హైదరాబాద్ : దున్నపోతుల విన్యాసాలు..ఒగ్గుడోలు దరువులు..కళాకారుల డప్పుచప్పుళ్లు..ఎత్తిన బోనాలు.. యాదవుల నెత్తిన పగిడీలు.. మహిళల కోలాటాలు.. ముస్లింల మర్ఫా అడుగులు.. లంబాడీల నృత్యాల సందడి మధ్య సదర్ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది.
బుధవారం ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో ఆద్యంతం తెలంగాణ సంస్కృతీ సంప్రదాయం ఉట్టిపడింది.
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా యాదవులు తరలివచ్చి ఈ ఉత్సవంలో పాలుపంచుకున్నారు.


