కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ టి20 ప్రపంచకప్‌లో ఆరోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
వెస్టిండీస్‌తో చివరి ‘సూపర్–8’ మ్యాచ్‌లో కాస్త పోటీ ఎదురైనట్లు కనిపించినా, చివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేసింది.
ఆదివారం జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (50 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటి చేత్తో ఛేదనను సులువుగా మార్చేశాడు.


