UPSC Topper జిన్నియా అరోరా సక్సెస్‌ జర్నీ గురించి తెలుసా? | UPSC Topper 2025 AIR 6 Zinnia Aurora Career Achievements | Sakshi
Sakshi News home page

UPSC Topper జిన్నియా అరోరా సక్సెస్‌ జర్నీ గురించి తెలుసా?

Mar 6 2026 5:06 PM | Updated on Mar 6 2026 7:21 PM

UPSC Topper 2025 AIR 6 Zinnia Aurora Career Achievements

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 ఫలితాల్లో జిన్నియా అరోరా (Zinnia Aurora)   టాప్‌ టెన్‌లో స్థానం సంపాదించి  ఘన విజయం సాధించింది. శుక్రవారం (మార్చి 6, 2026) విడుదలైన ఈ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించారు. జిన్నియా అరోరా గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు:

UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా మందికల. కానీ కొంతమంది మాత్రమే పట్టుదలతో తమ కలను సాకారం చేసుకుంటారు.  తొలి ప్రయత్నంలో  మెరుగైన ర్యాంక్ రాకపోవడంతో ఈ సారి ఆలిండియా 6వ ర్యాంకు (AIR 6). రోల్ నంబర్: 6410067. ఆమె గతంలో (UPSC 2024) 156వ ర్యాంకు సాధించారు. తన ర్యాంకును మెరుగుపరుచు కోవాలనే పట్టుదలతో మళ్ళీ పరీక్ష రాసి, ఈ సారి టాప్ 10లో నిలిచారు. అరోరా తన విజయం ద్వారా ఎంతో మంది సివిల్స్ ఆశావహులకు స్ఫూర్తిగా నిలిచారు.

ఎవరీ జిన్నియా అరోరా 
జిన్నియా అరోరా హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ఆమె కుటుంబం ప్రస్తుతం న్యూ ఢిల్లీలో స్థిరపడింది. ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉండటంతో ఆమె పెరిగింది, చదువుకుంది అంతా ప్రధానంగా ఢిల్లీలోనే సాగింది. తండ్రి పంకజ్ అరోరా (Pankaj Aurora), ఈయన కూడా సివిల్ సర్వెంట్. తల్లి రీతూ అరోరా (Ritu Aurora).తన తండ్రిని చూసి స్ఫూర్తి పొందిన జిన్నియా, చిన్నప్పటి నుండే ఐఏఎస్ (IAS) కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జిన్నియా పాఠశాల విద్య ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్కృతి స్కూల్ (Sanskriti School)లో పూర్తి చేశారు. 2018-19 బ్యాచ్‌కు గానూ పాఠశాల టాపర్‌గా నిలిచారు. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ వైపు మొగ్గు చూపారు. సివిల్స్‌లో జిన్నియా తన ఎంపికగా పొలిటికల్ సైన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ (PSIR)ను ఎంచుకుని విజయం సాధించింది.

PeaceX  కో ఫౌండర్‌ 
జిన్నియా పీస్ఎక్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు కూడా. 2020లో కోవిడ్ సమయంలో ఆమె PeaceX అనే స్వచ్ఛంద సంస్థ (NGO)తో కలిసి పనిచేశారు. ఇది ఐక్యరాజ్యసమితి (UN),వివిధ ప్రభుత్వాలతో కలిసి పనిచేసే సంస్థ. ఆమె తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఆమెకు అంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం, సామాజిక మార్పులపై మంచి అవగాహన ఉంది.

ఇదీ చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్‌ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని

Advertisement
 
Advertisement
Advertisement