వైఫల్యం అనగానే అవమానంగా, బాధగా అనిపిస్తుంటుంది. మనకే ఎందుకిలా జరుగుతుందని నిరాశ నిస్ప్రుహలకు లోనైపోతుంటాం. అయితే ఈ వ్యక్తి వైఫల్యాలు మీద వైఫల్యాలు పకరించినప్పుడే..విజయం చేరువవ్వుతున్నట్లు లెక్క అని అంటున్నాడు. అందుకు తన అనుభవమే ఉదాహరణ అంటూ..తన స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అతడే సుమిత్ మిట్టల్ తన మొత్తం సక్సెస్ జర్నీని సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేస్తూ..తాను చేసిన జీవిత పోరాటాల గురించి భావోద్వేగంగా రాసుకొచ్చాడు. తాను ఐఐటీ జేఈఈలో రెండుసార్లు ఫెయిలయ్యానని, అలాగే కెమిస్ట్రీ ప్రీ బోర్డు పరీక్షల్లో ఫెయిలైనట్లు తెలిపాడు. మరోవైపు కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైందని వివరించాడు.
దాంతో కాల్‌సెంటర్‌లో పనిచేస్తూ..ఓ మారుమూల ప్రాంతంలో బీసీఏ పూర్తి చేశానని, ఓ చిన్న గదిలో విద్యార్థులకు బోధిస్తూ సాగిన ప్రస్థానం..నిమ్‌సెట్‌లో ఆల్‌ఇండియా 4వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక కాలేజ్‌లో ఎంసీఏ చేసే రేంజ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదని చెప్పుకొచ్చాడు. తొలుత ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తూ..కంపెనీని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడమే గాక, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే రేంజ్‌కు చేరుకున్నట్లు తెలిపాడు.
చివరగా సుమిత్ పదేపదే వైఫల్యాలు పలకరిస్తున్నప్పుడు నిరాశ చెందకూడదని..ప్రతి ప్రయత్నం విజయాన్ని చేరువ చేసే మార్గంగా భావించాలని అంటున్నాడు. అలాగే జీవితం ఎప్పుడు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. వైఫల్యాలనేవి..విజయాన్ని చేరువచేసే ప్రయత్నాలుగా మలుచుకుంటే..గమ్యానికి చేరుకోగలవు..అనుకున్నది సాధించగలవు అంటూ చేసిన పోస్ట్ అందరి హృదయాలను తాకింది..పైగా నెటిజన్లు నిస్సహయ స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కథ ఓ ప్రేరణ అంటూ పోస్టులు పెట్టారు.
Yes, I failed IIT JEE twice
Yes, I failed in chemistry pre board exam
Yes, my family faced financial crisis
Yes, I worked at a call center
Yes, I completed my BCA from a distant college
Yes, I just started with teaching 4 students in a very small room
But, I got AIR 4 in NIMCET… pic.twitter.com/OOasjxAVhm— Sumit Mittal (@bigdatasumit) February 24, 2026
(చదవండి: హార్ట్‌బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!)


