అల్లు అర్జున్ సోదరుడు శిరీష్.. ఈ రోజే నయనికని పెళ్లి చేసుకోనున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగ్గా.. టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇకపోతే గురువారం, నయనిక ఇంట్లో పెళ్లి కూతురు వేడుక, పసుపు దంచడం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆ ఫొటోలని నయనిక తన సోషల్ మీడియాలో పంచుకుంది.
(ఇదీ చదవండి: క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం)
నయనిక ఇంట్లో జరిగిన ఈ శుభకార్యానికి అల్లు అరవింద్, తన సతీమణి, అల్లు అర్జున్, స్నేహ కుటుంబం హాజరైంది. ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నయనిక అక్కాచెల్లితో పాటు కుటుంబ సభ్యులందరూ ఫొటోల్లో కనిపించారు. ప్రీ వెడ్డింగ్ పార్టీ, రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగినప్పటికీ వివాహం మాత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హడావుడి లేకుండా జరగనుంది.
(ఇదీ చదవండి: విజయ్, శిరీష్ దారిలో టాలీవుడ్‌లో మరో హీరో ప్రేమ పెళ్లి)






