ఆదిలాబాద్‌టౌన్: నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు షురూ కానున్నాయి. ఏప్రిల్ 13 వరకు కొ నసాగనున్నాయి. విద్యా శాఖాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నా రు. ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఉంటాయి. అయితే ఈసారి పరీక్షలు దాదాపు నెల పాటు కొనసాగనున్నాయి. ఒక్కో పరీక్షకు మూడు నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంది. మరో వైపు మాస్ కాపీయింగ్ జరగకుండా నిఘా కట్టుదిట్టం చేశారు. ఆయా కేంద్రాల్లోని చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి సమక్షంలో పేపర్ తెరడం, సీల్ వేయ డం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలు..
పరీక్షలకు మొత్తం 10,888 మంది విద్యార్థులు హా జరుకానున్నారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డి పార్ట్‌మెంటల్ అధికారులు, 13 కస్టోడియన్లు, ము గ్గురు అదనపు డిపార్ట్‌మెంటల్ అధికారులు, 545 మంది ఇన్విజిలెటర్లను నియమించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఎంఈవో, సీనియర్ హెచ్‌ఎం, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు.
కేంద్రాల్లో సౌకర్యాలు..
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, తాగునీరు, వైద్య సేవలతో పాటు పూర్తిస్థాయిలో బెంచీలను ఏర్పా టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంటున్నారు. ఆయా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు. విద్యార్థులకు ఏ వైనా ఇబ్బందులు తలెత్తితే జిల్లా కేంద్రంలోని డీఈ వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 90329 74127 నంబర్‌పై కూడా సంప్రదించవచ్చు.


