ఓటమిని అంగీకరించిన నేపాలీ కాంగ్రెస్‌ : చారిత్రాత్మక విజయం దిశగా బాలెన్ షా | Nepal Election Result 2026 Votes Counting Live Updates And Top Headlines Telugu, RSP Wins 3 Seats And Leads In Over 45 Constituencies | Sakshi
Sakshi News home page

ఓటమిని అంగీకరించిన నేపాలీ కాంగ్రెస్‌ : చారిత్రాత్మక విజయం దిశగా బాలెన్ షా

Mar 6 2026 11:58 AM | Updated on Mar 6 2026 7:29 PM

Nepal Election Result 2026 Live updates

నేపాల్‌ ఎన్నికల్లో గెలుపు దిశగా బాలేంద్ర షా ‘ఆర్‌ఎస్‌పీ’ 

నేపాల్‌ ఎన్నికల కౌంటింగ్‌ అప్‌డేట్స్‌

  • చారిత్రాత్మక విజయం దిశగా బాలెన్ షా. 
  • రాపర్ నుంచి వ్యాపారవేత్తగా అవతరించిన బాలెన్ షా నేపాల్ ప్రధానమంత్రి అయ్యేందుకు సన్నద్ధం.
  • 110 స్థానాల్లో ఆధిక్యంతో అఖండ విజయాన్ని అందుకోనున్నబాలెన్‌షా
  • బాలెన్ షా  పార్టీ  107 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఒకసీటును గెలుచుకుంది.
  •  సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తోంది: నేపాలీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బిశ్వ ప్రకాష్ శర్మ 

ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు నేపాల్‌ను ప్రశంసించిన చైనా

  • మాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలి నేతృత్వంలోని బీజింగ్ అనుకూల సిపిఎన్-యుఎంఎల్ ఓటమి దిశగా సాగుతోంది.
  • నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఓలి, తన సొంత పార్లమెంటు స్థానంలో బాలెన్ షా కంటే చాలా వెనుకబడి ఉన్నారు.

క్లీన్‌ స్వీప్ దిశగా దూసుకెళ్తున్న ఆర్‌ఎస్‌పీ

  • నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి యోగేష్ గౌచన్ తకాలి ముస్తాంగ్ నుండి CPN-UML ఇంద్రధర బిస్టాపై 3,307 ఓట్లతో విజయం

ఆర్‌ఎస్‌పీ 102 నియోజకవర్గాల్లో ముందంజ

  • ఆర్‌ఎస్‌పీ 102 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది
  • ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి రంజు న్యూవానే కాఠ్మాండు-1 నుంచి పార్లమెంట్ సీటు గెలిచారు
  • 275 మంది సభ్యులు ఉన్న ‍ప్రతినిధి సభకు గురువారం ఓటింగ్‌ జరిగింది
  • 165 స్థానాలకు నేరుగా, 110 సీట్లకు నైష్పక్షిక విధానంలో ఓటింగ్‌ జరిగింది

ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఆధిక్యం?

  • రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ప్రస్తుతం 77 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది
  • నేపాలి కాంగ్రెస్ ఇప్పటికే ఒక స్థానాన్ని గెలుచుకుంది, 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది
  • సీపీఎన్‌-యూఎంఎల్‌ పార్టీ 7 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది
  • నేపాలి కమ్యూనిస్ట్ పార్టీ 6 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది
  • రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది
  • శ్రమ్‌ సంస్కృతి పార్టీ ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది
  • నేపాల్‌లో వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది

72 స్థానాల్లో ఆధిక్యంలో ఆర్‌ఎస్‌పీ

  • రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 72 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చింది
  • ట్రెండ్స్‌ చూస్తుంటే ఆర్‌ఎస్‌పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనపడుతోంది.

60 స్థానాల్లో ఆధిక్యంలో ఆర్‌ఎస్‌పీ  

  • కౌంటింగ్‌ జరుగుతున్న కొద్దీ ఆర్‌ఎస్‌పీకి పెరుగుతున్న ఆధిక్యం  
  • 60 స్థానాల్లో ఆధిక్యంలో ఆర్‌ఎస్‌పీ  

సింగిల్‌ డిజిట్‌ సీట్లకే పరిమితం? 

  • 55 స్థానాల్లో ఆధిక్యంలో బాలేంద్ర షా పార్టీ ‘ఆర్‌ఎస్‌పీ’ 
  • కేపీ శర్మ ఓలీ ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‘ 8 స్థానాల్లో ఆధిక్యం 
  • కేపీ శర్మ పార్టీ సింగిల్‌ డిజిట్‌ సీట్లకే పరిమితయ్యేలా ఉన్న ట్రెండ్స్‌

దూసుకెళ్తున్న పీఎం అభ్యర్థి బాలేంద్ర 

  • కొనసాగుతోన్న నేపాల్‌ ఎన్నికల కౌంటింగ్‌ 
  • ఝాపా నియోజక వర్గంలో దూసుకెళ్తున్న బాలేంద్ర షా (35)  
  • మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ(74)పై బాలేంద్ర షా ఆధిక్యం
  • ఆర్‌ఎస్‌పీ నుంచి ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షా 
  • మూడు సీట్లలో ఆర్‌ఎస్‌పీ గెలుపు, 45కి పైగా సీట్లలో ముందంజ 

Advertisement
 
Advertisement
Advertisement