిస్తే దర్యావ్సింగ్ మహరాజ్, మాంజిరతండా, బజార్హత్నూర్ మండలం పండుగలప్పుడు ఊరంతా సందడి..మా ఇలదైవం శ్రీ కృష్ణుడు. కృష్ణాష్టమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. తీజ్తో పాటు బండారా వేడుకలను కోలహలంగా నిర్వహించుకుంటాం. ఈ పండుగలప్పుడు బంధువులతో ఊరంతా సందడిగా ఉంటుంది. – సాబ్లె ప్రతాప్‌సింగ్, నేరడిగొండ ఆటపాటలకు పెద్దపీటమా గ్రామాల్లో ఆటపాటలకు పెద్దపీట ఉంటుంది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అంతా కలిసి ఉత్సహంగా పాల్గొంటాం. పండుగలను ఊరంతా కలిసి ఓకే చోట జరుపుకుంటాం. – నారాయణ్‌సింగ్, లింగట్ల, నేరడిగొండ మండలం సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు -
ఇన్స్టాంట్ ప్రచారం!
సాక్షి, మంచిర్యాలడెస్క్: జెన్‌జీ.. జెన్ ఆల్ఫా ఎవరైనా కావొచ్చు.. అందరి చేతుల్లోనూ సెల్‌ఫోన్ ఆరో వేలుగా మారింది. యువత సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తమ అభిప్రాయాలు, సలహాలనూ పంచుకుంటోంది. ఇటీవల కాలంలో ఇన్‌స్ట్రాగాం వినియోగం విపరీతంగా పెరిగింది. అందుకే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా నియోజకవర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇన్‌స్ట్రాగాంను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా క్షణాల్లో తమ ఖాతాల్లో పోస్టు చేయిస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిఇన్స్ట్రాగాంతోపాటు ఇతర సామాజిక మాధ్యమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తదితర పార్టీల నాయకులూ భారీసంఖ్యలోనే ఉ న్నారు. అందరూ సోషల్‌మీడియా ఖాతాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిలో చాలామంది సోషల్ మీడియాపై అవగాహన ఉన్నవారితో ఖా తాలు నిర్వహిస్తున్నారు. పర్యటనల్లో రాజకీయ కా ర్యక్రమాలు చిత్రీకరణకు ఫొటో, వీడియోగ్రాఫర్లు వెంటే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయా కార్యక్రమాలు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. వ్యాపారంలోనూ..వ్యాపారం ఏదైనా సరే విభిన్నమైన ప్రచారం చేస్తే ఆకట్టుకోవచ్చు. అందుకే చాలామంది వ్యాపారులు తమ వస్తువులకు సంబంధించిన వివరాలతో వీడియోలు చేస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తూ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.పేరు ఫాలోవర్లు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ 86,000 ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ 56,500 ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, నిర్మల్ 46,500 మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి 39,600 ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బోథ్ 32,900 పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ 25,400 మాజీ మంత్రి జోగు రామన్న 22,400 ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు, మంచిర్యాల 21,400 ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ 19,400 ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఖానాపూర్ 11,700ఇన్‌స్ట్రాగాంలో ఫాలోవర్లతో టాప్ 10లో ఉన్నవారు పదివేలలోపు..ఇన్‌స్ట్రాగాంలో ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులను ప్రజలు భారీ సంఖ్యలోనే అనుసరిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును 10వేలలోపు మంది ఫాలో అవుతున్నారు. ఇది జెన్‌జీ యుగం. సాంకేతిక పరిజ్ఞానా న్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే కాలం చెల్లినవారవుతారు(అవుట్‌డేట్). ఇప్పుడు యువత ఇన్‌స్ట్రాగాంలో హల్చల్ చేస్తోంది. మనం కూడా ఆ బాట పట్టాలి. ఇన్‌స్ట్రాగాం ఖాతాలు తెరిచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి. – ఇదీ ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం -
విద్యుత్ షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి
జన్నారం: విద్యుత్ షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఈ ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం గ్రామానికి చెందిన మహ్మద్ వలియోద్దీన్ (45) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం కాలనీలోని ఓ ఇంట్లో కరెంట్ మోటారుకు వైరు బిగిస్తున్నాడు. ఈక్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో షాక్ గురై ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు సీపీఆర్ చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబీకులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఉదయ్‌కిరణ్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మన్నూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం..మన్నూర్ గ్రామానికి చెందిన కేంద్రే విజయ్ (23) శనివారం రాత్రి దాబాలో భోజనం చేసి బైక్‌పై తిరిగివస్తున్నాడు. మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం
ఆదిలాబాద్‌టౌన్: ఆదర్శ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మంది రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినో త్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. భార త మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం జిల్లాస్థాయిలో ఉత్తమపురస్కారాలకు ఎంపికై న ఉపాధ్యాయులను సన్మానించారు. జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్విని యోగం చేసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన బో ధన అందించాలని సూచించారు. గతేడాది జిల్లాకు చెందిన 60మంది విద్యార్థులు బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం పొందారని ఈ ఏడాది ఆ సంఖ్య 100కు చేర్చేలా ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. గ్రా మాల్లో మద్యం దుకాణాలు లేకుండా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, ఇందుకు యంత్రాంగం సహకరిస్తుందని చెప్పారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. తన ఎదుగుదలలో గురువుల ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మా ట్లాడుతూ, విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించేలా బోధన సాగాలన్నారు. వచ్చే ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులను అధికారులే ఎంపిక చేస్తారని డీఈవో మాధవి తెలిపారు. జాతీ య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంతోష్, ఉత్తమ పురస్కార గ్రహీత లావణ్య తమ బోధనా వి ధానంలో తీసుకొచ్చిన మార్పులను వివరించారు. ఇందులో గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కలీం అహ్మద్, ఏఎంవో లక్ష్మణ్, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
బాసర: కుటుంబ సమస్యలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను నిర్మల్ జిల్లా బాసర పోలీసులు కాపాడి కుటుంబ సభ్యుల కు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. సికింద్రాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన షేన్ సవిత(30) కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహ త్య చేసుకోవాలని శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు బాసర గోదావరి నదిలో దూకింది. నీటిలో తు అక్కడ తక్కువ ఉండగా.. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గుర్తించి రక్షించారు. బాసర పోలీ సుస్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె సోదరుడు దాడెల్ల రాజేశ్‌కు అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో దీపక్ తెలిపారు. -
కుంగిన కుప్టి.. తోడైన ప్రమాదం
నేరడిగొండ/ఇచ్చోడ: నిర్మల్–ఆదిలాబాద్ 44వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలకు తరచూ ఆటంకం ఎదురవుతోంది. మండల పరిధిలోని కుప్టి వద్ద ఉన్న పాత వంతెన కుంగిపోవడంతో అధికారులు ఇటీవల దానిపై రాకపోకలను నిలిపివేశారు. ఇరువైపులా రాకపోకలు సాగించే వాహనాలన్నింటినీ ఒకే వంతెన మీదుగా మళ్లించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనికితోడు శుక్రవారం రాత్రి బ్రిడ్జి వద్ద టమాటా లారీ, సిమెంట్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పక్షం రోజులుగా ఇదే దుస్థితి.. వంతెన కుంగిపోయి 15 రోజులు గడుస్తున్నా నేషనల్ హైవేస్ అథారిటీ(ఎన్హెచ్ఏఐ) అధికారులు, సంబంధిత యంత్రాంగం గానీ ఎలాంటి మరమ్మతు చర్యలు చేపట్టకపోవడంపై ప్రయాణికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే వంతెన పైనుంచి భారీ వాహనాలు, బస్సులు, కార్లు వెళ్లాల్సి రావడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు.ప్రమాదానికి గురైన వాహనాలు, చిందరవందరగా పడి ఉన్న టమాటాలుబ్రిడ్జిపై రెండు వాహనాలు ఢీ ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలుకుప్టి జాతీయ రహదారిపై గల బ్రిడ్జిపై రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శుక్రవారం రాత్రి 11 దాటాక జరిగిన ఈ ఘటనలో గాయాలపాలైన డ్రైవర్ శనివారం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాగపూర్ వైపు టమాటా లోడ్‌తో వెళ్తున్న ఐచర్ వాహనం ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న సిమెంట్ క్రషర్ వాహనం కుప్టి జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో టమాటాలు చెల్లాచెదురైపోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐచర్ వాహన డ్రైవర్ మహమ్మద్ యూసుఫ్(38) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందగా, ఐచర్ క్లీనర్, క్రషర్ వాహన డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
ఆదిలాబాద్: 22–ఏ భూముల విషయంలో రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. 22–ఏ భూముల జాబితా నుంచి రైతుల భూములను తొలగించి, వారికి సంపూర్ణ హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ‘చలో ఇందిరాపార్క్’ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలంతా 22–ఏ భూముల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి, రైతుల తరఫున బలంగా తమ వాణిని వినిపిస్తామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
చోరీలకు పాల్పడిన నిందితుడి అరెస్టు
నిర్మల్‌టౌన్: చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బాగులవాడకు చెందిన మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, నిర్మల్‌రూరల్ మండలం చిట్యాలకు చెందిన కల్గద్దవార్ శ్రీకాంత్, హైదరాబాద్‌లోని హల్దియాబాద్కు చెందిన సారా సాయికిరణ్ పరస్పరం పరిచయంతో ఒక్కటయ్యారు. స్నేహం కాస్తా చోరీలకు దారితీసింది. కలిసి ఇళ్లు, దుకాణాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. వరుస చోరీలపై టైగర్స్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక దృష్టిపెట్టింది. సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను గుర్తించింది. మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, కల్గద్దవార్ శ్రీకాంత్‌ను గతనెల 17న పట్టుకుంది. పరారీలో ఉన్న సాయికిరణ్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారించగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, గన్నవరం పోలీస్స్టేషన్న్పరిధిలో చోరీలు చేసినట్లు అంగీకరించారు. జిల్లాలో నమోదైన 25 చోరీ కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు తేలింది. 16 కేసులకు సంబంధించిన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. 12 కిలోల వెండి ఆభరణాలు, రూ.67 వేల నగదు, నిస్సాన్మాగ్నైట్ కారు, మెల్టింగ్ మెషిన్న్, గ్యాస్ పైప్ మెషిన్న్ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, సమ్మయ్య, ఎస్సైలు లింబాద్రి, గణేశ్, శ్రీకాంత్, అశోక్, ఎస్.కె.గఫార్, హెడ్‌కానిస్టేబుల్ జగన్‌సింగ్, పీసీలు తిరుపతి, సతీశ్ తదితరులను ఎస్పీ అభినందించారు. ఆలయాలే టార్గెట్..పట్టణంలోని దివ్యనగర్, బంగల్పేట్, శాస్త్రినగర్, సారంగాపూర్ మండలం వంజర, ఆలూర్, నిర్మల్ రూరల్ మండలం కౌట్ల–కె, లోకేశ్వరం మండలం కిష్టాపూర్, మామడ మండలం, లక్ష్మణచాంద మండలం వడ్యాల్లోని ఆలయాల్లో జరిగిన చోరీలో నిందితుల ప్రమేయం ఉంది. వీటితోపాటు ఇందిరానగర్, ప్రియదర్శినినగర్, శాస్త్రినగర్, ఏఎన్న్రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ కేసుల్లోనూ వీరి పాత్ర ఉన్నట్లు తేలింది. -
విద్యారంగాన్ని విస్మరించి విజయోత్సవాలా?
కై లాస్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఆరు గ్యారెంటీల అమలులోనూ విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. విద్యార్థులు, యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలతో పాటు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు వాగ్మారె ప్రశాంత్, బట్టు సతీశ్, కరుణ, సాబీర్, హరీష్, శృతి, త్రిష, పల్లవి, రఘు, సాయి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
నెన్నెల: కట్టుకున్న భార్యను హత్యచేసిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం బెల్లంపల్లిలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ కేసు వివరాలు వెల్లడించారు. నెన్నెలలోని కాపువాడకు చెందిన తోట సబిత, తోట మల్లేశ్ భార్యాభర్తలు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో ఈనెల 2న సబితను హత్య చేసి పరారయ్యాడు. గతంలో రెండుసార్లు హత్యకు యత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ఘటన అనంతరం దుస్తులు మార్చుకుని పరారైన మల్లేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంతో శనివారం సాయంత్రం తాళ్లగురిజాల వై జంక్షన్ వద్ద అదుపులో తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. నెన్నెల ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. తల్లి కాటికి.. తండి జైలుకు..తల్లి కాటికి.. తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు ఒంటరి వారయ్యారు. తాతయ్య, అమ్మమ్మ సంరక్షణ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పెద్ద మనుషులకే ఒకరు సాయం చేసే స్థితిలో ఉండగా ఈ పిల్లల భారం వారిపై పడింది. అమ్మప్రేమకు దూర మై నాన్న జైలు పాలు కావడంతో తమను ఎవరు చూసుకుంటారో తెలియని అయోమయంలో పిల్ల ల బాల్యం మిగిలిపోయింది. వారి చదువుపై తల్లికి ఎంతో శ్రద్ధ ఉండేదని అమ్మమ్మ, తాతయ్య తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చిన పిల్లలను బాగా చదివించాలనేది ఆమె కోరిక నెరవేరకుండానే కన్నుమూసిందని పేర్కొన్నారు. -
విద్యాప్రమాణాలు పెంచాలి
ఉట్నూర్‌రూరల్: ఉపాధ్యాయులు స్వీయప్రేరణతో విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో 133 ఆశ్రమ పాఠశాలలు, 900 పైచిలుకు ప్రాథమిక పాఠశాలలు, గురుకులాలు, ఈఎంఆర్‌ఎస్‌లో తొలిసారిగా ఎఫ్ఎల్ఎన్ అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు సులభపద్ధతిలో పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. ఏపీవో భాస్కర్, డిప్యూటీ డీఈవో చందన్, గిరిజన క్రీడా అధికారి పార్థసారథి, డీటీడీవోలు, హెచ్ఎంలు విద్యార్థులు పాల్గొన్నారు. -
పట్టణ అభివృద్ధికి కృషి
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందుకోసం రూ.154 కోట్ల తో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామ ని, త్వరలోనే రూ.50 కోట్ల నిధులు విడుదల కానున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు ట్రాక్టర్లను అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్‌తో కలిసి శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మున్సి పాలిటీలో పారిశుధ్య నిర్వహణను మరింత మె రుగుపరిచేందుకు అవసరమైన వాహనాలను సమకూరుస్తున్నామని అన్నా రు. ప్రభుత్వం మున్సిపాలిటీలకు కేటాయించిన టీయూఎఫ్ఐడీసీ నిధుల్లో రూ.18 కోట్లు మంజూరయ్యాయ ని, వాటితో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. మరోరూ.43 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ క మిషనర్ ఏ.జగదీశ్వర్‌గౌడ్ , శానిటరీ ఇన్స్పెక్ట ర్ శంకర్, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు ఇజ్జ గిరి సంజయ్, వెనగంటి ప్రకాష్, కౌన్సిలర్లు బొడిగం శ్రీకాంత్, ఆత్రం వెంకటేష్, నాయకులు బండారి సతీష్, అన్నెల వసంత్, బొంపల హనుమాండ్లు తదితరులు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
సాక్షి,ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్లకు సంబంధించి భారత పత్తి సంస్థ (సీసీఐ) సన్నద్ధమవుతుంది. ప్రణాళిక మేరకు కొనుగోలు కేంద్రాలు, మౌలిక వసతుల ఏ ర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించింది. జిల్లాలో అక్టోబర్ మూడో వారంలో కొనుగోళ్లు షురూ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ వానా కాలం పత్తి పంట అంచనా లకు అనుగుణంగా సాగైంది. అక్టోబర్‌లో దిగుబడులు చేతికందనున్నాయి. ఈమేరకు సీసీఐ ఏర్పాట్లను ప్రారంభించింది. జిల్లాలో గతేడాది మా దిరిగానే 11 కేంద్రాల ద్వారా పత్తిని సేకరించనున్నారు. ఆదిలాబాద్‌లో 2, బోథ్, నేరడిగొండ, పొచ్చెర, సొనాల, ఇంద్రవెల్లి, నార్నూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, బేలలో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులతో అనుసంధానం రైతులకు ఇబ్బందులు కలగకుండా సీసీఐ ఏటా జిల్లాలో జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులను అద్దెకు తీసుకుని అక్కడే పత్తి కొనుగోళ్లు చేపడుతుంది. ఆధునిక జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులను ఇటీవల అద్దెకు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను సీసీఐ ప్రారంభించింది. సేకరించిన పత్తి ద్వారా అదే జిన్నింగ్‌లో పత్తి బేల్స్ తయారు చేయడం జరుగుతుంది. వాటిని భద్రపర్చడానికి గోదాంలను అద్దెకు తీసుకుంటుంది. గతేడాది జిల్లాలో 34 మిల్లులను సీసీఐ అద్దెకు తీసుకుంది. లోడింగ్ ఆన్లోడింగ్, రవాణాకోసం కూలీలను నియమించింది. ఇలా ఒక్కో ప్రక్రియను కొనుగోళ్లు మొదలు పెట్టే సరికి పూర్తి చేసేలా సీసీఐ ప్రణాళిక ప్రకారం సాగనుంది.మద్దతు ధర పెంపు ..క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగానే..కేంద్ర ప్రభుత్వం పత్తికి సంబంధించి ఈ ఏడాది మద్దతు ధర పెంచింది. గతేడాది పొడువు పింజ పత్తి క్వింటాల్‌కు రూ.8,110 ఉండగా ఈ సారి రూ.557 పెంచారు. గతేడాదితో పోల్చితే 6.9 శాతం పెరుగుదల ఉంది. పత్తిలో తేమ శాతం 8నుంచి 12 మధ్య ఉంటేనే నిర్ణీత మద్దతు ధర లభిస్తుంది. తేమ శాతం పెరిగితే నిబంధనల ప్రకారం సీసీఐ ధరలో కోత పెడుతుంది. సేకరించిన పత్తికి సంబంధించి నగదును నేరుగా రైతుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలోకి డీబీటీ పద్ధతి ద్వారా జమ చేస్తుంది.పంటల సాగు విస్తీర్ణానికి సంబంధించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్రాప్ బుకింగ్ ఏటా చేపడుతారు. కాటన్ ఫార్మర్ యాప్‌లో నమోదు చేసిన విస్తీర్ణం, క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగానే సీసీఐ కొనుగోళ్లు సాగుతాయి. అక్టోబర్‌లో పంట చేతికి వచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్‌లో చోరీకి పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లా కై తారానికి చెందిన కుమావత్ గుందారం, కుమావత్ ఘన్‌శ్యామ్, కుమావత్ మాణిక్‌చంద్, కుమావత్ లక్ష్మణ్, హైదరాబాద్‌లోని పటాన్చెరు బండ్లగూడకు చెందిన తేజ్పాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆదిలాబాద్‌లోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్ వద్ద రెక్కీ నిర్వహించారు. ఇటీవల రాత్రి సమయంలో గడ్డపారతో షాప్ తాళాలు పగులగొట్టి లోపల వివిధ రకాల సిగరెట్ బాక్సులతోపాటు కౌంటర్లోని నగదు చోరీ చేశారు. హైదరాబాద్‌లోని పఠాన్‌చెరులో వారికి పరిచయమైన వ్యక్తికి విక్రయించేందుకు ప్రయత్నించారు. వీటి విలువ సుమారు రూ.5.35 లక్షలు ఉంటుంది. కొంత మొత్తానికి సిగరెట్ బాక్సులు విక్రయించి, వచ్చిన నగదును నలుగురు పంచుకున్నారు. మిగిలినవి విక్రయించేందుకు, ఆదిలాబాద్‌లో మరో చోరీకి పాల్పడే ఉద్దేశంతో తిరిగివచ్చారు. వాటిని విక్రయిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకుంటుండగా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంబడించి అదుపులో తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 27 అమెరికన్ సిగరేట్ బాక్స్‌లు, 10 కింగ్ సైజ్, లైట్ 11, స్మాల్ గోల్డ్ 14, బ్రిస్టల్14, ఒకటి క్లాసిక్ రెడ్, ఓల్డ్ అడిషన్ 21, రెండు ఐస్ బస్ట్, కనెక్ట్ సిగరేట్ ఒక బాక్స్‌తో పాటు రూ.60వేల నగదు, చోరీకి వినియోగించిన మారుతీ కారుతోపాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
జామిడిలో మద్యనిషేధం
తాంసి: మండలంలోని జామిడి గ్రామంలో గ్రామస్తులు శనివారం మద్యనిషేధం కోసం నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అశోక్ అధ్యక్షతన గ్రామస్తులు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయని, యువ త చెడుదారి పట్టకుండా మద్యనిషేధం సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామస్తులు, మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మద్య నిషేధం తీర్మానం చేస్తున్న గ్రామస్తులు -
● జిల్లాలో 1,50,425 మందికి గాను ఇప్పటి వరకు ఇచ్చింది 49,955 మందికే.. ● నేడు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు
సర్.. నోటీసుల జారీ స్లో!కై లాస్‌నగర్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా అన్‌మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లకు సంబంధించిన నోటీసుల జారీ ప్రక్రి య జిల్లాలో నెమ్మదిగా సాగుతుంది. జిల్లావ్యాప్తంగా 1,50,425మంది ఓటర్లు ఆయా కేటగిరీల్లో ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు వారందరికీ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు నెలాఖ రు వరకే అందజేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అందులో సగం మందికి కూడా ఇవ్వలేదు. నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణ కూడా నెమ్మదిగానే సాగుతుంది. ఇలాగే కొనసాగితే గడువులోపు ప్రక్రియ పూర్తికావడం కష్టమే. కాగా ఓటర్ల సౌకర్యార్థం శని, ఆదివారాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. నెమ్మదిగా ప్రక్రియ.. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు జూలైలో ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలు సేకరించారు. 2002 జాబితాతో ప్రస్తుత ఓటర్ల వివరాలు మ్యాపింగ్ కానటువంటి, పేరు, ఇంటిపేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా వంటి వివరాలు తప్పుగా ఉన్న వారిని అనామలిస్గా గుర్తించారు. ఇలాంటి వారు జిల్లావ్యాప్తంగా 1,50,425 మంది ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 295 పోలింగ్ కేంద్రాల పరిధిలో 85,525 మంది అన్‌మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లు ఉండగా వీరిలో 8201 మందికి మాత్రమే నోటీసులు జారీ చేశారు. అలాగే బోఽథ్ నియోజకవర్గ పరిధిలోని 305 పోలింగ్ కేంద్రాల పరిధిలో 64,900 మంది ఓటర్లున్నట్లుగా గుర్తించిన అధికారులు వీరిలో 41,754 మందికి నోటీసులు జారీ చేశారు. ఆదిలాబాద్‌తో పోలిస్తే బోథ్‌లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతుంది. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలున్నాయి. విచారణలోనూ తీవ్ర జాప్యం.. నోటీసుల జారీలోనే కాదు ఓటర్ల విచారణ ప్రక్రియలోనూ తీవ్రజాప్యమవుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 85,525 మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 662 మంది విచారణ మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇక బోథ్‌లో 64,900 మందికి నోటీసులిచ్చి విచారించాల్సి ఉండగా 4,615 మందిని మాత్రమే విచారించినట్లుగా చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్ఈసీ ప్రకటించిన గడువులోపు ప్రక్రియ పూర్తవడం గగనమే అనిపిస్తోంది. నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు .. ఓటర్ల సౌకర్యార్థం ఈనెల 5, 6 తేదీల్లో తొలి విడత, 12, 13తేదీల్లో రెండో విడత ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 600 పోలింగ్ కేంద్రాల్లో ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు బీఎల్వోలు అందుబాటులో ఉండనున్నారు. ఓట ర్లు నేరుగా తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ముసాయిదా జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరు లేకుంటే ఫారం–6 ద్వారా ఓటరుగా పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఫారం–7, 8 ద్వారా అభ్యంతరాలు, ఫిర్యాదులు అందజేసే అవకాశం కల్పించనున్నారు.సద్వినియోగం చేసుకోవాలిపారదర్శక ఓటర్ల జాబితా తయారీలో భా గంగానే ఎస్ఈసీ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు బీఎల్వో లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. జాబితాలో పేరు లేనటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరా లు, ఫిర్యాదులుంటే కూడా అందించవ చ్చు. బీఎల్వోలు వాటిని పరిశీలించి సరిచేసే దిశగా చర్యలు తీసుకుంటారు.నోటీసుల జారీప్రక్రియ వేగవంతం చేసి విచారణ సై తం సత్వరం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – ఎస్.రాజేశ్వర్, అడిషనల్ కలెక్టర్ జిల్లాలో.. పోలింగ్ కేంద్రాలు 600 బీఎల్ఓలు 600 మొత్తం ఓటర్లు 4,03,625 నోటీసులను అందుకున్న వారు 48,955 విచారణకు హాజరైన ఓటర్లు 5277 -
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఆదిలాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో వాసుదేవుని దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. తమ చిన్నారులను శ్రీకష్ణుడు, గోపికల వేషధారణతో తీర్చిదిద్ది తల్లిదండ్రులు మురిసిపోయారు. జిల్లా కేంద్రంలోని రాంపూర్ సమీపంలో గల ఇస్కాన్ ఆలయంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శ్రీ సత్యభామారుక్మిణి సమేత గోపాలకృష్ణ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో మఠాధిపతి యోగానంద సరస్వతిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అడ్డగోలుగా అక్రమాలు!
సాక్షి,ఆదిలాబాద్: గత జూలైలో జిల్లాలో ఆర్అండ్బీ ఈఈగా వ్యవహరిస్తూ పదోన్నతి పొంది నిజామాబాద్ ఎస్ఈగా బదిలీపై వెళ్లిన ఎస్.నర్సయ్య అవి నీతి బాగోతం బట్టబయలైంది. జిల్లాలో ఆర్థిక అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో అంతర్గతంగా విజిలెన్స్ విచారణ జరపడం, ప్రాథమికంగా రుజువు కావడంతో సస్పెండ్ వేటు వేశారు. సరిగ్గా ఆయన ఉద్యోగ విరమణ రోజే అంటే.. ఆగస్టు 31న ఆయనపై వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. ఆర్అండ్బీ ఉన్నతాధికారి నర్సయ్య జిల్లాలో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా సుమారు నాలుగేళ్ల పాటు విధులు నిర్వహించారు. మధ్యలో నిర్మల్ జిల్లాలో కూడా కొద్దికాలం ఇన్చార్జి ఈఈగా వ్యవహరించా రు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆయనకు ఈ ప్రాంతంలోని కాంట్రాక్టర్లతో సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఆ శాఖలో ఉంది. దీంతోనే ఆయన ఆర్థిక అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. తాజాగా ఈ విషయం ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. టెండర్లలో అవకతవకలు అధికారి నర్సయ్య జిల్లాలో పనిచేసినకాలంలో ఇక్క డ చేపట్టిన పలు రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణ టెండర్లలో నిబంధనలు ఉల్లంఘించి తన కు కావాల్సిన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేలా ప్ర క్రియను మళ్లించారనే ఆరోపణలున్నాయి. అర్హత లేని, సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిబంధనలు సవరించి మరీ పనులు కట్టబెట్టడం ద్వారా భారీగా కమీషన్లు కుదుర్చుకోవడం జరిగిందనే విమర్శలున్నాయి. రహదారులు, వంతెన నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పా టించకుండానే పనులు పూర్తి చేసినట్లు చూపి, క్షేత్రస్థాయి తనిఖీలు సరిగ్గా నిర్వహించకుండానే కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ బిల్లులు ఆమోదించి నిధుల దు ర్వినియోగానికి సహకరించారని విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నాణ్యత ప్రమాణాల తనిఖీ సరిగ్గా చేపట్టకుండానే ఆ పనులకు ఆమోదముద్ర వేసినట్లు చెప్పుకుంటున్నా రు. నాణ్యత పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయ ల బోగస్, అడ్వాన్స్ బిల్లులను కాంట్రాక్టర్లకు మంజూరు చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఏకంగా నిధులే మళ్లింపు.. ఆర్అండ్బీ శాఖకు కేటాయించిన అభివృద్ధి నిధుల ను, నిర్వహణ (మెయింటనెన్స్) గ్రాంట్లను నిర్దేశిత పనులకు కాకుండా ఇతర పనుల పేరిట కాగితాల పై రికార్డు చేసి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అనుమతులు లేని పనులను మంజూరు చేయడం, శాఖాపరమైన విచారణలు ఎదుర్కొంటున్న సమయంలోనూ విధానపరమైన నిర్ణయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆర్అండ్బీ ఈఈ రమేశ్ పవార్‌ను వివరణ కోరగా, సస్పెన్షన్ వాస్తవమేనని, ప్రస్తుతం తాను స్థానికంగా అందుబాటులో లేనని, శనివారం వివరాలు తెలియజేస్తానని చెప్పారు. -
‘ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా...?’
నేరడిగొండ: రహదారి ప్రమాదాలు జరుగుతు న్నా సంబంధిత అధికారులు పట్టించుకోరా.. అంటూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. మండలంలోని కుప్టి హైవే (ఎన్‌హెచ్44)ను శు క్రవారం పరిశీలించారు. ఈ జాతీయ రహదారి కి కుప్టి వద్ద గుంతలు పడటం,రోజులు గడుస్తు న్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ని త్యం లక్షలాది వాహనాలు తిరిగే ఈ రహదారి పై గల బ్రిడ్జిపై సింగిల్‌వే చేయడంతో అనేక ప్ర మాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. సమాధానం రాకపోయినా, అధికా రులు పనులు పూర్తి చేయకపోయినా హైవే దిగ్బంధం చేస్తానని హెచ్చరించారు. -
ఉపాధ్యాయ వృత్తి నుంచే వచ్చా..
రాజకీయాల్లో ఎంతో మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వరకు ఎదిగారు. విజయవంతంగా పనిచేస్తున్నారు. నా గురువు సత్తయ్య రిజర్వేషన్‌తో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని టీచర్ ఉద్యోగం సాధించాను. తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టాను. విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఎల్లప్పుడు స్మరించుకుంటాను. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ కపటం, క ల్మశం లేకుండా..ఉపాధ్యాయులు కపటం, కల్మశం, స్వార్థం లేకుండా విద్యాబుద్ధులు నేర్పిస్తారు. వారు చెప్పిన పాఠాలతో ఈ స్థాయికి ఎదిగాను. అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పది. గురువులు సమాజ మార్గదర్శకులుగా నిలుస్తారు. నాకు ఇచ్చోడలో టీచర్ నారాయణ రెడ్డి బోధన చేశారు. చదువులో నిత్యం ప్రోత్సహించేవారు. ఇప్పటికీ ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటాను. – అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే విలువలతో కూడిన విద్య నేర్పించారు..నా విద్యాభ్యాసం ఆదిలాబాద్‌లోనే. ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. ఇంటర్, డిగ్రీ గవర్నమెంట్ కళాశాలల్లో పూర్తి చేశాను. మా గురువులు విలువలతో కూడిన విద్యను బోధించారు. తప్పు చేస్తే దండించేవారు. వారి మార్గదర్శకంలో ఈ స్థాయికి ఎదిగాను. ప్రస్తుతం సెల్ఫోన్లు, సోషల్ మీడియాతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. నేను సూపరింటెండెంట్ అయ్యేవరకు కూడా సెల్‌ఫోన్ ఉపయోగించలేదు. – డి.మాధవి, డీఈవో -
గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
రెబ్బెన: మహారాష్ట్రలోని బల్లార్షాలో గంజాయి కొనుగోలు చేసి రెబ్బెనలో విక్రయించేందుకు తీసుకొస్తు న్న వ్యక్తులను గురువారం పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో శుక్రవారం సీఐ సంజయ్ వివరాలు వెల్ల డించారు. ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రెబ్బెన బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు పో లీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా 130 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితులు రెబ్బెన మండలం జక్కులపెల్లికి చెందిన దాగం సందీప్, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన కొండగుర్ల రాజేంద్రప్రసాద్‌గా గుర్తించారు. నింది తులు జక్కులపెల్లికి చెందిన దుర్గం అభినేష్ అలి యాస్ చింటూతో కలిసి గురువారం మహారాష్ట్రకు వెళ్లి అక్కడ అజిత్ వికాస్ వద్ద 130 గ్రాముల గంజాయిని రూ.7వేలకు కొనుగోలు చేశారు. దాన్ని గంజాయి సేవించే అలవాటు ఉన్న రెబ్బెన మండలం జక్కులపల్లికి చెందిన పబ్బతి అనిల్, మేడి అంజయ్యతో పాటు మరికొంత మందికి విక్రయించేందుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది రవికుమార్, పీసీ నౌషద్‌లు ఉన్నారు. పెరట్లో గంజాయి సాగు సిరికొండ: సిరికొండ మండల కేంద్రానికి చెందిన గైక్వాడ్ రుక్మాబాయి తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇచ్చోడ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇంటి పెరట్లో కంది పంట మధ్య సాగు చేస్తున్న 46 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 136 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ రూ.4.60 లక్షలు, ఎండు గంజాయి విలువ రూ.3,400 ఉంటుందని తెలిపారు. గైక్వాడ్ రుక్మాబాయితో పాటు ఆమె కుమారుడు గైక్వాడ్ బాలాజీపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
పశువులు తరలిస్తున్న వాహనాలు పట్టివేత
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ ఏసీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహనాల్లో 13 ఆవులు, 17 దూడలు ఉండడంతో వాహనాలు నడుపుతున్న నక్క రాజ్‌కుమార్, షేక్ అహ్మద్, సుకే కుమార్, సహాయకులు షేక్ షఫి, షేక్ షాహీద్, ఓరగంటి రాజ్‌కుమార్, తాండ్ర శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ పశువులను ఆసిఫాబాద్ జిల్లా కౌటాల నుంచి జగి త్యాల జిల్లా రాజారాంపల్లె మార్కెట్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
క్రీడాకారులు కోలిండియా స్థాయిలో రాణించాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు కో లిండియా స్థాయిలో రాణించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ప్రగతి మైదానంలో ఏరియా స్థాయి డబ్ల్యూపీఎస్, జీఏ వా ర్షిక క్రీడలు మొదలయ్యాయి. మొదటిరోజు వాలీ బాల్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏరియా క్రీ డాకారులు గత సంవత్సరం సాధించిన పతకాల కంటే రెట్టింపు పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈసారి క్రీడా సామగ్రి కొనుగోలు కోసం ఏరి యాకు రూ.4.5 లక్షలు మంజూరు చేశామన్నారు. విన్నర్‌గా ఆర్కే5 గ్రూప్..వాలీబాల్ పోటీల్లో విన్నర్‌గా ఆర్కే 5 గ్రూప్, రన్నర్‌గా ఆర్కే7 గ్రూపు నిలిచిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.వీరభద్రయ్య, ఏరియా ఎస్ఓటు జీఎం కృష్ణప్రసాద్, డీజీఎం(పర్సనల్) ఎస్.అనిల్‌కుమార్, క్రీడల గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, కోఆర్డినేటర్ తోట సురేశ్, కెప్టెన్లు చిన్నయ్య, ఎం.శ్రీనివాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
పశువులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
నేరడిగొండ: రోల్మామడ టోల్‌ప్లాజా వద్ద విధుల్లో ఉన్న సిబ్బందిపైకి వాహనాలు ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు, అక్రమంగా గోవులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నేరడిగొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్ వివరాలు వెల్ల డించారు. ఈనెల 1న నేరడిగొండ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న మహీంద్రా బొలెరో టోల్గేట్లను ఢీకొడుతూ వేగంగా దూసుకెళ్లింది. టోల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిని చంపాలనే ఉద్దేశంతో వాహనాన్ని వారిపైకి తీసుకెళ్లారు. వెనుక వస్తున్న కంటైనర్ లారీ కూడా సైన్ కోన్లు, డివైడర్లను ఢీకొట్టి వేగంగా పరారైంది. టోల్‌ప్లాజా సూపర్వైజర్ ఎంపల్లి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా 3వ తేదీ తెల్లవారుజామున కుంటాల గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆదిలాబాద్‌లో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్ తాటిగూడకు చెందిన ఎండీ షఫీ ముదస్సిర్, గోపాల్ సింగ్ షెకావత్, మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన లారీ డ్రైవర్ ఫిర్దోస్ బేగ్, మహమ్మద్ హైదర్అలీ, క్షితిజ్ భీమ్రావు సేవట్కర్, యవత్మాల్కు చెందిన సందీప్ విఠల్ ముప్పిడివార్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహమ్మద్ మజార్, రాజు, రవి జగదీశ్ బాగ్డేల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతంలో దొంగిలించిన పశువులను లారీలో నిజామాబాద్ జిల్లా సతాపూర్ వైపునకు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి 24 ఎద్దులు, 23 ఆవులను మొత్తం 47 పశువులు స్వాధీనం చేసుకున్నారు. ఊపిరాడక మూడు పశువులు మృతిచెందగా, మిగిలిన 44 పశువులను సురక్షితంగా గోశాలకు తరలించారు. వీటితో పాటు బొలెరో, కంటైనర్ లారీ, 4 గ్రాముల గంజాయి, ఐఫోన్ 16 సహా పలు సెల్ఫోన్లు, రూ.6,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి బోథ్ జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఇచ్చోడ సీఐ రమేశ్ -
ఆధ్యాత్మిక కారిడార్
ఆచూకీ లేని భైంసా: చదువుల తల్లి కొలువైన బాసర.. ప్రకృతి అందాల సహస్రకుండ్.. రేణుకామాత, దత్తాత్రేయ క్షేత్రాలతో ప్రసిద్ధి చెందిన మాహోర్.. ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక– పర్యాటక కారిడార్ చేపట్టాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. తెలంగాణలోని బాసర నుంచి మహారాష్ట్రలోని మాహోర్ వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాసర నుంచి సహస్రకుండ్ జలపాతం వరకు సుమారు 76 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మాహోర్ వరకు 97 కిలోమీటర్లు ఉండగా మొత్తంగా సుమారు 173 కిలోమీటర్ల మార్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తే తెలంగాణ –మహారాష్ట్ర మధ్య కీలకమైన ఆధ్యాత్మిక –పర్యాటక మార్గంగా ఈ రహదారి మారే అవకాశం ఉంది. ప్రమాదాల మార్గం..ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాల్లోని ఘాట్ రహదారులు, మలుపులు, రోడ్డు పరిస్థితులు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సోమవారం మాహోర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న కుభీర్ మండలం పార్డీ (బి) గ్రామానికి చెందిన నలుగురు జీపు ప్రమాదంలో మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. గతంలో భైంసా మండలం సుంక్లి గ్రామానికి చెందిన ముగ్గురు మాహోర్ నుంచి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో ఆధ్యాత్మిక –పర్యాటక కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాసర –సహస్రకుండ్ –మాహోర్ను ఒకే పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తే మూడు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికే బాసర నుంచి భైంసా వరకు జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. ఇక భైంసా నుంచి మహారాష్ట్ర వైపు రహదారి అనుసంధానాన్ని కొనసాగిస్తూ మాహోర్ దిశగా నిర్మాణం చేపడితే ఈ ప్రాంలాల ముఖచిత్రం మారిపోతుంది. ప్రస్తుతం ఉన్న రహదారులను విస్తరించడం, అవసరమైన చోట కొత్త మార్గాలు నిర్మించడం, ఘాట్ ప్రాంతాల్లో రక్షణ గోడలు, క్రాష్ బ్యారియర్లు, హెచ్చరిక బోర్డులు, పార్కింగ్, అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రయాణం సురక్షితంగా మారుతుంది. భక్తులకు ఉపయోగకరం..నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి తీరాన కొలువైన శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం విద్యారంభం, అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని మాహోర్ రేణుకాదేవి ఆలయం, దత్తాత్రేయ క్షేత్రంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉంది. రేణుకాదేవి ఆలయాన్ని ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటిగా మహారాష్ట్ర పర్యాటక శాఖ పేర్కొంటోంది. వీటి మధ్యలోని సహస్రకుండ్ జలపాతం వర్షాకాలంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మిస్తే భక్తులు ఒకే ప్రయాణంలో ప్రకృతి అందాలు– ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారని పలువురు పేర్కొంటున్నారు. కేంద్ర మంత్రి దృష్టికి..బాసర–భైంసా జాతీయ రహదారిని మహా రాష్ట్ర వైపు విస్తరించి మాహోర్తో అనుసంధా నం చేయాలనే అంశాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ పలుమార్లు కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కేంద్రానికి సమగ్ర ప్రతిపాదన పంపి తే ఈ మార్గం రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఈ రహదారి నిర్మాణం కేవలం ప్రయాణ సౌకర్యం కోసం చేపట్టే ప్రాజెక్టుగా కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య భక్తి, పర్యాటకం, వ్యా పారం, సాంస్కృతిక సంబంధాలను బలోపే తం చేసే మార్గంగా మారుతుంది. -
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: జి ల్లాకి చెందిన యు వ క్రీడాకారుడు అట్టం జశ్వంత్ అథ్లెటిక్స్‌లో ప్రతి భ చాటుతూ జా తీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పుదుచ్చేరిలో నిర్వహించనున్న 37వ నేషనల్ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల హన్మకొండ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ –20 బాలుర రేస్‌వాక్ విభాగంలో అట్టం జశ్వంత్ బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డిబోజా రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్, శిక్షకులు వీజీఎస్ రాకేశ్, జ్యోతి స్వరణ్ క్రీడాకారుడిని అభినందించారు. -
పట్టుచీరపై తెలుగు వైభవం
బాసర: తెలుగు భాష గొప్పతనాన్ని చేనేత కళతో మేళవిస్తూ సిరిసిల్లకు చెందిన ఓ కళాకారుడు అద్భుతమైన పట్టుచీర నేశాడు. తెలుగు భాషకు మూలమైన 56 అక్షరాలను పట్టుచీరపై అందంగా పొందుపరిచాడు. శుక్రవారం మేళతాళాల మధ్య పద్మశాలీ సంఘం సభ్యులు ఈ చీరను ఆలయానికి తీసుకొచ్చి ఈవో అంజనాదేవి, ఆలయ స్థానాచా ర్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీ పూజారి, వేద పండితుల సమక్షంలో అమ్మవారికి సమర్పించారు. 35ఏళ్ల అనుభవం..నల్ల జగదీష్ గత 35 ఏళ్లుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్నారు. తన అనుభవంతో ఎన్నో వినూత్న వస్త్రాలు తయారు చేసిన ఆయన తెలుగు భాషకు సంబంధించిన 56 అక్షరాలను చేనేత చీరపై నేసి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి నల్ల పరంధాములు కూడా చేనేత రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని, ఆయన ఆశీర్వాదంతోనే తాను ఈ కళాఖండాన్ని రూపొందించినట్లు జగదీష్ తెలిపారు. తన తండ్రి కలలో సూచించినట్లుగా ఈ చీరను అమ్మవారికి సమర్పించాలనే సంకల్పంతో కుల, సత్రం ప్రతినిధుల సహకారంతో బాసర అమ్మవారికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో సత్రం అధ్యక్షుడు రాపోల్ సుధాకర్, కార్యనిర్వహక అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, ప్రధా న కార్యదర్శులు రమణ విశ్వం, జెంటిల్ శ్యామ్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేశ్‌గౌడ్, కొక్కుల గంగాధర్, మోరే సాయిలు, ఎలగందుల శ్రీనివాస్, ఓని స్వామి, రువ్విపోశెట్టి, మేకల అశోక్, అంకం రమేశ్ తదితర గ్రామ పద్మశాలీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 15 రోజులు నిష్ఠతో..సిరిసిల్ల వాస్తవ్యుడు నల్ల పరంధాములు కుమారుడు నల్ల జగదీశ్ నేత తన తండ్రి ఆశయాలు, ఆశీర్వాదంతో ఈ వినూత్న చీరను రూపొందించా రు. పొడవు ఆరు మీటర్ల 30 సెంటీమీటర్లు, వెడ ల్పు ఒక మీటరు 25 సెంటీమీటర్లు, 650 గ్రాముల బరువున్న ఈ చీరను చేనేత మగ్గంపై 15 రోజులపాటు నిష్ఠతో నేశారు. చీర మొత్తం తెలుగు అక్షరమాలతో కళాత్మకంగా తీర్చిదిద్దడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
ఆ ఇద్దరిని మరిచిపోలేను
ప్రాథమిక విద్యాభ్యాసంలో నా గురువు అమరేష్ గణిత బోధన తీరు నన్ను గణితం వైపు ఆకర్షించింది. ఆయన ప్రోత్సాహంతో మ్యాథ్స్‌లో పట్టు సాధించాను. ఇది జేఈఈలో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు తోడ్పడింది. మరో గురువు పవన్ ప్రోత్సాహంతో సివిల్స్‌లో టాపర్‌గా నిలిచాను. అమరేష్ సార్‌తో ప్రస్తుతం టచ్‌లో లేనప్పటికీ, పవన్ సార్‌తో అనుబంధం కొనసాగుతుంది. ఆ ఇద్దరిని జీవితాంతం మరిచిపోలేను. విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలంటే తల్లిదండ్రులతో పాటు గురువు పాత్ర ఎంతో కీలకం. – రాజర్షిషా, కలెక్టర్ మార్గదర్శకులుగా నిలవాలి ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలి. విద్యార్థి ఎదుగుదలలో టీచర్ల పాత్ర కీలకం. నేను ఈ స్థాయికి ఎదగడానికి మా గురువు జోగిందర్ కృషి ఎంతగానో ఉంది. 9, 10 తరగతుల్లో ఆయన జమ్ములో నాకు విద్యాబుద్ధులు నేర్పించారు. నా జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను ఎన్నటికీ మరిచిపోను. అప్పుడప్పుడు వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుంటాను. – అఖిల్ మహాజన్, ఎస్పీ నిస్వార్థ సేవకులు.. గురువులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు గురువులు నిస్వార్థంగా సేవ చేస్తారు. అందుకే సమాజంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు, శాస్త్రవేత్తలందరినీ తీర్చిదిద్దేది టీచర్లే. నా గురువు గంగారెడ్డి పాఠశాలలో ‘నువ్వు పెద్ద లీడర్ అవుతావని..’ ఎప్పుడూ చెప్పేవారు. వారు చేసిన బోధనలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ -
చెరువులో పడి బాలుడు మృతి
కుభీర్: ఎల్లమ్మ చెరువులో గత నెల 10వ తేదీన ఇద్దరు చిన్నారులు ఈతకు వెళ్లి మృతిచెందిన విషయం మరువక ముందే శుక్రవారం మరో బాలుడు చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవిదాస్ (16) శుక్రవారం ఉదయం గొర్రెలను మేపేందుకు ఎల్లమ్మ చెరువు కట్ట వద్దకు ఇతరులతో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం చెరువులో గొర్రెలు నీరు తాగుతుండగా ఒక గొర్రెపిల్ల నీటిలోకి వెళ్లింది. దానికి బయటకు తీసేందుకు నీటిలోకి వెళ్లి గుంతలో పడిపోయాడు. గమనించిన కాపరులు వెంటనే బయటకు తీయగా అప్పటికే బాలుడు మృతిచెందాడు. దేవిదాస్‌కు తల్లి, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు.. నిర్మల్‌టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చింతకుంటవాడ కాలనీకి చెందిన పోలకొండ లక్ష్మీనారాయణ వర్మ (50) శాంతినగర్‌లో జరిగిన శుభకార్యానికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా జయశంకర్ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే లక్ష్మీనారాయణ వర్మను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ఉండగా, సంతానం లేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాలువలో పడి యువకుడు.. ముత్తారం: మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సాయిరాం(21) ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడి శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై కథనం ప్రకారం.. సాయిరాం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖ మ్మంపల్లిలోని తమ బంధువు ఇంటికి చుట్టపుచూపుగా వచ్చాడు. పనిమీద ఖమ్మంపల్లి నుంచి హ రిపురం వచ్చి మళ్లీ ఖమ్మంపల్లికి తిరిగి వెళ్తున్న క్ర మంలో కేశనపల్లిలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద బైక్ అదుపుతప్పి కాలువలో పడి దుర్మరణం చెందాడు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ వివరించారు. కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య బజార్హత్నూర్: కడుపునొప్పి భరించలేక యువతి కోలపురి స్రవంతి(18) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన కోలపురి గంగన్న –అడెల్లబాయిల కూతురు స్రవంతి గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. గురువారం తల్లితండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గమనించి వెంటనే స్రవంతిని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది. తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. మృతురాలు బజార్హత్నూర్లోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మద్యానికి బానిసై ఒకరు.. ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని బృందావన్‌కాలనీకి చెందిన శివ్శెట్టి మన్మద్(32) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేవ్ జిల్లా ధర్మబాద్‌కు చెందిన శివ్శెట్టికి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన యువతితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ సభ్యులతో కలిసి బృందవన కాలనీలో నివాసముంటున్నాడు. ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. అనా రోగ్యంతో బాధపడుతున్నాడు. మద్యం మానేయాలని తండ్రి విఠల్ మందలించాడు. దీంతో గురువారం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్‌తో గేదె మృతి ఇచ్చోడ: మండలంలోని కామాగిరి గ్రామానికి చెందిన రైతు ఫడ్ భగవత్‌కు చెందిన గేదె శుక్రవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మేస్తుండగా విద్యుత్ తీగకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు తెలిపాడు. గేదె విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందన్నాడు. -
ఉత్తమ పీడీగా మేకల సౌమ్యకు అవార్డు
ఆదిలాబాద్: ఇంద్రవెల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మేకల సౌమ్యకు ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు –2026 లభించింది. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుల్లో ఆమెను పురస్కారానికి ఎంపిక చేశారు. విద్యార్థినులకు క్రీడాశిక్షణ అందించడంతో పాటు క్రీడారంగంలో ఆమె చేస్తున్న కృషి, ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. ఉత్తమ పీడీగా ఎంపిక కావడంపై పలువురు క్రీడా సంఘాల బాధ్యులు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు. -
అతివలకు అండగా షీటీం
ఆదిలాబాద్‌టౌన్: అతివలకు అండగా షీటీం బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం షీటీం పనితీరుపై ఆగస్టు నివేదిక విడుదల చేశారు. అనంతరం పోలీస్ అక్కలు, షీటీం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ఆగస్టులో 136 ఫిర్యాదులు అందగా, ఇందులో 117 ఈ–పెట్టి కేసులు, ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటు 14మందికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. 163 హాట్స్పాట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రెండు బాల్య వివాహాలు అడ్డుకున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలను తరచూ సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని, వేధింపులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, వేధింపులు, బాల్య వివాహాల నివారణ తదితర అంశాలపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొన్నారు. ఫొటోలు, వీడియోలను దుర్విని యోగం చేస్తూ బ్లాక్మెయిల్, వేధింపులకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలని, సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బంది ని అభినందించి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో షీటీంను 87126 59953 నంబర్లో, డయల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అదనపు ఎస్పీ మౌనిక, డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఎస్బీ డీఎస్పీ వెంకటనర్సయ్య, పట్టణ సీఐలు, షీటీం సభ్యులు సుశీల, రోహిణి, లావణ్య, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు. బలమైన వ్యవస్థను అమలు చేయాలి విజిబుల్ పోలీసింగ్, బలమైన పోలీస్ వ్యవస్థను అమలు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో మాట్లాడారు. రాజీకి అవకాశమున్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. గణేశ్ మండపాల వివరాలను ముందస్తుగా నమోదు చేసుకోవాలని, మండల స్థాయిలో శాంతికమిటీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పోలీస్స్టేషన్లను సందర్శించాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టే, డీఎస్పీలు జీవన్‌రెడ్డి, వెంకటనర్సయ్య, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
జూనియర్ అసిస్టెంట్లకు ప్రత్యేక లాగిన్లు
● సాఫీగా భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కై లాస్‌నగర్: జిల్లాలో భూ భారతి అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల గై ర్హాజర్తో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కలుగుతున్న ఇబ్బందులను వివరిస్తూ ‘శిక్షణ ఇచ్చారు.. లాగిన్లు మరిచారు’ శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. భూ భా రతి ఆపరేటర్ల తొలగింపుతో జూనియర్ అసిస్టెంట్లకు భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహణపై అధికార యంత్రాంగం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. అయితే, వారికి లాగిన్లు ఇవ్వకుండా తొలగించిన ఆపరేటర్లతోనే విధులు నిర్వహించడాన్ని ఈ కథనంలో ప్రస్తావించింది. ఇందుకు కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. 20 గ్రామీణ మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తూ శిక్షణ పొందిన జూనియర్ అసిస్టెంట్లకు ప్రత్యేక లాగిన్లు క్రియేట్ చేసి వారికి భూ భారతి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించా రు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన అధికారులు జూనియర్ అసిస్టెంట్లకు లాగిన్లు క్రియేట్ చేశారు. దీంతో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రి య వారి ఆధ్వర్యంలో మొదలైంది. ఇక నుంచి ప్రక్రియ సాఫీగా సాగడంతోపాటు భూ రిజిస్ట్రేషన్లలో జరిగే అక్రమాలకు కూడా చెక్ పడనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
మాతా శిశుమరణాలను పూర్తిగా అరికట్టాలి
ఇచ్చోడ: ఏజెన్సీ ప్రాంతాల్లో మాతా శిశుమరణాలను పూర్తిగా అరికట్టేలా వైద్య సిబ్బంది ప్ర త్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంకల్ప్ ప్రో గ్రాం ఆఫీసర్ కీర్తిరెడ్డి ఆదేశించారు. గురువా రం ఇచ్చోడ పీహెచ్‌సీని సందర్శించి పలు రికా ర్డులు, మందుల నిల్వలు, ఓపీ, సిబ్బంది హాజ రు శాతాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అస్పత్రులకు వచ్చే గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. డీహెంహెచ్‌వో డాక్టర్ సాధన, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్‌రాథోడ్, స్థానిక వైద్యాధికారి మధురిమ, సీహెచ్‌వో బ్రహ్మానందంరెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
భవన నిర్మాణాల్లో వేగం పెంచాలి
కై లాస్‌నగర్: అంగన్వాడీ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాలు, నూతన భవనాలు, మరుగుదొడ్లు, పీఎం జన్మన్, ఉపాధిహామీ, గ్రామపంచాయతీ భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పనుల పురోగతిని పరిశీలించి పెండింగ్ పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమశాఖాధికారి మిల్కా, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎయిడ్ ఎన్జీవో ఆధ్వర్యంలో బాల్య వి వాహ ముక్త భారత్‌కు సంబంధించిన ప్రచార పోస్ట ర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఆడపిల్లల రక్షణ, సంరక్షణకు జేజేబీ కోర్టు, చైల్డ్‌లైన్, ఐసీపీఎస్, ఎయిడ్ ఎన్జీవో పనిచేస్తున్నాయని తెలిపారు. ఆపదలో ఉన్న వారు డయల్ 1098, 100 నంబర్లకు కాల్ చేయాల ని సూచించారు. అధికారులు మిల్కా, రాథోడ్ ర వీందర్, రమేశ్, రాథోడ్ శివరాం, ఉమాదేవి, ఎన్జీ వో జిల్లా కోఆర్డినేటర్ వినోద్, కమ్యూనిటీ మొబిలైజర్లు సంపత్ కిరణ్, శంకర్ తదితరులున్నారు. -
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఇంద్రవెల్లి: నాగోబా ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కేస్లాగూడ గ్రామాన్ని సందర్శించారు. పాఠశాలలో నిర్మించిన ప్రహరీని ప్రారంభిచారు. అనంతరం నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో రూ.కోటితో చేపట్టిన గెస్ట్‌హౌస్ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు వంట గదులు, డైనింగ్ హాల్, వీఐపీ గెస్ట్ హౌస్, ట్రైబల్ మ్యూజియం, పూరి.. మెస్రం వంశీయులకు విశ్రాంతి కోసం గెస్ట్ హౌస్, కోనేరు సుందరీకరణ, మెస్రం వంశీయులు, భక్తుల కోసం నాలుగు సులభ్ కాంప్లెక్స్‌లు, తాగునీటి సౌకర్యం, ఓహెచ్‌ఆర్ ట్యాంక్ నిర్మాణంతో పాటుగ్రామానికి అనుబంధంగా ఉన్న గ్రామాల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించి గడువులోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, సర్పంచ్ మెస్రం తుకారాం, ఐటీడీఏ ఈఈ తానాజీ, మెస్రం వంశీయులు మెస్రం నాగ్నాథ్, ఆనంద్‌రావ్, శేఖర్‌బాబు, పార్టీ నాయకులున్నారు. -
ఇక ప్రణాళిక ప్రకారమే అభివృద్ధి
జిల్లాలోని గ్రామపంచాయతీలు 473 గ్రామీణ ప్రాంతాల జనాభా 5,41,230 తొలివిడత వచ్చే నిధులు రూ.40కోట్లు కై లాస్‌నగర్: 16వ ఆర్థిక సంఘాన్ని అమల్లోకి తెచ్చి న కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరుస్తూ.. నిధుల దుర్విని యోగానికి అడ్డుకట్ట వేసేదిశగా దృష్టి సారించింది. ఏడాది కాలంలో పంచాయతీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికల రూపకల్పనకు ఆదేశించింది. జనాభా ప్రాతిపాదికన కేటాయించే నిధులు, వాటితో చేపట్టనున్న పనుల అంచనాలను రూపొందించాలని స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టిన అధికారులు ప్రతీ పంచాయతీకి అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)ని సిద్ధం చేశారు. తొమ్మిది అంశాలతో తయారు చేసిన ప్రణాళికల వివరాలను ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. ప్రతీ పంచాయతీకి ప్రణాళిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే 16వ ఆర్థికసంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీల్లో సమకూరనున్న జనరల్ ఫండ్‌ను సద్వి నియోగం చేసుకుని ఆదర్శ పంచాయతీలుగా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో కేంద్రం జీపీడీపీ రూపకల్పనకు ఆదేశించింది. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, అంగన్వాడీ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని, ఏయే రంగాలకు ఎంత నిధులు వెచ్చించాలనే దిశగా నివేదిక రూపొందించాలని సూచించింది. వీటితో పాటు గ్రామాలు ఆదర్శంగా నిలిచేలా తొమ్మిది అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. ఆయా అంశాల్లో నిధులు వెచ్చించే దిశగా ఏడాదికి సంబంధించిన ప్రణాళికలు కోరింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా కదిలిన పంచాయతీ సెక్రటరీలు, అ ధికారులు గ్రామాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశా రు. వందశాతం నిధులకు గాను 120శాతం బడ్జెట్‌తో కూడిన ప్రతిపాదనలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. ఈ ప్రక్రియ గత నెల 31వ తేదీతో ముగిసింది. నిధుల దుర్వినియోగానికి చెక్ ముందుగా సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారంగానే అభివృద్ధి పనులకు నిధులు వెచ్చించాల్సి ఉండటంతో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనుంది. ఇష్టారాజ్యాంగా ఖర్చు చేసే అవకాశం లేకపోవడంతో ఆర్థిక క్రమశిక్షణ పెరగనుంది. ప్రతీ పనికి ఓ ప్రత్యేక కోడ్ ఉంటుంది. దాని ప్రకారంగానే పూర్తి చేసిన పనుల వివరాలు, ఫొటోలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సర్పంచ్, పంచాయతీ సెక్రటరీల లాగిన్ల ద్వారా ఆ పనులకు సంబంధించిన చెక్ జనరేట్ అవుతుంది. దీంతో డబ్బులు వృఽథాగా ఖర్చు చేసే అవకాశముండదు. ఫలితంగా పారదర్శకమైన అభివృద్ధికి బాటలు పడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా ఫిబ్రవరి నెలాఖరులోపు ఈ ప్రణాళికను సిద్ధం చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిధుల వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించాయి. బేసిక్ గ్రాంట్ కింద 80శాతం నిధులు వినియోగించాలని సూచించింది. 50శాతం టైడ్ గ్రాంట్స్‌ను శానిటేషన్, తాగునీరు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆన్‌టైడ్ 50శాతం గ్రాంట్స్‌లో 20శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీసీ రోడ్లు, డ్రైనేజీలకు వెచ్చించాల్సి ఉంటుంది. మరో 30శాతం నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ఆదేశించింది. 20శాతం ఫార్మర్స్మెన్స్ గ్రాంట్ కింద వినియోగించాల్సి ఉంటుంది. 10శాతం స్టేట్ ఫార్మర్స్మెన్స్, మరో 10శాతం రూరల్ లోకల్ బాడీస్ ఫార్మర్స్మెన్స్ కింద వినియోగించాల్సి వస్తోంది. కేంద్రం విడుదల చేసే నిధుల్లో కనీసం 20శాతం నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ఫార్మర్స్మెన్స్ కింద పరిగణించబడుతుంది. గ్రామాల్లో ఆర్థిక వనరులను సమీకరించుకుంటే ఆర్ఎల్బీ ఫార్మర్స్మెన్స్ కిందకు వస్తోంది. ఒక్కో ఇంటికి రూ.1,200 కింద వసూలు చేసినట్లయితే దీనికింద పరిగణించబడుతుంది.నిధుల వినియోగం ఇలా.. -
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి
కై లాస్‌నగర్: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని ఎంపీ గోడం నగేశ్ పిలుపునిచ్చా రు. యంత్ర పరికరాలు, ఆధునిక సాంకేతికతో పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆత్మ ఆధ్వర్యంలో గురువారం మావల మండల కేంద్రంలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కిసాన్ మేళాను కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ.. వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మా ర్కెట్లో డిమాండ్ పెంచేందుకు ఎగుమతి అవకాశాలను విస్తరించాల్సిన అవసరముందన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. కొత్త గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ కమిటీ, మున్సిపల్ చైర్మన్లు బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, బండారి అనూష, ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ ఆత్మ చైర్మన్లు సంతోష్‌రావు, రాజు, నారాయణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రవీందర్‌సింగ్, పశుసంవర్ధకశాఖ అధికారి రాథోడ్ రామారావు, ఉద్యానశాఖ అధికారి సందీప్‌కుమార్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యంఆదిలాబాద్: పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల సేవా అంకితభావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 17నుంచి అక్టోబర్ 17వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలి పారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో అభియాన్‌పై నిర్వహించిన కార్యశాలలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపురే అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాటిపల్లి గంగాధర్‌రావు, దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి వాగ్మారే శైలేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గటిక క్రాంతికుమార్, మహిళా మోర్చా అధ్యక్షురాలు జాదవ్ సుమన్‌బాయి తదితరులు పాల్గొన్నారు. -
నేరాలను అరికట్టేనా..?
సాక్షి, ఆదిలాబాద్: ఎకై ్సజ్ శాఖలో సమూల ప్రక్షాళన చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రక్రియ, సాధారణ బదిలీలు అని ఉన్నతాధికారులు చెబు తున్నా.. ఎలాంటి గైడ్‌లైన్స్ జారీ చేయలేదని, ఆప్ష న్లు కూడా తీసుకోలేదని శాఖలో ప్రచారం సాగుతోంది. ఆ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ నుంచి బు ధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో దాదాపు అన్ని ఎకై ్సజ్ స్టేషన్లు, ఇత ర విభాగాల నుంచి ఇన్స్పెక్టర్లు, ఎస్సైలకు ట్రాన్స్ఫర్లు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఆదిలాబాద్ డివిజన్ నుంచి కరీంనగర్, నిజామాబాద్ డివిజన్లకు బదిలీలు చోటుచేసుకోగా, అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాకు పలువురు వచ్చారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో పలు వురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. గతేడాదే పలువురికి ప్రమోషన్ వచ్చినా పో స్టింగ్‌లు కేటా యించలేదు. తాజాగా పోస్టింగ్‌లు కేటాయించడంతో పాటు బదిలీ లు చేపట్టారు. దీంట్లో ఏకంగా ఎక్సైజ్ డివిజన్ నుంచే బదిలీ చేసి ఇతర డివిజన్లకు పంపించారు. ముందుగా ఎలాంటి గైడ్‌లైన్స్ జారీ చేయకుండా, ఆప్షన్ ఇవ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టారని శాఖలో ప్రచారం జరుగుతున్నా.. జిల్లా నుంచి బదిలీపై వెళ్తున్న కొందరు అధికారులకు ఇతర డివిజన్లలో పలుకుబడి ఉన్నచోట పోస్టింగ్ లభించిందనే చర్చ సాగుతోంది. ఒకరోజు ముందు రాత్రి కొంత మంది తమ పరిచయాలు, పైరవీలతో అనువైన చోటకు బదిలీపై వెళ్లారని అంతా చెప్పుకొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఎక్సైజ్ ఆదిలాబాద్ డి విజన్ పరిధిలో మంచిర్యా ల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. వీటి పరిధిలో 11 ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఆదిలా బాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట స్టేషన్లున్నాయి. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో డివిజన్ పరిధిలో పనిచేసే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో పాటు నాలుగు జిల్లాల్లో డీటీఎఫ్ విభాగాలున్నాయి. వీటి పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. వారిని కరీంనగర్, నిజామాబాద్ డివిజన్లకు బదిలీపై పంపించారు. అక్కడి నుంచి ఈ జిల్లాలకు ఎన్స్పెక్టర్లు, ఎస్సైలు వస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున మూడు దిక్కులా మహారాష్ట్ర ఉంది. ఇక్కడికి అక్కడి నుంచి దేశీదారు రవాణా విస్తృతంగా సాగుతోంది. జిల్లా నుంచే పలువురు స్మగ్లర్లు దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. దీంతో చీప్ లిక్కర్ అమ్మకాల విషయంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గుతోంది. అంతే కాకుండా గంజాయి సాగు ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అడపాదడపా పోలీసులు దాడులు చేసి అరికట్టేందుకు కృషి చేస్తున్నా ఎకై ్సజ్ శాఖ నామమాత్రంగానే దాడులు నిర్వహిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. గుడుంబా కేసులు కూడా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రైమ్‌ను అరికట్టేందుకు సమూల ప్రక్షాళన ద్వారా శాఖలో ప్రయత్నాలు చేపట్టారనే ప్రచారం సాగుతోంది. -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించగా జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఇన్నోవెటివ్ బోధనలో జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లుండే రాము, కళాశాలను అభివృద్ధి చేసినందుకు గాను ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ సాయిప్రసాద్, ఉత్తమ బోధన, రీసెర్చ్లకు గాను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అగ్రికల్చర్ కళాశాల అగ్రోనమి ప్రొఫెసర్ మంజూలత అవార్డులు దక్కించుకున్నారు. ఈనెల 5న హైదరాబాద్‌లో వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. -
నిధుల సద్వినియోగానికి దోహదం
కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థికసంఘం నిధుల విడుదల కోసం పంచాయతీలవారీగా అభివృద్ధి ప్రణాళికలు కోరింది. ఆ దిశగా జిల్లాలోని 473 పంచాయతీలకు ఏడాదికాలంలో చేపట్టే పనుల ప్రతిపాదనలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేశాం. నిధుల మంజూరు, అభివృద్ధి పనుల వివరాలు నమోదు చేయాల్సి ఉండటంతో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్టే పడే అవకాశముంది. పంచాయతీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. తద్వారా పంచాయతీల అభివృద్ధికి తోడ్పడనుంది. జిల్లాకు రూ.40 కోట్లు విడుదలయ్యే అవకాశముంది. – జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
పాలిటెక్నిక్‌ల విలీనం ఆపాలి
ఆదిలాబాద్‌టౌన్: జీవో 97 ప్రకారం పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీ నం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంట నే ఉపసంహరించుకోవాలని పాలిటెక్నిక్ అధ్యాపకులు డిమాండ్ చేశారు. సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం పట్టణంలోని సంజ య్ గాంధీ పాలిటెక్నిక్ ఆవరణలో టీపీ–జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్‌ల విలీనం వల్ల బడుగు, బలహీన, పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అందే అవకాశాలు దూరమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్‌ను శక్తిశాఖలోకి కాకుండా సాంకేతిక విద్యలోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరేష్, టీపీ జేఏసీ లోకల్ యూనిట్ అధ్యక్షుడు సాయన్న, కోశాధికారి కే. మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాథోడ్ శ్రీకాంత్, జాయింట్ సెక్రెటరీ రాథోడ్ జైపాల్, సభ్యులు పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకే ’ మై సెల్ఫ్’
కైలాస్‌నగర్: విద్యార్థులకు బోధనతో పాటు వా రిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు విభిన్న కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించేందు కోసమే ‘మై సెల్ఫ్’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమానికి సంబంధించి ఏ స్వైర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ ఏంఓయూ కుదుర్చుకొని, పోస్టర్ ఆవిష్కరించారు. వృత్తి నైపుణ్యాలు తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఉమ్మడి జిల్లాలోని ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. బాల వికాస్ ఫౌండేషన్, కీ–స్టోన్ సంస్థల సహకారంతో పాఠశాలలకు అవసరమైన వసతులు, ఫర్నిచర్ వంటి సౌ కర్యాలు కల్పిస్తున్నామని వెల్ల డించారు. కార్యక్రమంలో డీఈవో మాధవి, స్వచ్ఛంద సంస్థ ప్రతి నిధులు శ్రీలక్ష్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ వహించాలి
నేరడిగొండ: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా నోడల్ అధికారి సాహెబ్రావ్ పవార్ అన్నారు. కుమా రి ప్రాథమిక పాఠశాలను జిల్లాస్థాయి తనిఖీ బృందంతో కలిసి బుధవారం సందర్శించారు. ఉపాధ్యాయులు వినియోగిస్తున్న టీచింగ్ లె ర్నింగ్ మెటీరియల్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐ బోధన తీరుపై ఆరా తీశారు. వి ద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఇందు లో సభ్యులు అరుణ్‌రాజ్, ప్రధానోపాధ్యాయులు గంగాధర్, శివలీల, వాణిశ్రీ పాల్గొన్నారు. -
● కలెక్టర్ రాజర్షిషా
పారదర్శక ఓటరు జాబితాకు సహకరించాలికై లాస్‌నగర్: జిల్లాలో పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా తయారీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం నోమ్యాపింగ్, వ్యత్యాసాలు ఉన్నవారికి నోటీసులు జారీ చేసి ఈఆర్వోలు, ఏఈఆర్వోల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నామని అన్నారు. ఓటరే స్వయంగా హాజరుకావాలనే నిబంధన లేదని, వారు రాలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు లేదా బంధువులు సైతం హాజరు కావచ్చని స్పష్టం చేశారు. విచారణకు వచ్చేవారు కుల, జనన ధ్రువీకరణ, పాస్‌పోర్టు, శాశ్వత నివాసపత్రం, మెట్రిక్యులేషన్, అటవీ హక్కుల పత్రం లేదా ప్రభుత్వ ఇళ్ల పట్టాలు వంటి గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒక ఒరిజినల్ సర్టిఫికెట్తో పాటు ఒక సెట్ జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. నిర్దేశిత తేదీల్లో విచారణకు హాజరు కాలేకపోయిన వారికి తదుపరి ఏడు రోజుల వ్యవధిలో విచారణకు హాజరయ్యే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. అలాగే 2026 అక్టోబరు 1నాటికి అర్హత సాధించేవారు, జాబితాలో పేర్లు లేనివారు లేదా తప్పుల సవరణ కోరే వారి కోసం సెప్టెంబరు 5, 6, 12, 13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు. కొత్తగా పేరు నమోదుకు ఫారం–6, మార్పులు–చేర్పులు లేదా అభ్యంతరాలకు ఫారం–8తో పాటు డిక్లరేషన్ ఫారమ్‌లను పూర్తి చేసి ఆయా పోలింగ్ కేంద్రాల్లోని బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే క్షయ రహిత సమాజం కై లాస్‌నగర్: ప్రజల భాగస్వామ్యంతోనే క్షయ(టీబీ) రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ఆదిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధి ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో సాధన, జిల్లా క్షయ నియంత్రణ అధికారి సుమలత, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, జెడ్పీ సీఈవో రవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అవగాహన అవసరం
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌టౌన్: సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సైబర్ జాగృతి దివస్‌లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని, గుర్తుతెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు, మెసేజ్‌లు, లింకులు, ఫోన్‌కాల్స్ నమ్మవద్దని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు, అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపే ఆఫర్లకు ఆకర్షితులైతే సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదముందన్నారు. కేవైసీ, డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, మ్యాట్రిమోనీ, నకిలీ లింకులు వంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌లో సంప్రదించాలని సూచించారు. ముందుగా సైబర్ మోసాలపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ నైలు, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ బి.సునీల్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ అతిక్ బేగం, ఏఎస్సై సురేందర్, సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతికై లాస్‌నగర్: సహకార శాఖలో సీనియర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మహమ్మద్ గౌస్ బాబాకు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించింది. జిల్లా సహకార అధికారి కార్యాలయంలో పోస్టింగ్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారిని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ కలీం అహ్మద్ ఆధ్వర్యంలో బుధవారం సత్కరించారు. ఇందులో సూపరింటెండెంట్ సయ్యద్ రాహీల్ అహ్మద్, ఉర్దూ అధికారి తన్వీర్ కౌసర్ తదితరులు పాల్గొన్నారు. -
● కాంగ్రెస్ సర్కారు తీరుపై నిరసన ● ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని ఆందోళన
బీఆర్ఎస్ పోరుబాటకై లాస్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఎన్నికల హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ బుధవారం ఆందోళన చేపట్టింది. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో, బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. జిల్లాకేంద్రంలో పోరుబాట పేరిట ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు’ అనే 420 అడుగుల ఫ్లెక్సీతో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల హామీలతో కూడిన ప్లకార్డులు, బాకీకార్డులను ప్రదర్శిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి వెయ్యి రోజులైనా పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రికి ఆ పదవీలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీని రాష్ట్రంలో ఏ ఒక్కరికై నా అమలు చేసినట్లు నిరుపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మనోహర్, నర్సింగరావు, అజయ్, సాజీదోద్దీన్, యూనిస్ అక్బాని, వసంత్, ప్రమోద్ రెడ్డి, మమత, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. దద్దరిల్లిన బోథ్ బోథ్: ఎన్నికల వేళ ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విమర్శించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ బాకీపడ్డ పథకాలను గుర్తుచేస్తూ ప్రజలకు ప్రత్యేకంగా రూపొందించిన బాకీ కార్డులు అందజేశారు. వాటితో సెల్ఫీలు దిగి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్‌కు రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ ప్రాంత వాసుల చిరకాల ఆకాంక్ష అయిన బోథ్ రెవెన్యూ డివిజన్ సాధన కోసం శాసనసభ లోపల, వెలుపల రాజీలేని పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. ఇందులో బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సర్కారు బడిపై ఫోకస్
ఆదిలాబాద్‌టౌన్: కలెక్టర్ రాజర్షిషా సర్కారు బడుల పై ఫోకస్ పెంచారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేలా చర్యలు చేపడుతున్నారు. పిల్లల ప్రగతిని పరిశీలించేందుకు ప్రతినెలా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఆ శాఖాధికారులతో సమీక్షలు నిర్వహించేలా ఇప్పటికే ప్రణా ళికలు రూపొందించారు. తదనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. జిల్లా వెనుకంజ అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లా చదువుల పరంగా వెనుకబడి ఉంది. సర్కారు బడుల్లో చదివే చాలామంది చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడంలో వెనుకబడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్ఫామెన్స్ గ్రేడ్ ఇండెక్స్(పీజీఐ)లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 33వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రాథమిక, ఉన్నత తరగతుల విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపర్చడంతో పాటు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు కలెక్టర్‌తో పాటు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లో నాణ్యమైన బోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ప్రాధాన్యత సంతరించుకుంది. పాఠశాలలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. డీఈవో, ఏఎంవో, ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు, అకాడమిక్ ప్యానల్ తనిఖీ బృందం నిరంతరం తనిఖీలు చేసి సామర్థ్యాలను తెలుసుకోవాల్సి ఉంది. అవసరమైన సూచనలు విద్యార్థులకు అందజేయాలి. రోజూ స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు.. సర్కారు బడుల్లో చదివే ప్రతి విద్యార్థి ఆంగ్లంపై పట్టు సాధించేలా కలెక్టర్ చొరవ చూపుతున్నారు. సబ్జెక్టులతో పాటు ప్రతిరోజు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా విద్యార్థులకు బోధించాల్సి ఉంది. అలాగే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదవడం, రాయడం వచ్చేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలుడీఈవో పరిధిలోనివి 678 ప్రాథమిక 467 ప్రాథమికోన్నత 105 ఉన్నత 106 మొత్తం విద్యార్థులు 58వేలువిద్యార్థుల ప్రగతిపై నిఘా.. సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల ప్రగతిని పరీక్ష ఫలితాల ఆధారంగా కాకుండా తరగతుల వారీగా అభ్యసన స్థాయిని ప్రత్యేకంగా అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణిత ప్రాథమిక అంశాలు, సైన్స్ అవగాహన వంటి విషయాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపేలా పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు మండల స్థాయిలో టీఎల్ఎం మేళా, 22న జిల్లా స్థాయిలో నిర్వహించేలా సన్నద్ధమవుతున్నారు. -
డీఎల్ఎస్ఏ కార్యదర్శిగా హుస్సేన్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జడ్జి హుస్సేన్‌ను లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా సేవలు అందిస్తున్న ఈయన పదోన్నతిపై న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా నియామకం అయ్యారు. జడ్జిని కలిసిన వారిలో చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, చంద్రకాంత్, ఉమేష్‌రావు డోలే, రూపేష్, తిలోత్తమ ఉన్నారు. -
సీపీఎస్ రద్దు చేయాలని ఆందోళన
కై లాస్‌నగర్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శా పంగా మారిన సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధా నం పునరుద్దరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కలెక్టర్ కా ర్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలి పారు. జేఏసీ నాయకులు శివకుమార్, నవీన్‌కుమా ర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఊ సెత్తకపోవడం శోచనీయమన్నారు. ఇందులో జేఏసీ నాయకులు కిష్టన్న, అశోక్, శ్రీనివాస్, రవికుమార్, శ్రీకాంత్ , నవీన్‌యాదవ్, చంద్రశేఖర్, విజయ్, నర్సింహులు, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. కోలిపూర ఉన్నత పాఠశాలలో ఆదిలాబాద్‌టౌన్:పాత పెన్షన్ విధానం అమలు చే యాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రవీంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం ఆదిలాబాద్ పట్ట ణంలోని కోలిపూర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి సెప్టెంబర్ 1ని విద్రోహ దినంగా పాటించారు. ఇందులో పాఠశాల హెచ్ఎం మురళి, డి.శేఖర్, సంజీవ్ రావు, భీంరావు, రుబీన, పాండురంగ, మాధవి, పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ గెజిటెడ్ నం.1 పాఠశాలలో నిర్వహించిన ఇందులో హెచ్ఎం నీలాదేవి, సుకుమార్, యాదగిరి పాల్గొన్నారు. -
కన్నీరు పెట్టిన పార్డి(బి)
కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(బి)గ్రామానికి చెందిన తూము సాయిలు(60), ఆవుల గంగన్న (63), గౌరాబాయి (70), తులసీరాం (27) సోమవారం మహారాష్ట్రలోని సాసర్కుండ్కు వెళ్లి వస్తుండగా తోటంబా వద్ద జీబు బోల్తాపడి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో పార్టి(బి) గ్రామం కన్నీటి పర్యంతమైంది. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మహారాష్ట్ర పోలీసులు మృతదేహాలను అప్పగించారు. నాలుగు చితులు వరుసక్రమంలో పేర్చి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన జీబు, అందులో పరిమితికి మించి 9 మందికి బదులుగా 18 మందిని ఎక్కించుకుని ప్రయాణం చేయడం కూడా ఘటనకు కారణమైందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి కాలం చెల్లిన వాహనాలపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. -
రవాణా భత్యం వచ్చిందోచ్..!
మంచిర్యాలఅర్బన్: సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చే పేద విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం రవాణా చార్జీల నిధులను విడుదల చేసింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బడిలేని విద్యార్థులకు రవాణా, ఎస్కార్ట్ సౌకర్యం కోసం 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మొదటి మూడు నెలలకు (2026 జూన్ నుంచి ఆగస్టు వరకు) నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమీపంలో పాఠశాల లేక ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటర్, ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలలకు ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి వెళ్లే విద్యార్థులు ప్రయాణ భత్యాన్ని పొందేందుకు అర్హులు. ఒక్కో విద్యార్థికి పది నెలలకు రూ.6వేల చొప్పున రవాణా చార్జీలు చెల్లిస్తారు. ఇందుకు విద్యార్థి హాజరు 80 శాతం ఉండాలి. మూడు నెలల రవాణా చార్జీల మంజూరుతో విద్యార్థులకు ఊరటనిస్తోంది. విద్యార్థుల ఖాతాలో నేరుగా.. ఉమ్మడి జిల్లాలో స్కూల్ లెస్ హబిటేషన్స్, విద్యార్థుల వివరాలను గుర్తించారు. దూరప్రాంతాలకు వెళ్లి రవాణా భత్యం పొందే వివరాలు లెక్కతేల్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,400 మంది విద్యార్థులకు రూ.61,20,000 రవాణా నిధులు మంజూరయ్యాయి. ఆదిలాబాద్‌లో పీఎస్, యూపీఎస్‌లో 231 మంది, హైస్కూల్లో 799 మందిని గుర్తించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 92 మంది, ఉన్నత పాఠశాలలో 705 మంది, మంచిర్యాలలో పీఎస్‌లో 133 మంది, హైస్కూల్లో 575 మంది విద్యార్థులను గుర్తించారు. నిర్మల్ జిల్లాలో ప్రైమరీ, యూపీఎస్‌లో 39, ఉన్నత పాఠశాలల్లో 823 మంది విద్యార్థులు అర్హులుగా ప్రకటించారు. వీరందరికి నెలకు రూ.600 చొప్పున మూడు నెలల నిధులు మంజూరయ్యాయి. వాటిని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు, మంజూరైన నిధులు (రూ.ల్లో) -
బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం
కై లాస్‌నగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అట్రాసిటీ జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి జిల్లాలో నమోదైన కేసులు, పు రోగతి, నష్టపరిహారంపై పోలీస్స్టేషన్లు, మండలా ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు అరికట్టడం, వారి హక్కులు కాపాడేందుకు చట్టపరంగా తగిన రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. అత్యాచార కేసుల్లో బాధితులకు పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు పునరావాసంతోపాటు, వారిలోధైర్యం నింపేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, చట్టపరంగా ఎలాంటి లోపాలు లే కుండా కట్టుదిట్టమైన దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్.చిత్రు, ఎస్. రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీ కృష్ణ, ఎస్సీ సంక్షేమ అధికారి సునీతకుమారి, ఈడీ మనోహర్, ఇత రశాఖలఅధికారులు, కమిటీసభ్యులు పాల్గొన్నారు. భాషా నైపుణ్యాల పెంపునకు స్పోకెన్ ఇంగ్లిష్ పోటీలు విద్యార్థుల్లో ఆంగ్లభాషా సంభాషణ నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే స్పోకెన్ ఇంగ్లిష్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆగస్టు నెలకు సంబంధించి స్పోకెన్ ఇంగ్లిష్ కార్యక్రమ అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు ఎంతో కీలకమన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వి ద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీఈవో మాధవి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్య సాధనకు స్మార్ట్ వర్క్ ముఖ్యం
ఆదిలాబాద్‌రూరల్: పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కఠోర శ్రమతో పాటు ప్రణాళికాబద్ధమైన స్మార్ట్ వర్క్ ఎంతో ముఖ్యమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మెరిట్ అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సు శిక్షణ తరగతుల ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టడీ సెంటర్లో శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తమ అభిప్రాయాలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు సిలబస్‌పై పూర్తి పట్టు సాధించాలన్నారు. స్టాటిక్ అంశాలను సమకాలీన పరిణామాలతో (కరెంట్ అఫైర్స్) అనుసంధానిస్తూ నోట్స్ తయారు చేసుకోవాలని, ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌కు ఎంతో దోహదపడుతుందన్నారు. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంలో ఎలిమినేషన్ మెథడ్ కీలకమన్నారు. ప్రిపరేషన్ సమయంలో స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాల వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి బీసీ సంక్షేమాధికారి సునీతకుమారి, స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
అస్తమించిన ఆదివాసీ ఉద్యమ నాయకురాలు
ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం సాగించిన యోధురాలు కుర్సెంగ రాధక్క, అలియాస్ మోతిబాయి అనారోగ్యంతో ఆసువులు బాసింది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లింగుగూడకు చెందిన రాధక్క 20 ఏళ్ల వయసులోనే పోరుబాట పట్టింది. పోడు భూములకు హక్కులు కల్పించాలని, ఆదివాసీల అణచివేతపై విముక్తి కల్పించాలని పోరాటం సాగించింది. ఆమెను కడసారి చూసేందుకు వందలాది మంది తరలివచ్చారు. మావోయిస్టు మాజీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవుజీ నివాళులర్పించారు. రాధక్క భర్త చంద్రన్నను పరామర్శించారు. కుమురంభీం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్, తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మావోయిస్టు మాజీ రాష్ట్ర కార్యదర్శి దామోదర్, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు బండి ప్రకాష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్, వెంకటేష్, పౌర హక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, ఎన్.నారాయణరావ్, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ కుమారి, తదితరులు పాల్గొన్నారు. నెరవేరని కల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టిసావర్గాం శివారు ప్రాంతంలో గల కుమురం భీం గూడలో చిన్న ఇంటిని నిర్మించుకుని భర్త చంద్రన్నతో కలిసి నివాసం ఉండాలని భావించారు. కానీ ఆ కల నేరవేరకుండానే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడం అందరికీ ఆవేదన మిగిల్చింది. -
ఖర్చులోనూ వెనుకబాటు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలా బా ద్ జిల్లాను ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే అన్నింటా వెనుకబడినట్లే నిధులు వినియోగంలోనూ వెనుకబడింది. లోక్‌సభ సభ్యులకు ఎంపీ ల్యాడ్స్(లోకల్ ఏరియా డెవలప్మెంటు స్కీం) కింద ఏడాదికి రూ.5కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇందులోనూ ప్రతీ ఆరు నెలలకోసారి రెండు వాయిదాల్లో రూ.2.5 కోట్ల చొప్పున మంజూరు చేస్తారు. వీటిని తమ నియోజకవర్గాల్లో ఎంపీలు మౌలిక వసతులు విద్య,వైద్యారోగ్యం, రోడ్డు, రవాణా, ఆస్తుల కల్పన తదితర అభివృద్ధి పనులకు ప్రతిపాదించవచ్చు. ఈ నిధులను నేరుగా ఎంపీలకే ఇవ్వకుండా జిల్లా అధికారులు, అందులోనూ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పూర్తి చేసే బాధ్యత సంబంధిత శాఖలకు అప్పగిస్తుంది. ఎంపీలు ప్రతిపాదించిన చోట్ల కనీసం రూ.25లక్షల పనులకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ జనాభా ఉన్న చోట్ల కనీసం 15శాతం, ఎస్టీలు ఉన్న చోట్ల 7.5శాతం చొప్పున మొత్తం నిధుల్లో ఖర్చు చేయాలి. గత రెండేళ్లలో విడుదలైన ఈ నిధుల్లో రెండు లోక్‌సభ స్థానాలు ఆదిలాబాద్, పెద్దపల్లి పరిధిలో తక్కువ శాతం ఖర్చు చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ 11శాతమే ఖర్చు చేయగా, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ 24.3శాతం ఖర్చు చేశారు. ఇద్దరు ప్రజాప్రతినిధులూ నిధుల ఖర్చులో వెనుకబడిపోయారు. ప్రతిపాదిత పనులు సకాలంలో పూర్తి కాక ఖర్చు పూర్తి స్థాయిలో జరగలేదు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంశం పెద్దపల్లి లోకసభ పరిధి ఆదిలాబాద్ లోక్‌సభ పరిధి కేటాయింపు రూ.14.8కోట్లు రూ.14.7కోట్లు మొత్తం పనులు 71 277 పూర్తయినవి 9 80 ఖర్చు చేసింది రూ.1.6కోట్లు రూ.3.57కోట్లు ఖర్చు చేయాల్సింది రూ.13.2కోట్లు రూ.11.12కోట్లు పురోగతిలో ఉన్నవి 62 197 నిధుల ఖర్చు 11శాతం 24.3శాతంపెండింగ్లోనే పనులుఎంపీలు తమ లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనులు ప్రతిపాదించినప్పటికీ సకాలంలో పూర్తి కావడం లేదు. అధికంగా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పనుల పురోగతిని బట్టి నిధుల చెల్లింపులు జరుగుతాయి. క్షేత్రస్థాయిలో ఆశించిన మేర పనులు జరగకపోవడంతో చెల్లింపులు జరగడం లేదు. కొన్నిసార్లు సంబంధిత కాంట్రాక్టర్లు పనుల పూర్తిలో జాప్యం చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ పరిధిలో ఇప్పటి వరకు తొమ్మిది పనులే పూర్తి కాగా, మరో 62పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో మొత్తం 277పనులు ప్రతిపాదనలో ఉండగా, వీటిలో 197వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 80పనులే పూర్తయ్యాయి. ఎంపీ నిధుల ఖర్చులో అధికంగా కుల, సామాజిక భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీరు(బోర్ వెల్స్), రోడ్లు, తదితర పనులకు కేటాయిస్తున్నారు. -
జాతీయ సదస్సుకు సంతోష్ కుమార్
ఆదిలాబాద్‌టౌన్: ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితంపై బుధ, గురువారాల్లో ఢిల్లీలో నిర్వహించే జాతీ య సదస్సుకు గుడిహత్నూర్ మండలంలోని తో షం జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ హాజరు కానున్నారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. సదస్సులో ఛత్రపతి శివాజీ జీవితం, నాయకత్వం, పరిపాలన దక్ష త, సైనిక వ్యూహాలు, ప్రజా సంక్షేమ దృక్పథం, వారసత్వంపై చర్చించనున్నారు. ఈయన తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతిలోని 11వ పాఠ్యాంశం మధ్యయుగ భారత చరిత్రలో భాగంగా మొగల్ చరిత్ర, శివాజీ చరిత్ర పరిపాలన అనే అంశాలను రచించారు. -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని తనిషా గార్డెన్లో జిల్లాలోని గణపతి మండపా ల నిర్వాహకులు, కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వినాయక చవితి, నవరాత్రులు, నిమజ్జనం రోజు మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అధిక శబ్దం వచ్చే డీజేలకు అనుమతి లేదన్నారు. ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకో వా లన్నారు. లక్కీడ్రాలు నిర్వహించవద్దని, బలవంతపు చందాలు వసూలు చేయవద్దని పేర్కొన్నారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టే, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనూష, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్,సీఐలు సునిల్‌కుమార్, నాగరాజు, శ్రావణ్, రమేశ్, నరేశ్, ప్రసాద్, గురుస్వామి, వెంకటి, మురళీ, చంద్రశేఖర్, ఎస్సైలు, హిందు ఉత్సవ సమితి అధ్యక్షుడు హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
గుడిహత్నూర్: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని వైజాపూర్ గ్రామానికి చెందిన కనక విలాస్ (38) ఇటీవల కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. మంగళవారం ఉదయం ఇంటి గోడలకు నీరు పట్టడానికి మోటార్ ఆన్ చేయడానికి కరెంటు తీగలను బోర్డులో పెడుతుండగా ప్రమాదవశాత్తు తీగలు చేతికి తగిలి షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అంబులెన్సులో రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని భార్య కనక లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వైన్‌షాపు వద్ద ఒకరు ..బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని ఓ వైన్‌షాపు ఎదుట మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాసర మండలం కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన అలిశెట్టి విజయ్ (35) సోమవారం రాత్రి వైన్‌షాపు ఎదుట నిద్రించి అక్కడే మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని సోదరుడు సాయినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ, సీఐ దీపక్ తెలిపారు. గుండెపోటుతో చిన్నారి..నస్పూర్: గుండెపోటుతో చిన్నారి మృతి చెందిన సంఘటన మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ గేట్ సమీపంలో నివాసం ఉంటున్న ఎండీ జావిద్ కుమార్తె ఎండీ నహేదా (9) జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వి స్కూల్లో మూడోతరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం నిద్ర నుండి లేచిన తర్వాత చాతి, వీపులో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా వాంతులు, మూత్ర విసర్జన చేసుకుని ఒక్కసారిగి కుప్పకూలిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం మాతాశిశు కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. -
జిల్లాకు ‘టీఎస్ఎఫ్సీ’
కై లాస్‌నగర్: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్సీ) శాఖ మళ్లీ జిల్లాకు వస్తోంది. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ కేంద్రంగా ఎంతో మంది వ్యాపారులకు ఆర్థికచేయూతనందించి పరిశ్రమల స్థాపనకు తోడ్పడింది. అయితే ఈ కా ర్యాలయాన్ని 2008లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో మంచిర్యాలకు తరలించారు. 18 ఏళ్లుగా జిల్లావాసులకు దూరమైన టీఎస్ఎఫ్సీ శాఖను మళ్లీ స్థానికంగాఅందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణంలోని జెడ్పీ సమీపంలో గల ఆ సంస్థ పాత కార్యాలయానికి ఆనుకుని సొంత భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయ పునరుద్ధరణకు అవసరమైన పనులు ప్రారంభమయ్యాయి. నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో కా ర్యకలాపాలు అందుబాటులోకి వచ్చే అవకాఽశముందని ఆ సంస్థ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మహ్మద్ అలీం తెలిపారు. జిల్లా అభివృద్ధికి దోహదం .. ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఏళ్లుగా జిల్లాకు దూరమైన రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ తిరిగి సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. మంచిర్యాల జిల్లాలో ఈ కార్యాలయం ఉన్నప్పటికీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాపారులు, ప్రజలకు సేవలందించేందుకు ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడి ప్రజలు కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటే వందలాది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. వాటిని దూరం చేసేలా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సంస్థ పారిఽశ్రామిక, సేవా రంగాల్లో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే, ఉన్న వ్యాపారాలను మరింత వృద్ధి చేసేందుకు అవసరమైన రుణాలను అందజేయనుంది. హార్డ్‌వేర్, బట్టల దుకాణాలు , రైస్, కాటన్, జిన్నింగ్ మిల్లులు వంటి ఇతర వ్యాపారాలతో పాటు ఆసుపత్రులు, ఫంక్షన్‌హాళ్లు, హోటళ్లు వంటి వాటి ఏర్పాటుకు అవసరమైన రుణాలు అందజేయనుంది. దీంతో జిల్లాలో ఔత్సాహిక వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. కొత్త పరిశ్రమల స్థాపనకు ఊతమివ్వడం ద్వారా జిల్లా అభివృద్ధికి తోడ్పడనుంది. -
శిక్షణ ఇచ్చారు.. లాగిన్లు మరిచారు
కై లాస్‌నగర్: భూభారతి పోర్టల్‌లో ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం ఇటీవల తొలగించింది. తహసీల్దార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వీరిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆ స్థానాల్లో జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. అయితే తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న తమను ఉన్నపాటుగా తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతంందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈక్రమంలో యంత్రాంగం వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతోంది. ఫలితంగా ఇప్పటికీ తహసీల్దార్ కార్యాలయాల్లో భూభారతి వ్యవహారాలను వారే చూస్తున్నారు. వారికి కేటాయించిన లాగిన్లతోనే రిజిస్ట్రేషన్లు, విరాసత్ వంటి ప్రక్రియ జరుగుతుంది. ప్రభుత్వం తొలగిస్తూ ఆదేశాలు జారీచేసినా వారే విధులు నిర్వహిస్తుండడంతో వారు ఉన్నట్లా లేక తొలగించినట్లా అనే దానిపై స్పష్టత కరువైంది. ప్రత్యేక శిక్షణ ఇచ్చినా.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాయంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని ఆయా మండలాల్లో పనిచేస్తున్న 21 మంది జూనియర్ అసిస్టెంట్లను ఎంపిక చేసింది. భూ భారతి పోర్టల్ నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్లు ఇతర కార్యకలాపాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ ప్రక్రియ ముగిసి సుమారు నెలరోజులు కావస్తున్నా వారికి సంబంధిత లాగిన్లు ఇవ్వలేదు. మరోవైపు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆపరేటర్లు నిరసనకు దిగుతూ తర చూ విధులకు గైర్హాజరవుతున్నారు. వీరు అందుబాటులో లేకపోవడం, శిక్షణ పొందిన జూనియర్ అసిస్టెంట్లకు లాగిన్ ఐడీలు ఇవ్వకపోవడంతో రిజి స్ట్రేషన్ల ప్రక్రియకు ఇటీవల తరచు అంతరాయం ఏర్పడుతంంది. జిల్లాలో సగటున రోజుకు 40 నుంచి 50 రిజిస్ట్రేషన్లు జరగనున్నట్లుగా అధికా రులు చెబుతున్నారు. భోరజ్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, భీంపూర్, తాంసి వంటి మండలాల్లో సగటున రోజుకు 4 నుంచి 5 రిజిస్ట్రేషన్లు అవుతాయని చెబుతున్నారు. అయితే మూడు రోజులుగా జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈక్రమంలో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందుల్లేకుండా చర్యలు భూభారతి ఆపరేటర్లను ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు ఇవ్వాలని ఆదేశించింది. జిల్లాలో 21 మందిని ఎంపిక చేసి ఇటీవల వారికి ప్రత్యేక శిక్షణ అందించాం. త్వరలోనే వారికి లాగిన్ ఐడీలు క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. – ఆర్ఎస్.చిత్రూ, అడిషనల్ కలెక్టర్ ఇక్కడ కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ఎం.సత్తయ్య, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అమరేందర్. వీరు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జందాపూర్ గ్రామంలో మూడెకరాల వ్యవసాయభూమిని ఇటీవల కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం మీసేవలో స్లాట్ బుక్ చేసుకోగా మంగళవారం సమయమిచ్చారు. భూమిని అమ్మే రైతు సాక్షులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. ఆపరేటర్ అందుబాటులో లేడనే కారణంతో అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టలేదు. చేసేదిలేక వారు వెనుదిరిగారు. ఇది ఒక్క వీరి సమస్యే కాదు.. జిల్లా వ్యాప్తంగా భూములు అమ్మడం, కొనుగోలు చేయాలనుకునే వారంతా ఇబ్బందులు పడుతున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో 20 మంది బాలికలు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీసీవో అరుణశ్రీ తెలిపారు. మొత్తం 60 మంది పోటీలో పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన 20 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికై న వారిలో అర్ధిక్ష, షర్మిత, సింధు, బిందు, హర్షిక, భూమిక, మీనాక్షి, మధుప్రియ, అక్షిత, అభీక్ష, కోమలి, వరలక్ష్మి, పల్లవి, నందిని, అశ్వథ, శ్రీవాణి, సుష్మిత, ప్రణవి ఉన్నారు. ఈ నెల 4 నుంచి 6 వరకు నిజామాబాద్ జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ రవి తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ రామ్మోహన్, వనిత, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
శాంతిఖని గని ప్రైవేటు..!
ఇతర గనులూ..బెల్లంపల్లి: మందమర్రి ఏరియా పరిధిలోని బెల్లంపల్లి శాంతిఖని భూగర్భ గనిని ప్రైవేటుకు అప్పగించేందుకు సింగరేణి కంపెనీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బొగ్గు ఉత్పత్తి ద్వారా నష్టాలు వస్తుండడంతో తగ్గించుకునేందుకు ప్రయోగాత్మకంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కంపెనీ బొగ్గు ఉత్పత్తి చేసి ఇస్తే సింగరేణి కంపెనీ నిర్ణీత ధరకు విక్రయిస్తుంది. ఈ విధానంలో బొగ్గు ఉత్పత్తికి అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో ఈ విధానం అమలు చేసి నష్టాలను తగ్గించుకున్నట్లు గ్రహించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేయడం, ఓ ప్రైవేటు కంపెనీ ఆసక్తి చూపడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిలిచిన ఉత్పత్తి శాంతిఖని భూగర్భ గనిలో దాదాపు తొమ్మిది నెలల నుంచి బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. దాదాపు 550 మీటర్ల లోతులో నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. భూగర్భ భౌగోళిక స్థితిగతులు ప్రతికూలంగా ఉండి గాలి సరఫరా లేక కార్మికులు యాతన పడుతున్నారు. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తికి టన్నుకు రూ.21,550 వ్యయం అవుతుండగా.. అత్యల్ప ధర రూ.4,500కు అమ్ముతున్నారు. దీంతో ఒక్కో టన్నుకు రూ.17,050 నష్టపోవాల్సి వస్తోందని కంపెనీ భావిస్తోంది. గనిలో 378మంది కార్మికులు పని చేస్తున్నారు. కొత్తగా సౌత్ సైడ్‌లో టన్నెల్ పనులు సాగుతుండడంతో మరో ఆరు నెలల వరకు బొగ్గు వెలికి తీసే అవకాశాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రతినిధుల సందర్శన గనిని గత జూన్ 10న ఆస్ట్రేలియాకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. భూగర్భంలో దిగి పని స్థలాలు, రక్షణ చర్యలు పరిశీలించారు. రెండు నెలల్లోగా నివేదిక అందిస్తామని ప్రకటించినా ఇప్పటికీ అందనట్లు తెలుస్తోంది. అపారంగా బొగ్గు నిక్షేపాలు 1954లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాగా నేటికి 72ఏళ్ల కాలం గడిచిపోయింది. భూగర్భంలో ఇంకా తరగని నిక్షేపాలు ఉన్నాయి. దాదాపు 43 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు రెండున్నర దశాబ్దాల క్రితం సింగరేణి కంపెనీ బొగ్గు అన్వేషణ విభా గం అధికారులు సర్వే చేసి నిర్ధారించారు. అపారమైన నిల్వలు ఉన్న గనిలో ఉత్పత్తికి ఎదురవుతున్న సవాళ్లను ఛేదించుకుంటూ ముందుకు వెళ్లాలనే పట్టుదలతో యాజమాన్యం కార్యాచరణ తయారు చేసినట్లు తెలుస్తోంది. అన్నీ కలిసి వస్తే మరో 25ఏళ్ల వరకు బొగ్గు వెలికి తీసే అవకాశాలు ఉన్నాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలు ఉన్నాయి. బొగ్గు గనులు అంతరించడం, ఇతరత్రా కారణాలతో దశాబ్దంన్నర క్రితం రామకృష్ణాపూర్ ఏరియాను ఎత్తివేసి బెల్లంపల్లిలో ఉన్న జీఎం కార్యాలయాన్ని గోలేటి టౌన్షిప్(బెల్లంపల్లి పేరుతో)లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలో రెండు ఓపెన్‌కాస్టులు, భూగర్భ గనులు మూతపడ్డాయి. మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఓపెన్‌కాస్టు గనులతోపాటు భూగర్భ గనులు కూడా ఉన్నాయి. ఆయా ఏరియాల్లోని భూగర్భ గనులూ చాలావరకు నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నోలాస్ నో ప్రాఫిట్లో ఉండగా, మరికొన్ని నష్టాల బాట పట్టినట్లు తెలుస్తోంది. నష్టాలను తగ్గించుకోవాలనే నిర్ణయంతో సింగరేణి ప్రయోగాత్మకంగా ఎంచుకున్న శాంతిఖని గని అనుభవాలు మిగతా వాటిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. -
సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
ఆదిలాబాద్: బీజేపీ కార్యాలయాలు, నాయకులపై జరిగిన దాడులపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆది లాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ కోరారు. పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంపై సుమారు 50మంది దాడికి పాల్పడినట్లు తెలి పారు. బాధితులకు సంఘీభావం తెలిపేందు కు వెళ్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనన్నారు. -
ఎమ్మెల్యేకు ‘ఎఫ్టీఎస్’ వినతి
నేరడిగొండ: భూభారతిలో విధులు నిర్వహిస్తు న్న తమ సేవలు పునరుద్ధరించాలని ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ కోరారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. 2018 నుంచి రెవె న్యూ శాఖకు నిరంతరాయంగా సాంకేతిక సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
ఇదేం తీరు?
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ అధికారుల తీరుపై ఔట్సోర్సింగ్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంత మందికి టర్మినెట్ ఉత్తర్వులు అందజేసి.. మ రికొంత మందికి నోటీసులు జారీ చేసి వారిని కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రి మ్స్‌కు సంబంధించిన కళాశాల, ఆస్పత్రిలో వేర్వేరుగా నిబంధనలు పాటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత మార్చి 31న డీఎంఈ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను టర్మినెట్ చేయాలని ఉత్తర్వులు జారీ చే సింది. రెగ్యులర్ సిబ్బందిని నియమించడంతో మ ళ్లీ కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేయలేమని అందులో స్పష్టం చేశారు. తీరా జూలైలో మళ్లీ ల్యాబ్ టెక్నీషియన్లను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కొందరికి మాత్రమే చోటు దక్కింది. ఆస్పత్రిలో పనిచేసే ఎల్టీలకు టర్మినెట్ చేయగా, మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను కొనసాగిస్తుండటం, ఇటీవల వారికి వేతనాలు జమ చేయడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. మార్చి 31న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) నుంచి ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను టర్మినెట్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిమ్స్ జనరల్ ఆస్పత్రిలో ఆరుగురు ఎల్టీలు ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారు. రిమ్స్ కళాశాల పరిధిలో 9 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు రిమ్స్ కళాశాలలో, కొంత మంది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో, ఇంకొందరు టీ–హబ్‌లో పనిచేస్తున్నారు. వీరందరికీ ఒకే నిబంధనలు వర్తిస్తాయి. అయితే డీఎంఈ ఆదేశాల మేరకు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురిని టర్మినెట్ చేస్తూ ఉత్తర్వులు అందజేశారు. కళాశాలలో పనిచేస్తున్న వారికి మాత్రం టర్మినెట్ ఆర్డర్ ఇవ్వకుండా నోటీసులు జారీ చేసి కొనసాగిస్తున్నారు. అనధికారికంగా వారితో సేవలు చేయించుకుంటున్నారు. అయితే కొనసాగింపు ఉండదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాలు లేనప్పటికీ వారితో పనులు చేయించడంపై చర్చ సాగుతోంది. వారికోసం ప్రత్యేకంగా ఓ హాజరుపట్టిక ఏర్పాటు చేసి సంతకాలు చేయించినట్లు సమాచారం. వేతనాలు ఇస్తారా..ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేసే ఉద్యోగికి నెలకు రూ.22,500 వేతనం చెల్లిస్తారు. గత జూలై నుంచి ఇప్పటివరకు ఆస్పత్రి పరిధిలోని ఎల్టీలు విధులకు హాజరవుతున్నప్పటికీ అటెండెన్స్ వేయలేదు. అధికారికంగా వీరు పనిచేయని కిందికే వస్తుంది. అయితే వీరికి వేతనాలు చెల్లిస్తారా.. లేదా అనేదానిపై స్పష్టత కరువైంది. ఇదిలా ఉండగా ఆస్పత్రికి సంబంధించిన సిబ్బంది ఎల్టీలను టర్మినెట్ చేశామని చెబుతున్నారు. అటెండెన్స్ లేదని, వారికి ఏవిధంగా వేతనాలు ఇస్తామని పేర్కొంటున్నారు. ఒకే ఆస్పత్రి పరిధిలో ఇలా ఇద్దరికి వేర్వేరు నిబంధనలు ఉండటంపై గందరగోళం నెలకొంది. కళాశాల పరిధిలోని అధికారులు, సిబ్బందిని ఈ విషయమై అడగగా, కొనసాగింపు ఉత్తర్వులు వచ్చేవరకు పనిచేస్తామని చెప్పడంతోనే కొనసాగించామని, జూలైలో కొనసాగింపు ఉత్తర్వులు రావడంతో వారికి వేతనాలు చెల్లించామని చెబుతున్నారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. -
చైన్ స్నాచర్ల అరెస్ట్, రిమాండ్
ములుగు: ములుగు జిల్లాలోని అబ్బాపూర్‌లో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన సిరిగిరి ప్రసాద్, నిర్మల్ జిల్లాకు చెందిన పండుగ రమేశ్, నిజామాబాద్ జిల్లా సారంగాపూర్‌కు చెందిన గుంజ గంగాధర్ కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 19న అబ్బాపూర్‌లో రెక్కీ నిర్వహించారు. రాత్రి వృద్ధురాలు మూత్రవిసర్జనకు బయటకు రావడంతో ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. అనంతరం గ్రామంలో పార్క్ చేసిన బైక్‌పై పరారయ్యారు. కొలనూరు రైల్వేస్టేషన్ వద్ద బైక్ పంక్చర్ కావడంతో అక్కడే వదిలి రైలులో మంచిర్యాల వెళ్లారు. ములుగు పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తుండగా మంగళవారం ఉదయం జీవింతరావుపల్లి వై జంక్షన్ వద్ద పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి 4.280 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు, రెక్కీకి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు. -
ఆరోగ్యశ్రీ సిబ్బంది తొలగింపు
ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్యశ్రీ పథకం కింద డాటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్లుగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రిమ్స్‌లో 15 ఏళ్లకు పైగా 13 మంది డాటాఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు అటెండర్లు పనిచేస్తున్నారు. గత 17 నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారు ఇటీవల డీఎంఈని కలిసి తమ సమస్యను విన్నవించారు. సర్దుబాటు చేసి వేతనాలు అందించాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే గత రెండు, మూడేళ్ల నుంచి శ్రీ మహాలక్ష్మి మ్యాన్‌పవర్ ప్లేస్మెంట్ సర్వీస్ ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వీరిని టర్మినెట్ చేస్తున్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు సోమవారం ఉత్తర్వులు జారీ చేసి కాపీలు అందజేశారు. తమను అర్ధాంతరంగా తొలగించడం ఏమిటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి తమ గోడు విన్నవిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని స్పష్టం చేశారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను వివరణ కోరగా, ప్రభుత్వ ఆదేశాలతోనే టర్మినెట్ చేసినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా బడ్జెట్ విడుదల కావడం లేదని, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు అందజేసి టర్మినెట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం
రెబ్బెన: మెదక్ జిల్లా బీహెచ్ఈఎల్లో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ అండర్–14 రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు కాంస్య పతకాన్ని సాధించినట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొత్తపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. ఆదివారం జరిగిన సెమీఫైనల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు వరంగల్ జట్టుతో పోటీపడగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో స్వల్ప తేడా ఓడిపోయిందన్నారు. టోర్నమెంట్లో తృతీ యస్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు నిజామాబాద్‌తో పోటీపడగా 35–25, 35–28 పాయింట్లతో విజయం సాధించి కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోషియేషన్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, అసోషియేషన్ ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, కోశాధికారి భాస్కర్, సీనియర్ క్రీడాకారులు శంకర్, సంయుక్త కార్యదర్శులు వెంకటేశ్వర్లు, అడ్వైజర్ శ్రీనివాస్‌రెడ్డిలు బాలికల జట్టును అభినందించారు. -
‘హస్త’వ్యస్తం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పా ర్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి జిల్లా నాయకుల వరకు వారి మధ్య ఐక్యత కొరవడుతోంది. నియోజకవర్గాల్లో ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లో మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా.. మిగతా చోట్ల ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరిన్ని శాసనసభ స్థానాలు గెలుచుకునేలా పని చేయాల్సి ఉండగా.. గ్రూపు రాజకీయాలతో కేడర్‌లో అయోమయం నెలకొంది. గాంధీభవన్‌కు పంచాయితీలు జిల్లా నుంచి పార్టీ పంచాయితీలు రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసేలా గాంధీభవన్ వరకు వెళ్తున్నాయి. ఇటీవల ఉట్నూరులో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ ముందే ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలంటూ నరేశ్జాదవ్పై బోఽథ్ నియోజకవర్గ ఇన్చార్జి అడె గజేందర్ తన అనుచరులతో గాంధీ భవన్‌కు వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వినతిపత్రం ఇచ్చారు. అంతకుముందు ఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణకు వ్యతిరేకంగా మాజీ డీసీసీ అఽధ్యక్షుడు విశ్వప్రసాద్ అనుచరులు గాంధీభవన్ ముందే ధర్నా చేశారు. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్‌నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఖానాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ మధ్య సఖ్యత లేదు. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, బె ల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి వివేక్‌వెంకటస్వామి వర్గాలుగా ఉన్నా యి. ఇటీవల మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోనే మంతెన జగన్మోహన్రావు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు వ్యతిరేకంగా ఓ గ్రూపు కడుతున్నారు. అసంతృప్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామ, మండల స్థాయి నాయకులను కూడగడుతున్నారు. ప్రేమ్‌సాగర్‌రావు, మంత్రి వివేక్ వర్గాల మధ్య వైరం ముదురుతోంది. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనను నిరసిస్తూ దండేపల్లి మండలం గూడెంలో ఎమ్మెల్యే వర్గీయులు స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశా రు. దీనిపై పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఒకే పార్టీలో రెండు వేర్వేరు వర్గాలుగా ఉన్నాయి.సరిదిద్దేవారేరి?ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఉన్నారు. అయితే నాలుగు జిల్లాల్లో పరిస్థితులు చక్కబెట్టే వారే కరువయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. ఇక పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం తక్కువగానే ఉంటోంది. దీంతో ఎవరికి వారే అన్నట్లు సాగుతోంది. ఓ వైపు ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా వారికి నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కడం లేదు. జిల్లా స్థాయిలో భర్తీ కావడంతో పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినా జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు ఏం ఒరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటిని చక్కబెట్టి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే అధిష్టానం ఆశలకు క్షేత్రస్థాయి నాయకుల మధ్య అనైక్యత అడ్డంకిగా మారాయి. -
బారులు తీరి.. బాధలు విన్నవించి
కై లాస్‌నగర్: భూ సమస్య పరిష్కరించాలని ఒకరు.. ఇందిరమ్మ ఇంటి బిల్లు రావడం లేదని మరొకరు.. ఉపాధి కల్పించాలని ఇంకొకరు ఇలా పలు సమస్యలతో తరలివచ్చిన బాధితులు కలెక్టర్ రాజర్షి షాకు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావే శ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా న లుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు గంట ల తరబడి బారులు తీరారు. కలెక్టర్‌కు తమ గోడు విన్నవించుకున్నారు. అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు తో కలిసి అర్జీలు స్వీకరించిన ఆయన దరఖా స్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ స త్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్వో స్రవంతి, జెడ్పీ సీఈవో రవి పా ల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.దరఖాస్తుదారు సమస్య వింటున్న కలెక్టర్ రాజర్షి షా -
ఒకే నంబర్ ప్లేట్‌తో రెండు బైక్‌లు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఒకే నంబర్ ప్లేట్‌తో రెండు బైక్‌లు ఉన్నాయి. మంచిర్యాల మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని నంనూర్‌కు చెందిన లారీ డ్రైవర్ కారుకూరి వినోద్ బైక్‌కు ఆదివారం చలాన్ పడినట్లు ఫోన్‌కు మెస్సేజ్ చూసి ఖంగుతిన్నాడు. ఓపెన్ చేసి ఫొటో క్లిక్ చేస్తే తన వాహన నంబర్ ప్లేట్ మరో బైక్‌కు ఉండడంతో అవాక్కయ్యాడు. వినోద్ వెంటనే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. కాగా, భీమారం పోలీస్‌స్టేషన్ పరిధిలో తన నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న వాహనదారుడికి లైసెన్స్ లేని కారణంగా చలాన్ విధించినట్లు వినోద్ తెలిపారు. ఒకటే నంబర్ ప్లేటు ఉన్న బైక్‌లు -
ఉద్యోగ విరమణ సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: విధి నిర్వహణలో ఎస్సై ఎండీ యూనుస్, కానిస్టేబుల్ పి.గంగారాం అందించిన సేవలు అభినందనీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ కొనియాడారు. ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరిని జిల్లా పోలీసు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్‌శాఖలో అంకితభావంతో పనిచేసిన ఇద్దరి సేవలు స్ఫూర్తిదాయకమ ని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు కార్యాలయ ఏవో శివకుమార్, సీసీ కొండరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఆశన్న, సీఐ నైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ట్రెజరీ అధికారికి..కై లాస్‌నగర్: ఉద్యోగ విరమణ పొందిన జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామచంద్రరాజును టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్ కుమార్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శివ కుమార్, ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి, ఏటీవోలు రమణాచారి, హారిక, పాల్గొన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: అర్జీలు సత్వరం పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మండలాల ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. ల్యాప్ టాప్ మంజూరు చేయాలని ఉట్నూర్ మండలం భూరుమాజీగూడకు చెందిన కుర్సెంగ మహేశ్, తనకు బ్లడ్‌కాన్సర్ చికిత్సకు ఆర్థికసా యం అందించాలని గుడిహత్నూర్ మండలం తోషం వాసి మెస్రం శ్రీను, ఇతరులు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఐటీడీఏ శాఖల అధి కారులు పాల్గొన్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ సీఐ హన్నన్ పేర్కొన్నారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝా ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రధాన చౌరస్తాల వద్ద సోమవారం తనిఖీ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని 12 బైక్‌లను గుర్తించి సీజ్ చేశారు. మరో 40 వాహనాలకు జరిమానా విధించారు. సీఐతోపాటు సిబ్బంది ఉన్నారు. మందుబాబులకు జరిమానా మంచిర్యాలక్రైం: డ్రంకెన్ డ్రైవ్‌లో ఇటీవల పట్టుబడిన 24 మందికి న్యాయమూర్తి రమేశ్ సోమవారం జరిమానా విధించారు. మందుబాబుల కు మొత్తం రూ.40,500 జరిమానా విధించిన ట్లు ట్రాఫిక్ సీఐ హన్నన్ తెలిపారు. ఒకరి రిమాండ్ మంచిర్యాలక్రైం: పోలీస్ విధులకు ఆటంకం కల్గించిన ఒకరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలి పా రు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో ఎస్సై మజా రొద్దీన్ ఆదివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. ముగ్గురు స్కూటీపై వెళ్తుండగా ఆపి తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో నలిగేటి వివేక్.. కానిస్టేబుల్‌పై దుర్బాషలాడి వీరంగం సృష్టించాడు. వివేక్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఇద్దరికి ఏడాది జైలు తానూరు: విద్యుత్ తీగలు చోరీకి పాల్పడిన ఇద్దరికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి శ్రీవాణి సోమవారం తీర్పునిచ్చింది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2023లో ముధోల్‌కు చెందిన అభిబ్ హైమద్, సయ్యద్ జీషన్లు భైంసా నుంచి ఎల్వి సబ్‌స్టేషన్‌కు సరఫరా చేసే 33 కేవీ విద్యుత్ తీగలు చోరీ చేశారు. ఏఈ ప్రదీప్ ఫిర్యాదుతో అప్పటి ఎస్సై విక్రమ్ కేసు దర్యాప్తు చేపట్టారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు అనంతరం వారిని విచారించగా నేరం రుజు వైంది. ఈమేరకు జిల్లా జడ్జి తీర్పుచెప్పారు. -
ఒప్పందాలు చూసి ఓర్వలేక విమర్శలు
శ్రీరాంపూర్: యాజమాన్యంతో ఆర్ఎల్సీ సమక్షంలో తాము చేసుకున్న మెరుగైన ఒప్పందాలు చూసి ఓర్వలేకనే టీబీజీకేఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సీసీసీ కార్నర్‌లోని నరసయ్య భవన్లో సోమవారం నిర్వహించి న కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 24 డి మాండ్లను చర్చల్లో సాధించామన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పెర్క్స్‌పై ఆదాయపన్ను చె ల్లింపు, హైదరాబాద్‌లో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, మెడికల్ బోర్డు నిర్వహణ, సొంతింటి పథకం వంటి వాటిపై చర్చల్లో కీలక ఒప్పందాలు చేసుకున్నామన్నారు. వారి గుర్తింపు సంఘం 11 ఏళ్లలో కార్మికులకు ఏ హక్కులు సాధించారో చెప్పాలని సవాల్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు వీరభద్ర య్య, వైవీ రావు, ముస్కే సమ్మయ్య, మోత్కూరి కొ మురయ్య, బద్రి బుచ్చయ్య పాల్గొన్నారు. -
కుంటాలకు కొత్త సొబగులు
నేరడిగొండ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రము ఖ పర్యాటక ప్రాంతం కుంటాల జలపాతానికి మరింత వన్నె తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా నిలిచిన ఈ జలపాతం ఇక మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. పర్యాటకులకు మె రుగైన వసతులు కల్పించడంతోపాటు, కుంటాల అందాలను మరింత పెంపొందించేలా పనులు కొనసాగుతున్నాయి. రిసార్ట్స్ అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. రూ.3.5 కోట్లతో పనులు..రిసార్ట్స్ అభివృద్ధి పనులు రూ.3.5 కోట్లతో చేపట్టా రు. అదే సమయంలో ట్రైబల్ హట్స్ నిర్మాణం కూడా కొనసాగుతోంది. పర్యాటకుల సంఖ్యను, భ విష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బోటింగ్ పాయింట్, ఓపెన్ స్టేజ్, స్విమ్మింగ్ పూల్ వంటి అ దనపు సౌకర్యాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూ పొందిస్తున్నారు. దీంతో సందర్శకులకు ప్రకృతి అందాలతో పాటు వినోదం, విశ్రాంతి సౌకర్యాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. సందర్శించిన కలెక్టర్..ఇటీవల కుంటాల ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా క లెక్టర్ రాజర్షి షా, రిసార్ట్స్ ప్రాంగణంలో అవసరమై న మౌలిక వసతులతోపాటు అదనపు సౌకర్యాల క ల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూ చించారు. పర్యాటకుల సంఖ్య, భవిష్యత్ అవసరా లను అంచనా వేసి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రిసార్ట్స్ అభివృద్ధి కేవలం భవన నిర్మాణాలకే పరిమితం కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఉండాలని, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పార్కింగ్, విశ్రాంతి ప్ర దేశాలు, భద్రత తదితర అంశాలపై సమగ్ర ప్రణా ళికతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ చొరవతో ప్రత్యేక వసతులు కుంటాల జలపాతం అభివృద్ధికి కలెక్టర్ రాజర్షిషా ప్రత్యేక చొరవ చూపుతున్నారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. జలపాతాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్నాం. పర్యాటకులకు మరిన్ని వసతులు అందుబాటులోకి తెస్తున్నాం. రెండు, మూడు నెలల్లో రిసార్ట్స్‌ను అందుబాటులోకి తెస్తాం. – రవికుమార్, జిల్లా టూరిజం శాఖ అధికారిపర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి.. పర్యాటక ప్రాంత అభివృద్ధిపై టూరిజం శాఖ ప్ర త్యేక దృష్టి సారిస్తోంది. రిసార్ట్స్‌లో మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తోంది. బోటింగ్ పాయింట్ వద్ద పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టనుంది. నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి త్వరగా సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలంలో ఇప్పటికే సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రిసార్ట్స్, ట్రైబల్ హట్స్, బోటింగ్, ఓపెన్ స్టేజ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో స్థానిక చిరు వ్యాపారులు, హోటళ్లు, రవాణా రంగాలకు ఆదాయం పెరుగుతుంది. -
‘చేయూత’కు దరఖాస్తుల వెల్లువ
కైలాస్‌నగర్: చేయూత పథకం కింద అందించే సామాజిక పింఛన్ కోసం జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. సుదీర్ఘ కాలం తర్వాత ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారిలో హర్షం వ్యక్తమైంది. గత నెల 8 నుంచి స్వీకరణ ప్రక్రియ ప్రారంభించగా 31వరకు జిల్లావ్యాప్తంగా 12,940 మంది వివిధ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ప్రభుత్వం ప్రకటించిన దరఖాస్తు గడువు సోమవారంతో ముగియగా తాజాగా మరో 15 రోజులు పొడిగించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. జిల్లాలో ఇలా.. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్, బోధకాల వ్యా ధిగ్రస్తులకు కొత్తగా పింఛన్లు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం దాదాపు ఆరేళ్ల తర్వాత దరఖా స్తుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 8నుంచి ప్రక్రి య ప్రారంభించింది. పట్టణ పరిధిలో మున్సిపాలి టీలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీ కరించారు. ఈవివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లా వ్యా ప్తంగా 20 గ్రామీణ మండలాల పరిధిలో అత్యధికంగా ఉట్నూర్‌లో 1092మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా మావల మండలంలో 125 మంది దరఖాస్తులు అందజేశారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరి ధిలో 2,528 దరఖాస్తులు అందాయి. ఇందులో వి తంతువులు 421 మంది, ఒంటరి మహిళలు 61, దివ్యాంగులు 149, గీతకార్మికులు ముగ్గురున్నారు. మరో 15 రోజుల గడువు పెంపు ప్రభుత్వం తొలుత ప్రకటించిన దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. అర్హులై ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని వారి కోసం తాజాగా మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఈమేరకు జిల్లా అధి కారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంకా ఎవరైనా అర్హులుంటే సెప్టెంబర్ 15వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పింఛన్ విభాగం డీపీఎం జాదవ్ శేష్‌రావు తెలిపారు. కేటగిరీల వారీగా అందిన దరఖాస్తుల వివరాలు వితంతువులు 8,694 ఒంటరి మహిళలు 1,241 దివ్యాంగులు 2,967 చేనేత కార్మికులు 3 గీత కార్మికులు 35 -
పశుసంపద వృద్ధిపై ప్రత్యేక దృష్టి
తలమడుగు: జిల్లాలో పశుసంపద వృద్ధిపై రైతులు ప్రత్యేక దృష్టిసారించాలని ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దూద్రామ్ రాథోడ్ పేర్కొన్నారు. మండలంలోని భరంపూర్, ఝరి గోపాలమిత్ర కేంద్రాలను సోమవారం సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల, పశువులకు అందిస్తున్న కృత్రిమ గర్భధారణ గురించి వి వరాలను గోపాలమిత్రలను అడిగి తెలుసుకున్నా రు. రైతులు ప్రతీ ఆవులు, గేదెల చెవులకు గుర్తింపు ట్యాగ్లు వేయించాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 111 గోపాలమిత్ర సేవ కేంద్రాలు ఉన్నాయని వీ టిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భరంపూర్ సర్పంచ్ దేవన్న, గ్రామపెద్దలు కేదారేశ్వరరెడ్డి, కార్యదర్శి అనిల్‌రెడ్డి, తలమడుగు సర్పంచ్ చంటి, లక్ష్మీనారాయణ, సాయి, పవన్, గోపాలమిత్ర జంగు స్వామిరెడ్డి గంగన్న తదితరులు ఉన్నారు. -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రెబ్బెన: ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కెరమెరి మండలం గోయగాం పంచాయతీ ఇందాపూర్‌కు చెందిన వాడై మునేశ్వర్ (28) కాగజ్‌నగర్‌లో పనిచేస్తుంటాడు. రోజు వెళ్లి వస్తుంటాడు. సోమవారం రాత్రి పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. రెబ్బెన మండలం రాంపూర్, నవేగాం బస్టాప్‌ల మధ్య చేరుకున్నాడు. ఎదురుగా బెజ్జూర్‌కు వెళ్తున్న ఆదిలాబాద్ డిపో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఎగిరిపడిన మునేశ్వర్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోక్సో కేసు.. యువకుడి అరెస్టు కౌటాల(బెజ్జూర్): బెజ్జూర్ మండలంలోని ఓ గ్రా మానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన యువకుడు రౌతు మహేశ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సర్తాజ్ పాషా సోమవారం తెలిపారు. బాలిక ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరిట పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మహేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. చికిత్సపొందుతూ మృతి పాముకాటుతో వృద్ధుడు.. -
మరోసారి.. అదే తీరు
మరోసారి అదే తీరుకైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. నలు గురు సభ్యుల ఎన్నిక కోసం సోమవారం మధ్యాహ్నం 3గంటలకు కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేక వాహనాల్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి హాజరయ్యారు. సభ్యులను మిన హా ఇతరులేవరిని పోలీసులు లోనికి అనుమతించలేదు. కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తొలుత సభ్యుల సంతకాలు తీసుకున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 51 మంది ఉండగా ఎంఐఎం, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు గైర్హాజరయ్యారు. పకడ్బందీ బందోబస్తు ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్యాలయానికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇతరులెవరినీ లోనికి అనుమతించలేదు. వన్‌టౌన్, టూ టౌన్ సీఐలతో పాటు పలువురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి స్వయంగా కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.మెజారిటీ ఉన్నా అడ్డుపడ్డారు..సమావేశ నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని చైర్పర్సన్ హైకోర్టును ఆదేశించడంతో కోర్టు నాలుగు వారాల సమయమిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జరిగిన సమావేశంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరపాల్సి ఉంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు దాన్ని పాటించకుండా ఏదో అనవసరమైన అంశాన్ని తెరపైకి తెచ్చి గందరగోళం సృష్టించారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. అయినప్పటికీ సీటుపై ఉంది మా చైర్‌పర్సనే అనే ఉద్దేశంతో ఆయా పార్టీల సభ్యులు ఆందో ళన చేసి ఎన్నికకు అడ్డుపడ్డారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఆ పార్టీల చెంపచెల్లుమనిపించేలా కోర్టు డైరెక్షన్ వస్తుందనే నమ్మకం ఉంది. – గోడం నగేశ్, ఎంపీ సభ్యుల డిమాండ్ మేరకే వాయిదాఎమ్మెల్యే భూకబ్జాలు, అక్రమాలపై విచారణ జరపాలని పలువురు సభ్యులు పట్టుబట్టారు. పట్టణంతో పాటు భోరజ్ మండలం హత్తి ఘాట్, గూడ, రాంపూర్ ఇండస్ట్రీయల్ కారి డార్కు సంబంధించి ఈడీ ఆధీనంలో ఉన్న భూములను బినామీల పేరిట అమ్మేసి అక్రమాలకు పాల్పడినట్లు సమావేశం దృష్టికి తెచ్చారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపించా కే ఎన్నిక నిర్వహించాలని సభ్యులు ఆందోళన కొనసాగించారు. ప్రజా సమస్యలపై చర్చించే సమావేశాలకు గైర్హాజరైన బీజేపీ సభ్యులు కోఆప్షన్‌పై ఎందుకంతా ఆసక్తి చూపుతున్నారని ప్రశ్నించారు. వారడిగింది సరైందే కనుక సమావేశాన్ని వాయిదా వేశాను. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. – బండారి అనూష, మున్సిపల్ చైర్పర్సన్ హైకోర్టును ఆశ్రయిస్తాం.. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి అడ్డుకోవాలనే కుట్ర తోనే ఈ ఎన్నికను వాయిదా వేశారు. లోపల జరిగి న సమావేశంనంతటిని వీడియోలో చిత్రీకరించాం. దాన్ని హైకోర్టుకు సమర్పిస్తాం. 27 మంది సభ్యులు నలుగురు బీజేపీ సభ్యులకు మద్దతునిస్తున్నామని చెప్పి కమిషనర్, చైర్‌పర్సన్‌కు రాత పూర్వకంగా అందజేశారు. స్పష్టమైన మెజార్టీ ఉన్నా బీజేపీకి అవకా శం ఇవ్వవద్దనే దురుద్దేశంతోనే ఎన్నికను అడ్డుకున్నా రు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. పట్టణ ప్రజ లు అంతా గమనిస్తున్నారు. తాను ఏదైనా తప్పుచేసి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందు న విచారణ చేయించవచ్చు. 30సార్లు వాయిదా వేసినా బీజేపీ ఎదుగుదలను అడ్డుకోలేరు. మాకు స్పష్టమైన మెజార్టీ ఉంది. న్యాయపరంగా పోరాడుతాం. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే కూటమి సభ్యుల ఆందోళన సమావేశం ప్రారంభంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు చైర్పర్సన్ పోడియం వద్దకువెళ్లి ఆందోళనకు దిగా రు. ఎమ్మెల్యే శంకర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్ర దర్శిస్తూ నిరసన చేపట్టారు. పట్టణంలో జరిగిన ఎమ్మెల్యే భూకబ్జాలపై విచారణ జరపాలని, విచా రణ పూర్తయ్యాకే కోఆప్షన్ ఎన్నిక నిర్వహించాలంటూ పట్టుబట్టారు. మరోవైపు ఎన్నిక నిర్వహించా ల్సిందేనని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇరువర్గాల నినాదాలతో సమావేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా చైర్పర్సన్ ప్రకటించా రు. కూటమి సభ్యులతో కలిసి బయటకు వచ్చా రు. సభ్యులు మరోసారి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మరోవైపు బీజేపీ సభ్యులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే బయటకు వచ్చారు. వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. -
చివరి స్టేటస్..
గ్రామానికి చెందిన దాగాం సావిత్రి బాయి, గంగాధర్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు వివాహం జరిపించారు. కొడుకు తులసీరామ్‌కు భైంసాకు చెందిన యువతితో గత వేసవిలో వివాహం చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే తులసీరామ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో సాసర్ కుండ్‌కు వెళ్లాడు. భార్యతో కలిసి అక్కడ దిగిన ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ ఆనంద దృశ్యాలు చెరిగిపోకముందే విధి వెక్కిరించింది. సోమవారం గ్రామస్తులను జీపులో యాత్రకు తీసుకెళ్లిన తులసీరామ్ తిరుగు ప్రయాణంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్టేటస్ పెట్టి 24 గంటలు కూడా గడవకముందే అతను లేడన్న విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భైంసా ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. -
ఆవుదూడలు పట్టివేత
సిర్పూర్(టి): మహారాష్ట్రలోని సరిహద్దు గ్రా మమైన పోడ్సా గ్రామంలో ఆవు డూడలను కొనుగోలు చేసి వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు సిర్పూర్(టి) ఎస్సై సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకట్రావ్‌పేట్ స మీపంలో ఆదివారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని ఆపి తనిఖీ చే యగా నాలుగు ఆవు దూడలు ఉన్నాయి. వా టిని గోలేటి గోశాలకు, వాహనాన్ని సిర్పూర్(టి) పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్రమ రవాణా చేస్తున్న మహ్మద్కై ఫ్, అబ్దుల్ కరీం కుర్షి, ఖాజా యాకూబొద్దీన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా అరెస్టు
భైంసా: రాత్రివేళల్లో ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠా సభ్యులను ముధోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భైంసా పోలీసుస్టేషన్లో ఏఎస్పీ సాయికిరణ్ సోమవారం వివరాలు వెల్లడించారు. భైంసా డివిజన్లోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో గత ఎనిమిది నెలల్లో నమోదైన 33 ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. వారి నుంచి 250 కిలోల రాగి తీగ, నాలుగు బైక్‌లు, ఏడు సెల్ఫోన్లు, ఎనిమిది పానాలు, కటింగ్ ప్లేయర్, దబ్బనం స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో విలువైన రాగి తీగను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ముధోల్ పరిధిలో 8, తానూర్‌లో 11, కుభీర్‌లో 4, బాసరలో 3, భైంసా టౌన్లో 3, భైంసా రూరల్‌లో 2, కుంటాలలో 2 కేసులు నమోదయ్యాయి. ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ భైంసా పర్యవేక్షణలో ట్రాన్స్ఫార్మర్ చోరీల ఛేదనకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేయడంతో ముఠా కదలికలపై నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. మహారాష్ట్రకు చెందినవారే..నిందితులను మహారాష్ట్రలోని ధర్మాబాద్, రత్నేల్లి ప్రాంతాలకు చెందిన పెడికే గణేశ్, పిట్లోల్ల పోశెట్టి, ఘోగరే దీపక్, గంటలవాడ్ సాయినాథ్, గజనంద్, నక్కలవాడ్ గణేష్ తదితరులుగా పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించి న ముధోల్, బాసర, తానూరు పోలీసు అధికారులు , సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. -
విషాద యాత్ర
భైంసా/కుభీర్: శ్రావణ సోమవారం సందర్భంగా నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(బి) గ్రామానికి చెందిన పది మంది తీర్థయాత్ర విషాదాంతమైంది. పుణ్యక్షేత్రంలో దైవదర్శనం చేసుకుని, పూజలు చేసి.. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న జీపు మహారాష్ట్రలో తోటంబా ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పార్డి(బి) గ్రామానికి చెందిన తూము సాయిలు(60), ఆవుల గంగన్న(63), తూము గౌరాబాయి(70)తోపాటు ఆవుల ప్రేమలబాయి, తూము ముత్తుబాయి, తూముల కిషన్, బ్యారపు మోనాజీ, దొర్లా శంకర్, పుష్ప భాయ్, దనగర్ మల్లయ్య, శంకర్ గ్రామానికే చెందిన తులసీరామ్(27)జీపులో సోమవారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్రలోని కై లాస్‌టెకిడి శివాలయ దర్శనానికి బయల్దేరారు. మధ్యాహ్నం వరకు అక్కడకు చేరుకుని పూజలు చేశారు. తిరుగు ప్రయాణంలో సాసర్ కుండ్ జలపాతం వద్దకు వెళ్లారు. తర్వాత స్వగ్రామానికి బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు కుభీర్, భైంసా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చివరి ప్రయాణం.. తూము సాయిలు(60)–భార్య ముత్తుబాయితో కలి సి యాత్రకు వెళ్లాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెళ్లిళ్లు జరిపించారు. మలి వయసులో కుటుంబంతో ప్రశాంతంగా జీవించాల్సిన దశలో ఆయన పుణ్య క్షేత్ర యాత్రలోనే మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో భార్య ముత్తుబాయి ప్రాణాలతో బయటపడింది. భర్తను కోల్పోయిన ఆమె ఏడుపు అక్కడున్న వారిని కలచివేసింది. ఇక ఆవుల గంగన్న(63)–ప్రేమలబాయి దంపతులు కూడా యాత్రకు వెళ్లారు. ప్రమాదంలో గంగన్న మృతి చెందాడు. ప్రేమలబాయి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందరికీ వివాహం చేశారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే ప్రమాదంలో మృతిచెందిన తూము గౌరాబా యి(70) భర్త మూడేళ్ల క్రితమే మరణించాడు. ఇద్దరు కుమారుల పెళ్లిళ్లు చేసి కుటుంబంతో కలిసి మలిదశ జీవనం సాగిస్తోంది. గ్రామస్తులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఆమెకు ఈ యాత్రే ఆఖరి ప్రయాణమైంది.చెల్లాచెదురైన క్షతగాత్రులు.. ఘాట్ దిగుతుండగా జీపు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఎగిరి రోడ్డుపై పడ్డారు. జీపు టైరు ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు కొందరు చెబుతున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం భీతావాహంగా మారింది. క్షతగాత్రుల రోదనలు విన్న సమీప గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం చేశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కుటుంబాలకు సమాచారం అందించారు. -
ముగిసిన మాజీ మావోయిస్టు రాధక్క ప్రస్థానం
ఆదిలాబాటౌన్: మావో యిస్టు ఉద్యమంలో దా దాపు మూడు దశాబ్దాలపాటు పనిచేసిన కా మ్రేడ్ కుర్సంగె మోతిబా యి అలియాస్ రాధక్క ప్రస్థానం ముగిసింది. అనారోగ్యంతో ఆదిలా బాద్ రిమ్స్‌లో చేరిన ఆమె చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందారు. గత కొంతకాలంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి ఉద్యమ సహచరులు సంతాపం తెలిపారు. దండకారణ్యంలో కీలక బాధ్యతలు2003లో రాధక్క దండకారణ్యానికి బదిలీపై వెళ్లారు. అక్కడ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘానికి నాయకత్వం వహించారు. ఈక్రమంలో ఆమెకు గుండె సంబంధిత సమస్య తీవ్రమైంది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆమె అరెస్టయ్యారు. 2013–16 వరకు తెలంగాణలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవించారు. ఆ తర్వాత విడుదలయ్యారు. అనంతరం తన సహచరుడితో కలిసి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో నివసించారు. నేడు అంత్యక్రియలురాధక్క అంత్యక్రియలు మంగళవారం ఉద యం 11 గంటలకు ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి రోడ్‌లోని వాన్వాట్–మామిడిగూడ మధ్యలో గల లింగూగూడలో నిర్వహించనున్నట్లు ఆమె సహచరులు తెలిపారు. ఈ సందర్భంగా రాధక్కకు ఉద్యమ సహచరులు జోహార్లు అర్పించారు. 1984లో ఉద్యమంలోకి..కామ్రేడ్ రాధాక్క 1984లో సీపీఐ(ఎంఎ ల్) పీపుల్స్‌వార్‌లో చేరారు. తొలుత సిర్పూర్ దళంలో సభ్యురాలిగా పనిచేశా రు. 1986లో పార్టీ సభ్యత్వం పొందారు. 1989లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, 2000లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలిగా ఎదిగారు. -
వామ్మో పులి
బోథ్: సొనాల మండల పరిధిలోని చింతలబోరి, అజ్జర్ వజ్జర్ అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. దేవులనాయక్ తండాకు చెందిన రైతు రాథోడ్ వసంత్‌కు చెందిన ఆవును, ఫూల్సింగ్ నాయక్ తండా గ్రామానికి చెందిన ఆడె కిశోర్‌కు చెందిన దూడను హతమార్చిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. గ్రామం నుంచి ఇద్దరు కాపరులు రాథోడ్ మఖూన్, రాథోడ్ రవి రోజు మాదిరిగా శనివారం మేత కోసం పశువులను అడవికి తీసుకెళ్లారు. అవి మేస్తుండగా పొదల మాటున ఉన్న పులి ఒక్కసారిగా వాటిపై దాడి చేసింది. పశువుల అరుపులతో అప్రమత్తమైన కాపారులు కేకలు వేయడంతో పులి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆవు, దూడ చనిపోయాయి. విషయాన్ని కాపరులు వెంటనే గ్రామస్తులకు తెలిపారు. వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. బోథ్ ఇన్చార్జి ఎఫ్ఆర్వో కవిత ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం పులి దాడిలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. బెబ్బులి కదలికలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అడవిలో ట్రాప్ కెమెరాలను అమర్చినట్లు పేర్కొన్నారు. బాధిత రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పులి సంచారం దృష్ట్యా అటవీ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ముదిరాజ్‌ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా
● ఎమ్మెల్యే పాయల్ శంకర్ఆదిలాబాద్: ముదిరాజ్‌ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, వారి అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన భీమన్న, పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆలయంలో పూ జలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ బీసీలు ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే అంశంపై నా వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఇందులో మాజీ మంత్రి రామన్న, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, చిట్యాల సుహాసినిరెడ్డి, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు దారవేణి రాము, నగేశ్, రవి, లస్మన్న, రాజు, శివయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నాభావుసాఠే నేటి తరానికి స్ఫూర్తిదాయకం
ఇంద్రవెల్లి: అన్నాభావుసాఠే తన రచనలు, సా హిత్యం ద్వారా సమాజహితం కోసం చేసిన కృషి నేటితరానికి స్ఫూర్తిదాయకమని ఎంపీ గో డం నగేశ్ అన్నారు. మండలంలోని హీరాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన అన్నాభా వుసాఠే జయంతి కార్యక్రమానికి ఎంపీ హాజరై మాట్లాడారు. యువత అన్నాభావుసాఠే జీవితా న్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కామ్లే బాలాజీ, కేస్లాపూర్, తేజ్‌పూర్ సర్పంచ్‌లు మెస్రం తుకారాం, కోవ రాజేశ్వర్, అన్నాభావుసాఠే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కిశోర్, మాంగ్ సమాజ్ నాయకులు రామారావ్, గోవింద్, నర్సయ్య, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం 000000000000000000000000000000000000000000000000000000000000
పేదల సొంతింటి కల సాకారంతాంసి: ఇందిరమ్మ పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. మండలంలోని పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారు లక్ష్మి–రామన్న నూతన గృహ ప్రవేశానికి కలెక్టర్ ఆదివారం హాజరయ్యారు. దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులందరికీ విడతల వారీ గా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కా ర్యక్రమంలో ఆత్మచైర్మన్ నారాయణ, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ జాదవ్ గణేశ్, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచ్ రాంరెడ్డి, పంచా యతీ కార్యదర్శి గంగన్న తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నీట్ పీజీ ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని నలంద కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్–పీజీ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ రాజర్షిషా కేంద్రాన్ని తనిఖీ చేశా రు. నిర్వహణ తీరు, వసతులపై ఆరా తీశారు. అ భ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పా ట్లు చేయాలని, ప్రవేశ ప్రక్రియ, బయోమెట్రిక్ తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రంలో మొత్తం 100 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, డీఐ ఈవో గణేశ్ జాదవ్, పరీక్షల లైజన్ అధికారి శ్రీధర్, తహసీల్దార్ వేణు, అధికారులు, కళాశాల ప్రతినిధులు తదితరులున్నారు. రేపు గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశంఆదిలాబాద్టౌన్: జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని తనిషా గార్డెన్లో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరవుతారని తెలిపారు. పట్టణ, ఆయా మండలాలు, గ్రామాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. -
హస్తంలో అసమ్మతి
సాక్షి, ఆదిలాబాద్: ‘ఉట్నూర్ పీఏసీ సమావేశంలో ఇటీవల జరిగిన గొడవకు ముఖ్య కారకులు జిల్లా అధ్యక్షుడు నరేశ్జాదవే. పీఏసీ కమిటీ ఏర్పాటులో ఆయన నియోజకవర్గ ఇన్చార్జీలను సంప్రదించలేదు. ప్రొటోకాల్‌లో ఉన్న వారిని కాకుండా తనకు నచ్చిన మాజీ నాయకులను తీసుకున్నారు. అందుకే ఆ గోడవ జరిగింది. ఈ విషయం మీ దృష్టికి తెస్తున్నాను..’ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్‌పై పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్ శనివా రం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చేసిన ఫిర్యాదుల్లో ఇదొక్కటి. జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి రగులుతోంది. ఇటీవల ఉట్నూర్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా పీఏసీ సమావేశంలో జరిగిన గొడవ మరిచిపోకముందే బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి గజేందర్ ఏకంగా జిల్లా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ తాడోపేడో తేల్చుకునేందుకు టీపీసీసీకే ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఆయన నియోజకవర్గం నుంచి సుమారు 40 వాహనాల్లో వందలాది మంది కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌కు తరలివెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి ఫిర్యాదు చేయడం పార్టీలో సంచలనం కలిగిస్తోంది. ఫిర్యాదు అంశాలు ఇలా.. బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతమే ల క్ష్యంగా తాను నిరంతరం పనిచేస్తున్నప్పటికీ తనపై నరేశ్‌జాదవ్ టీపీసీసీ, జిల్లా ఇన్చార్జి మంత్రి, అధి ష్టానం వద్ద నిత్యం ఫిర్యాదులు చేస్తున్నాడని గజేందర్ పేర్కొన్నాడు. దీంతో పార్టీ అంతర్గత ఐక్యత దెబ్బతింటుంది. గ్రూపు రాజకీయాలు పెరిగాయి. జిల్లా కాంగ్రెస్ కార్యవర్గంలో ఓ పది మంది మినహా మిగతా అందరూ పార్టీ కోసం చురుగ్గా పనిచేయని వారిని ఎంపిక చేశారు. ఏఐీసీసీ, టీపీసీసీ పిలుపుని చ్చే ధర్నాలు, నిరసనలు ఇతరకార్యక్రమాల్లో కూడా జిల్లా కార్యవర్గ సభ్యుల హాజరు పదిమంది కంటే ఎక్కువగా ఉండటం లేదు. నియోజకవర్గ ఇన్చార్జీ లు, సీనియర్ నాయకులు, మండల స్థాయి నాయకులతో తగిన సంప్రదింపులు జరుపకుండా మండ ల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియామకం చేశా రు. నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించడం లేదు. హైదరాబాద్‌కే ఎక్కువగా పరి మితమవుతున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు ఆయన వచ్చిన నాటి నుంచి ఆగిపోయాయి. పార్టీ నుంచి పలువురు బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. సొంత మండలం గుడిహత్నూర్లోనే ఈ పరిస్థితి ఉంది. జిల్లా ఇన్చార్జి మంత్రి, సర్ ఇన్చార్జీలు జిల్లాకు వచ్చినప్పుడు మాత్ర మే సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఓటరు సవరణ ప్రక్రియను సరిగా పర్యవేక్షించడం లేదు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చే ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు స్వయంగా పాల్గొనడం లేదు. పార్టీ పదవులు అనుబంధ సంస్థల కార్యవర్గాలు, మండల అధ్యక్షుల నియామాకాల్లో నియోజకవర్గ ఇన్చార్జీ లను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. దీని వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. సంతగ్రామంలో సర్పంచ్‌ను గెలిపించుకోలేకపోయారు. తాను మాత్రం 110 మంది సర్పంచ్‌లను నియోకవర్గంలో గెలిపొందేలా కృషి చేశానంటూ ఫిర్యాదులో గజేందర్ వివరించాడు. అతన్ని తొలగించండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడానికి సంస్థాగతంగా తగిన మార్పులు చేయాల్సిన అవసరముందని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి గజేందర్ తీసుకెళ్లాడు. జిల్లాలో పార్టీ ప్రస్తుత పరిస్థితిపై సమ గ్ర సమీక్ష నిర్వహించి నియోజకవర్గ ఇన్చార్జీలు, సీనియర్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరాడు. నరేశ్‌జాదవ్‌ను అధ్యక్ష పదవీ నుంచి తప్పించి సమర్థుడైన కొత్త వారిని నియమించాల్సిన అవసరముందని వివరించాడు. మహేశ్‌కుమార్ గౌడ్ ప్రతిస్పందన.. గజేందర్ కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌లో మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు అందజేసే సందర్భంగా ఆయన ప్రతిస్పందించారు. పార్టీ పదవుల పరంగా కొత్తగా వచ్చిన వారికి ఒకటి, రెండు ఇవ్వడం జరుగుతుందన్నారు. ముందు నుంచి పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. వారి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చింది గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నరేశ్‌జాదవ్, అడె గజేందర్ చెప్పిన వారికో, ఎవరో ఇచ్చిన జాబితాలో ఉన్న వారికి పదవులిస్తే పార్టీ సంకనాకిపోతుందని స్పష్టం చేశారు. కేడర్‌కు భరోసానిచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రూల్ ప్రకారమే పదవులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. -
స్వతంత్రులకు అదృష్టం!
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్ని క పొలిటికల్ హీట్ పెంచగా ఇండిపెండెంట్ కౌన్సి లర్లను మాత్రం అదృష్టం వరించనున్నట్లు తెలు స్తోంది. ఈ నెల 31న జరిగే కోఆప్షన్ ఎన్నికలో వీరి మద్దతే కీలకం కానుండగా.. ప్రసన్నం చేసుకునేందుకు అధికార, విపక్షాలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నా యి. నాలుగు స్థానాలను ఎలాగైనా కై వసం చేసుకు ని చైర్పర్సన్ ఎన్నికలో ఎదురైన భంగపాటుకు ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అలాగే కూటమిగా ఏర్పడి బల్దియా పీఠాన్ని కై వసం చేసుకున్న కాంగ్రెస్ సైతం ‘కమలం’ పార్టీ ఆశలకు గండికొట్టాలని భావిస్తోంది. దీంతో ఆయా పార్టీలు ఇండిపెండెంట్లను ఆకర్షించేలా వరాలజల్లు కురిపిస్తున్నాయి. కూటమి తరఫున కొత్త అభ్యర్థులు తెరపైకి రావడంతో సోమవారం వరకు పరిణామాలు మారే అవకాశముందని తెలుస్తోంది. భారీగా బేరసారాలు ఈ ఎన్నికలో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కూటమితో పాటు విపక్ష బీజే పీ భావిస్తోంది. ఇందులో స్వతంత్ర కౌన్సిలర్ల మద్ద తే కీలకం కానుండటంతో వారితో ఇరు పార్టీలు బేరసారాలు సాగిస్తున్నాయి. డిమాండ్ మేరకు ఒక్కో సభ్యుడికి రూ.15లక్షల నుంచి రూ.25లక్షల వరకు ముట్టజెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థులు ఇందులో సగం ఖర్చు భరించేందుకు సి ద్ధంగా ఉండటంతో ఎలాగైనా కై వసం చేసుకోవా లని ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. బీజేపీ ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లను మహారాష్ట్రలోని ప్రత్యేక క్యాంపులకు తరలించింది. ఇందుకుగాను భారీ న జరానాతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, బల్దియా అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యత ఇస్తామని వారిని తమ శిబి రంలోకి రప్పించారు. ఈ క్రమంలో కూటమి నేతలు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన స్థానిక ముఖ్య నేతలతో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి శనివారం ఫోన్లో ప్రత్యేకంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే సమావేశ ఎజెండాను తీసుకునేందుకు నిన్నటి వరకు వెనుకంజ వేసిన బీఆర్ఎస్ సభ్యులకు దాన్ని తీసుకోవాలంటూ పార్టీ ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మారుతున్న సమీకరణాలు ప్రత్యేక సమావేశ గడువు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నిన్నటి వరకు పార్టీ తరఫున గెలుపొందిన 21మంది కౌన్సిలర్లు, ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో సభ్యులతో పాటు నలుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో 27 సభ్యుల సంపూర్ణ మెజార్టీతో నాలుగు పదవులను సులువుగా కై వసం చేసుకుంటామని బీజేపీ భావించింది. ఈ క్రమంలో కూటమి నుంచి మాజీ మంత్రి జోగు రామన్న, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ శిబిరంలో ఉన్న ఇద్దరు సభ్యులతో వారు మంతనాలు సాగిస్తూ తమవైపునకు రప్పించే ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా చర్చ సాగుతుంది. కూటమి తరఫున కొత్త అభ్యర్థులకు మద్దతునిచ్చే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ తనకు మద్దతునిస్తే రూ.25లక్షలు వెచ్చిస్తానని కూటమి ముఖ్య నేతలకు చెప్పినట్లుగా వినిపిస్తోంది. బీజేపీ తరఫున మైనార్టీ కోటా కింద మద్దతు ఆశిస్తున్న మాజీ కౌన్సిలర్ సైతం ఎంత ఖర్చుకై నా వెనుకాడేది లేదని చెబుతుండటంతో ఇండిపెండెంట్లపై కనకవర్షం కురిసే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతుంది. చైర్పర్సన్ ఎన్నిక సమయంలో ఒప్పుకున్న నగదు పూర్తిస్థాయిలో ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న ఓ కౌన్సిలర్ ఆశించిన తాయిలం అందిస్తే కూటమి వైపు వచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో స్వతంత్ర కౌన్సిలర్ తనకు రూ.25లక్షలు ఇస్తే మీకే మద్దతునిస్తానంటూ కూటమినేతలకు భరోసానిచ్చినట్లుగా సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీలు వారడిగినంత ముట్టజెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ రాజకీయంగా జోరుగా సాగుతుంది. అయితే ఆదివారం నాటికి ఈ పరిణామాలు మారి మెజార్టీపై స్పష్టతవచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కలెక్టర్‌ను కలిసిన బీజేపీ కౌన్సిలర్లు కాగా బీజేపీ సభ్యులు శనివారం కలెక్టర్ రాజర్షి షాను మరోసారి కలిసి సమావేశ నిర్వహణ పారదర్శకంగా జరిగేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు. గత సమావేశంలో ఎదురైన ఘటనలను ప్రస్తావిస్తూ సమావేశాన్ని లైవ్‌గా టెలికాస్ట్ చేసేలా ఏర్పాట్లు చేయాలని, అలాగే సమావేశ మందిరంలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని కోరారు. కమిషనర్ ఆధ్వర్యంలో కాకుండా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమావేశం జరిగేలా చూడాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.


