తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా? | Rukmini Vasanth And Her Sister Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

Rukmini Vasanth: రుక్మిణి వసంత్ తిరుమలలో.. తెలుగులో మాట్లాడుతూ

Mar 6 2026 3:51 PM | Updated on Mar 6 2026 3:55 PM

Rukmini Vasanth And Her Sister Visits Tirumala Temple

'కాంతార' ఫేమ్ కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్.. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం దర్శించుకుంది. చెల్లితో పాటు కలిసి సంప్రదాయబద్ధంగా చాలా సింపుల్‌ లుక్‌లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలానే రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు తెలుగులోనూ సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరిచింది.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)

మూవీస్ అప్‌డేట్ గురించి అడగ్గా.. ఇప్పుడేం లేదు. త్వరలో వస్తుంది, అప్పుడు చెబుతా అని రుక్మిణి వసంత్ చెప్పుకొచ్చింది. ఈమె నటించిన 'టాక్సిక్'.. ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా ఏకంగా జూన్ 4కి వాయిదా పడింది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తీస్తున్న 'డ్రాగన్'లోనూ ఈమెనే హీరోయిన్. కాకపోతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రీసెంట్‌గా కన్నడ ఇండస్ట్రీలో ఫొటోగ్రాఫర్ల తీరుపై హీరోయిన్లు సప్తమి గౌడ, ఆషికా రంగనాథ్ తదితరులతో పాటు తన ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచితంగా జూమ్ చేస్తూ తమని ఫొటోలు తీస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. హీరోయిన్లని ఈ విధంగా ఇబ్బందులకు గురిచేసేవారిపై చర్యలకూ తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని రుక్మిణి వసంత్‌ చెప్పింది.

(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement