సృష్టి ఫెర్టిలిటీ కేసు.. డాక్టర్ నమృత ‍అరెస్టు | Dr Namrutha arrested in Fertility case | Sakshi
Sakshi News home page

సృష్టి ఫెర్టిలిటీ కేసు.. డాక్టర్ నమృత ‍అరెస్టు

Feb 13 2026 7:28 AM | Updated on Feb 13 2026 9:51 AM

Dr Namrutha arrested in Fertility case

సాక్షి, హైదరాబాద్‌: సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్ నమృతను పోలీసులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గిరిజనుల వద్ద నుంచి బిడ్డలను కోనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టినట్లు నమ్మించిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అయితే డాక్టర్ నమృతపై గతంలో పలు అభియోగాలు నమోదయ్యాయి.  హైదరాబాద్ లో సరోగసీ పేరుతో 'సృష్టి' ఫెర్టిలిటీ సెంటర్‌ చాలా మోసాలు చేస్తోందని గతంలో కేసులు నమోదయ్యాయి. ఐవీఎఫ్‌(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీనికోసం ఏపీలో కొంత మంది ఏఎన్‌ఎం(ANM)ల సహాయం కూడా తీసుకున్నారని  విచారణలో తేలింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని సృష్టి యూనివర్సల్‌ ఫెర్టిలిటీ సెంటర్‌  యజమాని డాక్టర్‌ నమ్రతను జులై 27న పోలీసులు అరెస్టు చేశారు. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఐవీఎఫ్‌(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని. తదితర ఆరోపణలతో డాక్టర్‌ నమ్రతపై కేసులు నమోదు చేశారు.

అంతేకాకుండా డాక్టర్ నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవిద్యను చదివిన ముగ్గురు వైద్యులను  పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలు గతంలో  బెయిల్ పై విడుదలకాగా  ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement