త్రిముఖ పోటీతో నష్టం జరిగింది: రాంచందర్‌రావు | Bjp Ramchandra Rao Reaction On Municipal Election Results | Sakshi
Sakshi News home page

త్రిముఖ పోటీతో నష్టం జరిగింది: రాంచందర్‌రావు

Feb 13 2026 6:08 PM | Updated on Feb 13 2026 6:54 PM

Bjp Ramchandra Rao Reaction On Municipal Election Results

సాక్షి, హైదరాబాద్‌: ఆరు మున్సిపాలిటీలో సింగల్ లార్జెస్ట్ గా అవతరించామని.. మొదటిసారి రెండు కార్పొరేషన్లు కైవసం చేసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. మొత్తం కలిపి 300 పైగా వార్డు, కార్పొరేటర్లు గెలిచారు. నారాయణపేటలో గెలిచాం. గతం కంటే ఇపుడు మెరుగయ్యాం. ఎన్నికల్లో మేము మేనిఫెస్టో ఇచ్చాం. ప్రభుత్వ తప్పిదాలపై ఛార్జీ షీట్ కూడా ప్రకటించాం. చాల చోట్ల స్వల్పంగా ఓడిపోయాం. త్రిముఖ పోటీలో నష్టం జరిగింది’’ అని రాంచందర్‌రావు పేర్కొన్నారు.

‘‘ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం సాధించాం. ఖమ్మం కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో కూడా ఒకటి గెలిచాం. అధికార దుర్వినియోగం వల్లే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి ఇది క్లియర్ మెజారిటీ కాదు. బీఆర్‌ఎస్‌ కూడా గతం కంటే వెనకబడింది. బీఆర్ఎస్‌ది రెండో స్థానం అనుకోవడం కాదు.. గతం కంటే వెనుకబడ్డారు. బీజేపీకి ఓటు శాతం పెరిగింది. బీజేపీ ఓటింగ్ ప్రాంతాల్లోనే మజ్లీస్ పార్టీ, బీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. ఉత్తర తెలంగాణలో ముస్లిం పాపులేషన్ ఉంది. వాళ్ల ఓట్ల వల్లనే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అక్కడ గెలిచింది, కాంగ్రెస్ బీఆర్‌ఎస్, మజ్లీస్ ఒక్కటి అయ్యాయి’’ అని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు.

	మేము ఓడిపోలేదు ముగ్గురూ కలిసి ఓడించారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement