కై లాస్‌నగర్: దివ్యాంగులకు అందిస్తున్న చేయూత పింఛన్‌ను రూ.6వేలకు పెంచాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యను బుధవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, స్ట్రీట్ వెండర్ షాపుల్లో 5శాతం షాపులను దివ్యాంగులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల చట్టం– 2016ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బావునే నగేశ్, ఉగ్గే నానయ్య తెలిపారు. చైర్మన్‌ను కలిసిన వారిలో సంఘ నాయకులు సయ్యద్ హంజ, వినోద్, మేరాజ్, రాకేశ్, సంతోష్ తదితరులున్నారు.


