నేను ఇటీవలే సర్పంచ్‌గా ఎన్నికయ్యా. నిధులు వస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నిధులను బ్యాంకు అధికారులు ట్రాక్టర్ కిస్తీల కింద జమ కట్టుకున్నారు. ఏం మిగలకపోవడంతో ప్రస్తుతం జీపీలో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే మరిన్ని నిధులు విడుదల చేయాలి.
– రూప్‌చంద్, సర్పంచ్,
బాబెరతండా, బోథ్ మండలం
త్వరలోనే మరిన్ని నిధులు..
ఇటీవల పంచాయతీ లకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. రెండేళ్లుగా ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఆ నిధుల నుంచి చెల్లించాల్సి వచ్చింది. చిన్న పంచాయతీలకు కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితి వాస్తవమే. జీపీలకు త్వరలోనే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. – రమేశ్, డీపీవో


