ఇంజనీర్, ర్యాపర్, మేయర్‌.. బాలేన్‌  | Nepal ex-rapper mayor on track to be new PM | Sakshi
Sakshi News home page

ఇంజనీర్, ర్యాపర్, మేయర్‌.. బాలేన్‌ 

Mar 7 2026 6:46 AM | Updated on Mar 7 2026 7:00 AM

Nepal ex-rapper mayor on track to be new PM

ఆయన పాటలు జెన్‌ జెడ్‌ను ఉద్యమం వైపు పురిగొల్పాయి. కఠ్మాండు మాజీ మేయర్‌ కూడా అయిన ఆయన ఇప్పుడు ప్రధాని అయి నేపాల్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అతడే బాలేంద్ర షా..నేపాలీలు ముద్దుగా పిల్చుకునే బాలేన్‌..!

మార్చి 4వ తేదీ. మరో రెండు రోజుల్లో జరిగే సాధారణ ఎన్నికలకు దేశం సమాయత్తమవుతుండగా ఝాపా జిల్లా వాసులు బాలేన్‌తో సెల్ఫీ కోసం క్యూ కట్టారు. ఎన్నికల ప్రచారం కోసం వచి్చన బాలేన్‌తో ఫొటో దిగేందుకు పోటీలు పడ్డారు. దీంతో, కార్యకర్తలు వారిని నియంత్రించే పనిలో బిజీ అయిపోయారు. బాలేన్‌తో సెల్ఫీ దిగాలని ముచ్చటపడే వారిని క్యూలో నిల్చోబెట్టి, ఒక్కొక్కరికి 10 సెకన్ల చొప్పున సమయమిచ్చారు. ఆ జనం మధ్యలో బాలెన్‌ నిలబడి ఉన్నారు. నల్లటి బ్లేజర్, నీటుగా ట్రిమ్‌ చేసిన గడ్డం, తనదైన స్టయిల్‌లో దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలతో కనిపిస్తున్నారు. ఆయన వారిని బాలేన్, ఒక కరచాలనం, ఒక చిరునవ్వు, ఒక సెలీ్ఫతో సంతోషపెడుతున్నారు. 

బాలేన్‌ ధరించే దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో బాలేన్‌ షా గ్లాసెస్‌ పేరుతో జనం కొనుగోలు చేస్తుండటం విశేషం. ఇంతటి జనాదరణ కలిగిన 36 ఏళ్ల బాలేన్‌..అదే బాలేంద్ర షా కఠ్మాండుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు రామ్‌ నారాయణ్‌ షా నలుగురు కుమారుల్లో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షతో మెలిగిన ఇతడికి కవితలు రాయడమంటే తెగపిచి్చ. నేపాల్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన బాలేంద్ర, భారత్‌లో స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌లో పీజీ చదివాడు. 2013లో నేపాల్‌లో బాగా పేరున్న ర్యాబార్జ్‌ పోటీలో గెలుపొందాడు. అందులో బాలేన్‌ అవినీతి, రాజకీయ స్తబ్ధత, వారసత్వ పాలన వంటి వాటిపై స్వయంగా రాసి పాడిన పాటలు సూపర్‌ హిట్టయ్యాయి. ర్యాపర్‌ కంటే కూడా ఆయన మంచి కవి అని విమర్శకులు అంటున్నారు. అణగారిన ప్రజల గురించే ఆయన ఎక్కువగా కవితల్లో ప్రస్తావిస్తుంటారని, సామాన్యుల్లో ఆయనకు ఆదరణ ఇంతగా పెరగటానికి ఇవే కారణమని కూడా చెబుతున్నారు.  

అమెరికా, చైనాతోపాటు భారత్‌నూ వదల్లేదు..!
గతేడాది సెప్టెంబర్‌లో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించినప్పుడు బాలేన్‌ స్వయంగా అందులో పాల్గొనలేదు. కానీ, ఆన్‌లైన్‌ వేదికగా పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా, చైనా, భారత్‌లను తిట్టిపోసిన బాలేన్‌..వీరితో ఏపనీ కాదంటూ ఫేస్‌బుక్‌లో షాకిచ్చే పోస్ట్‌ పెట్టారు. ఆ సమయంలో బాలేన్‌ దేశాన్ని ముందుకు నడిపించేందుకు తగిన వ్యక్తి అంటూ 16 వేల సార్లు ప్రస్తావనకు వచి్చనట్లు అంచనా. పెద్ద సంఖ్యలో యువత ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరినా ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కికి బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదనకు మద్దతు పలికారు. రెండు నెలల అనంతరం మేయర్‌ పదవికి రాజీనామా చేసిన రా్రïÙ్టయ స్వతంత్ర రాష్ట్ర పార్టీలో చేరారు.  

మేయర్‌గా దూకుడు... 
2022లో బాలేన్‌ కఠ్మాండు మేయర్‌ పదవికి స్వతంత్ర అభ్యరి్థగా పోటీకి దిగి ఏకంగా 61 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఎప్పటి నుంచో అధికారంలో కొనసాగుతున్న 
పారీ్టలను షాక్‌ తినిపించారు. పాలనలోనూ అదే దూకుడు కనబరిచారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. కఠ్మాండులోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూలగొట్టించారు. నగరంలో చెత్తాచెదారాన్ని శుభ్రం చేసే యంత్రాంగమే లేదని నిరసనగా చెత్తను ప్రధాని కార్యాలయం ఆవరణలో పారబోయించారు. 2025 సెప్టెంబర్‌లో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జెన్‌జెడ్‌ ఆందోళనలు నేపాల్‌ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి వేశాయి.   
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement