మున్సిపల్‌ ఫలితాలు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హోరాహోరీ విజయాలు | BRS And Congress Win In Municipal Elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఫలితాలు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హోరాహోరీ విజయాలు

Feb 13 2026 10:57 AM | Updated on Feb 13 2026 11:23 AM

BRS And Congress Win In Municipal Elections

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. చిట్యాల, చండూరు, హాలియా, నందికొండ మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.

👉మరోవైపు.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. గడ్డపోతారంలో మొత్తం 18 వార్డులకు గాను 14 చోట్ల బీఆర్‌ఎస్‌, 3 చోట్ల కాంగ్రెస్‌, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక, నందికొండలో 12 వార్డులకు గాను.. 11 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు.. కే. సముద్రం, ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

👉సుల్తానాబాద్‌లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్‌ ఖాతాలో పడింది. మొత్తం 15 వార్డులకు గానూ 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఇతరులు ఒక్కో వార్డును దక్కించుకున్నారు.

👉డోర్నకల్‌లో హస్తం పార్టీ విజయం సాధించింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 15 వార్డుల్లో 10 వార్డులను కాంగ్రెస్‌ దక్కించుకోగా, నాలుగింటిలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.

  • మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. మరిపెడ 15 స్థానాల్లో కాంగ్రెస్‌-8, బీఆర్‌ఎస్‌-6 విజయం సాధించాయి. 

  • చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. చండూరు(10) స్థానాల్లో కాంగ్రెస్‌-7, బీఆర్‌ఎస్‌-2, సీపీఐ-1 విజయం సాధించాయి.

  • చిట్యాల కాంగ్రెస్‌ విజయం చోటుచేసుకుంది. చిట్యాల (12) స్థానాల్లో కాంగ్రెస్‌-9, బీఆర్‌ఎస్‌-2 విజయం. 

  • హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం. హాలియాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్‌-8, బీఆర్‌ఎస్‌-2 విజయం. 

  • గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం. గుమ్మడిదల 22 స్థానాల్లో బీఆర్‌ఎస్‌-14, కాంగ్రెస్-4. బీజేపీ-2 విజయం

  • చొప్పదండి కాంగ్రెస్‌ వశం.. చొప్పదండిలోని 14 స్థానాల్లో కాంగ్రెస్‌-10, బీజేపీ-3, బీఆర్‌ఎస్‌-1 స్థానం విజయం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement