టాలీవుడ్ ప్రముఖ నటుడి ఇంట విషాదం | Actor Muralidhar Goud Wife Passed Away | Sakshi
Sakshi News home page

Muralidhar Goud: 'డీజే టిల్లు' నటుడి ఇంట విషాదం

Mar 6 2026 9:19 PM | Updated on Mar 6 2026 9:19 PM

Actor Muralidhar Goud Wife Passed Away

'డీజే టిల్లు' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈయన భార్య శశికళ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. చికిత్స పొందుతూ గురువారం మరణించారు. దీంతో మురళీధర్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

(ఇదీ చదవండి: నా కథని మానభంగం చేశారు.. టాలీవుడ్ స్టార్ రైటర్ షాకింగ్ పోస్ట్)

గతంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన మురళీధర్ గౌడ్.. రిటైర్ అయిన తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు చేశారు. అలా 2018లో రిలీజైన 'రంగస్థలం'లో చిన్న పాత్ర చేశారు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత బలగం, మేం ఫేమస్, మ్యాడ్, టిల్లు స్కేర్ తదితర చిత్రాలు చేశారు. గతంలో భార్యతో కలిసి పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. శశికళ.. గతంలో రామాయంపేట, పంచాయతీగా ఉన్నప్పుడు వార్డ్ మెంబర్‌గా కూడా పనిచేశారట.

(ఇదీ చదవండి: చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?)

Advertisement
 
Advertisement
Advertisement