కన్నడ స్టార్ హీరో, 'కాంతార' (Kantara) ఫేమ్ రిషబ్ శెట్టి తన కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టి, కుమారుడు రన్విత్ శెట్టి, కుమార్తె రాద్య శెట్టిలతో కలిసి దీపావళి పండుగను ఆనందంగా గడిపారు.
ఈ పండుగ సందర్భంగా తీసిన కొన్ని అందమైన, ఆప్యాయమైన కుటుంబ ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ పండుగ సంతోషాన్ని, శాంతిని, వెలుగులను నింపాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
(Images Source : Instagram/rishabshettyofficial)


