Telangana Municipal Elections Results 2026
-
మహిళ చేతికే మంత్రదండం
సాక్షి, హైదరాబాద్: పురపోరులో మహిళలు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రంలో పురపాలనను వారు శాసించనున్నారు. అతివలకు రిజర్వ్ చేసిన స్థానాల కంటే ఎక్కువ చైర్పర్సన్ స్థానాలను అలంకరించారు. కార్పొరేషన్లలో మాత్రం రిజర్వ్ చేసిన మూడు స్థానాల్లోనే మేయర్ పీఠాలను దక్కించుకున్నారు, మహిళలకు ఇతర రంగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా.. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సోమవారం నిర్వహించిన చైర్పర్సన్/మేయర్ ఎన్నికల ఫలితాల్లో 105 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఏకంగా 64 శాతం పదవులను మహిళలు దక్కించుకున్నారు. వారు ఏకంగా 72 చోట్ల పురపాలన పగ్గాలు చేపట్టారు. అయితే, ఎన్నికలు వాయిదా పడిన మరో 11 మున్సిపాలిటీల్లో ఇప్పటికే మహిళలకు 4 రిజర్వ్ అయ్యాయి. మొత్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వారు 76 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసినట్లు అవుతుంది. అంటే దాదాపు 62 శాతం పదవులను దక్కించుకున్నట్లు అవుతుంది. మహిళలు వారికి కేటాయించిన 50 శాతం రిజర్వేషన్ల కంటే 12 శాతం అధికంగా పదవులు దక్కించుకుంటుండటం విశేషం. చట్టసభల్లోనూ అమల్లోకి వస్తే.. మహిళలు తెరచాటు వ్యక్తులుగా కాకుండా నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం రాజకీయ చైతన్యం పెరిగిన నేపథ్యంలో.. 2029లో చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తే.. ఎంతమంది మహిళా రాజకీయ వేత్తలు చట్టసభలకు వెళ్తారనేది ఆసక్తికరం. చైర్పర్సన్లుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు కూడా అధికంగా ఉండటం గమనార్హం. బీసీ, ఎస్సీ, అన్రిజర్వ్డ్ సీట్లలోనూ వారు విజయం సాధించడం గమనార్హం. వార్డు సభ్యుల ఎన్నికలోనూ వారు అన్రిజర్వ్డ్ సీట్లలో గెలుపొంది సత్తాచాటారు. రాష్ట్రంలో మహిళలకు పదవులు ఇస్తూ వారికి రాజకీయాల్లో రాణించే అవకాశం కల్పించడం మంచి పరిణామం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. దీనివల్ల ఆ సమస్యల పరిష్కారానికి వారు ప్రత్యేక చొరవ తీసుకునే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. రాజకీయ నాయకులు తమకు అవకాశం రానిచోట తమ ఇంట్లోని మహిళలను రంగంలోకి దించారు. అయితే అధికారం అందుకున్న తరువాత పాలనపై తమదైన ముద్ర కనిపించాలంటే వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటేనే వారి భవిష్యత్తు రాజకీయంగా మరింత ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. విద్యాధికులు చైర్పర్సన్/మేయర్ స్థానాలు అధిరోహించిన మహిళల్లో విద్యాధికులూ ఉన్నారు. వీరిలో 8 మంది పీజీ చేసిన వారు ఉంటే.. 23 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారున్నారు. ఒక డాక్టర్ ఉన్నారు. అలాగే, టెన్త్, ఇంటర్ చదివిన వారూ ఉన్నారు. బీసీలకు 58 శాతం పదవులు రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జోరుగా ఆందోళన జరగడం, అది చట్టబద్ధత సాధించడానికి అనేక అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో 112 చైర్పర్సన్/మేయర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీసీలకు 58.03 శాతం పదవులు దక్కాయి. ఇందులో ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా 22 పదవులు దక్కగా.. ఆ తరువాత గౌడ్లకు 8, ముదిరాజ్‌లకు 7, యాదవ సామాజిక వర్గానికి 5 చైర్పర్సన్ పదవులు లభించాయి. వీరు కాకుండా లింగాయత్. బెస్త, పద్మశాలి, స్వర్ణకారులు, బోయ, తేలి, కురుమ, రెడ్డిక సామాజిక వర్గాల వారూ ఉన్నారు. -
హంగు.. కొత్త రాజకీయ రంగు
రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖచిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొన్నిచోట్ల కాంగ్రెస్–బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్–బీజేపీ, ఒక్కోచోట కాంగ్రెస్–బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళుతుండడం, మజ్లిస్, ఏఐఎఫ్‌బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత రెండు రోజులుగా మారిన రాజకీయ సమీకరణలను బట్టి సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా, మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన వాటితోపాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే చాన్స్ ఉంది. హంగ్ పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు నాలుగైదు, బీజేపీకి ఒకట్రెండు మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్⇒ మహబూబాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్‌కు 19 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్ నుంచి 13, బీఆర్ఎస్ నుంచి 12 మంది గెలిచారు. కాంగ్రెస్‌కు ముగ్గురు సీపీఎం, బీఆర్ఎస్కు ముగ్గురు సీపీఐ సభ్యులు మద్దతిస్తున్నారు. వీరు కాకుండానే ఇంకా మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన మరో ముగ్గురి కోసం స్వతంత్రులకు అధికార కాంగ్రెస్ గాలం వేసింది. ఈ ప్రయత్నాలు సఫలం కావడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే పీఠం దక్కించుకోనుంది. అయితే, చైర్మన్‌గా కాంగ్రెస్‌లో చేరిన ఇండిపెండెంట్ అయ్యే అవకాశం ఉంది. ⇒ తొర్రూరు: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన 9 మంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఆ పార్టీకే మున్సిపల్ పీఠం దక్కే మెజారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిలను రంగంలోకి దింపుతోంది. ఇద్దరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించింది. దీంతో ఇరు పార్టీల బలం తొమ్మిదికి చేరనుంది. ఇక్కడ కూడా టాస్ అనివార్యం కానుంది. ⇒ ఆసిఫాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిర్ ఫిగర్ 11. ఇక్కడ కాంగ్రెస్‌కు ఏడుగురు, బీఆర్ఎస్కు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్‌లో చేరగా ఈ మున్సిపాలిటీ ఆ పార్టీ పరం కానుంది. ⇒ ఖానాపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లకు 4 చొప్పున రాగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. ఒక స్వతంత్రుడు కాంగ్రెస్‌లో చేరడంతో వారి బలం 4కు చేరింది. ఇప్పుడు మూడు పార్టీల బలం సమంగా ఉంది. అయితే, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (కాంగ్రెస్) నమోదు కావడం, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి ఒక్కో స్వతంత్రుడు కాంగ్రెస్ వైపునకు వచ్చారన్న ప్రచారంతో ఈ మున్సిపాలిటీ హస్తగతం కావొచ్చు.లేదంటే 3 పార్టీలు అధికారాన్ని పంచుకునే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ⇒ ఆదిలాబాద్: మ్యాజిక్ ఫిగర్‌కు నాలుగు తక్కువగా 21 వార్డుల్లో విజయం సాధించిన బీజేపీని నిలువరించడమే కర్తవ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కూటమి కట్టాయి. తమ పార్టీల నుంచి కాకుండా స్వతంత్రుడిని చైర్మన్ చేయాలని నిర్ణయించాయి. దీంతో కాంగ్రెస్ (11), బీఆర్ఎస్ (6), ఎంఐఎం (6)తో పాటు స్వతంత్రుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ పీఠంపై ఇండిపెండెంట్ కూర్చునే అవకాశాలున్నాయి. ⇒ భైంసా: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14. ఇక్కడ ఎంఐఎం 12 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ నుంచి ఒకరు కలిపితే ఆ పార్టీ బలం 13కు చేరనుంది. బీజేపీ నుంచి ఆరుగురు గెలిచారు. ఆ పార్టీకి ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో బీజేపీ బలం కూడా 13కు చేరింది. మరో ఇద్దరు స్వతంత్రులు ఎంఐఎం వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వీరు ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ ఇద్దరు స్వతంత్రుల మనసు మారకపోతే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. ⇒ కాగజ్‌నగర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ కాంగ్రెస్‌కు 9 మంది, బీఆర్ఎస్కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు, స్వతంత్రులు కలిపి కాంగ్రెస్‌కు మద్దతివ్వనుండడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనుంది. ⇒ క్యాతనపల్లి: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 12 స్థానాలకుగాను ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. బీఆర్ఎస్(10), సీపీఐ(4)ల మద్దతుతో ఈ స్థానం బీఆర్ఎస్ పరం కానుంది. ⇒ బెల్లంపల్లి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, ఇక్కడ పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 14 మందిలో ఇద్దరు బీఆర్ఎస్ పక్షం చేరడంతో ఆ పార్టీ బలం 12కు తగ్గింది. అయితే, నలుగురు ఇండిపెండెంట్లతో మళ్లీ 16కు పెరిగింది. ఇక, 14 మంది కౌన్సిలర్లు గెలిచిన బీఆర్ఎస్ పక్షాన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరడంతో ఆ పార్టీ బలం కూడా 16కు చేరింది. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లు ఈ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్ జెండానే ఎగురవేయాలనే వ్యూహంతో ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కూడా వారు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ⇒ బోధన్ : ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 20. కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం నుంచి గెలిచిన 12 మంది మద్దతుతో ఇక్కడ కాంగ్రెస్ పాగా వేయనుంది. మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎంఐఎం కొంత విభేదించినా చివరకు కాంగ్రెస్ ఇష్టానికే చైర్మన్ అభ్యరి్థత్వాన్ని వదిలేయడంతో కథ సుఖాంతమైంది. ⇒ కామారెడ్డి: ఈ మున్సిపాలిటీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు పావులు కదుపుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 25 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా, బీజేపీకి 16 మందితో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 19, బీఆర్ఎస్ 11 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. కాంగ్రెస్‌కు చైర్మన్, బీఆర్ఎస్కు వైస్‌చైర్మన్ దక్కే అవకాశాలున్నాయి. ⇒ అలంపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్‌కు ఆరుగురి బలం కావాలి. బీఆర్ఎస్కు ఐదు, కాంగ్రెస్‌కు ఐదు వచ్చాయి. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటుతో గులాబీ జెండా ఎగరనుంది.⇒ జనగామ: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. కాంగ్రెస్‌కు 12, బీఆర్ఎస్కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సీపీఎం కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తోంది. దీంతో ఆ పార్టీ బలం 13కు చేరుతుంది. నలుగురు స్వతంత్రులు గెలవగా.. ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. జనగామలోనే ఉన్న మరో కౌన్సిలర్ కాంగ్రెస్‌కు మద్దతిస్తారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ చామల కిరణ్ (కాంగ్రెస్), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బీఆర్ఎస్) నమోదు చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలం 16కు చేరుతుంది. ఈ నేపథ్యంలో జనగామ టాస్ వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ⇒ అలియాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 11. కాంగ్రెస్‌కు 8, బీఆర్ఎస్కు 7 కౌన్సిలర్లు గెలిచారు. ఇక్కడ బీఎస్పీతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. ముగ్గురు బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఎవరికీ మద్దతివ్వడం లేదు. చైర్మన్ పదవి అడుగుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చీల్చే పనిలో కాంగ్రెస్ ఉంది. ఏం జరుగుతుందో సోమవారమే స్పష్టత రానుంది. ⇒ ఎల్లంపేట: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్‌కు 8 మంది, బీఆర్ఎస్కు 12 మంది బలం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి (బీఆర్ఎస్) ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 13కు చేరనుంది. ఈ మేరకు స్పష్టత ఉన్నా, బీఆర్ఎస్లో చీలిక తెస్తున్నామని కాంగ్రెస్ అంటోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపేట పీఠం ఎవరికి దక్కుతుందో సోమవారమే తేలనుంది. ⇒ పరిగి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్‌కు 10 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్‌కు 8, బీఆర్ఎస్కు 8 మంది బలం ఉంది. ఇద్దరు స్వతంత్రులు చెరో పక్షం చేరారు. దీంతో ఇరు పార్టీలకు బలం చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఆర్ (కాంగ్రెస్) ఎక్స్ అఫీషియో నమోదు చేసుకోవడంతో ఆయన ఓటుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరనుంది. ⇒ మొయినాబాద్ : ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 14. ఇందులో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7 గెల్చుకున్నాయి. ఇక్కడ స్వతంత్రులు ఐదుగురు గెలిచారు. వీరిలో మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైనంత మంది స్వతంత్రులు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరి సహకారంతో మొయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరం కానుంది. ⇒ వికారాబాద్: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, కాంగ్రెస్ నుంచి 17 మంది గెలిచారు. స్వతంత్రుల మద్దతులో ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండానే కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వర్ధన్నపేట: ఈ మున్సిపల్ పీఠం కోసం 7గురు సభ్యుల బలం అవసరం. ఇందులో కాంగ్రెస్ గెలిచిన ఐదింటితోపాటు మరో స్వతంత్రుడు కలిపితే అధికార పార్టీ పక్షాన ఆరుగురు అయ్యారు. బీఆర్ఎస్ ఆరుగురు కౌన్సిలర్లను గెలిచింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఓటుతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరం కానుంది. ⇒ కేసముద్రం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 9 మంది బలం కావాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు 8 చొప్పున స్థానాలు వచ్చాయి. ఇక్కడి నుంచి మహబూబాబాద్ లోక్‌సభ సభ్యుడు బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈయన ఓటుతో కేసముద్రం పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ జహీరాబాద్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 కాగా, బీఆర్ఎస్ 15, బీజేపీ 3 కలిసినా మ్యాజిక్ ఫిగర్ రాదు. 14 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు. వీరికి ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతివ్వనుండడంతో పాటు ఎంపీ సురేశ్ షెట్కార్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రానుండడంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలున్నాయి. ⇒ గద్వాల: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 19. కాంగ్రెస్‌కు 16, బీఆర్ఎస్ 11, బీజేపీ నుంచి 7గురు, ఎంఐఎం నుంచి ఒక్కరు, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలం 19కి చేరుతోంది. అయితే, ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లు అవగాహన కుదర్చుకున్నారు. రెండు పార్టీల బలం 18కి చేరుతోంది. కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఇద్దరు స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపీ మల్లురవిలు ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే... ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన 11 మందిలో పలువురు సరిత వర్గీయులే. దీంతో గద్వాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ⇒ నారాయణపేట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్ 7, ఎంఐఎం రెండు కలిపితే 9 మంది అవుతున్నారు. బీజేపీకి 11తోపాటు ఎంపీ అరుణ ఎక్స్ అఫీషియో ఓటు, స్వతంత్రుడితో ఆ పార్టీ బలం 13కి చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్ (2), ఏఐఎఫ్బీ (1)తో పాటు ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కాంగ్రెస్‌కు వస్తే ఆ పార్టీ బలం కూడా 13కు చేరనుంది. కానీ, గద్వాలతో ముడిపెట్టిన బీజేపీ.. బీఆర్ఎస్ను కాంగ్రెస్ వైపునకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలను విరమించలేదు. అనూహ్యం జరగకపోతే ఈ మున్సిపాలిటీ బీజేపీ పరమయ్యే అవకాశాలే ఎక్కువ. ⇒ అమరచింత: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఆరు కాగా, మూడు ప్రధాన పార్టీలు మూడు చొప్పున గెలుపొందాయి. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. సీపీఎం కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పీఠం పంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఎవరు చైర్మన్ కావాలన్న పీఠముడి వీడితే అమరచింత బీజేపీ, బీఆర్ఎస్ కూటమిదే. ⇒ జమ్మికుంట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓటుతో ఆ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయతి్నంచింది. కానీ, 10 మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్ పక్షానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు చేరడంతో బీఆర్ఎస్ బలం తగ్గింది. ఆ కౌన్సిలర్‌తోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్బీ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ బలం 15కు చేరనుంది. మ్యాజిక్ ఫిగర్‌కు రెండు పక్షాలకు ఒక ఓటు తగ్గుతుండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ⇒ ఇస్నాపూర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 14 కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన 12 మంది, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి (ఎక్స్ అఫీషియో), ఒక ఇండిపెండెంట్‌తో కలిసి మ్యాజిక్ ఫిగర్ వస్తోంది. కానీ, ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా ఎంపీ రఘనందన్‌రావు ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ⇒ మెదక్, నర్సాపూర్ : హంగ్ ఏర్పడిన ఈ రెండు మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవగాహన కుదుర్చుకుంటున్నారు. మెదక్‌లో కాంగ్రెస్, నర్సాపూర్‌లో బీజేపీకి చైర్మన్ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ⇒ రాయికల్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 7 కాగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి గెలిచిన ఆరుగురికి తోడు స్వతంత్ర అభ్యర్థి జట్టుకట్టి ఈ మున్సిపాలిటీని దక్కించుకునేలా అవగాహన కుదిరింది. ⇒ దేవరకద్ర: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏడు కాగా, కాంగ్రెస్ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు గెలిచారు. అదే పార్టీ రెబెల్ ఒకరు పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి మరొకరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండా ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ ఇంద్రేశం: ఈ మున్సిపాలిటీలో మేజిక్ ఫిగర్ 10 కాగా, ఎన్నికల్లో గెలిచిన 9 మందితోపాటు స్వతంత్ర కౌన్సిలర్ కూడా ఒకరు మద్దతివ్వనుండడంతో అక్కడ గులాబీ జెండా ఎగరనుంది. ⇒ కోహిర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 9 కాగా, గెలిచిన 8 మంది కౌన్సిలర్లతోపాటు మరో ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం కౌన్సిలర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని దక్కించుకోనుంది. ⇒ జిన్నారం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11 కాగా, బీఆర్ఎస్ (8), బీజేపీ (4) మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ⇒ మెట్పల్లి: ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలిసి బీజేపీకి చెక్ పెడుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 14కుగాను బీఆర్ఎస్(6), కాంగ్రెస్ (6)తో పాటు నలుగురు స్వతంత్రులు కలిసి పాలకమండలి ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో 10 చోట్ల గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ⇒ జగిత్యాల: మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 26 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 23 గెలిచింది. ఇక్కడ స్వతంత్రులుగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబెల్స్ 15 మంది గెలుపొందారు. వీరికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డితో ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు ఫలించడంతో జగిత్యాల పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వేములవాడ: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 15. 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకుతోడు స్వతంత్రులు, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా తోడయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానుంది.ఆమనగల్లులో ఏమవుతుందో?బీఆర్ఎస్కు చెక్‌పెట్టే యోచనలో కాంగ్రెస్, బీజేపీఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పావులుఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, వీటిలో అధికార కాంగ్రెస్ కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలుచుకుంది. ఆరు వార్డుల్లో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు పలికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చైర్మన్ పదవిని కాంగ్రెస్‌కు అప్పగించి, వైస్ చైర్మన్ పదవితో సర్దుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూలు ఎంపీ మల్లురవి ఎక్స్ అఫీషియో ఓట్లతో ఈ పీఠాన్ని ఆ రెండు పార్టీలు కైవసం చేసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. -
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో కీలక పరిణామం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ బలం.. మ్యాజిగ్ ఫిగర్‌కి చేరుకుంది. బండి సంజయ్ సమక్షంలో రెబల్, ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీలో చేరారు. ఆ ఇద్దరి చేరికతో కార్పోరేషన్లో 34కి బీజేపీ బలం చేరుకోగా.. బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో 35కి బీజేపీ బలం చేరింది. కరీంనగర్ కార్పోరేషన్ దాదాపు బీజేపీ కైవసం చేసుకున్నట్లయింది.కరీంనగర్లో ఫలితాల తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో 66 డివిజన్లలో 30 సీట్లు గెల్చుకుని బీజేపీ.. అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లు దక్కించుకోవాలంటే 34 సీట్లు అవసరం. ఎక్స్ అఫీషియో మెంబర్లగా ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిల ఓట్లతో బీజేపీ బలం 33కి చేరింది. ఇప్పటికే మరో ఐదుగురు ఇండిపెండెంట్స్ బీజేపీలో చేరికతో కరీంనగర్ బల్దియాపై కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు బీజేపీకి లైన్ క్లియర్ అయ్యింది. కరీంనగర్లో 30 స్థానాలు గెలుచుకుని బీజేపీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 స్థానాలకు పరిమితమవడంతో మేయర్ పీఠం బీజేపీ వశమవడంనల్లేరు మీద నడకలా ఉంది. తెరపైకి ఎక్స్అఫిషియో ఓట్లుఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. రాయికల్, మెట్పల్లి, జమ్మికుంటలో హంగ్ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి చోట్ల ఎక్స్అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గపరిధిలోని మున్సిపాలిటీలో ఎక్స్అఫిషియో ఓటుహక్కు కలిగి ఉంటారు. తన పరిధిలో రెండు మూడు మున్సిపాలిటీ ఉంటే.. ఎక్కడ అవసరమో అక్కడ ముందే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాని సమయంలో వీరి ఓటు కీలకమవుతుంది. తాజాగా పాత కరీంనగర్ జిల్లాలో ఎక్స్అఫిషియో ఓట్లపై జోరుగా చర్చ సాగుతోంది.కరీంనగర్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. మేజిక్ ఫిగర్ చేరుకోలేదు. అవసరాన్ని బట్టి 10 మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్లతోపాటు, ఎక్స్అఫిషియో ఓట్లు వినియోగించుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అన్ని పార్టీలు తమ అమ్ముల పొదిలో దాచిన ఈ ఓట్లను అవసరాన్ని బట్టి వినియోగించనున్నాయి. బీజేపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఓట్లు ఉండగా..కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్లో, మేడిపల్లి సత్యం చొప్పదండిలో, ఆది శ్రీనివాస్ వేములవాడలో, మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ ధర్మపురిలో, మంత్రి శ్రీధర్‌బాబు మంథనిలో, హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, విజయరమణారావు పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో, రామగుండంలో మక్కాన్‌సింగ్ ఓట్లు వినియోగించుకునే అవకాశముంది. వీరే కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, భానుప్రసాద రావు ఉన్నారు. బీఆర్ఎస్కు గంగుల కమలాకర్, కేటీఆర్, కోరుట్లలో సంజయ్, హుజూరాబాద్‌లో పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ ఓట్లు అందుబాటులో ఉన్నాయి. -
నిజామాబాద్ మేయర్ మాదే: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్‌లో ఎంఐఎం పార్టీ.. తమకే మద్దతు ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ నేతనే ఉంటారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో హాంగ్ వచ్చిన మున్సిపాలిటీల అంశంపై వ్యూహ రచన చేస్తాం. సీపీఐ నేతలతో మాట్లాడుతున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. జగిత్యాలలో కాంగ్రెస్ వాళ్ళే చైర్మన్‌గా ఉంటారు. మతాన్ని రెచ్చగొట్టినా బీజేపీ ఏం సాధించలేకపోయింది. 90 శాతం గెలవాలని రూల్ ఉందా?. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉండదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయం మాదే. మెగా గ్రేటర్ ఎన్నికలు కూడా మేమే కైవసం చేసుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.ఇక, అంతకుముందు.. డీసీసీ అధ్యక్షులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించే బాధ్యత డీసీసీలకు అప్పగించారు. హాంగ్ వచ్చిన మున్సిపాలిటీలలో స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుపై సాయంత్రంలోగా మున్సిపాలిటీల వారీగా వివరాలు ఇవ్వాలని డీసీసీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. నిజామాబాద్‌లో హంగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎంఐఎం పార్టీ కీలకంగా మారనుంది. -
అసంతృప్తులకు రేవంత్ వార్నింగ్!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్‌లో తనకు ఎదురు లేదన్న సంకేతం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రేవంత్ ధీమాకు తగ్గట్టుగానే ఉన్నా.. బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలే కైవసం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.రెండు కార్పొరేషన్ స్థానాలు సాధించగలిగిన బీజేపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా ముందంజ వేయలేదు. మిగిలిన పార్టీల మాటెలా ఉన్నా.. కాంగ్రెస్‌లో మాత్రం తనకు ఎవరూ సాటిరారన్న సంకేతం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయగలిగారు. సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చెప్పే కొంతమంది నేతలకు కూడా రేవంత్ మీ పప్పులు ఉడకవు అని చెప్పకనే చెప్పారనుకోవచ్చు.రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు సంగతి, ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, పార్టీపై పట్టు ఉందన్న భావన ఉంటే, తనకు తిరుగు ఉండదని అనుకుంటున్నారు. దీనికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన నాయకత్వాన్ని కొంతమేర బలోపేతం చేస్తాయి. అయితే 36 చోట్ల హంగ్ రావడం, బీఆర్ఎస్ 13 మున్సిపాల్టీలు గెలుచుకోవడం కాంగ్రెస్‌కు ప్రమాదకర సంకేతమన్న విశ్లేషణలు ఉన్నాయి. కాకపోతే ఆ విషయాన్ని కాంగ్రెస్‌లోని ఇతర వర్గాలు ఇప్పటికిప్పుడు రచ్చ చేయకపోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి సీనియారిటీ సంపాదించిన నేతలు కొందరైతే, ఇతర పార్టీలు ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి పార్టీపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్న నేతలు మరికొందరు కనిపిస్తారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ రెండో టర్మ్‌లో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా పని చేశారు. అలాగే పాదయాత్ర కూడా చేశారు. ఈలోగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పక్షాన ఎంపీ అయిన రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంలో పలుకుబడి పెంచుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. దానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ద్వారా పరోక్ష సహకారం పొందారని చెబుతారు. ఇతరత్రా సామాజిక అంశాలు కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ గెలవగానే సీఎం రేసులో ముందంజలో నిలబడ్డారు. ఫలితంగా మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు పార్టీలో సీనియర్లయినా రేవంత్ రాజకీయ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినా, మూలాలు టీడీపీలోనే ఉన్నాయి. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చినా అంతకుముందు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో ఉండేవారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంలో మంత్రులపై తన పట్టు పెంచుకోవడానికి పలు వ్యూహాలు అమలు చేశారని చెబుతారు.ఉదాహరణకు కొంతకాలం క్రితం వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మల్లు భట్టి కొంత స్వతంత్రంగా బిల్లులు మంజూరు చేయడానికి చొరవ తీసుకునేవారట. కానీ, ఇటీవలి కాలంలో సీఎంకు తెలియకుండా బిల్లులకు నిధులు విడుదల చేసే పరిస్థితి లేదట. ఢిల్లీ వెళ్లి కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ గోడు మొరబెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అధిష్టానం పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం తాము పవర్లో ఉన్న మూడు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. ఆ విషయంలో రేవంత్ బాగానే ఉపకరిస్తుండవచ్చన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఆ ధైర్యంతోనే రేవంత్ నేనే రాజు, నేనే మంత్రి అన్న డైలాగును వాడి కాంగ్రెస్ లోని ఇతర ముఖ్య నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారనుకోవచ్చు. అయితే, ఇది అహంకార పూరితమైందా? అన్న చర్చ వస్తుంది. కొందరు అలా చూడవచ్చు. మరికొందరు రేవంత్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా కుంపట్లు పెట్టే సీన్ లేకుండా చేసుకోవడానికి కూడా ఈ డైలాగు ఉపయోగపడవచ్చు. బీజేపీ వారే గట్టిగా నిర్ధారించలేకపోతున్నప్పటికీ, జమిలి ఎన్నికల గురించి రేవంత్ మాట్లాడడం, ఈ టర్మ్‌లో ఆరు నెలల అదనపు పదవీకాలం, తదుపరి మరో టర్మ్‌లోనూ తానే సీఎం అని అంటున్నారు. ఇది కేడర్‌లో ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు తానే పోటీ అని కూడా ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఇలానే మాట్లాడుతుండేవారు. రాజకీయాలలో ఎవరు పొగిడినా, పొగడకపోయినా, తన గురించి తాను బాగా చెప్పుకోవాలి. అదంతా మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగాలి. ఈ స్ట్రాటజీలో చంద్రబాబు మొనగాడు. ఇప్పుడు రేవంత్ కూడా ఆ బాటలో ఉన్నారనపిస్తుంది.మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక రేవంత్‌కు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా నువ్వే రాజు, నువ్వే మంత్రి అని కీర్తించడం కూడా గమనార్హమే. ఇది రేవంత్‌కు ఎంత ప్రయోజనమో తెలియదు కాని, ఆ మీడియాకు బాగానే గిట్టుబాటు అవుతుందన్న భావన కలుగుతుంది. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరడం వెనుక కూడా ఒక ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానులు, ఒక సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఈ మాటలు చెబుతుండవచ్చు. ఈ రకంగా పలు వ్యూహాలు అమలు చేస్తున్న రేవంత్ మున్సిపల్ ఎన్నికలలో విజయం అంతటిని తన ఖాతాలోనే వేసుకుంటారు. రాష్ట్రం అంతటా తిరిగి ప్రచారం చేసింది ఆయన ఒక్కరే కనుక ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఈ వెసులుబాటు తక్కువగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రేవంత్ నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడుగా మరీ అంత బలమైన నేత లేకుండా చూసుకోవడం కూడా ప్లస్ పాయింటే అని చెప్పాలి.ఇక మున్సిపల్ ఎన్నికలలో విజయాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ను మరోసారి గెలిపిస్తాయన్న భావన రేవంత్ తదితర కాంగ్రెస్ నేతలలో ఉండవచ్చు. కానీ, ఈ స్థానిక ఎన్నికలే కొలమానంగా తీసుకోలేం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. బీఆర్ఎస్, బీజేపీలను నైతికంగా దెబ్బతీయడానికి ఉపయోగపడతాయి. కేసీఆర్ రెండో టర్మ్‌లో బీఆర్ఎస్ అన్ని జెడ్పీలను, 90 శాతం మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. కానీ, ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. బీజేపీ సడన్‌గా ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. కానీ, స్థానిక ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోయింది. బీఆర్ఎస్కు కాస్త మెరుగైన ఫలితాలే వచ్చినా అవి కొంత ధైర్యాన్ని ఇవ్వవచ్చు కానీ, పూర్తి విశ్వాసాన్ని ఇవ్వలేకపోవచ్చు.ఒకప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయానికి ఒక ప్రాతిపదికగా ఉండేవి. ఉదాహరణకు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జెడ్పీ ఎన్నికలలో 11 చోట్ల టీడీపీ, 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాల్టీలలో కూడా హోరాహోరీగా ఎన్నికలు సాగేవి. కానీ, విభజన తర్వాత స్థానిక ఎన్నికలలో 70 నుంచి 90 శాతం వరకు అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకుంటున్నాయి. ఈ ఎన్నికలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిపోతామని అనుకుంటే అది ఒక్కోసారి భ్రమ అవుతుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒక రీతిలో ఉండవు. ఈ మున్సిపల్ ఎన్నికలతోనూ, పార్టీ హైకమాండ్ లోను, అలాగే పార్టీ ఇతర సీనియర్ నేతలపైన పట్టు సాధించినంత వరకు రేవంత్‌కు సంతోషమే. అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి ఇవి సరిపోతాయని అనుకోజాలం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తిస్తే ఆయనకే మంచిది. రాజకీయాలలో ఎప్పుడు ఎవరు రాజు అవుతారో, ఎప్పుడు ఎవరు మంత్రి అవుతారో, ఎప్పుడు అడ్రస్ లేకుండా పోతారో చెప్పజాలం. ఆ విషయాన్ని రాజకీయ నేతలు విస్మరించరాదని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నిజామాబాద్‌పై ఉత్కంఠ.. కొత్తగూడెంలో బీఆర్ఎస్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. మొత్తం 7 కార్పొరేషన్లలో రామగుండం, నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్లలో పూర్తి మెజార్టీతో ఖాతాలో వేసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ దక్కించుకోగా.. కొత్తగూడెం, నిజామాబాద్ పరిస్థితి ఉత్కంఠగా మారింది.కొత్తగూడెంలో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐతో హోరాహోరీ తలపడింది. 60 స్థానాలకు గాను కాంగ్రెస్ -22, బీఆర్ఎస్ -8, బీజేపీ -1, ఇతరులు -29 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ మేయర్ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన 9 అదనపు ఓట్ల కోసం ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడమా లేదా స్వతంత్రులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో కార్పొరేషన్ కైవసం చేసుకోవడమా అనే అంశాలను పరిశీలిస్తోంది. మరోవైపు.. కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్లాన్ మార్చింది. సీపీఐకి బీఆర్ఎస్ బహిరంగ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో సీపీఐ కలిసి వెళ్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.ఇక, నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్ రావడంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిజామాబాద్‌లో మొత్తం డివిజన్లు 60 ఉండగా.. బీజేపీ-28, కాంగ్రెస్-18, ఎంఐఎం-13, బీఆర్ఎస్-1 స్థానాలను దక్కించుకున్నాయి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొలిటికల్ సస్పెన్స్ నెలకొంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ కీలకంగా మారింది. అయితే, ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎంఐఎం మద్దతు తీసుకుని, నాలుగు లేదా ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లతో ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలపై దృష్టి పెట్టింది. ఎంఐఎం కీలకం కావడంతో మేయర్‌గా ఆ పార్టీ మెంబర్ ఉంటారా? లేక కాంగ్రెస్ నుంచి ఎన్నుకుంటారా? అనే విషయం కూడా తేలాల్సి ఉంటుంది.అటు మహబూబ్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 60 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ -29, బీఆర్ఎస్ -15, బీజేపీ -7, ఇతరులు - 8 స్థానాల్లో విజయం సాధించారు. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు దక్కలేదు. అయితే, ఇండిపెండెంట్లు అధికార కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండటంతో మేయర్ పీఠం హస్తం పార్టీకే దక్కే చాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 66 స్థానాలకు గాను 30 సీట్లలో సొంతంగా విజయం సాధించింది. ఫలితాల వెలువడ్డ కొద్దిసేపటికే మరో నలుగురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్బీ కార్పోరేటర్ బీజేపీలో చేరిపోయారు. దీంతో, బీజేపీ బలం 34కు చేరుకుంది. ఈరోజు లేదా రేపు మరో ఐదుగురు కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. హాంగ్ ఏర్పడ్డ 37 మున్సిపాలిటీలు , మూడు కార్పోరేషన్లలో పార్టీ వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, ఈనెల 16న మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫిషియో ఓట్ షేర్‌పై సూచనలు చేయనున్నారు. -
వారికే ఈ విజయం అంకితం.. సీఎం రేవంత్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.‘‘ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం... పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం.. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘‘అదేవిధంగా.. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద-మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ.. భవిష్యత్‌లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన…— Revanth Reddy (@revanth_anumula) February 13, 2026 -
కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి.. కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
-
మున్సిపల్ రిజల్ట్‌పై BRS క్రిశాంక్ కామెంట్స్
-
త్రిముఖ పోటీతో నష్టం జరిగింది: రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఆరు మున్సిపాలిటీలో సింగల్ లార్జెస్ట్ గా అవతరించామని.. మొదటిసారి రెండు కార్పొరేషన్లు కైవసం చేసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. మొత్తం కలిపి 300 పైగా వార్డు, కార్పొరేటర్లు గెలిచారు. నారాయణపేటలో గెలిచాం. గతం కంటే ఇపుడు మెరుగయ్యాం. ఎన్నికల్లో మేము మేనిఫెస్టో ఇచ్చాం. ప్రభుత్వ తప్పిదాలపై ఛార్జీ షీట్ కూడా ప్రకటించాం. చాల చోట్ల స్వల్పంగా ఓడిపోయాం. త్రిముఖ పోటీలో నష్టం జరిగింది’’ అని రాంచందర్‌రావు పేర్కొన్నారు.‘‘ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం సాధించాం. ఖమ్మం కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో కూడా ఒకటి గెలిచాం. అధికార దుర్వినియోగం వల్లే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి ఇది క్లియర్ మెజారిటీ కాదు. బీఆర్ఎస్ కూడా గతం కంటే వెనకబడింది. బీఆర్ఎస్ది రెండో స్థానం అనుకోవడం కాదు.. గతం కంటే వెనుకబడ్డారు. బీజేపీకి ఓటు శాతం పెరిగింది. బీజేపీ ఓటింగ్ ప్రాంతాల్లోనే మజ్లీస్ పార్టీ, బీఆర్ఎస్.. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. ఉత్తర తెలంగాణలో ముస్లిం పాపులేషన్ ఉంది. వాళ్ల ఓట్ల వల్లనే బీఆర్ఎస్, కాంగ్రెస్ అక్కడ గెలిచింది, కాంగ్రెస్ బీఆర్ఎస్, మజ్లీస్ ఒక్కటి అయ్యాయి’’ అని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. -
కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని పోతాం : కేటీఆర్
సాక్షి,తెలంగాణ భవన్: కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. సీపీఐకి బీఆర్ఎస్ బహిరంగ మద్దతు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. మున్సిపాలిటీల్లో 2,500 స్థానాల్ని గెలుచుకోబోతున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విరోచిత పోరాటం చేశారు. కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని పోతాం.కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల మా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లారు. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి ఫలితాలొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం,డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టింది.సింగరేణిలో జరుగుతున్న కుంభకోణణాన్ని బయటపెట్టాం. కొత్తగూడెం సింగరేణి బెల్ట్‌లో భాగం. కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తాము. ఇదే విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడాం. కాంగ్రెస్,బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లౌకిక పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది. కాంగ్రెస్,బీజేపీ కుయుక్తులు పన్నుతున్నాయి.కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి ,బీజేపీ అడ్డుకునే శక్తి బిఆర్ఎస్ పార్టీకే ఉంది. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఫలితాలు సంతృప్తినిచ్చాయి.హైదరాబాద్ కార్పోరేషన్ , ఎంపీటీసీ,జెడ్పీటీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహం కనబరుస్తాం. ఈ దేశం చాల గొప్పది, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి వారే ఓడిపోయారు. రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ సఫలం అవుతుంది. 2029లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.అధికార పార్టీ చాలా రకాలుగా సామ దాన దండోపాయలు ప్రదర్శించినా..ప్రజల మనస్సులు గెలుచుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి 40శాతం సర్పంచులు గెలిపించారు. నోరు మూసుకునేలా పురపోరులో ఫలితాలు సాధించాం.750 వరకు వార్డుల్లో BRS గెలుస్తుంది. వీరోచిత పోరాటం చేశాం.అధికారులను అడ్డం పెట్టుకొని కొన్ని వార్డుల్లో గెలిచి ప్రయత్నం చేస్తున్నారు.15 మున్సిపాల్టీలను సింగిల్ గా కైవసం చేసుకున్నాం.. మరో 15 మున్సిపాలిటీల్లో కూడా ఇతరుల సాయంతో అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు, మద్యం, అక్రమాలు తారా స్తాయికి చేరాయి.రేపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు గులాబీ జెండా పట్టుకొని తిరగాల్సి వస్తుంది.కాంగ్రెస్,బీజేపీ కలిసి పని చేస్తున్నట్లు అందరు చూస్తున్నారు.సింగరేణిలో దోపిడీపై ప్రశ్నిస్తే కాంగ్రెస్,బీజేపీ నుంచి సమాధానం లేదు. కాంగ్రెస్,బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్ఎస్కే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మా నాయకులు,కార్యకర్తలు విరోచితంగా పోరాడారు. గద్వాలలో అధికారులను అడ్డం పెట్టుకుని గెలిచారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
తెలంగాణ మున్సిపోల్స్.. సత్తా చాటిన ఎంఐఎం
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. పలు స్థానాల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM) పార్టీ సత్తా చాటింది. మధ్యాహ్నం 2:00 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం.. ఎంఐఎం పార్టీ వివిధ జిల్లాల్లో పలు వార్డులను కైవసం చేసుకుంది. కాగజ్‌నగర్‌లో వార్డు నంబర్ 3లో ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ ముబీన్ విజయం సాధించారు.సంగారెడ్డిలో వార్డు నంబర్ 5 నుంచి ఎంఐఎం అభ్యర్థి ఐజాజ్ గెలుపొందగా.. జహీరాబాద్‌లో ఎంఐఎం రెండు స్థానాలను గెలుచుకుంది. జగిత్యాలలో ఎంఐఎం 31, 34 వార్డులను గెలుచుకుంది. మరో రెండు వార్డుల్లో ముందంజలో ఉంది. బాన్సువాడలొ వార్డు నంబర్ 17 నుండి ఎంఐఎం తరపున ఫరా నాజ్ విజయం సాధించారు. వికారాబాద్‌లో వార్డు నంబర్ 4లో ఎంఐఎం అభ్యర్థి షబ్బీర్ హుస్సేన్ గెలిచారు.నిర్మల్‌లో వార్డు నంబర్ 29 నుండి ఎంఐఎం అభ్యర్థి ముజాహిద్ అలీ విజయం సాధించారు. నారాయణపేలో వార్డు నంబర్ 23లో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ తఖీ చంద్ గెలుపొందారు. కొడంగల్‌లో వార్డు నంబర్ 9 నుంచి ఎంఐఎం అభ్యర్థిని సనా ఆఫ్రీన్ విజయం సాధించారు. కోహీర్‌లో వార్డు నంబర్ 8లో ఎంఐఎం తరపున రఫీ విజయం సాధించారు. భైంసాలో ఎంఐఎం ఇప్పటివరకు 8 వార్డులను గెలుచుకుంది. (స్వతంత్ర అభ్యర్థులు, బీజేపీ రెబల్స్ కూడా 6 వార్డుల్లో గెలిచారు).బోధన్లోఎంఐఎం తన ఆధిపత్యాన్ని చాటుతూ ఏకంగా 12 వార్డులను కైవసం చేసుకుంది. రఫీక్((వార్డు-3), సమీర్ (వార్డు 5), అఖీల్ (వార్డు-7), రఫీ (వార్డు-8), అలీమ్ (వార్డు-12), మీర్ ఇలియాస్ అలీ (వార్డు-18), అన్సారీ కామ్ (వార్డు-27), ముజాహిద్ బాబర్ (వార్డు-28), వలీ (వార్డు-30), అల్తాఫ్ (వార్డు-31), వసీం సుల్తానా (వార్డు-32), ఖైఖషా కౌసర్ (వార్డు- 38) గెలుపొందారు.నల్గొండలోనల్గొండలో ఏఐఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించింది. వార్డు నంబర్ 46 నుంచి పట్టణ అధ్యక్షుడు రఫీ ఉద్దీన్ గెలుపొందగా, వార్డు నంబర్ 29 నుంచి నదీమ్ విజయం సాధించారు.మహబూబ్ నగర్లో వార్డ్ నెం.14 నుండి , ఇమ్రాన్ షరీఫ్ గెలిచారు. గద్వాల్లో వార్డు నెం. 15 నుంచి మొహమ్మద్ ఇలియాస్ గెలిచారు. -
ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్.. ఐదు చోట్ల హంగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో భాగంగా పలుచోట్ల హంగ్ ఏర్పడింది. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్, కోహిర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీల ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థుల కోసం పార్టీలు పోటీపడే అవకాశం ఉంది.వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లాలోని కేస సముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా.. చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో, హంగ్ ఏర్పడింది. మరోవైపు.. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా.. చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, ఐదు చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. ఇక, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇస్నాపూర్‌లో 26 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4 విజయం సాధించారు. మ్యాజిక్ ఫిజర్ 13 కాగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో, ఇండిపెండెంట్లపై పార్టీలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోట గెలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలోనూ అదే తరహా పరిస్థితి నెలకొంది. అక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా.. బీజేపీ, ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు.ఏఐఎఫ్బీ ప్రభంజనం.. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఓ మున్సిపాలిటీని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్బీ) దక్కించుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అక్కడ 10 వార్డుల్లో 8 చోట్ల ఏఐఎఫ్బీ గెలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కో వార్డుకే పరిమితమయ్యాయి. తెలంగాణ జాగృతికి చెందిన నేతలు ఏఐఎఫ్బీ తరఫున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించడం గమనార్హం.కాంగ్రెస్ హవా.. కారు జోరు.. కాంగ్రెస్: నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్, స్టేషన్ ఘన్పూర్.బీఆర్ఎస్: గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్ఫార్వర్డ్ బ్లాక్: వడ్డేపల్లి. -
మున్సిపల్ ఫలితాలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ విజయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. చిట్యాల, చండూరు, హాలియా, నందికొండ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.👉మరోవైపు.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. గడ్డపోతారంలో మొత్తం 18 వార్డులకు గాను 14 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల కాంగ్రెస్, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక, నందికొండలో 12 వార్డులకు గాను.. 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు.. కే. సముద్రం, ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.👉సుల్తానాబాద్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. మొత్తం 15 వార్డులకు గానూ 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ, బీఆర్ఎస్, ఇతరులు ఒక్కో వార్డును దక్కించుకున్నారు.👉డోర్నకల్‌లో హస్తం పార్టీ విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 15 వార్డుల్లో 10 వార్డులను కాంగ్రెస్ దక్కించుకోగా, నాలుగింటిలో బీఆర్ఎస్ విజయం సాధించింది.మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరిపెడ 15 స్థానాల్లో కాంగ్రెస్-8, బీఆర్ఎస్-6 విజయం సాధించాయి. చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చండూరు(10) స్థానాల్లో కాంగ్రెస్-7, బీఆర్ఎస్-2, సీపీఐ-1 విజయం సాధించాయి.చిట్యాల కాంగ్రెస్ విజయం చోటుచేసుకుంది. చిట్యాల (12) స్థానాల్లో కాంగ్రెస్-9, బీఆర్ఎస్-2 విజయం. హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. హాలియాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్-8, బీఆర్ఎస్-2 విజయం. గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం. గుమ్మడిదల 22 స్థానాల్లో బీఆర్ఎస్-14, కాంగ్రెస్-4. బీజేపీ-2 విజయంచొప్పదండి కాంగ్రెస్ వశం.. చొప్పదండిలోని 14 స్థానాల్లో కాంగ్రెస్-10, బీజేపీ-3, బీఆర్ఎస్-1 స్థానం విజయం. -
ఎవరో పురంధర్!
సాక్షి, హైదరాబాద్: కొద్దిసేపట్లో మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ‘పురం’ధర్ ఎవరో తేలనుంది. శుక్రవారం ఉదయం 8కి కౌంటింగ్ చేపట్టి మధ్యాహ్నం 2 గంటలకల్లా ఫలితం వెల్లడించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఎన్నికల అధికారులు ఆయా కేంద్రాల్లో మాక్ కౌంటింగ్ నిర్వహించారు. తొమ్మిది కౌంటింగ్ కేంద్రాల్లో 106 టేబుళ్లు.. 418 మంది లెక్కింపు సిబ్బందిని నియమించారు. నగర శివారులోని 9 పురపాలికల్లోని 194 వార్డుల్లో మొత్తం 590 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవిత్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, అనంతరం వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. లెక్కింపు ఇలా.. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో 14 టేబుళ్లు, మొయినాబాద్‌లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్‌పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్లో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 265 మంది సిబ్బంది ఓట్లు లెక్కించనున్నారు. మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మూడు కౌంటింగ్ కేంద్రాల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 153 మంది సిబ్బంది ఓట్లు లెక్కించనున్నారు. రిజర్వేషన్లు ఇలా.. ఫలితాల వెల్లడి తర్వాత ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి, చేవెళ్ల మున్సిపాలిటీలు జనరల్‌కు రిజర్వు కాగా, షాద్‌నగర్ బీసీ జనరల్‌కు, మొయినాబాద్ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. అలియాబాద్ మున్సిపాలిటీ జనరల్ మహిళలకు, మూడు చింతపల్లి మున్సిపాలిటీ ఎస్సీ జనరల్‌కు, ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎస్టీ జనరల్‌కు రిజర్వయ్యాయి. భారీ భద్రత ఆమనగల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద శుక్రవారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమిగూడటం నిషేధం. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. – సుధీర్‌బాబు, ఫ్యూచర్ సిటీ కమిషనర్ -
మున్సిపల్ ఫలితాలు.. కాంగ్రెస్ హవా
Telangana Municipal Elections 2026 Results👉వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు👉వార్డుల వారీగా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.. నిజమాబాద్ : కార్పొరేషన్ 60 డివిజన్లో ముగిసిన ఓట్ల లెక్కింపుఅతిపెద్ద పార్టీ గా బీజేపీ ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత రెడ్డి ఓటమిబీజేపీ 28కాంగ్రెస్ 18ఎంఐఎం 13బీఆర్ఎస్ 01తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా116 మున్సిపాలిటీల్లో 72 చోట్ల కాంగ్రెస్ విజయం15 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ రామగుండంలో కాంగ్రెస్ విజయం వెనుక మంత్రి శ్రీధర్‌బాబు కీలక పాత్రపెద్దపల్లి జిల్లాలో చక్రంతిప్పిన మంత్రి శ్రీధర్బాబుమంథని మున్సిపాలిటీలో 13 స్థానాలకు 11 కాంగ్రెస్ కైవసంరామగుండం కార్పొరేషన్ దక్కించుకున్న కాంగ్రెస్రామగుండంలో 60 స్థానాలకు 38 స్థానాల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ పలు మున్సిపాలిటీల్లో హంగ్హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో హీటెక్కిన పాలిటిక్స్చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ స్కెచ్ నిజమాబాద్ : కార్పొరేషన్ లో 60 డివిజన్లకు ఓట్ల లెక్కింపు26 డివిజన్ల లో ముందంజలో బీజేపీ అభ్యర్థులుకాంగ్రెస్ 17 డివిజన్లలో ముందంజఎంఐఎం 10 డివిజన్లలో ముందంజబీఆర్ఎస్ ఒక డివిజన్లో ముందంజ కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుపోతాం: కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాంకాంగ్రెస్ ప్రభుత్వం మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టిందిఅధికారుల్ని అడ్డం పెట్టుకుని గెలవాలని చూశారుకాంగ్రెస్, బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్ఎస్కే ఉందికాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్(మొత్తం 60 డివిజన్లు)ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీసీపీఐ -24చోట్ల గెలుపుకాంగ్రెస్-20చోట్ల గెలుపుబీఆర్ఎస్-09సీపీఎం -01బీజేపీ -01 నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంమంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంరామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్‌దే కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసంకరీంనగర్ జిల్లా:కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో 3 గంటల 50 నిమిషాల వరకు అప్డేట్స్బీజేపీ 33కాంగ్రెస్ 12బీఆర్ఎస్ 9ఇండిపెండెంట్స్ 6ఎంఐఎం 3ఆల్ ఇండియా ఫార్వబ్లాక్-3రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 3.17pmవరకు ఫలితాలు -48కాంగ్రెస్ 31బీఆర్ఎస్ 12బిజెపి 01ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 03ఇండిపెండెంట్ 01సిద్ధిపేట జిల్లాహుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం మెదక్: నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంనారాయణపేట: మక్తల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంవరంగల్: పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబ్నగర్: కల్వకుర్తిమున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంరంగారెడ్డి: షాద్‌నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంరంగారెడ్డి: శంకరపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమెదక్: రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్కైవసంమెదక్: తుప్రాన్మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసంకొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ ఆధిక్యందాదాపు 15 మున్సిపాలిటీల్లో హంగ్దేవరకద్ర, కేసముద్రం, జహీర్బాద్లో హంగ్అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామల్ హంగ్ఆసిఫాబాద్, జమ్మికుంట,జిన్నారంలో హంగ్మహబూబాబాద్,బోధన్, వేములవాడ, ఆలియాబాద్‌లో హంగ్ జగిత్యాల జిల్లా :ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్15/15 స్థానాలు కాంగ్రెస్ కైవసంమొత్తం స్థానాలు 1515స్థానాల్లో ఒక్క అభ్యర్థిని గెలిపించుకోలేక పోయిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ప్రభావం చూపని బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులుఖమ్మం:వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంనిజామాబాద్ జిల్లా:ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతమాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన16 వ వార్డు రీ కౌంటింగ్ చెయ్యాలని జీవన్ రెడ్డి డిమాండ్కరీంనగర్ జిల్లా:తొలి రౌండ్ ముగిసేసరికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల్లో 30 స్థానాల్లో లీడ్‌లో దూసుకుపోతున్న బీజేపీరాష్ట్ర వ్యాప్తంగా కౌటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది: ఎస్ఈసీ రాణి కుమిదినిఎక్కడా ఎలాంటి సమస్యలు మా దృష్టికి రాలేదు.సాయంత్రానికి పూర్తి ఫలితాలు విడుదల అవుతాయి.బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నేషనల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించింది.16వ తేదీ మేయర్, చేర్మెన్ ఎన్నిక ఉంటుంది.మేయర్, చైర్మెన్ ఎన్నికలు టై అయితే లాటరీ విధానం అమలు చేస్తారు సిద్దిపేటచేర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ఇల్లందు మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్మహబూబాబాద్ జిల్లా;మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్_ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ కాంగ్రెసు కార్యకర్తల అందోళనకౌంటింగ్ సెంటర్ లోకి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లోపలికి ఎలా పంపించారంటూ పోలీసులతో వాగ్వివాదం4 వార్డు ఇండిపెండెంట్ ఆభ్యర్ది గుగులోత్ జ్యోతి రమేష్. 135 ఓట్ల తో గెలుపుజ్యోతి రమేష్ ను క్యాంపు కు తరలించడానికి మంతనాలుక్యాంప్ కి ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పోలీసుల రంగ ప్రవేశంఆభ్యర్ధిని కౌంటింగ్ హలోకి పంపిన పోలీసులుమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారు ముందు కాంగ్రెసు కార్యకర్తలు.. నిరసనఖమ్మం జిల్లాకల్లూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా:ఆర్మూర్ మున్సిపాలిటీని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీరాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 1, 6, 26 వార్డుల్లో రీకౌంటింగ్ కు పట్టుబడుతున్న సమీప ప్రత్యర్థులుకౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించిన ఆయా వార్డు అభ్యర్థులుబయటకు నెట్టేసిన పోలీసులు..కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీ బీఆర్ఎస్ కైవసంకౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతమేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతస్వతంత్ర అభ్యర్థి వెంకటేష్‌ను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులుఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లిన పోలీసులుపోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు, తోపులాట ధర్మపురిలో సంచలన ఫలితాలు..ధర్మపురి రాజకీయాల్లో సంచలన ఫలితాలు.ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘోర పరాభవం.15 స్థానాలకు 15 స్థానాలు కాంగ్రెస్ కైవసం..రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న ధర్మపురి మున్సిపల్ ఫలితాలు.. హంగ్ ఎఫెక్ట్.. స్వంత్రులకు గిరాకీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పోటాపోటీ.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ.దేవరకద్ర, కేససముద్రం, జహీరాబాద్‌లో హంగ్.అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామలో హంగ్.ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారంలోనూ హంగ్.బోధన్, వేములవాడ, అలియాబాద్‌లో హంగ్.ఈ నేపథ్యంలో కీలకం కానున్న స్వతంత్రులు. కాంగ్రెస్ ఆధిపత్యం.. మధిరలో కాంగ్రెస్ ఘన విజయంమధిర 22 వార్డుల్లో 21 వార్డులు కాంగ్రెస్ కైవసం.ఒక్క వార్డుకే పరిమితమైన బీఆర్ఎస్మెదక్ రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబ్నగర్ కొత్త మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయంసంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం.మద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయంపెబ్బేరు కాంగ్రెస్ కైవసం. పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంజమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యంఆత్మకూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంసిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం బీఆర్ఎస్ జోరు.. భీంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.15 వార్డుల్లో 11 చోట్ల బీఆర్ఎస్ విజయం.క్యాతనపల్లి మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం. కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మూడు చోట్ల హంగ్.. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్.కేస సముద్రంలో చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం.అలంపూర్‌లో చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ.. సిరిసిల్లలో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం.39 వార్డులకు గాను 14 వార్డుల్లో ఫలితాలు వెల్లడి.14 వార్డుల్లోనూ బీఆర్ఎస్ విజయం.స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.ఘన్‌పూర్‌లో 18 స్థానాల్లో కాంగ్రెస్-13, బీఆర్ఎస్-5.హుజురాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.హుజురాబాద్ 30 స్థానాల్లో కాంగ్రెస్-16, బీఆర్ఎస్-8, బీజేపీ-5ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హంగ్.ఇస్నాపూర్‌లో 26 స్థానాల్లో బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4జనగామలో బీఆర్ఎస్ ఆధిక్యం.జనగామలో 30 స్థానాల్లో బీఆర్ఎస్-13, కాంగ్రెస్-12, ఇతరులు-4గాంధీభవన్‌లో సంబురాలు..హైదరాబాద్..గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సంబురాలు.బాణాసంచా పేల్చి, స్వీట్లు తినిపించుకున్న కాంగ్రెస్ నేతలు. 👉ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ హవా.👉ఉమ్మడి జిల్లాలో కీలక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం.ఇప్పటి వరకు వెలువడిన 18 స్థానాల్లో ఫలితాల ప్రకారం..13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపుఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం. ఖమ్మంలో కాంగ్రెస్ హవా..మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు మున్సిపాలిలీలు కాంగ్రెస్ కైవసం. కొల్లాపూర్, మంథని, నేరుడుచర్చ కాంగ్రెస్ వశం..ఐజా మున్సిపాలిటీ బీఆర్ఎస్ విజయం. కామారెడ్డిలో కాంగ్రెస్ హవా..బాన్సువాడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్మ్యాజిక్ ఫిగర్ మెజార్టీ సాధించిన కాంగ్రెస్.19 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.3 వార్డుల్లో బీజేపీ విజయం2 వార్డుల్లో స్వతంత్రులుఒక వార్డులో బీఆర్ఎస్ విజయం. కామారెడ్డిలో బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం2 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం.బోణీ కొట్టని బీజేపీ.కొత్త మున్సిపాలిటీలో ఎగిరిన కాంగ్రెస్ జెండా. 👉ఇప్పటి వరకు 80 మున్సిపల్ వార్డుల ఫలితాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు అందించిన అధికారులు👉52 వార్డులు కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 3 బీజేపీ, 3 ఇండిపెండెంట్, 1 ఇతరులు గెలుపు.దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమొత్తం 20 వార్డులుకాంగ్రెస్-11బీఆర్ఎస్-6 ఇండిపెండెన్స్-2బీజేపీ-1 బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయంచిట్యాల, చండూరు, హాలియా, నందికొండలో కాంగ్రెస్ విజయం. మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మరిపెడ 15..కాంగ్రెస్-8బీఆర్ఎస్-6 చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.చండూరు(10)కాంగ్రెస్-7బీఆర్ఎస్-2సీపీఐ-1చిట్యాల కాంగ్రెస్ విజయం.చిట్యాల (12)కాంగ్రెస్-9బీఆర్ఎస్-2 హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంహాలియా 12..కాంగ్రెస్-8బీఆర్ఎస్-2 గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.గుమ్మడిదల 22బీఆర్ఎస్-14కాంగ్రెస్-4బీజేపీ-2బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.22 వార్డుల్లో కాంగ్రెస్ 16 విజయం.వేములవాడలో బీజేపీ ఆధిక్యం.కోహిర్లో (16) ఇలా..కాంగ్రెస్-6బీఆర్ఎస్-5బీజేపీ-1 నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం.నందికొండ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నా కాంగ్రెస్నందికొండలో మొత్తం 12 వార్డులు.కాంగ్రెస్-11బీఆర్ఎస్-1 గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసంసంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో 18 వార్డులుబీఆర్ఎస్-14కాంగ్రెస్-3ఇండిపెండెంట్-1. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కిషోర్ గెలుపు13వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ నరసింహ రెడ్డి గెలుపు17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ గెలుపుమూడో వార్డు అభ్యర్థి ప్రియాంక రెడ్డి బీజేపీ విజయం.16వ వార్డు అభ్యర్థి కె.లక్ష్మీ బీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంహుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 4 5 6 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు4 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం5 వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం6 వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ విజయం7 వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయంబీఆర్ఎస్ హవా..మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయంఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపుమేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో గెలిచిన అభ్యర్థి గురుక కుమార్మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపుసంగారెడ్డి జిల్లా గడ్డ పోతారం మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం... ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.ఒకటో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.విజయాలు ఇలా.. జగిత్యాల పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.వరంగల్ నర్సంపేట మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్.వైరా మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో ఏడు వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.కొల్లాపూర్ 6,14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు. అభ్యర్థుల విజయాలు..యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డు బీజేపీ అభ్యర్థి రాధ గెలుపుమరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం.సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.ఇబ్రహీంపట్నం 12వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు.100 ఓట్ల తేడాతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి.ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.గడ్డిపోతారం 16వ వార్డులో బీఆర్ఎస్ విజయం. ఆధిక్యం ఇలా.. మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరులో కాంగ్రెస్ లీడ్.ఆసిఫాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్.యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఫస్ట్ వార్డులో బీజేపీ గెలుపు.ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.నందికొండ, హాలియా, చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్.నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం. నల్లగొండ జిల్లాహాలియా మున్సిపాలిటీలోపోస్టల్ బ్యాలెట్ల ఫలితాలుకాంగ్రెస్ :32టీఆర్ఎస్ :8బీజేపీ : 1 ఇండిపెండెన్స్ :2నోటా: 1మొత్తం: 44చొప్పదండి మున్సిపల్ రెండవ వార్డులో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుబీజేపీ:1కాంగ్రెస్:2టీఆర్ఎస్:1 ఆధిక్యాలు ఇలా.. ఆదిలాబాద్..పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.ఖమ్మం జిల్లామధిర మున్సిపాలిటీ మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముందంజ.కాంగ్రెస్ -29బీఆర్ఎస్ -5నోటా -1 సంగారెడ్డిసంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలుమొత్తం 38 వార్డుల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం3 వార్డుల్లో BRS ఆధిక్యంక్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తుహైదరాబాద్..క్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తుఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలునగర శివారుల్లోని పలు రిసార్టులలో రూమ్స్ బుక్ చేసిన హస్తం నేతలు350 రుమాలు బుక్ చేసిన కాంగ్రెస్నిన్న రాత్రే పలు మున్సిపాలిటీల అభ్యర్థులను క్యాంపులకు తరలింపుఈరోజు ఉదయం మరి కొందరిని క్యాంపునకు తరలించిన కాంగ్రెస్ నేతలుబీఆర్ఎస్ ఆగ్రహంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా..అశ్వారావుపేట కౌంటింగ్ హాల్లో అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం..అధికార పార్టీ అభ్యర్థితో ముగ్గురిని అనుమతిస్తూ, బీఆర్ఎస్ నుండి ఒక్కరినే అనుమతి ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళనఅందరికి ఒకే రూల్ ఉండాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలుబీజేపీ అభ్యర్థి మృతి.. మంచిర్యాల..లక్షెట్టిపేట పదో వార్డు బీజేపీ అభ్యర్థి మృతి.ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన బత్తిని ఎల్లమ్మ.బీజేపీ లీడ్.. కరీంనగర్ జిల్లా:కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ లీడ్.పలు వార్డుల్లో బీజేపీ ఆధిక్యత.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు తర్వాత ప్రకటించనున్న అధికారులు.కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న ఈసీ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్.వెబ్ కాస్టింగ్ విధానాన్ని కమిషన్ ఆఫీసులో పరిశీలిస్తున్న చీఫ్ రాణి కుమిదిని.ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఉండాలని SEC ఆదేశం.పోలింగ్ రోజు తరహాలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి.కౌంటింగ్ కేంద్రంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలి.కౌంటింగ్ జరగని చోట ఆలస్యానికి కారణం ఏంటని ఆరా తీసిన SEC. 👉మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుస్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.కరీంనగర్ జిల్లా:హుజురాబాద్‌లో స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.గడ్డపారతో స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొట్టిన అధికారులు.కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతఎన్నికలపై అన్ని పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠకౌంటింగ్ కేంద్రాల సందడి వాతావరణం,. క్యూలో అభ్యర్థులను లోపలికి పంపుతున్న పోలీసులు ఎన్నికలు ఫలితాలు.. టీపీసీసీ చీఫ్ కీలక ఆదేశాలుఎన్నికల ఫలితాలపై ఉత్కంఠఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ఫలితాలపై అలర్ట్‌గా ఉండాలన్న పీసీసీ ఛీఫ్.హాంగ్ వచ్చే అవకాశం ఉన్న చోట వెంటనే పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రికి సమాచారం ఇవ్వాలని ఆదేశం..ఇంకా క్యాంప్‌లకు తరలించని అభ్యర్థులను వీలైనంత త్వరగా తరలించాలని సూచన..ఒకటి రెండు ఓట్లతో ఓడిపోయే వార్డులలో కచ్చితంగా రీ కౌంటింగ్‌కు అడగాలని సూచించిన మహేష్ కుమార్. ఈసీ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు..తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వద్ద భారీ బందోబస్తు.పోలింగ్ రోజుతో పోల్చితే మూడింతల బందోబస్తు పెంచిన పోలీస్ శాఖ.పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై కేసులు నమోదు చేయాలని SEC ఆదేశం.SEC నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీ, BRS నేతలు.కౌంటింగ్ దగ్గర ఏదైనా ఇబ్బంది అయితే SECకి చేరుకుంటారనే సమాచారంతో బందోబస్తు పెంచిన అధికారులు.ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపుఓట్ల లెక్కింపు కోసం మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం2,981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థులుఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికఈనెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికఅభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్న అధికార, విపక్షాలుకట్టుదిట్టమైన భద్రత: డీజీపీకౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: డీజీపీ శివధర్రెడ్డిలెక్కింపు కేంద్రాల వద్ద 12వేల మంది పోలీసులతో భద్రతపోలీసులతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాలతో నిఘాకమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణకౌంటింగ్ కేంద్రాలకు 200 మీ దూరం వరకు ఆంక్షలుఅన్ని పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలి మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం.. ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం తేలనున్న 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుందా? బీఆర్ఎస్ పట్టునిలుపుకొనేనా? బీజేపీ నిలబడేనా?ఫలితాలపై సర్వత్రా ఆసక్తిమొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు..


