వంటగ్యాస్‌ పక్కదారి పట్టిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

వంటగ్యాస్‌ పక్కదారి పట్టిస్తే చర్యలు

Mar 14 2026 7:39 AM | Updated on Mar 14 2026 7:39 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: జిల్లాలో వంట గ్యాస్‌ కొరత లేదని, ఎక్కడైనా పక్కదారి పట్టిస్తే కఠిన చ ర్యలు తప్పవని కలెక్టర్‌ రాజర్షి షా హెచ్చరించారు. ఎల్‌పీజీ సరఫరా నిలిచిన వైనాన్ని వివరిస్తూ ‘నో స్టాక్‌’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నో స్టాక్‌ బోర్డులు ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రంలోని విమల్‌ గ్యాస్‌ ఏజెన్సీనీ శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశా రు. స్టాక్‌, ఆన్‌లైన్‌ బుకింగ్‌ వివరాలను స్వయంగా పరిశీలించారు. సిలిండర్ల సరఫరా, డెలివరీ వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విని యోగదారులతో మాట్లాడి బుకింగ్‌, సరఫరా వంటి అంశాలపై ఆరా తీఽశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సిలిండర్ల కొరతపై సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. జిల్లాలో వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదన్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వెంటనే వినియోగదారులకు సిలిండర్లు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వారికి సిలిండర్లను డోర్‌ డెలివరీ చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. పౌరసరఫరా, రెవెన్యూ పోలీస్‌ శాఖలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా 1800–425–1939 టోల్‌ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఆ యన వెంట అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, డీఎస్‌వో నందిని, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement