సినీ నటి రీతూ వర్మ శుక్రవారం నగరంలో సందడి చేశారు. రాయదుర్గంలో అరుణ ఐస్‌క్రీమ్స్ (Arun Icecreams) సంస్థ నిర్వహించిన ‘హైదరాబాద్ వరల్డ్ గిన్నిస్ రికార్డు బ్రేక్’ కార్యక్రమంలో రీతూవర్మ పాల్గొంది. పాఠశాలల పిల్లలతో కలిసి ఐస్‌క్రీమ్ రుచులను ఆస్వాదించింది. అభిమాన తారలను చూసేందుకు ప్రజలు భారీగా వచ్చారు.


