breaking news
Revanth Reddy
-
‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం, తన నుండి వివరణ కోరడం ఎంతమాత్రం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ మేరకు మంత్రి కొండా సురేఖ అధికారిక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ.. ‘సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకానీ ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కొండా సురేఖ కోరారు.కుటుంబ సభ్యుల వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలకు పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను ముడిపెట్టడం సరికాదని, ఈ విషయంలో తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ కొండా సుష్మిత ఏమన్నారంటే? 'సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్‌కు స్థానం లేకుండా చేస్తున్నారు'అని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్‌లో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు.‘ఎప్పుడూ ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్లినపుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారు’అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదన్నారు. తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా, రాహల్, ప్రియాంకలను గౌరవిస్తామన్నారు.పరకాలనుంచి తాను ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని చెప్పారు. ‘బీసీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వారు వచ్చి చెబుతున్నారు. మంత్రులు సంతకాలు పెట్టిన పనులూ జరగటం లేదు. టీపీసీసీ అధ్యక్ష పదవికి నా తల్లిదండ్రులే రేవంత్ రెడ్డిని ప్రతిపాదించారు. అధ్యక్షుడైన తర్వాత మా ఇంటికి వచ్చి నా తండ్రి మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మరచిపోయారు’అని పేర్కొన్నారు.కోటమైసమ్మ, ఎల్లమ్మ గుడి వద్దకు వచ్చి ఆ మాట అనలేదని ప్రమాణం చేస్తారా అని సీఎంకు సవాల్ విసిరారు. తన తండ్రి తిరిగి ప్రచారం చేస్తే రేవూరి గెలిచాడని, అలాంటి నాయకుడు నీకు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. సీఎంకు కళ్లు నెత్తికె క్కాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం పనిచేసే దాన్నని,చావుకు కూడా భయపడనన్నారు.నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు'సీఎంతోపాటు ఒక 'పొంగు ఉంది. ఆ పొంగు ఎక్కువ సేపు ఉండదు. వీరిలో ఎవరూ సీఎం అనేది తెలియడం లేదు. హైదరాబాద్ ఇన్చార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటో పెట్టకుండా అక్కడి ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం, పొంగు ఫొటోలు పెట్టుకున్నారు. బీసీలంటే అంత చులకనా. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రయత్నించిన దయాసాగర్, షబ్బీర్ అలీ ఆయన సీఎం అయిన తర్వాత కలవడానికి వెళితే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు'అని సుస్మితా ఆగ్రహం వ్యక్తంచేశారు.మూడేళ్లలో వేం నరేందర్‌రెడ్డి ఇచ్చిన సలహాలు ఏమిటో, వాటిని పాటించి సీఎం చేసిన పనులేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. సీఎం తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే రూ.200 కోట్ల విలువైన భూమిని అతడికి ధారాదత్తం చేశారని మండిపడ్డారు. అన్నా, తమ్ముడు రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము కాపోళ్లమని తమకు వ్యవసాయం చేయడం తప్ప ఊడిగం చేయడం రాదని, తాము పద్మశాలీలమని తమకు నేత చేయడం తప్పితే మోసం చేయడం రాదని అన్నారు. -
బరాబర్ పరకాల బరిలో ఉంటా
సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు ఇప్పుడే రాజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీలో మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పరకాల పర్యటనలో పిలుపునివ్వడం ఒకవైపు.. కొండా సుస్మితాపటేల్ చేసిన ఘాటు వ్యాఖ్యలు మరోవైపు రాజకీయ వేడిని పెంచాయి. ఇదే సమయంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి సైతం తాను లేదా తన సతీమణి పరకాల నుంచి బరిలో ఉంటామని చెప్పడంతో కాంగ్రెస్‌లో మూడు వర్గాల మధ్య పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికలకు ముందే మొదలైన ఈ టికెట్ పోరు.. రానున్న రోజుల్లో ఇంకా ముదిరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.గీసు‘కొండా’ కేంద్రంగానే..2024 మే 8: గీసుకొండ కాంగ్రెస్ నాయకుడి వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మధ్య ఫోన్ సంభాషణ ఆడియో లీక్‌తో కలకలం.2024 అక్టోబర్ 13: ధర్మారంలో దసరా ఫ్లెక్సీ వివాదం.. కొండా, రేవూరి వర్గాల మధ్య ఉద్రిక్తత, పోలీస్‌స్టేషన్‌లో హైటెన్షన్.2025 డిసెంబర్: గీసుకొండ మండలంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో కొండా వర్గానికి 7, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గానికి 9 స్థానాలు వచ్చాయి. 2026 మార్చి 3: కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో సుస్మితా పటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననే సంకేతాలు.2026 మార్చి 3: కొండా మురళి సైతం కుమార్తెకు మద్దతుగా కొండా కుటుంబాన్ని భవిష్యత్‌లోనూ గీసుకొండ ప్రజలు ఆశీర్వదించాలని పిలుపు.2026 ఆగస్టు 19: గీసుకొండలో సుస్మితా పటేల్ సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. రేవూరి ప్రకాశ్‌రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా పరకాల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటన. -
నేర చరిత్రలో 4వ స్థానంలో చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ముఖ్యమంత్రులపై నమోదైన క్రిమినల్ కేసుల జాబితాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచారు. చంద్రబాబుపై 19 కేసులు నమోదు కాగా 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. చట్టసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు నియమించిన సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తాజాగా అత్యున్నత న్యాయస్థానానికి 22వ నివేదిక సమర్పించారు. ఇందులో పలు కీలక వివరాలను వెల్లడించారు. సీఎంల జాబితాలో రేవంత్ టాప్.. దేశంలో 28 రాష్ట్రాలకుగాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికల ఆధారంగా అమికస్ క్యూరీ తెలిపారు. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి 89 కేసులతో (72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 160 ఇతర ఐపీసీ సెక్షన్లు) దేశంలోనే తొలి స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారి 29 కేసులతో రెండో స్థానంలో నిలిచారు. ఆందోళనకరంగా తెలుగు రాష్ట్రాల చట్టసభలు.. చట్టసభల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల సంఖ్య తీవ్ర ఆందోళనకరంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల గణాంకాలను నివేదికలో విపులంగా ప్రస్తావించారు. ఏపీ అసెంబ్లీలో 2024 ఎన్నికల నాటికి ఉన్న ఎమ్మెల్యేల్లో 138 మందిపై (79 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 98 మంది (56 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఏపీకి చెందిన 25 మంది లోక్‌సభ సభ్యుల్లో 13 మందిపై (52 శాతం) కేసులు ఉండగా 9 మందిపై (36 శాతం) తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలోని 2023 ఎన్నికల నాటికి ఉన్న ఎమ్మెల్యేల్లో 81 మందిపై (68 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 58 మంది (49 శాతం) తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. తెలంగాణలోని 17 మంది లోక్‌సభ ఎంపీల్లో 14 మంది (82 శాతం) క్రిమినల్ కేసులు, 12 మంది (71 శాతం) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్...దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ఏకంగా 4,192 కేసులు ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ దశలో పెండింగ్‌లో ఉన్నట్లు హైకోర్టులు ఇచ్చిన సమాచారం ద్వారా నివేదిక స్పష్టం చేసింది.పదేళ్లకు పైగా విచారణకు నోచుకోని కేసులు 519 ఉన్నాయి. ఐదు నుంచి పదేళ్ల మధ్య పెండింగ్‌లో ఉన్నవి 754 కేసులుగా తేలింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు ఉన్నవి 562 కేసులు ఉన్నాయి. మూడేళ్ల లోపు ఉన్నవి 1,095 కేసులుగా నమోదయ్యాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సిట్టింగ్ ఎంపీలపై 335 కేసులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు విచారణ దశలో ఉన్నాయి. మాజీ ఎంపీలపై 269 కేసులు, మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా ఛార్జ్‌షీట్ దాఖలు కాకుండా దర్యాప్తు దశలోనే 700 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తు దశలోనే ఉండిపోయాయి. ఏపీ హైకోర్టు నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై 18 విచారణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సమర్పించిన నివేదికలో కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 21 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొనగా హైకోర్టు అధికారిక వెబ్సైట్లో రాష్ట్రవ్యాప్తంగా 300 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నమోదైంది. 2025లో దేశవ్యాప్తంగా 1,243 కేసులు పరిష్కారం కాగా కొత్తగా 1,050 కేసులు నమోదయ్యాయి. అమికస్ క్యూరీ కీలక సిఫార్సులు...ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా పలు కీలక సూచనలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు కేవలం ఆ కేసులనే విచారించాలి. ఆ కేసులు పూర్తయిన తర్వాతే సాధారణ కేసులను వాటికి కేటాయించాలి. హైకోర్టులు సుమోటోగా కేసుల పురోగతిని ప్రతి నెలా పర్యవేక్షించాలి. ఛార్జ్ ఫ్రేమ్ చేసిన ఏడాది లోపు విచారణను తప్పనిసరిగా పూర్తి చేయాలి. మూడేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను జాప్యం లేకుండా రోజువారీగా విచారించాలి. వరుసగా రెండు వాయిదాలకు నిందితులు హాజరు కాకపోతే తక్షణమే నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి. సాక్షులను కోర్టులో హాజరుపరిచే బాధ్యతను నోడల్ ప్రాసిక్యూషన్ అధికారికి అప్పగించాలి. ఒకవేళ విఫలమైతే సదరు అధికారిపై జిల్లా ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. కేసుల వివరాలు, రోజువారీ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రియల్ టైమ్ డేటా ద్వారా పొందుపరచాలి. -
నేర చరిత్రలో టాప్‌లో రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ముఖ్యమంత్రులపై నమోదైన క్రిమినల్ కేసుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి 89 కేసులతో (72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 160 ఇతర ఐపీసీ సెక్షన్లు) దేశంలోనే తొలి స్థానంలో ఉన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచారు. చంద్రబాబుపై 19 కేసులు నమోదు కాగా 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. చట్టసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు నియమించిన సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తాజాగా అత్యున్నత న్యాయస్థానానికి 22వ నివేదిక సమర్పించారు. ఇందులో పలు కీలక వివరాలను వెల్లడించారు. దేశంలో 28 రాష్ట్రాలకుగాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికల ఆధారంగా అమికస్ క్యూరీ తెలిపారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారి 29 కేసులతో రెండో స్థానంలో నిలిచారు. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ 19 కేసులతో మూడో స్థానంలో ఉన్నారు. ఆందోళనకరంగా తెలుగు రాష్ట్రాల చట్టసభలు.. చట్టసభల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల సంఖ్య తీవ్ర ఆందోళనకరంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల గణాంకాలను నివేదికలో విపులంగా ప్రస్తావించారు. ఏపీ అసెంబ్లీలో (2024 ఎన్నికల నాటికి) మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 138 మందిపై (79 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 98 మంది (56 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఏపీకి చెందిన 25 మంది లోక్‌సభ సభ్యుల్లో 13 మందిపై (52 శాతం) కేసులు ఉండగా 9 మందిపై (36 శాతం) తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలోని (2023 ఎన్నికల నాటికి) 119 మంది ఎమ్మెల్యేల్లో 81 మందిపై (68 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 58 మంది (49 శాతం) తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. తెలంగాణలోని 17 మంది లోక్‌సభ ఎంపీల్లో 14 మంది (82 శాతం) క్రిమినల్ కేసులు, 12 మంది (71 శాతం) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్... దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ఏకంగా 4,192 కేసులు ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ దశలో పెండింగ్‌లో ఉన్నట్లు హైకోర్టులు ఇచ్చిన సమాచారం ద్వారా నివేదిక స్పష్టం చేసింది. పదేళ్లకు పైగా విచారణకు నోచుకోని కేసులు 519 ఉన్నాయి. ఐదు నుంచి పదేళ్ల మధ్య పెండింగ్‌లో ఉన్నవి 754 కేసులుగా తేలింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు ఉన్నవి 562 కేసులు ఉన్నాయి. మూడేళ్ల లోపు ఉన్నవి 1,095 కేసులుగా నమోదయ్యాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సిట్టింగ్ ఎంపీలపై 335 కేసులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు విచారణ దశలో ఉన్నాయి. మాజీ ఎంపీలపై 269 కేసులు, మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా ఛార్జ్‌షీట్ దాఖలు కాకుండా దర్యాప్తు దశలోనే 700 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తు దశలోనే ఉండిపోయాయి. ఏపీ హైకోర్టు నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై 18 విచారణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సమర్పించిన నివేదికలో కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 21 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొనగా హైకోర్టు అధికారిక వెబ్సైట్లో రాష్ట్రవ్యాప్తంగా 300 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నమోదైంది. 2025లో దేశవ్యాప్తంగా 1,243 కేసులు పరిష్కారం కాగా కొత్తగా 1,050 కేసులు నమోదయ్యాయి. అమికస్ క్యూరీ కీలక సిఫార్సులు... ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా పలు కీలక సూచనలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు కేవలం ఆ కేసులనే విచారించాలి. ఆ కేసులు పూర్తయిన తర్వాతే సాధారణ కేసులను వాటికి కేటాయించాలి. హైకోర్టులు సుమోటోగా కేసుల పురోగతిని ప్రతి నెలా పర్యవేక్షించాలి. ఛార్జ్ ఫ్రేమ్ చేసిన ఏడాది లోపు విచారణను తప్పనిసరిగా పూర్తి చేయాలి. మూడేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను జాప్యం లేకుండా రోజువారీగా విచారించాలి. వరుసగా రెండు వాయిదాలకు నిందితులు హాజరు కాకపోతే తక్షణమే నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి. సాక్షులను కోర్టులో హాజరుపరిచే బాధ్యతను నోడల్ ప్రాసిక్యూషన్ అధికారికి అప్పగించాలి. ఒకవేళ విఫలమైతే సదరు అధికారిపై జిల్లా ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. కేసుల వివరాలు, రోజువారీ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రియల్ టైమ్ డేటా ద్వారా పొందుపరచాలి. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి సత్తా చాటాలని, అందుకు అవసరమైన అన్నిరకాల సహకారం అందించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్టానం ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వగా, సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యూహాలు, జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి కీలకమైన రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులు, పీసీసీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారన్నారు. అధిష్టానం ఆదేశిస్తే.. పార్టీ విజయంలో కీలక భూమిక పోషించే ప్రచారం కోసం అక్కడే మకాం వేసి పూర్తిస్థాయిలో పనిచేస్తారని సీఎం తెలిపారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలను ఆయా రాష్ట్రాల ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారాన్ని రూపొందిస్తామన్నారు. బీజేపీ విధానాలను తిప్పికొట్టాలి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ, అయోధ్య రామాలయంలో చందాల చోరీ వంటి విషయాల్లో బీజేపీ తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే సమయం యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు, సమరశీల పోరాటాలు చేపడుతున్నామని వివరించారు. భవిష్యత్ ఎన్నికల్లో యువతే కీలకపాత్ర పోషించనున్నందున, వారి సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తున్నామని చెప్పారు. -
కాంగ్రెస్‌లో అంతే..!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజుకో తీరుగా బహి ర్గతమవుతున్నాయి. మంత్రుల మధ్య సమన్వయ లేమి, తమ శాఖలో జరిగే అంశాలు తమకు తెలియకుండానే జరిగి పోతున్నాయనే అసంతృప్తి, ఒకరి శాఖపై మరో మంత్రి వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ఇన్‌చార్జీలతో సమన్వయ లేమి, పార్టీ కేడర్‌తో ఎమ్మెల్యేల గిల్లి కజ్జాలు, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ గొడవలు నిరంతరాయంగా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడు ఏకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, అధిష్టానాన్ని వేలెత్తి చూపుతున్న ఘటనలు, నేరుగా వారికే సవాల్ విసిరే ప్రసంగాలు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తుంగతుర్తి, పాలకుర్తి, గజ్వేల్, మునుగోడు, జడ్చర్ల, వనపర్తి, ఎల్బీనగర్... ఇలా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడం, పార్టీ నేతలను సమన్వయం చేయడంలో రాష్ట్ర పార్టీ పక్షాన ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అసమ్మతి స్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకునే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఏదో నియోజకవర్గంలో తలనొప్పులు బహిరంగంగానే బయటపడుతున్నాయి. ఇప్పటికే పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ పేరుతో సతమతమవుతున్న కాంగ్రెస్‌లో తాజా గొడవలు మరింత చిచ్చు రేపుతున్నాయి. వనపర్తి అసెంబ్లీ పరిధిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయంలో ఏకంగా చిన్నారెడ్డికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు తుంగతుర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ స్థానిక నాయకత్వం పంచాయతీ ఇంకా సమసిపోలేదు. ఇప్పటికే పాలకుర్తి, గజ్వేల్ నియోజకవర్గాల్లోని అంతర్గత గొడవలతో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు గాం«దీభవన్‌కు చేరాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోని నేతలతో పార్టీ క్రమశిక్షణా కమిటీ పలుమార్లు భేటీ అయి విచారణ జరిపింది. అయినా ఇక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఆదిలాబాద్‌లో బాహాబాహి ఎల్బీనగర్ నియోజకవర్గంలో అయితే ఈశ్వరమ్మ యాదవ్, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి వర్గాలు ఏకంగా ఇళ్ల ముందు ఆందోళనల వరకు వెళ్లాయి. వీటితోపాటు ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన జిల్లా పీఏసీ సమావేశంలో ఆదిలాబాద్ స్థానిక నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో ఇరువర్గాలకు పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు అసలు తమకు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ప్రాధాన్యతే లేదని ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు వాపోతున్నారు. బీజేపీ నేతలు చెప్పిన మాట వింటున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బహిరంగ వేదికపైనా వ్యాఖ్యానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటికితోడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల ఈ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు బయటపడుతున్నాయి. ఇటీవల పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య విభేదాలు ఇలా ఉంటే పార్టీ అధిష్టానం నియమించిన డీసీసీ అధ్యక్షుల్లో కొంత మందికి స్థానిక పార్టీ నాయకత్వం అసలు సహకరించడమే లేదు. ఇటీవల కాలంలో ముగ్గురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన డీసీసీ అధ్యక్షులను మార్చాలనే నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు తాజాగా తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ ధిక్కారం ఇటీవలి కాలంలో షరా మామూలే అయిపోయిందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సీఎంకు నేరుగా అసమ్మతి సెగ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి సహజమే అయినా ఇటీవలి కాలంలో సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ఈ సెగ నేరుగానే తగులుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన వైఖరిని ఖండిస్తూ, పాలనను వేలెత్తి చూపుతూ, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ కొందరు పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండగా, మరికొందరు పార్టీలోనే అంతర్గతంగా చక్రం తిప్పుతూ రేవంత్‌కు చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్ టార్గెట్‌గానే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నవారు వేలకోట్లు సంపాదించుకుంటూ ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5లక్షలు ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది బహిరంగ రహస్యమేనని పార్టీ వర్గాలంటున్నాయి. ఇక, తనకు తెలియకుండానే రైస్‌మిల్లులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం గురించి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంతర్గతంగా పావులు కదిపారని, అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిందనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యలు కూడా ఈ కోవలోనే చర్చనీయాంశమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన ప్రభుత్వమని, కీలక నిర్ణయాల్లో పార్టీ జోక్యం ఉంటుందని స్పష్టం చేయడం ద్వారా రేవంత్‌కు చెక్ పెట్టే జాబితాలోకి ఆయన కూడా చేరారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తాజాగా వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ కుమార్తె నేరుగా సీఎం పేరును ఉటంకిస్తూ ఆయనకే నేరుగా సవాల్ విసిరిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలో ఎవరికీ సరైన పట్టు లేదన్న చర్చ సాగుతోంది. మంత్రికి నోటీసులు సుస్మితా పటేల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె తల్లి, దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండాసురేఖకు పీసీసీ క్రమశిక్షణకమిటీ నోటీసులు జారీ చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల వనపర్తిలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత ప్రసంగాల గురించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పార్టీ ఆదేశించింది. ఎల్బీనగర్ నియోజకర్గంలో బీసీ మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్‌నుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. -
కొండా సుస్మిత వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా మురళి-సురేఖ దంపతుల కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే కాంగ్రెస్ క్రమశిక్షన కమిటీ ఆగ్రహం వ్యక్తం నేపథ్యంలో అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. అదే సమయంలో టీపీసీసీ నుంచి పూర్తి నివేదిక కోరారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం..కొండా సుస్మిత కామెంట్ పై స్పందించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయన్నారు. పార్టీ లక్ష్మణ రేఖను ఎవరు అతిక్రమించిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీలో ఉన్న మల్లు రవి వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాత కొండా సుస్మిత పై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కూడా షబ్బీర్ అలీ, కొండా మురళి వివాదంలో వారితో చర్చించి సమస్యను పరిష్కరించామని, ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే నోటీసులు ఇచ్చామని కూడా ఆయన తెలిపారు.‘నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు?’ -
‘నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు?’
గీసుకొండ(వరంగల్ జిల్లా): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కొండా మురళి-సురేఖ దంపతుల కుమార్తె కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాల అసెంబ్లీ సీటు అంశానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సీటు ఇస్తున్నట్లు ఇటీవల రేవంత్ ప్రకటించడంపై సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు సీటు ఇవ్వడానికి రేవంత్ ఎవరు? అంటూ ప్రశ్నించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు నెత్తికెక్కాయా?, రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్. రేవంత్‌రెడ్డి మాట తప్పావు. పరకాలలో నేనే పోటీ చేస్తా.. గెలిచి తీరుతా. బీసీలు అంటే చులకనా?, టీడీపీ సభ్యులు అంటే రేవంత్‌కు ఎందుకంత ప్రేమ?, రేవంత్‌లా ఊడిగం చేయడం మాకు రాదు. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్. నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు?, అధిష్టానం ఇస్తుంది. రేవంత్‌రెడ్డితో పాటు పొంగులేటి ఉంటున్నాడు. రేవంత్ ముఖ్యమంత్రా.. పొంగులేటి ముఖ్యమంత్రా?, అనవసరంగా కెలికావు.. నీ బండారం బయటపెడతా. నీ తమ్ముడు షెల్ కంపెనీకి రూ. 200 కోట్లు ధారాదత్తం చేశావు. కొండా మురళీ తిరిగి గెలిపిస్తే రేవూరి ఎమ్మెల్యే అయ్యాడు. రెండు, మూడు నియోజక వర్గాల్లో తిరిగి గెలిపించింది కొండా మురళి. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలని కోరుకున్న మొదటి వ్యక్తులు కొండా దంపతులు. పరకాలలో నా ఇళ్ళు ఇస్తా, అక్కడే ఉండి రేవూరిని గెలిపించుకో. రేవూరి గెలుస్తాడో...కొండా మనిషి గెలుస్తాడో చూద్దాం. 119 నియోజకవర్గాల్లో టికెట్లను నువ్వే ప్రకటించు, అధిష్టానం ఎందుకు.?’ అని తీవ్రస్థాయిలోధ్వజమెత్తారు. -
22ఏ భూ బాధితులకు అండగా బీఆర్ఎస్
సాక్షి,తెలంగాణ భవన్: 22ఏ భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్లో 22ఏ నిషేధిత భూ బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కుట్రతో భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతుంది.కష్టాల్లో ఉన్న వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది22ఏ భూ బాదితులకు బిఆర్ఎస్ లీగల్ సెల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. మంచి మాటతో ప్రభుత్వం వినక పోతే ఎలాంటి పోరాటానికి అయినా సిద్ధం.30 ఏళ్ల క్రింద రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది. నిషేధిత జాబితా నుండి తీసివేయాలంటే 30 శాతం నుంచి 50 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారు అని చెబుతున్నారు.మంత్రి నిషేధిత జాబితా నుండి తీసేశారట..ముఖ్యమంత్రి నిషేధిత జాబితాలో పెట్టించారట. ముఖ్యమంత్రి,పొంగులేటికి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే..బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు తెలుసు.ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదు. భువనగిరిలో 40వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీఎంకు నాలుగు సార్లు చెప్పారని అన్నారు.ముఖ్యమంత్రి , పొంగులేటిని భర్తరఫ్ చెయ్యి...అన్ని సజావుగా జరుగుతాయి.ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎందుకు లంచాలు ఇవ్వాలి. నిషేధిత జాబితాలో పెట్టిన వాటిని వెంటనే తొలగించాలి.ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగితే పొంగులేటిని వెంటనే భర్తరఫ్ చేయాలి. 22ఏ నిషేధిత భూముల విషయంలో ఏ1 రేవంత్ రెడ్డి,ఏ2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎకరాల్లో కొని గజాల్లో అమ్ముతున్నారని ముఖ్యమంత్రి అంటున్నారు. హిల్ట్ పాలసీతో ఉద్యోగాలు పోగొట్టారు.ప్రజలకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ప్రభుత్వం చేసిన కుట్ర.. వెంటనే సుమోటోగా స్వీకరించి తొలగించాలి.భూ భారతీ సైట్ పని చేయడం లేదు. అవసరం అయితే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిద్దాం’అని పిలుపునిచ్చారు. -
22-ఏ భూములపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్: ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 22-ఏ జాబితాలో ఉన్న ప్రైవేటు భూములను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. స్లాట్ తీసుకున్న వారి భూములను 2 రోజుల్లో పరిశీలిస్తామన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 18వ తేదీ) 22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 22-ఏ జాబితాలో ఉన్నది ప్రైవేటు భూమి అని తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు, ఈ మేరకు కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘జిల్లాల వారీగా 22-ఏ భూములపై సమగ్ర పరిశీలన చేయాలి. తప్పుల్లేని తుది జాబితా రూపొందించాలి. శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు. ప్రైవేటు భూముల్లో ఒక్క అంగుళానికీ ఇబ్బంది రానివ్వం. భూ హక్కులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 22-ఏ సమస్యల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలి. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించొద్దు. పుకార్లు, కట్టుకథలను నమ్మకండి. ఆస్తుల హక్కుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని స్సష్టం చేశారు. .... -
పదేళ్లలో పేదల ఆస్పత్రులు కట్టలేదేం?
సాక్షి, హైదరాబాద్: ‘కూలిపోయే పరిస్థితిలో ఉన్న వందేళ్ల నాటి ఉస్మానియా ఆస్పత్రిని తిరిగి నిర్మించాలని పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఆలోచన చేయలేదు. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లలో కొత్త ఆస్పత్రులకు టెంకాయ కొట్టి వాటి నిర్మాణం మర్చిపోయారు. వరంగల్‌లో పెద్ద మాటలు చెప్పి ఉన్న ఆసుపత్రిని కూల్చేశారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే వాళ్ల పార్టీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ (టిమ్స్ ఆస్పత్రి) కలియదిరిగారు. దీన్ని మేం కట్టాం.. రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నాడన్నారు. నువ్వు నిజంగా కడితే రిబ్బన్ కట్ చేయడానికి పదేళ్లలో సమయం దొరకలేదా? కేసీఆర్ నాకు సాయం చేసినా చేయకున్నా అలాంటి కొడుకును తెలంగాణకు ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది. నీ (కేసీఆర్) కొడుకు అట్లనే ఉండాలి.. అబద్ధాలు చెప్పాలి. అప్పుడే నిజాలు ప్రజలకు అర్థమవుతాయి’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 1,082 పడకల (సూపర్ స్పెషాలిటీ) డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడారు. మీ ఫాంహౌస్‌లు ఏమైనా ఆగాయా? ‘కేసీఆర్‌కు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫాంహౌస్.. ఆయన కుమారుడికి జన్వాడలో వంద ఎకరాల్లో ఫాంహౌస్.. ఆయన చెల్లికి శంకర్‌పల్లిలో 50 ఎకరాల్లో, బావ మొయినాబాద్‌లో 20 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నారు. అందులో ఏదైనా ఆగిందా? పేదల ఆస్పత్రులు ఏవైనా పూర్తి చేశారా? ఇంత కూడా ఆత్మపరిశీలన చేయకుండా సమాజం గమనిస్తుందని సిగ్గు పడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటున్నారు. ఇకనైనా మీ బుద్ధి మారాలి. కరువు రావాలని అఘోర దీక్షలు, రైతులు చచ్చిపోవాలని చేతబడులు చేయించడం మానాలి. మీరు సంపాదించిన రూ. లక్ష కోట్లలో నియోజకవర్గానికి రూ. 10 కోట్లో లేదా రూ. 20 కోట్లో ఖర్చు చేస్తే.. నల్లమల, ఆదిలాబాద్ అడవుల్లో సేవలందిస్తే మీరు చేసిన పాపాలు తగ్గుతాయి’అని సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యం.. ప్రజాపాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమం, అభివృద్ధిని ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఇప్పటివరకు 16 వేల మంది వైద్య సిబ్బందిని నియమించామన్నారు. వైద్యంపై ఖర్చును సంక్షేమం, ఖర్చు కింద చూడటం లేదని.. భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడిగా చూస్తున్నామని తెలిపారు. ‘ప్రస్తుతం విద్య, వైద్యం అత్యంత ఖరీదైనవిగా మారాయి. పేదలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే ఆస్తులమ్మినా సరిపోక కిడ్నీలు అమ్ముకొనే పరిస్థితి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అవగాహనతో ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందించాలని నిర్ణయించింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండె, కిడ్నీ బాగుండాలి. ఇందులో భాగంగానే మర్రి చెన్నారెడ్డి పేరుమీద వైద్య సాయం అందుబాటులోకి తెచ్చాం’అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. 32 నెలల పాలనలో ఆరోగ్యశ్రీ కోసం రూ. 2,700 కోట్లు కేటాయించామని, సీఎంఆర్ఎఫ్ రూ. 2,526 కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో వైద్యం కోసం రూ. 21,800 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 10 వేల పడకలు అందుబాటులోకి.. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యంతో ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గోషామహల్లో 2 వేల పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా.. 2027 డిసెంబర్ 9 నాటికి ఉస్మానియా ఆస్పత్రి, ఎల్బీ నగర్లో, అల్వాల్‌లో ఇలా ప్రతి ఆరు నెలలకో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. దీనివల్ల 10 వేల ఆసుపత్రి పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రులను నిమ్స్, ఎయిమ్స్‌తో పోటీ పడి సేవలందించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. రోగులకు ఉచిత భోజనం, రోగుల సహాయకులకు డార్మిటరీలు, ఇతర వసతులు కల్పిస్తామని వివరించారు. అదనంగా పనిచేసే వైద్యులకు ఇన్సెంటివ్‌లు ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులను అదనపు సమయం పనిచేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అలా పని చేసే వారికి ఇన్సెంటివ్‌లు ఇస్తామన్నారు. ప్రభుత్వ వైద్యుల నైపుణ్యాన్ని, నేర్పరితనాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరే పేషెంట్ల కోసం ఉపయోగించుకోవాలని.. ప్రభుత్వం ఇన్సెంటివ్‌లు ఇవ్వకపోవడం వల్ల వారు ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అందువల్ల ఉన్నతాధికారులు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కష్టం వస్తే తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ అన్న అండగా ఉన్నాడన్న విశ్వాసం ప్రజలకు కల్పించాలని చెప్పారు. అంతకుముందు టిమ్స్ ఆస్పత్రిలో వార్డులు, ఓపీ, ఓటీలలో సహచర మంత్రులు, అధికారులతో కలిసి సీఎం కలియతిరిగారు. సిబ్బందితో మాట్లాడారు. ఒక్కో వార్డును ఒక్కో మంత్రి, ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవం చేయించారు. సురక్షిత ఆహారం, నాణ్యమైన మందులే లక్ష్యంగా టీజీ సేఫ్, ఆరోగ్య దీపిక పాలిక్లినిక్‌లను ప్రారంభించారు. కోటి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో 2023 నుంచి రూ. 8,923 కోట్లను ఆస్పత్రుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ‘కానీ మేం చేసిన ప్రతి పని తామే చేశామని చెప్పుకొనే తప్పుడు సంస్కృతితో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకునే ప్రతిపక్షం రాష్ట్రంలో తిరుగుతోంది’అని బట్టి విమర్శించారు. ప్రజారోగ్యం కోసం అక్టోబర్ నుంచి జులై వరకు యాక్సలరేటెడ్ పేమెంట్స్ చేయాలనే ఆలోచనతో రూ. 1,452 కోట్లు నిధులు కేటాయించినట్లు చెప్పారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజారోగ్యం కోసం ఖర్చు చేసింది రూ. 70 కోట్లు మాత్రమేనన్నారు. పేదల ఆరోగ్య రక్షణ మా ప్రభుత్వానిది: మంత్రి దామోదర పేదల ఆరోగ్య రక్షణ తమ ప్రభుత్వానిదేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ కింద రూ. కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు బలోపతం చేశామని తెలిపారు. గాందీ, పేట్లబురుజు ఆస్పత్రుల్లో ఉచితంగా ఐవీఎఫ్ సేవలు అందిస్తున్నామని.. రాబోయే పదేళ్లలో తలసేమియారహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని లక్ష్యంగా పెటుకున్నామని మంత్రి దామోదర తెలిపారు. మూడు టిమ్స్ ఆస్పత్రులతోపాటు నిమ్స్, ప్రతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 100 పడకలను ఇంటర్నేషనల్ బెడ్స్ వింగ్ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రొ.కోదండరాం, బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, టిమ్స్, నిమ్స్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్
-
‘22-Aతో రేవంత్ ప్రభుత్వం గందరగోళానికి తెరలేపింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 శాతం ప్రభుత్వం నడుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా రేవంత్ ప్రభుత్వంపై హరీష్ మండిపడ్డారు. ‘లక్షలాది ప్రాపర్టీలు 22-Aలో పెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకొన్న తర్వాత మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు.. ప్రాహిబిటేషన్ లో ఉంది అని చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వం గందరగోళానికి తెరలేపింది. ఎవరి భూమి ప్రాహిబిటేషన్ లో ఉందో తెలియని పరిస్థితి. సీఎం రేవంత్ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉంది. అందుకే తొలగించడానికి హడావుడి చేస్తున్నారు. రాష్ట్రం లో 30 పర్సంటేజ్ ప్రభుత్వం నడుస్తుంది. ప్రాహిబిటేషన్లో నుండి సర్వే నంబర్ తీసివేయాలంటే 30 పర్సంటేజ్ ఆడుతున్నారు. రెవెన్యూలో మీ పని జరగాలంటే. 30 పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అంటున్నారు’ అని హరీష్ విమర్శించారు.సొంతింటి యజమానులకు ‘22–ఏ’ పిడుగు..! Cm రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ప్రోహిబిటెషన్ లో ఉంది..Cm రేవంత్ రెడ్డి ఇల్లు వుండటంతో ఇప్పుడు ప్రోహుబిటేషన్ తీసివేస్తం అంటున్నారు..22ఏ పై విచారణ జరపాలి..ప్రాహిబిటేషన్ పెట్టమని ఆదేశించింది ఎవరు. కారకులు ఎవరు..రాష్ట్రం లో 30 పర్సంటేజ్ ప్రభుత్వం నడుస్తుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి అలా ఉంటే ..సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది -
బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)
-
పేదలకు పెద్ద వైద్యం!
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్‌లోని డా.మర్రిచెన్నారెడ్డి టిమ్స్ ఆస్పత్రి ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు ఈ ఆస్పత్రి ప్రారంభం వాయిదా పడిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్‌లో నిర్మించిన ప్రతిష్టాత్మక డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నా రు. ఈ ఆస్పత్రిలో ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దారు. ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలి సారిగా ప్రభుత్వ ఆస్పత్రి (టిమ్స్)లో ఏర్పాటు చేయడం విశేషం. ఫలితంగా రోగుల నుంచి సేకరించిన పరీక్షా నమూనాల ఫలితాలను ఒకటి, రెండు నిమిషాల వ్యవధిలో అందుబాటులోకి రానున్నాయి. కాగా, మంత్రి రాజనర్సింహ ఆదివారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జకారియా, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ బ్లాక్‌లో ఏముంటుంది? ఆస్పత్రిని నాలుగు బ్లాకులుగా నిర్మించారు. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. డయాగ్నోస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ, 12 మైక్రోబయాలజీ, 10 బయోకెమిస్ట్రీ, 5 ప్రత్యేక ల్యాబ్‌లు ఉన్నాయి. బ్లాక్–ఏలో అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉంటాయి. బ్లాక్–బీలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్‌ల్యాబ్‌లు, బ్లాక్–సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు, బ్లాక్–డీలో పరిపాలన, విద్యా విభాగాలతో పాటు, ఆడిటోరియం ఉంటుంది. మొత్తం 1,080 పడకలు అందుబాటులోకి రానున్నాయి. నిమిషాల్లోనే రక్త నమూనాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ టిమ్స్ సనత్ నగర్ లో ఏర్పాటు చేశారు. సీల్డ్ ట్యూబ్‌లు, గాలి ఒత్తిడితో రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలు, అత్యవసర వినియోగ వస్తువులను వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్‌లు, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్‌ల మధ్య కేవలం 1–2 నిమిషాల్లో ఈ విధానం ద్వారా తరలించవచ్చు.ఫలితంగా వేగవంతమైన చికిత్సలు అందుతాయి. ఆరు కీలక విభాగాల్లో .. టిమ్స్‌లో అవయవ మార్పిడి, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, నెఫ్రాలజీ, ట్రామా కేర్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పనిచేస్తుంది. కిడ్నీ, కాలేయం, గుండె, బహుళ అవయవ మార్పిడి సేవలకు ఇక్కడ అవకాశం ఉంది. ఆధునిక కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలు, లీనాక్ ఆధారిత రేడియోథెరపీ, 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ బ్యాకప్‌తో 30 క్లినికల్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. 3 టెస్లా ఎంఆర్ఐ, 128 స్లైస్ సీటీ స్కానర్, అధునాతన మామోగ్రఫీ యూనిట్, ఐదు ఎక్స్‌రే యంత్రాలు ఏర్పాటు చేశారు. సహాయకుల కోసం ధర్మశాల రోగులతో వచ్చే సహాయకుల కోసం జీ+5 అంతస్తుల్లో ధర్మశాలను నిర్మించారు. ఇందులో 200 మందికి వసతి కల్పించే సదుపాయం ఉంది. 30 మృతదేహాల సామర్థ్యంతో మార్చురీ, కేంద్ర వంటశాల, లాండ్రీ, వైద్య వాయువు పైప్‌లైన్ వ్యవస్థలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 200 మంది కూర్చునే ఆడిటోరియం కూడా ఉంది. పర్యావరణహిత నిర్మాణానికి టిమ్స్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. నీటి వినియోగాన్ని 75 శాతం వరకు తగ్గించే సాంకేతికతను అమలు చేశారు. మురుగునీరు, వ్యర్థ ద్రవాల శుద్ధికి ఎస్టీపీ, ఈటీపీలు ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సేకరించి మొక్కలు, పచ్చదనం కోసం వినియోగించే విధానం ఉంది. పర్యావరణహిత నిర్మాణం, ఇంధన సామర్థ్య వ్యవస్థల కారణంగా ప్రాజెక్టుకు ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ లభించింది. ఒకే మాస్టర్‌ప్లాన్‌తో నిర్మాణం సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం దశలవారీగా సాగుతుండగా.. టిమ్స్ సనత్‌నగర్‌ను ఒకే దశలో, ఒకే మాస్టర్‌ప్లాన్ కింద సంపూర్ణ సూపర్ స్పెషాలిటీ వైద్య సముదాయంగా నిర్మించారు. ప్రభుత్వ వైద్యరంగంలో అత్యాధునిక మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా టిమ్స్ సనత్‌నగర్ నిలవనుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లభించే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను సామాన్యులకు ప్రభుత్వ వ్యవస్థలోనే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యానికి ఇది కీలక ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. -
మేడారంలో సీఎం రేవంత్ పూజలు
ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి/ములుగు రూరల్: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు మేడారం చేరుకున్న రేవంత్.. ప్రత్యేక కాన్వాయ్‌లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయ పద్ధతిలో రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సమ్మక్క–సారలమ్మ పూజారులు, అధికారులు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.అమ్మవార్ల సన్నిధిలో సీఎం ఎత్తు బంగారం (బెల్లం) తులాభారం వేశారు. ఎత్తు బంగారం, పసుపు, కుంకుమ, చీరసారెలతో అమ్మవార్ల గద్దెలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లులకు చీరసారె, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధిపనులను పరిశీలించారు. రేవంత్‌రెడ్డి బరువు 67 కేజీలుమేడారం అమ్మవార్లకు సీఎం రేవంత్‌రెడ్డి తులాభారం నిర్వహించగా ఆయన 67 కేజీల బరువు ఉన్నారు. ఈ ఏడాది మహాజాతర సమయంలో అమ్మవార్లకు తులాభారం నిర్వహించిన ఆయన బరువు 68 కేజీలుగా ఉంది. జాతర జరిగి ఆరు నెలలు దాటగా రేవంత్‌రెడ్డి కిలో బరువు తగ్గారు. పింఛన్ల పంపిణీ24 మంది మహిళలకు చేయూత పింఛన్లు, గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన 24 మంది వితంతువులు, ఒంటరి మహిళలకు సామాజిక భద్రత పింఛన్లు అందజేశారు. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఉపాధి, ఆర్థిక అభివృద్ధి అంశాలు అడిగి తెలుసుకున్నారు. పైలాన్ ఆవిష్కరణములుగు జిల్లా కేంద్రం శివారు గట్టమ్మ ఆలయం వద్ద నిర్మించిన గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. అదేవిధంగా నూతన కలెక్టరేట్‌ను మంత్రి సీతక్క చేతులమీదుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును కుర్చీలో కూర్చోబెట్టి శాలువా కప్పారు. -
కేసీఆర్‌ది కుటుంబ పాలన... నాది సామాజిక పాలన
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికే లాభం.. నేను ముఖ్యమంత్రి అయితే ప్రజలకే లాభం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులకే పదవులు దక్కాయని.. తమ ప్రజా ప్రభుత్వంలో ఆడబిడ్డలు, ఉద్యమకారులు, సామాజిక వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ములుగు, పరకాలలో ఆదివారం నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, ‘ప్రజా పాలన–ప్రగతి బాట’ బహిరంగ సభల్లో సీఎం ప్రసంగించారు. ‘రక్తం పంచుకుని పుట్టకపోయినా సీతక్కను ఆడబిడ్డగా గౌరవిస్తున్నా. ఇంకోవైపు రక్తం పంచుకుపుట్టిన సోదరిని ఆస్తికోసం ఇంటి నుంచి పంపించారు. సలాక కాల్చి కొడుక్కి బుద్ధి చెప్పాల్సిన తండ్రి ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడు. వీళ్లు తెలంగాణ ఆడబిడ్డలకు మేలు చేస్తారా? సొంత చెల్లికి న్యాయం చేయని కేటీఆర్ రెండు కోట్ల మంది అక్కాచెల్లెళ్లకు మేలు చేస్తారా?’ అని రేవంత్ ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు... నాకు తేడా అదే.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కేటీఆర్, హరీశ్‌రావులను మంత్రులను చేశారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. తాను సీఎం అయిన తర్వాత సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చానన్నారు. కేసీఆర్.. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇస్తే.. తాను అడ్లూరి లక్ష్మణ్‌కు అవకాశం కల్పించానన్నారు. కేసీఆర్ తన కుమార్తెను ఎంపీగా, ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా చేశారని.. తాను కావ్యను ఎంపీగా, యశస్వినిని ఎమ్మెల్యేగా చేశానని చెప్పారు. కేసీఆర్ సడ్డకుని కొడుకు సంతోష్‌రావును ఎంపీని చేస్తే.. తాను మిత్రధర్మంతో వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ అవకాశం ఇచ్చానన్నారు. ఓడిపోయిన బోయిన్పల్లి వినోద్‌కుమార్‌కు ప్లానింగ్ కమిషన్ వైస్‌చైర్మన్ పదవి ఇస్తే.. తాను ఉద్యమకారుడు కోదండరాంను ఎమ్మెల్సీగా చేశానన్నారు. కేటీఆర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేస్తే.. తాను మహేశ్‌కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా చేశానని చెప్పారు. వచ్చే నెల్లో అసెంబ్లీ పెడతా... ‘అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని బావా, బావమరదులు అడుగుతున్నారు. సెప్టెంబర్‌లో సమావేశాలు పెడతా. కేసీఆర్‌ను కూడా తీసుకొని రండి అక్కడే అన్నీ మాట్లాడుదాం’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి లాభం జరిగిందో లెక్కలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2029 ఎన్నికలకు ఇప్పటినుంచే రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నట్లు రేవంత్ సంకేతాలిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి రెట్టింపు మెజారిటీ ఇవ్వాలని కోరారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎంతమంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతోనే తాను ములుగునుంచి పాదయాత్ర ప్రారంభించానని రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర నలుమూలలా ప్రతీ గూడెం, పల్లెకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని భరోసా ఇచ్చామని, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరని, వారి కష్టాలు తీరాలంటే ములుగు ప్రాంతానికి సాగునీరు అందాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని సీఎం చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తామని ప్రకటించారు. ‘ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది.. పరీక్షలకు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది’ అని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. జంపన్నవాగును నూటికి నూరు శాతం అభివద్ధి చేస్తామని ప్రకటించారు. గత పాలకులు బతుకమ్మ చీరల్లో కమీషన్ నొక్కి ఫాంహౌస్‌లో పడుకుంటే.. సారె పేరు మీద ఆడపడుచులకు పాలపిట్ట చీరలు అందించామన్నారు. ఈ డిసెంబర్లో ప్రతీ ఆడబిడ్డకు చిలకపచ్చ చీరలు అందిస్తామన్నారు. పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లా ఎప్పుడూ చైతన్యం ప్రదర్శించిందని సీఎం అన్నారు. మీరు అండగా ఉంటే ఏమైనా చేస్తా.. ప్రజలు ఇబ్బందులు పడాలని కొందరు కోరుకున్నారని, అఘోరా పూజలు చేశారని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్.. దేవుడు తమవైపే ఉన్నాడని, వర్షాలు కురిపించాడని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం.. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం’ అని అన్నారు. ములుగు, పరకాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు నిర్వహించగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, డా.కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్విని, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట: మంత్రి పొంగులేటి పేదల సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పరకాల నియోజకవర్గంలో రూ.400 కోట్లకు పైగా అభివద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దశాబ్దాల వరంగల్ ప్రజల కల మామునూరు విమానాశ్రయాన్ని సాకారం చేస్తున్నామని, రాబోయే రెండేళ్లలో విమానాశ్రయం పూర్తి చేసి సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరంగల్‌లో సుమారు రూ.5,700 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. సంక్షేమం, సామాజిక న్యాయమే: మహేశ్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత సమర్థంగా అందించేందుకు 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. సమగ్ర సామాజిక, కుల సర్వే ద్వారా అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి సామాజిక న్యాయం దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
సీఎం పరకాల పర్యటనకు కొండా సురేఖ దూరం.. !
పరకాల: ఒకవైపు సీఎం రేవంత్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. మరొకవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీచేస్తారని రేవంత్ వ్యాఖ్యలు.. వీరి మధ్య దూరం పెరిగిందనే వాదనకు బలం ఇస్తోంది. తాజాగా సీఎం రేవంత్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే మేడారం సమ్మక్క-సారలమ్మ అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎం రేవంత్. మరొకవైపు రేవంత్ పరకాల సభలోనూ కొండా సురేఖ కనిపించలేదు. దాంతో ఈ అంశం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీ చేస్తారని రేవంత్ చెప్పడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. రేవూరిని ఆశీర్వదించాలని కూడా రేవంత్ పిలుపునిచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు కొండా సురేఖ దూరంగా ఉన్నారనే చర్చ మొదలైంది. -
అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్‌ను తీసుకొస్తారా?: రేవంత్
పరకాల: అసెంబ్లీ పెట్టు వస్తామని బావ, బావమరుదులు అడుగుతున్నారని కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబరులో అసెంబ్లీ సమావేశాలు పెడతానని.. బావ, బావమరుదులు కలిసి కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని సవాలు విసిరారు.హనుమకొండ జిల్లాలోని పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రజల మీద ఆధిపత్యం చేసేవారిని వరంగల్ ప్రజలు బొందపెట్టారు. కాకలు తీరిన నేతలను యశస్విని భారీ తేడాతో ఓడించారు. మిమ్మల్ని ఓడించేవాళ్లు లేరనుకున్న వాళ్లను పాతరేశారు. ఎప్పటికీ అధికారం మాదే అనుకునేవారిని ప్రజలు ఓడించారు. వ్యవసాయాన్ని పండుగలా చేశాం. మా హయాంలో వరి పండించిన రైతులకు బోనస్ ఇచ్చి ధాన్యం కొన్నాం.కేసీఆర్ పాలనలో ఒక్క మహిళకు కూడా పదవి ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. విడతలవారీగా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం. నిరుద్యోగులను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ రక్తదానం నిర్వహించింది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరు కూడా రక్తం ఇవ్వలేదు’’ అని చెప్పారు. -
తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడితోనే.. 'కులగణన'
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కులగణన చేసి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. జనగణనలో కులగణన చే యాలన్న తెలంగాణ ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో చేసిన కులగణన నివేదికను కేంద్రానికి పంపించాం. దీనితో కేంద్రం కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడానికి దోహదపడింది. దేశంలోనే సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను పకడ్బందీగా నిర్వహించి కులాల వారీగా సామాజిక స్థితిగతులను వెల్లడించాం. 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి వ ర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించాం. చివరగా దేశంలో 1931లో బ్రిటిష్ పాలనలో కులగణన జరిగింది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఆయన పరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఇక ఆన్లైన్లో ప్రజావాణి.. ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ ప్రారంభించి త్వరలోనే ఇక ఆన్లైన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఆర్జీలను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. వాటి పరిష్కార పురోగతిని ప్రత్యేక డ్యాష్‌బోర్డు ద్వారా నిరంతర పర్యవేక్షిస్తాం. ఈనెల 17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ స్కీమ్ అమల్లోకి తెచ్చాం. టీ–ఫైబర్ ద్వారా భారత్ నెట్ రెండో దశలో 8,895 గ్రామపంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాం. మూసీ బాధితులకు నష్టం కలిగించం... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి మొత్తం వ్యయంలో 12.4 శాతం కేటాయించాం. కనీస వేతనాలను సవరించి 1.11 కోట్ల మంది కార్మీకులకు ప్రయోజనం కల్పించాం. గిగ్ కార్మీకులకు చట్టబద్ధ గుర్తింపు కల్పించాం. సినీ కార్మీకుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాం. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల తెలంగాణ చట్టానికి రూపకల్పన చేస్తున్నాం. 55 కి.మీ. పరిధిలో మూసీ పునరుజ్జీవనంలో భాగంగా 39 కొత్త ఎస్టీపీల నిర్మాణంతోపాటు 2.5 టీఎంసీల గోదావరి నీళ్లను మూసీకి తరలించే ప్రణాళికను తీసుకెళ్తున్నాం. మూసీ పరీవాహకంలో నివాసితులకు ఎలాంటి కష్టం, నష్టం కలిగించం. మీ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఫ్యూచర్ సిటీ రైతులకు పరిహారం రాష్ట్రాన్ని 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ జీడీపీలో రాష్ట్రవాటాను 10 శాతానికి పెంచే దిశగా ముందుకు సాగుతున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్–జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. 30వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి భూములిచ్చిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన రాష్ట్ర వాటా సాధించే విషయంలో రాజీ లేదు. అటు తుమ్మడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. టీజీ–ఐపాస్‌తో రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి. నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ–2026తో తెలంగాణను ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో నిలబెట్టేలా దిశా నిర్దేశం చేసుకున్నాం. కేపీహెచ్బీలో ఇందిరమ్మ టవర్స్.. తొలి దశలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షల ఇందిమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నాం. అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెట్టాం. కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ విద్య ప్రారంభించాం. ప్రభుత్వ శాఖల్లో 72 వేల ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాం. దక్షిణ భారత దేశంలో తొలి రోబోటిక్ కిడ్నీ మార్పిడి నిర్వహించిన తొలి ప్రభుత్వ ఆస్పత్రికి నిమ్స్ చరిత్ర సృష్టించింది. డ్రగ్స్, ఆహార కల్తీని ఎదుర్కొనేందుకు టీజీ సేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేసి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణకి టీజీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకున్నాం. -
TG: లోక్‌భవన్‌లో గవర్నర్ తేనీటి విందు
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్ భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు గవర్నర్ తేనీటి విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు, ఇతర ఆహ్వానితులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్
సిద్ధిపేట: సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేది ప్రతీది అబద్దమేనని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ఆయన అబద్ధాలే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. అబద్ధాలు మాట్లాడే రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రేవంత్‌రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పరని, ఆయనొక ఘరానా మోసగాడని ధ్వజమెత్తారు. రేవంత్‌కు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే రుణమాఫీ చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 15వ తేదీ) సిద్ధిపేట నుంచి మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్‌రావు.. రేవంత్‌పై ధ్వజమెత్తారు. ‘దేవుళ్లపై ఒట్టుపెట్టి మోసం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. అసెంబ్లీలో అన్ని రికార్డులు భద్రంగా ఉన్నాయి. రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే రుణమాఫీ చెయ్యాలి. రేవంత్‌రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పలేదు. రేవంత్‌రెడ్డి ఘరానా మోసగాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పాలి. ఆనాడు రూ. 1400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెడితే మేం కట్టాం. పిల్లలకు క్షమాపణలు చెబుతావా.. ముక్కు నేలకు రాస్తావా?, నిరుద్యోగుల గురించి రేవంత్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. గన్మెన్లు లేకుండా అశోక్‌నగర్‌కు రాగలవా? అని నిలదీశారు.‘కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు కంటే రేవంత్ తక్కువ ఇచ్చారు. రూ. 15 వేల కోట్లు రైతు బంధు రేవంత్ ఎగ్గొట్టాడు. 2025-26లో మీరు ఇచ్చింది కేవలం రూ. 11 వేల కోట్లు మాత్రమే. ఇది తప్పు అయితే ముక్కు నేలకు రాస్తా. రేవంత్‌కు ఇదే నా సవాల్. అబద్ధాలు మాట్లాడే రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు. 2 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి యువతను మోసం చేశావు. మూడేళ్లలో 16వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్‌ను కోర్టుకు ఈడుస్తా. నాపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలి. పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగుతా. రైతుబంధు, రుణమాఫీపై దమ్ముంటే అసెంబ్లీ చర్చింద్దాం. కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై మీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. మీ అవినీతిపై పోచారం, రాజగోపాల్ెడ్డి మాట్లాడారు. రుణమాఫీ విషయంలో రేవంత్‌కు ఊరికే వెళ్దాం. అందరికీ రుణమాఫీ అయితే అక్కడే రాజీనామా చేస్తా. రుణమాఫీ కాలేదంటే రేవంత్ రాజీనామా చేస్తారా?అని సవాల్ విసిరారు. -
జగ్గారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగ్గారెడ్డేనని సీఎం రేవంత్ ప్రశంసించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో ఆయన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రత్యేకంగా జగ్గారెడ్డి గురించి సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ జగ్గారెడ్డి 30 ఏళ్ల నుంచి నా దోస్తు. జగ్గారెడ్డి నేను నిలబడను అంటే కాదు. జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు. ఇంకోసారి జగ్గారెడ్డి అలా అంటే వారం రోజులు ఇంట్లో పెట్టి తాళం వేయండి’ అని సరదాగా మాట్లాడారు.‘ప్రజల కోసం పరితపించే నాయకుల్లో జగ్గారెడ్డి నంబర్ వన్. జగ్గారెడ్డి గెలిచి ఉంటే మంచి పదవిలో ఉండేవారు. ఓడిపోయినా ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి జగ్గారెడ్డి. వెయ్యి కోట్లు, వజ్రాలు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి వారు దొరకరు. జగ్గారెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేయాలో రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు. రాహుల్ గాంధీ రాముడైతే.. జగ్గారెడ్డి హనమంతుడు. రాహుల్ గాంధీ గీసిన గీత జగ్గారెడ్డి ఎప్పుడూ దాటడు. జగ్గారెడ్డిని కాపాడుకునే బాధ్యత మీది. జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి. ఓ సోదరుడిగా జగ్గారెడ్డికి అండగా ఉండాలని కోరుకుంటున్న’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఈ స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ఓ ప్లాస్టిక్ కార్డు కాదు..: రేవంత్ రెడ్డి -
ఈ స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ఓ ప్లాస్టిక్ కార్డు కాదు..: రేవంత్ రెడ్డి
సంగారెడ్డి: బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, నాణేనికి బొమ్మ, బొరుసులాంటివని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో ఆయన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ప్లాస్టిక్ కార్డు కాదని, పేదల ఆత్మగౌరవమని తెలిపారు.‘‘కేసీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నాను. రైతులకు మేము చేసిన మేలు ఏంటో మీరు చేసిన అన్యాయమేంటో చర్చకు సిద్ధం. సంక్షేమ పథకాలపై కొందరు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. చర్చిద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం వరి వేసిన రైతులకు బోనస్ ఇచ్చింది’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలని ఆ రెండు పార్టీలు ఏనాడైనా ఆలోచించాయా? అని రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘పేదల కోసం ఇందిరా గాంధీ అహర్నిశలు పాటుపడ్డారు. రైతులకు మేం చేసిన మేలు ఏంటో మీరు చేసిన మేలు ఏంటో చర్చకు సిద్ధం. పేదల కోసమే రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. సంక్షేమ పథకాలపై కొందరు ప్రశ్నిస్తున్నారు. 3.48 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. బీఆర్ఎస్ సన్నబియ్యం ఇవ్వాలని పదేళ్లలో ఏనాడూ ఆలోచించలేదు’’ అని చెప్పారు.2034 వరకు మీ ఆశీర్వాదం ఉండాలివిధ్వంసం అయిన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘అన్నం తిన్నా తినకపోయినా కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కడుతూ అప్పుల ఊబిలో నుంచి బయటికి వస్తున్నా. ఓ పూట ఆలస్యం కావచ్చు మీ హక్కులను భంగం కలగనివ్వం. బీఆర్ఎస్ పాలన, మా పాలనను అంచనా వేయండి. దేశంలో మొదటిసారి కులగణన చేసేంది కాంగ్రెస్. 2034 వరకు మీ ఆశీర్వాదం ఉండాలి. మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏమి లేదు’’ అని చెప్పారు. -
ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్‌దారులు, విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై తొలిసారి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమర జవాన్ల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించారు.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నాం. 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తోంది. రైతులకు సంక్షేమం కోసం తమ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని.. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చాక లక్షా 70 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం కేటాయించామని తెలిపారు. 2 లక్షల పంట రుణమాఫీతో 25 లక్షల మంది రైతు కుటుంబాలకు మేలు జరిగిందని.. కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని అన్నారు.పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. కోర్ అర్బన్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని.. తద్వారా పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2.25 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వితంతులకు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు.రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చామని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కోటి మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మీ స్కీంతో ఆడబిడ్డలకు అండగా ఉంటున్నామన్నారు. మహాలక్ష్మీ, గృహా లక్ష్మీ స్కీములతో ఆడబిడ్డలకు ఆసరా అయ్యామని అన్నారు.పెట్రోల్ బంకులకు మహిళా సంఘాలను యజమానులను చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ ద్వారా సన్నం బియ్యం పంపిణీ పథకాన్ని విప్లవాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. అలాగే, రాష్ట్రంలోని విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని పూర్తిగా అందజేస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం 2400కోట్ల రూపాయలు ముందుగానే బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అయిందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరిని అడగవలసిన అవసరం లేకుండా డబ్బులు నేరుగా వారి ఖాతాలలోనే పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
ముందే ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే మార్పులు అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అయితే ఇకపై ఈ నిధులను ముందుగానే అడ్వాన్స్‌గా బ్యాంకులో జమ చేస్తాం. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే దరఖాస్తులను పరిశీలించి కేవలం నెల వ్యవధిలోనే విద్యార్థి ఖాతాలో ఫీజు నిధులు జమ చేస్తాం. ఈ ఏడాది ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేశాం. ఇకపై కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు..’అని సీఎం తెలిపారు. శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా ఫూలే, సావిత్రీ బాయి పూలే విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు‘ప్రస్తుతం విద్య ఒక్కటి ఉంటే సరిపోదు. నైపుణ్యంతో కూడిన విద్య అత్యవసరం. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలొస్తాయి. దశాబ్దం క్రితం ఇంజనీర్‌కు ఇప్పుడు మార్కెట్ లేదు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు తగినట్లుగా మారిన వారికే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన ప్రజా ప్రభుత్వం ఏటీసీలను అభివృద్ధి చేసింది. అక్కడ చదివే విద్యార్థులకు రూ.2 వేల స్టైపెండ్ ఇస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అత్యుత్తమ నైపుణ్యాలను అందించి పరిశ్రమలకు తగిన మానవ వనరులను తయారు చేస్తోంది. కులాలు లేని విద్యా వ్యవస్థకు రూపకల్పనవిద్య ఒక్కటే మనిషికి ఆత్మ గౌరవాన్ని ఇస్తుంది. ఆ విద్యను అందరికీ సమానంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యం. కులాలు లేని విద్యా వ్యవస్థను తయారు చేస్తున్నాం. అందుకే సమీకృత గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలనే భేదాలు లేకుండా అందరికీ ఒకేచోట విద్యను అందించనున్నాం. నర్సరీ నుంచి ఇంటర్ వరకు అన్ని వసతులు కల్పిస్తున్నాం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అందిస్తున్నాం. ఇప్పుడు నూటికి నూరు మార్కులు వచ్చిన విద్యార్థులు 90 శాతం మంది ఉంటున్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాం. మీ రేవంతన్న దేశంలోనే మొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యను పరిష్కరించాడు. బీసీ జనగణన చేయడానికి దేశంలో ఎవరూ ధైర్యం చేయలేదు. బ్రిటిష్ వాళ్ల తర్వాత ఈ ప్రజా ప్రభుత్వం కుల గణన చేసి బీసీల లెక్క తేలి్చంది. గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు పెంచుకొమ్మంది..గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు పెంచుకోండని, చెప్పులు కుట్టుకోండని, చేపలు పట్టుకోమని చెప్పింది. వాళ్ల పిల్లలు రాజ్యాలు ఏలాలన్నదే వాళ్ల ఆలోచన. బీసీలు రాజ్యాధికారంలో భాగం అడుగుతారన్న ఉద్దేశంతోనే గొర్రెలు, బర్రెలు పెంచుకోమన్నారు. ఇప్పుడు కూడా చెప్పులు కుట్టుకోవాల్సిందేనా? గొర్రెలు, బర్రెలు కాయాల్సిందేనా? ఈ సమాజం చదువుకోవద్దా? ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కావొద్దా.? చదువు ఒక్కటే తలరాతలు మారుస్తుంది. తెలంగాణను మారుస్తుంది. జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు చట్టసభల్లోకి రావాలి. నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది. మీ బంగారు భవిష్యత్తుకోసం రోజుకు 18 గంటలు పనిచేస్తా. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు కృషి చేయాలి..’అని సీఎం అన్నారు. మహనీయుల స్ఫూర్తితో మా పాలన సాగుతోంది: భట్టిసామాజిక అసమానతలను తొలగించి బడుగు, బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఫూలే దంపతులు జీవితాంతం పోరాడారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వారి స్ఫూర్తితోనే విద్య, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఫూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 300 నుంచి 700కు పెంచామని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఆశయాలకు, సామాజిక న్యాయానికి ఇస్తున్న గౌరవానికి సూచనగా ఈ విగ్రహాల ఆవిష్కరణ చేపట్టామన్నారు. కుల, లింగ వివక్ష, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఫూలే దంపతులు పోరాడారని, విద్యే సమాజ మార్పునకు శక్తివంతమైన ఆయుధమని చాటిచెప్పారని తెలిపారు. మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, మహమ్మద్ అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు తేదీలను ఖరారు చేసింది. ఈసారి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. అనంతరం రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఆవిష్కరణల ఎగ్జిబిషన్, స్టాల్స్‘సదస్సు నిర్వహణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘంతో పాటు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గత ఏడాది ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ ఆవిష్కరించగా, ఈసారి సదస్సులో ఫ్యూచర్ సిటీ ప్రణాళికను ఆవిష్కరించనుంది. ప్రధానంగా రాష్ట్రంలో రక్షణ, ఏరో స్పేస్, ఫార్మా రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈసారి సదస్సు జరుగుతుంది. వివిధ రంగాల్లో ఇప్పటికే తెలంగాణ స్టార్టప్‌లు, పరిశ్రమలు సాధించిన విజయాలు.. వివిధ రంగాల కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఎగ్జిబిషన్, స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ రేషన్‌కార్డులు రెడీ..స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్మార్ట్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లో ప్రారంభిస్తారు. జిల్లాల్లో సంబంధిత జిల్లాల ఇన్చార్జి మంత్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్‌కార్డు లబ్ధిదారులుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడంతో 62 లక్షల మందికి కొత్తగా లబ్ధి చేకూర్చింది. మొత్తం 3 కోట్ల 42 లక్షలకు లబ్ధిదారులు పెరిగారు. వీరికి స్మార్ట్ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సన్న ధాన్యం సాగుపై రైతులకు అవగాహనప్రస్తుత వానాకాలంలో ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రైతులకు అవగాహన కల్పించడానికి అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ ఏడు రకాల సన్నాలకే రూ.500 బోనస్ చెల్లించాలని కేబినెట్ తీర్మానించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.అందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,389 కనీస ధరతో సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ–వేలం ద్వారా విక్రయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబట్టుకున్న నేపథ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాల్‌కు కేంద్రం నిర్దేశించిన కనీస ధర రూ.2,389ను ప్రాథమిక ధరగా నిర్ణయించి ఈ– వేలం ద్వారా అమ్మాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్కిల్స్ వర్సిటీ పరిధిలోకి ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్లుసాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిని తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి తొలగించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తొలివిడతగా 113 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, కొత్త వాటితో కలిపి ఇప్పటివరకు మొత్తం 86 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యాయి. క్యూర్లో ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల రాయితీకోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చే దిశగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలున్నాయి. వీటిని ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్టంగా రూ.1.5 లక్షల సబ్సిడీ అందిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం/ పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నారు.హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు అంటే అక్టోబర్ 31 వరకు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను రూ.2,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు, సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి ఆమోదం తెలిపింది.వెబ్సైట్లో నిషేధిత భూముల జాబితా: మంత్రి పొంగులేటి ప్రభుత్వ స్థలాలు, న్యాయ వివాదాల్లో ఉన్న భూములు మినహా ఇతర ప్రైవేటు భూములను 22ఏ–నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తామని మంత్రి పొంగులేటి..విలేకరుల ప్రశ్నకు జవాబుగా చెప్పారు. జిల్లా కలెక్టర్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఇప్పటికే ఈ విషయంలో సూచనలు జారీ చేశామన్నారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న అన్ని భూముల వివరాలను శుక్రవారం సాయంత్రంలోగా వెబ్సైట్లో పొందుపరచాలని ఆదేశించామన్నారు. క్యూర్ ఏరియా పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లను ఆవపవద్దని రిజిస్ట్రార్లను ఆదేశించామని తెలిపారు.కేబినెట్ నిర్ణయాలను విలేకరుల సమావేశంలో వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రి అడ్లూరి, ఎంపీ రఘురాంరెడ్డి -
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు
సాక్షి, హైదరాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. అందరం కలిసి ఐక్యంగా పనిచేస్తూ ముందుకెళ్దామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. అన్ని రకాలుగా కష్టపడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఏదంటే అది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం సరైంది కాదు. ఇప్పటివరకు జరిగింది చాలు. ఇంకో రెండేళ్లు మాత్రమే సమయముంది. ఈ రెండేళ్లు కష్టపడి పనిచేసి, మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఐక్యంగా ప్రయత్నిద్దాం..’ అని అన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత.. 10 నిమిషాల పాటు ఆయన రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురించి ముఖ్యమంత్రి పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఏది మాట్లాడినా తనతో నేరుగా లేదా పార్టీ వేదికలపై మాట్లాడాలే తప్ప బయట మీడియాతో మాట్లాడి నష్టం చేసుకోవద్దని సూచించారు. అన్ని స్థాయిల్లో నియంత్రణ ఉండాలి.. జిల్లాల్లో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను జిల్లాల ఇన్చార్జి మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. వారికున్న సమస్యలను తీర్చడానికి ప్రయత్నించాలని, వారు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా చూడాలని చెప్పారు. అంతర్గతంగా చర్చించుకునే అంశాలను యథాలాపంగా బయట ఎక్కడపడితే అక్కడ, ఎవరితోనూ పంచుకోవద్దని, ఎంతవరకు అవసరమో ఆ మేరకు ప్రస్తావించాలే తప్ప.. పార్టీకీ, ప్రభుత్వానికి నష్టం జరిగేలా వ్యవహరించొద్దంటూ సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. ఎవరైనా ఆచితూచి మాట్లాడకపోతే అంతిమంగా మనందరికీ నష్టం జరుగుతుందని అలా జరగకుండా అన్ని స్థాయిల్లో నియంత్రణ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డట్టు సమాచారం. బీఎల్ఓలను పూర్తిగా నమ్మొద్దు.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గురించి కూడా మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి రాష్ట్రంలో ఎస్ఐఆర్ కుట్ర చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రాకుండా ఉండాలనే దుగ్ధతో పనిచేస్తున్నాయని, ఈ కుట్రను సమష్టిగా ఎదుర్కోవాలని కోరారు. ‘ఎన్నికల సంఘం పక్షాన బీఎల్ఓలు ఉంటే.. పార్టీ పక్షా బూత్ లెవల్ ఏజెంట్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం మనదే ఉంది కదా అని బీఎల్ఓలను నమ్మవద్దు. మన బీఎల్ఏలు ఎవరైనా సరిగా పనిచేయకపోతే వారిని వెంటనే తప్పించండి. చురుగ్గా ఉన్న వారిని నియమించండి. అనామలిస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని, ఓటర్లకు అన్ని విధాలా సహకరించి వారి ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇన్చార్జి మంత్రులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు అందరూ అప్రమత్తంగా ఉండి అర్హులైన వారి ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది పార్టీ లైన్..’అని చెప్పినట్టు సమాచారం. -
ఇక ‘స్మార్ట్’గా రేషన్ కార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్దిదారుల గుర్తింపును మరింత పటిష్టం చేయడంతోపాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డు (స్మార్ట్ రేషన్‌కార్డు)లో పలు భద్రతా ఫీచర్లను పొందుపరిచింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్డులో కనిపించే భద్రతా అంశాలతోపాటు సాధారణంగా గుర్తించలేని రహస్య భద్రతా గుర్తులు, స్పర్శ ద్వారా గుర్తించే సాంకేతికత, డిజిటల్ ధ్రువీకరణ వంటి పద్ధతులను కార్డులో వినియోగించారు. కార్డుపై తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన హోలోగ్రామ్‌ను ముద్రించారు. అలాగే జారీ చేసే అధికారి అయిన పౌరసరఫరాల కమిషనర్ అధికారిక సంతకాన్ని కూడా కార్డులో పొందుపరిచారు. దీంతో కార్డు ప్రామాణికతను నిర్ధారించడం, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్దిదారుల గుర్తింపును బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చేతితో తడిమితే తెలిసే అక్షరాలు ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’అనే పదాలను ఉబ్బెత్తుగా ముద్రించారు. చేతితో తడిమినప్పుడు ఈ అక్షరాలు స్పష్టంగా తెలుస్తాయి. అలాగే కార్డులో మైక్రో ప్రింటెడ్ టెక్సŠట్ను కూడా ఉపయోగించారు. అతి చిన్న పరిమాణంలో ఉండే ఈ అక్షరాలు సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించవు. పెద్దదిగా పరిశీలించినప్పుడు మాత్రమే చదవగలిగేలా ఉంటాయి. సాధారణ ప్రింటర్లతో నకిలీ చేయడం కష్టంగా ఉండటంతో ఇది యాంటీ–కాపీ భద్రతా అంశంగా పనిచేస్తుంది.‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’, ‘ఒరిజినల్’వంటి అక్షరాలతో ద్వంద్వ రహస్య చిత్రాలను పొందుపరిచారు. నిర్దిష్ట కోణంలో చూసినప్పుడు లేదా పెద్దదిగా పరిశీలించినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయి. కార్డు అసలైనదో కాదో నిర్ధారించేందుకు నిపుణులకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో వాటర్‌మార్క్‌ను కార్డులో పొందుపరిచారు. కార్డును వెలుతురుకు ఎదురుగా ఉంచినప్పుడు ఈ గుర్తు కనిపిస్తుంది. ప్రభుత్వ పత్రాల్లో సాధారణంగా ఉపయోగించే బలమైన ధ్రువీకరణ భద్రతా విధానాల్లో ఇది ఒకటి. అలాగే సాధారణ వెలుతురులో కనిపించని తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని అతినీలలోహిత (యూవీ) కాంతిలో కనిపించేలా ప్రత్యేక సిరాతో ముద్రించారు. యూవీ కాంతి కింద ఈ గుర్తు వెలుగుతుంది. దీంతో రహస్యంగా కార్డును తనిఖీ చేయడంతోపాటు యంత్రాల ద్వారా కూడా వేగంగా ధ్రువీకరించవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ కార్డులో లబ్దిదారుల వివరాలను భద్రంగా ధ్రువీకరించేలా ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అదీకృత సాఫ్ట్వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా మాత్రమే ఇందులోని సమాచారాన్ని ధ్రువీకరించేలా రూపొందించారు. కార్డుకు సంబంధించిన సీరియల్ నంబర్ తదితర డిజిటల్ సమాచారాన్ని ఇందులో భద్రపరచవచ్చు. అ«దీకృత వ్యవస్థ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు మాత్రమే వివరాలను ధ్రువీకరించే అవకాశం ఉంటుంది. -
ప్రజలపై చేతబడులా?
సాక్షి, హైదరాబాద్: ‘పదేళ్లు అధికారంలో ఉన్న వారు, పాతికేళ్లు తెలంగాణలో రాజకీయం చేసినవారు ప్రభుత్వం, ప్రజలపై పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చేతబడులు, అఘోరా పూజలు చేయించడం అత్యంత దుర్మార్గం. బుద్ధి సరిగ్గా లేకపోతే ఆ క్షుద్ర పూజలే తిరగబడతాయి. అదే గనుక జరిగితే మిమ్మల్ని ఫామ్‌హౌస్‌ల నుంచి బయటికి రాకుండా అష్ట దిగ్బంధనం చేస్తాయి..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గురువారం కూకట్‌పల్లిలో తొలి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రం ఎండిపోవాలని, కరువు వచ్చి జనాలు అల్లాడిపోవాలని, ప్రభుత్వం బద్నాం కావాలని ప్రతిపక్ష నాయకులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అఘోరా పూజలు, చేతబడులు చేశారు. ఎంత ఘోరమైన పూజలు చేసినా దేవుడు, అదృష్టం మా వైపే ఉన్నాయి. మా సంకల్పం మంచిది కాబట్టే ఎల్ నినో సమయంలోనూ వర్షాలు కురిసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌లు నిండాయి. హైదరాబాద్‌కు తాగునీటి ఎద్దడి లేకుండా పోయింది. చిత్తశుద్ధి, మంచి ఆలోచన ఉన్న మా ప్రభుత్వాన్ని ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ ఎల్లప్పుడూ కాపాడతాయి..’ అని సీఎం అన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు ‘గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను ఊరించి, నగరం నుంచి 40–50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో కట్టి ఇబ్బందులకు గురిచేసింది. నగరంలో పనిచేసుకునే పేదలు అర్ధరాత్రి వేళ అంత దూరం వెళ్లి ఎలా జీవిస్తారు? అందుకే కూకట్‌పల్లిలో రూ.వందల కోట్ల విలువైన 11 ఎకరాల స్థలాన్ని కేటాయించి, పేదలు నివసించే ప్రాంతంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఐటీ కంపెనీల నడుమ, శిల్పారామం పక్కన రూ.1,000 కోట్ల విలువైన 3.5 ఎకరాల స్థలాన్ని ’ఇందిరమ్మ మహిళా శక్తి’ స్టాళ్లకు కేటాయించి, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను, పిండి వంటలను విక్రయించుకునేలా అమెజాన్ లాంటి ఈ–కామర్స్ సంస్థలతో సైతం అనుసంధానం చేశాం. పేదల కోసం నిర్మించే ఇళ్లకు సంబంధించి స్థలాన్ని పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. పేదల ఇళ్లకయ్యే రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్న పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం..’ అని రేవంత్ చెప్పారు. 22ఏ భూములపై ఆందోళన వద్దు ‘నిషేధిత జాబితా (22 ఏ)ల్లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 22 ఏలో చేరిన భూముల సర్వే నంబర్లకు బై నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తాం. కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలం అంగుళం కూడా ఎక్కడికీ పోదు. కోర్టు కేసులున్న స్థలాల వరకు పక్కనపెట్టి మిగతా వాటికి బై నంబర్లు ఇచ్చి సమస్య పరిష్కరిస్తాం. భూములు, కట్టుకున్న ఇళ్లు 100% రిజిస్ట్రేషన్ అయ్యేలా చేస్తాం. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసే సంఘాలను, వ్యక్తులను నమ్మొద్దు..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. రూ.8.11 లక్షల కోట్ల అప్పులున్నా సంక్షేమం ఆగదు ‘గత పాలకులు మాపై రూ.8.11 లక్షల కోట్ల భారీ అప్పుల భారం మోపారు. నడుము వంగిపోయే అప్పుల భారం ఉన్నప్పటికీ, రూపాయి రూపాయి కూడబెట్టి ప్రజా సంక్షేమాన్ని నడిపిస్తున్నాం. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే కోళ్లకు, బర్రెలకు వేసే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.25 కోట్ల మంది ప్రజలకు ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నాం. 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. కూకట్పల్లి రుణం తీర్చుకుంటా.. ‘మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గం నా రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించింది. నాడు నిధులు మంజూరు చేసే అధికారం లేకపోయినా బస్తీల్లో ప్రజలు నా వెన్నంటి నిలిచారు. ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చింది. కూకట్పల్లి అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు ఆదేశాలు ఇచ్చా. నియోజకవర్గంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, పాఠశాలలు, కళాశాలల నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే ఏడాది ఇందిరమ్మ టవర్స్ నుంచి బోనాలు: పొంగులేటి ‘ఇందిరమ్మ టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆనాటి ప్రభుత్వం కమీషన్లు రావనే కారణంతో పేదలకు ఇళ్ళు కట్టలేదని, కమీషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించిందని ఆరోపించారు. దీనికి భిన్నంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం.. ఎకరా రూ.200 కోట్ల వరకు ఉన్నప్పటికీ హైదరాబాద్ మహానగరంలో పెద్ద పెద్ద టవర్స్ పక్కనే పేదలకు కూడా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి ఆచరణలోకి తెచ్చిందని తెలిపారు. తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి సంకల్పించామని దీనికి సంబంధించి ఇప్పటివరకు 51 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందరి సమక్షంలో ఎటువంటి లాలూచీలు లేకుండా, మంత్రుల సిఫారసులు సైతం లేకుండా అందరి ముందు లక్కీ డిప్ తీసి ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ముందే ఇళ్ల వివరాలను అందిస్తాం కాబట్టి వారు దగ్గరుండి కాంట్రాక్టర్‌తో నాణ్యంగా తమ ఇళ్ళను కట్టించుకోవచ్చునని సూచించారు. మూడింతల ఇళ్లు నిర్మించకుంటే మళ్లీ పోటీ చేయను గత ప్రభుత్వం పదేళ్లలో నిర్మించిన ఇళ్ల కంటే మరో రెండున్నరేళ్లలో మూడింతలు ఎక్కువగా ఇళ్లు నిర్మిస్తామని, ఒకవేళ అది చేయకపోతే తాను మరోసారి శాసనసభకు పోటీ చేయనని పొంగులేటి ప్రకటించారు. రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాంతంలో కొన్ని భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చారని, అవి ప్రభుత్వ భూములు కాకపోతే రెండు రోజుల్లోనే ఆ భూములపై నిషేధం తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కరవు రావాలని కొందరు క్షుద్ర పూజలు చేశారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘కరవు రావాలని కొందరు క్షుద్ర పూజలు చేశారు. కానీ దేవుడు మన వైపే ఉన్నాడు.. వర్షాలు కురిపించాడు. ఇలాంటి పూజలు చేస్తే మీకే తిరగబడుతుంది’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి. కూకట్పల్లి నియోజకవర్గాన్ని ప్రతీక దృష్టితో అభివృద్ధి చేయాలని శ్రీధర్ బాబుని ఆదేశిస్తున్నానన్నారు.‘‘గత పదేళ్ల పాలన, ఈ రెండేళ్ల మా పాలనను బేరీజు వేసుకోండి. తెలంగాణలో రూ.3 కోట్ల 28 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆడ బిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం. కడుపులో విషం పెట్టుకుని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పినా వెనక్కి తగ్గలేదు..ఆడ బిడ్డలను బస్సులకు యజమానులను చేశాం. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాం. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లను ఇచ్చాం. ఒక వైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. డబ్బా ఇండ్లు వద్దు.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న వాళ్లు మీలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా?. పట్టణంలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శ్రీకారం చుట్టింది..మొదటి విడతలో లక్ష ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా. 22 ఏ విషయంలో మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాది. ఈ విషయంలో మీకు ఆందోళన అవసరం లేదు. సోషల్ మీడియాలో కొందరు చేసే అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు. పదేళ్ల వారి పాలను.. రెండేళ్ల మీ తమ్ముడి పాలనను బేరీజు వేసుకోండి. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళుతున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
47 ఏళ్ల హౌసింగ్ బోర్డు చరిత్రలో తొలిసారి ఇందిరమ్మ టవర్స్
సాక్షి, హైదరాబాద్: మహా హైదరాబాద్‌లో పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. కేపీహెచ్‌బీలోని ప్రైమ్ లొకేషన్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. హౌసింగ్ బోర్డు 47 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఇలాంటి బహుళ అంతస్తుల టవర్స్ నిర్మాణం చేపట్టడం విశేషం. అంతకు ముందు 1980లో బోర్డు కేపీహెచ్బీలో ఫేజ్ 1,2లో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు ఇలాంటి బహుళ అంతస్తుల టవర్స్ నిర్మించలేదు. ఈ ప్రాజెక్ట్ ఆ చరిత్రను మార్చనుంది రూ. 46.20 కోట్లతో మొదటి దశ పనులు అత్యంత ఖరీదైన కేపీహెచ్‌బీ కాలనీలోని ఫేజ్ 7–9, గోకుల్ ఫ్లాట్స్ మధ్యలోని మలేషియా టౌ¯న్ షిప్ ఎదురుగా ఉన్న సుమారు 5.87 ఎకరాల విస్తీర్ణంలో రూ.46.20 కోట్ల అంచనా వ్యయంతో 4 టవర్లను నిరి్మంచనున్నారు. మొదటి దశ కింద 4 టవర్ల ద్వారా 480 ఇళ్లు నిరి్మంచనున్నారు. రెండవ దశలో 680 ప్లాట్లను నిరి్మంచేందుకు కూడా స్థలాన్ని కేటాయించారు. ఏడాది వ్యవధిలోనే మొదటిదశ నిర్మాణ పనులను పూర్తిచేసి లబి్ధదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే నగరంలోని 16 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి డిమాండ్ సర్వే నిర్వహించి దరఖాస్తులు స్వీకరించగా, మొదటి ప్రాజెక్టుగా కేపీహెచ్బీలోనే పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ భూమిపైనే నిర్మాణం జరుగుతుంది ఒక్కో ఇల్లు మార్కెట్ విలువ రూ.40 నుంచి రూ.58 లక్షల మధ్య ఉన్నా, లబి్ధదారులు కేవలం రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తం ప్రభుత్వ సబ్సిడీగా అందుతుంది. ఈ నెల 19న టెండర్లను ఖరారు చేసి, నిర్మాణ పనుల్ని వేగవంతం చేయనున్నారు దరఖాస్తుల వరద క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,340 ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆగస్టు 10 వరకు 46,121 దరఖాస్తులు వచ్చాయి. గడువును ఆగస్టు 15 వరకు పొడిగించారు. కూకట్పల్లి నియోజకవర్గంలోనే 5,233, ఖైరతాబాద్‌లో 4,394, కుత్బుల్లాపూర్‌లో 4,121, నాంపల్లిలో 3,613 దరఖాస్తులు వచ్చాయి. మహేశ్వరంలో కేవలం 471 మాత్రమే వచ్చాయి. ప్రతి దరఖాస్తుదారు రూ.10 వేల ఈఎండీ చెల్లించాల్సి ఉంది. ఎంపిక కాని వారికి ఈ మొత్తం తిరిగి ఇస్తారు. ఆగస్టు 20 నుంచి లాటరీ ప్రక్రియ మొదలుపెట్టి, నెలాఖరు లోపు కేటాయింపులు పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ నిర్ణయించింది. -
మిల్లర్ల ముక్కు పిండండి
సాక్షి, హైదరాబాద్: వ్యాపార దృక్పథంతో ధాన్యం మిల్లులు నిర్వహించే వారితో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ ఉద్దేశపూర్వకంగా బకాయిలు ఎగవేసేందుకు ప్రయత్నించే వారి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం సొమ్ముకు సంబంధించిన బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం స్పష్ట మైన విధివిధానాలను రూపొందించాలని సూచించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో పౌరసరఫరాల శాఖపై మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభు త్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం కల్పించిందని, ఇప్పుడు ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని సీఎం మండిపడ్డారు. ఇప్పటికే బకాయిల (మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యం మాయం కావడానికి సంబంధించిన బకాయిలు) వసూళ్లలో కొంత పురోగతి సాధించామని, మిగిలిన మొత్తాన్ని కూడా పూర్తిగా రాబట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు విధివిధానాలను రూపొందించిన తర్వాత నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించాలని సూచించారు. ఉప సంఘం పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లకు ఇకపై ధాన్యం కేటాయించకుండా, ఆ మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్ బాధ్యతను అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. సైలో బ్యాగుల కోసం భూకేటాయింపు ప్రతి సీజన్లో ధాన్యం నిల్వకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. భారీగా ధాన్యం వచ్చే నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్ (భారీ ప్లాస్టిక్ ట్యూబ్‌లు)ల ఏర్పాటును పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు ఒక్కో నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. సైలో బ్యాగ్ నిర్మాణాలపై రెవెన్యూ, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు. వీబీజీ రామ్‌జీలో ప్లాట్‌ఫాంల నిర్మాణానికి అవకాశం ఉన్నందున విశాలమైన ఫ్లాట్‌ఫాంలు నిర్మించి, జర్మన్ టెంట్లలో ధాన్యం నిల్వ చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. ప్రైవేటు గోదాముల గుర్తింపు ధాన్యం నిల్వకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా సీఎం ఆరా తీశారు. మండల, గ్రామ స్థాయిలో ఉన్న ప్రైవేటు గోదాములను ముందుగానే గుర్తించాలని ఆదేశించారు. ధాన్యం నిల్వకు అనువైన కల్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర షెడ్లను గుర్తించి అవసరమైనప్పుడు లీజుకు తీసుకునేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి సీజన్లో చివరి నిమిషంలో గోదాముల కోసం పరుగులు పెట్టకుండా ముందుగానే నిల్వ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, దక్షిణ భారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎనుముల హబ్స్.. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో భారీ లాభాలు: కేటీఆర్ సెటైర్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూ కేటాయింపుల అంశం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ భూముల కేటాయింపులు జరిగాయంటూ బీఆర్ఎస్ ఆరోపణలకు దిగింది. అయితే ఈ ఆరోపణలతో కూడిన ఓ వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ పోస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు.టీ-హబ్‌ను నిజమైన స్టార్టప్‌ల అభివృద్ధి కోసం నిర్మించాం. కానీ రేవంత్ రెడ్డి ‘ఎనుముల హబ్స్’ను రూపొందిస్తున్నారు. కుటుంబ ఆధారిత, కుటుంబ ప్రయోజనాల కోసం నడిచే వ్యవస్థ అంటూ ఘాటు విమర్శలు చేశారు.“జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో.. వందల కోట్ల లాభాలు?”కేటీఆర్ తన వ్యాఖ్యల్లో ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి అత్యంత తక్కువ ధరకు విలువైన ప్రభుత్వ భూమి కేటాయించారంటూ ఆరోపణలు చేశారు. “జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో డిఫెన్స్ కంపెనీ నిర్మించి, రాత్రికి రాత్రే రూ.200 కోట్ల లాభాలు సాధించిన ఆవిష్కర్తగా అనుముల కొండల్ రెడ్డిని గుర్తించాలి” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.అలాగే మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ యువతకు ప్రభుత్వ భూములు ఎలా పొందాలో ఈ “మ్యాజిక్ ట్రిక్” నేర్పించాలని ఎద్దేవా చేశారు.While we built T-Hub to ensure that real startups’ thrive, Revanth Reddy is busy devising “Anumula Hubs” - family-run, family-driven, zero-innovation, zero-employee scam…err scheme.!If you are one of the Anumula brothers, you get land allotted for dirt cheap. No questions… https://t.co/jZjt65VZvm— KTR (@KTRBRS) August 12, 2026బీఆర్ఎస్ తన ప్రచారంలో దీనిని “ఎనుముల బ్రదర్స్ రూ.200 కోట్ల భారీ భూ స్కాం”గా అభివర్ణించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కుటుంబానికి చెందిన వారికి విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించారంటూ ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య భూ కేటాయింపుల అంశం మరోసారి రాజకీయ పోరుకు కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
రెండు రోడ్డు ప్రమాదాలు.. 8మందిమృతి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి /జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లా పరిధిలో 65వ జాతీయరహదారిపై మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. కర్ణాటక సరిహద్దుల్లోని జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ఆటోను వెనుక నుంచి ట్యాంకర్ బలంగా ఢీ కొట్టడంతో నలుగురు మహిళా కూలీలు రేఖ, శ్రీదేవి, కవిత, రేష్మ, ఆటో డ్రైవర్ దేవదాస్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ భార్య, కూలీ నిఖిత మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. గాయాలపాలైన ఏడుగురిని బీదర్, సంగారెడ్డి ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా కర్ణాటకలోని రాజ్పూర్ గ్రామానికి చెందిన వారు. వీరంతా పనుల కోసం జహీరాబాద్ ప్రాంతానికి వచ్చి.. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో జహీరాబాద్ వైపు నుంచి కర్ణాటకలోని తమ సొంతూరు రాజ్పూర్ వైపు వెళ్తుండగా ఓ లారీ యూ టర్న్ తీసుకుంటోంది. ఆ లారీని తప్పించబోయిన డ్రైవర్ ఆటోను పక్కకు తీయడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్యాంకర్ ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెనుక వైపు నుంచి వస్తున్న వాహనాన్ని గమనించకుండా పక్కకు తిప్పడంతో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ పరితోశ్ పంకజ్ పరిశీలించారు. డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి పడిన కారు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపూర్ చౌరస్తా వద్ద ఇదే హైవేపై జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్‌కు వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి రోడ్డుకు అవతలి వైపు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉద్యోగి మల్లన్న, శంకర్ మృతి చెందారు. వీరు సదాశివపేటకు చెందిన వారుగా భావిస్తున్నారు. సీఎం దిగ్భ్రాంతి: సత్వార్ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
సీఎం తమ్ముడి కంపెనీకి రూ. 200 కోట్ల భూమి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించడంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక్క ఉద్యోగి కూడా లేని, కేవలం రూ.లక్ష పెయిడ్ అప్ మూలధనం ఉన్న కంపెనీకి ఇంత విలువైన భూమిని ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం రాష్ట్రంలోని అతిపెద్ద భూకేటాయింపు అక్రమాల్లో ఒకటిగా అనుమానిస్తున్నామని చెప్పారు. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే లోకాయుక్త, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క ఉద్యోగి లేని సంస్థకు ఐదెకరాలా?‘టెస్సరాక్ట్ చైర్మన్ తానేనంటూ సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తమ సంస్థ పనిచేస్తున్నట్టు పేర్కొంటూ కొండల్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా కాన్సుల్ జనరల్ కూడా పాల్గొన్నారు. టెస్సరాక్ట్ చైర్మన్ హోదాలోనే యూఎస్ భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొండల్‌రెడ్డి చేరినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టెస్సరాక్ట్ కంపెనీ వెబ్సైట్లో ఫోన్ నంబర్ 123456789గా పేర్కొంటూ, 2025 మార్చి 31 నాటికి ఉద్యోగుల సంఖ్య సున్నాగా పేర్కొన్నారు. పటాన్‌చెరులోని ఓ చిన్న ఫ్లాట్‌ను టెస్సరాక్ట్ చిరునామాగా చూపుతున్నారు. గజానికి సుమారు రూ.3,700 చొప్పున ఐదు ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీలో రూ.7 కోట్లకు కేటాయించింది. రూ.200 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు కేటాయించడం కుంభకోణం కాదా. టెస్సరాక్ట్‌కు, కొండల్‌రెడ్డికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పడం విడ్డూరం. అమెరికాలో ఉన్న సీఎం మరో సోదరుడు జగదీశ్‌రెడ్డికి చెందిన స్వచ్ఛ్ బయో సంస్థతో సుమారు రూ.1,000 కోట్ల ఎంఓయూను అమెరికా పర్యటన సందర్భంగా రేవంత్ కుదుర్చుకున్నాడు. మంత్రి శ్రీధర్‌బాబు శాఖలోనే ఈ నిర్ణయాలు జరిగితే ఆయనకు సమాచారం లేదా. టెస్సరాక్ట్‌కు భూ కేటాయింపు వ్యవహారంపై చివరి వరకు పోరాడతాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే జల ఉద్యమం‘కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ కోరుతోంది. ఇదే విషయాన్ని ఈ నెల 18న జరిగే గోదావరినది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఎజెండాలో చేర్చడం సరికాదు. ఎజెండాలో ఈ అంశాలను తొలగించకుంటే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని బహిష్కరించాలి. లేదంటే జల ఉద్యమం చేపట్టి, అవసరమైతే జీఆర్ఎంబీ సమావేశం జరిగే జలసౌధను ముట్టడిస్తాం. సీఎం యాగాలు చేయడాన్ని మేము తప్పు పట్టడం లేదు. కానీ నీటిని ఒడిసి పట్టే పనులు చేయకుండా యాగాలు చేయడాన్నే మేము ప్రశ్నిస్తున్నాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
పాతబస్తీ ‘మెట్రో’ వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర చేపట్టనున్న మెట్రో కారిడార్‌కు సంబంధించి రహదారి విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ మార్గంలో మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రస్తుత సాంకేతికతపై ఢిల్లీ మెట్రో అధికారులతో సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రైళ్లకు అదనపు బోగీలను జత చేసేందుకు అవసరమైన కోచ్‌ల కొనుగోలుపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రయాణికులకు మెరుౖగెన సేవలు అందించేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగాఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సదస్సును నిర్వహించి తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వివిధ వ్యాపార రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖులను సదస్సులో సన్మానించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. గత ఏడాది సదస్సు ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఆహార భద్రతకు ఇక ‘స్మార్ట్’ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనుండగా, అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పౌర సరఫరాల సంస్థ అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తోనూ మాట్లాడి ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,28,092 ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార భద్రత పరిధిలో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు.ఏడాదిన్నరలో 16.32 లక్షల కొత్త కార్డులు2025 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేసి, వాటి ద్వారా 61,08,544 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరిందన్నారు. తెలంగాణలో ఆహార భద్రత కార్యక్రమం ఏ స్థాయిలో కొనసాగుతోందో ఇందుకు ప్రభుత్వం చేస్తున్న వ్యయమే నిదర్శనమన్నారు. రేషన్ బియ్యం కోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు.లబ్ధిదారుడికి ఇబ్బంది కలగొద్దుసంగారెడ్డి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల తరలింపు, సీటింగ్, భద్రత, కార్డుల పంపిణీతో పాటు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పకడ్బందీగా ప్రణాళిక చేయాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన మినిట్-టు-మినిట్ షెడ్యూల్ సిద్ధం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.సమాజంలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వాస్తవ లబ్ధిదారులను గుర్తించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని చెప్పారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీలో లబ్ధిదారుల గుర్తింపును ధ్రువీకరించి, పూర్తి పారదర్శకతతో కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపాలని, అవసరమైన వ్యయంపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు.‘ప్రతి అర్హుడికీ ఆహార భద్రతే లక్ష్యం’‘‘తెలంగాణలో 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నాం. ప్రతి అర్హుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. ఇంత భారీ సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా లబ్ధిదారుడి చెంతకు తీసుకెళ్లడమే స్మార్ట్ రేషన్ కార్డుల లక్ష్యం’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ప్రభుత్వ ఆహార భద్రత కార్యక్రమం విస్తృతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 1.06 కోట్ల కార్డులు–3.43 కోట్ల లబ్ధిదారులు–ఉచిత సన్నబియ్యం వంటి కీలక అంశాలతో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాతో పాటు షార్ట్ వీడియోలు, రీల్స్ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.ఆగస్టు 15 నాటికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, సంగారెడ్డి రాష్ట్రస్థాయి కార్యక్రమంతో పాటు 33 జిల్లాల్లో జరిగే పంపిణీ కార్యక్రమాలను క్రమశిక్షణతో, పారదర్శకంగా, నిర్వహించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
‘కేసీఆర్‌ను మోసం చేయాలనుకోలేదు’
కామారెడ్డి : ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల విధేయత చూపిస్తూనే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదరవుతున్న ఇబ్బందులపై ఆయన పశ్చాత్తాప వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కామారెడ్డి బీర్కూర్ మండలం మంజీరా నది చెక్ డ్యాం వద్ద తన అనుచరులతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనిలో భాగంగా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కార్యకర్తలకు వివరించారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం.‘మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో పార్టీ మారలేదు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదని చెప్పాను. కండువా కప్పుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామంటే తప్పని పరిస్థితుల్లో కండువా కప్పుకున్నా. 6 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం చెప్పినా మంత్రులు నా ఫోన్ ఎత్తడం లేదు. నేను అమ్ముడు పోలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కండువా కప్పుకున్నాను. పాత కాంగ్రెస్ నాయకులు నేను రావడాన్ని స్వాగతించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు 90 శాతం మంది నాతో వచ్చారు. ఇదంతా నియోజకవర్గం అభివృద్ధి కోసమే. కేసీఆర్‌ను మోసం చేయాలనుకోలేదు. అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడూ మర్చిపోను. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు నిధులు అడుగుతుంటే ఎవరూ స్పందించడం లేదు’ అని పేర్కొన్నారు. -
‘రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి?
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. సీఎం సోదరులు ఏ హోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘సీఎం సోదరుల వ్యవహరశైలిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో సీఎం రేవంత్ సోదరులకు ప్రత్యేక రూల్స్ ఎందుకు?. సీఎం రేవంత్‌రెడ్డి దోపిడీని ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. చదువు రాని రేవంత్ బ్రదర్స్ సూటు బూట్లుతో కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ లేరు.. ఆ కంపెనీకి వేల కోట్ల భూములు కేటాయింపు. 200 కోట్ల విలువ చేసే స్థలాన్ని 7 వేల కోట్లకి కేటాయించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆ కంపెనీకి కొండల్ రెడ్డికి సంబంధం లేదని ఎలా చెబుతారు?..మీ శాఖలో ఏం జరుగుతుందో శ్రీధర్ బాబుకి తెలియదా? లేక సీఎం ఒత్తిడికి తలొగ్గరా? కొండల్ రెడ్డికి సంబంధం లేకుంటే యూఎస్ కౌన్సిల్ మీటింగ్‌కి ఎలా వెళ్ళారు. ఈ భూ కేటాయింపులను వదలం. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయట పెడతాం. 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనేది ఆందోళనకరం. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాంఅర్హుల ఓట్లు కోల్పోకుండా చూస్తాం. తెలంగాణణకి అన్యాయం చేసే జీఆర్ఎంబీ మీటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా? లేదా స్పష్టం చేయాలి. జలసౌధాలో జరిగే జీఆర్ఎంబీ ఎజెండా మార్చుకుంటే జలసౌధను ముట్టడిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర చెప్పినా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
34 ఏళ్ల క్రితం ప్రేమికులుగా.. కాలం మారిందంతే!
నాగార్జునసాగర్ కేవలం ఓ పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత జీవితంలో ఓ ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచిపోయిన ప్రదేశం. మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా.. ఆ ప్రాంతంతో ముడిపడిన అనుబంధం మాత్రం వాళ్లకు అలాగే ఉండిపోయింది. అందుకే ఆ జ్ఞాపకాలను మరోసారి ఆ జంట గుర్తు చేసుకుంది.34 ఏళ్ల క్రితం యువకుడు రేవంత్‌రెడ్డి, గీత దంపతుల జీవితంలో ప్రేమ జ్ఞాపకాలకు వేదికైన నాగార్జునసాగర్.. ఇప్పుడు మరోసారి వారిని ఆకర్షించింది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. అప్పట్లో సాధారణ జీవితంలో ఉన్న వారు.. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రాంతానికి చేరుకున్నారు.వరుణయాగం తర్వాత.. సోమవారం నాగార్జునసాగర్‌లో నిర్వహించిన వరుణయాగంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం దంపతులు విజయవిహార్ అతిథిగృహం వద్ద కృష్ణానది తీరానికి వెళ్లారు. ఆ ప్రాంతంలో గడిపిన క్షణాలు, అప్పటి జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు తమ జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయానికి వేదికైన ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మళ్లీ సందర్శించడం భావోద్వేగ క్షణంగా మారింది.ఒక ఫొటో.. రెండు కాలాల కథఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలకు సంబంధించిన పాత ఫొటోతో పాటు.. ప్రస్తుతం సీఎం దంపతులు సాగర్ వద్ద ఉన్న ఫొటోను కలిపి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “అప్పుడు ప్రేమ ప్రయాణం మొదలైన చోటే.. ఇప్పుడు జీవిత ప్రయాణంలో మరో మైలురాయి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజకీయాలకతీతంగా ఓ వ్యక్తిగత క్షణంసాధారణంగా రాజకీయ నేతల ప్రతి అడుగు రాజకీయ కోణంలోనే చర్చకు వస్తుంది. కానీ నాగార్జునసాగర్ పర్యటనలో మాత్రం రేవంత్‌రెడ్డి దంపతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం తెరపైకి వచ్చింది. రాజకీయ పోరాటాలు, పదవులు, బాధ్యతలకు అతీతంగా.. జీవితంలో కొన్ని ప్రదేశాలు ప్రత్యేక గుర్తులుగా మిగిలిపోతాయి. నాగార్జునసాగర్ కూడా రేవంత్–గీత దంపతులకు అలాంటి ఓ భావోద్వేగ ప్రదేశంగా నిలిచింది.ప్రేమ నుంచి బాధ్యతల వరకు.. సాగర్ సాక్షిగాయువకుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో మలుపులు వచ్చాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం కాలంతో మారవు. ప్రేమకు సాక్షిగా నిలిచిన నాగార్జునసాగర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి దంపతుల పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసిన వేదికగా మారింది. -
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో క్రతువులు నిర్వహించారు. కృష్ణమ్మకు సీఎం పూర్ణాహుతి సమర్పించారు. ‘రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. ప్రాజెక్టులు, చెరువులు నిండాలి..’అని ప్రార్థించారు. బ్రహ్మ ముహూర్తంలో.. సోమవారం ఉదయం 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో యాగాన్ని ప్రారంభించారు. ప్రారంభ క్రతువులో నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమ గుండాలతో వరుణ దేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమ క్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు యాగశాలలోకి వచ్చిన సీఎం దంపతులు..3:24 గంటలకు పూర్ణాహుతి సమర్పించారు. ‘కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా పడాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళను సంతరించుకోవాలి. భూగర్భ జలాలు పెరగాలి. పంటలు పుష్కలంగా పండాలి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలి..’అని ముఖ్యమంత్రి వరుణ దేవుడిని ప్రార్థించారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయం. కాగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, నేనావత్ బాలునాయక్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కృష్ణమ్మ ఒడ్డున మార్మోగిన వేదఘోష సూర్యకిరణాలు ఇంకా కృష్ణమ్మ జలాలను తాకకముందే.. నాగార్జునసాగర్ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సోమవారం తెల్లవారుజాము నుంచే వేద మంత్రాలు మార్మోగాయి. చతుర్వేద పారాయణంతో యాగ క్రతువు ప్రారంభమైంది. ప్రధాన యాగ క్రతువుల కోసం 32 మంది రుత్వికులు యాగశాలలో నిర్దేశించిన స్థానాల్లో ఆశీనులు కాగా, మిగిలిన రుత్వికులు నిరంతర వేద పారాయణం, జపంలో పాల్గొన్నారు. చతుర్వేద పారాయణం అనంతరం అగ్ని ప్రతిష్ఠాపన నిర్వహించారు. హోమకుండాల్లో పవిత్ర అగ్నిని ప్రజ్వలింపజేసి, వరుణ దేవుడిని ఆవాహన చేస్తూ హోమాలు నిర్వహించారు. ఆకాశం–జలం–భూమి–మానవాళి మధ్య సమతుల్యత నెలకొనాలని ఆకాంక్షిస్తూ వేద మంత్రాల నడుమ హోమ ద్రవ్యాలను అగ్నికి సమర్పించారు. ఒకవైపు కృష్ణమ్మ విశాల జలరాశి, మరోవైపు హోమకుండాల్లో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు, వాటి మధ్య ప్రతిధ్వనించిన వేదఘోషతో సాగర్ తీరం భక్తిభావంతో నిండిపోయింది. వరుణారాధనతో విజయపురికి ప్రాచీన అనుబంధం మహా వరుణ యాగం నిర్వహిస్తున్న ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉందని యాగ నిర్వాహకులు పేర్కొన్నారు. నేటి నాగార్జునసాగర్ ప్రాంతం ఒకనాటి విజయపురిగా ప్రసిద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలోనే వరుణారాధన జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని వేద పండితులు వివరించారు. వరుణుడితో సంబంధం ఉన్న ఒక ప్రాచీన ప్రతిమ ప్రస్తుతం నల్లగొండ మ్యూజియంలో భద్రపరచబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న మహా వరుణ యాగానికి మరింత ఆధ్యాత్మిక విశిష్టత చేకూరిందని తెలిపారు. శతాబ్దాల కిందట జలాల కోసం ఇదే నేలపై వినిపించిన వరుణ ప్రార్థన, ఇప్పుడు మరోసారి కృష్ణమ్మ ఒడ్డున వేదఘోషగా ప్రతిధ్వనిస్తోందన్న భావన యాగానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు యాగ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. ప్రధాన అర్చకులు ఆచార్య వెంకటాచార్యులు, నరేష్ శర్మ, వెంకట రామశర్మ, ఆదిత్య శర్మతో పాటు పలువురు వేదపండితులు యాగ క్రతువులను నిర్వహించారు. రోజంతా వరుణ యాగం కొనగసాగగా, మధ్యాహ్నం 3.24 గంటలకు మహా పూర్ణాహుతితో ముగిసింది. -
16న కొత్త చేయూత పింఛన్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న ములుగులో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త చేయూత పింఛన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించే అవకాశా లున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ములుగులో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల పనులకు సీఎం భూమి పూజ నిర్వహించి అక్కడే నిర్వహించే బహిరంగ సభలో కొత్త పింఛన్లను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అయితే తొలుత తలసేమియా, సికిల్‌సెల్, ఇతర కేటగిరీలకు పరిమితంగానే పింఛన్లు ఇస్తారని తెలిసింది. శుక్రవారం రాత్రి నుంచే చేయూత వెబ్‌పోర్టల్‌లో అన్ని కేటగిరీలకు సంబంధించి కామన్ దరఖాస్తును ప్రజలు డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చింది. శుక్ర, శనివారాల్లో సెర్ప్, మెప్మా అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (డీఆర్డీవో), జిల్లా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశాల్లో పలు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఆన్లైన్లోనే స్వీకరణప్రభుత్వం రెండున్నర లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేయాలని సూత్రప్రా యంగా నిర్ణయించినా... తొలివిడతగా 50 వేల పింఛన్లు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొత్త పింఛన్ల కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా రెండు వారాలపాటు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మీసేవా కేంద్రాలతోపాటు ఆన్లైన్లో సమర్పణకు వీలుగా ఎంపీడీవో ఆఫీసుల్లో, మండల సమాఖ్యలు, మున్సిపల్ కార్యాలయాలు, వార్డు ఆఫీసుల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. వివిధ కేటగిరీల దరఖాస్తుల సమర్పణ పూర్తయ్యాక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం సమగ్ర వేదిక డేటాబేస్ ద్వారా 360 డిగ్రీల్లో వాటిని రెండు వారాలపాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. తర్వాత ‘చేయూత’ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్ దరఖాస్తుదారు అర్హులో కాదో పరిశీలించి ఖరారుచేస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితాను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, తహసీ ల్దార్లు సంబంధిత డీఆర్డీవో, డీఆర్వోకి పంపుతారు. తదనంతరం ఈ జాబితాను జిల్లా కలెక్టర్లు ఆమోదించాల్సి ఉంటుంది. ఇలా జిల్లా, రాష్ట్రస్థాయిల్లో వీటి ఆమోదానికి వారం, పదిరోజులు పడుతుంది. అంటే మొత్తం ప్రక్రియకు నెలన్నర రోజులు దాకా పట్టే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ట్యాంపర్ ప్రూఫ్‌గా స్మార్ట్ రేషన్ కార్డులునకిలీలకు చెక్ పెట్టేలా లామినేటెడ్ కార్డుల తయారీఈ నెల 15 నుంచి 1.05 కోట్ల కార్డుల పంపిణీసాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడంతోపాటు రేషన్ కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులను సిద్ధం చేసింది. కార్డుల్లోని వివరాలను మార్చడానికి ఏమాత్రం వీల్లేని విధంగా సురక్షితమైన లామినేటెడ్ కార్డులను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల 15న ప్రారంభించనుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లోనూ కార్డుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.1.05 కోట్ల కుటుంబాలకు..ప్రభుత్వం కొత్తగా 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. దీంతో అదనంగా 61.09 లక్షల మంది ఆహార భద్రత పరిధిలోకి వచ్చారు. కొత్త కార్డుల మంజూరుతో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరింది. వాటి ద్వారా 3.42 కోట్ల మంది ఆహార భద్రత పొందుతున్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముందు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ఖరారు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. కుటుంబ పెద్దగా ఇంటి ఇల్లాలు ఫొటోతో కార్డు రానుంది. ఇప్పటికే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రేషన్‌కార్డులకు కుటుంబ పెద్ద ఫొటోను ‘ఆధార్’ ఆధారంగానే తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల అధికారి ఒకరు తెలిపారు. కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. -
‘సీఎంకి భూమి అంటే రియల్ ఎస్టేట్ తప్ప మరేం లేదు’
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం ముల్లు గర్రతో పొడిస్తే తప్ప ప్రభుత్వం బాద్యతలు నిర్వహించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకి భూమి అంటే రియల్ ఎస్టేట్ తప్ప మరేం లేదని విమర్శించారు. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో మా హరీష్‌రావు జీఆర్ఎంబీ ఎజెండాపై ప్రశ్నించారు. కన్నేపల్లికి నేను వెళ్లి లక్ష క్యూసెక్కులు పోతున్నాయని చెప్పా. క్షద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షద్ర రాజకీయాలు చేస్తున్నారు. కరెంట్ ఉండి నేడు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో కరెంట్ సరఫరా సరిగా ఉండటం లేదు. యాగాలు చేస్తే తప్పు లేదు... కేసీఆర్ యాగాలు చేశారు’ అని పేర్కొన్నారు. త్వరలో అన్ని ఆధారాలతో వివరాలు బయటపెడతారంగారెడ్డి జిల్లాలో భారీ భూకుంభకోణం జరుగుతోంది. త్వరలో ఆధారాలతో సహా వివరాలు బయటపెడతా. రైతులు, కంపెనీ మధ్య సీఎం, పొంగులేటి జోక్యం చేసుకున్నారు. ఎకరానికి రూ. 10 కోట్లు వరకూ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. కానీ ఎకరానికి రూ. 5 కోట్ల లోపే ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. త్వరలో సర్వే నంబర్లతో సహా అన్ని బయటపెడతా’ అని హెచ్చరించారు. -
రేవంత్ మాటలే బీఆర్ఎస్కు ఆయుధాలు!
తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ల మధ్య రాజకీయ పెనుగులాట ఆసక్తికరంగా ఉంది. మూడో పక్షం బీజేపీ అధికార సాధన లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటివరకైతే ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో పట్టు నిలబెట్టుకోవడంతో పాటు,ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరగకుండా ఉండడానికి అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో హైడ్రా ద్వారా ప్రభుత్వానికి స్వాధీనం అయిన భూముల అమ్మకం ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోసం వినియోగించాలని ఆలోచిస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ ను బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించినా అందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లుగా కనిపిస్తుంది. ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుందన్నది చర్చగా ఉంది. ప్రభుత్వంపై కాని, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కాని ఆరోపణలు వస్తున్న తీరు రేవంత్ కు చికాకు కలుగుతుండవచ్చు. ఇక బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన ఆధారపడి రాజకీయాలను నడుపుతోంది. మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం జనంలో తిరగకుండా, వెనుక ఉండి పార్టీని నడుపుతున్నారు. ఫేసెస్ ఆఫ్ ద పార్టీగా కేటీఆర్, హరీష్ రావులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ఆందోళనలకు సన్నద్దమవుతున్నారు. రేవంత్ ప్రసంగాలలో ఏ మాత్రం తప్పులు దొర్లినా వెంటనే అందుకుని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కేటీఆర్, హరీష్ రావు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ప్రభుత్వపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారు.ఈ క్రమంలో కొన్నిసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల దుమారం హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో ఇంజనీరింగ్ విద్యను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం ఇంజనీర్లందరిని కించపరచడం కాకపోవచ్చు. ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కోల్పోతోందని చెప్పాలన్నది ఆయన భావన. అందులో కొంత నిజం ఉంది. కొంతమంది ఇంజనీరింగ్ పూర్తి చేసినా మంచి ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల సుమారు 60 కాలేజీలు మూతపడ్డాయట. లెక్చరర్లు మంచి విద్య అందించాలని చెప్పడం తప్పు కాదు. కాని అసలు ఆ ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అని అనడం విమర్శలకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఒక్కోసారి కొన్ని వ్యాఖ్యలు చేసి ఇబ్బందులలో పడుతున్నారు. హైడ్రాను సమర్ధించడానికి హిట్లర్‌తో పోల్చుకోవడం, ఇరాన్ యుద్ద విధ్వంసాన్ని ప్రస్తావించడం వంటివి చేశారు. ఇప్పుడేమో ఇంజనీరింగ్ విద్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ రంగంలో అయినా కొన్ని ప్రమాణ లోపాలు ఉండవచ్చు. కాని అంతమాత్రాన దానిని క్రిమినల్ వేస్ట్ అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. అలాగైతే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలను ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది కదా! ఇంజనీరింగ్ విద్యను లక్షలాది మంది చదువుకున్నారు కాబట్టే దేశంలోకాని, ఇతర దేశాలలో కాని మనవాళ్లు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్నారన్న సంగతిని గ్రహించాలి. రేవంత్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకోవడానికిబీఆర్ఎస్ నేతలు అన్ని వ్యూహాలు అమలు చేశారు. తెలంగాణలోని యువతను అవమానించే రీతిలో రేవంత్ మాట్లాడారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్లికేషన్ రాయలేని స్థితిలో ఇంజనీర్లు ఉన్నారంటున్న రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్ ను పూర్తి చయగలరా అని సవాల్ చేశారు.కాంగ్రెస్ పార్టీనే క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ మండిపడ్డారు . ఆ తర్వాత రేవంత్ పై కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు.రేవంత్ ఇంజీనిరింగ్ విద్యను వేస్ట్ అనడాన్ని ఎవరూ సమర్దించరు. అలాగే కేటీఆర్ కూడా రేవంత్ ను అదే మాట అనడం కరెక్టు కాదని చెప్పాలి. తమను వ్యక్తిగతంగా అటాక్ చేస్తే తామూ అదే చేస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. కొంత హద్దులు మీరి ఇరువైపులా విమర్శలు చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక ఇంజీనర్లకు మద్దతు ఇస్తూ రాకెట్ పంపుతున్నవారిని అవమానిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని ఆయన మండిపడ్డారు. జెన్ జి, కాక్రోచ్ ఉద్యమాలకు మద్దతు ఇచ్చే విషయంలో ఈ రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఢిల్లీలో కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ ఉన్నా, తెలంగాణకు వచ్చేసరికి అదికారంలో అదే పార్టీ ఉండడంతోబీఆర్ఎస్ ఆ అవకాశాన్ని వాడుకుంది. కొద్ది రోజుల క్రితం నిరుద్యోగులతో సంగ్రామ్ పేరుతో ఒక భారీ సభను నిర్వహించారు. ఖమ్మంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్యయత్నం చేస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడాన్ని తన నోట్ లో తప్పుపట్టారు. ఇది కాంగ్రెస్ పై నిరుద్యోగి ఛార్జీషీట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం యువతను ఆకర్షిస్తే తమకు అధికారం రావడం ఖాయమనిబీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్న తరుణంలో రేవంత్ వ్యాఖ్య వారికి అందివచ్చినట్లయిందనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాధ్ విషయంలో రేవంత్ కోర్టు ఆదేశాలను పాటించడానికి ఇష్టపడడం లేదని అర్దం అవుతుంది. రంగనాధ్ ను బదిలీ చేయాలని హైకోర్టు సూచించినా ,అది ప్రభుత్వ విచక్షణాధికారమన్న భావనలో రేవంత్ ఉన్నారనుకోవాలి. అదే టైమ్ లో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల అమ్మకం ద్వారా అరవైవేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు దీనిని వాడవచ్చన్నది ప్రభుత్వ వర్గాల భావన. అయితే ఈ భూములను అమ్మడానికి అవకాశం లేదన్నది విపక్షం వాదనగా ఉంది. గత రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి ఉండడం, ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లింపులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేకపోవడం, మెట్రో రైలు రుణం వ్యవహారం మొదటికి రావడం ఇలా అనేక సమస్యలు ఉన్న తరుణంలో నిజంగానే ఈ భూములను అమ్మే అవకాశం వస్తే అది ప్రభుత్వానికి జాక్ పాట్ అవుతుంది.కాని మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి చికాకుగా మారుతున్నాయి.ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను చెల్లించవలసిన సుమారు 400 కోట్లకు పైగా రుణాన్ని తీర్చివేశారట.ఇది ఎలా సాధ్యమైందని,దానిపై విచారణ చేయించగలరా అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లూటింగ్ ఏజెంట్లుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఆయా శాఖలలో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఇవన్ని ఒక చక్రబంధం వంటివి. వీటిని జాగ్రత్తగా తప్పించుకుంటూ ముందుకు పోవాలని అదికార కాంగ్రెస్ యత్నిస్తుంది. కాని ఆ చక్రబంధంతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికిబీఆర్ఎస్ అన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ఎవరిది పై చేయి అవుతుందో కాలమే తేల్చుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏఐతో ఖజానాకు ఊతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించడం ద్వారా ఖజానాకు మరింత ఊతం తీసుకురావచ్చని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ఏఐ ఆధారిత సమాచారంతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాబడులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేలా సులభతర వ్యవస్థను తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో శుక్రవారం సాయంత్రం అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జీఎస్టీ, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి ఆదాయ పెంపునకు ఉన్న మార్గాలు, ఇరు శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, ఏఐతో వ్యవస్థలను పటిష్టం చేసుకునే అంశాలపై అరవింద్ సుబ్రమణియన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శాఖల మధ్య మరింత సమన్వయం అవసరం.. ఈ సందర్భంగా అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట వేసేందుకు, పన్ను లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వ శాఖల మధ్య మరింత సమన్వయం అవసరమని సూచించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మెరుగుపరిచేలా టెక్నాలజీని వినియోగించాలని వివరించారు. ప్రధానంగా భవన నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టే విధంగా మున్సిపల్, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం అవసరమన్నారు.భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలను, అందుకు అనుగుణంగా పన్నుల అంచనాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ జీఎస్టీలో ఏఐ వినియోగం ద్వారా వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సూచించారు.ఈ డేటాతోపాటు మీ–సేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలను కూడా సమీకృతం చేయడం ద్వారా పరిపాలనకు ఉపయోగపడేలా చూడాలన్నారు. ఈ భేటీలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎక్సైజ్ కమిషనర్ సి.హెచ్. హరికిరణ్, ముఖ్య పౌరసంబంధాల అధికారి (సీపీఆర్వో) గుర్రం మల్సూర్ పాల్గొన్నారు. ఎక్సైజ్‌లో కీలక సంస్కరణల కోసం సూచనపవర్పాయింట్ ప్రజెంటేషన్‌లో భాగంగా ఎక్సైజ్ శాఖలో తీసుకురావాల్సిన కీలక సంస్కరణల గురించి అరవింద్ సుబ్రమణియన్ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా బార్ అండ్ రెస్టారెంట్లలో విక్రయించే లిక్కర్‌పై వ్యాట్ విధించాలని (తద్వారా బార్లలో విక్రయించే లిక్కర్ ధరలు పెరుగుతాయి), బార్లు పెట్టుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, సరఫరాదారులు, అన్ని రకాల బ్రాండ్లు తెలంగాణ మార్కెట్లోకి సులభంగా ప్రవేశించేలా నిబంధనల్లో మార్పులు తేవాలని సూచించారు.అలాగే లిక్కర్ ధరల నిర్ధారణ (పెంచడం లేదా తగ్గించడం) విధానం కూడా సులభతరంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు లిక్కర్ సరఫరాదారులకు చెల్లింపులు జరపాలని సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌తో పోలిస్తే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువగా ఎక్సైజ్ ఆదాయం ఉంటోందని.. అయితే క్రమంగా ఇతర రాష్ట్రాల్లో ఇది పెరుగుతోందని చెప్పారు. అదే సమయంలో జీఎస్డీపీ, సొంత పన్నుల ఆదాయంతో పోలిస్తే ఎక్సైజ్ ఆదాయం క్రమంగా తెలంగాణలో తగ్గుతోందని సీఎం రేవంత్, అధికారులకు అరవింద్ సుబ్రమణియన్ వివరించారు. -
రేవంత్ యాచిస్తుండో.. సొమ్మిచ్చివస్తుండో?
సాక్షి, హైదరాబాద్: ‘మనకేమో గురువు జయశంకర్.. కానీ సీఎం రేవంత్‌కు గురువు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం ‘జై తెలంగాణ’అనేందుకు కూడా రేవంత్‌కు మనసొప్పదు. రేవంత్ సీఎం పదవి చేపట్టిన తర్వాత 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్తూ సగటున 13 రోజులకోసారి ప్రదక్షిణలు చే స్తున్నారు. ఢిల్లీకి వెళ్లి వారిని యాచిస్తున్నడో లేక వారికే తెలంగాణ సొమ్మును ఇచ్చి వస్తున్నాడో తెలియదు. కానీ తెలంగాణకు ఢిల్లీ నుంచి ఏం తెస్తున్నాడో చెప్పడం లేదు. ఢిల్లీకి సామంతుల్లా తలవంచడం కాదు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే స్వతంత్ర నాయకత్వం కావాలి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా భావిస్తే, కేసీఆర్‌కు జయశంకర్ సార్ గాడ్‌ఫాదర్‌లా మార్గనిర్దేశం చేశారన్నారు. జయశంకర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన ‘తెలంగాణ కోసమే పుట్టిన నిఖార్సయిన పార్టీ బీఆర్ఎస్ అయితే ప్రాణాలు పణంగా పెట్టి పోరాడే నాయకత్వం కేసీఆర్‌దే. పార్లమెంటులో ఓ బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చినా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు స్పందించలేదు. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ ఉంటే ఆ వ్యాఖ్యలు చేసిన వారిని గల్లా పట్టి నిలదీసేవాడు. తెలంగాణ మళ్లీ ఢిల్లీ పార్టీల చేతుల్లో తల్లడిల్లుతోంది. ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ అధ్యయనాల ప్రకారం తెలంగాణ మిగులు రాష్ట్రం. నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం వాటిని వినియోగించలేకపోతోంది.ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రయత్నిస్తుంటే, జీఆర్ఎంబీ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని హరీశ్‌రావు ఇప్పటికే ఆధారాలతో వివరించారు. తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదో రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. జైపాల్‌రెడ్డి జీవితంలో ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. నిఖార్సయిన ఉద్యమకారులుగా కోదండరాం వంటి వారి పేర్లను కూడా రేవంత్ చెప్పడం లేదు. జయశంకర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన సాగుతోంది’అని కేటీఆర్ మండిపడ్డారు.ఉద్యమానికి దిక్సూచి జయశంకర్‘స్వయం సమృద్ధి, ఆత్మగౌరవం, స్వయం పాలన అనే మూడు దశల ద్వారా తెలంగాణ సమాజాన్ని జయశంకర్ విశ్లేíÙంచారు. యాచించి కాదు.. శాసించి తెలంగాణ సాధించాలి అనే స్ఫూర్తిని కేసీఆర్‌లో జయశంకర్ నింపారు. కాంగ్రెస్ తెలంగాణకు శాశ్వత శత్రువని, మూడు తరాలను ముంచిన పార్టీ కాంగ్రెస్ అని జయశంకర్ చెప్పేవారు. జయశంకర్ ఆశయ సాధన కోసం బీఆర్ఎస్ పనిచేస్తుంది. తెలంగాణను మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మండలి ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొని జయశంకర్‌కు నివాళులు అరి్పంచారు. -
దోచింది దాచేందుకే విదేశాలకు..
సాక్షి, హైదరాబాద్: దోచుకున్నది పంచుకొని దాచుకోవడానికే సీఎం సహా రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి, ఇతర నేతలతో కలిసి మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులు, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులనే కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం మూసీ రివర్‌ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్న నరసింహారెడ్డి గతంలో కేటీఆర్‌తో సన్నిహితంగా వ్యవహరించారని, ఆయనతోపాటు హరీశ్‌రావు వద్ద దీర్ఘకాలం ఓఎస్డీగా పనిచేసిన అశోక్‌రెడ్డికి కాంగ్రెస్ ప్రభు త్వం కీలక బాధ్యతలు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య అవగాహనకు నిదర్శనమన్నారు. టెండర్లు, కమీషన్లు, భూకేటాయింపులు, షెల్ కంపెనీలు, నియామకాలు, సబ్ కాంట్రాక్ట్‌లు, మంత్రుల విదేశీ పర్యటనలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రూ. 82 వేల కోట్ల పనులు ఏపీ కాంట్రాక్టర్లకే... మూసీలో చెత్త తొలగింపు పేరుతోనే మొత్తం రూ. 21 వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేయబోతోందని ఏలేటి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ. 92 వేల కోట్ల విలువైన పనుల్లో రూ. 82 వేల కోట్ల పనులను ఏపీకి చెందిన కాంట్రాక్టర్లకే అప్పగించిందని కూడా ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ సంపదను 30 శాతం ఆస్థాన కాంట్రాక్టర్లే దోచుకుంటుంటే ప్రభుత్వం మౌనం ఎందుకు వహిస్తోందని నిలదీశారు. ‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ట్రాన్స్‌కో, సింగరేణి సీఎండీకి అమెరికా టూర్ ఎందుకు? భట్టి టూర్‌పై చాలా అనుమానాలు ఉన్నాయి’అని ఏలేటి వ్యాఖ్యానించారు. దొంగకు తాళం ఇస్తే ఎలా ఉంటుందో... ‘కాంట్రాక్టరే.. మంత్రి అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు స్పష్టమౌతోంది. దొంగకు తాళం ఇస్తే ఎలా ఉంటుందో రెవెన్యూ మంత్రి పొంగులేటి చేసి చూపిస్తున్నారు. 103 షెల్ కంపెనీల సంగతి ఏమిటి? మీ కంపెనీకి అన్ని ఆస్తులు ఎలా బదిలీ అయ్యాయి? రూ. లక్ష కోట్ల విలువైన భూములు మీ (పొంగులేటి)పై, మీ బినామీల పేర్లపై ఉన్న మాట వాస్తవం కాదా’అని ఏలేటి ప్రశ్నించారు. -
ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యానికి నో
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. రోడ్ నెట్‌వర్క్‌ను ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని, భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణతోసహా అన్ని అంశాలు ఈ సిస్టంలో చేర్చాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్లు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, ఇతర రోడ్లు ఈ వ్యవస్థ పరిధిలోకి రావాలన్నారు. ఓఆర్‌ఆర్‌పైన ఎక్కడికక్కడ వాహనాలను నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈ రోడ్డు నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆ భూములకే టీడీఆర్.. టీడీఆర్పైన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ చేయాలని స్పష్టం చేశారు. టీడీఆర్ ప్రక్రియను మొత్తం ఆన్లైన్ చేయాలన్నారు. టీడీఆర్‌లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రేడియల్ రోడ్–1ను డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని వివరించారు. రోడ్ల నిర్మాణం నాణ్యతలో రాజీ లేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బద్వేల్ ఇంటర్ చేంజ్ ట్రంపెట్ అత్యంత కీలకమన్నారు. భవిష్యత్ రోడ్ల అభివృద్ధిపైనే..ఎలివేటెడ్ కారిడార్–1, కారిడార్–2 పనులను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎలివేటెడ్ కారిడార్–3 బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ పనులను త్వరగా మొదలుపెట్టాలన్నారు. హైదరాబాద్ నగర భవిష్యత్ రోడ్ల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని తెలిపారు. భూసేకరణ వేగవంతం చేయాలని, ఈ విషయంలో అలసత్వం చూపించొద్దని అధికారులకు స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి) జయేశ్‌రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
పంద్రాగస్టున స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార భద్రతకార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఏకకాలంలో కొత్తగా రూపొందించిన స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్టు మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 1.05 కోట్ల లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) స్మార్ట్ రేషన్‌కార్డులను ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు, రేషన్‌కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాటు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, ప్రచారం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం 15న సంగారెడ్డిలో స్ట్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ విషయాన్ని‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేవైసీ పూర్తి చేసిన కుటుంబాలకు మాత్రమే స్మార్ట్ రేషన్‌కార్డు వచ్చే అవకాశం ఉందని, ఇంటి ఇల్లాలు పేరిట, ఆమె ఫొటోతోనే స్మార్ట్ రేషన్‌కార్డు ఉంటుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. కేవైసీ ఆధారంగా ఆధార్‌కార్డుపై ఉన్న ఫొటోను స్మార్ట్ రేషన్‌కార్డుకు బదిలీ చేస్తారు. -
రేవంత్ రెడ్డిని ఓడిస్తా.. కాంగ్రెస్ ను భయపెడుతున్న PK కామెంట్స్
-
కాంగ్రెస్ చేతులెత్తేసింది.. GRMB మీటింగ్ బహిష్కరించాలి: హరీష్
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు, నీటి హక్కులపై శ్రద్ధ లేకుండా పోయిందని మండిపడ్డారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించామని ఆయన చెప్పుకొచ్చారు.ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ పాత్ర చిరస్మరణీయమని హరీశ్ రావు అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రభుత్వం, గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రావడానికి కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటమే కారణ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు.గోదావరి జలాల విషయంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించామని అన్నారు. గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేసిందని, మిగిలిన నీటి వాటా కోసం అవసరమైన డీపీఆర్‌లను కూడా కేంద్రానికి సమర్పించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా కొత్తగా ఒక్క అనుమతిని కూడా సాధించలేదని ఆరోపించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రాజెక్టులను సమీక్షించి, అనుమతులను రద్దు చేయాలనే అంశం ఎజెండాలోకి రావడం ఆందోళనకరమని అన్నారు.గతంలో జరిగిన GRMB సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన ఎప్పుడూ రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు, నీటి హక్కులపై శ్రద్ధ లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి GRMB ఎజెండాను మార్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే GRMB సమావేశాన్ని బహిష్కరించాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని ప్రశ్నించిన ఆయన, సమ్మక్క–సారక్క ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చినప్పటికీ దానిని ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని నిలదీశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్-2తో పాటు వరంగల్, నల్గొండ ప్రాంతాలకు నీరు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
152 మీటర్ల ఎత్తుకు ఒప్పించండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం ఎత్తు పెంచడానికి అనుమతించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బరాజ్ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొన్నారు. కాబట్టి కనీసం 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం.. బుధవారం ఉదయం కేంద్రమంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యత, ఈ ప్రాజెక్టుకు అనుమతుల మంజూరు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను రాసిన లేఖ, దానికి పీఎంఓ స్పందించి జలవనరుల శాఖకు లేఖ పంపడం తదితర విషయాల గురించి పాటిల్‌కు ముఖ్యమంత్రి వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి గతంలోనే ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే 152 మీటర్ల వరకు ఎత్తుతో బరాజ్ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం చేసిందని, ఆ అధ్యయనం ప్రకారం152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించినా ముంపులో పెద్దగా తేడా లేదని స్పష్టమైందని చెప్పారు. ఆ ముంపులోనూ 50 శాతం నదీ గర్భంలోనే ఉంటుందని వివరించారు. ఒకవేళ 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే గ్రావిటీ ద్వారా కావల్సినంత నీరు సరఫరా చేయలేమని అన్నారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎంఓ నుంచి లేఖ వచ్చింది: పాటిల్ పీఎంఓ నుంచి లేఖ అందిందని ముఖ్యమంత్రికి పాటిల్ చెప్పారు. దీనిపై తొలుత కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్రస్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్‌కుమార్ యాదవ్, కడియం కావ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, ముఖ్య కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వండి పాలమూరు–రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను ముఖ్యమంత్రి కోరారు. బుధవారం పార్లమెంట్ భవన్లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు కేంద్రమంత్రిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగర్‌పై రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధులను వ్యయం చేసిందని చెప్పారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయి, ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని వివరించారు. ప్రధానిని దూషిస్తే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసైనా పెట్టారా? ప్రదానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన దివంగత మాతృమూర్తి హీరాబెన్ మోదీలను సోషల్ మీడియా వేదికగా దూషించిన ఘటనలపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం ఒక్క కేసైనా నమోదు చేశారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం పూర్తిగా చట్ట ప్రకారమే ముందుకు వెళ్తోందన్నారు. సోషల్ మీడియాలో ప్రధానిని, ఆయన తల్లిని దూషిస్తున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన బీజేపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసు అధికారిని బదిలీ చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ తర్వాత సీఎం మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. పనీపాటా లేనోళ్లు విమర్శలు చేస్తున్నారు.. వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారని రేవంత్ చెప్పారు. ‘ప్రధానిపై, ఆయన తల్లిపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి డీఎస్పీ బదిలీ వ్యవహారంపై ఢిల్లీలో పనీపాటా లేని కొందరు విమర్శలు చేస్తున్నారు..’అని పరోక్షంగా కిషన్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారుల బదిలీ అనేది ముఖ్యమంత్రికి రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారమని, తన బాధ్యతల్లో అది కూడా ఒకటని పేర్కొన్నారు. బీజేపీ నేతలే వేరేవాళ్లను దారుణంగా తిడుతున్నారని, కాంగ్రెస్ నేతలను, ప్రతిపక్ష పారీ్టల నాయకులను, విద్యార్థులను అభ్యంతరకరమైన పదాలతో దూషిస్తున్నారని మండిపడ్డారు. -
‘కాంగ్రెస్ పాలనలో ఫేక్ ఎన్వోసీలు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ సొంత శాఖలో అవినీతి జరిగి, ఫోర్జరీ చేసి అక్రమంగా అనుమతులు తీసుకున్నా అధికారులు కనిపెట్టడం లేదని, ముఖ్యమంత్రి 18 గంటల రివ్యూ ఏమైందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.ముఖ్యమంత్రి సొంత విద్యా శాఖలోనే జూనియర్ కాలేజి యాజమాన్యాలు ఫైర్ ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసం హైడ్రా కమీషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి,అక్రమంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల నుండి అనుమతులు పొందారని, పోలీసులు, విద్యాశాఖ అధికారులు మరియు హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫిబ్రవరిలో ఫైర్ ఎన్ఓసి కోసం దరఖాస్తు చేసుకున్న జూనియర్ కాలేజీలు హైడ్రా కమీషనర్ సంతకం ఫోర్జరీ చేసి, ఇంటర్మీడియట్ బోర్డు నుండి అనుమతులు పొందితే అధికారులెవరూ కనిపెట్టలేకపోవడం దారుణమన్నారు. హైడ్రా అధికారులు లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.కాంగ్రెస్ పాలనలో అధికారులు మరియు కాలేజీ యాజమాన్యాలు అవినీతి అక్రమాలను పెంచి పోసిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ, హోం శాఖ, మరియు మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల్లో జరిగే అవినీతిని, ఫోర్జరీలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారన్నారు.క్షుద్రపూజలు,తాంత్రిక పూజల గురించి స్క్రిప్ట్ రాసిచ్చే బదులు ఫోర్జరీ,అవినీతికి పాల్పడే వారిని దొరకబట్టమని స్క్రిప్ట్ ఇవ్వాలని సూచించారు. ఎంతసేపు పోలీసులు కేసిఆర్ కేటి ఆర్ హరీష్ రావు ఇతర బిఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టారని ఆరా తీయడం కాకుండా,అవినీతి అక్రమ అనుమతులపై చర్యలు తీసుకోమని ఆదేశించాలని హితవు పలికారు.ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ, సరైన అనుమతులు లేకుండా, కాలేజీలు నిర్వహిస్తే, ఏదైనా ప్రమాదం జరిగి విద్యార్థులకు ఇబ్బందులు కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు,హైడ్రా, పోలీసులు మరియు ఫోర్జరీ మరియు అవినీతి అక్రమాల్లో ప్రమేయం ఉన్న అందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఏం చేస్తారో అయన విఙ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. -
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 17 లేదా 18 అర్ధరాత్రి నుంచి సెపె్టంబరు 10 మధ్య నాలుగు దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగు దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో సీఎం బృందం పర్యటించనుంది. పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు కానున్నారు. ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులతోపాటు రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీలు, క్రీడలు, శిక్షణా సంస్థల భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ఈనెల 16న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి 21ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉండాలంటూ తీర్మానం చేసే అవకాశం ఉంది.ఆ మరుసటి రోజు విదేశీ పర్యటనకు బయలుదేరే అవకాశముంది. హైదరాబాద్ నుంచి ముందుగా యూకేకు, అక్కడ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూతురు నిఖా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి ఆహా్వనించే ప్రయత్నాలు జరగనున్నాయి. యూకే, అమెరికాలోని ప్రముఖ క్రీడా అకాడమీలు, శిక్షణా కేంద్రాలను సందర్శించి అక్కడ అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి సలహాదారు కె.రామకృష్ణారావుతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. -
ఢిల్లీకి సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయి అనుమతుల సాధనే ఎజెండాగా ఆయన ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్. పాటిల్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్‌లతో భేటీ కానున్నారు.సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు నేపథ్యంలో అటవీ, పర్యావరణ అనుమతులు కోరుతూ ఇరువురు మంత్రులకు ఆయన వినతిపత్రాలు సమర్పించనున్నారు. అదే విధంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున వీలును బట్టి పలు శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను, పార్టీ పెద్దలను కలిసే అవకాశముందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
సింగరేణికి రూ.54 వేల కోట్లు ఎందుకు ఇవ్వడం లేదు?
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణలో లేదా? అక్కడి కారి్మకులు తెలంగాణ ప్రజలు కారా అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. సింగరేణికి బకాయిలు చెల్లించే వరకు కార్మిక సంఘాలు పోరాడాలని, ప్రభుత్వం మెడలు వంచైనా ఆ నిధులను వసూలు చేస్తామని స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్.. ఎవరి హయాంలో సింగరేణికి నష్టం జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. సింగరేణికి కేంద్రం సంపూర్ణ సహకారం తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే సింగరేణికి మూడో కోల్ బ్లాక్ (మణుగూరు పీకేఓసీ–2 డిప్‌సైడ్ బ్లాక్) దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో సింగరేణిని దోచుకునేందుకు యత్నించారని, కేసీఆర్, రేవంత్‌రెడ్డిల హయాంలోనే రూ.54 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే వేలంలో కొత్త బ్లాక్‌లు పొందుతూ సంస్థ భవిష్యత్‌కు ఊపిరి అందుతోందన్నారు. ప్రధానిపై పోస్టులు.. డీసీపీ బదిలీపై ఆగ్రహం పీఎం మోదీ, ఆయన తల్లిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై బీజేపీ నేత సాయికిరణ్ ఫిర్యాదు చేయగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే, ఈ కేసులో ‘మెటా’ఇండియా హెడ్‌కు నోటీసులు ఇచ్చారన్న కారణంతో కేసు నమోదు చేసిన డీసీపీ అరవింద్ బాబును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఈ బదిలీ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారుల బదిలీలు ‘మ్యూజికల్ చైర్’ఆటలా మారాయని, రెండేళ్లలో 44 సార్లు అధికారులను మార్చడం వల్ల వారిలో ఆందోళన నెలకొందన్నారు. -
మళ్లీ ‘బ్లాక్ లెవల్’ గ్రామీణ పరిపాలన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ గతంలోని ‘బ్లాక్ లెవల్’గ్రామీణ పరిపాలనకు రంగం సిద్ధమవుతోందా ? ముఖ్యంగా మండలాల స్థాయిలో అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలపై పర్యవేక్షణ అనేది పాత పద్ధతుల్లో సాగనుందా ? ఈ ప్రశ్నలకు ప్రభుత్వవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 1985లో మండల వ్యవస్థ అమల్లోకి రాకముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘బ్లాక్ డెవలప్మెంట్ సిస్టమ్’కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం సందర్భంగా మండలాల్లో అన్ని శాఖల అభివృద్ధి పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) ద్వారా పర్యవేక్షింపజేయాలని పీఆర్‌శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మండలస్థాయిలో టీచర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర వ్యవస్థలన్నీ కూడా ఎంపీడీవోకే రిపోర్ట్ చేసేలా చర్యలు ప్రభుత్వం చేపట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్లాక్ డెవలప్మెంట్ వ్యవస్థ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో మనరాష్ట్రంలోనూ 2,3 మండలాలకు ఇన్‌చార్జీగా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు (బీడీవో) వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ తెలంగాణలో ఆ వ్యవస్థ అమలు సాధ్యాసాధ్యాలపై అధికారుల్లో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మండలస్థాయిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి పరిశీలన, అన్ని శాఖలకు సంబంధించిన పనుల పర్యవేక్షణ వంటివి ఎంపీడీవోల ద్వారా చేయొచ్చునేమో కానీ మొత్తం బ్లాక్ డెవలప్మెంట్ వ్యవస్థను మళ్లీ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ఏ మేరకు సాధ్యమనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే, బ్లాక్ డెవలప్మెంట్ వ్యవస్థ ఎక్కువ నిధులతో, మెరుగైన ఆర్థిక స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. దీనికి భిన్నంగా మండల వ్యవస్థ పరిపాలనా పరంగా ప్రజలకు దగ్గరగా ఉన్నప్పటికీ, నిధులు, ఆర్థిక ఆమోదాల కోసం ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూడాల్సి రావడం దీని ప్రధాన బలహీనతగా పరిగణిస్తున్నారు. బ్లాక్ లెవల్ అభివృద్ధి (మధ్యస్థాయి పంచాయతీ) వ్యవస్థ మనదేశంలోని 20కు పైగా రాష్ట్రాలు, ఎంపిక చేసిన కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది. దేశవ్యాప్తంగా 6,700 కంటే ఎక్కువ మధ్యంతర బ్లాక్ పంచాయతీల ద్వారా పనిచేస్తోంది. బ్లాక్ డెవలప్మెంట్ 3–అంచెల వ్యవస్థ ఇదీ... –మొదటి అంచె (గ్రామ స్థాయి):గ్రామ పంచాయతీ –రెండవ అంచె (మధ్యస్థ / బ్లాక్ స్థాయి): పంచాయతీ సమితి– ఇదే బ్లాక్ డెవలప్మెంట్ సిస్టమ్ –మూడవ అంచె (జిల్లా స్థాయి): జిల్లా పరిషత్ మండల వ్యవస్థ ఇలా... – ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ పదవుల ఆధారంగా క్షేత్రస్థాయిలో ప్రజలు, నాయకులు దీనిని సహజంగా 5–అంచెల వ్యవస్థగా పరిగణిస్తారు. గ్రామీణ ఓటరు 5 రకాల ప్రతినిధులు/స్థాయిలను చూస్తారు. – చట్టప్రకారం ఇవి 3 అంచెలే (గ్రామం, మండలం, జిల్లా) అయినప్పటికీ, అధికారాలు, ఎన్నికల విభజన వల్ల ఇది 5 అంచెలుగా (ఫైవ్ టైర్) కనిపిస్తాయి. – గ్రామ పంచాయతీ కింది స్థాయి పాలన (సర్పంచ్ల ద్వారా) – మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ): మండల స్థాయి ప్రజాప్రతినిధి – మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్షుడు : మండల స్థాయి రాజకీయ అధినేత – జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (జడ్పీటీసీ): జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి. – జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ (జడ్పీపీ) : జిల్లా స్థాయి రాజకీయ అధినేత -
‘18 గంటల సీఎం’ ఏం సాధించారు?
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ ‘18 గంటలు పని చేశానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి సాధించింది ఏముంది? కేవలం సర్వే నంబర్లు చూస్తూ, ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదు’అని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి పాలనలో కేవలం మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప, మిగిలిన అన్ని రంగాలు వెనక్కి వెళ్ళిపోయాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధి గురించి మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సైతం తన పుస్తకంలో స్పష్టంగా ప్రస్తావించారని గుర్తుచేశారు. ఇదే సమయంలో పోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా తప్పించేందుకు, సీఎం రేవంత్ రెడ్డి బంధువు అయిన శరత్ రెడ్డికి వాటాలు ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించారు’ అని ఆరోపించారు.‘మాక్స్ బీన్’ కంపెనీ నుంచి మెడికవర్ ఆసుపత్రికి నిధులు మళ్లించారని, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా పోరాడటం వల్లే పోలీసులు భగీరథ్‌ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లేకపోతే అతనికి బెయిల్ వచ్చేంత వరకు మెడికవర్ ఆసుపత్రిలోనే దాచిపెట్టేవారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తాము గమనిస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి లెక్కలు బయటకు తీస్తామని కేటీఆర్ హెచ్చరించారు. -
వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో యువతను వాడుకోవడం.. ఆ తర్వాత నట్టేట ముంచటం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య ఘటన ఆవేవన కలిగించిందన్న ఆయన.. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ యువతను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కానీ, ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారు. కానీ, రెండున్నరేళ్లుగా జాబ్‌క్యాలెండర్ ఇవ్వలేదు. తెలంగాణ యువత.. ప్రత్యేకించి నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో వేణు అనే యువకుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వేణు తన లేఖలో రాశాడు. అలాగే బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారని కూడా గుర్తు చేశాడు. వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ రాశాడు. బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల 42 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. హైదరాబాద్‌లో 142 ఫ్లైఓవర్లు నిర్మించిందెవరు? సచివాలయం కట్టించింది ఎవరు? బీఆర్ఎస్ హయాంలో చివర 48 వేల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చాం.రేవంత్ పాలనలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానవతా దృక్ఫతం లేకుండా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడారు. విద్యార్థుల విలువ సీఎం రేవంత్‌కు ఏం తెలుసు?. అసలు నిరుద్యోగులకు ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. పోలీసు ఉద్యోగాలు 20 వేలు ఖాళీ ఉన్నాయి. 7 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఎందుకిచ్చారు?. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చింది. అశోక్ నగర్లో సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు విలువ లేదు. ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా రాహుల్ పట్టించుకోరా? ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులపై దాడులు జరిగితే వెళ్తున్న ఆయన.. అసలు హైదరాబాద్‌కు ఎందుకు రావడం లేదు?. తెలంగాణ వైపు చూసే దమ్మే ఆయనకు లేదా?కాంగ్రెస్, బీజేపీ యువతను వాడుకుంటోంది. రాహుల్, రేవంత్ తెలంగాణ యువతను మోసం చేశారు. వాళ్లు ఇద్దరు ప్రకటించిన డిక్లరేషన్లు, కార్డులు క్రిమినల్ వేస్ట్. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయడం క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తి సీఎం కావడం క్రిమినల్ వేస్ట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. వేణు సూసైడ్‌కు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని కేటీఆర్ నిలదీశారు.ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫారాలు నింపడం రాదని రేవంత్ అన్నారు. ఆ మాటలకు మేం బాధపడ్డాం. అసలు ఆయనకు ఎన్నికల అఫిడవిట్ ఫారం నింపడం వచ్చా?. ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్మాణాలు తెలుసు.. కాంగ్రెస్‌కు ఎలా సమాధి కట్టాలో తెలుసు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నాం. మళ్లీ పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా.. ముందు ఆ హామీని నెరవేర్చండి. యువత సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రండి అని కేటీఆర్ రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు. -
మహంకాళీ... కాపాడాలి
రాంగోపాల్‌పేట్: చరిత్రాత్మకమైన లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వేలాది మంది తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. జాతర సందర్భంగా వేకువజామున 4.05 గంటలకు నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 12.45 గంటలకు అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.ఆయనతోపాటు మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు, ఆలయ చైర్మన్ కామేష్, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యులు పవన్‌ఖేరా, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్, నవీన్‌యాదవ్ తదితరులు సీఎం వెంట ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్‌రావు, హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా, ప్రభుత్వ సలహాదారులు వి.హన్మంతరావు, వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ ఆల ప్రియాంక, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. బోనాలు విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేసీఆర్‌దే: కేటీఆర్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే బోనాల జాతరను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. తల్లి ఆశీర్వాదంతోనే తెలంగాణ సాధించాం. అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి వర్షాలు బాగా కురవాలి, రైతులందరూ సంతోషంగా ఉండాలని మొక్కుకున్నా. తెలంగాణ అగ్రగామిగా ఉండాలి: మహేశ్‌గౌడ్ దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా అమ్మవారు ఆశీర్వదించాలని మొక్కుకున్నా. వర్షాలు బాగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. -
మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్
-
మీ పెట్టుబడులకు రక్షణ
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు సురక్షిత స్థానమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తరాది ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వనించారు. పెట్టుబడులకు రక్షణగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సీఎంతో సీఐఐ ఉత్తర భారత ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయని సీఎం తెలిపారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో కొన్ని పాలసీలు ప్రవేశపెట్టారని.. వాటిని కొనసాగిస్తూనే తాము సరికొత్త పాలసీలు తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్రంలో విధానపరమైన స్తబ్దత లేదని.. నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా మంచి పాలసీ తీసుకొస్తే అది కొనసాగుతోందన్నారు. ప్యూర్‌కు తరలిస్తాం.. ఫారూచ్యన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కాలుష్యంతో ఢిల్లీ, వర్షాలతో ముంబై, ట్రాఫిక్ కష్టాలతో బెంగళూరు, ప్రకృతి వైపరీత్యాలతో చెన్నై సతమవుతున్న నేపథ్యంలో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించామని సీఎం చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ప్రాంతాన్ని క్యూర్‌గా గుర్తించామని, ఇక్కడ సేవా రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.ఔటర్ నుంచి రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ప్రాంతాన్ని ప్యూర్‌గా గుర్తించామని.. అక్కడ తయారీ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రీజనల్ రింగ్‌రోడ్డు వెలుపల వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రేవంత్ వివరించారు. హైదరాబాద్ పరిధిలోని పరిశ్రమలను ప్యూర్ ప్రాంతానికి తరలిస్తామని స్పష్టం చేశారు. రేడియల్ రోడ్లు నిర్మిస్తామని.. పోర్టుకు అనుసంధానంగా రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మిస్తున్నామని తెలిపారు. రెట్టింపు ఆదాయం.. తెలంగాణ సంస్కృతి తమకు పెద్ద ఆస్తి అని.. హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలున్నారని సీఎం చెప్పారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన దానికి రెట్టింపు ఆదాయం వస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలు కోరిన వసతులు కలి్పస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి రెండు నెలలకోసారి, తాను మూడు నెలలకోసారి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణను తమ సొంత ప్రాంతంగా భావించాలని సీఐఐ ప్రతినిధులకు సీఎం సూచించారు. డిమాండ్ ఉన్న కోర్సులే.. ఏఐ సునామీతో వైట్‌కాలర్ ఉద్యోగాలు పోతున్నందున తాము నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పామని చెప్పారు. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని.. వాటిలో శిక్షణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగాలు వచ్చాయన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులనే బోధిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని జీసీసీల్లో 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని చెప్పారు. డేటా సెంటర్లపై అమెజాన్ రూ. లక్ష కోట్లు, అదానీ రూ. 35 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయని వివరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, సీఐఐ ఉత్తరాది వైస్ చైర్మన్ శారదా సూరి మార్వా తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక విధానాలకు ఆకర్షితులమయ్యాం.. తెలంగాణ పారిశ్రామిక విధానాలు చాలా బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఇస్తున్న మద్దతుతో జీసీసీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. మౌలిక వసతులు, ప్రభుత్వ సహాయ సహకారాలు మెరుగ్గా ఉండటంతోనే సమావేశానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. ఇక్కడ అధ్యయనం చేసేందుకు వచ్చాం. – పునీత్ కౌరా, సీఐఐ ఉత్తరాది చైర్మన్ -
పనితీరు కనబరిచినందుకు రాజీనామా చేయాలా?
సాక్షి, హైదరాబాద్: ‘విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి వైదొలగాలని కొందరు మాట్లాడుతున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా? ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చినందుకా? విద్యార్థులకు నైపుణ్యం అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ వర్సిటీ బోర్డు సభ్యులుగా నియమించినందుకా’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.ఫిన్లాండ్, జర్మనీలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులతో ముఖాముఖి సందర్భంగా గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పునరుద్ఘాటించారు. 80 వేల పుస్తకాలు చదివి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూళేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. మొదటి తారీఖునే జీతాలు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు అందుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తెచ్చాం . విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తున్నాం . పిల్లలు తల్లిదండ్రులకు స్ట్రెస్ బస్టర్స్ం. అందుకే డే స్కాలర్ విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తున్నాం . సమాజంలో మానవ సంబంధాలు విచి్ఛన్నమైతే ఏ కుటుంబం, ఏ దేశం నిలబడదు. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల దగ్గరే పిల్లలు ఎక్కువ సమయం ఉంటారు. తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో ఉపాధ్యాయులకూ అంతే బాధ్యత ఉంది . విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌లతో సమానంగా ఏటా 10–15 మంది టీచర్లను విదేశాలకు పంపి చదువుకునేందుకు అవకాశం కల్పిద్దాం. ఓట్లు, రాజకీయం కోసం నేను పనులు చేయడం లేదు. నాణ్యమైన విద్యను అందించాలనే బాధ్యతతో పనిచేసుకుంటూ వెళ్తున్నా. నా సంకల్పాన్ని మీరు ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడి నుంచే దీక్ష తీసుకుని బయలుదేరండి’ అని ఉపాధ్యాయులకు చెప్పారు. విద్యార్థుల సమస్యలపై కొట్లాడండి ‘ఇంగ్లిష్ ఒక్కటే ముఖ్యమనుకుంటే చైనా ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది? 25 ఏళ్లు అమెరికా వైపు చూశాం.ం ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సింది జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాలపై . ఆ దేశాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుదాం . ఉపాధ్యాయ సంఘాలు మీ సమస్యలపై కాదు.. విద్యార్థుల సమస్యలపై కొట్లాడాలి. ఐదేళ్లు సమాజం కోసం, తరతరాల భవిష్యత్‌ను మార్చేందుకు ప్రతిజ్ఞ పూనండి . నాణ్యమైన విద్య అందించేందుకు ఇంకా ఏం చేయాలో మీరే సూచించండి . వచ్చే విద్యా సంవత్సరానికి ఏం చేస్తే బాగుంటుందో డిసెంబరులోగా నివేదిక ఇవ్వండి . ప్రతీ మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రణాళిక సిద్ధం చేయండి ’ అని సీఎం చెప్పారు. ఒక్కో విద్యారి్థపై రూ.1.08 లక్షలు ‘ప్రతీ పేదవాడికి విద్యతోపాటు వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలి. నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందిచడమే లక్ష్యంగా పనిచేయాలి . ఏ ఆస్తులు లేకపోయినా చదువుకొని ఉద్యోగాలు సాధించిన వారు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడమే మా ప్రభుత్వ లక్ష్యం . ఒక్కో విద్యారి్థపై ప్రభుత్వం రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోంది . ప్రైవేటు స్కూల్ పిల్లలకు వారి తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు దాదాపు రూ.50 వేలు. ప్రభుత్వం ఎంతో వెచ్చిస్తున్నా తల్లిదండ్రులు ప్రైవేటు బడులకు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి ’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మోదీ చేసిన అప్పు రూ.151 లక్షల కోట్లు స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి 2014 వరకు ప్రధానులుగా ఉన్నవాళ్లు చేసిన మొత్తం అప్పు రూ.50 లక్షల కోట్లు అని సీఎం రేవంత్ అన్నారు. 2014 నుంచి 2026 వరకు ప్రధాని మోదీ చేసిన అప్పు రూ.151 లక్షల కోట్లు అని చెప్పారు. ఇప్పటి వరకు దేశంపై ఉన్న అప్పు రూ.201 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. కొందరు చిన్న చిన్న సంఘటనలు చూపి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని భారత్‌ను సార్వ¿ౌమ దేశంగా మార్చిన వారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ శాంతికుమారి పాల్గొన్నారు. -
వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలు విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు గురువారం రూ.2 వేల కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన మొత్తంతో కలిపి మూడు విడతల్లో రూ.6 వేల కోట్ల బకాయిల చెల్లింపు పూర్తయింది. ఈ ఏడాది మే 29న తొలి విడతగా రూ.2,000 కోట్లు, జూన్ 30న రెండో విడతగా మరో రూ.2 వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మూడో విడతలో రూ.2 వేల కోట్లు విడుదల చేయడంతో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ అమలైనట్టు తెలిపింది.ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను పూర్తిగా చెల్లించినట్టు ఆర్థికశాఖ పేర్కొంది. మిగిలిన ఇతర బకాయిలను కూడా దశల వారీగా క్లియర్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బకాయిల చెల్లింపులను కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, బకాయిల విడుదలను ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు స్వాగతించారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీజీఓ ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ ప్రభుత్వ నిర్ణయం పట్ల గురువారం వేర్వేరు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులో హామీని అమలు చేయడం సానుకూల పరిణామమన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇతర బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
కూరగాయల సాగును ప్రోత్సహించండి
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖతోపాటు ఇతర అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను భారీ సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిసర ప్రాంతాల్లో కూరగాయల ఆర్గానిక్ పద్దతిలో సాగును ప్రోత్సహించాలని, అక్క డ పండే తాజా కూరగాయలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి కిచెన్లకు సరఫరా చేసే వ్యవస్థను అభివృద్ధి చేయా లని సూచించారు. దీంతో రైతులకు గిట్టు బాటు ధర లభించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన, తాజా ఆహారం అందుబాటులోకి వస్తుందన్నారు.గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రికి ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం, వ్యవసాయంపై దాని ప్రభావం, తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై డాక్టర్ చిన్నారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను సమరి్పంచింది. ఈ సందర్భంగా కమిటీ చేసిన సిఫార్సులపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల ఆదాయానికి భరోసా కలి్పంచడంతోపాటు ఆహార భద్రతను కాపాడే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక ప్రతి గ్రామానికి ప్రత్యేక అత్యవసర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కమిటీ సూచించింది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల్లో వరి, సాగు తగ్గిందని, అందుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ప్రోత్సహించాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఆయా ప్రాంతాల భూస్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని పేర్కొంది.ఈ పంటలకు అవసరమైన విత్తనాలను 75% సబ్సిడీపై అందించడంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు కొత్త పంట రుణాలు మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రత్యేకంగా ప్రోత్సహించాల ని పేర్కొంది. నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృత కూరగాయల ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయాలని తెలిపింది. పశుగ్రాసం, డెయిరీపై దృష్టి వ్యవసాయంతోపాటు పశుసంవర్ధక రంగాన్ని కూడా బలోపేతం చేయాలని కమిటీ సూచించింది. పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై అందించి పశుగ్రాస సాగును పెంచాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించాలని సిఫార్సు చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు అందించాలని, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల నిర్వహణపై ప్రత్యేక సలహాలు ఇవ్వాలని సూచించింది. ఆయా బృందాలు పంటల పరిస్థితి, నీటి లభ్యత, రైతుల సమస్యలను నిరంతరం పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు అందించాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.రూ.803 కోట్లతో కార్యాచరణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, సాగునీరు తదితర రంగాలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రణాళిక అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరమని కమిటీ అంచనా వేసింది. సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల నష్టాన్ని తగ్గించడం, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం, పశుగ్రాస భద్రత, ఉద్యాన పంటల విస్తరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలకు నివేదికలో ప్రాధాన్యం ఇచి్చనట్లు తెలిపారు. జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలమట్టం తగ్గడంతో నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలకు బదులుగా కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, నూనెగింజలు, కూరగాయలు, పశుగ్రాస పంటలను గ్రామాల వారీ కార్యాచరణతో ప్రోత్సహించాలన్నారు. -
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
హైడరాబాద్: యువ ఇంజనీర్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యువ ఇంజనీర్లను అవమానించే హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. యువ ఇంజనీర్లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టం: హరీష్ఉద్యోగులకు సీఎం రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ, డీఏ హామీలు ఏమయ్యాని ఆయన నిలదీశారు. ఉద్యోగుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందన్నారు హరీష్‌రావు. -
సీఎం రేవంత్ కు గట్టి ఎదురుదెబ్బ.. హైడ్రా ఉంటుందా..? ఊడుతుందా..?
-
ఫ్యూచర్ సిటీలో ఇతర ‘రాష్ట్ర భవనాలు’
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో ఇతర రాష్ట్రాలు ఆయా ‘రాష్ట్ర ప్రభుత్వ భవనాల’ను నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు పది రాష్ట్రాలు హైదరాబాద్‌లో రాష్ట్ర భవనాలు నిర్మించుకోవడానికి అనుమతి కోరినట్లు సమాచారం. తెలంగాణ మాజీ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ అయిన జిష్ణుదేవ్‌వర్మ ‘‘ఈశాన్యరాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్‌లో నివసిస్తున్నారని, ఈశాన్యరాష్ట్రాలకు భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించాల’’ని అప్పట్లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.ఆ మేరకు ప్రతి రాష్ట్రానికి ఎకరా భూమి కేటాయించాలని, అందుకోసం ఫ్యూచర్ సిటీలో 15 ఎకరాలను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ‘రాష్ట్ర భవనాలు’నిర్మించుకోవడానికి స్థలాలు అడిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. కానీ ఇప్పటి వరకు ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. డేటా సెంటర్లకు వెయ్యి ఎకరాలు ఫ్యూచర్ సిటీలో డేటాసెంటర్ల ఏర్పాటు కోసం దాదాపు వెయ్యి ఎకరాలు కేటాయించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అమెజాన్ ప్రధాన డేటాసెంటర్కు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలకు కేటాయింపులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతోపాటు నగర విస్తరణకు కావాల్సినంత భూమి ఆ పరిసరాల్లోనే ఉందని, అది అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అనువైన ప్రాంతంగా ఉంటుందని ఆ అధికారి వివరించారు. సింగపూర్‌కు చెందిన జూరాంగ్ సంస్థ ఈ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచి్చందని, దానికి మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. -
ఒక రోజు అసెంబ్లీ !
సాక్షి, హైదరాబాద్: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఒక రోజుకు మాత్రమే పరిమితం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. వర్షాకాల సమావేశాల్లో చట్టసభల్లోకి అడుగిడే యువత వయసు ప్రస్తుతం ఉన్న 25 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గించే అంశంపై తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ అనంతరం ఆమోదించిన తరువాత వాయిదా పడుతుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. ఈ సమావేశాలను ఆగస్టు మొదటి వారంలోనే నిర్వహించే అవకాశం ఉందన్నాయి. తీర్మానం ఆమోదించిన వెంటనే దాన్ని కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ సమయంలోనూ వయసు తగ్గింపు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన సంగతి విదితమే. ప్రస్తుతానికి ఒక్కరోజునే సమావేశాలు ఏర్పాటు చేసి, శీతాకాల సమావేశాల సమయంలో ఎక్కువ రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల తరువాత అసెంబ్లీ ప్రొరోగ్ కాకపోవడం వల్ల.. నేరుగా స్పీకర్ అసెంబ్లీని సమావేశపర్చడానికి అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అదీకాక అసెంబ్లీలో ప్రస్తుతం మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి.సెంట్రల్ హాల్ ఏర్పాటు, కిందనున్న మంత్రుల చాంబర్స్‌ను పైకి మార్చడం, సీఎం చాంబర్‌కు మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. కింద సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనసభా వ్యవహారాల మంత్రి చాంబర్లు మాత్రమే ఉంటాయి. మిగిలిన మంత్రుల చాంబర్లను మొదటి అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ఈ మరమ్మతులన్నీ సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం సీఎల్పీ కార్యాలయం స్థానంలో పూర్తి గ్రీనరీని ఏర్పాటు చేయాలని మొదట్లో భావించారు. ప్రస్తుతం దాని మార్పు గురించి ఎలాంటి చర్చ జరగడం లేదు. -
సర్కార్ కీలక నిర్ణయం.. పథకాలకు ఈ కొత్త సర్టిఫికెట్ తప్పనిసరి
-
హైడ్రా రంగనాథ్ దూకుడుకు బ్రేక్.. రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి పరిధి వారికి ఉంటుంది. సర్వాధికారాలు ఒకే వ్యవస్థకు ఉండవు. చెక్స్ అండ్ బేలెన్సెస్తో నడిచేదే ప్రజాస్వామ్యం. కాని దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అధికారంలో ఉన్నవారు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంటారు. కార్యనిర్వహణాధికారిగా ఉండవలసిన అధికారిక వ్యవస్థ కూడా ఇష్టారాజ్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పడానికి, హైదరాబాద్ లోని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తాయి. రంగనాథ్‌కు సమర్దుడైన అధికారిగా పేరు ఉండవచ్చు. కాని తనకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్న విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారన్న విమర్శ కొంతకాలంగా వినిపిస్తున్నదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా సంబంధ, బాంధవ్యం ఉండడం కావచ్చు.. లేదా తన సహజ ప్రవృత్తి కావచ్చు.. ఏదైనా కానీ.. న్యాయ వ్యవస్థను సైతం పదే,పదే దిక్కరిస్తున్నారన్న అభిప్రాయం వల్ల ఆయనకు చిక్కులు వచ్చిపడ్డాయి. ఏకంగా ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించడం తీవ్ర సంచలనం అయింది. రేవంత్ సర్కార్ కు పెద్ద ఎదురు దెబ్బే అన్నది అందరి అభిప్రాయం. రంగనాథ్‌ను ఈ సమస్య నుంచి గట్టెక్కించి,తన పరువు కాపాడుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఏ మార్గం అనుసరిస్తుందన్నది ఆసక్తికర అంశంగా ఉంది. రంగనాథ్‌ను బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశం, కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని ప్రభుత్వానికి చెందిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదే,పదే కోర్టుధిక్కరణ కు పాల్పడుతున్నందున, ఇలాంటి అరుదైన ఆదేశం ఇవ్వవలసి వచ్చిందని కోర్టు తీర్పును సమర్ధించేవారు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య ఇది ఘర్షణకు దారి తీస్తుందా?లేక మద్యే మార్గంగా రాజీ కుదురుతుందా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్లినప్పుడు ఎలాంటి వాదన చేస్తుందన్నదానిపై ఈ వ్యవహారం ఆధారపడి ఉండవచ్చు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమిని ,ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్దరించడానికి ఈ హైడ్రా ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో కమిషనర్ గా నియమితులైన రంగనాథ్ కొన్ని చెరువులను పరిరక్షించారన్న పేరు తెచ్చుకున్నారు. అంతవరకు మంచిదే. కాని ఆయా చోట్ల ప్రైవేటు వ్యక్తుల, నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన తీరు వివాదాస్పదం అయింది. హైడ్రా ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఇంటిని కూల్చిన సన్నివేశంలో ఒక చిన్నారి తన పుస్తకాలను కూడా అధికారులు తీసుకోనివ్వలేదని మీడియా ముందు చెప్పిన వీడియో వైరల్ అయింది. అది రేవంత్ సర్కార్ కు తీరని చేటు చేసింది. అలాగే కొన్నిచోట్ల అపార్టుమెంట్లు, విల్లాలను తొలగించిన వైనం మధ్య తరగతి వారిలో తీరని ఆక్రోశం మిగిల్చింది.రూపాయి,రూపాయి కూడగట్టుకుని, బ్యాంకు లోన్లు తీసుకుని తాము ఇంటిని కొనుగోలు చేస్తే, సడన్ గా హైడ్రా వచ్చి వాటిని కూల్చితే తమ పరిస్థితి ఏమిటని అనేక మంది వాపోయారు.లే అవుట్ లకు అనుమతి ఇచ్చినప్పుడు, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ,విద్యుత్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు అధికారులు ఎందుకు నివారించలేదన్న ప్రశ్న వస్తుంది. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వమే ఒకవైపు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తుంటుంది.మరో వైపు అక్రమ నిర్మాణాలు అంటూ అదే ప్రభుత్వం కూల్చివేతలకు దిగుతుంది. చెరువుల గర్భంలో ఆక్రమణలకు పాల్పడి ,అనధికారికంగా నిర్మాణాలు చేస్తే చర్య తీసుకోవడం తప్పుకాదు.కొన్ని చోట్ల ఆయా కాలనీలవారు స్వయంగా హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో కూడా చర్యలు చేపట్టారు. పార్కులను పరిరక్షించారు. మొత్తం మీద లక్షన్నర కోట్ల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. అది నిజమే కావచ్చు. అయినా ఎందుకు ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ లో పడ్డారు?కొన్ని ప్రైవేటు స్థలాలను కూడా ప్రభుత్వ భూములుగా పరిగణించి చర్య తీసుకున్నారన్నది ఆరోపణ. ఆ సంస్థలు ,వ్యక్తులు కోర్టును ఆశ్రయించి రక్షణ పొందినా,వాటిని పట్టించుకోకుండా రంగనాథ్ వ్యవహరించారన్నది విమర్శ. లోతుకుంట భూ వివాదం కూడా అలాంటిదే. 65 కోర్టు ధిక్కరణ పిటిషన్ లు ఆయనపై పడ్డాయంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పిటిషన్ లపై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడంపై ఆగ్రహించింది. ఏకంగా హైడ్రాను గ్రీకు పురాణాలలోని పలు తలల రాక్షసుడిగా అభివర్ణించింది.కొద్ది రోజుల క్రితం కూడా హైకోర్టు ఒక వ్యాఖ్య చేస్తూ తాము సంయమనం పాటిస్తున్నామని, రంగనాధ్ కస్టడీకి ఆదేశించేవాళ్లమే అని హెచ్చరించింది.ఈ నేపధ్యంలో రంగనాధ్ క్షమాపణ కోరిన తీరును హైకోర్టు ఆక్షేపించింది. తాను పిటిషనర్ స్థలంలో జోక్యం చేసుకోలేదని,పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవమని, కోర్టు మరోలా అనుకుంటే క్షమించాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఇందులో నిజాయితీ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తీర్పు తర్వాత రంగనాద్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. నిజానికి ఒక అదికారిగా అంత సీరియస్ గా మాట్లాడి ఉండాల్సింది కాదేమో!భూకబ్జాదారులు ,లాండ్ మాఫియా వ్యక్తులు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇది ఒకరకంగా కోర్టులతో మళ్లీ తగాదా పడినట్లే అవుతుందేమో తెలియదు. రాజకీయ వ్యవస్థలోని వారు ,రేవంత్ ప్రభుత్వంలోని బాధ్యులు ఆయన తరపున మాట్లాడి ఉంటే సమంజసంగా ఉండేదేమో!ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు పెద్దగా ముందుకు వచ్చినట్లు కనిపించదు. అదేదో రేవంత్ చూసుకుంటారులే అన్నట్లుగా ఉన్నారేమో అనిపిస్తుంది.ఊహించినట్లే రేవంత్ సమర్ధించుకోవల్సి వచ్చింది. భూకబ్జాదారులే కోర్టులలో కేసులు వేస్తున్నారని ఆయన అన్నారు.అంతేకాక గతంలో బిఆర్ఎస్ హయాంలో సి.ఎస్.గా పనిచేసిన సోమేష్ కుమార్ పై400 కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. హైడ్రా ను కొనసాగించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రంగనాద్ బదిలీపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.కోర్టు తీర్పు ప్రతి చూశాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంటే అప్పీల్ కు వెళ్లడానికే రంగం సిద్దం అవుతున్నదని అనుకోవచ్చు.న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి ఆదేశాలు ఇచ్చిందన్నది ముఖ్యమంత్రి భావనగా కనిపిస్తుంది. అధికారి బదిలీ అన్నది ప్రభుత్వ అభీష్టం మేరకు జరుగుతుందన్నది ఆయన చెప్పకనే చెప్పారు.ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అప్పుడే చెప్పలేం. లోతుకుంటలోని 10వేల కోట్ల రూపాయల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని రంగనాద్ అంటున్నారు. ఇందులో నిజానిజాలను న్యాయవ్యవస్థకు మరింత గట్టిగా వివరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది. ఆక్రమణలలో ఉన్నవాటిని కూల్చడంలో హైడ్రా వివక్ష చూపుతోందన్న విమర్శ కూడా వచ్చింది. ఉదాహరణకు దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ లో ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి,వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవరకు ఎందుకు ఆగారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమీప బంధువుల ఇళ్లు ఇందులో ఉండడమే కారణమని వారు ఆరోపిస్తుంటారు. దీనిపై హైడ్రా లేదా ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు కనిపించదు.రంగనాధ్ వ్యవహార శైలి చూస్తే తానేదో సర్వస్వతంత్రుడన్నట్లుగా అనిపిస్తుంటుందన్నది ఒక ఆరోపణ.ఆయన చిత్తశుద్దిని ఆక్షేపించడం లేదు కానీ.. దూకుడుగా ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నారు. కాగా రేవంత్ ఒక సందర్భంలో తాను హిట్లర్ మాదిరి ప్రవర్తిస్తానని, ఇరాన్ యుద్దంతో హైడ్రా కూల్చివేతలను పోల్చడం వివాదాస్పదం అయింది. హైదరాబాద్ లో వేల కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నది నిజం. కాని ఆ నెపంతో పేద,మధ్య తరగతివారి ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చడం ఎంతవరకు సమర్ధనీయం అన్నది ఆలోచించుకోవాలి. ఇందులో హ్యూమన్ ఫేస్ ను కూడా జోడించి చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదేమో. యుపిలో బుల్ డోజర్ రాజ్ నడుస్తోందని కాంగ్రెస్ పదే,పదే ఆరోపిస్తుంటుంది. అదే బుల్ డోజర్ రాజ్ ను తెలంగాణకు తెచ్చారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది.ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని రేవంత్ సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం కూడా ఉండవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
హైకోర్టు తీర్పుపై రేవంత్ రియాక్షన్.. తగ్గేదే లే..
-
హైడ్రా ఒక వేట కుక్క
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైడ్రా ఒక వేట కుక్కలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ఆ వేట కుక్కను పంపించి, దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైడ్రా ద్వారా బడా బాబులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని, ఆ డబ్బులో కొంత వాటా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీకి, మరికొంత వాటా బీజేపీకి ఇస్తున్నారని ఆరోపించారు. ‘హైడ్రా అనేది తొమ్మిది తలల విషసర్పం అని హైకోర్టే చెప్పింది.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతకంటే చెంపపెట్టు ఏముంటుంది? సీఎంకు సిగ్గుండాలి..’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘హైడ్రా అనేది నువ్వు చెప్పినట్టు సంస్కరణ అయితే, మీ అన్న తిరుపతిరెడ్డి ఇల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుల ఇళ్లు ఎందుకు కూల్చడం లేదు?..’అని నిలదీశారు. కేటీఆర్ మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ దామోదరరావులతో కలసి రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ వద్దిరాజు నివాసంలో అందరితో కలిసి మీడియాతో మాట్లాడారు. నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు ‘హైడ్రాపై 65 సార్లు హైకోర్టు చెప్పినా వినవా? ఇంకా ఎవరు చెప్తే వింటావ్? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లర్ అనుకొని, హిట్లర్‌కు ఇష్టమైన పదం ‘‘హైడ్రా’’ఐ డిమాలిíÙంగ్ ఎవ్రీథింగ్, ఇరాన్, ఇజ్రాయెల్ మాదిరిగానే ఉంటాను అంటావా? హైదరాబాద్‌ను శిథిలావస్థలోకి తీసుకునిపోతావా?ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? మమ్మల్ని కబ్జాకోరులు అని అంటున్నావ్. మేం కాదు ..నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు. అందరికంటే ఎక్కువ ఆస్తి దోచుకుంటున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులే.హైకోర్టు చెప్పి 24 గంటలైనా ఇంకా రంగనాథ్‌ను కొనసాగించొచ్చా? మా హయాంలో ఉన్న ‘ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్’(ఈవీడీఎం) పేరు మార్చి, అన్నిటికీ రంగులేసినట్టు, సున్నాలేసినట్టు దీనికి కూడా వేసి పోజులు కొట్టడం తప్ప పీకిందేమీ లేదు. కేవలం దాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్‌రెడ్డి అతిపెద్ద బ్లాక్ మెయిలర్‌గా మారారు. వాస్తవానికి అధికారంలోకి రాకముందే పెద్ద బ్లాక్ మెయిలర్. ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బతికినోడు. ఇప్పుడు హైడ్రాని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాడు..’అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీ రహస్య మిత్రులు బీజేపీ వాళ్లే.. రేవంత్ ఢిల్లీలో ఉన్నప్పుడే కేటీఆర్ కూడా ఉంటున్నారంటూ బీజేపీ ఎంపీ «ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్‌రెడ్డి కేసులు పెట్టేది మా మీద. తెల్లారి లేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్‌రెడ్డి రహస్య మిత్రులు బీజేపీ వాళ్లని రాష్ట్రంలో అందరికీ తెలుసు. కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుని 9 రోజులు అరెస్టు చేయకుండా కాపాడింది రేవంత్‌రెడ్డే అనే విషయం అందరికీ తెలుసు. అమృత్ పథకంలో రేవంత్‌రెడ్డి బావమరిదికి కాంట్రాక్టులు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు. సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే, అక్కడ సృజన్‌రెడ్డి నాయకత్వంలో, రేవంత్‌రెడ్డి బావమరిది నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే, మేము వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2014లో కూడా బకాయిలున్నాయి.. ‘మేము అధికారంలోకి వచి్చనప్పుడు 2014లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4 వేల కోట్లు ఉన్నాయి. వాటిని మేం చెల్లించలేదా? బకాయిలు అనేది నిరంతర ప్రక్రియ..’అని కేటీఆర్ వివరణ ఇచ్చారు. ‘చెల్లని నాణేనికి గీతలు ఎక్కువ, చేతగానోడికి మాటలు ఎక్కువ..’అంటూ ఎద్దేవా చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునరి్వభజన చేపట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావాలంటే లోక్‌సభ స్థానాల కంటే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలను పెంచాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చే సంస్కరణలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, అయితే కొత్త బిల్లులు తెచ్చేముందు గతంలో నియమించిన కమిటీల సిఫార్సుల అమలుపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే డివిజన్, వరంగల్‌లో ఏఐ సెంటర్ కాజీపేటలో ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. కొత్తగూడెం రైల్వే డివిజన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, సిరిసిల్ల, వేములవాడ స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో చేర్చాలని కోరామన్నారు. వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్ లేదా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటుచేయాలని, కరీంనగర్ లేదా ఖమ్మంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎస్టీపీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. -
మా విచక్షణాధికారం
ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారం. దానిని ఎవరూ లాక్కోలేరు. గతంలో సీఎస్‌గా పనిచేసిన సోమేశ్‌కుమార్‌పై 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. న్యాయస్థానాలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించి చట్టబద్ధంగా ముందుకు వెళ్తాం.. – సీఎం రేవంత్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత గొప్ప సంస్కరణ ‘హైడ్రా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. చెరువులు, కుంటలను కాపాడేందుకు చేపట్టిన ఈ వ్యవస్థను కొనసాగించి తీరతామని తేల్చి చెప్పారు. హైడ్రా విషయంలో కోర్టుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ దురుద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్) కేసులు వేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా? ‘చెరువులు, నాలాలను కాపాడటంలో హైడ్రా తన విధులు నిర్వర్తిస్తున్న తీరుపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. ఎన్ కన్వెన్షన్, గండిపేట, బతుకమ్మ కుంటల్లో ఆక్రమణలు తొలగిస్తే అవి పేదలవంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా? బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్లు కబ్జా పెట్టుకున్నారు. దానిపై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేశారు. కబ్జాదారులు డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. చెరువులను ఆక్రమించిన వారు ధనవంతులైనా, పేదలైనా చర్యలు తప్పవు. గత 12 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.. ‘గడిచిన 12 ఏళ్లలో తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. రాష్ట్రంలోని 11.56 లక్షల మంది అర్హులైన పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై (జీ)2.0) కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, త్వరలోనే ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధి హామీ నిధుల విడుదల, ఎల్ నినో వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి చేశాం..’ అని రేవంత్ తెలిపారు. విద్యా హక్కులపై కేంద్రం ఆధిపత్యం సరికాదు.. ‘పరీక్షల నిర్వహణ, లీకేజీల నిరోధానికి దేశస్థాయిలో పకడ్బందీ విధానం ఉండాలి. నిబంధనలు పట్టించుకోని కోచింగ్ సెంటర్లే ప్రశ్నపత్రాల లీకేజీలకు వేదికలుగా మారుతున్నాయి. విద్యకు సంబంధించి రాష్ట్రాల పరిధిలో ఉన్న అధికారాలను కేంద్రం లాక్కోవాలని చూడటం వల్లే గందరగోళం ఏర్పడుతోంది. నీట్ సహా ఇతర పరీక్షల విషయంలో యూనివర్సిటీలపై ఆధిపత్య ధోరణి వీడాలి. ప్రశ్నపత్రాల లీకేజీలకు కారకులను కఠినంగా శిక్షించాలి. పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవు. ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉంది. సభలో చర్చ జరిగితే రాహుల్‌గాంధీ అన్ని అంశాలపై మాట్లాడతారు..’ అని సీఎం అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పకడ్బందీ ప్రణాళిక ‘గత కేసీఆర్ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టి పారిపోయింది. ప్రతి ఏటా రూ.2,200 కోట్ల నుంచి రూ.2,400 కోట్లు ఇందుకు అవసరమవుతాయి. ఇకపై ఏ సంవత్సరం బకాయిలు ఆ సంవత్సరమే చెల్లించేలా, అడ్వాన్స్‌గా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ప్రణాళికలు రూపొందించాం. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో..కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య 100% ఫీజు రీయింబర్స్మెంట్ చేయించిన తర్వాత తెలంగాణలో ఆ మేరకు డిమాండ్ చేస్తే బాగుంటుంది..’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, సురేష్ షెట్కార్, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్‌కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు తదితరులు ఉన్నారు. -
హైడ్రా మేము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ: సీఎం రేవంత్
ఢిల్లీ: కబ్జా కోర్లే హైడ్రా వద్దంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కబ్జా చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోమన్నారు. హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని రేవంత్ స్పష్టం చేశారు. నిన్న( సోమవారం, జూలై 27వ తేదీ) హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అసలు హైడ్రానే వద్దనే వాదన కూడా తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ.. కబ్జా కోర్లే హైడ్రా వద్దంటున్నారని, గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పేదల పెద్దలా? అని ప్రశ్నించారు. కబ్జా కోర్లకు మీడియా కూడా సహకరించకూడదన్నారు రేవంత్. ‘హైడ్రా పనులను కొనసాగించి తీరుతాం. కబ్జా కోర్లు హైడ్రావద్దంటున్నారు. కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోం. ఎన్ కన్వెన్షన్ పేదలదా పెద్దలదా?, హైడ్రా మేము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ. ఏ అధికారిని నియమించాలనే విచక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బిఆర్ఎస్ నేతలు దురుద్దేశంతో కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారు. కోర్టు తీర్పుని పరిశీలించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తాం. హైడ్రా కార్యాచరణ పైన మాకు పూర్తి స్పష్టత ఉంది. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
వీబీజీ రామ్‌జీ జాబితాలో ఇందిరమ్మ ఇండ్లు?.. రేవంత్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను కోరారు. ఈ రోజు( మంగళవారం) ఢిల్లీలో శివరాజ్సింగ్తో ఆయన భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో గ్రామీణ ఇళ్ల నిర్మాణం నిర్లక్ష్యం చేశారని ఎల్‌నినో నేపథ్యంలో వీబీ-జీ రామ్-జీలో అదనపు పనులు చేర్చాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.కేంద్రం నూతనంగా తీసుకవచ్చిన వీబీ-జీ రామ్-జీలో బిల్లులో రైతుల జీవనోపాధి మరింత మెరుగయ్యేలా మరో 10 కొత్త పనులను చేర్చాలని ఈ సందర్బంగా కేంద్రమంత్రికి సూచించారు. కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లకు,రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ అనుమతి కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వీబీ-జీ రామ్-జీ జాబితాలో చేర్చి లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
జెన్‌జీ గురించి రేవంత్ మాట్లాడుతారా? అర్వింద్
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వకుండా జెన్‌జీ భవిష్యత్తును నాశనం చేస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ క్యాబినెట్ సగటు వయస్సు 62 సంవత్సరాలని ఆయన జెన్‌జీ గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే కుటుంబ పాలన చేస్తున్నారని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి దర్యాప్తును కేంద్రానికి అప్పగించడం లేదని కేసులు ముందుకు కదలకుండా కేటీఆర్ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారని ప్రశ్నించారు. దోచుకున్న వారిని కాపాడుతూ రేవంత్ మరింత దోపిడికి పాల్పడుతున్నారని, రేవంత్, కేటీఆర్ కేవలం మెుక్కుబడికోసమే ఢిల్లీకి వచ్చారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు.. -
హైడ్రా కమిషనర్ గా రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశాలు
-
హైడ్రా ఎపిసోడ్లో ట్విస్ట్: రేవంత్ సర్కార్ ప్లాన్ ఏంటంటే..
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను పదవి నుంచి తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన్ని తప్పిస్తారా? వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా?.. అనే చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అయితే ఈ విషయంలో తొందరపాటు వద్దని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. హైడ్రా చర్యలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా.. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని హైకోర్టు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నరలో ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదవడం అసాధారణమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను గౌరవించడం చట్టబద్ధ పాలనకు కీలకమని పేర్కొంది. ప్రజా ఆస్తుల పరిరక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించే అధికారం ఏ సంస్థకూ లేదని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడం గ్యారెంటీ అనే చర్చ మొదలైంది. అయితే కోర్టు ఆర్డర్ కాపీని అధికారికంగా అందుకుని పరిశీలించాకే తర్వాతే ముందుకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ (ఏజీ)తో పాటు న్యాయ నిపుణుల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. అప్పీల్‌పై ప్రభుత్వ కసరత్తుహైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. సీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించి న్యాయపరమైన అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తిస్థాయిలో పరిశీలించి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.ప్రస్తుతం హైడ్రా కమిషనర్ వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనను పదవి నుంచి తప్పించాలన్న ఆదేశాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీ కావడంతో.. అప్పీల్ ఎవరు దాఖలు చేయాలి? ప్రభుత్వం తరఫున వెళ్లాలా? లేదంటే రంగనాథ్ వ్యక్తిగతంగా అప్పీల్ చేయాలా? అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.రంగనాథ్ వివరణ.. ‘కబ్జాదారులే కేసులు వేశారు’మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తనపై ఉన్న 63 ధిక్కరణ కేసులు భూకబ్జాదారులు వేసినవేనని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను రక్షించే క్రమంలోనే ఈ కేసులు ఎదుర్కొంటున్నానన్నారు. రెండేళ్లలో హైడ్రా ద్వారా మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు రక్షించామని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తితోనే చేపట్టామని చెప్పారు. తనపై వచ్చిన కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.హైడ్రా ఏర్పాటు అలా.. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కుల పరిరక్షణ లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2024లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)ను ఏర్పాటు చేసింది. కేబినెట్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 99 ద్వారా హైడ్రాకు అధికారిక రూపం కల్పించారు. నగరంలో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో హైడ్రాను రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మక సంస్థగా భావిస్తోంది. ముఖ్యంగా చెరువులు, నాలాల పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వం తన పాలనలో కీలక అజెండాగా తీసుకుంది.హైడ్రా భవిష్యత్‌పై ఉత్కంఠఇదిలా ఉండగా.. హైడ్రా పనితీరు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా సాధించిన ఫలితాలను ప్రభుత్వం వివరించనుంది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు అమలవుతాయా? లేదంటే ప్రభుత్వం అప్పీల్‌తో ముందుకు వెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. డివిజన్ బెంచ్‌లో జరిగే విచారణే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొనసాగింపుపై కీలకంగా మారనుంది. -
సమన్వయం లేదు.. కలహాలు పెరిగాయి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు, అంతర్గత పోరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కొరవడటం.. జిల్లాల్లో మంత్రుల ఏకఛత్రాధిపత్యం.. ఎమ్మెల్యేల నియోజకవర్గాల స్థాయి అభివృధ్ధి పనుల్లో జాప్యంపై వరుసగా వస్తున్న ఫిర్యాదులపై రాష్ట్ర నాయకత్వాన్ని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా జిల్లాల స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన కాంగ్రెస్ హైకమాండ్, ప్రభుత్వం–పార్టీ మధ్య సమన్వయం గాడి తప్పుతోందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జితో జరిగిన సమావేశంలో పార్టీ వ్యవహారాలపై స్పష్టమైన హెచ్చరికలు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అందరిదీ సొంత అజెండానే.. రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి, సంస్థాగత వ్యవహారాల, ఎస్ఐఆర్ కొనసాగుతున్న తీరుపై రెండు గంటలపాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి తెప్పించుకున్న నివేదికలు, ఇంచార్జీలు ఇచ్చిన నివేదికలపై అధిష్టాన పెద్దలు సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ శ్రేణులకు చేరడం లేదని, పార్టీ నుంచి వచ్చే అభిప్రాయాలు ప్రభుత్వానికి వెళ్లడం లేదని, మంత్రులు–ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడిందని వచ్చిన నివేదికలపై గట్టిగానే చర్చ జరిగినట్లు సమాచారం. చాలామంది మంత్రులు తమ తమ శాఖలు, నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని, జిల్లాల వారీగా పార్టీని సమన్వయం చేసే బాధ్యత కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రులు సొంత నియోజకవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, నిధుల కేటాయింపుల్లోనూ వారికి ప్రాధాన్యమిచ్చుకుంటూ జిల్లా ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు అందాయని రాష్ట్ర నేతల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. మంత్రుల స్థాయిలోనూ, కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు తమ సొంత అజెండా, సొంత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాలు తప్ప, పార్టీ ఇమేజ్‌కు పెద్దగా దోహదం చేయడం లేదన్న అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగానే ఎస్ఐఆర్ ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల భాగస్వామ్యం కొరవడిందన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. షబ్బీర్..సామేల్..డీసీసీల వ్యవహారాలపై ప్రశ్నలు తమకు అందించిన నివేదికల్లోని అంశాలను ప్రస్తావిస్తూ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతల నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. ముఖ్యంగా యాదాద్రి దేవస్థాన పాలకమండలి ఎంపికలో జిల్లా నేతల అభిప్రాయాలను కోరకపోవడం, జిల్లా నేతలను విస్మరించారని ఫిర్యాదులు రావడం, పీసీసీని లక్ష్యంగా చేసుకుంటూ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యలు చేయడం, యూత్ కాంగ్రెస్ నేత వ్యవహారంలో జరిగిన వివాదం, ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చుట్టూ జరిగిన పరిణామాలు, ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా స్పందించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. మండల కమిటీల ఏర్పాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న ఆరోపణలతో అనేక జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా మాట్లాడినట్లు తెలిసింది. అభివృద్ధి నిధుల కేటాయింపు, అధికార యంత్రాంగం స్పందన, స్థానిక సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేల సూచనలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాలపైనా అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. రంగంలోకి హైకమాండ్ రాష్ట్ర పరిస్థితిని గాడిన పెట్టేందుకు హైకమాండ్ రంగంలోకి దింగింది. పార్టీ సమన్వయాన్ని కాపాడే క్రమంలో మొదటి అడుగుగా బుధవారం ఢిల్లీలో పార్టీ పీసీసీ సమన్వయ కమిటీ భేటీని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతోపాటే.. మీనాక్షికి పార్టీ–ప్రభుత్వ సమన్వయాన్ని బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించడం, విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించడం, బహిరంగ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోమని స్పష్టమైన కేతాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ నేతల విషయంలో అవసరమైతే హైకమాండ్ నేరుగా జోక్యం చేసుకుంటుందని, ఏఐసీసీ పరిశీలకులను పంపి అవసరమైన చర్యలకు దిగుతామనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. -
‘హైడ్రాను బ్యాన్ చేయాలి’
హైదరాబాద్: హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలనే హైకోర్టు తీర్పును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్వాగతించారు. హైకోర్టు తీర్పు సీఎం రేవంత్‌కు చెంపదెబ్బ అంటూ మండిపడ్డ రాంచందర్‌రావు.. హైడ్రాను సైతం బ్యాన్ చేయాలన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసింది రేవంత్‌రెడ్డేనని, అధికారాన్ని పావులా వాడుకున్నారని ధ్వజమెత్తారు. దీనికి పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డినే వహించాలన్నారు. ‘హిట్లర్ స్పూర్తితో హైడ్రా తెచ్చాం అని రేవంత్ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటికీ 63 సార్లు కన్టెంప్ట్ ఎదుర్కున్నారు రంగనాథ్. హైడ్రా కేవలం పేదల ఇండ్లు కూల్చడానికి ఉంది.. పెద్దల జోలికి పోవట్లేదు. అసలు హైడ్రాను బ్యాన్ చేయాలి’ అని డిమాండ్ చేశారు రాంచందర్‌రావు. -
High Court: సీఎం రేవంత్‌కు చెంప దెబ్బ
-
‘హైకోర్టు తీర్పు సీఎం రేవంత్‌కు చెంప దెబ్బ’
హైదరాబాద్ హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ తీర్పు సీఎం రేవంత్‌కు చెంప దెబ్బగా అభివర్ణించిన ప్రవీణ్‌కుమార్.. హైడ్రా పేరుతో ప్రభుత్వం ఎన్నో దారుణాలు చేసిందన్నారు. హిట్లర్ ఆదర్శమంటూ హైడ్రాను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్.. క్రూరమైన 99 జీవో తీసుకొచ్చారన్నారు. హిట్లర్ రక్తపాతం చేసినట్లు హైడ్రాతో హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించారన్నారు. ‘దివ్యాంగుల కాలనీని కూడా హైడ్రా నేలమట్టం చేసింది. అమీన్పూర్లో ఎన్నో బిల్డింగ్‌లను కూల్చేశారు. ఘోరమైన, క్రూరమైన చరిత్ర హైడ్రాకు ఉంది. జీవో నంబర్ 99లో చెప్పినట్లు హైడ్రా నడుచుకోలేదు. కూల్చివేతలు వద్దని హైకోర్టు చెప్పినా బిల్డింగ్‌లను నేలమట్టం చేశారు. కోర్టులకు సెలవులు ఉన్నప్పుడు చూస్కొని హైడ్రా విరుచుకుపడేది. హైడ్రా పేరుతో ఎన్నో దారుణాలు చేశారు. పిల్లల పుస్తకాలు చిందర వందర చేశారు, ముసలమ్మను ఈడ్చిపడేశారు. దిగువ మధ్యతరగతి, పేదల ఇళ్లపై హైడ్రా విరుచుకుపడింది. ధనవంతుల బిల్డింగ్‌ల జోలికి హైడ్రా వెళ్లలేదు. సీఎం రేవంత్ సోదరుడు ఇల్లును హైడ్రా కూల్చలేదు. రంగనాథ్ కాకపోతే మరొకరు వస్తారు.. అసలు చేపిస్తున్నది ఎవరు..?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రవీణ్ కుమార్. -
‘మరి రేవంత్ రాజీనామా చేయరా?’
ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ విద్యాశాఖ మంత్రిగా ఉండగానే టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అయ్యిందని, మరి నీతులు మాట్లాడుతున్న ఆయన ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించారు. ముందు సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. దేశ హితం కోసం ఏ వ్యవస్థ వచ్చినా తప్పులేదని, దేశానికి నష్టం చేసే వ్యవస్థ మాత్రం ఉండకూడదన్నారు. నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్ అని అన్నారు. దేశం డిజిటల్ చెల్లింపుల్లో అగ్రస్థానంలో ఉందన్నారాయన. తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో చాలా మార్పులు వస్తాయన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయని, భవిష్యత్తులో ప్రధాని ,హోంమంత్రి అందరూ నేతలు తెలంగాణలో పర్యటిస్తారన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కి భూమి పూజ చేయాలని, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్లానింగ్ జరుతుందన్నారు. -
జై జవాన్.. జై కిసాన్.. జై 'యువ'
సాక్షి, హైదరాబాద్: వికసిత్ భారత్ 2047, సబ్కా సాథ్ సబ్కా వికాస్ వంటి నినాదాలతో మాత్రమే మార్పు రాదని, యువశక్తిని సరైన దిశలో నడిపించి దేశ భవిష్యత్తుతో వారిని అనుసంధానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ఒకప్పుడు ‘జై జవాన్, జై కిసాన్‘ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ‘జై జవాన్, జై కిసాన్, జై యువ‘ అనే నినాదంతో ముందుకెళుతుందని చెప్పారు. యువశక్తి ఇక రోడ్లపై పోరాడటమే కాదు, పార్లమెంట్‌లోకి రావడానికీ సిద్ధంగా ఉందని, చట్టాలను కేవలం పాటించడానికే కాదు, రూపొందించడానికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ స్థానాల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించే అంశంపై కూడా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నాలుగు అంశాలపై ఒకేసారి చర్చ జరగాలని, ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం ఉంటే ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు, భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలు తీసుకుని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం జాతీయ మీడియాతో మాట్లాడారు. విని, ఆలోచించి, చట్టం చేయాలి ‘ప్రదానమంత్రికి తెలంగాణ ప్రభుత్వం తరఫున నా డిమాండ్ ఒక్కటే. సీట్ల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌తో పాటు ఎన్నికల వయసు తగ్గింపు అంశాన్ని కూడా చర్చించండి. దేశంలో లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ.. ఇలా ఎక్కడ ఎన్నికల వ్యవస్థ ఉన్నా అక్కడ చర్చ జరగాలి. ప్రజల స్వరమే దీనిపై తుది నిర్ణయానికి ఆధారం కావాలి. ప్రధాని మోదీ ఎప్పుడూ మాట్లాడడమే కాదు వినడమూ అలవర్చుకోవాలి. మీ పార్టీ, మీ వ్యవస్థలో మీరు చెప్పేది అందరూ వింటారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ‘మన్ కీ బాత్‘ పేరుతో ఆకాశవాణిలో మాట్లాడుతూనే ఉంటారు. మీకు మాట్లాడడం మాత్రమే అలవాటు. వినే అలవాటు లేదు. కానీ ఇప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దేశం మారుతోంది. దేశ ప్రజలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడం ప్రారంభించారు. మీరు కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. విని, ఆలోచించి, చట్టం చేయాలి. యువశక్తిని రాజకీయ వ్యవస్థలోకి తీసుకొస్తే దేశ భవిష్యత్తు మారిపోతుంది. 21, 25 సంవత్సరాలకు తగ్గించాలి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఇంకా 25 సంవత్సరాలుగానే ఎందుకు ఉండాలి? అందుకే ఆగస్టు నెలను చరిత్రాత్మక నెలగా మార్చాలని నిర్ణయించాం. తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించి, ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు, రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 25 సంవత్సరాలకు తగ్గించాలని తీర్మానం చేసి ఆమోదించాలని నిర్ణయించాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మోదీకి ఇది రెండో పరాజయం ‘దేశంలోనే అత్యంత శక్తివంతుడు తానేనని భావించే మోదీకి ఇది రెండో పరాజయం. రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తెచ్చినప్పుడే రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ఈ చట్టాలను దేశ ప్రజలు అంగీకరించరని, విరమించుకోవాలని సూచించారు. కానీ మోదీ తనను ఏమీ చేయలేరని భావించారు. రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని నాడు రాహుల్‌గాంధీ చెప్పినా వినలేదు. చివరకు దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమబాట పట్టారు. ప్రాణాలు పోయినా వెనక్కు తగ్గకుండా ఉద్యమించి మోదీని వెనక్కు తగ్గించారు. ఆ మూడు నల్లచట్టాలను విరమించుకునేలా చేసి రైతులకు క్షమాపణలు చెప్పించారు. దాన్ని ఒక పాఠంగా తీసుకుని మోదీ మారతారని, ప్రతిపక్షానికి గౌరవం ఇస్తారని భావించాం. కానీ మారలేదు. పాత ధోరణినే కొనసాగించారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి విద్యా రంగంలోనూ అదే పరిస్థితి కనిపించింది. యూజీసీ–నెట్ సహా అనేక పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పరీక్షలు రాసిన విద్యార్థులు విఫలం కాలేదు.. పరీక్షలను సక్రమంగా నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వమే విఫలమైంది. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ, నార్కోటిక్స్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరించి విద్యార్థులను, వారి పక్షాన మాట్లాడిన వారిని నియంత్రించాలని ప్రయత్నించారు. దేశమంతా వీధుల నుంచి పార్లమెంట్ వరకు తమ శక్తిని యువత చాటింది. 56 అంగుళాల ఛాతీ అంటూ గొప్పలు చెప్పుకున్న అహంకారాన్ని ఓడించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు.. నీట్ ఘటనల్లో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు కేంద్రం ఆర్థికసాయం అందించాలి. విద్యార్థులపై పెట్టిన అన్ని క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. రాహుల్‌గాంధీ కోరినట్టు అది జరగకపోతే యువశక్తి మరో ఉద్యమం చేపడుతుంది..’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులదే.. ‘మొదట దేశం, తర్వాత ప్రజలు, చివరగా పార్టీ. దేశ ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు కాంగ్రెస్ ముందు నిలబడుతుంది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, నిజాం పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసింది, స్వతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు యువత చేసిన ఉద్యమాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావించడం లేదు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులు, యువతదే. వారికి అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకుంది. పేదలను మరింత పేదలుగా మార్చడం బీజేపీకి ఎప్పుడూ అలవాటు. అందుకే చిన్న రాష్ట్రాలన్నింటికీ నష్టం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతోంది. దీనికి శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనాలి..’ అని సీఎం అన్నారు. -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు. ఓటు హక్కు వయస్సు, ఎన్నికల నిబంధనలు వంటి అంశాలను నిర్ణయించే అధికారం భారత ఎన్నికల సంఘం (Election Commission of India) మరియు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఇటువంటి అంశాలపై ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధికి తగదన్నారు. అదేవిధంగా, రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని,. ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం కావడంతో విద్యార్థులు తమ విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఇతర అంశాలపై దృష్టి మళ్లించడం సరైంది కాదన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నామన్నారు. -
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,278.14 కోట్లకు పరిపాలనా అనుమతి, 2,009.23 ఎకరాల భూసేకరణకు ఆదేశాలు జారీ చేసింది. IAF కోసం 1,609.23 ఎకరాలు, సివిల్ ఏవియేషన్‌కు 400 ఎకరాలు వాడనుంది. జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తారు. MRO, కార్గో, ప్యాసింజర్ సేవలకు ఎయిర్పోర్ట్ రూపకల్పన ఉండనుంది. భూసేకరణ, రోడ్ల మళ్లింపు, విద్యుత్ టవర్ల తొలగింపునకు నిధులు వాడతారు. హైటెన్షన్ లైన్లు, నీటి వనరుల మార్పునకు ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నారు. 2026 డిసెంబర్ 31లోగా భూసేకరణ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘రోడ్లపై జరిగిన మీ పోరాటం మళ్లీ ఇంటికి వెళ్లొద్దు. జంతర్‌మంతర్ నుంచి నేరుగా లోక్‌సభ, రాజ్యసభకు వెళ్లాలి. ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు. ఇక్కడ వినిపించిన గళం చట్టసభల్లో ప్రవేశించాలి. మీ ఆలోచన ప్రపంచానికి చాటిచెప్పాలి. నాడు రాజీవ్‌గాంధీ హయాంలో రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే దేశ యువతకు ఓటు హక్కు కల్పించారు. 21 ఏళ్లకే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవుతున్నారు. కానీ, ఈ దేశ యువత లోక్‌సభకు, అసెంబ్లీకి వెళ్లాలంటే 25 ఏళ్ల వరకు, రాజ్యసభకు, శాసనమండలికి వెళ్లాలంటే 30 ఏళ్ల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. అందుకే దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలి. ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనసభ, మండలిని ప్రత్యేకంగా సమావేశపరుస్తా. 21 ఏళ్లకే చట్టసభల్లోకి ప్రవేశం కల్పించేలా అన్ని పక్షాలతో చర్చించి రాష్ట్రం తరఫున తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. రాహుల్, ఖర్గే సహకారంతో పార్లమెంటులో ఆమోదానికి ప్రయత్నిస్తాం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని అయితే జెన్‌జీ నాయకుడికి కేంద్ర విద్యా శాఖ మంత్రిగా అవకాశం వస్తుందని, అలా ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని, ఇండియా కూటమి పక్షాలతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పారు. నీట్ పేపర్ లీక్‌కు నిరసనగా, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ, విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా టీపీసీసీ ఆధ్వర్యలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో రేవంత్‌రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొంగులేటి, అజహరుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్‌తో పాటు పలువురు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోదీ మెడలు వంచారు... ఇందిరాగాంధీ విగ్రహం వద్ద యువతనుద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడుతూ.. లాఠీలు, తూటాలు విద్యార్థి ఉద్యమ స్ఫూర్తిని నిలువరించలేకపోయాయని, ప్రధాని మోదీని ఓడించి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించిన విద్యార్థుల పోరాట స్ఫూర్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. 56 అడుగుల చాతీ సాగిలపడిందని ఎద్దేవా చేశారు. సోమవారంలోపు విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇక్కడకు వచ్చిన యువకులెవరూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాదని రేవంత్ అన్నారు. పోరాడి దేశ యువత సాధించిన విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదల్చుకోలేదన్నారు. ఈ పోరాటం, విజయం యువతదే అని చెప్పారు. 21 ఏళ్లకే ప్రధాని కావచ్చు ‘శాసనసభతోపాటు లోక్‌సభ, స్థానిక సంస్థలు చట్టసభల్లో ప్రధానమైనవి. ఈ స్థానిక సంస్థల్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతకు జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లుగా అవకాశం వస్తోంది. తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి నాడు 21 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డి. అనన్య అనే అమ్మాయి 21 ఏళ్లకే ఐఏఎస్ అయింది. 32 ఏళ్ల క్రితం తన 22 సంవత్సరాల వయసులోనే డీజీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ అయ్యారు. కానీ, అసెంబ్లీ, లోక్‌సభకు వెళ్లాలంటే 25 ఏళ్ల వరకు, రాజ్యసభ, శాసనమండలికి వెళ్లాలంటే 30 ఏళ్ల వరకు ఆగాల్సి వస్తోంది. జర్మనీ, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్లు పూర్తయితే చట్టసభలకు వెళ్లడమే కాకుండా దేశ ప్రధానులుగా, అధ్యక్షులుగా కూడా కావచ్చు. సింగపూర్‌లో 21 ఏళ్లకే ప్రధాని కావచ్చు. కానీ, మనదేశంలో ఆ పరిస్థితి లేదు. అందుకే 25 ఏళ్ల వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో విద్యా, ఐటీ శాఖలు 60, 70 ఏళ్లున్న వారు కాదు.. 21 ఏళ్ల వయసున్న యువకులు మంత్రులుగా నిర్వహించాలి. జెన్‌జీ యువ కెరటాలకు చట్టసభల్లో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి’అని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ నుంచే ప్రారంభం: మహేశ్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ‘దేశ వ్యాప్తంగా విద్యార్థి లోకం ఒక్కటైంది. 56 ఇంచుల చాతీ అని చెప్పుకునే ప్రధాని మోదీ నీట్ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి దేశంలో ఏర్పడింది. యువతకు చట్టసభల్లో మాట్లాడే అవకాశం వచ్చేంతవరకు ఇలాంటి లీకేజీలు జరుగుతుంటాయి. రాహుల్ ప్రధాని అయితే జెన్‌జీ నుంచి ఒకరు విద్యా మంత్రి అవుతారు. ఉభయసభలను సమావేశపరిచి 21 ఏళ్లకే చట్టసభల్లోకి ప్రవేశించే విధంగా తీర్మానం చేయాలని సీఎం రేవంత్‌ను కోరుతున్నా. దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసే ఆలోచన తెలంగాణ నుంచే ప్రారంభం కావాలి’అని వ్యాఖ్యానించారు. ర్యాలీలో పాల్గొన్న ఒక విద్యార్థిని మాట్లాడుతూ తాను కూడా నీట్‌పరీక్ష రాశానని, అయితే నీట్ గత రెండేళ్లుగా లీక్ అవుతోందని, కానీ ఈ సంవత్సరమే వెలుగులోకి వచ్చిందని చెప్పారు. సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామిక విజయమని అన్నారు. కాగా, కార్యక్రమం ముగిసిన తర్వాత యువతతో రేవంత్ సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు దిగారు. -
క్యూర్ జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో నిర్మించే ఎల్ఐజీ (ఇందిరమ్మ ఇళ్లు) ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని ఈ ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని, ప్రతిగా ఆయా శాఖలకు వేరే చోట స్థలాలు ఇవ్వాలని సూచించారు. జనావాసాలకు దూరంగా ఇళ్లను కేటాయిస్తే, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.అలా కాకుండా పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తేగా.. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకుని, సంబంధిత శాఖలకు వేరేచోట స్థలాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు.సంబంధిత నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శులు ఎన్.శ్రీధర్, వి.శేషాద్రి, రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతకు ప్రత్యేక బ్యూరో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక బ్యూరోను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రవాణా వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసి ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసే ఈ బ్యూరోకు సంస్థాగత నిర్మాణం ఉండాలని సూచించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఈ అంశంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీల ఏర్పాటుపై ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి రెండు లేదా మూడు నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధికరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని చెప్పారు. ట్రాఫిక్ వ్యవస్థలో నిబంధనలకన్నా క్రమబద్ధికరణపై ఎక్కువగా దృష్టి సారించాలని, వాతావరణంలో వచ్చే మార్పులు, కార్యాలయాల పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన అధ్యయనం జరగాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు పటిష్టం చేయాలని, ఓఆర్ఆర్పై ఇష్టానుసారం వాహనాలు నిలపకుండా నిరంతర పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో స్మార్ట్ సిగ్నలింగ్! హైదరాబాద్ నగరంలో స్మార్ట్ సిగ్నలింగ్ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావడానికి అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని, సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని సూచించారు. డ్రగ్స్‌పై విద్యా సంస్థలకు బాధ్యత అప్పగించాలి ‘డ్రగ్స్ నిరోధంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలి. విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి సంస్థల యాజమాన్యాలను బాధ్యుల్ని చేయాలి. క్యాంపస్ లోపల డ్రగ్స్‌కు సంబంధించి ఏ ఘటనకైనా యాజమాన్యాలనే బాధ్యుల్ని చేయాలి. క్యాంపస్ బయట జరిగే కార్యకలాపాలు గుర్తించి సమాచారాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. విద్యాసంస్థలకు అధికారంతో పాటు బాధ్యతను అప్పగించాలి. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలి..’అని సీఎం చెప్పారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ ‘డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం అందించేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. డ్రగ్స్‌ను గుర్తించడం, మాని్పంచడం, శిక్షించడం అన్న మూడు దశలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. డ్రగ్స్ స్వీకరించి పట్టుబడితే డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించాలి. తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించండి. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయండి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్‌రెడ్డి, కె.రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తాగు నీటి సరఫరాకు మాస్టర్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో తాగు నీటి సరఫరాకు సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీతోపాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగు నీటి సరఫరాలో ఏకరూపత ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్ ప్లాన్ ఉండాలని సూచించారు. హైదరాబాద్ మహా నగర తాగునీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి ఎంసీఆర్హెచ్ఆర్డీలో గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వల్ల తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగు నీటి వనరులను అనుసంధానించాలన్నారు. ఏదేని కారణంతో ఒక చోటి నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో చోటి నుంచి వచ్చేలా ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అనుసంధానత దోహదపడుతుందన్నారు. రోజు విడిచి రోజు ఇవ్వాల్సిందే.. జీహెచ్ఎంసీ పరిధిలో ఏళ్లుగా పలు ప్రాంతాల్లో మూడునాలుగు రోజులకోసారి తాగు నీరు సరఫరా చేస్తున్నారని, ఇక ముందు ఆ పరిస్థితి ఉండకూడదని సీఎం రేవంత్ చెప్పారు. ఆయా ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగు నీటి సరఫరా పనులను ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్టీపీల నిర్మాణ పనులపై ఆరా తీసిన ఆయన.. వాటి నిర్మాణాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలుంటే త్వరగా పరిష్కరించాలని సూచించారు.తాగు నీటి సరఫరాకు సంబంధించిన పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల ప్రగతిపై ప్రతి నెలా తనకు నివేదిక సమరి్పంచాలన్నారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు, వివిధ నిర్మాణ పనుల్లో గ్రే వాటర్ (వినియోగార్హమైన మురుగునీరు) వాడేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. సమీక్షలో ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జేఎండీ మయాంక్ మిట్టల్ పాల్గొన్నారు. -
రాజకీయ మనుగడ కోసమే అరాచకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన ప్రవేశపరీక్షల పత్రాల లీకేజీలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, వామపక్ష పారీ్టలు రాజకీయ మనుగడ కోసం అరాచకాలకు పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులను కవచంగా వాడుకుంటూ దేశ వ్యతిరేక శక్తులు, తుక్డే గ్యాంగులతో కలిసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షహీన్‌బాగ్ తరహాలో దేశంలో అలజడి సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నీట్ లీకేజీపై తక్షణ చర్యలు తీసుకున్నాం... నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 17 మందిని సీబీఐ అరెస్టు చేసిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం ద్వారా దోషులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు. రెండోసారి పకడ్బందీగా పరీక్ష నిర్వహించామని.. విద్యార్థులంతా సంతోషంగా ఉన్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చకు రావాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. టెన్త్ పేపర్ లీకైనప్పుడు రేవంత్ రాజీనామా చేయలేదేం? గతంలో కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగినా ఏనాడూ బాధ్యత వహించని నేతలు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ రాజీనామాను డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిలకు రాజీనామాలు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. 2025లో టెన్త్ పేపర్ లీక్ అయినప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. 2026లో జగిత్యాలలోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు కాంగ్రెస్ మంత్రులతో రాజీనామా చేయించారా అని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పాకే రేవంత్‌రెడ్డి నీట్ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. -
కొడంగల్‌లో ధర్నా రాజకీయ నాటకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: నీట్ పరీక్ష ఉదంతంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రస్తావించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంపై రాజ్ భవన్ ముందు ధర్నా చేయాల్సిందిపోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తే ఆయన కొడంగల్‌కు పోయి అక్కడ ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. ‘మోదీ అంటే రేవంత్‌కు భయం. ఆయన పగలు కాంగ్రెస్‌తో ఉంటాడు. రాత్రయితే బీజేపీతో కలుస్తాడు..’అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఒక మూట ఇస్తే బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడని ఆరోపించారు. సీఎంపై ఉన్న పాత కేసులను బీజేపీ ప్రభుత్వం తోడుతుందనే ఉద్దేశంతోనే ప్రధాని పేరును కూడా పలకడానికి భయపడుతున్నాడని విమర్శించారు. గురువారం హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు ‘ఇది మూటలు పంపే పాలన. ప్రజలకు ఉపయోగపడే ఏ పని రేవంత్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టులను తన బంధువులకు ఇప్పించుకుంటున్నారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు. ఆయన బామ్మర్ది సృజన్‌రెడ్డికి మేలు జరిగే విధంగా వ్యవహరించారు. కన్నెపల్లి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరు? బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులేవీ కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయడం లేదు. ఆ పనులు పూర్తి చేస్తే మాకు పేరొస్తుందని సీఎం భయపడుతున్నారు. దేవాదుల నుంచి నీటిని లిఫ్ట్ చేసినప్పుడు కన్నెపల్లి నుంచి ఎందుకు నీటిని పంపిణీ చేయరు? కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా తాము ఆపలేదని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు..’అని కేటీఆర్ అన్నారు. నాలుగు పార్టీలు మారి హరీశ్‌రావుపై ఆరోపణలా? ‘హరీశ్‌రావు పార్టీ మారరు. బీఆర్ఎస్ పార్టీ లోనే తన పుట్టుక, చావు అని ఇప్పటికే పలుమార్లు హరీశ్‌రావు ప్రకటించారు. అయినా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. హరీశ్‌రావుపై నాలుగు పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఎవరితోనూ పొత్తులుండవు.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. కవిత అంశంపై కూడా వ్యక్తులుగా కాకుండా వ్యవస్థలుగానే మాట్లాడతాం. కేసీఆర్ దయవల్లే మేమంతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 179 వరకు పెరిగే అవకాశం ఉంది. పునర్విభజన వల్ల నా నియోజకవర్గం మారే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉండటమే నాకు ఎక్కువ సంతృప్తినిస్తోంది.ప్రజా సమస్యలపై అంశాల వారీగా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతులు, నిరుద్యోగులతో సమావేశాలు నిర్వహించాం. త్వరలో ఇతర వర్గాలతో కూడా సమావేశాలు చేపడతాం. నిరుద్యోగం, యువత సమస్యలు, రైతుల ఇబ్బందులపై బీఆర్ఎస్ మరింత దూకుడుగా పోరాటాలు కొనసాగిస్తుంది. అలాగే వచ్చే ఏడాది పాదయాత్ర కూడా చేస్తా. త్వరలోనే తేదీలు, వివరాలు ప్రకటిస్తాం. విద్యార్థుల ఆగ్రహం మోదీపైకి మళ్లింది.. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల ఆందోళనలు పెరుగుతున్నాయి. మొద ట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. దేశంలో యువత, నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తే దీనికి కారణం. మోదీ ప్రభుత్వం ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకుంది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం పదవి వారసత్వ హక్కు కాదు.. ‘ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. సీఎం పదవి అనేది వారసత్వ హక్కు కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు, రాష్ట్ర సాధకుడు.. కేసీఆర్ కుమారుడిగా, ఈ తెలంగాణ బిడ్డగా రాష్ట్ర సాధన పోరాటంలో మమేకం అయినందుకు గర్వపడుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. పదవులు ప్రజల అభీష్టం మేరకు వస్తాయని, ప్రజలు ఏది కోరుకుంటే అదే అవుతుందని అన్నారు. -
మంత్రికి తెలియకుండానే విజిలెన్స్ విచారణ?
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియకుండానే ఆ శాఖలో జరిగిన సన్న ధాన్యం టెండర్ల రద్దు వ్యవహారంపై విజిలెన్స్ విచారణ సాగడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుగా మంత్రి భావిస్తున్నారని తెలిసింది. మిగిలిపోయిన సన్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని భావించి టెండర్లను పిలిస్తే, బిడ్డర్లు తక్కువ ధరను కోట్ చేయడంతో మంత్రి ఆదేశాలతో ఆ టెండర్లు రద్దయ్యాయి. అయితే రద్దయిన ఈ టెండర్లకు సంబంధించి మంత్రికి తెలియకుండా సీఎం రేవంత్‌రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంబంధిత శాఖ అధికారులు సైతం విషయం మంత్రికి తెలియజేయలేదని అంటున్నారు. విజిలెన్స్ విచారణ సంగతి పత్రికల్లో వచ్చేంత వరకు మంత్రికి కనీసం సమాచారం లేదని తెలుస్తోంది. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. శాఖ ఉన్నతాధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. తనకు శాఖకు సంబంధించిన అంశాలు పత్రికల్లో చూసి తెలుసుకోవాల్సి వస్తోందంటూ సన్నిహితుల వద్ద ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రిని సంప్రదించకుండానే..? గత ఖరీఫ్ సీజన్లో సేకరించిన ధాన్యంలో కేంద్రం సెంట్రల్ పూల్ కింద తీసుకున్నది, రాష్ట్ర అవసరాలకు ఉంచుకున్నది పోగా.. సుమారు 12 లక్షల టన్నుల సన్న ధాన్యం మిగిలిపోయింది. ఈ ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా వేలం వేయాలని నిర్ణయించిన మంత్రి.. పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. తొలుత 5 లక్షల టన్నుల ధాన్యాన్ని 11 లాట్లుగా విభజించి టెండర్లను ఆహా్వనించారు. ఇందులో కనీస ధరను టన్నుకు రూ. 34,050గా నిర్ణయించినప్పటికీ, బిడ్డర్లు రూ.25 వేల నుంచి రూ.27 వేల మధ్య మాత్రమే కోట్ చేశారు. దాంతో మంత్రి ఆదేశాల మేరకు ఆ టెండర్లను అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బిడ్డర్లు తక్కువ ధరలకు ఎందుకు కోట్ చేశారనే అనుమానంతో ముఖ్యమంత్రి విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత శాఖ మంత్రి అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సంప్రదించలేదని సమాచారం. కాగా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా మంత్రికి ఈ విషయం తెలియజేయకుండా ఏకంగా మిల్లుల్లో విచారణ చేపట్టారు. మీడియాలో వచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్..‘నా శాఖలో నాకు తెలియకుండా విజిలెన్స్ విచారణ ఎలా వేస్తారు..? ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు..?’ అంటూ గురువారం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎంవో నుంచే నిర్ణయాలా..? పౌరసరఫరాల శాఖకు సంబంధించిన కీలక నిర్ణయం నేరుగా సీఎంవో ఆదేశాలతోనే అమలవుతుండడం, ఆ శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకపోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంవో నుంచి వచ్చిన సూచనల మేరకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకు విజిలెన్స్ విచారణ, మిల్లుల్లో దాడులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఆ మరుసటి రోజే మిల్లులకు ఇచ్చిన రూ.52 కోట్ల ధాన్యం మాయమైందనే విషయాన్ని కూడా మంత్రికి తెలియజేయకుండానే లీక్ చేసినట్లు తెలిసింది. మిల్లుల నుంచి సీఎంఆర్ పూర్తిగా సేకరించకుండానే ధాన్యం మాయమైందనే నిర్ణయానికి వచ్చిన అధికారులు.. ఆ విషయాన్ని లీక్ చేయడంపై కూడా మంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. నిర్ణయాలు ముందుగా మీడియాకు లీక్ చేసి, అనంతరం శాఖను ఇరకాటంలో పెట్టేలా పరిస్థితి నెలకొంటోందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ, దాడుల పేరుతో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని కూడా ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. -
కాంగ్రెస్ ఓట్లే లక్ష్యం.. 'సర్'తో బీజేపీ సర్కార్ కుట్ర: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–సర్) పేరుతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘సర్’ పేరుకే ప్రక్షాళన అని, కాంగ్రెస్ ఓట్ల తొలగింపే టార్గెట్ అని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళితులు, గిరిజనుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు కోల్పోతే సంక్షేమ పథకాల లబ్ధి పొందడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ నగరంలో లక్షల ఓట్లు తొలగించారని, ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనను సంక్షేమ శాఖకు బదిలీ చేశారని విమర్శించారు. ఇప్పుడు చేస్తున్న ఎస్ఐఆర్కు ఆద్యుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. గురువారం శాసనసభ ఆవరణలో జరుగుతున్న మరమ్మతు పనులను సీఎం పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ మీడి యా అడ్వైజరీ కమిటీ కార్యాలయంలో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ముందు ఓట్ల తొలగింపు.. తర్వాత సంక్షేమ పథకాలు ‘పేదోడి ఓటు చాలా విలువైంది. ఓటు పోతే వారి జీవితం పోతుంది. అందుకే 3వ తేదీ వరకు మా నేతలకు హైదరాబాద్ రావొద్దని చెప్పా. సర్ ప్రక్రియ ఇప్పటివరకు 70 శాతం పూర్తయ్యింది. ఇంకా 30 శాతం ఉంది.. ఇదే కీలకం. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత కీలక పాత్ర పోషించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలు, దళితులు, గిరిజనుల ఓట్లు పెద్దఎత్తున తొలగిపోయే ప్రమాదం ఉంది. కూలీ పనులకు వెళ్లేవారు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పేదలంతా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వాళ్లే. బీఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్లు ఇంట్లో లేకపోతే ఆ ఓట్లు పోయినట్టే. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న ఈ వర్గాల ఓట్లను తొలగించడం ద్వారా పార్టీని బలహీనపరచాలని కుట్ర జరుగుతోంది. ఓటు లేకపోతే ప్రజాస్వామ్య హక్కులు పోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నాకు రెండు ఓట్లు లేవు.. ‘కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నాయి. నీట్ పేపర్ లీకేజీ నుంచి ఎస్ఐఆర్ వరకు రెండు పార్టీల వైఖరి అనుమానాలకు తావిస్తోంది. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. నాకు రెండు ఓట్లు ఉంటే బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. విచారణ చేసి తప్పు అయితే లోపల వేస్తారు. నేను స్వయంగా ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు పెట్టుకుని ఓటు కొడంగల్‌కు మార్చుకున్నా. కాళేశ్వరం కేసులో సీబీఐ తన పని చేసుకుంటుంది.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిటీ నివేదికల ఆధారంగానే సీబీఐకి దర్యాప్తుకు అప్పగించాం. తప్పు చేసి ఉంటే తప్పించుకోలేరు. మేడిగడ్డ బరాజ్ గేట్లు తెరిచినా, పంప్‌హౌస్‌లు నడిచేపక్షంలో అవెందుకు కట్టారో చెప్పకుండా హరీశ్‌రావు చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్, బరాజ్‌ల నిర్మాణం, గేట్ల నిర్వహణపై నిపుణుల నివేదికలు స్పష్టంగా ఉన్నాయి. ఆ అంశాలపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడకుండా కన్నెపల్లి నుంచి నీటిని తరలించాలని కొత్త రాగం అందుకున్నారు. మేడిగడ్డ బరాజ్‌లో 5 టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని తరలించే అవకాశం ఉంది. అదే పద్ధతి అన్నారం, సుందిళ్లలో కూడా ఉంది. ఇవన్నీ జరగాలంటే మూడు బరాజ్‌ల గేట్లు మూయాలి. అవి మూస్తే బరాజ్ కూలుతుందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. దేవాదుల ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేస్తున్నాయి..’ అని రేవంత్ వివరించారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఎవరిది? ‘ఇంటర్మీడియెట్ పరీక్షల వ్యవహారంలో 25 మంది విద్యార్థుల మరణాలకు కారణమైందని ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబ్ అరెనా సంస్థ పేరు మార్చుకుని ప్రస్తుతం ’కో ఎంప్ట్’ గా చలామణి అవుతోంది. నీట్ పేపర్ లీకేజీకి స్ఫూర్తి నాటి గ్లోబ్ అరెనా సంస్థ చేసిన ఇంటర్ లీకేజీనే. జన్వాడ ఫామ్‌హౌస్ ఏ రాజు నుంచి వచ్చిందో...ఆ ఫామ్‌హౌస్‌కు, గ్లోబ్ అరెనా సంస్థ ‘రాజు’కు ఉన్న సంబంధమేంటో కేటీఆర్ చెప్పాలి. గ్లోబ్ అరెనా సంస్థ తనది కాదని కేటీఆర్ చెప్పే పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. ఇప్పటికే విజిలెన్స్ ద్వారా గ్లోబ్ అరెనా ఇంటర్ లీకేజీపై విచారణ జరుగుతోంది. కేటీఆర్ ఫిర్యాదు చేస్తే సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగుతారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారి విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు. జైలుకు వెళ్తే సానుభూతి వచ్చి సీఎంలు అయ్యే పక్షంలో, ఎప్పుడో జైల్లో ఉన్న చార్లెస్ శోభరాజ్, బిల్లా రంగాలు కూడా పీఎంలు ఆయ్యే వాళ్లు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఇందిరమ్మ’ అదనపు ఖర్చు లబ్ధిదారులదే ‘పేదల ఇళ్లకు రూ.5 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అందుకు అనుగుణంగానే భూమి ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది. హైదరాబాద్‌లో ఇచ్చే లక్ష ఇళ్లకు కూడా ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది. అదనపు ఖర్చు లబ్ధిదారులే చెల్లించాల్సి ఉంటుంది. సమర్ధవంతంగా హైడ్రా వ్యవస్థ హైడ్రా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది. చెరువులను పునరుద్ధరించి ప్రభుత్వ భూములను కాపాడుతోంది. ఉద్యోగాల భర్తీలో మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 55 రోజుల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే నియామకాల జాబితాను పేర్లతో సహా వెల్లడించడానికి సిద్ధం. నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రశ్నపత్రం అమ్ముకోవడం వారి విధానమైతే, నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం మా విధానం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయలేకపోయామని కేటీఆర్ ఒప్పుకున్నాడు. మేము ప్రక్షాళన చేయడమే కాకుండా పదేళ్ల తర్వాత గ్రూప్ –1 పరీక్షలు నిర్వహించాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
సీఎం రేవంత్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. గ్లోబేరినా టెక్నాలజీస్ అంశంలో చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. గ్లోబేరినా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేశారు.‘‘గ్లోబేరినా బినామీ కంపెనీ అనడం, సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని విమర్శలు గుప్పించారు. గడువులోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
కాక్రోచ్ జనతా పార్టీపై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్
-
రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ ర్యాలీ
వికారాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొడంగల్‌లోని తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నినాళులు అర్పించారు.కరీంనగర్ జిల్లాలో..జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల నిరసన కార్యక్రమంలో పోలీసుల లాఠీఛార్జ్ పై నిరసన ప్రకటించారు. ప్రధాన మంత్రీ నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లెక్సీ లు దగ్ధం చేశారు.నల్లగొండలో..నల్లగొండలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.సిద్దిపేట జిల్లాలో.. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన జరిగింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో, ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ఉద్యమాన్ని , సత్యాగ్రహాన్ని తలపించింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు తిరగబడకుండా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని గాంధేయ మార్గంలో నిరసన తెలిపారు. అనేక మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థుల లాఠీచార్జ్ పై కనీసం హోంమంత్రి సంఘీభావం తెలపలేదు. ఇప్పటికే ఛాత్రోంకి గుంజ్ పేరుతో దేశ వ్యాప్తంగా విద్యార్థులతో రాహుల్ గాంధీ గారు విద్యా వ్యవస్థ పై మాట్లాడుతు విద్యార్థుల గొంతు వినిపిస్తున్నారని పొంగులేటి అన్నారు. కామారెడ్డి జిల్లాలో..రాహుల్ గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లి చౌరస్తాలో 161వహై వే పై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతా రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆలే మల్లికార్జున్, జుక్కల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా..రాహుల్ గాంధీ తో పాటు ప్రతిపక్షాల నేతల అక్రమ అరెస్టు నిరసిస్తూ, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని గాంధీ చౌక్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని కాంగ్రెస్ శ్రేణుల నిరసన తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నిర్మల్ జిల్లా బైంసా.. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ముధోల్ నియోజకవర్గం ఇంచార్జ్ నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో ఆందోళన బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
రేవంత్‌కు తెలిసింది ఒట్లు.. తిట్లే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ఢిల్లీలో పార్లమెంట్ వద్ద వేలాది యువత నిరసనతో కేంద్రాన్ని ఎలా గడగడలాడించిన్రో చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. యువత, రైతన్నలు తిరగబడితే కాంగ్రెస్ నాయకుడు బయట తిరగలేరు.’అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మాజీ ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు అధ్యక్షతన జరిగిజన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు అల్లాడుతున్నారు. అన్ని గండాలను దాటిన రేవంత్‌రెడ్డి గండం రైతులు దాటలేకపోతున్నారు. రైతులకే కాక అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది. 31నెలలు అయిపోయింది. ఇంకా 29నెలలే ఉంది. యువ సంగ్రామ సదస్సుతో ప్రభుత్వాన్ని ఎండగట్టాం. యువత చేతికి రేవంత్‌రెడ్డి దొరికితే పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నారు. పాము సొంత పిల్లల్ని తిన్నట్లు రేవంత్‌రెడ్డి రైతులను చెప్పలేని కష్టాలు పెడుతున్నారు. నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు. కన్నెపల్లి వద్ద 94మీ.ఎత్తులో నీరు పారుతున్నా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు నడిపిస్తే, రోజుకు 3టీఎంసీల ఎత్తిపోయవచ్చు. ఎన్డీఎస్ఏ కన్నెపల్లి నీళ్లు ఎత్తిపోయొద్దని చెప్పిందా? అని ప్రశ్నించారు. గోదావరి, ప్రాణహిత నదులు పారుతున్నా పరిపాలించే వారికి సోయి లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రూ.400కోట్లతో ఎల్అండ్టీ సంస్థ రిపేరు చేస్తామని చెప్పినా ప్ర భుత్వం పట్టించుకోలేదు. ఆయన గురువు చంద్రబాబు పట్టిసీమ లిఫ్టు నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లది రక్తం చల్లండి అంటే ప్రశాంత్‌రెడ్డి, సూర్యాపేట జిల్లాలో రైతులు రక్తం చల్లారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసింది ఒట్లు, తిట్లు మాత్రమే.’అని విమర్శించారు. ఈ సందర్భంగా వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌పై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాందీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన హామీలపై వీడియోను ప్రదర్శించారు. ఏ జాతి నీది అంటున్నారని, తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను రూ.50లక్షలతో కొనుగో లు చేసేందుకు వెళ్లిన జాతి తమదికాదని ధ్వజమెత్తారు. తెలంగాణలో రెండే జాతులున్నాయని, ఒకటి ప్రేమించేది, మరోటి రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి అన్నారు. కాగా, వరిధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి గాలివానకు గోడ కూలి చనిపోయిన నలుగురు రైతులు తనుగుల నాగరాజు, తనుగుల అభిరాం, నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్ కుటుంబాలకు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ.5లక్షలు అందజేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సు లో ఆసిఫాబాద్, బాల్కొండ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, నారదా సు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, దాసరి మనోహర్, నాయకులు రామ్మోహన్రావు, జాన్సన్‌నాయక్, విజిత్‌రావు పాల్గొన్నారు. -
‘మక్తల్’ ఎత్తిపోతల వేగం పెంచండి
కొడంగల్/దుద్యాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన మక్తల్ – నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్‌లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా) ఆధ్వర్యంలో చేపట్టిన పనుల తీరుతెన్నులపై చర్చించారు. ఎత్తిపోతల పథకానికి సంబంధించి సెప్టెంబర్‌లోపు భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో నిర్లక్ష్యం వహించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. 2027 డిసెంబర్‌లోపు ఎంత మేరకు పనులు పూర్తి చేస్తారో రాత పూర్వకంగా నివేదిక ఇవ్వాలని చెప్పారు. మూడు నియోజకవర్గాలకు ప్రాణాధారమైన పథకంపై అలసత్వం తగదన్నారు. దీనికి సంబంధించి అదనపు పంపుల ఏర్పాటు కోసం అవసరమైన సివిల్ పనులకు వర్క్ ఆర్డర్ ఇచ్చి పూర్తి చేయించాలని చెప్పారు. కాగా మొదటి దశ పనులను డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి ఇంజనీరింగ్ అధికారులు హామీ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ల డిజైన్లు రూపొందించండి.. రంగారెడ్డి– వికారాబాద్– నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంగా చర్చించి డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించిన భూ సేకరణను వేగవంతం చేయాలని చెప్పారు. ఇది పూర్తయిన వెంటనే టెండర్ ప్రాసెస్ మొదలు పెట్టాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన మల్టీపర్పస్ ఇండ్రస్టియల్ పార్క్‌కు అవసరమైన భూసేకరణపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబై– పుణె కనెక్టివిటీ మాదిరిగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కొడంగల్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డుపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇండస్ట్రియల్ పార్కులు, ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ధి పనులకు కనీసం 5 వేల నుంచి 10 వేల ఎకరాల భూమిని సేకరించాలని సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల ఇండ్రస్టియల్ పార్క్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. దేశానికే తలమానికంగా ఎడ్యుకేషన్ హబ్ హకీంపేట, లగచర్ల, పోలేపల్లి శివారులో రూ.5 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ దేశానికే తలమానికం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అసహనం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది మార్చిలోపు పనులన్నీ పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, బి.మనోహర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దానకిషోర్, వికాస్‌రాజ్, ముఖ్య కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ఎన్.శ్రీధర్, పలువురు ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. -
ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారం తరహాలోనే సీరియస్‌గా తీసుకోవాలని, రానున్న పది రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు మూడో తేదీ వరకు పొడిగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని, అప్పటివరకు నియోజకవర్గాల్లోనే ఉండి ఓటర్ల జాబితా సవరణపై దృష్టి పెట్టాలని సూచించారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్‌కు రావొద్దు.అలాంటి వారికి అసలు అపాయింట్మెంట్లు ఇవ్వొద్దు. కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చుని పనిచేయడం లేదు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదు..’ అని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి ఆదివారం ఆయన జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.30న మళ్లీ సమీక్ష‘ఎస్ఐఆర్పై పార్టీ పక్షాన ఇప్పటివరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 489 సమావేశాలు జరిగాయి. కొన్ని చోట్ల బాగానే జరుగుతున్నా మరికొన్ని చోట్ల వెనుకబడ్డాం. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లోని నేతలు ఎస్ఐఆర్పై దృష్టి పెట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్ఐఆర్ కోసం నియమించిన పార్టీ ఇన్చార్జిలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. బీఎల్ఏ, బీఎల్వోల రిపోర్టులను గాంధీభవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించి సూచనలివ్వాలి. ఇన్చార్జి మంత్రులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలి. ఏది జరిగినా వారిదే బాధ్యత. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి మరోమారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటాం..’ అని రేవంత్ స్పష్టం చేశారు. 100 మందికి రాహుల్‌తో ఫొటోకు చాన్స్‘జిల్లాల వారీగా ఎస్ఐఆర్ కార్యక్రమాలపై అన్ని జిల్లాల ఇన్చార్జి మంత్రులు సోమవారం సమీక్షలు జరుపుతారు. ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నా ఎస్ఐఆర్పై దృష్టి సారించాల్సిందే. పార్టీ పరంగా ఎస్ఐఆర్ ఇన్చార్జిలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. ఇన్చార్జిలుగా ఎంపీలున్నా క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాల్సిందే. లేదంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పూర్తిగా బీఎల్వోల రిపోర్టులపై ఆధారపడొద్దు. బీఎల్ఏల రిపోర్టులను పరిశీలించాలి. పార్టీ పరంగా పనిచేస్తున్న నేతలు ఈ బీఎల్ఏలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.అలా ఉపయోగించుకోవాలంటే పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలి. ప్రతి ఒక్కరూ సీరియస్‌గా ఉండాలి. బాగా పనిచేసే 100 మందికి రాహుల్‌గాంధీతో ఫొటో దిగే అవకాశం కల్పిస్తాం. ఎస్ఐఆర్ విషయంలో పార్టీ కార్యక్రమాలన్నింటికీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం ¿భట్టి విక్రమార్క బాధ్యత తీసుకోవాలి. అందరినీ సమన్వయం చేయాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. జాగ్రత్తగా వ్యవహరించాలి: మహేశ్గౌడ్టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా కీలకమైందని, ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి జరిగిన నష్టాన్ని గుర్తించైనా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని మహేశ్‌గౌడ్ కోరారు. -
సర్.. బేఖాతర్!
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలు, సమన్వయకర్తల నియామకం. గాంధీభవన్‌లో ప్రత్యేక వ్యవస్థ. ‘ఎస్ఐఆర్ను సీరియస్‌గా తీసుకోండి.. లేదంటే మీ స్థానంలో కొత్తవారు వస్తారు.. అవసరమైతే మీ జిల్లాలు మార్చేందుకు కూడా వెనుకాడను..’ అంటూ ఎమ్మెల్యేలకు, ఇన్చార్జి మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు డీసీసీ అధ్యక్షుల నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి సమాచార సేకరణ. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత వచ్చిన ఫలితాలు.. ‘ఇవేవీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పట్టడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘సర్’పై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ పక్షాన పదేపదే చెబుతున్నా మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా ఖాతరు చేయడం లేదు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 66 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండగా, అధికారం ఉండి కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయలేకపోతున్నారని అవి పేర్కొంటున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆదివారం పార్టీ నేతలతో జరిగిన జూమ్ సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ కేడర్ పనితీరును గురించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తన వద్ద ఉన్న నివేదికను నాలుగు కేటగిరీల్లో సీఎం రేవంత్ చదివి వినిపించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న 11 చోట్ల ముందంజ ఈ నివేదిక ప్రకారం 41 మంది పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ఎస్ఐఆర్పై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. 11 చోట్ల పర్వాలేదనే స్థాయిలో పనిచేస్తుండగా, 14 స్థానాల్లో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని, మరో 4 స్థానాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ కేడర్ జాడ కూడా లేదని వెల్లడయింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న మరో 11 చోట్ల పార్టీ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తేలింది. మొత్తం మీద పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం నియోజకవర్గాల్లో 60 శాతం స్థానాల్లో మాత్రమే ఎస్ఐఆర్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని వెల్లడైంది. ఎస్ఐఆర్ విషయంలో బాగా పనిచేస్తున్న నియోజకవర్గాల జాబితాలో కొడంగల్, మధిర, ఆంధోల్, కొల్లాపూర్ తదితర నియోజకవర్గాలుండగా, పెద్దగా పనిచేయని నియోజకవర్గాల జాబితాలో హుజూర్నగర్, పర్వాలేదనే స్థాయిలో పనిచేస్తున్న స్థానాల్లో ధర్మపురి ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని 89 నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ అంచనా ఇది: బాగా పనిచేస్తున్న నియోజకవర్గాలు: అచ్చంపేట, ఆదిలాబాద్, ఆలేరు, అంబర్‌పేట, ఆంధోల్, అశ్వారావుపేట, బెల్లంపల్లి, భువనగిరి, భూపాలపల్లి, బోధ్, చెన్నూరు, దేవరకొండ, డోర్నకల్, స్టేషన్ ఘన్పూర్, గోషామహల్, హుస్నాబాద్, హుజూరాబాద్, జడ్చర్ల, జగిత్యాల, కల్వకుర్తి, కామారెడ్డి, కరీంనగర్, ఖైరతాబాద్, కొడంగల్, ఖమ్మం, కొల్లాపూర్, కొత్తగూడెం, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మానకొండూరు, మంచిర్యాల, మంథని, మిర్యాలగూడ, ములుగు, నాగార్జున సాగర్, నకిరేకల్, నల్లగొండ, నారాయణ్ ఖేడ్, నిజామాబాద్ రూరల్, అర్బన్, పాలకుర్తి, పరకాల, రామగుండం, సంగారెడ్డి, సిర్పూర్, తాండూరు, వేములవాడ, వనపర్తి, వరంగల్ వెస్ట్, వర్థన్నపేట, ఇల్లెందు. పర్వాలేదనే స్థాయిలో పనిచేస్తున్న స్థానాలు: బాన్సువాడ, చొప్పదండి, ధర్మపురి, కోదాడ, మల్కాజిగిరి, మునుగోడు, ముషీరాబాద్, నారాయణపేట, నర్సంపేట, పరిగి, కుత్బుల్లాపూర్, సత్తుపల్లి, శేరిలింగంపల్లి, తుంగతుర్తి, సూర్యాపేట, జహీరాబాద్. సరిగా పనిచేయని నియోజకవర్గాలు: బాల్కొండ, బోధన్ , చేవెళ్ల, గజ్వేల్, హుజూర్నగర్, చార్మినార్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, ముథోల్, నిర్మల్, పినపాక, రాజేంద్రనగర్, ఉప్పల్, ఎల్లారెడ్డి, గజ్వేల్, నర్సంపేట, యాకుత్‌పుర. అసలు దృష్టి పెట్టని స్థానాలు: ఆలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహుదూర్‌పుర. -
70 వేల ఉద్యోగాలు ఇచ్చుంటే.. రాజకీయ సన్యాసం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే.. నేను రాజకీయ సన్యాసం చేసి, రాహుల్‌గాం«దీకి జై కొడతా’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరూర్‌నగర్ స్టేడి యం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభా గం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరోలెక్క.. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువతరం ఇక్కడికి వచ్చింది. జంగ్ సైరన్ మోగించిన యంగ్ జనరేషన్ కాకతీయ, ఉస్మానియా, మహాత్మాగాం«దీ, శాతవాహన వర్సిటీలతోపాటు అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ నుంచి యువశక్తి శివమెత్తి పోటెత్తింది. పిడికిళ్లు బిగిస్తే.. పీఠాలే కదిలిపోతాయి. తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చింది. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరే. దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. వారికి డెత్ డిక్లరేషన్ రాయాలి ‘సరిగ్గా 38 నెలల క్రితం ఇదే నేలపై తెలంగాణ యువతకు దారుణమైన దగా జరిగింది. ప్రియాంకగాం«దీతోపాటు ఢిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్, హై కమాండ్ నుంచి గాం«దీలు, గాంధీ భవన్ నుంచి గాడ్సేలు కలిసి వచ్చి.. మాయామశ్చింద్ర చేశారు. యూత్ డిక్లరేషన్ పేరుతో నయవంచనకు పాల్పడ్డారు. మన యువతకు 24 హామీలు ఇచ్చారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి రాలేదు. డిగ్రీ పాసైతే రూ.లక్ష రాలేదు. పీహెచ్డీ చేస్తే రూ.ఐదు లక్షలు రాలేదు. అధిష్టాన పుత్రుడు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చిండు. చాయ్ తాగి, బిస్కెట్లు తిన్నడు. తెలంగాణ నిరుద్యోగులకు బిస్కెట్లు వేశాడు. రెండు (కేసీఆర్, కేటీఆర్) ఉద్యోగాలు తీసేస్తే.. ఒకేసారి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. కొలువుల కుంభమేళా అన్నారు. కుంభకోణాల పర్వానికి తెరతీశారు. యూత్ డిక్లరేషన్ చేసిన రాహుల్‌గాం«దీకి, ప్రియాంకగాంధీకి, రేవంత్‌రెడ్డికి డెత్ డిక్లరేషన్ రాయాల్సిన అవసరం ఉంది’ అని కేటీఆర్ చెప్పారు. నిన్ను సీఎంను చేసింది ఇందుకేనా..? ‘రాహుల్‌కు ప్రధాని జాబ్ వచ్చే వరకు విడిచి పెట్టబోననని సీఎం రేవంత్ చెబుతున్నాడు. తెలంగాణ యువత నిన్ను సీఎం చేసింది యువతకు జాబ్‌లు ఇవ్వాలని, లేక రాజకీయ నిరుద్యోగి రాహుల్‌కు ప్రధాని జాబ్ ఇవ్వమనా..? ఒక్క ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబులు నింపడం లేదు కానీ రాహుల్‌గాంధీ జేబులు, అన్నదమ్ముల అల్మారాలు బినామీల బీరువాలు నింపుతున్నాడు. ఉస్మానియా, కాకతీయ పీహెచ్డీ విద్యార్థులు.. ‘ఓటు కోసం కోటి మోసాలు.. కాంగ్రెస్ నాటకాలు’ అనే థీసిస్ చేయాలి. 20 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని నింపాలని దిల్‌సుఖ్‌నగర్‌లో ఆందోళన చేస్తుంటే.. లాఠీలు ఝళిపిస్తున్నాడు. దమ్ముంటే సెక్యురిటీ లేకుండా వీఎం హోంకు రా? ఎవరు ఉంటారో? ఎవరు చస్తాడో ? తేలుతుంది. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది’ అని కేటీఆర్ చెప్పారు. వాళ్లది పోటీ పరీక్షలు రాసిన ముఖమా? ‘పట్టాలు చేతపట్టుకుని, కిరాయి కట్టలేక, ఖాళీ కడుపుతో నిద్రహారాలు మాని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల పరిస్థితి మాకు తెలుసు. ఇలాంటి వారి జీవితాలతో కాంగ్రెస్, బీజేపీలు పరిహాసమాడుతున్నాయి. కేంద్రంలోని బడేభాయ్ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాÐనన్నాడు. ఇక్కడి చోటే భాయ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. పకోడీలు, చెకోడీలు వేసుకొమ్మని మోదీ చెబుతుంటే.. ఎండ్రిన్ తాగి చావండని రేవంత్ చెబుతున్నాడు. పోటీ పరీక్షలకు హాజరు కావడం, ఉద్యోగం కొట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు.. కానీ బండి సంజయ్, రేవంత్ ఒక్క పోటీ పరీక్ష రాసిన ముఖం కాదు. తెచ్చుకున్న తెలంగాణ తెర్లవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నేపాల్ మాదిరి భూకంపం పుట్టించమనడం లేదు. శ్రీలంకలా శివతాండవం చేయమనడం లేదు. ప్రభుత్వాన్ని కూల్చమనడం లేదు. మాది అల్లర్లు సృష్టించి, కేసుల్లో ఇరికించి, నెత్తురు చిందించి తప్పించుకునే పార్టీ కాదు. విద్యార్థులకు అండగా ఉంటాం. 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే. కేసీఆరే సీఎం. గతంలా కాకుండా ఈసారి మీ పూర్తి బా«ధ్యతను తీసుకుంటా. ఓ అన్నగా అండగా ఉంటా’ అని కేటీఆర్ పేర్కొన్నారు. స్కైరూట్‌కు అభినందనలు.. ‘బీఆర్ఎస్ హయాంలో ప్రైవేటు రంగంలో 26 లక్షల కొలువులు సృష్టించాం. ప్రతి మూడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటి హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. ఊహలకు రెక్కలిచ్చి ఆలోచనలకు ఆవిష్కరణలుగా మార్చే ఒక టీహబ్‌ను సృష్టించాం. ఇక్కడ పురుడు పోసుకున్న స్కైరూట్.. 79 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ రాకెట్‌ను నింగిలోకి పంపింది.. స్కైరూట్‌ను అభినందిస్తున్నాం’ అని కేటీఆర్ చెప్పారు. -
ఏడాదిలో 70 వేల ఉద్యోగాలిచ్చాం
ఘట్కేసర్: తన పాట కోట్లాది తెలంగాణ ప్రజల కోసం తప్ప, గడీల దొరల కోసం కాదని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ రథసార«థి, ప్రజా కవి డాక్టర్ అందెశ్రీ నిటారుగా నిలబడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మనందరం దండు కట్టి విషసర్పాలను తుదముట్టించాలన్న ఆయన మాటలు గుర్తుకొస్తున్నాయన్నారు. గత పదేళ్ల పాలనలో ఆయన పాట వినిపించకుండా కుట్రలు చేశారని, పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని రేవంత్ పేర్కొన్నారు. అందెశ్రీ 65 జయంతిని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఓఆర్ఆర్ వద్ద అందెశ్రీ స్మృతివనం పనులకు శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ భూమి పూజ చేసి పునాది రాయి వేశారు.అనంతరం జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘మేం నోటిఫికేషన్లు ఇచ్చినం, రేవంత్‌రెడ్డి భర్తీ చేశారని సిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించావు కానీ ఉద్యోగాల కోసం ఏనాడు ఆలోచించలేదు. మీరు నిరుద్యోగులను ఏనాడూ మానవీయ కోణంలో చూడలేదు. మేం అధికారంలోకి వచ్చాక అడ్డంకులు తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశాం. పదేళ్లలో నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు. ఏడాదిలో మేం 79 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎల్బీస్టేడియం, శిల్పాకళా వేదికగా తల్లితండ్రుల ముందు వారి బిడ్డలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వారి కళ్లల్లో ఆనందం నింపాం’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఆనాడే నిర్ణయించుకున్నారు... ‘ఎప్పుడైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో, గద్దరన్నను అవమానించారో అనాడే గడీల పాలనకు శాశ్వతంగా పాతరేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. ఇవాళ తోడేళ్ల గుంపును ప్రశ్నిస్తున్నా.. ఆనాడు కవితను, వినోద్‌రావును ప్రజలు తిరస్కరిస్తే ఆద్యోగాలిచ్చినవు, తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించావా. మీరు శ్రీమంతులు ఎలా అయ్యారు, తెలంగాణ ఎందుకు అప్పుల పాలైందో చెప్పండి. గజ్వేల్‌లో మిమ్మల్ని మా యువత రాజకీయ సమాధి చేస్తుంది’ అని రేవంత్ అన్నారు. ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలి, మీ కుటుంబం దోచుకోవడానికా, కుటుంబ పదవుల కోసమా అని ప్రశ్నించారు. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే ఉంటుందని, ఇదే భవిషత్తు, ఇదే చరిత్ర,. మీకు గతమే తప్ప భవిష్యత్తు లేదన్నారు. తెలంగాణ మీకు ఏం తక్కువే చేసింది... ‘తెలంగాణ సమాజం మీకు ఏం తక్కువ చేసింది.. దుబాయ్ పాస్‌పోర్ట్ బ్రోకర్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అమెరికాలో బాత్రూంలు కడిగినోడిని, రబ్బరు చెప్పులేసుకొని తిరిగి, సోడా పోసినోళ్లను మంత్రులను చేసింది. నేను ఉన్నంత కాలం తెలంగాణ తెలసి వనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వను. మాకు అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీ స్పూర్తి, మీకు నిజాం, ఖాసిం రిజ్వా స్ఫూర్తి. నీకు, మాకు పోలికేంటి. మీ దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. తెలంగాణ సమాజం గమనిస్తోంది. నిజాంను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ గడ్డకు ఉంది. తెలంగాణ ప్రజల చైతన్యం ముందు మీరెంత. తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణను ఎవరూ చెరబట్టలేరని, చెరబట్టాలని చూస్తే అందెశ్రీ పాటగా తిరిగొస్తారన్నారు. తమ ప్రభుత్వం ఆయన స్ఫూర్తితో పని చేస్తోందన్నారు. నిరుద్యోగులు మాయగాళ్ల మాయలో పడొద్దని, తమ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుందని చెప్పారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యులుగా, ప్రొఫెసర్ కోదండారాంను ఎమ్మెల్సీగా నియమించామన్నారు. 9 మంది కవులను సన్మానించి కోటి రూపాయల నగదు బహుమతిచ్చి గౌరవించామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కుటుంబపెద్దగా భావించా.. అందెశ్రీ ఆత్మగౌరంతో ఏనాడూ దొరల గడప తొక్కలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతి బడి, గడపలో ఆయన పాట వినిపిస్తోందన్నారు. అందెశ్రీకి ప్రజా ప్రభుత్వం అపూర్వ గౌరవం ఇచ్చిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘అందె శ్రీ నాకు ఆత్మబంధువు.., కుటుంబ పెద్దగా భావించాను. నిరాశ, నిస్పృలకు లోనైనప్పుడు, ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడడానికి ఆయనే స్ఫూర్తి. ఆయన పాటలు తూటాలై, మరఫిరంగులై గడీలను బద్ధలు కొట్టాయి. ఇటుకపై ఇటుక పేర్చినట్లు అక్షరాలపై అక్షరాలు పేర్చి ఉద్యమ గీతాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో చైతన్యం నింపింది’ అని సీఎం అన్నారు. -
మీ కుటుంబంలోని నలుగురు తెలంగాణకు ఏం ఇచ్చారు?: రేవంత్
ఘట్కేసర్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పులు ఎలా అయ్యాయి? అని అన్నారు. 16 ఏళ్ల పాటు గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.ఘట్కేసర్లో అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మీ కుటుంబంలోని నలుగురు తెలంగాణకు ఏం ఇచ్చారు? నిజాంల కంటే ఆస్తిపరులు ఎలా అయ్యారు? తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ గళమెత్తారు. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ నాకు స్ఫూర్తిగా నిలబడేవారు. అందెశ్రీ పాటలు తూటాలై, మరఫిరంగులై గడీలను బద్దలు కొట్టాయి.ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించాం. కానీ, గత పదేళ్లలో కుట్రలతో ఆయన పాటను వినిపించకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి బడిలో, ప్రతి గడపలో ఆయన పాట వినిపిస్తోంది.ఏ రోజైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో.. గద్దరన్నను అవమానించారో ఆనాడే గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నారు. మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. ఈ తోడేళ్ల గుంపును నేను ప్రశ్నిస్తున్నా.. ఆనాడు కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే ఉద్యోగాలు ఇచ్చినవ్ కదా? తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించారా? మేం నోటిఫికేషన్లు ఇచ్చినం రేవంత్ రెడ్డి భర్తీ చేశారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావ్. పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించుకున్నారు తప్ప.. పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మీ కుటుంబం ఏనాడైనా ఆలోచించిందా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్‌కు 'డెత్ డిక్లరేషన్' రాయాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలతో యువతను మోసం చేసిందని, ఆ మోసానికి సమాధానం చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా డెత్ డిక్లరేషన్ రాయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల సమస్యలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రచారానికే పరిమితమైందని మండిపడ్డారు.సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన 'యువ సంగ్రామ సభ'లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ మోసం చేసిన సరూర్నగర్లోనే 'యువ సంగ్రామ సభ' నిర్వహించాం. 38 నెలల క్రితం కాంగ్రెస్ మాటలు నమ్మి యువత దగా పడింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు కాలేదు. అది చిత్తు కాగితంగా మారింది. ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా. ఇదే నా సవాల్. వాస్తవానికి 10 వేల ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు.నిరుద్యోగుల సమస్యలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రచారానికే పరిమితమైంది. రేవంత్ ప్రభుత్వం క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తోంది. గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలకూ తమదే ఘనతగా చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ భృతి, స్కూటీల పంపిణీ వంటి హామీలు అమలు కాకపోగా, లూటిఫికేషన్ మాత్రమే జరుగుతోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి గాంధీలు, గాంధీ భవన్ నుంచి గాడ్సేలు వచ్చారు. రాష్ట్రంలో ఉన్మాద పర్వం నడుస్తోంది. పాత కేటుగాళ్ళు, కొత్త డూప్లికేట్ గాళ్ళు యువతను మోసం చేశారు. మోసం చేసిన వాళ్లను ఏమని అందాం. 60 ఏళ్ళు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ మాటలు నమ్మాం. అందరి కాళ్లు మొక్కి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. రేవంత్ రెడ్డి భాషలో బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా? లాగులో తొండలు విడుద్దామా?. యువతతో పెట్టుకుంటే పుట్ట గతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాయాలి. రాహుల్ గాంధీ జేబులు రేవంత్ రెడ్డి నింపుతున్నారు. అన్నదమ్ముళ్ల అల్మారాలు నింపుతున్నారు.తెలంగాణ విద్యార్థుల గుండెల్లో బుల్లెట్లు దింపింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ రక్త పిశాచి. రక్తం పంట పొలాల్లో చల్లాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. 50 లక్షలతో అడ్డంగా రేవంత్ రెడ్డి దొరికారు. క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గు అనిపించడం లేదా?. అబద్దాలు చెప్పడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఓటుకు నోటు దొంగ కుర్చీలో కూర్చున్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి బిస్కెట్లు తిని మనకు బిస్కెట్లు వేసి పోయారు’ అంటూ సెటైర్లు వేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన తెలిపితే బూతులు తిడుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటావా?. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు.. మీ అయ్య జాగీరా?. ప్రజలు హామీలపై ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడుతున్నారు. నమ్మించి మోసం చేయడంలో రేవంత్ పీహెచ్డీ చేశారు. తెలంగాణలో భూములు, బూడిద, ఇసుక లూటిషికేషన్ జరుగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రపంచంలోనే అతి పెద్ద మోసం. బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రేవంత్ సున్నాలు దిద్దుతున్నారు. మనం తెచ్చిన కంపెనీలకు రేవంత్ రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. బడేభాయ్ రెండు కోట్లు, చోటా భాయ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను రాజు నేను హిట్లర్ అంటూ బట్లర్ మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికార పీఠం.. నిరుద్యోగులకు బలిపీఠం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: యాదాద్రి ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలు, మాజీ కార్పొరేటర్ ఈశ్వరమ్మ యాదవ్‌పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. చింతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితురాలైన ఈశ్వరమ్మ యాదవ్‌కు వెంటనే గన్‌మెన్ భద్రత కల్పించాలని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈశ్వరమ్మ యాదవ్ ఎల్బీ నగర్లో అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్‌గా గెలుపొందారని, గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా సేవలందిస్తున్న నాయకురాలని ఆయన తెలిపారు. అలాంటి మహిళా నాయకురాలిని అవమానిస్తూ మాట్లాడటమే కాకుండా, దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే భాషనే శివచరణ్ రెడ్డి కూడా అనుసరిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఈశ్వరమ్మ యాదవ్‌ను అవమానించిన అనంతరం శివచరణ్ రెడ్డికి 1+1 గన్‌మెన్ భద్రత కల్పించారని, కానీ దాడికి గురైన 80 ఏళ్ల ఈశ్వరమ్మ యాదవ్ మాత్రం భయాందోళనల మధ్య ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.బాధితురాలికి భద్రత కల్పించకుండా, నిందితులకు గన్‌మెన్ సెక్యూరిటీ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందని ఆయన విమర్శించారు. బీసీలు, పేద వర్గాలపై కాంగ్రెస్ నాయకులు చులకన భావంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఘటనపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో బీసీ నాయకులకు చోటు కల్పించలేదని, జగ్గా రెడ్డి, నరసింహా రెడ్డితో కమిటీ వేసినప్పటికీ బాధితులను కలిసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. అలాగే, శివచరణ్ రెడ్డికి ఇప్పటివరకు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని విమర్శించారు.షబ్బీర్ అలీకి వెంటనే షోకాజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం,ఈ ఘటనలో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన ఆయన, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా స్పందించలేదని అన్నారు.రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని షాబాద్‌లో ఆరుగురు మహిళల హత్యలు పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ లభిస్తున్న ఘటనలు మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక, బహుజన వ్యతిరేక విధానాలతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.బీసీలకు పదవులు ఇచ్చినట్లు చూపిస్తూ.. వెనుక నుంచి వారిని అణచివేస్తున్నారని విమర్శించిన ప్రవీణ్ కుమార్,యాదాద్రి ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలైన ఈశ్వరమ్మ యాదవ్‌కు వెంటనే గన్‌మెన్ సెక్యూరిటీ కల్పించాలని, ఎలాంటి అధికారిక హోదా లేని శివచరణ్ రెడ్డికి భద్రత ఎలా కల్పించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
వాటర్ వారియర్ హరీశ్ రావు పాదయాత్ర.. నెక్స్ట్ కారే..!
-
కాళేశ్వరం రాజకీయ యుద్ధంగా మారిందా?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నిత్యం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. అది క్రమేపి రాజకీయ రూపు దాల్చుతోంది. ఆ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దానికి తెరదీసింది. ఒక వైపు వానలు అంతంత మాత్రంగా ఉండడం, మరో వైపు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వస్తాయో, రావో అన్న సందిగ్దత గందరగోళంగా మారింది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసినప్పటికీ మెడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు కుంగడంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా డామేజి జరిగింది.2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిలో ఆ సమస్య కూడా ఒక కారణం అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎలాంటి విధానం అనుసరించాలన్నదానిమీద సరైన క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నదన్న విమర్శ వస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఏర్పడిన పగుళ్లనండి. లేదా పిల్లర్లు కుంగడం అనండి.. ఏదైనా కానివ్వండి.. గ్రౌండ్ సిచ్చుయేషన్కు అనుగుణంగా నిర్ణయాలు చేసి రేవంత్ తనకు అడ్వాంటేజ్ తెచ్చుకునే అవకాశం ఒక దశలో ఉంది.ఆ ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని నేషనల్ డామ్ సేఫ్టి అథారిటి చెబుతోందన్నది ఆయన వాదనగా ఉంది. ఇందులో స్కామ్ అని, మరొకటి అని చెప్పి గత రెండేళ్లుగా అలాగే ఉంచేశారు. ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులను అరెస్టు చేస్తారేమో అన్నంతగా ప్రచారం జరిగింది. కాని వారు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ పొందగలిగారు. కమిషన్ రిపోర్టుకు కూడా పెద్ద విలువ లేకుండా పోయిందనిపిస్తుంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నీరు నిల్వచేసి పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తోడి ఆయా ప్రాంతాలలో ఉన్న రిజర్వాయిర్లను నింపాలా? వద్దా? అన్న చర్చకు పరిస్థితి చేరింది. ఇక్కడే రేవంత్ ప్రభుత్వం పొరపాటు చేస్తున్నదా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి, అక్కడ నీటిని తోడకపోతే తామే మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. తనకు ఇరిగేషన్ మంత్రి పదవి అప్పగిస్తే, మూడునెలల్లో బారేజీలను బాగు చేయించి చూపుతానని హరీష్‌రావు సవాల్ చేశారు. వీటికి ప్రతిగా రేవంత్ కూడా ధీటుగానే బదులు ఇచ్చారు. అది వేరే విషయం.నిజానికి ఇంతదాకా రేవంత్ ప్రభుత్వం వెళ్లనిచ్చి ఉండాల్సింది కాదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు ఆయా జిల్లాలను ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు నీరు ఎలా ఇవ్వవచ్చా అన్నదానిపై ఆలోచన చేసి ఉండాల్సింది. కేసీఆర్ కట్టించినంత మాత్రాన ఆ ప్రాజెక్టు ఆయనది అయిపోదు. అలాగే ఆరోపణలు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టుతో రేవంత్‌కు సంబంధం ఉండకపోదు. అది ప్రజల ఆస్తి.ఈ క్రమంలోనే వాదోపవాదాలు, విమర్శ, ప్రతి విమర్శలకు అవకాశం ఇచ్చారు. కాళేశ్వరం నీరు ఎత్తిపోయకుండా పగ పట్టారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి బదులుగా నీళ్లు ఉన్నంత మాత్రాన ఎత్తిపోయలేం అని, నీటి నిల్వకు ఆ బారేజీలు అనువుగాదని జాతీయ డామ్ భద్రత అథారిటీ చెబుతోందని, బరాజ్‌లు సురక్షితం కాదని కూడా ఆ సంస్థ చెప్పిందని రేవంత్ అన్నారు. అది నిజమే కావచ్చు. కాని అందుకు ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే, రైతుల పొలాలకు నీరందించలేకపోతే, వర్షాలు సరిగా కురవకపోతే ఆ ప్రభావం అంతా తన ప్రభుత్వంపైనే పడుతుందన్న సంగతి ఆయన గుర్తించాలి.అంతేకాక విపక్షాన్ని ఉద్దేశించి పొలాలలో రక్తం చల్లితే పంటలు పండుతాయని అనడం సరికాదు. ఎదుటి పక్షం వారు ఎదైనా చిన్న వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తేనే కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ కాస్త బెటర్ అయినా, ఈ మధ్య జరిగిన కొన్ని అరెస్టులు చూస్తే, ఇక్కడ కూడా టీడీపీ పెత్తనం సాగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత కొన్నాళ్లుగా తీవ్ర అసహనంతో మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఆయనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను బయటపెట్టుకుంటున్నారు. తెలంగాణలో ఆయన శిష్యుడుగా పేరొందిన రేవంత్ కూడా అదే బాటలో వెళ్లకుండా ఉంటే మంచిది.రేవంత్ వ్యాఖ్యను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలచుకుని, గోదావరి నీళ్లు రైతులకు అందిస్తామంటే తమ రక్తం ఇస్తామంటూ పెద్ద హడావుడినే సృష్టించింది. తెలంగాణ భవన్లో భారీగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. కేసీఆర్‌ను ఎలాగైనా ఇరిటేట్ చేసి ముగ్గులోకి దించాలని రేవంత్ చూస్తున్నప్పటికి, ఆయన తొణకడం లేదు. కేటీఆర్, హరీష్‌రావులే గట్టిగా బదులు ఇస్తున్నారు. దీనివల్ల కూడా రేవంత్ అసహనానికి గురి అవుతున్నారేమో తెలియదు. రేవంత్ కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే దాని పునరుద్దరణపై పూర్తి శ్రద్ద పెట్టి ఉంటే ఆయనకు పేరు వచ్చేది.కేసీఆర్‌ను విమర్శించవచ్చు. అందులో అవినీతి ఉంటే దానిపై దర్యాప్తు చేయించవచ్చు. కాని అల్టిమేట్‌గా ప్రజలకు కావల్సింది నీరు. అందులోను వర్షాభావ స్థితిలో తమ పొలాలకు నీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అందువల్ల బీఆర్ఎస్ కోరడానికి ముందే, గోదావరిలోకి వచ్చిన వరద నీటిని అంచనా వేసుకుని, పంప్ హౌస్‌ల ద్వారా నీరు లిఫ్ట్ చేయించడం మొదలు పెడితే బాగుండేదేమో! కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా దానినే సూచిస్తున్నారట. ఒక వేళ నిజంగానే గోదావరి నీటిని లిఫ్ట్ చేయడంలో ఇబ్బంది ఉంటే, విపక్షాన్ని కూడా ఆహ్వానించి, వారిని కూడా ఆయా బారేజీల వద్దకు, పంప్ హౌస్‌ల వద్దకు తీసుకువెళ్లి ఇరిగేషన్ అధికారుల ద్వారా పరిస్థితిని వివరించి ఉండవచ్చు. అలాగే మేధావులైన ఇంజనీర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కోసం ఒక సమావేశం పెట్టి ఉండవచ్చు. ఇవేవి చేసినట్లు లేరు. పైగా అనుచిత వ్యాఖ్య చేసి తనకు రావల్సిన మైలేజీని రేవంత్ వదులుకున్నారేమో అనిపిస్తుంది.కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఊపిరి పోస్తుందనిపిస్తుంది. కారణం ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం కూడా మెడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల పునరుద్దరణకు వేగంగా చర్యలు చేపట్టలేదన్న భావన ఉంది. ఒకప్పుడు గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఉన్న బారేజీ గేట్లు దెబ్బతిన్నాయి. దాంతో ఉభయ గోదావరి జిల్లాలకు తీవ్ర సంక్షోభం వచ్చే స్థితి ఏర్పడింది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు స్వయంగా ధవళేశ్వరం వెళ్లి, అక్కడే మకాం చేసి ఆ గేట్లను బాగుచేయడమో. కొత్త గేట్లను బిగించడమో చేశారట. దానివల్ల ఆయనకు ఖ్యాతి వచ్చింది.1986లో వచ్చిన భారీ వరదలకు గోదావరి రెండువైపులా గట్లు పలుచోట్ల తెగిపోయాయి. ఆ నది వెంబడి ఉన్న జిల్లాలన్నీ మునిగిపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వం వెంటనే గోదావరి గట్లను పటిష్టపరిచే పని చేపట్టింది. అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమని చెబుతూ కాలం గడపలేదు. ఇలాంటి అనుభవాలు మరి కొన్ని కూడా ఉన్నాయి. కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిని ఎదుర్కుని ముందుకు పోవడంలోనే ప్రభుత్వ విజన్ కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా రేవంత్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా దానిని వినియోగించుకుంటే మంచిది. పాజిటివ్ దృక్పథంతోనే రేవంత్ ముందుకు వెళితే ఆయనకు మైలేజీ రావచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నేడు కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టుల సవరించిన అంచనా విలువలకు సంబంధించి ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు సమాచారం. గత కేబినెట్ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సవరించిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారుల స్థాయిలోనే ఆగిపోతున్నాయని, కేబినెట్ ముందుకు రావడం లేదని చెప్పారు. దీంతో సీఎం కల్పించుకుని వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చిద్దామని చెప్పారు.పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెండు ప్యాకేజీలతోపాటు నిర్మాణంలో ఉన్న పలు ఇతర ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలిసింది. మెట్రో రైలు అంశం ముందుకు సాగకుండా అలా నిలిచిపోవడంపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం.. ఎస్బీఐ కాప్స్‌కు మొదటి దశ ఆస్తుల విలువ మదింపు, ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ చేయడం, రెండో దశకు అయ్యే వ్యయ అంచనాలు, అలాగే రుణాలు తక్కువ వడ్డీకి తీసుకునే అంశంలో నివేదిక ఇవ్వాల్సి ఉంది.ఈ ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌ను నియమించినా, కేంద్రం ఇంకా తన ప్రతినిధిని ప్రకటించకపోవడం, కమిటీ ఏర్పాటు కాకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్‌పై చర్చ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రిజర్వాయర్లు అడుగంటిన నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్‌ను అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్‌కు అవసరమైన భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉన్నందున అందుకు అయ్యే వ్యయం, భూ సేకరణ అంశాలను కూడా చర్చించవచ్చని తెలిసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, కృష్ణా గోదావరి నదీ జలాల వివాదం, సుప్రీంకోర్టు నోటీసుల తరువాత అనుసరించాల్సి వ్యూహంపై చర్చించవచ్చని సమాచారం. అలాగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలన్న చర్చించే అవకాశం ఉందంటున్నారు. పీఆర్ చట్ట సవరణకు ఆమోదం! గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70(3)కు సవరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ భేటీ శుక్రవారం ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశం కానుంది. పురపాలక శాఖ, టీజీఐఐసీ ఒక్కో శాఖ ప్రతినెలా భూముల అమ్మకాల ద్వారా కనీసం రూ.1000 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించనున్నారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి ల్యాండ్ పూలింగ్ విధానంపై సబ్ కమిటీకి నివేదిక సమరి్పంచనున్నారు. హిల్ట్–పీ అమలు తీరుపై టీజీఐఐసీ ఎండీ వివరాలు అందించాలని కమిటీ ఆదేశించింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావులు పాల్గొంటారు. -
18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదన్నారు కేటీఆర్. దీనిలో భాగంగా ఈనెల 18వ తేదీన సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ కోతలుఅప్రకటిత కరెంట్ కోతతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. 11 జిల్లాల్లో రైతులు సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేశారని, బొగ్గు కొరతతో విద్యుత్‌కి అంతరాయ ఏర్పడిందన్నారు. ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని నిద్ర లేపినా.. ఉలుకు లేదు.. పలుకు లేదని మండిపడ్డారు. థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు లేదని, విద్యుత్ ఉత్పత్తి లేక కోత విధిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో సరిపడా విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందని, 7180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు హరీష్. ఇది చేతకాని ప్రభుత్వమని, ప్రభుత్వం 3190 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యుత్ కోతలని మండిపడ్డారు. ప్రభుత్వం నడిపే వారికి కనీస అవగాహన, సోయి లేదన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు కనీసం సోయి లేదన్నారు. ఎనిమిది గంటల విద్యుత్ అనేది రైతులకు అందించడం లేదని హరీష్‌రావు ఆరోపించారు. -
76 సార్లు ఢిల్లీ వచ్చారు.. 76 పైసలైనా తెచ్చారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘పంటలకు నీళ్లు అడిగితే రక్తం చల్లాలి’ అని సీఎం అంటారా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ తన తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అసలు ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏమాత్రం నియంత్రణ ఉందో లేదో అర్థం కావడం లేదని విమర్శలు సంధించారు. బుధవారం ఢిల్లీలోని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘చిట్‌చాట్’లో కేటీఆర్ మాట్లాడారు. ‘అధికారం చేపట్టిన 31 నెలల్లో దాదాపు 76 సార్లు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి కనీసం 76 పైసలు అయినా రాష్ట్రానికి తెచ్చారా, ఒక ప్రాజెక్టును తెచ్చారా, రైతులకు యూరియా తెచ్చారా?’ అని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. 30 శాతం పర్సంటేజ్ మంత్రి పొంగులేటి ‘తెలంగాణలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి లాక్ అన్‌లాక్ గేమ్ ఆడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో 16లక్షల ఎకరాల భూమి ఉండేది. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. భూముల వివాదాలను అన్‌లాక్ చేసేందుకు 30శాతం వసూలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 30శాతం పర్సంటేజ్ మంత్రిగా మారారు. సర్వేల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్లు చూస్తోంటే ఆయనలో... ‘రాము, రెమో’లు ఇద్దరు ఉన్నట్లు కనిపిస్తోంది’ కేటీఆర్ పేర్కొన్నారు. దక్షిణాది వాటా యథావిధిగా ఉంటేనే మద్దతు దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్లమెంట్లో 24శాతం ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని కొనసాగించాల్సిందేనని అని కేటీఆర్ అన్నారు. యధావిధిగా దక్షిణాది వాటా ఉంటేనే బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు. తెలంగాణలో ఎలాగైనా సీట్లు పెరగడం ఖాయమని, అది డీలిమిటేషన్ విధానంలో అయినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమైనా సీట్లు పెరగాల్సిందేనన్నారు. ఏదైనా సరే బీజేపీ అనుకుంటే అవుతుందని, లేదంటే ఆలస్యం తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు, ఓటములపై సీఎం రేవంత్ నాలుగు సర్వేలు చేయించుకున్నాడు. బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఈ నాలుగు సర్వేలు రిపోర్టు ఇవ్వడాన్ని రేవంత్ జీరి్ణంచుకోలేకపోతున్నాడని ధ్వజమెత్తారు. మెట్రో భూములపై రేవంత్ కన్ను ‘మా ఓటమికి 100 శాతం కారణం మా పొరపాట్లే. అందుకే మేం ఓడిపోయాం. ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకుంటున్నాం. మమ్మల్ని ఓడించారని ప్రజలను మేం ఎప్పుడూ తప్పుబట్టలేదు. మాకు రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చారు, మూడోసారి మమ్మల్ని పక్కనపెట్టారు. ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతోంది. 18 కోట్ల చదరపు అడుగుల్లో ‘మెట్రో’కు సంబంధించి కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మించేందుకు మెట్రోలో భాగస్వాములైన కంపెనీలకు 2008లో అప్పటి సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 280 ఎకరాల భూమిని కేటాయించారు. లీజు పీరియడ్ 30–40 ఏళ్లు ఉంది. అయితే ఇప్పటి వరకు 1.4 కోట్ల చదరపు అడుగుల్లో కూడా నిర్మాణం జరగలేదు. ఆ 280 ఎకరాలపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌లతో వ్యక్తిగతంగా నాకు గట్టు పంచాయితీలు లేవు. కేవలం రాజకీయ విభేదాలే. 2027లో పాదయాత్ర చేస్తా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యా. సెలెట్రిటీల ఫోన్ ట్యాప్ కాలేదని పోలీసు అధికారులే చెబుతున్నారు. ఫార్ములా ఈ–కారు రేస్ కేసులో ఈ నెల 31న హాజరుకావాలని సమన్లు అందాయి. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరవుతా’ అని కేటీఆర్ అన్నారు.బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయిన కేటీఆర్ ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించండి కేంద్రమంత్రి కుమారస్వామికి కేటీఆర్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తక్షణమే పునఃప్రారంభించి, భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, సీసీఐ సాధన కమిటీతో కలసి బుధవారం ఢిల్లీలో ఆయన కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. సీసీఐ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉండి, పునరుద్ధరణ జరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీసీఐ పునరుద్ధరణకు హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంట్‌లోని రూ.50 కోట్ల విలువైన యంత్రాలను ఈ–వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ కొనసాగిస్తోందని, ఇది ఆందోళనకరమని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో ప్రపంచ భాషలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జర్మనీ, జపాన్, ఇతర అభివృద్ధి చెందిన దేశాల భాషలను నేర్పించేలా మార్పులు తీసుకురావాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశ, రాష్ట్ర భవిష్యత్ తరగతి గదిలోనే ఉంటుందని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెరుగైన విద్యావ్యవస్థ కోసం ఆధునిక విద్యావ్యవస్థలు కలిగిన దేశాలకు ప్రభుత్వ టీచర్లను పంపించి అధ్యయనం చేయిస్తామని తెలిపారు.ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవంలోగా సర్కారు బడిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ.. విద్యాభ్యాసానికి ఉపయోగపడే 9 రకాల వస్తువులతో ఎడ్యుకేషన్ కిట్‌ను అందజేస్తామని వెల్లడించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్‌లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (సీక్యూపీ)ను సీఎం ప్రారంభించారు. అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్మించిన బాలికల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. టీచర్లు ప్రశాంతంగా ఉంటేనే సరైన బోధన ‘గత పాలకులు పదేళ్లు విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే, దేశ భవిష్యత్ నిర్మాణానికి విద్యాశాఖ కీలకమని గుర్తించి ఆ శాఖను నా వద్దే పెట్టుకుని సంస్కరణలకు శ్రీకారం చుట్టా. మొదట ఉపాధ్యాయుల కుటుంబాలను విడగొట్టిన 317 జీఓ వలన కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు 35 వేలమంది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టి ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేశాం. టీచర్లు కుటుంబంతో ప్రశాంతం ఉన్నప్పుడే విద్యార్థులకు సరైన బోధన అందించడం సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈ దిశగా ముందడుగు వేశాం. దేశంలో నంబర్ 1 స్థానానికి కృషి చేయాలి విద్యార్థుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో విద్య నిర్లక్ష్యానికి గురికావటం శోచనీయం. 2023కు ముందు విద్యలో మన రాష్ట్రం దేశంలో చివరి నుంచి ఒకటి, రెండోస్థానంలో ఉంటే.. ప్రజాప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక 15వ స్థానానికి ఎగబాకింది. ఈ పురోగతి ఉపాధ్యాయులదే. ఇంకొంత కాలం విశ్రాంతికి ఆస్కారం లేకుండా నంబర్ వన్, టు స్థానాలకు వచ్చే వరకు ప్రయత్నించాలి. అందుకు కావాల్సిన అన్ని రకాల ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తుంది. చదువులో రాణించని విద్యార్థుల కోసం పాలసీ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కొంత సమయం తీసుకుని పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. చ దువులో రాణించలేకపోయిన విద్యార్థుల కోసం నూతన క్రీడా విధానాన్ని తీసుకువస్తున్నాం. క్రీడల్లో రాణించి దేశానికి పేరు తీసుకువచ్చిన ఎందరో నామమాత్రపు చదువు చదివిన వారిని గ్రూప్–1 అధికారులుగా చేసి సత్కరించాం..’అని సీఎం తెలిపారు. వెల్త్ అండ్ ఎంప్లాయిమెంట్ తెలంగాణ దివిటిపల్లిలో మాట్లాడుతూ.. ‘తెలంగాణ జీడీపీని పది శాతానికి చేర్చాలి. వెల్త్ అండ్ ఎంప్లాయిమెంట్ రాష్ట్రంగా చేయాలి. మాకు పాలసీలకు సంబంధించి ఎలాంటి పక్షపాతం లేదు. గత ప్రభుత్వాలు ఎన్నో పాలసీలు చేశాయి. ప్రజాప్రయోజనం చేకూర్చే పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలను మేమూ కొనసాగిస్తున్నాం. కొన్నింటిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మెడికల్, హెల్త్, టూరిజం, ఇండ్రస్టియల్, స్పోర్ట్స్ పాలసీలు తెచ్చాం. ఈ పాలసీలు తెలంగాణను రైజ్ చేసి, తెలంగాణ రైజింగ్–2047కు నాందిగా నిలువనున్నాయి. జపాన్, చైనా, కొరియా దేశాలతో పోటీ పడాలంటే పరిశ్రమలు పెట్టాలి. వాటిని స్థాపించాలంటే మౌలిక వసతులు కల్పించాలి. అందుకు స్పష్టమైన, పారదర్శకమైన పరిపాలన విధానం ఉండాలి. ప్రభుత్వం ఆ మేరకు విధానం రూపొందించుకుని ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే అమరరాజాను ప్రోత్సహిస్తున్నాం..’అని రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకి టి శ్రీహరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి సంజయ్‌జాజు, సీఎం ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చిరస్మరణీయం ‘ఒకప్పుడు చెట్లకింద, ఇరుకైన గదులలో చదువుకునే పరిస్థితి ఉండేది. ఒక్కోగదిలో రెండు క్లాస్‌లు నడిపించేవారు. మా కష్టాలను, ఇబ్బందులను అర్థం చేసుకుని మా భవిష్యత్ కలలను గుర్తించిన మా ఎమ్మెల్యే జీఎంఆర్, సీఎం రేవంత్‌రెడ్డి అన్ని సౌకర్యాలతో మాకు కొత్త స్కూల్ నిర్మించి ఇచ్చారు..’అని కొత్తకోట జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇందు చెప్పింది. కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల చరిత్రలో ఈ రోజు చిరస్మరణీమని పేర్కొంది. ‘మా విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు. మీ మేలు మేము మర్చిపోలేం..’అనడంతో.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టారు. మీరే నా స్ఫూర్తి.. ‘కొండరెడ్డిపల్లి, వనపర్తి ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుకుని రాష్ట్రాన్ని పాలించే సీఎం స్థాయికి ఎదిగిన మీరే నా స్ఫూర్తి..’అంటూ కొత్తకోట సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఏంజెల్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వ గురుకులంలో చదువుకునే తాను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సీఎంను స్ఫూర్తిగా తీసుకుంటున్నట్లు ఏంజెల్ తెలిపింది. గురుకులాల్లో చదువుకునే విద్యార్థినులకు కాస్మోటిక్ చార్జీలు, మెస్ చార్జీలు పెంచటం తదితరాలతో విద్యార్థులకు ఎంతో మేలు చేశారంటూ ముఖ్యమంత్రిని ప్రశంసించింది. -
అమెజాన్‌తో ‘ఫ్యూచర్’
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమెజాన్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఫ్యూచర్ సిటీలో ఇతర కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు దోహద పడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్–500 కంపెనీలను ఆకర్షించడానికి ప్రధాన పరిశ్రమగా అమెజాన్ దోహదపడుతుందని అన్నారు. ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నూతన డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగేలా ప్రణాళికలు ‘2025 డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించాం. 108 దేశాలకు చెందిన 3 వేల మంది వివిధ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా రూ.60 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్ తెలిపింది. కానీ రాష్ట్ర అవసరాలకు అది సరిపోదు. 2034 నాటికి అమెజాన్ రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలి. ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తేనే 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యాన్ని చేరుకోగలం. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం. 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపాలన్న వికసిత భారత్–2047 లక్ష్యంలో భాగంగా జాతీయ జీడీపీలో తన వాటాను ప్రస్తుతం ఉన్న 5 నుంచి 10 శాతానికి పెంచుకునేలా తెలంగాణ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన కీలకం. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, అనుమతులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..’అని సీఎం తెలిపారు. అభివృద్ధికి నమూనాగా తెలంగాణ ‘ఫ్యూచర్ సిటీని అత్యంత అధునాతన నగరంగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి నెలా పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నాం. అమెజాన్ పెట్టుబడులకు సంబంధించి కూడా ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం . తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలనే ఆలోచనతో తెలంగాణ రైజింగ్ పాలసీని రూపొందించాం. పరిశ్రమలు, పర్యాటకం, ఇంధనం, ఆరోగ్యం, క్రీడలు వంటి రంగాల్లో నిర్దిష్ట పాలసీలు రూపొందించాం. ఉద్యోగాల కల్పన కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతో హైదరాబాద్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయం..’అని రేవంత్ చెప్పారు. ఎలక్ట్రిక్ రైడ్ దిశగా.. ‘మూడు లక్షల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో డీజిల్ మీద ఆధారపడి నడుస్తున్న 2 లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈవీల రిజి్రస్టేషన్‌కు పన్నును పూర్తిగా మినహాయించి హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాదికి రూ.1,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దేశంలో ఇతర నగరాల్లో ఉన్న కాలుష్య సంబంధిత సమస్యలు హైదరాబాద్‌లో ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించాం. సమగ్ర ప్రణాళికతో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల కోసం భూములను త్యాగం చేసిన రైతులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. భూమి ఇచ్చి అభివృద్ధికి సహకరించిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారులు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి అవసరమైన నష్ట పరిహారాన్ని అందించాలి. ఆందోళనలు చేపడుతున్న రైతులతో మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి చర్చించాలి. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలను, మంచి నష్ట పరిహారాన్ని అందించాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిరంతర విద్యుత్, నీటి సరఫరా: మంత్రి శ్రీధర్‌బాబు ప్రభుత్వం నియంత్రణ సంస్థ కాదని, పరిశ్రమలకు ఒక సులభతరమైన సదుపాయకర్తగా మాత్రమే పనిచేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆలూరులో ఒక డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇక్కడ డేటా సెంటర్లకు అత్యంత కీలకమైన వనరులైన నిరంతర విద్యుత్, నీటి సరఫరాతో సహా సమగ్ర వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. -
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఇది ఊతం ఇస్తుంది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ శంకుస్థాపన కార్యక్రమం ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకంగా ఉపయోగపడనుందనిప్పారు. ‘‘ఫ్యూచర్ సిటీలో అత్యంత అధునాతనమైన నగరాన్ని నిర్మించాలని, ఫార్చ్యూన్-500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి 2025 డిసెంబర్ లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించాం. 108 దేశాల నుంచి 3 వేల మంది వివిధ దిగ్గజ కంపెనీల నుంచి కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొన్నారు.తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే "తెలంగాణ రైజింగ్-2047" లక్ష్యం. వికసిత భారత్ 2047 లక్ష్యం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గా భారత్ ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా జాతీయ జీడీపీలో తెలంగాణ తన వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కీలకం.. ఇందులో భాగంగా, పరిశ్రమల కల్పనకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు, అనుమతులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2034 నాటికి అమెజాన్ సంస్థ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలి.ప్రతి నెల పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర రివ్యూ నిర్వహిస్తున్నాం. అమెజాన్ సంస్థ పెట్టుబడులకు సంబంధించి ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలనే ఆలోచనతో తెలంగాణ రైజింగ్ పాలసీ విధానాన్ని రూపొందించుకున్నాం .. పరిశ్రమలు, పర్యాటకం, ఎనర్జీ, ఆరోగ్యం, స్పోర్ట్స్ లాంటి రంగాల్లో నిర్దిష్టమైన పాలసీలు రూపొందించుకున్నాం.ఉద్యోగ కల్పన కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీను ఏర్పాటు చేసుకున్నాం. అమెజాన్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఆ ప్రాంతాల్లో ఇతర కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుంది. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారు.. ఉద్యోగ అవకాశాలు కల్పించడం తోపాటు కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించే అవసరం ఉంది, మూసి నది ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరించాల్సిన అవసరం ఉంది. మూడు లక్షల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులు గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో డీజిల్ మీద ఆధార పడి నడుస్తున్న 2 లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి.ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ కు టాక్స్ ను పూర్తిగా మినహాయించి హైదరాబాద్ ను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది .. ఏడాదికి రూ 1,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దేశంలో ఇతర నగరాల్లో ఉన్న కాలుష్య సంబంధిత సమస్యలను హైదరాబాద్ లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించాం.. సమగ్ర ప్రణాళిక తో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. ఈ ప్రాంత రైతులను మనస్పూర్తిగా అభినందిస్తున్నా.. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల కోస భూములను త్యాగం చేసిన రైతులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చి సహకరించిన వారిని అభినందిస్తూ .. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ అవసరమైన నష్ట పరిహారాన్ని అందించాలని అధికారులకు ఆదేశాలిస్తున్నా.భూమి ఇచ్చి అభివృద్ధికి సహకరించిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆందోళనలు చేపడుతున్న రైతులతో చర్చించాలని మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మా రెడ్డి గార్లకు సూచిస్తున్నా.. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించాలి.. మంచి నష్ట పరిహారాన్ని అందించాలి. అమెజాన్ సంస్థ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. -
బాబుకు పవన్ బిగ్ షాక్
-
అప్పట్లో ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనపడింది: రేవంత్ రెడ్డి
కొత్తకోట: బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ స్కూళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. చదువే జీవితాల్లో మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో సర్కారీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గితే, తమ పాలనలో స్టూడెంట్స్ సంఖ్య పెరిగిందని చెప్పారు. చదువే మన ఆత్మ గౌరవవాన్ని నిలబెట్టుతోందని అన్నారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీల నుంచి యూనివర్సిటీల వరకు ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనపడిందని రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం కారణంగా విద్యాలయాల్లో సదుపాయాలు లేవని అన్నారు. విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో విద్యాలయాలు, విద్య పటిష్ఠంగా ఉండాలని చెప్పారు. విద్యార్థులకు టెక్నికల్ నాలెడ్జ్ అవసరమని అభిప్రాయడ్డారు. -
అమెజాన్ డేటా సెంటర్‌కు నేడు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ నూతన డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట రెవెన్యూ కేంద్రంగా సర్వే నంబర్ 120లో 48 ఎకరాల్లో అమెజాన్ డేటా సెంటర్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజాగా అదే ప్రాంతంలో సేవలను విస్తరించనుంది. బుధవారం మధ్యాహ్నం 12:15 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్లో భారత్ ఫ్యూచర్ సిటీకి చేరుకొని అమెజాన్ నూతన డేటా సెంటర్ భూమిపూజ నిర్వహించనున్నారు.ఈ డేటా సెంటర్ నిర్మాణ పనులు 24 నెలల్లో పూర్తి కానున్నాయి.2025 జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా అమెజాన్ ప్రతినిధులతో చర్చించిన సీఎం రేవంత్.. తెలంగాణలో డేటా సెంటర్ల విస్తరణ కోసం రూ. 60 వేల కోట్ల పెట్టుబడికి అమెజాన్ బృందాన్ని సూత్రప్రాయంగా ఒప్పించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది.2025 డిసెంబర్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా అమెజాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రూ.125 కోట్ల విలువచేసే ప్రోత్సాహకాలు, రాయితీలను అమెజాన్‌కు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సీఎం ఆదేశాల మేరకు భారత్ ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలతోపాటు చందన్వెల్లిలో 98 ఎకరాలను అమెజాన్‌కు కేటాయించారు. అమెజాన్ నూతన డేటా సెంటర్ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్లలో ఒకటిగా హైదరాబాద్ నిలవనుంది.మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో పర్యటన సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో కూడా పర్యటించనున్నారు. అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర రాజా గిగా కారిడార్‌లో సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంబోత్సవానికి హాజరవుతారు. 3 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంబోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరవుతారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వ్యూహాత్మక, వాణిజ్యపరమైన అవసరాల రీత్యా వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం ఢిల్లీలోని విమానయాన శాఖ కార్యాలయమైన రాజీవ్‌గాంధీ భవన్లో రామ్మోహన్ నాయుడితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరంగల్ విమానాశ్రయ పనుల గురించి చర్చించారు. రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉండడంతోపాటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తదితర పరిశ్రమలతో తెలంగాణలో వరంగల్ కీలక నగరంగా ఉందని వివరించారు.ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు కేంద్రంగా ఉన్న వరంగల్‌ను పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందువల్ల వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్), ఎయిర్‌కార్గో, హ్యాంగర్ సదుపాయాలను కల్పించాలని కోరారు. ఇప్పటికే భూసేకరణ పూర్తి అయినందున, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. 2028, జూన్ 2 నాటికి ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, వరంగల్‌కు ఉన్న ఘనమైన కాకతీయ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్లు ఉండాలని భావిస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించగా, రామ్మోహన్ నాయుడు సుముఖత వ్యక్తంచేశారు. రక్షణ శాఖతో కలిసి ఆదిలాబాద్‌లో... రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో పౌర విమానాశ్రయం నిర్మించాలని రామ్మోహన్నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ విమానాశ్రయం మాదిరిగానే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఎంఆర్వో, ఎయిర్ కార్గో, హ్యాంగర్ వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రెండు విమానాశ్రయాల్లోనూ విమాన శిక్షణ సంస్థలను నెలకొల్పాలని విన్నవించారు. హుస్సేన్‌సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బరాజ్ వరకూ సీప్లేన్లు నడిపే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనికి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందిస్తూ, అందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.ఈ సమావేశంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్అండ్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్, విమానయాన శాఖ కార్యదర్శి సమీర్‌కుమార్ శర్మ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ విపిన్ కుమార్ పాల్గొన్నారు. చరిత్రకు అద్దంపట్టేలా డిజైన్: రామ్మోహన్నాయుడు విమానాశ్రయ నిర్మాణానికి సకాలంలో భూసేకరణ పూర్తిచేసి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. భూసేకరణ, ఇతర అంశాల్లో మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ మాదిరే స్పందించాలని చెప్పారు. కాకతీయæ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా వరంగల్ విమానాశ్రయ డిజైన్ ఉంటుందన్నారు. దేశంలోనే అత్యుత్తమ కల్చరల్ టెర్మినల్‌గా నిలుస్తుందన్నారు. అలాగే, రక్షణ శాఖతో సంయుక్తంగా సివిలియన్, డిఫెన్స్ అవసరాల కోసం స్ట్రాటజిక్ లొకేషన్‌గా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని వివరించారు. ఇందుకోసం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్‌రెడ్డితో కలిసి సమీక్షించినట్లు వెల్లడించారు. అక్కడ 250 ఎకరాల మేర రక్షణ శాఖ భూమి ఉందని, ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన మరో 1,700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. విమానాశ్రయాలతో యువతకు ఉపాధి: రేవంత్‌రెడ్డి భేటీ అనంతరం రామ్మోహన్ నాయుడుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని రేవంత్ వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల అభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందన్నారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2028 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయాల్లోనే కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వస్తున్నామని, దానిపైనా రాజకీయ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని మోదీ వికసిత్ భారత్–2047 లక్ష్యంలో తెలంగాణ భాగస్వామ్యం అవుతుందని రేవంత్ చెప్పారు. అదే సమయానికి తెలంగాణను కూడా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేయాలనే ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. -
ఆర్ఆర్ఆర్ ఆరంభించండి
సాక్షి, న్యూఢిల్లీ: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ అనుమతి ఇప్పించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం గడ్కరీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో రేవంత్ భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఆర్ఆర్ఆర్ రెండువైపులా ఏకకాలంలో పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, నిర్మాణ వ్యయం తగ్గుతుందని వివరించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామని ఏపీ పునరి్వభజన చట్టంలో పేర్కొన్నందున వెంటనే ఆ రహదారికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్‌కు 12 వరుసల రహదారి మంజూరు చేస్తే హైదరాబాద్–విజయవాడ మధ్య 100 కి.మీ. దూరం తగ్గుతుందని, సరకు రవాణా వేగవంతమవుతుందని సీఎం వివరించారు. అటవీశాఖ అనుమతులు ఇప్పించండి మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం జలాశయాలు ఈ కారిడార్ పరిధిలో ఉంటాయని సీఎం తెలిపారు. అలాగే, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఆరు వరుసల ప్రత్యామ్నాయ రహదారికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి అవసరమైన భూ సేకరణను తాము చేపడతామని తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ రహదారి వ్యవసాయ, వ్యాపారపరంగా నూతన అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్అండ్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. -
అనుమతుల సాధనే లక్ష్యంగా పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపీలకు పిలుపునిచ్చారు. నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం కోరారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రంవద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఎంపీలకు ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి అవసరమని, ఎంపీలు ఈ విషయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్– 1, స్వాదీనం, మెట్రో ఫేజ్–2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని సీఎం ఎంపీలకు వివరించారు. ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెంట్‌గా నియమించే ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలన్నారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో 95 శాతం భూ సేకరణ పూర్తయిందని.. ఆ పనుల ప్రారంభానికి, దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూ సేకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందని సీఎం తెలిపారు. మూసీ పునరుజ్జీవనం పనుల్లో మొదటి దశ టెండర్ల దశకు వచి్చందని సీఎం తెలిపారు. ఈ పనులను అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్ర అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎంపీలు ఈ విషయంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఎన్ఓసీలు : ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉందని ఈ అంశంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడామని వారు సూత్రప్రాయంగా అంగీకరించారని, ఎన్ఓసీలు వస్తే వాటికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని సీఎం అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150–151 అడుగుల్లో నిర్మించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అవుదామని ఎంపీలతో సీఎం అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబయిలకు వెళ్లే బుల్లెట్ రైళ్లకు సంబంధించి ఎలైన్మెంట్లు కొలిక్కివచ్చాయని సీఎం తెలిపారు. – ఎంపీలకు అవసరమైన సమాచారం అందించడానికి ఢిల్లీ తెలంగాణ భవన్లో కోఆర్డినేషన్‌కు ఐఏఎస్ అధికారి అద్వైత్‌కుమార్ సింగ్‌ను నియమించామని సీఎం చెప్పారు. పెండింగ్ అంశాలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా ఎంపీలు ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవికి సీఎం సూచించారు. ఎంపీలు అడిగిన సమాచారం ఇవ్వండి : భట్టి విక్రమార్క ఎంపీలు అడిగిన ప్రతి సమాచారం అందజేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి గతంలో పంపిన లేఖలు, ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ లేఖలు సిద్ధం చేసి పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అందుబాటులో ఉంచాలన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ముఖ్యమంత్రిగానీ, తాను గానీ స్వయంగా ఢిల్లీకి వస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అక్కడ ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏఏ అంశాలపై ఒత్తిడి తేవాలనే దానిపై చర్చిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎంపీల సిఫారులను పట్టించుకోండి : ఈటల రాజేందర్ ఇందిరమ్మ ఇళ్లలో ఎంపీలు ఇచి్చన సిఫార్సుల మేరకు కేటాయింపులు చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీల ప్రోటోకాల్ దెబ్బతినకుండా చూడాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడానికి తమ వంతు సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ నుంచి రామగుండం రైల్వే లైన్ కోసం పార్లమెంట్లో నేను రెండు మూడుసార్లు మాట్లాడానని, ఇవ్వడానికి ఒప్పుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలన్నారు. ఎంపీలు ఏమన్నారంటే.... గద్వాల దగ్గర మూతపడిన ఆయిల్ మిల్లు పునరుద్ధరణపై ఎంపీ డాక్టర్ మల్లు రవి అధికారులను ప్రశ్నించారు. 7–8 నెలల్లో పునరుద్ధరణ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్లో ప్రశ్నలు వేయడానికి వీలుగా ఈ సమావేశాలు చాలా ముందుగా ఏర్పాటు చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి కోరారు. ఎంపీలంతా ఏదో ఒక స్టాండింగ్ కమిటీ, కన్సల్టెన్సీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారని, ఆ సమాచారం తీసుకొని ఆయా అంశాలకు సంబంధించిన పెండింగ్ విషయాలు తెలియజేస్తే సమావేశాల్లో తాము చర్చించేందుకు వీలుంటుందని ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి డిజైన్లలోనే లోపాలున్నాయని.. ఈ అంశంపై నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేయించాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సూచించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన వందలాది ప్రతిపాదనలు కేంద్ర ఫ్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, 181 అంశాలతో కూడిన ఎజెండాను ఈ సందర్భంగా ఎంపీలకు అందజేశారు. -
17న కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని పలు కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేవంత్‌తో ఆదివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై ప్రాజెక్టుల అంచనా పెంపుతోపాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇతర కీలక అంశాలపై చర్చించినట్టు తెలిసింది.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని ప్యాకేజీలు–7, 11, 15, 17ల అంచనాల పెంపు, జె.చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు అంచనాలు తుదిసారిగా పెంపు, గట్టు రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలపై గతంలో ఆర్థిక శాఖ కొర్రీలు వేయడంతో రాష్ట్ర మంత్రివర్గ ఆమోదానికి నోచుకోవడం లేదు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను సందర్శించి ఇచ్చిన హామీల అమలులో సైతం పురోగతి లేకుండా పోయింది. చివరిసారిగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో తదుపరి మంత్రివర్గ సమావేశంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలపైనే తొలుత చర్చిద్దామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.ఆదివారం సీఎం సమక్షంలో ప్రాజెక్టుల అంచనాల పెంపు ప్రతిపాదనలపై మంత్రులు ఉత్తమ్, భట్టి విక్రమార్క చర్చించినట్టు తెలిసింది. ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ అభ్యంతరాలకు నీటిపారుదల శాఖ నుంచి సమగ్ర వివరణ కోరినట్టు సమాచారం. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోయడం లేదని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పేకొట్టే అంశంపై సైతం చర్చించినట్టు తెలిసింది. నేడు దేవాదులకు మంత్రుల బృందం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి దేవాదుల, సీతమ్మసాగర్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. తొలుత హెలికాప్టర్ ద్వారా దేవాదుల ప్రాజెక్టు ఆఫ్టేక్ పాయింట్‌కు చేరుకొని గోదావరి జలాల తరలింపును పరిశీలించనున్నారు. ప్రాజెక్టుపై అక్కడే సమీక్షిస్తారు. అనంతరం సీతారామ సాగర్ ప్రాజెక్టు ఆఫ్టేక్ పాయింట్‌కు చేరుకొని ప్రాజెక్టుపై అక్కడే సమీక్షించిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. -
నేడు ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలతో ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్‌లో జరిగే ఈ భేటీకి హాజరు కావాలని అన్ని పార్టీలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, పలు ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి ఈ సమావేశంలో ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించనున్నారు.అన్ని పార్టీల భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీలతో సీఎం డిన్నర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ, మెట్రో రైలు, ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర వైఖరి తదితర అంశాలపై పార్టీ ఎంపీలు అనుసరిచాల్సిన వైఖరి గురించి సీఎం రేవంత్ కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంటులో ఏ ఎంపీ ఏ అంశంపై మాట్లాడాలనే పని విభజన చేయనున్నారు. -
టార్గెట్ హరీశ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయాలన్న డిమాండ్‌తో నాలుగైదు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య సాగుతున్న మాటల యుద్ధంలో భాగంగా మాజీమంత్రి హరీశ్‌రావు టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలు ఆదివారం విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం లోపలేపిస్తా: విప్ అద్దంకి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బరాజ్‌లు నేలమట్టమవుతాయని చెబుతుంటే హౌలేగాడిలా నీళ్లు ఎత్తిపోయాలని హరీశ్ మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి మ్యాప్ వేసి చూయించినా మ్యాడ్ ఫెలోకి అర్థం కావడం లేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనవాళ్లు కేసీఆర్ చెడగొట్టాడని, ప్రాణహిత చేవెళ్లకు కాళేశ్వరం పేరు పెట్టి కమీషన్లు దండుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకుతిన్న కల్వకుంట్ల కుటుంబానికి సిగ్గు, లజ్జ ఉంటే సప్త సముద్రాలు దాటిపోవాలని, లేదంటే తనకు ఒక గంట అధికారమిస్తే ఆ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తానని అద్దంకి వ్యాఖ్యానించారు. సైకోలా మారి రైతులను తప్పదోవ పట్టించే ప్రయత్నం: విప్ ఆది శ్రీనివాస్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీశ్‌రావు అబద్ధాల వరద పారిస్తున్నాడని, ఆయన చదివింది పాలిటెక్నిక్ అయినా పెద్ద ఇంజనీర్లా పోజులు కొడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ తెలంగాణకు గుండెకాయ అన్నారని, అది జారిపోయిందని, అసలు ఈ ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తే ప్రమాదమని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ సూచించిందని చెప్పారు. ఊర్లు కొట్టుకుపోయినా సరే రాజకీయాలే ముఖ్యమన్నట్టు బీఆర్ఎస్ నేతల తీరు ఉందని, హరీశ్‌రావు సైకోలా మారిపోయి రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రక్తం చిందించే ధైర్యం హరీశ్‌రావుకు లేదు: జగ్గారెడ్డి ‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు పెట్రోల్ తెచ్చుకొని అగ్గిపెట్టె మర్చిపోయిన హరీశ్‌రావు ఎంతో మంది యువకుల బలిదానాలకు కారణమయ్యాడు. హరీశ్‌రావుకు అంత ధైర్యం లేదు. ఆయన రక్తం చిందించమని అడిగినా చిందించడు. అసలు రక్తం చిందించే ధైర్యం హరీశ్‌రావుకు లేదు.’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టే మనస్తత్వం కేసీఆర్ కుటుంబానికి ఉందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఏదో ఒకటి అనాలి అనే లైన్లోనే హరీశ్‌రావు వెళుతున్నారు తప్ప ఆయనకు ప్రజలు, రైతులు అవసరం లేదని, కేవలం రాజకీయమే ముఖ్యమని చెప్పారు. ఆయనది కసబ్ క్యారెక్టర్ : మెట్టు సాయికుమార్ హరీశ్‌రావుది కసబ్ లాంటి మనస్తత్వమని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని దివాళా తీయించడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో హరీశ్‌రావు పాత్ర కూడా అంతే ఉందన్నారు. రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత చిల్లర మాటలు మాట్లాడే హరీశ్‌రావుకు లేదని చెప్పారు. -
నీళ్లు అడిగితే రక్తం కావాలా?
సాక్షి, హైదరాబాద్: రైతులు సాగునీరు అడిగితే రక్తం కావాలంటూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన నరహంతకుడికి పెద్దగా తేడా కనిపించడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలని, బెల్టుతో కొట్టాలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత జుగుప్సాకరమని మండిపడ్డారు. హిట్లర్‌ను ఆదర్శంగా చెప్పుకునే రేవంత్ అదే తరహా హంతక భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈగోతో కన్నెపల్లి, దేవాదుల మోటార్లను నిలిపివేసి రాష్ట్రాన్ని కరువు వైపు నెడుతోందన్నారు. తనను జైల్లో వేసినా, తన ప్రాణం పోయినా అభ్యంతరం లేదని, కానీ వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులను ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తడం లేదు గోదావరిలో ప్రస్తుతం లక్ష క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తున్నా ప్రభుత్వం కావాలనే నీటిని ఎత్తడం లేదని హరీశ్ ఆరోపించారు. మేడిగడ్డ గేట్లు మూయకుండానే కన్నెపల్లి మోటార్లు నడపొచ్చని, ఇదే విషయాన్ని నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులు కూడా ప్రభుత్వానికి స్పష్టం చేశారని తెలిపారు. కేవలం రూ.8.5 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎల్లంపల్లికి తరలించొచ్చని అధికారులు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం బయటపడుతుందనే భయంతోనే మోటార్లు ఆన్ చేయడం లేదని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు నీటిని ఎత్తకపోతే ఎన్టీపీసీ, సింగరేణి, హైదరాబాద్ తాగునీటి అవసరాలు దెబ్బతినడంతోపాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మేడిగడ్డపై నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ అధికారులే పోలవరం ప్రాజెక్టులో రూ.వేల కోట్ల నష్టానికి బాధ్యులని హరీశ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే వ్యవసాయ విప్లవం కాంగ్రెస్ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా, బీఆర్ఎస్ హయాంలో 48.74 లక్షల ఎకరాలకు నీరందించామని హరీశ్ పేర్కొన్నారు. దేవాదులలో పూర్తిస్థాయిలో మోటార్లు నడపకుండా, గోదావరి జలాలను కిందకు వదిలి పట్టిసీమకు మేలు చేస్తూ సీఎం తన రాజకీయ గురువు చంద్రబాబుకు గురుదక్షిణ ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ కక్షలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని, వెంటనే కన్నెపల్లి, దేవాదుల మోటార్లను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
‘ఇది రేవంత్ రెడ్డి రక్కసి పాలనకు నిదర్శనం’
హైదరాబాద్: తమ రక్తాన్ని చెమటగా చిందించి, రేయింబవళ్లు కష్టపడి దేశానికి అన్నం పండించే అన్నదాతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని, కనీసం నీళ్లివ్వడం చేతకాని రేవంత్ రెడ్డి.. 'మీ ఒంటి రక్తాన్ని చల్లి పంటలు పండించుకోండి' అనే రేంజ్లో మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు తెలంగాణలో మరో రైతుల రక్త చరిత్రకు నాంది పలుకుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏనాడూ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్నం పెట్టే రైతుపై ఇంతటి క్రూరమైన, హేయమైన, అరాచకమైన భాషను వాడలేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇదేనా అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తూ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రమైన ప్రశ్నలు సంధించారు..1. నువ్వు అసలు ముఖ్యమంత్రివా? లేక రక్త దాహం మరిగిన మృగానివా? రైతు కష్టాన్ని గౌరవించడం చేతకాని రేవంత్ రెడ్డి.. నువ్వు కూర్చున్నది ప్రజాస్వామ్యబద్ధమైన ముఖ్యమంత్రి కుర్చీనా లేక రక్తం మరిగిన మృగం అరాచక పీఠమా?2. పంట పొలాలకు నీళ్లు అడిగితే రక్తం చల్లుకోమంటావా? కనీస మానవత్వం, ఇంగితజ్ఞానం, సభ్యత లేని ఇటువంటి భాష మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది?పేద ప్రజల సొమ్మును 'బకాసురుడి' లెక్క దోచుకు తింటూ, అధికారం నెత్తికెక్కి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత ఎంతమాత్రం లేదని, ఆ హక్కు అంతకన్నా లేదని శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు. ఏ రైతు కన్నీరు పెడితే దేశంలో సామ్రాజ్యాలు కూలిపోయాయో, అదే విధంగా రేవంత్ రెడ్డి దోపిడీ సామ్రాజ్యం కూడా కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.తెలంగాణ ప్రజలు నీళ్ల కష్టాలను శాశ్వతంగా తొలగించుకునేందుకు, స్వయంపాలనలో సగర్వంగా బతికేందుకే కదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదని ఆయన గుర్తు చేశారు. "మన కళ్ల ముందే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఉన్నా.. వాటి పంపులు ఆన్ చేయకుండా సాగుభూములను కావాలనే ఎండబెడుతున్నారు. రైతులను రక్తం చుక్కలు చిందించమంటూ వెటకారాలు మాట్లాడుతున్నారు. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి.. ఏ రైతు కన్నీరైతే నీకు వెటకారంగా అనిపిస్తోందో, అదే రైతు ఆగ్రహావేశాల ఉప్పెనలో నీ ఈఎంఐ (EMI) కుర్చీ కాలి బూడిదవడం ఖాయం!" అని హెచ్చరించారు.రైతు ఆగ్రహానికి బలైన ఏ పాలకుడూ చరిత్రలో బతికి బట్టకట్టలేదని డాక్టర్ శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారం తలకెక్కి అన్నదాతలను అవమానిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోబోదన్నారు. కరువు ఛాయలతో రాష్ట్రంలో రైతాంగం తల్లడిల్లుతుంటే.. నీళ్లపై కక్షా రాజకీయం చేస్తూ, రక్తం గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ రాక్షసత్వానికి, క్రూరమైన భాషకు తెలంగాణ రైతాంగం త్వరలోనే తిరగబడి తగిన గుణపాఠం చెబుతుందని, ప్రజల కోర్టులో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. -
రేవంత్.. ఏది మాట్లాడితే అది చెల్లుతుందా?: హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణభవన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట బూతులు, అబద్ధాల ప్రవాహం పారుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు సైకోలా ఉన్నాయి ముఖ్యమంత్రి లా లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పంట పొలాల్లో మా రక్తం పారిస్తా అని రేవంత్ మాట్లాడుతున్నాడు. హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని మండిపడ్డారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శాపనార్థాలు రైతులకు అవసరం లేదు. ముఖ్యమంత్రి భాష చూస్తే అబద్ధాలు, శాడిజం, బూతులు కనిపిస్తున్నాయి. కన్నెపల్లి పంపులను ఆన్ చేయమంటే మా రక్తం కావాలనుంటున్నాడు. మా గొంతు నొక్కుతున్నాడు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి రక్తం కావాలంటే ఇస్తాం. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. జైలు పంపుతామంటే ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త భయపడడు. మాకు కేసులు, అరెస్ట్‌లు కొత్త కాదు. రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. ప్రతి పక్షాలపై ఉన్న దృష్టి పంట పొలాలకి నీళ్లు ఇవ్వడంపై లేదు.కన్నెపల్లిపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రిని చూస్తే జాలేస్తుంది. విషయం లేకపోవడం వల్లే ఇలా బూతులు మాట్లాడుతున్నారు. అబద్దాలు, బూతుల విషయంలో మేము రేవంత్‌లో పోటీ పడలేం. ముఖ్యమంత్రికి ప్రాజెక్ట్‌లపై కనీస విషయ పరిజ్ఞానం లేదు. సీఎం రేవంత్ మాటలు చూస్తే ఓ శాడిస్ట్ మాట్లాడుతున్నాడా? అనిపిస్తోంది. మాట్లాడితే రిటైర్డ్ ఇంజనీర్లను జైలులో పెడతా అని బెదిరిస్తావ్. రిటైర్లు ఇంజనీర్లు కూడా నీళ్లు ఎత్తిపోయవచ్చనే చెబుతున్నారు. రైతులను, ప్రజలను కాపాడాలన్న తపన ముఖ్యమంత్రికి ఉండాలి. సీఎం రేవంత్ ఒక్కటైనా నిజం మాట్లాడుతున్నాడా?.రేవంత్ రెడ్డిలో సైకో కనిపిస్తున్నాడు. నిన్న ముఖ్యమంత్రిలా ఆయన మాట్లాడలేదు. రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడతున్నారు. ఆయనలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఏది మాట్లాడితే అది చెల్లుతుందా?. ఓటమి తప్పదు అనే భయంతో ఇలా బూతు భాష మాట్లాడుతున్నావ్. షాబాద్ ఘటనపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. షాబాద్‌లో ఘటన జరిగితే రాష్ట్ర పోలీస్ బాస్ గోల్ఫ్ ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి అలానే ఉన్నాడు.. ఆయన నియమించుకున్న పోలీస్ అధికారులు అలానే ఉన్నారు. షాబాద్ ఘటన నిందితులకు, సీఎం రేవంత్‌కు మధ్య తేడాఈ లేదు. హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
వైటీడీఏ నా శాఖ పరిధిలో ఉంది
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థా నం బోర్డు సభ్యుల నియామకం తన శాఖ పరిధిలోకే వస్తుందని, వైటీడీఏ మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈబోర్డు సభ్యుల నియామకంలో తాను ఎవరినీ సంపద్రించలేదన్న ఆరోపణల్లో పస లేదని, తన శాఖ పరిధిలోకి వస్తుంది కనుకనే దేవాలయానికి అవసరమైతే ఓ పది కోట్లు విరాళంగా ఇవ్వగలిగిన వారిని చూసి సభ్యులుగా నియమించామని చెప్పా రు. ఈ బోర్డులో నల్లగొండ జిల్లా వారే ఉండాలన్న నిబంధన లేదని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అనేక రాష్ట్రాల సభ్యులుంటారని ఆయన గుర్తు చేశారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం అనంతరం బోధ్ పెవిలియన్‌లో ఆయన విలేకరుల తో ఇష్టాగోష్టి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029 ఎన్నికలలోపు నియోజకవర్గాల పునరి్వభజన జరుగుతుందని, మహిళా బిల్లు ఆమోదం పొందుతుందని, జమిలి ఎన్నికలు కచ్చితంగా వస్తాయని చెప్పారు. అసలు ఏ నియోజకవర్గాన్ని ఎలా విభజిస్తారో, ఏ నియోజకవర్గం ఎవరికి రిజర్వు అవుతుందో తెలియనప్పుడు తాడూ లేదు బొంగరం లేదన్నట్టు ఇప్పుడు సర్వేలు ఎందుకు చేయిస్తామని ప్రశ్నించారు. ఎవరికి ఏ స్థానం రిజర్వు అయినా తన కుటుంబంలో తాను ఒక్కడినే రాజకీయాల్లో ఉంటానని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. తాను పూరీలు చేసిన వీడియో వైరల్ అయిందన్న విషయం విలేకరులు తన దృష్టికి తీసుకురాగా, తన మనుమడు పూరీలు చేయమని అడిగితే చేశానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని అయ్యాక గతంలో ఉన్న ఏ పథకాన్ని కూడా నిలిపివేయలేదని, అన్ని పథకాలు కొనసాగిస్తున్నానని చెప్పారు. క్యాంపు ఆఫీసును విలేకరులకు చూపించిన సీఎం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) చైర్మన్‌గా తన క్యాంపు ఆఫీసు ఇక్కడ పెట్టుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. తాను అధికారిక నివాసంలో ఉండటం లేదు కనుక కొన్ని స్వతంత్ర వ్యవస్థలకు చెందిన వారు అక్కడకు రావడం సరికాదని, అందుకే ఇక్కడ క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. తన క్యాంపు ఆఫీసుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానడడంలో వాస్తవం లేదని చెప్పిన రేవంత్‌రెడ్డి బోధ్ పెవిలియన్‌ను విలేకరులకు చూయించారు. అక్కడ సీఎం కార్యాలయం, కాన్ఫరెన్స్ హాల్, లాన్‌తోపాటు లోయర్ గార్డెన్తో సహా విలేకరులకు చూపించారు. చిన్న కార్యాలయంలో పనిచేస్తున్నానని, అందరికీ అందుబాటులో ఉండేలా ఇక్కడ అధికారిక సమీక్షలు చేస్తున్నానని రేవంత్ చెప్పారు. -
షాబాద్ హంతకుడికి... సీఎం రేవంత్‌కు తేడా లేదు
సాక్షి, సిద్దిపేట/సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు ముగ్గురు పసిపిల్లలతో సహా ఆరుగురిని కిరాతకంగా చంపేయడం ప్రభుత్వ, పోలీసుల వైఫల్యమేనని బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్’లోనూ కొన్ని వ్యాఖ్యలు పోస్ట్‌చేశారు. ‘రేవంత్‌కు షాబాద్ హంతకుడికి తేడా లేదు. రైతులు సాగునీరు అడిగితే ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలని మాట్లాడిన ముఖ్యమంత్రి వెంటనే ప్రజలకు, రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’అని తీవ్రస్థాయిలో విమర్శించారు.ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మరోసారి దారుణ హత్యాకాండకు పాల్పడ్డాడన్నారు. మే 16న మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే.. నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు.. నెల రోజులపాటు అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో.. అతను కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఈరోజు ఆ కుటుంబాన్నే అంతం చేశాడని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలు బయటపడినప్పుడల్లా ప్రజల దృష్టి మళ్లించేందుకు కాళేశ్వరం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని ఆరోపించారు. చిన్నారి పేరుపై కోటి డిపాజిట్ చేయాలి ‘రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది. పోలీస్ స్టేషన్లను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మార్చేశారు. షాబాద్ ఘటనలో ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండని బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఈ కిరాతక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో మిగిలిన దివ్యాంగ చిన్నారి పేరు మీద ప్రభుత్వం రూ.కోటి ఫిక్స్ డిపాజిట్ చేసి ఆ అమ్మాయిని పెంచే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి’అని హరీశ్‌రావు చెప్పారు. ఓదార్పు కోసం వెళ్లిన మాజీ హోంమంత్రి సబిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పద్మలను నేరస్తులుగా అరెస్ట్ చేశారని, అదే హత్య చేసిన నేరస్తున్ని పోలీసులు పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చేమోగానీ, ఎల్లకాలం మోసం చేయడం సాధ్యం కాదన్న అబ్రహం లింకన్ వ్యాఖ్యలు రేవంత్‌కు సరిగ్గా సరిపోతాయని హరీశ్ అన్నారు. రేవంత్ తెచ్చిన కృత్రిమ కరువు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాలం తెచ్చిన కరువు కాదని, సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధితో తెచ్చిన కృత్రిమ కరువు అని హరీశ్‌రావు ఆరోపించారు. గోదావరి నదిలో కావలసినన్ని నీళ్లున్నప్పటికీ, కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రభుత్వం కావాలనే ఆన్ చేయడం లేదని విమర్శించారు. పంట పొలాల్లో గోదావరి నీళ్లు పారేలా రేవంత్‌రెడ్డికి కలలో వచ్చి చెప్పాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించానని చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్లు, బీఆర్ఎస్ నాయకులు సాగునీటి కోసం సూచనలు చేస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ కక్షలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. తగిన సమయంలో రైతులు, ప్రజలే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హరీశ్‌రావు హెచ్చరించారు. -
కాళేశ్వరం.. కూలేశ్వరం ఎందుకయ్యింది?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కిలాడీ కమిటీ మాపై ఒత్తిడి తెచ్చి ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కిలాడీ కమిటీతో తమకు పని లేదని.. ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు పనిచేస్తామన్నారు. కేసీఆర్‌తో తప్పుడు పనులు చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్లు కొల్లగొట్టారంటూ విమర్శలు గుప్పించిన రేవంత్.. కాళేశ్వరం కూలేశ్వరం ఎందుకు అయ్యింది? లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయంటూ దుయ్యబట్టారు.‘‘ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో నీళ్లు ఎత్తిపోయాలి. కాళేశ్వరానికి శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ, మేడిగడ్డ వెన్నుపూస కన్నెపల్లి దగ్గర గేట్లు ఎత్తడానికి అవకాశమే లేదు. జూన్ 13, 2026న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆరుగురితో కమిటీ వేశారు. జూన్ 30, 2026న కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక నిపుణులతో సూచన చేశారు’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.‘‘కేసీఆర్ ఏర్పాటు చేసిన కమిటీలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈటల ఉన్నారు. కాళేశ్వరం కమిషన్లు తిన్న కొందరు రిటైర్డ్ ఇంజనీర్లే ఇప్పుడు నీరు ఎత్తిపోయాలని సూచించడం హాస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి చెప్పింది నిజం కాదా? కేసీఆర్ కీలాడి కమిటీలో చేరొద్దని ఈటలను కోరుతున్నా. హరీష్‌రావును కేసీఆర్ నమ్మకనే రెండో ప్రభుత్వంలో హరీష్ రావుకు ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదు.నిన్ను మీ మామే నమ్మలేదు. కమిషన్ల దోపిడీకి హరీష్‌రావు పాల్పడుతున్నాడు. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు దోచుకుంటున్నాయని మాట్లాడిన హరీష్ రావు... ఇప్పుడు ఆ కాలేజీలకు పాలు పొస్తున్నాడు. ఈటల రాజేందర్ మీరు తక్షణమే ఎన్డీఎస్ఏ దగ్గరకు వెళ్లి.. నీళ్లు ఎత్తిపోయాలని కోరండి. ప్రాజెక్టు గేట్లు మూస్తే గ్రామాలకు గ్రామాలకు కొట్టుకుపోతాయి. మీరు పదేళ్లు ఉద్దరిస్తేనే కాళేశ్వరం కూలింది.. ఇప్పుడు ఇంకేంచేస్తారు?. నీళ్లు ఎత్తిపోస్తామంటే ఎన్డీఎస్ఏకు ప్రాజెక్టు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏపీ పట్టిసీమ కట్టింది. అప్పుడు హరీష్‌రావు ఏం చేస్తున్నారు?’’ అంటూ రేవంత్ ప్రశ్నించారు. -
భద్రాచలంకు ముప్పు కాళేశ్వరంతో కాదు పోలవరంతో ఇదిగో ప్రూఫ్స్..!
-
ఎప్పుడూ అనుములే కాదు.. అన్నారం కూడా పట్టించుకోండి: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే.. నీళ్లు పంపింగ్ చేయకుండా రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు అని అన్నారు. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయవచ్చు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీల్లు లిఫ్ట్ చేయవచ్చు. గోదావరి బేసిన్లో 77 శాతం నీళ్లు లేవు. సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోతున్నారు. మేము కన్నెపల్లికి పోగానే సీఎం రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకుపోతుందని.. భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని అంటున్నారు. ఎల్‌నినో అంటూ రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారు. సీఎం రేవంత్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సీఎం బండారం బయటపడింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. రోజుకు 9 టీఎంసీల నీళ్లు కొందకు వృథాగా పోతున్నాయి. ఈ నీళ్లతో తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లు నింపవచ్చు.గేట్లు తెరిస్తే మేడిగడ్డ కొట్టుకుపోతుందని రేవంత్ అంటున్నారు. రేవంత్‌కు ప్రాజెక్ట్‌లపై అవగాహన తెచ్చుకోవాలి. గతంలో భారీ వరద వచ్చినా మేడిగడ్డ తట్టుకుని నిలబడింది. అన్నారం, సుందిళ్లకు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే.. నీళ్లు పంపింగ్ చేయకుండా రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు. వరదను తట్టుకని మేడిగడ్డ.. మేటిగడ్డగా నిలబడింది. కాళేశ్వరంపై బురద చల్లేందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై రేవంత్ అజ్ఞాన ప్రదర్శన చేశాడు.మాపై కక్ష ఉంటే కేసులు.. కానీ, రైతులను పగబట్టకు. మీ రాజకీయం కోసం లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ, మన సీఎం మాత్రం సొంత రాష్ట్ర ప్రయోజనాలనే ఫణంగా పెడుతున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌పై ఒక్కనాడైనా సీఎం రేవంత్ రివ్యూ చేశారా?. ముఖ్యమంత్రికి దేవాదుల ఎక్కడుందో, నల్లమల్ల ఎక్కడుందో తెలియదు. ఎప్పుడు అనుముల గురించే కాదు.. అన్నారం గురించి కూడా పట్టించుకోండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
మాట తప్పుడు.. పార్టీలు మారడం నీ సంస్కృతి
సాక్షి, హైదరాబాద్: మాట తప్పడం..పార్టీలు మారడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ సంస్కృతి కావొచ్చని, తనది కాదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు అన్నారు. రేవంత్ 20 ఏళ్ల రాజకీయ చరిత్ర, తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానమే అందుకు నిదర్శనమన్నారు. రేవంత్‌లా ఒట్టు వేసి ఒకమాట, ఒట్టు వేయకుండా మరోమాట చెప్పే అలవాటు తనకు లేదని చెప్పారు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు.రాష్ట్రం సంగతి పక్కన పెడితే, ముఖ్యమంత్రి సభ నిర్వహించిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందా అని నిలదీశారు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దామంటూ, మరోవైపు ప్రతి సభలో అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా హరీశ్‌రావు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కన్నెపల్లి పంపులు ఎందుకు ఆన్ చేయడం లేదు? కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తు తం లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులను ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగంపై నమ్మక ద్రోహమేనని హరీశ్‌రావు ఆరోపించారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం కావాలనే వినియోగించడం లేదన్నా రు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని రిటైర్డ్ ఇంజనీర్లు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు.ఎల్లంపల్లి నుంచి సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, మిషన్ భగీరథ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పెద్దఎత్తున నీరు అవసరమవుతుందని, ఆ పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు హెచ్చరికలు వస్తున్న సమయంలో లభ్యమవుతున్న ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీశ్‌రావు తెలిపారు. ఏపీకి నీరు.. తెలంగాణకు నిర్లక్ష్యం తెలంగాణలో గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా, వాటిని వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలేయడం జలద్రోహమేనని హరీశ్‌రావు ఆరోపించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 24 మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తూ ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంటుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను ఆన్ చేయకపోవడం వెనుక చీకటి ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు.దేవాదుల ప్రాజెక్టులో పది మోటార్లు ఉండగా ఒకటి, రెండు మాత్రమే నడపడం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ తెలంగాణ రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కన్నెపల్లి పంపులను ప్రారంభించి ఎల్లంపల్లి, అన్నారం, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్తోపాటు ఇతర రిజర్వాయర్లను నింపాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. తెలంగాణలో భవిష్యత్‌లో తాగు, సాగునీటి సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హరీశ్‌రావు హెచ్చరించారు. -
117 సీట్లు మావే!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘గత ఎన్నికలకు ఆరు నెలల ముందే జోస్యం చెప్పా. ఇప్పుడు 2029 ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి చెబుతున్నా. అసెంబ్లీ ఎన్నికలు 2029 మే – జూన్ మధ్య జరుగుతాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సీట్లు 26కి, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 182 శాసనసభ స్థానాల్లో 117 సీట్లకు పైగా గెలిచి రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.అలాగే 20 ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకుని రాహుల్‌గాందీని ప్రధానమంత్రి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌరవ వంశంగా ఉన్న కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీది నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు. ఇది భద్రాచలం రాముడి మీద ఆన. కాస్కో చంద్రశేఖర్‌రావు...’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద జరిగిన రైతు ఆశీర్వాద సభలో చివరి విడత రైతుభరోసా కింద రూ.1,009 కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అప్పుడు 65 సీట్లు గెలుస్తామని చెప్పా.. ‘2023 జూలైలో భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా ఖమ్మంలో రాహుల్‌గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పెనై వచ్చారు. ఈ సభ తర్వాత గాం«దీభవన్‌లో పాత్రికేయ మిత్రులు కలిసి బీజేపీ వేగంగా వస్తోంది, బీఆర్ఎస్, కేసీఆర్ మాయమాటలు, మూటలను తట్టుకుని ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? అని అడిగారు.కానీ ఖమ్మం సభ చూశాక కాంగ్రెస్ పార్టీ నుంచి 65 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, సీపీఐ ఒక్క సీటు గెలుస్తుంది, బీజేపీ 8 –9 సీట్లు, ఎంఐఎం 6–7 సీట్లు పోగా మిగిలిన చోట్ల మాత్రమే కేసీఆర్, కేసీఆర్ భజనపరులు గెలుస్తారని చెప్పా. అదే తరహాలో కాంగ్రెస్ 64 సీట్లు గెలవగా.. ఉప ఎన్నికల్లో ప్రజలు మరో రెండు సీట్లు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాగే జరిగింది. ప్రజాతీర్పు ద్వారా పాపాల భైరవుడిని ఫార్మ్ హౌస్‌లో బంధించినం..’ అని రేవంత్ అన్నారు. అన్నం తినేటోడు ఇప్పుడు సర్వేలు చేయిస్తడా.. ‘రేవంత్‌రెడ్డి సర్వే చేసుకుంటే మేము గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నారు.. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలవకుండా సర్వేలు చేయిస్తడా?..’ అని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం విమర్శలు చేశారు. ‘మొన్న కన్నెపల్లి పోయిండు. మేడిగడ్డలో నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండన్నడు. మేడిగడ్డ గేట్లు దించి నీళ్లు నిలబెడితే.. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండడు. ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోతాయి. నీ లుచ్చా రాజకీయాల కోసం మేడిగడ్డ నింపి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చేయాల్నా?..’ అని మాజీమంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి రేవంత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉచిత కరెంట్‌పై సంతకం చేసింది వైఎస్సార్ ‘రైతుల కోసం 30 నెలల కాలంలో రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. సన్న బియ్యంతో కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే కార్యక్రమం జరుగుతోంది. రైతును రాజును చేయాలన్న ఆలోచనతో తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్‌ది. ఉచిత కరెంటు మా పేటెంట్. 2004లో ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొట్టమొదటి సంతకం పెట్టి, రైతాంగానికి ఉచిత కరెంట్ అందించడంతో పాటు రైతుల మీద ఉన్న వేల కేసులను తొలగించారు..’ అని సీఎం తెలిపారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేద్దాం.. ‘మోదీ, అమిత్ షా.. మమతా బెనర్జీ పార్టీ, ఆప్‌ను చీల్చి, ఇతర పార్టీలను లొంగతీసుకుని సీట్లు పెంచాలన్న బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో వాళ్లు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఈనెల 20న ఢిల్లీకి వెళ్తున్నా, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాం«దీని కలుస్తున్నా. 26 పార్లమెంట్ సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి మేము అందిస్తామని చెప్పదలుచుకున్నా. ఖమ్మంలో, ఇదే ప్రాంతంలో 5 లక్షల మందిని ఆహ్వానించి రాహుల్‌గాంధీతో సభ ఏర్పాటు చేస్తాం. భద్రాద్రి రాములోరి ఆశీర్వాదంతో రాహుల్‌గాం«దీని దేశానికి ప్రధానమంత్రిని చేసేవరకు మనం విశ్రమించొద్దు..’ అని రేవంత్ పిలుపునిచ్చారు. మొక్కజొన్న రైతులకు రూ.3,504 కోట్లు సభావేదిక పైనుంచి రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో పాటు, యాసంగి సీజన్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నకు గాను రైతులకు రూ.3,504 కోట్లు సీఎం విడుదల చేశారు. భూధార్‌కు సంబంధించి పైలట్ గ్రామంగా సర్వే పూర్తి చేసిన ఖమ్మం జిల్లా ములుగుమాడులోని రైతులు ముగ్గురికి లాంఛనంగా ఈ–పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశారు. అవన్నీ చెక్కు చెదరలేదు.. కాళేశ్వరం కూలిపోయింది: భట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు దశాబ్దాలైనా చెక్కు చెదరలేదని, కొన్ని వందల టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టులు ఇప్పటికీ నీళ్లు అందిస్తుంటే.. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచి్చన బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. ‘గోదావరిపై ప్రాజెక్టులతో రూ.లక్షల కోట్లు దోపిడీ చేశారు. దోపిడీలకు పాల్పడే ఇలాంటి గుంటనక్కలు, తోడేళ్లను రాష్ట్రంపై మరోసారి పడనివ్వబోం..’ అని భట్టి అన్నారు. ప్రతీ గజాన్ని సర్వే చేస్తాం: పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..‘భూభారతి ద్వారా ప్రస్తుతం 70 గ్రామాల్లో సర్వే చేస్తున్నాం. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గజాన్ని సర్వే చేసి సాగులో ఉన్న వారికి మ్యాప్‌తో భూధార్ కార్డు ఇస్తాం..’ అని తెలిపారు. ఇప్పటికే రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని, మళ్లీ ఎన్నికలు వచ్చినా బుద్ధి చెబుతారని అన్నారు. 30 మాసాల్లో రూ.36 వేల కోట్ల రైతుభరోసా: తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతుభరోసా కింద 30 మాసాల కాలంలో రూ.36 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.72 వేల కోట్లు మాత్రమే జమ చేసిందని విమర్శించారు. ఈ సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు వాకిటి శ్రీహరి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, డాక్టర్ రాంచందర్ నాయక్, ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, నవీన్‌యాదవ్, నాగరాజు, మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, ఈర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతా
-
సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఖమ్మం: బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌరవవంశం కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ నుంచి తరిమికొడతామంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మళ్లీ గెలిచేది తామేనన్న సీఎం రేవంత్.. 117 అసెంబ్లీ సీట్లలో విజయం సాధిస్తామన్నారు. ఇది భద్రాచలం రాముడి సాక్షిగా చెబుతున్నమాట అని, కేసీఆర్ రాసిపెట్టుకోవాలంటూ కూడా సవాల్ విసిరారు. 2028లో ఎన్నికలు కాదు.. 2029 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయన్నారు. పార్లమెంట్‌కు 26 అసెంబ్లీకి 182 సీట్లు పెరుగుతాయని కూడా రేవంత్ జోస్యం చెప్పారు.ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో రైతు ఆశీర్వా సభ నిర్వహించారు. ఈ సభలో రైతు భరోసా కింద నిధులు విడుదల చేశారు సీఎం రేవంత్. రైతు భరోసా కింద రూ. 1009 కోట్లు విడుదల చేశారు సీఎం రేవంత్. ఇప్పటికే 74 లక్షల మందికి పెట్టుబడి సాయం అందగా, తాజాగా మరో రూ. 1000 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకూ రైతు భరోసా కింద రైతులకు మొత్తం రూ. 8, 759 కోట్ల నిధులు విడుదల చేశారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రజాపాలనను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా తనకు గుండె లాంటిదని వ్యాఖ్యానించారు. గడిచిన 10 ఏళ్లు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందంటూ మండిపడ్డారు. గత పాలనలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజనులకు బేడీలు వేశారని ఆరోపించారు. చెప్పింది చెప్పినట్లు చేయడం వల్లనే ప్రజాతీర్పు తమకు అనుకూలంగా ఉందన్నారు. ‘కౌరవ వంశాన్ని’ తెలంగాణ గడ్డ నుంచి తరిమికొడతానని విమర్శించారు. -
ఇది కదా జగన్ బ్రాండ్.. రేవంత్ స్వాగత ఫ్లెక్సీలో జగన్ ఫోటో..
-
మమ్మల్ని కొన్నాళ్లు పని చేయనివ్వండి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి రంగారెడ్డి: ‘మేము చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించకపోయినా పరవాలేదు కానీ.. అడ్డు తగులుతూ కడుపులో ఉన్న విషాన్నంతా రోజూ మాపై కక్కొద్దు.. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూసుకుందాం. ఎవరు ఏం చేశారో? అప్పుడు చర్చిద్దాం. మమ్మల్ని కొంతకాలం పని చేసుకోనివ్వండి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయిన బాధ మీకు ఉన్నా అభివృద్ధి జరగనివ్వండని పరోక్షంగా విపక్ష బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యంగల సోలార్ మాడ్యూళ్ల తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని రేవంత్ చెప్పారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామన్నారు. కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ లాంటి నగరాల్లో నివసించలేని పరిస్థితి తలెత్తిందని, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని సీఎం పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ నగరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందుకే హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత అభివృద్ధి జరగాలని నిర్ణయించామని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2,100 చ.కి.మీ విస్తీర్ణంలోని క్యూర్ ఏరియాను పూర్తిగా సర్వీస్ సెక్టార్‌గా నిర్ణయించామని తెలిపారు. నైపుణ్య పెంపు బాధ్యత పరిశ్రమలదే.. ప్రస్తుతం వైట్‌కాలర్ ఉద్యోగాలకు కాలం చెల్లింది. స్కిల్స్ ఉన్న వారికి బ్లూకాలర్ జాబ్స్‌కు కొదవ లేదు. ఇప్పటివరకు అమెరికా వైపు చూశాం. ప్రస్తుతం జర్మన్, జపాన్, చైనా, సౌత్ కొరియాను ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఆయా దేశాలతో పోటీపడదాం. రాష్ట్రంలో ఏటా 10 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలు తీసుకుని బయటికి వస్తున్నారు. సంబంధిత సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో పది శాతం మందికి కూడా ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. వీరి నైపుణ్యాలను పెంచి, అవకాశాలు కల్పించే బాధ్యతలను పరిశ్రమలు తీసుకోవాలి. నిర్వాసితులకు ఇంటి పట్టాలు రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలని సంకల్పించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం భాగస్వామ్యం కలిగి ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. సీతారాంపురంలో సోలార్ మాడ్యూల్ ప్లాంట్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందంటూ.. గ్రామంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇంటి పట్టాలు, ఉపాధి కోసం వ్యాపార సముదాయాలను నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా రైతులు త్యాగం చేయడం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ విశ్వవ్యాప్తం కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు ‘కేవలం పెట్టుబడులు ఆకర్షించడమే కాదు. ఆవిష్కరణలు, తయారీ ఇక్కడే జరగాలి. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ఇక్కడి నుంచే ప్రపంచానికి ఉత్పత్తులను అందించాలి. ఇదే మా ప్రభుత్వ సంకల్పం’అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు తెలంగాణను ఎంచుకోవడం ఇక్కడి పారిశ్రామిక ప్రగతికి, రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. 3 వేల మందికి ఉపాధి అవకాశాలు సోలార్ మాడ్యూళ్ల తయారీ కేంద్రం 75 ఎకరాల్లో ఏర్పాటైంది. యూనిట్ పూర్తి సామర్థ్యానికి చేరుకుంటే 3 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. కంపెనీ 6 గిగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఫెసిలిటీతో పాటు ఏటా 18 వేల మెట్రిక్ టన్నుల తయారీ సామర్థ్యంతో రానున్న అల్యూమినియం ఫ్రేమ్స్ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుత కేంద్రాల విస్తరణ, నూతన ఫెసిలిటీల కోసం సంస్థ 2028 నాటికి సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. -
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సొంత సర్వేలో తేలిందన్న కేటీఆర్.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సర్వేల భయంతోనే సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైంది. మరోసారి ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పిన విషయాన్ని తెల్చిచెప్పారు...సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే మరోసారి ముఖ్యమంత్రి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని.. సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అలా చేయడం వల్లే ముఖ్యమంత్రినయ్యా: రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో పూర్తి సమయం కేటాయించడం వల్లే తాను సీఎం అయ్యానని.. కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. వర్శిటీ లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.‘‘యువకులు ఈ దేశ సంపద.. ఒలంపిక్స్‌లో ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ అత్యంత వెనుకబడింది. ప్రభుత్వాలకు ఒక విధానం లేకపోవడమే ఇందుకు కారణం. పీటీ ఉష లాంటి క్రీడాకారులు దేశానికి పేరు తెచ్చారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను క్రీడల్లో రాణించిన దేశంగా గుర్తించడం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ విధానంలో ప్రారంభించుకున్నాం. క్రీడల్లో రాణించడం వల్లే పీటీ ఉషకు గుర్తింపు వచ్చింది. క్రీడల్లో రాణించి ఆమె రాజ్యసభ సభ్యురాలి స్థాయికి చేరారు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘లక్ష్యాన్ని చేరాలంటే వంద శాతం కష్టపడాల్సిందే. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కు వేదికగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలతో పాటు నగదు పారితోషికం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. డిసెంబర్ 2028 నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకుంటాం. క్రీడల్లో రాణించినా మీ భవిష్యత్తు బాగుంటుంది. క్రీడల్లో రాణించి దేశానికి పేరు తెస్తే మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. -
రేవంత్ 20 ఏళ్ల రాజకీయం.. సీఎం కుర్చీపై కొత్త సమరం!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్లు పూర్తి కావడం ఒక మైలురాయే. ఇందుకు ఆయనను అభినందించాలి. రాజకీయంగా జడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంత తేలిక కాదు. దానికి ఎంతో కష్టపడాలి. వ్యూహాత్మకంగా సాగాలి. ఆ విషయంలో రేవంత్‌ను మెచ్చుకోవచ్చు. అంతవరకు అభినందనలు.ఈ సందర్భంగా మిడ్జిల్ వద్ద జరిగిన సభలో రేవంత్ చేసిన ప్రసంగం గమనిస్తే ఏదో భయం ఆయనను వెన్నాడుతున్నట్లు అనిపిస్తుంది. ఎంత పదవి వచ్చినా, దానిని నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలా అన్నదానిపై కాస్త గందరగోళంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాముడి వంటిదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రావణుడి వంటిదని ఆయన అనడంలోనే ఆ డౌటు వస్తుంది. ఆయన ఉద్దేశం తాను రాముడినని, విపక్ష నేత, మాజీ సీఎం చంద్రశేఖరరావును రావణుడని చెప్పడమే కదా!తాను ప్రభుత్వపరంగా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఘనంగా చెప్పుకోవచ్చు. ఇచ్చిన హామీలు ఏమిటో, వాటిని ఏ విధంగా నెరవేర్చుతున్నట్లో వివరించగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉండేది. రాష్ట్ర అప్పుల గురించి రెండున్నర ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎంతవరకు ప్రయోజనం? ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సహా కొందరు మంత్రులు అప్పులపై బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసరడం, చర్చలంటూ హడావుడి చేయడం, దానికి ప్రతిగా బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కే.తారక రామారావు, మాజీ మంత్రి హరీష్‌లు చర్చకు సిద్దం అంటూ ప్రతి సవాల్ చేయడం తదితర ఘట్టాలు చూస్తే ప్రభుత్వం ఏదో రకంగా అప్పుల పేరుతో ఇతర అంశాలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది.మిడ్జిల్‌లో రేవంత్ కూడా అప్పుల ప్రస్తావన తెచ్చి కేటీఆర్, హరీష్‌రావులను పిల్ల రాక్షసులుగా అభివర్ణించారు. వారిని మీరు అన్నా, వారు మిమ్మల్ని అన్నా ఇదేదో మీ రెండు పార్టీలకే సంబందించిన అంశం కాదు. ఎన్నికలకు ముందు కూడా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులపై తీవ్ర విమర్శలు చేశారు కదా! అయినా ఆచరణ సాధ్యం కాని అనేక వాగ్దానాలను పీసీపీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ప్రచారం చేశారు కదా! కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు కదా! పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చారో గుర్తు చేసుకోండి.కేసీఆర్ గెలిస్తే పదివేలే రైతుకు వస్తుందని, అదే కాంగ్రెస్ గెలిస్తే 15వేలు రూపాయలు వస్తాయని అన్నారా? లేదా? అప్పుడు అది సాధ్యమా? కాదా? అన్నది ఆలోచించలేదా? గతంలో అమెరికా టూర్లో రేవంత్ ఒక మాట అన్నారు. మోసపోయే ప్రజలు ఉన్నంతకాలం రాజకీయ నేతలుగా మోసం చేస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. ఆ మానిఫెస్టో చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది కదా! ఉదాహరణకు మహిళలకు ఒక్కొక్కరికి 2500రూపాయలు చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం గురించి ఇంతవరకు వివరణ ఇచ్చారా? లేదే! అలా అని అసలు ఏ హామీ అమలు కాలేదని చెప్పజాలం. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నారు. పబ్లిక్ స్కూళ్లను కొన్నిచోట్ల ఏర్పాటు చేయడం వరకు బాగుంది. దానిని మెచ్చుకోవచ్చు. రైతులకు రుణమాఫీని కొంతమేర అమలుచేశారు. ఇటీవలి కాలంలో హామీల గురించి మాట్లాడడం కన్నా, బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను అటువైపు మళ్లించాలన్న ఉద్దేశం కావచ్చు. కేటీఆర్, హరీష్‌రావులకు, అదే టైమ్‌లో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానంగా కూడా కావచ్చు. అయితే విపక్షాలకన్నా ప్రభుత్వంలో ఉన్నవారికి అధిక బాధ్యత ఉంటుంది. వాగ్దానాల సంగతి ఎలా ఉన్నా, కొత్తగా మూసి పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా ప్రజల మద్దతు పొందాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అది కూడా తప్పు కాదు. కాకపోతే మూసికి సంబంధించి రెండున్నర టీఎంసీల మంచినీరు ఎక్కడి నుంచి వస్తుందని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. అలాగని కాలుష్య కాసారంగా ఉన్న మూసిని బాగు చేయవద్దని ఎవరూ చెప్పరు.అలాగే ఫ్యూచర్ సిటీ పేరుతో వేల కోట్లు వ్యయం చేయాలన్న ఆలోచనను కూడా ఒకటికి రెండుసార్లు సమీక్షించుకుని ముందుకు వెళ్లవలసి ఉంటుంది. మెట్రో రైలుకు సంబంధించిన రుణ భారాన్ని నెత్తిన వేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చ జరగాలి. రైతు భరోసా కింద రైతులకు డబ్బు వేసిన మాట నిజమే. కాని మానిఫెస్టోలో చెప్పినట్లు చేస్తున్నారా? లేదా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. విపక్షంగా బీఆర్ఎస్ ఆ ప్రశ్నను లేవనెత్తి రైతులకు రేవంత్ 28720 కోట్ల బకాయిపడ్డారని విమర్శిస్తున్నారు. వీటిపై తగురీతిలో జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. అయితే ఇలా ఇవ్వకపోవడానికి గత కేసీఆర్ ప్రభుత్వ పాలనవల్ల కలిగిన నష్టం, అప్పటి అప్పులే కారణమని చెప్పి తప్పించుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం కావచ్చు.కేసీఆర్ పాలన, తన పాలనపై చర్చకు సిద్దమని రేవంత్ అంటున్నారు. అదేదో అసెంబ్లీ సమావేశాలలో పెట్టుకోగలిగితే సరిపోతుంది. ఇక ఆయా సభలలో రేవంత్ చేస్తున్న ప్రకటనలు కొన్ని ఆశ్చర్యకరంగాను, ఆసక్తికరంగాను ఉంటున్నాయి. తాను గుంపుమేస్త్రీనని ఆయన ప్రకటించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తన గుంపేనని, ఈ గుంపే తన బలమని, ధైర్యమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధి అని రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారధి అన్నంతవరకు బాగానే ఉంటుంది కాని, గుంపు అనడమే అంత బాగున్నట్లు లేదు. గుంపు అంటే ఏదో మేకలు, గొర్రెల గుంపేమో అన్న భావన కలిగే అవకాశం ఉంది. దీనికి హరీష్ రావు జవాబిస్తూ ముంపు మేస్ల్రీ అని ఎద్దేవ చేశారు. రేవంత్ మంచి ఉద్దేశంతోనే గుంపు మేస్త్రీ అని చెప్పుకున్నా, ఆ పదం అంత బాగున్నట్లు అనిపించదు.మరో సభలో రేవంత్ మాట్లాడుతూ అధికారం కోసం అబద్దాలు చెప్పనని, ఏమి ఉంటే అదే చెబుతానని, చెప్పిందే చేస్తానని, ఇచ్చిన మాట నిలబట్టుకోవడమే తన రాజకీయ జీవితం అని రేవంత్ ప్రకటించారు. నిజంగా అలా చేయగలిగితే ఆయనను అభినందించవచ్చు. రేవంత్‌తో సహ రాజకీయ నేతలు అబద్దాలు ఆడుతున్నారా? లేదా? అన్నది ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎన్నికల ముందు ఏమేమి చెప్పింది. వాటిని ఎలా ఆచరించి చూపింది, తద్వారా తాను సత్య సంధుడనని రుజువు చేసుకోగలిగితే ఆయనకు గొప్ప పేరు వస్తుంది. కాని తన రాజకీయ గురువు, ఏపీ ముఖ్యమంత్రి తరహాలోనే రాజకీయ ప్రసంగాలు చేస్తే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా? అన్నది చర్చనీయాంశం.ఏపీలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు వేరు. తెలంగాణలో పరిస్థితులు వేరు. తెలంగాణలో దైర్యంగా ప్రశ్నించగలిగ ప్రజలు ఎక్కువ. ఏపీలో ప్రజలు ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడేలా రెడ్ బుక్ పాలన సాగుతోంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఏపీతో పోల్చితే రేవంత్ సర్కార్ మరీ ఘోరంగా పోలీసులను ప్రజలపై, ప్రశ్నంచేవారిపై ప్రయోగించడం లేదు. అంతవరకు ఓకే. కాని అబద్దాలు చెప్పను అన్న స్టేట్ మెంట్ మాత్రం కాస్త అతిగానే ఉందనిపిస్తుంది. ఇటువంటి ప్రకటనల వల్ల ఆయనకు రాజకీయంగా నష్టం జరగవచ్చు. సాద్యమైనంతవరకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని నడుపతూ ప్రజలకు నిజాలు చెప్పడం వల్లే ఆయనకు మంచి పేరు వస్తుందని అనాల్సి ఉంటుంది. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్నందుకు రేవంత్‌కు మరోసారి అభినందనలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నాకు 3 నెలలు ఇరిగేషన్ శాఖను అప్పగించు!
సాక్షి, హైదరాబాద్: ‘నీ సవాలుకు స్పందించడానికి కేసీఆర్ అవసరం లేదు.. నేను చాలు.. నాకు ఫ్యాను వద్దు, ఫ్యూను వద్దు, కారు, జీతం కూడా వద్దు. నాకు మూడు నెలలు ఇరిగేషన్ శాఖను అప్పగించి చూడు. మూడు నెలల్లో కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు తెచ్చి పారించి చూపిస్తా. ఒకవేళ చేయలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. నా సవాలుకు సిద్దమేనా..?’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. తెలంగాణ భవన్లో బుధవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రేవంత్, నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. అబద్ధాలకు నోబెల్ బహుమతి ఉంటే అది రేవంత్ రెడ్డికే వస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం గోదావరి జలాలను వృథాగా కిందికి వదిలేస్తోందని ఆరోపించారు. సమ్మక్క బ్యారేజి వద్ద లక్ష క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంటే దేవాదుల ద్వారా కేవలం 2,542 క్యూసెక్కుల నీటినే ఎత్తిపోస్తున్నారన్నారు. 71 మీటర్ల నీటిమట్టం వద్దే మోటార్లు నడిచే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే వాటిని ఆన్ చేయడం లేదని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 నుంచి 80 శాతం చెరువులు ఎండిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం రైతుల పట్ల ‘నేర పూరిత నిర్లక్ష్యం’కిందకు వస్తుందన్నారు. సమ్మక్క బరాజ్‌పై అసెంబ్లీలో చర్చ పెడితే తాను సిద్ధంగా ఉన్నట్లు హరీశ్ ప్రకటించారు. ఆధారాలు చూపకపోతే క్షమాపణ చెప్పాలి ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెబితే ఒక్క అధికారిక లేఖ చూపించినా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. సీడబ్ల్యూసీ స్వయంగా అక్కడ 160 టీఎంసీల నీటి లభ్యత లేదని, కేవలం 102 టీఎంసీలే ఉన్నాయని స్పష్టం చేసింది. తుమ్మిడిహెట్టికి కాంగ్రెస్ పాలనలో రూ.6 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్తూ సర్వేలు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో రూ.2,328 కోట్లు మెక్కారు. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహారాష్ట్రతో అనేకసార్లు చర్చించినా 152 మీటర్ల ఎత్తున బరాజ్ నిర్మాణానికి అనుమతి రాలేదు. మూడేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నిసార్లు మహారాష్ట్రతో చర్చించిందో చెప్పాలి. ఆధారాలు చూపించలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మేడిగడ్డ బ్యారేజికి పరిమితం చేసి చూపించడం రాజకీయ దురుద్దేశం మాత్రమే. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగాన్ని 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు, ఆయకట్టును 16 లక్షల ఎకరాల నుంచి 37 లక్షల ఎకరాలకు పెంచాం. నష్టపరిహారం పెరగడం, రిజర్వాయర్ల సామర్థ్యం పెరగడం వల్లే వ్యయం పెరిగిందని, దానిని అవినీతి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. కాళేశ్వరం లేకపోతే మూసీ పునరుజ్జీవానికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు’అని రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. పోలవరం నుంచి మేడిగడ్డ వరకు రాజకీయ కుట్ర ‘పోలవరం అథారిటీ సీఈఓగా ఉన్న సమయంలో పదిసార్లు డ్యామ్ కొట్టుకుపోయి రూ.7 వేల కోట్ల భారీ నష్టానికి కారణమైన వ్యక్తే ఎన్డీఎస్ఏ చైర్మన్‌గా మేడిగడ్డపై నివేదిక ఇచ్చాడు. పోలవరం పదేపదే దెబ్బతిన్నా అక్కడికి వెళ్లని ఎన్డీఎస్ఏ, ఎన్నికలకు ముందు మేడిగడ్డపై నివేదిక ఇవ్వడానికి రావడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కునకు నిదర్శనం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయి. కానీ కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలోనే సుంకిశాల గోడలు కూలడం, వట్టెం పంప్‌హౌస్ మునిగిపోవడం, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడం, చెక్‌డ్యాంలను పేలి్చవేయడం వంటి ఘటనలు జరిగాయి. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 7.5 టీఎంసీల నీరు వృథాగా పోతున్నా కన్నెపల్లి మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలి’అని హరీశ్‌రావు మండిపడ్డారు. -
కెనడా–తెలంగాణ సంబంధాల బలోపేతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సౌర విద్యుదుత్పాదక, హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కెనడా సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కోరారు. భారత్‌లో కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ బుధవారం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెనడా–తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల విషయంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రేవంత్ చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. కెనడాలోని విశ్వవిద్యాలయాలూ హైదరాబా ద్లో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు పరిశీలించాలని కోరారు. పెట్టుబడులు, వ్యాపార భాగస్వాములకు తెలంగాణ మంచి వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సీఎం నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం కెనడాకు రావాలని కూటర్ ఆహ్వానించారు. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో సదస్సుకు కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అన్నివిధాలుగా సహకరిస్తాం: కూటర్ మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై రేవంత్, కూటర్ చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు కెనడా అన్నివిధాలుగా సహకరిస్తుందని కూటర్ హామీ ఇచ్చారు. తెలంగాణ–కెనడా మధ్య పారిశ్రామిక, ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని, ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించడం, సీఐబీసీ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించడం వంటి పరిణామాలు రాష్ట్రంపై కెనడా కంపెనీల నమ్మకానికి నిదర్శనమని కూటర్ అన్నారు. సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ హైదరాబాద్‌కు చెందిన కంట్రోల్ఎస్(సీటీఆర్ఎల్ఎస్) డేటా సెంటర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. -
8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం
2026లో నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం దక్కడం పట్ల రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, యువ క్రీడాకారులకు ప్రోత్సాహం, క్రీడల విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగానే తెలంగాణకు ఈ ప్రతిష్ఠాత్మక ఆతిథ్య అవకాశం లభించిందన్నారు. 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను ఆతిథ్య రాష్ట్రంగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవియాలకు మంత్రి వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులు తెలంగాణకు రానున్నారని, రాష్ట్ర ఆతిథ్య సామర్థ్యాన్ని దేశానికి చాటిచెప్పే అవకాశం ఇదని మంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్ మార్గదర్శకత్వంలో అన్ని శాఖల సమన్వయంతో ఈ క్రీడా మహోత్సవాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల నిర్వహణ తెలంగాణలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడంతో పాటు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి, భావితర క్రీడాకారులకు ప్రేరణగా నిలవడానికి దోహదపడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు. -
సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌కు నీళ్లు ఇవ్వాలన్న నిజాయతీ లేదని.. అబద్ధాల ప్రవాహంలో ఆయన మునిగి తేలుతున్నాడంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాణహిత చేవేళ్ల పేరు మీదు రూ.2,300 కోట్లు దోచేశారని.. తుమ్మిడిహెట్టికి అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పారంటూ దుయ్యబట్టారు.‘‘నీళ్లుండి కూడా రైతులకు సాగునీరు ఇవ్వలేకపోతున్నారు. బేసిక నాలెడ్జ్ లేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సీఎంగా రేవంత్, మంత్రిగా ఉత్తమ్ ఫెయిల్ అయ్యారు. చెరువులు నింపే అవకాశం ఉన్న నింపడం లేదు. గోదావరి నీళ్లు వృథాగా పోతుంటే ఈ ప్రభుత్వానికి సోయి లేదు. అసత్యాలు చెప్పడంలో రేవంత్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలి. దేవాదులు నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమని అంటే ఎన్డీఎస్ఏ సాకు చెబుతున్నారు. నీళ్లుండి కూడా మోటార్లు ఆన్చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్’’ అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు.‘‘నీళ్లు లేని చోట ప్రాజెక్టులకు కాంగ్రెస్ రూపకల్పన చేసింది. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. తుమ్మిడిహెట్టి దగ్గర అనుమతి తెచ్చామని రేవంత్ అంటున్నారు. అనుమతి కాపీని సీఎం రేవంత్ బయటపెట్టాలి. అనుమతి డ్యాకుమెంట్‌ను చూపిస్తే నేను రాజీనామా చేస్తా. అనుమతి కాపీ లేకుంటే తప్పయిందని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. రాజకీయాల కోసమే అలా మాట్లాడానని రేవంత్ ఒప్పుకోవాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు. -
పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్
ఉప్పల్/మల్లాపూర్ (హైదరాబాద్): ‘ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడటమే కాదు ఆ ఆడబిడ్డలకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలి. పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది. అందుకే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు పేద పిల్లలకు బలమైన పౌష్టికాహారం ఇవ్వాలన్న ఆలోచనతో బాలామృతం ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆరోగ్యవంతమైన పిల్లలతోనే పరిపూర్ణ తెలంగాణ రూపుదిద్దుకుంటుందని అన్నారు. పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తని పేర్కొన్నారు. మంగళవారం నాచారం పారిశ్రామికవాడలో తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణంలో రూ.40 కోట్లతో నిర్మించిన కొత్త బాలామృతం ప్లాంట్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే..‘మహిళా సాధికారత, శిశు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పిల్లల ఆరోగ్యం, చదువు, భవిష్యత్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా జన్మిస్తారు. ఆ ఆలోచనతోనే ఇందిరాగాంధీ బాలామృతాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభించారు. ఇది అంచలంచెలుగా ఎదుగుతూ ఉప్పల్ నియోజకవర్గంలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించింది. ఈ నూతన బాలామృతం ఉత్పత్తి కేంద్రం తెలంగాణ, ఏపీకే కాదు చుట్టుపక్కల 4–5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా అభివృద్ధి చెందుతుంది. నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యనాణ్యమైన భోజనమే కాదు నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా పట్టణాల్లో వలస వచ్చి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్లకు పంపించాల్సిన పరిస్థితి. వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక సంపాదించిన మొత్తం, తల్లిదండ్రుల కష్టమంతా విద్యకు లేకపోతే వైద్యానికి ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అందుకే ఆలోచన చేసి నర్సరీ నుంచి 12 క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లంచ్‌లో నాణ్యమైన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. చదువు తలకెక్కాలంటే కడుపు నిండుగా ఉండాలి..విద్య విద్యార్థి తలకెక్కాలంటే వాని కడుపు నిండా భోజనం ఉండాలి. కడుపులో ఎలుకలు పరుగెత్తుతుంటే సార్ ఎంత గొప్ప చదువు చెప్పినా అది అంతే సంగతులు. వానాకాలం చదువు అయితది. అందుకే ప్రతి స్కూల్లో పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం ఇవ్వాలని నిర్ణయించాం. పిల్లలకు మంచి భోజనం అందాలనే టీచర్లకూ లంచ్పిల్లలకు మాత్రమే టిఫిన్, లంచ్ పెడితే, టీచర్లు తినకపోతే వాళ్లు దాన్ని పట్టించుకోరు. అందుకే లక్షా 25 వేలమంది టీచర్లకు కూడా టిఫిన్, లంచ్ స్కూల్లోనే ఏర్పాటు చేశాం. ఎప్పుడైతే సార్ అక్కడ టిఫిన్ తింటాడో, సార్ అక్కడ లంచ్ చేస్తాడో అప్పుడు పిల్లలకు పెట్టే భోజనం ఎట్లుందో సార్‌కు రుచి తెలుస్తది. అప్పుడు ఆ వంటను సరిదిద్ది పిల్లలకు మంచి భోజనం పెట్టే విధంగా టీచర్లు చూసుకుంటారు..’ అని సీఎం చెప్పారు.దేశవ్యాప్తంగా బాలామృతంమంత్రి సీతక్క మాట్లాడుతూ.. 50 ఏళ్లత తర్వాత తెలంగాణ ఫుడ్స్ క్రియాశీల పాత్ర పోషిస్తోందని చెప్పారు. బాలామృతం దేశ వ్యాప్తంగా సరఫరా చేసేందుకు కృషి జరుగుతోందన్నారు. దేశంలో ఇలాంటి ప్లాంట్లు ఎక్కడా లేవని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు డిజిటలైజేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలన మరింత పారదర్శకతతో నిర్వహించేందుకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు అవసరమైన చట్టాలను రూపొందించాలన్నారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతోపాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి జీతాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని చెప్పారు. పీఎఫ్ ఇవ్వని ఏజెన్సీలపై చర్యలురాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా.. ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని వివరించారు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడంతో ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని, నిర్లక్ష్యంగా వహిస్తున్న ఏజెన్సీల పట్ల ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా సీఎం తప్పు పట్టినట్లు సమాచారం. అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు.కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 1 నుంచి గరిష్టంగా 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాల చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందన్నారు. పూర్తి వివరాలను డిజిటలైజ్ చేసేందుకు వివిధ విభాగాల అధికారులతో ఒక కమిటీని నియమించాలని సూచించారు. కమిటీ వంద రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. హెల్త్ కార్డులు, ఇతర ప్రయోజనాలు అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలన్నారు. నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతి కుమారి, వేతన సవరణ కమిషనర్ ఎన్.శివ శంకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ప్రణాళికా విభాగం కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.పనిచేసే వారికి వేతనాలివ్వరా?ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాల అమలులో బాధ్యతగా పనిచేస్తున్న వారి పట్ల నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా పరిగణించారు. క్షేత్రస్థాయిలో బిల్లులు రాకపోవడంతో చెల్లింపులు నిలిచిపోయినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్పినప్పటికీ... ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బిల్లులు అందకపోవడం, చెల్లింపులు చేసినా ఏజెన్సీలు పంపిణీ చేయలేదనే కారణాలపై ఆయన సంతృప్తి చెందలేదు. వేతన చెల్లింపుల్లో జాప్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనక్కు తగ్గవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
కన్విన్స్ చేస్తే కేసీఆర్‌కు బరాజ్‌లు అప్పగిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ స్పీకర్‌కు లేఖ రాస్తే ఆయన కోరిన తారీఖున, కోరుకున్నన్ని రోజులు శాసనసభ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చిద్దాం. ప్రత్యేక అనుమతితో శాసనసభ, మండలి జాయింట్ సెషన్ పెట్టి కేసీఆర్‌కు ఎందుకు ఇవ్వాలో కన్విన్స్ చేస్తే మూడు బరాజ్‌లను 100 శాతం వచ్చే మూడేళ్లు అప్పగిస్తాం. ఏం చేస్తడో చేయనీ. నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ, ఇతర కాంట్రాక్టర్లను తొలగించి ఈయననే హెడ్ ఆఫ్ ది కాంట్రాక్టర్‌గా చేసి అప్పగిద్దాం. తనకు కావాల్సినోళ్లందరినీ పెట్టుకుని ఎలా పునరుద్ధరిస్తడో చేయనీయండి..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విపక్షనేత కేసీఆర్‌కు సవాలు విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. అనంతరం రేవంత్ రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ‘సబ్జెక్ట్ నిపుణులు, అడ్వొకేట్ జనరల్‌ను స్పీకర్ అనుమతితో మాట్లాడిద్దాం. ఏమాత్రం మీ(కేసీఆర్) గౌరవానికి, మర్యాదకు భంగం కలగకుండా సజావుగా జరి గే బాధ్యత శ్రీధర్‌బాబు తీసుకుంటారు. మేధావిగా ఆయన సూచన చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుంది. మీకు ప్రతిపక్ష నేత హోదా లేదా? జీతభత్యాలు తీసుకుంటున్నారు. సభకు వచ్చి మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు చేసిన నేరం ఘోరం మీకు తెలుసు. అందుకే ముఖం చాటేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోడానికి బేషరంగా అబద్ధాలు చెప్పేవారిని ఊరిమీద వదిలి మమ్మల్ని లక్ష్యంగా చేసి మాట్లాడుతున్నరు’అని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు కేసీఆర్‌కు అప్పగిస్తే నీళ్లను ఎత్తిపోసి చూపిస్తామని కేటీఆర్ చేసిన సవాలుకు ప్రతిస్పందనగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసం పేరు, ఊరు మార్చి... ‘దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.38వేల కోట్ల అంచనాలతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. తెలంగాణ వచ్చిన ఏడాదిన్నర వరకు రూ.11,670 కోట్ల ఖర్చు చేశాక కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల వసూలుకు ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ ఆలోచనలు మారాయి. ఊరు, పేరు మార్చి, అంచనాలు పెంచి నిధులను కొల్లగొట్టాలని కేసీఆర్ స్కీమ్ వేస్తే ఆయన ఆలోచన తప్పని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 2015లో స్పష్టంగా చెప్పింది. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మిస్తే ఉండదు, వేమలపల్లి వద్ద నిర్మిస్తే పర్వాలేదు అని చెప్పింది. ఈ నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌లు, పంపులు, లిఫ్టులు కట్టదలిచినా అని ఆర్డర్ ఇచ్చారు. వాళ్లు నిపుణులు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కాదు. వాళ్లు రాజకీయాల్లో తిమ్మినిబమ్మి చేయడంలో నిపుణులు కావచ్చు. అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి ఎలక్షన్ కలెక్షన్లలో నిపుణులు. ఇందులో ముగ్గురికీ ఫస్ట్ ర్యాంక్ పంచాల్సి వస్తుంది. ఊరు, పేరు మార్చి రూ.38వేల కోట్ల ప్రాజెక్టు అంచనాలను రూ.81వేల కోట్లకు పెంచారు. అంచనా రూ.1.47 లక్షల కోట్లకు పెరగనుందని కాగ్ నివేదిక ఇచ్చింది. ఇంత తిన్నా డిజైన్, ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణలో నాణ్యత పాటించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తన మెదడును రంగరించి, 80వేల పుస్తకాలు చదివి కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసిన, ఇది నా బ్రెయిన్‌చైల్డ్ అని కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారు. నాటి గవర్నర్ నరసింహన్ అబద్ధాల రావుల మాటలు నమ్మి హరీశ్‌రావుకు కాళేశ్వరం రావు అని బిరుదు ఇచ్చారు’అని సీఎం ఎద్దేవా చేశారు. రెండు మూడేళ్లలో వేల కోట్ల కోసం ... ‘కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ 2019 జూన్ 21న ప్రారంభించాడు. యజ్ఞాలు యాగాలు చేసిండు. ఎన్ని చేసినా చిత్తం శువుడి మీద భక్తి చెప్పులపై ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంత సేపు ఎట్ల కొల్లగొట్టాలనే ఆలోచనతో హడావిడిగా ప్రారంభించాడు. ఏడాది తిరిగే లోపే మేడిగడ్డలో లోపాలన్నీ బయటపడ్డాయి. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమీషన్లు ఇచ్చాం. ఇంకా రిపేర్లు ఎవరు చేసుకుంట కూర్చుంటడు అని ఎల్అండ్టీ పట్టించుకోలేదు. రోజురోజుకి సమస్య పెద్దదై కుప్పకూలే పరిస్థితి వచ్చింది. సర్ ఆర్థర్ కాటన్ సర్వే చేసి బరాజ్‌లు కట్టడానికి ఇది సరైన ప్రాంతం కాదని ఆ రోజుల్లోనే నివేదిక ఇచ్చాడు. రెండు మూడేళ్లలో రూ.వేల కోట్లను సంపాదించుకోవాలని కేసీఆర్ హడావుడి చేశారు. భూపరీక్షలు చేయకుండానే ఇసుకలో బరాజ్‌లు కట్టారు. కట్టిన వెంటనే 100 శాతం సామర్థ్యంతో నీళ్లను నిల్వ చేయడంతో బరువు తట్టుకోలేక మేడిగడ్డ కుంగిపోయింది’అని సీఎం పేర్కొన్నారు. రేవంత్ మాటలు ఆయన మాటల్లోనే.. భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది.. ‘నాలుగు పిల్లర్లు పోతే ఏమవుతుందని కేసీఆర్ అంటాడు. వెన్నుపూసలో నాలుగు పూసలు దెబ్బతింటే మంచానికి పరిమితమై ఉండాల్సిందే. గోదావరి ప్రాజెక్టులకు వెన్నుపూస ‘మేడిగడ్డ’దెబ్బతింది. 80వేల పుస్తకాలు చదివిన మేధావి తొమ్మిదిన్నరేళ్లు కష్టపడి మూడేళ్లలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరమై కుప్పకూలింది. మళ్లీ ఇప్పుడు వారం రోజులు మాకు ఇవ్వండి.. తడాఖా చూపిస్తాం అంటుండు(కేటీఆర్). పోనీ ఆయనైనా(కేసీఆర్) వచ్చి అడిగిండా? ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్లందరినీ తోలుతుండు. ప్లానింగ్ డిజైనింగ్ నాణ్యత, నిర్వహణ లోపాలతోనే కుంగిందని ఎన్డీఎస్ఏ కమిటీ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. మొత్తం బరాజ్ దెబ్బతిన్నది, నీళ్లు నింపితే కుప్పకూలుతుంది. ఖాళీ చేయమని చెప్పింది. లేకుంటే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయి. యథాతథంగా బరాజ్‌ల గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోయాలని ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ చెప్పలేదు. మేడిగడ్డ తరహా టెక్నాలజీతోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. అక్కడా బుంగలు ఏర్పడ్డాయి. నీళ్లు ఆపితే బరాజ్‌లు కూలి కింద ఉన్న భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది. బాంబులతో పేలిస్తే భూమిలోకి పోతదా? బాంబులతో పేలిస్తే బరాజ్ గాల్లోకి లేస్తదా? భూమిలోకి పోతదా? మన మీద వేస్తడేమిటి? మీ నాన్న అవినీతికి బలైపోయింది. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పు అయితే, కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్, రూ.లక్ష కోట్ల ఆస్తులు; కేటీఆర్‌కు జన్వాడ, హరీశ్‌రావుకి మొయినాబాద్‌లో 50 ఎకరాల్లో, కవితకు శంకరపల్లిల్లో 25 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఎలా వచ్చాయి? కేసీఆర్ ఆగర్భ శ్రీమంతుడు ఎలా అవుతాడు? పత్రికలు, చానళ్లు, వ్యాపారాలు, బెంజీకార్లు ఎలా వస్తాయి? ఆ సూత్రం ఏదో చెప్తే మొత్తం తెలంగాణ బాగుపడ్తది. రూ.లక్ష కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టును నిలబెట్టుకోవాలని తాపత్రయం పడుతున్నం. కరువు వచ్చినప్పుడు పనికి వస్తుందని దూరదృష్టితో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండని ఒకాయన అంటాడు. ఎల్‌నినోతో నీళ్లే లేవు. వరద ఉధృతంగా వచ్చినప్పుడు 90 రోజుల్లో తరలించుకోవడానికి కట్టింది. వర్షాలు రానప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయాలని అల్లుడు (హరీశ్) అంటున్నడు. కనీస పరిజ్ఞానం ఉన్నోడు మాట్లాడే మాటలేనా? వర్షమే లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్..ఆర్థిక ఆగ్రవాదులు తొమ్మిదిన్నేర ఏళ్లు మీకు అప్పగిస్తే రూ.8.21లక్షల కోట్ల అప్పులు చేశారు. రూ.38వేల కోట్ల అంచనాలను రూ.1.47లక్షల కోట్లకు పెంచి, రూ.1.02 లక్షల కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించాక కట్టిన రెండేళ్లకే కాళేశ్వరం కూలిపోయి కూలేశ్వరమైంది. దీనిని నిర్వాకం కాదు విధ్వంసం అంటారు. ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఆర్థిక ఉగ్రవాదులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్. తెలంగాణ ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేశారు. అప్పుడే నేరాలన్నీ మాఫీ అయినట్టు వ్యవహరిస్తున్నారు. 15 ఆగస్టు, 26 జనవరికి తీవ్రమైన నేరాలు చేసిన వారికీ మార్పు వచ్చిందని క్షమాభిక్ష పెడుతుంటాం. వీళ్లు మారేటోళ్లు కాదు. తెలంగాణ ఉద్యమంలో ముసుగుతొడుక్కుని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి దోపిడీకే ప్రాధాన్యతనిచ్చారు. అని రేవంత్ పేర్కొన్నారు. ఉరివేయాలంటే నిబంధనలు అడ్డు బరాజ్‌లు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే రాత్రింబవళ్లు కూర్చుని చేపించేవాళ్లం. ఏం చేయలేని నిస్సాహాయస్థితిలో ఉన్నం. బాధ, కోపం ఉన్నాయి. రూ.లక్ష కోట్లుపెట్టింది ఇలా అయింది. నేరగాళ్లను శిక్షించ లేకపోతున్నాం. ప్రజలందరూ వీరిని ఉరితీయాలని కోరుకుంటే నియమనిబంధనలు అడ్డువస్తున్నాయి. కేంద్ర మంత్రి చెప్పినట్టు విచారణను సీబీఐకు అప్పగిస్తూ 2025 సెపె్టంబర్ 1న జీవో ఇస్తే ఇంకా చేపట్టలేదు అని సీఎం మండిపడ్డారు. మీరేందుకు మాట్లాడడం లేదు? ‘మీరేందుకు ధైర్యంగా మాట్లాడం లేదు. ఎందుకు ఘాటుగా తిప్పికొట్టలేకపోతున్నరు. 30 నెలల్లో చేయని పని ఏదైనా ఉందా? 15 నెలల్లో 67వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. హామీలన్నీ అమలు చేశాం. తెలంగాణలోని అన్ని కుటుంబాలకు రూ.5లక్షల ప్రమాద బీమా అమలు చేయబోతున్నాం’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. 10న మధిర నియోజకవర్గంలో రైతుభరోసా సభకు అందరూ రావాలని ఆహా్వనించారు. మరో రూ.1000 కోట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. -
మహోన్నత ప్రజానేత వైఎస్సార్: సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రజలే తన కుటుంబమని భావించి, వారి సంక్షేమమే పరమావధిగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత ప్రజా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జూలై 8న వైఎస్ జయంతిని పురస్కరించుకుని.. ఆయనను స్మరించుకున్నారు. నిరుపేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఆయన అమలు చేసిన అనేక పథకాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయని వివరించారు. ‘ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర.. ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు, సేవా తపనకు చిరస్మరణీయ నిదర్శనమని ప్రశంసించారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవల విస్తరణ, విద్యకు ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో వైఎస్ తీసుకున్న నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని అభివర్ణించారు. హైదరాబాద్ మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ వంటి కీలక మౌలిక వసతుల అభివృద్ధికి వైఎస్ తీసుకున్న నిర్ణయాలు.. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన విజన్, దూరదృష్టికి నిదర్శనాలని తెలిపారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు, ప్రజాసేవపై ఆయన అంకితభావం, మానవతా దృక్పథం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు.


