తెలంగాణ మున్సిపోల్స్‌.. సత్తా చాటిన ఎంఐఎం | Aimim Key Wins In Telangana Municipal Corporation Election Results 2026 | Sakshi
Sakshi News home page

తెలంగాణ మున్సిపోల్స్‌.. సత్తా చాటిన ఎంఐఎం

Feb 13 2026 4:43 PM | Updated on Feb 13 2026 5:35 PM

Aimim Key Wins In Telangana Municipal Corporation Election Results 2026

హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీదే పైచేయిగా నిలిచింది. బీఆర్‌ఎస్ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. పలు స్థానాల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM) పార్టీ సత్తా చాటింది. మధ్యాహ్నం 2:00 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం.. ఎంఐఎం పార్టీ వివిధ జిల్లాల్లో పలు వార్డులను కైవసం చేసుకుంది. కాగజ్‌నగర్‌లో వార్డు నంబర్ 3లో ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ ముబీన్ విజయం సాధించారు.

సంగారెడ్డిలో వార్డు నంబర్ 5 నుంచి ఎంఐఎం అభ్యర్థి ఐజాజ్ గెలుపొందగా.. జహీరాబాద్‌లో ఎంఐఎం రెండు స్థానాలను గెలుచుకుంది. జగిత్యాలలో ఎంఐఎం 31, 34 వార్డులను గెలుచుకుంది. మరో రెండు వార్డుల్లో ముందంజలో ఉంది. బాన్సువాడలొ వార్డు నంబర్ 17 నుండి ఎంఐఎం తరపున ఫరా నాజ్ విజయం సాధించారు. వికారాబాద్‌లో వార్డు నంబర్ 4లో ఎంఐఎం అభ్యర్థి షబ్బీర్ హుస్సేన్ గెలిచారు.

నిర్మల్‌లో వార్డు నంబర్ 29 నుండి ఎంఐఎం అభ్యర్థి ముజాహిద్ అలీ విజయం సాధించారు. నారాయణపేలో వార్డు నంబర్ 23లో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ తఖీ చంద్ గెలుపొందారు. కొడంగల్‌లో వార్డు నంబర్ 9 నుంచి ఎంఐఎం అభ్యర్థిని సనా ఆఫ్రీన్ విజయం సాధించారు. కోహీర్‌లో వార్డు నంబర్ 8లో ఎంఐఎం తరపున రఫీ విజయం సాధించారు. భైంసాలో ఎంఐఎం ఇప్పటివరకు 8 వార్డులను గెలుచుకుంది. (స్వతంత్ర అభ్యర్థులు, బీజేపీ రెబల్స్ కూడా 6 వార్డుల్లో గెలిచారు).

బోధన్‌లో
ఎంఐఎం తన ఆధిపత్యాన్ని చాటుతూ ఏకంగా 12 వార్డులను కైవసం చేసుకుంది. రఫీక్((వార్డు-3),  సమీర్ (వార్డు 5), అఖీల్ (వార్డు-7), రఫీ (వార్డు-8), అలీమ్ (వార్డు-12), మీర్ ఇలియాస్ అలీ (వార్డు-18), అన్సారీ కామ్ (వార్డు-27), ముజాహిద్ బాబర్ (వార్డు-28), వలీ (వార్డు-30), అల్తాఫ్ (వార్డు-31), వసీం సుల్తానా (వార్డు-32), ఖైఖషా కౌసర్ (వార్డు- 38) గెలుపొందారు.

నల్గొండలో
నల్గొండలో ఏఐఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించింది. వార్డు నంబర్ 46 నుంచి పట్టణ అధ్యక్షుడు రఫీ ఉద్దీన్ గెలుపొందగా, వార్డు నంబర్ 29 నుంచి నదీమ్ విజయం సాధించారు.

మహబూబ్ నగర్‌లో వార్డ్ నెం.14 నుండి , ఇమ్రాన్ షరీఫ్ గెలిచారు. గద్వాల్‌లో వార్డు నెం. 15 నుంచి మొహమ్మద్ ఇలియాస్‌ గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement