హైదరాబాద్ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు.. యువకుల నృత్యాలు.. జానపద కళాకారుల సందడి నడుమ నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో మంగళవారం రాత్రి ‘సదర్ సమ్మేళనం’ (Sadar Festival 2026) ధూంధాంగా జరిగింది.
యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొని సందడి చేశారు. పెద్ద సంఖ్యలో యాదవ సోదరులు పాల్గొన్నారు.


