breaking news
gen z
-
అట్టుడుకుతున్న జార్ఖండ్ వెనక్కి తగ్గేదే లే!
-
అధః పాతాళానికి తొక్కకపోతే... జెన్ -జీ పై బాబు వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డి మాస్ కౌంటర్
-
రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందా?
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇలాంటి సమయంలో జెన్ జీ (Gen Z) తరం ఇళ్లు కొనడం మానేస్తే?, ఏమవుతుందనే ప్రశ్న తలెత్తింది. దీనికి చాలామంది మార్కెట్ కుప్పకూలుతుంది, రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెబుతారు. కానీ నిపుణులు ఇది నిజం కాదని అంటున్నారు.జెన్ జీ ఇళ్లు కొనడం తగ్గిస్తే.. రియల్ ఎస్టేట్ మార్కెట్ వెంటనే కుప్పకూలిపోతుందని అనుకోవడం సరైనది కాదు. ఎందుకంటే.. వీరు నివసించడానికి కూడా ఇల్లు అవసరమే. అయితే.. ఆ ఇల్లు సొంతంగా కొనవచ్చు, అద్దెకు తీసుకోవచ్చు లేదా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా రావచ్చు.జెన్ జీ ఇల్లు కొనడాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదు, కానీ.. తొందరగా ఇల్లు కొనాల్సిన అవసరం లేదని భావిస్తోంది. గతంలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఇల్లు కొనాలని అనుకునేవారు. కానీ నేడు ముందుగా డబ్బు సంపాదించి.. సేవింగ్స్ పెంచుకుని, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టి, ఆ తరువాత ఇల్లు కొనాలనుకుంటున్నారు.ఈ మార్పు కొంత రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపవచ్చు. ఒక ఇల్లు అమ్ముడైతే బిల్డర్ మాత్రమే కాదు.. సిమెంట్, స్టీల్, పెయింట్, ఫర్నిచర్, నిర్మాణ కార్మికులు, బ్యాంక్స్, ప్రభుత్వాలు కూడా లాభపడతాయి. కాబట్టి యువత ఇల్లు కొనడాన్ని ఐదు లేదా పది సంవత్సరాలు ఆలస్యం చేస్తే కొత్త ప్రాజెక్ట్స్, హోమ్ లోన్స్, కన్స్ట్రక్షన్ జాబ్స్, స్టాంప్ డ్యూటీ ఆదాయం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జెన్ జీ ఇల్లు కొనకుండా ఆ డబ్బును స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడితే.. ఆ డబ్బు ఆర్థిక వ్యవస్థ నుంచి మాయమవ్వదు. అంటే.. డబ్బు ఒక రంగం నుంచి మరో రంగానికి మారుతుంది. ఇప్పటివరకు భారతీయ కుటుంబాల సంపదలో పెద్ద భాగం ప్రాపర్టీలలో ఉంది. యువత మాత్రం తమ డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. మొత్తం మీద జెన్ జీ ఇళ్లు కొనడం మానేయదు, కొంత ఆలస్యం చేస్తుందని తెలుస్తోంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇళ్లకు డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్స్! -
సాక్షి కార్టూన్ : 08-08-2026
సాక్షి కార్టూన్ : 08-08-2026 -
'జెన్ జీ' పై ఎంపీ కంగనా రనౌత్ యూటర్న్: ఆసక్తికర వ్యాఖ్యలు
నీట్ అవకతవకలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనల సందర్బంగా యువతరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్( Kangana Ranaut) ఇపుడు యూ టర్న్ తీసుకోవడం నెట్టింట సంచలనంగా మారింది. జెన్ జీకాదు జనరేషన్ గట్టర్‌గా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆమె 'జెన్ జీ' (Gen Z )ని భారతదేశపు గొప్ప బలంగా అభివర్ణించడం సంచలనం రేపుతోంది. జార్ఖండ్‌లో నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు ఎంతో శాంతియుతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని ఉదాహరణగా చెప్పడం గమనార్హం. దీంతో నిన్నటి దాకా యువతపై నోరు పారేసుకున్న కంగనాలో వచ్చిన మార్పు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎంపీ,సినీ నటి కంగనా రనౌత్ శుక్రవారం యువతపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఇప్పటికా వారిని మురికితరం అంటూ విరుచుకు పడిన ఆమె, ఇప్పుడు అదే యువతను దేశానికి బలం, గర్వకారణం అంటూ కొనియాడారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన మండి లోక్‌సభ ఎంపీ, ఒకే మాటతో మొత్తం తరాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలను తోసిపుచ్చారు. కేవలం "10-15 మంది" మాత్రమే మొత్తం తరానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని, కానీ 'జెన్-జెడ్'లోని అత్యధికులు దేశానికి సానుకూలమైన రీతిలో తమవంతు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిరసనల్లో కొద్దిమంది చేసే అభ్యంతరకర లేదా హానికర ప్రవర్తన ఆధారంగా మొత్తం తరాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనతప్రభుత్వంలో 'జెన్-జెడ్' కూడా ఒక భాగం. వారి ఆకాంక్షలే మా ప్రభుత్వం ఇన్నాళ్లుగా నెరవేరుస్తూ వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉండటానికి ఈ తరం ఇచ్చిన మద్దతే (మ్యాండేట్) కారణం అంటూ కంగనా మాట మార్చటం విశేషం. దేశానికి పతకాలు సాధించిపెడుతున్న యువ క్రీడాకారులు తమ విజయాలను ప్రధానమంత్రికి, దేశానికి అంకితం చేస్తున్నారని కొనియాడారు. కేవలం కొద్ది మంది మాత్రమే జెన్-జీ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటూ విపక్షాలు రభస సృష్టిస్తున్నాయని, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు, చేస్తున్న పనులతో వారు ఏకీభవించకుండా వినాశకర ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కాగా, గతవారం సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల నిరసనలను ఉద్దేశించి కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పద మయ్యాయి. నిరసనల్లోని యువతుల భాష, ప్రవర్తనను విమర్శిస్తూ ఆమె ఆ తరాన్ని 'జెనరేషన్ గట్టర్' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె జెన్ జీ యువతకు మద్దతుగా మాట్లాడటం గమనార్హం. ఇదీ చదవండి: అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ -
కాస్కో చంద్రబాబు Gen-Zరెడీ.. ఇక యుద్ధమే
-
ఆ సంప్రదాయ గోడలను బద్దలు కొడుతున్న జెన్ జీ
జెన్ జీ జీవనశైలి గత తరాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా మారుతోంది. ముఖ్యంగా వీకెండ్‌ను గడిపే విధానంలో యువత కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. అధిక ఖర్చులు, ఆర్థిక భద్రతపై పెరిగిన అవగాహన, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ఆసక్తి కారణంగా సంప్రదాయ వినోదాలకు దూరమవుతోంది. బయట తిరగడం, పార్టీల కంటే పొదుపు, వ్యక్తిగత అభివృద్ధి, ప్రశాంతమైన సామాజిక కలయికలకు ప్రాధాన్యం ఇస్తూ జెన్ జీ వీకెండ్ సంస్కృతిని కొత్త దిశలో తీసుకెళ్తోంది.ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి వస్తువు ధర పెరిగిన నేపథ్యంలో డబ్బును ఆదా చేయడానికి జెన్ జీ కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో 62 శాతం మంది వీకెండ్‌కు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవడం లేదని చెప్పారు. ఖర్చు చేసిన తర్వాత ఆర్థిక ‘‘ఎందుకు ఖర్చు చేశాం?’’ అనే భావన కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పోలింగ్ సంస్థ హారిస్ పోల్ గత నెల విడుదల చేసిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ఈ సర్వేలో 603 మంది జెన్ జీ యువతతో పాటు మొత్తం 4,100 మంది పెద్దలు పాల్గొన్నారు.యువతలో కనిపిస్తున్న ఈ పొదుపు ధోరణి, ఆర్థిక, సామాజిక, శారీరక ఆరోగ్యంపై వారి ఆసక్తిని చూపుతోందని నిపుణులు చెప్పారు. "జెన్ జీ మృదువైన సామాజిక కలయికలను కోరుకుంటోంది. అవి ప్రశాంతంగా, తక్కువ ఖర్చుతో, మద్యం తప్పనిసరి కాని విధంగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఉంటాయి. సామాజిక ఆకర్షణ కేంద్రం నైట్‌క్లబ్ నుంచి వ్యాయామం, తరగతి గది, ప్రశాంత వాతావరణం వైపు మారిపోయింది" అని ఆమె తెలిపారు.వీకెండ్లో బయటకు వెళ్లడం ఖర్చుకు తగిన విలువ ఇవ్వడం లేదని 68 శాతం సందర్భాల్లో జెన్ జీ అభిప్రాయపడుతోంది. ఈ ఫలితాలు చూస్తే, డబ్బు ఖర్చు చేసే నిర్ణయాల్లో లాభనష్టాలను అర్థం చేసుకునే, ఉద్దేశపూర్వక ఆర్థిక దృక్పథం ఉన్న తరం అని తెలుస్తోంది.వీకెండ్లలో ఇంట్లోనే ఉండటానికి జెన్ జీ చూపుతున్న ఆసక్తి, మరింత విస్తృతమైన ఆలోచనా విధానానికి నిదర్శనమని నిపుణులు చెప్పారు. "జెన్ జీ నిర్లక్ష్యంగా ఉండటం కంటే తెలివిగా వ్యవహరిస్తోంది. వారి ప్రవర్తన చుట్టూ ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న తీరును చూపుతోంది" అని అంటున్నారు. గత తరాల మాదిరిగా వస్తువులను కూడబెట్టడం కంటే, స్వేచ్ఛను పొందేందుకు డబ్బును ఒక సాధనంగా చూస్తున్నారని పేర్కొన్నారు.ఒత్తిడులను తట్టుకునే తరం?అమెరికాలో చాలా మంది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రంగాల్లో జెన్ జీ డబ్బు నిర్వహణ విధానం ఉపయోగకరంగా నిరూపితమైంది. పదవీ విరమణ దీనికి ఒక ఉదాహరణ. 2026లో వెలువడిన పలు అధ్యయనాలు, అమెరికన్లు తమ పదవీ విరమణ జీవితానికి అవసరమైనంత డబ్బు పొదుపు చేయలేదని వెల్లడించాయి.ఆర్థిక సేవల సంస్థ ష్రోడర్స్ జూలైలో నిర్వహించిన సర్వే ప్రకారం, సౌకర్యవంతమైన పదవీ విరమణ జీవితం కోసం సగటు ఉద్యోగి $1.25 మిలియన్ అవసరమని భావిస్తున్నారు. కానీ ఉద్యోగ జీవితం ముగిసే సమయానికి సగానికి పైగా వ్యక్తుల వద్ద $500,000 కన్నా తక్కువే ఉంది.సైలెంట్ జనరేషన్, బేబీ బూమర్ తరాలు పొందిన పెన్షన్ వ్యవస్థ ఇప్పుడు దాదాపు కనుమరుగైంది. పెన్షన్ రూపంలో పదవీ విరమణ ఖర్చును భరించే విధానానికి బదులుగా, అనేక సంస్థలు 401(కే) ఖాతాలకు మారాయి. వీటిలో ఉద్యోగులే డబ్బు జమ చేయాలి. డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చనే నిబంధనలు కూడా ఉంటాయి. 401(కే) అంటే అమెరికాలో ఉద్యోగుల పదవీ విరమణ పొదుపు పథకం.24 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న జెన్ జీ ఉద్యోగులు ఈ పరిస్థితికి అనుగుణంగా మారిపోయారు. 2025 నవంబరులో బ్రోకరేజ్ సంస్థ వాన్గార్డ్ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం, సౌకర్యవంతమైన పదవీ విరమణ లక్ష్యానికి చేరువలో ఉన్న వయస్సు వర్గాల్లో వీరే ముందున్నారు. బేబీ బూమర్లను కూడా అధిగమించారు.ఇల్లు కొనుగోలు చేయడం సగటు అమెరికన్‌కు అందని కలగా కనిపిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం, అమెరికాలో మధ్యస్థ ధర గల ఇల్లు, 20-34 ఏళ్ల వయస్సు గల వారి మధ్యస్థ జీతం కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ ధరలో ఉంది. 1990లో ఈ నిష్పత్తి 3.2 మాత్రమే.అయినా సొంత ఇంటి కలను జెన్ జీ వదిలిపెట్టలేదు. 2025 నవంబరులో రియల్టర్.కామ్ నిర్వహించిన సర్వే ప్రకారం, 67 శాతం మంది సొంత ఇల్లు కలిగి ఉండటం "ముఖ్యమైన జీవిత లక్ష్యం" అని చెప్పారు.వారు ఉద్దేశపూర్వక దృక్పథాన్ని అనుసరిస్తున్నారు. జీవిత ప్రారంభ దశలో ఇల్లు కొనుగోలు చేయడం కంటే వృత్తి జీవితంపై దృష్టి పెట్టి, భవిష్యత్తులో పెద్ద కొనుగోలుకు ఆర్థికంగా సిద్ధమవుతున్నారు. దాదాపు 75 శాతం మంది ముందస్తు చెల్లింపు కోసం పొదుపు ప్రారంభించారు. -
జెన్ జీకి తొలి వికెట్.. ‘వైరస్’ అన్న నబీన్‌కు ఓటుతో బదులు
బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ విజయ దుందుభి మోగించారు. బీజేపీ దాదాపు మూడు దశాబ్దాలుగా గెలుస్తున్న నియోజక వర్గంలో మరో పార్టీ గెలవడమంటే సామాన్యమైన విషయం కాదు. తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. జన్ సూరజ్ పార్టీకి ఇది తొలి అసెంబ్లీ విజయం. తొలిసారి చట్టసభలో అడుగుపెట్టనున్నారు ప్రశాంత్ కిశోర్. బీజేపీకి 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో కేవలం 30 రోజుల పాటు శ్రమించి (ఎన్నికల ప్రచారం చేసి) ఆయన గెలుపొందారు. బీజేపీ ఓటమి వెనుక పలు ముఖ్యమైన అంశాలున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల నిర్వహించిన ఆందోళనల నేపథ్యంలో బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితంపై చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలను జెన్ జీలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఇచ్చిన ఝలక్‌గా అభివర్ణిస్తున్నారు.4 సార్లు ఇక్కడే నబీన్ గెలుపురాజ్యసభకు వెళ్లేందుకు ఆయన స్వయంగా వదులుకున్న సొంత నియోజకవర్గం బంకీపూర్లోనే బీజేపీ ఓటమి చెందింది. అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబీన్ గెలిచారు. అలాగే, 1995 నుంచి బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ ఎప్పుడూ కోల్పోలేదు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఓడించారు.సీజేపీని వైరస్‌తో పోల్చిన నబీన్నితిన్ నబీన్ సీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ దానిని "వైరస్"తో పోల్చారు. ఆయన ఇటీవల మాట్లాడుతూ.. "దేశంలో వైరస్, కాక్రోచ్‌లాంటి పార్టీలు వస్తున్నాయి. ఇవి దేశాన్ని లోపల నుంచి బలహీనపరచాలని చూస్తున్నాయి. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే టుక్డే-టుక్డే గ్యాంగ్‌లో ఇవి భాగం" అని అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందిస్తూ.. "మమ్మల్ని టెర్రరిస్టులు, వైరస్ అని పిలుస్తున్నారు. కానీ మేము విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్నాం" అని చెప్పారు.జెన్ జీ ఎఫెక్ట్- సంప్రదాయ ఓటు బ్యాంక్‌లో చీలికబంకీపూర్లో బీజేపీ ఓటమి జెన్ జీ ఎఫెక్టే అంటూ నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. యువ ఓటర్ల తీర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ ఓటమికి జెన్ జీ ఉద్యమం ప్రభావం ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యువ ఓటర్లలో పెరిగిన అసంతృప్తి ఎన్నికల ఫలితంపై స్పష్టంగా కనిపించింది. జెన్ జీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, విద్యా సంస్కరణల అంశాలను యువత బలంగా ప్రస్తావించింది. కాక్రోచ్ ఉద్యమంలో బిహార్ యువత కూడా పాల్గొన్నారు. జెన్ జీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ యువ ఓటర్లను చైతన్యపరిచింది. మొదటిసారి ఓటు వేసిన యువతలో గణనీయమైన మార్పు కనిపించింది. ప్రతిపక్షాలకు మద్దతుగా డిజిటల్ ప్రచారం ఊపందుకుంది. జెన్ జీ ఉద్యమం స్థానిక సమస్యలను ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చింది. దీంతో బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌లోనూ కొంత మేర చీలిక ఏర్పడినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ ఫలితం యువత రాజకీయ ప్రభావాన్ని మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. -
19 ఏళ్ల యువతి కథ.. శ్రీధర్ వెంబు భావోద్వేగం!
ప్రస్తుతం సమాజంలో జెన్ జీ (Gen Z) గురించి పలురకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వారు ఎక్కువగా సౌకర్యాలను కోరుకుంటారని, కష్టపడి పనిచేయరని, బాధ్యతలు తీసుకోరని చాలామంది భావిస్తారు. కానీ.. ఇది వాస్తవం కాదని జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ఎందుకో వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.నిజానికి నేటి జెన్ జీ యువత అందరూ ఒకేలా ఉంటారని చెప్పడం సరికాదు. శ్రీధర్ వెంబు తన ''సంస్థలో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతితో మాట్లాడారు. ఆ సంభాషణలో ఆమె తన జీవితంలోని నిజమైన పరిస్థితిని వివరించింది. తన తల్లిదండ్రులు తీసుకున్న అప్పులను తీర్చడానికి, అలాగే తన చిన్న తమ్ముళ్లు, చెల్లెళ్ల భవిష్యత్తు కోసం తాను కష్టపడి పనిచేస్తున్నానని చెప్పింది. తన కుటుంబం సంతోషంగా ఉండటమే.. తన జీవితంలో ముఖ్యమైన లక్ష్యమని ఆమె తెలిపిందని'' ఆయన పేర్కొన్నారు.కుటుంబ క్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఆ యువతి.. అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపుగా జీవిస్తోంది. ఖరీదైన దుస్తులు కొనకుండా.. తక్కువ ధరలో దొరికేవే కొనుగోలు చేస్తోంది. తెగిపోయిన చెప్పులను కుట్టించుకుని మళ్లీ వాటినే ఉపయోగిస్తోంది. ప్రతి రూపాయిని.. భవిష్యత్తు కోసం ఆదా చేస్తోంది. ఆమె మాటలు విని తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.I come across a large number of people of various age groups, and I don't find categorizing generations based on age all that meaningful.A 19 year old employee told me last week that she works hard to earn money so that her parents can repay their loans and support her younger…— Sridhar Vembu (@svembu) August 3, 2026ఈ సంఘటనను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వేలాది మంది స్పందించారు. ఆయన మరో విషయాన్ని కూడా చెప్పారు. తమ సంస్థలో ఇటీవల వివాహం చేసుకున్న ఇద్దరు యువ ఉద్యోగులు, తన సూచన మేరకు ఆడంబరాలకు దూరంగా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఇది యువతలో ఇంకా మంచి విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచనలు ఉన్నాయని చూపిస్తుందని పేర్కొన్నారు.ఈ పోస్టుకు అనేక రకాల స్పందనలు వచ్చాయి. కొందరు యువతను ప్రోత్సహించిన శ్రీధర్ వెంబును ప్రశంసించారు. మరికొందరు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యల వల్లే చాలా మంది యువత చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడటం, క్రమశిక్షణ, మంచి నడవడిక చాలా అవసరమని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో జెన్జీలు 24%
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశమంతా మార్మోగుతున్న పేరు జెన్‌జీ. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన ఈ తరం (14 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వారు) జనాభా తెలంగాణలో సుమారు 24 శాతంగా ఉండొచ్చని 2011 సెన్సస్ను పరిగణనలోకి తీసుకొని యూఎన్ఎఫ్పీఏ యూత్ రిపోర్ట్ అంచనా వేసింది. ఇక దేశంలో జెన్జీల సగటు జనాభా 27.1 శాతంగా ఉన్నట్లు ఇండియా ఇన్ పిక్సెల్స్ రిపోర్ట్–2025 పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం బిహార్‌లో అత్యధికంగా జెన్జీలు 32.5 శాతం ఉన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతంగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో జెన్‌జీ జనాభా ఇతర జిల్లాల కంటే అధికంగా ఉంది. ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ యూనివర్సిటీలు, హైటెక్ సిటీ, కో–వర్కింగ్ స్పేస్‌లు, స్టార్టప్‌లు ఇక్కడ కేంద్రీకృతం కావడంతో యువత భాగ్యనగరానికి వలస వస్తోంది. ఈ తరం ఆలోచనలు గత తరం లాగా ఒకే కంపెనీలో ఉద్యోగం కోసం చూడటం లేదు. బదులుగా యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్, గ్రాఫిక్ డిజైన్, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి సైడ్ హస్టిల్లు చేస్తోంది.ఐటీ ఉద్యోగంతోపాటు వీకెండ్లో సొంత స్టార్టప్‌లు నడపడం, గిగ్ ఎకానమీలో పనిచేయడం జెన్‌జీ ప్రత్యేకతలు. ఫలితంగా హైదరాబాద్‌లో కాఫీ షాపులు, కో–వర్కింగ్ స్పేస్‌లు, ఈ–కామర్స్, డెలివరీ జాబ్స్ విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామిక, సేవా, ఐటీ రంగాలకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. డిజిటల్ స్కిల్స్, కొత్త టెక్నాలజీని త్వరగా అందిపుచ్చుకోవడంలో జెన్‌జీ ముందు వరుసలో ఉండటం వల్ల కంపెనీలు వారిని టార్గెట్ చేస్తున్నాయి. త్వరలో జనాభా తగ్గే అవకాశం పట్టణ ప్రాంతాల్లో జెన్‌జీ జనాభా పెరుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుదల కనిపిస్తోంది. అయితే నిపుణుల అంచనాల ప్రకారం జననాల రేటు తగ్గడం, వృద్ధుల జనాభా పెరగడం వల్ల వచ్చే 5–10 ఏళ్లలో జెన్జీల జనాభా శాతం 21–22 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న యువతలోనే నైపుణ్యాలు పెంచి వారిని ఉత్పాదకంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా తెలంగాణ జెన్ –జీ ఉద్యోగం కోసం ఎదురుచూసే తరం కాదు. ఉద్యోగాలను సృష్టి్టంచే తరం. వీరికి సరైన శిక్షణ, ఫండింగ్ అందిస్తే తెలంగాణ డిజిటల్ ఎకానమీలో దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుంది. -
బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్.. జెన్‌జీ ఆనందం!
సొంతిల్లు ఎవరికైనా జీవిత కల. అదే ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటే బెంగళూరు లాంటి నగరంలో అయితే.. పాతికేళ్లు కూడా నిండకుండానే సాకారమైతే అంతకుమించిన విజయం ఇంకేముంది అంటే అతిశయోక్తి కాదు. 24 ఏళ్ల వయసులోనే రూ.1.8 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్న లీగల్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఆకాశ్ నారాయణ్.. తన విజయాన్ని కేవలం వ్యక్తిగత ఘనతగా చూడటం లేదు. ఆర్థిక అనిశ్చితి, కుటుంబ సమస్యల నుంచి మొదలైన తన ప్రయాణంలో తల్లి, మెంటార్లు, స్నేహితులు, తొలి టీమ్ సభ్యుల సహకారమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెబుతున్నారు.ఆకాశ్ నారాయణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కాసాగ్రాండ్ వివాసిటీలో ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగా.. 2027 ఏప్రిల్ నాటికి ఫ్లాట్ స్వాధీనం లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆకాశ్ నారాయణ్ ప్రస్తుతం లీగలిట్ అనే లీగల్-టెక్ సంస్థను నడుపుతున్నారు. ఆ సంస్థ వార్షిక స్థూల ఆదాయం సుమారు రూ.13 కోట్లని సమాచారం.‘ఇది నా విజయం మాత్రమే కాదు’తన తొలి ఇంటిని కొనుగోలు చేసిన సందర్భంగా సోషల్ మీడియాలో ఆకాశ్ నారాయణ్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. 24 ఏళ్లకే మొదటి అపార్ట్మెంట్ కొనుగోలు చేశానని చెబుతూ.. ఈ మైలురాయి తనది మాత్రమే కాదని పేర్కొన్నారు. కుటుంబం, మెంటార్లు, టీమ్, స్నేహితులు తన ప్రయాణంలోని ప్రతి దశలో అండగా నిలిచారని తెలిపారు.ఒకప్పుడు సొంత ఇల్లు అనేది తనకు సాధ్యం కాని కలలా అనిపించేదని ఆకాశ్ చెప్పారు. ఇప్పుడు ఆ కల నిజమైనప్పటికీ, దాని వెనుక ఎంతో మంది సహకారం ఉందన్నారు. తన తల్లి ప్రోత్సాహంతోపాటు తనతో కలిసి పనిచేసిన టీమ్ సహకాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘ఇది ప్రారంభం మాత్రమే’తొలి ఇంటి కొనుగోలును ఆకాశ్ నారాయణ్ తన జీవితంలో ముగింపు గమ్యంగా కాకుండా మరో దశకు ఆరంభంగా చూస్తున్నారు. ‘‘ఇది ప్రారంభం మాత్రమే’’ అంటూ తన సోషల్ మీడియా పోస్ట్‌ను ముగించారు. వ్యక్తిగతంగా సాధించిన విజయాన్ని కుటుంబం, టీమ్, మెంటార్లు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా.. విజయానికి వెనుక ఉండే సహకారం కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Akash Narayan (@kshnryn) -
ఈసారి ‘ఆల్ఫా’ వంతు!
జంతర్ మంతర్ వేదికగా జెన్ జీ తరం సృష్టించిన పెను సంచలనం గురించి అందరూ ఇంకా చర్చించుకుంటుండగానే... తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆల్ఫా తరం కూడా తరగతి గదుల్లోంచి బయటికొచ్చింది. ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్లతో పాటు మహారాష్ట్రలో సైతం పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, బెంచీలవంటి కనీస సదుపాయాలు కల్పించాలనీ, అన్ని పాఠ్యాంశాలకూ టీచర్లను నియమించా లనీ కోరుతూ సాగుతున్న ధర్నాల వెనక కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సాధించిన విజయాల స్ఫూర్తి ఉన్నదని తెలుస్తూనే ఉంది. పాలకుల్ని నిలదీసిన జెన్ జీ తరాన్ని చూసి అసహ్యించుకున్న ఎంపీ కంగనా రనౌత్ లాంటివారు ఈ ఆల్ఫా తరానికి ఎలాంటి శాపనార్థాలు పెడతారో చూడాల్సివుంది. బిహార్‌లోని గయ జిల్లాలో విద్యార్థులు అతి పెద్ద ధర్నా నిర్వహించడమే కాదు... తమ డిమాండ్లు తెలుసుకోవటానికొచ్చిన ప్రభుత్వా ధికారిని వెనక్కిపంపారు. తాము జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్)తో తప్ప మాట్లాడబోమని చెప్పటంతో ఆయనే రావాల్సివచ్చింది. అన్నిచోట్లా ఒకే రకమైన సమస్యలు. అందరిదీ ఒకే రకమైన కథ. చదువు చుట్టూ ఇన్ని సమస్యలుండగా ‘వికసిత్ భారత్’ ఎలా సాధ్యమో పాలకులు చెప్పాలి. దేశంలో ప్రాథమిక విద్య మొదలు విశ్వవిద్యాలయ విద్యవరకూ అంతా అస్తవ్యస్థంగా ఉంది. ఎక్కడ చూసినా శిథిలాలను తలపించే బడులు, అరకొర సదుపా యాలు వెక్కిరిస్తుంటాయి. సరిపడా ఉపాధ్యాయులుండరు. యాదృచ్ఛికంగానే కావొచ్చు గానీ... రాజ్యసభలో గురువారం పాఠశాల విద్య గురించి అడిగిన ప్రశ్నకు విద్యామంత్రిత్వ శాఖ ఇచ్చిన జవాబు దిగ్భ్రమ గొలుపుతుంది. దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,00,843 అని ఆ శాఖ సహాయమంత్రి చెప్పారు. అందులో 16,357 పాఠశాలలతో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంటే జార్ఖండ్(9,827), మహారాష్ట్ర(9,269), కర్ణాటక(8,042), ఉత్తరప్రదేశ్(7,874) తదనంతర స్థానాల్లో ఉన్నాయి. అలాగని మిగిలిన స్కూళ్లు బాగున్నాయని కాదు. రాజస్థాన్‌లోని ఒక పాఠశాలలో కేవలం చరిత్ర, హిందీ పాఠ్యాంశాలకు మాత్రమే టీచర్లున్నారు. మరో పాఠశాలలో 1,2,3 తరగతులకు అసలు టీచర్లే లేరు. తక్షణం టీచర్ల నియామకం జరగకుంటే పాఠశాలకు తాళాలేసి, రహదారి దిగ్బంధిస్తామని పిల్లలు హెచ్చరించారు. చివరకు అప్పటికప్పుడు నలుగుర్ని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. మరో ముగ్గుర్ని పది రోజుల్లో నియమిస్తామనటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో లిఖితపూర్వక హామీ దొరికేవరకూ ఇంటర్ విద్యార్థులు ధర్నా కొనసాగించారు. సెకండరీ విద్యలో 2023–24లో ఆడపిల్లల్లో 12.6 శాతంగా ఉన్న డ్రాపౌట్లు 2025–26కు 8 శాతానికి తగ్గాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదిక చెబుతోంది. కానీ ఇప్పటికీ 8 శాతంమంది పిల్లలు ఆ స్థాయికొచ్చాక చదువులు మానుకుంటున్నారంటే ఆవేదన కలుగుతుంది. దీన్ని అంకెల్లోకి మారిస్తే లక్షల్లో ఉంటుంది. ఇది మన అధ్వాన్న స్థితికి అద్దం పడుతుంది. పేదరికం మొదలుకొని పాఠశాలలో సదుపాయాల లేమి వరకూ ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. వాటిని సరిచేయటానికి పూనుకొనే వరకూ ఇలాంటి పిల్లలు చదువులకు దూరంకాక తప్పదని పాలకులు గుర్తించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల వ్యథ మరో రకం. అక్కడ గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11,700 కోట్లు వ్యయం చేసి ‘నాడు–నేడు’ కింద 38,059 పాఠశాలల రూపురేఖల్ని మార్చింది. కార్పొరేట్ విద్యాసంస్థల్ని తలదన్నేలా 60,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,000 స్మార్ట్ టీవీలు అమర్చి తరగతి గదుల్ని డిజిటల్ లెర్నింగ్ స్పేస్‌లుగా మార్చింది. పిల్లలకు దాదాపు ఆరు లక్షల ట్యాబ్ల్ని అందించి పాఠాల్ని సులభంగా అవగాహన చేసుకునేందుకు తోడ్పడింది. ఇప్పుడు ఉత్తరాదిన వినబడుతున్న డిమాండ్లతోపాటు మరెన్నో నాలుగేళ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అందులో చాలా భాగం అటకెక్కాయి. గుక్కెడు మంచినీళ్లు, పరిశుభ్రమైన పరిసరాలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం కరువయ్యాయి. గతంలో సకల సదుపాయాలతో వర్ధిల్లిన బడులన్నీ ఇప్పుడు బావురుమంటున్నాయి. అనేకం మూతబడ్డాయి. అందుకే ఉత్తరాది పిల్లల స్ఫూర్తితో రేపో మాపో ఏపీ ఆల్ఫా తరం కూడా తిరగబడినా ఆశ్చర్యం లేదు. -
వీళ్లు జెన్ జీ కాదు.. జెన్ ఆల్ఫా.. 1,500 మంది ధర్నా
లక్నో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆధ్వర్యంలోని జెన్ జీ (1997 - 2012 మధ్య పుట్టినవారు) నిరసన ప్రభావం జెన్ ఆల్ఫా(2013 - 2025 మధ్య పుట్టినవారు)పై కూడా పడింది. ఉత్తరప్రదేశ్‌లో 6 నుంచి 12 తరగతుల వరకు చదువుతున్న 1,500 మందికి పైగా విద్యార్థులు తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.ఫతేపూర్ జిల్లాలోని సర్వోదయ ఇంటర్ కాలేజీ విద్యార్థులు తమ పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరతపై ధర్నా చేపట్టారు. దీంతో యాజమాన్యం వారి డిమాండ్లలో చాలా వరకు అంగీకరించింది. ఈ నిరసనను సామాజిక మాధ్యమాల్లో “జెన్ ఆల్ఫా నిరసన”గా చర్చించినప్పటికీ, ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళనలో పాల్గొని తిరిగి వచ్చిన కొందరు సీనియర్ విద్యార్థులు దీన్ని ప్రణాళిక చేశారని పాఠశాల అధికారులు అంటున్నారు.నీట్ ప్రశ్నపత్ర లీక్ ఆరోపణలపై జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థులు నలుగురు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. అక్కడి అనుభవంతో ప్రేరణ పొందిన వారు తాగునీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు, తరగతి గదుల మౌలిక సదుపాయాల లోపం, క్రీడా సదుపాయాల కొరత వంటి దీర్ఘకాల సమస్యలపై తమ పాఠశాలలో ఇదే తరహా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాల్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. “నేను పాఠశాలకు చేరుకున్న వెంటనే విద్యార్థులు తరగతులకు వెళ్లకుండా ధర్నా చేపట్టారని ఉపాధ్యాయులు చెప్పారు. ఆ సమయంలో ఆందోళనకు నాయకత్వం వహించిన అంకూర్ సోన్కర్ ఇటీవల జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విషయం నాకు తెలియదు. తర్వాత అతడు అక్కడ ఉన్న వీడియోలు చూశాను. చిన్న పిల్లలు ఇలాంటి నిరసనలకు దూరంగా ఉండాలని చెప్పాం. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. అయినా వారిని ఒప్పించడానికి 6 గంటలు పట్టింది” అని ఆయన చెప్పారు.అంకూర్ మాట్లాడుతూ.. ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తనపై గాఢ ప్రభావం చూపారని తెలిపారు. జంతర్ మంతర్ నిరసన సమయంలో రికార్డు చేసిన వీడియోల్లో “సోనమ్ సర్‌కు మద్దతు ఇవ్వండి. మంచి వ్యక్తులకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరికిస్తాం? మీ హక్కుల కోసం పోరాడండి” అని యువతకు పిలుపునిచ్చారు.అంకూర్ తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు ఆర్వో వ్యవస్థతో స్వచ్ఛమైన తాగునీరు, కొత్త మరుగుదొడ్లు, ప్రతి తరగతి గదిలో 4 ఫ్యాన్లు, మెరుగైన క్రీడా సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధి కోరారు. నిరసన అనంతరం యాజమాన్యం డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళన విరమించారు.6 గంటల ధర్నా, చేతుల్లో అంబేడ్కర్ చిత్రపటాలుఉదయం 7.30 గంటల సమయంలో 6 నుంచి 12 తరగతుల వరకు చదువుతున్న 1,500 మందికి పైగా విద్యార్థులు అంబేడ్కర్ చిత్రాలు, ప్లకార్డులు పట్టుకుని పాఠశాల ప్రాంగణంలో గుమికూడటంతో నిరసన ప్రారంభమైందని తెలిసింది. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, తరగతి గదుల సదుపాయాల లోపం చాలా కాలంగా ఉందని, వాటి వల్ల చదువులకు ఇబ్బంది కలుగుతోందని విద్యార్థులు ఆరోపించారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.జెన్ ఆల్ఫా నిరసన వార్త వ్యాపించడంతో పాఠశాల అధికారులు, స్థానిక పోలీసులు విద్యార్థులను తరగతులకు పంపేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలకు వచ్చే వరకు నిరసన విరమించబోమని విద్యార్థులు స్పష్టం చేశారు.జిల్లా పాఠశాలల పరిశీలకుడు రాకేష్ కుమార్, నాయబ్ తహసీల్దార్ నితిన్ కుమార్ తదితర అధికారులు క్యాంపస్‌కు చేరుకుని 8 మంది విద్యార్థుల ప్రతినిధి బృందంతో చర్చించారు. సమావేశం అనంతరం విద్యార్థుల 8 డిమాండ్లలో 7 డిమాండ్లను లిఖితపూర్వకంగా అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం తర్వాత నిరసన ముగిసింది.ప్రతి తరగతి గదిలో 4 ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామని, విద్యుత్ వైరింగ్ మరమ్మతులు చేపడతామని, సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తామని, క్రీడా మైదానాన్ని నిర్వహిస్తామని, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిమాణం మెరుగుపరుస్తామని, ఫర్నిచర్ తక్కువగా ఉన్న తరగతి గదుల్లో అదనపు బెంచీలు నెలరోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.సైన్స్ విభాగం ప్రారంభించాలన్న ఒక్క డిమాండ్ మాత్రమే వెంటనే అంగీకరించలేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదన పంపాలని పాఠశాలకు సూచించారు.జిల్లా పాఠశాలల పరిశీలకుడు రాకేశ్ కుమార్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల లోపంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు.నిరసనకు ప్రధాన కారణం ఏమిటి?ఓ విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం తరగతి గదిలో ఫ్యాన్లు పనిచేయడం లేదని ఫిర్యాదు చేసిన కొందరు బాలికలతో ఓ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటనే నిరసనకు కారణమైంది. “బాలికలు ఫిర్యాదు చేయగా, ‘నువ్వు కూర్చో, నిశ్శబ్దంగా ఉండు’ అని ఉపాధ్యాయుడు అన్నాడు. ఆ తర్వాత మరికొందరు బాలికలు కలిసి జరిగిన విషయం బాలురకు చెప్పారు. కొందరు విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి వద్ద ఫిర్యాదు చేశారు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదని వారు భావించారు” అని ఆ విద్యార్థి తెలిపాడు. -
మెగా డీఎస్సీ స్కామ్‌పై జెన్‌జీ వార్!
సాక్షి, అమరావతి: ‘నీట్’ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్‌జీ యువతరం ఉవ్వెత్తున ఉద్యమించిన రీతిలోనే.. మెగా డీఎస్సీ 2025లో అక్రమాలపై బాధిత అభ్యర్థులు, నిరుద్యోగ యువత చంద్రబాబు సర్కారుపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమైంది. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను అక్రమాలు, అవినీతిమయంగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్ సర్వత్రా వెల్లువెత్తుతోంది. డీఎస్సీలో అక్రమాలను ఆధారాలతో సహా పలుమార్లు బయటపెట్టినా స్పందించకుండా లోకేశ్ ఇంకా సవాళ్లు విసరడం సిగ్గు చేటని బాధిత అభ్యర్థులు మండిపడుతున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేశ్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్లతో ఈనెల 31 నుంచి భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని నిరుద్యోగులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు ఎన్నో ఉదంతాలున్నాయని గుర్తు చేస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాల పర్వం.. మెగా డీఎస్సీ 2025 ప్రక్రియ మొదలు పెట్టగానే అంతకు ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో నియమితుడైన కన్వీనర్‌ను తొలగించి మరో అధికారిని పెట్టుకున్నారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి అధికారాలను కేంద్రీకరించారు. ప్రశ్నాపత్రం తయారు చేసే ఎస్సీఈఆర్టీ కన్వీనర్నే పరీక్షలు నిర్వహించే డీఎస్సీ కన్వీనర్‌గా నియమించారు. అక్కడే అక్రమాలకు బీజం పడింది. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త సంతకాలతో, కొత్త తేదీలతో మరో నోటిఫికేషన్ ఇచ్చారు. గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను, అప్ లోడింగ్‌ను, డిజిటలైజేషన్‌ను పూర్తిగా ఎస్సీఈఆర్టీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారు. ఇందులో ఒకడైన నవీన్ జిల్లా టాపర్‌గా వచ్చాడు. అతడి నియామకాన్ని రద్దు చేసి ఆ తర్వాత రెండో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు? డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను భ్రష్టు పట్టించడానికి లోకేశ్ విద్యాశాఖను వాడుకున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. కలెక్టరేట్లో ప్రదర్శించాల్సిన మెరిట్‌లిస్ట్ ఎందుకు పెట్టలేదు? టాప్ ర్యాంకర్‌గా వచ్చిన నవీన్‌ను తీసేసి రెండో లిస్ట్ ఎందుకు విడుదల చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి నవీన్‌ను ఎందుకు తీసేశారో కోర్టుకు కూడా చెప్పకుండా వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో దొడ్డి దారిన అమ్మేశారు.. స్పోర్ట్స్ కోటా కోసం జీవో 74 ఉండేది. అప్పుడు 2 శాతం కోటాలో ఉద్యోగాలు ఇచ్చేవారు. ఆటల్లో నైపుణ్యంతో పాటు టెట్, డీఎస్సీ క్వాలిఫై కావాలి. లోకేశ్ మంత్రి కాక ముందు ఈ నిబంధన ఉండేది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే రోజే అంటే 2025 ఏప్రిల్ 19న ప్రకటన చేయటానికి గంట ముందు స్పోర్ట్స్ కోటా కొత్త జీవో 4 ఇచ్చారు. అదే సమయంలో జీఏడీ జీవో 47 ఇచ్చింది. అందరితోపాటు సమానంగా విద్యార్హతలు అక్కర్లేదు, టెట్, డీఎస్సీలు రాయాల్సిన పని లేదని పేర్కొంది. మెగా డీఎస్సీ పూర్తయ్యాక స్పోర్ట్స్ కోటాలో మళ్లీ మార్పులు చేస్తూ జీవో 56 జారీ చేశారు. దొడ్డి దారిన టీచర్ల ఉద్యోగాలు అమ్ముకుని, 26 రోజుల్లోనే జీవోలు ఇచ్చి, మళ్లీ జీవోలు మార్చేశారు. జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ వచ్చిన దుర్గయ్యకు ఇవ్వకుండా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగం ఇచ్చేశారు. అడ్డగోలుగా సర్టిఫికెట్లు.. వాటితో ఉద్యోగాలు కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ద్వారా 38 మంది టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. లోకేశ్ తోడల్లుడు భరత్ అధ్యక్షుడిగా ఉన్న జూడో సంఘం ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా 39 మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతోనే ఈ ఉద్యోగాలు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి, బేరసారాల్లో దొరికిపోయినా ఇంకా బుకాయిస్తున్నారు. ఆధారాల్లో ఫోన్ నంబర్ కనిపిస్తున్నా.. ఎఫ్ఐఆర్లో అనుమానితుడని చెప్పి తప్పించేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారో లోకేశ్ తేల్చాలి. ఎవరూ లేకపోతే పోలీసులు ఎందుకు దీనిపై విచారణ జరపడం లేదు? సీబీఐ విచారణ జరగాల్సిందే: పేర్ని నానిడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేశ్ మెగా డీఎస్సీలో అవకతవకలపై సమాధానం చెప్పకుండా వైఎస్ జగన్ ఇంటి గేటు బయట నిలబడ్డా! పిలిచాను! ఆయన రాలేదు! అని సొల్లు కబుర్లు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. మంగళగిరిలోనో, పునాదిపాడులోనో దాతలు ఇచ్చిన డబ్బులతో స్కూల్ కడితే విద్యాశాఖను మార్చినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. ‘రమ్మీ, పేకాటకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? వీటిపై ప్రశ్నిస్తే శ్రీకాకుళం జిల్లాలో నాపై కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజు వస్తుంది’ అని పేర్కొన్నారు.ఈ ప్రశ్నలకు బదులేది..?1. ప్రశ్నపత్రాల తయారీతోపాటు పరీక్షల నిర్వహణ బాధ్యత కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించడం పారదర్శకతకు పాతర కాదా?2. ప్రశ్నల తయారీ, అప్లోడింగ్, డిజిటల్ నిర్వహణ లాంటి అత్యంత గోప్యమైన పనులను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం పేపర్ లీకేజీకి పునాది కాదా?3. ఔట్సోర్సింగ్ ఉద్యోగి పురమ నవీన్ సోషల్ స్టడీస్‌లో కృష్ణా జిల్లా టాపర్‌గా, టీజీటీ తెలుగు పరీక్షలో జోన్ 2లో ఆరో ర్యాంకర్‌గా నిలిచాడు. ప్రశ్నపత్రాల వ్యవస్థలో పనిచేసిన వ్యక్తికే టాప్ ర్యాంకులు రావడం పేపర్ లీకేజీని నిర్ధారిస్తోంది. ఆ తర్వాత నవీన్‌కు ఉద్యోగం ఇవ్వకుండా మెరిట్ లిస్టు నుంచి పేరు తొలగించారు. డేటాను మాయం చేసి కాల్‌లెటర్ కూడా పంపలేదు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది? లీకైన పేపర్‌తో ఎంతమంది పరీక్ష రాశారు? ఎంత డబ్బు చేతులు మారింది? వీటిపై విచారణ ఏది?4. జీవో నంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా 2 శాతంగా ఉండేది. ఇతర అభ్యర్థులతో సమానంగా అన్ని అర్హతలు కలిగి, సంబంధిత పోస్టుకు పరీక్ష రాయడం తప్పనిసరి. కానీ డీఎస్సీ 2025లో జీవో నంబర్లు 4, 47 ద్వారా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు పరీక్షను ఎత్తివేశారు. కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచారు. స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ చేయగానే జీవో నంబర్లు 4, 47ను రద్దు చేసి, పోటీ పరీక్షను మళ్లీ తప్పనిసరి చేస్తూ జీవో నంబర్ 56 జారీ చేశారు.మొదట ఇచ్చిన జీవోలు సరైనవే అని అనుకున్నప్పుడు మళ్లీ వాటిని రద్దుచేస్తూ జీవోలు ఎందుకు తెచ్చారు? అంటే.. తమవారితో పోస్టులు నింపడానికి గేట్లు తెరిచి, పని పూర్తికాగానే మళ్లీ మూసేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను పక్కనపెట్టి.. ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. కొన్ని క్రీడా సంఘాల నుంచి అసాధారణ సంఖ్యలో సర్టిఫికెట్లు చూపించి నియామకాలు చేపట్టారు. 5. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.. జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో నుంచి 39 మందికి, సాఫ్ట్‌బాల్ నుంచి 38 మందికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు. క్రీడా సంఘాలకు నాయకత్వం వహించేది అధికార పార్టీ నేతలే. సర్టిఫికెట్లు ఇచ్చేదీ వారే. ఇక పారదర్శకత ఎక్కడుంది?6. ఆర్చరీలో జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్యను 1 : 1 పద్ధతిలో పిలిచి, సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదు. మరోవైపు జిల్లా, యూనివర్సిటీ స్థాయిలో కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారుడిని పక్కనపెట్టారు.7. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు ఆడియో, వీడియో ఆధారాలు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఓ వ్యక్తి.. అభ్యర్థితో ఉద్యోగం కోసం బేరసారాలు జరిపారు. వీడియోలో ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపించినా ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకుండా ‘అనుమానిత వ్యక్తి’గా మాత్రమే పేర్కొన్నారు. బలమైన సెక్షన్లు పెట్టకుండా నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై వదిలేశారు. ఇది కుంభకోణం వెనుక పెద్దల ప్రమేయానికి రుజువు కాదా? -
కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలపై, నేటి యువతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జెన్ జీ వర్గం అనుచిత భాషను వాడిందని, వారి ప్రవర్తన బాగోలేదని ఆమె ఆరోపించారు. కాగా కంగనా వ్యాఖ్యలపై ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, సింగర్ విశాల్ దద్లానీ తీవ్ర స్థాయిలో స్పందించారు.ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జీలు, హింసాత్మక ఘటనలను ఆయన గుర్తు చేశారు. ‘చెడు భాష గురించా? మీరు రోడ్లపై పిల్లలను కొట్టారు, వారిపై రాళ్లు రువ్వారు, పైగా వారినే నిందిస్తున్నారు! వారిపై కాల్పులు జరుపుతున్నారు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. వారి ముఖాలపై పెల్లెట్ గన్లు వాడుతున్నారు. మీ పెయిడ్ గూండాలు ఇప్పటికీ తిరుగుతూ, వారిని బెదిరిస్తున్నారు, కొడుతున్నారు! ఈ తిట్లను మీరే స్వయంగా సంపాదించుకున్నారు.. మై ఫ్రెండ్’ అంటూ విశాల్ దద్లానీ మండిపడ్డారు.ఈ పోస్ట్ క్యాప్షన్‌లో.. ‘పెయిడ్ స్టోరీలు, ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు నిర్వహించడం వల్ల మీ దిగజారుడుతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విశాల్ దద్లానీ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. మరోవైపు, కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో నిరసనలకు సంబంధించిన ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ తీవ్ర పదజాలం వాడారు. ‘నా జీవితంలో ఇంతటి అసహ్యకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. జెన్ జీ నిరసనల రీల్స్ చూస్తే వాంతి వస్తోంది. వారు మాట్లాడే తీరు, వాడే భాష అత్యంత హేయంగా ఉన్నాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిరసనకారులను ‘జనరేషన్ గటర్’ అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువుసంధ్యలు లేని వీరు వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగపడరని, కనీసం ఇంటిని కూడా చక్కదిద్దలేరని ఆమె విమర్శించారు. కాగా, ఈ వివాదం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
ఈ జెన్‌జీ భాష కనిపెట్టింది ఎవరో తెలుసా?
నిన్నటి వరకు సోషల్ మీడియా మీమ్స్, చాటింగ్‌ల్లో మాత్రమే కనిపించిన జెన్ జీ భాష.. ఇప్పుడు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలోనూ వినిపించింది. రాజకీయ విమర్శలకు యువత వాడే స్లాంగ్ పదాలను ఎంపీలు ఉపయోగించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఆన్లైన్ సంభాషణల్లో కనిపించే పదాలు.. తాజాగా లోక్‌సభ చర్చలోనూ చోటు దక్కించుకున్నాయి.నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన చర్చలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తొలుత Gen Z పదజాలాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాల నిరసనలను విమర్శిస్తూ.. ‘MIA’ (Missing In Action), ‘FOMO’ (Fear Of Missing Out), ‘Delulu’ (Delusional) వంటి పదాలను ఉపయోగించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ కూడా ‘Clock it’ అనే పదాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తేజస్వి సూర్య సైతం ‘Delulu’, ‘source code’ వంటి పదాలను ఉపయోగిస్తూ తన వాదనను వినిపించారు.It's raining Gen Z lingo in Loksabha.BJP MP Bansuri Swaraj said that PM Modi clocked by bringing a bill against the Paper leak. https://t.co/ovC4uz8QKs pic.twitter.com/o2cNJtUT4k— Political Kida (@PoliticalKida) July 28, 2026 "Congress was having FOMO and staying in DELULU".Dr. Shrikant Shinde of Shivsena just bodied Congress in Loksabha in GenZ style! 😂 pic.twitter.com/LMN5IRUQmt— Political Kida (@PoliticalKida) July 28, 2026 అయితే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈ కొత్త భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది విద్యా వ్యవస్థలోని సమస్యలపై అని.. కేవలం కొత్త పదాల ప్రదర్శన కోసం కాదని సూచించారు. అయితే ఆ తర్వాత ఆమె కూడా ‘Delulu’ పదాన్ని ఉపయోగిస్తూ.. యువత మొత్తం తమవైపే ఉందని భావించొద్దని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.'Delulu' takes over #LokSabha: #TejasviSurya, #SupriyaSule clash over who has Gen Z's support🌍 Catch the day's latest news here ➠ https://t.co/40gdOz6FIS 🗞️ pic.twitter.com/B9cr59wJTm— Economic Times (@EconomicTimes) July 28, 2026అసలు ఈ Gen Z భాష పుట్టింది ఎక్కడ?Gen Z స్లాంగ్ అనేది ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టిన భాష కాదు. ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీమ్ సంస్కృతి, డిజిటల్ జీవనశైలి కలిసి సృష్టించిన కొత్త భాషా రూపం. సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని Gen Zగా పిలుస్తారు. ఈ తరం చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగింది. అందుకే వీరి సంభాషణల్లో వేగం, సంక్షిప్తతకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది.ఎక్కువ భావాన్ని తక్కువ పదాల్లో చెప్పడం, సరదాగా స్పందించడం, ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం కోసం కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. మొదట చిన్న ఆన్లైన్ గ్రూపులు, గేమింగ్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా చర్చల్లో మొదలైన ఈ పదాలు.. TikTok, Instagram, YouTube వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.మీమ్స్‌తో మొదలై..జెన్‌జీ భాష వ్యాప్తిలో మీమ్ కల్చర్ కీలక పాత్ర పోషించింది. ఒక సంఘటనను లేదంటే ఒక భావాన్ని సీరియస్‌గా కాకుండా సరదాగా చెప్పేందుకు యువత కొత్త పదాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కొత్త పదాలు సినిమాలు, టెలివిజన్, సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్లేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఆ స్థానాన్ని తీసుకుంది. ఒక వైరల్ వీడియో, ఒక మీమ్ లేదంటే ఒక ట్రెండ్ ద్వారా పుట్టిన పదం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇలా డిజిటల్ ప్రపంచంలో పుట్టిన పదజాలం ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారం, ప్రకటనలు వంటి రంగాల్లోకి కూడా ప్రవేశించింది.యువత ఎందుకు ఇష్టపడుతోంది?ఈ భాషలో కొన్ని పదాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ‘Delulu’ అంటే వాస్తవానికి దూరమైన ఊహల్లో ఉండటం, ‘FOMO’ అంటే ఏదైనా అవకాశం కోల్పోతామేమో అన్న భయం, ‘MIA’ అంటే కనిపించకుండా పోవడం, ‘Clock it’ అంటే ఒక విషయాన్ని గుర్తించడం లేదా నిజాన్ని బయటపెట్టడం. ‘Rizz’ అంటే ఆకర్షించే వ్యక్తిత్వం, ‘Slay’ అంటే అద్భుతంగా చేయడం, ‘No cap’ అంటే నిజం చెబుతున్నాను అనే అర్థం. సోషల్ మీడియా, మీమ్ కల్చర్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదాలు ఇప్పుడు యువత సంభాషణల్లో భాగమయ్యాయి.జెన్‌జీ భాషకు ప్రధాన ఆకర్షణ దాని సరళత, వేగం. సుదీర్ఘమైన భావాలను ఒకే పదంతో వ్యక్తం చేసే అవకాశం ఈ స్లాంగ్ ఇస్తోంది. అంతేకాదు.. ఒకే తరానికి చెందిన వారు ఒకే రకమైన పదాలను ఉపయోగించడం ద్వారా తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరుచుకుంటున్నారు. ఇది కేవలం మాట్లాడే విధానంలో మార్పు కాదు.. డిజిటల్ యుగంలో ఒక తరం తన గుర్తింపును వ్యక్తం చేసుకునే మార్గంగా మారింది.వ్యాపారాలకు కూడా ఉపయోగమే..ఇప్పుడు కేవలం యువత సంభాషణలకే ఈ భాష పరిమితం కాలేదు. యువ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకునే కంపెనీలు, బ్రాండ్లు కూడా ఈ పదజాలాన్ని గమనిస్తున్నాయి. ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల్లో యువతకు దగ్గరగా ఉండే భాషను ఉపయోగించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఒక తరం ఎలా ఆలోచిస్తోంది, ఎలా స్పందిస్తోంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ స్లాంగ్ ఒక సాధనంగా మారింది.విమర్శలు కూడా..అయితే Gen Z భాషపై విమర్శలు కూడా ఉన్నాయి. అధికారిక వేదికల్లో ఇలాంటి స్లాంగ్ పదాలను ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా విద్య, విధానాలు వంటి తీవ్రమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో భాష మరింత గంభీరంగా ఉండాలని కొందరి అభిప్రాయం.భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఎన్నో పదాలు ఇప్పుడు సాధారణ వాడుకలోకి వచ్చాయి. టెక్నాలజీ, సినిమాలు, వీధి సంస్కృతి నుంచి గతంలో పదాలు వచ్చినట్లే.. ఇప్పుడు సోషల్ మీడియా కొత్త పదాలకు వేదికగా మారింది. Gen Z భాష వెనుక అసలు కథ కొన్ని విచిత్రమైన పదాల కథ కాదు. ఇంటర్నెట్ యుగంలో పెరిగిన ఒక తరం తన భావాలను, ఆలోచనలను, గుర్తింపును వ్యక్తం చేసుకునేందుకు సృష్టించుకున్న కొత్త శైలి. అందుకే మీమ్స్, చాటింగ్‌ల నుంచి మొదలైన ఈ భాష.. ఇప్పుడు పార్లమెంట్ చర్చల వరకూ చేరింది.:::వెబ్ ప్రత్యేకం -
2029 నాటికి ‘జెన్ జీ’ ఓటే శాసనం!
2029 నాటికి భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేందుకు ఒక సరికొత్త యువశక్తి సిద్ధమవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకున్న ‘జెన్ జెడ్’ లేదా ‘జెన్ జీ’ అని పిలిచే ప్రస్తుత యువతరం దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఓటర్ల సమూహంగా అవతరించనున్నదని తాజా నిరుద్యోగ, విద్యాపరమైన నిరసనలు స్పష్టం చేస్తున్నాయి.రాజకీయాల్లో ఆధిపత్యంభారతదేశ రాజకీయ భవిష్యత్తును మలుపు తిప్పే శక్తిగా ‘జెన్ జెడ్’ ఎదుగుతోంది. నీట్ వంటి కీలకమైన పరీక్షల పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు, ప్రభుత్వాలు ఇకపై యువత గొంతును విస్మరించలేవనే కఠిన సత్యాన్ని నిరూపించాయి. పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ తరం నిలబడుతున్న తీరు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో వణుకు పుట్టిస్తోంది.38 కోట్ల మందితో భారీ ఓటర్ల బలగంవచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి, 18 నుండి 32 సంవత్సరాల వయస్సు గల జెన్ జెడ్ జనాభా దాదాపు 38 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో దాదాపు 19 కోట్ల మంది పురుషులు, 18 కోట్ల మంది మహిళలు ఉంటారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న ఈ తరం, మిలీనియల్స్ తరాన్ని వెనక్కి నెట్టి దేశంలోనే అతిపెద్ద వయోజన ఓటర్ల సమూహంగా రికార్డు సృష్టించనుంది.డిజిటల్ కనెక్టివిటీతో పెరిగిన శక్తికేవలం జనాభా సంఖ్య మాత్రమే కాకుండా ఈ తరానికి ఉన్న డిజిటల్ కనెక్టివిటీనే వారి ప్రధాన బలం. సోషల్ మీడియా వేదికగా కేవలం క్షణాల వ్యవధిలో వేలాది మందిని ఏకం చేయగల సామర్థ్యం ‘జెన్ జెడ్’ సొంతం. ఏ చిన్న సమస్య ఎదురైనా దానిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేయడంలో, ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంలో ఈ యువత ముందుంటోంది.మారుతున్న జనాభా లెక్కలు మరోవైపు భారతదేశ జనాభా క్రమంగా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తోంది. దేశంలో చిన్నారుల శాతం తగ్గుతుండగా, వృద్ధులు, మధ్య వయస్కుల జనాభా క్రమంగా పెరుగుతోంది. 1988లో ఓటర్లలో 18-29 ఏళ్ల వయసువారు 38.3 శాతంగా ఉండగా, 2024 నాటికి అది 30.1 శాతానికి పడిపోయింది. 2029 నాటికి ఇది మరింత తగ్గి 27.8 శాతానికి చేరనుందని అంచనా.రాజకీయ పార్టీలకు సవాల్ఓటర్ల మొత్తం సంఖ్యలో యువత శాతం స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ, వారి ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రాబోయే కాలంలో ఉపాధి, నాణ్యమైన విద్య, జీవన ప్రమాణాలు, గృహ నిర్మాణం, వాతావరణ మార్పులు, సుపరిపాలన వంటి అంశాలే ఎన్నికల ఫలితాలను శాసించనున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఈ యువ ఓటర్ల మద్దతు తప్పనిసరి కానుంది.నిరసనల రూపంలో ప్రజాస్వామ్యంగతంలో ఎన్నడూ లేనివిధంగా యువత తమ నిరసనలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా, డిజిటల్, ప్రత్యక్ష ఆందోళనల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా చేయగలుగుతున్నారు. ఢిల్లీ వేదికగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు కేవలం ఒక విద్యా విభాగానికి సంబంధించినవి కావు, ఇవి రాబోయే రాజకీయ మార్పులకు బలమైన పునాదులు.దేశ భవిష్యత్తును నిర్దేశించనున్న ‘జెన్ జెడ్’ఒకవైపు జనాభా కూర్పు మారుతున్నప్పటికీ, జెన్ జెడ్ తరం అత్యంత చైతన్యవంతంగా ఉంటూ, దేశ రాజకీయ దిశను నిర్దేశిస్తోంది. 2029 ఎన్నికల నాటికి ఈ యువశక్తి దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే కాలంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఈ యువత ఆకాంక్షలకు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.ఇది కూడా చదవండి: వీడని బిగ్ మిస్టరీ: 23 ఏళ్లుగా ప్రముఖ నటుడు అదృశ్యం! -
పేకాట అడినోళ్లకే ఉద్యోగం.. గుంటూరు యువత వినూత్న నిరసన
-
లోకేష్ కే షాక్.. DSC స్కాంపై జెన్ జీ ఉద్యమం.
-
పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z
-
ఏపీలో Gen-Z తుఫాన్ నారా మోసం అంతా ఇంతా కాదు
-
పవన్ కు బిగ్ షాక్.. Gen-Z తిరుగుబాటు.. జనసేనపై సోషల్ మీడియాలో వార్
-
మా నెక్ట్స్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం: అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తదుపరి కార్యాచరణ ఏంటి? భారతీయుల్లో ఉన్న ప్రశ్న ఇది. దీంతో దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం చెబుతూ.. "మా తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం. ఉద్యమం నిన్ననే ముగిసింది. మాకు కొంత సమయం ఇవ్వండి" అని అన్నారు.పంజాబ్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా అభిజీత్ దీప్కే స్పందించారు. "ఆ అంశాన్ని కూడా ప్రస్తావిస్తాం. ప్రస్తుతం దానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం" అని చెప్పారు.ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల గురించి దీప్కే మాట్లాడుతూ... "విద్యార్థులపై నమోదైన కేసుల అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏ విద్యార్థిపైనా కేసులు నమోదు చేయకూడదు" అని స్పష్టం చేశారు.పంజాబ్ మంత్రిపై ఒత్తిడికేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. అయితే ఆ డిమాండ్లను బైన్స్ తాజాగా తిరస్కరించారు. ఫార్మసీ నియామక పరీక్ష వివాదంపై స్పందిస్తూ విమర్శకులపై ఆయన మండిపడ్డారు.బైన్స్ మీడియాతో మాట్లాడుతూ.. "ఇది ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కాదు. భారీ స్థాయిలో కాపీయింగ్ జరిగిన ఘటన. కాపీయింగ్‌ను పరీక్షా కేంద్రంలోనే గుర్తించి, అందుకు పాల్పడిన విద్యార్థులను అక్కడికక్కడే పట్టుకున్నాం" అని చెప్పారు.తన రాజీనామా కోరుతున్న వారిపై స్పందిస్తూ, ప్రతిపక్ష నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. "నేను మొదటి నుంచి విద్యార్థులకే అండగా నిలిచాను. నా రాజీనామా వల్ల ఉద్యమానికి ఉపయోగం ఉంటే పదవి వదులుకోవడానికి కూడా సిద్ధమేనని విద్యార్థులకు చెప్పాను" అని బైన్స్ వెల్లడించారు."ఆ కాపీయింగ్ కేసు నా శాఖ పరిధిలోనిది కూడా కాదు. అది నా సహచర మంత్రి బాధ్యత. అయినప్పటికీ బాధ్యత నుంచి నేను తప్పించుకోవడం లేదు" అని హర్జోత్ సింగ్ బైన్స్ స్పష్టం చేశారు. -
AP బొద్దింకలు సిద్ధం! నెక్స్ట్ వేసేది నిన్నే.. Gen-Z గుప్పిట్లో బాబు, లోకేష్
-
ఈ తరం లాజిక్ అడుగుతోంది GenZపై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
యువతకు సమాధానం ఇవ్వాల్సిందే: మోహన్ భగవత్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో యువత, కొత్త తరంతో వ్యవహరించే విధానంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘విశ్వ మంగళ్య సభ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను, యువత ఆలోచనా విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.తాము యువకులుగా ఉన్న కాలం పూర్తిగా విధేయతతో కూడుకున్నదని, కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ప్రస్తుత కొత్త తరం ప్రతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని, వారికి కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా తగిన కారణాలు వివరించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. నేటి కుటుంబాల్లోనూ పరస్పర సంభాషణలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో మరింత ఆప్యాయంగా మెలగాలని, వారి కోసం సమయం కేటాయించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.ఇదేసమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పష్టం చేశారు. నూతన సాంకేతికతలను అందిపుచ్చుకుని, వాటిపై పట్టు సాధించి, మానవాళి అభ్యున్నతికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. భౌతికవాద ఆలోచనల కారణంగా సృజనకు పరిమితంగా ఉన్న వనరులు, అపరిమిత ఆకాంక్షల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోటీ కారణంగానే సమాజంలో సంఘర్షణలు తలెత్తుతున్నాయని మోహన్ భగవత్ విశ్లేషించారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ ఎఫెక్ట్: మందుబాబులకు షాక్! -
SMలో వీడియో వైరల్.. GEN-Z డేరింగ్ లేడీ.. మహిళా కానిస్టేబుల్ తో ఫైట్
-
ప్లకార్డ్‌లో పంచ్‌లైన్... నిరసనలో రీల్ వైబ్
లాఠీలతో కొడితే థ్యాంక్యూలు చెప్తున్నారు. చెదరగొట్టడానికి వాటర్ కానన్ వాడితే రెయిన్ డాన్స్ చేస్తున్నారు. వాళ్ల పాటే నినాదం. వాళ్ల వ్యంగ్యమే ప్రశ్న. సెల్‌ఫోన్ పట్టుకున్న సైన్యంలా ఉంటున్నారు. జెన్ జి నిరసనకు ఫార్మాట్ మారింది. సీరియస్ ఇష్యూ + సినిమా పంచ్ + సోషల్ మీడియా... అదే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’.ఢిల్లీ జంతర్ మంతర్‌లో ‘నీట్’ ప్రశ్నాపత్రానికి సంబంధించి తాజా నిరసనలో టియర్ గ్యాస్ గుప్పుమంది. అది చూసిన ఒక కుర్రాడు వెంటనే ప్లకార్డ్ మీద ఇలా రాశాడు. ‘గురూ... నేను యమునకు ఆ వైపున ఉంటా. ఇంతకన్నా కంపు రోజూ తెలుసు. ఇదసలు లెక్కే కాదు’....అక్కడే ఉన్న మరో కుర్రాడు ఇంకో ప్లకార్డ్ పట్టుకున్నాడు. దాని మీద గాంధీగారి బొమ్మ ఉంది. కింద కామెంట్– ‘ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సీజన్1 హీరోని రంగంలో దించాల్సి వచ్చింది’... అంటే అహింసామార్గ ప్రదాతనే రంగంలోకి దించాల్సి వచ్చిందని అర్థం.మరో ప్లకార్డ్ ఒకమ్మాయి పట్టుకుంది. దాని మీద కామెంట్– ‘నాకు ఎవరూ ఫండింగ్ చేయలేదు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఉచితానికే అసహ్యించుకుంటున్నా’...తమ నిరసనకు స్పందించని పెద్దలకు చురక వేస్తూ మరో పోస్టర్. దానిపై మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్‌లోని సర్క్యూట్ పాత్ర. కింద కామెంట్– ఓయ్ సర్క్యూట్. రాంగ్ పర్సన్‌ని ఎత్తుకొచ్చావ్ స్వామీ.మామూలుగా నిరసనల్లో లాఠీచార్జీ జరిగితే పారిపోతారు. కాని నిరసనకు దిగిన జెన్ జి తరం వెనక్కి తగ్గలేదు. వాటర్ కానన్ కొట్టినా బదులుగా ‘రెయిన్ డాన్స్’ చేశారు. ‘Fitness plan: Running from police’ అని బోర్డు పట్టుకున్నారు.జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్ఒకప్పుడు నిరసన అంటే నల్ల జెండాలు, గొంతు చించుకునే నినాదాలు. కానీ 2026లో జెన్ జి ఆ డెఫినిషన్ను చెరిపేసింది. వాళ్లకు ఆగ్రహం ఉంది. కానీ ఆ ఆగ్రహాన్ని మీమ్‌గా, రీల్‌గా, పాటగా మారుస్తున్నారు. పేపర్ లీక్, నిరుద్యోగం, అవినీతి– సీరియస్ ఇష్యూలే. కానీ చెప్పే తీరు మాత్రం క్రియేటివ్. ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, జైపూర్ కావచ్చు... జెన్ జికి కోపం వస్తే స్టయిల్ ఇదే. స్పందించని వ్యవస్థను ఎద్దేవా చేస్తూ ‘నా ఎక్స్ (బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్) కూడా నన్ను ఇంతగా బాధించ లేదు’ అని ప్లకార్డు పట్టుకొని నిలబడుతున్నారు. ఇలా డిజిటల్ కల్చర్‌ను, మీమ్స్ భాషను నిరసనకు వాడుకోవడాన్నే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’ అంటున్నారు. బాలీవుడ్ పాటలు పాడటం, సంగీత కచ్చేరీలు, ప్రబోధ గీతాల ఆలాపన.. అన్నీ అలౌడ్.గెట్ రెడీ విత్ మీ (G-RWM)జెన్ జి యువతీ యువకులు ఒక దగ్గరకు కూడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీ ‘చలో సంసద్’ నిరసన కోసం ప్రిపరేషన్ అంతా సోషల్ మీడియా రీల్స్ నుంచే ప్లాన్ అయింది. ‘గెట్ రెడీ విత్ మీ’ అంటూ రీల్స్ చేస్తూ యువతను సమీకరించారు. టియర్ గ్యాస్‌ను తట్టుకోవడానికి స్విమ్మింగ్ గాగుల్స్, ఢిల్లీ ఉక్కపోతను తట్టుకోవడానికి మినీ యూఎస్బీ ఫ్యాన్లు, విసనకర్రలు దగ్గర పెట్టుకుని బయలుదేరి వచ్చారు. ఎయిర్‌పోర్టుల నుంచి, రైలు కంపార్ట్మెంట్లలో నుంచి స్టోరీలు పెడుతూ ఏదో మ్యూజిక్ కాన్సెర్ట్‌కు వెళ్తున్నంత ఊపుతో దేశ రాజధానికి తరలివచ్చారు. ‘మా గుండెల్లో ఇంక్విలాబ్.. మా చేతుల్లో ఇన్ స్టాగ్రామ్!’ అనే వన్–లైనర్ ఈ తరం నిరసన తత్వం. ధర్మాగ్రహం కలిగి, శాంతియుతంగా మార్పు తేవాలని ప్రయత్నిస్తున్న ఈ తరాన్ని, వ్యంగ్యమనే బాణాలతో ప్రత్యర్థి మనసు మార్చాలని చూస్తున్న ఈ భావితరం స్వరాన్ని ‘నో’ అని నొక్కేస్తే రేపు వాళ్లు మాట్లాడటమే మానేస్తారు. ‘మేమున్నాం’ అని భుజం తడితే ఈ దేశానికి క్రియేటివ్, కరేజియస్ లీడర్స్ దొరుకుతారు. పంచ్‌లైన్ తో మొదలైన ఈ నిరసన రేపు పాలసీతో అంతం కావాలి. అప్పుడే ఈ ‘సెల్‌ఫోన్ సైన్యం’ నిజమైన దేశభక్తి సైన్యంగా మారుతుంది. వారి దారి వినూత్నంఢిల్లీలో పోలీసుల లాఠీచార్జి జరిగి, సాయంత్రం వాళ్లు డ్యూటీ దిగుతుంటే లాఠీ దెబ్బలు తిన్న యువతీ యువకులంతా ‘థ్యాంక్యూ సర్... చాలా బాగా డ్యూటీ చేశారు’ అని రోడ్డు పొడుగునా నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇలా చేయడం తిట్టడం కంటే చాలా ఎక్కువ. ‘ఇంటికెళ్లి గర్వంగా ముఖం చూపించండి’ అని కూడా అన్నారు. తమను కొట్టిన వారికే మంచి నీళ్లు అందించడం, గులాబీపూలు ఇవ్వడం జెన్ జి ప్రొటెస్ట్ స్టయిల్. పోలీసులు కొడుతుంటే జాతీయ జెండాను చుట్టుకుని నిలబడటం, సారే జహాసే అచ్ఛా పాడటం.... జనగణమన ఆలపించడం.... కచ్చితంగా గాంధీ మార్గం.– కె -
జెన్ జీ జెట్ స్పీడ్
‘నైపుణ్యానికి ఆసక్తి తొలి మెట్టు’ అంటారు. నేటి తరం యువత ఆసక్తి అనే తొలి మెట్టు ఎక్కి, ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ అద్భుతాలు సాధిస్తోంది. ‘అదృష్టం కాదు...ఆసక్తే నీ బలం, నైపుణ్యం, విజయరహస్యం’ అని చెప్పకనే చెబుతోంది. స్టీరియో టైప్ లైఫ్‌కి సెండాఫ్ ఇచ్చి నచ్చిన రంగంలో తమదైన ముద్రవేసేందుకు ఆసక్తి చూపుతోంది. వారసత్వంగా వస్తున్న వృత్తులకు ఆధునికతను జోడించి సంప్రదాయ కళలను అనుసంధానం చేయడం, టెక్ ప్రపంచాన్ని పక్కన పెట్టి ఊహలకి ఊతమివ్వడం, సాంకేతికతకు సృజనాత్మకతను మేళవించి తపనే పెట్టుబడిగా చేసుకుని అనుకున్న లక్ష్యాలను సాధించడంలో నేటి జెన్ జీ తరం జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది... సాంకేతిక రంగం నుంచి వినోద రంగం వరకు యువతలో ఎంతోమంది అద్భుతాలు సాధిస్తున్నారు... వారిలో కొందరి గురించి...ఓన్లీ ట్యాలెంట్మోడలింగ్ టు యాక్టింగ్ఏ మాత్రం సినీ నేపథ్యం లేని కుటుంబాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి తమ సత్తా చాటుకునే వాళ్లు కూడా ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఉంది అనీత్ పడ్డా. గతేడాది బాలీవుడ్లో సైలెంట్‌గా రిలీజై సెన్సేషన్‌ని సృష్టించిన సినిమా ‘సయ్యారా’. ఈ చిత్రంలో హీరోయిన్గా చేసిన అనీత్ పడ్డా ఒక్కసారిగా బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోకి చేరిపోయింది. గేయ రచయిత్రిగా వాణిబాత్రా పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం మాడ్డాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ లోవస్తున్న తదుపరి చిత్రం ‘శక్తిషాలిని’లో నటిస్తోంది.యాడ్ ఫిల్మ్ టు డైరెక్షన్ప్రకటనలు, షార్ట్ ఫిల్మ్‌లతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన షాజియా ఇక్బాల్, 2025లో విడుదలైన ధడక్ –2తో ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. కథను భావోద్వేగపూరితంగా తెరకెక్కించినందుకు విమర్శకుల నుంచి ప్రశంసలందుకుంది. సామాజిక అంశాలను సున్నితంగా ఆవిష్కరించే దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. 2026 స్క్రీన్స్ అవార్డ్స్‌లో బ్రేక్ త్రూ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డు అందుకుంది.కోల్‌కతా టు కేన్స్కోల్కతాకు చెందిన మోధురా పాలిత్కి చిన్నప్పటి నుంచి కెమెరా అంటే మక్కువ ఎక్కువ. తల్లిదండ్రులిద్దరూ ఫొటోగ్రాఫర్లు కావడంతో స్వతహాగా లైటింగ్, కంపోజిషన్ వంటి విషయాలపై ఆసక్తి పెంచుకుంది. సహజ కాంతిని వినియోగించడం, భావోద్వేగాలకు అనుగుణంగా ఫ్రేమ్‌లను తీర్చిదిద్దడం ఆమె ప్రత్యేకత. షార్ట్‌ఫిల్మ్‌లు, బెంగాలీ, హిందీ సినిమాలు, వెబ్ సీరిస్‌లకు సినిమాటోగ్రఫర్‌గా చేసిన ఆమె పనితీరుకు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. 2026లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పియర్ ఆంజెన్యూ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ వేదికపై భారతీయ ఫొటోగ్రఫీకి తీసుకొచ్చిన గౌరవం ఇది...వెలకట్టలేని కళకి కొత్త వెలుగుఐటీరంగం నుంచి విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాలలో కృత్రిమ మేధ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు డిగ్రీ పాస్ అయినా, బీటెక్‌లో బ్యాక్‌లాగ్స్ కంప్లీట్ చే సినా ఉద్యోగాల బాట పట్టే యువత మెల్లగా తన దారి మార్చుకుంటోంది. సంప్రదాయ హస్తకళలకు ఆధునికతను జోడించి అద్భుతాలు సృష్టిస్తోంది.గుజరాత్‌లోని కచ్‌కు చెందిన ముబస్సిరా ఖలీద్ ఖత్రీ సంప్రదాయ అజ్రక్ బ్లాక్ ప్రింటింగ్ కళాకారుల కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి అజ్రక్ కళను సున్నితంగా పరిశీలిస్తూ పెరిగిన ఖత్రీ దానిపై మక్కువ పెంచుకుంది. మూడు తరాలు కేవలం మగవారికి మాత్రమే పరిమితమైన ఈ కళలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. హస్తకళను ఆధునిక ఫ్యాషన్‌కు అనుసంధానించే దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఖత్రీ ‘ఎలీసియన్’ అనే బ్రాండ్ పేరిట అజ్రక్ కళతో రూపొందించిన జాకెట్లు, కాఫ్తాన్లు, డ్రెస్సులు, ఇండో వెస్ట్రన్ దుస్తులను కొత్త తరానికి పరిచయం చేస్తోంది. 2025లో లాక్మే ఫ్యాషన్ వీక్ ఎక్స్ ఎఫ్డీసీఐలో ఆమె ప్రదర్శించిన అనాటమీ కలెక్షన్ అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలందుకుని సంప్రదాయ అజ్రక్ కళకు కొత్త ఊపునిచ్చింది. దీంతో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30–2026 జాబితాలో ఆమెకు స్థానం లభించింది. నేడు యూత్ స్కిల్స్ డే సందర్భంగా ఖత్రీ యువతకు ఒక స్పష్టమైన సందేశాన్నిస్తోంది. వారసత్వంగా వచ్చిన కళను కాపాడడమే కాదు, డిజైన్, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి ఆధునిక నైపుణ్యాలను జోడిస్తే స్థానిక హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావచ్చని ఆమె నిరూపించింది.అజ్రక్ కళ అంటే ? అజ్రక్ అనేది గుజరాత్‌లోని కచ్, రాజస్థాన్‌లోని భార్మేర్ ప్రాంతాలలో పాటు పాకిస్థాన్‌లోని సిం«ద్ ప్రాంతంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ హ్యాండ్ ప్రింటింగ్ కళ. చెక్కతో చెక్కిన బ్లాక్‌లను ఉపయోగించి సహజమైన రంగులతో వస్త్రాలపై అందమైన ఆకృతులను ముద్రించడం దీని ప్రత్యేకత. ఇండిగో, కొన్ని మొక్కల వేర్లు, దానిమ్మ తొక్కలు వంటి సహజ పదార్థాలతో రంగులు తయారు చేయడం వల్ల ఈ వస్త్రాలు పర్యావరణహితంగా ఉంటాయి. ఈ కళకు సుమారుగా వెయ్యేళ్ల చరిత్ర ఉంది.నేటి యువతకు దిక్సూచిలాఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, ఏఐ.. ఇలా ఎన్నో.. రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రపంచాన్ని మన ముంగిట్లోకి తెచ్చిందని సంబరపడుతుంటాం.. కానీ అదే సాంకేతికత నేటి యువత మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఎలా దెబ్బతీస్తుందో లోతుగా విశ్లేషిస్తున్నారు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, జెన్ జెడ్ ప్రతినిధి ఫ్రేయా ఇండియా.నేటి యువత నిజమైన ప్రపంచాన్ని వదిలేసి లైకులు, కామెంట్ల కోసం వెంపర్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్ల్స్ పుస్తక రచయిత్రి అయిన 26 ఏళ్ల ఫ్రేయా ఇండియా యూకేలో పుట్టిపెరిగింది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జోనాథన్ హైట్ నడుపుతున్న ‘ఆఫ్టర్ బాబెల్’ ప్లాట్ఫామ్లో స్టాఫ్ రైటర్‌గా పనిచేస్తూ.. ‘ది యాంగ్షియస్ జనరేషన్’ ప్రాజెక్ట్‌లో ఆమె అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా జెన్ జెడ్ ఎదుర్కొంటున్న డిజిటల్ సమస్యలను గురించి వివరిస్తున్నారు.డిజిటల్ ప్రపంచంలో యువత విలవిల!ఫ్రేయా ఇండియా కేవలం సాంకేతికతను మాత్రమే విమర్శించట్లేదు. సోషల్ మీడియా వల్ల యువత కోల్పోతున్న భావోద్వేగాలను, నిజమైన బంధాలను ఆమె తన వ్యాసాల ద్వారా కళ్లకు కడుతున్నారు. ఆమె దృష్టిలో నేటి తరం నిజమైన స్నేహాన్ని కోల్పోయింది. ఇద్దరు మిత్రులు ముఖాముఖి మాట్లాడుకున్నపుడు వచ్చే ఆత్మీయతను నేటి తరం కోల్పోతోందన్నది ఆమె ఆవేదన. అమ్మాయిలకు దిశానిర్దేశం ఆమె ప్రారంభించిన గర్ల్స్ అనే సబ్‌స్టాక్ ద్వారా నేటి యువతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సోషల్ మీడియా వల్ల వారి ఆత్మగౌరవం ఎలా దెబ్బతింటోంది అనే విషయాలపై ఫ్రేయా ఇండియా గొంతు విప్పుతున్నారు. అందం కోసం డిజిటల్ ఫిల్టర్లపై ఆధారపడటం, మానసిక సమస్యలను సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌లా మార్చడం, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆన్ లైన్ లో ప్రదర్శించడం, నిజమైన బంధాలకు దూరమవ్వడం, భావోద్వేగాలపై విరక్తి చెందడం వంటి అంశాలను వివరిస్తున్నారు.నిజమైన సాధికారత అంటే ఏమిటి? స్క్రీన్ ల బయట బంధాలను మళ్లీ ఎలా నిర్మించుకోవాలి? అనే ప్రశ్నలను మన ముందుంచుతూ నేటి డిజిటల్ యుగంలో యువతను మేల్కొలుపుతూ ఈ తరం గొంతుకగా నిలుస్తున్నారు ఫ్రేయా ఇండియా.⇒ నేటి డిజిటల్ యుగంలో ఒక అమ్మాయి మానసికంగా కాస్త బలహీనపడినా, తనపై తను నమ్మకం కోల్పోయినా... కార్పొరేట్ సంస్థలు ఆమెను ఆదుకోవడానికి రావు.. బదులుగా ఆమె బలహీనతలను క్యాష్ చేసుకుని ‘నువ్వు ఇలా మారిపో‘ అంటూ సరికొత్త ముసుగులను అమ్మడానికి సిద్ధమవుతాయి. అందుకోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటాయి. ఏఐ, అల్గారిథమ్స్ సాయంతో ఆమెలో ఉన్న అత్యంత రహస్యమైన భయాలను, అభద్రతా భావాలను పసిగట్టి.. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ల ద్వారా రోజులో 24 గంటల పాటూ అదేపనిగా సరికొత్త ప్రకటనల దాడి సాగిస్తాయి. మరింత అందంగా, మరింత పాపులర్‌గా ఎలా ఉండాలో నిరంతరం నూరిపోస్తూ... గత ఏ తరం ఎదుర్కోని విధంగా నేటి తరాన్ని బలవంతంగా బ్రాండ్ల వైపు మళ్లిస్తున్నాయి. – ఫ్రేయా ఇండియారోబోటిక్ మోడల్ డస్ట్ బిన్..మన దేశంలో రీసైక్లింగ్ ప్రక్రియ సరిగ్గా సాగకపోవడానికి ప్రధాన కారణం చెత్తను దాని రకాన్ని బట్టి ముందుగా వేరు చేయకపోవడం. ఈ సమస్యను గుర్తించిన ఢిల్లీకి చెందిన మహి మల్హాని అనే 17 ఏళ్ల విద్యార్థిని, ఏఐ సాయంతో కంప్యూటర్ విజన్ ఆధారంగా పనిచేసే రోబోటిక్ మోడల్‌ను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న చెత్త సమస్యకు సాంకేతికతే సరైన పరిష్కారమని నిరూపించింది మహి మల్హానీ. తాను ఒక విహారయాత్రకు వెళ్లినపుడు డస్ట్ బిన్లకు చుట్టుపక్కల పడి ఉన్న చెత్తను గమనించింది.అందుకు ఒక పరిష్కారం కనిపెట్టాలని ఆలోచించింది. అలా ఏఐని ఉపయోగించి, కేవలం తడి– పొడి చెత్తనే కాకుండా... వివిధ రకాల వ్యర్థాలను 90 శాతం కచ్చితత్వంతో వేరు చేయగల ఒక అద్భుతమైన కంప్యూటర్ విజన్ ఆధారంగా పనిచేసే రోబోటిక్ మోడల్ని రూపొందించింది. రోబో ప్రత్యేకత... ఇది అడ్వాన్ ్సడ్ కెమెరా సెన్సార్లతో రూపొందించినది. కాబట్టి రోబో ముందు వేసిన వ్యర్థాల మీదకు కెమెరా లైట్ పడగానే, అది ప్లాస్టిక్, కాగితం, మెటల్, గ్లాస్ లేదా ఆర్గానిక్ (తడి చెత్త) వ్యర్థమా అనేది మైక్రోసెకన్లలో గుర్తిస్తుంది. వెంటనే, అందులోని రోబోటిక్ ఆర్మ్ ఆ వస్తువును పట్టుకుని దానికి కేటాయించిన ప్రత్యేకమైన డస్ట్‌బిన్ లో వేస్తుంది. పర్యావరణానికి ఎంతో మేలు! ఈ ఆవిష్కరణకు అయ్యే తయారీ ఖర్చు చాలా తక్కువ. దీనిని గనుక మున్సిపల్ కేంద్రాల్లో లేదా కాలేజీలు, అపార్ట్మెంట్లలో పెద్ద ఎత్తున వాడితే... మానవ ప్రమేయం లేకుండానే చెత్తను అత్యంత వేగంగా వేరు చేయవచ్చు. దీనివల్ల రీసైక్లింగ్ పరిశ్రమలకు క్లీన్ మెటీరియల్ అందుతుంది.కార్ కప్ హోల్డర్ ఫ్రెండ్లీ డస్ట్ బిన్ రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు కార్ల అద్దాలు దించి నీళ్ల బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్ రాపర్లు బయటకు విసిరేయడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ‘స్వచ్ఛ భారత్’ అంటూ మనం ఎంత చెప్పుకున్నా, ప్రయాణాల్లో కార్లలో చెత్త వేయడానికి సరైన సదుపాయం లేకపోవడం కూడా దీనికి ఒక కారణం. ఈ సమస్యకు ఢిల్లీకి చెందిన కొంతమంది ప్రతిభావంతులైన జెన్ జెడ్ విద్యార్థులు అత్యంత సులభమైన, వినూత్నమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే కార్ కప్ హోల్డర్ డస్ట్‌బిన్. మిజోరాం రాష్ట్రానికి చెందిన నాథన్ అనే విదార్థి ఢిల్లీలోని మన్న్ పాఠశాలలో చదువుతున్నాడు. రహదారుల వెంట చెత్త కనిపించడం, కార్లనుంచి చెత్తను రోడ్లపైనే విసిరివేయడం అతనిని ఆలోచింపజేసింది. అందుకు పరిష్కారం కనుగొనాలని తన స్నేహితులతో కలిసి ప్రయోగాలు ప్రారంభించాడు. సాధారణంగా కార్లలో పెద్ద డస్ట్బిన్లు పెట్టడానికి స్థలం ఉండదు. డోర్ పాకెట్లలో ప్లాస్టిక్ కవర్లు తగిలించినా అవి చూడటానికి బాగోవు, పైగా దుర్వాసన వస్తుంటుంది. దీన్ని గమనించిన విద్యార్థులు, దాదాపు ప్రతి కారులోనూ గేర్ లివర్ పక్కన లేదా సీట్ల మధ్యలో ఉండే కప్ హోల్డర్ ఖాళీగా ఉండటాన్ని గమనించారు.కచ్చితంగా ఆ కప్ హోల్డర్ స్థానంలో సరిగ్గా అమరిపోయేలా, కప్పు సైజులోనే ఉండే ఒక వినూత్నమైన ‘మినీ డస్ట్‌బిన్’ను వారు డిజైన్ చేశారు. ఎలాంటి అదనపు క్లిప్‌లు లేదా గ్లూ అవసరం లేకుండా నేరుగా కారులోని కప్ హోల్డర్‌లో ఉంచవచ్చు. దీనికున్న ప్రత్యేక స్ప్రింగ్ మూత వల్ల, కేవలం ఒక చేత్తో సులభంగా నొక్కి లోపల చెత్త వేయవచ్చు. వేసిన వెంటనే మూత దానంతట అదే మూసుకుపోతుంది. దీనివల్ల కారులో ఎలాంటి దుర్వాసనా రాదు. దీనిని వాటర్‌ప్రూఫ్ ప్లాస్టిక్ లేదా సిలికాన్ మెటీరియల్‌తో తయారు చేస్తారు గనుక శుభ్రపరచడం కూడా తేలిక.నేను మిజోరాం నుంచి చదువుకోవడానికి ఢిల్లీకి వచ్చినపుడు రహదారుల వెంబడి ఉన్న చెత్తను చూసి ఆవేదనకు గురయ్యాను. మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నప్పుడు రహదారులను, బయటి పరిసరాలను, నేలను ఎందుకు చెత్తతో నింపుతున్నాం అని ఆలోచించాను. ముఖ్యంగా కార్ల నుంచి రహదారులపైకి విసిరివేస్తున్న చెత్త సమస్యకు ఒక పరిష్కారం కనిపెట్టాలని ఆలోచించి కార్ కప్ హోల్డర్ డస్ట్ బిన్ను రూపొందించాను. దీనివల్ల చాలా వరకు రహదారులు శుభ్రంగా ఉంటాయి. ఈ చిన్న ఇన్వెన్షన్ ప్రతి కారులో ఉంటే, లక్షలాది టన్నుల చెత్త రోడ్లపై పడకుండా నేరుగా రీసైక్లింగ్ కేంద్రాలకు చేరుతుంది. – నాథన్నిర్వహణ: శ్రావణ్ జయ, రమ జంబుల -
వయసేమో 20.. మోకాళ్లేమో 60!
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులనేవి వృద్ధాప్యానికి సంకేతాలుగా మనం భావిస్తుఉంటాం. కానీ ప్రస్తుత ‘జెడ్ జనరేషన్’ యువతను ఈ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో చిన్న వయస్సు వారే మోకాళ్లు బిగుసుకుపోవడం, కీళ్ల వాపులు, భుజాల నొప్పులు తదితర ఫిర్యాదులతో భారీగా ఆస్పత్రుల బాట పడుతున్నారు.యువతలో ఇంత వేగంగా కీళ్ల సమస్యలు పెరగడానికి కేవలం వారి ఆధునిక జీవనశైలి మాత్రమే కారణం కాదు. దీని వెనుక బలమైన 'జన్యుపరమైన' కారణాలు కూడా దాగున్నాయని వైద్యులు చెబుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) లేదా రోగనిరోధక వ్యవస్థ లోపాలు (ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్) ఉన్నట్లయితే, ఆ వంశంలోని యువతకు ఈ ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోసింగ్ స్పాండిలైటిస్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది. తల్లిదండ్రులు లేదా తోబుట్టువులలో ఈ సమస్యలు ఉంటే, వారి పిల్లలకు చాలా చిన్న వయస్సులోనే ఈ లక్షణాలు బయటపడవచ్చు.దీనికి తోడు ప్రస్తుత జెడ్ జనరేషన్ ఉద్యోగుల జీవనశైలి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. గంటల తరబడి డెస్క్‌లకే పరిమితం కావడం, శారీరక శ్రమ లేకపోవడం (సెడెంటరీ లైఫ్ స్టైల్) వంటి అలవాట్లు జన్యుపరమైన లోపాలతో తోడై.. కీళ్ల వాపులను, కార్టిలేజ్ (మృదులాస్థి) దెబ్బతినడాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయి. ఈ తరం యువతలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే.. తమకు వస్తున్న నొప్పులు ఆర్థరైటిస్ కావచ్చు అని వారు అస్సలు ఊహించడం లేదు. ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోవడం, విశ్రాంతి తీసుకున్నాక కూడా వాపులు తగ్గకపోవడం వంటి ప్రాథమిక హెచ్చరికలను వారు అలసట, పని ఒత్తిడి లేదా పడుకునే పద్ధతి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చినవిగా భావించి కొట్టిపారేస్తున్నరు.ఈ నిర్లక్ష్యం కారణంగా సరైన సమయంలో వైద్యులను సంప్రదించకుండా ఏళ్ల తరబడి వ్యాధి నిర్ధారణను ఆలస్యం చేస్తున్నారు. తద్వారా చిన్న వయస్సులోనే కీళ్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. యువతలో కీళ్ల నొప్పులను ముందే గుర్తించడమే కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొదటి అడుగు. వంశపారంపర్యంగా వచ్చే జన్యువులను మనం మార్చలేం. కానీ ఈ సమస్యను ఖచ్చితంగా నియంత్రించవచ్చు. క్రమం తప్పకుండా శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, ఎక్కువసేపు ఒకే చోట కదలకుండా కూర్చోకుండా ఉండటం వంటి చిన్న జాగ్రత్తల ద్వారా కీళ్ల నొప్పుల తీవ్రతను తగ్గించవచ్చు లేదా రాకుండా నివారించవచ్చు. ముందే గుర్తించి, సరైన వైద్య పరీక్షల ద్వారా చికిత్స తీసుకుంటే దీర్ఘకాలిక వైకల్యాల బారిన పడకుండా కీళ్ల కదలికలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. (మణిపాల్ హాస్పిటల్ వైట్‌ఫీల్డ్‌కు చెందిన ఆర్థోపెడిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ గిరీషా బి.ఎ ‘మాతృభూమి’కి అందించిన వివరాల ఆధారంగా..) -
‘నేనేం స్కూల్ స్టూడెంట్‌ని కాదు సార్’
ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో మేనేజర్లు, ఉద్యోగుల మధ్య సంబంధాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అద్దం పట్టే సంఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనారోగ్య సెలవు (సిక్ లీవ్) అడిగినందుకు సదరు ఉద్యోగిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డిమాండ్ చేసిన బాస్‌కు ఒక జెన్ జీ ఉద్యోగి ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆన్లైన్లో చర్చకు దారితీసింది.అసలేం జరిగిందంటే..?ఎక్స్ వేదికగా వైరల్ అవుతున్న ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్ ప్రకారం.. ఒక ఉద్యోగి తన మేనేజర్‌కు మెసేజ్ చేస్తూ, ‘సార్ నహీ ఆ పావంగా, ఫీవర్ బడ్ గయా హై’(సార్.. నేను రాలేను, నాకు జ్వరం ఎక్కువైంది) అని సమాచారం ఇచ్చాడు. దీనికి బాస్ స్పందిస్తూ, ‘చలో డాక్టర్ కే పాస్ చల్తే హై’(డాక్టర్ వద్దకు వెళ్తున్నావా) అని బదులిచ్చాడు. ప్రస్తుతానికి తాను ట్యాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నానని, అవసరమైతేనే డాక్టర్ వద్దకు వెళ్తానని ఉద్యోగి స్పష్టం చేశాడు. అయితే, అంతటితో ఆ సంభాషణ ముగియలేదు.‘డైరెక్టర్ సర్ నే కహా హై జో భీ బిమార్ హో ఉస్సే డాక్టర్ కి ప్రిస్క్రిప్షన్ లో’(అనారోగ్యంతో సెలవు అడిగే ప్రతి ఒక్కరి నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సేకరించాలని డైరెక్టర్ గారు ఆదేశించారు) అంటూ మేనేజర్ ఒత్తిడి తెచ్చాడు.మేనేజర్ మాటలకు సదరు జెన్ జీ ఉద్యోగి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘మై స్కూల్ స్టూడెంట్ నహీ హూన్ సర్. లీవ్ రెహ్తీ హై, లీవ్ మై’ (నేను స్కూల్ స్టూడెంట్‌ని కాదు సార్. నాకు సెలవు అందుబాటులో ఉంది, అందుకే తీసుకుంటున్నాను) అని తేల్చిచెప్పాడు. అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రిస్క్రిప్షన్ అంత తప్పనిసరి అయితే, కంపెనీ డైరెక్టరే స్వయంగా డాక్టర్ కాబట్టి తన పేరు మీద ఆయన్నే ఒక ప్రిస్క్రిప్షన్ రాసుకోమనాలని సూచించాడు. అంతేకాకుండా, తన తల్లిదండ్రులు సంతకం చేసిన లీవ్ లెటర్లు తన వద్ద లేవని, ప్రస్తుతానికి తాను విశ్రాంతి తీసుకుంటున్నందున ఇకపై వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించనని చాటింగ్‌ను ముగించాడు.నెటిజన్ల స్పందనఈ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపట్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. ‘భారతీయ మేనేజర్లు తమ కింద పనిచేసేవారిని ఉద్యోగులుగా కాకుండా, బానిసలుగా భావిస్తారు. జెన్ జీ ఉద్యోగి ఇచ్చిన ప్రతిస్పందన అద్భుతం’ అంటూ కొందరు సదరు యువకుడికి మద్దతుగా నిలిచారు. కంపెనీలు ఉద్యోగులకు వార్షిక సెలవులు కేటాయించినప్పుడు, ఒక రోజు అనారోగ్య సెలవు కోసం కూడా మెడికల్ సర్టిఫికెట్లు అడగడం వారిపై నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: బెంగళూరు ఐటీ కారిడార్‌లో ఘోరం -
జెన్‌జీ కొత్త ఫార్ములా.. ఇదే ఇప్పుడు వైరల్!
టెక్నాలజీ జీవితాన్ని సులభతరం చేస్తుంటే.. అనవసరంగా ఎందుకు కష్టపడాలి?. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ పోస్ట్.. దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యంగా జెన్‌జీ (Gen Z) యువత జీవితం, పని, విజయం, కష్టం గురించి ఎలా ఆలోచిస్తోందనే అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు.ఈ చర్చకు కారణమైనది ఎక్స్ (X) వేదికపై ప్రేమ్ సోని అనే యూజర్ చేసిన ఓ పోస్ట్. పాతతరం కష్టాన్నే విజయానికి కొలమానంగా భావిస్తుంటే.. జెన్‌జీ మాత్రం సమయం, సామర్థ్యం, సౌకర్యానికే ఎక్కువ విలువ ఇస్తోందని ఆ యూజర్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఒక పనిని సులభంగా పూర్తి చేసే అవకాశం కల్పిస్తుంటే.. అదే పనిని అనవసరంగా కష్టపడి చేయడంలో అర్థం లేదనేదే జెన్‌జీ ఆలోచనగా వివరించారు.దీనికి ఉదాహరణగా.. కూరగాయలు కొనడానికి ట్రాఫిక్, దుమ్ము, బేరసారాలతో గంటసేపు గడపడం కంటే.. మొబైల్ యాప్‌లో కొన్ని నిమిషాల్లో ఆర్డర్ చేయడాన్నే జెన్‌జీ తెలివైన నిర్ణయంగా భావిస్తోందని చెప్పారు. అలాగే రద్దీ బస్సుల్లో ప్రయాణించడం కంటే క్యాబ్ లేదంటే రైడ్-హైలింగ్ యాప్‌ను ఉపయోగించడం సమయాన్ని ఆదా చేసే మార్గమని యువత చూస్తోందని పేర్కొన్నారు.అంతేకాదు, పిల్లలు మంచి ఉద్యోగాలు చేసి సౌకర్యవంతమైన జీవితం గడపాలని కోరుకునే తల్లిదండ్రులే.. అదే పిల్లలు టెక్నాలజీ సాయంతో సమయం ఆదా చేసుకుంటే వారిని బద్ధకస్తులుగా చూడడం ఒక వైరుధ్యమని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కష్టాన్ని, పొదుపును గొప్పగా చెప్పిన పెద్దలే.. ఇప్పుడు తమ స్మార్ట్ఫోన్లలో క్విక్ కామర్స్ యాప్‌ల ద్వారా వచ్చే డెలివరీలను ట్రాక్ చేయడం కూడా ప్రస్తావించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.Indian parents are facing a massive existential crisis because Gen Z refuses to suffer for no logical reason.It is deeply offensive to our culture that a 24 year old will order groceries on Blinkit instead of spending 45 minutes inhaling road dust and fighting a vendor to save…— Prem Soni (@ValueWithPrem) June 28, 2026సమయానికి విలువ ఇవ్వడం, అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడం బద్ధకం కాదని, అదే ఆధునిక జీవనశైలి అని చాలామంది జెన్‌జీకి మద్దతు తెలిపారు. మరోవైపు, జీవితంలో కొంత కష్టాన్ని అనుభవించడం వల్లే సహనం, క్రమశిక్షణ, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని మరికొందరు వాదించారు.మొత్తానికి.. ఈ చర్చ కేవలం ఆన్లైన్లో కూరగాయలు కొనడం, క్యాబ్‌లో ప్రయాణించడం గురించి మాత్రమే కాదు. కాలం మారుతున్న కొద్దీ 'కష్టం' అనే పదానికి అర్థం కూడా మారుతోందా? సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు సమయాన్ని ఆదా చేసుకోవడం తెలివా? లేదంటే కష్టపడటమే జీవిత విలువను నేర్పుతుందా?అనే ప్రశ్నలను మరోసారి సమాజం ముందుకు తీసుకొచ్చింది. అందుకే.. జెన్‌జీ కొత్త ఫార్ములాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మరి మీరేమంటారు?.. ఈ వాదనతో ఏకీభవిస్తారా??. -
కంగారు లేని ప్రయాణం.. మనసుకు నచ్చిన నిశ్శబ్దం!
ఒకప్పుడు వెకేషన్ అంటే ఉదయాన్నే లేవడం, టూరిస్ట్ ప్లేస్‌ల చుట్టూ తిరగడం, ఫొటోలు దిగడం.. వింటుంటేనే అలసిపోయినట్లు ఉంది కదూ! అయితే నేటి తరం యువత (జెన్ జీ) ఈ పాత పద్ధతులకు పూర్తిగా స్వస్తి పలుకుతోంది. ప్రయాణాల పేరుతో సాగే ఈ పరుగుల పందేన్ని పక్కన పెట్టి, సరికొత్త పద్ధతికి తెరలేపింది. అందమైన ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ లగ్జరీ గదుల్లో ఏమీ చేయకుండా ప్రశాంతంగా గడపడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఈ వినూత్న ట్రెండ్‌ను ‘రూమ్ రొట్టింగ్’ అని పిలుస్తున్నారు. ఇది సోమరితనం కాదు, ఒత్తిడిని జయించే ఒక అద్భుతమైన మార్గమని నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.మారిన ప్రయాణాల రూపురేఖలుగతంలో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలంటే అదొక పెద్ద పట్టిక, సందర్శించాల్సిన స్థలాల జాబితా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆరాటం ఉండేవి. కానీ నేటి తరం ఆ ఒత్తిడిని అస్సలు ఇష్టపడటం లేదు. తాజా గణాంకాల ప్రకారం.. ప్రతి ముగ్గురిలో ఇద్దరు జెన్ జీ పర్యాటకులు కేవలం ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, 10 మందిలో 8 మంది యువతీ యువకులు తమ ట్రిప్‌లో కనీసం సగభాగం తాము బస చేసిన హోటల్ లేదా ఎయిర్బిఎన్బి గదుల్లోనే గడుపుతున్నారు.రూమ్ రొట్టింగ్ వెనుక అసలు రహస్యంఈ సరికొత్త ధోరణిని పాత తరం వారు సమయాన్ని వృథా చేసుకోవడంగా భావించవచ్చు. కానీ జెన్ జీ కోణంలో చూస్తే ఇది ఒక విప్లవాత్మక మార్పు. వారు తమకు నచ్చిన వ్యక్తులతో గడపడానికి, నిరంతరం పనిచేసే మెదడుకు కాస్త విశ్రాంతి ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ ఎయిర్బిఎన్బి గదులే ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. బాల్కనీ నుండి కనిపించే వ్యూ, అర్ధరాత్రి కలిసి వండుకునే వంటలు, తెల్లవార్లూ సాగే మనసు విప్పిన సంభాషణలే వారికి నిజమైన అనుభూతులు.స్వేచ్ఛకు పెరిగిన ప్రాధాన్యతపరిశోధనల ప్రకారం.. దాదాపు 64 శాతం మంది యువత తమ ప్రయాణాల్లో ఎలాంటి షెడ్యూల్స్ లేకుండా ఖాళీగా ఉంచుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఇక 74 శాతం మంది పర్యాటకులు తాము అనుకోకుండా ప్లాన్ చేయకుండా చేసిన పనులే అత్యంత ఉత్తమమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయని చెబుతున్నారు. అర్ధరాత్రి స్నాక్స్ కోసం చేసే డ్రైవ్‌లు, జీవితం గురించి గంటల తరబడి సాగే చర్చలే ఈ తరం ఆశిస్తున్న వినోదం.మానసిక ఆరోగ్యం..ఈ రూమ్ రొట్టింగ్ ట్రెండ్ వెనుక బలమైన ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. నేటి యువతలో మానసిక ప్రశాంతత కోసం ప్రయాణాలు చేసే ధోరణి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతీయ యువతలో తీవ్రమైన ఒత్తిడి, బర్నౌట్ (అలసట) నుండి కోలుకోవడానికి చేసే ప్రయాణాలను ‘మెంటీ బీ ట్రావెల్’ అని పిలుస్తున్నారు. ప్రపంచం ఇచ్చే ఒత్తిడి ఎక్కువైనప్పుడు, మరిన్ని పనులు చేయడం కంటే, ప్రశాంతత కోసం ఏమీ చేయకుండా ఉండటమే సరైన మందు అని వారు నమ్ముతున్నారు.ప్రతి ప్రయాణంలోనూ వైవిధ్యంఈ ట్రెండ్‌లో మరో విశేషం ఏంటంటే.. 67 శాతం మంది జెన్ జీ పర్యాటకులు తాము చేసే ప్రతి ప్రయాణం ఒకదానికొకటి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో నిర్దిష్టమైన రూల్స్ ఏమీ లేవు. ఒకరికి కొండ ప్రాంతంలో మూడు రోజులు ఏ ప్లాన్ లేకుండా గడపడం నచ్చితే, మరొకరికి నగరంలోని ఒక అపార్ట్మెంట్లో ఉదయం 8 గంటల దాకా హాయిగా పడుకోవడం నచ్చవచ్చు. ఇంకొకరు తోటలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదించవచ్చు.అపరాధ భావన వీడిన యువతలక్షలు పోసి టూర్‌కు వచ్చి, బయట తిరగకపోతే డబ్బులు దండగ అనే పాత అపరాధ భావన ఇప్పుడు పూర్తిగా మాయమవుతోంది. రూమ్ రొట్టింగ్ అంటే తక్కువగా బతకడం కాదు, జీవితంలో ఏది ముఖ్యమో దానికి మాత్రమే సమయం కేటాయించడం. తమకు నచ్చిన వారితో, ఎక్కడికీ వెళ్లాలనే కంగారు లేకుండా, ఇంటికి దూరంగా ఒక అందమైన ప్రదేశంలో కేవలం ప్రశాంతంగా ఉండటమే నిజమైన వెకేషన్ అని జెన్ జీ నిరూపిస్తోంది.ఇది కూడా చదవండి: ఇక ఫోన్లతో పనిలేదు.. కళ్లద్దాలతోనే కాల్స్, ట్రాన్స్‌లేషన్స్! -
పెళ్లికి దూరమవ్వడానికి కారణాలు ఇవే అంటున్న లేటెస్ట్ జనరేషన్
-
నవతరానికి మొహం మొత్తిందా?
కొత్త వింత... పాత రోత అంటారు. కానీ... ఈ తరానికి కొత్త కూడా రోతగానే అనిపిస్తున్నట్లు ఉంది! ఎందుకంటారా? నాలుగైదేళ్లు కూడాకాకముందే ఏఐపై వారికి మొహం మొత్తింది! అమెరికా, యూరప్, ఆసియా.. ఇలా ప్రపంచం మొత్తమ్మీద... ఏఐని నమ్మని వాళ్లు, వద్దని అనుకుంటున్న వాళ్లు... తిరస్కరిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది! 2020ల మొదట్లో చిన్న చిన్న చాట్బోట్లు, సిఫారసు వ్యవస్థలతో మొదలైన ఏఐ ఆటోమేషన్ 2023లో చాట్‌జీపీటీ రాకతో రాకెట్ స్పీడ్ అందుకుంది. ఇమేజీలు సృష్టించడం మొదలుకొని సినిమాలు తీసేంతవరకూ అనేకానేక ఏజెంటిక ఏఐల రాకతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం పడింది. ఆంథ్రోపిక్ క్లాడ్తోపాటు మరికొన్ని అత్యాధునిక ఏఐ వ్యవస్థలు నెమ్మదిగా సాఫ్ట్వేర్ కోడింగ్ చేయడం, తన తప్పులు తానే సరి చేసుకోవడం.. వంటి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా మొదలైంది.అంతేకాకుండా డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై అవగాహన కూడా పెరిగింది. ఇదే సమయంలో వివిధ దేశాలు ఏఐ టెక్నాలజీకి ముకుతాడు వేసేందుకు, నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చే ప్రయత్నాలూ మొదలుపెట్టాయి. తాజాగా జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం యువతలో మరీ ముఖ్యంగా జెన్–జీలో ఏఐపై విముఖత పెరుగుతోంది. అమెరికాలో ‘ప్యూ రీసెర్చ్’, యూరప్‌లో ‘స్టాన్‌ఫర్డ్ ఏఐ ఇండెక్స్ – 2026’లు జరిపిన అధ్యయనాలు జెన్–జీలో ఏఐ పట్ల పెరుగుతున్న అభద్రత భావానికి అద్దం పడుతున్నాయి. అంకెలు చెప్పే విషయం... అమెరికాలోని ప్యూ రీసెర్చ్ ఇటీవలే ‘‘అమెరికన్స్ అండ్ ఏఐ 2026: ఛాట్‌బోట్స్, స్మార్ట్ డివైజెస్ అండ్ వ్యూస్ ఆన్ ఇంపాక్ట్’పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. వారం రోజుల క్రితం విడుదలైన అధ్యయన ఫలితాల ప్రకారం కేవలం 16 శాతం మంది (అధ్యయనంలో పాల్గొన్న 5119 మందిలో) మాత్రమే ఏఐ సమాజంపై సానుకూల ప్రభావం చూపగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.అదే సమయంలో ఈ టెక్నాలజీతో సమాజానికి నష్టమే అని అభిప్రాయపడ్డవారు 40 శాతం వరకూ ఉంది. ఇదే అభిప్రాయంతో 48 శాతం జెన్–జీ సభ్యులు ఏకీభవిస్తూండటం గమనార్హం. అలాగని ఎవరూ ఈ టెక్నాలజీని వాడటం లేదా అంటే 49 శాతం మంది చాట్‌జీపీటీ వంటివి వాడుతున్నట్లు స్పష్టమైంది. జెన్–జీలో ఇది 66 శాతం. రెండేళ్ల క్రితం వాడకందార్లు కేవలం 33 శాతం మంది మాత్రమే. ఏఐపై వ్యతిరేకత వయసుతోపాటు కొంత తక్కువ అవుతూండటం ఇంకో ఆసక్తికర అంశం. అమెరికా మాత్రమే కాదు.. యూరప్, భారత్‌సహా ఆసియా దేశాల్లోనూ ఏఐ వాడకమైతే పెరుగుతోంది కానీ.. అందుకు తగ్గట్టుగానే అపనమ్మకం కూడా ఎక్కువ అవుతోందన్నమాట. దీనికీ కారణాలు లేకపోలేదు. కంపెనీ యాజమాన్యాలు ఏఐ వాడకంపై ఎక్కువ ఆసక్తి చూపుతూండగా ఉద్యోగులు భయం, భయంగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజ కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు గుమ్మరిస్తూండటంతో ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్న మాట వాస్తవమైనప్పటికీ జెన్–జీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఎంత కాలం కొనసాగుతుందన్నది ప్రశ్నగా మారింది.యూరప్‌లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. ఏఐ వ్యవస్థలపై నియంత్రణ అవసరమన్న వాదనతోపాటు ఏఐ కంపెనీలపై విశ్వాసం సడలుతున్నట్లు స్టాన్‌ఫర్డ్ ఏఐ ఇండెక్స్ 2026 స్పష్టం చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఏఐతో ఉద్యోగాలకు నష్టమన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తూండగా యూకేలో వాడకం బాగా పెరుగుతున్నా ఏఐ వ్యవస్థలపై నమ్మకం అతితక్కువ స్థాయిలోఉంది. మానవ సృజనకు పాతర... ఏఐ మానవ సృజనకు పాతరేస్తోందని, ఆటోమేషన్ కారణంగా మనిషి ఆలోచించడం మానేస్తాడని జెన్–జీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై కూడా జెన్–జీలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పవన్ కామెంట్స్ పై GEN-Z ఫైర్
-
మల్టీప్లెక్స్‌ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీప్లెక్స్ థియేటర్ల ముఖచిత్రం వేగంగా మారుతోంది. కేవలం భారీ బడ్జెట్, అగ్ర హీరోల పెద్ద సినిమాలపైనే ఆధారపడకుండా నిరంతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సరికొత్త వ్యూహాలను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ‘జెన్ జీ’ వినియోగదారులను తమ ప్రధాన ఆడియన్స్ గ్రూప్‌గా మల్టీప్లెక్స్ పరిశ్రమ టార్గెట్ చేస్తోంది. ఓటీటీలు, రీల్స్ వంటి ఆన్లైన్ వేదికలపై విరక్తి (డిజిటల్ అలసట) చెందిన యువత.. మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తుండటం ఇండస్ట్రీలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది.మరోవైపు, పెద్ద సినిమాల విడుదలకు మధ్య ఉండే గ్యాప్‌లో మల్టీప్లెక్స్‌ల్లో ఆక్యుపెన్సీ రేటు పడిపోకుండా ప్రాంతీయ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు, ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లే చిన్న చిత్రాలు (స్లీపర్ హిట్లు) కీలక పాత్ర పోషిస్తున్నాయి.బాక్సాఫీస్‌ను శాసిస్తున్న యూత్!ఇటీవల విడుదలైన ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా టోబర్ 2026 నివేదిక ప్రకారం.. భారతీయ బాక్సాఫీస్ వసూళ్లలో యువత పాత్ర ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. హిందీ బాక్సాఫీస్ మొత్తం కలెక్షన్లలో 30 ఏళ్ల లోపు ఉన్న యువత వాటా ఏకంగా 57% గా ఉంది. ఇక ఒక సినిమా విడుదలైన మొదటి రోజు (ఫస్ట్ డే) వచ్చే రెవెన్యూలో ఈ యువ తరం వాటా అత్యధికంగా 70% గా నమోదు కావడం విశేషం.‘ప్రస్తుతం సినిమా థియేటర్లకు వస్తున్న వారిలో జెన్ జీ తరం వారే అత్యధికంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేదికలతో విసిగిపోయిన యువత, మళ్లీ వెండితెర అనుభూతిని ఆస్వాదించేందుకు థియేటర్లకు తిరిగి వస్తున్నారు’ అని పీవీఆర్ ఐనాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ బిజ్లీ అన్నారు.ఒరిజినల్ కథలకే జై కొడుతున్న యువతఏదో ఒక సూపర్ హీరో ఫ్రాంచైజీలనో, పాత హిట్ చిత్రాల రీమేక్లనో లేదా రీబూట్లనో కాకుండా.. సరికొత్త లైన్లతో, ఒరిజినల్ కథాంశాలతో వచ్చే సినిమాలను చూసేందుకే యువత మక్కువ చూపుతున్నారని సంజీవ్ బిజ్లీ పేర్కొన్నారు. యువ దర్శకులు రూపొందించిన సరికొత్త చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎలా కనెక్ట్ చేస్తున్నాయనే దానికి కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’, కేన్ పార్సన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాక్‌రూమ్స్’ చిత్రాల విజయాలే నిదర్శనమని ఉదహరించారు.భవిష్యత్తు ట్రెండ్స్ ఇవే..సినిమా ఎగ్జిబిషన్ రంగాన్ని రాబోయే రోజుల్లో కొన్ని అంశాలు శాసించనున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవి..థియేటర్లలో అధునాతన స్క్రీన్లు, మెరుగైన సీటింగ్, లగ్జరీ అనుభూతిని అందించడం.ద్వితీయ, తృతీయ శ్రేణి (టైర్2, టైర్3) పట్టణాలు, నగరాలకు మల్టీప్లెక్స్‌లను విస్తరించడం.కేవలం ఈవెంట్ సినిమాలు, పెద్ద చిత్రాలపైనే ఆధారపడకుండా.. విభిన్నమైన కంటెంట్‌తో వచ్చే స్లీపర్ హిట్ చిత్రాల ద్వారా థియేటర్లను నిరంతరం నిర్వహించడం.ఇదీ చదవండి: కాకపెంచుతున్న పసిడి ధరలు -
జెన్‌జీ..చెప్పుడు మాటలు నమ్మట్లేదు
నిన్నటివరకు కేవలం గాడ్జెట్లు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఎంపికలకే పరిమితమనుకున్న ‘జెన్-జీ’ వినియోగదారుల ప్రభావం.. ఇప్పుడు ఫుడ్ బ్రాండ్లకు పాకింది. దశాబ్దాల చరిత్ర గల ప్రముఖ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు సైతం ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకోక తప్పడం లేదు. కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, ప్రొడక్ట్ లేబులింగ్, సరికొత్త ఉత్పత్తుల రూపకల్పన.. ఇలా ప్రతి నిర్ణయాన్నీ ఈ తరం యువ వినియోగదారులే శాసిస్తున్నారని పరిశ్రమవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.దేశీయ వినియోగంలో 35 శాతం వీరిదే!ఇప్సోస్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఫుడ్ వినియోగ వ్యయంలో దాదాపు 35 శాతం వాటా 15 నుంచి 20 ఏళ్ల పైబడిన జెన్-జీ యువతదే. ఆరోగ్యం, డిజిటల్ పరిజ్ఞానం, పర్యావరణ స్పృహ వంటి అంశాలే వీరి ఎంపికలను నిర్ణయిస్తున్నాయి.లేబుల్స్ చదువుతున్నారు.. ప్రశ్నిస్తున్నారు!ఒకప్పుడు బ్రాండ్ పేరు చూసి వస్తువులు కొనేవారు. కానీ నేటి తరం ఆలోచనా విధానం వేరుగా ఉంది. దీనిపై ఎమ్టీఆర్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ తివారీ మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘కాలేజీకి వెళ్లే నా కుమారుడు, అతని స్నేహితులు ఏ ప్రొడక్ట్ కొన్నా.. బ్రాండ్‌తో సంబంధం లేకుండా వెనుక వైపు ఉన్న లేబుల్‌ను నిశితంగా పరిశీలించడం స్వయంగా చూశాను. నేను మార్కెట్ విజిట్స్‌కి వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గమనిస్తుంటాను. యువ వినియోగదారులు షాపింగ్ మాల్స్‌లో నిలబడి లేబుల్స్‌ను పోల్చి చూస్తూ ఆ ప్రొడక్ట్‌లో ఏమేం పదార్థాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సమయం కేటాయిస్తున్నారు. బ్రాండ్లు చెప్పే మాటలను నమ్మడం లేదు. చదువుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఆపైనే నిర్ణయం తీసుకుంటున్నారు’ అని విశ్లేషించారు.ఫ్యూచర్-రెడీ దిశగా దిగ్గజ కంపెనీలుయువతను ఆకట్టుకునే వ్యూహంలో భాగంగా మారిపోతున్న ట్రెండ్‌ను మారికో ఎండీ సౌగతా గుప్తా వివరిస్తూ.. ‘మేము ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంతో పాటు సంస్థను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలంటే.. మా ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో కచ్చితంగా జెన్-జీ, మిలీనియల్స్ అభిరుచులకు అనుగుణంగా ఉండాలి’ అన్నారు. ఇందుకు తగ్గట్టుగానే, మారికో సంస్థ కేవలం మూడు వారాల వ్యవధిలోనే యువతను టార్గెట్ చేసే మూడు డైరెక్ట్-టు-కన్స్యూమర్ బ్రాండ్లను దాదాపు రూ.800 కోట్లతో కొనుగోలు చేసింది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో..అంశంశాతం తమ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలనుకుంటున్న జెన్-జీ యువత79%అరోగ్యం కోసం జీవనశైలిలో గణనీయమైన మార్పులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నవారు83%2022 - 2025 మధ్య కాలంలో భారతదేశంలో ప్లాంట్-బేస్డ్ (మొక్కల ఆధారిత) ఫుడ్ ఇండస్ట్రీ సాధించిన వృద్ధి19% -
జెన్ జెడ్.. కొత్త పాఠాలు
అప్పులంటే ఇష్టం లేదు. కానీ... ఈజీగా ‘ఇదిగో తీసుకో’ అంటూ వచ్చే మెసేజీలకు ఇట్టే ఆకర్షితులైపోతారు. అదుపులేకుండా వాడేస్తారు. ఎక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందో సొంతగానే విశ్లేషిస్తారు. తమకు అన్నీ తెలుసనుకుంటారు. కానీ... రీల్స్‌లో ఇన్ఫ్లుయెన్సర్లను ఇట్టే నమ్మేస్తారు. ఖర్చుల్ని నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటారు. కానీ స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా జరిపే లావాదేవీలతో... డబ్బు నిరంతరం ఖర్చవుతూనే ఉంటుంది. ముందే పొదుపు ఆరంభిస్తున్నారు. చిన్నచిన్న డిస్కౌంట్లు, ఆఫర్లకన్నా... పారదర్శకంగా చార్జీలు వసూలు చేసే సంస్థలనే నమ్ముతున్నారు. స్మార్ట్ ఫోన్లలో వాడే అప్లికేషన్ల నుంచీ ఎంటర్టైన్మెంట్ వరకూ సబ్ర్‌స్కిప్షన్లు ఎక్కువ. ఎప్పటికప్పుడు కొత్త గాడ్జెట్లు, లైఫ్ స్టైల్‌ను అప్‌గేడ్ చేసుకోవటం అలవాటు. ఇదంతా ‘జెడ్’ జనరేషన్ గురించి. 16 ఏళ్లు దాటి... 30 ఏళ్లు నిండని యువతరం గురించి. వీరి అలవాట్లు కొన్ని మంచివే అయినా... కొన్నింటి విషయంలో జాగ్రత్తపడాల్సిందే. 2030 నాటికి జెన్ జెడ్, యువ మిలీనియల్స్ దేశీ వినియోగ వ్యయాల్లో మెజారిటీ వాటాకు చేరుతున్న నేపథ్యంలో... వీళ్లేం చేస్తున్నారో... ఏం చేస్తే బాగుంటుందో చెప్పే ‘సాక్షి వెల్త్’ స్టోరీ ఇది.పదేళ్ల కిందటి వరకూ పర్సులో డబ్బులు లేకుండా కదలడమనేది ఊహక్కూడా అందేది కాదు. కానీ ఇప్పటి జెన్ జెడ్.. చేతిలో స్మార్ట్‌ఫోన్ తప్ప మరేదీ వెంట తీసుకెళ్లడం లేదు. యూపీఐ సహా డిజిటల్ లావాదేవీలు సర్వ సాధారణమైపోవటమే ప్రధాన కారణం. క్యాష్తో సౌకర్యం తక్కువని భావించటం వల్ల కూడా దీనిపై ఆధారపడటం తగ్గుతోంది. మరో గమనించదగ్గ అంశమేంటంటే ఈ తరం క్రెడిట్ కార్డులకు తక్కువ ప్రాధాన్యమివ్వటం. యూపీఐ, మొబైల్ వాలెట్స్, డెబిట్ కార్డులనే ఎక్కువ వాడటం. క్యాష్‌ని అత్యంత తక్కువగా ఉపయోగిస్తున్నారు. పేమెంట్ మెథడ్ ఎంత సింపుల్‌గా ఉంటే అంత మంచిదనుకుంటున్నారు. పాత తరం వారు నెలవారీగా కొనుగోళ్లు, పండగ షాపింగ్‌లు జరుపుతుంటే... ఈ జెన్ జెడ్ మాత్రం వీకెండ్ షాపింగ్‌లే కాకుండా దాదాపు నిరంతరం ఖర్చు చేస్తూనే ఉన్నారు. క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, ఓటీటీ మెంబర్‌షిప్‌లు, గేమింగ్ సబ్్రస్కిప్షన్లు.. ఇలా ఒకటి కాదు నిత్యం బోలెడన్ని చిన్న చిన్న లావాదేవీలు చేస్తూనే ఉంటున్నారు. ఇలా వీరి ఖాతాల్లోంచి నిరంతరం ప్రవహిస్తున్న నగదు ఆధారంగా... ఇపుడొక కొత్త ‘రియల్ టైమ్ స్పెండింగ్ ఎకానమీ’ పుట్టుకొచ్చింది. అది అంతకంతకూ పెరుగుతోంది. అప్పంటే ఇష్టం లేదు.. కానీ.. సాధారణంగా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టేస్తుందని యువతపై ఓ అభిప్రాయం ఉంది. కానీ జెన్ జెడ్ తరం ఆర్థిక అలవాట్లు లోతుగా చూస్తే ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక సంక్షోభాలు, కరోనా సమయంలో అనిశ్చితి, టెక్ రంగంలో ఉద్యోగాల కోతల్లాంటివన్నీ చూసిన మీదట ఈ తరం వాళ్లలో చాలా మంది ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు సంప్రదాయ క్రెడిట్ కార్డులకు బ దులు డెబిట్ కార్డుల వాడకానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీనితో సంప్రదాయ క్రెడిట్ కార్డ్ కంపెనీలకి ఈ సెగ్మెంట్లో అంతగా పట్టు లభించటం లేదు. కానీ కొత్తరూట్లో ‘‘బై నౌ, పే లేటర్’’ (బీఎన్‌పీఎల్) పేరిట సరికొత్త క్రెడిట్ సర్వీసులు తెచ్చేసరికి జెన్ జెడ్ ఇట్టే ఆకర్షితులయిపోతున్నారు. ఈ– కామర్స్, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాంలతో నేరుగా అనుసంధానమైన ఈ తరహా స్వల్పకాలిక ఫైనాన్సింగ్ ను యువతరం ఎక్కువగా ఉపయోగించుకుంటన్నా రు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. → చాలా తక్కువ డాక్యుమెంటేషన్, అప్పటికప్పుడు అప్రూవల్ → వార్షిక ఫీజులు లేకపోవడం, వడ్డీరహిత గ్రేస్ పీరియడ్ → చిన్న చిన్న మొత్తాల్లో సరళంగా చెల్లించే వెసులుబాటు కాకపోతే, బీఎన్‌పీఎల్ అనేది చాలా సౌకర్యవంతమైనదే కానీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. వివిధ యాప్‌ల ద్వారా దాదాపు ఒకే వ్యవధిలో చేసే చిన్న చిన్న కొనుగోళ్లన్నీ ఒకేసారి తడిసి మోపెడై, అప్పుడప్పుడే ఆదాయార్జనలో పడిన యువతకు భారీ రుణ భారంగా మారుతున్నాయి కూడా. ఈ ప్రమాదాన్ని ఊహించాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఫిన్ఫ్లుయెన్సర్ల ప్రభావం..యువతరం ఇప్పుడు ఆర్థిక సలహాల కోసం ఇంట్లో పెద్దవాళ్లనో, బ్యాంకు మేనేజర్లనో, చార్టర్డ్ అకౌంటెంట్లనో సంప్రదించడం తగ్గుతోంది. ఎక్కువగా ఫిన్ఫ్లుయెన్సర్ల వైపు మళ్లే ధోరణి పెరుగుతోంది. పాత తరం వాళ్లు ఆర్థిక సలహాల కోసం తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బ్యాంకు మేనేజర్లు, ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు, న్యూస్ పేపర్లు.. ప్రింట్ మీడియా, ఫిక్స్డ్ డిపాజిట్లవైపు చూసేవారు. కానీ జెన్ జడ్ మాత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇంటిగ్రేటెడ్ ఫిన్‌టెక్ యాప్‌లు, యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లు, ఆన్లైన్ కమ్యూనిటీలు (రెడిట్, డిస్కార్డ్), ఆధునిక డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాంల వైపు చూస్తున్నారు. అన్ని చోట్లా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల చిన్న వయస్సు నుంచే ఆర్థిక అక్షరాస్యత మెరుగ్గా ఉంటున్నప్పటికీ, తప్పుడు సమాచారం కూడా భారీగానే వ్యాప్తి చెందుతోంది. వీటివల్ల దెబ్బతింటున్నవాళ్లూ పెరుగుతున్నారు. దీంతో అడ్డూ అదుపూ లేకుండా ఫిన్ఫ్లుయెన్సర్లు విస్తరిస్తుండటంపై ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థలు నిశితంగా దృష్టి పెడుతున్నాయి. తప్పుల తడకల ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ సలహాలను కట్టడి చేయడంపై కసరత్తు చేస్తున్నాయి.ముందు నుంచే పెట్టుబడులు.. డిజిటల్ వల్ల కలిగిన ప్రయోజనమేంటంటే... తమ పేరెంట్స్‌తో పోలిస్తే జెన్ జెడ్ చాలా ముందు నుంచే పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు. దాదాపుగా అవరోధాలేమీ లేకపోవడంతో నెలకు రూ.100 నుంచి 500 వరకు ఉండే మైక్రో సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరి పోర్ట్‌ఫోలియో చాలా వైవిధ్యంగా ఉంటోంది. మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, డైరెక్ట్ ఈక్విటీలు, డిజిటల్ గోల్డ్, సావరీన్ గోల్డ్ బాండ్లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్) వంటివి ఈ పోర్ట్‌ఫోలియోలో ఉంటునాయి. ఇలా సాధ్యమైనంత ముందు నుంచే ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ జనరేషన్ వాళ్లు... వెల్త్ మేనేజర్లకు బంగారు గనుల్లా మారుతున్నారు. ఓ ఇన్వెస్టరును 22 ఏళ్ల వయసులో పట్టుకుంటే ఆ తర్వాత బోలెడన్ని సంవత్సరాల పాటు వారు క్లయింట్లుగా కొనసాగే అవకాశం ఉండటమే దీనిక్కారణం. అయితే, ఆర్థిక సంస్థలు ఇందుకోసం తమ మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటోంది. జెన్ జెడ్ డిస్కౌంట్లు.. లాయల్టీ పాయింట్ల కన్నా ఎక్కువగా చార్జీల విషయంలో పారదర్శకత, నైతికతతో కూడుకున్న వ్యాపార విధానాలు, డేటా ప్రైవసీకి ప్రాధాన్యమిస్తున్నారు. హెచ్చరిక సంకేతాలు.. జెన్ జెడ్‌కి డిజిటల్ ఐక్యూ ఎక్కువే అయినా... కొన్ని విశిష్టమైన సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటోందని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన లైఫ్‌స్టయిల్ ఖర్చులు: వేగంగా ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ, వాటికి తగ్గట్లు లైఫ్‌స్టయిల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ పోవడం వల్ల ఖర్చులు మితిమీరిపోతున్నాయి. ఫలితంగా, ఆదాయాలను దీర్ఘకాలిక పొదుపు వైపు మళ్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. సబ్స్క్రిప్షన్లతో చిల్లు: నెలవారీగా కట్టే డజన్ల కొద్దీ డిజిటల్ సబ్్రస్కిప్షన్ల వల్ల చిన్న, చిన్నగా పర్సుకు చిల్లులు పడుతున్నాయి. సోషల్ మీడియా ఒత్తిడి: ప్రతిదాన్నీ డిజిటల్‌గా పోల్చి చూసుకునే సంస్కృతి వల్ల ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్), (ఇప్పుడు దొరకపుచ్చుకోకపోతే ఇంకెప్పటికీ దొరకదేమో అన్న భయం) వల్ల ఖరీదైన ఎక్స్‌పీరియన్స్‌లు, లగ్జరీ ఉత్పత్తులను కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఎమర్జెన్సీ నిధుల కొరత: అప్పటికప్పుడు సంతృప్తి కలిగించే ఎక్స్‌పీరియన్స్‌లకు ప్రాధాన్యం ఇస్తూ, ఆర్థిక భద్రతను పక్కన పెడుతుండటం వల్ల, ఆదాయంపరంగా అనూహ్యమైన షాక్లేవైనా తగిలితే తట్టుకునే పరిస్థితి ఉండటం లేదు. గెలుపు గుర్రాలు.. జెన్ జెడ్ తెచ్చిన ఆర్థిక విప్లవమనేది దేశీ మార్కెట్ వ్యవస్థలో కొత్త మార్పులకు ఆజ్యం పోసింది. ఈ భారీ డెమొగ్రఫిక్ మార్పులతో ప్రభావితమయ్యే సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు ప్రయోజనం పొందవచ్చు. అవేమిటంటే ... → ఫిన్‌టెక్, వెల్త్ టెక్ ప్లాట్‌ఫామ్స్: డిజిటల్ చెల్లింపులు, ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్, మైక్రో రుణాలిచ్చే కంపెనీలు → ప్రైవేట్ బ్యాంకులు: పటిష్టమైన, అధునాతన డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలు అందించేవి. → ఫైనాన్షియల్ సూపర్ యాప్స్: పేమెంట్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్, బీమాను ఒకే ఇంటర్ఫేస్లో అందించేవి. → అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు: భారీ స్థాయిలో సిప్ రూపంలో రిటైల్ పెట్టుబడులను అందుకుంటున్న మ్యూచువల్ ఫండ్ సంస్థలు. ఇలా, డిజిటల్‌గా ఆర్థిక సేవలను అందించే, తద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోగలిగే ఆర్థిక సంస్థలే భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లగలవు. – సాక్షి, వెల్త్ -
కామ్రేడ్.. జెన్ జెడ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాక్రోచ్ జనతా పార్టీ పేరు తో పెల్లుబుకుతున్న అసంతృప్తి, నిరసన కార్యక్రమాలు ఇటు మావోయిస్టులు, అటు నిఘా వర్గాలను ఆలోచనలో పడేశాయి. దీంతో ఎవరికి వారుగా తమ కార్యాచరణను అమలు చేసేందు కు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే జెన్‌జెడ్‌లను కలుపుకొని పోవాలనే ఆలోచనలో మాజీ మావోలు ఉన్నట్టు తెలుస్తోంది.రాజ్యాంగ పరిధిలోతిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అజ్ఞాతం వీడిన తర్వాత పలు ఇంటర్వ్యూల్లో ‘మా పార్టీపై నిషేధం, మాపై కేసులు ఎత్తివేస్తే రాజ్యాంగ పరిధిలో ప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు తోటి కామ్రేడ్లకు పిలుపునిస్తా’అని ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన అగ్ర నేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు సైతం కొంచెం అటూఇటుగా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పట్లో మావో యిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసే అవకాశం కనిపించడం లేదు.కార్యాచరణ ఎలా?ఓ వైపు ఆపరేషన్ కగార్ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలోనే శ్రీలంక, నేపాల్‌లో జెన్‌జెడ్ ఆధ్వర్యాన తిరుగుబాటు ఉద్యమాలు జరిగాయి. ఇక్కడ యువతలో సైతం నేపాల్, శ్రీలంక తరహాలో అసంతృప్తి ఉందనేది మాజీల అంచనా. అయితే దేశవ్యాప్తంగా 1995 నుంచి 2005 వరకు అమలైన తీవ్ర నిర్బ«ంధం కారణంగా సాయుధ విప్లవ పోరాటం ప్రధానంగా అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడేలకే పరిమితమైంది, ఫలితంగా 2000కి అటూఇటుగా జన్మించిన జెన్‌జెడ్ తరంతో సాయుధ విప్లవ పార్టీలకు పెద్దగా సంబంధాలు లేవు. అయితే ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్‌తో మావోయిస్టు అగ్ర నాయకత్వం అడవులను వదిలింది. అయితే, ఏ తరహా పోరాటం చేయాలి.. ఎవరి కేంద్రంగా పోరాటాలు చేయాలనే కచ్చితమైన కార్యాచరణకు మాజీ మావోయిస్టులు రాలేకపోతున్నారు. వామపక్ష పార్టీలు మాజీ మావోలను తమ పార్టీలోకి రావాలంటూ రెడ్ కార్పెట్ పరిచాయి. అయితే వారితో కలిసి పనిచేయడం సబబా, కాదా అన్న మీమాంస లొంగిపోయిన మావోయిస్టు నేతల్లో ఉన్నట్టు సమాచారం.యువత కేంద్రంగానే బెస్ట్..సోషల్ మీడియా వేదికగా వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ సృష్టిస్తోన్న ప్రభంజనం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది.దీంతో కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్ కామ్రేడ్లతో కలిసి నడవడం కంటే, ఉవ్వెత్తున ఎగిసిపడే శక్తి సామర్థ్యాలు, తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత కేంద్రంగానే తమ దీర్ఘకాలిక రాజకీయ కార్యాచరణ మేలనేది ఎక్కువ మంది మాజీల అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో నిన్నామొన్నటి వరకు యాంటీ మావోయిస్టు ఆపరేషన్లలో కీలకంగా అడవులకు దగ్గరగా పనిచేసిన ఖాకీలు ఇప్పుడు జెన్జెడ్ల అడ్డా అయిన సోషల్ మీడియాలోకి ఎంటరవుతున్నారు. మారు గుర్తింపులతో ఖాతాలు తెరుస్తున్నారు. గడిచిన రెండు వారాలుగా అన్ని జిల్లాల్లో ఈ తరహా ధోరణి కనిపిస్తోంది. జెన్‌జెడ్ అడుగులు ఎటువైపు అనేది అన్ని వర్గాలకు గమనించతగ్గ అంశంగా మారిపోయింది. -
కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? జెన్ Z ఇలా ఉందేంటి?
బొద్దింక అంటే ఏంటి? ఒక పురుగా, ఒక కీటకమా, లేక అసంతృప్తితో ఉన్న భారతీయ యువకుడిని అలా పిలుస్తున్నారా? కొత్తగా రూపుదిద్దుకుంటున్న "కాక్రోచ్ జనతా పార్టీ"ని ఇష్టపడుతున్న వారిని అడిగితే ‘‘పైవి అన్నీ’’ అనే సమాధానం వస్తుంది. ఇప్పటివరకు ఇది వ్యంగ్యంగా పుట్టిన ఒక ఆసక్తికర గ్రూప్ మాత్రమే. ఇదొక క్వాసీ రాజకీయ పార్టీ. అంటే పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాకపోయినా, రాజకీయ లక్ష్యాలు ఉన్న పార్టీ లేదా రాజకీయాలపై ప్రభావం చూపే గ్రూపు.కానీ భారత ప్రజాస్వామ్య ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తిగా ఉన్న దేశ యువతకు తామే ప్రతినిధులమని ఇది చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని మిలియన్ల మంది అలా భావిస్తున్నారు. అయితే, ఇది క్షణికావేశం, కొన్ని రోజుల్లో నిరుగారిపోయే ఉత్సాహమేనా?కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆన్లైన్ జోక్‌గా మొదలైంది. నిరుద్యోగ యువతపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఇది పుట్టుకొచ్చింది. ఆ మీమ్ వేగంగా వ్యాపించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మిలియన్ల మంది దాని సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించడం మొదలుపెట్టారు. చాలా మంది వ్యాఖ్యాతలు వెంటనే దీన్ని బీజేపీ వ్యతిరేక ఉద్యమంగా అభివర్ణించారు. కానీ అది కథలో సగం మాత్రమే.పెద్ద సందేశం ఏమిటంటే, ఎన్నికల్లో యువత భాగస్వామ్యం భారీ స్థాయిలో ఉందని గణాంకాలు చూపుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలకు అదే బలమైన కొలమానం. అనేక దేశాల్లో జెన్ జీ ఓటర్లు రాజకీయాలను చాలా భిన్న దృష్టితో చూస్తున్నారు. భారతదేశంలో వారిలో చాలా మంది బీజేపీ పాలన కాలంలోనే (2014 నుంచి ఇప్పటివరకు) పెరిగారు. ఉద్యోగాలు, జీవన వ్యయం, గృహాలు, రవాణా, స్వచ్ఛమైన గాలి, మెరుగైన ప్రజా సేవలు. ప్రస్తుత రాజకీయ వర్గం ఈ ప్రాథమిక అవసరాలను అందిస్తోందా? అని చాలా మంది భావిస్తున్నారు. ఆ అసంతృప్తి కొత్త గొంతుకలకు, కొత్త మార్పులకు అవకాశం కల్పిస్తోంది.అయితే, సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రజాదరణ ఎన్నికల వేళ ఉండే ప్రజాదరణతో సమానం కాదు. మిలియన్ మంది ఫాలో అయ్యే వారు ఉన్నారంటే, అదే మిలియన్ మంది ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. వాస్తవానికి మిలియన్ మంది అనుసరించే ఒక ఇన్ఫ్లూయెన్సర్ నిజమైన ఎన్నికల్లో కొన్ని వందల ఓట్లు కూడా పొందడంలో ఇబ్బంది పడవచ్చు. ఆన్లైన్లో ఎవరినైనా అనుసరించడానికి ఒక ట్యాప్ చాలు. కానీ ఓటు వేయడానికి నిబద్ధత, వ్యవస్థీకరణ, విశ్వాసం, ఓటర్ల హాజరు అవసరం.కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నటికీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా కనుమరుగైపోవచ్చు. కానీ దాన్ని తక్కువ అంచనా వేయడం కూడా పొరపాటే. ఎందుకంటే ఉద్యమాలు తరచుగా హాస్యం, అసంతృప్తితోనే మొదలవుతాయి.అప్పట్లో భారత్ అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం ప్రజల ఆగ్రహానికి వ్యక్తీకరణగా మొదలైంది. నెట్‌వర్క్‌లు, చర్చలు, పౌరుల భాగస్వామ్యంతో అది వేగం అందుకుంది. మిలియన్ల మంది ఒక జోక్ (సీజేపీ వంటి) వెనుక నిలబడినప్పుడు, ఆ జోక్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దాన్ని ఏ రాజకీయ వర్గమైనా వినడం మంచిది. -
దూసుకుపోతున్న అన్నామలై కొత్త ఉద్యమం.. అంతా జెన్ Z మాయ
బీజేపీ నుంచి అన్నామలై బయటకు వచ్చేసిన తర్వాత చెన్నై ఈసీఆర్‌లోని ఆయన నివాసం సందడిగా కనపడుతోంది. ఆయన మద్దతుదారులు హడావుడిగా ఫోన్ కాల్స్ చేస్తుండడం, సీరియస్‌గా చర్చల్లో పాల్గొనడం కనిపిస్తున్నాయి. అన్నామలై బీజేపీతో బంధం తెంచుకోవడం చాలా తక్కువ కాలంలో, పెద్ద హడావుడి లేకుండానే ముగిసింది. న్యూఢిల్లీ పర్యటన, పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చల అనంతరం అన్నామలై తన రాజీనామాను ప్రకటించారు.ప్రస్తుతం అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమంలో ఇప్పటివరకు 14 లక్షలకు పైగా సభ్యత్వ నమోదులు జరిగాయి. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. జెన్ జీను ఆకర్షించే ప్రయత్నం వెబ్సైట్ (wetheleader.org) ప్రారంభంతో మొదలైంది. ఆ వెబ్సైట్లో పేరును నమోదు చేసుకుని అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమానికి మద్దతు లేదా దానిపట్ల ఆసక్తిని తెలియజేయవచ్చు.జెన్ జీ యువతలో అన్నామలైకు మద్దతు వేగంగా పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికలపై ఆయన సందేశాలకు భారీ స్పందన లభిస్తోంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త తరహా రాజకీయాలను యువత స్వాగతిస్తోంది. "వి ది లీడర్స్" ఉద్యమంలో వారు స్వచ్ఛందంగా చేరుతుండడమే దీనికి నిదర్శనం.డిజిటల్ వేదిక ద్వారా చేసిన ప్రసంగంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలను వేధిస్తున్న ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండటంతోనే బీజేపీ నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు. “ప్రజలు తరచూ నన్ను అడుగుతుంటారు. మీరు తమిళ వ్యక్తా? లేక భారతీయుడా? అని. నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను. నేను గర్వించే భారతీయుడిని. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాల్లో పెరిగాను” అని చెప్పారు.వైఖరిని చెప్పేసిన ప్రసంగం ఆ వీడియో సందేశం, ఆయనతో జరిగిన సంభాషణల ఆధారంగా చూస్తే.. ప్రాంతీయతను పక్కన పెట్టినా స్థానిక ప్రయోజనాలను వదలకుండా, సమైక్య రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే, అధికారంలో ఉన్నవారిని జవాబుదారులుగా నిలబెట్టే కొత్త రాజకీయ వేదికను అన్నామలై నిర్మించబోతున్నట్లు కనిపిస్తోంది.మరోవైపు, “ఈ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు మాకు 3 నెలలు పట్టింది. వి ది లీడర్స్” అని అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన ఓ వ్యక్తి చెప్పారు. ఈ టీమ్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు లేరు. “అన్నామలై ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉన్నారు. వారిలో కొందరు ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రులు, కొందరు ఐఐఎం లక్నోకు చెందినవారు, మరికొందరు సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చినవారు” అని ఆ వ్యక్తి తెలిపారు.అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. యువతను చేరుకోవాలనే ఉద్దేశంతో అన్నామలై ఇప్పుడు సాంప్రదాయ మాధ్యమాలను పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇదే విధానం టీవీకేకు మంచి ఫలితాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే పత్రికా సమావేశానికి బదులుగా, ఈ సారి తన ప్రణాళికను నేరుగా ప్రజలకు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా తెలియజేయాలని ఆయన నిర్ణయించారు.జాతీయవాదం+తమిళ గుర్తింపు అన్నామలై టీమ్‌లో ఉన్నవారు మాట్లాడుతూ.. “మా నాయకుడి సిద్ధాంతం జాతీయవాదం-తమిళ గుర్తింపు/తత్వం కలయికగా ఉంటుంది. అవసరమైతే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానైనా ప్రజా సమస్యలను లేవనెత్తుతాం” అన్నారు. మూడు భాషల విధాన అమలుకు వ్యతిరేకంగా అన్నామలై చేసిన ట్వీట్ దీనికి ఉదాహరణ.విజయ్‌కు పోటీగా నిలిచే, ప్రజలను ఆకర్షించే నాయకుడి స్థానం ఖాళీగా ఉందని అన్నామలై భావిస్తున్నారు. ఆ ఖాళీని తాను భర్తీ చేయగలనని అన్నామలై నమ్ముతున్నారు.2031 తమిళనాడు ఎన్నికలు లక్ష్యం రానున్న కొన్ని నెలల్లో ప్రజలతో, ముఖ్యంగా యువతతో మరింతగా మమేకమవడం, “వి ది లీడర్స్” అనే వెబ్సైట్లో లక్షలాది సభ్యులను చేర్చుకోవడం, 2031 తమిళనాడు ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకోవడం అన్నామలై ప్రణాళికగా సోర్సెస్ తెలిపాయి.తన కొత్త రాజకీయ ప్రయాణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వర్గాలు సూచిస్తున్నాయి. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కూడా ఇలాంటి ఉద్యమాన్ని ప్రకటించారు.తమిళనాడు స్పష్టంగా కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. కొత్త వ్యక్తులు రాజకీయ చర్చలను ప్రభావితం చేస్తున్నారు. ఒకవైపు సి జోసెఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. అధికారిక రాజకీయ ప్రవేశం చేసిన 28 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అసాధ్యాన్ని సాధించారు.మరోవైపు ద్రావిడ పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రతీదానికి అంతర్గత సవాళ్లు ఉన్నా, గత 6 దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజా మద్దతుపై అవి ఆధారపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల యుగంలోకి మనం మరింతగా ముందుకు వెళ్తున్నాం. అక్కడ క్యాన్సల్ కల్చర్ (ప్రజా వ్యతిరేకత కారణంగా వ్యక్తులు లేదా సంస్థలను సామాజికంగా తిరస్కరించే ధోరణి), ఎవరినీ విడిచిపెట్టకుండా చేసే విమర్శలు చురుకుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన గౌరవాన్ని సంపాదించి, దాన్ని నిలబెట్టుకోగలరా? దానికి సమాధానం కాలమే చెబుతుంది. -
ఒక్క కాఫీ.. చిన్న పేస్ట్రీ.. పెద్ద ఉపశమనం!
నేటి ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, ఆర్థిక అనిశ్చితి కారణంగా యువత తీవ్ర అలసటకు గురవుతోంది. ఈ క్రమంలోనే ‘లిటిల్ ట్రీట్ కల్చర్’ అనే సరికొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క కాఫీ లేదా చిన్న పేస్ట్రీని ఆస్వాదించడం, ‘క్యూట్ స్టేషనరీ’ కొనుగోలు చేయడం ద్వారా తాత్కాలికంగా మానసిక ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. అసలు ఈ ట్రెండ్ వెనుక ఉన్న వాస్తవం ఏమిటి? ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమేనా లేక మానసిక ఆరోగ్యానికి సంకేతమా?ఏంటీ ‘లిటిల్ ట్రీట్ కల్చర్’?'లిటిల్ ట్రీట్ కల్చర్' అంటే పెద్ద పెద్ద ఖర్చులు కాదు. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా మూడ్ బాలేనప్పుడు తమకు తాముగా ఇచ్చుకునే చిన్న చిన్న బహుమతులు. ఒక కప్పు కాఫీ, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఐస్ క్రీమ్, లేదా ఆన్లైన్లో ఒక చిన్న కీచైన్ కొనడం మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి. ఇది కేవలం వస్తువును కొనడం కాదు, కష్ట సమయంలో తనను తాను ఓదార్చుకునే ఒక భావోద్వేగ ప్రక్రియ.పాండమిక్ తర్వాత ఊపందుకున్న అలవాటుకోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచంలో అనిశ్చితి పెరిగింది. పెద్ద పెద్ద లక్ష్యాల కోసం వేచి చూడటం కంటే, రోజువారీ జీవితంలోనే చిన్న చిన్న సంతోషాలను వెతుక్కోవడం సులభమని యువత భావిస్తోంది. భారీ షాపింగ్‌లు లేదా ఖరీదైన హాలిడే ట్రిప్పుల కంటే, కేవలం రూ. రూ. 100లోపు ఖర్చుతో లభించే కాఫీ లేదా స్వీట్, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని నమ్ముతున్నారు.సోషల్ మీడియాలో ‘మెయిన్ క్యారెక్టర్’ మూమెంట్స్ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఈ ట్రెండ్‌ను మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చాయి. తాము కొన్న చిన్న వస్తువులను, తమ రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను ‘మెయిన్ క్యారెక్టర్ మూమెంట్స్’గా సోషల్ మీడియాలో ప్రదర్శించడం ఫ్యాషన్‌గా మారింది. ‘ఈరోజు చాలా కష్టపడ్డాను, కాబట్టి నాకో చిన్న ట్రీట్’ అనే వ్యాఖ్యలు ఇప్పుడు యువతకు అత్యంత ఆనందకర అనుభూతినిస్తున్నాయి.మెదడుపై చిన్న ట్రీట్ల ప్రభావంనిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్న చిన్న సంతోషకరమైన పనులు మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, తాత్కాలికంగా ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పని ఒత్తిడి, ఆర్థిక భారం, సామాజిక ఒత్తిడి ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న రివార్డులు ఒక రకమైన ‘ఎమోషనల్ రీసెట్’గా పనిచేస్తాయి. ఇక్కడ వస్తువు కంటే, ఆ వస్తువును కొనేటప్పుడు కలిగే ఆత్మసంతృప్తి ముఖ్యమైనది.మైక్రో-లగ్జరీల మార్కెటింగ్ మాయాజాలంఈ ట్రెండ్‌ను బ్రాండ్లు కూడా చక్కగా వాడుకుంటున్నాయి. చిన్న సైజు పర్ఫ్యూమ్లు, ట్రావెల్-సైజ్ స్కిన్‌కేర్ ఉత్పత్తులు, క్యూట్ డెకర్ వస్తువులను ‘మైక్రో-లగ్జరీ’లుగా ప్రచారం చేస్తున్నాయి. తక్కువ ధరలో దొరికే ఈ విలాసాలు ఆర్థికంగా భారం కాకపోవడం వల్ల, యువత వీటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇదే ఇప్పుడు ఒక భారీ వ్యాపార మార్గంగా మారింది.ఇది మంచిదా? లేక అనారోగ్యకరమా?చిన్న చిన్న ఆనందాలు తప్పు కాదు. కానీ అది వ్యసనంగా మారకూడదు. ప్రతి చిన్న కష్టానికి షాపింగ్‌పైనే ఆధారపడటం ఆర్థికంగా చిక్కుల్లో పడేయవచ్చు. అప్పుడప్పుడు తీసుకునే ‘ట్రీట్’ ఒక రకమైన ఊరటనిస్తే, అదే పనిగా ఖర్చు చేయడం అనేది ‘ఎమోషనల్ స్పెంటింగ్’ అనే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అందుకే సంతోషం అనేదానిని కొనుగోలుతోనే తెచ్చుకోకుండా, ఇతర ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా కూడా సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: హార్ముజ్‌ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’ -
‘జెన్ జెడ్’ మంత్రం.. ‘హార్ట్ఫుల్నెస్’ ధ్యానం
నిరంతరం నోటిఫికేషన్ల మోత, ల్యాప్‌టాప్ స్క్రీన్ల ముందు గడపడం, డెడ్లైన్ల భయం... వెరసి నేటి కార్పొరేట్ ప్రపంచంలో ‘బర్న్అవుట్’ (తీవ్ర అలసట) అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతను కోల్పోతున్న ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు, ముఖ్యంగా నేటితరం ‘జెన్ జెడ్’ యువత ఒత్తిడిని జయించడానికి ఒక సరికొత్త అస్త్రాన్ని ఎంచుకున్నారు. అదే ‘హార్ట్ఫుల్నెస్ ధ్యానం’హార్ట్‌పుల్‌నెస్ మెడిటేషన్ అంటే..హార్ట్‌పుల్‌నెస్ మెడిటేషన్ అనేది రాజా యోగా పద్ధతిపై ఆధారపడిన ఒక ఆధునిక, సరళమైన ధ్యాన ప్రక్రియ. ఈ పద్ధతిలో ధ్యానం చేసేటప్పుడు కేవలం హృదయం పైనే దృష్టి కేంద్రీకరిస్తారు. హృదయంలో ఒక దైవిక కాంతి ఉందనే భావనతో (ఉద్దేశ్యంతో) కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడమే దీని ప్రాథమిక విధానం. ఈ ధ్యానంతో మనస్సులోని చంచలత్వం తగ్గి, ఒత్తిడి దూరమవుతుంది. ఇది ఎటువంటి మంత్రాలు లేదా కఠినమైన నియమాలు లేని, హృదయపూర్వక అంతర్గత ప్రశాంతతను, ఆత్మపరిశీలనను పెంపొందించే ఒక ఆచరణాత్మకమైన ధ్యాన మార్గంఆధునిక జీవనశైలి - అలసిపోతున్న మెదడుసోషల్ మీడియాలో నిరంతరం గడపడం (డూమ్స్క్రోలింగ్), ఒకేసారి పలు పనులు (మల్టీ టాస్కింగ్) చేయడం వల్ల మన నాడీ వ్యవస్థ ఎప్పుడూ తీవ్రమైన అలర్ట్ మోడ్‌లో ఉంటోంది. దీనివల్ల మనసుకి కావలసినంత విశ్రాంతి దొరకడం లేదు. ఈ రకమైన తీవ్ర మానసిక ఆందోళనలను, ఒత్తిడి కలిగించే ఆలోచనా సరళిని మొదటి దశలోనే గుర్తించి నియంత్రించడానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం అద్భుతంగా సహాయపడుతుందని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.‘జెన్ జెడ్’ మంత్రం.. ఒత్తిడిపై విజయంగతంలో ధ్యానం అంటే ఏదో కఠినమైన ప్రక్రియగా లేదా వయసు పైబడిన వారు చేసే సాధనగా భావించేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో నిమిషం తీరిక లేని యువ ఉద్యోగులు దీనిని ఒక అద్భుతమైన లైఫ్‌స్టైల్ ట్రెండ్‌గా మార్చేశారు. కేవలం మెదడును నియంత్రించడం కాకుండా, హృదయంపై ధ్యాస ఉంచి, మనసును అంతర్గత ప్రశాంతత వైపు మళ్లించడమే ఈ సరికొత్త ‘జెన్ జెడ్ మంత్రం’లోని ప్రత్యేకత.ధ్యానంతో భావోద్వేగాల నియంత్రణఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కుంగిపోకుండా, మనసును స్థిమితంగా ఉంచుకోవడానికి హృదయపూర్వక ధ్యాన పద్ధతి ఒక శక్తివంతమైన సాధనం. రోజుకు కేవలం కొన్ని నిమిషాల పాటు ఫోన్లకు దూరంగా, గుండె నిండా ప్రశాంతతను నింపుకునే ఈ ప్రక్రియ, శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లను అదుపు చేస్తుంది. ఫలితంగా పనిలో ఏకాగ్రత పెరగడమే కాకుండా, రాత్రి పూట నిద్ర నాణ్యత కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది.నిత్య జీవితంలో చిన్న చిన్న మార్పులుఈ బిజీ లైఫ్‌లో ఒత్తిడిని జయించడానికి నిపుణులు కొన్ని సాధారణ ఆచరణీయ పద్ధతులను సూచిస్తున్నారు. ఉదయం నిద్ర లేవగానే ఫోన్లకు దూరంగా ఉండటం, గైడెడ్ మెడిటేషన్ పాడ్కాస్ట్ల సహాయం తీసుకోవడం, మైండ్‌ఫుల్ వాకింగ్ చేయడం వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇవి కేవలం ఆఫీస్ ఉత్పాదకతను పెంచడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ నిజమైన సంతోషాన్ని ఇస్తాయి.కార్పొరేట్ రంగంలో వెల్నెస్ సంస్కృతిఇప్పుడు కార్యాలయాల్లో కూడా ఈ సరికొత్త మెడిటేషన్ సంస్కృతికి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగుల మానసిక శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా వెల్నెస్ బ్రేక్‌లను, ధ్యాన సెషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. నిరంతరం ఆన్లైన్లో ఉండే ప్రపంచంలో భావోద్వేగ భారాన్ని తగ్గించుకుని, పని-జీవిత సమతుల్యతను సాధించడానికి జెన్ జెడ్ యువతకు ఈ ‘హార్ట్ఫుల్నెస్’ ఒక సంజీవనిలా మారిందని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: ‘బిహార్’ దెబ్బ: బంగ్లా వీడి ఆశ్రమానికి ప్రశాంత్ కిశోర్ -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party - CJP) గురించే చర్చ నడుస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే వేగంగా దూసుకుపోతున్న ఈ సరికొత్త వ్యంగ్య (Satirical) ఉద్యమం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వైరల్ ట్రెండ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు తెలుసా?భారతదేశ యువతను అనూహ్యంగా ఆకట్టుకున్న సీజేపీ వెనుక ఉన్న ఆ సంచలనం పేరు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke). ఉద్యోగాలు లేక, సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియా, ఆర్టీఐ (RTI) యాక్టివిస్టులుగా మారి వ్యవస్థపై దాడి చేసే కొంతమంది నిరుద్యోగ యువతను "బొద్దింకలు" (Cockroaches), "సమాజానికి పట్టిన పరాన్నజీవులు" (Parasites) అన్న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఆన్లైన్లో ప్రతిస్పందనగా 30 ఏళ్ల ఈ రాజకీయ ప్రచార వ్యూహకర్త, అభిజీత్ ప్రారంభించిందే కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ఇప్పుడు సునామీలా మారింది. ఆపై సీజేఐ వివరణ ఇచ్చుకున్నప్పటికీ .. ‘బొద్దింక’ అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు అభిజీత్.యువతను అవమానించిన ఆ పదంతోనే సరికొత్త వ్యంగ్య రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. ఫలితంగా సీజేపీ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ వెబ్ సైట్ అండ్ అజెండా తమను తాను "సోమరులు, నిరుద్యోగ యువత పక్షపాతి" (Voice of the lazy and unemployed youth) గా ప్రకటించుకుంది. 'Secular, Socialist, Democratic, and Lazy' అనే ట్యాగ్‌లైన్‌తో నడుస్తున్న ఈ డిజిటల్ పార్టీకి కేవలం ఐదు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల (1.2 కోట్లు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు వచ్చారు. ఇది దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. దీని ఆవిర్భావం కేవలం జోక్ కాదు.. యువత ఆక్రోశం! ఇంటర్నెట్ జోక్ లాగా మొదలైనప్పటికీ, దేశంలోని నిరుద్యోగం, నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలపై యువతలో ఉన్న అసంతృప్తిని ఈ వేదిక ప్రతిబింబిస్తోంది.పార్టీలో చేరడానికి వింత నియమాలు:కచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి (బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా). విపరీతమైన సోమరితనం ఉండాలి (శారీరక శ్రమ పరంగా మాత్రమే). రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లోనే గడపాలి (Chronically Online). ప్రొఫెషనల్‌గా, లాజికల్‌గా వ్యవస్థపై విమర్శలు (Rant) గుప్పించగలిగే నైపుణ్యం ఉండాలి. ఇంతకీ ఎవరీ అభిజీత్ దిప్కే?పూణేలో జర్నలిజం చదివిన అభిజీత్, ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ (PR) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నిరుద్యోగి.Now attempts being made to hack Instagram pic.twitter.com/doFskK9D7Z— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఆమ్ ఆద్మీ నేపథ్యం సీజేపీని ప్రారంభించడానికి ముందు, దీప్కే 2020 - 2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించినప్పుడు, దీప్కే రాజకీయ సందేశాలు మరియు యువతను చేరుకోవడంపై దృష్టి సారించిన మీమ్-ఆధారిత డిజిటల్ ప్రచారంపై పనిచేశారు.2024లో తన వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం కోసం ఆప్ నుండి బయటకు వచ్చి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మేనిఫెస్టోకేవలం మీమ్స్ కే పరిమితం కాకుండా 5 అంశాలతో కూడిన ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. జడ్జీలకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు వంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించకూడదు.పార్టీ ఫిరాయింపులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.తాము కూడా ఆర్టీఐ (RTI) పరిధిలోకి వస్తామని, ఎలాంటి అజ్ఞాత విరాళాలు (Electoral Bonds) తీసుకోబోమని స్పష్టం చేయడం. మహువా మోయిత్రా, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖులు సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. సంప్రదాయ రాజకీయాల్లో డబ్బు, అంగబలం ఉన్నవారే రాజ్యమేలుతున్న తరుణంలో.. ఈ జెన్ జెడ్ (Gen Z) యువత కేవలం మీమ్స్, రీల్స్ ద్వారా డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తూ దేశంలోనే సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. As expected Cockroach Janta Party’s account has been withheld in India. pic.twitter.com/44ymllnSMJ— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఇంతలోనే భారీ షాక్మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. ఊహించినట్టే, ' కాక్రోచ్ జనతా పార్టీని ఇండియాలో నిలిపివేశారని పేర్కొన్నారు. -
నాడు మనసులు కలిస్తే.. నేడు డేటా సరిపోలితే..
నేటి ఆధునిక ప్రపంచంలో ఇప్పుడున్న యువతరం(‘జెన్ జీ’) ప్రేమ, అనుబంధాల విషయంలో తమ ఆలోచనా విధానాన్ని విభిన్నంగా మార్చుకుంటోంది. ఒకప్పుడు కేవలం మనసులు కలవడం, పరస్పర ఆకర్షణ ఆధారంగా ప్రేమ చిగురించేది. కానీ నేటి యువత మాత్రం ప్రేమలో పడటానికి ముందే గూగుల్, రెడిట్, జ్యోతిష్యం, అటాచ్మెంట్ థియరీలతో పాటు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)టూల్స్‌ను ఉపయోగించి, తగిన భాగస్వామి ఎవరనేది ముందే అంచనా వేస్తోంది. దీనినే ప్రస్తుతం ‘ప్రిడిక్టివ్ డేటింగ్’ అని పిలుస్తున్నారు.పరిశోధనగా మారిన ఆధునిక ప్రేమాయణండేటింగ్ అనేది ఎప్పుడూ ఒక అనిశ్చితితో కూడుకున్న విషయమే. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ అనిశ్చితిని తగ్గించుకునేందుకు యువత సాంకేతికతను ఆశ్రయిస్తోంది. కేవలం ఒకరినొకరు ఇష్టపడటమే కాకుండా, రెండవ డేటింగ్‌కు వెళ్లే ముందే గూగుల్‌లో వ్యక్తిత్వ లక్షణాలను శోధించడం, రెడిట్ థ్రెడ్లను పరిశీలించడం, సోషల్ మీడియాలో ‘రిలేషన్షిప్ సైకాలజీ’ రీల్స్ చూడటం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో, డేటింగ్ సంస్కృతి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, భావోద్వేగాల పరంగా సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో యువత ఇంటర్నెట్ సమాచారమే పరమావధిగా భావిస్తోంది.సమయం వృథా కాకూడదనే..ఈ సరికొత్త ట్రెండ్‌కు ప్రధాన కారణం నేటి తరం ఆలోచనల్లోని భావోద్వేగ జాగ్రత్తలే. ఫాస్ట్ మూవింగ్ డేటింగ్ యాప్స్, ఘోస్టింగ్ సంస్కృతి, ‘సిట్యుయేషన్షిప్స్’, మానసిక అలసట వంటి వాతావరణంలో పెరుగుతున్న యువత తమకు సరిపడని వ్యక్తి కోసం తమ సమయాన్ని వృథా చేయకూడదని బలంగా నిశ్చయించుకుంటున్నారు. ‘మనం మానసికంగా ఒకరికొకరు సరిపోతామా?’, ‘భవిష్యత్తులో ఈ బంధం నిలబడుతుందా?’ అనే ప్రశ్నలను సంబంధం ప్రారంభం కాకముందే విశ్లేషిస్తున్నారు. సమస్యలు వచ్చిన తర్వాత బాధపడటం కంటే, ముందే ఊహించి తప్పుకోవడం మంచిదనే ధోరణి పెరుగుతోంది.డేటింగ్లో చేరుతున్న సైకాలజీ పదాలుసోషల్ మీడియా ప్రభావం వల్ల సైకాలజీ (మానసిక శాస్త్రం)కి సంబంధించిన పదాలు నేడు సాధారణ సంభాషణల్లో భాగమైపోయాయి. ‘లవ్ బాంబింగ్’, ‘గ్యాస్‌లైటింగ్’, ‘ఎమోషనల్ అవైలబిలిటీ’, ‘యాంగ్జియస్ అటాచ్మెంట్’ వంటి కఠినమైన సాంకేతిక పదాలను యువత తమ రోజువారీ ప్రేమ విషయాల్లో ఉపయోగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ పాడ్కాస్ట్ల ద్వారా ఈ విషయాలు అందరికీ సులువుగా చేరుతున్నాయి. ఇది ఒక రకంగా హానికరమైన అలవాట్లను గుర్తించడానికి సహాయపడుతున్నప్పటికీ, బంధం సహజంగా బలపడక ముందే అవతలి వ్యక్తిని అతిగా విశ్లేషించే ప్రమాదానికి కూడా దారితీస్తోంది.జాతకాలు, అల్గారిథమ్‌ల ఆధారంగా..కేవలం సైకాలజీ మాత్రమే కాకుండా రాశిఫలాలు, జ్యోతిష్య అనుకూలత, పర్సనాలిటీ టెస్టులు (ఎంబీఐటీ), ఏఐ అందించే రిలేషన్షిప్ సలహాలను కూడా ఎక్కువగా నమ్ముతున్నారు. కొందరు యువతీ యువకులు బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే తమ జాతక చక్రాలను పరస్పరం పంచుకుంటున్నారు. డేటింగ్ యాప్స్ వల్ల మనుషులు కలవడం సులువైనా, నమ్మకాన్ని ఏర్పరచుకోవడం కష్టంగా మారిన నగరాల్లో ఈ ఆన్లైన్ క్విజ్లు, అల్గారిథమ్‌లు వారికి ఒక సులువైన భరోసాను ఇస్తున్నాయి.రిస్క్ తీసుకోడానికి ఇష్టపడని తరంగత తరాల వారితో పోలిస్తే, నేటి తరం సెలబ్రిటీల విడాకులు, సోషల్ మీడియాలోని రిలేషన్షిప్ వైఫల్యాలు, టాక్సిక్ బంధాల గురించిన చర్చలను నిరంతరం చూస్తూ పెరుగుతోంది. అందువల్ల వారు భావోద్వేగ పరంగా ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. బంధం ముదరక ముందే అవతలి వ్యక్తిలోని లోపాలను గుర్తించి జాగ్రత్త పడుతున్నారు. దీనివల్ల నేటి డేటింగ్ సంస్కృతి ఒకవైపు భావోద్వేగాలతోను, మరోవైపు వ్యూహాత్మక ఆలోచనలతోను ముడిపడి నడుస్తోంది.ప్రేమని ముందే ఊహించడం సాధ్యమేనా?ఇంటర్నెట్ చెక్‌లిస్ట్‌లు ఎంత సాయపడినప్పటికీ, సహజమైన మానవ సంబంధాలను, మనసుల కలయికను ఏ అల్గారిథమ్ పూర్తిగా అంచనా వేయలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షల్లో అన్ని అర్హతలు ఉన్న వ్యక్తితో కూడా నిజ జీవితంలో కెమిస్ట్రీ కుదరకపోవచ్చు. అతిగా విశ్లేషించడం వల్ల టెక్స్టింగ్ ప్యాటర్న్లపై అనవసరమైన ఆందోళన పెరగడం, చిన్న విషయాలకే బంధాన్ని తెంచుకోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మనసు గాయపడకూడదనే భయంతో, యువత సహజమైన ప్రేమానుభూతికి దూరమవుతున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’? -
జెన్ జెడ్ పారిశ్రామికవేత్తలు చాలా స్మార్ట్
యువ పారిశ్రామికవేత్తలు ఎంతో స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక్క విభాగానికి పరిమితం కాకుండా ఒకటికి మించిన ఆదాయ మార్గాలతో విజయాల మోత మోగిస్తున్నారు. దాదాపు 75 శాతం మంది జెన్ జెడ్ పారిశ్రామికవేత్తలు (1997–2012 మధ్య జన్మించిన వారు) ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉన్నట్టు లింక్డ్ఇన్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. పాత తరంతో పోలిస్తే నేటి యువత మరింత సరళతర పని నమూనాల వైపు అడుగులు వేస్తున్నారు. జెన్ జెడ్‌లో ప్రతీ నలుగురిలో ముగ్గురు (75 శాతం) తమకు ఒకటికి మించి ఆదాయ వనరులున్నట్టు చెప్పారు. జెన్ ఎక్స్ (1965–1980 కాలంలో జన్మించిన వారు)లో కేవలం 62 శాతం మందికి మాత్రమే ఒకటికి మించిన ఆదాయ వనరులు ఉన్నాయి. వృత్తిపై పూర్తి నియంత్రణ సాధించడంతో పాటు, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ తరం తమ కెరీర్‌ను మలుచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వ్యాపార ధోరణులకు భారత్ నిదర్శనంగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో భారత్‌లో తమ ప్రొఫైల్‌లో ‘వ్యవస్థాపకుడు’ అని జోడించుకున్న వారి సంఖ్య 104 శాతం పెరిగింది. ఏ ఇతర దేశంతో పోల్చినా భారత్‌లోనే ఇది అధికమని ఈ నివేదిక తెలిపింది. 500 మంది చిన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధిలోని వారిని ప్రశ్నించి లింక్డ్ఇన్ ఈ వివరాలు రూపొందించింది. వ్యయాలు, అనుభవం లేకపోవడం వంటి సంప్రదాయ అవరోధాలను ఏఐ, డిజిటల్ టూల్స్ తగ్గిస్తున్నాయి. దీని వల్ల వ్యాపారం ప్రారంభించడం కొత్త తరానికి సులభతరంగా మారింది. 85 శాతం మంది యువ వ్యవస్థాపకులు తమ వ్యాపార వృద్ధికి ఏఐ ఎంతో కీలకమని భావిస్తున్నారు. తమ నేపథ్యంతో సంబంధం లేకుండా పారిశ్రామికేవేత్తలుగా అవతరించే అవకాశాలు ప్రస్తుం ఉన్నట్టు 80 శాతం మంది చెప్పారు. గతంతో పోలి్చతే నేడు మరింత సులభతరం అయినట్టు 81 శాతం మంది తెలిపారు. భారత్‌లో జెన్‌జెడ్ విజయం అంటే కేవలం డబ్బు అనుకోవడం లేదు. 64 శాతం మంది స్వేచ్ఛ, సౌలభ్యం, 56 శాతం వ్యక్తిగత అభివృద్ధి, 55 శాతం మంది ఆర్థిక సంపదను నిజమైన విజయంగా భావిస్తున్నారు. వీటిని సాధించేందుకు రిస్క్ తీసుకునేందుకూ వెనుకాడడం లేదు. ఏఐతో అందరికీ అవకాశాలు..‘‘ఒకప్పుడు అసాధ్యం అనుకున్న వ్యాపార కలలను నేడు ఏఐ నిజం చేస్తోంది. ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా, రకరకాల ఆదాయ మార్గాలను సృష్టించుకునేందుకు, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది’’ అని లింక్డ్ఇన్ భారత మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన -
‘నువ్వు వద్దు.. నీ ఉద్యోగం వద్దూ’.. జెన్‌జీ యువతి
తాను పనిచేస్తున్న ఓ సంస్థలో తన బాస్ తనకి గౌరవం ఇవ్వడం లేదనే కారణంతో ఓ జెన్‌జీ ఉద్యోగానికి రిజైన్ చేసింది. ఉద్యోగానికి రాజీనామా చేయడం తప్పుగా అనిపించడం లేదు. నిజం చెప్పాలంటే తాను కోరుకున్న దాని కోసం రాజీపడని జెన్‌జీ నేను గర్వపడుతున్నాను’అని వ్యాఖ్యానించింది. ఓ జెన్‌జీ ఉద్యోగిని తన బాస్ సమావేశంలో అవమానకరంగా ప్రవర్తించడంతో తీవ్రంగా బాధపడింది. ఆ అవమానం తట్టుకోలేక ఆమె వెంటనే రాజీనామా చేసింది. రాజీనామా అనంతరం తన బాస్‌కి ఓ సందేశం పంపింది. తక్కువ జీతమా? భరించొచ్చు. కానీ అవమానిస్తే అస్సలు ఊరుకోను. గౌరవం లేని వాతావరణంలో పనిచేయడం అసాధ్యం’అని స్పష్టం చేసింది. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అందులో నేను 2 సంవత్సరాలు 7 నెలలు ఒక సంస్థలో విధులు నిర్వహించా. కష్టపడ్డా. తగినట్లు పేరు సంపాదించాను. అదనపు గంటలు పనిచేశారు. అదనపు గంటలకు వేతనం ఇవ్వమంటే మేనేజర్ అందరిముందు నాపై అరిచారు. ఇది సరైన పద్దతి కాదు. క్షమాపణ అడిగాను. క్షమాపణలు చెప్పలేదు. అవన్నీ జరగనప్పుడు నేను అదే సంస్థలో ఉద్యోగం ఎందుకు చేయాలి. అందుకే రాజీనామా చేశా. ‘నిజం చెప్పాలంటే, అలా చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను’ అని ఆమె చెప్పింది.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనేక మంది యువత ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. ‘ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం’ అని కామెంట్లు చేస్తున్నారు. జెన్‌జీ తరం ఉద్యోగంలో కేవలం జీతం కోసం కాకుండా, గౌరవం, సౌకర్యం, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by VYLA | Dhrupadi (@vyla.world) -
కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!
అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లో ఇప్పుడు చర్చంతా ‘జెన్ జీ’ గురించే. 1997 నుంచి 2012 మధ్య జన్మించి, ప్రస్తుతం కెరీర్ ప్రారంభించిన ఈ యువతరంపై కార్పొరేట్ ప్రపంచం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. పుట్టినప్పటి నుంచే టెక్నాలజీతో సాన్నిహిత్యం ఉన్న ఈ తరంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా వెలువడిన నివేదికలు విస్తుపోయే నిజాలను బయటపెడుతున్నాయి.మూణ్ణాళ్ల ముచ్చటేనా?ప్రముఖ విద్యా, కెరీర్ సలహా సంస్థ ‘ఇంటెలిజెంట్’ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 60 శాతం మంది యజమానులు తాము నియమించుకున్న జెన్ జీ ఉద్యోగులను కేవలం కొద్ది నెలల్లోనే తొలగించారు. దాదాపు 1,000 మంది హైరింగ్ మేనేజర్ల అభిప్రాయాలను సేకరించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి ప్రతి ఆరుగురు యజమానుల్లో ఒకరు వెనకాడుతున్నారు.పనితీరు బాగోలేని 79% మంది జెన్ జీ ఉద్యోగులకు శిక్షణ (పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్) ఇచ్చినప్పటికీ అందులో 60% మంది చివరకు ఉద్యోగాలు కోల్పోయారు.74% మంది మేనేజర్లు ఇతర తరాల వారితో పోలిస్తే జెన్ జీతో పనిచేయడం అత్యంత కష్టమని సర్వేలో చెప్పారు.ఉద్వాసనకు దారితీస్తున్న ప్రధాన కారణాలుకారణంశాతం (సుమారుగా)చొరవ చూపకపోవడం50%ప్రొఫెషనలిజం లోపం46%బలహీనమైన కమ్యూనికేషన్ స్కిల్స్39%విమర్శలను తట్టుకోలేకపోవడం38%సమస్య పరిష్కార సామర్థ్యం లేకపోవడం34%వారానికి 20% మంది ఆలస్యంగా ఆఫీసుకు రావడం, కార్యాలయానికి తగని దుస్తులు ధరించడం, పని ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటివి యజమానులను కలవరపెడుతున్నాయి.'స్నోఫ్లేక్' సిండ్రోమ్.. ఫీడ్‌బ్యాక్ అంటేనే భయం!యజమానులు ప్రధానంగా ఫిర్యాదు చేస్తున్న మరో అంశం.. విమర్శలను స్వీకరించలేకపోవడం. మేనేజర్లు ఇచ్చే నిర్మాణాత్మకమైన సలహాలను కూడా వీరు వ్యక్తిగత విమర్శలుగా భావిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే వీరిని సోషల్ మీడియాలో ‘స్నోఫ్లేక్’ అని పిలుస్తున్నారు. అంటే చిన్న విషయాలకే కుంగిపోయే మనస్తత్వం కలవారని అర్థం. తమ తొలగింపు ఉదంతాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తూ కొందరు సానుభూతి పొందుతుంటే, మరికొందరు ఆఫీస్ కల్చర్‌ను తప్పుబడుతున్నారు.ఆధారపడటం పెరిగింది.. ఆత్రుత తగ్గింది!బ్యాంక్రేట్ సర్వే ప్రకారం.. దాదాపు 70% మంది జెన్ జీ యువత ఆర్థికంగా ఇంకా తమ తల్లిదండ్రులపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల కెరీర్లో ఎదగాలనే తపన, స్వతంత్రంగా ఉండాలనే ఆత్రుత వారిలో తగ్గడానికి కారణమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు తమ రిటైర్మెంట్ సేవింగ్స్ ఖర్చు చేస్తూ పిల్లలను ఆదుకోవడం వారి వృత్తిపరమైన ఎదుగుదలకు పరోక్షంగా అడ్డంకిగా మారుతోంది.నాణేనికి మరోవైపుజెన్ జీపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ భవిష్యత్తు వారిదే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం, 2025 నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో 25% పైగా వీరిదే వాటా. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వీరికి ఉన్న పట్టు కంపెనీలకు ఎంతో కీలకం. అంతేకాకుండా, కేవలం జీతం కోసమే కాకుండా.. మానసిక ఆరోగ్యం, పని-జీవిత సమతుల్యత కోసం వీరు గళం విప్పుతున్నారు. పాతకాలపు కఠినమైన పని పద్ధతులను సవాలు చేస్తూ మరింత స్నేహపూర్వకమైన పని వాతావరణం కావాలని కోరుకుంటున్నారు.కంపెనీల అంచనాలు, కొత్త తరం ఆలోచనల మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చకపోతే భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. జెన్ జీ ఉద్యోగులు వృత్తిపరమైన క్రమశిక్షణను అలవర్చుకోవడంతో పాటు కంపెనీలు కూడా వారి మైండ్‌సెట్‌కు తగ్గట్టుగా తమ సంస్కృతిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తగ్గాలి -
జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!
నేటి ఉద్యోగ ప్రపంచంలో 'జెన్ జీ' (Gen Z) తరం గురించి ఒక చర్చ జరుగుతోంది. కొంతమంది వ్యాపారవేత్తలు, యువత పనిపట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారని, ఆఫీస్ రూల్స్ కూడా పాటించరని చెబుతున్నారు. దీనిపై యువ పారిశ్రామికవేత్త రోహిత్ ఆర్యన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో తన అనుభవాన్ని పంచుకుంటూ.. జెన్ జీ ఉద్యోగులు నిజానికి ఎంతో కష్టపడే వారు అని స్పష్టం చేశారు.''రెండు నెలల క్రితం ఒక జెన్ జీ యువతిని ఉద్యోగంలోకి తీసుకున్నాను. మొదట్లో నేను కూడా.. అందరూ చెప్పినట్లే ఈ తరం గురించి కొన్ని సందేహాలు పెట్టుకున్నాను. కానీ ఆమె పనితీరును దగ్గరగా గమనించిన తరువాత, తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. ఆమె నిజాయితీగా పనిచేయడం, బాధ్యతగా వ్యవహరించడం, తన పనిపట్ల ఆసక్తి చూపించడం ఆయనను ఆకట్టుకున్నాయని వెల్లడించారు.జెన్ జీ ఉద్యోగులు పని చేయరని మాట తప్పు.. ఎందుకంటే వారు పని చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. పాత తరాల ఉద్యోగులు సంప్రదాయ పద్ధతుల్లో పనిచేయడాన్ని ఇష్టపడితే.. జెన్ జీ యువత కొత్త ఆలోచనలు, స్వేచ్ఛ, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. వారు పని - వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత ముఖ్యమని భావిస్తారు. ఇది వాళ్ల బలహీనత కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన కొత్త దృక్పథం అని రోహిత్ ఆర్యన్ పేర్కొన్నారు.Hired a GenZ girl 2 months back, and honestly she works with full heart, super sincere. That whole "GenZ doesn't work hard" thing is totally wrong. You just need to understand how they work - their style, their way of communicating is a bit different, but that's completely fine.…— Rohit Aryan (@RohitAryannn) May 6, 2026జెన్ జీ ఉద్యోగులు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ముందుంటారు. అవసరమైతే 'ఇది సరైనది కాదు' అని ధైర్యంగా చెప్పగలరు. కొందరు దీనిని అహంకారంగా భావించినా, వాస్తవానికి అది వారి ఆత్మవిశ్వాసానికి సూచిక. సరైన ప్రోత్సాహం, గౌరవం, అర్థం చేసుకునే నాయకత్వం లభిస్తే.. వారు సంస్థకు ఎంతో విలువైనవారిగా మారగలరని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?రోహిత్ ఆర్యన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. చాలామంది ఆర్యన్ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. తాము కూడా జెన్ జెడ్ ఉద్యోగులతో మంచి అనుభవాలు పొందామని చెప్పారు. సరైన మార్గదర్శనం, స్వేచ్ఛ, నమ్మకం ఇస్తే ఈ తరం అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు. -
స్టాక్ మార్కెట్లోకి దూసుకొస్తున్న ‘జెన్-జీ’
గతంలో స్థిరమైన ఉద్యోగం, చేతినిండా సంపాదన వచ్చాక మాత్రమే భారతీయులు పెట్టుబడుల గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి జెన్-జీ యువత (Gen Z) తమ ఇరవయ్యో ఏట అడుగుపెట్టకముందే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ (SIP)ల గురించి చర్చిస్తున్నారు.భారతీయ యువతలో ఆర్థిక అవగాహన మునుపటి కంటే గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియా ప్రభావం, ఆన్లైన్ ఆర్థిక సమాచారం సులభంగా అందుబాటులోకి రావడం వల్ల పెట్టుబడి అనేది కేవలం నిపుణులకు పరిమితమైన అంశం కాకుండా, సామాన్యుల రోజువారీ సంభాషణల్లో భాగమైపోయింది. నేడు యువతకు పెట్టుబడి పెట్టడం అనేది కేవలం డబ్బు సంపాదించడమే కాదు, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటానికి ఒక చిహ్నంగా మారుతోంది.భారీగా పెరుగుతున్న డీమాట్ ఖాతాలుపెట్టుబడి ధోరణిలో వచ్చిన ఈ భారీ మార్పునకు కోవిడ్-19 మహమ్మారి ఒక ప్రధాన చోదక శక్తిగా నిలిచింది. లాక్డౌన్ సమయంలో యువత ఆన్లైన్లో గడిపే సమయం పెరగడంతో యూట్యూబ్, పాడ్‌కాస్ట్‌లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సంక్లిష్టమైన మార్కెట్ అంశాలను సులభంగా అర్థం చేసుకున్నారు. గణాంకాల ప్రకారం, జనవరి 2023 నుండి ఆగస్టు 2024 మధ్య కాలంలోనే దేశంలో 6 కోట్లకు పైగా కొత్త డీమాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, నేటి యువత కేవలం సాంప్రదాయ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ఫ్రీలాన్సింగ్, గిగ్ వర్క్ వంటి మార్గాల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ మిగులు ఆదాయాన్ని వారు దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఈక్విటీలు, సిప్ (SIP)లలో మదుపు చేస్తున్నారు.మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యువత జోరు స్పష్టంగా కనిపిస్తోంది. 2025 మధ్య నాటికి భారతదేశంలో డీమాట్ ఖాతాల సంఖ్య 20 కోట్లు దాటగా, అందులో ప్రతి నలుగురిలో ముగ్గురు 30 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. సెబీ (SEBI) 2025 సర్వే ప్రకారం, పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్న వారిలో 56 శాతం మంది జెన్-జీ యువతే ఉన్నారు. అయితే, ఈ ఉత్సాహంతో పాటు కొన్ని సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ప్రస్తుతం యువతకు సమాచారం తక్కువగా లేదు, కానీ అతిగా ఉంది. వేల సంఖ్యలో లభించే ఆన్లైన్ టిప్స్, మార్కెట్ అంచనాలలో ఏది నిజమో, ఏది ఊహాగానమో గుర్తించడం వారికి కష్టతరంగా మారుతోంది. కేవలం 30 శాతం మంది యువకులకు మాత్రమే కాంపౌండింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి ప్రాథమిక సూత్రాలపై సరైన అవగాహన ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.అవగాహన అవసరం ఈ నేపథ్యంలో, యువత కేవలం ఉత్సాహంతో కాకుండా సరైన అవగాహనతో పెట్టుబడులు పెట్టడం అత్యవసరం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారానికి లోనుకాకుండా ఉండటానికి క్రమబద్ధమైన ఆర్థిక విద్యా కార్యక్రమాలు (Structured Learning) అవసరం. ప్రస్తుతం మార్కెట్ సిమ్యులేషన్స్, మెంటార్షిప్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ల ద్వారా యువతకు వాస్తవ మార్కెట్ పరిస్థితులపై శిక్షణ ఇచ్చే ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం త్వరితగతిన లాభాలు ఆర్జించడం కాకుండా, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాట్లను పెంపొందించుకున్నప్పుడే భారత పెట్టుబడి రంగం సుస్థిరమైన భవిష్యత్తును కలిగి ఉంటుంది. యువత ఎంత మంది మార్కెట్లోకి వస్తున్నారనే దానికంటే, వారు ఎంత అవగాహనతో వస్తున్నారనేదే ముఖ్యం.- అజయ్ లఖోటియా, స్టాక్‌గ్రో ఫౌండర్ & సీఈవో -
మారనున్న సీన్.. మోదీ సర్కార్‌కు పెద్ద పరీక్షే!
పలు దేశాల్లో పోరాటాలతో ప్రభుత్వాలను గద్దె దించిన ఘనత జెన్ జీదే. అలాంటి తరం భారత్‌లో కొత్త రాజకీయ సమీకరణకు కారణం కాబోతోందా?. రాజకీయాన్ని కేవలం కంటెంట్‌గా చూసే ఈ జనరేషన్.. రాబోయే ఎన్నికల్లో నిజంగానే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోందా?.. అవుననే అంటున్నాయి పలు విశ్లేషణలు.భారత రాజకీయాల్లో 12 ఏళ్ల కిందట నాయకత్వ మార్పు జరిగింది. అప్పట్లో మిల్లెనియల్స్ అనే తరం (1981–1996లో పుట్టినవాళ్లు) పెద్ద ఎత్తున ఓటర్లుగా ఉన్నారు. వారు యూపీఏ పాలనతో విసిగిపోయో.. మార్పు కోసం ఆసక్తిగా ఎదురుచూసో.. ఎన్డీయేకు రెండుసార్లు పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లో ఓటర్లలో మూడో వంతుగా, 2019లో దాదాపు 40 శాతంగా ఉండి మోదీ సర్కార్‌ను గెలిపించారు. కానీ, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ సీన్ మారబోతోంది.2024 ఎన్నికల్లో జెన్‌జీ రూపంలో 9 కోట్ల మంది కొత్త ఓటర్లు సరికొత్త రాజకీయ సమీకరణకు సంకేతాలు ఇచ్చారు. ఫలితంగా.. ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చినా మెజారిటీపై ప్రభావం చూపెట్టింది. అయితే మరో మూడేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేది ఈ తరమే. అప్పటికల్లా భారత జనాభా 151 కోట్లకు చేరవచ్చని ఓ అంచనా. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. మిల్లెనియల్స్ + జెన్‌జీ కలిపి 91 కోట్లకు చేరుకుంటుందని.. ఇందులో జెన్‌జీ తరంవాళ్లే అత్యంత పెద్ద వర్గం ఓటర్లుగా(43 నుంచి 47 శాతం) ఉండబోతున్నారు.1997–2012 మధ్య పుట్టిన జెన్‌జీ తరం మోదీ పాలన చూస్తూ పెరిగారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాం గురించి వాళ్లకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు(తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్లు లేకపోలేదు). కాబట్టి ఈ జనరేషన్ బీజేపీ ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఓ వ్యవస్థగానే చూస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ జనాభా సుమారు 2.5 బిలియన్లు, అంటే ప్రపంచ జనాభాలో 30% అన్నమాట. ప్రపంచంలోనే అత్యధికంగా ఒక్క భారతదేశంలోనే 40 కోట్ల దాకా ఈ జనాభా ఉంది. ఇప్పటికే వారు దేశ కార్మిక శక్తిలో నాలుగో వంతుగా ఉన్నారు. 2030 నాటికి వీళ్ల ద్వారా ఎకనమీ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని ఓ అంచనా. సంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రాజకీయ అవగాహన పొందడం వీరికున్న మరో ప్రత్యేకత.అయితే.. భారత్‌లో దేశీయంగా ఐటీ వృద్ధి మందగించడం, విద్యావకాశాలు తగ్గిపోతుండడం, నిరుద్యోగం రేటు గణనీయంగా పెరగడం, విదేశీ అవకాశాలు కఠినతరం కావడం, ఆర్థిక భద్రత కొరవడడం ఆందోళనను రేకెత్తిస్తోంది. గిగ్, తయారీ రంగాల్లో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ వాదనతో జెన్‌జీ ససేమీరా అంటోంది. ఇది కేవలం విధానపరమైన చర్చ మాత్రమే కాదు.. ఈ జనరేషన్‌కి నిత్యజీవిత సమస్య కూడా.సోషల్ మీడియా ఒకప్పుడు అధికార మార్పుకు కీలకమైన సాధనం. అయితే ఇప్పుడు అదొక విభిన్న వేదికగా మారింది. ఒక కథనాన్ని ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా పలు కోణాల్లో చర్చించేందుకు అక్కడ అవకాశం ఉంటోంది. ఇందులో అత్యధికంగా పాల్గొంటోంది కూడా జెన్‌జీనే.కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కచ్చితంగా భిన్నంగా ఉండబోతున్నాయి. అంటే గత ఎన్నికల్లా బీజేపీ-కాంగ్రెస్‌ల పోలిక కంటే.. ‘‘మాకు మంచి చేసింది ఎవరు?’’ అనే ప్రశ్నే 2029లో వారి ఓటును డిసైడ్ చేయబోతోంది. వీళ్ల తీర్పు గతం ఆధారంగా కాకుండా, ప్రస్తుత ఫలితాలు (ఉద్యోగాలు, విద్య, అవకాశాలు) ఆధారంగా ఉండబోతోంది. ఈ లెక్కన 2029 ఎన్నికలు మోదీ సర్కార్‌కు ఒక పెద్ద పరీక్షగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.పైన చెప్పుకున్నది రాజకీయ అభిప్రాయం ఎంత మాత్రం కాదు. ఇది డేటా ఆధారిత విశ్లేషణ. పీఎల్ఎఫ్ఎస్ (Periodic Labour Force Survey)భారతదేశంలో ఉద్యోగాలు, నిరుద్యోగం, కార్మికశక్తి పాల్గొనడం వంటి అంశాలపై డేటా ఇస్తుంది. కేంద్ర బ్యాంక్ RBI ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై నివేదికలు విడుదల చేస్తుంది. నాస్కామ్(NASSCOM) .. ఐటీ రంగంలో ఉద్యోగాలు, వృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై నివేదికలు ఇస్తుంది. ఈ మూడింటి డేటా ఆధారంగా.. Gen Z Is Not Impressed With Modi | The 2029 Election Warning అనే యూట్యూబ్ వీడియోలో Gen Z ఓటర్ల ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, అవకాశాల లోటు గురించి వివరించారు.అలాగే.. ది పయనీర్ పత్రిక రాసిన ఓ వ్యాసంలో(Why Urban Gen Z Voters Prefer Narendra Modi’s Performance-Driven Politics) పట్టణ జెన్‌జీ ఓటర్లు ఫలితాలు, పనితీరు ఆధారంగా రాజకీయాలను అంచనా వేస్తున్నారని విశ్లేషించారు. అలాగే అజంతా అనే ఓ జర్నలిస్టు కమ్ రచయిత్రి ‘Youth and Politics: How Gen Z Is Reshaping India’s Democracy’ అనే వ్యాసంలో జెన్‌జీ రాజకీయ అవగాహన, 2024 ఎన్నికల్లో వారి పాత్ర గురించి, ఆపై సోషల్ మీడియా ప్రభావం, 2029 ఎన్నికల్లో వాళ్ల ప్రభావం ఎలా ఉండబోతోంది అని విశ్లేషించారు. VIDEO Credits: What Does This Data Say -
‘ఇక ఏదీ మునుపటిలా ఉండదు’
లండన్: కృత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో అలజడి చెలరేగుతోంది. గడిచిన 37 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణమైన పరిస్థితిని ప్రస్తుత ఎంట్రీ-లెవల్ జాబ్ మార్కెట్ ఎదుర్కొంటోంది. ఏఐ దెబ్బకు అగ్రశ్రేణి యూనివర్సిటీల విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ విపత్కర పరిణామాలను గమనించిన మెటా మాజీ ఎగ్జిక్యూటివ్ క్లారా షిహ్.. ‘ఇకపై ఏదీ మునుపటిలా ఉండదు’ అని హెచ్చరిస్తూనే, యువత (Gen Z) ఉద్యోగ వేట కోసం సరికొత్త ఏఐ సాధనాలను ఆశ్రయించాలన్నారు.టాపర్లనే దాటేసిన ఏఐ.. షాకింగ్ నిజాలుమెటా, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన క్లారా షిహ్.. ఏఐ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును ప్రత్యక్షంగా చూశారు. తమ సంస్థలోని అత్యుత్తమ ఉద్యోగుల కంటే ఏఐ ఏజెంట్లు అనేక పనుల్లో వేగంగా, అద్భుతంగా పనిచేయడం చూసి ఆమె విస్తుపోయారు. ఆ క్షణమే భవిష్యత్తు ఉద్యోగాలన్నీ ఏఐ మయం కాబోతున్నాయని ఆమె గ్రహించారు. ఏఐ ప్రభావంతో తన స్నేహితులు, బంధువుల పిల్లలు కనీసం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కూడా సాధించలేకపోవడం చూసి చలించిపోయారు. ఈ సంక్షోభం నుంచి యువతను గట్టెక్కించేందుకు ఆమె ‘న్యూ వర్క్ ఫౌండేషన్’ అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించారు.ఏఐ దెబ్బకు ఏఐతోనే బదులుప్రస్తుతం వస్తున్న ఈ సాంకేతికతను చూసి భయపడటం కంటే, దానిని ఆయుధంగా మలచుకోవడమే ఏకైక మార్గమని క్లారా స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగం సంపాదించాలన్నా, ఉన్న దాన్ని కాపాడుకోవాలన్నా ఏఐ ఏజెంట్లను సమర్థవంతంగా వాడుకోవడంలో యువత నైపుణ్యం సాధించడం తప్పనిసరి. ఇందుకోసం ‘డియర్ సీసీ’ పేరుతో యువత కోసం ప్రత్యేక ఏఐ టూల్స్ ను ఆమె అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ‘ఫీల్డ్ రిపోర్ట్’ అనే టూల్.. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్ లో ఉన్న ప్రస్తుత అవకాశాలు, అలాగే ఏఐ వల్ల ఆ రంగంలో పొంచి ఉన్న ఆటోమేషన్ ముప్పును విశ్లేషించి చెబుతుంది.రెజ్యూమ్ అక్కర్లేదు.. ‘జాబ్క్లా’తో కొత్త రకం వేటఉద్యోగాన్వేషణను మరింత సులభతరం చేసేందుకు ‘జాబ్ క్లా’ (JobClaw) అనే మరో అద్భుతమైన టూల్‌ను కూడా ఈ ఫౌండేషన్ పరిచయం చేసింది. దీనికి ఎలాంటి రెజ్యూమ్ అవసరం లేదు. కేవలం ఐదు సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే చాలు, అభ్యర్థి ఆసక్తులు, బలాలు ఆధారంగా సరిపోయే ఉద్యోగాలను ఇది వెతికి పెడుతుంది. మరోవైపు ఏఐ విషయంలో యువతలో ఆందోళన, కోపం పెరుగుతున్నాయని గాలప్ సర్వే వెల్లడించింది. ఇది కూడా చదవండి: నాడు రోమాలపై హేళన.. నేడు ఇంటర్‌లోనూ టాపర్! -
కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం
టెక్నాలజీలో వేగంగా మార్పులొస్తున్నాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఆఫీసుల్లో కొత్తగా చేరే ఉద్యోగుల తీరు విభిన్నంగా ఉంది. గతంలో బాస్ ఏదైనా చెబితే చాలా వరకు ఎదురు చెప్పకుండా దాన్ని పాటించేవారు. కానీ ఇప్పుడు యువత ముఖ్యంగా జెన్ జీ తీరు మారింది. ఇది పని పట్ల వారికున్న కొత్త ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. వారిలోని మార్పును నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారో చూద్దాం.హోదాను చూసి కాదు..ఒకప్పుడు ఆఫీసులో ఎవరైనా పెద్ద పోస్టులో ఉంటే వారు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు సీన్ మారింది. కార్యాలయాల్లో ఇంటర్నల్ మీటింగ్స్ జరిగినప్పుడు ‘ఈ పని ఎందుకు చేయాలి?’ అని యువ ఉద్యోగులు అడుగుతున్నారు. కేవలం మేనేజర్ అని గౌరవం ఇవ్వడం కాకుండా తనకు విషయం తెలిసి స్పష్టంగా సమస్యను, పరిష్కారాన్ని వివరిస్తేనే నిజమైన గౌరవం దక్కుతోంది. అంటే, అధికారం అనేది ఇప్పుడు కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టి వస్తోంది.పనిలో క్లారిటీ ఉండాల్సిందే!‘నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల కంపెనీకి లేదా నాకు వచ్చే లాభం ఏంటి?’ అని జెన్‌జీ యువత ఆలోచిస్తున్నారు. పని గురించి సరిగ్గా వివరించకపోతే ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఇది తిరుగుబాటు కాదు, అర్థం లేని పని చేయలేక వస్తున్న విసుగు అని గమనించాలి. మనం చేసే పనికి ఒక అర్థం, ఒక లక్ష్యం ఉందని తెలిస్తేనే నేటి ఉద్యోగులు ఉత్సాహంగా పని చేస్తున్నారు.అప్పటికప్పుడు ప్రోత్సాహం కావాలి!పాత కాలంలో ఏ ఏడాదికో ఒకసారి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పటి డిజిటల్ కాలంలో అంత ఓపిక ఎవరికీ లేదు. ‘నేను చేస్తున్న పని బాగుందా? లేదా?’ అని ఉద్యోగులు అప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బాస్ ఏమీ చెప్పకుండా గమ్మున ఉంటే.. అది తమకు ఇష్టం లేదనో లేదా తనను పట్టించుకోవడం లేదనో ఉద్యోగి ఫీలవుతున్నారు. చిన్న మెచ్చుకోలు అయినా సరే అది పనిని రెట్టింపు వేగంతో చేయిస్తుంది.జీతం కోసం మాత్రమే కాదు!నేటి తరం పనిని కేవలం నెల నెలా వచ్చే జీతం కోసం చేయడం లేదు. వారు చేసే పనిలో ఒక తృప్తిని వెతుక్కుంటున్నారు. ‘నేను చేస్తున్న పని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నేను ఎదగడానికి ఇది పనికొస్తుందా?’ అనేదే వారి మెయిన్ పాయింట్. అందుకే ఇప్పుడు ఆఫీసుల్లో కంట్రోల్ చేయడం కంటే ఉద్యోగులతో కలిసి ప్రయాణించడం ముఖ్యం. బాస్‌లు ఆదేశాలు ఇచ్చే వారిగా కాకుండా దారి చూపే వారిగా మారినప్పుడే ఏ కంపెనీ అయినా సక్సెస్ అవుతుంది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
అందరిచూపు.. ఆసియా దేశాలవైపు!
భారతీయ ప్రయాణికులు ఈ వేసవిలో ఎక్కువగా ఆసియా దేశాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నట్లు ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. ఇప్పటి యువత, ముఖ్యంగా Gen Z తరం, కొరియన్ డ్రామాలు, జపనీస్ సంస్కృతి, ఆసియన్ స్ట్రీట్ ఫుడ్ వంటి వాటికి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ఆసియా టూరిజం మీద ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది.ఎయిర్‌బీఎన్‌బీ గణాంకాల ప్రకారం.. ఈ వేసవిలో 40 శాతం కంటే ఎక్కువ జెన్ జీ వర్గానికి చెందిన వారు ఆసియా దేశాలకు ట్రావెల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణాలు కేవలం కేవలం విశ్రాంతి కోసం కాకుండా అనుభవాల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత కచేరీలు, పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన అనుభవాలు వంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.జపాన్, దక్షిణ కొరియా, దక్షిణ - తూర్పు ఆసియా దేశాల్లోని నగరాలు భారతీయుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓసాకా, టోక్యో, బుసాన్ వంటి నగరాల్లో సెర్చ్‌లు గణనీయంగా పెరిగాయి. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్ వంటి నగరాలు కూడా తమ సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు, పరిచయంతో కూడిన వాతావరణం వల్ల ప్రజాదరణ పొందుతున్నాయి.ప్రయాణం ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా కుటుంబంతో, స్నేహితులతో కలిసి చేసే అనుభవంగా మారుతోంది. దాదాపు 60 శాతం మంది గ్రూప్ లేదా ఫ్యామిలీ ట్రావెల్ చేసినట్లు గణాంకాల ద్వారా తెలిసింది. దేశీయంగా కూడా కొత్త ట్రెండ్లు కనిపిస్తున్నాయి. ప్రజలు సాధారణంగా వెళ్లే ప్రదేశాలకంటే భిన్నమైన, ప్రకృతి, సంప్రదాయం, సంస్కృతి కలిగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తిరువనంతపురం, పూరి, జైపూర్, మేఘాలయ వంటి ప్రదేశాలు ఉన్నాయి. -
జెన్‌జీ రూటు ఎటో!
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జెన్‌జీ(జనరేషన్ జెడ్) నిర్ణయాత్మక శక్తిగా అవతరించింది. యువతరం తమిళ రాజకీయాల్లో పెద్దమార్పునకు పునాది కాబోతుంది. 1.18 కోట్ల మంది యువ ఓటర్లు ఉండడంతో రాజకీయ పార్టీలు వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి. తమిళనాడులోని మొత్తం ఓటర్లలో సుమారు 20 శాతం అంటే 1.18 కోట్ల మంది 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జెన్‌జీ ఓటర్లే ఉన్నారు. వీరి ఓట్లు గెలుపోటములను శాసించడంలో కీలక భూమిక పోషించనున్నాయి. జెన్ జెడ్‌ను ఆకర్షించేలా రాజకీయ పార్టీల వ్యూహాలు జెన్–జెడ్ ఓటర్లను ఆకర్షించే వ్యూహాలకు తమిళ రాజకీయ పార్టీలు పదునుపెట్టాయి. డీఎంకే ఆధునిక డిజిటల్ ప్రచారంలో నిమగ్నమైంది. ప్రభుత్వం కొనసాగింపు, అభివృద్ధి నినాదం ఇందులో కీలకంగా ఉంది. యువఓటర్లను ఆకర్షించే విధంగా ఉచిత ల్యాప్ టాప్‌లు, వైఫై సేవలు, ఉద్యోగకల్పన, ఉన్నతచదువుల కోసం నాన్ మొదల్వన్ పథకం ద్వారా ఉచిత వృత్తి శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణే కాకుండా, పుదుమైపెన్, తమిళ్‌పుదల్వన్ పథకాల పేరిట నెలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. అన్నాడీఎంకే విషయానికి వస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రిజర్వేషన్లను 7.5% నుంచి 10%కి పెంచుతామని, ఆర్థిక సంక్షేమ పథకాల భరోసాను కీలకంగా చేసుకుంది. తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రంతో యువత, అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అందుకే విజయ్ ఈ తరం కోసం ఏఐ టెక్నాలజీ, ఫీజులమాఫీ అంటూ ముందుకు సాగుతున్నారు. నామ్ తమిళర్ కట్చి కన్వినర్ సీమాన్ అయితే తమిళ దేశం నిర్మాణం తదితర భావోద్వేగ అంశాలతో జెన్‌జీ ఓటర్ల కోసం కీలక ప్రకటనలు చేశారు. మునుపటి తరాల మాదిరిగా ఒక పార్టీకి వంశపారంపర్య విధేయులుగా ఉండకుండా, జెన్–జీ ఓటరు తాజాగా స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సమస్యల ఆధారిత ఓటింగ్ పార్టీల కంటే సమస్యలకే జెన్‌జీ ఓటర్లు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తాజా అంచనాలు చెబుతున్నాయి. నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన భవిష్యత్తు, సమాచార మూలాల విశ్లేషణకు జెన్‌జీ వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియా ద్వారా రాజకీయ అవగాహన పెంచుకుంటున్నారు. ఈ దృష్ట్యా యువ ఓటర్లు ఏకపక్షంగా ఉండకుండా చీలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం అధికార మార్పిడి కోసం మాత్రమే కాదు. రాబోయే 20 ఏళ్ల తమిళనాడు రాజకీయ గమనాన్ని నిర్ణయించే కొత్త తరం గళం కాబోతోంది. -
బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగం(2026) మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు మాత్రమే కాదు.. యువత భవిష్యత్ ఆలోచనల మధ్య సాగుతున్న మహా సంగ్రామం. ఈ చరిత్రక ఎన్నికల్లో గెలుపోటములను శాసించే బ్రహ్మాస్త్రం ఇప్పుడు ‘జెన్ జెడ్’ చేతుల్లోనే ఉంది. మొదటిసారి ఓటు వేస్తున్న లక్షలాది మంది యువత.. కుల, మత, వారసత్వ రాజకీయాలకు అతీతంగా, తమ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ, పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మళ్లీ అధికారంలోకి రావాలా లేదా బీజేపీ నేతృత్వంలోని ‘పరివర్తన్ 2.0’కు పట్టం కట్టాలా అనేది ఇప్పుడు ఈ తరం యువత చేతుల్లోనే ఉందంటున్నారు విశ్లేషకులు.సంక్షేమ పథకాలే టీఎంసీకి శ్రీరామరక్షతృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకునే యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ‘కన్యాశ్రీ’, ‘సబుజ్ సాథి’ వంటి సంక్షేమ పథకాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. వారి విద్యాభ్యాసానికి, ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడి వారి జీవితాల్లో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. అలాగే, బెంగాలీ సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడే నాయకత్వంపై కొంతమంది యువతకు మక్కువ ఎక్కువ. దీదీ పాలనను కొనసాగిస్తే తమకు అందుతున్న ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నది వారి భావన. అయితే 2011లో వచ్చిన రాజకీయ మార్పును కేవలం సుదూర చరిత్రగా మాత్రమే చూస్తున్న నేటి ‘జెన్ జెడ్’ ఓటర్లు.. పాత రాజకీయ కథనాలను గుడ్డిగా నమ్మడం లేదు. డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరిగిన వీరు సోషల్ మీడియా ప్రభావంతో, రాజకీయ నాయకులు ఇచ్చే ప్రతి హామీని నిశితంగా పరిశీలిస్తూ, ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు.‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌తోనే..పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన యువతలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అధికార పార్టీ పాలనపై వారిలో క్రమంగా అసంతృప్తి రగులుతోంది. రాష్ట్రంలో భారీ స్థాయి ప్రైవేట్ పెట్టుబడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు మృగ్యం కావడంతో.. బెంగాల్ యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలు నైపుణ్యాన్ని నమ్ముకున్న యువతలో తీవ్ర నైరాశ్యాన్ని నింపాయి. సరిగ్గా ఈ అసంతృప్తినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. పారదర్శకత, అవినీతి రహిత పాలన, కేంద్రంతో కలిసి పనిచేసే ‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌తోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమంటూ 'పరివర్తన్ 2.0' నినాదంతో యువతను ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తోంది.‘సీఈఓ’ లాంటి లీడర్ కావాలినేటి యువత ఏ ఒక్క రాజకీయ పార్టీకీ కట్టుబడి ఉండలేదు. వారు పూర్తిగా సమస్యల ఆధారిత విధానాన్ని నమ్ముతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ తరంలో చాలా మంది తమకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెబుతున్నప్పటికీ, వారు అడిగే ప్రశ్నలు, డిమాండ్లు మాత్రం రాజకీయ వ్యవస్థను నిలదీసేలా ఉన్నాయి. వారికి ఉద్వేగభరితమైన మాటలు చెప్పే నాయకులు కాదు, ఒక బహుళజాతి కంపెనీని నడిపించే ‘సీఈఓ’ మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థుడైన నాయకుడు కావాలి. ఉద్యోగాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంకేతికతను యువత కోరుకుంటోంది. రాష్ట్రంలోని పట్టణ యువత ఓటింగ్ శాతమే విజేతను నిర్ణయించనున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా యువతను ప్రసన్నం చేసుకునేందుకు టీఎంసీ, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఇది కూడా చదవండి: కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్ వీడియో -
అస్సాం ఎన్నికల బరిలో ‘జెన్ జీ’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాలంటే వారసత్వ ఆస్తి అనే పాత పద్ధతులకు అస్సాం ఎన్నికల్లో ‘ఎండ్ కార్డ్’ పడుతోంది. ప్రజలతో అనుబంధం, విద్య, పోరాట పటిమే పెట్టుబడిగా కుర్రకారు రాజకీయ రణరంగంలోకి దూసుకొస్తోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు లక్షల మంది యువత తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాంతో పార్టీలు యువతకు గాలం వేస్తున్నాయి.34 ఏళ్ల లోపు నవతరానికి, విద్యావంతులకు మునుపెన్నడూ లేని విధంగా టికెట్లు కేటాయించాయి. వాళ్లు పక్కా గ్రౌండ్ వర్క్, సమస్యలపై అవగాహనతో రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ అడుగుపెట్టి ప్రజా గళం వినిపించాలని ఈ యువ అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. వీరంతా విద్యార్థి ఉద్యమాలు, సామాజిక సేవ నుంచి వచ్చిన, క్షేత్రస్థాయి అనుభవమున్న వారే...!తేయాకు తోటల నుంచిరాజోర్ దళ్ పార్టీ తరఫున మార్గెరీటా నియోజ కవర్గం నుంచి బరిలో ఉన్న రాహుల్ ఛెత్రీ తేయాకు తోటల్లో పనిచేసిన కుటుంబం నుంచి వచ్చారు. విద్యార్థి ఉద్యమాల ద్వారా నాయకుడిగా ఎదిగారు. దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న రాహుల్ నిరుద్యోగం, విద్య, మౌలిక సదుపాయాల కల్పనను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.విద్యార్థి రాజకీయాలతోఅల్గాపూర్–కట్లిచెర్రా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జుబేర్ అనామ్ మజుందార్ పోటీ చేస్తున్నారు. ఆయన తొలుత విద్యార్థి సంఘాల్లో పనిచేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. చురుకైన, దూకుడైన నాయకుడిగా పేరుగాంచారు. ప్రజలకు చేరువ కావడానికి డిజిటల్ మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారు.మధ్యతరగతి ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ తిన్సుకియా అభ్యర్థిగా డేవిడ్ టి.ఫుకాన్‌ను నిలబెట్టింది. మేనేజ్మెంట్ విద్యను అభ్యసించిన ఫుకాన్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. మధ్యతరగతి ప్రజల ప్రతినిధిగా గుర్తింపు పొందారు. పరిశ్రమలు, తేయాకు తోటల కార్మికుల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.గిరిజన గొంతుకగా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి, జిల్లా అటానమస్ కౌన్సిల్లో చురుగ్గా పనిచేసిన 36 ఏళ్ల రూపాలీ లాంగ్థాసా గిరిజన సమాజంలో కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రాంతీయ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపునకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. హాఫ్లాంగ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి ఉన్నారు.గ్లోబల్ అనుభవంతో సెంట్రల్ గౌహతి నుంచి అస్సాం జాతీయ పరిషత్ అభ్యర్థిగా కుంకీ చౌదరి బరిలో ఉన్నారు. ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థులందరిలోనూ అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. లండన్‌లో మాస్టర్స్ చేసిన ఆమె కార్పొరేట్ కెరీర్‌ను వదిలి స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కుంకీ చౌదరి విస్తృతంగా పనిచేశారు.కార్యకర్త నుంచిగోల్పారా వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పవిత్ర రాభా పోటీ చేస్తున్నారు. విద్యార్థి రాజకీయాలతో ప్రస్థానం ప్రారంభించి, యువమోర్చాలో కీలక పాత్ర పోషించి సంస్థాగతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్థానిక అభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా ఆయన ముందుకెళ్తున్నారు.మంచి కెరీర్ వదిలేసిమరియానీ నియోజకవర్గం నుంచి రైజోర్ దళ్ అభ్యర్థిగా డాక్టర్ జ్ఞానశ్రీ బోరా పోటీ చేస్తున్నారు. కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసిన ఆమె సురక్షితమైన కెరీర్‌ను వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. నిరుద్యోగం, మెరుగైన ఆరోగ్య సేవలు, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకున్నారు.చదవండి: మాయోంగ్ గ్రామానికి నేతల క్యూ.. ఎందుకో తెలుసా? -
నేపాల్‌లో సంచలనం.. మాజీ ప్రధాని కేపీ ఓలీ అరెస్ట్
ఖాట్మాండ్: నేపాల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ శనివారం తెల్లవారుజామున అరెస్టు అయ్యారు. నేపాల్‌లో జెన్ జెడ్ నిరసనలను హింసాత్మకంగా అణచివేసిన ఘటనకు సంబంధించి, నరహత్య కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక, నేపాల్ ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజే ఆయన అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.ఇక, ఇదే కేసులో నేపాలీ కాంగ్రెస్ నాయకుడు, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ కూడా అరెస్టు అయ్యారు. భక్తపూర్‌లోని వారి నివాసాల నుండి ఈ ఇద్దరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించగల నిబంధనల కింద అభియోగాలు మోపే అవకాశం ఉంది. నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) నాయకుడైన ఓలీపై విచారణ జరపాలని నేపాల్‌లోని ఒక ఉన్నత స్థాయి కమిషన్ సిఫార్సు చేసిన తర్వాత ఆయన అరెస్టు జరిగింది.This is how it’s started to arrest Nepal Ex Prime Minister KP Sharma Oli. New Prime Minister Balendra Shah cabinet’s Home Minister Sudhan Gurung also confirmed! पूर्वप्रधानमन्त्री केपी शर्मा ओली पक्राउ ! #Nepal #KPSharmaOli #KPOli Gen Z pic.twitter.com/jfTvZzI4cN— Jitan Katwal 𝕏 (@JitanKatwal) March 28, 2026కాగా, కేపీ శర్మ ఓలీ హయాంలో పాలనా వైఫల్యాలు, అవినీతి, నిరుద్యోగం, రాజకీయ అస్థిరతపై ప్రజల్లోని ఆగ్రహంతో 2025 సెప్టెంబర్‌లో ‘జెన్ జెడ్ విప్లవం’గా పిలవబడే భారీ యువత తిరుగుబాటు నేపాల్‌ను అట్టుడికింది. డిజిటల్ స్వేచ్ఛ కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం, త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుగా పరిణమించడంతో ప్రభుత్వం తీవ్ర అణచివేతకు పాల్పడింది. తత్ఫలితంగా జరిగిన హింసా కాండలో కనీసం 77 మంది ప్రాణాలు కోల్పోగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు. #WATCH | Former Nepal Prime Minister KP Sharma Oli taken into custody from his residence in Gundu, Bhaktapur, by Nepal Police. According to the Kathmandu Post, "he has been arrested in connection with a culpable homicide-related case linked to the alleged suppression of the… pic.twitter.com/S0zrAmPUFV— ANI (@ANI) March 28, 2026నేపాల్ ప్రధానిగా షా..ఇదిలా ఉండగా.. నేపాల్‌లో రాప్ నుంచి నవతరం నాయకుడిగా ఎదిగిన బాలేంద్ర షా ‘బాలెన్’ (35) శుక్రవారం నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేశారు. శీతల్ నివాస్‌లోని అధ్యక్ష కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాలెన్తో దేశ అధ్యక్షుడు రామ్ చంద్రపౌడెల్ ప్రమాణం చేయించారు. గతంలో ఖాట్మాండ్ నగర మేయర్‌గా పనిచేసిన బాలెన్... ప్రజాస్వామ్యబద్ధంగా అతి పిన్న వయసులో దేశ ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇక, కొత్తగా ఏర్పాటైన బాలేంద్ర షా మంత్రివర్గం తొలిరోజే సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. గత సెప్టెంబరు నెలలో జరిగిన జెన్ జెడ్ ఉద్యమంపై దర్యాప్తు జరిపిన ఉన్నతస్థాయి కమిషన్ సిఫార్సులను తక్షణం అమలు చేయాలని నిర్ణయించింది. -
టెక్నాలజీలో ముందుకు.. ఆలోచనల్లో వెనక్కి?
టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఆలోచనల విషయంలో మాత్రం యువత వెనక్కి వెళ్తోందని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. జెన్ జెడ్ యువకుల్లో దాదాపు 31% మంది ‘భార్య ఎల్లప్పుడూ భర్తకు లోబడి ఉండాలి’ అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఒక అంతర్జాతీయ సర్వే చెబుతోంది.➤న్యూ గ్లోబల్ సర్వే ప్రకారం 33% మంది యువకులు ముఖ్యమైన నిర్ణయాలలో తమదే తుది నిర్ణయం కావాలని భావిస్తున్నారు. ➤భారతదేశంతో సహా గ్రేట్ బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి 29 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ➤నేటి యువకులు జెండర్ రోల్స్‌కు సంబంధించి సంప్రదాయ అభిప్రాయాలను కలిగి ఉండే అవకాశం ఉందని తెలియజేస్తోంది న్యూ గ్లోబల్ సర్వే.➤జెన్ జెడ్ యువకులు బేబీ బూమర్ల కంటే వివాహానికి సంబంధించి సంప్రదాయ ఆలోచనలతో ఉన్నారు.➤కెరీర్లో రాణిస్తున్న మహిళలను ఇష్టపడుతున్న యువకులు 41 శాతం మంది ఉన్నారు. జెన్ జడ్ యువకులు తమ భాగస్వామి బాగా సంపాదించాలని కోరుకుంటున్నప్పటికీ తమ అదుపు, ఆజ్ఞలలో ఉండాలని కోరుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ➤పిల్లల సంరక్షణ, ఇంటి పనులకు మహిళలే ప్రధాన బాధ్యత వహించాలని అంటున్నారు యువకుల్లో 35 శాతం మంది. ➤బేబీ బూమర్స్ (13%) కంటే ఈతరం యువకులే (31%) రెట్టింపు స్థాయిలో సంప్రదాయ భావాలను కలిగి ఉన్నారు. -
ఇంజనీర్, ర్యాపర్, మేయర్.. బాలేన్
ఆయన పాటలు జెన్ జెడ్‌ను ఉద్యమం వైపు పురిగొల్పాయి. కఠ్మాండు మాజీ మేయర్ కూడా అయిన ఆయన ఇప్పుడు ప్రధాని అయి నేపాల్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అతడే బాలేంద్ర షా..నేపాలీలు ముద్దుగా పిల్చుకునే బాలేన్..!మార్చి 4వ తేదీ. మరో రెండు రోజుల్లో జరిగే సాధారణ ఎన్నికలకు దేశం సమాయత్తమవుతుండగా ఝాపా జిల్లా వాసులు బాలేన్‌తో సెల్ఫీ కోసం క్యూ కట్టారు. ఎన్నికల ప్రచారం కోసం వచి్చన బాలేన్‌తో ఫొటో దిగేందుకు పోటీలు పడ్డారు. దీంతో, కార్యకర్తలు వారిని నియంత్రించే పనిలో బిజీ అయిపోయారు. బాలేన్‌తో సెల్ఫీ దిగాలని ముచ్చటపడే వారిని క్యూలో నిల్చోబెట్టి, ఒక్కొక్కరికి 10 సెకన్ల చొప్పున సమయమిచ్చారు. ఆ జనం మధ్యలో బాలెన్ నిలబడి ఉన్నారు. నల్లటి బ్లేజర్, నీటుగా ట్రిమ్ చేసిన గడ్డం, తనదైన స్టయిల్లో దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలతో కనిపిస్తున్నారు. ఆయన వారిని బాలేన్, ఒక కరచాలనం, ఒక చిరునవ్వు, ఒక సెలీ్ఫతో సంతోషపెడుతున్నారు. బాలేన్ ధరించే దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలు ఇప్పటికీ ఆన్లైన్లో బాలేన్ షా గ్లాసెస్ పేరుతో జనం కొనుగోలు చేస్తుండటం విశేషం. ఇంతటి జనాదరణ కలిగిన 36 ఏళ్ల బాలేన్..అదే బాలేంద్ర షా కఠ్మాండుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు రామ్ నారాయణ్ షా నలుగురు కుమారుల్లో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షతో మెలిగిన ఇతడికి కవితలు రాయడమంటే తెగపిచి్చ. నేపాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలేంద్ర, భారత్‌లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో పీజీ చదివాడు. 2013లో నేపాల్‌లో బాగా పేరున్న ర్యాబార్జ్ పోటీలో గెలుపొందాడు. అందులో బాలేన్ అవినీతి, రాజకీయ స్తబ్ధత, వారసత్వ పాలన వంటి వాటిపై స్వయంగా రాసి పాడిన పాటలు సూపర్ హిట్టయ్యాయి. ర్యాపర్ కంటే కూడా ఆయన మంచి కవి అని విమర్శకులు అంటున్నారు. అణగారిన ప్రజల గురించే ఆయన ఎక్కువగా కవితల్లో ప్రస్తావిస్తుంటారని, సామాన్యుల్లో ఆయనకు ఆదరణ ఇంతగా పెరగటానికి ఇవే కారణమని కూడా చెబుతున్నారు. అమెరికా, చైనాతోపాటు భారత్‌నూ వదల్లేదు..!గతేడాది సెప్టెంబర్‌లో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించినప్పుడు బాలేన్ స్వయంగా అందులో పాల్గొనలేదు. కానీ, ఆన్లైన్ వేదికగా పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా, చైనా, భారత్‌లను తిట్టిపోసిన బాలేన్..వీరితో ఏపనీ కాదంటూ ఫేస్బుక్లో షాకిచ్చే పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో బాలేన్ దేశాన్ని ముందుకు నడిపించేందుకు తగిన వ్యక్తి అంటూ 16 వేల సార్లు ప్రస్తావనకు వచి్చనట్లు అంచనా. పెద్ద సంఖ్యలో యువత ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరినా ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కికి బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదనకు మద్దతు పలికారు. రెండు నెలల అనంతరం మేయర్ పదవికి రాజీనామా చేసిన రా్రïÙ్టయ స్వతంత్ర రాష్ట్ర పార్టీలో చేరారు. మేయర్‌గా దూకుడు... 2022లో బాలేన్ కఠ్మాండు మేయర్ పదవికి స్వతంత్ర అభ్యరి్థగా పోటీకి దిగి ఏకంగా 61 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఎప్పటి నుంచో అధికారంలో కొనసాగుతున్న పారీ్టలను షాక్ తినిపించారు. పాలనలోనూ అదే దూకుడు కనబరిచారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. కఠ్మాండులోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూలగొట్టించారు. నగరంలో చెత్తాచెదారాన్ని శుభ్రం చేసే యంత్రాంగమే లేదని నిరసనగా చెత్తను ప్రధాని కార్యాలయం ఆవరణలో పారబోయించారు. 2025 సెప్టెంబర్‌లో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జెన్‌జెడ్ ఆందోళనలు నేపాల్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి వేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటమిని అంగీకరించిన నేపాలీ కాంగ్రెస్ : చారిత్రాత్మక విజయం దిశగా బాలెన్ షా
నేపాల్ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్చారిత్రాత్మక విజయం దిశగా బాలెన్ షా. రాపర్ నుంచి వ్యాపారవేత్తగా అవతరించిన బాలెన్ షా నేపాల్ ప్రధానమంత్రి అయ్యేందుకు సన్నద్ధం.110 స్థానాల్లో ఆధిక్యంతో అఖండ విజయాన్ని అందుకోనున్నబాలెన్షాబాలెన్ షా పార్టీ 107 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఒకసీటును గెలుచుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తోంది: నేపాలీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బిశ్వ ప్రకాష్ శర్మ ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు నేపాల్‌ను ప్రశంసించిన చైనామాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలి నేతృత్వంలోని బీజింగ్ అనుకూల సిపిఎన్-యుఎంఎల్ ఓటమి దిశగా సాగుతోంది.నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఓలి, తన సొంత పార్లమెంటు స్థానంలో బాలెన్ షా కంటే చాలా వెనుకబడి ఉన్నారు.క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తున్న ఆర్ఎస్పీనేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి యోగేష్ గౌచన్ తకాలి ముస్తాంగ్ నుండి CPN-UML ఇంద్రధర బిస్టాపై 3,307 ఓట్లతో విజయంఆర్ఎస్పీ 102 నియోజకవర్గాల్లో ముందంజఆర్ఎస్పీ 102 నియోజకవర్గాల్లో ముందంజలో ఉందిఆర్ఎస్పీ అభ్యర్థి రంజు న్యూవానే కాఠ్మాండు-1 నుంచి పార్లమెంట్ సీటు గెలిచారు275 మంది సభ్యులు ఉన్న ప్రతినిధి సభకు గురువారం ఓటింగ్ జరిగింది165 స్థానాలకు నేరుగా, 110 సీట్లకు నైష్పక్షిక విధానంలో ఓటింగ్ జరిగిందిఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఆధిక్యం?రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ప్రస్తుతం 77 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉందినేపాలి కాంగ్రెస్ ఇప్పటికే ఒక స్థానాన్ని గెలుచుకుంది, 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉందిసీపీఎన్-యూఎంఎల్ పార్టీ 7 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉందినేపాలి కమ్యూనిస్ట్ పార్టీ 6 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉందిరాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉందిశ్రమ్ సంస్కృతి పార్టీ ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉందినేపాల్లో వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది72 స్థానాల్లో ఆధిక్యంలో ఆర్ఎస్పీరాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 72 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చిందిట్రెండ్స్ చూస్తుంటే ఆర్ఎస్పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనపడుతోంది.60 స్థానాల్లో ఆధిక్యంలో ఆర్ఎస్పీ కౌంటింగ్ జరుగుతున్న కొద్దీ ఆర్ఎస్పీకి పెరుగుతున్న ఆధిక్యం 60 స్థానాల్లో ఆధిక్యంలో ఆర్ఎస్పీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం? 55 స్థానాల్లో ఆధిక్యంలో బాలేంద్ర షా పార్టీ ‘ఆర్ఎస్పీ’ కేపీ శర్మ ఓలీ ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‘ 8 స్థానాల్లో ఆధిక్యం కేపీ శర్మ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితయ్యేలా ఉన్న ట్రెండ్స్దూసుకెళ్తున్న పీఎం అభ్యర్థి బాలేంద్ర కొనసాగుతోన్న నేపాల్ ఎన్నికల కౌంటింగ్ ఝాపా నియోజక వర్గంలో దూసుకెళ్తున్న బాలేంద్ర షా (35) మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ(74)పై బాలేంద్ర షా ఆధిక్యంఆర్ఎస్పీ నుంచి ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షా మూడు సీట్లలో ఆర్ఎస్పీ గెలుపు, 45కి పైగా సీట్లలో ముందంజ -
నేపాల్ ఎన్నికల కౌంటింగ్‌లో దూసుకుపోతున్న బాలేంద్ర షా ‘ఆర్ఎస్పీ’
కాఠ్మాండు: నేపాల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆ దేశంలో గత ఏడాది జెన్ జీ నిరసనలతో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఇవాళ ఉదయం ఉన్న ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఝాపా నియోజక వర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ(74)పై జెన్ జీ అభిమాన నాయకుడు కాఠ్మాండు మాజీ మేయర్, ర్యాపర్ బాలేంద్ర షా (35) ఆధిక్యంలో ఉన్నారు.ఈ ఎన్నికల ముందు నిర్వహించిన సభల్లో బాలేంద్ర షా పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించారు. ఆయన సభలకు అధికంగా యువత హాజరైంది. బాలేంద్ర షాను బలెన్గానూ పిలుస్తుంటారు. ఆయన గత డిసెంబర్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో చేరారు. ఆ పార్టీకి మాజీ టీవీ హోస్ట్ రబి లామిచ్ఛానే అధ్యక్షుడు. అయితే, తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షా పేరును ఆర్ఎస్పీ ప్రకటించింది.రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఇవాళ ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో మూడు సీట్లలో గెలుపు సాధించగా, 45కి పైగా సీట్లలో ముందంజలో ఉంది. కేపీ శర్మ ఒలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) పార్టీ, గగన్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ పార్టీలు తలో 3 సీట్లలో మాత్రమే ముందంజలో ఉన్నాయి.మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన పుష్ప కమల్ దహాల్ నేతృత్వంలోని నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ రుకుమ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉంది. నేపాల్‌లో 17 సంవత్సరాల్లో 14 ప్రభుత్వాలు మారాయి. రాజకీయ అస్థిరత ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. నేపాల్‌లో 1.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సుమారు 60 శాతం మంది గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 65 పార్టీల నుంచి 3,400కి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు.నేపాల్ ఎన్నికల ఫలితాలపై భారత్ దృష్టి నేపాల్ ఎన్నికల ఫలితాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఇటీవల నేపాల్‌లో శాంతి, పురోగతి, స్థిరత్వానికి భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని తెలిపారు. సత్సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా నేపాల్ కొత్త ప్రభుత్వంతో పని చేయాలని ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు. నేపాల్ ఎన్నికలకు భారత్ లాజిస్టిక్ సరఫరాలు కూడా చేసింది. -
నేపాల్‌లో నేడే పోలింగ్
కఠ్మాండు: నేపాల్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. జెన్ జెడ్ యువత ఆందోళనలతో గతేడాది కేపీ శర్మ ఓలి సార థ్యంలోని ప్రభుత్వం పడిపోయాక జరుగుతు న్న మొదటి ఎన్నికలివి. నేపాల్ పార్లమెంట్ ప్రతినిధుల సభలోని 275 స్థానాలకు గాను అర్హులైన 1.89 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. బరిలో 3,406 మంది అభ్యర్థులుండగా 165 సీట్లకు ప్రత్యక్ష ఓటింగ్, మిగతా 110 సీట్లకు నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. ఈ నెల 2వ తేదీ సోమవారం అర్ధరాత్రితో ప్రచార పర్వం ముగిసింది. గురువారం ఉదయం 7 మొదలుకానున్న పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. తాత్కాలిక ఎన్నికల ప్రధాన కమిషనర్ రాంప్రసాద్ భండారీ మీడియాతో మాట్లాడుతూ..ఓటింగ్ శాతం ఈ దఫా పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా, తాము చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో చెల్లని ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రక్రియ విజయవంతమయ్యేందుకు సహకారం అందించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆపద్దర్మ ప్రభుత్వంలోని హోం మంత్రి ఓం ప్రకాశ్ ఆర్యల్ కోరారు. 3.41 లక్షల భద్రతా సిబ్బందిపోలింగ్ సందర్భంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10,967 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల్లో మొత్తం 65 రాజకీయ పార్టీలు ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా పోటీ పడుతుండగా, ఇందులో 63 పార్టీలు నైష్పత్తిక ఓటింగ్ పద్ధతిలో పోటీ చేస్తున్నాయి. ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 80 వేల మంది ఆర్మీ సిబ్బంది, మరో 76 వేల మంది పోలీసులు, సాయుధ పోలీసులు 34 వేల మందిని వినియోగిస్తున్నారు. వీరుకాకుండా, తాత్కాలిక ఎన్నికల పోలీసులు 1.50 లక్షల మందిని రంగంలోకి దించుతున్నారు. ఎన్ని కల కోసం మొత్తం 3.41 లక్షల మంది సేవలను వాడుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.జెన్ జెడ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుఆశ్రిత పక్షపాతం, అవినీతికి వ్యతిరేకంగా రా జకీయ నాయకత్వంలో మార్పులు కోరుతూ గతేడాది సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో యువత సారథ్యంలో జరిగిన తీవ్ర నిరసనల ధాటికి కేపీ శర్మ ఓలి ప్రభుత్వం గద్దె దిగిపోవాల్సి వచ్చింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సారథ్యంలోని కమ్యూనిస్ట్‌పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మా ర్క్సిస్ట్ లెనినిస్ట్) సీపీఎన్–యూఎంఎల్, నేపా లీ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి అప్పట్లో పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజా రిటీ ఉంది. ఓలి దిగిపోవడంతో అధ్యక్షుడు పౌడెల్ పార్లమెంట్‌ను రద్దు చేసి, సుశీలా కర్కిను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు. యువత కోరిన విధంగా తాము అనేక మార్పు లను చేపట్టినట్లు పుష్ప కుమార్ దహల్ ‘ప్ర చండ’ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది. అయితే, పార్టీ నాయకత్వాన్ని మాత్రం మార్చలేదు. కేపీ శర్మ ఓలికి చెందిన సీపీఎన్–యూఎంఎల్ మాత్రం ఎలాంటి చర్య లను తీసుకోలేదు. మరోవైపు, రవి లామిచానే నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ ఎస్పీ), సీనియర్ నేత బాలేంద్ర షా, గగన్ థాపా నేతృత్వంలోని సంస్కరణలు కోరుకునే నేపాలీ కాంగ్రెస్ జెన్ జీ ఆకాంక్షలకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి. ఇంకా, కుల్మాన్ ఘీసింగ్ నేతృత్వంలోని ఉజ్యాలో నేపాల్ పార్టీ, మాజీ ధరణ్ మేయర్ హర్క సంపంగ్ నేతృత్వంలోని శ్రమ శక్తి పార్టీల ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంది. తాజా పరిస్థితుల్లో నేపాల్ రాజకీయాలు.. యథాతధ విధానాలను కొనసాగించాల నుకునే సంప్రదాయ పార్టీలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకునే పార్టీలనే రెండు వర్గాలుగా విడిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ప్రజలు సంప్రదాయ పార్టీలతో తీరుతో విసుగెత్తి పోయారని, మార్పును కోరుకుంటున్నారని చెబుతున్నారు.ఓలి, బాలేంద్ర షా ఢీ అంటే ఢీఆర్ఎస్పీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా కఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా(35)ను ప్రకటించగా నేపాలీ కాంగ్రెస్ గగన్ థాపాను బలపర్చింది. సీపీఎన్–యూఎంఎల్ మాత్రం 75 ఏళ్ల కేపీ శర్మ ఓలీనే మరోసారి ప్రధాని అభ్యర్థిగా ఎంచుకుంది. బాలేంద్ర షా, కేపీ శర్మ ఓలీలు కఠ్మాండులోని ఝాపా–5 నియోజకవర్గం నుంచి ముఖాముఖి తలపడుతున్నారు. ఈ సీటును ఓలి గతంలో ఆరుసార్లు గెలుచుకున్నారు. గట్టి పోటీ ఉండటంతో ఓలి దేశంలోని మిగతా ప్రాంతాల్లో ప్రచారానికి సైతం వెళ్లకుండా, నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అదే సమయంలో, కఠ్మాండుకు చెందిన నేపాలీ కాంగ్రెస్ నేత గగన్ థాపా ఈసారి మాథేస్ ప్రావిన్స్‌లోని థనుషా–4 సీటు నుంచి బరిలోకి దిగారు. గగన్ థాపా, బాలేంద్ర షాలు దేశంలోని మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణాదిన జరిగిన ఎన్నికల ర్యాలీల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీరి ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెబుతున్నారు.24 గంటల తర్వాతే ఫలితాలుదేశవ్యాప్తంగా పోలింగ్ బూత్‌ల నుంచి బ్యాలెట్ పెట్టెలను ఒక చోటికి తరలించేందుకు కనీసం ఒక రోజు పడుతుందని, ఆ తర్వాత 24 గంటల్లోగా 165 స్థానాల ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మిగతా 110 సీట్లకు నైష్పత్తిక ప్రాతినిథ్య విధానంలో ఓట్ల లెక్కింపునకు మరో రెండు మూడు రోజులు పట్టవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాం ప్రసాద్ భండారి చెప్పారు. -
జెన్ జీ పిల్లలూ మన పిల్లలే..!
జెన్ జీ పిల్లలు ఏ వర్గం వారైనా ఇంటర్నెట్ లేని ప్రపంచం వాళ్ళకి తెలీదు. జెన్ జీ పిల్లలకి పది పన్నెండు యేళ్ళు వచ్చే సరికి ఫ్రీ మొబైల్ డేటా అందుబాటు లోకి వచ్చింది. దాని వల్ల ప్రపంచం వారి మునివేళ్ళ మీద తారాడటం మొదలుపెట్టి వారి జీవితంలోకి రాని సమాచారం కుప్పలు తెప్పలుగా ప్రవహించింది. ప్రవహిస్తూనే ఉంది. సమాచారాన్ని జ్ఞానంగా భ్రమించే ఈ తరం పిల్లలు సైక్లో స్టయిల్ అంటే అదేదో హెయిర్ స్టైల్ అనుకుంటారు. 1983లో భోపాల్‌లో ఏం జరిగిందో, 1985లో కారంచేడులో ఏం జరిగిందో, 1992నాటి పరిస్థితులు ఏమిటో వీళ్ళకి కర్ణాకర్ణిగా కూడా తెలియదు. సోషల్ మీడియాకి విలువైన వినియోగదారులైన ఈ జెన్ జీ తరానికీ వారి కంటే ముందు తరానికీ మధ్య ఇంటర్నెట్ వినియోగం అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తోంది. జెన్ జీకి ముందుతరం వారికి సోషల్ మీడియా లేక΄ోయినా సామాజికంగా తెలియాల్సినవి తెలిశాయి. తెలియవలసిన పద్ధతిలో తెలిశాయి. జెన్ జీ ఇంటర్నెట్ వల్ల తెలుస్తున్నది తెలియవలసిన పద్ధతిలోనేనా అన్నది పెద్ద ప్రశ్న.ప్రభుత్వ ఉద్యోగం జీవితానికి ఇచ్చే భద్రత తెలియని జెన్ జీ తరం ఏ రంగంలో ఉద్యోగమైనా అవుట్ సోర్సింగ్‌తో మాత్రమే చేస్తూ పెర్మనెంట్‌గా పని చెయ్యడంలోని స్టెబిలిటీకి అపరిచితంగా ఉన్నారు. దాంతో ఉద్యోగం చెయ్యడానికి ఒక సంస్థ నుండి మరో సంస్థకి సునాయాసంగా మారి΄ోగలిగే మానసిక స్థితి జెన్ జీకి వచ్చింది. ఈ స్థితి జీవితంలో మిగిలిన ముఖ్యమైన జీవన విధానాల మీద ప్రభావం చూపిస్తోంది. ప్రేమ... పెళ్లి... పెళ్లి స్థానంలో సహజీవనం... సిట్యుయేషన్ షిప్... ఇలా పలు రకాలుగా స్త్రీ పురుష సంబంధాలు సాగుతున్నాయి. కాని వీరిలో పూర్వీకుల రక్తం ఉంది. ఆ రక్తం తరతరాలుగా కొనసాగుతూ వచ్చిన భావోద్వేగాలను, జీవన విలువలను ఇచ్చింది. అయితే వర్తమాన ధోరణికీ ఆ గతానికీ లంకె జెన్ జీకి కనిపించడం లేదు. దాంతో అన్ని అనుబంధాలు, జీవన మార్గాలలో మానసికంగా వస్తున్న ఘర్షణను అడ్రస్ చెయ్యటానికి, దానిని బెటర్‌గా అర్థం చేసుకోవటానికి జెన్ జీ తరం చాలెంజ్‌ని ఎదుర్కొంటోంది. ఈ స్థితిని దాటడానికి తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తమ చుట్టూ ఉండే పెద్ద వాళ్ళపై ఆధారపడి వారితో పంచుకోవడం కంటే మానసిక వైద్యులతోనో... థెరపిస్టులతోనో... కౌన్సెలింగ్ ఇచ్చే వారితోనో పంచుకోవడానికి... చర్చించటానికే ప్రాధాన్యమిస్తున్నారు. పెద్దల మీద కంటే ఈ నిపుణుల మీదే జెన్ జీకి ఎక్కువ నమ్మకం... విశ్వాసం. ఈ నమ్మకం, విశ్వాసం సంగతి తెలియక, అర్థం కాక తల్లిదండ్రులు, పెద్దలు, చుట్టూ ఉండేవారు మాత్రం ఈ జెన్ జీ తరం తమతో ఏదీ పంచుకోవడంలేదనే ఆదుర్దాకి లోనవుతుండటం చూస్తుంటాము. అలా ఆందోళన పడటం కంటే ఈతరం పిల్లల స్వభావం ఇదని అర్థం చేసుకుంటే వారిలోని ఈ ఆదుర్దా వారి ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపించకుండా ఉంటుంది. వ్యవస్థ మీద పెద్దగా ఆశలు పెట్టుకోని జెన్ జీ తరం వాళ్లు సోషల్ కాజెస్కి ఇన్వాల్వ్ అయినా, ఒక డీప్ పర్సనల్ లెవెల్ కమిట్మెంట్తో సోషల్ మూమెంట్స్‌తో ఇన్వాల్వ్ అయినా తమకి ఓ సోషల్ కాంటాక్ట్ వస్తుందనే హోప్‌తో ఆ మేరకు మాత్రమే పని చేస్తున్నారు. అంతర్జాలమే వాళ్ళ పుట్టిన ఊరు. వారి జగత్తు, ఉనికి అదే. వాళ్ళ ఉనికిని ముందుగా తల్లిదండ్రులు, పెద్దలు అర్థం చేసుకుంటే ఈ పిల్లలు మన పిల్లలే... గ్రహాంతరవాసులు కారని తెలుస్తుంది. ఒక రకంగా వాళ్ళకి మన కన్నా ఎన్నో ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కనిపించినా నిజానికి మన తరాలకు ఉన్న భరోసాలు ఏవీ వాళ్ళకు లేవు. వాళ్ళు చూసిన తల్లిదండ్రులు అందరూ నయా ఆర్థిక విధానాలలో ఎదిగి అనేక అభద్రతలతో సతమతమైన వాళ్ళే. వాళ్ల కాలంలో వాళ్లు చూస్తూ ఉన్న ‘మీ టూ’, ‘కోవిడ్’, ‘ఇఅఅ’, ‘ఎల్జీబీటీక్యూ మూవ్మెంట్స్’.... వీటిని గుర్తు పెట్టుకుంటే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది. జెన్ జీ ఆడపిల్లలు తమ గుర్తింపు ప్రేమ, పెళ్లిలో మాత్రం చూసుకోవడం లేదనేది సుస్పష్టం. తమలోని తెలివి, తాము అందుకోగల అవకాశాలు, ఆకాంక్షలు... వీటి ఆధారంగా తమకు ఏ గుర్తింపు దక్కగలదో దానినే కోరుకుంటున్నారు. ఇది కూడా అర్థం చేసుకుంటే వారి దారిలో పెద్దలు తమను తాము ఎక్కడి వరకు పరిమితం చేసుకోవాలో కూడా తెలుస్తుంది. మన పిల్లలను అందుకోవాల్సింది మనమే. కుప్పిలి పద్మ(చదవండి: టూత్‌పిక్‌తో టవర్ నిర్మించి రికార్డు సృష్టించాడు..!) -
లాస్ట్ మినిట్‌లో సెలవు రద్దు, జెన్ జెడ్ స్పందన వైరల్
చివరి క్షణంలో బాస్ సెలవు రద్దు చేయడంతో ఒక యువతి స్పందించిన తీరు నెట్టింట్ చర్చకు దారి తీసింది. తన జర్నీ ప్లాన్స్ గురించి ముందుగానే చెప్పినా, సరిగ్గా ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా సెలవు రద్దు చేశాడట మేనేజర్. దీనికి సంబంధించి జెన్‌జెడ్ యువతి ఒక వీడియోను సోషల్ మీడియాల పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. సిమ్రాన్ షేర్ చేసిన వివరాల ప్రకారం తాను సెలవు మీద వెళ్లాలనుకుంటున్నట్టు కొన్ని వారాల ముందుగానే మేనేజర్‌కు తెలిపింది. ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరం లేవనెత్తలేదు. కానీ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి సిద్ధమవు తున్నప్పుడు, అత్యవసర విస్తరణ అవసరం కారణంగా ఆమె సెలవు రద్దు చేసినట్టు సమాచారం ఇచ్చాడు మేనేజర్. దీంతో షాకైన ఆమె "ఐ డోంట్ కేర్" అని సమాధాన మిచ్చిందట. కార్యాలయంలో అత్యవసర పరిస్థితులు సంభవించవచ్చు, కానీ పర్సనల్ కమిట్మెంట్స్ను పదేపదే దెబ్బతీసేలా ఉండకూడదు కదా సిమ్రాన్ తెలిపారు. ఉద్యోగాన్ని శ్రద్దగా చేస్తాను. అలాగే తన జీవితాన్ని, ప్రయాణాన్ని ఆస్వాదిస్తాను. కానీ ఉద్యోగులు చివరి నిమిషంలో డిమాండ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని పేర్కొంది.Boss Cancels Leave At Last Moment, Gen Z Worker's "I Don't Care" Reply Goes Viral pic.twitter.com/GH2BZEm1K9— प्रेsident (@Desi_urbann) February 25, 2026నెటిజనుల స్పందనఈ వీడియో త్వరగా ఆన్లైన్లో దృష్టిని, మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఆమె వైఖరికి మద్దతు ఇచ్చారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై తీవ్ర చర్చ సాగింది. ఈ సంఘటన ఆమెను నిరాశకు గురిచేసిదని,ఇది కమ్యూనికేషన్ వైఫల్యంగా కొందరు పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల వ్యక్తిగత సమయం పట్ల గౌరవం లేకపోవడానికి నిదర్శమని కొందరు వ్యాఖ్యానించారు. మేనేజర్ సరైన బ్యాకప్‌ను ఏర్పాటు చేసుకొని, లీవ్ సంగతి స్పష్టంగా తెలియజేయాలని మరికొందరు పేర్కొన్నారు.అయితే, మరికొందరు సెలవు అధికారికంగా ఆమెదించారా? లేదా అని ప్రశ్నించగా, ఇలాంటి ప్రయాణాలప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ బాధ్యత ఉద్యోగిపై ఉందని ఒకరన్నారు. మొత్తం మీద ఈ వీడియో ఆఫీసు, అధికారుల ప్రవర్తనా తీరు, ఉద్యోగుల వృత్తిపరమైన జవాబుదారీతనం చుట్టూ పెరుగుతున్న ఆందోళనలను హైలైట్ చేసింది. ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త -
తొలి ఎంపిక బంగారమే.. సర్వేలో కీలక విషయాలు!
మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడి మార్గాలు ఎన్ని వచ్చినా.. యువత మాత్రం ఇప్పటికీ బంగారం పైనే గట్టి నమ్మకం పెట్టుకుంటున్నారు. దేశంలోని జనరేషన్ జెడ్ (జెన్ జీ), మిలీనియల్స్ పెట్టుబడుల ధోరణిపై స్మిట్టన్ పల్స్ ఏఐ నిర్వహించిన తాజా సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 5,000 మంది యువత (18-39 ఏళ్లు) అభిప్రాయాలను సేకరించిన ఈ నివేదిక ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా 62 శాతం మంది బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు.ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో సేవింగ్స్ అకౌంట్లు, ఈక్విటీల కంటే బంగారమే తమకు ధీమా ఇస్తుందని 65.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఒకవేళా రూ.25,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తే.. పెట్టుబడి మొత్తాన్ని కింది విధంగా విభజించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.➤బంగారం: 61.9 శాతం➤మ్యూచువల్ ఫండ్లు: 16.6 శాతం➤ఫిక్స్డ్ డిపాజిట్లు: 13 శాతం➤స్టాక్ మార్కెట్: 6.6 శాతం➤క్రిప్టో కరెన్సీ: 1.9 శాతంగతంలో బంగారం కొనుగోలు అంటే.. కుటుంబం అంతా కలిసి తీసుకునే పెద్ద నిర్ణయంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 66.7 శాతం కొనుగోళ్లు పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగానే జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల ప్రమేయం తగ్గుతోంది. 61.9 శాతం మంది తాము చేసిన ఇటీవలి కొనుగోలు 5 గ్రాముల లోపే ఉందని తెలిపారు. అందులో 27.5 శాతం మంది 2 గ్రాముల కంటే తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేశారు. జెడ్ జీ యువత తమ మొదటి జీతం (24.3 శాతం) అందగానే గోల్డ్ కొనుగోలు చేయాలని భావిస్తారు.డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు కూడా యువత ప్రాధాన్యత ఇస్తోంది. పెద్ద గోల్డ్ బ్రాండెడ్ షోరూమ్‌లలో 38.3%, స్థానిక జ్యువెలరీ దుకాణాలలో 34.7 శాతం, ఆన్లైన్/యాప్స్ ద్వారా బంగారం కొనుగోలు చేసేందుకు 5.2 శాతం యువత ఆసక్తిగా చూపుతున్నారు.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?బంగారం కొంటున్నారు. కానీ కొనేటప్పుడు ప్రధానంగా ప్యూరిటీ విషయంలో 49.4 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మేకింగ్ ఛార్జీలు (21 శాతం), రీసేల్ వాల్యూ (17 శాతం)పై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొన్న తర్వాత 67.1 శాతం మంది ఏదో ఒక సమయంలో బాధపడినట్లు సర్వేలో వెల్లడయ్యాయి.కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బంగారంపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రాబోయే 12 నుంచి 24 నెలల్లో కచ్చితంగా బంగారం కొంటామని 52.7 శాతం మంది యువత ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ పెట్టుబడిగా కాకుండా.. క్రమ పద్ధతిలో, చిన్న మొత్తాల్లో బంగారం కొనుగోలు చేయడమే ట్రెండ్ అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. -
జీవితం పూలపాన్పు కాదు
న్యూఢిల్లీ: జీవితం అనేది ఎత్తుపల్లాల్లేకుండా సరళరేఖలా ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని యువ ఎన్ఐఆర్ విద్యార్థులతో వీడియో ద్వారా రాహుల్ సంభాషించారు. ఆ సంభాషణ తాలూకు వివరాలను రాహుల్ తన యూట్యూబ్ ఖాతాలో ఆదివారం పోస్ట్‌చేశారు. ‘‘ వాస్తవిక ప్రశ్నలు, నిజాయతీ అయిన సమాధానాలు. ఇందులో ఎలాంటి వడబోతలు లేవు. నేటి యువత గుర్తింపు సమస్యతోపాటు ఒత్తిడిని బాగా ఎదుర్కొంటోంది. జెన్ జెడ్ యువత తమ ఇష్టాయిష్టాలను, వృత్తిజీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో తెలీక సతమతమవుతోంది. స్వేచ్ఛగా ఆలోచించడానికి తమ భావాలను వ్యక్తపర్చడానికి యువత ఇబ్బందిపడుతోంది. కొత్త విషయాలను తెల్సుకోవడం మొదలలు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఒక నిర్ణయం నుంచి ఎలా బయటపడాలి అనే సమస్యలూ జెన్‌జెడ్‌ను చుట్టుముట్టాయి. తమకు తమకు నమ్మకం లేక ఎలా ఇబ్బందులపాలవుతున్నారో, అభద్రతా భావంతో కుంగిపోతున్నారో వాళ్లు నాతో చెప్పారు. ఇబ్బందులు పడే జెన్‌జెడ్‌కు నేనిచ్చే సందేశం ఒక్కటే. సమయానుకూలంగా వ్యవహరిస్తూ దృఢచిత్తంతో పోరాడాలి. అన్నింటినీ ఎదుర్కోవాలి’’ అని సూచించారు. -
తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారా..!?
చాలామంది తరుచుగా ఉద్యోగాలు మారుతుంటారు. ముఖ్యంగా 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువత తరుచుగా జాబ్‌లు మారుతుంటారు. దాంతో చాలామంది ఈ ఉద్యోగంలోనైన ఎన్నాళ్లు ఉంటాడో అని విమర్శిస్తుంటారు. అయితే ఇలా విమర్శించడాన్ని తప్పుపడుతున్నారు పీపుల్ గ్రూప్ అండ్ షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు , సీఈవో అనుపమ్ మిట్లల్. ఇలా మారడాన్ని ఆయన సరైన స్ట్రాటజీగా అభివర్ణించారు కూడా. పైగా యువత సరిగ్గానే చేస్తుందని కితాబిచ్చేస్తున్నారు కూడా. చాలామంది నిపుణులు కూడా ఎక్కడ స్థిరంగా పనిచేయకపోతే అనుభవం ఎలా వస్తుందంటూ..ఉద్యోగాలు మారుతుండే వాళ్లని తిడుతుంటారు. కానీ మిట్టల్ మాత్రం ఇది సరైనదే అంటున్నారు. మరి అది ఏవిధంగానో ఆయన మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!జెన్‌జెడ్ తరుచుగా ఉద్యోగాలను మార్చడంపై సీఈవో అనుమపమ్ మిట్టల్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ..ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. జెన్‌జెడ్ తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారని కెరీర్ నిపుణులు తప్పుపడుతుంటారు. కానీ దీన్ని డేటింగ్‌లా తీసుకోండి అంటున్నారు అనుపమ్. స్థిరంగా ఒక చోట ఉద్యోగం చేయడాన్ని వివాహంగా భావిస్తే..ఈ తరం యువత తమకు నచ్చిన రంగంలో అభిరుచి వెతుక్కుంటూ చేస్తున్న అన్వేషణే ఇది అని అంటున్నారాయన. ఇలా ఉద్యోగాలు మారుతు తమకు నచ్చిన రంగాన్ని వెతుక్కుంటున్నారని అన్నారు. ఈ యువ నిపుణుల తమకు ఏ రంగాలు, ఎందులో తాము సరిపోతామో అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఇది అని అంటున్నారు. దీన్ని నమ్మకద్రోహం కిందకు చూడొద్దని, ఆత్మపరిశీలనకు సంబంధించిన అన్వేషణగా అభివర్ణించారాయన. చాలామంది కెరీర్ నిపుణులు దీన్ని తప్పుగా చూస్తున్నారు గానీ.. యువత సరిగ్గా చేయాల్సింది ఇదే కదా అన్నారు. నిజానికి జెన్‌జెడ్‌లో చాలామంది కెరీర్ ప్రారంభదశలో ఉన్న నిపుణులే. ఈ తరం ఒత్తిడి కంటే మానసిక శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తోంది. పైగా వాళ్లు కార్పోరేట్ నిచ్చెన ఎక్కడం కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై దృష్టి పెడతారని పలు సర్వేలు కూడా పేర్కొన్నాయని గుర్తుచేశారు. అందువల్ల ఈ తరం చేస్తుంది ముమ్మాటికి కరెక్టేనని అన్నారు. అంతేగాదు 21-24 ఏళ్ల మధ్య ఉద్యోగాలు మారడం సరైనదేనని, 25 ఏళ్ల తర్వాత మాత్రం స్థిరంగా ఒకచోట పనిచేయాలని అనుపమ్ సూచించారు. అంతేగాదు ఉద్యోగం మారాక, దాని గురించి ఆలోచించకండి, చింతికండి అని చెబుతున్నారు అనుపమ్. తాను టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడూ..ఉద్యోగాల నియామక ప్రక్రియలో చాలా క్లియర్‌గా ఉండేవాడినని, అభ్యర్థికి కనీసం 4 నుంచి 5 ఏళ్లు అనుభవం లేకపోతే నిర్థాక్షిణ్యంగా రిజెక్ట్ చేసేవాడినని అన్నారు. అలాగే ఇలా ఉద్యోగాలు మారడం వల్ల కొత్తదనం తెలియడమే కాకుండా, దాని పర్యవసానాలపై అవగాహన, అనుభవం ఏర్పడుతుందని కూడా నొక్కి చెప్పారు. ఈ పోస్ట్ చాలామంది యువతను ఆకర్షించడమే గాక మాకు ఇది సరైన మార్గనిర్దేశం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..) -
యువతను రెచ్చగొట్టారు
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని కేంద్రం ఆరోపించింది. పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్‌లలో మాదిరిగా జెన్ జెడ్ నిరసనలకు పిలుపునిచ్చారని పేర్కొంది. తన నిజ స్వరూపం బయటపడకుండా ఉండేందుకు గాను ఆయన మహాత్మాగాంధీ ప్రసంగాలను ఉపయోగించుకున్నారని తెలిపింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద వాంగ్చుక్ను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ అరవింద్ కమార్, జస్టిస్ పీవీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేసిన వ్యక్తులను ఎలాంటి విచారణ లేకుండా గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధించే హక్కు అధికారులకు ఉంటుంది. కేంద్రం, లద్దాక్ యంత్రాంగం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేంద్రాన్ని వాళ్లు అని, లద్దాఖ్ ప్రజలను మనం అని వేరుగా చూపిస్తూ మాట్లాడారని వాంగ్‌చుక్ ప్రసంగించే వారని ఆయన పేర్కొన్నారు. గతంలో జమ్మూ కశీ్మర్లో వచ్చినట్లుగా ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం చేపట్టాలంటూ డిమాండ్ చేశారన్నారు. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు కలిగిన లద్దాఖ్ ప్రాంతం అత్యంత సున్నితమైందన్న మెహతా..అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ వాంగ్‌చుక్ చేసిన ప్రసంగాలను తప్పనిసరిగా గణనలోకి తీసుకోవాలని కోరారు. ‘ప్రసంగాల వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే జిల్లా మేజిస్ట్రేట్ వాంగ్‌చుక్ నిర్బంధానికి ఆదేశాలు జారీ చేశారు. మేజి్రస్టేట్ ఆదేశాల మేరకు డీఐజీ స్థాయి అధికారి ముందుగా వాంగ్‌చుక్ వద్దకు వెళ్లి ఆయన ప్రసంగాల వీడియోలను, ఇతర ఆధారాలను చూపారు. నిర్బంధంలోకి తీసుకునేందుకు గల కారణాలను వివరించారు’అని ధర్మాసనానికి మెహతా తెలిపారు. మేజి్రస్టేట్ కృత్రిమ ఆధారాలతోనే వాంగ్చుక్ను నిర్బంధించాలంటూ ఆదేశాలు జారీ చేశారన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. వాంగ్‌చుక్ చేసిన ప్రసంగాలను విన్న అధికారులు, ఆ వీడియోలను తయారు చేసి మేజి్రస్టేట్ ముందుంచారని వివరించారు. మంగళవారం కూడా ఈ కేసులో వాదనలు కొనసాగనున్నాయి. జోథ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న వాంగ్‌చుక్ అరబ్ దేశాల్లో మాదిరిగా తిరుగుబాటును లేవదీసేందుకు ప్రయత్నించినట్లు తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ జనవరి 29వ తేదీన ఒక ప్రకటన వెలువరించారు. ప్రభుత్వాన్ని విమర్శించే, నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కు తనకుందని అందులో పేర్కొన్నారు. కొన్ని ఎంపిక చేసిన వీడియోలను చూపు తూ అధికారులు వాంగ్‌చుక్ నిర్బంధాన్ని సమరి్థంచుకుంటున్నారంటూ ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. వాంగ్‌చుక్ నిర్బంధం చట్ట విరుద్ధం, ఏకపక్ష చర్య..ఆయన ప్రాథమిక హక్కులకు భంగకరమని గీతాంజలి అంగ్మో ఆరోపిస్తున్నారు. లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ప్రకటించాలంటూ గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన నిరసనల్లో నలుగురు చనిపోగా, 90 మంది వరకు గాయపడ్డారు. అల్లర్లకు వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని ఆరోపిస్తూ రెండు రోజుల తర్వాత అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద ఆయన్ను నిర్బంధంలోకి తీసుకోవడం తెల్సిందే. -
జెన్జీలు ఇంత మంచోళ్ళు ఏంట్రా!?
జెన్‌జీ అనగానే చాలామందికి రకరకాల అపోహలు. సక్రమంగా పనిచేయరని, ఏ విషయానికీ శ్రద్ధ చూపరని, బాధ్యతగా ఉండరని… ఇలా ఇంటా బయటా వారిమీద ఓ అవవాదు ఉంది. కానీ తాజాగా వెలువడిన ఒక నివేదిక మాత్రం ఈ అపోహలను చెరిపేసింది. ‘జెన్జీలు ఇంత మంచోళ్ళు ఏంట్రా!’ అని అనిపించేలా ఆ నివేదికలో వివరాలు బయటపడ్డాయి. ఏంటా నివేదిక? ఆ నివేదికలో ఏముంది?బార్, రెస్టారెంట్, హౌస్ పార్టీ – ఏ సందర్భమైనా మద్యం తప్పనిసరి అన్న భావన ఉండేది. కానీ తాజాగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జెన్జీలు మద్యం వినియోగానికి దూరంగా ఉంటున్నారని తేలింది. బీర్, వైన్, స్పిరిట్స్ వంటి పానీయాలను వీరు పెద్దగా పట్టించుకోవడం లేదు. యువతలో మద్యం వినియోగం తగ్గుతుండగా, ఆరోగ్యంపై శ్రద్ధ, మితంగా జీవించడం, జీరో-అల్కహాల్ పానీయాలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగ ధోరణులు మారుతున్నాయి.అమెరికాలో గ్యాలప్ సర్వే ప్రకారం 18-34 ఏళ్ల వయసు గల యువతలో మద్యం తాగే వారి శాతం గత రెండు దశాబ్దాల్లో తగ్గింది. 2000ల ప్రారంభంలో 72 శాతం మంది తాగుతుండగా, ఇటీవల అది 62 శాతానికి పడిపోయింది. మిల్లెనియల్స్తో పోలిస్తే జెన్‌జీ తరం సుమారు 20 శాతం తక్కువగా మద్యం సేవిస్తోంది. మరో సర్వే ప్రకారం 21.5 శాతం మంది జెన్జీలు అసలు మద్యం తాగరని, 39 శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే తాగుతారని తేలింది. ఎందుకు తగ్గిస్తున్నారు?మద్యం వల్ల నిద్రలేమి, ఆందోళన, హ్యాంగోవర్ వంటి సమస్యలు వస్తాయని యువత స్పష్టంగా గుర్తిస్తోంది. ఫిట్నెస్, మైండ్‌ఫుల్‌నెస్, మానసిక స్థైర్యం కోసం మద్యం దూరం చేస్తున్నారు.సామాజిక ప్రభావం: సోషల్ మీడియా యుగంలో ప్రతి నిర్ణయం బహిరంగంగా కనిపిస్తోంది. అందుకే మద్యం తాగకపోవడం కూడా ఒక సామాజిక సందేశంగా మారింది. ‘సోబర్ క్యూయిరియస్’ ఉద్యమాలు, మద్యం లేని సమావేశాలు, వెల్నెస్ ఈవెంట్లు యువత సంస్కృతిలో భాగమయ్యాయి.ఆర్థిక కారణాలు: పెరుగుతున్న జీవన ఖర్చులు, విద్యా రుణాలు, గృహ వ్యయాలు. ఇవన్నీ మద్యం వినియోగాన్ని తగ్గించేలా ప్రభావం చూపుతున్నాయి. ఖరీదైన నైట్‌లైఫ్ కన్నా ఇంట్లో సమావేశాలు, నాన్-అల్కహాలిక్ పానీయాలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు.తాగుతున్నవారు కూడా..జెన్‌జీ తరం పూర్తిగా మద్యం మానేసిందని కాదు. తాగుతున్నవారు కూడా పూర్వతరాలతో పోలిస్తే భిన్నంగా తాగుతున్నారు. తక్కువ సార్లు, తక్కువ పరిమాణంలో, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తాగుతున్నారు. అలాగే లో-అల్కహాల్, నాన్-అల్కహాలిక్, ఫ్లేవర్డ్ పానీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఆహార, అతిథ్య రంగంపై ప్రభావంఈ మార్పు రెస్టారెంట్లు, బార్లు, బ్రాండ్లను కొత్త దారిలో నడిపిస్తోంది. మాక్టెయిల్స్, లో-అల్కహాల్ డ్రింక్స్, ప్రీమియం నాన్-అల్కహాలిక్ పానీయాలు ఇప్పుడు మెనూలో ప్రధాన స్థానాన్ని పొందుతున్నాయి. పానీయాల కంపెనీలు కొత్తగా లో-అల్కహాల్, నాన్-అల్కహాలిక్ విభాగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.జెన్‌జీ తరం మద్యం వినియోగాన్ని పూర్తిగా తిరస్కరించడం కాదు, దాని పాత్రను తిరిగి నిర్వచిస్తోంది. ఆరోగ్య ప్రాధాన్యత, ఆర్థిక వాస్తవాలు, సామాజిక మార్పులు – ఇవన్నీ కలిపి ఈ తరాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయి. సంప్రదాయాలను ప్రశ్నించే, అలవాట్లకన్నా ఉద్దేశ్యాన్ని విలువ చేసే తరం ఇది. -
టాలీవుడ్‌ను కాపాడుతున్న 'Gen Z' కిడ్స్
భారతదేశంలోని మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడిన సంస్థ MAI.. ఈ సంస్థ ఎప్పటికప్పుడు థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను క్రోడీకరిస్తుంది. గత 5ఏళ్లలో వచ్చిన మార్పులను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంది. వారు ఇప్పటికే అందించిన నివేదిక ప్రకారం కోవిడ్ తర్వాత 2020–2022 మధ్య థియేటర్‌కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. కానీ, 2023–2025లో పెద్ద సినిమాల కారణంగా మళ్లీ పెరుగుదల కనిపించిందని పేర్కొంది.ముఖ్యంగా 2025లో Gen Z (13–29 ఏళ్ల వయసు) ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లే వారి సంఖ్య 25% పెరిగింది. వారు సగటున సంవత్సరానికి 6 సార్లు థియేటర్‌కి వెళ్లారని లెక్కలు చెబుతున్నాయి. అయితే, 30 ఏళ్లకు పైబడిన వారి సంఖ్యతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఏకంగా 41 శాతం వరకు థియేటర్‌వైపు వెల్లడంలేదని తేల్చిచెప్పింది. 2019 వరకు ప్రతి ఏడాది థియేటర్లలో సినిమాలు చూసిన ప్రేక్షకుల సంఖ్య సుమారు 150 కోట్ల వరకు ఉంది. అయితే, 2024కు వచ్చేసరికి కేవలం రూ. 86 కోట్లకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సినిమా టికెట్ ధరలతో పాటు క్యాంటీన్ రేట్ల కారణంగా థియేటర్‌వైపు వెళ్లాలని ఉన్నప్పటికీ సామాన్యులు దడుసుకుంటున్నారు. దీంతో కొన్ని థియేటర్స్ మూతపడుతున్నాయి. ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ అవసరం తగ్గింది.థియేటర్స్‌కు ప్రేక్షకులు వెళ్లడం తగ్గించడంతో కలెక్షన్స్‌పై ఆ ప్రభావం పడుతుంది. గత ఐదేళ్లగా భారతీయ సినిమాలన్నీ సాధించిన వసూళ్లులో పెద్దగా మార్పు లేదు. దేశవ్యాప్తంగా 2019లో రూ. 19వేల కోట్లు వస్తే.. 2024లో రూ. 18వేల కోట్లు, 2025లో రూ. 14వేల కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. 41శాతం ప్రేక్షకులు తగ్గినప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం టికెట్ రేట్ల పెంపు అని చెప్పవచ్చు. 2025లో సినిమా టికెట్ ధరల పెంపు గణనీయంగా పెరిగింది. అదే సమయంలో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా Gen Z (13–29 ఏళ్ల వయసు) వారే థియేటర్‌కు వెళ్తున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. గతేడాదిలో హిందీ పరిశ్రమ కాస్త మెరుగ్గానే ఉంది. హిందీ పరిశ్రమ నుంచి గతేడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ, టాలీవుడ్ పాతాళానికి పడిపోయింది. తెలుగులో 274 సినిమాలు తీస్తే రూ. 2500 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ 290 సినిమాలకు గాను రూ. 1,533 కోట్ల గ్రాస్‌తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి. కలెక్షన్స్‌తో పాటు ఓటీటీ వంటి వాటితో నిర్మాతలు కాస్త బయటపడుతున్నారు. లేదంటే కోట్ల రూపాయలు నష్టం భరించాల్సి వచ్చేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా టాలీవుడ్లో ఈ ఏడాది నుంచి మరింత కఠనంగా పరిస్థితిలు ఉండే ఛాన్స్ ఉంది. -
మన జెన్ జెడ్‌లో పుష్కలంగా సృజన
న్యూఢిల్లీ: భారతీయ జెన్ జెడ్ యువతరంలో సృజనాత్మకత పుష్కలంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2047 ఏడాదికల్లా భారత్‌ను అభివృద్ధిచెందిన దేశంగా వికసిత్ భారత్‌గా అవతరింపజేసుకునేందుకు యువత తమ వంతుగా అందించే వినూత్న, సృజనాత్మక ఆలోచనల వేదికగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్(బీవీవైఎల్‌డీ)ను మోదీ ప్రభుత్వం తీర్చిదిద్దింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 12వ తేదీన బీవీవైఎల్‌డీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో వీబీఐఎల్డీ ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ ఏటా స్వామి వివేకానంద గౌరవార్థం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన స్ఫూర్తితో వీబీవైఎల్డీని స్థాపించాం. యువతను దృష్టిలో ఉంచుకుని పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చాం. అంకురసంస్థల విప్లవాన్ని ఆశిస్తున్నాం. ఇప్పుడు సృజనాత్మక ఆలోచనలు, శక్తి, సదుద్దేశాలతో మన యువశక్తి ఇప్పుడు దేశ నిర్మాణంలో ముందు వరసలో నిలబడింది. సృజనాత్మక ఆలోచనలు, సమా చారం, సంస్కృతిలతో ఆరెంజ్ ఎకానమీ గణనీయమైన వృద్ధిపథంలో పయనిస్తోంది. గత దశాబ్దకాలంగా చేపట్టిన పలు సంస్కరణలతో ఇప్పుడు ఏకంగా సంస్కరణ ఎక్స్‌ప్రెస్ దూసుకుపోతోంది. ఈ సంస్కరణల కేంద్ర బిందువు మన యువతలోనే దాగి ఉంది’’ అని మోదీ అన్నారు. జనవరి 9వ నుంచి 12వ తేదీదాకా బీవీవైఎల్‌డీ కొనసాగింది. దేశవ్యాప్తంగా పలు స్థాయిల్లో 50 లక్షల మందికిపైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంది. -
పద పదా.. భారత Gen Zలో పెరుగుతున్న ట్రెండ్
భారతదేశంలోని జెన్ జీ (Gen Z) నవ యువతలో సంగీతం ప్రాధాన్యత పెరుగుతోంది. ట్రావెల్ టెక్ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) విడుదల చేసిన తాజా అధ్యయనం పలు ఆసక్తి వివరాలు తెలియజేస్తోంది. సంగీత కచేరీలు, మ్యూజిక్ ఫెస్టివల్స్ యువయాత్రలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రేరేపిస్తున్నాయి.ఎయిర్‌బీఎన్‌బీ ‘ఎక్స్పీరియన్స్-లెడ్ ట్రావెల్ ఇన్సైట్స్’ రిపోర్ట్ ప్రకారం, 2026లో 62% యువ భారతీయులు కచేరీలు, సంగీత ఫెస్టివల్స్ కోసం ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారు. ఇది సంప్రదాయ విహారం కోసం చేసే యాత్రల నుండి సాంస్కృతిక అనుభవాల ఆధారిత యాత్రల వైపు మార్పును సూచిస్తుంది. ఇప్పటికే 76% మంది జెన్ జీ ప్రతినిధులు.. సంగీత కార్యక్రమం కోసమే తాము ఓ కొత్త నగరాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు.ఈవెంట్ ముగిసినా..ఇలా మ్యూజిక్ ఈవెంట్ల కోసం వెళ్లినవారు ఆ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఈవెంట్ అయిపోయాక కూడా అక్కడే ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలను మరింతగా అన్వేషిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 53% మంది ఇలాగే స్థానిక ప్రాంతాలు, కాఫీ షాపులు, నైట్‌లైఫ్, సాంస్కృతిక హాట్స్పాట్లను చూడటం కోసం తమ వసతిని మరికొన్ని రోజులు కొనసాగించారు.విదేశాలకూ వెళ్తాం..ఈ సంగీత ఆధారిత యాత్రలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. 40% కి పైగా జెన్ జీ ప్రతినిధులు అంతర్జాతీయంగా జరిగే మ్యూజిక్ ఈవెంట్ల కోసం ముఖ్యంగా అమెరికా, యూరోప్, ఆసియా దేశాలకు కూడా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 70% మంది ఫ్రెండ్స్ తో సమూహంలో ఈ ఈవెంట్లలో పాల్గొనడాన్ని ఇష్టపడుతున్నారు. గ్రూప్ స్టేలకు డిమాండ్‌ను పెంచుతోంది.ఖర్చు లెక్కేం లేదు..ఇలా మ్యూజిక్ ట్రిప్‌లకు వెళ్లడం కోసం ఖర్చుకు కూడా వెనకాడటం లేదు భారత జెన్‌జీ యువత. ప్రతి పది మందిలో ఆరుగురు యువ యాత్రికులు తమ నెలవారీ ఆదాయంలో 21–40% మ్యూజిక్ కన్సర్ట్ -ఆధారిత ట్రిప్లపైనే ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కో సంగీత కార్యక్రమ ప్రయాణానికి చేసే సగటు ఖర్చు రూ.51 వేల దాకా ఉంటోంది.ఇదీ చదవండి: ఇవేం ధరలు బాబోయ్.. హ్యాట్రిక్ కొట్టేసిన పసిడి, వెండి -
బలగాల ప్రయోగంపై కేపీ ఓలీకి సమన్లు!
కాఠ్మండు: గత ఏడాది సెప్టెంబర్‌లో నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో యువత పైకి సాయుధబలగాలను ప్రయోగించి నాటి ప్రధాని కేపీ శర్మ ఓలీ అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ కమిషన్ త్వరలో ఆయనను విచారించనుంది. జనవరి 21వ తేదీలోగా నివేదిక సమర్పింంచాల్సి ఉండటంతో ఆలోపు నిర్ణయాత్మకమైన నేతలు, అధికారుల నుంచి కమిషన్ సభ్యులు వివరణ తీసుకోనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన కాఠ్మండులో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ చేపట్టిన యువతపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లో అవినీతి, వారసత్వ రాజకీయాలు, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన జనం జెన్–జెడ్ యువతరం సారథ్యంలో ఉద్యమించడంతో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో దేశవ్యాప్తంగా ఆనాడు 77 మంది చనిపోయిన విషయం తెల్సిందే. దీంతో నేపాల్ తాత్కాలిక ప్రభుత్వం నియమించిన గౌరీ బహదూర్ కర్కీ సారథ్యంలోని విచారణ కమిషన్ దర్యాప్తు మొదలెట్టింది. కర్కీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఘటనలో స్పష్టత కోసం ఓలీకి సమన్లు జారీచేసి ప్రశ్నించే అవకాశముందని చెప్పారు. అయితే కమిషన్ ఎదుట తాను హాజరయ్యే ప్రసక్తే లేదని కేపీ శర్మ ఓలీ కరాఖండీగా చెప్పేశారు. కమిషన్ చట్టబద్ధతను, విచారణలో పారదర్శకతను ఆయన ప్రశ్నించారు. -
జెన్ జడ్ గురించి మీకు తెలుసా?
జెన్ జడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన... ఈ సాంకేతికను అలవర్చుకున్న... చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్‌నే జెన్‌జడ్ అని... అంటే జనరేషన్ జడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా... కొత్త ఆలోచనలు... దానికి మించి... ఆన్లైన్ సాంకేతికత... అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్ జడ్. ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్ జడ్ తీరు గురించి మనో వైజ్ఞానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్ చేద్దాం.జన్ జడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్..., "ఐ జనరేషన్"...., "డిజిటల్ స్థానికులు".... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్‌జడ్‌లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు. దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.... పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్ జడ్ లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్ వెదకటం, చాట్ జీపీటీని అడగం.... లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే... దీంతో వారి మనస్సులు... వారి సామాజిక స్పృహ... ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు. జన్జడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం... కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా... ఎక్కువగా ఆలోచిస్తారు... చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం... దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Z లో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం... సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం... ఇ-కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్లు, స్టార్టప్‌లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు. జెన్ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.... భయం లేకుండా ప్రవర్తించడం... కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని... లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తారు. జెన్ జడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు... భావోద్వేగాలకు తావు లేకుండా... బాధను వ్యక్తీకరించడం... ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.... సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా... వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.ఆన్ లైన్లో చర్చల ద్వరా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు... ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన... చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు... వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్పోజర్... అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం... ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు... కలిగి ఉంటారు. కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ... బలహీనత కాదు... అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.... గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి... కానీ జెన్‌జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.... తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్‌జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు. -
ఫొటో 2025
వేయి వాక్యాల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటో పట్టిచూపుతుందని ఒక విశ్లేషణ. అలా 2025 ఏడాదిలో విశ్వవ్యాప్తంగా పలు ఘటనలు చరిత్రలో నిలిచిపోయాయి.సమాజంపై ప్రభావితంచూపిన, చర్చనీయాంశమైన చిత్రాలివి..పెళ్లయి కాళ్లకు పారాణి కూడా ఆరకముందే ఉగ్రవాదుల పైశాచికకాండలో భర్తను కోల్పోయి అతని మృతదేహం వద్ద నిశ్చేష్టురాలై కూలబడిన నవ వధువు ఫొటో ఇది. పెళ్లయిన ఆరు రోజులకే నూరేళ్లు నిండిపోయిన భారత నావికాదళాధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోగా కాపాడండి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరచి అలసిపోయిన భార్య హిమాన్షీ ఫొటో ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాలో ప్రచురితమైంది. ఏప్రిల్ 22వ తేదీ జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం పరిధిలోని బైసారన్ పచ్చికబయళ్లలో అమాయక పర్యాటకులపై ఉగ్రమూకలు దాడిచేయడం, అందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేయడం తెల్సిందే.అగ్రరాజ్యాధినేత అధికారి నివాసం వైట్‌హౌస్ ఒక్కసారిగా రచ్చబండగా మారిన అరుదైన క్షణం తాలూకు ఫొటో ఇది. మాట్లాడుకుందాం అంటూ ఆహా్వనించి మీడియా ప్రతినిధుల ఎదుట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్కువచేసి మాట్లాడటం, దానికి జెలెన్స్కీ దీటుగా బదులివ్వడం, చివరకు ద్వైపాక్షిక భేటీ వాగ్వాదాలమయంగా మారడం తెల్సిందే. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఈ వాగ్వాదాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో ప్రపంచదేశాలన్నీ చూశాయి. అతిథిని అవమానించిన ట్రంప్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం గాల్లోకి లేచిన 32 సెకన్లకే ఎదురుగా ఉన్న వైద్యకళాశాల భవనంపై కుప్పకూలిన అత్యంత విషాధ ఘటన తాలూకు ఫొటో ఇది. 12 మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలి అగ్నిగుండంగా మారి బూడిదైంది. ఈ ఘటనలో ఒక్కరే బతికి బయటపడ్డారు. విమానంలో సాంకేతిక లోపమా? పైలట్ తప్పిదమా అనేది మిస్టరీగా మారింది. దేశీయ విమానయాన రంగ భద్రతపైనా ఈ దుర్ఘటన నీలినీడలు కమ్మేలా చేసింది.వేగంగా మండే స్వభావమున్న వెదురు కర్రలు, స్టీరోఫోమ్ కిటికీలను నెలలతరబడి మరమ్మతుల కోసం వినియోగించడంతో అనుకోకుండా అంటుకున్న నిప్పురవ్వలు చివరకు హాంకాంగ్‌లోని ప్రముఖ వాంగ్‌ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ బహుళ అంతస్తుల భవనాలను నిలువునా బూడిదచేసిన దారుణోదంతం ఫొటో ఇది. ఈ ఘటనలో ఏకంగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదం తర్వాత హాంకాంగ్‌లో వెదురు కర్రలు, స్టీరోఫోమ్ వినియోగంపై పెద్ద చర్చే మొదలైంది. అవినీతి, వారసత్వ రాజకీయాలు, నేతల విలాసవంత జీవితం, అసమర్థ, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన నేపాల్ యువత ఉవ్వెత్తున నిరసనోద్యమంగా ఎగసిపడిన క్షణం నాటి ఫొటో ఇది. జెన్ జెడ్ ఉద్యమంగా నేపాల్ ప్రధాన నగరాల్లో వేలాదిగా బారులుతీసిన విద్యార్థులు ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోశారు. ఈ దెబ్బకు సెపె్టంబర్ 9న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, కేబినెట్ మంత్రులు పదవులకు రాజీనామాచేసి సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం తెల్సిందే. వారం తిరిగేలోపే మాజీ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి సుశీల కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.గాజాపై నెలల తరబడి వేల కొద్దీ బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండటంతో ఇళ్లు, ఆస్పత్రులు సహా ప్రతి కట్టడం కుప్పకూలడంతో నిలువనీడలేక, తినడానికి తిండిలేక, దుర్భర దారి్రద్యంలో బతుకీడుస్తూ అన్నదాన శిబిరాల వద్ద గిన్నె పట్టుకుని ఆహారం కోసం పోటీపడుతున్న చిన్నారులు వీరంతా. ఈ ఏడాది మొదట్లో గాజాలో ఓ శరణార్థి శిబిరంలో తీసిన ఈ ఫొటో అక్కడి దయనీయ స్థితికి అద్దంపడుతోంది. ఇకనైనా ఇజ్రాయెల్ దారుణదాడులను నిలిపివేయాలని ప్రపంచదేశాలు వేడుకుంటున్నా అమెరికా అండతో ఇజ్రాయెల్ ఈ అభ్యర్థనలను పెడచెవిన పెడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జెన్ జడ్.. పదం కాదు.. ఓ తరం.. ఆసక్తికర విషయాలివే..!
జెన్ జడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన.. ఈ సాంకేతికను అలవర్చుకున్న.. చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్‌నే జెన్‌జడ్ అని.. అంటే జనరేషన్ జడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా.. కొత్త ఆలోచనలు.. దానికి మించి.. ఆన్లైన్ సాంకేతికత.. అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్ జడ్.ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్ జడ్ తీరు గురించి మనో వైజ్క్షానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్ చేద్దాం.జన్ జడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్.., "ఐ జనరేషన్".., "డిజిటల్ స్థానికులు"... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్‌జడ్‌లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు.దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్ జడ్లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్ వెదకటం, చాట్ జీపీటీని అడగం.. లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే.. దీంతో వారి మనస్సులు.. వారి సామాజిక స్పృహ.. ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు.జన్జడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం.. కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా.. ఎక్కువగా ఆలోచిస్తారు.. చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం.. దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Zలో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం.. సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం.. ఇ-కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్లు, స్టార్టప్‌లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు.జెన్ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.. భయం లేకుండా ప్రవర్తించడం.. కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని.. లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికితీయడానికి ప్రయత్నిస్తారు. జెన్‌జడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు.. భావోద్వేగాలకు తావు లేకుండా.. బాధను వ్యక్తీకరించడం.. ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.. సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా.. వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.ఆన్లైన్లో చర్చల ద్వారా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు.. ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన.. చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు.. వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్పోజర్.. అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం.. ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు.. కలిగి ఉంటారు.కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ.. బలహీనత కాదు.. అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.. గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి.. కానీ జెన్‌జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.. తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్‌జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.


