బంజారాహిల్స్: డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన తెలంగాణ సినీ ప్రస్థానంలో పుస్తక పరిచయ సభ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించారు.
కార్యక్రమానికి నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్‌ప్రసాద్ లాల్ అధ్యక్షత వహించారు. ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా, దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఆత్మీయ అతిథిగా, సినీ జర్నలిస్ట్ ప్రభు, దర్శకులు అల్లాణి శ్రీధర్, సినీ పుస్తక రచయిత ఎస్‌వీ రామారావు, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తకాన్ని ప్రముఖ రచయిత మామిడి హరికృష్ణకు అంకితమిచ్చారు.
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సినిమా గురించి ఎంతో సమాచారాన్ని పొన్నం రవిచంద్ర ఈ పుస్తకం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారన్నారు.


