విజయ్‌తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత | TVK Vijay Wife Sangeetha Files Another Petition To Stay In Their Home Until Divorce Case Is Resolved | Sakshi
Sakshi News home page

విజయ్‌తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత

Mar 7 2026 12:34 PM | Updated on Mar 7 2026 12:47 PM

TVK Vijay Wife Sangeetha Again Petition in court

తమిళ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌కి ఆయన సతీమణి సంగీత షాక్‌ ఇచ్చింది. తాజాగా కోర్టులో ఆమె  మరో పిటిషన్‌ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్‌తో పాటుగా ఉండేందుకు అనుమతి కావాలని పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సంగీత విడాకులు కేసు ముగిసే వరకు విజయ్‌ ఇంట్లోనే ఉంటానని పేర్కొనడం విశేషం.

విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ కొద్దిరోజుల క్రితం సంగీత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో గత నెల 24న ఆమె పిటిషన్‌ వేసింది. 2021లో ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడటం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది.  ఏప్రిల్‌ 20న వారి విడాకుల పిటిషన్‌ విచారణకు రానుంది. ఆ రోజు  కోర్టుకు విజయ్‌ హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే నోటీసు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement