గుజరాత్‌లోనూ నిరసనలు.. అహ్మదాబాద్‌లో ఆందోళనలు ఉధృతం | Student Protests Over Exam Irregularities Reach Gujarat, Demonstrations Held In Ahmedabad, Watch Videos Went Viral | Sakshi
Sakshi News home page

CJP Protests: గుజరాత్‌లోనూ నిరసనలు.. అహ్మదాబాద్‌లో ఆందోళనలు ఉధృతం

Jul 23 2026 11:40 AM | Updated on Jul 23 2026 11:48 AM

CJP Protets Continue In Gujarat Also

అహ్మదాబాద్‌: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు గుజరాత్‌కూ విస్తరించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు అహ్మదాబాద్‌లో నిరసనలకు దిగారు. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

నిరసనకారులు ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీలు నిర్వహిస్తూ తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. భద్రతా దృష్ట్యా అహ్మదాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. సీజేపీ నేతలు మాట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేరే వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, నిరసనలు చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

ఇదిలా ఉండగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సీజేపీ నిరసనలు కొనసాగడం గమనార్హం. బీహార్‌, ఒడిషా, మహారాష్ట్ర, గుజరాత్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో సైతం సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement