హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక సౌజన్యంతో అనన్యభినయం పేరిట యువ కూచిపూడి కళాకారిణి అనన్య సూరపనేని సోలో కూచిపూడి నృత్య రూపక ప్రదర్శన అలరించింది.
రవీంద్ర భారతిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో గణపతి ప్రార్థన, కామాక్షి స్తుతి, అర్ధనారీశ్వర స్తోత్రం, రాధికా కృష్ణ, తరంగం, హంస నందిని వంటి నృత్య రీతులతో చక్కటి హావభావాలు ప్రదర్శించింది.
నాట్య ప్రియులను ఆసాంతం రంజింపజేసింది. దీనికి హాజరైనా మంత్రి సీతక్క మాట్లాడుతూ విదేశాల్లో జని్మంచినప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరిగిన యువ కళాకారిణి నృత్యం రంగంలో తనదైన ముద్ర వేస్తుందని పేర్కొన్నారు.
భారత రాయభార కార్యాలయం వేదికపై కూచిపూడి ప్రదర్శన ఇవ్వడం ఎంతో ప్రశంసనీయమన్నారు.


