FSL అగ్నిప్రమాదంపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు | KTR Comments On CM Revanth Reddy Over Nampally FSL Fire Accident, More Details Inside | Sakshi
Sakshi News home page

FSL అగ్నిప్రమాదంపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Feb 8 2026 8:34 PM | Updated on Feb 9 2026 12:14 PM

Ktr Comments On Cm Revanth Reddy Over Fsl Fire Accident

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీలో అగ్నిప్రమాదం జరిగేలా కుట్ర జరిగిందన్నారు. 

ఎఫ్‌ఎస్‌ఎల్‌ అగ్నిప్రమాదం సీఎం రేవంత్‌ పనే. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండగా ఈ కుట్రలు. పక్కా ప్రణాళికతో ఆధారాలు మయం చేసేందుకు ఇలా చేశారు.

తాను తప్పించుకోవడానికి మిగతా కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా దెబ్బతినేలా చేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ తూతూ మంత్రంగా వివరణిచ్చారు. ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement