పవిత్ర రంజాన్ (Ramadan) మాసం వేళ మత సామరస్యానికి సంబంధించి అపురూపమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రంజాన్‌మాసం అంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. కానీ దుబాయ్‌లో 56 ఏళ్ల నాన్ ముస్లిం గత 23 ఏళ్లు ఉపవాస దీక్ష చేస్తుండటం విశేషంగా నిలుస్తోంది.
2002 నుండి సతీష్ కుమార్‌న దుబాయ్‌లో ఉంటున్నారు. స్వయంగా తాను హిందువు అయినప్పటికీ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్నారు. రంజాన్ అంటే మంచి పనులను పంచుకుంటూ, జీవించడం అంటే సమాజంతో ఐక్యంగా ఉండటం అంటారు సతీష్. తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల గౌరవం ఉందని, వారిమీద ప్రేమతోనే ఈ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కుమార్ రోజువారీ ఉపవాసం కేవలం శారీరక సవాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసిస్తానని తెలిపారు. ఇది ఆహారం, పానీయం, పాప ప్రవర్తనకు దూరంగా ఉండటంతోపాటు స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక శుద్ధిని పెంపొందించుకునే మార్గం ఇదని చెప్పారు.
ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!
దీంతోపాటు, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడే వ్యక్తుల ఇబ్బందులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చూడటానికి ఉపవాసం తనకు సహాయపడిందన్నారు. ఆకలిదప్పుల బాధను అనుభవించడం వల్ల పేదల దుస్థితిని అర్థం చేసు కోచ్చని, తద్వారా మనలో దాతృత్వం,కరుణ అనే భావం పెరుగుతుందని తెలిపారు. ఉపవాసంతో అనేక శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా ఉపవాసంద్వారా జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడం అంటే శారీరక ప్రయోజనాలను పొందమే అన్నారు. దీంతో మానసిక బలం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అనేది తన అనుభవంలో తెలిసిందన్నారు.
ఇదీ చదవండి: ఎప్‌స్టీన్ ఫైల్స్ : మైనర్‌పై దారుణం, ట్రంప్‌కు మరో షాక్


