‘గత ప్రభుత్వం తప్పులనే కాంగ్రెస్ కొనసాగిస్తోంది’ | bjp telangana chief ramchander rao Takes On Congress Govt | Sakshi
Sakshi News home page

‘గత ప్రభుత్వం తప్పులనే కాంగ్రెస్ కొనసాగిస్తోంది’

Feb 8 2026 5:47 PM | Updated on Feb 8 2026 6:07 PM

bjp telangana chief ramchander rao Takes On Congress Govt

ఫైల్‌ఫోటో

నల్లగొండ: గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు. ఎస్సీ, బీసీ, రైతు, యువ డిక్లరేషన్లు ఏమయ్యాయని, ఆరోగ్యశ్రీ బకాయిలు,  రీయింబర్స్‌మెంట్‌, రైతు భరోసా రావడం లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ బహిరంగ సభలో రాంచందర్‌రావు ప్రసంగించారు. 

‘రేవంత్ రెడ్డి పేరు రేవంతొద్దీన్.  దేవాలయాలను, హిందూ దేవుళ్లను కాంగ్రెస్ అవమానిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. బీఆర్ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లే. బీఆర్‌ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే గెలిచినవాళ్లు పార్టీలు మారరు. జీతాలు ఇవ్వడానికి నిదులు లేవని రేవంత్‌ అంటున్నారు. జీతాలు, ఫించన్లు ఇవ్వడానికి నిధులు లేకపోతే రాష్ట్ర అభివృద్ధి ఎలా చేస్తావ్‌ రేవంత్‌.

జనాలపై పన్నుల భారం పెంచబోతున్నారు‌. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లేదు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ జెండా ఎగరబోతోంది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మంచినీటి సరఫరా, రోడ్లు సరిగా లేవు. నల్లగొండను స్మార్ట్ సిటీ చేస్తాం. కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది’ అని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement