bjp
-
హద్దులన్నీ దాటుతోంది
న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో సమాఖ్య పాలన భావనను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బరితెగించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తనకు ఇష్టమొచ్చినట్లు దర్యాప్తు చేయడం కోసం హద్దులను మీరి మరీ విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు రాష్ట్ర మద్యం రిటైలర్ సంస్థ అయిన ‘‘తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్)’’పై నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్ కేసు దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం గురువారం ఈడీపై ఆగ్రహ అక్షింతలు చల్లింది. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని, ఉన్నతాధికారులను ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి, భయపెడుతోందని తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ వేసిన పిటిషన్‌ను గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తిట్లతో తలంటు డీఎంకే సర్కార్, టాస్మాక్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీలు వాదించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు తిట్లతో తలంటు పోసింది. ‘‘ఒక ప్రభుత్వ కార్పొరేషన్ అనేది నేరం ఎలా చేయగలదు?. ఈడీ అన్ని చట్టబద్ధ హద్దులను దాటేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సమాఖ్య విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది’’అని సీజేఐ జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోందని, అందుకే వెంటనే దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెంటనే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కల్పించుకుని ‘‘దర్యాప్తును ఆపకండి. దాదాపు రూ.1,000 కోట్ల అక్రమాలు జరిగాయి. కనీసం ఈ ఒక్క కేసులోనైనా ఈడీ హద్దులు దాటలేదని భావించండి’’అని వేడుకున్నారు. రాజు వాదనలను కపిల్ సిబల్ తప్పుబట్టారు. ‘‘మద్యం దుకాణాల లైసెన్సుల జారీ అంతా సక్రమంగా ఉన్నాసరే అక్రమాలు జరిగాయని అనవసరంగా నేర విచారణను ఈడీ మొదలెట్టింది. 2014 ఏడాది నుంచి ఇప్పటిదాకా అక్రమంగా డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగి అన్యాయంగా టాస్మాక్ కార్యాలయాలపై చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తోంది. మహిళా అధికారులను గంటల తరబడి టాస్మాక్ ఆఫీసుల్లోనే నిర్బంధించి ఈడీ అధికారులు వేధించారు. వ్యక్తిగత వస్తువులను లాక్కుని గోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కల్గించారు’’అని సిబల్ వాదించారు. ఈడీ దర్యాప్తును సమర్థిస్తూ ఏప్రిల్ 23వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. రాష్ట్రాల హక్కులను కూలదోస్తోంది సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ సైతం తన వాదనలను బలంగా వినిపించింది. ‘‘ఈడీ ప్రవర్తన సమాఖ్య విధానాన్ని కూలదోసేలా ఉంది. రాష్ట్రాల హక్కులను ఈడీ కాలరాస్తోంది. తమ పరిధిలోని నేరాల విచారణ రాష్ట్రాలకు సంబంధించిన విషయంకాగా ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా, బలవంతంగా లాక్కుంటోంది’’అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈఏడాది మార్చి ఆరో తేదీ నుంచి మార్చి 8వ తేదీదాకా ఏకధాటిగా 60 గంటలపాటు రాష్ట్రంలో ఈడీ చేసిన సోదాలు, తనిఖీలు, దాడులు, జప్తుల పర్వానికి చట్టబద్ధత ఉందా? అని తమిళనాడు సర్కార్ ఈడీని సుప్రీంకోర్టులో నిలదీసింది. ‘‘మార్చి ఆరో తేదీన టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సోదాలు, జప్తులు చేశామని ఈడీ చెబుతోంది. కానీ టాస్మాక్ అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని సంస్థ. ఇప్పటిదాకా అక్రమంగా నమోదైన ఎఫ్ఐఆర్లలో ఏ ఒక్క దాంట్లోనూ టాస్మాక్ పేరును ‘నిందితుల జాబితా’లో పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేని, నిందితుల జాబితాలో లేని సంస్థ పరిధిలో, ప్రాంగణాల్లో ఈడీకి విచారణ, దర్యాప్తు చేసే హక్కు లేదు. పీఎంఎల్ఏ చట్టం సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది’’అని తమిళనాడు సర్కార్ కోర్టులో వాదించింది. ‘‘2021లో చివరిసారిగా ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంత ఆలస్యంగా సోదాలు చేయడమేంటి?. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం నమ్మశక్యమైన కారణాలు ఉంటేనే దర్యాప్తు/సోదాలు జరపాలి. కానీ ఈడీ ఈ నిబంధనను గాలికొదిలేసింది. సరైన లక్ష్యంలేకుండా రంగంలోకి దూకి అడ్డదిడ్డంగా దర్యాప్తు చేస్తోంది’’అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈడీని సుప్రీంకోర్టు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా కేసుల్లో పలు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈడీ వైఖరిని తప్పుబట్టాయి. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. బీజేపీకి చెంపదెబ్బ: సుప్రీంకోర్టు నిర్ణయంపై డీఎంకే వ్యాఖ్య టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు స్టే నిర్ణయం కేంద్రంలోని బీజేపీకి చెంపదెబ్బలా తగిలిందని తమిళనాడులోని పాలక డీఎంకే పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు డీఎంకే సీనియర్ నాయకుడు, పార్టీ కార్యదర్శి(వ్యవస్థాగతం) ఆర్ఎస్ భారతి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలో డీఎంకే సర్కార్ కొలువుతీరాక ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈడీని రంగంలోకి దింపారు. తాజాగా కోర్టు ఉత్తర్వులు చూశాకైనా బీజేపీ ఈడీని దుర్వినియోగం చేయడం మానుకుంటే మంచిది. తమిళనాడులో మరో 7–8 నెలల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈడీ సోదాలు చేసింది’’అని ఆర్ఎస్ భారతి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని విపక్ష పారీ్టలు సైతం స్వాగతించాయి. -
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటీవ్, నెగిటీవ్ అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. 👉పాజిటీవ్ అంశాలు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నానుసిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయిందిపహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయిరేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారుతెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారుఅయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.👉నెగిటీవ్ అంశాలు :ఉర్దూలో మాట్లాడకపోవడం.వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడంబీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదుఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.పాత ఇన్ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్‌ను పట్టించుకోలేదు.పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయింది.బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.👉అందరూ ఆశించిన విషయం:ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.👉సూచన:కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి,రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్‌గా పరిగణించండి’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్ఎస్ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం
యశవంతపుర(కర్ణాటక): మహిళను వివస్త్రను చేసి సహచరులతో అత్యాచారం చేయించారని బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్న, సహచరులు వసంత్, చెన్నకేశవ, కమల్‌పై అత్యాచారం కేసును ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు నమోదు చేశారు. 2023లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడారు. దీనితో పాటు అంటువ్యాధి సోకేలా వైరస్ ఇంజక్షన్ వేశారు. దీనివల్ల నాకు జబ్బు సోకిందని ఫిర్యాదులో తెలిపింది. పలు రకాలుగా అసభ్యంగా ప్రవర్తించారు అని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినదానిని ఏకరువు పెట్టారు. ఫిర్యాదులో ఏముంది? ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. నేను బీజేపీ మహిళ కార్యకర్తగా పని చేస్తున్నాను. మొదట రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయా, తరువాత జగదీశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తున్నా. 2023లో ఎ1 నిందితుడు మునిరత్న నాపై పీణ్య పోలీసులచే వ్యభిచారం కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తరువాత మునిరత్న సహచరులు, నిందితులు నందినిలేఔట్‌కు వసంత్, చన్నకేశవ, కమల్‌తో కలిసి ఆశ్రయనగరకు చెందిన సునీతబాయి ద్వారా నాపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్లో హత్యయత్నం కేసును నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు. 2023 జూన్ 11న నా ఇంటికి వచ్చి కేసులను మునిరత్న వాపస్ తీసుకొంటారని చెప్పారు. యశవంతపుర జేపీ పార్క్ వద్దనున్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని పిలుచుకెళ్లారు, ఆఫీసులో లైంగికదాడి చేశారు, తరువాత నా ముఖంపై మూత్రం పోశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికైనా చెబితే కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించి మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు అని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు విచారణ చేపట్టారు. -
బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్యాంగ్‌రేప్
యశవంతపుర: మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆర్ఎంసీ యార్డు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. తాను బీజేపీ కార్యకర్తనని, మాట వినలేదని చెప్పి మునిరత్న తనపై వ్యభిచారం సహా పలు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది. 2023 జూన్‌లో కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే అనుచరులు వసంత్, చెన్నకేశవ, కమల్ ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ముఖంపై మూత్రం పోసి, ప్రమాదకరమైన జబ్బు వైరస్‌ను ఎక్కించారని పేర్కొంది. కాగా, మునిరత్నపై ఇదివరకే కాంట్రాక్టర్లకు బెదిరింపులు, హనీట్రాప్ తదితర కేసులు ఉన్నాయి. అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించలేదు. -
‘అఖిలపక్షం వేళ’ అనైక్యత!
దేశం కోసం సమష్టిగా కదలాల్సిన సందర్భాల్లో సైతం కలవలేనంతగా అధికార విపక్షాలు ఎడ మొహం పెడమొహంగా మారాయి. పెహల్గామ్లో గత నెల 22న ఉగ్రవాదులు సాగించిన మారణ కాండ మొదలు మన ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్, ఈ నెల 10న కాల్పుల విరమణ, పాకిస్తాన్ దురాలోచనలూ వగైరా ప్రపంచానికి తెలియజెప్పేందుకు అధికార, విపక్ష ఎంపీలతో ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాల కూర్పు ప్రక్రియ వివాదాస్పదంగా మారటం దీన్ని చాటుతోంది. మన దేశంనుంచి సమష్టి స్వరం వినబడితే దాని ప్రభావం వేరుగా వుంటుంది. పాకిస్తాన్ సైతం ఇదే తరహాలో అఖిలపక్ష ప్రతినిధి బృందాలను పంపటానికి సన్నాహాలు చేసుకుంటున్నది. కనీసం ఇందుకోసమైనా విభేదాలు పక్కనబెట్టి ఒక్కటై నిలబడదామన్న స్పృహ అటూ ఇటూ కరువవుతోంది. ఏ దేశంలోనూ ఇలా వుండదు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీసీ)పై ఉగ్రదాడి మొదలు ఇందుకు ఎన్నయినా ఉదాహరణలివ్వొచ్చు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరుతో అమెరికా అఫ్గాన్‌ను వల్లకాడు చేసింది. చివరకు ఒరిగిందేమీ లేదు. అఫ్గాన్‌నుంచి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. అయినా అక్కడి విపక్షం మౌనంగా ఉండిపోయింది. కానీ ఇక్కడలా కాదు. యూపీఏ హయాంలో ముంబైపై ఉగ్రదాడి, దానికి వెనకాముందూ జరిగిన అనేకానేక ఉదంతాల్లో మన దేశంలో అధికార పక్షంపై విపక్షం విరుచుకుపడటం, యక్షప్రశ్నలు వేసి ఇరుకున పడేసే ప్రయత్నం చేయటం రివాజుగా మారింది. యూపీఏ హయాంలో బీజేపీ విపక్షంలోవుండి ఏం చేసేదో, ఇప్పుడు కాంగ్రెస్ సైతం ఆ పనే చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడి సమయంలో మరీ దారుణం. జవాన్ల త్యాగాలూ, వారు దెబ్బకు దెబ్బ తీసిన వైనమూ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారటం ఆశ్చర్యపరిచింది. ఈ ఉదంతాలను బీజేపీ తనకను కూలంగా మలుచుకునే ప్రయత్నం చేయగా, ప్రభుత్వ వైఫల్యంపై విపక్షం చాటింపు వేసింది. అయితే మన దేశంలోనూ ఒకప్పుడు అధికార, విపక్షాలు కలిసికట్టుగా పనిచేసిన ఉదంతాలు లేకపోలేదు. ఇందుకోసం ఎన్నడో 1971 నాటి భారత్–పాక్ యుద్ధం వరకూ పోనవసరం లేదు. 1994లో కశ్మీర్‌పై భారత్ వైఖరిని వివరించటానికి నాటి ప్రధాని పీవీ నరసింహారావు రూపొందించిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించింది అప్పటి విపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి! పాతికేళ్ల క్రితం కార్గిల్ యుద్ధ సమయంలో నాటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, కాంగ్రెస్‌తోసహా విపక్షాలూ దేశభద్రత కోసం కలిసికట్టుగా పనిచేశాయి. కానీ ఇప్పుడెందుకు పరస్పరం తప్పులు వెదుక్కొనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నట్టు? దేశంలో తక్షణం వచ్చే ఎన్నికలేమీ లేవు. అయినా పెహల్‌గామ్‌ను రాజకీయంగా వినియోగించుకోవటానికి అటూ ఇటూ పోటీపడుతున్నారు. త్రివిధ దళాల అధికార ప్రతినిధులు చెప్పేవరకూ ఆగకుండా ఇష్టానుసారం ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి, విపక్షాలను పాకిస్తాన్ అనుకూలురుగా, దేశద్రోహులుగా చూపటానికి బీజేపీ శ్రేణులూ, సాను భూతిపరులూ చేయని ప్రయత్నం లేదు. తొలి ప్రధాని నెహ్రూ ఉదారంగా పాకిస్తాన్‌కు నదీజలాలు, భారీయెత్తున సొమ్ము కట్టబెట్టారని బీజేపీ నేతలు ఇంకా ఆరోపణలు గుప్పిస్తూనే వున్నారు. ఒకపక్క అఖిలపక్షాన్ని పంపుతూ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? వీటిని ఎలా ఎదుర్కొనాలో తెలియక ఇష్టానుసారం మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చులకనవుతున్నారు. యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి... మనవైపు జరిగిన నష్టమెంత అంటూ రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఇవి అడగకూడని ప్రశ్నలేమీ కాదు... కానీ అందుకు తగిన వేదికను ఎంచుకోవాలని కూడా ఆయనకు తోచదు. ఇంతకూ అఖిలపక్ష బృందాల కూర్పుపై ఇంత వివాదం ఎందుకొచ్చినట్టు? విపక్షాలను విశ్వా సంలోకి తీసుకుని, వారు పంపిన పేర్లనుంచి ఎంపికచేసే కనీస మర్యాద అధికార పక్షం పాటించివుంటే సమస్య తలెత్తేది కాదు. విపక్షానికి ఆలోచించే శక్తిసామర్థ్యాలు లేవన్నట్టు సర్కారు ప్రవర్తించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు సభ్యుల పేర్లు పంపితే వారిలో ఒక్కరినే ఎంపిక చేసింది. పోనీ సర్కారు ఎంచుకున్నది కూడా సమర్థుల్నే కదా అనే సర్దుబాటు ధోరణి కాంగ్రెస్‌కు లేదు. అసలు ఆ పార్టీ నుంచి వెళ్లిన జాబితాలో సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, మనీష్ తివారీ తదితరుల పేర్లు ఎందుకు లేకుండా పోయినట్టు? సీనియర్ నేత ఖుర్షీద్‌ను ఎంపిక చేసిన ప్రభుత్వం తీరా ఆయన సీనియారి టీని కాదని జేడీ(యూ) నేత సంజయ్ ఝాకు సారథ్య బాధ్యతలు ఎందుకిచ్చినట్టు? సమష్టి స్వరం వినబడాల్సిన ఈ సమయంలో ఇన్ని లుకలుకలుండటం మంచిదేనా? ఇంత రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ చివరకు ఈ వివాదాన్ని పొడిగించదల్చుకోలేదని చేతులెత్తేసింది. కానీ ఎప్పుడూ వీరంగం వేసే అలవాటున్న తృణమూల్ మాత్రం ప్రభుత్వం ఎంపిక చేసిన సభ్యుణ్ణి తప్పుకోమని చెప్పింది. దాంతో ప్రభుత్వం తగ్గి ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ సూచించిన నేతకు స్థానం కల్పించింది. అఖిలపక్షం పంపటంలోని ఉద్దేశమే సమష్టితత్వాన్ని, ఈ దేశ సంకల్పాన్ని, పాకిస్తాన్ కుయుక్తులను చాటడానికైనప్పుడు సభ్యుల ఎంపిక వివాదాస్పదం కాకుండా ప్రభుత్వం చూడాల్సింది. ఈమధ్య ఆపరేషన్ సిందూర్ మొదలుకొని పార్టీ వైఖరికి భిన్నంగా పలు ప్రకటనలిస్తూ సంచలనం సృష్టిస్తున్న శశిథరూర్‌ను కాంగ్రెస్ ఎంపిక చేయకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన్ను ఏరికోరి ఎంపిక చేయటం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టడానికేనన్న విషయంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. ఏదేమైనా ఇలాంటి సంక్షోభ సమయాల్లో అవసరమైన సంయమనం, హుందాతనం ఇరువైపులా కనబడకపోవటం దురదృష్టకరం. -
కాంగ్రెస్ మిమ్మల్ని అవమానిస్తోందా?.. ఎంపీ శశి థరూర్ రియాక్షన్ ఇదే
ఢిల్లీ: ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష నేతల్లో కేంద్ర ప్రభుత్వం తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించుకున్నారు. తాను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజకీయ కోణంలో చూడడం లేదు. ఇది దేశానికి సేవ చేయాల్సిన సమయం’ అని స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ ఎంపికపై శశిథరూర్ స్పందించారు. ‘మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ అనుభవం కారణంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాను ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. కిరణ్ రిజిజు అడిగిన వెంటనే నేను అందుకు అంగీకరించాను. ఇది దేశ సేవకు సంబంధించింది. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరుడిని సహాయం కోరితే ఇంకేం సమాధానం ఇవ్వాలి?అని ప్రశ్నించారు. తాను తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ విషయం పార్టీకి, కేంద్రానికి సంబంధించింది. మీరు కాంగ్రెస్‌ను అడగాలి’ అని సూచించారు. పార్టీ మిమ్మల్ని అవమానించిందా? అన్న ప్రశ్నకు.. నన్ను అంత తేలికగా అవమానించలేరు. నా విలువ నాకు తెలుసని సమాధానమిచ్చారు. దేశంపై దాడి జరిగినప్పుడు, అందరం ఒకే స్వరం వినిపించడం, ఐక్యతగా నిలబడటం దేశానికి మంచిది. కేంద్రం ఆయనను దేశ ప్రతినిధిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఆర్మీపై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
జబల్పూర్: యావత్ భారతదేశం, ఆర్మీ ప్రధాని నరేంద్ర మోదీ పాదాల ముందు మోకరిల్లాయంటూ మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీశ్ దేవ్డా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోదీకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. మొత్తం దేశంతో పాటు మన సైన్యం ఆయన పాదాలకు నమస్కరిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం జబల్పూర్లో జరిగిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ శిక్షణా కార్యక్రమంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.జగదీశ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు సిగ్గు చేటు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ ఆ రాష్ట్ర మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతగల పదవుల్లో ఉండి దేశానికి రక్షణ కల్పిస్తున్న మహిళా అధికారుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, మరోసారి వివాదంలో బీజేపీ నేత చిక్కుకోవడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని జగదీష్ దేవ్డా మండిపడ్డారు. -
‘ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయం’
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆ రాష్ట్ర బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పట్నుంచో మమతా ప్రభుత్వం నాన్చుతూ వస్తున్న పెండింగ్ డీఏను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల విజయంగా బీజేపీ పేర్కొంది. ఈరోజు(శుక్రవారం) దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగుల 25 శాతం డీఏ బకాయిలను మూడు నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.దీనిపై వెస్ట్ బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి అమిత మాలవియా మాట్లాడుతూ.. ‘ ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయం. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా మమతా సర్కారు దీన్ని పట్టించుకోవడం లేదు. 17 వాయిదాలు, విచారణలో ఆటంకాల తర్వాత సుప్రీంకోర్టుల చివరకు తన తీర్పును వెల్లడించడం హర్షించదగ్గ విషయం. ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు, బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం. ఇది ఒక మైలురాయి లాంటి తీర్పు’ అని పేర్కొన్నారు.కాగా, 2022, మే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. -
‘రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదు’
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు చనిపోతే రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదని విమర్శించారు. ఈ రోజు(గురువారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘40 కేజీల వరి ధాన్యం బస్తా నుంచి 4 కేజీల తరుగు తీస్తున్నారు. 13 లక్షల క్వింటాళ్ల ధాన్యం తరుగు రూపంలో పక్కదారి పడుతుంది. 6 వేల కోట్ల రూపాయల తరుగు రూపంలో రైతుల నుంచే కొట్టేస్తున్నారు. ఇది ఎవరి ఖాతాల్లో చేరుతోంది. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లు లు ఎన్ని ?, బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లులకు మళ్ళీ ఎందుకు ధాన్యం పంపుతున్నారు ? ,గతంలో ధాన్యం తీసుకుని సీఎంఆర్(CMR)ఇవ్వని రైస్ మిల్లులకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం CBI తో దర్యాప్తు చేయించాలి. బీఆర్ఎస్ పాలనలో సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్, ఉత్తమ్... ఎందుకోసం విచారణ చేయడం లేదు ?’ అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. -
తేలని తెలంగాణ బీజేపీ గమనం
కాంగ్రెస్‌ను ‘కప్పల తక్కెడ’ అని విమర్శించే బీజేపీ (BJP), తెలంగాణ (Telangana) విభాగం పార్టీ అంతర్గత వివాదాల్లో కాంగ్రెస్‌ను మించింది. కమలంలో ఎన్ని పువ్వు రేఖలున్నాయో అంత కన్నా ఎక్కువ గ్రూపులున్నా యని పార్టీ వర్గాలే నర్మగర్భ వ్యాఖ్య చేస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితి! ఉన్న ఎని మిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో... అత్యధికులు పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి పోటీ పడేవారే! వీరిలో ఒకరంటే మరొకరికి పడదు.పార్టీ జాతీయ బాధ్యులు కుదించిన రెండు, మూడు పేర్ల జాబితాల్ని అధిష్ఠానానికి సమర్పించినట్టు సమాచారం. పోయినసారి ఎన్నికల్లోనే వెనుకబడిన వర్గాల (బీసీ) వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ నాయకత్వం, అదే ఒరవడిలో బలమైన బీసీ సామా జికవర్గాలను మచ్చిక చేసుకునే ‘సోషల్ ఇంజినీరింగ్’కు యత్నిస్తోంది. ముది రాజ్, మున్నూరు కాపు (బీసీ), మాదిగ (ఎస్సీ) సామాజికవర్గాలకు ప్రాధాన్యంతో ‘త్రీ–ఎమ్ ఫార్ములా’ను ముందుకు తోస్తోంది. మల్కాజ్గిరిఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ (కరీంనగర్) పేర్లను అధినాయకత్వం సీరి యస్‌గా పరిశీలిస్తోందని అంటున్నారు. ఒకరు ముది రాజ్ సామాజికవర్గానికి చెందితే మరొకరు మున్నూరు కాపు సామాజికవర్గం వారు. బండి సంజయ్ ఇది వరకు అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నందున ఈటల రాజేందర్ వైపు అధినాయకత్వం కొంత మొగ్గింది. పార్టీలో తరచూ రగిలే పాత (తొలి నుంచి పార్టీలో ఉన్న), కొత్త (ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన) నాయకుల మధ్య ఉండే స్పర్థ ఒక అడ్డంకిగా మారింది. పార్టీ పాత నాయకులు పలువురు ఈ ఆలోచనను వ్యతిరేకించారు. దానికి తోడు పార్టీ నియమావళి ప్రకారం పదిసార్లకు తగ్గకుండా సాధా రణ సభ్యుడిగా, కనీసం మూడు పర్యాయాలు క్రియా శీల సభ్యుడిగా ఉన్న వారిని మాత్రమే అధ్యక్షుడిగా నియమించాలని ఉంది. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్య క్షుడిగా అన్నామలైని నియమించే విషయంలో లోగడ ఇటువంటి అడ్డంకే వచ్చింది. ఆయన 2017లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. పార్టీ నియమావళిని సడలించడం, పాత నాయకులకు నచ్చ జెప్పడం ద్వారా అధిష్ఠానం ఒక నిర్ణయం చేయవచ్చు. అలా చేస్తుందా? అన్నది ప్రశ్న. పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ (సంస్థా గత వ్యవహారాలు), సునీల్ బన్సల్ (రాష్ట్ర ఇంచార్జీ) వారివైన నివేదికలు పై వారికి (మోదీ–షా ద్వయం) ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, ఒక్క రాష్ట్రాధ్యక్ష ఎన్నిక మినహా దాదాపు పూర్తయింది. మండల, జిల్లా స్థాయి అధ్యక్షులు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు ఎన్నికై రెండు, మూడు మాసాలవుతున్నా... రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో ముడివడి ఉండటం వల్ల జిల్లా కమిటీలు ఏర్పాటు కాలేదు.మండల స్థాయి కమిటీలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే సంస్థా గతంగా బలోపేతం చేసి, గ్రామ స్థాయి వరకు పార్టీని పటిçష్ఠపరచి, స్థానిక సంస్థలకు సమాయత్తం చేయడా నికి వీలవుతుంది. అన్ని స్థాయిల్లో మూడోవంతు మహిళలుండాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమి టీల్లోనూ ‘త్రీ ఎమ్ ఫార్ములా’కు ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రాధ్యక్ష నియామకపు చిక్కుముడి వీడితే ఈ అన్నీ ఓ కొలిక్కివస్తాయి.అంచనాల స్థాయిలో బీఆర్ఎస్ రాష్ట్రంలో పుంజు కోవట్లేదని భావిస్తున్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్నాయి. నిజంగానే ప్రజలు ఆ దిశలో ఆలోచించినా... ఆ పరిస్థితిని సానుకూలంగా మలచుకునే స్థితిలో పార్టీ లేదని బీజేపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ‘త్రీ ఎమ్ ఫార్ములా’లో భాగమైన మాదిగలను ఆకట్టుకో వడానికి గత ఎన్నికల్లోనే మంద కృష్ణ మాది గను అక్కున చేర్చుకొని ప్రధాని మోదీ ఎస్సీ వర్గీక రణకు సానుకూలత ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా, సదరు బాధ్యతను రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో ఆ మేర చట్టం తీసుకురావడం జరిగిపోయాయి.పార్టీని గెలిపిస్తే బీసీని సీఎంగా చేస్తామని ఎన్ని కల ప్రకటన చేస్తూ, సరిగ్గా ఎన్నికల ముందు బీసీ రాష్ట్రాధ్యక్షుడిని కారణం చెప్పకుండా అధిష్ఠానం పక్కకు తప్పించడాన్ని ఇప్పటికీ తప్పుబట్టేవారు పార్టీలో ఉన్నారు. అదే సమయంలో, నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీని నివారించి బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసి, ఏడాది తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ముఖాముఖి తలపడి ఆధిక్యత తీసుకోవడం పార్టీ వ్యూహమని,అందుకే అలా చేశారని చెప్పేవాళ్లూ ఉన్నారు. వ్యూహాలు ఎత్తుగడల సంగతెలా ఉన్నా... ఢిల్లీ నాయ కత్వం స్థాయిలో రాష్ట్ర పార్టీ పని చేయటం లేదనే భావన బలంగా ఉంది. పార్లమెంటు కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం పెట్టి ప్రధాని మోదీ మందలించిన తర్వాత రాష్ట్ర ఇంచార్జీ బన్సల్ మందలించింది కూడా అందుకే! ‘గోడమీద రాతల నుంచి చిన్న పోస్టర్ అతికించడం వరకు... అన్నీ డబ్బుమయం అయిపోయాయి తప్ప తెలంగాణలో ఆశించన ఫలితాలు రావట్లేద’ని ఆయన మండిపడటం వెనుక ఎంత నిజముందో పార్టీ రాష్ట్ర నాయకత్వం బేరీజు వేసుకోవాలి.-దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు: NVSS ప్రభాకర్
-
కాలుష్య భూతంపై ‘వారుణాస్త్రం’!.. ఢిల్లీలో రూ. 3 కోట్లతో మేఘమథనం
ఢిల్లీ: చినుకు కోసం మేఘాలను చిలకబోతోంది దేశ రాజధాని ఢిల్లీ నగరం. కాలుష్య రక్కసిని సంహరించడానికి వరుణుడినే ఓ అస్త్రంగా సంధించబోతోంది. సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో ఢిల్లీ నగరం కాలుష్య భూతంతో పోరాటానికి సిద్ధమవుతోంది. ఢిల్లీలో ఈ నెలాఖరు నుంచి ఐదు ప్రదేశాల్లో మేఘమథనం ట్రయల్స్ నిర్వహించనున్నారు.మేఘాలు, తేమ ఆధారంగా ఆ ఐదు ప్రాంతాలను అప్పటికప్పుడు నిర్ణయిస్తారు. సరైన తేమ ఉంటేనే మేఘాలు వర్షిస్తాయి. అందుకే అనువైన మేఘాలు, సరిపోను తేమ వంటి అంశాలను గమనించి ఆ ఐదు ప్రదేశాలను ఎంపిక చేయనున్నారు. భద్రతా కారణాల రీత్యా లుట్యెన్స్ ఢిల్లీ, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతాలను మేఘమథనం నుంచి మినహాయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.కాన్పూర్ ఐఐటీ సాంకేతిక సహకారంతో ఢిల్లీ శివార్లలో అమలయ్యే ఈ ప్రాజెక్టు వ్యయం రూ.3.21 కోట్లు. 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో కృత్రిమ వర్షం తొలి ట్రయల్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రయోగం వ్యవధి గంట నుంచి గంటన్నర. వేర్వేరు రోజుల్లో జరపనున్న ఈ మేఘమథనం కోసం 13 కేంద్ర, రాష్ట్ర (ఢిల్లీ) ప్రభుత్వ సంస్థల నుంచి లాంఛనపరమైన అనుమతులు లభించాల్సివుంది. ఢిల్లీలో కృత్రిమ వాన కురిపించాలనే ప్రతిపాదనలు తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2023 శీతాకాలంలో ఈ ప్రతిపాదనను ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవంటూ ఆ కార్యక్రమాన్ని అప్పట్లో అది విరమించుకుంది.నిరుడు శీతాకాలంలోనూ మేఘమథనం కోసం ‘ఆప్’ సర్కారు పాకులాడింది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదంటూ ఆ ప్రయత్నం నుంచి మరోమారు వెనక్కు తగ్గింది. ఈ ప్రయోగంలో వర్షించడానికి అనుకూలమైన, సరిపోను తేమ గల మేఘాల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తారు. వాటిని గుర్తించాక సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ (ఉప్పు), డ్రై ఐస్ (ఘనీకృత కార్బన్ డై ఆక్సైడ్) వంటి రసాయన పదార్థాలను విమానంలో తీసుకెళ్లి ఆ మేఘాలపై చల్లుతారు. అలా మేఘాలు వర్షిస్తాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి పలు దేశాల్లో ఇలాంటి ‘స్వల్పకాలిక’ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వీటితో ఉపయోగమెంత అనేది ఓ చర్చనీయాశంగానే మిగిలింది! - జమ్ముల శ్రీకాంత్ -
BRS Vs BJP మాటల యుద్ధం
-
నువ్వు ముదిరాజ్వా.. రెడ్డివా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను బీసీ బిడ్డగా ఎవరూ ఆమోదించడం లేదని, ఆయన అసలు ము దిరాజ్ కులానికి చెందిన వారో, లేక రెడ్డి కులానికి చెందిన వారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అనుభవమున్న నాయకుడు రాజేందర్‌కు ఇంత దిగజారుడు తనం ఎందుకో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఇష్టారాజ్యంగా మాట్లాడడం తగదని, ఇక ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరించారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, పీసీసీ నేతలు ఈర్ల కొమురయ్య, సలీం, గజ్జి భాస్కర్, ఇందిరా శోభన్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ.. ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం లేదనే నిస్పృహలో ఉన్నారని, అందుకే కిషన్‌రెడ్డిపై ఉన్న ఆక్రోశాన్ని రేవంత్‌పై వెళ్లగక్కుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలన లోని అలీబాబా 40 దొంగల్లో ఈటల కూడా ఒక సభ్యుడని, రాష్ట్రం అప్పుల పా లు కావడానికి కేసీఆర్‌తో పాటు ఈటల నిర్వాకం కూడా కారణమని పేర్కొన్నా రు. దద్దమ్మగా ఉన్న ఈటలను అప్పుడు బీఆర్ఎస్ నుంచి తంతే వెళ్లి బీజేపీలో ప డ్డారని, మళ్లీ ఇప్పుడు అక్కడ ఇమడలేక కేసీఆర్‌వైపు చూస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. సీఎంను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, తాము ఒక్క విజిలేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తారో తెలియదని అ న్నారు. కేటీఆర్ బాణిలోనే రాజేందర్ మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతోంది కిషన్‌రెడ్డి, రాజేందర్ గ్యాంగేనని మండిపడ్డారు. -
‘కగార్’పై జనాంతిక ఆలోచనలు
కొన్ని విషయాలు సున్నితంగా ఉంటాయి. విషయాలు పూర్తి బహిరంగమైనవే. అందు గురించిన చర్చలు హోరాహోరీగా సాగినవే. కానీ పరిస్థితులు ఒక దశ నుంచి ఒకానొక దశకు మారినపుడు అంతా సున్నితం అవు తుంది. ‘ఆపరేషన్ కగార్’ సందర్భంగా ఆపరేషన్ విషయాలు కాదుగానీ నక్సలైట్ల గురించి, నక్సలిజం గురించిన చర్చ సున్నితంగా మారింది. పక్షం రోజులకు పైగా సాగుతున్న కర్రె గుట్టల ఉదంతం, ఎప్పటినుంచో జరుగుతున్న ఆ చర్చకు ఒక తక్షణ లక్షణాన్ని తీసుకు వచ్చింది. ఇది సున్నితం కావటానికి కారణం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన ‘ఆపరేషన్’ను ఒక భీషణ సమరంగా మార్చటం కాదు. అందుకు నేపథ్య పరిస్థితులు ఇదమిత్థంగా ఫలానా అప్పటి నుంచి మొదలయ్యాయని చెప్పలేముగానీ, సుమారు మూడు దశాబ్దాలుగా కావచ్చు. అవి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక మాత్రం తీవ్రం కావటం మొదలైంది.ప్రస్తుత ప్రభుత్వం తన నక్సలైట్ వ్యతిరేక చర్యలకు ‘ఆపరేషన్ కగార్’ అనే పేరు పెట్టింది. ‘కగార్’ అనే హిందీ మాటకు నిఘంటు అర్థం ‘అంచు’ లేదా ‘చివరి స్థితి’, ‘చివరి దశ’ అని. రాజకీయ అర్థం ‘అంతిమ దాడి’ అని! ఇది ఇతరుల నిర్వచనం కాదు. నక్సలైట్లను, నక్సలిజాన్ని 2026 మార్చ్ చివరి నాటికి అంతం చేసి తీరగలమని హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటిస్తున్నారు. అది సాధ్యమా కాదా అన్నది కాదు ఇక్కడ చేస్తున్న ఆలోచన. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని, సుమారు 57 సంవత్సరాలుగా సాగుతున్న నక్సలైట్ ఉద్యమాన్ని పలువురు సమీక్షిస్తుండవచ్చు. అందులో భాగంగా, పైన ప్రస్తావించిన ఇటీవలి మూడు దశాబ్దాల కాలాన్ని కూడా. అంటే నక్సలిజం బలహీనపడుతూ వస్తున్న మూడు దశాబ్దాలను!ఎముకలు మెడలో వేసుకోని కాంగ్రెస్సూటిగా చెప్పుకోవాలంటే, మొదటి సగకాలం బలంగా సాగిన ఉద్యమం, తర్వాత సగకాలం నుంచి బలహీనపడుతూ వస్తున్నది. ఆ బలహీనతలు నాలుగు విధాలు. ఒకటి – సైద్ధాంతికంగా. రెండు – నాయకత్వ పరంగా. మూడు – ఉద్యమ నిర్వహణలో. నాలుగు – జనాదరణ విషయమై! ప్రభుత్వ అణచివేతలు ఎప్పుడూ ఉన్నవే. అణచివేతకు ఆరంభం తెలంగాణ రైతాంగ పోరాట కాలంలోనే జరిగినపుడు నక్స లిజం తర్వాతి కాలంలో అంతకు భిన్నంగా ఉండగల ఆస్కారమే లేదు. పైగా 1948కి 1968కి మధ్యకాలం 20 సంవత్సరాలు మాత్రమే. అప్పటినుంచి మరో 20 ఏండ్లు గడిచేసరికి నక్సలైట్ ఉద్యమ క్షీణతకు అంకురార్పణ జరిగింది. గమనించదగినదేమంటే, ఆ కాలమంతా పాలించింది బీజేపీ కాదు... కాంగ్రెస్. కొన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం రాసుకుని, చట్టాలు చేసుకుని, ప్రణాళికలు రూపొందించుకుని, ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించుకున్నప్పటి నుంచి అన్నీ కపటమైన రీతిలో అరకొరగానే అమలయ్యాయి. అందుకే 1947 నుంచి 20 ఏండ్లయే సరికి నక్సలైట్లు అవతారమెత్తారు. అన్ని మలుపులూ 20–20–20 గానే కనిపిస్తు న్నాయి. అదొక విచిత్రం. ‘ఆపరేషన్ కగార్’ తరహా మాటలను కాంగ్రెస్ ఉపయోగించ లేదు, బీజేపీ ఉపయోగిస్తున్నది. చేతలు అవే, మాటలు వేరు. మాటలు వేరవటానికి మంచి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్‌కు 1885 నుంచి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అందులో సామాజిక సమ్మిళితత్వం, ఉదారవాద మధ్యే మార్గం, కొంత అభ్యుదయ ధోరణి, దేశ వ్యాప్తమైన జాతీయత వంటివి ఉన్నాయి. అవి కాలం గడిచినకొద్దీ బలహీనపడుతూ అనేక అవలక్షణాలు ప్రవేశించినా, కనీసం ఎము కలను మెడలో వేసుకునే ధోరణి ఇంకా రాలేదు. ఆ కారణంగా, నక్సలిజం వెనుక పేదరికం ఉన్నమాట నిజమనీ, అది కేవలం శాంతి భద్రతల సమస్య కాదనీ, పేదల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయ గలమనీ మాటలు, ప్రకటనల రూపంలో చెప్పటం ఎన్నడూ మాన లేదు. అణచివేతలకు సాయుధబలాల ఉపయోగమైతే యథావిధిగా సాగించారు గాని, ‘కగార్’ తరహా ‘అంతిమ దాడి’ అనకుండా జాగ్రత్తపడ్డారు. పౌరహక్కుల సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసినా, వారికి ‘అర్బన్ నక్సల్స్’ అనే ముద్ర వేయలేదు.నాగరిక, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలలో ఉదారవాద, ప్రగతిశీల భావనల సంప్రదాయం గురించి తెలిసిందే. ముఖ్యంగా రినైజాన్స్, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, బ్రిటన్‌లో రాజ్యాంగ ఆవిర్భావ కాలాల నుంచి ఉన్నత తరగతులపై, మధ్యతరగతిపై ఈ ప్రభావాలు మొదలయ్యాయి. ఈ వర్గాలు ప్రగతిశీలమైనవేగానీ, వ్యవస్థలో సంస్కరణలను కోరటం మినహా వ్యవస్థలను కూలదోయా లనేవి కావు. ఆ పరిమితులను తెలిసినందువల్లనే ఇక్కడ పౌర హక్కుల సంస్థల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం ఒక మేర గౌరవించటం, ఒకోసారి వారిని సంప్రదించటం చేస్తుండేవి. ఆ ధోరణి గత పదేళ్లుగా ఎట్లా మారిందో కనిపిస్తున్నదే. ఇది అంతి మంగా వ్యవస్థకు మేలు చేసేది కాదని ప్రభుత్వం గ్రహించవలసిందే తప్ప ఎవరూ చెప్పగల స్థితి కనిపించటం లేదు.మారిన సమాజ ధోరణులుఉద్యమాలకు ఎగుడు దిగుడులు సహజమేగానీ, నక్సలైట్ ఉద్యమం పైన చెప్పిన నాలుగు బలహీనతలలో దేని నుంచి కూడా నిజమైన అర్థంలో బయటకు రాలేక పోయింది. లేనట్లయితే, వారు కర్రె గుట్టల సందర్భంలో ఈ విధంగా చిక్కుకు పోవటం, చర్చల కోసం పది రోజుల్లో నాలుగుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరటం, పౌర హక్కుల సంస్థలను కదలించేందుకు ఇంతగా ప్రయత్నించటం వంటి పరిస్థితులు ఏర్పడేవి కావు. ఇంత జరుగుతున్నా సమాజం నుంచి ఒకప్పటివలె స్పందనలు లేవు. ప్రస్తుత తరాలు వివిధ కారణాల వల్ల మారిపోయాయి. వారి దృష్టి ఇప్పుడు తమ కెరీర్‌పై, ఇతర అంశాలపై ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒకప్పుడు ఉద్యమానికి పెద్ద బలం. ఇపుడు కొద్ది ప్రాంతాలలోని కొంతమంది ఆదివాసీలు మాత్రం స్థానిక పరి స్థితులనుబట్టి నక్సలైట్లతో కదులుతున్నారు. స్వయంగా ఆదివాసీలైన ప్రజాప్రతినిధులు గతంలో కన్నా ఎక్కువగా స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల వెంట ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వెనుకటి తరాలకు ఉద్యమం పట్ల గురి తప్పి నిరాశ ఏర్పడగా, కొత్త తరాలకు ఒక అగాథం వచ్చి కొత్త ప్రపంచంలో తమ జీవితాలను వెతుక్కుంటున్నారు. ఒకపుడు మధ్యతరగతిలో గణనీయమైన భాగానికి ఆదర్శవాదాలు ఉండేవి. అది సోవియెట్ యూనియన్‌కు, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు, విప్లవకారులకు, సాహిత్య–కళాకార్యకలాపా లకు పచ్చని కాలం. ఆ తరహా మధ్యతరగతి ఇపుడు పిడికెడుగా మిగిలింది. వామ పక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.నక్సలైట్లకు కొత్త రిక్రూట్మెంట్లు తగ్గటం ఎప్పటినుంచో ఉన్నది. ఎన్కౌంటర్లలో ఒకపుడు ఒకరు చనిపోయినా వార్తలు, ప్రజలలో చర్చలు ఉండేవి. ఇపుడు చాలామంది చనిపోవటం వరుసగా జరిగితే తప్ప వార్తలు, చర్చలు కనిపించటం లేదు. మరొకవైపు సిద్ధాంతాలు, పోరాట పద్ధతులు, సంస్థ నిర్మాణాలు, నాయకత్వాలు ప్రస్తుత ఆధునికమైన, బలమైన ప్రభుత్వ వ్యవస్థలను ఎదుర్కొనగల విధంగా ఉన్నాయనే అభిప్రాయం వారి సానుభూతిపరులలోనైనా ఉందా అన్నది అనుమానమే. పౌరహక్కుల సంఘాల స్పందనలు సైతం స్వీయ సంశయాల మధ్య మందకొడిగానే కనిపిస్తున్నాయి. నక్సలైట్లు, నక్స లిజం భవిష్యత్తు అగమ్యగోచరం కావటానికి వెనుక ఈ పరిస్థితులు, దీర్ఘకాలిక పరిణామాలు అన్నీ ఉన్నాయి.విషయాన్ని జనాంతికంగా చర్చించుకోవటం ఎందుకంటే, ఒక వైపు పేదరికం, పీడన కొనసాగుదల, ధనిక–పేద తారతమ్యాల పెరుగుదల అనే వాస్తవ స్థితి ఎంత కనిపిస్తున్నదో, ఆ పరిస్థితులను మార్చే సంస్కరణల కోసం లేదా కొత్త వ్యవస్థ ఆవిష్కరణ కోసమని చెప్పేవారు విఫలం కావటం కూడా అంత కనిపిస్తున్నది. ఈ విష యాలు ముఖ్యంగా ‘కగార్’ వంటి సందర్భంలో దాపరికం లేకుండా మాట్లాడటం సున్నితమైనదే!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. -
సీఎం రేవంత్ చేతులెత్తేశారా?.. బండి సంజయ్ కౌంటర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితేంటి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి అధైర్యం నింపుతారా? అంటూ నిలదీశారు. రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికలకు ముందే తెలుసా కదా?. అప్పుల గురించి తెలిసే హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు.ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ రాసిచ్చారు. రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయింది’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.మంగళవారం.. ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగస్థులు, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏలకు డబ్బుల్లేవంటున్నాడు సీఎం. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అన్నీ హుళక్కే ఇక. ఓట్లు వేసి గెలిపించారు ఇక మీ కర్మ. మేమైతే ఏం చేయలేమని ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండు...కేసీఆర్ అప్పులు చేశాడని చెప్పిన మీరు... తాము వస్తే అంతా బాగుంటుందని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. రేపట్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. కేంద్ర మంత్రులు, ప్రధాని వచ్చినప్పుడు సాయం చేస్తున్నారని మాట్లాడే కాంగ్రెస్ నాయకులే.. మళ్లీ ఆ తర్వాత కేంద్రం ఏం చేయడం లేదని రాజకీయాలు చేస్తారు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. -
ఎవరీ బీజేపీ లీడర్?..భద్రతా దళాలతో మంచులో రన్నింగ్! వీడియో వైరల్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు భద్రతా సిబ్బందితో మంచులో పరుగెడుతూ దాని వెనుక బ్యాక్ గ్రౌండ్లో ఓ బాలీవుడ్ సాంగ్ ప్లే అవుతున్న వీడియో ఇప్పుడు విశేషంగా వార్తల్లో నిలిచింది.ఎవరీ బీజేపీ లీడర్?రవీందర్ రైనా.. బీజేపీలో సీనియర్ నాయకుడు. జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే ఈయన. అయితే ఎప్పుడు వార్తల్లో పెద్దగా కనిపించని రవీందర్ రైనా.. ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఒక బృదం భద్రతా బలగాల్ని వెంట బెట్టుకుని ఆయన కూడా మంచులో పరుగెడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది వైరల్ గా మారింది.#JaiHind 🇮🇳🔥🔥🔥 pic.twitter.com/vH4XYKkrpI— Ravinder Raina (@RavinderRaina) May 4, 2025 మండిపడ్డ కాంగ్రెస్‌దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భద్రతా బలగాల్ని ఈ తరహాలో ఉపయోగించుకుంటారా అంటూ మండిపడింది. ఈ వీడియోపై సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినాతే ధ్వజమెత్తారు. పహల్గామ్ దాడి తర్వాత దేశం అంతా తీవ్ర శోకంలో ఉంటే ఇలా చేయడం సమంజసం కాదంటూ విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కొంతమంది తన కుమారుల్ని కోల్పోగా, మరికొంతమంది తల్లిదండ్రుల్ని, పలువురు భర్తల్ని కోల్పోయారు. మరి ఈయన అయితే మంచి రిథమ్ లో ఉన్నారు. రీల్స్ షూటింగ్ చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన చర్య’ అంటూ మండి పడ్డారు. -
కులగణన వద్దు? బీజేపీ యూ టర్న్ పై కాంగ్రెస్ రియాక్షన్..
-
‘టైమ్ పాస్ మీటింగ్‌లతో అలసిపోయాం’
హైదరాబాద్: ఇటీవల రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీకే చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి ధ్వజమెత్తారు. ఇప్పటికే టైమ్ పాస్ మీటింగ్ లతో అలసిపోయామని, తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని త్వరగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంచితే, రేపు( ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కులగణనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ తరుణంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్యనీయాంశంగా మారాయి.కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని గత నెలలో రాజాసింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కచ్చితంగా బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా స్పందించింది. దీనిలో రాజాసింగ్ ఒకవైపు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటూనే , రాష్ట్రంలోని నాయకత్వం సరిగా లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు.హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ గౌతంరావును అభ్యర్థిత్వాన్ని తొలుత నిరాకరించారు రాజాసింగ్. అయితే కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ చొరవతో రాజాసింగ్ కాస్త దిగివచ్చారు. పార్టీ లైన్ లోనే పనిచేస్తానని బండి సంజయ్ కు హామీ ఇచ్చారు. అయితే మరొకసారి రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటో కీలక నేతలకు అర్థం కావడం లేదు. -
రేవంత్ సర్కార్‌కు కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: కుల గణనపై చర్చకు సిద్ధమంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సర్కార్ చేసింది కుల గణన కాదని.. కుల సర్వే మాత్రమే చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సర్వే కూడా తూతూ మంత్రంగా చేశారు. మేము ఎప్పుడు కుల గణనను వ్యతిరేకించలేదు. బీసీలకి న్యాయం జరిగేలా సరైన గణన చేయాలని కోరాం’ అని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.‘‘ముస్లింలను బీసీలలో కలిపి అసలైన బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పాం. దేశంలో స్వాతంత్య్రం వచ్చాక కుల గణన చేస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీది. 90 శాతం జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనలో మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో ఎన్డీయే హయాంలో రోడ్ల కనెక్టివిటీ బాగా పెరిగింది. తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల్లో రోడ్ల నిర్మాణం జరిగింది. హైవే రోడ్లకు కనెక్టివిటీ చేయడం జరిగింది. 2014 తెలంగాణలో 2500 కిలో మీటర్ల జాతీయ రహదారులుంటే ఇవాళ 5200 కిలోమీటర్ల జాతీయ రహదారులు పెరిగాయి’’ అని కిషన్‌రెడ్డి వివరించారు.‘‘కేంద్ర ప్రభుత్వం 1 లక్ష 20 కోట్ల నిధులను కేవలం రోడ్ల నిర్మాణంపై ఖర్చు చేస్తోంది. హైదరాబాద్‌కు అన్ని వైపుల అత్యాధునికంగా, అన్ని సౌకర్యాలతో జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ఫోన్ లైన్ ఎలివేటెడ్ హైవే ప్రతిపాదనలో ఉంది. భూసేకరణ కాకపోవడం వల్ల రహదారుల నిర్మాణం నత్తనడకన జరుగుతున్నాయి. జాతీయ రహదారులకు కావలసిన ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా పనులు పూర్తవుతాయి. 6వేల కోట్ల నిధులతో తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ క్యారిడార్ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి.5 కారిడార్లకు లక్ష కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో రూ. 5416 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్ రెండు చోట్ల వివిధ జాతీయ రహదారులకు భూమి పూజ చేయనున్నారు. ఆదిలాబాద్‌లో కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద 5 ప్రాజెక్ట్ లు, హైదరాబాద్‌లో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లై ఓవర్, అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తారు. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగే సభలో ప్రసంగిస్తారు’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు. -
సింహాచలం దుర్ఘటనపై బీజేపీ ధార్మిక సెల్ కో కన్వీనర్ ఫణీంద్ర ఫైర్
-
‘శశి థరూర్ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’
తిరువనంతపురం: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఓడరేవును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఇవాళ శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు. కొందరికి ఇది నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది’’ అంటూ మోదీ చురకలు అంటించారు. కేరళ సీఎం విజయన్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని.. శశి థరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా.. నా నియోజకవర్గానికి వచ్చిన మోదీని సాదరంగా స్వాగతించా’’ అంటూ శశి థరూర్ ట్వీట్ కూడా చేశారు.శశిథరూర్ గత కొన్ని నెలలుగా తన సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న తెలిసిందే. ఇటీవల ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ కూడా ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ ఆయన ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా, భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు.. సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. -
చివరకు కులగణన వైపే మొగ్గు
కులగణన ప్రతిపాదనపై గత కొన్నేళ్లుగా కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు తన వైఖరి మార్చుకుంది. వచ్చే జనగణనతోపాటే కులగణన కూడా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ బుధవారం నిర్ణయించటం దేశ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అయితే ఇప్పటికే అయిదేళ్లుగా వాయిదా పడుతూవస్తున్న జనగణన ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశంలో స్పష్టత లేదు. స్వాతంత్య్రానంతరం అణగారిన కులాలు సైతం విద్యావకాశాలను అందుకోవటం, ఉన్నతోద్యోగాలు సాధించటం వంటి పరిణామాల కారణంగా ఆ వర్గాల్లో చైతన్యం పెరిగింది. జనాభా దామాషా ప్రాతిపదికన అవకాశాలు దక్కటం లేదన్న అసంతృప్తి ఎక్కువైంది. అందుకే కులగణన జరపాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. దేశంలో దీన్ని మొట్టమొదట స్వాగతించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2021లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కులగణన జరపాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానంచేసి పంపింది. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వేగవంతంగా, శాస్త్రీయంగా కులగణన నిర్వహించారు. బిహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సైతం కులగణన చేశాయి. అయితే బీజేపీ మొదటినుంచీ ఈ డిమాండును వ్యతిరేకించింది. 2021 జులై 20 నాడు పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన ఆనాటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ‘జనగణనలో ఎప్పటిలా ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా లెక్కల సేకరణ మినహా ఇతర కులాల లెక్కింపు జరపరాదన్నది కేంద్రప్రభుత్వ విధానపరమైన నిర్ణయం’ అని ప్రకటించారు. బయట ఎక్కడా నేరుగా కులగణనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ప్రకటనలు చేయకపోయినా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయటానికి కాంగ్రెస్ కులాన్ని ఉపయోగించుకుంటున్నదని విమర్శించేవారు. మొన్నటికి మొన్న పహల్గామ్లో ఉగ్రవాదులు నావికాదళ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను మతం ఏమిటో కనుక్కుని కాల్చిచంపటాన్ని ప్రస్తావించి ‘వారడిగింది మతం... కులంకాదు’ అని ఛత్తీస్‌గఢ్ బీజేపీ ట్వీట్ చేసింది. అయితే కులగణన చేయటమే సరైందని ఆరెస్సెస్ భావిస్తున్నదని రెండు నెలల క్రితం ఒక ఆంగ్లపత్రిక వెల్లడించినప్పటినుంచీ దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా జరిగితే దేశంలో దాదాపు వందేళ్ల తర్వాత ఆ ప్రక్రియ మళ్లీ అమల్లోకొచ్చినట్టవుతుంది. ఆఖరుసారి వలస పాలకుల హయాంలో 1931లో కులాలవారీ జనాభా లెక్కేశారు. అప్పట్లో 4,147 కులాలున్నట్టు తేల్చారు. 1901లో ఈ సంఖ్య 1,646. తర్వాత 1941లో కూడా కొంతవరకూ జనాభా లెక్కల్లో కులాన్ని గణించారుగానీ రెండో ప్రపంచయుద్ధ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. పీపుల్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు 1992లో జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 4,635 కులాలున్నాయి. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కులగణన నిర్వహిస్తామని వాగ్దానం చేశారు. అనంతరం సాంఘికార్థిక సర్వేకింద 2011–12 మధ్య ఆ లెక్కలు తీశారు. కానీ ఆ డేటాను బయటపెట్టలేదు. ఇటీవల జనగణనపై కాంగ్రెస్ పట్టుబట్టడం మొదలైంది. మతంపై ప్రధానంగా కేంద్రీకరించే బీజేపీ ఇందుకు ససేమిరా సమ్మతించబోదని, అందువల్ల ఎన్నికల్లో కులగణన తనకు ప్రధాన ఆయుధంగా మారుతుందని ఆ పార్టీ భావించింది. కానీ బీజేపీ హఠాత్తుగా మనసు మార్చుకోవటంతో కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నినాదం లేకుండా పోయింది. అణగారిన కులాలు అడిగాయని కాదు... కులం ఒక వాస్తవం అయినప్పుడూ, సమాజంపై దాని ప్రభావం అమితంగా వున్నప్పుడూ ఎవరి సంఖ్య ఎంతో తేల్చటం ప్రభుత్వాల బాధ్యత. ఇన్నాళ్లూ దాన్ని విస్మరించారు. ఇందువల్ల రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సంక్షేమ ఫలాలు లక్షిత వర్గాలకు సరిగా చేరటం లేదు. ఇప్పటికీ విద్యాగంధం అంటని, ప్రభుత్వ పథకాల సంగతే తెలియని కులాలవారు గణనీయంగావున్నారు. ఫలితంగా బడ్జెట్లలో గర్వంగా ప్రకటించుకునే పథకాలు ఆచరణలో నిరుపయోగం అవుతున్నాయి. ఇక ఇంద్ర సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు నిర్ణయం కోటా పెంపు ప్రయత్నాలకు అవరోధమవుతోంది. సమస్య వుందని ప్రభుత్వాలకు తెలిసినా, కొత్తగా తెరపైకొస్తున్న కులాలకు న్యాయం చేద్దామనుకున్నా అసాధ్యమవుతున్నది. అన్ని రంగాల్లోనూ ఆధిపత్య కులాల హవా కొనసాగుతోంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవటంలో, గాలివాలుకు అనుగుణంగా దూసుకెళ్లటంలో బీజేపీ దరిదాపుల్లోకొచ్చే రాజకీయపక్షం మరొకటి లేదు. వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల ముందూ... మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భాల్లో కులగణనపై కేంద్రం నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ భావించారు. అలాచేస్తే కాంగ్రెస్ డిమాండుకు తలొగ్గినట్టయ్యేది. పహల్గామ్ మారణకాండపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నవేళ కులగణన నిర్ణయం తీసుకోవటంతో అది తన ఘనతేనని కాంగ్రెస్ చెప్పుకునే పరిస్థితి లేకుండాపోయింది. పైగా కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలోవున్నా కులగణన జోలికి పోకపోవటం... 2011–12లో ఆ పని చేసినా దాన్ని సామాజికార్థిక సర్వేగా చెప్పటం ఆ పార్టీకి పెద్ద మైనస్. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ తీసుకున్నా తాజా నిర్ణయం నిస్సందేహంగా బీజేపీకి ఉపకరిస్తుంది. అయితే దీని వెంబడి రాగల ఇతరేతర డిమాండ్లతో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి. -
‘రాహుల్, కాంగ్రెస్ పార్టీలకు భయపడి మేం నిర్ణయాలు తీసుకోం’
ఢిల్లీ : వచ్చే జనగణనలో కులగణన చేర్చుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కుట్రలు, కుతంత్రాలు చేశారని, ముస్లింలందరినీ బీసీల్లో చేర్చారన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తమ ఘనతేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. తాము రాహుల్ గాంధీకో, కాంగ్రెస్‌కో భయపడి కులగణన నిర్ణయం తీసుకోలేదన్నారు. జనగణనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.ఈ కులగణన చరిత్రపుటల్లో నిలిచిపోనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు.. రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి.. కుట్రలు, కుతంత్రాలు చేశారు.ముస్లింలందరినీ.. బీసీల్లో చేర్చారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి.. ప్రజలను మతం పేరుతో విడగొడుతూ.. మతఘర్షణలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ.. కులాల పేరుతోనూ.. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై, బీసీలపై కపటప్రేమను చూపించడం ఒక్కటే కాదు.. వీలు చిక్కినపుడల్లా విషం కక్కిన సందర్భాలు కూడా చరిత్రలో ఎన్నో ఉన్నాయి.ఎస్సీ అయిన రామ్‌నాథ్ కోవింద్ గారిని, ఎస్టీ అయిన ద్రౌపది ముర్ముగారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినపుడు.. వ్యతిరేకించి తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మాదిగ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించేందుకు.. మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పూర్తి వివరాలు అందజేసిన తర్వాత.. ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది.వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ కూడా.. బీసీలపట్ల మొసలికన్నీరు కార్చుతోంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఏనాడూ పనిచేయలేదు.2018లో జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుంది.2019లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకోసం 10% రిజర్వేషన్ ను (EWS) అమల్లోకి తీసుకొచ్చింది.సమాజంలోని అన్ని వర్గాలకు సరైన న్యాయం జరగాలని.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదంతో చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి వారి సాధికారిత కోసం, వారికి ఆత్మగౌరవం కల్పించిన ఘనత మోదీ గారిది.ముస్లిం మహిళలపై ‘ట్రిపుల్ తలాక్’ వంటి అనాగరికమైన విధానాలను రద్దు చేసి..ముస్లిం మహిళలకు హక్కులు, అధికారాన్ని కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిది.సమాజంలోని ఏ ఒక్క వర్గానికీ.. తమను పట్టించుకోవడం లేదు.. అనే భావన రానీయకుండా మేం పనిచేస్తున్నాం.1881 నుంచి 1931 కులగణన జరిగింది. కానీ స్వాతంత్ర్యానంతరం కులగణన జరగకూడదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 1951 నుంచి నేటివరకు ఏనాడూ కులగణన జరగలేదు.మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకంగానే ఉంది. నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కులగణన పట్ల బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు.మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు.6 సెప్టెంబర్, 1990 నాడు.. పార్లమెంటులో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో బీసీలకంటే ముస్లింలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, వారికి చేయూత అందించాలని చెప్పారు. బీసీలను పక్కనపెట్టి ముస్లింల హక్కుల గురించి మాట్లాడారు.అంతే తప్ప బీసీలకు న్యాయం చేసే విషయంలో ఒక్క మాట కూడా సానుకూలంగా మాట్లాడలేదు.2010లో నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.. కులగణనపై మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో, 2010లో బీజేపీ పక్షనేత సుష్మాస్వరాజ్ గారు.. నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాస్తూ.. తమ పార్టీ కులగణనకు అనుకూలంగా ఉన్నామని లేఖ రాశారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కనపెట్టి.. 2011లో జనగణన చేసింది.బీజేపీ మొదట్నుంచీ కులగణనకు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తోంది. కానీ ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా.. సామాజికంగా అన్ని వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడేలా ఉండాలనేది బీజేపీ ఆలోచన.దేశంలో కులగణన జరిగితే.. సామాజిక, ఆర్థిక పరమైన లబ్ధి పేదలకు అందించడంలో ఈ డేటా ఉపయోగపడుతుంది.సంక్షేమపథకాలు, రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు జనగణన డేటా ఉపయుక్తం అవుతుంది.ఇది మా ప్రభుత్వ స్పష్టమైన వైఖరిని ప్రస్ఫుటం చేసింది.కానీ, 2011లో జనగణనతో పాటుగా కులగణన చేయడాన్ని నాటి హోంమంత్రి చిదంబరం.. వ్యతిరేకించారు.బీజేపీ తరపున.. చాలా సందర్భాల్లో అమిత్ షా గారు మాట్లాడుతూ.. జనగణన చేపట్టినపుడు కులగణన చేస్తామని చెప్పారు.గతంలో సుష్మాస్వరాజ్ గారు ఇచ్చిన లేఖ ఆధారంగా.. మా పాలసీ మేరకు.. ఇవాళ మేం జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ, కాంగ్రెస్ అండ్ pvt Ltd కంపెనీలు.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయి. మోదీ సర్కారు తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం.. తమ ఘనత అన్నట్లు రాహుల్ గాంధీ చెప్పుకోవడం సిగ్గుచేటు.రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో భయపడి బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు.ఎద్దులబండి కింద కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది.అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా.. తాము చెప్పినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పుకుంటోంది.ఇది హాస్యాస్పదం.2010లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ తో అయితే.. నిర్ణయం తీసుకున్నామో.. దానికి కట్టుబడి ముందుకెళ్తున్నాం.దేశానికి, సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో ఆలోచించి.. నిర్ణయం తీసుకుంటాం.ఆ నిర్ణయాలు తీసుకునే సత్తా బీజేపీకి, ఎన్డీయేకు, మోదీ గారి నాయకత్వానికి ఉంది.ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమి, ట్రిపుల్ తలాక్, GST వంటి ఏ నిర్ణయాన్నయినా.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటాం.మేం చేపట్టబోయే కులగణనలో.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీల్లో చేర్చబోం.మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానాల తీర్పుకు విరుద్ధంగా బీసీ ముస్లింలు అనే ఆలోచనతో కాంగ్రెస్ ముందుకెళ్లింది. దీన్ని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం.కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. షార్ట్ టర్మ్ లక్ష్యాలతో, ఓటుబ్యాంకు రాజకీయాలు, అధికార దాహంతో తీసుకున్న నిర్ణయాలే తప్ప.. దేశం హితం కోసం, దేశ ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచించలేదు.తెలంగాణ, కర్ణాటకల్లో రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన కూడా హడావుడిగా.. ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప.. ఇందులో చిత్తశుద్ధి లేదు. ఇది కులగణన కాదు. ఇది కులాలకు సంబంధించిన సర్వే.కులగణన చేయాలంటే.. విధానపరమైన నిర్ణయాలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది.50% జనాభాను కూడా చేరుకోకుండా మొత్తం సర్వే పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదం.శాస్త్రీయమైన పద్ధతిలో ఈ సర్వే జరగలేదు.బీసీల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే.. నిష్పాక్షికమైన, సైంటిఫిక్ పద్ధతిలో కులగణన జరగాలనేదే మోదీ సర్కారు ఆలోచన. దీనికోసమే.. జనగణన వరకు వేచి చూశాం.జనగణన చేస్తున్నప్పుడే.. కులగణన సాధ్యమవుతుంది.ఈసారి నిర్మాణాత్మకంగా జనగణన చేపట్టడం అందులో భాగంగా కులగణన జరపాలనేదే మా ప్రభుత్వ స్పష్టమైన విధానం.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ గారు పదేళ్లలో కులగణన ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు.2010లో రేవంత్ ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.అప్పుడే మేం కులగణనకు ఆమోదం తెలిపాము.ప్రతి పదేళ్లకోసారి, దశాబ్దపు మొదటి సంవత్సరంలో కులగణన జరుగుతుంది.బీజేపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి జనగణన జరుగుతున్నప్పుడు.. కులగణన కూడా జరుగుతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టలేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీలు కులగణను వ్యతిరేకించారు.తూతూ మంత్రంగా.. తంతు లాగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం లేదు.వాస్తవాలకు అనుకూలంగా, శాస్త్రీయమైన పద్ధతిలో కులగణన ఉంటుంది.ఒకసారి పబ్లిష్ చేసి.. లోపాలుంటే.. మరో రెండ్రోజులు సమయం ఇచ్చి.. మీ ఇష్టం వచ్చినట్లు సర్వే చేశారు తప్ప.. ఇందులో శాస్త్రీయత లేదు.ఈ విషయం రాహుల్ గాంధీకి అర్థం కాలేదు.తెలంగాణలో ఉన్న రాంగ్ రోల్ మోడల్ మాకు అవసరం లేదు.మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి.. సమగ్రంగా జనగణ చేస్తాం.కులగణన చేపట్టేందుకు ‘సెన్సెస్ యాక్ట్ 1948’లో సవరణ తీసుకొచ్చి.. ఇందులో ‘కులం’ అనే పదాన్ని ఓ ప్యారామీటర్ గా చేర్చాలి.వచ్చే పార్లమెంటు సమావేశాల్లో.. దీనికి సంబంధించిన సవరణ తీసుకొచ్చాకే.. జనగణనపై ముందుకెళ్తాం.కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నారు.తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మడం లేదు.కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ బీసీలకు సంబంధించిన అంశాల్లో.. రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయలేదు.42% బీసీ జనాభా ఉన్నప్పటికీ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎందుకు ఇవ్వలేదు.కులగణను ఏనాడూ బీజేపీ వ్యతిరేకించలేదు.మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓడిపోవడం ఖాయం.2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడే కులగణన ఉంటుంది.రేవంత్ సర్కారు చేసిన సర్వే.. బీసీ వ్యతిరేక సర్వే.బీసీ ముస్లింలని జోడించి చేసిన సర్వేను మేం వ్యతిరేకిస్తున్నాం.హైదరాబాద్ లో 150 కార్పొరేషన్ సీట్లలో.. బీసీలకు రిజర్వ్ చేసిన 50 సీట్లలో.. 30 సీట్లు ముస్లింలే గెలిచారు -
Madhav: ఏడుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు భక్తులు
-
ఢిల్లీలో పారని బాబు పాచిక!
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిన మంత్రాంగం పని చేయలేదు. ఆయన్ను పట్టించుకోకుండా పార్టీకి చెందిన ముఖ్య నేత పాకా సత్యనారాయణను బీజేపీ అగ్ర నాయకత్వం ఎంపిక చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీలో తనకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవడానికి చంద్రబాబు తెర వెనుక శాయశక్తులా ప్రయత్నించినట్లు తెలిసింది. ఇటీవల రెండుసార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో మాట్లాడినట్లు సమాచారం. కానీ వారు చంద్రబాబు సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఆయన ఒక నాయకుడి పేరు చెప్పి ఆయనకు ఇస్తే కూటమికి ఉపయోగం ఉంటుందని తన మాయజాలంతో బీజేపీ పెద్దలను ఒప్పించేందుకు యత్నించారు. ఆ వ్యక్తికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించేందుకు బీజేపీలోని తన మనుషులతో గట్టి లాబీయింగ్ కూడా చేయించారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే నేతలు అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారంతా చంద్రబాబు సూచించిన వ్యక్తికి సీటు ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అవేమీ పట్టించుకోకపోవడం విశేషం.రకరకాల ప్రచారాలు..ఎత్తులుతాను సూచించిన అభ్యర్థికి రాజ్యసభ అభ్యర్థిత్వం వచ్చే అవకాశం లేదని తెలిశాక, మొదటి నుంచి బీజేపీలోనే ఉంటూ ఇప్పుడు రేసులో ఉన్న నాయకుల్లో తనకు అనుకూలంగా ఉండే ఒక నేతను చంద్రబాబు ప్రోత్సహించినట్లు తెలిసింది. ఒక దశలో ఈ సీటును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైకి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అనూహ్యంగా భీమవరానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నేత పాకా సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ పేరు ఖరారైన తర్వాతే ఆయన గురించి అందరికీ తెలిసింది. నిజానికి ఒరిజినల్ బీజేపీకి చెందిన నేతలు చాలా మంది మాత్రం ఆయనకు అవకాశం ఉంటుందని భావించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయన పేరు బలంగా వినిపించింది. కానీ ఆ సీటును సోము వీర్రాజుకు కేటాయించారు. దీంతో ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ అవకాశం దక్కింది. ఈయనతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సోము వీర్రాజు వంటి వారంతా సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో ఉంటూ ఆ పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేస్తున్న వారుగా పేరుంది. చంద్రబాబుకు షాకే!చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా తనకు అనుకూలంగా ఉండే వారిని విడతల వారీగా బీజేపీలోకి పంపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వంటి చాలా మంది చంద్రబాబు అనుయాయులే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చంద్రబాబుకు స్వయానా వదిన. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీలో సగం మంది చంద్రబాబు వర్గానికి చెందిన వారే కనిస్తారు. తద్వారా బీజేపీకి కేటాయించిన ఏ పదవినైనా తన వర్గంలోని ఎవరో ఒకరికి ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిసూ్తనే ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన మనుషులకే పదవులు కూడా దక్కాయి. కానీ కొద్ది కాలంగా బీజేపీ బాబు వ్యవహారాన్ని గమనించి సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి, సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ, ఇప్పుడు పాకా సత్యనారాయణకు రాజ్యసభ పదవులు దక్కాయి. ఈ నిర్ణయాలు ఒకరకంగా చంద్రబాబుకు షాక్‌లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అధ్యక్షుడి కోసం.. నిరీక్షణ తప్పదా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ఇంకా కొన్నిరోజులు సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అధ్యక్షుడితో పాటు ఏపీ తదితర రాష్ట్రాల అధ్యక్షులు అలాగే, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉండగా..ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తాజాగా కశ్మీర్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పహల్గాంలో 28 మంది పర్యాటకులు చనిపోవడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని.. పాలనా పరంగా, రాజకీయంగానూ కుదిపేసింది.ప్రభుత్వంలో, పార్టీలో కీలకమైన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పూర్తిగా..పహల్గాం ఉగ్రదాడి తదనంతరం పరిణామాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత అంశాలు, రాజకీయపరమైన విషయాలను ఇప్పట్లో పట్టించుకునే అవకాశం లేదని, కొత్త జాతీయ అధ్యక్షుడి విషయంలో మరి కొంతకాలం వేచిచూడక తప్పదని బీజేపీ నేతలు అంటున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక కూడా ముడిపడి ఉన్నందున, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కూడా ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడికి అన్నీ సవాళ్లే..! రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనా సంస్థాగతంగా, రాజకీయంగానూ కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఈ బాధ్యతలు చేపట్టగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ప్రక్రియపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని అంటున్నారు. పార్టీలో గ్రూపులు పెరగడంతో.. సొంత ముద్రతో క్యాడర్‌ను తమ వైపు తిప్పుకోవడమూ సవాళ్ళతో కూడుకున్నదేననే చెబుతున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా (2028) పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడం ద్వారా పార్టీ బలాన్ని చాటడం కొత్త అధ్యక్షుడికి పెద్ద సవాల్‌గానే నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేడర్‌లో నిరాసక్తత! రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగకపోవడం, పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేకపోవడంతో.. పైకి బాగానే కనిపిస్తున్నా కేడర్‌లో లోలోపల నిరాసక్తత, నిర్లిప్తత చోటు చేసుకుందని అంటున్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు ఇతర వర్గాల సమస్యలపై అడపాదడపా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా పెద్దగా కార్యాచరణ ఏదీ లేదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. రాజకీయ కార్యకలాపాలు జోరుగా సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు తమ సొంత ఇమేజీని పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
ప్రధాని మోదీపై కాంగ్రెస్ వివాదాస్పద పోస్ట్
-
విభేదిస్తే వ్యతిరేకించాలా?
‘అధికారం చెడగొడుతుంది. సంపూర్ణ అధి కారం సంపూర్ణంగా చెడగొడుతుంది.’ లార్డ్ జాన్ డల్బర్గ్ 1887లో చెప్పిన మాట ఇది. అధికారం అహంకారం కూడా తెస్తుంది,సంపూర్ణ అధికారం సంపూర్ణ అహంకారం తెస్తుంది... ఇది నేటి మాట. ఈ అహంకారానికి అవమానించే గుణం తోడవుతోంది. అహంకారులు భిన్నస్వరాన్ని భరించలేరు. అణచివేస్తారు. ఇండియాలోనే కాదు, అమెరికా తదితర అనేక దేశాల్లోనూ ఈ ధోరణి ప్రబలుతోంది.స్వేచ్ఛ కాగితాలకే పరిమితమా?అధికార పార్టీ నేతల పట్ల వ్యతిరేక భావాలు వ్యక్తం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి వారిపై భౌతిక దాడులు జరుగుతాయి. ప్రభుత్వ ఏజన్సీలు వారిని వేటాడతాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అసమ్మతి ప్రకటించే వారి పట్లే ఈ తృణీకార ధోరణి ఇంతకాలం పరిమితమైంది. కానీ ఇప్పుడిది ఎల్లలు దాటింది. ఆఖరికి న్యాయవ్యవస్థను కూడా వదిలిపెట్టని దుఃస్థితి దాపురించింది. తమ మాటకు తలొగ్గని వారు ఎవరైనా వారికి ఒకటే. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇందుకు మినహాయింపు కాదు. తమతో విభేదించిన న్యాయవ్యవస్థ వారి అవమానానికి గురవుతోంది.చిన్నప్పుడు మనకు స్కూల్లో ఏం చెప్పేవారు? చట్ట సభలు ప్రజా స్వామ్య పీఠాలనీ, సభ్యులకు అక్కడ భయం లేకుండా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందనీ చెప్పేవారు కదా! నిజానికి అవన్నీ కాగితాలకే పరిమితం. ప్రజలెన్నుకున్న ప్రతినిధులు చట్టసభల్లో అధికార పక్షంతో విభేదించి తమ గొంతు వినిపించగలుగుతున్నారా? అధికార పార్టీ సభ్యులు గానీ, అధ్యక్ష స్థానంలో ఉన్నవారు గానీ వారిని అందుకు అనుమతించడం లేదు. శాసన నిర్మాణ సంస్థల స్థాయి పెరిగే కొద్దీ వాటిలో ఈ ధోరణీ హెచ్చుతోంది.ప్రతిపక్ష సభ్యుల గొంతు వినబడకుండా అరుపులు కేకలతో పాలకపార్టీ సభ్యులు వారిని నిరోధించడం సర్వసాధారణమైంది. ఒక వేళ వారా పని చేయలేకపోతే, సభాధ్యక్షులు జోక్యం చేసుకుని ప్రతి పక్ష సభ్యుల మాటలను రికార్డుల నుంచి తొలగిస్తారు, మైకులు కట్ చేస్తారు. లేదంటే మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఇచ్చినా తగినంత సమయం కేటాయించరు.తటస్థత చూపనక్కర్లేదా?అత్యున్నత పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం, దిగువ సభ స్పీకర్, ఎగువ సభ చైర్మన్ తమ రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టి విధి నిర్వహణలో తటస్థంగా ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఇలా జరగటం లేదు. ఈ సంప్రదాయం నుంచి వారు వైదొలగుతున్నారు. కింది స్థాయి చట్టసభల్లోనే కాదు, లోక్‌సభలో, రాజ్యసభలో సైతం ఇదే జరుగుతోంది. ఉదాహరణకు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను చూడండి. బీజేపీతో ఆయన తన అనుబంధాన్ని వీడలేక పోతున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఆయన కళ్లన్నీ రాష్ట్రపతి పదవి మీదున్నాయి. అధినాయకుడి అను గ్రహం ఉంటేనే ఆ కల నెరవేరుతుంది. అందుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయనొక్కడే కాదు, అలాంటివారు పార్లమెంటులో చాలామంది ఉన్నారు. తగిన అర్హతలు లేకున్నా అధి నాయకుడి పట్ల విధేయత అనే ఒక్క అర్హతతో వారు మహనీయమైన ఉన్నత పదవులు పొందగలిగారు. గొప్ప మేధావులు ఎందరో ధన్ ఖడ్‌కు ముందు ఆ పదవిని అలంకరించారు. అత్యున్నత ప్రజాస్వా మిక విలువలతో వారంతా తమ పదవికి వన్నె తెచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ని అణు క్షిపణిగా పేర్కొంటూ ధన్ ఖడ్ ఈ మధ్య ఒక తూటా పేల్చారు (సంపూర్ణ న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టుకు విస్తృత విచక్షణాధికారాలను కట్టబెట్టే ఆర్టికల్ ఇది). ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే! ఆ అధికరణంపై సమగ్ర సమీక్ష, అవగాహనతో చేసిన వ్యాఖ్య కాదు! తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ప్రకటన వెలువడింది. గవర్నర్లు చట్టసభలు చేసిన బిల్లులకు తప్పనిసరిగా సమ్మతి ఇవ్వాలన్నది తీర్పు సారాంశం. ఈ మధ్యకాలంలో చాలా మంది గవ ర్నర్లు కేంద్రానికి పక్క వాద్యకారులుగా పని చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ధన్‌ఖడ్ సైతం ఇలాగే చేశారు. కాబట్టి, అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సబబే! ఆయన ఆర్టికల్ 142ని అణు క్షిపణిగా పేర్కొనడం... శాసన, న్యాయ వ్యవస్థల నడుమ ఉండాల్సిన అధికార సమతుల్యతను తిర స్కరించడమే అవుతుంది. ఇలా వ్యాఖ్యానించి, రాజ్యాంగ నిర్మాతల విజ్ఞతకు ఆయన సవాలు విసిరారు. ఇది మరీ తీవ్రమైన అంశం. నైతికత సారథులుగా వ్యవహరించాలి!రాష్ట్రపతి మూడు నెలల్లో బిల్లుపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని ధన్‌ఖడ్ తప్పు పట్టారు. అయితే, మనం ఉన్నది రాజరిక వ్యవస్థలో కాదనీ, మనది ప్రజాస్వామ్యం అనీ ఉప రాష్ట్రపతి గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రపతి పౌరులకు జవాబుదారీ కనుక, న్యాయవ్యవస్థకు లోబడి ఉండాలని మర్చిపోకూడదు. చట్టం తు.చ. తప్పకుండా అమలయ్యేట్లు చూడటంతో పాటు, ఆ శాసన ఆదేశాల ఉద్దేశం ఏమిటో గ్రహించడం కూడా న్యాయ వ్యవస్థ విధి.శాసన, న్యాయ వ్యవస్థల నడుమ అధికార విభజన గురించి స్పష్టంగా చెప్పిన వాళ్లలో మాంటెస్క్యూ ఒకరు. ‘ద స్పిరిట్ ఆఫ్ లా’ (1748) పుస్తకంలో ఆయన దీన్ని గురించి చర్చించారు: శాసన, కార్య నిర్వాహక అధికారాలు ఒకే వ్యక్తి వద్ద లేదా న్యాయాధికారుల బృందం చేతిలో ఉంటే స్వేచ్ఛ బతకదు. అందుకే వాటి నుంచి న్యాయాధికారాన్ని వేరు పరచాలి. మూడు అధికారాలు ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ చలాయించేట్లయితే అన్నీ నాశనమవుతాయి... ఇదీ ఆయన సిద్ధాంతం. దేశంలో ‘సివిల్ వార్’కు సుప్రీంకోర్టు బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ధన్‌ఖడ్ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన ఈ మాటలన్నారు. హిందూ రాష్ట్ర స్థాపన తమ ధ్యేయమని బీజేపీ నాయకత్వం పదేపదే ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా, బీజేపీ నాయకత్వం శామ్యూల్ టేలర్ కొలరిజ్ రాసిన ‘ద స్టేట్స్‌మన్స్ మాన్యువల్’ చదివి తీరాలి. రాజకీయ నాయకులు తమ నిర్ణయాలు నైతిక, ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగాఉండేట్లు జాగ్రత్త వహించాలి. తమను తాము నైతికత సారథులుగా భావించాలి. కేవలం వ్యావహారిక నైపుణ్యం, ప్రయోజకత్వం మీద ఆధారపడే రాజకీయాలను ఆయన విమర్శిస్తాడు. బదులుగా, పవిత్ర గ్రంథాల్లోని దివ్యజ్ఞానం ప్రాతిపదికగా ఉండే సూత్రప్రాయ విధానా లను అనుసరించాలని కొలరిజ్ సూచిస్తాడు. తద్వారా రాజనీతిజ్ఞులు ప్రజలకు సమర్థమైన పాలన అందించడంతో పాటు సమాజాన్ని నైతికంగానూ ఉన్నతస్థితికి చేర్చగలరని హితవు పలికాడు.అభయ్ మోకాశీవ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మీడియా ట్రెయినర్ -
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణ(Paka Venkata Satyanarayana)ను ఎంపిక చేసింది ఆ పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ వేయబోతునున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. తొలుత తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరిగింది. చివరకు ఏపీ నేతకే ఆ అవకాశం దక్కింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా ఉన్నారు పాక వెంకటసత్యనారాయణ. గతంలో భీమవరం కౌన్సిలర్‌గా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారీయన. -
‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు వస్తారా?’
హైదరాబాద్: తెలంగాణ విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని బీజేఎప్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో దిట్టని, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలపై చర్చకు వస్తారా? అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎల్కతుర్తి సభలో సెటైర్లు వేశారు మహేశ్వర్ రెడ్డి. కొండంత రాగం తీసి.. దిక్కుమాలని పాట పాడినట్లు ఉంది బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని ఎద్దేవా చేశారు.‘తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని నిందించారు. బీబీ నగర్ లో ఎయిమ్స్ ఎవరిచ్చారు?, కేసీఆర్ పదేళ్లపాటు మావోయిస్టులను చర్చలకు ఎందుకు పిలవలేదు. అధికారం పోయాక మావోయిస్టులు గుర్తుకు వచ్చారా?, మావోయిస్టులను వెనకేసుకురావడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. గతంలో చర్చలు జరిపినప్పుడు ఏమైంది?, మావోయిస్టులకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు’ అని ధ్వజమెత్తారు.కేసీఆర్ పగటి కలలు కంటున్నారు..మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంస పాలన.. ఫెయీల్యూర్ పాలన.. కుటుంబ పాలన. కుటుంబ పాలనకు కాలం చెల్లింది. తెలంగాణకు అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టారు. కాళేశ్వరం కట్టి తెలంగాణ ప్రజల మీద భారం మోపారు. మొసలీ కన్నీరు కార్చిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’ అని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. -
YSR మావోయిస్టుల చర్చల సారాంశాన్ని కుల్లంకుల్లా దేశం ముందు ఉంచాడు
-
బంగ్లాదేశ్‌కూ నీళ్లు నిలిపివేయాలి: బీజేపీ
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలగాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ విషయంలో సైతం ఇలాంటి చర్యనే తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కోరారు. 1996లో కాంగ్రెస్ హయాంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన గంగ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. ‘ఆ ఒప్పందం చాలా తప్పు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటు చేసింది’అని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో సంబంధాలున్న దేశాలతో నదీ జలాల పంపకం ఒప్పందాలను యథా ప్రకారం కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ‘పాములకు ఎంతకాలం నీళ్లు అందించాలి? వాటిని నలిపేయాలి’అంటూ దూబే వ్యాఖ్యానించారు. లష్కరే తొయిబా ఉగ్రవాదులకు బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వంతో సంబంధాలున్నాయంటూ వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదులు సరిహద్దుల గుండా చొరబడకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలన్నారు. -
మా వాళ్లు కరెక్ట్‌గా లేకే అధికారంలోకి రాలేదు: రాజాసింగ్
హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కచ్చితంగా బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా స్పందించింది. దీనిలో భాగంగా మాట్లాడిన రాజాసింగ్.. ‘ సభలో కేసీఆర్ ఆడిన ప్రతి మాట అబద్ధం. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయిలు ఇచ్చింది. తెలంగాణ అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగింది. కేసీఆర్ ఫాంహౌస్ లో మంచిగా ఉన్నారు. మీరు అక్కడ ఉంటేనే మంచిది.కేసీఆర్ రాష్ట్రాన్ని మత్తుగా మార్చారు. తెలంగాణ అంటే బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చారు. తెలంగాణ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారుతోనే జరుగుతుంది’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు కేసీఆర్ వార్నింగ్ -
‘దక్షిణ భారతంలో కూడా అధికారంలోకి వస్తాం’
విజయవాడ: దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. డా. బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దీనికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు మాట్లాడిన కిషన్ రెడ్డి.. ‘దక్షిణ భారతదేశంలో కూడా అధికారంలో కి వస్తాం. తమిళనాడు, తెలంగాణలో బిజెపి ప్రభుత్వాలు వస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారు.అంబేద్కర్ ఉత్సవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ప్రతిస్టాత్మకం గా నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ జయంతి అనేది ఏప్రిల్ 14వ తేదీనే కాకుండా 10 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అంబేద్కర్ దళిత సామాజిక వర్గంలో జన్మించి అనేక ఒడిదుడుకులు ఎదురుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఎన్నో అవమానాలకి గురయ్యారు.ఒక మేధావిగా ఆయన ఎదిగి అనేక పోరాటాలు చేశారు. బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం నింపారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ ఎంపీ గా పోటి చేస్తే ఓడించాలని నెహ్రూ విస్తృతంగా ప్రచారం చేసారు. కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పి కొట్టి పార్లమెంట్ కి పంపించేలా మేధావులు కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కాంగ్రెస్ వ్యవహరించింది. రాజకీయ స్వలాభం కోసం ఆనాడు కాంగ్రెస్ పాలన ఉండేది. అడుగడుగునా అంబేద్కర్ ని అవమానపరిచేలా కాంగ్రెస్ చేసింది. అంబేద్కర్ ఒక మేధావి అయినప్పడికి అనేక రకాలుగా కాంగ్రెస్ అవమానపరిచింది. మొదటి సారి ప్రధానిగా మోదీ ఎన్నిక అయినప్పుడు అంబేద్కర్ కి నివాళులు అర్పించి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తి తోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని మరింత శక్తీవంతంగా ఉంచాలని మోదీ ప్రభుత్వం పని చేస్తుంది. రాజ్యాంగానికి గౌరవం ఉండేలా మోదీ ప్రభుత్వం ఉంటుంది. అంబేద్కర్ అంతిమ సంస్కారం చేసిన స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. అంబేద్కర్ ఉన్న ప్రదేశాలని పంచ తీర్థ పేరుతో నిర్మాణం చేపట్టాం. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించిన ఘనత ప్రధాని మోదీది. దేశానికి సేవ చేసిన అంబేద్కర్ కి కాంగ్రెస్ భారతరత్న ఇవ్వకుండా అవమానపరిచింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ కి భారత్ రత్న ఇచ్చింది. అంబేద్కర్ సిద్ధాంతం, స్ఫూర్తి తో ప్రధాని మోదీ పని చేస్తున్నారు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
బెంగళూరు: పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని. భారత్ శాంతిప్రియ దేశం. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీని విమర్శించారు. సిద్ధరామయ్య.మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’దీనిపై కర్ణాటక బీజేపీ తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్ లో , పాకిస్తాన్ బోర్డర్ లో సిద్ధరామయ్య పేరు మారుమ్రోగుతోంది. ‘ మీరు పాకిస్తాన్ రత్న’ కర్ణాటక బీజేపీ ధ్వజమెత్తింది. మన దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించిన బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రన్... పాకిస్తాన్ కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై సంతకం చేసినప్పుడు పాకిస్తాన్ చాలా సంతోషం ఉంది. కాబట్టే అప్పుడు రావల్పిండి వీధ/ల్లో నెహ్రూను ఓపెన్ జీప్ లో తీసుకెళ్లారు. పాకిస్తాన్ లో ఓపెన్ జీప్ లో తిప్పబడే భారత దేశ తదుపరి రాజకీయ నేత మీరు అవుతారా సిద్ధరామయ్య అవుతారా? అని ప్రశ్నించారు బీజేపీ చీఫ్‌ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప విమర్శించారు. ‘ మనదేశం అంతా ఒక్కటిగా ఉండాల్సిన సమయంలో ఈ తరహ మాటాలేమిటి.. అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్ధం చేసుకోవాలి. మీకు సీఎంగా ఇచ్చే ఫేర్ వెల్ పార్టీ కాదు ఇది. మీ వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు యడ్యురప్ప. -
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
విశాఖపట్నం, సాక్షి: కూటమి కీలక నేతలు బహిరంగంగానే.. అదీ కార్యకర్తల సమక్షంలో గొడవకు దిగారు. ఇంతకాలం టీడీపీ-జనసేన గొడవలు మాత్రమే చూస్తున్న ఏపీ ప్రజలకు ఇవాళ్టి కొత్త వివాదం ఆసక్తికరంగా అనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది.శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు?’’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్‌ను ప్రశ్నించారు. అయితే.. లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు ఆరోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో కలెక్టర్ ని కలిసి వినత పత్రం సమర్పించామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ సర్దిచెప్పబోయారు. అయినా కూడా వినకుండా గంటా విష్ణుతో వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చొనో గంటా విష్ణుపై కేకలు వేయగా.. దానికి బయటి నుంచే విష్ణుకుమార్ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
ఆది నారాయణరెడ్డి శక్తికి మించి ఆలోచిస్తుంటారు: రామసుబ్బారెడ్డి
-
ఢిల్లీ మేయర్‌గా బీజేపీ నేత రాజా ఇక్బాల్ సింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారం దాదాపు రెండేళ్ల తర్వాత బీజేపీకి దక్కింది. ఆ పార్టీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ శుక్రవారం ఢిల్లీ నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. 142 ఓట్లకు గాను ఇక్బాల్‌కు 133 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు చెందిన మన్దీప్ సింగ్‌పై ఇక్బాల్ ఘన విజయం సాధించారు. ఒక ఓటును చెల్లనిదిగా అధికారులు ప్రకటించగా, బీజేపీకి చెందిన ఎంపీ మనోజ్ తివారీ గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌కు మొత్తం 8 ఓట్లు పడ్డాయి. కాగా, ఈ ఎన్నికను ఆప్ బహిష్కరించింది. నెల రోజుల్లో స్టాండింగ్ కమిటీ వేసి ఢిల్లీ ప్రభుత్వం సహకారంతో ప్రజలకు సమస్యలే లేకుండా చేస్తామని ఇక్బాల్ సింగ్ ఎన్నిక అనంతరం ప్రకటించారు. ఇక్బాల్ సింగ్ నార్త్ ఎంసీడీ మేయర్‌గా చేశారు. 2020 దాకా పార్టీ సివిల్ లైన్స్ జోన్ చీఫ్‌గా వ్యవహరించారు. -
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో MIM గెలుపు
-
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల చివరి రోజు నుంచి పలు ఊహాగానాలతోపాటు ఉత్కంఠను రేకెత్తించిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, చివరి రెండు గంటల్లో ఎవరూ రాలేదు. మొత్తం 112 మంది ఓటర్లలో.. 88 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ నుంచి ఎన్.గౌతమ్‌రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభ్యులెవరూ పోలింగ్‌లో పాల్గొనలేదు. పార్టీల వారీగా పోలింగ్‌కు హాజరైన ఓటర్ల సంఖ్యను బట్టి ఎంఐఎం గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ బరిలో ఉండటంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి నెలకొంది. తమ పార్టీలకు గెలిచేంత ఓటర్ల సంఖ్య లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. చివరి క్షణం వరకూ తమకు ఇతర పార్టీల ఓట్లు పడతాయన్న బీజేపీ, పోలింగ్ అనంతరం సైతం కాంగ్రెస్ ఓట్లు కొన్ని తమకు పడ్డట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఎంఐఎం తొత్తుగా మారిందని బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు బయటపడ్డాయని, ఎంఐఎంకు వాటి మద్దతు ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి నల్ల దుస్తులతో పోలింగ్‌కు హాజరయ్యారు. మిగతా బీజేపీ ఓటర్లు చేతులకు నల్లరిబ్బన్లు చుట్టుకొని వచ్చారు. -
దెబ్బతిన్నా తిరిగి లేస్తాం: కేటీఆర్
శూన్యం నుంచి సునామీని సృష్టించి లక్ష్యాన్ని చేరుకున్న అసాధారణ నేత కేసీఆర్. ఆయన మార్గదర్శకత్వంలో పని చేయడం పూర్వజన్మ సుకృతం. బీఆర్ఎస్ మాత్రమే రాజీ పడకుండా కొట్లాడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది కాబట్టి పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే భావన ప్రజల్లో బలంగా ఉంది..రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంత బలంతో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాదని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. బీఆర్ఎస్తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీ లు తమ సొంత రాష్ట్రాల్లో పుంజుకుని మరింత బలంగా ఎదుగుతాయని అన్నారు. దెబ్బతిన్నా తిరిగి నిల్చుంటామని స్పష్టం చేశారు. తమకు ఎదురైంది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని, తిరిగి ప్రజాదరణ పొందుతామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని, తెలంగాణలో బీజేపీతో కలిసి టీడీపీ, పవన్ కల్యాణ్ వచ్చినా బీఆర్ఎస్ అఖండ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కుల, మతాలు అనే తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడే పార్టీ లు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ యే రక్షణ కవచం. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా. బీఆర్ఎస్ ఎంత బలంగా ఉంటే తెలంగాణకు అంత లాభం.’’ఇక్కడి ప్రజలపై మాకు ఉన్న ప్రేమలో అణువంత కూడా ఢిల్లీ పార్టీలకు ఉండదు. అందుకే 25 ఏళ్లుగా తెలంగాణ ఇంటి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ను మరో 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ప్రజలు కాపాడుకోవాలి..’అని కేటీఆర్ అన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీగా అవతరించి బీఆర్ఎస్గా కొనసాగుతున్న పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం, పదేళ్ల పాలన, రజతోత్సవాలు, వర్తమాన రాజకీయాలు, తదితర అంశాలపై ఆయన స్పందించారు.సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గాపార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఎలా చూస్తున్నారు? కేటీఆర్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ లు రజతోత్సవాలు నిర్వహించుకోవడం ఆషామాషీ కాదు. అధికారం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు చాలా పార్టీ లు ఒక లక్ష్యం కోసం ప్రారంభమై గమ్యాన్ని చేరుకోక మునుపే మూత పడతాయి. ‘‘టీఆర్ఎస్ పిడికెడు మందితో ప్రారంభమై 60 లక్షల మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్గా ఎదిగింది. ఉద్యమం, అధికారం, ప్రతిపక్షం..ఇలా ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా వారి గొంతుకగా నిలుస్తున్నాం. మరో 50 ఏళ్ల పాటు పార్టీ నిలిచేలా చేసే అద్భుతమైన నాయకత్వం మా పార్టీ సొంతం. 25 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ పేరు మాత్రమే మారింది. మా జెండా, ఎజెండా, గుర్తు, నాయకుడు, సిద్ధాంతం మారలేదు..’’ప్రజల బాగోగులు ఎజెండాగా పని చేయడమే మా పార్టీ భావజాలంసాక్షి: ఉద్యమ సమయంలో సవాళ్ల నడుమసాగిన ప్రయాణం ఎలా అనిపించింది? కేటీఆర్: మొండితనం, పట్టుదల, నమ్మిన సిద్ధాంతంపై రాజీ పడకపోవడం, నిజాయితీ.. ఇవే కేసీఆర్ ఆస్తులు. ధన, కుల, మీడియా బలం లేకున్నా పార్టీని ప్రారంభించి తెలంగాణ అస్తిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. అపజయాలు, ఎదురుదెబ్బలు, అవమానాలతో రాటుదేలిన కేసీఆర్‌కు ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకునే శక్తి ఉంది. పార్టీని ప్రారంభించింది మొదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటూ చరిత్ర మార్చిన నాయకుడు ఆయన. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సాధించిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. పదేళ్లు అధికారంలో ఉన్నదాని కంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది.కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై ఎందుకు వెనక్కి తగ్గారు? పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సోనియాఇంటికి వెళ్లి పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారు. సోనియా సూచన మేరకు దిగ్విజయ్ సింగ్‌తో విలీనంపై జరిపిన సంప్రదింపుల్లో కాంగ్రెస్నిజాయితీగా స్పందించలేదు. తనను నమ్ముకున్న వందలాది మందినాయకులు, వేలాది మంది కార్యకర్తల రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వకపోవడంతో విలీనం ప్రతిపాదనను కేసీఆర్ విరమించుకున్నారు. తమిళనాడులో డీఎంకే తరహాలో తెలంగాణకు ఒకగొంతు ఉండాలని పౌర సమాజం నుంచి ఒత్తిడి కూడా రావడంతో స్వతంత్రంగా ఉండేందుకే కేసీఆర్ ఇష్టపడ్డారు.సాక్షి: కొత్త రాష్ట్రంలో ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారు? కేటీఆర్: జమిలి ఎన్నికల పేరిట రెండు జాతీయ పార్టీ లు నాటకం ఆడుతున్న సమయంలో తెలంగాణను దేశం ముందు ఆవిష్కరించేందుకు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. ఆరు నెలల పదవీ కాలాన్ని పక్కన పెట్టి ఎన్నికలకు వెళితే 88 సీట్లతో అసాధారణ గెలుపు నమోదు చేశాం. ఇది కేసీఆర్ సమర్థతకు ప్రజలు ఇచ్చిన సరి్టఫికెట్. రెండో టర్మ్‌లో పెద్ద నోట్ల రద్దు, కరోనాతో ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా సమర్థవంతమైన నాయకత్వం అందించాం. మూడోసారి కాంగ్రెస్ హామీలు, గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయినా మేము తుడిచి పెట్టుకుపోలేదు. కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ మోడల్ సాధించిందేమిటి? 2014లో తెలంగాణలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించి విద్యుత్, సాగునీరు, తాగునీరు సహా అనేక అంశాల్లో తన దూరదృష్టితో కేసీఆర్ సమగ్ర, సమతుల్య, సమీకృత అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులు మేరకే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా విస్తరించాలనే ఆలోచన వచ్చింది. భవిష్యత్తులోనూ జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ తన వంతు పాత్ర పోషిస్తుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకున్నారా? పదేళ్ల పాలనలో మేము చేసిన మంచి పనులను సరిగా ప్రచారం చేసుకోలేక పోయాం. విప్లవాత్మక పథకాలు అమలు చేసినా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. నాతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఓటమికి కారణం. మరోవైపు కాంగ్రెస్ ఉన్నది లేనట్లుగా చిత్రీకరించడంతో ప్రజలు మోసపోయారు. మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం తదితరాలు ప్రభావం చూపాయి. రాజకీయ పునరేకీకరణతో బహుళ నాయకత్వ సమస్యతో ఓటమి చెందామనే వాదన కూడా సరికాదు. ఇది తాత్కాలికమైన చిన్న ఎదురుదెబ్బ మాత్రమే. శాశ్వతంగా ఇదే పరిస్థితి కొనసాగదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాదరణ రుజువు చేసుకుంటాం. ఫామ్‌హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ అనే విమర్శలను ఎలా చూస్తారు? అధికారం చేతిలో పెట్టినా రాష్ట్రాన్ని నడపలేక చేసే విమర్శలు అవి. కేసీఆర్ ఆయన నియోజకవర్గంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లో ఇటీవల ఫామ్‌హౌస్ పాలన కావాలా, కాంగ్రెస్ పాలన కావాలా అని పోల్ పెడితే ప్రజలు ఫామ్‌హౌస్ వైపు మొగ్గు చూపారు. ఇక సీఎం రేవంత్ కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం. పార్టీ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణ బిడ్డగా కేసీఆర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చా. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌పై పనిభారం తగ్గించేందుకు 2018 డిసెంబర్లో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆరున్నరేళ్లలో 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, 60 లక్షల సభ్యత్వం, అనేక ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాం. అధికారం కోల్పోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నా. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, కేసీఆర్‌కు అనారోగ్యం వంటి సమస్యలు ఎదురైనా కేడర్‌లో విశ్వాసం కల్పించాం. పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించేలా పనిచేస్తా.పార్టీ రజతోత్సవంసందర్భంగా మీ సందేశం తెలంగాణ ఇంటి పార్టీ మాది.రాబోయే రోజుల్లో విద్యార్థి, యువజన, మహిళా విభాగాలను బలోపేతం చేసి సంస్థాగతంగా బలోపేతం చేస్తాం.కేసీఆర్‌ను తిరిగి సీఎం చేసేంత వరకు ఒక కార్యకర్తగా పనిచేస్తా.నాతో కలిసి వచ్చే పార్టీ శ్రేణులనుకంటికి రెప్పలా కాపాడుకుంటా. బీజేపీ నుంచి కొత్త పోటీఎదురవుతోందా?కేసీఆర్ స్థాయి రాష్ట్ర రాజకీయాల్లో ఏ ఇతర నేతకూ లేదు. మేం బ్యాగులు, చెప్పులు మోసే నాయకులం కాదు. ఎవరికీ తలవంచకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ దశాబ్దాల కల నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణలో జరిగిన మూడు ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటలేదు. మోదీకి ఆదరణ క్రమంగాతగ్గుతున్న తరుణంలో ఆ పార్టీని పోటీగా భావించడం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ అఖండ మెజారిటీ సాధిస్తుంది. మరోవైపు రేవంత్.. సొంతూరుకు చెందిన మాజీ సర్పంచ్ మొదలుకుని రాష్ట్రమాజీ ముఖ్యమంత్రిపైనా ఆరోపణలతో అక్రమ కేసులు పెడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు.ప్రజల దృష్టిలో కాంగ్రెస్, బీజేపీ పలుచన అవుతున్నాయి.−కల్వల మల్లికార్జున్‌రెడ్డి -
బిహార్ ఎన్నికలు... ఎన్నెన్నో ప్రశ్నలు!
బిహార్ రాష్ట్రం 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలనీ; వలసలు నియంత్రించాలనే డిమాండ్స్ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో బిహార్ రాష్ట్రానికి పెద్ద పీట వేసి అందరికంటే ముందుగానే బీజేపీ అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. గత ఎన్నికల వరకు ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ)దే పైచేయిగా ఉండేది. కానీ, ఐదేళ్లలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ అగ్రవర్ణాలపై తన పట్టును కాపాడుకుంటూనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రెండు దశాబ్దాలుగా జేడీ(యూ) ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీలను, దళితులను తన వైపు తిప్పుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో, పరిపాలనా సంస్కరణలతో లబ్ధిపొందిన ఈ వర్గాలను ఆకర్షించడం ద్వారా... బీజేపీ తన ‘సామాజిక’ కూటమిని బలోపేతం చేసుకుంది. సామాజిక న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించిన లోక్ జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకులు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆ పార్టీ తన బలాన్ని కోల్పోయింది. ఆ పార్టీ తమ గుర్తింపును కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడు తున్న క్రమంలో బీజేపీకి సానుకూలంగా మారింది. వివిధ కుల సమూహాలను తనవైపు తిప్పుకోవడానికి బీజేపీ అంతర్గతంగా ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తోంది. పలు సందర్భాల్లో జేడీ(యూ)తో విభేదాలొ చ్చినా రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటం వల్ల బీజేపీ తన హిందూత్వ భావ జాలాన్ని బిహార్ మట్టిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేయగలిగింది. హిందూ సంఘటితం చుట్టే రాజకీయాలు నడు పుతూ మొట్టమొదటిసారి ఈ ఎజెండాతోనే ఎన్నికలు నడిచేలా వ్యూహాలను రచిస్తోంది. బడుగు, బలహీన వర్గాల ఐక్యతను కాపాడాలనే సిద్ధాంతంతో పని చేస్తున్న ‘ఇండియా’ కూటమికి ఇది అతిపెద్ద సవాలుగా మారబోతోంది. రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉంది. అలాగే ఆ పార్టీ వ్యూహాత్మ కంగా సృష్టిస్తున్న హిందూ కులాల ఐక్యత ఈసారి బిహార్ ఎన్నికలను రసవత్తరంగా మార్చనున్నది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 43.17 శాతం ఓట్లు రాగా; ఆర్జేడీ,కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన మహాగఠ్‌బంధన్ (ఎంజీబీ) కూటమికి 38.75 శాతం ఓట్లు వచ్చాయి.ఈ ఓట్ల వ్యత్యాసం ఇకముందు కూడా కొనసాగితే ఎన్డీఏ 2025లోనూ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి. కానీ 2020 తర్వాత వికాసషీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) మహాVýæఠ్బంధన్లో చేరడం, జేడీ (యూ)లో రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ విలీనం కావడంతో ఈసారి లెక్కలు మారవచ్చు.బిహార్‌లో 18 శాతం ఉన్న ముస్లింలు కీలక పాత్ర పోషిస్తారు. 2020లో ఎంజీబీకి 76 శాతం ముస్లిం ఓట్లు రాగా, ఎన్డీఏకు కేవలం 5 శాతమే వచ్చాయి. యాదవ్– ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే బీజేపీ వైపు ఉన్న బీసీలను, దళితులను తనవైపు తిప్పుకోగలిగితే ఎంజీబీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. అయితే రాష్ట్రంలో పుట్టుకొచ్చిన కొత్త పార్టీలు ఎన్డీఏ–ఎంజీబీ కూటముల గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) జన్ సూరజ్ పార్టీ నుంచి ఎంజీబీకి ముప్పు పొంచి ఉంది. 2024లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఆయన ఇటు ఎంజీబీ, అటు జేడీ(యూ) ఓట్లను గణనీయంగా చీల్చవచ్చు. ఆయన ఆర్జేడీ, జేడీ(యూ) పార్టీలపైనే విమర్శలతో విరుచుకుపడుతుండటంతో బీజేపీకి పరోక్షంగా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల ఆధారిత రాజకీ యాలు కాకుండా అభివృద్ధి తరహా రాజకీయాలు చేస్తా నని పీకే చెప్తున్నారు. లాలూ, నితీష్ల వృద్ధాప్యం, పాశ్వాన్ మరణంతో ఏర్పడిన ఖాళీని తాను భర్తీ చేయా లనుకుంటున్నారు. అయితే 243 నియోజకవర్గాల్లో నిల బెట్టడానికి బలమైన, నమ్మకమైన అభ్యర్థులు ఆయన పార్టీకి లేరు. కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత ఐ.పి. గుప్తా ‘ఇండియన్ ఇంక్విలాబ్ పార్టీ’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రెండు కులాలపై ఈ పార్టీ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ఐపీఎస్ అధికారిగా బిహార్‌లో ప్రత్యేక పనితీరు కనబర్చిన మహా రాష్ట్రకు చెందిన శివ్‌దీప్ లాండె ‘హింద్ సేన’ పార్టీ ఏర్పాటు చేశారు. ఒకప్పుడు నితీష్‌కు సన్నిహి తునిగా ఉన్న ఆర్సీపీ సింగ్ ఆయనతో విభేదించి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ – జేడీ(యూ) మళ్లీ పొత్తు పెట్టుకో వడంతో ఈయన ‘ఆప్ సబ్కీ ఆవాజ్’ పార్టీని నెలకొల్పారు. కుర్మీ సామాజిక నేత అయిన ఆర్పీ సింగ్ ఆ సామాజిక ఓట్లు చీల్చే అవకా శాలున్నాయి. ఈ చిన్న పార్టీలు చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్ అభ్యర్థుల గెలుపోటములను శాసించ నున్నాయి.ఆర్జేడీ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. బీజేపీకి పెరుగుతున్న ఆకర్షణను అడ్డుకోవడానికి ఆర్జేడీ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఓబీసీలను ఏకం చేయాలనీ, మైనారిటీ ఓట్లను కాపాడుకుంటూనే ఈబీసీలను, దళితులను ఎన్డీయే శిబిరం నుంచి తమ వైపు తిప్పుకోవాలనీ ఎంజీబీ లక్ష్యాలుగా పెట్టుకుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇది. మరో ఏడు నెలల్లో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సిందే!ఆర్. దిలీప్ రెడ్డి వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై
అమరావతి,సాక్షి: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.మంగళవారం సీఎం చంద్రబాబు, కేంద్రహోమంతి అమిత్‌షా భేటీలో ఖరారైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేందుకు చంద్రబాబు సుమఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిఇటీవల, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (K Annamalai) ఆ పదవికి రాజీనామా చేశారు. త్వరలో రాష్ట్ర కొత్త అధ్యక్షుడ్ని బీజేపీ నియమిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఆయన రాజీనామాకు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలేనని తెలుస్తోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తుకు సిద్ధమైంది. అయితే 2023లో అన్నాడీఎంకే నేతలను అన్నామలై తీవ్రంగా విమర్శించారు. తాజా పొత్తు నేపథ్యంలో అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బీజేపీ అధిష్టానానికి షరతు విధించినట్లు సమాచారం. అన్నాడీఎంకే షరతు మేరు అన్నామలైను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు సమాచారం. ఇక ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేలా కమలం పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఈసారి ‘మహా’ వంతు!
ఏదేమైనా హిందీని అందరికీ నేర్పించి తీరాలన్న సంకల్పం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మహారాష్ట్రలో తాజాగా రాజుకుంటున్న వివాదాన్ని చూసైనా బీజేపీ తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు... దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలని కావొచ్చు హిందీని బలవంతంగా రుద్దే విధానాన్ని అంగీకరించబోమని ప్రకటించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దక్షిణాదిన దుమారం రేపారు. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, మరేదైనా భాష ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి చేసే నూతన విద్యావిధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో స్టాలిన్ దాన్ని తప్పుబట్టారు. అదింకా పూర్తిగా చల్లారక మునుపే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకూ మూడో భాషగా హిందీని తప్పనిసరి చేయటమే ఆ నిర్ణయం సారాంశం. ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి భాషలు మరాఠీ, ఇంగ్లిష్ మాత్రమే. కానీ జాతీయ విద్యావిధానం చెబుతున్నట్టు ‘ఏదైనా మరో భాష’ కూడా తప్పనిసరి గనుక హిందీని ఆ రెండింటితో జత చేశామని ప్రభుత్వం అంటున్నది. సహజంగానే మహారాష్ట్రలో ఇది వివాదాన్ని రేకెత్తించింది. ‘మేం హిందువు లమేగానీ... హిందీ అవసరం లేద’ంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ముంబై నగరంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టింది. నిజానికి ఎంఎన్ఎస్ అయినా, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) అయినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా అయోమ యంలో పడ్డాయి. ఎంఎన్ఎస్ ఏర్పడి ఇరవయ్యేళ్లు కావొస్తున్నా ఇంతవరకూ ఆ పార్టీ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయింది. యూబీటీగా చీలకముందు శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఏక్నాథ్ షిండే రూపంలో వచ్చిపడిన విపత్తుతో పార్టీ నిలువునా చీలిపోవటమే కాక, అధికారాన్ని కూడా కోల్పోయింది. జనం సానుభూతి చూపిస్తా రనుకుంటే అదీ జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిండా ఆర్నెల్లు కాలేదు. కనుక విపక్షాలు ఏం చేయటానికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర సర్కారు విపక్షాలకు ఆయుధాన్ని అందించింది.తమిళనాడులో స్టాలిన్ హిందీ వివాదాన్ని రేకెత్తించినప్పుడు కేంద్రం తన విధానాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ఒక మాట చెప్పింది. మూడో భాషగా హిందీయే నేర్పాలని తాము పట్టుబట్టడం లేదని, దేశ భాషల్లో దేన్నయినా ఎంపిక చేసుకోవచ్చని అన్నది. కానీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇస్తున్న వివరణ చూస్తే అందుకు భిన్నంగావుంది. నూతన విద్యావిధానంలో భాగంగా స్థానిక భాష, ఇంగ్లిష్‌తోపాటు హిందీని కేంద్రం తప్పనిసరి చేసిందని, దాన్నే తాము అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వివరణ సహజంగానే తమిళనాడులో పాలక డీఎంకేకు అందివచ్చింది. మూడో భాషగా ‘మరేదైనా’ నేర్చుకోవచ్చన్న నిబంధన ఆంతర్యమేమిటో మహా రాష్ట్ర నిర్ణయం బట్టబయలు చేసిందని ఆ పార్టీ అంటున్నది. దేశంలో హిందీని ఏదో విధంగా దొడ్డిదోవన అనుసంధాన భాషగా చేయాలన్నదే కేంద్రంలోని ఎన్డీయే పాలకుల ఉద్దేశమని విమర్శి స్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రంనుంచి ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. వాటిని ఎప్పటికప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తమిళనాడు వ్యతిరేకిస్తూనే వచ్చాయి.తమిళనాడు మాదిరే మహారాష్ట్రలో కూడా భాషాభిమానం బాగా ఎక్కువ. దాన్ని అన్నివిధాలా ఉపయోగించుకుందామని ఠాక్రే సోదరులు భావిస్తున్నట్టు కనబడుతోంది. సొంత అన్నదమ్ములు కాకపోయినా ఇద్దరూ శివసేనలో కలిసి పనిచేసేవారు. 2005లో వారిమధ్య పొరపొచ్చాలు బయల్దే రాక పార్టీ అధినేత బాల్ ఠాక్రే ఇద్దరి మధ్యా రాజీకి ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. 2006లో రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ స్థాపించారు. మొదట్లో యూపీ, బిహార్‌లనుంచి వలస వచ్చేవారి వల్ల స్థానికుల ఉపాధి దెబ్బతింటున్నదని, వారు దాదాగిరీ చలాయిస్తున్నారని ఆరోపిస్తూ నడిపిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత దుకాణాల బోర్డులన్నీ మరాఠిలో ఉండాలంటూ సాగించిన ఉద్యమం కూడా ఆ తోవలోనే నడిచింది. ఇవిగాక మరాఠీ ఆత్మగౌరవం పేరిట చాలా ఉద్యమాలు నడిపినా రాజ్ ఠాక్రేకు కలిసిరాలేదు. ఇప్పుడు బలవంతంగా హిందీ రుద్దుతున్నారన్న అంశంపై సాగించే ఉద్యమానికి స్పందన ఏమాత్రం వస్తుందన్నది చూడాలి. మహారాష్ట్రకు రావా ల్సిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తన్నుకుపోవటాన్ని తప్పుబడుతూ నిరుడు లోక్‌సభ ఎన్నికల సమ యంలో తాను నిలదీసినప్పుడు రాజ్ కలిసిరాలేదని, అదే జరిగుంటే ఇవాళ కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఉండేది కాదని ఉద్ధవ్ వాదన. తమ మధ్య కేవలం చిన్న చిన్న అపోహలు మాత్రమే ఉండే వని ఉద్ధవ్ అంటుంటే... అసలు సోదరులిద్దరూ విడిపోయిందెక్కడని యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఠాక్రే సోదరుల ప్రకటనలు వారిద్దరూ మళ్లీ కలిసి పనిచేయబోతు న్నారన్న సంకేతాలిస్తున్నాయి. అది బీజేపీ మనుగడను దెబ్బతీస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే పాలకులు మేల్కొనాల్సిన సమయం వచ్చింది. 1963 నాటి అధికార భాషల చట్టం, దానికి 1967లో తీసుకొచ్చిన సవరణలు గమనించి మసులుకుంటే భాషా వివాదం తలెత్తదు. అధి కార లావాదేవీలన్నిటా ఇంగ్లిష్, హిందీ వినియోగించాలని, హిందీ మాతృభాషగా లేని రాష్ట్రాలతో ఇంగ్లిష్‌లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాలని చట్టం స్పష్టంగా చెబుతున్నప్పుడు అందరూ హిందీ నేర్చుకు తీరాలని శాసించటం సరికాదు. దేశ సమైక్యత, సమగ్రత పేరిట దాన్ని తలకెత్తుకుంటే అందుకు విరుద్ధమైన ఫలితాలొస్తాయి. మహారాష్ట్ర పరిణామాలు ఆ సంగతిని చాటుతున్నాయి. -
తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు
వైఎస్సార్,సాక్షి : అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఐదు సున్నపు రాయి టిప్పర్లను సీజ్ చేయించారు. కంపెనీలోని కాంట్రాక్ట్ కార్మికులపై జులుం ప్రదర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులను బయటకు పంపించేశారు. కాంట్రాక్ట్ కార్మికులు లేకపోవడంతో కంపెనీలో పనులు నిలిచిపోయాయి.సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తామంటూ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.అల్ట్రాటెక్ సిమెంట్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు. అక్కడి కాంట్రాక్ట్‌లన్నీ తనకే కావాలని ఉత్పత్తిని అడ్డుకున్నారు. ఇన్ని చేస్తూనే తన తప్పులేదని బుకాయించడం చూసి విస్తుపోతున్నారు స్థానికులు. మూడున్నర దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధి..చిలంకూరు సిమెంట్ పరిశ్రమలో సుమారు 35 ఏళ్ల నుంచి స్థానికులు ఉపాధి పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకే అన్ని పనులు కావాలంటూ పరిశ్రమకు రవాణా అవుతున్న సున్నపురాయి, ఫ్లైయాష్‌ను బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులు శనివారం నుంచి అడ్డుకుంటున్నారు. దీంతో సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అగిపోయి మూతపడే దశకు వచ్చింది.అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్తరం వైపు సున్నపురాయి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినా మొత్తం పనులు తమకే కావాలని ఆదినారాయణరెడ్డి వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చిలంకూరులోని ఐసీఎల్ (అల్ట్రాటెక్) సిమెంట్ పరిశ్రమకు సరఫరా అయ్యే సున్నపురాయిని ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవటంపై యజమాన్యం ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు.చిలంకూరు సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులైన ఎస్.జగదీశ్వర్‌రెడ్డితో పాటు పది మందిపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్‌బాబు తెలిపారు. చిలంకూరు ఐసీఎల్ (అల్ట్రాటెక్) మైనింగ్ క్వారీ వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఇవి అరాచకాలు👉గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను తమ వర్గీయులకే అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరులు మందీ మార్బలంతో విధ్వంసం సృష్టించారు.👉ఆర్టీపీపీ నుంచి సిమెంట్ కంపెనీలకు ఫ్లైయాష్ రవాణా చేస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం దీన్ని తమకే అప్పగించాలంటూ వీరంగం సృష్టించింది.👉 ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో అల్ట్రాటెక్ (ఐసీఎల్) సిమెంటు పరిశ్రమకు ఫ్లైయాష్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులను 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తోంది. -
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.ముర్షిదాబాద్ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్ గవాయ్ పిటిషన్‌ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్ రిట్ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్ లాయర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్ గవాయ్(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. -
Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్ అన్నారు.बोस्टन : चुनाव आयोग ने हमें शाम 5:30 बजे तक के मतदान के आंकड़े दिए और शाम 5:30 बजे से 7:30 बजे के बीच 65 लाख मतदाताओं ने मतदान किया. ऐसा होना शारीरिक रूप से असंभव है :राहुल गांधी #RahulGandhi #MaharashtraElection #ElectionCommission #RahulGandhiUSA #Boston pic.twitter.com/8kSVOhZ6BU— Sumit Kumar (@skphotography68) April 21, 2025‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. సోమవారం బ్రౌన్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. -
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ పరిణామం.. దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. రెండు దశాబ్దాలుగా రాజకీయ విరోధులుగా ఉన్న సోదరులు ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రేలు కలిసి పోనున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ కలయిక ప్రచారాన్ని బీజేపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తోంది.ముంబై: యూబీటీ సేన-ఎంఎన్ఎస్ పొత్తు అవకాశాలపై ఓ హిందీ న్యూస్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ నారాయణ్ రాణే(Nitesh Narayan Rane) ఈ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఎంఎన్ఎస్తో థాక్రే శివసేన చేతులు కలపబోతోందా?. ఈ విషయంలో తన భార్య రష్మీ థాక్రే(Rashmi Thackeray) అనుమతి తీసుకున్నారో లేదో?. ఈ విషయాన్ని ఉద్దవ్ థాక్రేను మీరే(న్యూస్ యాంకర్‌ను ఉద్దేశించి..) అడగాలి. ఇలాంటి నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యమే ఎక్కువ అనే విషయం ఆయన మరిచిపోవొద్దు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.శివసేన నుంచి రాజ్ థాక్రే(Raj thackeray) నిష్క్రమణకు రష్మీనే కారణమన్న రాణే.. ఆ సమయంలో సోదరుల మధ్య ఎలాంటి విబేధాలు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రజలు మయూతీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని.. కాబట్టి ఎంఎన్ఎస్, యూబీటీ శివసేన పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. ఇక్కడి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నితీశ్ రాణే అన్నారు.ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే-రాజ్ థాక్రే విందు సమావేశంపైనా రాణేకు ప్రశ్న ఎదురైంది. షిండేకు బాల్ థాక్రే కుటుంబానికి దశాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా రాజ్ థాక్రేను బాల్ థాక్రేకు అంశగా షిండే భావిస్తుంటారు. అంతేగానీ వాళ్ల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది కాదు అని రాణే అన్నారు. మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్ థాక్రేతో కలిసి పని చేసేందుకు సిధ్ధమని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. ఇందుకు ఉద్ధవ్ థాక్రే కూడా సానుకూలంగా స్పందించడంతో ఇరువురు ఏకం కానున్నారనే వార్తలు విస్తృతమయ్యాయి. అయితే దీనిపై తాజాగా యూబీటీ సేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) మాట్లాడుతూ.. రాజకీయ పొత్తుకు సంబంధించి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, కేవలం వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నా బద్ధ శత్రువుకి కూడా ఈరోజు రాకూడదు -
బీజేపీ వివరణ రాజకీయ వంచన
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలపై ఆ పార్టీ చర్యలెందుకు తీసుకోలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. వారి విమర్శలు వ్యక్తిగతమని చెబుతూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం రాజకీయ వంచనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. ‘ఆ ఎంపీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కనీసం షోకాజ్ నోటీసులు ఎందుకివ్వలేదు?’ అని నిలదీశారు. తరచూ వివిధ వర్గాలు, వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా విద్వేష, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలకు పార్టీతో సంబంధం లేదంటూ దూరంగా ఉండటం కేవలం నష్ట నివారణ చర్య మాత్రమేనన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మౌనంగా ఉండటం తగదని పేర్కొన్నారు. ఒక వేళ ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో పార్టీ ఏకీభవిస్తోందా? అని జేపీ నడ్డాను ప్రశ్నించారు. భారత రాజ్యాంగంపై ఇలా పదే పదే జరుగుతున్న దాడులపై ప్రధాని మౌనంగా ఉండటమంటే వారికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని జైరామ్ రమేశ్ అన్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ వంచన అని ఆయన అభివర్ణించారు. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ నిశికాంత్ దూబే పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన అల్లర్లు, వక్ఫ్ చట్టంపై చేసిన వ్యాఖ్యలు ధిక్కారం కిందికే వస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘ఇది కోర్టు ధిక్కారానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన స్పష్టమైన కేసు. తేలిగ్గా తీసుకోలేం. భారత ప్రధాన న్యాయమూర్తిపై ఈ ఎంపీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థను బెదిరించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన ప్రత్యక్ష దాడి. స్పీకర్, సుప్రీంకోర్టు ఆ ఎంపీపై చర్య తీసుకోవాలి’ అని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఎంపీ దూబే శనివారం సుప్రీంకోర్టుపై విమర్శలు చేయడం తెల్సిందే. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తుంటే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలను మూసివేసుకోవాల్సిందేనన్నారు. దేశంలో సివిల్ వార్లకు సీజేఐ కారణమని నిందించారు. అదేవిధంగా, రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన బిల్లులపై 90 రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించిన యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఇటీవల.. పార్లమెంట్‌ను, రాష్ట్రపతిని ఎవరూ ఆదేశించలేరంటూ వ్యాఖ్యానించారు. అయితే, వీరి వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని శనివారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. ‘న్యాయవ్యవస్థ, భారత ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇవి వారి వ్యక్తిగతం. పార్టీ వీటితో ఏకీభవించదు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతివ్వదు. పూర్తిగా తిరస్కరిస్తుంది’ అని నడ్డా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం
సాక్షి, హైదరాబాద్/ అత్తాపూర్: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవటం తెలంగాణ సమాజానికి చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవలసిన బాధ్యత తెలంగాణ సమాజంపైనే ఉందని తెలిపారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు తరలివచ్చి కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు.వారికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు కేసీఆర్ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ మళ్లీ వెనక్కు తీసుకెళ్తోందని మండిపడ్డారు. ‘మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో మనకు జరిగిన నష్టం తక్కువ. మన ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది.స్వరాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. ఈ రికార్డును ఎవరూ చెరపలేరు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ఎవరన్నా అనుకుంటే అది వారి అజ్ఞానం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. దండయాత్రలు చేసిన రాజులు కూడా ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పరు’అని కేటీఆర్ అన్నారు. బీజేపీకి మత పిచ్చి లేపడమే తెలుసు ‘దేశంలో మత పిచ్చి లేపడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ వెనక్కి పోయినట్టే.. మోదీ నాయకత్వంలో దేశం వెనక్కి పోతుందని అన్నారు. ‘మత పిచ్చి మంచిది కాదు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. హిందువులు ప్రమాదంలో ఉన్నారట! 2014 వరకు మంచిగా ఉన్న హిందువులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారట. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లేని పంచాయితీ ఇప్పుడు ఎందుకు కొత్తగా పెడుతున్నారు? రాజకీయం కోసం దేశాన్ని విడగొడుతున్నారు. మంచి పనులు చేసి ఓట్లు అడగాలి. హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరాం, మోదీ.. ఈ ఐదు పదాలు చెప్పకుండా ఓట్లు అడిగేటోళ్లు ఎవరైనా ఉన్నారా? తెలంగాణకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ శత్రువులే’అని కేటీఆర్ విమర్శించారు. గరీబోళ్ల ఇండ్లపైకే హైడ్రా బుల్డోజర్లు హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘హైడ్రాతో ఆస్తులు కాపాడుతాం అంటున్నారు. చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రర్‌రావు, సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇళ్లను మాత్రం ముట్టరు. అల్కగా దొరికే గరీబోని పైకి బుల్డోజర్లు పంపుతున్నారు. రైతుబంధు, తులం బంగారం, రుణమాఫీ, స్కూటీలకు పైసల్లేవు కానీ.. మూసీకి మాత్రం లక్షన్నర కోట్లు ఇస్తారట’అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి ఆదినారాయణరెడ్డి బెదిరింపులు
-
ఆది అరాచకం.. అల్ట్రాటెక్‌కు మరోసారి బెదిరింపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు మితిమీరిపోతున్నాయి. మరోమారు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై బెదిరింపులకు దిగారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అల్ట్రాటెక్ సిమెంట్స్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు.అక్కడి కాంట్రాక్టులన్నీ తనకే కావాలంటూ ఉత్పత్తి అడ్డుకున్నారు. ముడిసరుకు, ఉత్పత్తి బయటకు వెళ్లకుండా బస్సు అడ్డుగా పెట్టీ మరీ బెదిరింపులకు దిగారు. అదినారాయణరెడ్డి దౌర్జన్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫ్యాక్టరి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసు బందోబస్తుతో తిరిగి ఉత్పత్తి పునరుద్ధరించారు. అయినా తన తప్పేమీ లేదంటూ ఆదినారాయణరెడ్డి బుకాయించారు. పైగా సీఎంతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ మరోసారి బెదిరింపులకు దిగారు.కాగా, చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో గత రెండు రోజుల క్రితం కూడా ఉత్పత్తి ఆగిపోయిన సంగతి తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న బెదిరింపులు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.మొన్న అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను అడ్డుకుని విధ్వంసం..! నిన్న ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా లారీలను అడ్డుకుని దౌర్జన్యం..! తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు..! వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి ఆది నుంచి అరాచకాలనే ప్రోత్సహిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. -
బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర
-
అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే
పెద్దపల్లి జిల్లా,సాక్షి: పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాం. అలాంటి బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉంది. టైటిల్ డీడ్ లేని భూములను వక్ఫ్ పేరుతో ఆక్రమించుకున్న చరిత్ర ఎంఐఎం పార్టీది. న్యాయస్థానాలపై భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉంది. నిన్న జరిగిన మీటింగుకి ఖర్మ, కర్త, క్రియ రేవంత్ రెడ్డియే..మీటింగు కోసం నిధులు సమకూర్చింది కూడా రేవంత్ రెడ్డియే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు నాటకాలాడుతున్నాయి. మంచి ఉద్దేశంతో బిల్ తీసుకువస్తే మత కోణంలో ప్రతిపక్షాలు విద్వేశాలు రెచ్చగొడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నిజమైన వారుసుడు మోదీయే. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలి. రైతుల విషయాన్ని పక్కన పెట్టి వక్ఫ్ మీటింగు కోసం కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తాపత్రయ పడుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. -
ఆడియో టేపుల కలకలం.. తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యకు కుట్ర
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొండా ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు నిందితులు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా కోర్టు, రియల్ఎస్టేట్ కార్యాలయాల వద్ద కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీషీటర్లు అనుమానాస్పదంగా కనిపించారు.ఓ హత్యకేసులో ప్రశాంత్‌రెడ్డి నిందితుడు కావడం, రూ.2.5 కోట్లకు సుఫారీ కుదుర్చుకున్నట్లు పలు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రశాంత్‌రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెలుగులోకి వచ్చిన ఆడియోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
బీఆర్ఎస్.. రాం రాం! .. మరి కాంగ్రెస్ వైఖరేమిటో?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసకందాయంగా మారనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నిక జరగనుంది. తగిన బలం లేకపోయినప్పటికీ, బీజేపీ తమ అభ్యరి్థని బరిలో దింపడంతో పోలింగ్ అనివార్యంగా మారింది. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికకు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తమ అభ్యర్థులను పోటీకి దింపలేదు. కాంగ్రెస్‌కు సంబంధించి ఎంఐఎంకు స్నేహహస్తం కోసమే పోటీకి దింపలేదని కూడా ప్రచారంలో ఉంది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కలిసిమెలిసి గెలిచిన ఆ రెండు పారీ్టలూ ఈ ఎన్నికలోనూ అదే వైఖరి పాటించనున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీల ఎన్నిక సందర్భంగా ఇచి్చన హామీ మేరకు సైతం కాంగ్రెస్ రంగంలో దిగలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.బీఆర్ఎస్ దూరం.. ఎంఐఎంతో విభేదాల్లేని బీఆర్ఎస్.. ఆ పార్టీకికి మద్దతు ఇస్తుందా, లేక పోలింగ్‌కు గైర్హాజరవుతుందా అని ఆలోచిస్తున్న రాజకీయ పరిశీలకుల ఆలోచనలకు తెర దించుతూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. విప్ జారీ చేస్తామని, ఎవరైనా ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కాంగ్రెస్ దారెటు ? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోలింగ్‌లో పాల్గొంటుందా, లేక అది సైతం పోలింగ్‌కు దూరంగా ఉంటుందా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఎందుకంటే.. కాంగ్రెస్ పోలింగ్‌లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఎంఐఎంకు వచ్చే నష్టమంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి ఓట్లేసే అవకాశం లేదు. మిగిలింది ఎంఐఎం మాత్రమే అయినందున కాంగ్రెస్ పోలింగ్‌లో పాల్గొంటే ఆ పార్టీ మెజార్టీ పెరుగుతుందే తప్ప దానికి ఓటమి అంటూ లేదని చెబుతున్నారు. మొత్తం 112 మంది ఓటర్లలో బీజేపీకి 25 ఓటర్ల బలం ఉండగా, ఎంఐఎం బలం 49గా ఉంది. అంటే దాదాపు రెట్టింపు బలం. కాబట్టి ఎంఐఎం గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అనూహ్య పరిణామం ఏమైనా జరిగేనా? ఇదే తరుణంలో అనూహ్యంగా ఏమైనా జరగనుందా ? అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. అందుకు కారణం ఈసారి ఎలాగైనా ఈ ఎన్నికలో గెలవాలనే తలంపుతోనే బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దింపిందని చెబుతున్నారు. అంతే కాదు.. పోలింగ్‌కు సంబంధించి సన్నాహక సమావేశం, మాక్‌పోలింగ్ వంటివి సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పారీ్టకి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడూ ఒకటేనన్నారు. ఎంఐఎంను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీలో లేవని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మరో కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం ఎంఐఎంను ఓడించేందుకు పార్టీలకతీతంగా ఓట్లేయాలని పిలుపునిచ్చారు. విప్ ఉండదా? ఈ నేపథ్యంలోనే తమ పార్టీ పోలింగ్‌ను బహిష్కరిస్తుందని కేటీఆర్ చెబుతున్నారు. ఈ ఎన్నిక నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ సమాచారం మేరకు అసలు విప్ అంటూ ఉండదు. అయినా విప్ జారీ చేస్తామనడం పారీ్టవారు కట్టుతప్పకుండా ఉండటానికేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు, బీజేపీ తగిన వ్యూహరచన చేసిందని వినిపిస్తోంది. గెలుస్తామనే ధీమాలోనే ఆ పార్టీ ఉందని, అందుకే ఈ ఎన్నిక కోసమే గ్రేటర్ పరిధిలోని ఎంపీలు కిషన్‌రెడ్డితో పాటు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ఎక్స్‌అఫీíÙయో సభ్యులుగా ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ రోజుకో మలుపుతో ‘స్థానిక’ ఎన్నిక రసకందాయంగా మారింది. పోలింగ్ వరకు ఇంకా ఏం జరగనుందోనన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. -
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
రాంచీ: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు ఆ జాబితాలో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ నిక్షికాంత్ దుబే చేరిపోయారు. సుప్రీం తీర్పు ‘అరాచకం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ.. ఇక తాము పార్లమెంట్ ను, అసెంబ్లీలను కూడా మూసేస్తాం అంటూ సెటైర్లు వేశారు. ప్రధానంగా రాష్ట్రపతికి మూడు నెలల టైమ్ లైన్ విధించడాన్ని ఆక్షేపించారు సదరు ఎంపీ.నియామక అధికారికి మీరు ఎలా దిశానిర్దేశం చేస్తారు?, రాష్ట్రపతి అనేవారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను నియమిస్తారు. పార్లమెంట్ అనేది ఈ దేశంలో చట్టాలు తయారు చేస్తుంది. అప్పుడు మీరు పార్లమెంట్ ను ఎలా డిక్టేట్ చేస్తారు. మీరు కొత్త చట్టాన్ని ఎలా రూపొందించారు. ఏ చట్టంలో రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది? అంటే మీరు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందేనని దూబే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ పరిమితులపై ప్రశ్నలను లెవనెత్తింది’ అంటూ వ్యాఖ్యానించారు.ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు.ఇవీ చదవండి:వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులురాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’ -
బీఆర్ఎస్ బండారం బట్టబయలు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ బండారం బయటపడిందని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎంను గెలిపించేందుకే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉందని ఆరోపించారు. భాగ్యనగర్‌ను మజ్లిస్‌కు అప్పగించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు.ఈ మూడు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని రాజాసింగ్ ఆరోపణలు గుప్పించారు. భాగ్యనగర్‌లో బీఆర్ఎస్ను పాతరేస్తాం. మజ్లిస్‌ను గెలిపిస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఖతమైనట్లేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఉద్దేశించి అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లే.. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయండి అంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు.కాగా, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్‌కట్ చేస్తున్నామని.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. -
బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. 17 నెలల కాలంలో బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పెరిగిందన్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్‌కట్ చేస్తున్నామని.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.హెచ్‌సీయూ భూ కుంభకోణం వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడంటూ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఒక్క రూపాయైనా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే.. రేవంత్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష, పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్న.. కేటీఆర్.. బీఆర్ఎస్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందన్నారు.చేసినవి చెప్పుకోనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీయూ, హైడ్రా, మూసీ పేరుతో అరాచకాలు సృష్టిస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌ను ఒక్క మాట కూడా అనరని.. హెచ్‌సీయూ భూములపై ప్రధాని మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
చంద్రబాబు చెవిలోనైనా ఆ విషయం చెబుతారా?
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద కంచ గచ్చిబౌలి వద్ద ఉన్న 400 ఎకరాల భూమికి సంబంధించి ఒకవైపు సుప్రింకోర్టు విచారణ జరుపుతుండగా, ప్రధానమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోందని మోదీ ఆరోపించారు. అక్కడ జంతువులను ప్రమాదంలో పడేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అయితే.. .. ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) ఇప్పటికే 33 వేల ఎకరాల పచ్చటి పంటల భూములను పర్యావరణంతో సంబంధం లేకుండా నాశనం చేస్తే మద్దతు ఇచ్చిన బీజేపీ పెద్దలకు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి నైతికంగా అర్హత ఎంత మేర ఉంటటుందన్నది ఆలోచించుకోవాలి. అది చాలదన్నట్లుగా మరో 45 వేల ఎకరాలు సమీకరిస్తామని బాబు సర్కార్ చెబుతుంటే కనీసం స్పందించని బీజేపీ.. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 👉అయినా తెలంగాణలో బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక విమర్శలు, ఆరోపణలు చేస్తే చేయవచ్చు. కాని దేశ ప్రధాని అంతటివారు ఈ వివాదంలో వేలు పెట్టడం పద్దతేనా?. అది సుప్రీం కోర్టు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చకు ఆస్కారం ఇస్తోంది. హామీలు అమలు చేయకుండా రేవంత్ సర్కార్ బుల్డోజర్లను వాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో అభివృద్ది పరుగులు తీస్తోందని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రాలను పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై మోదీ అధిక విమర్శలు చేయడం ద్వారా ఆయనలోని రాజకీయ నేత కోణం అంతగా మంచి పేరు తేకపోవచ్చు. ఉత్తరప్రదేశ్ తదితర కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో నేరస్తుల పేరుతో ఇళ్లను ఇష్టారాజ్యంగా కూల్చివేస్తున్న తీరుపై చాలా అసంతృప్తి ఉంది. సుప్రీంర్టు సైతం దీనిపై పలుమార్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ విషయాలను మోదీ గమనంలోకి తీసుకుంటారో లేదో తెలియదు. రేవంత్ ప్రభుత్వం కంచ గచ్చి బౌలి భూముల విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైనదా? కాదా? అనేది ఇక్కడ చర్చ కాదు. దానిని సమర్ధించవచ్చు. వ్యతిరేకించవచ్చు. స్థానిక ప్రజలు తమ అభీష్టాన్ని ప్రభుత్వానికి చెప్పవచ్చు. అది వేరే సంగతి. కాని గతంలో దేశ ప్రధానులలో ఎవరూ ఇలా రాష్ట్రాలపై తరచు విమర్శలు చేసినట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో పార్టీ పరంగా, విధానపరంగా విమర్శలు,ప్రతి విమర్శలు చేయడానికి వారు ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చు. అంతే తప్ప, ఏ రాష్ట్రానికి వెళ్లినా అదే పనిలో ఉండడం గతంలో ఈ స్థాయిలో ఉండేది కాదని చెప్పవచ్చు. లేదా మహా అయితే పరోక్షంగా ఏమైనా ఒకటి,రెండు విమర్శలు చేసి ఉండొచ్చు. 👉మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలపై పనికట్టుకుని ఆరోపణలు చేసేవారుకాదు. కాకపోతే సింగ్ బ్యూరోక్రాట్ నుంచి రాజకీయనేతగా మారారు. మోదీ మొదట ఆర్ఎస్ఎస్ లో ఉండి ,తదుపరి రాజకీయ నేతగా ఎదిగారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలోని కంచ గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిపై వివాదం ఏర్పడిన మాట నిజం. ఆ భూములలోఎలాంటి పనులు చేపట్టవద్దని పలువురు కోరిన సంగతి కూడా నిజమే. దానిపై కేంద్రప్రభుత్వపరంగా ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని సజెస్ట్ చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసి ఉండవచ్చు. కాని అవేవీ చేయలేదు. 👉తెలంగాణ బీజేపీ నేతలు(Telangana BJP) ఏ విమర్శలు చేశారో వాటినే ప్రధాని మోదీ కూడా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం అవి అసలు అటవీశాఖ భూములే కాదు. ప్రభుత్వ భూములని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాతే అక్కడ కొన్ని కార్యకలాపాలు చేపట్టడం జరిగింది. ఆ భూముల ఆధారంగా పదివేల కోట్ల రుణ సమీకరణ కూడా చేశారు. ఈలోగా దీనిపై యూనివర్శిటీలో విద్యార్దులు వ్యతిరేకించి ,ఆ భూమి కూడా సెంట్రల్ యూనివర్శిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దానికి బీజేపీ, బీఆర్ఎస్లు మద్దతు ఇవ్వడం, సడన్‌గా సుప్రీం కోర్టు కూడా సుమోటోగా జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగింది. దీనికి రేవంత్ సర్కార్ బదులు ఇస్తూ కంచగచ్చిబౌలి(kanche Gachibowli) భూములు అటవీ భూములు కాదని, ప్రభుత్వం అధీనంలో ఉన్న భూములని స్పష్టం చేసింది. అక్కడ జంతువులకు ఆవాసం లేదని,వాటికి తగు రక్షణ కల్పించడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 👉ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేదిత జాబితాలో లేవని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే సుప్రీం కోర్టు దీనిపై కూడా అంత సంతృప్తి చెందలేదు. చెట్లు కొట్టివేయడానికి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు..కాని ఈలోగా ప్రధాని మోదీ అవి అడవులని, అక్కడ జంతువులు ఉన్నాయని, అడవిని, జంతువులను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని రాజకీయంగా మాట్లాడడం పద్దతేనా అనే అభిప్రాయం కలుగుతుంది. తెలంగాణలో అధికారం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండవచ్చు. దానికి తగిన విధంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంటారు. తెలంగాణకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేస్తే అదో తరహా. కాని ఎక్కడో హర్యానాలో ఒక సభలో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. నిజంగానే పర్యావరణంపైన ప్రధానమంత్రికి అంత శ్రద్దాసక్తులు ఉన్నట్లయితే ఏపీలో రాజధాని పేరుతో 33వేల ఎకరాలు సమీకరించినప్పుడు బిజెపి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?. మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారే. అవసరమైనమేర ప్రభుత్వ భూమిని వాడుకుంటే మంచిదని అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మోడీ ఎందుకు సలహా ఇవ్వలేదు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ విడిపోయాక.. పోలవరం, అమరావతి టీడీపీ నేతలకు ఏటీఎంగా మారాయని ఆయనే ఆరోపించారు కదా?. ఆ తర్వాత 2024లో మళ్లీ పొత్తు పెట్టుకున్నాక అవన్ని తూచ్ అయిపోయినట్లనుకోవాలా?. ఇంతకుముందు తీసుకున్న 33 వేల ఎకరాలు కాకుండా,మరో 45వేల ఎకరాల భూమి సమీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం సరైనదా? కాదా? అనేదానిపై మోదీ మాట్లాడడానికి సిద్దంగా ఉంటారా?. మరోసారి రాజధాని పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మే 2 న వస్తారట.అప్పుడైనా పర్యావరణానికి విఘాతం కలిగేలా ఇన్నివేల ఎకరాల భూములు ఎందుకు?అక్కడ పంటలను ఎందుకు నాశనం చేస్తున్నారు? పక్కనే ఉన్న కృష్ణానది మరింత కలుషితంగా మారడానికి ఈ చర్య అవకాశం ఇస్తుంది కదా? అని ప్రధాని ప్రశ్నించితే.. తెలంగాణ భూములపై చేసిన వ్యాఖ్యలను సమర్దించవచ్చు. అలా కాకపోతే అవకాశవాద రాజకీయాలకే ప్రధాని ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంగతి ప్రజలకు తెలిసిపోదా?. తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా మాట్లాడితే మోదీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.., ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు మద్య తేడా ఏముంటున్నదన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ప్రతి అంశంలోను పార్టీపరంగా కాకుండా దేశ ,రాష్ట్ర ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తే బాగుంటుంది కదా!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Dr B R Ambedkarవీళ్ళే ఇలా రాస్తే ఎలా?!
అంబేడ్కర్ జయంతికి కేంద్ర మంత్రులు అంబేడ్కర్‌పై పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఒకరు దీన్ని కాంగ్రెస్ విమర్శకు వాడుకుంటే, మరొకరు అంబేడ్కర్ నోట అబద్ధాలు కుక్కారు. వీటిని ఆదర్శాల పేరుతో భావితరాలకు బోధిస్తారట. ఆర్య దండ యాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారనీ, సంస్కృతాన్ని అధికార భాషగా ఆమోదించడానికి మద్దతుగా రాజ్యాంగ సభలో సవరణను ప్రవేశపెట్టారనీ. హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి అని ప్రకటించారనీ ఇలా ఎన్నో అవాస్తవాలను రాశారు వారు. ‘‘ఇండో–ఆర్యులు ఇండియాకు వలస వచ్చి స్వదేశీయులను తరిమేశారు. వలస వాద, బ్రాహ్మణవాద కథనాలు కులాధిపత్య సమర్థనలు. ఆర్యులు సాంస్కృతిక భాషా సమూహం, ప్రత్యేక జాతి కాదు. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాల్లోని విభేదాలు సామాజిక అంత ర్గత పోరాటాల ప్రతిబింబాలు. ఆర్య దండయాత్ర సూత్రం ఆర్యేతర శూద్రుల, దళితుల అణచివేత సాధనం.’’ అని రాశారు అంబేడ్కర్. ఆర్య సూత్ర జాతి సంస్కృతుల ఊహలను సవాలు చేశారు. యజుర్, అధర్వణ వేదాల రుషులు శూద్రు లకు తగిన ప్రాధాన్యమిచ్చినట్లు అంబేడ్కర్ అనలేదు. ‘‘శూద్రులు ముందు ఆర్య క్షత్రియుల్లో భాగం. జనశ్రుతి (శూద్రుడు) వైదికజ్ఞాన అభ్యాసం, కవశ ఐలూశ (శూద్రుడు) శ్లోకాల రచన సంగతులు ఈ వేదాల్లో ఉన్నాయి. వేదాలు శూద్రుల జాతి, సామాజిక హీనతను సమర్థించ లేదు. మనుస్మృతి ఆ పని చేసింది. బ్రాహ్మణ, ప్రత్యేకించి ఉపనయన, ఆచారాల విభేదాలతో వారిని నాల్గవ వర్ణానికి దిగజార్చారు. శూద్రుల ఉన్నత స్థాయి తగ్గింపునకు వేదకాలం తర్వాతి బ్రాహ్మణ నీతి ఇది’’ అని అన్నారు. అంబేడ్కర్ శూద్రులతో పోల్చి ఆర్యులను పొగడలేదు. ఆర్య ఉన్నత జాతి సూత్రీ కరణను తిరస్కరించారు. ద్రవిడ, నాగ, దాస తెగలు అనార్యుల్లో భాగమని, వారు ఆర్యు లకు ఏ విధంగానూ తక్కువ కారని అంబేడ్కర్ అభిప్రాయం. అంబేడ్కర్ అధి కార భాషగా సంస్కృతానికి మద్దతివ్వలేదు. సంస్కృతాన్ని ప్రజలు అతి తక్కువగా వాడు తారని, పాలనకు, ప్రజలు ఒకరితోనొకరు మాట్లాడుకోవడానికి సంస్కృతం ఆచరణీయం కాదనేది ఆయన అభిప్రాయం. హిందీని రుద్దడం హిందీయేతర భాషా ప్రాంతాల అణచివేతకుదారి తీయగల అపాయాన్ని జాగ్రత్తగా పరిగణించాలన్నారు. ఆంగ్లంతో పాటు హిందీ భారత ప్రజల లంకె భాషగా ఉండాలని అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో వాదించారు. మరిఅంబేడ్కర్ ఆదర్శాలను సంఘ్ సర్కారు ఆచరిస్తుందా? – సంగిరెడ్డి హనుమంత రెడ్డి,ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
కత్తులతోనే పొత్తు పొడుపు!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉండగానే తమిళనాడులో ప్రత్యర్థి పార్టీల మధ్య చిట పటలు మొదలైపోయాయి. ఈసారి ఎలాగైనా నిలదొక్కుకుని పార్టీ జెండా రెపరెపలాడించాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విమర్శల జోరుపెంచారు. స్టాలిన్ కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. రెండేళ్ల క్రితం తమను వీడివెళ్లిన అన్నా డీఎంకేతో బీజేపీ చెలిమిని ఖరారు చేసుకుంది. అందుకోసం అమిత్ షా చెన్నై రావటాన్ని చూస్తే రాబోయే పోరులో తమది కీలకమైన పాత్రని ఆ పార్టీ చెప్పదల్చుకున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈ సాన్నిహిత్యం ఏమంత సజావుగా లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కేవలం ఈ చెలిమి కోసం బీజేపీ అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో నయనార్ నాగేంద్రన్ను నియ మించింది. అన్నామలై గత రెండేళ్లుగా డీఎంకే సర్కారుపైకి దూకుడుగా పోతున్నారు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఆధిపత్య కులాల వోట్లు రాబట్టడంలో, యువతను సమీకరించటంలో ఆయన విజయం సాధించారు. సీట్లయితే రాలేదుగానీ... బీజేపీ వోటు శాతం 11.24 శాతా నికి చేరుకుంది. కానీ ఆ దూకుడు పొత్తు రాజకీయాల్లో చిచ్చు పెడుతుందన్న భయం బీజేపీ అధిష్ఠా నంలో వుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామిపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. అవి వ్యక్తిగత స్థాయికి వెళ్లి పోయాయి. అందుకే ఎన్నికల వరకూ పొత్తు సజావుగా వుండాలంటే అన్నామలైని తప్పించటమే మంచిదని కేంద్ర నాయకత్వం భావించింది. నాగేంద్రన్ అన్నాడీఎంకే నుంచి వచ్చినవారే. జయ సర్కారులో పళని స్వామి, ఆయనా సహచరులు కూడా. 2016లో జయ మరణం తర్వాత నాగేంద్రన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ మాటెలావున్నా రెండు పార్టీలకూ ఇది ఇష్టం లేని పొత్తే. కొన్ని సీట్లయినా సాధించుకోగలిగితే ద్రవిడ కోటలో పాగా వేశామన్న అభిప్రాయం కలిగించ వచ్చని బీజేపీ ఆశిస్తోంది. అటు అన్నాడీఎంకే పరిస్థితీ ఏమంత బాగోలేదు. జయ మరణంతో అది అనాథగా మారింది. అంత ర్గత కీచులాటల మధ్య 2021 వరకూ ప్రభుత్వం మనుగడ సాగించినా తర్వాత అది మూడు ముక్క లైంది. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో 66 స్థానాలొచ్చాయి. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 39 స్థానాలనూ డీఎంకే కూటమి గెల్చుకుంది. అందుకే అటు బీజేపీకి, ఇటు అన్నాడీఎంకేకు ప్రస్తుత పొత్తు ప్రాణావసరమైంది.సమస్యేమంటే రెండు పార్టీల మధ్యా పొత్తు ఏర్పడినా, అది ఎన్డీయే కూటమిగా ఉంటుందని అమిత్ షా చెప్పినా ఈ చెలిమితో ఇరుపక్షాలూ ఇబ్బంది పడుతున్న వైనం కనబడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేకుండానే తాము 11.24 శాతం వోట్లు రాబట్టుకోగలిగామని బీజేపీ ధీమాగా వుంది. కానీ ఆ పరిస్థితి అన్నాడీఎంకేలో లేదు. అధికారంలో పాలుపంచుకుంటామో, లేదో ఎన్నికల తర్వాతే చెబుతామని షా అంటే... ఎన్నికల్లో పోటీవరకే పొత్తులని పళనిస్వామి ప్రక టించారు. తమిళనాడు రాజకీయ ధోరణులు గమనిస్తే అక్కడ కూటమి ప్రభుత్వాలు ఎప్పుడూ లేవు. పొత్తులున్నా రాష్ట్ర మంత్రివర్గంలో ఏనాడూ జాతీయ పార్టీలకు చోటీయలేదు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందనుకుంటే తప్ప తమిళ వోటర్లు కనికరించరని పళనిస్వామి, అమిత్ షాలు అనుకుని వుండొచ్చు. అయితే డీఎంకేపై విరుచుకుపడటానికి తగిన ఆయుధాలు లేకపోవటం ఎన్డీయే కూటమికున్న ప్రధాన సమస్య. కాశీకి ప్రత్యేక రైలు నడపటం, కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్, వీణ పెట్టడం ద్రవిడ రాజకీయ ప్రాబల్యంగల తమిళనాడును అంతగా ఆకర్షించినట్టు లేదు. స్టాలిన్ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి. ముఖ్యంగా ఆయన తమిళుల ఆత్మగౌరవంఅంశాన్ని ముందుకు తెచ్చారు. తమిళులు అనాగరికులని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యా నించటం, అనంతరం క్షమాపణ చెప్పటం ప్రస్తావిస్తున్నారు. బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తు న్నారని ఆరోపిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం నవీన్ పట్నాయక్‌కు సన్నిహి తుడైన తమిళ ఐఏఎస్ అధికారి వీకే పాండ్యన్‌పై బీజేపీ రేపిన దుమారాన్ని గుర్తుచేస్తున్నారు. ఒడిశా ప్రజలపై తమిళులు పెత్తనం ఎలా చేస్తారని ప్రశ్నించటాన్ని ఎత్తిచూపుతున్నారు. గత పదేళ్లలో తమిళ నాడుకు కేంద్ర నిధులు మూడు రెట్లు పెరిగినా కొందరికి ఏడవటం అలవాటైపోయిందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలనూ ఆయన తనకు అనుకూలంగా మలుచుకున్నారు. తమ వంతు వాటా అడగటం తమ హక్కని, అందుకు ఏడవటం లేదా బానిసత్వం చేయటం చేతకాదని స్టాలిన్ జవాబి చ్చారు. 234 స్థానాలుగల అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 133, మిత్రులతో కలిసి 159 గెల్చుకుంది. 46 శాతం వోట్లు రాబట్టింది.ఇప్పటికైతే తమిళనాట సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవం ప్రధానాంశాలు. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచటం, సుప్రీంకోర్టు ఆయన్ను మందలించటంతోపాటు వాటిని ఆమోదించినట్టుగా భావించాలని చెప్పటం స్టాలిన్‌కు మరింత శక్తినిచ్చింది. అవినీతి పెరిగిందని, వేలకోట్ల ప్రజాధనాన్ని డీఎంకే నేతలు దోచు కుంటున్నారని, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్ని ఎంతవరకూ కదలించగలవో చూడాలి. అంతకన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వచ్చే ఏప్రిల్‌నాటికైనా తమ పొత్తు విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కనబర్చటం అవసరమని ఎన్డీయే గుర్తించాలి. -
‘అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా మాకేం కాదు.. అది డీఎంకే పవర్’
చెన్నై: ఇటీవల అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. గత వారం అదొక ‘అవినీతి కూటమి’ అంటూ వ్యాఖ్యానించిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్.. వారి పొత్తుపై మరొకసారి ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తమిళనాడుకొచ్చి బీజేపీ ఏదో చేద్దామని కలలు కంటుందని, అది వారి వల్ల కాదని స్టాలిన్ నేరుగా విమర్శలు చేశారు. తమిళనాడుకు అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా తమకేమీ కాదంటూ విమర్శించారు. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకునే సందర్భంలో తమిళనాడుకు సంబంధించి ఏ ఒక్క విషయంలోనూ బీజేపీ పెద్దలు క్లారిటీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అవకతవకలు జరిగిన నీట్ ఎగ్జామ్స్ కు సంబంధించి రాష్ట్ర విద్యార్థులకు ఎటువంటి మినహాయింపును బీజేపీ ఇవ్వలేదన్నారు. అదే సమయంలో హిందీని తమిళనాడులో రుద్దమనే విషయంలో కూడా వారు ఏమీ స్పష్టత ఇవ్వలేదని, ఇక డీలిమిటేషన్ అంశంపై కూడా ఏమీ పెదవి విప్పలేదని బీజేపీని కార్నర్ చేశారు స్టాలిన్.తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తమ ప్రభుత్వం పట్ల వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టులాంటి తీర్పని స్టాలిన్ వ్యాఖ్యానించారు. వ్యవస్థలను వ్యక్తులను అడ్డుపెట్టుకుని పెత్తనం చేయాలని ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. తాను ఇక్కడ ఒక విషయం మాత్రం దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నానని, తమ పోరాటం కేవలం తమిళనాడుకి, తమిళ ప్రజలకు సంబంధించినది మాత్రమే కాదని, యావత్ దేశ ప్రజల తరఫున చేస్తున్న పోరాటంగా స్టాలిన్ అభివర్ణించారు. ఇది డీఎంకే బలమంటూ బీజేపీ, అన్నాడీఎంకేల పొత్తును దెప్పిపొడిచారు. అందుచేత తమిళనాడు ఎవరు వచ్చినా తమను ఏం చేయలేరని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది..!
హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి తనకు పార్టీ నేతలు బర్త్ డే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ కు అలకబూనారట. రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పగా, బీజేపీ నుంచి ముఖ్య నేతల ఎవరూ కూడా ఆయనకు విషెస్ చెప్పలేదట. దాంతో రాజాసింగ్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో జరిగిన సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారట. ఈటెల రాజేందర్‌తో సహా పలువురు ప్రముఖ నేతలు ఆ మీటింగ్ కు హాజరు కాగా, రాజాసింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం నిర్వహించిన సమయంలో రాజాసింగ్ ఇలా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే కారణమా?.. లేక ఇంకేమైనా ఉందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది.బండి సంజయ్ రాజీ చేశారు.. కానీకొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి అలక పాన్పు ఎక్కిన రాజాసింగ్ఎం ను ఇటీవల ఎంపీ బండి సంజయ్ స్వయంగా కలిసి ఆయనకు నచ్చజెప్పి వచ్చారు. ప్రధానంగ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు. గౌతంరావును ఆ స్థానంలో నిలబెట్టడానికి ప్రధాన కారణం బండి సంజయ్ కాబట్టి.. రాజాసింగ్ ను బుజ్జగించి వచ్చారు. అప్పుడు గౌతంరావుతో రాజాసింగ్ ను కరాచలనం చేయించడమే కాకుండా ఇరువురు నేతలు శాలువాలతో సత్కరించుకునే కార్యక్రమం కూడా జరిగింది. ఇంతలోనే రాజాసింగ్ మళ్లీ పార్టీ శ్రేణులపై కోపంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తును ప్రచారం జరుగుతోంది ఇందుకు తన బర్త్ డేకు పార్టీలోని ప్రముఖలు విషెస్ చెప్పకపోవడంగా సమాచారం. సీఎం రేవంత్ విషెస్ చెప్పగా, తమ సొంత పార్టీలోని ముఖ్యులు ఎవరూ కూడా కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే కారణంతో రాజాసింగ్ కోపంగా ఉన్నారట, నేటి బీజేపీ కీలక సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉండటానికి ఇదే కారణమనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది. -
తమిళనాడులో అమిత్ షా రూల్ చెల్లదు: స్టాలిన్
చెన్నై, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా రూల్ తమిళనాడులో చెల్లదంటూ ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారు. విభజించు పాలించు సిద్ధంతం ఇక్కడ పని చేయదు. తమిళనాడు ఏనాటికీ ఢిల్లీ నియంత్రణలోకి వెళ్లబోదు అంటూ వ్యాఖ్యానించారు. నీట్, జాతీయ విద్యా విధానం విషయంలో కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వైరం సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలపడంతో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బీజేపీ నూతన చీఫ్ ఎంపిక వేగవంతం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పార్టీ అగ్ర నాయకత్వం వేగవంతం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షు ల ఎంపికను ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసేందుకు అగ్రనేతలు విస్తృత సంప్రదింపులు మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మూడు గంటల పాటు కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్ లు పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం అమిత్ షా, రాజ్‌నాథ్, సంతోష్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత అమిత్ షా, నడ్డా విడిగా భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించడంతో పాటు ఈ నెల 20వ తేదీ తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించే లక్ష్యంగా ఈ భేటీలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్టీ జాతీయ ఎన్నికల అధికారి తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెల మొదటివారంలో ఎన్నికలు నిర్వహించే ప్రణాళికతో పార్టీ ముందుకెళ్లనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత భేటీలో ఐదారుగురు నేతల పేర్లే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీఎల్ సంతోశ్ తో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డిల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. 2020 ఫిబ్రవరిలో నడ్డా తొలిసారిగా అధ్యక్షుడయ్యారు. పరిమిత మూడేళ్ల కాలం పూర్తయ్యాక కూడా ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. దాంతో ఇప్పటికీ ఆయనే అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుల ప్రకటన బీజేపీ ఇప్పటివరకు 15 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించింది. ఏప్రిల్ 19 లేదా 20వ తేదీన మరో ఆరేడు రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించాలని భావిస్తోంది. పార్టీ సొంత నియమనిబంధనావళి ప్రకారం 19 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జరిగిన తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అధ్యక్షులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని పార్టిలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్షుల ప్రకటన తర్వాత మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉంటుందనే చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌తో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రేసులో పురందేశ్వరి, మాధవ్, పార్థిసారధి రెడ్డిల పేర్లపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఎంపిక ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ పాత్ర సైతం ఉంటుందని తెలుస్తోంది. బిహార్‌లో ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగొచ్చు. పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు ఉండొచ్చు. ఈ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల్లో కమలదళ సారథుల ఎంపిక కొనసాగనుంది. -
‘వారిని సోషల్ బాయ్ కాట్ చేయాలి’
హైదరాబాద్: కేటీఆర్, హరీష్ రావు, కవితలను సోషల్ బాయ్ కాట్ చేయాలని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని వీరు చేయలేదని, అందుచేత ఆ ముగ్గుర్ని సోషల్ బాయ్ కాట్ చేయాలని రఘునందన్ రావు సూచించారు. ఈరోజు(గురువారం) మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రఘునందన్ రావు.. ‘ కేటీఆర్, హరీష్ రావు, కవితలు 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనీ చేయలేదు. గతంలో కేంద్రం కొండా బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే తెల్లారే భూమి, యునివర్సిటీ పేరు మారింది. కేసీఆర్ గవర్నమెంట్ రాగానే ఎందుకు HCU భూములు బదలాయించలేదు.2012 నాటి జిల్లా కలెక్టర్ CCLA కు రాసిన లేఖ ఆధారంగా బదలాయించాలి. ఆనాడు వారి అవసరాలకు అనుగుణంగా దాన్ని పక్కన పెట్టిన కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నో డాక్యుమెంట్స్ సేకరించి CEC సాధికారత కమిటీకి అందజేశా. సాధికారత కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు ముందు నన్ను వాదనలు వినిపిస్తారా అని అడిగారు. మేము రిఫర్ చేస్తాం వచ్చి వాదనలు వినిపించాలి అన్నారు. అవసరమైనప్పుడు పిలిస్తే వస్తా అని చెప్పా. HCU భూములు అంటూ ఆనాడు ప్రభుత్వం తెలుగులో రాసిన పంచనామా ఉంది. HCU భూములు కానప్పుడు ఆనాటి ప్రభుత్వం ఎందుకు పంచనామా చేసింది. గోపనపల్లిలో కేటాయించిన స్థలంలో వేర్వేరు సంస్థలు వచ్చాయి. ఇష్టారీతిన అమ్మాలని ప్రభుత్వం చూసింది. HCU భూములపై ఫైట్ చేసింది బీజేపీ’ అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. -
టీడీపీ గుంపుకు సింహంలా సమాధానం చెప్పిన ఎంపీ గురుమూర్తి
-
ముస్లింలకు చంద్రబాబు ద్రోహం: సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా, ఏప్రిల్ 11: బీజేపీ ఇచ్చే కొద్దిపాటి అధికారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు మనసు చంపుకొన్నారని.. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికిన బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌పైనా మమత నిప్పులు చెరిగారు. వీరిద్దరూ ముస్లింలకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. కోల్‌కతాలో బుధవారం ముస్లిం పెద్దల సమావేశంలో మమతా మాట్లాడారు. ఎన్డీఏ కూటమికి కీలక మద్దతుదారులైన చంద్రబాబు, నీతీశ్ కారణంగానే వక్ఫ్ బిల్లు పార్లమెంటులో గట్టెక్కిందని అన్నారు. ఇప్పుడు మాత్రం వారిద్దరూ నోరు మెదపకుండా కూర్చుకున్నారని మండిపడ్డారు. బీజేపీకి పార్లమెంటులో సొంతంగా మెజారిటీ లేకున్నా ఇలాంటివన్నీ చేస్తోందన్నారు. ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారని ఆరోపించారు. నమ్మి ఓట్లు వేసినవారి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. వక్ఫ్ చట్టాన్ని సవరించాలంటే రాజ్యాంగాన్ని సవరించాలని, కానీ, అదేమీ లేకుండా సాధారణ మెజారిటీతో పార్లమెంటులో ఆమోదం పొందిందని మమతా పేర్కొన్నారు.వక్ఫ్ చట్టం సవరణకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
బెదిరింపులు.. మోసం.. వారికి కొత్త కాదు: కవిత
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు.. మోసం కొత్త కాదని.. తెలంగాణ ఇస్తానని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత బస్సు అంటూ. మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.కళ్యాణలక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఒక బస్సు ఇచ్చి.. బంగారాన్ని తుస్సుమనిపించారు. రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి. బీజేపీ మోసపూరిత విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పసుపు బోర్డును తూతూమంత్రంగా ఏర్పాటు చేశారే కానీ.. చట్టబద్ధత కల్పించలేదు. దాంతో పసుపు బోర్డుకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. మరి పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా?’’ అంటూ కవిత ప్రశ్నించారు.రెండు కోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, మనిషికి 15 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ పిచ్చి మాటలు మాట్లాడుతారు. అంతకు మించి ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. అయినా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు 8 రూపాయలు కూడా ఇవ్వలేదు. 8+8 = పెద్ద గుండు సున్నా. తెలంగాణాను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, గులాబీ జెండానే. రజతోత్సవం గుజాబీ పండుగ మాత్రమే కాదు.. ఇది తెలంగాణ పండుగ. తెలంగాణా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని కవిత చెప్పుకొచ్చారు.‘‘బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసిమెలసి ఢిల్లీతో తిరుగుతున్న వార్తను టీవీల్లో చూశాను. సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్‌లో చేరారా అన్న అనుమానం వచ్చింది. సంజయ్ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో... మరొకసారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలం. ఎమ్మెల్యే సంజయ్‌ని గ్రామ గ్రామానా నిలదీయాలి’’ అని కవిత పేర్కొన్నారు. -
ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ చిత్తే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయే విధంగా క్షేత్రస్థాయి పరిస్థితులున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘తొందరపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టం.సర్కార్‌కు ఇంకా మూడున్నరేళ్లకు పైగా గడువు ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి లాభం ఎంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అందరికీ తెలుసు’అని వ్యాఖ్యానించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతి నిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... భూముల విక్రయం, అప్పులు చేయడం, మద్యం అమ్మడం ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని మండిపడ్డారు. కేసులు ఎదుర్కునేందుకూ సిద్ధంహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల కూల్చివేత, భూమి చదునుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ఉల్లంఘనలకు పాల్పడిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్లు పెట్టి చెట్లు నరికిన పరిస్థితి గతంలో ఎక్కడా జరగలేదని, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రధాని మోదీ విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశంలో ఎవరో ఏఐతో చేసిన నకిలీ ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టారని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. హెచ్‌సీయూ అంశంపై గతంలో తాను ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌కు కట్టుబడి ఉన్నానని, ఈ విషయంలో కేసులు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ భూముల విక్రయం వెనక బీజేపీ ఎంపీ ఉంటే, అతడి పేరు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అసదుద్దీన్ బిగ్బాస్కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బిగ్‌బాస్ అని, ఆయనే ఈ రెండు పార్టీలను నియంత్రిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 19న వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భూబకాసు రులు నిరసనలు నిర్వహిస్తున్నారని ఎంఐఎం సభను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ముస్లింల ప్రార్థనా మందిరాలకు వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర కార్పొరేటర్లను కూడా కలిసి ఓట్లు అడుగుతామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన, టీడీపీతో కలిసి పోటీచేసే ఆలోచనే లేదని స్పష్టంచేశారు. ఒంటరిగానే పోటీచేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని తెలిపారు. ఇకపై కాంగ్రెస్, బీఆర్ఎస్లతో బీజేపీకి దోస్తీ ఉందని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టాలని ప్రజలకు సూచించారు. -
మన పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘మన ప్రభుత్వానికి మంచి పేరు, సాఫీగా నడిచే విధంగా ఆదాయం రావడం బీఆర్ఎస్, బీజేపీలకు ఇష్టం లేదు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆ రెండు పారీ్టలు కలిసి చేసిన కుట్రలే ఇందుకు నిదర్శనం. మనం కోర్టులో గెలిచి ఆ భూములను తీసుకువచ్చాం. మొత్తం 2,200 ఎకరాల్లో మన ప్రభుత్వం క్లెయిమ్ చేస్తోంది 400 ఎకరాలే. మిగిలిన భూముల జోలికి వెళ్లడం లేదు. ఆ 400 ఎకరాల్లో ఐటీ టవర్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నాం. అలా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగాలు కూడా వస్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా కిషన్‌రెడ్డికి చెప్పాడు. కిషన్‌రెడ్డి అమిత్‌షాకు చెపితే అమిత్‌షా మోదీకి చెప్పాడు. మన పథకాలు ప్రధానిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగారు. బుల్డోజర్లు, జేసీబీలకు తేడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో గుజరాత్ మోడల్ పోయింది. తెలంగాణ మోడల్ ప్రచారంలోకి వస్తోంది. ముఖ్యంగా కులగణన గేమ్ ఛేంజర్ అయింది. రేపు జరిగే బిహార్ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించబోతోంది. ప్రధాని మోదీకి ఇది రాజకీయంగా మరణశాసనం కాబోతోంది..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పి) సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్లు కుడుతున్న ప్రతిపక్షాలను కట్టడి చేయాలి ‘సన్న బియ్యం, ఎస్సీల వర్గీకరణ, కులగణన, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి అద్భుత కార్యక్రమాలతో ముందుకెళుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయి. కళ్లు కుడుతున్న ప్రతిపక్షాలను కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మీరు మళ్లీ గెలవాలంటే ఏం కావాలో అడగండి ఎవరైనా సరే పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలి. నేనైనా, డిప్యూటీ సీఎం భట్టి అయినా పార్టీ చెప్పిన మేరకే పనిచేస్తాం. ప్రభుత్వంతో పాటు పార్టీ బలంగా ఉంటేనే మరోసారి గెలుస్తాం. మీరు రెండోసారి గెలవాలంటే మీ నియోజకవర్గంలో ఏం కావాలో నివేదిక తయారు చేసుకోండి. అవసరమైతే కన్సల్టెంట్‌ను పెట్టుకోండి. మే 1 నుంచి మీకు అందుబాటులో ఉంటా. మీ నివేదికలు నాకివ్వండి. నేను కూడా వెరిఫై చేసుకుని నిధులు కేటాయిస్తా. మీ నియోజకవర్గాలకు వస్తా. పాదయాత్రలా, కార్నర్ మీటింగ్‌లా, బహిరంగ సభలా.. ఏం పెడతారో మీ ఇష్టం. ఈ విషయంలో డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కార్యాచరణ ఇస్తారు. జూన్ 2 నుంచి జనాల్లోకి వస్తా.. నేను కూడా జూన్ 2 వరకు జనాల్లోకి వస్తా. మన ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు వివరిద్దాం. సన్న బియ్యం పథకంతో ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తోంది. సన్నబియ్యం కాంగ్రెస్ పార్టీ పథకం. ఇది పేటెంట్, మన బ్రాండ్. సన్న బియ్యంతో పాటు ఎస్సీల వర్గీకరణ, కులగణన, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ విషయంలో ఇన్చార్జి మంత్రులు కీలక పాత్ర పోషించాలి. పార్టీ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయొద్దు..’ అని రేవంత్ అన్నారు. భారత్ సమ్మిట్‌కు రాహుల్, ప్రియాంక ‘మంత్రివర్గ విస్తరణను రిజర్వుడ్ ఫర్ జడ్జిమెంట్ తరహాలో అధిష్టానం ఫ్రీజ్ చేసింది. ఎవరేం చెప్పుకోవాలన్నా హైకమాండ్‌కు చెప్పుకోవాలి. భువనగిరి ఎంపీ కిరణ్‌రెడ్డి తను వెళ్లిన చోటల్లా ఒక మంత్రిని ప్రకటిస్తున్నాడు. అది సరైంది కాదు. అద్దంకి దయాకర్ చాలా ఓపికగా వెయిట్ చేశాడు. పార్టీ లైన్లో పనిచేశాడు. అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెలలో నిర్వహించే భారత్ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాం«దీలు వస్తున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు కూడా వస్తారు. పీసీసీ అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను మంత్రులకివ్వాలి..’ అని సీఎం చెప్పారు. అవి వారి అస్తిత్వానికే ప్రమాదం: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సంక్షేమం ఒక ఎత్తయితే ఎస్సీల వర్గీకరణ, బీసీల కులగణన కార్యక్రమాలను గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయినా, తెలంగాణ ప్రభుత్వం ధీరోదాత్తంగా చేసిందని అన్నారు. ఇవి బీఆర్ఎస్, బీజేపీలను కట్టి మూలన పడేస్తాయని, వారి అస్తిత్వానికే ప్రమాదంగా మారనున్నాయని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు సీఎం చెక్కులు అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్‌లను అభినందించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కూడా హాజరయ్యారు. బెంబేలెత్తించిన లిఫ్ట్ సీఎల్పీ సమావేశం జరిగే రెండో అంతస్తుకు వెళ్లేందుకు గాను సీఎంతో పాటు పలువురు నేతలు లిఫ్ట్ ఎక్కారు. రెండో అంతస్తుకు వెళ్లిన ఆ లిఫ్ట్ అకస్మాత్తుగా మళ్లీ వేగంగా కిందకు వచ్చింది. దీంతో గాభరాపడిన వారంతా మరో లిఫ్ట్‌లో సమావేశ హాలుకు వెళ్లారు. -
ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి లాభం ఎంటి?: కిషన్ రెడ్డి
-
అంబేడ్కర్‌కు బీజేపీ–ఆర్ఎస్ఎస్ శత్రువులు: ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై ఎటువంటి అభిమానం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం అంబేడ్కర్ కృషిని ప్రశంసించడం కేవలం మాటలకే పరిమితమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. వాస్తవానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అంబేడ్కర్‌కు శత్రువులని ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందంటూ ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఈ మేరకు స్పందించారు. 1952 ఎన్నికల్లో తన ఓటమికి కమ్యూనిస్ట్ నేత ఎస్ఏ డాంగే, హిందుత్వ వాది వీడీ సావర్కర్లే కారణమంటూ బీఆర్ అంబేడ్కర్ రాసిన ఒక లేఖను ఈ సందర్భంగా ఖర్గే మీడియాకు చూపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దక్కేలా డాక్టర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారని కొనియాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వం పథకాలను అమలు చేసేందుకు ఇప్పటికీ 2011 జనగణనే ఆధారంగా చేసుకుంటోందని తెలిపారు. 2021లో చేపట్టాల్సిన జనగణన ప్రస్తావనను ప్రభుత్వం తేవడం లేదన్నారు. జనగణన, కులగణనను చేపట్టి సమాజంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేయాలన్నారు. -
బుల్డోజర్ల ప్రయోగంలో రేవంత్ సర్కారు బిజీ: ప్రధాని మోదీ
‘తెలంగాణ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేసేలా, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోంది. అడవుల్ని ధ్వంసం చేస్తోంది. వాటిపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది..’ –ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. హామీలను పక్కన పెట్టి బుల్డోజర్లను ప్రయోగించడంలో రేవంత్ సర్కార్ నిమగ్నమైందని ధ్వజమెత్తారు. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు నమ్మక ద్రోహానికి గురవుతున్నారని విమర్శించారు. తాము అభివృద్ధి ఎజెండాతో ముందుకెళుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. హరియాణాలోని హిసార్‌లో ‘మహారాజ అగ్రసేన్ ఇంటర్నేషనల్’ విమానాశ్రయాన్ని ప్రధాని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇటీవల వివాదం రేకెత్తిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల విశ్వాస ఘాతుకం హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తాము పూర్తిగా అమలు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో అక్కడి ప్రభుత్వాలు విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేసేలా, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోంది. అడవుల్ని ధ్వంసం చేస్తోంది. వాటిపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది..’అని మోదీ ధ్వజమెత్తారు. అవినీతిలో కర్ణాటకను నంబర్ వన్‌గా నిలిపారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్‌నప్రదేశ్‌లోనూ అభివృద్ధి, సంక్షేమం అటకెక్కిందన్నారు. కర్ణాటకలో కరెంట్ నుంచి పాల దాకా, బస్సు చార్జీల నుంచి విత్తనాల వరకు ప్రతిదాని రేట్లు పెరిగాయని ప్రధాని మండిపడ్డారు. అక్కడి సీఎం అవినీతిలో దేశంలోనే నంబర్ వన్‌గా ఆ రాష్ట్రాన్ని నిలిపారని ఆరోపించారు. బీజేపీది అభివృద్ధి మోడల్ అయితే, కాంగ్రెస్‌ది అబద్ధాల మోడల్ అని విమర్శించారు. -
కాకరేపుతున్న కామెంట్స్.. ఈటల వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రయత్నిస్తుండగా, మరోవైపు కొందరు పదవులు దక్కిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే అసంతృప్తి శ్రేణుల్లో నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో కొత్తగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షుల వ్యవహార శైలిపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు పార్టీ పరంగా గ్రౌండ్ వర్క్ (Ground Work) చేసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. డివిజన్, జిల్లాలవారీగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ బలాబలాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాలపైనా చర్చిస్తున్నారు. ఇలాంటి సమంలో పార్టీ పదవుల్లో ఉన్నవారు సమావేశాలకు గైర్హాజర్ కావడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారే పార్టీ పదవుల్లో కొనసాగాలని, అలా కుదరదంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలనే వాదలు గట్టిగా వినిపిస్తున్నారు.ఇటీవల కాషాయ పార్టీ మీటింగ్‌లో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender ) సైతం ఇదే స్వరాన్ని వినిపించారు. మేడ్చల్ అర్బన్ జిల్లాలో బీజేపీ 25 డివిజన్లుగా విభజించింది. కొత్తగా డివిజన్ అధ్యక్షులను ఎంపిక చేసింది. అనంతరం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కొత్తగా ఏర్పాటైన వారిలో 9 మంది డివిజన్ అధ్యక్షులు హాజరు కాలేదు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన ఈటల రాజేందర్ 70 వేల మందికి ప్రాతినిథ్యం వహించే డివిజన్ అధ్యక్షుడు పార్టీ సమావేశాలకు హాజరు కాకుంటే ఎలా, అత్యవసర పరిస్థితుల్లో రాలేనివారిని మినహాయిస్తే, మిగతావారిని ఊపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.చదవండి: వారి మద్దతుతోనే ఈ నల్ల చట్టాన్ని తెచ్చారుదీంతో పార్టీలో ఆ 9 మంది డివిజన్ అధ్యక్షుల భవితవ్యం ఏంటనే చర్చ జరుగుతోంది. భాగ్యనగరంలోని మిగతా డివిజన్ల పరిస్థితిపైనా నిశితంగా పరిశీలించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నవారిని పక్కన పెట్టి పార్టీకి పనిచేసే వారికి పట్టం గట్టాలని పార్టీ అధిష్టానం (High Command) భావిస్తోందని నేతలు పేర్కొంటున్నారు. నేతలు సొంత పార్టీ వారే అయినా కొన్ని దఫాలు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందంటున్నారు. పదవి పొందేటప్పుడు ఉన్న ఆరాటం ఆ తర్వాత ఉండటం లేదని, పార్టీ కోసం 24 గంటలు పని చేయాల్సిందేనని పార్టీ అధిష్టానం స్పష్టం చేస్తోంది. -
రాజాసింగ్‌తో బండి సంజయ్ చర్చలు సఫలం
హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజాసింగ్ తో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్ గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ వ్యతిరేకించడంతో బండి సంజయ్ రంగంలోకి దిగారు. అయితే గౌతంరావును గెలిపించడానికి కృషి చేస్తానని బండి సంజయ్ కు రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ లైన్లలోనే పని చేస్తానని రాజాసింగ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో కార్పొరేటర్లతో కో ఆర్డినేషన్ చేస్తానని రాజా సింగ్ తెలిపారు. ఈ క్రమంలోనే గౌతంరావును అక్కడకు రప్పించి రాజాసింగ్ తో కరాచలనం చేయించారు బండి సంజయ్. దీనిలో రాజాసింగ్, గౌతంరావులు పరస్పరం శాలువాలతో సత్కరించుకున్నారు. అదే సమయంలో పార్టీలో ఇబ్బంది లేకుండా చూసుకుంటానని రాజాసింగ్‌కు బండి సంజయ్ కూడా భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ పోటీలో ఉండాలని బండి సంజయ్ పట్టుబట్టి మరీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టారు. దీనిలో భాగంగా హైదరాబాద్ లోనే తిష్టవేసిన బండి సంజయ్.. కార్పోరేటర్లతో కూడా సమావేశమయ్యారు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలుగోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటీ సందర్భంగా ముందుగా పాతబస్తీలోని ఆకాష్ పురి హనుమాన్ దేవాలయానికి బండి సంజయ్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయానికి చేరుకునే క్రమంలో రాజాసింగ్.. బండి సంజయ్‌కు స్వాగతం పలికారు. కేటీఆర్ పై విమర్శలుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు బండి సంజయ్. హెచ్ సీయూ భూముల అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘ బీజేపీ ఎంపీ ఉంటే పేరు ఎందుకు బయటపెట్టడం లేదు. కేటీఆర్ కళ్లు, చెవులు దొబ్బినాయ్.. వాడు, వీడు అని మాట్లాడుతున్నాడు. HCU భూముల కోసం కోట్లడింది మేము. ఎబివిపి కార్యకర్తలు ఇప్పటికీ జైల్ లో ఉన్నారు. HCU భూముల అమ్మకుండా కోర్టు అడ్డుకుంటుందని మాకు నమ్మకం ఉంది. రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో ఎటువంటి విభేదాలు లేవు’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీల పొత్తుపై ఆ రాష్ట్ర సీఎం , డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఇదొక ఓడిపోయే అవినీతి కూటమి అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టి అధికారం కోసం అర్రులు చాస్టున్న కూటమి, బీజేపీ చేతిలో బందీగా మారిన బానిస పార్టీ అంటూ మండిపడ్డారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్త పెట్టుకున్న సంగతి తెలిసిందే. అన్నా డీఎంకేతో పొత్తు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న(శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో(2026 అసెంబ్లీ ఎన్నికల్లో) ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడినట్లు అమిత్ షా పేర్కొన్నారు.దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ.. ‘ రెండు పార్టీల సిద్ధాంతాల్లో క్లారిటీ అనేది లేదు. ఏదో పొత్తు పెట్టుకోవాలి కాబట్టి.. అన్నా డీఎంకేతో సంధి కుదుర్చుకున్నారు. నీట్ అంశాన్ని ఏఐఏడీఎంకే వ్యతిరేకించింది. ఇదే తరహాలో రాష్ట్రంలో త్రి భాషా విధానంలో హిందీ భాషను రుద్దే అంశాన్ని, వక్ప్ యాక్ట్ ను, డీలిమిటేషన్ అంశాన్ని కూడా అన్నాడీఎంకే వ్యతిరేకించింది. మరి అటువంటప్పుడు బీజేపీతో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంది.ఇరు పార్టీలు పొత్తు పెట్టుకునేటప్పుడు కామన్ మినిమమ్ ప్రాగ్రామ్(సీఎంపీ) అనేది ఒకటి ఉంటుంది కదా. మరి వీటి గురించి హోంమంత్రి అమిత్ షా ఏమీ మాట్లాడలేదు. అలాగే అన్నాడీఎంకే నేతలు కూడా ఏమీ నోరు విప్పలేదు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి పొత్తు కుదుర్చుకున్నారు. అదే పనిగా డీఎంకేపై, నాపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. నీట్ ను సీబీఐ దర్యాప్తు చేస్తుంది కదా.. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేశారు అమిత్ షా. సీబీఐ అనేది కేంద్రం చేతుల్లోనే కదా ఉండేది’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు స్టాలిన్. -
‘ఒకరు సంచులు మోస్తే.. మరొకరు చెప్పులు మోస్తారు’
హైదరాబాద్: రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు ఢిల్లీ పార్టీల్లో ఒకటి సంచుల పార్టీ అయితే, మరొకటి చెప్పులు మోసే పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్.గతంలో కేసీఆర్ నాయకత్వంలో ఏప్రిల్, మే నెలల్లో కూడా మానేరు ఓ సజీవధారగా ప్రవహించదన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక చిన్న పర్రె పడితే బద్నాం చేశారని బీజేపీ, కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఎస్ఎల్పీసీలో ఎనిమిది చనిపోతే, సుంకిశాల కూలిపోతే ఎన్డీఎస్ఏ ఎందుకు రాదని ప్రశ్నించారు.భూకంపం వచ్చినా తట్టుకుని నిలబడింది కాళేశ్వరమని, మేడిగడ్డకు ఇప్పటికైనా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్ సీయూ భూములపై స్వయానా కుదవ పెడితే.. మరో మంత్రేమో ఏం లేదంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మీదీ కాని భూమిని తనఖా పెట్టడం తప్పు కాదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
బండి సంజయ్ -రాజాసింగ్ భేటీపై ఉత్కంఠ
హైదరాబాద్: ఇటీవల రాష్ట్ర బీజేపీపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే రాజాసింగ్ తో కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ భేటీ కానుండటంపై ఉత్కంఠ నెలకొంది. హిందుత్వ ఎజెండాతో పని చేస్తున్న ఈ ఇద్దరు నేతల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతుంది. రాజాసింగ్ తో సంధి కోసమే.. బండి సంజయ్ భేటీ అవుతున్నారనే ప్రచారం ఒకవైపు జరుగుతుండగా, బీజేపీలో రాజాసింగ్ ను మళ్లీ యాక్టివ్ చేయడానికే బండి సంజయ్ భేటీ అవుతున్నారని మరోవైపు ప్రచారం ఊపందుకుంది.ఈరోజు(శనివారం) పాతబస్తీకి వెళ్లనున్న బండి సంజయ్.. ఆకాశ్ పురిలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం రాజాసింగ్ తో సమావేశం కానున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించిన రాజాసింగ్... తన స్టేట్ మెంట్స్ తో రాష్ట్ర నేతలను ఒకింత కలవరానికి గురి చేశారు.ఈ క్రమంలోనే రాజాసింగ్ తో బండి సంజయ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజాసింగ్ ను కాస్త శాంతిపచేసి మళ్లీ తిరిగి బీజేపీ కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కోరే అవకాశం ఉంది.మరొకవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ వీరు భేటీ కావడం మరో వాదనకు తెరలేపింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై అభిప్రాయ సేకరణ పూర్తైన నేపథ్యంలో రాజాసింగ్ తో బండి సంజయ్ సమావేశం అవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. తాను అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ ప్రకటించినప్పటికీ వేరే వాళ్లకు మద్దతు ఇస్తే, ఎవరికి మద్దతు ఇస్తారు అనే దానిపై చర్చ నడుస్తోంది. మద్దతు కూడగట్టేందకే రాజాసింగ్ తో భేటీ అవుతున్నారా ? అనేది భేటీ తర్వాత క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఇదిలా ఉంచితే, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎన్ గౌతంరావు బరిలో ఉన్నారు. దీనిపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. గౌతంరావును పట్టుబట్టి బరిలో దింపారు బండి సంజయ్. ఈ విషయంపై రాజాసింగ్ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్ర పార్టీ నాయకత్వంపై కూడా విమర్శలు చేశారు. ఈ ఎన్నికను బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, పార్టీలో కీలక నేతగా ఉన్న రాజాసింగ్ మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తరుణంలో వీరి భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. -
KSR Live Show: సన్న బియ్యం.. HCU భూములు.. ఇరకాటంలో రేవంత్ సర్కార్
-
మాది సబ్ కా వికాస్ వారిది పరివార్ కా వికాస్
వారణాసి/అశోక్‌నగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పారీ్టలు కేవలం సొంత కుటుంబాల బాగు కోసమే అధికారం దక్కించుకోవడానికి ఆరాట పడుతున్నాయని విమర్శించారు. బీజేపీ విధానం ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’అయితే విపక్షాల విధానం ‘పరివార్ కా సాత్, పరివార్ కా వికాస్’అని ధ్వజమెత్తారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమంతోపాటు దేశ సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని ఉద్ఘాటించారు. బీజేపీకి అధికార కాంక్ష లేదని స్పష్టంచేశారు. విపక్ష నాయకులు స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా అధికారం కోసం పాకులాడుతూ రాత్రి పగలు రాజకీయ క్రీడల్లో మునిగితేలుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 130 తాగునీటి పథకాలు, 100 అంగన్వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, డిగ్రీ కాలేజీ తదితరాలు ఉన్నాయి. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మోదీ వారణాసికి రావడం ఇది 50వ సారి. నగరంలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులకు నివాళులరి్పంచారు. వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పూర్వాంచల్ ఆరోగ్య రాజధాని కాశీ ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతం గతంలో పూర్తిగా వెనుకబడి ఉండేదని, తాము అధికారంలోకి వచి్చన తర్వాత గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి సాధించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాశీ నగరం ఇప్పుడు ఈ ప్రాంతానికి ఆరోగ్య రాజధానిగా మారిందన్నారు. ఇక్కడ అత్యుత్తమ వైద్య చికిత్స లభిస్తోందని హర్షం వ్యక్తంచేశారు. 70 ఏళ్లు దాటినవారికి ఉచితంగా చికిత్స అందించడానికి ఆయుష్మాన్ వయ్ వందన కార్డులు పంపిణీ చేస్తున్నామని, అత్యధికంగా వారణాసిలో 50 వేల మందికి ఈ కార్డులు ఇచ్చామని తెలిపారు. కాశీ కేవలం ప్రాచీన నగరమే కాదు, ప్రస్తుతం ప్రగతిశీల నగరంగా మారిందని పేర్కొన్నారు. కాశీ–తమిళ సంగమం గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2036లో వారణాసిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలన్న ఆలోచన ఉందని తెలిపారు. అందుకోసం కార్యాచరణ మొదలైందన్నారు. ఈ క్రీడల్లో పతకాలు సాధించడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని వారణాసి యువతకు పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం వారణాసికి చేరుకున్న తర్వాత.. ఇటీవల యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది వ్యక్తులు ఆరు రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆనంద్‌పూర్ ధామ్‌లో మోదీ పూజలు ప్రధాని మోదీ శుక్రవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం అశోక్‌నగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ ధామ్‌ను దర్శించుకున్నారు. ఇక్కడి గురూజీ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీఆనంద్‌పూర్ ట్రస్టు స్థాపించిన ఆనంద్‌పూర్ ధామ్ 315 ఎకరాల్లో విస్తరించి ఉంది. గోశాల నిర్వహణతోపాటు ఆనంద్‌పూర్ ధామ్ చేపడుతున్న ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. -
ఎవరీ నైనర్ నాగేంద్రన్..?
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనర్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైంది. ఇటీవల తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కే అన్నామళై రాజీనామా చేయడంతో ఆ బాధ్యతల్ని నాగేంద్రన్ చేపట్టడం ఇక లాంఛన ప్రాయమే. కేవలం రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా పోటీలో నిలిచే అభ్యర్థుల పరంగా చూస్తే కేవలం నాగేంద్రన్ నామినేషన్ మాత్రమే వచ్చింది.ఏమైనా అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్పా నాగేంద్రన్ ఇక తమిళనాడు బీజేపీ చీఫ్ గా వ్యవహరించడం ఖాయం. ఇప్పటివరకూ కేవలం నాగేంద్రన్ నామినేషన్ మాత్రమే వచ్చిన తరుణంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగనుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియలో భాగంగా నాగేంద్రన్ పేరును అధికారికంగా రేపు(శనివారం) ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు(శుక్రవారం) మందీ మార్బలంతో వచ్చి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నాగేంద్రన్ నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ఇప్పటివరకూ అధ్యక్షునిగా కొనసాగిన అన్నామళై కూడా రావడం విశేషం.ఎవరీ నాగేంద్రన్..?ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు నాగేంద్రన్. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఉపాధ్యక్షుడిగా సేవల అందిస్తూ వస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే పార్టీలో కొనసాగిన నాగేంద్రన్.. 2017లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. 2001 మే 19 వ తేదీ నుంచి 2006 మే 12 వరకూ ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు బీజేపీ గూటికి చేరారు. ఆయన బీజేపీలో చేరిన మూడేళ్ల తర్వాత అంటే 2020 జూలై 3 వ తేదీన బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.జయలలిత మరణం తర్వాత..2016లో మాజీ సీఎం జయలలిత మరణించిన తర్వాత చాలా మంది ఎఐఏడీఎంకే నేతలు.. బీజేపీలో చేరారు. వారిలో నాగేంద్రన్ కూడా ఒకరు. 2017 ఆగస్టులో కాషాయ జెండా కప్పుకున్నారు నాగేంద్రన్. ఆయనకు ఢిల్లీ అధినాయకత్వంలో మంచి గుర్తింపు ఉంది. 2021లో తిరునెల్వెలి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, ఆయనకు మద్దతుగా అమిత్ షా సైతం వచ్చి అక్కడ ప్రచారం చేశారు. సుమారు 23వేలకు పైగా ఓట్లతో డీఎంకే అభ్యర్థిపై నాగేంద్రన్ గెలిచి ఇక్కడ మూడోసారి విజయాన్ని అందుకున్నారు.ఆయన అసలు పేరు.. నాగేందిరేన్ కాగా, రెండో పేరు నాగేంద్రన్. ప్రస్తుతం ఈ పేరుతో మరింత ప్రాచుర్యం పొందారాయన. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఆయన పేరును మాజీ అధ్యక్షుడు అన్నామళైతో పాటు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, మాజీ కేంద్ర మంత్రి రాధాకృష్ణన్‌లు బలపరిచారు. -
ఆపరేషన్ 2026 ఎలక్షన్స్ ... అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు
-
‘కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌కు కేటీఆర్ బాడీగార్డ్’
హైదరాబాద్: కాంగ్రెస్-బీఆర్ఎస్లపై మరోసారి ధ్వజమెత్తారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మీడియాతో చిట్ చాట చేసిన మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ కు తోక పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మారిందంటూ విమర్శించారు. చెన్నైలో డీకే శివకుమార్ తో కేటీఆర్ రెండు గంటలు పాటు సమావేశమయ్యారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య కుదిరిన ఒప్పందంగా మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య మద్రాసు ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌కు కేటీఆర్ బాడీగార్డ్. బీజేపీని అడ్డుకోవడానికి రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. లోన్ ఇప్పించిందంటూ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను ప్రొటెక్ట్ చేసేందుకే బీజేపీ ఎంపీ ఉన్నారంటూ కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే పేరు బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి -
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు ఖరారైంది. డీఎంకే-కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ-అన్నాడీఎంకేలు కూటమిగా కలిసి పోటీచేయడానికి నిర్ణయించాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు. ‘ఏడీఎంకే అంతర్గత వ్యవహారంలో మేం జోక్యం చేసుకోం. పొత్తు కోసం ఏడీఎంకే ఎలాంటి షరతులు విధించలేదు. వచ్చ ఎన్నికల్లో కూటమి ఘన విజయం ఖాయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ రెండు పార్టీలు పొత్తు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఖాయంఈ పొత్తులో భాగంగా తమిళనాడు కూటమి సీఎం అభ్యర్థిగా కె పళనిస్వామి అని అమిత్ షా ప్రకటించారు. అమిత్ షా మాట్లాడుతూ.. 1998 నుంచి ఏఐఏడీఎంకే అనేది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ.. తమిళనాడు మాజీ సీఎం జయలలితలు ఇద్దరూ కలిసే గతంలో పని చేశారు. ఎన్డీఏ భాగ్వస్వామ్యం అనేది విజయానికి సంకేతం. మా పొత్తుతో మేం మరింత పటిష్టం కానున్నాం. కచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మెజార్టీతో ప్రభుత్వాన్ని చేపడతాం’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
Dharmapuri Arvind: ఇచ్చిన ఒక్క హామీ కాంగ్రెస్ పూర్తి చేయలేదు
-
‘ వారికి వసూల్ చేయడం రాదనే.. సీఎంను మార్చడం లేదు’
హైదరాబాద్: : తెలంగాణ రాష్ట్రంలో అసమర్థ, అవినీతి ప్రభుత్వం నడుస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. అసలు రాష్ట్రంలో పరిపాలన శూన్యమని, ప్రజల దృష్టికి మరల్చడానికే హెచ్ సీయూ హైడ్రా వివాదాలని ఆరోపించారు అరవింద్. లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి కాంగ్రెస్ ఇన్ని వాగ్దానాలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రగతిభవన్ లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నప్పుడు, కేసీఆర్ కు తెలియదా.. లంకె బిందెలు ఎక్కడ దాచుకోవాలో అని నిలదీశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. ‘ సీఎం రేవంత్ సీసీపీయూ( Connect Collect Pay Use) కోర్సు చేశారని, ఇది మాత్రమే ఆయనకు తెలుసు. రేవంత్ పాలనలో పెద్దల నుంచి అంగన్ వాడిలో చదువుకునే చిన్నపిల్లలు కూడా సంతోషంగా లేరు. కేసీఆర్, రేవంత్ ల కథ గజదొంగ గంగన్న, ఆయన కొడుకు రంగన్న కథలా ఉంది. HCU భూముల అంశంలో బిజేపి ఎంపీ ఉన్నాడు అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. మరి పేరు ఎందుకు బయటపెట్టడం లేదు. టైమ్ ఎప్పుడు వస్తుంది.రేవంత్ ను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోంది. సీఎంను మారిస్తే మళ్లీ అర్హత గల సీఎం దొరకడం లేదు. ఎలిజిబుల్ ఉన్న శ్రీధర్ బాబు సహా మిగతావారికి వసూల్ చేయడం రాదు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గుతోంది’ అని ఆరోపించారు ధర్మపురి అరవింద్. -
రేవంత్.. నోరు అదుపులో పెట్టుకో
హైదరాబాద్,సాక్షి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు.గుజరాత్లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన అఖిల భారత కాంగ్రెస కమిటీ సదస్సు ‘న్యాయ్‌పథ్’లో.. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకమైన వారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, గాంధీ ఆలోచనలను రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళుతుంటే ప్రధాని మోదీ గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడారు. రేవంత్ మతి స్థిమితం లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. రాహుల్ మెప్పు కోసం మాట్లాడారు. రేవంత్ తెలంగాణను రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టారు. రాజ్యాంగేతర శక్తి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియేట్‌లో అడుగు పెట్టారు. సీఎం లేనప్పుడు అజ్ఞాత వ్యక్తి సెక్రటరియేట్లో రివ్యూ చరిత్రలో లేదు.రేవంత్ నీ స్థాయిని మించి మోదీపై మాట్లాడటం మానుకో. ప్రధాని పదవి కోసం నెహ్రూ దేశాన్ని ముక్కలు చేశారు. దేశ విభజనకు కారణం కాంగ్రెస్. రేవంత్ చరిత్ర మర్చిపోయిన దేశ ప్రజలు మర్చిపోలేదు. హామీలు అమలు చేయకుండా అహ్మదాబాద్‌లో గొప్పలు చెప్తావా?గ్యారంటీలపై చర్చకు సిద్దమా? రాహుల్ గాంధీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. హామీలు అమలు చేయనందుకు ఆయన్ను రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వరు. దమ్ముంటే హెచ్‌సీయూలో రాహుల్ గాంధీ మీటింగ్ పెడతారా? త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ రాబోతుంది. రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చననే నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?’ అని ప్రశ్నించారు. -
వేడెక్కిన ‘పటేల్’ రాజకీయాలు.. ‘ఉక్కు మనిషి’పై హక్కు ఎవరిది?
న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు, ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) ఎవరివాడనే దానిపై కాంగ్రెస్-బీజేపీ మధ్య రాజకీయాలు ముసుకుంటున్నాయి. ఇటీవల గుజరాత్లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశంలో ఆ పార్టీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందడుగు వేసింది. పార్టీ తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. పటేల్ వారసత్వాన్ని భారతీయ జనతా పార్టీ తీసేసుకుని, దానిని నెహ్రూ-గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా వాడుకుంటున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.కాంగ్రెస్(Congress) సారధ్యంలో జరిగిన విస్తృత కార్యవర్గ సమావేశంలో (సీడబ్ల్యూసీ) ‘స్వాతంత్ర్య ఉద్యమ సారథి - మా సర్దార్ వల్లభాయ్ పటేల్’ అనే తీర్మానానికి ఆమోద ముద్ర వేసింది. గాంధీ, పటేల్ జన్మస్థలమైన అహ్మదాబాద్‌లో దేశానికి కొత్త దిశానిర్దేశాన్ని అందించేందుకు తమ నాయకత్వం సమావేశమైందని పేర్కొంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు సర్దార్ పటేల్ వారసత్వాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయని, అలాగే పటేల్.. జవహర్లాల్ నెహ్రూ మధ్య విభేదాలు ఉన్నాయంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఇరువురు నేతలు ఒకే నాణేనికున్న బొమ్మబొరుసులాంటి వారిని, వారి మధ్య గొప్ప అనుబంధం ఉందని కాంగ్రెస్ పేర్కొంది.గుజరాత్లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంపై దృష్టి సారించింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థలం కూడా కావడంతో ఇక్కడ సత్తా నిరూపించుకునేందుకు కాంగ్రెస్ తపత్రయ పడుతోంది. ఇది తమ సొంత గడ్డ అని నిరూపించుకునేలా బీజేపీకి సవాల్ విసరాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ(BJP) సర్దార్ పటేల్‌ను తమ జాతీయవాద సిద్ధాంతంలో ఒక భాగంగా ఇప్పటికే మలచుకుంది. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని ఆనంద్‌లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీ సందర్శన సందర్భంగా ‘జోధ్‌పూర్, జూనాగఢ్, హైదరాబాద్, లక్షద్వీప్ ఈ రోజు భారతదేశంలో భాగంగా ఉన్నాయంటే, అది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనేనని, ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను నెరవేర్చారు’ అని పేర్కొన్నారు. ఇదేవిధంగా బీజేపీ 2018లో నర్మదా నది తీరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు చెందిన 182 మీటర్ల ఎత్లయిన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని నిర్మించి, పాటీదార్ సమాజాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.గుజరాత్(Gujarat)లో పాటిదార్ సమాజం రాజకీయంగా ప్రభావవంతంగా ఉంది. 182 సభ్యుల అసెంబ్లీలో 40-50 సీట్లపై పాటీదార్లు తమ ప్రభావం చూపిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం చాలా ఏళ్లు గుజరాత్‌ను పాలించిన కాంగ్రెస్, 1995లో అధికారాన్ని కోల్పోయింది. మళ్లీ తిరిగి ప్రాభవాన్ని పొందలేకపోయింది. అయితే ఇప్పుడు సర్దార్ పటేల్ వారసత్వాన్ని తిరిగి స్వీకరించడం ద్వారా, పాటిదార్ ఓట్లను ఆకర్షించి, బీజేపీ ఆధిపత్యాన్ని సవాలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే బీజేపీ ఇప్పటికే పటేల్ వారసత్వాన్ని తమ సొంతం చేసుకున్న తరుణంలో కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతమవుతుందా లేక ఆలస్యమైన చర్యగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఆగ్రహం -
ఇసుక తోడేళ్లు!
చూడు నాగిరెడ్డి..! నేను ఎన్నికల్లో రూ.10 లక్షలు ఖర్చు చేశా. మా ఊరి నుంచి ఇసుక నేనే తవ్వుకుంటా. ఎవరూ అడ్డు రావద్దు..! నేను ఎమ్మెల్యే (జయనాగేశ్వరరెడ్డి)కి చెప్పి ఇసుక తోలుతున్నా. సీఐకి రూ.50 వేలు ఇచ్చినా..! నా టిప్పర్‌తోనే ఇసుక తోలుతా. ఇసుక బండి ఆపేదెవడు? దమ్ముంటే రమ్మను!- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం టీడీపీ నేతలు గురజాల జయరాముడు, రాయచోటి నాగిరెడ్డి ఫోన్ సంభాషణ ఇదీ!నాకు తెలియకుండా మట్టి తోలుతున్నావ్..! నాకు చెప్పాలి కదా..? బండ్లు మనయే ఉన్నాయ్..!రామలింగారెడ్డి (ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కుడి భుజం)తో మాట్లాడా..! ఎమ్మెల్యే.. తహసీల్దార్‌కు కూడా చెప్పాడు. మట్టి శాంపిల్ కూడా తీశా. మనమే ఒకటిగా లేకుంటే ఎట్టా...? వచ్చే డబ్బులో రామలింగారెడ్డి వాటా ఆయనకు పోతాది. వైఎస్సార్సీపీ వాళ్లు బండ్లు ఆపుతున్నారు..ఆపోజిట్ వాళ్లు ఎవడైనా బండి ఆపితే టిప్పర్‌తోనే కొడతా..! రమ్మను..!- శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో టీడీపీ నేతలు క్రాంతి కుమార్, శ్రీనివాసులు ఫోన్ సంభాషణ ఇదీ!!మీ ఓనర్‌కు ఫోన్ చేసి రెండు నెలలైంది.. ఎమ్మెల్యే వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెప్పినా కలవలేదు. మీ ఓనర్ వచ్చి మాట్లాడే దాకా లారీ స్టేషన్లోనే ఉంటుంది..-లారీ డ్రైవర్ లంకన్నకు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పీఏ నాగరాజు గౌడ్ బెదిరింపులు!ఉచిత ఇసుక పేరుతో పచ్చ ముఠాలు ఏ స్థాయిలో బరి తెగించి సామాన్యులపై రౌడీయిజం చేస్తున్నారో చెప్పేందుకు ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే! టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు నదులు, వాగులు, వంకల్లో ఇసుకను యథేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారం అండతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని వాటాలు పంచుకు తింటున్నారు. ఆరు లారీలు.. మూడు ట్రాక్టర్లు అనే రీతిలో ఈ అక్రమాల పర్వం రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులు నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీలు లాంటి భారీ యంత్రాలతో నదీ గర్భాలను గుల్ల చేస్తున్నారు. పేరుకు ఫ్రీ అంటున్నా ఎక్కడా ఉచితంగా ఇవ్వడం లేదు. 18 టన్నుల లారీ ఇసుకను రూ.30 వేల నుంచి 60 వేల వరకూ అమ్ముతున్నారు. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్‌కు, అనంతపురం సరిహద్దుల నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీఎత్తున ఇసుక నిత్యం అక్రమంగా తరలిపోతోంది. అన్నిచోట్లా కూటమి ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. కమీషన్లు కరకట్ట బంగ్లాకు ఠంచనుగా చేరిపోతున్నాయి. ముఖ్యనేతకు కప్పం కట్టి ఎక్కడికక్కడ నదులు, వాగులను కొల్లగొట్టేస్తూ రూ.వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు.– సాక్షి, అమరావతి, నెట్వర్క్తెలంగాణకు అక్రమ రవాణాఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఇసుక దందాలో ఆరితేరిపోయారు. పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం, శనగపాడు గ్రామాల నుంచి రాత్రిళ్లు తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆళ్లూరుపాడు ఇసుక క్వారీ నుంచి పొక్లెయిన్లు, జేసీబీలతో లోడు చేసి లారీ లోడు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అనుచరులు ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా లారీకి రూ.10 వేలు చొప్పున వసూలు చేసి ఎంత కావాలన్నా సై అంటున్నారు. మున్నేరు నుంచి ఇసుక అక్రమంగా వైరా, మధిర తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. నిషేధిత జాబితాలో ఉన్న యనమలకుదురు, హైకోర్టు స్టే పరిధిలో ఉన్న పెదపులిపాక, సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన చోడవరం క్వారీల్లో సైతం యంత్రాలతో పెద్ద ఎత్తున ఇసుకను తవ్వి తరలిస్తున్నారు.అమరావతిలో యథేచ్చగా అక్రమాలుగుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు, అబ్బురాజుపాలెం గ్రామాల్లో ఇసుకను అక్రమంగా నిల్వ చేసి రాత్రి పూట బయట ప్రాంతాలకు చేరవేస్తున్నారు. మంత్రి లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని గొడవర్రులో పొక్లెయిన్లతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. గుండిమెడ, పాతూరు, చినరావూరులో అనుమతులు లేకపోయినా టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తోడేస్తున్నారు. కొల్లిపర, తెనాలి, చెరుకుపల్లి మండలాల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం మల్లాది గ్రామం, అచ్చంపేట మండలం చింతపల్లి నుంచి ఇసుక అక్రమంగా కూటమి నేతలు తరలిస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో ఇసుక హైదరాబాద్‌కు తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లాలో పెసర్లంక, గాజుల్లంక, వోలేరు ప్రాంతాల్లోని కృష్ణా నది నుంచి టీడీపీ నేతలు రేయి పగలు తేడాలేకుండా యంత్రాలతో తోడేస్తున్నారు.నెల్లూరు.. అందరూ అందరే..నెల్లూరు జిల్లాలో పెన్నానదిలోని సంగం, సూరాయపాలెం, పోతిరెడ్డిపాలెం డీ సిల్టింగ్ పాయింట్లకు గడువు పూర్తయినా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సూరాయపాలెంలో ఓ అధికార పార్టీ నేత నేరుగా నదిలోకి రహదారి ఏర్పాటు చేసి హిటాచీతో 12 టైర్ల టిప్పర్లకు లోడింగ్ చేస్తున్నారు. పల్లిపాడులో ఓపెన్ రీచ్‌లో యంత్రాలు ఉపయోగించి లోడింగ్ జరుగుతోంది. ఆత్మకూరు, వెంకటగిరి, కోవూరు, నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లో భారీ యంత్రాలతో పెన్నా నదిలోకి బాటలు వేసి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. రోజుకు 200కు పైగా టిప్పర్లు చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. లోకేశ్ టీమ్ పేరుతో మన్నేరు నుంచి టీడీపీ నాయకులు భారీగా ఇసుకను తరలిస్తున్నారు. కరేడు అటవీ భూముల్లో టీడీపీ నాయకుడు పోలుబోయిన శ్రీనివాసులు ఇసుకను హేచరీలకు తరలించారు.ప్రకాశంలో ఇష్టారాజ్యం ప్రకాశం జిల్లాలో ఇసుక మాఫియా చెప్పిందే వేదంగా నడుస్తోంది. అన్నిచోట్లా టన్నుకు రూ.200 నుంచి రూ.500 వరకు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో అక్రమ రవాణా జరుగుతోంది. కొండపి నియోజకవర్గం నుంచి ఒంగోలుకు ఇసుక తరలించే విషయంలో దామచర్ల సోదరుల వర్గీయుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. దామచర్ల అనుచరుల ప్రైవేటు సైన్యం వేధింపులు భరించలేక టిప్పర్ల యజమానులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. దర్శిలో టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి, గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కనుసన్నల్లో మాఫియా చెలరేగుతోంది. మార్కాపురంలో కూటమి నాయకుల నేతృత్వంలో ఇసుక విక్రయాలు సాగుతున్నాయి.పశ్చిమలో ఎడాపెడా బాదుడుపశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరు రీచ్‌లు, ఐదు డీసిల్టేషన్ పాయింట్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వెళ్లడంతో మూసివేసినందున ఇసుక దొరకడంలేదు. దీంతో తీపర్రు, పెండ్యాల, పందలపర్రు, జొన్నాడ, గోపాలపురం తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ లారీకి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ర్యాంపు నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారు. భీమవరానికి లారీ ఇసుక చేరవేసేందుకు రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాకు రోజుకు 500 నుంచి 600 ట్రిప్పుల వరకు ఇసుక రవాణా జరుగుతుండగా.. అదనపు వసూళ్ల రూపంలో జిల్లాలోని వినియోగదారులపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు భారం పడుతోంది.గోదావరి గుల్ల గుల్ల.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరిని గుల్ల చేస్తూ నిషేధిత ప్రాంతాల్లో సైతం తవ్వకాలు జరుగుతున్నాయి. కోటిలింగాల, కొవ్వూరు ర్యాంపుల్లో నిషేధిత డ్రెడ్జింగ్ అడ్డగోలుగా సాగుతోంది. ఒక్కో ర్యాంపు నుంచి రోజుకు 50కి పైగా లారీల్లో ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ (18 టన్నులు) ఇసుకను రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ విక్రయిస్తున్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై రోడ్ కమ్ రైల్వే వంతెన, గామన్ వంతెనల సమీపంలో ఇసుక తవ్వకాలను నిషేధించారు. బ్రిడ్జిలు దెబ్బ తినే ప్రమాదం ఉన్నందున అక్కడ ఇసుక తవ్వకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయినా కూటమి నేతలు లెక్క చేయకుండా రెండు బోట్ల ద్వారా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అనుమతి లేకుండానే పలు ప్రాంతాల్లో యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక తవ్విన గోతుల్లో ఇటీవల కొత్తపేట గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు దుర్గాప్రసాద్ స్నానానికి దిగి మునిగిపోయి మరణించాడు.సిక్కోలులో మంత్రులకు వాటాలు!శ్రీకాకుళం జిల్లాలో అంబళ్లవలస, బట్టేరు, అంగూరు, బూరవల్లి, గార, గోపాల పెంట, కాఖండ్యాంలోని రీచ్‌లను కూటమి నేతలు తమకు కావాల్సిన వారికి ఇప్పించుకుని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీలో సైలెంట్‌గా ఓ సెంట్రల్ మినిస్టర్.. వయలెంట్‌గా మరో మినిస్టర్ వాటాలు వసూలు చేసుకుంటున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తన బినామీలతో రాత్రిపూట పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఆమదాలవలసలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు బూర్జ మండలం నారాయణపురం, చిన అంకలాం వద్ద భారీ లారీల్లో ఇసుక తరలించేస్తున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇసుక రీచ్‌లను సొంత జాగీర్లుగా మార్చుకుని రాజ్యమేలుతున్నారు. పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇసుక వ్యాపారాన్ని ఇష్టానుసారం సాగిస్తున్నారు. ఎచ్చెర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇసుక తన సరిహద్దు దాటాలంటే లారీకో రేటు ఫిక్స్ చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో ఇసుక డంపింగ్ కేంద్రాలు పెట్టించి తన కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులకు ఇసుకలో వాటాలు ఇస్తున్నారు.చిత్తూరు టు కర్ణాటక, తమిళనాడు తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి నది, అరుణానదిలోని ఇసుకను ఒక ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు భారీ యంత్రాలతో తోడి కర్ణాటక, తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ ఇసుక రూ.60 వేల చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల పరిధిలో ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల అనుచరులు, బంధువులే కీలక పాత్రపోషిస్తున్నారు. నాయుడుపేట మండలం అన్నమేడు, మర్లపల్లి, భీమవరంలో స్వర్ణముఖి నదినుంచి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తండ్రి పేరుతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. చిత్తూరు రూరల్ మండల పరిధిలో బీఎన్‌ఆర్‌పేట రీచ్‌ను టీడీపీ ఎమ్మెల్యే జగన్మోహన్రావు అనుచరులు అడ్డాగా చేసుకుని అక్రమ వ్యాపారానికి తెర తీశారు. పలమనేరు నియోజక వర్గ పరిధిలోని కౌండిన్య నది, జీడిమాకనపల్లి, పెద్దచెరువులో కేటిల్ఫాం నుంచి వైయస్సార్ జలాశయం దాకా ఇసుకను ట్రాక్టర్లలో తోడి నిల్వ చేస్తున్నారు.కర్నూలులో దర్జాగా దందాకర్నూలు జిల్లాలోని కర్నూలు, కల్లూరు మండలాల పరిధిలో తుంగభద్ర, హంద్రీ నదుల్లో యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. సుంకేసుల, మునగాలపాడు, నిడ్జూరు, పంచలింగాల తదితర గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు గ్రామానికి ఒకరిని నియమించుకుని దర్జాగా ఇసుక దందా నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా మునగాలపాడు సమీపంలో తుంగభద్ర నదీ తీరంలో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్న అక్రమార్కులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలు హైదరాబాద్‌కు తరలి వెళుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.10 వేలు చొప్పున పోలీసు అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. రీచ్‌ల వద్ద అదనంగా రూ.1,000 వసూలు చేస్తున్నారు. టిప్పర్‌కు రూ. 15 వేలు ఇవ్వాల్సిందే. ఈ డబ్బంతా స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు చేరుతోంది. వైఎస్సార్ జిల్లాలో పచ్చ నేతల చేతివాటంవైఎస్సార్ జిల్లాలో కొండాపురం మండలం బెడుదూరు నుంచి స్థానిక టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పెండ్లిమర్రి, కమలాపురం మండల పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరులు అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. నాగావళిని చెరబట్టిన ఇసుకాసురులు విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో టీడీపీ నాయకులు నాగావళిని చెరబట్టారు. జావాం సమీపంలో రెండు పొక్లెయినర్లతో రాత్రీపగలు తవ్వుతున్నారు. బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పెంట, అలజంగి, కారాడ గ్రామాల వద్ద వేగావతీ నదీతీరంలో ప్రభుత్వ ఇసుక రీచ్ లేకపోయినా వేలం పాట నిర్వహించి మరీ ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో నాగావళి నదీతీరం వెంబడి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కనుసన్నల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి.వేదవతిని ఊడ్చేస్తున్న తమ్ముళ్లు..అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గంలో ఇసుక అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతోంది. కణేకల్లు, బొమ్మనహాళ్, డి హీరేహాళ్, రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో వేదావతి హగరి నది చుట్టూ కర్ణాటక సరిహద్దు ఆనుకుని ఉంది. టీడీపీ నాయకులు చీకటి పడగానే జేసీబీలతో టిప్పర్లలో ఇసుక లోడ్‌చేసి బళ్లారి, బెంగళూరు, తుమకూరు, చిత్రదుర్గం, సండూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇసుక అడ్డగోలుగా అక్రమ రవాణా జరుగుతోంది. చిత్రావతి, పెన్నా, కుముద్వతి, జయమంగళి నదులను జేసీబీలతో తోడేస్తున్నారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నాటకకు భారీగా ఇసుక తరలిస్తున్నారు. రొద్దం, చిలమత్తూరు, పుట్టపర్తి, గోరంట్ల, హిందూపురం నుంచి రాత్రింబవళ్లు ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిపోతోంది. -
నేడు హెచ్సీయూకు ఎంపవర్డ్ కమిటీ !
సాక్షి, హైదరాబాద్ : హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాలకు సంబంధించి ఏం జరిగిందనే దానిపై క్షేత్రస్థాయి పరిశీలనతోపాటు, జరిగిన నష్టంపై సొంతంగా అంచనా వేసేందుకు గురువారం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్‌కు రానుంది. ఈ బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ, పర్యావరణ వేత్తలు, ఆయా రంగాలకు చెందిన వారున్నట్టు సమాచారం. పర్యటనలో భాగంగా ఈ సమస్యతో ముడిపడిన అంశాలపై పరిశీలనతోపాటు ప్రభుత్వ అధికారులు, వివిధ రంగాలకు చెందిన, పర్యావరణ నిపుణులను ఈ బృందం భేటీ కానున్నట్టుగా తెలిసింది. ఇది అటవీ ప్రాంతమా.. ప్రదేశమా అనే దానితో నిమిత్తం లేకుండా...దాదాపు వందకు పైగా ఎకరాల్లో జరిగిన చెట్ల నరికివేత, వన్యప్రాణులు, పర్యావరణానికి ఏ మేరకు నష్టం జరిగిందనే అంశాలకు ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 11వ తేదీలోగా ఆయా అంశాలపై సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాల్సి ఉండగా, హెచ్‌సీయూ పరిశీలనకు స్వయంగా ఎంపవర్డ్ కమిటీ వస్తున్నట్టుగా తెలుస్తోంది. అటవీశాఖ తీరుపైనా చర్చ హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల భూమి రక్షిత అటవీ ప్రాంతం కాకపోయినా చెట్ల కూల్చివేత, వన్యప్రాణులు, జీవవైవిధ్యానికి జరిగిన నష్టం చర్చనీయాంశమయ్యాయి. 40 ఏళ్లుగా పెరిగిన చెట్లతోపాటు వన్యప్రాణులు, జంతువుల సంచారం పెరగడం, రకరకాల పక్షులకు ఇది కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. అటవీశాఖ పరంగా జరిపిన పరిశీలనలో ఈ ప్రాంతంలో ఎక్కువగా సుబాబుల్ చెట్లున్నాయని, అధిక శాతం డీగ్రేడెడ్ ఫారెస్ట్‌గానే ఉందనే నివేదిక ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం.ఇటీవల వందకు పైగా ఎకరాల్లో చెట్ల కూల్చివేత జరిగిన ప్రదేశంలో ఎక్కువ సుబాబుల్ చెట్లు్ల ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఈ 400 ఎకరాలు రక్షిత అటవీ ప్రాంతం కాదనే వాదననే వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ పదే పదే నివేదించడం చర్చనీయాంశమవుతోంది. ఈ ప్రాంతం విభిన్న రకాల చెట్లు, జంతువులు, పక్షులు, పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యం ఏర్పడిందనే విషయాన్ని...ఇటీవల చెట్ల కూల్చివేతలు, క్లియరెన్స్ అనేది నియమనిబంధనలకు అనుగుణంగానే జరిగిందా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఎన్యుమరేషన్‌కు సంబంధించి హెచ్‌సీయూ పాలకవర్గానికి గతంలోనే అటవీశాఖ ప్రతిపాదన పంపించగా...ఫండింగ్ అనేది ఆర్థికభారంగా మారినందున అది ముందుకు సాగలేదని అధికారులు చెబుతున్నారు. కూల్చిన చెట్ల సంఖ్యపైనా అస్పష్టత...గతంలోనే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫర్ నేచర్ హైద రాబాద్...హెచ్‌సీయూ పరిధిలోని భూమిలో పర్యా వరణ వ్యవస్థ, జీవావరణం, జీవవైవిధ్యంపై అధ్య యనం నిర్వహించింది. వర్సిటీలో ‘బయోడైవర్సి టీ’భేషుగ్గా ఉందని, వివిధ రకాల జంతువులు, చెట్లతో అలరారుతోందని ఈ వర్సిటీకి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక సమర్పించింది. ఇటీవల జరిగిన చెట్ల కూల్చివేతకు సంబంధించి కూడా డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌కు స్పష్టమైన సమాచారం అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలో ‘ట్రీ ప్రొటెక్షన్ కమిటీ’దీనిపై పూర్తి వివరాలేవి అందలేదని తెలుస్తోంది. ఈ కమిటీలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఇతర సభ్యులు కూడా నేలమట్టమైన చెట్ల డేటా ఇవ్వాలని ‘ట్రీ ప్రొటెక్షన్ కమిటీ’చైర్పర్సన్ డా.జి.రామలింగంకు లేఖ రాసినట్టు సమాచారం. ఈ అంశాలన్నింటిపైనా ఎంపవర్డ్ కమిటీ దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎంపీలతో హెచ్‌సీయూ వీసీ, రిజిస్ట్రార్ భేటీ» ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నివాసంలో సమావేశం» హాజరైన ఈటల రాజేందర్, రఘునందన్‌రావు » వాస్తవాలు తెలుసుకునేందుకే సమావేశమయ్యామన్న ఎంపీలు సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ భూములకు సంబంధించి వివాదం తలెత్తడం, ఇందులో ఓ బీజేపీ ఎంపీ ప్రమేయం ఉందంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావులతో వర్సిటీ వీసీ జగదీశ్వరరావు, రిజిస్ట్రార్ సమావేశమయ్యారు. బుధవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశానంతరం ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఈ భూములకు సంబంధించి ఎంపీలుగా వాస్తవ విషయాలు తెలుసుకుని, ప్రజల ముందు ఉంచేందుకే ఈ భేటీ నిర్వహించామని కొండా చెప్పారు. ‘హెచ్‌సీయూ వీసీ, రిజిస్ట్రార్‌తో సమావేశమయ్యాం. లీగల్ డాక్యుమెంట్స్ పరిశీలించాం. 2,300 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. వర్సిటీకి ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఉన్నాయి. దీనిపై సర్వే చేసే అవకాశం ఉందా? అసలు భూమి ఎవరిదన్న విషయాలపై చర్చించాం’ అని ఆయన తెలియజేశారు. ఈ భూముల వ్యవహారంపై ఇటీవల సచివాలయంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హాజరుకావడం పట్ల విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.కేటీఆర్ ఆరోపణలపైనా..హెచ్‌సీయూ భూముల విషయంలో ఓ బీజేపీ ఎంపీ ప్రమే యం ఉందంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్య లు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీల సమావేశం చ ర్చనీయాంశమైంది. కేటీఆర్ ఆరోపణలపై వీసీతో మాట్లాడి వాస్తవ విషయాలను తెలుసుకునేందుకు ఎంపీలు సమావేశ మయ్యారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ వర్సిటీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉండటంతో స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చొరవ తీసుకొని సమావేశం నిర్వహించార ని తెలుస్తోంది. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లా డుతూ.. 2012లో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ 2,185 ఎక రాలు హెచ్సీయూకు చెందినదని సీసీఎల్ఏకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో రేవంత్ ఈ భూమిపై ఎప్పుడు పోరాడారని ఆయన ప్రశ్నించారు. ‘వివాదాస్పదంగా ఉన్న 400 ఎకరాలు పక్కనపెట్టి 1,785 ఎకరాల భూమికి గత పదేళ్లలో ఎందుకు కాంపౌండ్ వాల్ కట్టలేదు. ఈ వర్సిటీకి చెందిన 134 ఎకరా లు మాజీ సీఎం కేసీఆర్ టీఎన్జీవోలకు ఎందుకు ఇచ్చారు? కేటీఆర్ ఆరోపణలు చేయడం కాదు. ఏ ఎంపీ చేశారో చెబితే పార్టీ తరఫున మేం సమాధానం చెబుతాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లిన అనంతరం ఇష్యూపై ముందుకు వెళ్తాం’ అని రఘునందన్ తెలిపారు. -
బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకరమైన వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టినట్లే రాహుల్‌గాంధీ నాయకత్వంలో మనమంతా దేశంలో బీజేపీని ఓడించి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ నేతృత్వంలో ముందుకు తీసుకుని వెళ్తుంటే.. ప్రధానమంత్రి మోదీ మాత్రం దేశ వ్యాప్తంగా గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సదస్సు ‘న్యాయ్‌పథ్’లో బుధవారం సీఎం ప్రసంగించారు.వల్లభాయ్ పటేల్‌తో హృదయపూర్వక బంధం‘గుజరాత్ ప్రజలతో, వల్లభాయ్ పటేల్ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంది. దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదు. అప్పుడు మాకు స్వాతంత్య్రం ప్రసాదించిన వల్లభాయ్ పటేల్‌తో మాకు హృదయపూర్వక బంధం ఉంది. వల్లభాయ్ పటేల్ మాకు స్వాతంత్య్రం ఇస్తే.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి నేను ఒకటే చెబుతున్నా. మేము బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం..అడ్డుకుంటాం. వారిని ఎవరూ క్షమించరు’ అని రేవంత్ అన్నారు.మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే..‘రాహుల్‌గాంధీ తెలంగాణలోని రైతులకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 10 నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసి చూపించింది. మరో హామీ అయిన కులగణనను కూడా పూర్తి చేశాం. కేంద్రం జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్‌పై లోక్‌సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా రాహుల్‌గాంధీని మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని గాలికి వదిలేశారు. రెండు కోట్ల మందికి రాకపోయినా మోదీ, అమిత్‌షాలకు మాత్రం పదవులు వచ్చాయి. రైతులు కనీస మద్దతు ధర, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 15 నెలలపాటు ఆందోళన చేసినా మోదీ ప్రభుత్వం కనీసం వారితో చర్చలు కూడా జరపలేదు. మోదీ మణిపూర్‌లో మంటలు రాజేశారు. దేశ మూల వాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం చేశారు. మోదీ గ్యారంటీ దేశాన్ని విభజించడమే. కానీ రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరిట 150 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.బీజేపీ ఓటమికి కంకణబద్ధులై వెళ్లాలిదేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ ఎన్నో ఆందోళనలు చేసినా.. ఆయనపై ఏనాడూ లాఠీ ఎత్తలేదు. కానీ స్వాతంత్య్రం వచ్చిన ఆరునెలల్లోనే గాడ్సేలు తూటాలు పేల్చి ఆయన్ను పొట్టన పెట్టుకున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు, మోదీ ఆలోచన విధానాన్ని అడ్డుకునేందుకే మనమంతా ఇక్కడ ఏకమయ్యాం. ఇక్కడకు వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్త రానున్న ఎన్నికల్లో బీజేపీని ప్రతిచోటా ఓడించేలా కంకణబద్ధులై వెళ్లాలి. గాడ్సే భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీని, బీజేపీని అడ్డుకుని దేశాన్ని రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. -
అహ్మదాబాద్ వేదికగా.. ప్రధానిపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
అహ్మదాబాద్ (గుజరాత్): మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చుపెడుతున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.వచ్చే రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. దేశంలో కుల గణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. బ్రిటీష్ వాళ్లు ఎలా దేశాన్ని లూటీ చేశారో.. బీజేపీ నేతలు కూడా అలానే లూటీ చేస్తున్నారు. బిట్రీష్ వాళ్ల కంటే బీజేపీ వాళ్లే ప్రమాదకరం. బ్రిటీష్ వాళ్లను తరమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడగొట్టాలి. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. -
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ : కార్గో,ఎక్స్‌ప్రెస్,ప్యాసింజర్ రైళ్ల రాకపోకల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీలోని (చిత్తూరు, తిరుపతి) మీదుగా తమిళనాడు (వెల్లూరు) వరకు వెళ్లే రైల్వే లైన్లో మరో అదనపు రైల్వే లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలోని నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తిరుపతి -పాకాల - కాట్పడి మధ్య 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ రూ.1332 కోట్ల రూపాయల ఖర్చుతో డబ్లింగ్ చేయనుంది. తద్వారా 400 గ్రామాలు,14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగనుంది. నాలుగు మిలియన్ టన్నుల సరుకు రవాణా ఏడాదికి పెరిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నేరుగా 35 లక్షల పని దినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 👉పీఎంకేఎస్వైలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను కమాండ్ ఏరియా అభివృద్ధికి కేంద్రం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది. Union cabinet approves modernization of Command Area Development and Water Management (M-CADWM) as a sub-scheme of Pradhan Mantri Krishi Sinchayee Yojana (PMKSY) for the period 2025-2026 with an initial total outlay of Rs.1600 crore. pic.twitter.com/SB3g4Mcqoq— ANI (@ANI) April 9, 2025 -
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎంపీలు నేడు సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు భేటీ అవుతున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నివాసంలో వీరంతా సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా హెచ్‌సీయూ భూముల వివాదంపై ఎంపీలు చర్చించనున్నారు.అంతకుముందు బీజేపీ, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల, మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌ను కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు. -
గంగాజలం ఎఫెక్ట్.. బీజేపీ నేతపై సస్పెన్షన్ వేటు
రాజస్థాన్‌లో వివాదాస్పద నేత జ్ఞానదేవ్ అహూజాపై ఎట్టకేలకు అక్కడి బీజేపీ విభాగం చర్యలు తీసుకుంది. క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనకుగానూ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆలయంలో గంగా జలంతో శుద్ధి చేయడమే ఇందుకు కారణం!!.ఆల్వాల్‌లో శ్రీరామ నవమి సందర్భంగా ఓ ఆలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ నేత తికారాం జల్లీ హాజరయ్యారు. అయితే దళిత నేత అడుగుపెట్టి ఆలయం అపవిత్రం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజా గంగా జలంతో ఆ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ పరిణామం దళిత సంఘాలకు ఆగ్రహావేశాలు తెప్పించింది.ఈ చర్య పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంటూ బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ , అహుజాకు నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్‌కు వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.జ్ఞానదేవ్ అహూజా.. 2013-18 మధ్య రామ్‌ఘడ్ ఎమ్మెల్యేగా పని చేశారు. వివాదాల్లో నిలవడం ఈయనకు కొత్తేం కాదు. 2016లో.. జేఎన్‌యూలో జాతీ వ్యతిరేక నినాదాల వ్యవహారంపై స్పందిస్తూ జ్ఞానదేవ్ తీవ్రవ్యాఖ్యలే చేశారు. జేఎన్‌యూలో నిత్యం 3 వేల కండోమ్స్, 2 వేల లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. 2017లో గోవుల అక్రమ రవాణా చేస్తున్నాడని పెహ్లూ ఖాన్ అనే పాడి రైతును మూక దాడిలో చంపడాన్ని కూడా అహూజా సమర్థించారు. -
రాజకీయాల్లోకి టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నాడు. గతేడాదే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్.. ఇవాళ (ఏప్రిల్ 8) బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడు. పలు కథనాల ప్రకారం జాదవ్ ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నాడు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే కేదార్‌ను భాజపాలోకి ఆహ్వానించనున్నాడు. కేదార్ మహా సీఎం ఫడ్నవిస్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Former cricketer Kedar Jadhav set to start his political career Details:👉 https://t.co/2tpIz8m7ju pic.twitter.com/ftEYmpgP3u— CricTracker (@Cricketracker) April 8, 202540 ఏళ్ల కేదార్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. కుడి చేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన అతను భారత్ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. కేదార్ వన్డేల్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీల సాయంతో 1389 పరుగులు చేసి 27 వికెట్లు తీశాడు. 9 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 122 పరుగులు చేశాడు. కేదార్ చాలా మ్యాచ్‌ల్లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2017లో పూణేలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అతను 120 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు.టీమిండియాకు ఆడకముందే కేదార్ ఐపీఎల్లో మెరిశాడు. వాస్తవానికి ఐపీఎల్ ప్రదర్శనల కారణంగానే అతడికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. కేదార్ 2010లో ఐపీఎల్‌లోకి ప్రవేశించి వివిధ ఫ్రాంచైజీల తరఫున (కొచ్చి టస్కర్స్ కేరళ, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, సన్‌రైజర్స్) 95 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 123.11 స్ట్రయిక్‌రేట్‌తో, 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.కేదార్ దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించేవాడు. అతడిని ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ ఏ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. మహారాష్ట్ర మిడిలార్డర్లో కేదార్ చాన్నాళ్ల పాటు కీలక సభ్యుడిగా ఉన్నాడు. కేదార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలు, లిస్ట్-ఏ క్రికెట్లో 9 సెంచరీలు చేశాడు. 2013-14 రంజీ సీజన్ కేదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ సీజన్లో అతను 1000కి పైగా పరుగులు చేయడమే కాకుండా ఓ ట్రిపుల్ సెంచరీ (327) కూడా చేశాడు. కేదార్ 2024 జూన్ 3న క్రికెట్లోని అన్ని ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. -
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్,సాక్షి: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు.వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebrations) కోసం బీఆర్ఎస్ (brs) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.ఈ తరుణంలో కేటీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ,హెచ్‌సీయూ భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండవ తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. అందుకే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది. ఈ సారి డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెడుతున్నాం. అన్ని జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నెలకో కార్యక్రమం జిల్లాల్లో నిర్వహిస్తాం.అమెరికా దుందుడుకు నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు నష్టపోయారు. మోదీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా మౌనం ఎందుకు?. తర్వాత దెబ్బ తెలంగాణపై పడబోతుంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు ఉంటాయి. వాటిపై ఎఫెక్ట్ ఉండబోతుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు BRS పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల,మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు. -
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక: మోదీ
న్యూఢిల్లీ: బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ కార్యకర్తలకు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో వరుసగా పోస్టులు చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని స్పష్టంచేశారు. వారంతా క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేస్తున్నారని, సుపరిపాలన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తు న్నారని పేర్కొన్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కార్యకర్తలను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని గుర్తుచేశారు. కార్యకర్తల శక్తి, ఉత్సాహం తనకు ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయని వివరించారు. దేశ ప్రజలు బీజేపీలో సుపరిపాలన ఎజెండాను దర్శిస్తున్నారని, ఎన్నికల్లో పార్టీకి లభిస్తున్న చరిత్రాత్మక విజయాలే ఇందుకు తార్కాణమని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అన్ని రకాల ఎన్నికల్లో బీజేపీ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. సమాజ సేవకు, దేశ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించారు. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని బలోపేయడానికి కంకణబద్ధులై పనిచేస్తున్న కార్యకర్తల సేవలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇదేనని పేర్కొన్నారు. దేశ ప్రగతి కోసం మనమంతా పూర్తి అంకితభావంతో పనిచేయాలని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించుకోవాలని మోదీ పిలుపు నిచ్చారు. -
వక్ఫ్ బోర్డులను నియంత్రించే ఉద్దేశం లేదు: నడ్డా
న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డులను నియంత్రించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జె.పి.నడ్డా స్పష్టంచేశారు. వక్ఫ్ బోర్డులు చట్ట పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయా బోర్డుల ఆస్తులు విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ఉపయోగపడాలని, తద్వారా ముస్లిం వర్గానికి మేలు జరగాలని చెప్పారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జె.పి.నడ్డా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టర్కీతోపాటు చాలా దేశాల్లో వక్ఫ్ బోర్డుల ఆస్తులను అక్కడి ప్రభుత్వాలు నియంత్రణలోకి తీసుకున్నాయని గుర్తుచేశారు. మన దేశంలో మాత్రం బోర్డులు చట్ట పరిధిలో పని చేయాలని చెబుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా సరే నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే బీజేపీ ప్రస్థానాన్ని నడ్డా ప్రస్తావించారు. నేడు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా మారిందని అన్నారు. ప్రస్తుతం బీజేపీకి 240 మంది లోక్‌సభ సభ్యులు, 98 మంది రాజ్యసభ సభ్యులు, 1,600 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తుచేశారు. -
బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కోరారు. ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి కూడా అవకాశం ఇస్తే పారదర్శక పాలన ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించా రు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయటం.. భారతదేశ గౌరవాన్ని పెంచటం, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టడమే బీజేపీ లక్ష్య మని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో చాయ్ అమ్ముకున్న సాధారణ వ్యక్తి కుమారుడిని ఈ దేశానికి ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మూడు దఫాలుగా అత్యంత సమర్థవంతమైన, పారదర్శక పాలనను బీజేపీ అందిస్తోందని తెలిపారు. బీజేపీవైపు చూస్తున్న తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో 77 లక్షల మంది తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం అందించారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మజ్లిస్ ఆగడాలను అరికడతాం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకు ఆ రెండు పార్టీలు పోటీపడుతున్నాయ ని ఆరోపించారు. మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు మజ్లిస్ హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించిందని, తీగలగుట్ట వద్ద 400 మంది దళితులు, హిందువులపై హత్యాకాండకు ఒడిగట్టిందని ఆరోపించారు. మజ్లిస్ దౌర్జన్యాల వల్ల పాతబస్తీ నుంచి హిందువులు వలస పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మజ్లిస్ పార్టీ ఆగడాలను అడ్డుకుంటుందని ప్రకటించారు. 14వ తేదీ వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 14 నుంచి 22 వరకు అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించాలని సూచించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రికాంగ్రెస్ సర్కార్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపాటు కరీంనగర్ టౌన్: సీఎం రేవంత్‌రెడ్డి రబ్బర్ స్టాంప్‌లా మారారని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చే శారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బండి సంజయ్ మొదట కరీంనగర్‌లోని తన నివాసంలో.. తరువాత పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సచివాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో సమీక్ష చేయడమేంటని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరు వద్దు అనేదానిపై ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటుందని, తెలంగాణలో పాలన భ్ర ష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు. కాగా, 45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొ డుకులు, అవమానాలను అధిగమించిందన్నారు. 16 రాష్ట్రాల్లో సొంతంగా.. 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తోందన్నారు. సన్న బియ్యం కోసం కేంద్రం కిలోకు రూ.37 ఖర్చు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం భరించేది కేవలం రూ.10 మాత్రమే అన్నారు. అలాంటప్పుడు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫొటో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు నుంచి బియ్యం వరకు ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. -
బండి సంజయ్‌కు టీపీసీసీ స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్: కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ కు టీపీసీసీ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, బండి సంజయ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.‘ దమ్ముంటే బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్లో చేర్చేలా చట్టబద్ధత కోసం ప్రధానిని ఒప్పించే దమ్ముందా?,* ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బిజెపి నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలకు గులాం గిరి చేసిన పనులు మర్చిపోయావా బండి సంజయ్. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర నీది నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. ఏదైనా సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల వలె స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ బిఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే రహస్య మిత్రులు బిఆర్ఎస్ తో చీకటి ఒప్పందం. బండి సంజయ్ లో రోజురోజుకు అభద్రత భావం పెరిగిపోతుంది. మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా కనీసం టిఫిన్ కూడా చెయ్యడు. సొంత పార్టీ కార్యకర్తలే బండి సంజయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. అధ్యక్ష పదవి రాదని తెలిసి బండి సంజయ్ ఆగమాగం అయితుండు. గుర్తింపు కోసమే తాను కేంద్రమంత్రిని అని మర్చిపోయి దిగజారి బండి సంజయ్ మాట్లాడుతుండు. బీజేపీలో ఉనికి కోసం బండి సంజయ్ ఆరాటం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి బండి సంజయ్ కి కనిపించకపోవడం విడ్డూరం. సుదీర్ఘ కాలం అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం చేసుకోలేని బీజేపీకి కాంగ్రెస్ హై కమాండ్ గురించి మాట్లాడే హక్కే లేదు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించి బట్టే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం లభించిందని అవగాహన లేకుండా బండి మాట్లాడుతున్నారు. హెచ్ సీయూ అంశం ఉన్నత న్యాయ స్థాన పరిదిలో ఉంది. ప్రభుత్వం కమిట్ వేసింది. రాజకీయ అవసరాల కోసం బండి సంజయ్ మాట్లాడడం సమంజసం కాదు. మైనార్టీ హక్కుల కోసం నిలబడి కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు బిల్లు పై నిర్ణయం తీసుకుంది.కార్పొరేట్ సంస్థలను నయన భయానా బెదిరించి నిధులు రాబట్టుకున్న బీజేపీ నంబర్ వన్ గా నిలిచింది.సన్న బియ్యం బీజేపీ ఇస్తుంటే దేశం మొత్తం ఇవ్వచ్చు కదా?, సన్న బియ్యంతో తెలంగాణలో నిరుపేదలకు అసలైన పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశ చరిత్రలో నిలిచిపోయే కుల గణన, బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ సన్న బియ్యంను కాంగ్రెస్ హయంలో అమలు అయ్యాయి’ అని స్పష్టం చేశారు. -
West Bengal: నవమి వేడుకల్లో కత్తులు తిప్పిన బీజేపీ నేతలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఈ రోజు(ఆదివారం) శ్రీరామ నవమి వేడుకలు(Sri Rama Navami celebrations) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా జైశ్రీరాం నినాదాల నడుమ శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో రోడ్లపై భక్తజన సందోహం కనిపిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఆయుధ పూజలు నిర్వహించారు. రోడ్లపై కత్తులు తిప్పుతూ కనిపించారు. బీజేపీ నేత చంద్రశేఖర్ బావన్కులే.. మమత సర్కారుపై పలు ఆరోపణలు చేశారు. సీఎం మమతా బెనర్జీ రామనవమి వేడుకలను అడ్డుకుంటున్నారని, శోభాయాత్రలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకే జనం మమతా సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఘోరువై శ్రీరామనవమి సందర్భంగా దుర్గాపూర్‌లోని చండీదాస్ బజారులో ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన కత్తులను గాలిలో తిప్పుతూ, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మాల్డాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల నిర్వాహకులు భక్తులకు మిఠాయిలను పంచిపెట్టారు. బీజేపీ నేత శుభేందు అధికారి నందీగ్రామ్‌లోని సోనాచురాలో నూతన రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ కోల్‌కతా సెంట్రల్ ఎవెన్యూ(Kolkata Central Avenue)లోని రామాలయంలో జరిగిన పూజలలో పాల్గొన్నారు.ఇది కూడా చదవండి: Manipur: నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్ -
Tamil Nadu: బీజేపీ బలోపేతానికి ‘పంబన్’ వారధి?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తమిళనాడు ప్రజలకు పంబన్ బ్రిడ్జి(Pamban Bridge) రూపంలో భారీ కానుకను అందించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ ఈ అద్భుత వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ దక్షిణ భారతదేశంలో తన పట్టును బలోపేతం చేసుకునేందుకే ఈ వంతెనను వ్యూహాత్మకంగా ప్రారంభిస్తున్నదనే వాదన వినిపిస్తోంది. 2.08 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన పంబన్ వంతెన రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది.పంబన్ బ్రిడ్జి భారతదేశంలోని మొట్టమొదటి సముద్రపు వంతెన. ఓడల రాకపోకలకు అనుగుణంగా ఈ బ్రిడ్జి గేట్లు తెరుచుకుంటాయి. నూతనంగా నిర్మించిన ఈ వంతెన మరింత ధృడంగా ఉండనుంది. ఇది తమిళనాడు(Tamil Nadu) ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేయనుంది. అలాగే పర్యాటకరంగానికి ప్రోత్సాహాన్ని అందించనుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామేశ్వరంనకు రాకపోకలు సాగించేందుకు ఈ వంతన ఉపయోగపడనుంది. శ్రీరాముని జన్మదినోత్సవమైన రామ నవమిని దక్షిణ భారతదేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రామేశ్వరంనకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు.రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు లంకను చేరుకునేందుకు ఇక్కడ స్వయంగా వారధి నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాగా తమిళనాడు ప్రజలలో తన హిందూత్వ ఎజెండాను బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు బీజేపీ పంబన్ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించి, జాతికి అంకితం చేస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. 2026లో తమిళనాడులో ఎన్నికల జరగనున్న దృష్ట్యా బీజేపీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు శాసనసభకు జరిగే ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.తమిళనాడు రాజకీయాలలో(Tamil Nadu politics) డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యం కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంలో బలమైన పట్టు ఉన్న బీజేపీ, దక్షిణాదిలో ఇంకా గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయితే పంబన్ బ్రిడ్జి వంటి పెద్ద ప్రాజెక్టులను చేపట్టి, తద్వారా తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బీజేపీ తమిళనాడు ప్రజలకు తెలియజెప్పాలనుకుంటోంది. తమిళనాడులో రెండవ అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఆ కూటమి ఎన్నికల్లో విఫలం కావడంతో, బీజేపీకి ఏఐడిఎంకే దూరమయ్యింది. ఇప్పుడు 2026 ఎన్నికలకు ముందు బీజేపీ మరోసారి అన్నాడీఎంకేతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తోందని భోగట్టా. అయితే బీజేపీ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో కాలమే చెబుతుంది. ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్ -
మాకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదు
హైదరాబాద్,సాక్షి: బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది? అంటూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ. కాంగ్రెస్ పోటీలో లేదు. మేము బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది?బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ వేసింది. 112 ఓట్లలో బీజేపీకి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మాకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తటస్థంగా ఉన్నాం. ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు.బీజేపీ ఎలా గెలుస్తుంది క్రాస్ ఓటింగ్ ఎంకరేజ్ చేస్తున్నారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకునికి బినామీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి లోపాయికారి ఒప్పందంతో మద్దతు తెలిపింది’ అని వ్యాఖ్యానించారు. -
ఇక చర్చిల ఆస్తులపై గురి!
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం క్రైస్తవ సంస్థల ఆస్తులేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాజాగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ బిల్లులోని అనేక అంశాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ శనివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో నడిచే ‘ఆర్గనైజర్’లోని కథనాన్ని ఉదహరించారు. కాథలిక్ సంస్థలకు దేశవ్యాప్తంగా 7 కోట్ల హెక్టార్ల భూములున్నాయని, ఇంత భారీగా భూములున్న ప్రభుత్వేతర సంస్థ ఇదేనంటూ అందులో పేర్కొన్నారని రాహుల్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ కన్ను ఇప్పుడిక కాథలిక్ భూములపై పడినట్లు ఈ కథనంతో అర్థమవుతోందని ఆరోపించారు. ముస్లిం వర్గం ఆస్తులే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లు ఇతర వర్గాలకు లక్ష్యంగా చేసుకోవడానికి ఒక ఉదాహరణగా ఉంటుందని రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అతి త్వరలోనే క్రైస్తవుల ఆస్తులపై ఆర్ఎస్ఎస్ దృష్టి పడనుందని ఆయన జోస్యం చెప్పారు. ‘ఇటువంటి దాడుల నుంచి మనకు రక్షణ కల్పించే ఏకైక సాధన రాజ్యాంగం. రాజ్యాంగాన్ని మనం కలిసికట్టుగా పరిరక్షించుకుందాం’అని పిలుపునిచ్చారు. ఇండియన్ చర్చ్ యాక్ట్–1927 ప్రకారం బ్రిటిషర్ల పాలనలో కాథలిక్ సంస్థలు అత్యధికంగా భూములు సంపాదించుకున్నట్లు ఆర్గనైజర్ కథనం పేర్కొంది. అయితే, వలస పాలనలో లీజుకిచ్చిన భూములను చర్చి ఆస్తులుగా పరిగణనలోకి రావంటూ 1965లో భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. -
బీజేపీ సమావేశంలో ఈటెల ఆసక్తికర వ్యాఖ్యలు
మేడ్చల్: జిల్లా బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం.. పని చేసేటప్పుడు కూడా ఉండాలని బీజేపీ శ్రేణులకు చురకలంటించారు. పార్టీలో అటెండెన్స్ సిస్టం ఉండొద్దని, చేతులు ఎత్తే పద్ధతి ఉండొదన్నారు ఈటెల. ఇది ఇన్సల్ట్ చేసే పద్ధతి అని ఈటెల పేర్కొన్నారు.‘ పదవుల్లో పొందిన వారు కష్టపడి పార్టీ కోసం పని చేయాలి. ఆరాటం అనేది రెండు విషయాల్లో ఉండాలి. ఒక వేళ పదవులు పొంది.. పని చేయకపోతే వారు రాజీనామా చేయండి. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. డివిజన్ అధ్యక్షుడు ఆపైన నాయకులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఆలా ఉండకపోతే పార్టీకి రాజీనామా చేయండి. ఈ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని చర్చ జరుగుతోంది. దానిని అందిపుచ్చుకునేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి’ అని ఈటెల పేర్కొన్నారు. -
MLC Elections: బలం మజ్లిస్‌దే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ఓటర్ల (కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) బలం ఎంఐఎం (మజ్లిస్)కే ఎక్కువగా ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థి గెలవడం నల్లేరు మీద నడకేనని, ఆ లెక్కన మిగతా పార్టీలేవీ కూడా తమ అభ్యర్థిని కూడా బరిలో దింపకుండా ఎన్నిక ఏకగ్రీవమే కాగలదని ఇప్పటిదాకా అందరూ భావించారు. నామినేషన్ల చివరి రోజున ఊహించని విధంగా బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలో దింపడంతో పోలింగ్ నాటికి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో తమ పార్టీకి బలం లేదన్నది బీజేపీకి తెలియనిది కాదు.. అయినా రంగంలోకి దిగిందంటే లోపాయికారీగా ఏదో జరుగుతోందన్న ప్రచారానికి తావిచి్చంది. జీహెచ్ఎంసీలో 25 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 వార్డులున్నప్పటికీ, ఈ ‘స్థానిక’ ఎన్నికల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 81 కార్పొరేటర్ల డివిజన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు ఈ స్థానిక సంస్థలో ఓటేసేందుకు ఎంపిక చేసుకున్న ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఓటర్లుగా బీజేపీ నుంచి తాజాగా ఒక రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్, ఇద్దరు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు చేరారు. ఓటర్లుగా చేరేందుకు ఇక ఎవరికీ అవకాశం లేదు. గడువు ముగిసిపోయింది. రాబోయే మేయర్ స్థానంపై అవగాహనతో..? ఇటీవల కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన దాసోజు శ్రవణ్ ఇంకా ప్రమాణం చేయనందున వారు ఓటర్లు కాలేదని సమాచారం. తాజా సమాచారం మేరకు సైతం అన్ని పార్టీల కంటే ఎంఐఎంకే ఎక్కువ బలం ఉంది. ఆ పార్టీకి చెందిన ఓటర్లు 49 మంది ఉన్నారు. ఇక తర్వాత స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఎలాగూ తమ అభ్యర్థిని బరిలోకి దింపదని, ఎంఐఎంకు మద్దతునిస్తుందని, రాబోయే జీహెచ్ఎంసీ మేయర్ స్థానాన్ని సైతం దృష్టిలో ఉంచుకొని ఈ అవగాహనకు వచి్చనట్లు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థిని బరిలో దించకుండా కాంగ్రెస్‌కు మద్దతునట్లుగానే అందరూ భావిస్తున్నారు. మద్దతు కూడగట్టే ధీమాలో బీజేపీ.. మారుతున్న రాజకీయ పరిస్థితులతో ఎంఐఎంతో పోరాడి గెలిచేందుకు తాము ఇతర పార్టీల మద్దతు కూడగట్టగలమనే ధీమాలో బీజేపీ ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల ఎన్నికలప్పుడు ఒక పార్టీలో ఉండి ఇప్పుడు వేరే పార్టీలో చేరిన వారు కూడా ఎందరో ఉన్నారు. వారిలో ఎందరు ఇప్పుడు తాముంటున్న పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారో చెప్పలేని పరిస్థితి. దాంతో కాంగ్రెస్ మద్దతిచ్చే ఎంఐఎంకు ఎందరు ఓటు వేస్తారో కూడా చెప్పలేమంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు తమపై పెత్తనం చెలాయిస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ కార్పొరేటర్లలో ఉంది. వాస్తవానికి కార్పొరేటర్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌నుంచి ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే గెలిచినప్పటికీ, వారీ ఎన్నికలో ఓటర్లు కారు. ఇక కార్పొరేటర్లలో.. బీఆర్ఎస్ నుంచి వచి్చన కార్పొరేటర్లే కాంగ్రెస్ ఓటర్లుగా ఉన్నారు. ఇలా వివిధ అంశాలు, వ్యక్తిగత పరిచయాలు, అభిమానాలు, తదితరమైన వాటితో తాము బలంగా పోటీనివ్వగలమన్న ధీమాతోనే బీజేపీ బరిలో దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వైఖరి ఏమిటన్నది కూడా ఆసక్తిగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వేటికవిగా మిగతా రెండూ ఒకటేనని ఆరోపిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం జరగనుంది? బీఆర్ఎస్ ఎటు మొగ్గుచూపనుంది? కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయనున్నాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. -
పార్లమెంట్ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ ఏడాది జనవరి 31వ తేదీన ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. వక్ఫ్(సవరణ) బిల్లును ఉద్దేశించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో శుక్రవారం దుమారం రేగింది. ఈ బిల్లు ముమ్మాటికీ రాజ్యాంగంపై దాడేనని, బిల్లును లోక్‌సభలో బుల్డోజ్ చేశారు అంటూ సోనియా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ... సోనియా గాంధీ వ్యాఖ్యలు దురదృష్ట్టకరం, సభ గౌరవానికి విరుద్ధం అని పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా టారిఫ్‌లపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత స్పీకర్ తన ముగింపు వ్యాఖ్యలను చదివారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో 173 మంది, కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో 169 మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 16 బిల్లులు ఆమోదించినట్లు, సభ ఉత్పాదకత 118 శాతానికి పెరిగినట్లు ప్రకటించారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యసభలో రెండో సుదీర్ఘ భేటీ ఈ సెషన్లో రాజ్యసభ మొత్తంగా 119 గంటలపాటు పని చేసిందని, ఉత్పాదకత 119 శాతానికి పెరిగిందని ఎగువ సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. సభలో రికార్డు స్థాయిలో 49 మంది సభ్యులు ప్రైవేటు మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారని వివరించారు. వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ గురువారం ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు విరామం లేకుండా సుదీర్ఘంగా సమావేశమైందని, ఇదొక రికార్డు అని అన్నారు. పార్లమెంటరీ రికార్డుల ప్రకారం.. రాజ్యసభలో ఇది రెండో సుదీర్ఘ భేటీ. మొదటి సుదీర్ఘ భేటీ 1981 సెప్టెంబర్ 18న జరిగింది. అప్పట్లోసభ మరుసటి రోజు తెల్లవారుజామున 4.43 గంటల వరకు కొనసాగింది. అత్యవసర సేవల నిర్వహణ బిల్లు–1981పై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చించారు. ఇదిలా ఉండగా, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ధ్రువీకరిస్తూ రాజ్యసభలో ఒక తీర్మానాన్ని శుక్రవారం ఆమోదించారు. పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. మణిపూర్‌లో ఘర్షణకు తెరదించడమే లక్ష్యంగా రెండు ముఖ్యమైన తెగల మధ్య సమావేశం త్వరలో జరగబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో వెల్లడించారు. ఢిల్లీలో ఈ భేటీ జరుగుతుందన్నారు. -
తొలిసారి స్పందించిన అన్నామలై
-
తమిళనాట కీలక పరిణామం.. సంచలనంగా అన్నామలై ప్రకటన
కోయంబత్తూర్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అన్నామలై ప్రకటన సంచలనంగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన అన్నామలై.. పార్టీకి జోష్ తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందనే వాదన కూడా ఉంది. ఆయనకు అన్నాడీఎంకేతో వైర్యం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ పార్టీకి, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న కారణంగా, ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.రాజీనామా చేసే ముందు శుక్రవారం ఆయన కోయంబత్తూర్‌లో మాట్లాడుతూ.. మంచి వ్యక్తులు ఉండే పార్టీ బీజేపీ.. ఈ పార్టీ బాగుండాలి. బీజేపీ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తినంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో, నాయకులు పార్టీ నాయకత్వ పదవికి పోటీ చేయరు. మనమందరం కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాము. నేను ఆ పదవి రేసులో లేను’’ అంటూ అన్నామలై స్పష్టం చేశారు.‘‘పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేను. నేను ఎలాంటి రాజకీయ ఊహాగానాలకు స్పందించబోవడం లేదు. నేను ఏ రేసులో లేను’’ అని అన్నామలై పేర్కొన్నారు.Coimbatore, Tamil Nadu: State BJP chief K Annamalai says, "There is no contest in Tamil Nadu BJP, we will select a leader unanimously. But I am not in the race. I am not in the BJP state leadership race." pic.twitter.com/7OjdbOoTWR— ANI (@ANI) April 4, 2025 -
HYD: స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావు
ఢిల్లీ: హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ . గౌతం రావును ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ప్రకటనతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్. గౌతం రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు.. కేంద్ర ఎన్నికల సంఘం గతనెలలో షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ప్రభా కర్ రావు పదవీకాలం మే 1తో ముగియనుంది. తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంమైంది. ఏప్రిల్ 4న నామినేషన్లు స్వీకరణ, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 గడువు. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 25న ఓట్ల లెకింపు, ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ తెలిపింది. -
కమలంలో కానరాని గెలుపు జోష్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి ఘనవిజయం సాధించిన బీజేపీలో ఆ జోష్ అంతలోనే మాయమైంది. నాయకులు, కార్యకర్తల్లో స్తబ్ధత ఏర్పడింది. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు ఇతర వర్గాల సమస్యలపై అడపాదడపా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి ప్రభావం చూపేలా కార్యక్రమాలు జరగడం లేదని కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. బీఆర్ఎస్ దూకుడు.. బీజేపీ పాకుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని సాధిస్తామనే స్థాయిలో పార్టీకి హైప్ వచ్చినా 8 సీట్లతోనే సంతృప్తి పడాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకుగాను 8 సీట్లు గెలిచి బీజేపీ సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అసలైన ప్రత్యామ్నాయమనే స్థాయి తెచ్చుకుంది. దీంతో 2028 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే స్థాయిలో రాజకీయవర్గాల్లో అంచనాలు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లోనూ నెలకొంది.కానీ, బీఆర్ఎస్ అంతలోనే కోలుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరి సలపనివ్వకుండా పోరాటం చేస్తోంది. బీజేపీ మాత్రం ఆ స్థాయిలో పోరాడలేకపోతోంది. బీజేపీలో ముఖ్యనేతల నుంచి కిందిస్థాయి వరకు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్య నాయకుల మధ్య సమన్వయలేమి మరింత పెరిగిందని అంటున్నారు.8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారు సొంత ఇమేజ్ను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టడం, ముఖ్యనేతలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కేడర్‌లో గందరగోళం నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్లపై తీర్మానం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్యేలు పార్టీ వాదనను బలంగా వినిపించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమైంది. వరుస గెలుపుల తర్వాత కూడా నిర్లిప్తతే శాసనసభ, లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుస విజయాల తర్వాత కూడా బీజేపీలో పెద్దగా జోష్ కనిపించటంలేదు. ప్రజా క్షేత్రంలో ప్రభుత్వంపై కొట్లాడే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. వరుస గెలుపులను పదిలం చేసుకొనే కార్యకలాపాలేవీ ఇప్పటివరకు రాష్ట్ర నాయకత్వం చేపట్టకపోవటం గమనార్హం. మరోవైపు పార్టీలో పాత, కొత్త నేతల మధ్య వైరుధ్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకం ఆలస్యం కావటం కూడా నేతల్లో నిర్లిప్తతను పెంచుతోందనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీ అధిష్టానం కూడా రాష్ట్ర బీజేపీని ముందుకు కదిలించే ప్రయత్నం చేయటం లేదు. కొత్త అధ్యక్షుడి నియామకం ఆలస్యం అవుతున్నకొద్దీ నాయకులు, కార్యకర్తల్లో నిస్తేజం, నిర్లిప్తత పెరు గుతుందని కొందరు నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
హెచ్‌సీయూ వివాదం: సుప్రీంకోర్టు నిర్ణయంపై కిషన్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూమిలో పర్యావరణ విధ్వంసంపై ‘స్టే’ విధిస్తూ.. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 ఎకరాల్లో పర్యావరణం, జీవ వైవిధ్యతను కాపాడాలంటూ అన్ని వర్గాల ద్వారా జరుగుతున్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని.. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన తీర్పులోని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని.. వెంటనే ఈ భూముల్లో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నెలరోజుల్లో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆరు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయం.. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కినట్లుగా భావిస్తున్నాము’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.‘‘కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అటవీ సంపదను నష్టపరిచే ప్రయత్నం జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక చెట్టు నరికేందుకే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో చెట్లను నరికేందుకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా?. జీవవైవిధ్యత కళ్లముందు కనబడుతున్నప్పటికీ.. చెట్లను నరికివేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం ఈ అటవీ సంపద విధ్వంసాన్ని సుమోటోగా తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా.. ఉదయం నుంచి చెట్ల నరికివేతను కొనసాగించడం దురదృష్టకరం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.‘‘ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఆలోచనను మార్చుకుని.. వ్యక్తిగత అహాన్ని పక్కనపెట్టి.. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతున్నాను. పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అరెస్టు చేసిన విద్యార్థులను, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు
-
ముస్లింలపై ఎందుకింత ద్వేషం?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్(సవరణ) బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ బిల్లును తాను అంగీకరించబోనంటూ లోక్‌సభలో బిల్లు ప్రతిని ఆయన చించేశారు. దేశంలో మసీదు, ఆలయం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఆయన బుధవారం లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని, ఈ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి న్యాయం జరుగుతుందని తేల్చిచెప్పారు. రాత్రికి రాత్రి వక్ఫ్ భూములను ఆక్రమించుకున్న వారంతా వక్ఫ్(సవరణ) బిల్లుతో యజమానులుగా మారిపోతారని ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేం తమాషా? అని ప్రశ్నించారు. ముస్లింలపై ఎందుకింత ద్వేషం? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వక్ఫ్ బోర్డు అనేది పూర్తిగా ధార్మిక సంస్థ అని స్పష్టంచేశారు. వక్ఫ్ బిల్లు విషయంలో తాను సూచించిన 10 సవరణలు అంగీకరించాలని కోరారు. ప్రాచీన మందిరాలకే న్యాయం జరుగుతుంది ‘‘ఆర్టికల్ 14 ప్రకారం హిందూ, సిక్కు, జైన, బౌద్ధ ధర్మాలకు చెందిన వారికి సంబంధిత ఎండోమెంట్‌లోని ప్రోత్సాహకాలు వారికే దక్కాలి. పాలనా యంత్రాంగం మొత్తం వారి ఆధీనంలోనే ఉంటుంది. వారి పాలనా యంత్రాంగంలో వేరే ధర్మానికి చెందిన వారికి అవకాశం ఉండదు. వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాలను నూతన వక్ఫ్ బిల్లు ద్వారా తొలగించారు. ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డు పాలనా యంత్రాంగంలో భాగం అవుతారు. ఇది ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుంది. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26ను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత వక్ఫ్ ఆస్తులు(అనధికార ఆక్రమణదారుల తొలగింపు) బిల్లు–2014ను ప్రవేశపెట్టి 2024లో ఎందుకు ఉపసంహరించుకున్నారు? అనధికార ఆక్రమణలు జరుగుతున్నాయని భావించినప్పుడు ఆ బిల్లును ఎందుకు వెనక్కి తీసుకున్నారో చెప్పాలి. నూతన చట్టం ప్రకారం.. వివాదాస్పద భూముల్లో మసీదులు ఉన్నచోట ఇది ప్రభుత్వ భూమి అని అధికారి నిర్ణయించి ఒక నోటీసు అతికిస్తే అక్కడ మసీదు మూతబడి అది ప్రభుత్వ భూమిగా మారిపోతుంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దేశంలోని ప్రాచీన మందిరాలకు న్యాయం జరుగుతుంది తప్ప ప్రాచీన మసీదులకు కాదు. ప్రస్తుతం ఢిల్లీలో 172 వక్ఫ్ ఆస్తులు దేశ పురావస్తు శాఖ ఆ«దీనంలో ఉన్నాయి. వాటికి సంబంధించిన పత్రాలు లేని కారణంగా ఇప్పుడు అవి ఇక ప్రభుత్వ భూములుగా మారిపోతాయి’’ అని అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తంచేశారు. -
కుదిరితే సయోధ్య.. లేకుంటే ధర్మయుద్ధం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకునేందుకే ఢిల్లీకి వచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లు పెంచని పక్షంలో కేంద్రంతో ధర్మయుద్ధం తప్పదని స్పష్టంచేశారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం జాప్యం చేస్తే ‘గద్దె దిగాల్సిందే.. లేకుంటే గ్రామాల్లో గద్దెలు కూలాల్సిందే’అని హెచ్చరించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన బీసీ పోరు గర్జన ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం జాప్యం చేస్తోందని విమర్శించారు. ‘కురుక్షేత్ర యుద్ధానికి ముందు అయిననూ పోయి రావలె హస్తినకు అన్నారు. ధర్మ యుద్ధం కోసం ఢిల్లీకి వచ్చాం. సంధిలో భాగంగానే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాం. సయోధ్య కుదుర్చుకుందాం.. ఐదు గ్రామాలు ఇవ్వమన్నా నాడు దుర్యోధనుడు ఇవ్వలేదు. తర్వాత కురుక్షేత్రంలో ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటాం అని అడుగుతున్నాం. ఇకపై విజ్ఞప్తులు తీసుకొని ఢిల్లీకి రాం. గల్లీలకు వాళ్లు ఎట్లా వస్తారో చూస్తాం. ధర్మయుద్ధం ప్రకటించి మన సత్తా ఏంటో చూపుదాం’అని పిలుపునిచ్చారు. గద్దె దిగుడో.. గద్దెలు కూల్చుడో.. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటామని అడిగితే ప్రధాని మోదీకి వచ్చిన నొప్పేంటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ కుర్చీ అడిగామా? లేక గుజరాత్లో అమలు చేయమన్నామా? అని నిలదీశారు. ‘బీజేపీకి హెచ్చరిక జారీ చేస్తున్నా. అయితే రిజర్వేషన్లు పెంచాలి. లేదంటే మీరు గద్దె దిగాల్సిందే.. గ్రామాల్లో గద్దెలు కూలాల్సిందే. ఇదే నినాదంతో ముందుకు పోతాం. ఇప్పుడు రాకుంటే రిజర్వేషన్లు ఎప్పుడూ రావు. మీకు సహకారం అందించే సీఎంగా నేనున్నా. రాహుల్‌గాంధీ మద్దతు ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాలను ఏకం చేసి రిజర్వేషన్లు పెంచే బాధ్యత రాహుల్‌గాంధీ తీసుకుంటారు. మీరంతా ఏకమై ధర్మయుద్ధం ప్రకటించండి. మీ బలమేంటో పరేడ్ గ్రౌండ్లో చూపెట్టండి. మున్ముందు ఎర్రకోటపై మనమే జెండా ఎగురవేస్తాం. అందరం కలిసి రిజర్వేషన్లను సాధించుకుందాం’అని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ కమండల్ యాత్ర ప్రతినిధి రాహుల్‌గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కులగణన చేపట్టామని, బీసీల రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ విధానపరంగా వ్యతిరేకమని విమర్శించారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మండల్ కమిషన్‌ను నియమిస్తే, దానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్ యాత్ర మొదలుపెట్టిందని తెలిపారు. ఆ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ అని విమర్శించారు. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందనే 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను బీజేపీ ప్రభుత్వం వాయిదావేసిందని ఆరోపించారు. ‘బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టలేదు. మేము బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరడం లేదు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే 10 లక్షల మందితో సభ పెట్టి మోదీని సన్మానిస్తాం. అలా కాకుండా మాపై అధికారం చెలాయిస్తామంటే నాడు రజాకార్లకు పట్టిన గతే ఇప్పుడు బీజేపీకి పడుతుంది. జనగణనతోపాటు కులగణన నిర్వహించాల్సిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారు. మాకు ప్రాణాలు అక్కర్లేదు. కేవలం రిజర్వేషన్లు పెంచితే చాలు’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు యువత పోరాడినా గత దుర్మార్గ పాలకులు పట్టించుకోలేదని బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు ఇవ్వనందుకే తండ్రీకొడుకుల ఉద్యోగాలను యువత ఊడగొట్టారని తెలిపారు. -
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
మీర్‌పేట: విదేశీ యువతిపై లైంగికదాడి జరగడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె మీర్‌పేట మిథులానగర్లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న జర్మనీకి చెందిన యువతిని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఆసక్తి పెంచుకుని నెల రోజుల క్రితం యువతి దేశానికి వచి్చందన్నారు. నెల రోజుల పాటు ఎన్నో జ్ఞాపకాలు తనవెంట తీసుకెళ్దామనుకునే లోపే ఇలాంటి చేదు అనుభవం కలిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి గంటకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలో ఆలయానికి వచి్చన వివాహితపై, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదని ఆరోపించారు. విదేశీ యువతి ఘటనలో ఫొటోలు, వీడియో రికార్డింగ్‌ల వంటి ఆధారాలు ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 22 శాతం నేరాలు పెరిగాయని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు, గృహహింసలు పెరిగిపోతుండడం ఆందోళనకరమన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట బీజేపీ నాయకులు అందెల శ్రీరాములు యాదవ్, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, గాజుల మధు, భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్, రవినాయక్, రాజు, నీలారవినాయక్ తదితరులు ఉన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్/హిమాయత్‌నగర్: హెచ్‌సీయూ భూము లను పరిశీలించడానికి బీజేపీ ఎమ్మెల్యేలు వెళతారన్న ముందస్తు సమాచార నేపథ్యంలో వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని ఆయన నివాసంలో హౌస్అరెస్ట్ చేశారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పోలీసులు చుట్టుముట్టి అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి సమీప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఓయూ, కేయూ భూములు కూడా అమ్ముతారేమో: ఏలేటి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, రాబోయే రోజుల్లో ఉస్మానియా, కాకతీయ వర్సిటీల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ‘తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది. భూములు అమ్మితే కానీ ప్రభుత్వం నడవని పరిస్థితి. రియల్ ఎస్టేట్ దందా చేయడానికే ఈ ప్రభుత్వం ఉందా’అని ఏలేటి ప్రశ్నించారు. మంగళవారం హెచ్‌సీయూ సందర్శనకు వెళుతున్న తన హౌస్అరెస్ట్, బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్‌ను ఆయన ఖండించారు. వెంటనే అఖిలపక్ష బృందాన్ని హెచ్సీయూకు తీసుకెళ్లి చూపించాలని డిమాండ్ చేశారు. ‘త్వరలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తాం. వర్సిటీల భూముల జోలికి వెళితే సహించేది లేదు. భూముల వేలం ఆపడానికి ఉద్యమిస్తాం’అని హెచ్చరించారు. కాంగ్రెస్ మిత్రపక్ష నేతలైన ప్రొఫెసర్ కోదండరామ్, కూనంనేని సాంబశివరావులకు హెచ్‌సీయూ భూముల వివాదం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వేలాన్ని వెనక్కి తీసుకోవాలి: పాయల్ శంకర్ హెచ్‌సీయూ భూము ల వేలాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసు కోవాలని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనా రాయణ గుప్తాతో కలి సి ఆయన మీడియాతో మాట్లాడారు ‘ధరణి పేరుతో నాడు కేసీఆర్ దోపిడీ చేశారు. భూమాత పేరుతో నేడు కాంగ్రెస్ భూ దందా చేయడానికి ప్రయ త్నిస్తోంది’అని ఆరోపించారు. హెచ్‌సీయూ భూములపై వాస్తవ పరిస్థితు లకు తెలుసుకుందామని వెళుతుంటే పోలీసులు తమను నిర్బంధించారని, అణచివేత ప్రజాపాలన అవుతుందా అని పాయల్‌శంకర్ ప్రశ్నించారు. -
వక్ఫ్ బిల్లుపై వ్యతిరేకత ఎందుకంటే...
కేంద్ర ప్రభుత్వం బుధ వారం (నేడు) పార్లమెంట్లో ‘వక్ఫ్ సవరణ బిల్లు’ను ప్రవేశపెడుతోంది. ఈ చర్చను ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబళించే ప్రణాళికలో భాగంగా ముస్లిం సమాజం భావిస్తోంది. అలాగే ఇది లౌకికస్ఫూర్తి, మత స్వేచ్ఛ, సమానత్వం అనే రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కుతోంది. అందుకే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమ వుతోంది. ముస్లిం సమాజం ఈ బిల్లును వ్యతిరేకించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వక్ఫ్‌కి ఆదాయం ఎలా తేవాలి? ఆదాయాన్ని ఎలా వినియోగించాలి అనేదానిపై సర్వహక్కులు వక్ఫ్ బోర్డ్‌కి ఉంటాయి. కానీ ఈ సవరణ బిల్లులోని సెక్షన్ 32, సబ్ సెక్షన్ 2 క్లాజ్ (ఇ)ను సవరించడం ద్వారా ఈ ఆదాయ సముపార్జన, వినియోగాలపై వక్ఫ్ బోర్డుకున్న అధికారాలు పరిమితం చేయ బడ్డాయి. ఇప్పటికే వక్ఫ్ భూముల్లో 50% అన్యాక్రాంతమయ్యాయి. ‘ఢిల్లీ డెవలెప్మెంట్ అథారిటీ’ అనే ప్రభుత్వ సంస్థ ఢిల్లీలోని 30% వక్ప్ భూములను ఆక్రమించుకుంది. ఇప్పుడు ప్రతిపాదిత బిల్లు గనక చట్టం అయితే ఉన్న భూములను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సరైన పత్రాలు లేని భూములు వక్ఫ్ అధీనంలో ఉంటే అది (వక్ఫ్ బై యూజర్ ) వక్ఫ్ ప్రాపర్టీగానే భావించబడుతుంది. ఇçప్పుడు దీన్ని తొలగించనున్నారు. అదే జరిగితే డాక్యుమెంట్స్ లేని వక్ఫ్ ఆస్తులు ఆరునెలల్లోగా రిజిస్టర్ కాక పోతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. మత నియమాల ప్రకారం ఒకసారి సంక్షేమ కార్యక్రమాలకు దానం చేసిన ఆస్తిని ఇతర కార్య కలాపాలకు వాడకూడదు. ఈ బిల్లుతో దాన్ని తుంగలో తొక్కి పెద్ద స్థాయిలో వక్ఫ్ భూములను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఆక్రమించుకోవచ్చు. లేదా కార్పొరేట్లకు కట్టబెడుతుంది.అలాగే, సెక్షన్ 104 ఓనర్ షిప్కి సంబంధించినది. చట్టం ప్రకారం ముస్లిమేతరులు కూడా వక్ఫ్ చేయవచ్చు. కానీ కొత్త సవరణ ప్రకారం ముస్లింలే డొనేట్ చేయాలి. దానధర్మాల కోసం ఇచ్చేదానిలో మతాలను చొప్పించడం సరికాదు. మరోవైపు ముస్లింలు మాత్రం ఇతర మత సంస్థలకు డొనేట్ చేయడాన్ని నిషేధించలేదు. ఇది ద్వంద్వ వైఖరి మాత్రమే కాక వక్ఫ్‌ను బలహీనపరిచే చర్య కూడా!చాలా రాష్ట్రాల్లో హిందువేతరులు కూడా హిందూ దేవాలయాలకు దానం చేయవచ్చు అనే నిబంధన ఉంది. ఇదే నిబంధన వక్ఫ్ విషయంలోఎందుకు పాటించడం లేదు అనేది కీలకప్రశ్న. గతంలో వక్ఫ్ కౌన్సిల్లో ముస్లింలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు తలపెట్టిన సవరణ ద్వారా కౌన్సిల్లో ముస్లింల సంఖ్యను సగానికి తగ్గించి, మిగిలిన సగాన్ని ముస్లిమేతరులతో భర్తీ చేస్తుంది. మరి ఎండోమెంట్ బోర్డుల లాంటి వాటిలో ముస్లింలకు స్థానం ఎందుకు కల్పించరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం జవాబిస్తారు? సెక్షన్ 9 ప్రకారం వక్ఫ్ కౌన్సిల్ లోనూ, సెక్షన్ 14 ప్రకారం వక్ఫ్ బోర్డులోనూ ఇద్దరేసి ముస్లిమేతరులు సభ్యులుగా ఉంటారు. ఇది ముస్లింల రాజ్యాంగ హక్కులకు విఘాతమే!గతంలో వక్ఫ్ సీఈఓ ముస్లిం అయి ఉండాలి అనే నిబంధన ఉంది. ప్రస్తుతం దానిని తొలగించి ముస్లిమేతరులు కూడా సీఈఓ కావచ్చని మార్చ బోతున్నారు. ఇది ముస్లింల హక్కులకు గొడ్డలి పెట్టు.ఇప్పటివరకు వక్ఫ్‌కి డొనేట్ చెయ్యాలంటే ఇస్లామ్ మతావలంబి అయి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రస్తుత ప్రతిపాదిత సవరణ ద్వారా ఐదేళ్ళుగా ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉన్నవారు మాత్రమే డొనేట్ చేయాలనడం దారుణం మాత్రమే కాదు... వక్ఫ్‌ను బలహీన పరచడం! అదే ఎండో మెంట్ వారి విషయానికి వచ్చేటప్పటికి ప్రాక్టీసింగ్ హిందువే దానం చేయాలనే నిబంధన లేదు.సెక్షన్ 5 ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్‌కు ఉన్న అధికారాలను పరిమితం చేయడం జరిగింది. సెక్షన్ 3ఇ ప్రకారం కలెక్టర్లను వక్ఫ్ భూవివాదాల విచారణ, పరిష్కారాల కోసం నియమించడం సరికాదు. ఎందుకంటే కలెక్టర్ రెవిన్యూ రికార్డ్‌లకు అధిపతి కనుక అతను ప్రభుత్వ పక్షపాతి అవుతాడు. వివాదంలో ఉన్న ఏ వక్ఫ్ ఆస్తినైనా ప్రభుత్వ ఆస్తిగా మార్చేస్తాడు. ఒకసారి వక్ఫ్ అయితే అది ఎప్పటికీ వక్ఫే అన్న మతనియమానికి ఇది విరుద్ధం. అంతే కాక, అధికారుల పక్షపాతంతో, అధికార దుర్విని యోగంతో కొన్ని రోజుల్లోనే మొత్తం వక్ఫ్ ఆస్తులను ముస్లిం సమాజం కోల్పోయే ముప్పుంది.ఈ బిల్లు ద్వారా వక్ఫ్ భూములకు లిమిటేషన్ చట్టాన్ని వర్తింపచేస్తున్నారు. ఇదే జరిగితే వక్ఫ్ బోర్డులు శాశ్వతంగా ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను తిరిగిపొందే హక్కును... అనగా రైట్ ఆఫ్ రికవరీని కోల్పోతాయి. అంటే కోల్పోయిన వక్ఫ్ భూములు ఎప్పటికీ రికవర్ అయ్యే అవకాశం లేదు. ఈ అన్ని కారణాల రీత్యా ఈ బిల్లును ప్రజా స్వామ్య వాదులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో ‘రైతు ఉద్యమ’ స్ఫూర్తితో ముస్లింలు ఉద్యమబాట పట్టబోతున్నారు. సంయుక్త పార్లమెంటరీ సంఘం చెప్పిన అభ్యంతరాల్ని కాదని ప్రభుత్వం బిల్లు తేవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.ముహమ్మద్ షరీఫ్ వ్యాసకర్త ‘జమాఅతె ఇస్లామీ హింద్’ఏపీ రాష్ట్ర కార్యదర్శి ‘ 99483 15926 -
బీజేపీ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని రంగాల్లోనూ బీజేపీ విఫలం కావడంతోపాటు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. బీజేపీలో 75 ఏళ్లు దాటినవారు అధికారిక పదవుల నుంచి తప్పుకోవాలంటూ ఆ పారీ్టలో ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో బీజేపీ నాయకత్వం అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే ఏర్పడతాయి. సంకీర్ణ రాజకీయాల్లో మనం కీలకంగా మారుతాం’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 20 మంది ముఖ్య నేతలతో మంగళవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై చర్చించారు. దేశ, రాష్ట్ర రాజకీయ స్థితిగతులపైనా కేసీఆర్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు తగినంత సమయం ఇచ్చాం ‘రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలు వందశాతం ప్రభుత్వ పనితీరుపై పూర్తి అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నరగా తగినంత సమయం ఇచ్చాం. ప్రభుత్వాన్ని ఎండగట్టి, హామీల అమలు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగసభ నిర్వహించడమే సరైన మార్గం. అందుకే వరంగల్‌లో జరిగే బహిరంగసభను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో కదలాలి. తెలంగాణ సోయి మనకు ఉన్నా ఏమరుపాటుతనంతోనే ఓటమి పాలయ్యాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ప్రజలకు చేరువయ్యేందుకు మనం కృషి చేయాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ కేంద్రంగా దిశానిర్దేశం వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నియోజకవర్గాల వారీగా జనం, వాహనాల సమీకరణపై పలు సూచనలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి నుంచి రెండు లక్షల మంది జనసమీకరణ లక్ష్యంగా నిర్దేశించినట్టు సమాచారం. బుధవారం నుంచి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో బహిరంగసభ సన్నాహాలపై కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో సమీక్షిస్తారు. బుధవారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లా నేతల సమావేశం జరుగుతుంది. కేసీఆర్ వరుస సమీక్షల నేపథ్యంలో కేటీఆర్ జిల్లాల వారీగా బహిరంగసభ సన్నాహక సమావేశాలు రద్దయ్యే అవకాశమున్నట్టు తెలిసింది. బహిరంగసభ తర్వాతే సంస్థాగత నిర్మాణం వరంగల్ సభ నిర్వహణ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పార్టీనేత గ్యాదరి బాలమల్లుకు అప్పగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు, అన్ని స్థాయిల్లో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు షెడ్యూలు విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. -
HCU Issue: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
-
రేపు లోక్‌సభకు వక్ఫ్ బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్
ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లును రేపు(బుధవారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన తరుణంలో బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది ఆ పార్టీ అధిష్టానం. రేపు తప్పనిసరిగి బీజేపీ ఎంపీలంతా లోక్ సభలో ఉండాలంటూ విప్ జారీ చేసింది. అయితే ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి కిరణ్ రిజిజువక్ఫ్ సవరణ బిల్లును మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం మధ్యాహ్నం గం. 12.15 ని.లకు వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. దీనిపై ఎనిమిది గంటలపాటు చర్చ జరపనున్నారు ఎంపీలు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్ సభకు హాజరుకావాలని విప్ జారీ చేశారు. బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి. -
HCU భూముల వేలం నిలిపేయాలి : రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్
-
పవన్‌ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!
అవసరమైతే తమిళనాడుకు కూడా పార్టీని విస్తరిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్! వినడానికి బాగానే అనిపించినా ఆయన చెప్పిందైతే వాస్తవం! ఎలాగంటారా? ఏపీలోనే సొంతబలం లేదు కదా? ఇతర రాష్ట్రాలలో ఏం చేయగలుగుతారని మీకు అనిపించవచ్చు. అదే తమాషా రాజకీయం! ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ అని అందులో ఈయన ఒక పావుగా మారుతున్నారని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాల వారైతే బహిరంగంగానే ఈ విమర్శలకు దిగుతున్నారు.రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాలను సందర్శించారు. అది కూడా బీజేపీ మాట మేరకే అని ఒక విశ్లేషణ. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం మళ్లీ అన్నా డీఎంకేతో జత కట్టడానికి పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇందుకు దాదాపు సిద్దమవుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. డీఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రాలు సమర్పించడానికి ఢిల్లీ వళ్లారు. గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, లోక్‌సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు. కానీ డీఎంకే మొత్తం స్వీప్ చేసింది. ఆ పార్టీ తమిళనాడులో బలంగా వేళ్లూనుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన అన్నాడీఎంకేలో ఏర్పడిందని చెబుతున్నారు.ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈ కూటమిలో చేరతారా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తమ కూటమికి సినీ రంగు అద్దడానికి, తమిళనాడులోని తెలుగు వారిని కొంతమేర ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్‌ను ప్రయోగించాలని బీజేపీ తలపెట్టిందని అంటున్నారు. ఒకప్పుడు కులం ఏమిటి? మతం ఏమిటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతని వేషం కట్టి దక్షిణాది రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల క్రితం తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏపీలో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారు. పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని అంటున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ సీఎం కాకుండా అడ్డుపడడానికే ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నా, అవసరమైతే తన పదవి కోసం లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కొందరి భావన.చంద్రబాబు ఎప్పుడైనా మళ్లీ బీజేపీని వ్యతిరేకించినా, లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా, పవన్ కళ్యాణ్‌ను ప్రొజెక్టు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఏపీలో పెద్దగా ఓట్లు రాకపోయినా లేకపోయినా, ఆయన సినిమా ఇమేజీని వాడుకుని ఇతర రాష్ట్రాలలో ప్రొజెక్టు చేస్తే దాని ప్రభావం ఏపీపై కూడా ఉండవచ్చన్నది ఒక అంచనా అట.తెలంగాణలో గతంలో బీజేపీ జనసేనతో కలిసి పోటీచేసినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. జనసేన ఒక్క చోట తప్ప పోటీ చేసిన అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాని సనాతని వేషం కట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఇప్పుడు తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు ఒక చెక్ గా పవన్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు చెప్పినట్లు ప్రచారం చేసి వారితో ఆయన మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సమీప భవిష్యత్తులో లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడం, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి కుదరకపోవచ్చు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో చేరినా తమిళనాడులో జనసేన ఎంతవరకు సఫలం అవుతుందన్నది సందేహమే. సినీ నటుడు కూడా కనుక ప్రచారానికి ఈయనను వాడుకోవచ్చు. అందుకే యథా ప్రకారం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాంటి అబద్దాలు ఆడారో, అదే తరహాలో తమిళనాడులో కూడా ట్రయల్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది.ఉదాహరణకు ఆయనకు తమిళ కవి భారతీయార్ పై అభిమానం ఉందని చెప్పడం, శివాజీ గణేశన్‌కు అభిమానినని, 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని చెప్పడం, మైలాపూర్ పాఠశాలలో చదువుకున్నానని అనడం, కూరగాయల మార్కెట్ కు వెళ్లి తమిళం నేర్చుకున్నానని వెల్లడించడం చూస్తే వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్దాలు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పవన్ తన పుట్టిన స్థలం, చదువు గురించి మాత్రమే కాదు..అనేక అంశాలలో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది ఏపీ ప్రజలకు తెలుసు. అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే తప్పులేదని, అన్నా డీఎంకేతో జనసేన పొత్తు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఇక పిఠాపురంలో హిందీకి అనుకూలంగా మాట్లాడి, తమిళ నేతలను పరోక్షంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం మాట మార్చారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. తద్వారా తమిళ సెంటిమెంట్‌కు అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించే యత్నం చేశారన్న మాట.పిఠాపురంలో తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నప్పుడు హిందీని వ్యతిరేకించడం ఏమిటని అన్నారు. హిందీని రుద్దవద్దన్నది మాత్రమే తమిళ పార్టీల డిమాండ్. ఇదే అంశంపై అన్నాడీఎంకే కూడా అమిత్‌షా కు విన్నవించింది. పవన్ కళ్యాణ్ మరో ఆశ్చర్యకరమైన అంశం చెప్పారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటి కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ధైర్యం తప్ప మరేమీ లేవని ఆయన అన్నారు. ఇది సత్య దూరమైందో, కాదో ఆయనే ఆలోచించుకోవాలి. జనసేన పార్టీని స్థాపించడం, ఆ వెంటనే చంద్రబాబు కోరిక మేరకు మద్దతు ఇవ్వడం, కనీసం పోటీ కూడా చేయక పోవడం, తదుపరి టీడీసీ కూటమి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయడం జరిగాయి. చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి తరలి వెళ్లేవారు. మరి ఇందులో ఆయనకు చీకటి కనిపించడం ఏమిటో తెలియదు. కాకపోతే 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పోటీచేసి ఓటమి చెందినప్పుడు చీకటి కనిపించి ఉండవచ్చు. తన పార్టీ ఒకే సీటు గెలవడం, తనే రెండు చోట్ల ఓడిపోయారప్పుడు. 2019లో కూడా చంద్రబాబుతో పరోక్ష పొత్తు ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంటులో మాట్లాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. అంతే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తాను కూడా పోరాడతానని చెప్పలేక పోయారు. అదే టైమ్‌లో దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గవని నమ్ముతున్నట్లు ఆయన చెబుతున్నారు.ఏపీలో పార్టీ విస్తరణకు ప్రత్యేకంగా ఎలాంటి అడుగులు వేయకపోయినా, జనసేన నేతలు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాలలో టీడీపీ వారి పెత్తనం కింద నలిగిపోతున్నా, పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి చేసిన సూపర్ సిక్స్ అనే అబద్దాల వాగ్దానాలను తమిళనాడులో కూడా చెబుతారేమో తెలియదు. ఈ ఇంటర్వ్యూలలో ఆ జర్నలిస్టులు ఏపిలో ఎన్డీయే కూటమి హామీల అమలు తీరుతెన్నుల గురించి ఒక్క ప్రశ్న కూడా వేసినట్లు కనిపించదు. ముందస్తుగా మాట్లాడుకుని ఉంటే ఇబ్బంది లేని ప్రశ్నలే వేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ విప్లవవీరుడు చెగువెరా మొదలు టిడిపి అధినేత చంద్రబాబు వరకు, ప్రధాని మోడీ వరకు ఎన్ని రంగులు మార్చారో ,ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో, ఆయనను తమిళ ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాల్సిందే. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
HCU భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలి.. లేదంటే
హైదరాబాద్,సాక్షి: కంచ గచ్చిబౌలి (kancha gachibowli)లో వివాదం నెలకొన్న 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hcu) భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యానించారు.హెచ్‌సీయూ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అక్కడ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు మంగళవారం హెచ్‌సీయూలో పర్యటించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. ఈ క్రమంలో హెచ్‌సీయూ భూములపై బండి సంజయ్ మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోనిది. అటవీ శాఖ పరిధికి చెందిన భూముల్లో మొక్కల్ని నరకాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోవాలి. ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూములను వేలం వేయడం కుదరదు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండు కోవాలనుకోవడం దుర్మార్గం.గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా?. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని’ హెచ్చరించారు. -
కేంద్రంలో మరో 20 ఏళ్లు బీజేపీనే
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ కనీసం 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. స్థిరమైన పనితీరు కనబరుస్తున్న తమ పార్టీ పట్ల ప్రజాదరణ చెక్కుచెదరదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ విజయమైనా కష్టపడి పనిచేసే లక్షణంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. సొంత బాగు కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తే విజయం కచ్చితంగా సొంతమవుతుందని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ రాబోయే 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పానని గుర్తుచేశారు. గత పదేళ్లుగా అధికారంలో కొనసాగుతోందని, మరో 20 ఏళ్లపాటు పార్టీకి ఢోకా లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం రాత్రి ‘టైమ్స్ నౌ’సదస్సులో అమిత్ షా మాట్లాడారు. చక్కటి పరిపాలన అందించిన పార్టీకి ప్రజాదరణ లభిస్తుందని, తద్వారా ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రజలు మెచ్చే పాలన అందించలేని పార్టీలకు ఇలాంటి ఆత్మవిశ్వాసం లభించదని స్పష్టంచేశారు. పదేళ్లలో 16,000 మంది లొంగుబాటు దేశంలో అంతర్గత భద్రతకు ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదని అమిత్ షా స్పష్టంచేశారు. నక్సలైట్ల హింసాకాండ, జమ్మూకశీ్మర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం అనే మూడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మూడు అంశాలకు సంబంధించి గత పదేళ్లలో 16,000 మంది యువత లొంగిపోయారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా తనపై ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆరాధన స్థలాల చట్టం–1991పై ఇప్పుడు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో మనం మాట్లాడడం సరైంది కాదన్నారు. కోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ వలసదార్లను ఓటుబ్యాంకుగా మార్చుకుంటోందని అమిత్ షా మండిపడ్డారు. పొరుగు దేశం నుంచి వచ్చినవారిని ఓటర్లుగా చేర్పిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం లేదు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై అమిత్ షా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఒకదాని వెంట ఒకటి యూసీసీని ప్రవేశపెట్టబోతున్నాయని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీపై చట్టం తీసుకొచ్చారని, గుజరాత్‌లోనూ దీనిపై కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీ ఎజెండాలో యూసీసీ అనేది అత్యంత కీలకమైన అంశమని ఉద్ఘాటించారు. దేశంలో యూసీసీని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చామని తెలిపారు. అది జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. యూసీసీని తీసుకురావాలన్నది రాజ్యాంగ సభ నిర్ణయమని పేర్కొన్నారు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినప్పటికీ బీజేపీ మర్చిపోలేదన్నారు. చెప్పినట్లుగానే ఆర్టికల్ 370ని రద్దు చేశామని, అయోధ్యలో రామమందిరం నిర్మించామని, ఇక యూసీసీని అమలు చేయడం తథ్యమని వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనపై త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కమిటీ విచారణకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. మోదీ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటోందన్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వెల్లడించారు. సంఘ్ గత వందేళ్లుగా దేశభక్తులను తయారు చేస్తోందని ప్రశంసించారు. -
వలంటీర్లు ‘పచ్చడి’
ఇదిగో బాబు.. ‘ఈనాడు’లో నీ ఉగాది హామీసరిగ్గా ఏడాది కిందట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వలంటీర్లను తొలగించం. గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం’ అని ప్రకటించారు. కానీ గద్దెనెక్కిన తర్వాత వలంటీర్లను నిండా ముంచేశారు. సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రజలకు సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలిచ్చి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు, కూటమి పార్టీల నేతలు ఆపై మాట మార్చేశారు. ‘సూపర్ సిక్స్’ అమలు చేస్తానని మోసపూరిత హామీలతో అధికారం చేపట్టాక ప్రతి వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబు.. వలంటీర్లను సైతం మోసం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, పైరవీలు, పక్షపాతం లేకుండా క్షేత్ర స్థాయిలో సేవలు అందించిన వలంటీర్ల వ్యవస్థనూ ఒక్కసారిగా కుప్పకూల్చారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయం.. చివరకు తనకు ఓటు వేయని వారికైనా సరే అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలన్న నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులు నిర్వర్తించారు. వారికి కేటాయించిన ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వారికి ఏయే పథకాలకు అర్హత ఉందో గుర్తించి.. వారితో దరఖాస్తు చేయించి.. ఆయా పథకాలు వర్తింప చేసి.. ప్రభుత్వం ద్వారా లబ్ధి కలిగేలా కృషి చేశారు. ఇంతగా సేవలు అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను ప్రస్తుత టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి వలంటీర్లకు చిక్కులు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లకు విధులు అప్పజెప్పడం మానేసింది.ఇప్పుడు మళ్లీ ఉగాదొచ్చింది..ఇప్పుడు మళ్లీ ఉగాది వచ్చింది. గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగుతున్నారు. ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రంలో వలంటీర్లందరి ఉద్యోగాలు పోయాయి. 2024 జూన్ ఒకటో తేదీన సైతం వలంటీర్లు గౌరవ వేతనాలు పొందారు. అయితే 2023 ఆగస్టు నుంచే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదంటూ చంద్రబాబు ప్రభుత్వమే వలంటీర్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది ఉగాది పండుగ రోజున చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు వారి వేతనాలు పెరగకపోగా, ఏకంగా వారి ఉద్యోగాలే లేకుండా పోయాయి. పది నెలలుగా వారి వేతన చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. అసలు రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థే ప్రస్తుతం ఉనికిలో లేదని సాక్షాత్తు ఆ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి నిస్సిగ్గుగా ప్రకటించారు. ‘ఆ వ్యవస్థే లేనప్పుడు వారిని ఎలా కొనసాగిస్తాం? వలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎక్కడ ఉంటుంది?’ అంటూ ఎదురు ప్రశ్నించడంతో వలంటీర్ల దిమ్మ తిరిగిపోయింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని వల్లె వేశారు. ‘అసలు వలంటీర్లు అఫీషియల్‌గా లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, జీవోలో ఎక్కడా వాళ్లు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు’ అంటూ వ్యాఖ్యానించడంతో అందరూ విస్తుపోయారు. దీంతో తామంతా దారుణంగా మోసపోయామని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. గత ఉగాది పండుగ పూట మీకు తీపి కబురు చెబుతున్నామన్న చంద్రబాబు ఇంత దుర్మార్గంగా తమను మోసం చేస్తారని అనుకోలేదని నిప్పులు చెరిగారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పది నెలలుగా ఎక్కడికక్కడ ధర్నాలకు దిగారు. 2.66 లక్షల మంది వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడంతో పాటు వినతులు ఇస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం వారి గురించి కనీస ఆలోచన చేయడం లేదు. కరోనా సమయంలో కీలక సేవలువైఎస్ జగన్ హయాంలో ఎలాంటి అవినీతి, వివక్ష, పైరవీలకు తావులేకుండా ఆయా పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందించారు. ప్రజలకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ పని ఉన్నా వలంటీర్లే గ్రామ సచివాలయాల ద్వారా చేయించారు. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి నెలా రెండు విడతల చొప్పున కేవలం మూడు రోజుల సమయంలో అన్ని కుటుంబాల్లో ఫీవర్ సర్వే పూర్తి చేశారు. తద్వారా ఎప్పటికప్పుడు రోగుల గుర్తింపులో కీలక పాత్ర పోషించారు. వరదల సమయంలో బాధిత ప్రజలకు గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా సహాయక చర్యలు అందించడంలో ముందు వరుసలో నిలిచారు. గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నికల వరకు చంద్రబాబు సహా కూటమి నేతలంతా తీవ్ర విమర్శలు చేశారు. తీరా పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2.66 లక్షల కుటుంబాలను నిట్ట నిలువునా ముంచేశారని వలంటీర్లు వాపోతున్నారు. ఇప్పుడు ఊడగొట్టిన ఉద్యోగాలే ఎక్కువ కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని చూస్తే ఆ ఊసే లేదు. ఊడకొట్టిన ఉద్యోగాలే ఎక్కువ. 2.66 లక్షల మంది వలంటీర్ల ఉద్యోగాలు పోయాయి. బేవరేజ్ కార్పొరేషన్లో 18 వేల మందిని తొలగించారు. ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ.. ఇలా ఆయా ప్రభుత్వ విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలను పూర్తిగా కుదించేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు..తెలుగుదేశం.. ఎన్డీయే మూడు పార్టీల కూటమి తరఫున మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉగాది పండుగ రోజున తీపి కబురు చెబుతున్నాం. రూ.5 వేలు కాదు, మీకు రూ.10 వేలు పారితోషకం ఇచ్చే బాధ్యత మాది.-అసెంబ్లీ ఎన్నికల ముందు 2024 ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా చంద్రబాబువలంటీర్లకు నేను ఒకటే చెబుతున్నా.. వలంటీర్లలో లక్ష మంది మహిళలున్నారని వైఎస్సార్సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. అమ్మా, నేను ఓ అన్నగా చెబుతున్నా. మీకు ఐదు వేలు వస్తుంటే, ఇంకో ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడూ మీ పొట్ట కొట్టను. -ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్కళ్యాణ్అధికారంలోకి వచ్చాక..వలంటీర్లు అసలు అఫీషియల్‌గా లేరు ఇప్పుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా, ఎక్కడా.. జీవోలో వాళ్లు అసలు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు. అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయింది. -నాలుగు నెలల క్రితం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచుల సంఘ ప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్రూ.4.57 లక్షల కోట్ల పంపిణీలో కీలక పాత్ర2019 ఆగస్టు 15న అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మక వలంటీర్ల వ్యవస్థకు నాంది పలికింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మందిని నియమించింది. 2024లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే వరకు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వం ద్వారా లబ్ధిని ప్రజల గడప వద్దకే అందజేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఆ ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ రూపంలో, మరో రూ.1.84 లక్షల కోట్లు నాన్ డీబీటీ రూపంలో మొత్తంగా రూ.4.57 లక్షల కోట్ల మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో క్షేత్ర స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. అరచేతిలో వైకుంఠం చూపారుచంద్రబాబు వలంటీర్లకు అరచేతిలో వైకుంఠం చూపారు. అది నిజమనుకుని, ఆ హామీలు నమ్మాం. తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. గతేడాది ఉగాది నాడు నూతన పట్టు వస్త్రాలు ధరించి, నుదుట బొట్టుతో చంద్రబాబు మా భవిష్యత్ గురించి ఎంతగానో తపన పడుతున్నట్లు మాట్లాడారు. మమ్మల్ని ఊరిస్తూ బూటకపు హామీలు ఇచ్చారు. ఆ హామీని నమ్మి దగా పడ్డ వలంటీర్లంతా ఈ ఉగాదిని కూటమి దగా–దినంగా పాటించాలని నిర్ణయించుకున్నాం. పండుగ పూట పస్తుండి నిరసనలు తెలుపుతాం. – హుమాయూన్ బాషా, ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల సంఘం అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలిసీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా మాకు (వలంటీర్లకు) ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు. చంద్రబాబు గత ఉగాది నాడు పచ్చడి తింటూ ఈ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ లేదని చెబుతున్నారు. మంత్రులు ‘పుట్టని బిడ్డ’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌లో విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో మా సేవలు వినియోగించుకున్నారు. పుట్టని బిడ్డతో సేవలు ఎలా చేయించుకున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఉగాది పర్వదినాన చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. –గాలి షైనీ, వలంటీర్, విజయవాడమా ఉసురుతో ఈ ప్రభుత్వం పతనం ఉగాది పండుగ రోజున వలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మరిచిపోలేం. గతేడాది ఉగాది రోజున వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన మమ్మల్ని సీఎం చంద్రబాబు మోసం చేశారు. వలంటీర్లంతా పేద కుటుంబాలకు చెందిన వారే. అలాంటి కుటుంబాల్లో వలంటీర్ ఉద్యోగం కల్పించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేసింది. కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరూ చేసిన మోసాన్ని మేము మరిచిపోలేం.. మా ఉసురు ఈ ప్రభుత్వ పతనానికి దారి తీయడం ఖాయం. – చేపల రాజు, వలంటీర్, రేవుపోలవరం, అనకాపల్లి జిల్లాదుర్మార్గంగా పక్కన పెట్టేశారువలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలు సైతం రెట్టింపు చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించి సీఎం చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చి పది నెలలైనా మా గురించి పట్టించుకోవడం లేదు. జీతాలు పెంచే విషయం అటుంచి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేశారు. గత ఐదేళ్లలో వలంటీర్లు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందించాము. కరోనా సమయంలో మేము చేసిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి. చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి జీతాలు పెరుగుతాయని అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చాక దుర్మార్గంగా పూర్తిగా పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. – అన్నపూర్ణ, వలంటీర్, రాములవీడు గ్రామం, పొదిలి మండలం, ప్రకాశం జిల్లానమ్మించి నట్టేట ముంచేశారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్లను నమ్మించి నట్టేట ముంచేశారు. రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని చెప్పి వలంటీర్లను మోసం చేశారు. ఎన్నికల్లో నెగ్గాక ఈ వ్యవస్థే లేదంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో, ఇతరత్రా మా సేవలు చూసి యావత్ దేశ ప్రజలంతా ప్రశంసించడం నిజం కాదా? మీకు చిత్తశుద్ధి ఉంటే వలంటీర్లకు చేసిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలి. లేదంటే తగిన బుద్ధి చెబుతాం.– పెదపూడి చినబాబు, వలంటీర్, ఎన్ఆర్పీ అగ్రహారం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లాదగ్గరలోనే బుద్ధిచెప్పే రోజులు వలంటీర్లను కొనసాగించడానికి పరిపాలన అనుమతులు లేవని సాకులు చెప్పి నిలిపివేశారు. అయితే విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో వలంటీర్ల సేవలను ఏ అధికారంతో వినియోగించుకున్నారో చెప్పాలి. గత ప్రభుత్వానికి సాధ్యమైంది.. ఈ ప్రభుత్వానికి ఎందుకు కావడం లేదు? వలంటీర్లను తప్పించాలనే దురుద్దేశంతో ప్రభుత్వం సాకులు చెబుతోంది. చాలా మంది డిగ్రీ వరకు చదువుకొని ఉన్న ఊరిలో ఇంటి పనులు, ప్రజా సేవ చేస్తూ జీవనం సాగించే వారు. కూటమి ప్రభుత్వం కుట్రతోనే వలంటీర్లను పక్కనపెట్టింది. ఇది నిజం. వారికి తగినబుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – రామ్‌గోపాల్, చిన్నటేకూరు, కల్లూరు మండలం, కర్నూలు జిల్లాఉగాది చేదు జ్ఞాపకంఉగాది పండుగ మా వలంటీర్లందరికీ చేదు జ్ఞాపకం. ఎన్నికలకు ముందు గత ఉగాది పండుగను పురస్కరించుకుని విజయవాడలో చంద్రబాబునాయుడు ఒక ప్రకటన చేశారు. ఉగాది రోజు వలంటీర్లందరికీ తీపి కబురు చెబుతున్నామన్నారు. రూ.10 వేలు జీతం ఇచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సైతం అదే మాట చెప్పారు. ఇప్పుడేమో వలంటీర్లకు జీతాలు పెంచాలని చూస్తున్నాం కానీ వారందరూ ఎక్కడా జీవోలో లేనే లేరు అని తప్పించుకోవడం బాధాకరం. చిరు జీతానికి పని చేసుకుంటున్న మమ్మల్ని మోసం చేయడం సబబు కాదు. – చలపతి, పాదిరికుప్పం, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా -
భాషా రాజకీయాల ఆట
తమిళనాడు తన బడ్జెట్ ప్రమోషనల్ లోగోలో భారత కరెన్సీ సింబల్‌కు బదులుగా తమిళ అక్షరం ‘రూ’ వాడి దేశవ్యాప్తంగా దుమారం లేవనెత్తింది. ఈ చర్య కేవలంసింబల్ వివాదం కాదనీ, ఇది భారత సమైక్యతను బలహీనపరుస్తుందనీ, ప్రాంతీయ అభిమానం మాటున వేర్పాటువాద సెంటిమెంటును రెచ్చగొడుతుందనీ విమ ర్శిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే మాజీ చట్టసభ్యుడి తనయుడు, గువాహటి ఐఐటీలో డిజైనర్ అయిన ఒక తమిళ వ్యక్తి రూపకల్పన చేసిన సింబల్‌ను తిరస్కరించడం డీఎంకే ‘మందబుద్ధి’ని బయటపెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు. తమిళంలో రూపాయి గుర్తుకు తమిళ అక్షరం ‘రూ’ వాడటం సహజమే. మూడు భాషలను ప్రతిపాదించిన ఎన్ఈపీ 2020 పట్ల అసమ్మతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బడ్జెట్ పత్రాల్లో రూపాయి సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ’ అక్షరం వాడటం వెనుక డీఎంకే ఉద్దేశం. ఏడాదిలో రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ భాషాదురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. తమిళ సెంటిమెంట్ ఆందోళనహిందూ అహంకారం పతాకస్థాయికి చేరిన తరుణంలో అస్తిత్వ పోరుకు నడుం బిగించిన రాజకీయ నాయకుడు నిజానికి డీఎంకే అధినేత ఒక్కరే కాదు. అయితే ఒక్క డీఎంకే మీద మాత్రమే బీజేపీ నేతలు శ్రుతి మించిన ఆగ్రహావేశాలు ప్రదర్శించడం చూస్తే, ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలి. మతం ప్రాతిపదికగా వ్యక్తులను అవమానించడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు ముప్పుగా భావించే రోజు ఎప్పుడు వస్తుంది? రెండోసారి అధికారం చేజిక్కించుకోవడానికి స్టాలిన్ సన్నద్ధం అవుతున్నారు, వాస్తవమే! ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళనాడు అలవాటు. ఈ సింగిల్ టర్మ్ ఆనవాయితీని భగ్నంచేసింది జయలలిత ఒక్కరే! 2016లో ఆమె ఏఐఏడీఎంకేను రెండో టర్మ్ అధికారంలోకి తెచ్చారు. ఈ సెంటిమెంటుతో పాటు నటుడు విజయ్ నాయకత్వంలో ఏర్పడిన తమిళగ వెట్రి కళగం పార్టీ సైతం డీఎంకేకు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ లేదా మరో ఇతర పార్టీ రానున్న ఎన్నికలకు అజెండా సెట్ చేసేవరకూ డీఎంకే వేచి చూడదలచుకోలేదు. భాష, నియోజకవర్గాల పునర్విభజన అస్త్రాలను బయటకు తీసింది. రాష్ట్రంలో ఏ మూలైనా ఈ అంశాల మీదే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్‌లు... ఈ రెండు అంశాల మీద డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రహస్థితులు అనుకూలిస్తే, రానున్న ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ కూటమి కట్టే అవకాశాలున్న ఏఐఏడీఎంకే ఇప్పుడు పులుసులో పడింది. 2020లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఈపీకి వ్యతిరేకంగా తొలి శంఖం పూరించిన పార్టీ ఇదే. హిందీని నిర్దేశించకపోయినా...హిందీ వ్యతిరేక రాజకీయాల్లో తమిళనాడుకు వందేళ్ల చరిత్రఉంది. మూడు భాషల సూత్రానికి అంగీకరిస్తేనే రాష్ట్రానికి కేంద్ర విద్యానిధులు విడుదల చేస్తామని ప్రకటించి, నిద్రాణంగా పడి ఉన్న ఒక జటిల సమస్యకు బీజేపీ ఎందుకు తిరిగి ప్రాణం పోసింది? ఇది అంతుచిక్కని విషయం. ‘హిందీకరణ’ ఇండియా పట్ల తన మక్కు వను వెల్లడిస్తూ ఆ పార్టీ సంకేతాలపై సంకేతాలు ఇస్తోంది. వలసవాద అవశేషాలు తుడిచిపెట్టాలన్న మిషతో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పేర్లను హిందీలోకి మార్చడం ఇందుకు ఉదాహరణ. ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే రాజకీయ బలహీ నత అవుతుందేమో అన్నది బీజేపీ డైలమా. మూడో భాష హిందీయే అవ్వాలని ఎన్ఈపీ ఆంక్ష పెట్టని మాట నిజమే. ఆచరణలో మాత్రం మూడో భాష హిందీనే అవుతుంది. లెక్కలేనన్ని మూడో భాషలను బోధించే టీచర్లను నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా తలకు మించిన భారం. పైగా ఎక్కడెక్కడి నుంచో వారిని తీసుకురావడం మరీ కష్టం. స్కూళ్లలో హిందీ బోధించడం తప్ప గత్యంతరం లేదు. ఇదో దుఃస్థితి. తమిళనాడులో కూడా మలయాళం, కన్నడం, తెలుగు టీచర్ల కంటే హిందీ బోధించేవారిని నియమించుకోవడం సులభం.సరికొత్త ప్రచారకర్తఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘వాళ్లు ఆర్థిక లాభాలు ఆశించి ఎందుకు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేస్తు న్నారు?’ అంటూ ఒక తప్పు ప్రశ్న వేస్తున్నారు. దక్షిణాదిన హిందీకి, హిందుత్వకు సరికొత్త ప్రచారకర్తగా మారిన ఈయన డీఎంకేది ‘హిపో క్రసీ’ అని కూడా నిందిస్తున్నారు. ఒక్కమాటలో ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవచ్చు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదు. దాని వ్యతిరేకత అంతా హిందీని బలవంతంగా రుద్దడం మీదేఆశ్చర్యం ఏమిటంటే, తమిళనాడులో లక్షల మంది స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ వారిని అడ్డుకోడు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని లక్షల మంది ఉత్తర భారతీయలు ఉపాధి కోసం తమిళనాడు రావడం నాణానికి రెండో పార్శ్వం. ఉత్తరప్రదేశ్ లేదా బిహార్ స్కూళ్లలో తమిళం నేర్చుకోరు. తమిళనాడులో ఉపాధి కోసం తమిళం నేర్చుకోవాలని వారిని ఎవరూ ఒత్తిడి చేయరు. హిందీ మాట్లాడటానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షా లేదు. అందరూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చీరాని హిందీలో ప్రయత్నించి సహకరిస్తారు.చెన్నైలో ఏ రెస్టారెంటుకి వెళ్లినా మీకో దృశ్యం కనబడుతుంది. ఉత్తరాది వెయిటర్, తమిళ కస్టమర్ పరస్పరం ఎదుటి వారి భాషలో మాట్లాడుతారు. ఆ సంభాషణ ఎలా ఉన్నా ఆర్డర్ చేసిన ఆహారం రాకుండా పోదు. అదే తరహాలో హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నడుమ విలసిల్లుతున్న చిరకాల సహకారం పవన్ పేర్కొంటున్నట్లు హిపోక్రసీ కాదు. ఆర్థికం కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు... ప్రజలు స్వచ్ఛందంగా చేరువ అవుతారనడానికి ఇదో ఉదాహరణ.దొడ్డిదారినో మరో అడ్డదారినో ఒక భాషను బలవంతంగా రుద్దడం ఎప్పుడూ, ఎక్కడా సుఖాంతం కాలేదు. తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఈ విషయంలో తగినంత గుణపాఠం నేర్ప లేదు. పొరుగు దేశాల పరిణామాలు దీన్ని రుజువు చేస్తాయి. ఒకే భాష ద్వారా జాతీయ సమైక్యత సాధించాలన్న రాజకీయాలు చావు దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్ ఇందుకు చక్కటి ఉదాహరణ. 1947లో ఏర్పాటై సంబరాలు జరుపుకొన్న కొద్ది నెలల్లోనే ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. ఆనాడే వాస్తవంగా ఆ దేశం తన తూర్పు ప్రాంతాన్ని కోల్పోయింది. ఉర్దూకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం 1971లో, ఇండియా తోడ్పాటు లభించి, దేశవిభజనతో సమసింది. ‘సింహళ ఒక్కటే’ శాసనంతో... సింహళీయులకు తమిళు లకు నడుమ ఉన్న విభేదాలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరాయి. అదే 30 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. డీఎంకే అన్ని అంశాల్లోనూ, ఎన్ఈపీతో సహా, కేంద్రంతో సంప్ర దింపుల ధోరణితోనే వ్యవహరిస్తోంది. ‘రూ’ తమిళ అక్షరం వాడిందన్న సాకుతో ఆ పార్టీని ‘వేర్పాటువాది’గా అభివర్ణించడంతో బీజేపీ నైజం వెల్లడైంది. సర్వం కేంద్రం అధీనంలోకి తెచ్చుకోవాలన్న వీరావేశం, తనను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల దాని వైఖరి బట్టబయలు అయ్యాయి. చరిత్ర పట్ల ఆ పార్టీ నిర్లక్ష్య భావం కూడా బయటపడింది. ఇదే అన్నిటి కంటే ప్రమాదకరం.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-నిరుపమా సుబ్రమణియన్ -
2025 జనవరి 1 నుంచి డీఏ పెంపు వర్తింపు
-
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం
సాక్షి, తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చావుదెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ కేడర్ ఎదురొడ్డి పోరాడింది. అక్రమ కేసులు, కిడ్నాపులు, దాడులను ఎదుర్కొని వైఎస్సార్సీపీ గెలిచింది. రాష్ట్రంలో గురువారం జడ్పీలు, మండల పరిషత్‌లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది. వాస్తవానికి ఆ 53 పదవులూ గతంలో వైఎస్సార్‌సీపీవే. అయితే, పలు కారణాల వల్ల ఖాళీ అవ్వడంతో ఎన్నికలు అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా కూటమి ప్రభుత్వం బరిలోకి దిగింది. రెడ్‌బుక్ అమలు చేసి గెలవటానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది. అన్నిటినీ ఎదర్కొని ధైర్యంగా వైఎస్సార్సీపీ కేడర్ నిలిచింది. దీంతో టీడీపీ కేవలం తొమ్మిది స్థానాల్లో గెలుపును సరిపెట్టుకుంది. ఆ గెలుపును కూడా వైఎస్సార్సీపీ సభ్యులను తమవైపు తిప్పుకుని ఆ గెలుపుని తమ ఖాతాలో వేసుకుంది. కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్యులైన బీజేపీ, జనసేనలు పోలీసులను ప్రయోగించి చెరో ఎంపీపీని కైవసం చేసుకున్నాయి.కోరం లేక 10 చోట్ల ఎన్నికలు వాయిదా పడింది. వైఎస్సార్సీపీ కేడర్ పోరాట స్పూర్తికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.పది నెలల్లోనే మోసకారి ప్రభుత్వంపై ఇది తిరుగుబాటుగా ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది
-
సత్తా ఉన్న విధానమే కానీ...
దేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020 లక్ష్యం. ఈ నూతన విధానం గడచిన అయిదేళ్లలో అనేక విమర్శలు, ప్రతిఘటనలు ఎదుర్కొంది. బీజేపీ పాలిత ప్రాంతాలు అక్కున చేర్చుకుని అమలు చేస్తుండగా, తమిళనాడు వంటి ప్రతిపక్ష రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి. స్వయంప్రతిపత్తి, సాంస్కృతిక అస్తిత్వం ప్రమాదంలో పడతాయని భావిస్తూ ఎన్ఈపీని తిరస్కరిస్తున్నాయి. ఎన్ఈపీ విజన్ పక్కాగా ఉన్నప్పటికీ, అమలులో దక్షత కొరవడింది. నిధులు, మౌలిక వసతులు, సమాఖ్య ఏకాభిప్రాయం వంటి అంశాల్లో పలు సమస్యలు ఎదుర్కొంటోంది.ఇప్పుడున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 మోడల్ ప్రవేశపెట్టడం ఎన్ఈపీ 2020 తెచ్చిన కీలక సంస్కరణ. చిన్నారుల ఆరంభ విద్యకు ఇది ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే, ఉపాధికి ఉపకరించేలా 6వ తరగతి నుంచే వృత్తివిద్యను ప్రవేశపెట్టడం ముఖ్యమైన మార్పు. కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన ఉండాలన్నది మరో ముందాలోచన. బహుళ విద్యా విభాగాల ద్వారా ఉన్నత విద్య అభ్యసించే వీలు ఈ నూతన విధానం కల్పిస్తోంది. ఇది చెప్పుకోదగిన మార్పు. ఉన్నత విద్యను అంతర్జాతీయకరించే దిశగా విదేశీ విశ్వవిద్యాలయాలు దేశంలో ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది. డిజిటల్ డివైడ్‌ను అధిగమించే ధ్యేయంతో ‘నేషనల్ ఎడ్యు కేషనల్ టెక్నాలజీ ఫోరం’ (ఎన్ఈటీఎఫ్) ఏర్పాటు వంటి చర్యలు ప్రతిపాదించింది. డిజిటల్ క్లాస్ రూములు, ఆన్లైన్ వనరుల వాడకం వంటి ఆధునిక పద్ధతులను కర్ణాటక, మహారాష్ట్ర అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. దేశీ విద్యలో అంతర్జాతీయ ట్రెండ్ ప్రతిబింబించేందుకు ఇవన్నీ దోహదపడతాయి. లోటుపాట్లు– ఎన్ఈపీ విజన్ ఎంతో స్పష్టంగా ఉన్నప్పటికీ అమలులో గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. 2025 నాటికి సార్వత్రిక అక్షరాస్యత సాధించాలన్నది విధాన లక్ష్యం. విద్యారంగంలో మౌలిక వసతుల కోసం చాలినన్ని నిధులు కేటాయించకుండా, తగినంత మంది ఉపాధ్యాయులు లేకుండా ఇదెలా సాధ్యం? – మూడు భాషల ఫార్ములా కాగితం మీద బాగానే ఉందని పిస్తుంది. వాస్తవంలో ఇది ఎంత రాజకీయ రగడ సృష్టిస్తోందో చూస్తూనే ఉన్నాం. అమలు చేస్తున్న రాష్ట్రాల్లోనూ అస్పష్టత నెలకొని ఉంది. రెండు భాషల్లోనే ప్రావీణ్యం సాధించలేని విద్యార్థులు మూడు భాషలు ఎలా అభ్యసిస్తారో వాటికి అర్థం కావడం లేదు. పరభాషలు బోధించే సుశిక్షిత ఉపాధ్యాయుల లభ్యత గురించి ఎన్ఈపీ 2020 ప్రస్తావించలేదు.– పాఠశాలల డిజిటలీకరణ కూడా ఇలాంటిదే. దీని వల్ల పట్టణ విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. అయితే గ్రామాల మాటే మిటి? ఇప్పటికీ 60 శాతం మంది గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఇంటర్నెట్ సదుపాయం లేదు. దీన్ని పూడ్చేలా గట్టి పెట్టుబడులు పెట్టకపోతే డిజిటల్ అంతరం మరింత పెరుగుతుంది. – అలాంటిదే వృత్తి విద్య. దీంతో ఎన్ని లాభాలున్నప్పటికీ ఆచరణలో దుర్వినియోగం అయ్యే ముప్పు ఉంది. ఇంటర్న్షిప్స్ మాటున పరిశ్రమలు ఇంటర్న్‌లను దోపిడీ చేసి లేబర్ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రభుత్వం ఆశించినట్లు అర్థవంతమైన నైపుణ్యాభివృద్ధి జరగకపోవచ్చు. – బహుశా నిధుల సమస్య ఎన్ఈపీ 2020 లోటుపాట్లలో అగ్రభాగాన నిలుస్తుంది. జీడీపీలో 6 శాతం విద్య మీద పెట్టుబడి పెడతామన్న ప్రభుత్వ వాగ్దానం శుష్కంగానే మిగిలిపోతోంది. ఇప్పటికీ ఇది 4–4.5 శాతం మించడం లేదు. రాష్ట్రాలకు సమగ్ర శిక్ష స్కీము కింద విడుదల చేసే కేటాయింపులను ఎన్ఈపీ అమలుతో ముడిపెట్టారు. కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య మీద ప్రాంతీయ స్థాయి నిర్ణయాధికారాన్ని లక్ష్యపెట్టకుండా తీసుకున్న నిర్ణయం ఇది. దీనికి అనుగుణంగా తమిళనాడుకు రూ. 2,150 కోట్లను తొక్కిపట్టడంతో సమాఖ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఏకాభిప్రాయమే శరణ్యంబీజేపీ పాలిత రాష్ట్రాలు వీరావేశంతో ఎన్ఈపీని అమలు చేస్తుండగా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తృణీక రిస్తున్నాయి. తాము అమలు చేస్తున్న రెండు భాషల ఫార్ములాకే కట్టుబడి ఉన్నామని తమిళనాడు తెగేసి చెప్పింది. స్కూళ్లలో చేరే పిల్లల స్థూల జాతీయ సగటు (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో– జీఈఆర్) 27.1 శాతం ఉండగా, తమ రాష్ట్రంలో అది అత్యధికంగా 51.4 శాతంగా నమోదైందనీ, తమ విధానం విజయవంతమైందని చెప్పడానికి ఇది నిదర్శనమనీ అంటోంది.సీయూఈటీ వంటి కేంద్రీకృత ప్రవేశ పరీక్షలను ప్రవేశపెట్టడం రాష్ట్రాలకు మింగుడుపడని మరో ప్రధానాంశం. రాష్ట్ర బోర్డుల ద్వారా వచ్చే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ జాతీయ ప్రవేశ పరీక్షల్లో సీబీఎస్ఈ స్టూడెంట్స్ అధికంగా స్కోరు చేస్తారు. విద్యలో అసమానతలు పెరుగుతాయి. అందుకే కేరళ ఈ విధానాన్ని వ్యతిరేకించింది. అయితే ఎన్ఈపీ 2020 ఒక సఫల విధానమని కానీ లేదా ఫెయిల్యూర్ స్టోరీ అని కానీ చెప్పలేం. ఇది ఇంకా నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టు లాంటిది. నూతన విద్యావిధానం విజయవంతం కావాలంటే, అది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చు కోగలగాలి. ఏకాభిప్రాయమే శరణ్యమని గుర్తించి అందుకు అవస రమైన చర్చలు జరపాలి. బలవంతంగా రుద్దాలని చూస్తే కుదరదు. భిన్న సంస్కృతుల సమాహారమైన భారత్ వంటి దేశంలో ఈ వైఖరి అసలే పనికి రాదు. రాష్ట్రాలకు వాటి సొంత మోడల్స్ విడిచిపెట్టకుండానే జాతీయ విధానంలోని ప్రధాన అంశాలు అమలు చేసే వెసులు బాటు ఉండాలి. తమిళనాడునే తీసుకుందాం. భాషల ఫార్ములా జోలికి పోకుండా వొకేషనల్ ట్రెయినింగ్, డిజిటల్ లెర్నింగ్ పద్ధతు లను అది అమలుచేయొచ్చు.విద్యావ్యవస్థను మార్చగలిగే సత్తాఅదే సమయంలో, కేంద్రప్రభుత్వం ఎన్ఈపీ అమలుకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం తక్షణ అవసరం. 5+3+3+4 మోడల్‌కు మారుతున్నందున బోధనపరంగా కొత్త మార్పులు అవసరమవుతాయి. పెద్దపెట్టున శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనట్లయితే, నూతన విధానం సిద్ధాంతానికే పరిమితమవుతుంది. చిట్టచివరిగా, సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను భాగస్వాములుగా అంగీకరించి వాటితో కలిసి పనిచేయాలి. విరోధ భావన విడనాడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతల ప్రమేయంతో జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.ఎన్ఈపీ 2020 సరైన దిశలో రూపొందించిన ఒక ఆశావహమైన విధానం. అయితే, విద్యాసంస్కరణలను హడావిడిగా బలవంతంగా తీసుకురాలేమన్నది ఈ అయిదేళ్లలో మనం నేర్చుకున్న పెద్ద పాఠం. వీటి అమలుకు ఎంతో సహనం, పరస్పర సహకారం అవసరం. ఎన్ఈపీ 2020కి దేశ విద్యావ్యవస్థను మార్చే సత్తా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చీ రాజకీయాలకు అతీతంగా కార్య దక్షతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. అందాకా ఇది భారత విద్యాసంస్కరణల చరిత్రలో ఒక అసంపూర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది.ప్రొ‘‘ వి. రామ్‌గోపాల్ రావువ్యాసకర్త బిట్స్ పిలానీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్వైస్ చాన్స్‌లర్, ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ -
నటి రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు.. సొంతపార్టీ ఎమ్మెల్యేకి బీజేపీ షాక్!
బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సొంత పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ (Basanagouda Patil Yatnal)పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చారు. ఇటీవలే, బెంగళూరులో బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. Karnataka BJP MLA Basangouda Patil Yatnal-"I will name all Ministers involved in Ranta Rao gold smuggling case in Assembly session. I have complete information about her relationships and how the gold was brought in.She had gold all over her body and smuggled it in." pic.twitter.com/6xd4dy5Tne— News Arena India (@NewsArenaIndia) March 17, 2025 కొన్ని వారాల క్రితం మాజీ సీఎం యడియూరప్పపై విమర్శలు చేశారు. ఆయన తన కుమారుడు బి.వై విజయేంద్రపై కాకుండా పార్టీపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాదు, బీ.వై.విజయేంద్ర కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం శివకుమార్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతేడాది డిసెంబర్లో 32 జిల్లా అధ్యక్షులు యత్నాళ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పార్టీ నాయకత్వం ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. -
‘లోక్ సభలో నాకు మైకు ఇవ్వడం లేదు’
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై(Lok Sabha Speaker Om Birla) ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదు. నేను మాట్లాడితే ఆయన పారిపోతున్నారని’ ఎద్దేవా చేశారు.లోక్‌సభలో తన ప్రసంగంపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘సభలో స్పీకర్ ఓం బిర్లా తాను మాట్లాడేందుకు అనుమతించడం లేదని, కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది సరైన మార్గం కాదని అన్నారు. ‘ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని ఆయన్ని అభ్యర్థించాను. కానీ అతను (స్పీకర్) పారిపోయాడు. ఇది సభను నడపడానికి మార్గం కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా స్పీకర్ నా గురించి అసత్యాలు మాట్లాడుతున్నారు. సభను వాయిదా వేస్తున్నారు. ఇదంతా ఎందుకు.ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించడానికి అవకాశం ఇవ్వడమే ఈ సమావేశం ఉద్దేశ్యం. నేను లేచి నిలబడినప్పుడల్లా నాకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదు. మేం ఏం చెప్పాలని అనుకుంటున్నామో అది చెప్పాలి. అందుకు మైక్ ఇవ్వాలి కదా. ఇవ్వడం లేదు. నేను ఏం చేయలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నాను. అరె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 7-8 రోజులుగా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. లోక్‌సభలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కుట్ర జరుగుతోంది. ఆ రోజు కూడా అంతే ప్రధాని మోదీ కుంభమేళా గురించి మాట్లాడారు. ఆ సమయంలో నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలని అనుకున్నాను. కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. స్పీకర్ విధానం ఏంటో నాకు తెలియదు. కానీ మమ్మల్ని మాట్లాడటానికి అనుమతించడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. -
‘నవరాత్రి’ యుద్ధం: ‘మాంసమే కాదు మద్యం దుకాణాలూ వద్దు’
న్యూఢిల్లీ: రాబోయే నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని ఆలయాలకు సమీపంలోని మాంసం దుకాణాలను మూసివేయాలని ఢిల్లీ బీజేపీ ఎంపీ రవీంద్ర నెగీ దుకాణదారులను అభ్యర్థించారు. ఈ నెల 30 నుంచి చైత్ర నవరాత్రులు(Chaitra Navratri) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7 వరకూ కొనసాగే ఈ నవరాత్రులలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఉత్తరాదిన చైత్ర నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి.నవరాత్రి వేడుకలు హిందువులకు ఎంతో పవిత్రమైనవని, ఈ సమయంలో ఆలయాల సమీపంలోని మాంసం దుకాణాలు తెరిచి ఉంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఎంపీ రవీంద్ర నెగీ(MP Ravindra Negi) పేర్కొన్నారు. అందుకే ఆ దుకాణాలను నవరాత్రులలో మూసివేయాలని కోరారు. నెగీ అభ్యర్థన నేపధ్యంలో ఢిల్లీ సర్కారు నవరాత్రి సమయంలో ఢిల్లీవ్యాప్తంగా ఉన్న మటన్ దుకాణాలను మూసివేయించే దిశగా యోచిస్తోందని ఇండియా టీవీ తన కథనంలో పేర్కొంది.మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఎమ్మెల్యే జుబేర్ అహ్మద్..ఎంపీ రవీంద్ర నెగీ అభ్యర్థనపై స్పందిస్తూ నవరాత్రులలో ఢిల్లీలో కేవలం మాంసం దుకాణాలను మాత్రమే మూయించడం తగదని, మద్యం దుకాణాలను కూడా బంద్ చేయించాలన్నారు. ఆ రోజుల్లో మద్యం దుకాణాలు తెరిచివుంటే కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నవరాత్రుల్లో మాసం దుకాణాలను మూయించాలనుకుంటోందని తెలుసుకున్న మాంసం దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలను మూసివేస్తే పలువురు ఉపాధి కోల్పోతారని వారు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: Bihar: పరీక్షల్లో టాపర్‌ను మేళతాళాలతో ఊరేగిస్తూ.. -
విభజన కుట్ర
‘స్టాలిన్ దున్నపోతు ఈనిందని అందరికీ ఆహ్వానాలు పంపితే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు ఆ దూడను కట్టేయడానికి చెన్నైకి పరుగులు పెట్టారు.’ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అచ్చంగా ఇలాగే జరిగింది. అన్యాయం జరిగిపోతోందని బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు ఆ సమావేశానికి వెళ్లాయి. చెన్నైలో ఓ స్టార్ హోటల్లో కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన సమావేశంలో ఒక్కరంటే ఒక్కరైనా ఎలా అన్యాయం జరుగుతుందో చర్చించారా? జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుందనీ, దక్షిణాదిలో జనాభా తగ్గి పోయారనీ, ఉత్తరాదిలో పెరిగిపోయారనీ, అందుకే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయనీ వీరంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి ఈ ప్రక్రియలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదు. ముందుగా జనాభా లెక్కలు పూర్తి చేయాలి. అప్పుడే ఉత్తరాదిలో ఎంత పెరిగారు, దక్షిణాదిలో పెరిగారా, తగ్గారా అన్న స్పష్టత వస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుంది. జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేస్తారన్నది కూడా అపోహే! అలా అయితే ఈశాన్య రాష్ట్రాలకు 25 లోక్‌సభ సీట్లు ఉండేవా? ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పదే పదే చెబుతున్న ప్రధాని, కేంద్ర హోంమంత్రి... ఏ రాష్ట్రానికీ ఒక్క సీటు కూడా తగ్గదని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ డీలిమిటేషన్ ప్రక్రియను 2026 తర్వాత జనగణన డేటా ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం యోచి స్తోందని ప్రకటించారు. ప్రతి ఓటరుకూ సమాన ప్రాతి నిధ్యం లభించేలా చేస్తామన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా డీలిమిటేషన్ ఉంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానిక జనాభా వైవిధ్యం, గిరిజన సముదాయాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘డీలిమిటేషన్ అనేది కేవలం స్థానాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం కాదు, ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని స్థాపించే ప్రక్రియ’ అని స్పష్టం చేశారురాజకీయ అలజడి కోసమే...అయినా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాకి లెక్కలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు 42 లోక్‌సభ స్థానాలుంటే, పునర్విభజన తరు వాత 34 అవుతాయని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 స్థానాలుంటే వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్, బిహార్ రాష్ట్రాలలోని స్థానాల సంఖ్య 174 నుంచి 204 స్థానాలకు చేరుకుంటుందని అంటున్నారు. నిజానికి ఈ లెక్కలు ఇచ్చింది ఓ విదేశీ సంస్థ. ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అనే సంస్థ ‘ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్’ అనే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక తప్ప, డీలిమిటేషన్ సీట్లపై మరో రిపోర్టు లేదు.కేంద్రం నుంచి అసలు లేదు. అయినా ఓ విదేశీ సంస్థ రిపోర్టును పట్టుకుని దేశంలో రాజకీయ అలజడి రేపడానికి డీఎంకే ప్రయత్నిస్తూంటే, ఆ పార్టీ ట్రాప్‌లో ఇతర పార్టీలు పడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదనీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదనీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. లోకసభ నియోజకవర్గాల పునర్విభజన గతంలో 2002లో ప్రారంభమైంది. 2008లో అమలులోకి వచ్చింది. ఈ ప్రక్రియ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జరిగింది. 2002లో డీలిమిటేషన్ చట్టం ఆమోదించిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను సమన్వయం చేశారు. దీని ప్రకారం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు సవరించారు. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం మారలేదు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పౌరుల నుండి సూచనలు స్వీకరించింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, సరిహద్దులను ఖరారు చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇంకా విస్తృత సంప్రతింపులకు కమిటీలు వేస్తారు.పరుష వ్యాఖ్యలు ఎందుకు?ఉత్తరాదివాళ్ళు పందుల్ని కన్నట్లుగా పిల్లల్ని కంటున్నారనీ, అక్కడ బహుభర్తృత్వం ఉంటుందనీ డీఎంకేకు చెందిన మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాదివారిని కించపరిచి తమిళనాడు డీఎంకే నేతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఉత్తరాది వారిలో దక్షిణాదిపై ఏకపక్షంగా వ్యతిరేకత పెంచే కుట్రలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. తమిళనాడు డీఎంకే పాలన నాలుగేళ్లు నిండ కుండానే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. అందుకే ఉత్తరాదిపై విషం చిమ్మి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దక్షిణాది సెంటిమెంటుతో గెలవాలనుకుంటున్నారు.హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు, విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి విభ జనవాదుల మధ్య దేశాన్ని సమైక్యంగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే, అది విభజన వాదమే! దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా,దక్షిణాది తన ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు -
వైవిధ్య వైరుద్ధ్యాలు
ఒక కుటుంబం నుంచి, సమాజం నుంచి, ఒక దేశం వరకు వైవిధ్యాలు అనేకం ఉంటాయి. వాటిని వైరుద్ధ్యాలుగా మారకుండా చూసుకోవటంలోనే విజ్ఞత ఉంటుంది. ఆ విధంగా చూసినపుడు, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభ జనపై తలెత్తిన వివాదం ఒక వైవిధ్య స్థితి నుంచి వైరుద్ధ్య స్థాయికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 22న చెన్నైలో జరిగిన సమావేశం దేశానికంతా ఒక హెచ్చరిక వంటిదని చెప్పాలి. నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపడి మరొక రెండు అంశాలు కూడా ఉన్నాయన్నది గుర్తించవలసిన విషయం. ఒకటి – హిందీ భాషను హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారనే ఫిర్యాదు. ఈ విషయం చెన్నైలో చర్చకు రాలేదు. కానీ ఎప్పటినుంచో ఉన్నదే. రెండవది – దక్షిణ–ఉత్తర భారతాల మధ్య సాధారణ రూపంలోనే ఉన్నాయనే విభేదాలు. ఈ భావన నియోజక వర్గాల పునర్విభజనకు, హిందీ భాషకు పరిమితమైనది కాదు. ఇటువంటి భావనలకు గల చరిత్ర మూడు దశలలో కనిపిస్తుంది. ఒకటి– ఉత్తరాది వారికి దక్షిణాది వారిపట్ల ఎప్పుడూ చిన్నచూపేనన్నది. రెండు – దాక్షిణాత్యుల రంగురూపులు, భాషా సంస్కృతులు, ఆహార విహారాల పట్ల స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నదనే ఈసడింపు దృష్టి. మూడవది–ఈ రెండింటికన్నా ప్రమాదకరమైనది, ప్రాచీనమైనది. అది ఆర్య–ద్రవిడ వాదనలు. వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా...మరే దేశంలోనూ లేనంతటి వైవి«ధ్యాలు ఇక్కడ ఉన్నాయి. సాంస్కృతికంగా, విశ్వాసాలపరంగా ఒక ఏక రూపత, కనీసం స్థూలమైన విధంగా, అనాదిగా ఉండిన ప్పటికీ, బ్రిటిష్ వలస పాలన ముగిసినాక చరిత్రలో మొదటిసారిగా మొత్తం నాలుగు చెరగులకూ కలిపి భౌగోళికంగా, రాజకీయంగా దేశానికి ఏకరూపత సిద్ధించింది. వైవిధ్యాలను సరిహద్దులు చెరిపివేసి ఒకటి చేసే ప్రయత్నాలు 1885లో కాంగ్రెస్ వ్యవస్థాపన కాలం నుంచి మొదలై, 1947లో స్వాతంత్య్ర సాధన, 1950 నుంచి రాజ్యాంగం అమలు, 1951–52లో మొదటి సార్వత్రిక ఎన్నికలతో ఒక రూపానికి వచ్చాయి. వైవిధ్యాలు వైరు ద్ధ్యాలుగా మారగల అవకాశాలకు ఆ విధంగా ముగింపు పలికినట్లయింది. కనీసం అందుకు ఒక బలమైన ప్రాతిప దిక సూత్రరీత్యా ఏర్పడింది. దానిని అదే ప్రకారం స్థిర పరచి మరింత పటిష్ఠం చేయవలసిన బాధ్యతను చరిత్ర పాలకులకు అప్పగించింది. అందుకు పునాదుల స్థాయిలో భంగపాట్లు జరిగాయని అనలేముగానీ, వేర్వేరు సాయుల్లో జరుగుతూ వస్తున్న దాని పర్యవసానమే ప్రస్తుత వివాదాలు.ఇటువంటి వివాదాలకు కేంద్ర ప్రభుత్వం ఆస్కార మివ్వనట్లయితే చెన్నై సమావేశపు అవసరమే ఉండేది కాదు. ఆ సమావేశం దరిమిలా కేంద్ర హోంమంత్రిఅమిత్ షా ఏమీ స్పందించలేదుగానీ, దక్షిణాదికి చెందిన ముగ్గురు బీజేపీ మంత్రులు మాట్లాడుతూ, విభజనకు సంబంధించి ఇంకా నిర్ణయం జరగలేదు, విధివిధానాలు రూపొందలేదు, ప్రకటనేమీ వెలువడలేదు, అటువంటపుడు ఈ సమావేశాలు, విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. విధివిధానాల రూపకల్పన, ప్రకటన జరగక పోవచ్చు. కానీ నష్టపోతా మనుకునే రాష్ట్రాలకు స్థూలమైన అభిప్రాయాలు కలగకుండా ఎట్లా ఉంటాయి? వారు ఆ విషయమై మాట్లాడకుండా ఎట్లా ఉంటారు?ఇటువంటి విషయాలలో చర్చలు ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ముందునుంచే జరుగుతాయి తప్ప, అంతా ముగిసిపోయే వరకు ఆగవు. విషయం వివాదాస్పదమవుతున్న సూచనలు కనిపించినప్పుడు చర్చలు మరింత అవసరం. కానీ అమిత్ షా అదేమీ చేయకుండా, దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండ దనీ, అక్కడి స్థానాలు ఇప్పటికన్నా పెరుగుతాయనటం మొదలుపెట్టారు. ఇందులో ఒక చాతుర్యం ఉంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రెండింటికీ స్థానాలు ఇప్పటికన్న పెరిగినా, దక్షిణాదికన్న ఉత్తరాదికి పెరిగేవి చాలా ఎక్కువని, ఆ విధంగా రెండు ప్రాంతాల మధ్య గల ప్రస్తుత వ్యత్యాసం బాగా ఎక్కువవుతుందని అంచనా. అమిత్‌షా ఈ కోణాన్ని దాచిపెడుతున్నారు. అట్లాగాక ఏ వ్యత్యాసమూ, నష్టమూ ఉండదనుకుంటే ఆయన ఆ మాటను దక్షిణ రాష్ట్రాలను సమావేశపరచి వివరించాలి.సమావేశం అవసరం!చెన్నైలో జరిగిన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశానికి పార్టీ తేడాలు లేకుండా పలువురు హాజరయారంటేనే, విభజన ప్రతిపాదనలు ఎటువంటి అనుమానాలను కలిగిస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనటం. ఎందుకంటే, దేశమంతటాగల ఆ పార్టీ ఇటువంటి వైఖరి తీసుకుంటే వారికి ఉత్తరాదిన వ్యతిరేకత రాగలదనీ, ఆ భయంతో వారు హాజరు కాకపోవచ్చుననీ బీజేపీ అంచనా వేసింది. కానీ విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందుగానే మాట్లాడారు.ఇందులో రెండవవైపున చూస్తే, విభజనకు అనుకూలించటం వల్ల బీజేపీ దక్షిణాదిన నష్టపోగలదనే అభిప్రాయం ఉన్నా, ఆ పార్టీ అదే వైఖరికి కట్టుబడి ఉంటున్నది. దీనిని బట్టి ఇరువురూ, ఆయా ప్రాంతాలలో ప్రజాభిప్రాయాలు ఎట్లున్నా తమ వైఖరులను మార్చుకోదలచలేదని అర్థమవుతున్నది. దాని పర్యవసానాలు ఏమిటన్నది తర్వాతి విషయం. అది సూత్రబద్ధమైన వైఖరి అనుకుంటే మాత్రం ఆ మేరకు వారిని మెచ్చుకోవాలి.ఈ వైవిధ్యాలన్నీ వైరుద్ధ్యాలుగా మారి తీవ్ర స్థాయికి వెళ్ళకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను సమావేశపరచాలి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఒక తీర్మానంగా ఆమోదించిన చెన్నై సమావేశం, ఆ తీర్మాన ప్రతిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల కాలంలోనే ప్రధాని మోదీకి అందజేయగలమని ప్రకటించింది. ఆయన ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం మంచిదవుతుంది. చెన్నైలో తీర్మానించినట్లు విభజనను 25 సంవత్సరాల వరకు గాక, దక్షిణాదికి ఆమోదయోగ్యమయే ప్రత్యామ్నాయాన్ని కనుగొనే వరకు నిరవధికంగా వాయిదా వేయటం మంచిది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నాడు శివసేన-బీజేపీకి అందుకే చెడింది: ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్రలో థాక్రే కుటుంబానికి, బీజేపీకి మధ్య గల సంబంధంపై తరచూ ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి. ఈ రెండు పార్టీల మధ్య బాల్ థాక్రే కాలంలో మొదలైన స్నేహం ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray) రాకతో ముగిసింది. బీజేపీ తమను పట్టించుకోవడంలేదని ఉద్ధవ్ థాక్రే ఆరోపిస్తుండగా, దీనిపై ఆ పార్టీ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా మహారాష్ట్ర బీజేపీ రథసారథి దేవేంద్ర ఫడ్నవీస్.. 2014లో శివసేన- బీజేపీల మధ్య ఏం జరిగిందో, ఆ రెండు పార్టీలకు ఎందుకు చెడిందో వెల్లడించారు.ముంబైలో జరిగిన సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రహస్యాన్ని వెల్లడించారు. ఎన్డీటీవీ తన కథనంలో తెలిపిన వివరాల ప్రకారం.. 2014 నాడు జరిగిన ఉదంతాన్ని వివరిస్తూ ఫడ్నవీస్ ఇలా అన్నారు ‘ఆ సమయంలో తాము శివసేనకు 147 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి ముఖ్యమంత్రి, మాకు ఉప ముఖ్యమంత్రి ఉంటారని కూడా నిర్ణయించాం. అయితే ఉద్ధవ్ థాక్రే 151 సీట్లు ఇవ్వాలని మొండికేయడంతో శివసేన, బీజేపీ మధ్య పొత్తు తెగిపోయింది’ అని అన్నారు.దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపిన వివరాల ప్రకారం ఉద్ధవ్ థాక్రే 151 సీట్లు కోరిన నేపధ్యంలో బీజేపీ నేతలు ఓం ప్రకాష్ మాథుర్, అమిత్ షా తదితరులు ప్రధాని మోదీ(Prime Minister Modi) నాయకత్వంలో ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఆ తరువాత 2014 నుండి 2024 వరకు మహారాష్ట్రలో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వందకుపైగా సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచింది. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానంపై ఉద్ధవ్ థాక్రే పార్టీ నుండి ఇంకా ఎటువంటి స్పందన వెలువడలేదు. ఒకప్పుడు ముంబైని ఏలిన థాక్రే కుటుంబం ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందనే మాట వినిపిస్తోంది. పార్టీ కార్యకర్తలలో కూడా పార్టీ భావజాలం విషయంలో గందరగోళం నెలకొందని అంటున్నారు.ఇది కూడా చదవండి: హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు వీసాదారులపై నిరంతర నిఘా -
ఉగాదిలోపు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి ఉగాదిలోపు కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం పార్టీవర్గాల్లో ఊపందుకుంది. దీనికి సంబంధించి ఒకటి, రెండురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్యనేతలు చెబుతున్నారు. తాజాగా కేరళ పార్టీ అధ్యక్షుడిగా రాజీవ్చంద్రశేఖర్ను నియమించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. త్వరలోనే కేంద్రమంత్రి శోభకరాంద్లజే తెలంగాణకు వచ్చి అభిప్రాయసేకరణ జరుపుతారని తెలుస్తోంది. ఇది ముగిశాక ఒకనేత పేరుతో నామినేషన్ పత్రాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి.. మరుసటి రోజు అధ్యక్షుడి ప్రకటన ఉండొచ్చునని అంటున్నారు.అధ్యక్ష పదవి కోసం పార్టీలో పాత–కొత్త నేతల మధ్య ‘జాతివైరం’స్థాయిలో ఇప్పటికీ సాగుతోంది. పార్టీ సిద్ధాంతాలు, హిందుత్వ భావాలున్న పాత నాయకులకే ఈ పదవి ఇవ్వాలని కొందరు పట్టు పడుతున్నారు. పార్టీలో చేరాక, ఎంపీగా, ఎమ్మెల్యేగా లేదా మరో పదవికో ఎన్నికయ్యాక పాత–కొత్త అంటూ ఉండదని కొందరు (గత మూడు, నాలుగేళ్లలో చేరి ఆయా పదవులు పొందినవారు) వాదిస్తున్నారు. పార్టీలో కొత్తరక్తం నింపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనేక మార్పులు చేయాల్సి ఉంటుందని ఈ వర్గం సూచిస్తోంది.అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముఖ్యనేతలు, సీనియర్ నేతలు, పాత–కొత్త నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ⇒ ఈసారి బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం దక్కొచ్చుననే ఊహాగానాలు ఎక్కువగా సాగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరి్వంద్, బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి తదితరులు పోటీపడుతున్నారు. ⇒ ఇక ఓసీ నాయకుల విషయానికొస్తే ఎంపీలు డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, ఇంకా పి.మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ⇒ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న వారిలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారు. అయితే కొన్నిరోజులుగా అనూహ్యంగా కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంజయ్‌ను మళ్లీ అధ్యక్షుడిగా నియమించేందుకు బీజేపీ అధినాయకత్వం మొగ్గుచూపొచ్చుననేది ఈ ప్రచార సారాంశం. అయితే అధ్యక్ష పదవి కోసం తాను పోటీలో లేనంటూ తాజాగా సంజయ్ వివరణ ఇచ్చారు. అయినా, పార్టీని ముందుండి నడిపించేందుకు ఆయన్నే అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కొందరు నేతలు చెబుతున్నారు. బీసీ నేతకు ఇస్తే ఈటల రాజేందర్‌కు దక్కొచ్చునని గతంలోనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పీఎం మోదీ, సీనియర్ నేతలు అమిత్ షా, నడ్డా వంటివారు ఈటలకే ఓటేస్తారనే ప్రచారం జరిగింది.నేనంటే నేను అని ప్రచారంగతంలో ఎన్నడూలేని విధంగా తనకే అధ్యక్ష పదవి వస్తుందంటూ కొందరు ముఖ్యనేతలు సైతం ప్రచారం చేసుకోవడం పట్ల రాష్ట్ర పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తాను అధ్యక్షుడిని అవుతున్నానంటూ వారు మీడియాకు, అనుచరులకు లీక్‌లు ఇచ్చుకోవడం ఇటీవల బాగా పెరిగిపోయింది. పార్టీనాయకుల్లో ఇలాంటి పోకడలు గతంలో ఎప్పుడూ లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై రాష్ట్రపార్టీలో ఏకాభిప్రాయం కుదరని కారణంగానే జాతీయ నాయకత్వం కూడా డైలమాలో పడిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
కర్ణాటకలో 4% ముస్లిం కోటాపై పార్లమెంట్ లో దుమారం
-
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
-
కేరళ బీజేపీ చీఫ్‌గా రాజీవ్ చంద్రశేఖర్!
తిరువనంతపురం: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(60) కేరళ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులు కానున్నారు. ఈ పోస్టు కోసం ఆయనొక్కరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం జరిగే పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడనుంది. పార్టీ కేంద్ర పరిశీలకుడిగా సమావేశానికి హాజరుకానున్న ప్రహ్లాద్ జోషి ఈ నియామకాన్ని ధ్రువీకరించనున్నారు. పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్ష పదవి కోసం ఆదివారం రాజధాని తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయంలో రాజీవ్ చంద్ర శేఖర్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. -
ఈ వారమే లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వక్ఫ్ సవరణ బిల్లు–2024ను ఈ వారంలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 4వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న దృష్ట్యా, అంతకుముందే ఈ వారంలోనే బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికను ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాకు అందించింది. వక్ఫ్ బోర్డుల్లో కనీసం నలుగురు ముస్లిమేతరులను చేర్చుకోవచ్చని భూ వివాదాలపై దర్యాప్తు అధికారాన్ని కలెక్టర్ల నుంచి సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు బదిలీ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉండేందుకు వీలు కల్పించడం, కలెక్టర్లకు అదనపు అధికారాల వంటివాటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
తెలంగాణ విద్యా కమీషన్లో అర్బన్ నక్సల్స్
సాక్షి,కరీంనగర్ : తెలంగాణ విద్యా కమీషన్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములమ్మి జీతాలు చెల్లించే పరిస్థితి వచ్చిందన్నారు.బీఅర్ఎస్ అధినేతకు బీదర్‌లో దొంగనొట్లు ముద్రించే ప్రెస్ ఉందని, దొంగనోట్ల వ్యాపారం చేసి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు. పదేండ్లు బీఅర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ప్రభుత్వం భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చింది. ఈ ప్రభుత్వంలో 15 నుండి 18 కమిషన్ పెంచారు. కమిషన్ ఇచ్చిన వారికే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని విమర్శించారు. -
ప్రత్యేక దేశంగా ‘సౌత్ ఇండియా’.. ఎమ్మెల్యే గంగుల సెన్సేషనల్ కామెంట్స్
సాక్షి,కరీంనగర్ : దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే కచ్చితంగా దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్, తిరుగుబాటు తప్పదు’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ఆదివారం కరీంనగర్లో ఉమ్మడి జిల్లా రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనపై స్పందించారు. ప్రత్యేక తెలంగాణా తరహాలోనే ఆ డిమాండ్‌నూ తోసిపుచ్చలేం. బీజేపీపై బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌కు సంబంధించిన కత్తులు వేలాడుతున్నాయి. వాటిని సమర్థవంతంగా చేయకపోతే ముందుంది ముసళ్ల పండుగ’ అని వ్యాఖ్యానించారు.డీలిమిటేన్‌కు వ్యతిరేకంజనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘పునర్విభజన ప్రక్రియపై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్‌సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తేల్చిచెప్పింది.స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ శనివారం చెన్నైలో తొలిసారిగా సమావేశమయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీల ద్వారా ఉమ్మడిగా విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. -
ఐక్యంగా పోరాడుదాం.. బీజేపీని అడ్డుకుందాం
సాక్షి, చెన్నై: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడుదామని, అసమగ్ర పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా చెన్నైలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశంపై అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందించారు. సమావేశంలో రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రస్తుతం దేశం పెద్ద సవాల్ ఎదుర్కొంటోంది. జనాభాను నియంత్రించాలని 1971లో దేశం నిర్ణయించినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే.. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు విఫలమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్ధి సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి. ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు దక్షిణాది రాష్ట్రాలు దేశ ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ కూడా తక్కువ మొత్తాన్ని తిరిగి పొందుతున్నాయి. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే.. 29 పైసలే వెనక్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు రూపాయికి రెండు రూపాయల 73 పైసలు అందుతున్నాయి. బిహార్‌కు ఆరు రూపాయల ఆరు పైసలు, మధ్యప్రదేశ్‌కు రూపాయి 73 పైసలు వెనక్కి పొందుతున్నాయి. అదే కర్ణాటక కేవలం 14 పైసలు, తెలంగాణ 41 పైసలు, కేరళ 62 పైసలు మాత్రమే వెనక్కు పొందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్నుల వాటా చెల్లింపులు క్రమంగా తగ్గుతున్నాయి. చివరికి జాతీయ ఆరోగ్యమిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60– 65 శాతం నిధులు దక్కుతున్నాయి. అలా పునర్విభజనను ఒప్పుకోం.. మనది ఒకే దేశం.. దానిని గౌరవిస్తాం.. కానీ జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించం. అది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అధికారాన్ని కుదిస్తుంది. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలకు శిక్షగా మారుతుంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ గళం కోల్పోతాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందాం. దక్షిణాది ప్రజలు, పార్టీలు, నాయకులు ఏకం కావాలి. వాజ్‌పేయి విధానాన్ని అనుసరించండి.. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర కూడా ఉంది. ఈ దృష్ట్యా ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది. 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచకుండా ఏ విధంగా పునర్విభజన ప్రక్రియ జరిపిందో.. ఆ విధానాన్నే ఇప్పుడు అనుసరించాలి. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అదే తరహాలో ప్రారంభించింది. ఇప్పుడు అదే విధానాన్ని పాటించేలా.. మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో, సంఖ్యలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. ఈ అంశంపై తర్వాతి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిద్దాం. పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనే అంశంపై ఆ సమావేశంలో చర్చిద్దాం. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాం..’’అని రేవంత్ చెప్పారు.చెన్నై శ్రీకారం.. హైదరాబాద్ ఆకారం: రేవంత్ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిని గౌరవిస్తామని.. రాజకీయాల్లోనైనా, విద్యావ్యవస్థలోనైనా పెత్తనాన్ని మాత్రం సహించబోమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తి ప్రకారం హక్కుల సాధనలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా పోస్టు చేశారు. ‘‘ఈ పుణ్యభూమి అంబేడ్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. కేవలం రాజకీయ ప్రయోజన కాంక్షతో పునర్విభజనను అస్త్రంగా ప్రయోగించి ఆ హక్కులను విచ్చిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం. ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది. ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది’’అని పేర్కొన్నారు.