breaking news
Gujarat
-
ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. ఎక్కడంటే..!?
ఆ ఊర్లో ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ లాంటి లగ్జరీ కార్లు కనిపిస్తాయి. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 11 బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. వీటిల్లో ఊరి జనమంతా కలిసి 1000 కోట్ల రూపాయలకు పైగా దాచుకున్నారు. జనానికి కావాల్సిన సదుపాలయాన్నీ ఆ ఊరిలో ఉన్నాయి. అయితే ఇదేదో సిటీ అనుకుంటున్నారా? కానేకాదు పక్కా పల్లెటూరు. విలేజ్‌లో ఇంటికో విలాసవంతమైన కారు ఎలా అబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారా? మరి అదే ఆ గ్రామం ప్రత్యేకత.మనం చెప్పుకోబోయే గ్రామం పేరు ధర్మజ్. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉంది. మన దేశంలో అత్యంత ధనిక గ్రామంగా, ఎన్నారై విలేజ్‌గా ఆఫ్ ఇండియాగానూ (NRI Village of India) ప్రసిద్ధికెక్కింది. సగటు పల్లెలకు భిన్నంగా ధర్మజ్ సక్సెస్ సాధించడం వెనుక చాలా పెద్ద ప్రయాణమే ఉంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా సొంతూరిని మరిచిపోకపోకుండా ఉండడమే ఈ ఊరి విజయ రహస్యం. ఇక్కడి నుంచి పలు దేశాలకు వలసవెళ్లిన వారు పంపించిన సొమ్ములతో ధర్మజ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.అలా మొదలైంది..ధర్మజ్ గ్రామ విజయయాత్ర 1895లో మొదలైంది. ఈ గ్రామం మొదటి తరానికి జోతారామ్ కాశీరామ్ పటేల్ చతుర్భాయ్ పటేల్ ఉగాండా దేశానికి వలసవెళ్లి మార్గదర్శకులుగా నిలిచారు. తర్వాత నుంచి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లడం క్రమంగా పెరిగింది. జోతారామ్, చతుర్భాయ్ తర్వాత ప్రభుదాస్ పటేల్ వంటి వారు మాంచెస్టర్‌కు వెళ్లి స్థిరపడ్డారు. గోవింద్ భాయ్ పటేల్ ఒక అడుగు ముందుకేసి యెమెన్‌లోని పోర్ట్‌సిటీ ఆడెన్‌లో పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించారు. ధర్మజ్ నుంచి విదేశాలకు వెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది. ఎంతగా అంటే అక్కడి కుటుంబాల్లో సగానికిపైగా విదేశాల్లోనే ఉండేంతగా. తాజా గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో 1700, అమెరికాలో 800, కెనడాలో 300, ఆస్ట్రేలియా- న్యూజిలాండ్‌లో 150 కుటుంబాలు నివసిస్తున్నట్టు అంచనా. ఆఫ్రికాతో పాటు మిగతా దేశల్లోనూ చాలా కుటుంబాలు ఉన్నాయి.ప్రపంచ దేశాలకు వలస వెళ్లిన వాళ్లంతా తమ మూలాలను మర్చిపోకుండా తమ గ్రామాభివృద్ధి బాటలు వేయడమే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న ప్రవాసులను 2007లో ఏకతాటిపైకి తీసుకువచ్చి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయడంతో ధర్మజ్ (Dharmaj) రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఊరంతా విశాలమైన సిమెంట్ రోడ్లతో పాటు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడింది. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ.. ప్రతి గ్రామస్థుడు పాటించేలా చేస్తున్నారు. యువత, పెద్దల కోసం సువిశాలమైన పార్క్ ఉంది. ఇందులో తక్కువ ధరకే ఈత కొలను, బోటింగ్ చేయొచ్చు. గ్రామంలో పశువుల మేత కోసం ప్రత్యేకంగా 50 బిఘాల భూమిని కేటాయించారు.11 బ్యాంకులు.. వెయ్యి కోట్లు11,333 మంది జనాభాతో 17 హెక్టార్లలో విస్తరించి ధర్మిజ్ గ్రామం ఆర్థిక విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఊరిలోని 11 బ్యాంకుల్లో రూ. 1000 కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయి. 1959, డిసెంబర్ 18న దేనా బ్యాంక్ మొదటి శాఖను ఇక్కడ ప్రారంభమైంది. దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ధర్మజ్ గ్రామ వాసి హెచ్ఎం పటేల్ (HM Patel) వ్యవస్థాపక అధ్యక్షతన 1969, జనవరి 16న గ్రామ సహకార బ్యాంకు ఏర్పాటైంది. విదేశాల్లో స్థిరపడిన ధర్మజ్ వాసులు సొంతూరికి డబ్బులు పంపిస్తుండటంతో ఇక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ బాగా పుంజుకుంది. అలాగే ఊరి ప్రజల జీవనశైలి కూడా మెరుగుపడింది. ధర్మజ్ రోడ్లపై ఇప్పుడు మెర్సిడెస్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు చక్కర్లు కొట్టడం సర్వసాధారణ విషయం. అక్కడ ఇళ్లు కూడా వివిధ దేశాల శైలిని ప్రతిబింబిస్తుంటాయి.గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మ గాంధీ. ఆర్థిక పరిపుష్టి, పౌరుల సంపూర్ణ మద్దతు ఉంటే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయడానికి ధర్మజ్ ప్రత్యక్ష నిదర్శనం. డబ్బులు పంపి చేతులు దులుపుకోవడమమే కాదు ప్రతిఏడాది జన్మభూమికి వస్తుంటారు విదేశాల్లోని ధర్మజ్ వాసులు. ప్రతి సంవత్సరం జనవరి 12న నిర్వహించే ధర్మజ్ దివస్‌కు (Dharmaj Diwas) పెద్దసంఖ్యలో హాజరవుతారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతారు. అనుభూతులను పంచుకుంటారు. అభివృద్ధి గురించి చర్చిస్తారు.ధర్మజ్ అంటే కేవలం డబ్బు ఉన్న గ్రామం మాత్రమే కాదు. గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్ కలిసి ఎంతటి విజయం సాధించగలవో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ.చదవండి: అమెరికాలో ఐదేళ్లలో 100 మంది భారతీయుల మరణం -
ఐడియా అదిరింది.. డబ్బు మిగిలింది!
కలిసివుంటే కలదు అంటుంటారు మన పెద్దలు. దీనికి చాలా ఉదాహరణలు కూడా చెబుతారు. కలిసివుంటే డబ్బు కూడా ఆదా చేయొచ్చు అంటున్నారు గుజరాతీలు. వ్యాపార నిర్వహణ, డబ్బు సంపాదనలో గుజరాతీల ప్రావీణ్యం గురించి ప్రపంచమంతా తెలుసు. ఎక్కడికి వెళ్లినా ఇట్టే కలిసిపోయేతత్వం వారి సొంతం. వర్తకాన్ని ఒడుపుగా నిర్వహించడం, బలమైన సమాజ సంబంధాలతో ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నెగ్గుకొస్తుంటారు. అంతేకాదు తమవారికి దన్నుగా నిలిచి పైకి తీసుకురావడంలో వారికి వారే సాటి. తాజాగా గుజరాత్‌లోని జైన్ సామాజికవర్గం (Jain Community) ఓ ఆసక్తికర విషయంతో వార్తల్లో నిలిచింది.మనం మాంచి కాస్ట్లీ కారు కొనాలంటే ఏం చేస్తాం? దగ్గరలోని కార్ల షోరూంకు (Car Showroom) వెళ్లి మోడల్ సెలెక్ట్ చేసుకుని, రేటు మాట్లాడుకుంటాం. ఓ మంచి ముహూర్తం చూసుకుని కారును ఇంటికి తెచ్చుకుంటాం. గుజరాత్‌లోని జైన్ కమ్యునిటీ వాళ్లు మనలా చేయలేదు. దేశవ్యాప్తంగా ఉన్న తమవాళ్లలో ఎవరెవరు ఖరీదైన కొనాలనుకుంటున్నారో ముందుగా వాకబు చేశారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) ఇలాంటి వారి వివరాలను సేకరించింది. ఎవరెవరికి ఏయే మోడల్ కారు కావాలో తెలుసుకుంది. మొత్తం 186 కొత్త కార్లు లెక్కకువచ్చాయి. ఇందులో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ సహా 15 రకాల టాప్ బ్రాండ్స్ ఉన్నాయి.ఒకేసారి 186 కార్లను కొనుగోలు చేసేందుకు JITO నేరుగా రంగంలోకి దిగింది. ఆయా కార్ల కంపెనీలకు చెందిన డీలర్లతో బేరసారాలు సాగించింది. ఒకేసారి ఎక్కువ కార్లు అమ్ముడవుతుండడంతో విక్రేతలు కూడా మార్కెట్ ధర కంటే తక్కువకు ఇచ్చేందుకు మొగ్గుచూపారు. JITO బేరసారాలతో తమ సభ్యులకు రూ. 21.22 కోట్ల డిస్కౌంట్ లభించింది. రూ. 149.54 కోట్ల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం, వాటన్నింటినీ దేశవ్యాప్తంగా ఒకేరోజు డెలివరీ చేయడం వరకు అంతా పక్కాగా జరిగింది. తామంతా ఐకమత్యంగా ఉండడం వల్లే ఇలాంటివి చేయగలుతున్నామని JITO అపెక్స్ వైస్-చైర్మన్ హిమాన్షు షా తెలిపారు.అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నజైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో దేశవ్యాప్తంగా 65 వేల మంది సభ్యులు ఉన్నారు. సామూహిక కొనుగోలుతో భారీగా లబ్ధిపొందిన JITO తమ సభ్యుల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దేశమంతా తమ సభ్యుల అవసరాలు తెలుసుకుని వారికి కావాల్సిన వాటిని టోకుగా కొని ప్రయోజనం పొందెలా ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆభరణాలు, ఇతర వస్తువుల సామూహిక కొనుగోలుకు రెడీ అవుతోంది.121 జేసీబీలు.. రూ. 4 కోట్లు ఆదాజైన్ కమ్యునిటీ మాత్రమే కాదు భర్వాడ్ సామాజికవర్గం (Bharwad Community) కూడా ఇదేవిధంగా తమ సభ్యులకు ప్రయోజనం చేకూర్చింది. తమ కమ్యునిటీలోని యువత ఉపాధి కోసం గుజరాత్‌లోని భర్వాద్ యువ సంఘటన్ ఇటీవల 121 జేసీబీ యంత్రాల కొనుగోలుకు ముందుకు వచ్చింది. ఆయా వ్యాపార సంస్థలతో బేరాలు సాగించి ఒక్కొ యూనిట్‌కు రూ. 3.3 లక్షల తగ్గింపు పొంది రూ. 4 కోట్లు ఆదా చేసింది. యువత తమ కాళ్లపై తాము నిలబడటానికి తోడ్పాటు అందిస్తున్నామని భర్వాద్ యువ సంఘటన్ అధ్యక్షుడు దిలీప్ భర్వాద్ చెప్పారు. తాము ష్యూరిటీ ఇవ్వడంతో బలమైన క్రెడిట్ స్కోర్లు లేని వారు కూడా పాన్, ఆధార్ ధృవీకరణ ఆధారంగా జీరో డౌన్ పేమెంట్‌తో JCBలను పొందారని వెల్లడించారు.చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్చూశారుగా కలిసి కొంటే ఎంత లాభమో.. అవి లగ్జరీ కార్లు (luxury cars) అయినా, భారీ యంత్రాలు అయినా. సామూహిక కొనుగోలు శక్తితో ఇన్ని ప్రయోజనాలుంటాయని గుజరాత్ కమ్యునిటీలు నిరూపిస్తున్నాయి. సో.. కలిసివుంటే సుఖపడటమే కాదు.. డబ్బు కూడా ఆదా చేయొచ్చు! -
మంత్రిగా టీమిండియా క్రికెటర్ భార్య ప్రమాణ స్వీకారం
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా సోలంకి జడేజా (Rivaba Solanki Jadeja) రాజకీయ జీవితంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్ర మంత్రిగా ఆమె శుక్రవారం (అక్టోబరు 17) ప్రమాణ స్వీకారం చేశారు. కాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మంత్రులంతా గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టగా.. రివాబా జడేజా తాజాగా మంత్రి అయ్యారు.జడేజాతో ప్రేమ, పెళ్లిరివాబా సింగ్ సోలంకి 1990, నవంబరు 2న జన్మించారు. తండ్రి హర్దేవ్ సింగ్ సోలంకి బిజినెస్‌మ్యాన్ కాగా.. తల్లి ప్రఫుల్లాబా సోలంకి భారత రైల్వేస్‌లో ఉద్యోగిని. రాజ్‌కోట్‌లో ఉన్నత విద్యనభ్యసించిన రివాబా.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు.రవీంద్ర జడేజా సోదరి నైనాబాకు రివాబా ఫ్రెండ్. ఓ పార్టీలో నైనా.. తన సోదరుడు రవీంద్ర జడేజాకు రివాబాను పరిచయం చేశారు. అలా జడ్డు- రివాబాల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల సమ్మతితో 2016లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే అంటే.. 2017లో రివాబా- జడ్డూ దంపతులకు కూతురు నిధ్యానా జన్మించింది.సామాజిక సేవపెళ్లికి ముందు నుంచే రివాబా తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారు. రాజ్‌పుత్‌లకు చెందిన కర్ణి సేన మహిళా విభాగానికి ఆమె అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు రివాబా బీజేపీలో చేరారు.ఈ క్రమంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రివాబా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాతృశక్తి అనే చారిటబుల్ ట్రస్టు ద్వారా మహిళా సాధికారికత, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా జడ్డూ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రివాబా.. చిన్న వయసులోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.టీమిండియా అత్యుత్తమ ఆల్రౌండర్సౌరాష్ట్ర స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 87 టెస్టులు, 204 వన్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. ఆయా ఫార్మాట్లలో 3990, 2806, 515 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో 338 టెస్టు వికెట్లు, 231 వన్డే వికెట్లు, 54 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక భార్య రివాబాతో కలిసి జడ్డూ సైతం గతంలోనే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.చదవండి: అఫ్గాన్ చేతిలో వైట్ వాష్.. బంగ్లాదేశ్ క్రికెటర్ల వాహనాలపై దాడి! -
గుజరాత్లో నూతన మంత్రివర్గం కొలువు దీరింది
గాంధీనగర్: గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన క్యాబినెట్ ఏర్పాటు అయింది.ఈ సందర్భంగా 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో గుజరాత్ హోంమంత్రి నేత హర్ష్ రమేష్‌భాయ్ సంఘవీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని లక్షకు పైగా ఓట్లతో ఓడించి ఘన విజయం సాధించారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతున్నారు.కమలం అధిష్టానం క్యాబినెట్లో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చింది. 7 మంది పాటిదార్లు, 8 మంది ఓబీసీలు, 3 మంది ఎస్సీలు, 4 మంది ఎస్టీలు, 3 మంది మహిళా నేతలు ఉన్నారు. కొత్త క్యాబినెట్లో ఎక్కువ మంది కొత్తవారికే అవకాశం లభించింది. గత క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో కేవలం ఆరుగురు మాత్రమే తిరిగి పదవులు చేపట్టారు. #WATCH | BJP MLA Rivaba Jadeja takes oath as Gujarat Cabinet minister in Gandhinagar pic.twitter.com/mJzv53J2C0— ANI (@ANI) October 17, 2025 -
రూ.6,500 కోట్లతో జీహెచ్‌సీఎల్ విస్తరణ
న్యూఢిల్లీ: దేశీయంగా సోడాయాష్ తయారీలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న జీహెచ్‌సీఎల్ రూ.6,500 కోట్లతో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో సోడాయాష్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఆరు నెలల్లో ప్లాంట్ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ ఎండీ ఆర్ఎస్ జలాన్ ప్రకటించారు. ఇది పూర్తయితే సోడాయాష్ తయారీ సామర్థ్యం రెట్టింపై 2.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తికి చేరుకుంటుందని తెలిపారు. 2030 నాటికి 300 గిగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి, ఈ ప్లాంట్ ఏర్పాటు కీలక మద్దతుగా నిలవనుంది. సోలార్ గ్లాస్ తయారీలో సోడాయాష్ ను కీలక ముడి పదార్థంగా వినియోగిస్తుంటారు. ఈ రంగానికి జీహెచ్‌సీఎల్ ముఖ్య సరఫరాదారుగా ఉండడం గమనార్హం. కొత్త ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిలో అధిక భాగాన్ని కొనుగోలు చేసినట్టు, పర్యావరణ అనుమతులు సహా అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేసినట్టు జలాన్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సోడాయాష్ తయారీ సామర్థ్యం 1.2 మిలియన్ టన్నులుగా ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో రెండు దశల్లో కలిపి 1.1 మిలియన్ టన్నుల కొత్త సామర్థ్యం తోడుకానుంది. సోలార్ గ్లాస్ పరిశ్రమ అవసరాలకు.. ముఖ్యంగా సోలార్ గ్లాస్ తయారీ కోసమే రూపొందించిన లార్జ్డెన్స్ సోడాయాష్ ను కొత్త ప్లాంట్‌లో తయారు చేయనున్నట్టు జలాన్ తెలిపారు. ‘‘119 గిగావాట్ల నుంచి 300 గిగావాట్లకు సోలార్ విద్యుదుత్పాదన పెంచుకోవడం అన్నది మాకు పెద్ద మార్కెట్‌ను కల్పించనుంది. గణనీయమైన సామర్థ్యంతో డెన్స్ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. కనుక మాకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నాయి’’అని వివరించారు. పర్యావరణ అనుకూలమైన, అధిక ఇంధన సామర్థ్యంతో, అత్యాధునిక సాంకేతికతకు ఈ ప్లాంట్ నిర్మాణంలో వినియోగిస్తున్నట్టు తెలిపారు. కంపెనీ వద్ద రూ.1,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని.. రుణం, ఈక్విటీ జారీ రూపంలో మిగిలిన నిధులను సుమకూర్చుకోనున్నట్టు చెప్పారు. మొత్తం మీద రుణ భారం ఈక్విటీలో 0.6–0.7 రెట్లు మించదన్నారు. ప్రస్తుతం కంపెనీకి ఎలాంటి రుణ భారం లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశ అవసరాల్లో 20 శాతం మేర సోడాయాష్ ను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా సోడాయాష్ తయారీలో చైనా వాటా 45 శాతంగా ఉంది. భారత్‌లోకి చౌకగా సోడాయాష్ ను పంపిస్తుండడంతో ఇక్కడి పరిశ్రమల మార్జిన్లపై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌సీఎల్ కొత్త ప్లాంట్‌తో ముందుకు వెళుతోంది. -
గుజరాత్లో కీలక పరిణామం.. మంత్రులంతా రాజీనామా
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. "ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారు" అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్త వారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు. -
పోస్టుకార్డులతో గిన్నిస్ బుక్ రికార్డు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గుజరాత్ సహకార రంగానికి సంంధించిన ప్రజలు ఏకంగా 1.11 కోట్లకుపైగా లేఖలు రాశారు. పోస్టుకార్డులు పంపించారు. ఒకేసారి ఒకే వ్యక్తికి భారీసంఖ్యలో పోస్టుకార్డులు రాయడం గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులోకి చేరిందని అధికారులు బుధవారం చెప్పారు. జీఎస్టీ సంస్కరణతోపాటు ఇతర చర్యలు చేపట్టినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,11,75,000 పోస్టుకార్డులు పంపించడం గమనార్హం. ఈ అరుదైన ఘట్టాన్ని గిన్నిస్‌బుక్ ప్రపంచ రికార్డు ప్రతినిధులు గుర్తించారు. ఆయా పోస్టుకార్డులను లెక్కించారు. ప్రపంచ రికార్డు సృష్టించినట్లుగా సంబంధిత ధ్రువపత్రాన్ని మంగళవారం అధికారులకు అందజేశారు. ఇప్పటిదాకా 6,666 పోస్టుకార్డులే అతిపెద్ద రికార్డు. గతంలో స్విట్లర్లాండ్లో ఈ ఘనత సాధించారు. ఈ రికార్డును గుజరాత్ ప్రజలు తిరగరాశారు. -
అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!
కొన్ని సక్సెస్ స్టోరీలు ఎంతలా ప్రేరేపిస్తాయంటే.. జీరో నుంచి మిలియనీర్‌గా అవతరించడం ఎలా అనేది నేర్పిస్తాయి. తాతల తండ్రులు కాస్త సంపాదించే పెడితే కదా జీవితం బాగుండేది..మంచి చదువులు చదవగలిగేది అనుకుంటారు చాలామంది. అవన్నీ సాధించడం చేతకాని వాడు చెప్పే చెత్తకబుర్లే అవి పలువురు విజేతలు ప్రూవ్ చేశారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ వ్యక్తి. అతడికి ఎలాంటి వ్యాపార సామ్రాజ్య వారసత్వం లేకపోయినా.. కేవలం తనపై ఉన్న అచంచలమైన నమ్మకం, పట్టుదలతో కుభేరులు అవ్వొచ్చని చూపించి..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.అతడే గుజరాత్‌కి చెందిన పంకజ్ రామన్‌భాయ్ పటేల్(Pankaj Ramanbhai Patel). కోటీశ్వరుడి కావాలంటే వారసత్వం, వ్యాపార సామ్రాజ్యం ఉండాల్సిన పనిలేదంటాడు పటేల్. ఆయన సంపదలో గౌతమ్ అదానీ తర్వాత రెండో అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కాడు. ఆయన సంపద విలువ అక్షరాల రూ. 84,510 కోట్లు. ఆయన ఓ సాదాసీదా కంపెనీలో జాయిన్ అయ్యి..దాన్ని లాభాల బాట పట్టించి.. నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడమే కాదు దానికే నాయకత్వం వహించే రేంజ్‌కి వచ్చాడు. ఫార్మసి, లైఫ్సైన్సు అండ్ లాలో డిగ్రీలు చేసిన ఆయన..తరుచు ఏం చేయాలి,..ఏంటి లక్ష్యం అని ఆలోచిస్తుండేవాడు. అలా కాడిలా హెల్త్‌కేర్ అనే ఒక చిన్న కంపెనీలో చేరాడు. ఆయన ఉద్యోగిగా మొదలైనప్పుడూ ఆ కంపెనీ చాలా సాదాసీదా కంపెనీ. అయితే పంకజ్ పర్యవేక్షణలో శరవేగంగా అభివృద్ధి బాటలో పయనించి..కాడిలా జైడస్ లైఫ్సైన్సెస్గా పరిణామం చెందింది. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలోనే ఆయన పేరు బయటకొచ్చింది..ఆయన ఎదుగుదలను కూడా అత్యంత నిరాడంబరంగానే ఉంటుంది. ఎక్కడ ఎలాంటి పబ్లిసిటీలకు చోటివ్వరాయన. కోవిడ్ సమయంలోనే ఆయన పేరు బయటకొచ్చింది. అప్పటి దాక ఏ సరికొత్త టీకాలు లేదా ఔషధాల ఆవిష్కరణకు విదేశాల ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండేది. కానీ ఆ కష్ట సమయంలో జైడస్ భారతదేశంలో మొట్టమొదటి DNA-ఆధారిత COVID-19 వ్యాక్సిన్ అయిన జైడస్ జైకోవి-డిని అభివృద్ధి చేసి..అతిపెద్ద శాస్త్రీయ విజయం అందుకుంది. పైగా దీనికి విదేశీ ధ్రువీకరణతో పనిలేదంటూ ఓ సరికొత్త మైలురాయిని సాధించింది. ఇక పంకజ్ వ్యక్తిగతం జీవితం దగ్గరకి వచ్చేటప్పటికీ..ఆయన ప్రీతి పటేల్‌ని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆయన కుమారుడు డాక్టర్ షార్విల్ పటేల్ ఆ కంపెనీలోనే మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇక కూతురు శివాని కూడా అన్న బాటలో పయనిస్తున్నారు. ఇక 2003లో పంకజ్ పటేల్‌కు ఉత్తమ ఫార్మా మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు లభించింది. ఈ గుర్తింపుని సైతం ఆయన నిశబ్దంగానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక పంకజ్ వృద్ధి అనేది మంచితన లేకుండా సాధ్యం కాదని గట్టిగా నమ్ముతారు. ఆ నేపథ్యంలోనే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి తనవంతుగా సహాయ సహకారాలు అందించారు. అహ్మదాబాద్‌లో ఉండే ఇల్లు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అత్యంత సాదాసీదా ఉంటుంది . ఆయన ఎప్పుడు చెప్పేది ఒక్కటే..నిలకడగా ఉండటం అలవర్చుకుంటే..ఏదైనా సాధించొచ్చు అని. ఒకటి అనుకుని ఇంకొకటి చేస్తూ..అస్థిర మనసుతో ఉంటే.. ఏం సాధించలేం అని సదా చెబుతుంటారాయన. ఏపనైనా ఎంచుకునేటప్పుడూ..వందశాతం కచ్చితత్వం, స్తిరత్వంతో(నిలకతో) చేయాలి. అప్పుడు ఎలాంటి రంగంలోనైనా మంచి విజయాన్ని అందుకుంటామని నొక్కి చెబుతున్నారు పంకజ్ రామన్‌భాయ్ పటేల్. (చదవండి: Sherry Singh: భారత్‌కు తొలిసారి మిసెస్ యూనివర్స్ కిరీటం.. భార్యగా, తల్లిగా ఆమె చరిత్ర..) -
గుజరాత్ నుంచి 40 రోజులు : అయోధ్యకు నడిచొచ్చిన వృద్ధుడు
అయోధ్య: శ్రీరాముడిపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు గుజరాత్‌లోని మెహసనా నుంచి కాలినడకన బయలుదేరి 1,338 కిలోమీటర్ల దూరంలోని యూపీలోని అయోధ్య క్షేత్రానికి 40 రోజుల్లో గురువారం చేరుకున్నారు. అయోధ్యకు (Ayodhya) నడిచి వెళ్లాలనే మూడు దశాబ్దాలనాటి సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు. మెహసనా జిల్లా మోదీపూర్ గ్రామానికి చెందిన జయంతీలాల్ హర్జీవన్దాస్ పటేల్ (Jayantilal Harjivandas Patel) 1990లో బీజేపీ అగ్ర నేత ఎల్కే అడ్వాణీ చేపట్టిన సోమ్‌నాథ్–అయోధ్య రథయాత్రను స్ఫూర్తిగా తీసుకున్నారు. అప్పట్లో గుజరాత్‌లోని జరిగిన ఆ యాత్రలో జయంతీలాల్ పటేల్ పాల్గొన్నారు కూడా. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కూడా జరగడంతో తన కల నెరవేర్చుకునే సమయం వచ్చిందని భావించారాయన. ఆ మేరకు తన యాత్రను ఆగస్ట్ 30వ తేదీన స్వగ్రామం నుంచి ప్రారంభించారు. రోజుకు 33–35 మేర నడుస్తూ, రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకున్నారు. మార్గమధ్యంలోని ఆలయాలు, పబ్లిక్ పార్కులు, అతిథి గృహాల్లో విరామమిచ్చేవారు. కుటుంబసభ్యులు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవడంతోపాటు, ఆ మార్గంలో తర్వాతి స్టాప్ ఏమిటో తెలియజేస్తుండే వారు. అయోధ్యకు చేరుకున్న జయంతీలాల్ కరసేవక్‌పురంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌ను కలుసుకున్నారని ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా! View this post on Instagram A post shared by Ahmedabad Mirror (@ahmedabadmirrorofficial) -
భారత్ దెబ్బకు విండీస్ ఢాం!
అహ్మదాబాద్: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టులో ఎలాంటి సందేహం లేకుండా ఊహించిన ఫలితమే వచి్చంది. మ్యాచ్ పూర్తిగా మూడు రోజులు కూడా సాగలేదు. శనివారం ముగిసిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్దే డిక్లేర్ చేసింది. 286 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విండీస్ ఈ సారి కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. 45.1 ఓవర్లలో 146 పరుగులకే విండీస్ ఆలౌటైంది. భారత బౌలర్ల దెబ్బకు శనివారం కనీసం రెండు సెషన్లు కూడా ఆడకుండానే విండీస్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో సరిగ్గా ఒక్క ఓవర్ మాత్రమే ఆ జట్టు అదనంగా ఆడగలిగింది. అలిక్ అతనజె (74 బంతుల్లో 38; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒక దశలో జట్టు 46 పరుగులకే సగం వికెట్లు కోల్పోగా...అతనజె, గ్రీవ్స్ (25) ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించి కొద్ది సేపు ప్రతిఘటించారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా, సిరాజ్‌కు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌లో సెంచరీ కూడా నమోదు చేసిన జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేయగా... ఈ నెల 10 నుంచి న్యూఢిల్లీలో రెండో టెస్టు జరుగుతుంది. స్కోరు వివరాలువెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 162; భారత్ తొలి ఇన్నింగ్స్ 448/5 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) సుదర్శన్ (బి) జడేజా 14; చందర్‌పాల్ (సి) నితీశ్ (బి) సిరాజ్ 8; అతనజె (సి) అండ్ (బి) సుందర్ 38; కింగ్ (సి) రాహుల్ (బి) జడేజా 5; ఛేజ్ (బి) కుల్దీప్ 1; హోప్ (సి) జైస్వాల్ (బి) జడేజా 1; గ్రీవ్స్ (ఎల్బీ) (బి) సిరాజ్ 25; పైర్ (నాటౌట్) 13; వారికన్ (సి) గిల్ (బి) సిరాజ్ 0; లేన్ (సి) సిరాజ్ (బి) జడేజా 14; సీల్స్ (సి) అండ్ (బి) కుల్దీప్ 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–12, 2–24, 3–34, 4–35, 5–46, 6–92, 7–98, 8–98, 9–122, 10–146. బౌలింగ్: బుమ్రా 6–1–16–0, సిరాజ్ 11–2–31–3, జడేజా 13–3–54–4, కుల్దీప్ 8.1–3–23–2, సుందర్ 7–1–18–1. -
నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..
ఇప్పుడు బనానా ఏఐ నయా ట్రెండ్‌తో ఏది రియల్, ఏది ఫేక్ పోటో/వీడియోనో గుర్తించడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లు నమ్మశక్యం కానీ గందరగోళానికి గురిచేసింది. అందులోనూ శరన్నవరాత్రుల సమయంలో ఇలాంటి కమనీయ దృశ్యం కంటపడితే..దుర్గమ మహిమ లేక ఇది నమ్మదగినది కాదో అన్న సందేహాలను లేవనెత్తింది భక్తుల్లో. చివరికి అది ఫేక్ కాదని తేలాక..ఒక్కసారిగా 'మా దుర్గ' అన్న నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఇంతకీ ఏంటా అపురూపమైన దృశ్యం అంటే..ఒక దుర్గమ్మ ఆలయం వెలుపల కాపలా కాస్తున్న సింహం వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మొదట చూడగానే అందరూ ఏఐ మాయ అనుకున్నారు. కానీ దాని గురించి సాక్షాత్తు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ షేర్ చేయడంతో అది రియల్ అని నమ్మారు. ఆ దైవిక దృశ్యం చూడటం అదృష్టం అన్నంతగా బావించారు నెటిజన్లు. ఒక్కసారిగా నెట్టింట ఆ ఆలయానికి ఆ సింహం రక్షణగా ఉందేమో అనే చర్చలు లేవనెత్తాయి. అయితే ఇది గిర్ అడవిలోనిదని, అక్కడ చాలా దుర్గమ్మ ఆలయాలు ఉన్నాయని, వాటికి కాపలాగా ఈ సింహలు ఉంటాయని ఓ నెటిజన్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు గిర్ అటవీ ప్రాంతంలో తిరిగే ఈ సింహాలు మానవులపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువేనని అన్నారు. అవి గుజరాత్‌లోని సౌరాష్ట్రా ప్రాంతంలో కనిపించే అరుదైన సింహ జాతిగా అని పేర్కొనన్నారు నెటిజన్లు. ఇక ఆ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలకు ఆ వన్య ప్రాణులకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఆ వీడియో హైలెట్ చేస్తోందని అన్నారు. కాగా, భారతదేశంలో సింహాల జనాభా 2020లో 674 కాగా, 2025 కల్లా 891కి చేరుకుంది. అంటే 70 శాతంపైగా సింహాల సంఖ్య పెరిగిందని ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.What a divine sight. Look like that lioness is guarding the temple !! pic.twitter.com/bBlxlmKD4m— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 28, 2025 (చదవండి: అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..! మతసామరస్యాన్ని ప్రతీకగా..) -
దసరా వేడుకల్లో హద్దుమీరిన జంట.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ నృత్యాలు, అమ్మవారి అవతారాలకు ప్రత్యేక పూజలు, రావణ దహనం.. ఇలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఎన్నారై జంట చేసిన పాడు పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ప్రధానంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో హైలైట్ అవుతుంటుంది. ఇది దేవీ దుర్గాను ఆరాధిస్తూ.. వృత్తాకారంగా(సర్కిల్) నృత్యం చేస్తుంటారు. గర్భా నృత్యం భక్తి, ఉత్సాహం, సామూహిక ఆనందాన్ని ప్రతిబింబించే కళారూపం. అలాంటి నృత్యంలో పాల్గొన్న ఓ జంట ముద్దులతో నలుగురిలో హద్దులు దాటేసింది.గుజరాత్ వడోదరలో జరిగిన గర్బా వేడుకలో ఓ ఎన్నారై జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యునైటెడ్ వే గర్భా పేరిట నిర్వహించిన వేడుకల్లో.. ప్రతీక్ పటేల్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గర్భా చేస్తూ అత్యుత్సాహంలో ముద్దులు పెట్టుకున్న వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. అది కాస్త వైరల్ కావడంతో సనాతన్ సంత్ సమితి తీవ్రంగా స్పందించింది. ధార్మిక భావాలను దెబ్బతీశారంటూ ఆ జంటపై అటలదారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయ్యింది. అయితే విమర్శల నేపథ్యంలో ఆ జంట స్పందించింది. చేసిన పనికి లిఖితపూర్వక క్షమాపణ ఇచ్చింది. ఇది మా తప్పే. ఇంతలా విమర్శలు వస్తాయని అనుకోలేదు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గత 16 సంవత్సరాలు ప్రతీక్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తాజా వీడియోపై విమర్శల నేపథ్యంలో ఆ జంట దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.The NRI couple has issued a formal apology after their kissing video at a Garba event in Vadodara went viral.The couple were called to the police station, they are Australian nationals of Indian origin. They issued a written apology.#GarbaControversypic.twitter.com/GiaLSsLY6V— ShingChana😯 (@BaanwraDil) September 28, 2025 -
ఏపీ మీదుగా కొత్త ఒడిశా-గుజరాత్ ‘అమృత్ భారత్’... స్టాప్స్ ఇవే..
భువనేశ్వర్: ఒడిశాలోని బెర్హంపూర్ (బ్రహ్మపూర్) నుండి గుజరాత్‌లోని ఉధ్నా (సూరత్) వరకు నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైలు వివిధ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని అందించడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, నూతన ఉద్యోగాలను సృష్టించనుంది.ఈ ఒడిశా-గుజరాత్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ,గుజరాత్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 09022) సెప్టెంబర్ 27న 12:00 గంటలకు బ్రహ్మపూర్ నుండి బయలుదేరి మరుసటి రోజు 21:00 గంటలకు ఉధ్నా (సూరత్) చేరుకుంటుంది. ఈ రైలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్‌లోని కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాల మీదుగా వెళుతుంది. ఖనిజ, వస్త్ర, వాణిజ్య కేంద్రాలను కలుపుతుంది.ఒడిశా-గుజరాత్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన స్టాప్లుపలాస, విజయనగరం, రాయగడ, టిట్లాగఢ్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, భుసావల్, నందూర్బార్మరికొన్ని స్టాప్లుశ్రీకాకుళం, బొబ్బిలి, పార్వతీపురం, సుంగర్పూర్ రోడ్, మునిగూడ, కేసింగ, కాంతబంజి, ఖరియార్ రోడ్, మహాసముంద్, లఖోలి, దుర్గ్, గోండియా, వార్ధా, బద్నేరా, అకోలా, మల్కాపూర్, జల్గావ్, ధరన్‌గావ్, అమల్నేర్, సింధ్‌ఖేడా, దొండాయిచా, నవాపూర్, నవాపూర్, వ్యారా, బార్డోలి.రైలు ఫీచర్లు ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉన్నాయి. సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు ఆధునిక ఆన్‌బోర్డ్ సౌకర్యాలున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన 22 కోచ్‌లను ఏర్పాటు చేశారు. 11 జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు , ఎనిమిది స్లీపర్ క్లాస్ కోచ్‌లు , రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ వ్యాన్లు, ఒక ప్యాంట్రీ కార్ ఉంది. -
ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్‌లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్‌షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్‌ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్‌గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్‌తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్‌తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్‌కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్‌గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్‌లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్‌లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్‌లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్‌తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. -
తాతకు నివాళిగా పోస్ట్...హత్యకు దారి తీసిన ‘లాఫింగ్’ ఇమేజ్
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఫేస్బుక్ పోస్ట్ ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 20 ఏళ్ల యువకుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. బాధితుడిని బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌మీడియాలో పాటించాల్సిన కనీస మర్యాద, సభ్యత, సంస్కారాలకు నిదర్శనం ఈ ఘటన.20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ బీహార్‌కు చెందినవాడు. మరో ముగ్గురు బంధువులతో కలిసి గుజరాత్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నాలుగు నెలల క్రితం కాలం చేసిన తన తాత రూప్నారాయణ్ భింద్ను గుర్తుచేసుకుంటూ ఫేస్బుక్లో ఒక కథనాన్ని అప్లోడ్ చేశాడు ప్రిన్స్. అయితే బీహార్‌కు చెందిన ప్రిన్స్ పరిచయస్తుడు బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ అనుచితంగా రియాక్టయ్యాడు. ప్రిన్స్ పోస్ట్‌కు నవ్వుతున్న ఎమోజీతో పోస్ట్ చేశాడు. ఇదే ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది.మొల్లగా ఫోన్లోమొదలైనఘర్షణ ముదిరి భౌతిక దాడికి దారి తీసింది.ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) ప్రకారం, సెప్టెంబర్ 12 రాత్రి, 12:30 గంటల ప్రాంతంలో, ప్రిన్స్ తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ వెలుపల ఆటో రిక్షాలో కూర్చుని బిపిన్ దాడిచేశాడు. దీంతో ప్రిన్స్ ఫ్యాక్టరీ లోపలికి తిరిగి వెళ్లిపోయాడు. కానీ మరో నిందితుడు బ్రిజేష్ గోండ్ అడ్డుకున్నాడు. చంపేస్తానని బెదిరించాడు. ఇంతలో, బిపిన్ ప్రిన్స్‌ను కత్తితో పొడిచాడు. ప్రిన్స్ అరుపులు విన్న అతని సహచరులు వెంటనే అతనికి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆపై రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాలుగు రోజులకు పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి తరలించారు. గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో సెప్టెంబర్ 22నకన్నుమూశాడు. చనిపోవడానికి ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.చదవండి: మిలన్ ఫ్యాషన్‌వీక్ : రొటీన్‌గా కాకుండా బోల్డ్ లుక్‌లో మెరిసిన ఆలియాప్రిన్స్ వీపుపై అంగుళంన్నర, రెండు అంగుళాల లోతు గాయం ఉందని పోలీసులు తెలిపారు. బాధితుడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు కీలక నిందితుడిని అరెస్టు చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు. -
United States: గుజరాతీ మహిళ హత్యకేసులో యువకుని అరెస్ట్
దక్షిణ కరోలినా: దక్షిణ కరోలినాలో గుజరాతీ మహిళ హత్య కేసులో ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 16న గుజరాతీ మహిళ కిరణ్ పటేల్ మరణానికి దారితీసిన కాల్పుల సంఘటనతో సహా రెండు కాల్పుల సంఘటనలలో ప్రమేయం ఉన్న జైడాన్ మాక్ హిల్ (21)ను పోలీసులు అరెస్టు చేశారు.సెప్టెంబర్ 16న దక్షిణ కరోలినాలోని యూనియన్ కౌంటీలోని సౌత్ మౌంటైన్ స్ట్రీట్‌లోని ఒక యార్డ్‌లో చార్లెస్ నాథన్ క్రాస్బీ(67) అనే వృద్దుడిని మృతిచెందిన స్థితిలో పోలీసులు గుర్తించారు. ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం అదే రోజు సాయంత్రం, కిరణ్ పటేల్ (49) పై డీడీస్ ఫుడ్ మార్ట్ పార్కింగ్ స్థలంలో కాల్పులు జరిగాయి. ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందింది. గో ఫండ్‌మీ పేజీలోని వివరాల ప్రకారం ఈ ఘటన సెప్టెంబర్ 16న రాత్రి 10:30 గంటలకు జరిగింది. ఆ సమయంలో కిరణ్ పటేల్ యూనియన్ కౌంటీలో గ్యాస్ స్టేషన్-కమ్-కన్వీనియన్స్ స్టోర్ రిజిస్టర్ వద్ద నగదు లెక్కిస్తున్నారు. హిల్ ఆమె వద్దకు వచ్చి, క్యాష్ రిజిస్టర్ లాక్కున్నాడు. ఆమె అతనికి నగదు ఇచ్చేలోపుగానే అతను కిరణ్ పటేల్‌పై కాల్పులు జరిపాడు.అతనిని అడ్డుకునేందుకు కిరణ్ పటేల్ అతనిపైకి ప్లాస్టిక్ బాటిల్ విసిరి పరిగెత్తింది. హిల్ కూడా ఆమె వెంట పరిగెత్తాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు పార్కింగ్ స్థలం వైపు పరిగెత్తిన కిరణ్ పటేల్ పై హిల్ కాల్పులు కొనసాగించాడు. ఆమెకు బుల్లెట్ తగిలి, తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. తరువాత అతను ఆమె దగ్గరకు వచ్చి మరోమారు కాల్పులు జరిపాడు. కేసు దర్యాప్తు చేపట్టిన సౌత్ కరోలినా లా ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ అధికారులు అరెస్ట్ వారెంట్‌తో సౌత్ చర్చి స్ట్రీట్‌లోని హిల్ ఇంటికి చేరుకున్నారు. అయితే హిల్ వారిని ప్రతిఘటించాడు. ఎట్టకేలకు పోలీసులు హిల్‌ను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పరాదీనతే ప్రబల శత్రువు
భావ్‌నగర్(గుజరాత్): హెచ్–1బీ వీసాల దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయుల నెత్తిన భారీ పిడుగు పడేసిన నేపథ్యంలో భారత ప్రధాని మోదీ హితబోధ ధోరణిలో స్పందించారు. శనివారం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రూ.34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి తర్వాత ‘సముద్రం నుంచి సమృద్ధిదాకా’కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘విశ్వబంధు భావనతో భారత్ దూసుకుపోతోంది. అందరితో మిత్రత్వం, సత్సంబంధాలు కోరుకునే, కొనసాగించే భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేకంగా శత్రువంటూ ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ఇతర దేశాలపై ఆధారపడటం అనే వైఖరి మనకు పెద్ద శత్రువులా తయారైంది. ఇలా మనపై పైచేయి సాధిస్తున్న పరా«దీనతను మనందరం కలసికట్టుగా ఓడిద్దాం. విదేశాలపై అతిగా ఆధారపడితే అంతగా స్వదేశం విఫలమవుతుంది. విశ్వశాంతి, శ్రేయస్సు, సుస్థిరత కోసం పాటుపడే దేశం కచి్చతంగా స్వయంసమృద్ధిని సాధించాలి. స్వావలంబన సాధించకుండా ఇతర దేశాలపై ఆధారపడితే జాతీయ ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది’’అని మోదీ అన్నారు. 140 కోట్ల ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టబోం ‘‘140 కోట్ల ప్రజల భవిష్యత్తును విదేశీ శక్తుల చేతుల్లో పెట్టబోం. విదేశీ పరా«దీనత అనేది మన జాతీయాభివృద్ధిని నిర్దేశిస్తుందంటే అస్సలు అంగీకరించబోం. మన భావితరాల భవిష్యత్తును ఇతరుల చేతికి అందించబోం. ఏకంగా 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇతర దేశాలపై ఆధారపడితే జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే లెక్క. ఒక సామెతలాగా చెప్పాలంటే 100 సమస్యలకు ఒకే పరిష్కారం ఉన్నట్లు.. భారత్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. అదే ఆత్మనిర్భరత’’అని మోదీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌పై మళ్లీ విమర్శల నిప్పులు పనిలోపనిగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీలపై, గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ‘‘భారత్‌లో నిగూఢంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నాలు స్వాతంత్య్రం వచ్చాక ఆరేడు దశాబ్దాలదాకా జరగనేలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెంచిపోషించిన లైసెన్స్‌రాజ్ వ్యవస్థలో దేశాభివృద్ధి పడకేసింది. లైసెన్స్–కోటా రాజ్యంలో భారత్ విశ్వవిపణిలోకి అడుగుపెట్టలేక ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తర్వాత ప్రపంచీకరణ శకం మొదలైనప్పుడు గత ప్రభుత్వాలు తప్పిదాలే చేశాయి. దేశావసరాలు తీర్చుకునేందుకు స్వావలంబన సాధించాల్సిందిపోయి కేవలం దిగుమతులపైనే దృష్టిపెట్టాయి. దీంతో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు సర్వసాధారణమయ్యాయి. తప్పుడు విధానపర నిర్ణయాల కారణంగా ప్రభ కోల్పోయిన రంగాల్లో నౌకల తయారీ పరిశ్రమ కీలకమైంది. గతంలో భారతీయ తయారీ నౌకలనే మనం ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు విదేశాలపై ఆధారపడుతున్నాం. అప్పట్లో ఎగుమతిదిగుమతి సరుకుల్లో 40 శాతం భారతీయ నౌకల్లో జరిగేవి. ఇప్పుడు కేవలం 5 శాతం నౌకల్లో జరుగుతోంది. మిగతావన్నీ విదేశీ నౌకలే. అందుకే ఏటా ఏకంగా రూ.6 లక్షల కోట్లను వినియోగ ఖర్చుల కింద విదేశీ నౌకల కంపెనీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఏడు దశాబ్దాల్లో ఎంత చెల్లించామో లెక్కేసుకోండి. ఇంత సొమ్ము విదేశాలకు వెళ్లడంతో ఆయా దేశాల్లో ఉపాధి పెరిగింది. ఇదే సొమ్ములో కొంత అయినా దేశీయంగా పెట్టుబడిగా మార్చి ఉంటే ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగేవో ఊహించుకోండి. దేశీయ నౌకలనే వినియోగించి ఉంటే ఏటా భారత్ లక్షల కోట్ల ఆదాయాన్ని చవిచూసేది’’అని మోదీ వివరించారు. షిప్ అయినా చిప్ అయినా ఇక్కడిదై ఉండాలిచిప్(సెమీకండక్టర్) కావొచ్చు షిప్ కావొచ్చు. ఏదైనా భారత్‌లోనే తయారుకావాలి. వాటిని మనమే తయారుచేద్దాం. సముద్రవిపణిలో అగ్రగామిగా మారితే అంతర్జాతీయంగా పరపతి ఇనుమడిస్తుంది. ఇందుకు దేశీయనౌకాశ్రయాలే వెన్నుముక. దేశీయ సముద్రనౌకారంగం నవతరం సంస్కరణల దిశగా దూసుకుపోతోంది. పలు రకాల డాక్యుమెంట్లు, పత్రాల సమర్పణ, తనిఖీ వంటి సుదీర్ఘ ప్రక్రియకు దేశంలోని అన్ని ప్రధాన నౌకాశ్రయాల్లో చెల్లుచీటీ రాసేశాం. దీంతో ఒకే దేశం–ఒకే డాక్యుమెంట్, ఒకే దేశం–ఒకే నౌకాశ్రయం విధానంలో వాణిజ్యం, వ్యాపారం సులభతరమవుతుంది’’అని అన్నారు. రుణాలు ఇక సులువు ‘‘నౌకల తయారీ సంస్థలకు ఇప్పుడు సులభంగా రుణాలు లభిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంక్‌ల నుంచి రుణాలను పొందగల్గుతున్నాయి. మౌలికవసతుల ఫైనాన్సింగ్ సదుపాయం ఇప్పుడు అన్ని నౌకలతయారీ సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. మరో మూడు కీలక పథకాలపై ఎన్డీఏ సర్కార్ దృష్టిసారించింది. భారత్‌ను సముద్రయాన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. రుణలభ్యతతో నూతన సాంకేతికత, ఆధునిక డిజైన్, అత్యున్నత ప్రమాణాలను సంస్థలు అందిపుచ్చుకుంటాయి. త్వరలో ఈ రంగంలో ప్రభుత్వం రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది’’అని మోదీ అన్నారు. కార్యక్రమాల్లో భాగంగా రూ.7,870 కోట్ల విలువైన సముద్రయానసంబంధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. వీటికితోడు గుజరాత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోయే రూ.26,354 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ మోదీ పాల్గొన్నారు. అహ్మదాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామికప్రాంతమైన ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌లో హెలికాప్టర్లో విహంగవీక్షణం చేశారు. అహ్మదాబాద్‌లోని లోథల్‌లో భారతీయ సముద్రయాన వారసత్వాన్ని చాటే నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణపనులనూ మోదీ పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన భావ్‌నగర్‌కు చేరుకోగానే రోడ్‌షోలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ విధానాలతో యువతకు హాని: ప్రధాని మోదీ
గాంధీనగర్: ‘భారతదేశంలో సామర్థ్యానికి ఎప్పుడూ కొరత లేదు. అయితే కాంగ్రెస్ దేశ సామర్థ్యాన్ని విస్మరించింది. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన ఆరు నుండి ఏడు దశాబ్దాల తర్వాత కూడా భారతదేశం నిజంగా దక్కించుకోవలసినది సాధించలేకపోయింది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.. చాలా కాలం పాటు కాంగ్రెస్ దేశాన్ని లైసెన్స్ రాజ్‌లో బంధించి, ప్రపంచ మార్కెట్ల నుండి ఒంటరిగా ఉంచింది. తరువాత.. ప్రపంచీకరణ యుగం ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ కేవలం దిగుమతుల మార్గాన్ని అనుసరించింది. అప్పుడు కూడా వేల కోట్ల విలువైన కుంభకోణాలకు పాల్పడింది. ఇటువంటి విధానాలతో కాంగ్రెస్ మన దేశ యువతకు తీవ్ర హాని కలిగించింది’ అని ప్రధాని మోదీ అన్నారు. #WATCH | Gujarat | Addressing a public rally in Bhavnagar, PM Modi asks officials to collect the paintings prepared by children, brought for him as a gift (Source: ANI/DD) pic.twitter.com/lG733mAkVK— ANI (@ANI) September 20, 2025ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన సొంత రాష్ట్రం గుజరాత్లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్లో మౌలిక సదుపాయాలు, సముద్ర రంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టి రూ.34,200 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి భావ్‌నగర్‌లో జరిగిన సభలో ప్రసంగించారు. #WATCH | Gujarat | PM Modi addresses a public rally in Bhavnagar(Source: ANI/DD) pic.twitter.com/34Hv7AbNzG— ANI (@ANI) September 20, 2025‘నా పుట్టినరోజున శుభాకాంక్షలు పంపిన దేశవిదేశీయులందరికీ కృతజ్ఞతలు. విశ్వకర్మ జయంతి నుండి గాంధీ జయంతి వరకు, దేశవ్యాప్తంగా సేవా పఖ్వాడాను జరుపుకుంటున్నారు. గత మూడు రోజుల్లో సేవా పఖ్వాడా కింద పలు కార్యక్రమాలు జరిగాయి. గుజరాత్లో ఇప్పటివరకు రక్తదాన శిబిరాల్లో లక్ష మంది రక్తదానం చేశారు. అనేక నగరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో 30 వేలకు మించిన ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. నవరాత్రి పండుగ ప్రారంభం కానున్న సమయంలో నేను భావ్‌నగర్‌కు వచ్చాను. ఈసారి జీఎస్టీ తగ్గింపు కారణంగా మార్కెట్లు మరింత ఉత్సాహంగా ఉంటాయని భావిస్తున్నాను. #WATCH | Bhavnagar, Gujarat | PM Modi inaugurates and lays the foundation stone of multiple development projects worth over Rs 34,200 crore, including 'Samudra Se Samriddhi'(Source: ANI/DD) pic.twitter.com/mu6eZ6lGDO— ANI (@ANI) September 20, 2025ఈ పండుగ వాతావరణంలోమనం ‘సముద్ర సే సమృద్ధి’ పండుగను జరుపుకుంటున్నాం. నేడు భారతదేశం ‘విశ్వబంధు’ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతర దేశాలపై ఆధారపడాల్సి రావడం. ఇదే మన అతిపెద్ద శత్రువు, ఈ శత్రువును మనం ఓడించాలి. విదేశాలపై ఆధారపడటం ఎంత ఎక్కువగా ఉంటే, దేశం అంతగా వైఫల్యం చెందుతుంది. . ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశం ఆత్మనిర్భర్ భారత్‌గా మారాలి’ అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
శాస్త్ర, సాంకేతిక రంగాల భాషగా హిందీ!
గాంధీనగర్: మాట్లాడే భాషగా మాత్రమేకాదు శాస్త్ర, సాంకేతిక రంగాలు, న్యాయ, పోలీస్ విభాగాల్లోనూ హిందీ అంతర్లీనంగా కలిసిపోవాలిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభిలషించారు. ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఐదవ అఖిల భారతీయ రాజభాష సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమిత్‌షా పాల్గొని ప్రసంగించారు. ‘‘ హిందీకి ఇతర భారతీయభాషలకు మధ్య ఎలాంటి ఘర్షణ లేనేలేదు. దయానంద సరస్వతి, మహాత్మాగాంధీ, కేఎం మున్షీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి ఎందరో మహానుభావులు హిందీని ఆమోదించారు. హిందీ బాషను దేశవ్యాప్తంగా ప్రోత్సహించారు. గుజరాత్లో హిందీ, గుజరాతీ రెండూ తమ స్పష్టమైన ఉనికిను చాటుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఒకే రాష్ట్రంలో రెండు భాషలు ఉన్నాసరే రెండూ అభివృద్ధి చెందగలవని గుజరాత్ నిరూపించింది’’ అని అన్నారు.హిందీ కేవలం భాష కాదు‘‘హిందీ కేవలం మాట్లాడే భాష కాదు. పరిపాలనా భాష కూడా. శాస్త్ర సాంకేతిక రంగాలు, న్యాయ, పోలీస్ విభాగాల్లోనూ పరిపాలనలో హిందీని ఉపయోగిస్తే బాగుంటుంది. ఇలా అన్ని భాషలను కీలక రంగాల్లో పరిపాలన సౌలభ్యం కోసం వినియోగిస్తే పౌరులు సైతం ఈ భాషలను విరివిగా ఉపయోగిస్తారు. సంస్కృత భాష అనేది మనకు జ్ఞానగంగను ప్రసాదించింది. ఆ జ్ఞానాన్ని ఇంటింటికీ హిందీ మోసుకొచ్చింది. స్థానిక భాషల ద్వారా ఆ జ్ఞానం ప్రతి ఒక్కరికీ చేరువైంది. మాతృభాషలోకాకుండా ఇతర భాషలో చిన్నారులకు కొత్త విషయాన్ని చెబితే మళ్లీ మాతృభాషలోనే దానిని అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం మెదడు సామర్థ్యంలో 25 నుంచి 30 శాతం ఖర్చవుతుంది. సామర్థ్యం వృథాను తగ్గించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎల్లప్పుడూ మాతృభాషలోనే మాట్లాడాలి. లేదంటే పిల్లలకు కొత్త అంశాలను తెల్సుకోవడం కష్టమవుతోంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది’’ అని అన్నారు. ‘‘గుజరాతీ ఉన్నప్పటికీ గుజరాత్లో విద్యాంశాలు హిందీలోనే కొనసాగుతున్నాయి. ఇది మహాత్మాగాంధీ, దయానంద్ సరస్వతి వల్లే సాధ్యమైంది. అలాగే ప్రతి రాష్ట్రంలో ప్రజలు హిందీలోనూ సంప్రతింపులు కొనసాగించాలి’’ అని షా కోరారు. ‘హిందీ శబ్ద సింధూ అనేది 51,000 పదాలతో మొదలైంది. ఇప్పుడు 7,00,000 పదాలతో అలరారుతోంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలోని అన్ని భాషల్లో అత్యధిక పదాల నిఘంటువుగా చరిత్రకెక్కుతుంది’’ అని ఆయన అన్నారు. మోదీ శుభాకాంక్షలు‘‘హిందీ కేవలం భాష, సమాచారమార్పిడి అనుసంధానం కాదు.. మన భారతీయ సంస్కృతి, ఉనికికి సజీవ వారసత్వ సంపదగా హిందీ భాసిల్లుతోంది. హిందీ దివస్ రోజు మీకందరికీ అంతులేని శుభాకాంక్షలు. హిందీ దివస్ సందర్భంగా భారతీయ భాషలన్నీ పరిఢవిల్లాలని ప్రతిజ్ఞచేద్దాం’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ఆదివారం పోస్ట్ చేశారు. -
Gujarat: భారీ అగ్నిప్రమాదం.. తగలబడుతున్న ‘సంఘ్వి ఆర్గానిక్స్’
భరూచ్: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా, పనోలిలో గల సంఘ్వి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగల మధ్య భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి,ప్రాణ నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు. VIDEO | Bharuch, Gujarat: Fire breaks out in Sanghvi Organics Pvt Ltd in GIDC Panoli. Thick smoke and flames were visible from a distance as multiple fire tenders rushed to the spot and began firefighting operations. More details are awaited.(Source: Third Party)(Full video… pic.twitter.com/UMVi3UgoN6— Press Trust of India (@PTI_News) September 14, 2025గుజరాత్లో ఏప్రిల్ 2న బనస్కాంత జిల్లాలోని దీసాలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటన మరువకముందే ఈ తాజా ఘటన చోటుచేసుకుంది. నాడు అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో 21 మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్‌కు నుంచి వలస వచ్చిన కార్మికులు అధికంగా ఈ ప్రమాదం బారిన పడ్డారు. సంఘ్వి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం దరమిలా, దగ్గమైన పొగ ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టింది. గిడ్డంగిలో కొంత భాగం ఆహుతయ్యిందని సమాచారం. కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలియవస్తోంది. పోలీసులు ఈ పరిశ్రమను అక్రమంగా నడిపిస్తున్న యజమాని ఖుబ్చంద్ థక్కర్,అతని కుమారుడిని అరెస్టు చేశారు. -
ప్రచారం లేకుండా... పేటెంట్ల పరంపర!
ఎలక్ట్రిసిటీ అంటే ఎడిసన్, టెలిఫోన్ అంటే గ్రాహం బెల్, కంప్యూటర్ అంటే ట్యూరింగ్ గుర్తొస్తారు. కాని, ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ శాస్త్రవేత్త గురుతేజ్ సంధు పేరు చేర్చాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా యూఎస్‌లో ఎడిసన్ పొందిన పేటెంట్ల సంఖ్యను కూడా దాటేసిన ఈ టెక్ టైగర్– ప్రపంచ టెక్నాలజీని వేగవంతం చేసిన మాస్టర్‌మైండ్! ఆయన పేరు ఇప్పటివరకు ఎక్కువమందికి తెలియకపోవచ్చు. కాని, ప్రపంచవ్యాప్తంగా రోజూ వాడే టెక్నాలజీకి ఆధారం ఆయన ఆవిష్కరణలే! అమెరికాలోని మైక్రాన్ టెక్నాలజీలో పనిచేస్తూ, టెక్ రంగంలో నిశ్శబ్దంగా విప్లవం సృష్టించారు. వివిధ టెక్నాలజీలపై ఆయనకు ఇప్పటి వరకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 1,380 పేటెంట్లు ఉన్నాయి. ఇది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎడిసన్ యూఎస్ పేటెంట్స్ కౌంట్ 1,093 కంటే ఎక్కువ. సాధారణంగా పేటెంట్ అనేది సాధించడమే ఓ పెద్ద విషయం. ఒక్కటి పొందటానికి సంవత్సరాలు పడుతుంది. అలాంటిది అత్యధిక పేటెంట్స్ కలిగిన భారతీయుడుగా గురుతేజ్ సంధు నిలిచారు. మన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, క్లౌడ్ స్టోరేజ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వేగం, సామర్థ్యం పెంచడంలో ఆయన పాత్ర అంచనాకు అందని స్థాయిలో ఉంది. ఆయన అభివృద్ధి చేసిన ‘అటామిక్ లేయర్ డిపాజిషన్’, ‘పిచ్ డబ్లింగ్’ లాంటి సాంకేతిక పద్ధతులు మెమరీ చిప్‌ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. అంటే చిన్న పాకెట్లో పెద్ద ప్రపంచాన్ని నిక్షిప్తం చేయగల టెక్నాలజీని గురుతేజ్ రూపొందించారు. ప్రస్తుతం ఇవే గ్లోబల్ టెక్ పరిశ్రమలో ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా మారిపోయాయి. మీరు ఫోన్లో వీడియో చూస్తుంటే, ప్రతి పది సెకన్లకు ‘పాజ్’ కాకుండా స్మూత్‌గా ప్లే అవుతుంటే, దానికి మూల కారణం గురుతేజ్ సంధునే! ఇలానే, మరెన్నో మనం రోజూ వాడే టెక్నాలజీ పరిజ్ఞానాల్లో ఆయన మేధస్సు పనిచేస్తోంది.ప్రపంచాన్ని నడిపించే ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఈ మనిషికి గుర్తింపు లభించిందా అంటే – కొద్దిపాటి అవార్డులు మాత్రమే అని చెప్పాలి. ఆయనకు ‘ఐఈఈఈ ఆండ్రూ ఎస్. గ్రోవ్ అవార్డ్’ అనే అత్యున్నత గౌరవం దక్కింది. అంతేకాదు, ఆయనకు అంతర్జాతీయ మైక్రాన్ సంస్థలో అతి ముఖ్య సాంకేతిక గౌరవమైన ఫెలో హోదా దక్కింది. వివిధ టెక్నాలజీ పరిశోధనల్లో అద్భుత ప్రతిభ చూపినందుకు గాను ‘జార్జ్ ఈ. పేక్’ బహుమతిని కూడా అందుకున్నారు. అయితే, ఇంతటి ఘనత ఉన్నా ఆయన పేరు బహిరంగ ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడం కొంచెం ఆశ్చర్యకరం. ఫ్యామిలీ స్టార్! ఒక మధ్యతరగతి భారతీయ కుటుంబం నుంచి ఈ మేధావి కథ ప్రారంభమైంది! లండన్‌లో జన్మించిన గురుతేజ్ సంధు, మూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో భారత్‌కు వచ్చేశారు. తండ్రి సర్జీత్ సంధు, తల్లి గురుమీత్ సంధు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసించే మేధావిగా ఎదిగాడు. అలా ఆయన మేధస్సు మొదట ఐఐటీ ఢిల్లీ గేట్లు దాటింది, అక్కడే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం అమెరికా ప్రయాణం, నార్త్ కరోలినా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో పీహెచ్డీ సాధించారు. అప్పటి నుంచే ల్యాబ్‌లో సైలెంట్‌గా పని చేస్తూ, ప్రపంచ మెమరీ చిప్‌లకు మెమరబుల్ సైంటిస్టుగా మారారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు సంగీతంలో ప్రావీణ్యం పొంది డీజేగా గుర్తింపు పొందారు. మరొకరు ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఇలా ఆయన ఇద్దరు కుమారులు కూడా, ఒకరు మ్యూజిక్‌లో, మరొకరు మైక్రోచిప్‌లతో తమ తమ రంగాల్లో మ్యాజిక్ చేస్తున్నారు!. ప్రపంచాన్ని నడిపించే ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఈ మనిషికి గుర్తింపు లభించిందా అంటే – కొద్దిపాటి అవార్డులు మాత్రమే అని చెప్పాలి. -
ఘోర విషాదం: తెగిపడిన రోప్‌వే.. ఆరుగురు మృతి
పంచమహల్: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్గో రోప్‌వే కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఆరుగురు మృతిచెందారు. ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్ కొండపైకి రోప్‌వేలో నిర్మాణ సామగ్రి తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇవాళ (శనివారం) మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కార్గో రోప్‌వే ట్రాలీ, కొండపైకి నిర్మాణ సామాగ్రిని తరలిస్తున్న క్రమంలో నాలుగో టవర్ నుండి కేబుల్స్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో మరణించిన వారిలో ముగ్గురు స్థానికులు కాగా, ఇద్దరు కశ్మీర్, ఒకరు రాజస్థాన్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రికులను తీసుకెళ్లే ప్యాసింజర్ రోప్‌వే మూసివేశామని.. అయితే నిర్మాణ పనుల కోసం గూడ్స్ రోప్‌వే మాత్రం వినియోగంలో ఉందని పోలీసులు తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం, జిల్లా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వం.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ట్రాలీ దాని సామర్థ్యానికి మించి సామాగ్రిని తీసుకెళ్ళిందా?, సాధారణ తనిఖీలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 1986లో ఈ రోప్‌వేను నిర్మించారు. -
నాకు రూ. 80 లక్షల సాయం.. నా చెల్లి పెళ్లి ఖర్చంతా హార్దిక్ పాండ్యాదే!
‘‘మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవో భవ’’.. అమ్మానాన్న తర్వాత ప్రత్యక్ష దైవం గురువే. టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), కృనాల్ పాండ్యా (Krunal Pandya) ఈ మాటను గట్టిగా నమ్ముతారు. అందుకే మూలాలు మర్చిపోకుండా ఈ అన్నదమ్ములిద్దరు తమ చిన్ననాటి కోచ్ పట్ల ఇప్పటికీ కృతజ్ఞతా భావం చాటుకుంటున్నారు.కేవలం మాటల వరకు పరిమితం కాకుండా.. ఆర్థికంగానూ తమ ‘గురువు’ను ఆదుకుంటూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. గుజరాత్‌కు చెందిన పాండ్యా బ్రదర్స్ బాల్యం భారంగానే గడిచింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా సరే.. ఆత్మవిశ్వాసంతో క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. చదువును పక్కనపెట్టి ఆట కోసం ప్రాణం పెట్టారు.చిన్న నాటి కోచ్ జితేంద్ర సింగ్ (Jitendra Singh) మార్గదర్శనంలో హార్దిక్, కృనాల్ రాటుదేలారు. ఐపీఎల్ నుంచి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నారు. ఇక అన్న కృనాల్ కంటే.. తమ్ముడు హార్దిక్‌కే జాతీయ జట్టులో అవకాశాలు ఎక్కువ. టీమిండియాలో ఈ పేస్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం కీలక సభ్యుడు.రూ. 70- 80 లక్షల వరకు సాయంఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి కోట్ల డబ్బు ఆర్జించిన క్రికెటర్లలో హార్దిక్ ముందుంటాడు. అయితే, తాను ఎదిగిన తర్వాత కూడా చిన్ననాటి గురువును అతడు మర్చిపోలేదు. అన్న కృనాల్‌తో కలిసి దాదాపు రూ. 70- 80 లక్షల వరకు జితేంద్ర సింగ్‌కు సాయం చేశాడు.కారు కొనమని నాకు రూ. 20 లక్షలుఈ విషయాన్ని స్వయంగా జితేంద్ర సింగ్ వెల్లడించాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘నా మొదటి చెల్లి పెళ్లికి హార్దిక్, కృనాల్ సాయం చేశారు. వారి వల్లే వివాహ వేడుక సాఫీగా సాగిపోయింది. అంతేకాదు.. కారు కొనమని నాకు రూ. 20 లక్షలు బదిలీ చేశారు.ఇక 2024లో నా రెండో చెల్లి పెళ్లి కుదరగానే హార్దిక్ ఫోన్ చేసి.. ‘మీ చెల్లి.. నాకు కూడా చెల్లి లాంటిదే. తన వివాహాం.. ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి. అన్నీ సవ్యంగా జరిగిపోవాలి. అందుకు ఈ అన్నయ్య సహకారం ఉంటుంది’ అని చెప్పాడు. అన్నట్లుగానే తనే అంతా చూసుకున్నాడు.నా డబ్బంతా తీసుకో..మా అమ్మ అనారోగ్యంతో ఉన్నపుడు కూడా.. ‘నా డబ్బంతా తీసుకుని ఆమె ఆరోగ్యం బాగు చేయించు’ అన్నాడు. అప్పుడు తను ఇంకా బరోడా జట్టుకు మాత్రమే ఆడుతున్నాడు. అంటే.. అప్పుడే తనకి ఎంత పరిణతి ఉందో అర్థం చేసుకోవచ్చు. 2015-2016లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత.. అంటే తన అరంగేట్రం తర్వాత హార్దిక్ నాకు కారు కొనుక్కోమని రూ. 5-6 లక్షలు పంపించాడు.బైక్ మీద వెళ్తే..నాకు ఇలాంటివి వద్దని వారించాను. కానీ కృనాల్ ఒప్పించాలని చూశాడు. కానీ నేను వద్దనే చెప్పాను. అప్పుడు హార్దిక్ వచ్చి.. ‘ఈ కారు మీ సేఫ్టీ కోసం మాత్రమే. బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఎక్కువ కాబట్టే కారు కొనమంటున్నా’ అని నన్ను ఒప్పించాడు. కోచ్ పట్ల తనకున్న అభిమానం అలాంటిది.కృనాల్ నాకు రూ. 18 లక్షలు పంపాడునాకున్న మంచి దుస్తులన్నీ హార్దిక్, కృనాల్ కొనిచ్చినవే. ఇప్పటి వరకు నాకు పాండ్యా సోదరులు రూ. 70- 80 లక్షలు సాయం చేసి ఉంటారు. 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున టైటిల్ గెలవగానే కృనాల్ నాకు రూ. 18 లక్షలు పంపించాడు.ఎల్లవేళలా నేను సౌకర్యంగా ఉండాలనే వారు ఆలోచిస్తారు. నాది దిగువ మధ్య తరగతి కుటుంబం. వారు మాత్రం నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు’’ అని జితేంద్ర సింగ్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాస్త డబ్బు కనబడగానే కుటుంబ సభ్యులనే దూరం పెట్టే మనుషులు ఉన్న నేటి సమాజంలో.. గురువు పట్ల ఇంత అభిమానం చూపుతున్న పాండ్యా బ్రదర్స్ నిజంగా గ్రేట్ కదా!.. ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే!!చదవండి: రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం.. ఇంకా.. -
హర్షల్ పటేల్ కీలక నిర్ణయం
టీమిండియా క్రికెటర్ హర్షల్ పటేల్ (Harshal Patel) కీలక నిర్ణయం తీసుకున్నాడు. హర్యానా క్రికెట్ (Haryana Cricket)తో దశాబ్దానికి పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాడు. తిరిగి సొంత జట్టు గుజరాత్‌కు ఆడాలని నిర్ణయించుకున్నాడు. కాగా 34 ఏళ్ల హర్షల్ పటేల్.. 2008-09 సీజన్ సందర్భంగా గుజరాత్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.నాయకుడిగానూ..అయితే, అండర్-19 వరల్డ్‌కప్-2010 (U-19 World Cup) తర్వాత హర్షల్‌కు గుజరాత్ జట్టులో చోటు కరువైంది. ఈ క్రమంలో హర్యానాకు మారిన ఈ సీమర్.. ఆల్‌రౌండర్‌గా, కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. పదమూడేళ్ల సుదీర్ఘకెరీర్లో హర్యానా తరఫున 246 ఫస్ట్‌క్లాస్ వికెట్లు కూల్చాడు.అంతేకాదు.. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023-24లో హర్యానా గెలవడంలోనూ హర్షల్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, తాజాగా ఆ జట్టును వీడి గుజరాత్‌కు వెళ్లిపోవాలని అతడు నిర్ణయించుకోవడం గమనార్హం.ఈ విషయం గురించి హర్షల్ పటేల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అండర్-19 రోజుల నుంచి.. 2010-11 మధ్య కాలంలో హర్యానా తరఫున నా ప్రొఫెషనల్ కెరీర్ మొదలైంది. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను.అమెరికాకు షిఫ్ట్ అయి పోయేవాడినిఒకవేళ నేను పద్దెనిమిదేళ్ల వయసులో హర్యానాకు వెళ్లి అవకాశాలు అందిపుచ్చుకోకపోతే.. అమెరికాకు షిఫ్ట్ అయి పోయేవాడిని. టీమిండియా తరఫున ఆడే అవకాశం నాకు దక్కేదే కాదు’’ అని పేర్కొన్నాడు. కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన ఉన్ముక్త్ చాంద్‌కు ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో అమెరికా వెళ్లి.. ఆ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. 2012లో ఐపీఎల్లో అడుగుపెట్టిన హర్షల్ పటేల్.. తొమ్మిదేళ్ల తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 25 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ 29 వికెట్లు పడగొట్టాడు. 2023లో శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా హర్షల్ చివరగా టీమిండియాకు ఆడాడు.చదవండి: IND vs PAK: నేను.. రోహిత్ ఘోరంగా ఢీకొట్టుకున్నాం.. ఆరోజు ధోని ఫైర్: కోహ్లి -
హన్సల్ పూర్ లో స్వదేశీ ఈవీ ఫెసిలిటీని ప్రారంభించిన మోదీ
-
ఛతేశ్వర్ పుజారా నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
టీమిండియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఒకడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత మోస్ట్ డిపెండబుల్ బ్యాటర్‌గా ఈ సౌరాష్ట్ర ఆటగాడు పేరొందాడు. 2005లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన పుజారా.. ఆదివారం (ఆగష్టు 24) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.దేశీ క్రికెట్లో సౌరాష్ట్రకు ఆడిన పుజారా.. విదర్భతో మ్యాచ్ సందర్భంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. రోజురోజుకూ తన ఆటను మెరుగపరచుకుని దేశీ క్రికెట్ రన్ మెషీన్‌గా మారిపోయిన పుజ్జీ.. 2025లో గుజరాత్‌తో పోరు సందర్భంగా తన చివరి మ్యాచ్ ఆడేశాడు.పుజారా నెట్‌వర్త్ ఎంతో తెలుసా?ఇక 2010లో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన పుజారా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2023 ఫైనల్ సందర్భంగా తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. కాగా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటలు లిఖించుకున్నాడు పుజారా. ఆట పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న 37 ఏళ్ల పుజారా నెట్‌వర్త్ (Networth) ఎంతో తెలుసా?!వివిధ మీడియా రిపోర్టుల ప్రకారం పుజారా నికర ఆస్తుల విలువ రూ. 24 కోట్లు అని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులో ‘బి’ కేటగిరిలో ఉన్న ఆటగాడిగా అప్పట్లో రూ. 3 కోట్ల వార్షిక వేతనం పొందిన పుజ్జీ.. మ్యాచ్ ఫీజుల ద్వారా కూడా మంచి మొత్తమే అందుకున్నాడు.నెల సంపాదన రూ. 15 లక్షలు!ఇక జాతీయ జట్టుకు దూరమైన తర్వాత దేశీ క్రికెట్ ఆడటం ద్వారా కూడా ఆర్జించిన పుజారా.. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. కామెంటేటర్‌గానూ సేవలు అందిస్తున్నాడు. తాజా రిపోర్టుల సమాచారం ప్రకారం.. అతడి నెల సంపాదన రూ. 15 లక్షలు అని అంచనా.తన కెరీర్లో టీమిండియా తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా.. ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు. సంప్రదాయ క్రికెట్లో మేటి బ్యాటర్‌గా ఎదిగినప్పటికీ టీ20 ఫార్మాట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అందుకే.. ఐపీఎల్లో అతడికి ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు.మిగతా వారితో పోలిస్తే కాస్త తక్కువే!అందుకే తన సమకాలీన ఆటగాళ్లతో పోలిస్తే పుజారా సంపాదన తక్కువగానే అనిపించవచ్చు. నిరాడంబర జీవితానికి పెద్ద పీట వేసే పుజారా గ్యారేజీలో కొన్ని విలాసవంతమైన కార్లు కూడా ఉండటం విశేషం. ఆడి ఏ6, ఫోర్డ్, బీఎండబ్ల్యూ 5- సిరీస్, మెర్సిడెజ్ బెంజ్‌లు పుజ్జీ వద్ద ఉన్నాయి.పెన్షన్ ఎంతంటే?రిటైర్ అయిన మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ ప్రతినెలా పెన్షన్ ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఆటకు వీడ్కోలు చెప్పిన తమ ప్లేయర్లకు ఆర్థిక చేయూతను ఇవ్వడంతో పాటు.. వారి సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2022లో పలు మార్పుల అనంతరం.. మాజీ ఆటగాళ్లకు ఇచ్చే పెన్షన్ భారీగానే పెరిగింది.టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, ఎంతకాలం జట్టులో ఉన్నారన్న అంశాలతో పాటు అంతర్జాతీయ టెస్టులు ఆడారా? లేదా? అని పరిశీలించి మూడు కేటగిరీల్లో పెన్షన్ ఇస్తారు. ఉన్నత శ్రేణిలో ఉన్న వారికి రూ. 70 వేలు, దిగువ శ్రేణి ఆటగాళ్లకు రూ. 60 వేలు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేల చొప్పున బీసీసీఐ పెన్షన్ అందిస్తోంది. దీని ప్రకారం పుజారాకు రూ. 60 వేల మేర పెన్షన్ లభించవచ్చు.చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా.. -
‘గాజా సాయం’ పేరుతో నిధుల సేకరణ.. గుజరాత్లో సిరియన్ అరెస్ట్
అహ్మదాబాద్: ఇజ్రాయెల్ యుద్ధంతో పూర్తిగా దెబ్బతిన్న గాజాలోని పేదల కోసం భారత్‌లోని వివిధ మసీదుల నుండి నిధులు సేకరిస్తున్న సిరియన్ జాతీయుడిని గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరిస్తూ వస్తున్న మరో ముగ్గురు సిరియన్ పౌరులు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.నిందితునితో పాటు అతని సహచరులు గాజా బాధితుల పేరుతో విరాళాలు సేకరించి, ఆ డబ్బును వారి విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికితోడు వారు ఏదో ఒక ప్రయోజనం కోసం రెక్కీ నిర్వహించడానికి నగరంలో తిష్ట వేశారనే అనుమానాలున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఉదంతంలో ఎల్లిస్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఒక హోటల్ నుండి అలీ మేఘత్ అల్-అజార్ (23) ను అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరద్ సింఘాల్ మీడియాకు తెలిపారు. ఇదే హోటల్లో అనుమానిత సిరియస్లు జకారియా హైతం అల్జార్, అహ్మద్ అల్హబాష్, యూసఫ్ అల్-జహర్ బసచేసినట్లు పోలీసులు కనుగొన్నారు.‘ఒక నిఘా సమాచారం ఆధారంగా మేము డమాస్కస్ నివాసి అయిన అల్-అజార్‌ను అరెస్టు చేశాం. అతని వద్ద నుండి 3,600 అమెరికన్ డాలర్లు, రూ. 25,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అతని అరెస్టు తర్వాత మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే వారు దేశం నుండి పారిపోకుండా ఉండేందుకు వారిపై లుక్-అవుట్ నోటీసు జారీ చేశాం. ఈ నలుగురు సిరియన్లు పర్యాటక వీసాలపై దేశానికి వచ్చి జూలై 22న కోల్‌కతాలో దిగారు. ఆగస్టు 2న వారు అహ్మదాబాద్ చేరుకున్నారు.వారు స్థానిక మసీదుల నిర్వహకులను సంప్రదించి, గాజాలో ఆకలితో అలమటిస్తున్న వారి వీడియోలను చూపిస్తూ విరాళాలు సేకరించారు. గాజాలోని పేద లకు ఆహారం అందించేందుకు, నిధులు సేకరిస్తున్నామని వారు చెప్పేవారు. అయితే వారు గాజాకు నిధులు పంపుతున్నట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదు’ అని అని శరద్ సింఘాల్ తెలిపారు. కాగా గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, జాతీయ దర్యాప్తు సంస్థతో కలిసి అహ్మదాబాద్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ సిరియన్లు గుజరాత్‌కు రావడం వెనుక ఉన్న ఖచ్చితమైన ఉద్దేశ్యం ఏమిటి? స్థానిక మసీదుల నుండి సేకరించిన నిధులను ఎక్కడికి పంపారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.నిందితుల కదలికలు, సంబంధాల గురించి మరింత తెలుసుకునేందుకు వారు బస చేసిన ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను స్కాన్ చేస్తున్నామని ఒక అధికారి తెలిపారు. ప్రాథమికంగా.. వారు రెక్కీ చేయడానికే ఇక్కడకు వచ్చారని, కొంతమంది అనుమానాస్పద వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోందని ఆయన తెలిపారు. అరెస్టయిన సిరియన్ జాతీయుడు, అతని సహచరులు పర్యాటక వీసా షరతులను ఉల్లంఘించారన్నారు. విచారణ సమయంలో నిందితుడు తమ విలాసవంతమైన జీవనశైలి కోసం ఈ నిధులు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. -
ఆన్లైన్లో పాడిగేదెలు : లక్షల్లో మోసపోయిన డైరెక్టర్
ఆన్లైన్ షాపింగ్ అంటే ఆచి తూచి వ్యవహరించాల్సిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అత్యాశకు పోయినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. శాండల్‌వుడ్ దర్శకుడు ప్రేమ్ మోసపోయిన తీరు ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేస్తుంది. ఏం జరిగిందంటే...శాండల్‌వుడ్ దర్శకుడు ప్రేమ్ గుజరాత్‌కు చెందిన పశువుల వ్యాపారి చేతిలో రూ. 4.5 లక్షలు మేర దారుణంగా మోస పోయాడు. బ్రహ్మాండమైన రెండు గేదెలను డెలివరీ చేస్తానని హామీ ఇచ్చిన స్థానిక వ్యాపారి, తీరా డబ్బులు తీసుకొని పత్తా లేకుండా పోయాడు.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రేమ్, పాడి వ్యవసాయాన్ని చేద్దామనుకున్నాడు. ఇందుకోసం పాడిగేదెల్ని కొనేందుకు ఆన్లైన్ వెదికాడు. ఈ క్రమంలో గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన వాఘేలా వనరాజ్భాయ్ శాంతిభాయ్ను సంప్రదించాడు. అధిక పాల దిగుబడి కోసం పెంచిన గేదెలు అంటూ మెరిసే ఫోటోలనను షేర్ చేశాడు. ఫోటోలు చూసి పడిపోయిన ప్రేమ్, రూ.25,000 అడ్వాన్స్‌గా చెల్లించాడు. జంతువులను ట్రక్కులో ఎక్కించి బెంగళూరుకు వెళ్తున్నట్లు వాఘేలా నమ్మబలికాడు. ఇది చూసి మరింత మురిసి పోయిన ప్రేమ్ మరో విడతలవారీగా మొత్తం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ గేదెల డెలివరీ మాత్రం రాలేదు. అటు వాఘేలా కాల్స్ ఎత్తడం మానేశాడు. దీంతో మోస పోయానని గ్రహించి చంద్ర లేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లునిందితుడిఇంటికి తాళం వేసి అదృశ్యమైనట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం కూపీలాగుతున్నారు. గేదెలు కాదుకదా, దాని తోక వెంట్రుకలు కూడా రాలేదు అంటూ ప్రేమ్ వాపోయాడు. "ఆ ఫోటోలు నిజమైనవనుకుని నమ్మాం. ట్రక్ వారంలోపు వస్తుందని నిందితుడు చెప్పాడు" అని ప్రేమ్ మేనేజర్ దశవర్ చంద్రు అన్నారు. ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
తనపై దాడి తర్వాత ఢిల్లీ సీఎం రేఖా గుప్తా రియాక్షన్ ఇదే!
సాక్షి,న్యూఢిల్లీ: ‘ఈ దాడి నా మీద మాత్రమే కాదు..ప్రజాసేవ చేయాలనే నా నిబద్ధత మీద కూడా జరిగిన దాడి’ అంటూ ప్రజాదర్భార్‌లో ఓ వ్యక్తి తనపై దాడి చేసిన ఘటనపై ఢిల్లీ సీఎం రేఖాగుప్తా స్పందించారు.ఈ దాడి నా మీద మాత్రమే కాదు, ప్రజాసేవ పట్ల ఉన్న నా నిబద్ధత మీద కూడా జరిగిన దాడి. ఇలాంటి ఘటనలు నా ఆత్మవిశ్వాసాన్ని, ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవు. ఇప్పటికీ నేను బాగానే ఉన్నాను. త్వరలోనే మళ్లీ మీ మధ్య ఉంటాను. మరింత శక్తితో, మరింత అంకితభావంతో పనిచేస్తాను’అని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా బుధవారం ఉదయం జన్ సున్వాయి (ప్రజాదర్భార్) నిర్వహించారు. ఆ కార్యాక్రమంలో ఓ వ్యక్తి తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ కొన్ని పేపర్లు సీఎం రేఖాగుప్తాకు అందించాడు. ఆ పేపర్లను సీఎం పరిశీలించే సమయంలో నిందితుడు ఆమెను ఓ వస్తువుతో దాడి చేశాడు. కొందరు ప్రత్యక్ష సాక్షులు ఆమెను చెంపమీద కొట్టాడాని చెబుతున్నారు.ఈ ఘటనలో సీఎం రేఖాగుప్తా తలకి గాయమైంది. అప్రమత్తమైన అధికారులు,వ్యక్తిగత సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో తనపై జరిగిన దాడి ఘటనపై రేఖాగుప్తా పైవిధంగా స్పందించారు. Delhi CM Rekha Gupta tweets, "The attack on me during this morning's 'Jan Sunvai' was not just an attack on me, but a cowardly attempt on our resolve to serve Delhi and work for the welfare of the people. I was in shock after this attack, but now I am feeling better... Such… pic.twitter.com/YiFINZz2v3— ANI (@ANI) August 20, 2025రేఖాగుప్తాపై దాడి చేసింది గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌కు చెందిన రాజేష్ సక్రియాగా పోలీసులు గుర్తించారు. సీఎంపై రాజేష్ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో రేఖాగుప్తాపై దాడి ఘటనపై రాజేష్ సక్రియా తల్లి స్పందించారు. తన కుమారుడు జంతుప్రేమికుడని, ఇటీవల వీధికుక్కలపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో మనోవేధనకు గురయ్యాడు. ఆ బాధతోనే దాడి చేసి ఉంటారని తెలిపారు. -
ధోని వీరాభిమాని దుర్మరణం.. శోకసంద్రంలో తలా ఫ్యాన్స్
భారత దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోని వీరాభిమాని ఒకరు దుర్మరణం చెందారు. ధోనిని దేవుడిలా ఆరాధించే జయ్ జానీ అనే 27 ఏళ్ల యువకుడు గుజరాత్ రాష్ట్రం భావ్‌నగర్ జిల్లాలో గల తన స్వగ్రామం రబరికాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.ఈ నెల 12న జయ్ తన వ్యవసాయ భూమికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా రెండు రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచాడు.జయ్.. ఐపీఎల్ 2024 సమయంలో నరేంద్ర మోదీ స్టేడియంలో (అహ్మదాబాద్) జరిగిన మ్యాచ్‌లో భద్రతా సిబ్బందిని దాటి ధోని పాదాలను తాకిన ఘటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. జయ్ ఆకస్మిక మరణం ధోని అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విశ్వవ్యాప్తంగా ధోని ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. జయ్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అతనికి Instagramలో దాదాపు 18,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ధోని వల్లే అతనికి ఇంత పాలోయింగ్ లభించింది. జయ్ Dhoni Ashiq Official పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నాడు. ఈ ఛానల్‌కు 13,000కి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్లో జయ్ ధోని సంబంధించిన ఎడిటెడ్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటాడు. తద్వారా ధోనిపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు.సీఎస్కేకు చేదు అనుభవంఇదిలా ఉంటే, ధోని ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎస్కేకు గత ఐపీఎల్ సీజన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సీజన్లో ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.ఈ సీజన్ మధ్యలో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో, ధోని మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్లో ధోని 13 ఇన్నింగ్స్‌ల్లో 135.17 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులు చేశాడు. ధోని మోకాలి నొప్పితో బాధపడుతూనే ఈ సీజన్ మొత్తం ఆడాడు. -
‘నీట్’లో పాస్.. ప్రేమలో ఫెయిల్.. కంటతడి పెట్టిస్తున్న పరువు హత్య
బనస్కాంత: గుజరాత్‌కు చెందిన 18 ఏళ్ల యువతి పరువు హత్యకు గురయ్యింది. అయితే ఈ దారుణానికి కొద్దిసేపటి ముందు ఆమె తన ప్రియునికి పంపిన సందేశం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇటీవలే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, డాక్టర్ కావాలనుకున్న ఆమె పరువు హత్యకు దారుణంగా బలయ్యింది.గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతిని ఆమె తండ్రి, మేనమామ కలిసి దారుణంగా హత్య చేశారు. అప్పటికే లివ్-ఇన్ రిలేషన్లో ఉన్న ఆ యువతి తమ సంబంధం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో జీవిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆమె తన ప్రియునికి ‘రండి.. వచ్చి నన్ను తీసుకెళ్లండి. లేకపోతే నా కుటుంబ సభ్యులు నా ఇష్టానికి వ్యతిరేకంగా మరో వివాహం చేస్తారు. అందుకు నిరాకరిస్తే, నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి’ అంటూ తన ప్రియునికి సందేశం పంపింది. ఇది జరిగిన కొద్ది సేపటికే ఆమె హత్యకు గురయ్యింది.విషయం తెలుసుకున్న మృతురాలి ప్రియుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి తండ్రి సెంధాభాయ్ పటేల్, మేన మామ శివరాంభాయ్ పటేల్ ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు ఆ మేనమామను అరెస్టు చేయగా, మృతురాలి తండ్రి పరారీలో ఉన్నాడు. పోలీసుల దర్యాప్తులో ఆ యువతి శివరాంభాయ్ ఇంట్లో హత్యకు గురయ్యిందని, అక్కడే ఆమెకు నిద్రమాత్రలు కలిపిన పాలు ఇచ్చి, గొంతు కోసి చంపారని తేలింది. తరువాత నేరాన్ని కప్పిపుచ్చేందుకు అమెకు అంత్యక్రియలు నిర్వహించారని పోలీసులు తెలిపారు.కాగా ఆమె తన ప్రియునికి చివరి సందేశం పంపినప్పుడు అతను జైలులో, వెంటనే స్పందించలేని స్థితిలో ఉన్నాడు. అయినా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే విచారణ షెడ్యూల్ అయ్యే సమయానికి ఆ యువతి మరణించింది. జూన్ 25న కోర్టులో అతని పిటిషన్ విచారణకు ఉండగా, ముందురోజు అంటే జూన్ 24న రాత్రి ఆమె హత్యకు గురయ్యింది. ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు ఆ మర్నాడు నిర్వహించారు. ఆ యువతి తిరిగి తన ప్రేమికునితో ఎక్కడ వెళ్లిపోతుందనే భయంతోనే ఆమె తండ్రి, మేనమామ ఈ హత్యచేశారని పోలీసులు తెలిపారు. -
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
పల్లెటూరు అనగానే మననందరికీ గుర్తుకు వచ్చేది పచ్చని పొలాలు, పొందికైన ఇళ్లు, నినాదంగా గడిచే జీవితం. కానీ ఆ ఊరు అలా ఉండదు. పేరుకే పల్లెటూరు, దాని తీరు చూస్తే నగరానికి ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఆ ఊరు ఆసియాలోనే సంపన్న గ్రామం. ఇంతకీ ఇది ఎక్కడుందనేగా మీ డౌటు. ఇంకెక్కడ మన ఇండియాలోనే. ఏంటి ఏషియా రిచెస్ట్ విలేజ్ మనదేశంలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారా! మరి ఇంకేందుకు ఆలస్యం.. ఆ ఊరు ఎక్కడ ఉందో, దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం.. ఆసియాలోనే ధనిక గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. ఎటు చూసినా కాంక్రీట్ బిల్డింగ్లు, ఆధునాతన సౌకర్యాలతో అలరారుతూ ఉంటుంది ఈ విలేజ్. ఈ ఊర్లోని బ్యాంకుల్లో రూ. 7 వేల కోట్లు పైగా డిపాజిట్లు ఉన్నాయంటేనే అర్థమవుతుంది ఈ ఊరు రేంజ్. దేశంలోని మిగతా పల్లెటూళ్లకు భిన్నంగా ఉంటుంది మాధపర్ (Madhapar). ఈ గ్రామంలో 20 వేల ఇళ్లు ఉండగా.. దాదాపు 32,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ ఊర్లో 17 బ్యాంకులు ఉన్నాయి. మరికొన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఊరు సంపన్న గ్రామంగా ఎలా ఎదిగింది, ఇక్కడివారు ఏం చేస్తారనే తెలుసుకోవాలనుకుంటున్నారా?గ్లోబల్ రూట్స్, లోకల్ గ్రోత్మాధపర్ విజయ రహస్యం అక్కడి ప్రజలే. ఇక్కడి కుటుంబాల్లోని చాలా మంది అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా స్వగ్రామానికి దండిగా డబ్బులు పంపిస్తుంటారు. తాము ఉంటున్న దేశంలో కంటే మాధపర్ బ్యాంకుల్లో డబ్బును దాచుకోవడానికి ఇష్టపడతారు. ఇంటికి డబ్బు పంపడమే కాకుండా గ్రామంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా స్థిరమైన వృద్ధితో ఆర్థిక స్వావలంబన సాధించి సంపన్న గ్రామంగా ఎదిగింది మాధపర్ గ్రామం.ప్రవాసంలో ఉంటున్నా.. దేవాలయాలు, వారసత్వ కట్టడాలను సృష్టించడంలో సిద్ధహస్తులైన మిస్త్రి కమ్యునిటికి చెందిన వారు 12వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. కాలక్రమేణా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం పటేల్ కమ్యునిటికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు ఇక్కడి నుంచి చాలా మంది వలస వెళ్లడంలో మాధపర్ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ప్రవాసంలో ఉంటున్నా మూలాలను మరిచిపోకుండా సొంతూరిపై ఎన్నారైలు మమకారం చూపడంతో మాధపర్ ధనిక గ్రామంగా ఎదిగింది. పట్టణాలకు దీటుగా సౌకర్యాలు సమకూర్చుకుంది. విశాలమైన రోడ్లు, నాణ్యమైన పాఠశాలలు, కాలేజీలతో పాటు ఆధునిక వైద్యాన్ని అందించే ఆస్పత్రులు కూడా ఉన్నాయి.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!దేశానికి నమూనా మాధపర్ విజయగాథ కేవలం సంపదకు సంబంధించినది మాత్రమే కాదు. ఐక్యత, దార్శనికత, తిరిగి ఇవ్వడం అనే మూడు అంశాల ఆధారంగా మాధపర్ గ్రామం స్వావలంబన సాధించింది. అంతేకాదు ప్రజల మధ్య బలమైన సమాజ సంబంధాలు ఉంటే గ్రామీణ జీవితాన్ని కూడా అసాధారణంగా మార్చవచ్చని ఈ ఊరు నిరూపించింది. గ్రామీణ జీవిత సౌందర్యాన్ని ఆధునిక జీవన సౌకర్యాలతో మిళితం చేసి దేశానికి నమూనాగా నిలిచింది. -
రక్షా బంధన్‌కి అసలైన అర్థం ఈ అక్కా తమ్ముళ్లు..
రక్షా బంధన్ అనగానే రకరకాల రాఖీలు అన్న లేదా తమ్ముడి చేతికి కట్టి సంబరంగా జరుపుకుంటుంటారు అక్క/చెల్లి. ఇద్దరిలో ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా తోడుంటానని, ధైర్యంగా ఉండు అని చెప్పే ఈ పండుగ రక్తసంబంధం మైత్రికి, తోబుట్టువుల గొప్పదనానికి ప్రతీక. అలాంటి ఈ సంబరానికి అర్థం పట్టే ఓ కథ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రక్షా బంధన్ అసలైన అర్థం ఇదే కథ అనిపించేలాంటి గాథే ఇది.గుజరాత్‌లోని గాంధీనగర్‌కి చెందిన 60 ఏళ్ల కిరణ్ భాయ్ పటేల్ రెండు కిడ్నీలుపాడైపోయాయని వైద్యులు చెప్పడంతో అతడి ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోయింది. భరూచ్‌లోని ఓ ఎరువుల కంపెనీ పనిచేసే ఆయన దాత కోసం ఎదురుచూస్తున్నారు. అదీగాక సమస్య తీవ్రమై డయాలసిస్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురైంది ఆయనకు. అతడి కుమారుడు, కుమార్తె, భార్య ఆయనను ఎలా రక్షించుకోవాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే కుమార్దె కిడ్నీ దానం చేద్దామని ముందుకొచ్చినా..రక్తపోటు కారణంగా కిడ్నీలు దానం చేయలేదని తేల్చారు వైద్యులు. భార్య, కొడుకివి అతడికి మ్యాచ్ కాలేదు. ఇంకెలా ఆయన్ను రక్షించుకోవాలో తెలియని ఆందోళనలో సతమతమవుతుండగా ఆయన నలుగురు తోబుట్టువులు కిడ్నీలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మూడవ చెల్లికి పరీక్షల సమయంలో ఒకటే కిడ్నీ ఉందని తెలిసి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మరో చెల్లికి కాలులో పాక్షికంగా వైకల్యం ఉండటంతో ఆమె అనర్హురాలని చెప్పారు వైద్యులు. ఆఖరికి అక్క సుశీలాబెన్ కిడ్నీ కిరణ్ భాయ్‌కి మ్యాచ్ అవ్వడమేగాక ఆమె ఇచ్చేందుకు ముందుకు వచ్చారు కూడా. అందుకు ఆమె భర్త, అత్తమామలు కూడా సమ్మతించడం విశేషం. కిరణ్ బావ భూపేంద్రభాయ్ దగ్గరుండి అతడి సోదరి అని వైద్యపరీక్షలు చూసుకున్నారు. అహ్మదాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కిడ్నీ మార్పిడి జరిగింది. ఆ సర్జరీ జరిగి సరిగ్గా ఇప్పటికీ ఒకటిన్నర సంత్సరాలు. ప్రస్తుతం కిరణ్ ఆరోగ్యం మెరుగవ్వడమే గాక హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు కూడా. ఈ మేరకు సుశీలాబెన్ మాట్లాడుతూ..సోదరుడు కష్టంలో ఉంటే ఏ అక్క చూస్తూ ఉండగలదు. కష్టాల్లో, కన్నీళ్లలో మేమున్నాం అంటూ అండగా ఉన్నప్పుడే కథ రక్తసంబంధానికి, తోబుట్టువుల బాంధవ్యానికి అసలైన అర్థం అంటుందామె. ఈ రక్షా బంధన్ పండుగను సంబంరంగా జరుపుకోవడమే కాదు..సంకటపరిస్థితుల్లో కూడా ఆ బంధానికి, విలువలకు ప్రాధాన్యత ఇచ్చి బాంధవ్యాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పకనే చెబుతోంది ఈ కథ.(చదవండి: Plastic Man Of India: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకంగా తారురోడ్డు కంటే..!) -
Raksha Bandhan: చనిపోయిన చెల్లి స్వయంగా తన చేతితో రాఖీ కడితే..
ఈరోజు రక్షా బంధన్.. అక్కాచెల్లెళ్లు తమ అనుబంధానికి గుర్తుగా అన్నదమ్ములకు రాఖీ కడుతుంటారు. కొందరైతే ఈరోజున తమను వీడివెళ్లిన అన్నదమ్ములను అక్కాచెల్లెళ్లను గుర్తు చేసుకుంటారు. వారు తమతోపాటు ఉండి, తమకు రాఖీ కడితే ఎంతో ఆనందంగా ఉండేదని అనుకుంటారు. అయితే ఇటువంటి కల ‘శివమ్’ విషయంలో సాకారమయ్యింది. అతని గురించి తెలిసినవారంతా శివమ్‌ను మించిన అదృష్టవంతుడు లేడంటూ కొనియాడుతున్నారు.గుజరాత్‌లోని వడోదరకు చెందిన 19 ఏళ్ల శివమ్ సోదరి రియా బాబీ మిస్త్రీ(9) 2024లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అయితే ఆమె చేతిని అవయవమార్పిడి చికిత్స ద్వారా ముంబైకి చెందిన అనమ్తా అహ్మద్(14)కు అతికించారు. ఈ చిన్నారి విద్యుత్ షాక్ కారణంగా తన కుడిచేతిని కోల్పోయినది. అయితే శుక్రవారం శివమ్, అనమ్తా అహ్మద్ కుటుంబాలు భావోద్వేగంతో కూడిన రాఖీ సంబరాలు చేసుకున్నాయి. చనిపోయిన చిట్టి చెల్లి వడోదరకు వచ్చి శివమ్‌కు రాఖీ కట్టింది.2022లో విద్యుత్ షాక్ కారణంగా తన కుడి చేయిని కోల్పోయిన ముంబైకి చెందిన అనమ్తా అహ్మద్ అవయవ మార్పిడి ద్వారా తిరిగి చేతిని పొందగలిగింది. అమెకు వడోదరకు చెందిన తొమ్మిదేళ్ల రియా బాబీ మిస్త్రీ చేతిని అతికించారు. రియా మెదడులో అకస్మాత్తుగా రక్తస్రావం కావడంతో వైద్యులు ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. రాఖీ కట్టేందుకు తమ ఇంటికి వచ్చిన అనమ్తా అహ్మద్‌ను చూసిన శివమ్ పొంగిపోయాడు. మృతిచెందిన తన సోదరే తిరిగి తన దగ్గరకు వచ్చి రాఖీ కట్టిందని శివమ్ సంబరపడుతూ తెలిపాడు. -
పిల్లలంతా కలిసి కోట్లు కూడబెట్టారు!
ఇంజనీరింగ్‌లో చేరిన 17 ఏళ్ల కపిశ్ ల్యాప్‌టాప్ కొనుక్కోవడానికి వాళ్ల నాన్నను డబ్బులు అడిగాడు. కాలేజీ ఫీజుకే అప్పుచేసిన అతడి తండ్రి ల్యాప్‌టాప్ కొనడానికి మళ్లీ అప్పు చేయడానికి రెడీ అయ్యాడు. చదువులు అన్నాక అవసరమైనవి కొనక తప్పదు. ఈ రోజుల్లో ఉన్నత చదువులకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సివస్తోంది. ఫీజులతో పాటు పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ల కోసం అదనంగా బడ్జెట్ సమకూర్చుకోవాల్సి వస్తోంది. దీంతో పిల్లల చదువులు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి. అయితే తమకు అలాంటి బాధ లేదంటున్నారు గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా ఇదార్ తహసీల్‌లోని గ్రామాలకు చెందిన ప్రజలు. ఎందుకంటే వారికి అండగా బాలగోపాల్ బ్యాంక్ ఉంది. నిజానికిది బ్యాంక్ కాదు, కోపరేటివ్ సొసైటీ!పల్కిన్ రావల్ అనే 12వ తరగతి విద్యార్థిని తాను కూడబెట్టిన డబ్బులతో ఇటీవల ల్యాప్‌టాప్ (Laptop) కొనుక్కుంది. పదో తరగతి ట్యూషన్ ఫీజు కూడా తన సేవింగ్స్ నుంచే కట్టింది. అంతేకాదు కొత్త సైకిల్ కూడా కొనుక్కుంది. బాలగోపాల్ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బుతో ఇవన్ని చేసింది. ఇంత చేసి ఆమెది ధనవంతులు కుటుంబమేమీ కాదు. ఇదార్ పట్టణంలో వాళ్ల నాన్న టీ స్టాల్ నడుపుతాడు. బాలగోపాల్ బ్యాంక్‌లో క్రమంగా తప్పకుండా చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే వారి అవసరాలు తీరుస్తోంది. పల్కిన్ రావల్ తోబుట్టువులు కూడా ఇదే బ్యాంక్‌లో పొదుపు చేస్తున్నారు. దాదాపు 30 వేల మందిపైగా పిల్లలు ఈ బ్యాంక్‌లో తమ డబ్బులు దాచుకుంటున్నారు. ఇలా పిల్లలు పొదుపు చేసిన మొత్తం రూ. 30 కోట్లు పైమాటే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ బాలగోపాల్ బ్యాంక్ (Bal Gopal Bank) ఇదంతా ఎలా చేయగలిగింది?ఎవరు స్థాపించారు?ఇదార్ పట్టణవాసి అశ్విన్ పటేల్ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ బాలగోపాల్ బ్యాంక్. 16 ఏళ్ల క్రితం ఆయన ఈ బ్యాంక్‌ను ప్రారంభించారు. రైతులకు, మహిళలకు సహకార సంఘాలు ఉన్నట్టుగా పిల్లలకు ఎందుకు లేవన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి సమాధానంగా 2009, మే 30న సబర్కాంత జిల్లాలోని జవాన్పురా గ్రామంలో 'బాలగోపాల్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ' స్థాపించారు. 100 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 335 గ్రామాల నుంచి 30 వేలమందిపైగా పిల్లలు సభ్యులుగా ఉన్నారు. దేశంలో పిల్లల కోసం నడుస్తున్న ఏకైక సహకార సంస్థ తమదేనని 58 ఏళ్ల అశ్విన్ పటేల్ వెల్లడించారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని బాలగోపాల్ బ్యాంక్‌గా పిలుస్తున్నారు. ఎలా పని చేస్తుంది?పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు రూ. 110 చెల్లించి బాలగోపాల్ బ్యాంక్‌లో ఖాతా తెరవాలి. వారికి సంస్థ ప్రతినిధులు ఒక పిగ్గీ బ్యాంక్ (డిబ్బి) ఇస్తారు. ఇందులో పొదుపు చేసిన డబ్బును ప్రతినెలా ఇంటికి వచ్చి తల్లిదండ్రులు లేదా పెద్దవారి సమక్షంలో లెక్కిస్తారు. తర్వాత ఈ మొత్తాన్ని తీసుకెళ్లి పిల్లల ఖాతాల్లో వేస్తారు. పొదుపు చేసిన డబ్బుకు సంవత్సరానికి 6 శాతం వడ్డీ చెల్లిస్తారు. పిల్లలు తమకు అవసరమైనప్పడు లోన్లు కూడా తీసుకోవచ్చు. వెయ్యి మందిపైగా రుణాలు తీసుకున్నారని బ్యాంక్ తెలిపింది. బాలగోపాల్ బ్యాంక్ పనితీరు ప్రశంసనీయంగా ఉండడంతో ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. 'మొదట్లో పిల్లలతో పొదుపు ప్రారభింపజేయడానికి స్థానిక పాఠశాలల్లో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. ఇప్పుడైతే తల్లిదండ్రులే తమ పిల్లలతో కలిసి వచ్చి బ్యాంక్‌లో ఖాతాలు తెరుస్తున్నార'ని అశ్విన్ పటేల్ తెలిపారు. 10 నుంచి 12 పిల్లలు తమ దగ్గర పొదుపు చేసిన డబ్బుతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజులు చెల్లించారని ఆయన వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 ఏళ్లలోపు ఎవరైనా తమ సంస్థలో డబ్బులు దాచుకోవచ్చని చెప్పారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని 'పిల్లల బ్యాంక్'గా పిలుస్తున్నారు.పేరెంట్స్ ప్రశంసలుబాలగోపాల్ బ్యాంక్ సేవలను పేరెంట్స్ ప్రశంసిస్తున్నారు. తమ పిల్లలు చిన్నతనం నుంచే ఆర్థిక అక్షరాస్యత, పొదుపు పాఠాలను ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్నారని వారు అంటున్నారు. డబ్బు పొదుపు ప్రాముఖ్యతతో పాటు, సేవ్ చేసిన సొమ్ములను సరైన వాటికి ఖర్చుచేయడం వారికి అలవాటు అవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు చేసిన డబ్బుతో పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.చదవండి: పిల్లలూ బ్యాంక్ తలుపు తట్టండి!పైలట్ ప్రాజెక్ట్‌గా.. బాలగోపాల్ బ్యాంక్ విజయవంతంగా నడుస్తుండడంతో దీన్ని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 25 పాఠశాలల్లో 'బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజన’ పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తోంది. 5 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల కోసం దీన్ని ప్రవేశపెట్టింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సొంత నియోజకవర్గం ఘట్లోడియాలోని గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజనను తాత్కాలికంగా అమలు చేస్తున్నారు. బాలగోపాల్ బ్యాంక్ గురించి తెలిసిన వారు తమ ప్రాంతంలోనూ ఇలాంటి పిల్లల బ్యాంకు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. -
సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్‌గా..!
మెటాలిక్ కలర్, మిర్రర్ వర్క్ డ్రెస్‌లో నటి ఖుషీ కపూర్ హ్యూందయ్ ఇండియన్ కొచర్ వీక్‌లో మెరిసిపోయారు. డిజైనర్ రిమ్జిమ్ దాదు చేసిన ఈ మోడర్న్ డిజైన్స్‌కి గుజరాతీ సంచార జాతుల హస్తకళ ప్రేరణగా నిలిచింది. ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కలర్స్‌కి తోడైన ప్రాచీన హస్తకళ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్‌గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్‌లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌ను ఆమె తన డిజైన్స్‌కి జత చేశారు.ఖుషీ కపూర్ ధరించిన కస్టమ్ టెక్ట్స్‌టైల్ బ్రాకెట్–స్టైల్ బ్లౌజ్, హై–వెయిస్టెడ్ లెహంగా ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వంటి వేడుకలలో హైలైట్‌గా నిలిచే లక్ష్యంతో ఈ డ్రెస్‌ను రూపొందించారు. మెటాలిక్ కలర్లోనే స్కర్ట్ అంతా మిర్రర్ వర్క్ చేశారు. బంజారా సంచార స్ఫూర్తితో ప్రేరణ పొందిన ఈ సేకరణలో మెటాలిక్ తీగలను ఉపయోగించారు. దీంతో బంజారా తెగ సాంస్కృతిక వారసత్వం హైలైట్ అయ్యింది. ‘బంజారాతో దుస్తులకు ఉన్న సంబంధాన్ని, అది తనకు తెచ్చిన అందం, సౌకర్యాన్ని ఇష్టపడుతున్నాన’ని ఖుషీకపూర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్‌గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్‌లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌ను ఆమె తన డిజైన్స్‌కి జత చేశారు. ఇతర మోడల్స్ ధరించిన డ్రెస్సులను డిజైనర్ దాదు తన బ్రాండ్ సిగ్నేచర్ మెటల్ వైర్ల నుండి రూపొందించిన టైలర్డ్ ఫారమ్స్, స్కల్ప్చర్ డ్రేప్లతో ఆకట్టుకుటోంది. ఈ డిజైన్స్‌లో పైస్లీ మోటిఫ్‌లు మెరుస్తూ ఆకట్టుకున్నాయి. మన దేశీయ వారసత్వ హస్తకళా సంపద ఎన్నటికీ వన్నెతగ్గదని నిరూపిస్తూ డిజైనర్లు స్ఫూర్తిమంతమైన డిజైన్స్ మన ముందుకు తీసుకువస్తూనే ఉంటారు. మన మూలాల గొప్పతనాన్ని ఎప్పటికీ నిలిచి ఉండేలా ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటారు. (చదవండి: సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..) -
ఈసీ పక్షపాత అంపైరింగ్: రాహుల్
ఆనంద్: ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పక్షపాత ఎంపైర్‌గా పనిచేస్తోందని క్రికెట్ పరిభాషలో మండిపడ్డారు. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఎన్నికల సంఘమే కారణమని విమర్శించారు. అప్పట్లో తప్పుడు ఓటర్ల జాబితాను ఈసీ రూపొందించిందని ఆక్షేపించారు. క్రికెట్లో మనం తప్పులు చేయకపోయినా పదేపదే ఔట్ అవుతున్నామంటే అందుకు అంపైర్ పక్షపాత వైఖరే కారణమవుతుందని చెప్పారు. శనివారం గుజరాత్‌లోని ఆనంద్ పట్టణంలో ‘సంఘటన్ సుజన్ అభియాన్’లో రాహుల్ పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ఒక దేవాలయంగా అభివర్ణించారు. అక్కడికి ఎవరైనా వచ్చి ప్రార్థనలు, పూజలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ, ప్రసాదం ఎవరికి దక్కాలన్నది బీజేపీ–ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తున్నాయని ఆక్షేపించారు. గుజరాత్లో అధికార బీజేపీని కచి్చతంగా ఓడించాలని, అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. గుజరాత్లో ఆ పార్టీని మట్టికరిపిస్తే కాంగ్రెస్‌కు ఇక తిరుగుండదని తేల్చిచెప్పారు. బీజేపీని గుజరాత్లో ఓడిస్తే ఎక్కడైనా ఓడించడం సులభమేనని సూచించారు. ‘మిషన్ 2027’రోడ్‌మ్యాప్‌పై ఈ కార్యక్రమంలో చర్చించారు. -
‘పెద్ద ప్లానే’.. నలుగురు ఉగ్రవాదుల ఆటకట్టించిన ఏటీఎస్
న్యూఢిల్లీ: నకిలీ కరెన్సీ రాకెట్‌ను నడుపుతూ, ప్రపంచ ఉగ్రవాద సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సాయపడుతున్న అల్ ఖైదాతో సంబంధం కలిగిన నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. పట్టుబడిన ఉగ్రవాద నిందితులు మొహమ్మద్ ఫైక్, మొహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీలు అల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను, అనుమానాస్పద యాప్‌లను ఉపయోగించారని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. అలాగే వీరు తమ జాడ తెలియకుండా ఉండేందుకు ఆటో డిలీట్ యాప్‌లను ఉపయోగించారని సమాచారం.ఈ నిందితులు చాలా కాలంగా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారని గుజరాత్ ఏటీఎస్ అధికారులు గుర్తించారు. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అల్-ఖైదాతో సంప్రదింపులు జరిపారని వెల్లడైందన్నారు. వారి చాట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురూ సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు సంప్రదించుకున్నారని, ఢిల్లీ నివాసి ఫైక్.. పాకిస్తాన్ ఇన్స్టాగ్రామ్ యూజర్‌తో పరిచయం పెంచుకుని, భారతదేశంలో జిహాదీ కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి చర్చించారని తమకు తెలిసిందని తెలిసిందని గుజరాత్ ఏటీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సునీల్ జోషి పేర్కొన్నారు.ఈ నలుగురు నిందితుల ప్రధాన ఎజెండా అల్‌ఖైదా భావజాలం వైపు యువతను ఆకర్షించడం. హింస ద్వారా షరియాను స్థాపించడానికి, తద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించేందుకు యవతను ప్రేరేపించేందుకు వారు పనిచేస్తున్నారని సునీల్ జోషి తెలిపారు. వారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లలో అల్‌ఖైదా సాహిత్యం, షరియాను స్థాపించాలని పిలుపునివ్వడం, మత విద్వేషాన్ని సృష్టించే ప్రకటనలు ఉన్నాయని ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఒకరు వెల్లడించారు.నిందితుల ప్రవర్తన ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించడానికి, భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని అణగదొక్కడానికి ఉపకరించేదిగా ఉందని డీఐజీ తెలిపారు. కాగా ఒసామా బిన్ లాడెన్ గురువు షేక్ అబ్దుల్లా అజ్జాం నెలకొల్పిన మఖ్తబ్ అల్-ఖిదామత్ నుండి అల్-ఖైదా ఉద్భవించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే సంస్థగా ఉంది. అల్-ఖైదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లోని పెషావర్‌లో విస్తరించి ఉంది. 1996 నుండి 2001 చివరి వరకు అల్‌ఖైదాను తాలిబాన్ రక్షణలో బిన్ లాడెన్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు పర్యవేక్షించారు. -
ఎయిరిండియా ఘటన.. ఆ మృతదేహాలు మా వాళ్లవి కావు
లండన్: గత నెలలో జరిగిన భారత విమానయాన చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఒకటైన అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదంపై మరో వివాదం నెలకొంది. ‘అహ్మదాబాద్ ఎయిరిండియా (Air India Flight 171) ప్రమాదంలో ఇద్దరు యూకే ప్రయాణికులు మృతి చెందారు. మృతదేహాల్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యుల నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వైద్యులు డీఎన్ఏ నమోనాల్ని సేకరించారు. వాటి ఆధారంగా ఘటనా స్థలంలో లభ్యమైన రెండు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులవేనంటూ యూకే కుటుంబసభ్యులకు అప్పగించారు.అసలు మృతదేహాలు ఎక్కడా?కానీ డీఎన్ఏ పరీక్షల్లో యూకే కుటుంబ సభ్యుల డీఎన్ఏకు.. భారత్ వైద్యులు అప్పగించిన మృతదేహాలకు డీఎన్ఏ వేరుగా ఉందని తెలిపారు. మరి యూకే మృతుల బంధువులకు అప్పగించిన మృతదేహాలు ఎవరివి? అసలు మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదే విషయంపై యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులు భారత్‌తో న్యాయపోరాటం చేస్తున్నారు. మృతదేహాల మార్పుపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.డీఎన్ఏ మ్యాచ్ అవ్వలేదుమృతదేహాల మార్పుపై బాధితుల తరుఫు న్యాయవాది జేమ్స్ హీలీ మీడియాతో మాట్లాడారు. ‘జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమానం ఏఐ 171 విమానంలో 12,13 సీట్లలో మా క్లయింట్ (యూకే ప్రయాణికులు) ప్రయాణించారు. మృతదేహాల గుర్తింపు కోసం మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరించారు. వాటి ఆధారంగా మృతదేహాల్ని గుర్తించారు. మాకు అప్పగించారు. మాకు అప్పగించిన మృతదేహాల్ని.. కుటుంబసభ్యుల డీఎన్ఏతో టెస్ట్ చేశాం. కానీ మాకు అప్పగించిన మృతదేహాల డీఎన్ఏకు, కుటుంబ సభ్యుల డీఎన్ఏకు మ్యాచ్ అవ్వడం లేదని వెల్లడించారు.260 మంది ప్రయాణికులు దుర్మరణంఅహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 241 మంది మృతిచెందారు. ఇక, ఈ విమానం అహ్మదాబాద్ మేఘాణి నగర్లో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో అందులోని పలువురు మృతిచెందారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో 260 మంది మృతి చెందగా వారిలో 19మంది ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీలో ఉన్నవారివేనని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి సూపరిటెండెంట్ రాకేష్ జోషి తెలిపారు. యూకే బాధిత ప్రయాణికులకు మద్దతుగా ఎయిరిండియాడీఎన్ఏ రిపోర్టుల ఆధారంగా మృతదేహాల్ని గుర్తించడం, కుటుంబ సభ్యులకు అప్పగించే బాధ్యత ఎయిరిండియాది కానప్పటికీ.. యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులకు ఎయిరిండియా యాజమాన్యం అండగా నిలిచింది. బాధితుల మృతదేహాలను గుర్తించే విషయంలో తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన యూకే ప్రయాణికుల మృతదేహాల్ని డీఎన్ఏ ఆధారంగా గుర్తించారు. ఆ మృతదేహాల్ని అంతర్జాతీయ అత్యవసర సేవ కెన్యన్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను ఉపయోగించింది. ఎయిర్ ఇండియా కార్గో ద్వారా మృతదేహాల అవశేషాలను మోసుకెళ్లే శవపేటికలను యూకేకి పంపారు. -
సము‘చీతా’ స్థానం
మన దేశంలో అంతరించిపోయిన చీతాలను పునరుద్ధరించడం కోసం చేపట్టిన ఆపరేషన్ చీతా ప్రాజెక్టును విజయవంతం చేయడానికి యత్నాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల పునరావాసం కష్టమని తేలడంతో ప్రత్యామ్నాయంగా గుజరాత్‌లోని కచ్ జిల్లా బన్ని గడ్డి మైదానాలను ఎంపిక చేశారు. దేశంలో చీతాల సంతతి పునరుద్ధరణ కోసం 2022లో ప్రాజెక్టు చీతా ప్రారంభించారు. నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12 కలిపి మొత్తం 20 చీతాలను తీసుకువచ్చారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడతల వారీగా వదిలారు. కానీ కునో పార్కు చీతాలకు అనువైంది కాదని ఆ తర్వాత వెల్లడైంది. ఫలితంగా అవి మృత్యువాతపడడం మొదలైంది. కొన్ని చీతాలు పిల్లలు పెట్టినా చాలా వరకూ చనిపోయాయి. మొత్తం 10 చీతాలు చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది. ఆసియాలో జీవించిన చీతాలు, ఆఫ్రికన్ అడవుల్లోని చీతాలకు చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికితోడు కునో పార్కు ఆఫ్రికన్ గడ్డి మైదానాల తరహాలో లేకపోవడం, పరిమితమైన అటవీ ప్రాంతం, వాటికి అవసరమైన ఆహార జంతువుల కొరత, అడవిలో గడ్డి పరిధి ఎక్కువగా ఉండడంతో చీతాల వేగానికి ఆటంకం కలగడం, వాతావరణ మార్పులతో ఇన్ఫెక్షన్లు సోకడం, మానవ జోక్యం ఎక్కువ కావడం వల్ల అవి జీవించలేకపోతున్నట్లు తేలింది. – సాక్షి, అమరావతిబన్ని గడ్డి మైదానాలే ఎందుకంటే?ఈ నేపథ్యంలో చీతాల సంరక్షణకు ఆఫ్రికన్ గడ్డి మైదానాల తరహా ప్రాంతం కోసం అటవీ అధికారులు అన్వేషించారు. చివరికి కచ్ ప్రాంతంలోని బన్ని గడ్డి మైదానాలు అనువుగా ఉంటాయని తేల్చారు. ఇవి భారతదేశంలో ఉన్న అతి పెద్ద గడ్డి మైదానాలు. సుమారు 2,618 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి.తక్కువ పొడవు ఉండే గడ్డి, మృదువైన నేల, ఎక్కువ ఎండ, తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం. అలాగే చీతాలకు ఆహారంగా జింకలు, దుప్పులు ఇతర జంతువులు సహా అనేక జీవులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఆఫ్రికాలో చీతాలు నివసించే సహజమైన గడ్డి మైదానాల మాదిరిగానే బన్ని గడ్డి భూములు ఉంటాయి. ఈ ప్రాంతంలో జనసాంద్రత కూడా తక్కువగా ఉండటం వల్ల వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.కునో పార్కులో మిగిలిన 24 చీతాలు ఈ నేపథ్యంలోనే చీతాలను అక్కడ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ అటవీ శాఖ వన్యప్రాణుల ప్రధాన సంరక్షణాధికారి జైపాల్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటికే బన్ని గడ్డి మైదానాల్లో 500 ఎకరాల్లో బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు చీతాలు తిరగడానికి వీలుగా వలయాకారంలో భారీ ఫెన్సింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సరిపోయే ఆహార శ్రేణిని అభివృద్ధి చేస్తున్నారు. డ్రోన్ మానిటరింగ్, సీసీ టీవీ వ్యవస్థలు, అటవీ సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కునో పార్కులో 24 చీతాలు ఉన్నాయి. అందులో 12 పిల్లలు. మొదటి విడతగా పది చీతాలను బన్ని గడ్డి మైదానాల్లో వదలాలని భావిస్తున్నారు.కొత్త ప్రణాళికతో ముందుకు1952లోనే చీతాలు అధికారికంగా భారతదేశంలో అంతరించిపోయిన జాతిగా ప్రకటించారు. 70 ఏళ్ల తర్వాత 2022లో ప్రాజెక్టు చీతా ద్వారా మళ్లీ వాటిని ఆఫ్రికా దేశాల నుంచి మన దేశానికి తీసుకురాగలిగారు. అయితే ఆఫ్రికన్, ఆసియా చీతా జాతుల మధ్య ఉన్న తేడాలు, వాటి ఆవాసానికి సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయకపోవడం, ప్రణాళికా లోపం వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఈ మూడేళ్లలో ఎదురైన అనుభవాలతో ఇప్పుడు కొత్త ప్రణాళికతో ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే గుజరాత్ బన్ని గడ్డి మైదానాలను ఎంపిక చేశారు. -
Gujarat: కుటుంబాన్ని బలిగొన్న రూ. ఐదువేల ఈఎంఐ?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. శనివారం (జూలై 19) రాత్రి బాగోద్ర గ్రామంలో ఒకే కుటుంబానికి ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న వీరు విషం తాగారనే అనుమానాలున్నాయి. మృతుల్లో భర్త, భార్య వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు.కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను విపుల్ కాంజి వాఘేలా (34), అతని భార్య సోనాల్ (26), వారి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవానిగా పోలీసులు గుర్తించారు. వీరి కుటుంబం మొదట గుజరాత్‌లోని ధోల్కాలో ఉండేది. విపుల్ వాఘేలా ఆటో రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, బాగోద్ర పోలీసులు, 108 అంబులెన్స్ బృందం, అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే కాంజి వాఘేలా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.విపుల్ బావమరిది ఈ ఘటన గురించి మాట్లాడుతూ విపుల్ రుణం తీసుకుని ఆటోరిక్షాను కొనుగోలు చేశాడని, ప్రతీనెలా రూ. ఐదువేల ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు. ఆ భారమే అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చని అన్నారు. కాగా ఈ ఐదు మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం బాగోద్ర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు విపుల్ బంధువులను, పొరుగవారిని, పరిచయస్తులను విచారిస్తున్నారు. -
ఈ అరకొర నివేదిక దేనికి?!
ఒక పెను విషాదంపై జరిగే దర్యాప్తు ఎంతో బాధ్యతాయుతంగా వుండాలి. ఆ ఉదంతంలో అసలు జరిగిందేమిటో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అస్పష్టతకు తావీయకూడదు. ప్రాథమిక దర్యాప్తుకైనా, పూర్తిస్థాయి దర్యాప్తుకైనా ఇదే వర్తిస్తుంది. కానీ గత నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం విషయమై శుక్రవారం అర్ధరాత్రి వెలువరించిన ప్రాథమిక దర్యాప్తు ఆ నియమాలను ఉల్లంఘించింది. బాధిత కుటుంబాల్లో అయోమయాన్ని మరింత పెంచింది. ఆ ప్రమాదం వైమానిక ప్రమాదాల చరిత్రలో పెద్దది. ఆ విషాద ఘటన సమ యంలో విమానంలో 242 మంది ప్రయాణికులుండగా, ఒకరు క్షేమంగా బయటపడ్డారు. భవంతిపై కూలినందువల్ల అక్కడున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఇంధనాన్ని నియంత్రించే స్విచ్‌లు రెండూ ఆపివేసి వుండటం వల్లనే ప్రమాదం జరిగివుండొచ్చని దర్యాప్తు చేస్తున్న విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక భావించింది. ఇది కేవలం ప్రాథమిక నివేదికే గనుక వెంటనే నిర్ణయానికి రావటం తగదని కేంద్ర వైమానిక మంత్రిత్వ శాఖ అంటున్నది. మంచిదే. అటువంటప్పుడు ఏఏఐబీ నివేదిక స్విచ్‌ల విషయంలో మరింత సమాచారం అందాకే వాటిని ప్రస్తావించి వుండాల్సింది. పైలెట్ల సంఘం కూడా నివేదికను తప్పుబడు తోంది. పైలెట్ల తప్పిదమే కారణమని అర్థం వచ్చేలా నివేదిక వుండటం సరికాదని విమర్శిస్తున్నారు. దర్యాప్తులో తమ ప్రతినిధికి ఇప్పటికైనా చోటీయాలని వారు అంటున్నారు. ఈ అయోమయం ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో వున్న బాధిత కుటుంబాలను మరింత నొప్పించదా? అంతర్జాతీయ వైమానిక నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన ఏడాదిలోగా తుది నివేదిక రావాలి. ఈలోగా విడుదల చేసే ప్రాథమిక నివేదిక పైలెట్లను తప్పుబట్టే విధంగా వుండటం, ఆ తర్వాత దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదనటం న్యాయమేనా? ఘటనా స్థలంలో దొరికిన స్విచ్‌లున్న పరికరంలో అవి రెండూ ‘ఆన్’ చేసివున్నాయి. కానీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలెట్ మరొకరితో ‘ఇంధనం ఎందుకు నిలిపివేశావ్’ అని అడగటం, అందుకు రెండో పైలెట్ ‘నేనలా చేయలేదే...’ అంటూ జవాబివ్వటం వినబడటాన్నిబట్టి స్విచ్‌లు ఆపివేసి వున్నట్టు దర్యాప్తు బృందం నిర్ధారణకొచ్చింది. కానీ రెండో పైలెట్ ఆ వెంటనే వాటిని సరిచేసి వుండొచ్చని, అందుకే అవి సక్రమంగా వున్న స్థితిలో లభించాయని నివేదిక అంటున్నది. ఈ సంభాషణల్లో అడిగిన వారెవరో, జవాబిచ్చిన వారెవరో దర్యాప్తు చేసినవారు గుర్తించారా?గుర్తించి వుంటే ఆ సంగతి వెల్లడించటానికి వారికున్న అభ్యంతరమేమిటి? ఒకవేళ అలాంటి అభ్యంతరం వున్నప్పుడు అసలు ఆ సంభాషణను బయటపెట్టడం దేనికి? విమానంలోని యాంత్రిక వ్యవస్థలు సంక్లిష్టమైనవి. విమాన గమనంలో మనుషుల జోక్యం దాదాపు అవసరం లేని ‘ఫ్లై బై వైర్’ వ్యవస్థ అందుబాటులోకొచ్చి దశాబ్దాలవుతోంది. ముఖ్యంగా విమానం టేకాఫ్ సమయంలోనూ, దిగే సమయంలోనూ ఆ వ్యవస్థ పూర్తిగా తనకు తానే అన్నిటినీ సరిచేసుకుంటుంది. పైకెగిరినప్పుడూ, కిందకు దిగినప్పుడూ అవసరమైన ఇంధనం సరఫరా అయ్యేలా చూసుకుంటుంది. ఇవి విఫలమైన పక్షంలో పైలెట్ అవసరమైన మార్పులు చేసుకోవ డానికే స్విచ్‌లుంటాయి. రెండు స్విచ్‌లకూ రెండువైపులా రింగ్‌లుంటాయి. వాటికి ప్రత్యేక లాకింగ్ వ్యవస్థ వుంటుంది. మనిషి ప్రత్యేకించి వాటిని స్విచాన్ చేయటానికైనా, స్విచాఫ్ చేయటానికైనా ముందు ఆ లాకింగ్‌ను తెరవక తప్పదు. రెండు స్విచ్‌లూ ఆగిపోవటానికి మధ్య సెకను వ్యవధి వుందని తేల్చారు. పైగా పైకెగురుతున్న సమయంలో ఎక్కువ ఇంధనం సరఫరా కావాల్సి వుండగా దాన్ని కావాలని ఏ పైలెట్ కూడా స్విచాఫ్ చేయడు. దానిపై దర్యాప్తు బృందం ఏ నిర్ధారణకూ రాలేదు. పైలెట్లుగా వ్యవహరించినవారి చరిత్ర చూసినా ఉద్దేశపూర్వకంగా ఆపివుంటారని ఊహించటం అసాధ్యం. ప్రధాన పైలెట్ సుమీత్ సభర్వాల్‌కు బోయింగ్ 787ను 8,600 గంటలు నడిపిన సర్వీస్ (మొత్తంగా 15,638 గంటల సర్వీస్) వుండగా, కో పైలెట్ క్లైవ్ కుందేర్‌కు బోయింగ్‌పై 1,100 గంటల అనుభవం, మొత్తంగా 3,403 గంటల అనుభవం వుంది. ఇద్దరూ ఈ విమానం నడపటానికి ముందు తగినంత విశ్రాంతి తీసుకున్నవారే. ప్రధాన పైలెట్ పర్యవేక్షణలో కో పైలెట్ ఇష్టానుసారం చేయటం సాధ్యపడదు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగివుంటే వాగ్వాదం చోటుచేసు కునేది. అది రికార్డయ్యేది. పూర్తి స్థాయి పారదర్శకతకు దర్యాప్తు సంస్థ ఎందుకు వెనకాడుతోంది? ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను కేవలం ఒక ప్రశ్న, జవాబు స్థాయికి కుదించటంలోని మర్మమేమిటి? అటు తర్వాత లేదా అంతకుముందు వారేం మాట్లాడుకున్నారు? ఇది చెప్పకపోతే పైలెట్లలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడ్డారా అనే సంశయం బయల్దేరుతుంది. ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ వెబ్సైట్ ప్రధాన సంపాదకుడు జెఫ్రీ థామస్ అడుగుతున్నది ఇదే. దర్యాప్తు ఫలితాల గురించి అంతర్జాతీయంగా అనేకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రకం విమానాలను బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ, వర్జిన్ అట్లాంటిక్ సంస్థ ప్రధానంగా వినియోగిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక విడుదల చేయటం స్వాగతించదగిందే. కానీ ఇప్పటికే వున్న సంశయాలను మరింత పెంచేలా, అస్పష్టత అలుముకునేలా అది వుండటం సరికాదు. పైలెట్ల మధ్య జరిగిన సంభాషణ పూర్తి పాఠం విడుదల చేస్తే అటు పైలెట్ల సంఘం అభ్యంతరాలతోపాటు, ఇటు బాధిత కుటుంబాల సంశయాలు కూడా సమసిపోతాయి. -
17కు పెరిగిన మృతుల సంఖ్య
వడోదర/అహ్మదాబాద్: గుజరాత్‌లోని వడోదర జిల్లాలో బుధవారం ఉదయం వంతెన పాక్షికంగా కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య గురువారానికి 17కు పెరిగింది. ఇంకా ఆచూకీలేకుండా పోయిన నలుగురి కోసం మహిసాగర్ నదీప్రవాహం వెంట ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల బృందాలు విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే 40 ఏళ్లనాటి ఏకైక గంభీర్ వంతెన కుప్పకూలడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. ‘‘పాద్రా పట్టణ సమీపంలో కూలిన గంభీర–ముజ్పూర్ వంతెన వద్ద గాలింపు కొనసాగుతోంది. వర్షాలు, నదీ ప్రవాహం వెంట బురద కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కల్గుతోంది’’ అని వడోదర జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహన్ ఆనంద్ చెప్పారు. నదీ ప్రవాహం మధ్యలో పడిపోయిన వాహనాలను లాగేందుకు, గాలింపు చర్యల కోసం తాత్కాలికంగా ప్రత్యేక వంతెనను నిర్మించామని వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా చెప్పారు. నాలుగేళ్లలో 16 వంతెన ప్రమాదాలువంతెన కూలిన ఘటనపై విపక్ష కాంగ్రెస్ స్పందించింది. ‘‘ గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 16 వంతెన దుర్ఘటనలు జరిగాయి. ఈ అంశంలో సిట్‌తో దర్యాప్తు చేపట్టాల్సిందే. లేదంటే ఉద్యమం చేస్తాం. ప్రభుత్వపాలన అమోఘంగా ఉందంటూ ప్రసంగాలు, అడ్వరై్టజ్మెంట్లు ఇవ్వడంలోనే బీజేపీ నాయకత్వం, ప్రభుత్వ అధికారులు బిజీగా ఉన్నారు’’ అని కాంగ్రెస్ విమర్శించింది. రాష్ట్రంలో నాయకత్వలోపం ఉందని, ఇలాంటి ప్రభుత్వానికి ఓటర్లు సరైన సమయంలో బుద్ధి చెప్తారని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనలో వంతెనల తనిఖీలో నిర్లక్ష్యం వహించారంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు చెందిన నలుగురు ఇంజనీర్లను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గురువారం సస్పెండ్ చేశారు. రోడ్లు, భవనాల శాఖను ఆయన దగ్గరే ఉంది. -
పనికి రాదని చెప్పినా పట్టించుకోలేదు (చిత్రాలు)
-
‘మేం వాళ్లలా కాదు’: గుజరాతీయుల బాషా మర్యాద
న్యూఢిల్లీ: దేశంలో బాషా వివాదాలు నడుస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో అవి తారాస్థాయికి చేరాయి. రాజకీయాలపైన కూడా ప్రభావం చూపుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ బాషాభిమానం పొంగిపొర్లుతున్న వేళ.. అందుకు భిన్నంగా మాట్లాడిన గుజరాతీయులకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గుజరాత్‌కు సంబంధించిన ఈ వీడియోలో గుజరాతీ బాష తెలియని వ్యక్తితో స్థానికులు హృదయపూర్వకంగా హిందీలో మాట్లాడటం కనిపిస్తుంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ జై పంజాబీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అతను గుజరాత్‌కు చెందిన పలువురిని ఇంటర్వ్యూ చేశారు. ప్రతి ఇంటర్వ్యూ ప్రారంభంలో, తాను గుజరాత్లో నివసిస్తున్నప్పటికీ, తనకు గుజరాతీ బాష మాట్లాడటం రాదని, అర్థం చేసుకోలేనని అతను స్పష్టంగా చెబుతాడు.ఈ సమయంలో అతను ఇంటర్వ్యూ చేసిన ప్రతీ ఒక్కరూ హిందీలో మాట్లాడేందుకు అంగీకరించారు. వారు హిందీలో మాట్లాడుతూ తమ రాష్ట్రానికి వచ్చే అతిథులకు గుజరాతీ రాకపోయినా, వారిని స్వాగతించడం గుజరాతీయుల విధి అని అన్నారు. మీకు గుజరాతీ తెలియదు కనుకనే తాము హిందీలో మాట్లాడుతున్నామని, లేనిపక్షంలో గుజరాతీలో మాట్లాడేవారిమని తెలిపారు. ఇతరులతో హిందీలో మాట్లాడేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని గుజరాతీయులు స్పష్టం చేశారు. View this post on Instagram A post shared by Jai Punjabi (@jaipunjabii) -
గుజరాత్లో ఘోరం
వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితంనాటి పాత వంతెన కుప్పకూలిన ఘటనలో 13 మంది వాహనదారులు జలసమాధి అయ్యారు. నదీప్రవాహంలో పడి ప్రయాణికులతోసహా ట్రక్కులు, వ్యాన్లు, ఆటో, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు వడోదర జిల్లాలోని మహీసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో ఈ ఘోరం జరిగింది. పద్రా పట్టణ సమీపంలో నిర్మించి ఈ వంతెన కూలడంతో వడోదర, ఆనంద్ నగరాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపో యాయి. నదీ ప్రవాహంలో నిర్మించిన రెండు పిల్లర్ల మధ్యలోని శ్లాబులు పూర్తిగా కుప్పకూలడంతో ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉందని వడోదర రూరల్ ఎస్పీ రోహన్ ఆనంద్ చెప్పారు. నదిలో పడగా నే కొందరిని స్థానికులు కాపాడారు. రక్షించిన వారిలో గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్రిడ్జ్ కూలడంతో ఒక ట్యాంకర్ కొనకు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. దీంతో 4 గంటలపాటు శ్రమించి వెనక్కిలాగారు. కానీ అందులోని డ్రైవర్ ఆచూకీ గల్లంతైంది.బిడ్డను కాపాడాలంటూ తల్లి రోదనబ్రిడ్జి కూలినప్పుడు కొన్ని వాహనాలు నది ప్రవాహం మధ్యలో పడి కొట్టుకుపోతే మరికొన్ని ఒడ్డు వైపున పడిపోయాయి. అప్పుడు ఒక ప్రయాణికుడు కారుతోసహా నదినీటిలో చిక్కుకు పోయాడు. అతని తల్లి మాత్రం క్షేమంగా బయటపడింది. నడుం లోతు ఉన్న నీటిలో నిలబడి ఒడ్డు వైపున్న స్థానికులను తల్లి ఏడుస్తూ వేడుకుంటున్న వీడియో చూపరులను కంటతడి పెట్టించింది. ‘‘నా బిడ్డ ఇందులో ఇరుక్కుపోయాడు. నది నీటిలో మునిగిపోయి విలవిల్లాడిపోతున్నాడు. కాపాడండయ్యా’’ అంటూ ఆమె దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం ఆ మహిళ తన భర్త, కుమారుడు, కుమార్తె, అల్లుడితో కలిసి కారులో బాగ్దానాకు వెళ్తోంది. కారు నీటిలో పడినప్పుడు వెనకవైపు అద్దం పగలగొట్టి బయ టపడింది. కుమారుడు మాత్రం నదిలో మునిగిన వాహనంలో ఇరుక్కుపోయాడు.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీదుర్ఘటన వార్త తెల్సి మోదీ, రాష్ట్ర సీఎంభూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగా త్రులకు తలో రూ.50వేల సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.4 లక్షలు ఇస్తామని సీఎం చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వంతెన కూలడంతో ఇలాంటి పాత వంతెన పటిష్టతపై సమీక్ష జరపాలని రాష్ట్ర అధికారులకు ప్రధాని సూచించారు. 1981లో వంతెన నిర్మాణాన్ని మొదలెట్టి 1985లో వాహన రాకపో కలకు అందుబాటులోకి తెచ్చారు. మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 23 పిల్లర్లతో నదిపై 900 మీటర్ల పొడవునా బ్రిడ్జిని నిర్మించారు. అయితే వడోదర, ఆనంద్ నగరాలను కలిపే ఏకైక వంతెన కావడంతో దీనిపై వాహన రద్దీ ఎక్కువై పాడైందని స్థానికులు చెబుతున్నారు. కొత్త వంతెన కోసం మూడు నెలల క్రితమే రూ.212 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయని తెలు స్తోంది. వంతెన పరిస్థితి దారుణంగా ఉందని, రాకపోకలను నిలిపివేయాలని 2017లోనే కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
పొలిటికల్ రిటైర్మెంట్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి విరమణ అనంతరం తన భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(60) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విరమణ అనంతరం అనంతరం భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెడతానని అన్నారాయన. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన 'సహకార్ సంభాద్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నా. రసాయన ఎరువులతో పండించే పంటలతో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది అని అన్నారాయన. సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు మాత్రం.. హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని నేను భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని షా సంతోషంగా చెప్పారు. అయితే రిటైర్మెంట్ ఎప్పుడనేది మాత్రం ఆయన చెప్పలేదు. సహకార శాఖ మంత్రిగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు అమిత్ షా తొలి మంత్రిగా నియమితులయ్యారు. సహకార్ సే సమృద్ధి అనే నినాదంతో ఈ శాఖ గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తోంది. ఈ శాఖ ఏర్పాటునకు ముందు వ్యవసాయ శాఖ సహకార సంఘాల కార్యకలాపాలను చూసుకునేది. అమిత్ షా రాజకీయ ప్రస్థానం.. 1980లలో RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ద్వారా సామాజిక సేవలోకి ప్రవేశించారు. 1983లో ABVP (RSS విద్యార్థి విభాగం)లో చేరారు. 1987లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. యువజన విభాగమైన బారతీయ జనతా యువ మోర్చాలో కీలక పాత్ర పోషించారు. 1997లో గుజరాత్‌లోని సర్కేజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. గుజరాత్లో 2002–2010 మధ్య హోం, న్యాయ, ట్రాన్స్పోర్ట్, జైలు, నిషేధం వంటి పలు శాఖల మంత్రిగా పనిచేశారు.నరేంద్ర మోదీతో షాకు బలమైన అనుబంధం ఉంది. గుజరాత్ రాజకీయాల్లో మోదీకి అత్యంత విశ్వసనీయుడిగా ఎదిగారు. మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదిగే దారిలో కీలక పాత్ర పోషించారు. 2014లో BJP జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన వ్యూహాలతోనే BJP అనేక రాష్ట్రాల్లో విజయం సాధించింది. 2014 & 2019 లోక్‌సభ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. యూపీలో 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలవడమూ(2014లో 71 సీట్లు) అమిత్ షా వ్యూహాత్మక నాయకత్వ ఫలితమే. 2019లో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370 రద్దు, CAA వంటి కీలక నిర్ణయాల్లో కీలక భూమిక పోషించారు. 2021లో కేంద్రం కొత్తగా తెచ్చిన సహకార మంత్రిత్వ శాఖకు తొలి మంత్రిగా నియమితులయ్యారు. -
అప్పుడు మోర్బీ.. ఇప్పుడు గాంభీరా!
గుజరాత్లో జరిగిన ఘోర బ్రిడ్జి ప్రమాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి బ్రిడ్జి చీలిపోయి కుప్పకూలిపోవడంతో.. ఐదు వాహనాలు మహీసాగర్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ వంతెనకు మరమ్మత్తులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తుండడం విశేషం. గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఘోరం జరిగింది. పాడ్రా తాలుకాలో ఆనంద్-వడోదర జిల్లాలను కలిపే గాంభీరా వంతెనలో ఓ స్లాబ్ బుధవారం ఉదయం విరిగిపడింది. ఈ హఠాత్ పరిణామంతో రెండు ట్రక్కులు, రెండు వ్యానులు, ఓ ఆటో కింద ఉన్న మహీసాగర్ నదిలో పడిపోయాయి. ప్రమాదం ఉదయం వేళ ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలోనే జరిగింది. ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. పిల్లర్స్ మధ్య భాగం పూర్తిగా కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఘటన సమయంలో ఓ ట్యాంకర్ బ్రిడ్జి అంచునకు వచ్చి ఆగిపోయింది. ఆ ట్యాంకరే అడ్డు లేకుంటే మరికొన్ని వాహనాలు పడిపోయి మరింత నష్టమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు, వడోదర జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడోదర కలెక్టర్‌ను సంప్రదించి.. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు & భవనాల శాఖను ఈ ప్రమాదంపై తక్షణ విచారణ చేపట్టాలని ఆదేశించారాయన. ఫైర్ బ్రిగేడ్, బోట్లు, డైవర్స్, NDRF బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టాయి. క్రేన్ల సహాయంతో వాహనాల్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు.. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడినవారికి ₹50,000 నష్ట పరిహారాన్ని పీఎంవో ప్రకటించింది. గాంభీరా బ్రిడ్జ్.. గుజరాత్-సౌరాష్ట్రను కలిపే కీలక మార్గం. 1985లో దీనిని ప్రారంభించారు. ఇది ఆనంద్, వడోదర, భరూచ్, అంక్లేశ్వర్ మధ్య ప్రయాణించే వారికీ ప్రధాన రూట్ కావడంతో నిత్యం వాహన రద్దీ ఉంటుంది. అయితే చాలా కాలంగా ఈ బ్రిడ్జి పాడైపోయిన స్థితిలో ఉందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. తరచూ ఈ వంతెన సూసైడ్ స్పాట్‌గా మారిందని, పోలీసులు కూడా ఇక్కడ నిఘా వహించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే.. How this happened ? “The Gambhira Bridge connecting Vadodara and Anand has collapsed in the middle. Several vehicles are feared to have fallen into the river; rescue operations are ongoing.”The middle portion just vanished. #Vadodara pic.twitter.com/t2yZSoXexz— Kumar Manish (@kumarmanish9) July 9, 2025ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. బ్రిడ్జికి అవసరమైనప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం దర్యాప్తులోనే బయటపడుతుందని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్ అంటున్నారు. తాజా గాంభీరా బ్రిడ్జి ప్రమాద నేపథ్యంలో.. మూడేళ్ల కిందట జరిగిన గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ప్రమాదం తెర మీదకు వచ్చింది. మోర్బీ బ్రిడ్జ్ ప్రమాదం.. భారతదేశంలో అత్యంత ఘోరమైన ఘటనలలో ఒకటి. 2022 అక్టోబర్ 30వ తేదీన మోర్బీ జిల్లా కేంద్రంలో మచ్చు నదిపై ఉన్న జూల్తో పుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 141 మంది మరణించారు. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్.. మరమ్మత్తుల తర్వాత అక్టోబర్ 26న తిరిగి ప్రారంభమైంది, అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండానే ఈ బ్రిడ్జిని తెరిచినట్టు తేలింది. కేబుల్స్ తుప్పుపట్టినవి, బోల్టులు సడలిపోయినవి, అధిక బరువు ఉన్న ఫ్లోరింగ్ వేశారని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఓరేవా గ్రూప్ అనే ప్రైవేట్ సంస్థ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యత తీసుకుంది, కానీ సరైన అనుమతులు లేకుండానే తెరిచినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. #Gujarat Sad news coming, of a Cable Bridge collapse in Morbi of Gujarat, reports of many injuries as per initial reports.PM @narendramodi ji seeks urgent mobilisation of teams for rescue ops after cable bridge collapse in Gujarat's Morbi#PMModi #Gujarat #Morbi #Cablebridge pic.twitter.com/RyTA7nXeVm— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 30, 2022 ప్రమాదం జరిగిన సమయంలో 500 మందికి పైగా బ్రిడ్జ్‌పై ఉన్నారు, కానీ దాని సామర్థ్యం 125 మంది మాత్రమే. బ్రిడ్జ్ సడెన్‌గా విరిగిపడి, ప్రజలు మచ్చ్ఛు నదిలో పడిపోయారు. మృతుల్లో చాలా మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ వేయించి దర్యాప్తు చేయించింది. ఈ కేసులో ఓరేవా సంస్థ మేనేజర్లు, టికెట్ క్లర్కులు, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు.. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి మోదీ సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలకు పరామర్శ తెలిపారు కూడా. -
గుజరాత్ లోని పద్రా వద్ద కూలిన బ్రిడ్జి
-
ఒక్కసారిగా కూలిపోయిన వంతెన.. ట్రక్కు, కార్లు నదిలో పడిపోయి..
గాంధీనగర్: గుజరాత్ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలిపోయింది. ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో దానిపై నడిచే వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. కొందరు ప్రయాణీకులు గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని ఆనంద్ పట్టణం, వడోదరలను కలుపుతూ మహిసాగర్ నదిపై పద్రా వద్ద గంభీర వంతెన ఉంది. బుధవారం ఉదయం గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే.. సహాయక బృందాలు అక్కడి చేరుకుని నదిలో ఉన్న వారిని రక్షించారు. వాహనాల నుంచి ఇప్పటివరకు నలుగురిని రక్షించారని.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. Gujarat’s Gambhira Bridge Collapse Kills Nine, Severs Key Vadodara–Anand Routehttps://t.co/aYn6KEELhi— DeepNewz (@deepnewzcom) July 9, 2025 #WATCH | Vadodara, Gujarat | The Gambhira bridge on the Mahisagar river, connecting Vadodara and Anand, collapses in Padra; local administration present at the spot. pic.twitter.com/7JlI2PQJJk— ANI (@ANI) July 9, 2025అయితే, వంతెన పాతబడడంతో పాటు.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేశారు. వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. How this happened ? “The Gambhira Bridge connecting Vadodara and Anand has collapsed in the middle. Several vehicles are feared to have fallen into the river; rescue operations are ongoing.”The middle portion just vanished. #Vadodara pic.twitter.com/t2yZSoXexz— Kumar Manish (@kumarmanish9) July 9, 2025#BREAKING 2 people dead in Gujatat bridge collapse A portion of the decades-old Gambhira bridge, connecting Vadodara & Anand near Padra has collapsed over the Mahisagar river The 45yr old structure gave way while vehicles were passing over it, plunging at least four into… pic.twitter.com/VwVJXxym8p— Nabila Jamal (@nabilajamal_) July 9, 2025 -
మనోళ్ల అక్రమ వలసలు తగ్గాయి
వాషింగ్టన్: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 10,300 మందికి పైగా భారతీయులు అక్రమంగా అమెరికా లోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. అయితే 2024తో పోలిస్తే భారతీయుల అక్రమ వలసలు 70 శాతం తగ్గినట్టు వెల్లడించింది. గతేడాది జనవరి– మే మధ్య 34,535 మంది భారతీ యులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. అంటే సగటున రోజుకు 230 మంది! 2025లో ఇది రోజుకు 69కి తగ్గింది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కఠినతరం చేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. అమెరికా లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో గుజరాత్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ఊహించే స్మగ్లింగ్ సిండికేట్ 2024 చివరి నుంచి తమ కార్యకలాపాలను తగ్గించిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 6 లక్షలకు పైగా అక్రమ వలసదారులను అమెరికా సరిహద్దుల వద్ద అరెస్టు చేసింది. 2024లో ఇదే కాలంలో 12,33,959 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో 30 మంది ఒంటరి మైనర్లున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 500 మందికి పైగా భారతీయ మైనర్లను అమెరికా అరెస్టు చేసింది. అనేక దేశాల నుంచి ఏటా వేలాది మంది తమ పిల్లలను అమెరికా–మెక్సికో, అమెరికా–కెనడా సరిహద్దులో వదిలి వెళ్తారు. వారికి అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఇలా చేస్తుంటారు. ఈ పిల్లలంతా 12–17 ఏళ్లు, అంతకంటే చిన్న వయసు వారని నివేదికలు చెబుతున్నాయి.పత్రాల్లేని వారు 2.2 లక్షలుడిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 2024 ఏప్రిల్ నివేదిక ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతి పత్రాలూ లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివకరూ 332 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. అయినా ప్రమాదకరమైన డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి భారతీయులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లోనూ వెళ్తున్నారు. గత మే 9న కాలిఫోర్నియా తీరంలోని డెల్మార్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 ఏళ్ల భారతీయ బాలుడు, అతని 10 ఏళ్ల అతని సోదరి మరణించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Ahmedabad: ఎయిరిండియా విమానం ప్రమాదానికి కారణం ఏంటంటే?
సాక్షి,ఢిల్లీ: భారత విమానయాన చరిత్రలో ఘోర విషాదంగా నిలిచిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చినట్లు బ్లూబెర్గ్ నివేదించింది. విమాన దుర్ఘటనకు కారణం రెండు ఇంజిన్లు విఫలం కావడం వల్లేనని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు భావిస్తున్నారు. కాబట్టే విమాన సిబ్బంది ప్రమాదాన్ని నిరోధించే ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని, తద్వారా అపార ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలుస్తోంది. విమానంలో అత్యవసర విద్యుత్ సరఫరా కోసం ఉపయోగించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) యాక్టివేషన్ యాక్టివేట్ కావడం వల్ల విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం వల్లేనని తేలింది. కానీ,సాధారణ లోపాల వల్ల ప్రమాదం జరగలేదని తేటతేల్లమైంది. వీటితో పాటు విమాన ప్రమాదానికి గల కారణాల్ని రాబట్టేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) డేటాను విశ్లేషిస్తున్నారు. ఇది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించనుంది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఓ వైద్య కళాశాల వసతిగృహంపై కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతిచెందగా.. 19 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒకేఒక వ్యక్తి మృత్యుంజయుడిగా ప్రాణాలతో భయటపడ్డాడు. -
ఈ గేదె ధర.. 14 లక్షలు
-
కోర్టు విచారణలో అర్జంట్‌గా బాత్రూమ్ వెళ్లాల్సి వస్తే ఎలా?
న్యాయవ్యవస్థపై కనీస గౌరవం ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?.. నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఘటనపై చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. ఏకంగా టాయిలెట్ సీటుపై నుంచే వర్చువల్ కోర్టు విచారణకు హాజరు కాగా, ఆ తతంగం అంతా రికార్డు అయ్యింది కూడా. అయితే కోర్టు విచారణలో ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి అవసరం పడితే ఎలా మరి?గుజరాత్ హైకోర్టు వీడియో విచారణకు ఓ వ్యక్తి టాయిలెట్ సీటుపై కూర్చొని పాల్గొన్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జడ్జి నిర్జర్ దేశాయ్ ఓ చెక్‌బౌన్స్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు కోసం వాదనలు వింటున్నారు. జూమ్ కాల్ విచారణ(Virtual Hearings) లో టాయిలెట్ సీటు నుంచి హాజరైన వ్యక్తి ఫిర్యాదుదారుడే. కానీ జూమ్‌కాల్‌లో పేరు ‘సమద్ బ్యాటరీ’ అని ఉంది. ఆ వ్యక్తి టాయిలెట్ సీటు మీద బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ధరించి విచారణలో పాల్గొన్నాడు. ఓ పక్క అవతలి పార్టీ, మరోపక్క కోర్టులో లాయర్ వాదనలు వినిపిస్తున్నాడు. ఈలోపు.. ఆ వ్యక్తి ఫోన్ నేలపై ఉంచి శుభ్రం చేసుకున్నాడు కూడా. అటుపై మరో గదికి వచ్చి విచారణలో కొనసాగాడు. జూన్ 20వ తేదీ ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలను న్యాయమూర్తులు అస్సలు ఉపేక్షించరు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలే జరగ్గా.. కోర్టులు తీవ్రంగా పరిగణించాయి కూడా. ఈ ఏడాది మార్చిలో.. ఓ వ్యక్తి లావేటరీ నుంచి కోర్టువిచారణకు హాజరు కాగా.. ఆగ్రహించిన జడ్జి ఆ వ్యక్తికి ₹2 లక్షల జరిమానా, కోర్టు ప్రాంగణం శుభ్రం చేయాలని కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించారు. అలాగే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెడ్‌పై పడుకుని విచారణలో పాల్గొన్న వ్యక్తికి ₹25,000 జరిమానా విధించారు. 2020లో ఏకంగా ఓ అడ్వొకేట్ విచారణ టైంలో సిగరెట్ తాగుతూ న్యాయమూర్తి ఆగ్రహానికి గురయ్యారు. అయితే కోర్టులకు హాజరైనప్పడు సరైన వస్త్రధారణ మాత్రమే కాదు.. ప్రవర్తన కూడా సవ్యంగా ఉండాలి. కోర్టు హాల్లో విచారణ జరుగుతున్నప్పుడు గంభీరమైన వాతావరణం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో.. న్యాయమూర్తికి అసహనం కలిగించే పనులు చేయకూడదు. ఒకవేళ.. అత్యవసరం పడితే(ఒకటికి, రెంటికి) జడ్జిలకు విజ్ఞప్తి చేస్తే కచ్చితంగా అనుమతిస్తారు. ఒకవేళ సమయం గనుక లేనట్లయితే విచారణ త్వరగతిన పూర్తి చేయాలని లాయర్లకు సూచిస్తారు. వర్చువల్ హియరింగ్స్(వీడియో కాల్స్ విచారణలో)కు ఇదే వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో.. మైక్‌ను మ్యూట్‌లో ఉంచడం, కెమెరాను ఆఫ్ చేయడం, లేదంటే తమ లాయర్ల ద్వారా జడ్జిలను రిక్వెస్ట్ చేసుకోవడం ద్వారా అవసరాలను తీర్చుకోవచ్చు. తాజా గుజరాత్ హైకోర్టు ఉదంతంలో అలాంటివేం జరగలేదని తెలుస్తోంది. అంతేకాదు.. సదరు వ్యక్తిపై క్రమశిక్షణా చర్య తీసుకోవడంగానీ, జరిమానా విధిచండంగానీ జరగలేదని సమాచారం.A video showing a man attending Gujarat High Court virtual proceedings while seated on a toilet and apparently relieving himself has gone viral on the social media. Read full story: https://t.co/FbendKMD2M #GujaratHighCourt #VirtualHearings #VideoConferencehearing… pic.twitter.com/spyxMiptiO— Bar and Bench (@barandbench) June 27, 2025 -
గుజరాత్ లోని గోల్ వాడ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
-
రథయాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
గాంధీనగర్: గుజరాత్లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఒక ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో, ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో కూడా జగన్నాథ ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని గోల్‌వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు 18 ఏనుగులను అక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగ్రహంతో జనం పైకి దూసుకెళ్లింది.Breaking!🚨Three elephants went out of control during the Jagannath Rath Yatra in Ahmedabad, GujaratHorrifying visuals. #RathaJatra2025pic.twitter.com/W2b7CwHpVw— 𝗩eena Jain (@DrJain21) June 27, 2025 ఇక, సదరు ఏనుగును చూసి పక్కనే ఉన్న ఏనుగులు సైతం ఆగ్రహానికి లోనయ్యాయి. ఒక్కసారిగా అక్కడున్న భక్తులపైకి ఏనుగులు దూసుకెళ్లాయి. దీంతో, ఏనుగులను చూసి అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. ఏనుగులు గట్టిగా అరుస్తూ.. అటూ ఇటూ తిరగాయి. ఈ క్రమంలో రథ యాత్ర వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయడానికి మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు కాలేదు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేసి రథ యాత్రకు సిద్ధం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. Ahmedabad Rath Yatra ….All people are safe … pic.twitter.com/0rw979Mfxa— €hetu $oN¥ (@chetusony) June 27, 2025🔵During the Rath Yatra in Ahmedabad, an elephant ran out of control. A mishap was narrowly avoided...Jai Jagannath Ji 🙏🙏🙏 pic.twitter.com/fr6Cyx2qSi— THE UNKNOWN MAN (@Theunk13) June 27, 2025 -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం
గాంధీనగర్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా.. 34 ఎయిరిండియా విమానం ఢీ కొట్టిన బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్‌కు చెందిన వారు ఉన్నారని మంగళవారం (జూన్ 24న)గుజరాత్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విమానం అహ్మాదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఢీ కొట్టింది. దుర్ఘటనలో మొతత్తం మరణాల సంఖ్యను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ప్రమాదం తీవ్రతతో ఘటనా స్థలంలో భౌతికకాయాల్ని గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది.దీంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన డీఎన్ఏను ఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాలతో పోల్చి చూస్తున్నారు. మృతదేహాల్ని వారిక కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. కొన్ని మృతదేహాల డీఎన్ఏ గుర్తింపు ఇంకా పురోగతిలో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదంఅహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం భారత విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. జూన్ 12న, లండన్‌కు బయలుదేరిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది.ప్రమాదం ఎలా జరిగింది?- విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే పైలట్ మేడే కాల్ ఇచ్చారు.- విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా 475 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది.- విమానం మేఘాణి నగర్ ప్రాంతంలోని జనావాసాలపై కూలి, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను ఢీకొట్టింది.- ప్రమాద సమయంలో విమానంలో 241 మంది ప్రయాణికులు ఉండగా, నేలపై ఉన్న 34 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.కారణాలు ఏమిటి?- ప్రాథమికంగా హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం అనుమానంగా భావిస్తున్నారు.- బోయింగ్ 787-8 మోడల్ గతంలోనూ సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచింది- బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషణ జరుపుతున్నారు.ఒకే ఒక్కడు ఎలా బతికాడు?విశ్వకుమార్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కూలిన సమయంలో అతని సీటు విరిగిపడి బయటకు పడిపోయింది. శిథిలాల మధ్య నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
గుజరాత్లో బీజేపీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బీజేపీకి గట్టి షాక్ ఇచి్చంది. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, ఒక స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ పార్టీ ఘన విజయం సాధించింది. మరో స్థానంలో అధికార బీజేపీ నెగ్గింది. లూథియానా వెస్ట్(పంజాబ్), కాళీగంజ్(పశ్చిమ బెంగాల్), కాడీ, విసావదర్(గుజరాత్), నీలంబూర్(కేరళ) శాసనసభ స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరిగాయి. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ఘన విజయం సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్‌పై 17 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గోపాల్ ఇటాలియాకు 75,942 ఓట్లు రాగా, కిరీట్ పటేల్‌కు 58,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విసావదర్ నుంచి గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తమ సిట్టింగ్ స్థానాన్ని ఆప్ నిలబెట్టుకుంది. కాడీ ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా 39,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్ సోలంకీ మృతిచెందడంతో ఉప ఎన్నిక జరిగింది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్ మళ్లీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్‌పై 10 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి జీవన్ గుప్తా మూడో స్థానంలో నిలిచారు. లూథియానా వెస్ట్‌లో ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్బస్సీ గోగీ మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. బెంగాల్‌లోని కాళీగంజ్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అలీఫా అహ్మద్ బీజేపీ అభ్యర్థి ఆశీష్ ఘోష్‌పై 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలీఫా తండ్రి, తృణమూల్ ఎమ్మెల్యే నజీరుద్దీన్ అహ్మద్ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. కేరళలోని నీలంబూర్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి అర్యదన్ షౌకత్ వామపక్ష అభ్యర్థి ఎం.స్వరాజ్‌పై 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నీలంబూర్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గుజరాత్, పంజాబ్‌లో మాదే విజయం: కేజ్రీవాల్ గుజరాత్, పంజాబ్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం పట్ల ఆప్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ సోమవారం హర్షం వ్యక్తంచేశారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ అని, ఇందులో తామే గెలిచామని స్పష్టంచేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓటర్లు పూర్తిగా తిరస్కరించడం ఖాయమని అన్నారు. ఆప్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. -
అక్కడ బీజేపీకి ఓటమి.. ఆప్, కాంగ్రెస్, టీఎంసీ విజయం
Four States Bypoll Results Updates..👉నాలుగు రాష్ట్రాల్లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పంజాజ్‌లోని లూథియానా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి సంజీవ్ అరోరా విజయం సాధించారు. గుజరాత్‌లోని విసావదార్ అసెంబ్లీ స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. #WATCH | Kerala | Nilambur Assembly by-election: UDF workers celebrate outside a counting centre in Malappuram as Congress candidate Aryadan Shoukath continues his lead into the 16th round of counting.As per official EC trends, he is leading by a margin of 10,482 votes;… pic.twitter.com/87foBWs4iZ— ANI (@ANI) June 23, 2025BIG WIN FOR AAP IN GUJARATAAP @Gopal_Italia WINS from Visavadar, Gujarat !!AAP defeats BJP in Gujarat !!Congrats to everyone !!pic.twitter.com/2rKhiF0hTx— AAP Ka Mehta 🇮🇳 (@DaaruBaazMehta) June 23, 2025👉కేరళలోని నీలంబూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యధాన్ శోకత్ విజయాన్ని అందుకున్నారు. ఇక, గుజరాత్‌లోని కాడీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర కుమార్ గెలిచారు. బెంగాల్లో తృణముల్ అభ్యర్థి అలిఫా అహ్మద్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. Kadi (Gujarat) Assembly by-election | As per the latest official trends by EC, BJP's Rajendra Chavda continues his lead over Congress' Ramesh Chavda; currently leading by a margin of 34,597 votes after 15 rounds of counting. AAP's Jagdish Chavda trailing in a distant third… pic.twitter.com/cBQVBhH5Hy— ANI (@ANI) June 23, 2025 ఆప్, బీజేపీ, తృణముల్, కాంగ్రెస్ ఆధిక్యం ఇలా.. బెంగాల్లో తృణముల్ అభ్యర్థి భారీ ఆధిక్యం..Kaliganj (West Bengal) Assembly by-election | As per latest official trends by Election Commission, TMC's Alifa Ahmed continues her lead over Congress' Kabil Uddin Shaikh; currently leading by 14,462 votes in the fifth round of counting. BJP's Ashish Ghosh is trailing in the… pic.twitter.com/WxOhxqN2UN— ANI (@ANI) June 23, 2025పంజాజ్‌లో దూసుకెళ్తున్న ఆప్ అభ్యర్థి.Ludhiana West (Punjab) Assembly by-election | As per latest official trends by Election Commission, AAP's Sanjeev Arora continues his lead over Congress' Bharat Bhushan Ashu; currently leading by 2504 in the 5th round of counting. BJP's Jiwan Gupta trailing in third position. pic.twitter.com/nWIe91KZhO— ANI (@ANI) June 23, 2025కేరళలో కాంగ్రెస్ అభ్యర్థ ముందంజ. Nilambur (Kerala) Assembly by-election | As per official trends by Election Commission, UDF candidate - Congress' Aryadan Shoukath continues his lead over LDF candidate - CPI(M)'s M. Swaraj; currently leading by 6931 in the 11th round of counting. pic.twitter.com/oUcbPlrGA8— ANI (@ANI) June 23, 2025గుజరాత్లో పోటాపోటీ.. Visavadar (Gujarat) Assembly by-election | After initially leading, AAP's Gopal Italia now trailing behind BJP's Kirit Patel by 985 votes in the 7th round of counting, as per the latest official EC trends. Congress' Nitin Ranpariya trailing in the third position. pic.twitter.com/hZ0Q9WqigP— ANI (@ANI) June 23, 2025లీడ్‌లో ఆప్, కాంగ్రెస్ గుజరాత్లో రెండు స్థానాల్లో బీజేపీ ముందంజ..పంజాబ్‌లో ఆప్ లీడింగ్కేరళలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజబెంగాల్ తృణముల్ అభ్యర్థికి లీడ్. Kadi (Gujarat) Assembly by-election | As per latest official trends by Election Commission, BJP's Rajendra Chavda continues his lead over Congress' Ramesh Chavda; currently leading by 13,195 votes in the 7th round of counting. AAP's Jagdish Chavda trailing in the third position. pic.twitter.com/vxLel9szbp— ANI (@ANI) June 23, 2025గుజరాత్లో ఆప్ అభ్యర్థి ముందంజ..విసావదర్ స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియాకు లీడింగ్.రెండో స్థానంలో బీజేపీ Visavadar (Gujarat) Assembly by-election | As per official trends by Election Commission, AAP's Gopal Italia leading over BJP's Kirit Patel by 391 votes in the second round of counting. Congress' Nitin Ranpariya trailing in the third position. pic.twitter.com/NH3kyEN520— ANI (@ANI) June 23, 2025 👉పంజాబ్‌లో ఆప్ అభ్యర్ధి లీడింగ్..Ludhiana West (Punjab) Assembly by-election | As per official trends by Election Commission, AAP's Sanjeev Arora leading over Congress' Bharat Bhushan Ashu by 1269 votes in the first round of counting. BJP's Jiwan Gupta trailing in third position. pic.twitter.com/X1j2JQCuRe— ANI (@ANI) June 23, 2025 👉కేరళలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ..Nilambur (Kerala) Assembly by-election | As per official trends by Election Commission, UDF candidate - Congress' Aryadan Shoukath leading over LDF candidate - CPI(M)'s M. Swaraj by 419 votes in the first round of counting. pic.twitter.com/K7ro5uQ10w— ANI (@ANI) June 23, 2025👉జూన్ 19న ఎన్నికలు జరగ్గా నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్‌లోని రెండు స్థానాలు విసావదర్, కాడి, పంజాబ్ (లూథియానా వెస్ట్), బెంగాల్ (కాలిగంజ్), కేరళ (నిలంబూర్) అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.గుజరాత్లో ఇలా.. గుజరాత్‌లోని కాదీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాజేంద్రకుమార్ దానేశ్వర్ చవడా, కాంగ్రెస్ అభ్యర్థి రమేష్‌భాయ్ చావడ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకి మరణం కారణంగా ఉప ఎన్నికల జరగుతోంది. అలాగే, మరో స్థానం విసావదార్‌లో బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్, ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా మధ్య హోరాహోరీ ఉండే అవకాశం ఉంది.#WATCH | Gujarat: Counting of votes for Kadi Assembly by-elections begins. Postal ballots are being counted first. Voting was held on 19th June. Visuals from a counting centre in Mahesana. BJP's Rajendra Chavda, Congress' Ramesh Chavda and AAP's Jagdish Chavda are among the… pic.twitter.com/rwLXA5WJvk— ANI (@ANI) June 23, 2025 కేరళలో.. కేరళలోని నీలంబర్ సీటు కాంగ్రెస్ అభ్యర్థి విజయం.. ప్రియాంక గాంధీ వాద్రాకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ స్థానం ఆమె వయనాడ్ నియోజకవర్గంలోకి వస్తుంది. జూన్ 19న జరిగిన ఉప ఎన్నికలకు ముందు ఆమె ఈ ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఓవి అన్వర్ గెలుస్తారా లేదా? అనేది తేలనుంది.VIDEO | Ludhiana West bypoll: Counting of votes to begin at 8 AM at Khalsa College; visuals of security arrangements from the counting centre.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6WJb9VmNuE— Press Trust of India (@PTI_News) June 23, 2025బెంగాల్ బైపోల్నాడియా జిల్లా పరిధిలోకి వచ్చే బెంగాల్‌లోని కలిగంజ్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం కారణంగా ఉప ఎన్నిక జరిగింది. ఆయన కుమార్తె అలీఫా అహ్మద్ అధికార పార్టీ అభ్యర్థిగా ఆ స్థానాన్ని నిలుపుకోవాలని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్‌ను నిలబెట్టగా, కాంగ్రెస్ CPI(M) మద్దతుతో కబిల్ ఉద్దీన్ షేక్ పోటీలో ఉన్నారుఉ. కలిగంజ్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్, బీజేపీ మధ్య కీలకంగా మారనుంది.పంజాబ్‌లో త్రిముఖ పోరు.. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ స్థానంలో ఆప్‌కు చెందిన సంజీవ్ అరోరా, బీజేపీ జీవన్ గుప్తా, కాంగ్రెస్ భరత్ భూషణ్ అషు మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. శిరోమణి అకాలీదళ్ ఉప ఎన్నికకు తన అభ్యర్థిగా పరూప్కర్ సింగ్ ఘుమాన్‌ను నిలబెట్టింది.#WATCH | Punjab: Security has been tightened outside Ludhiana's Khalsa College for Women, the counting centre for the Ludhiana West bypoll; counting of votes will begin at 8 am.The AAP fielded Rajya Sabha MP Sanjeev Arora from the seat. The BJP fielded its leader Jiwan Gupta… pic.twitter.com/Lr9mZawi1o— ANI (@ANI) June 23, 2025 -
ఇసుకను చూసి ఉప్పందిస్తారు!
డిటెక్టివ్ ‘షెర్లాక్ హోమ్స్’ పేరు మీరు వినే ఉంటారు. బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కానన్ డోయల్ సృష్టించిన పాత్ర అతడు. నేర పరిశోధనలో అతడిది డేగ దృష్టి! రాలిన వెంట్రుకలు, నేలపై పడి ఉన్న సిగరెట్ పీకలు, ఆఖరికి ఆ... నుసి నుంచి కూడా అతడు నేరస్థుడి జాడల్ని, నీడల్ని కనిపెట్టగలడు. ఆ డిటెక్టివ్ హెర్లాక్ హోమ్స్‌ని మించిన వారే... ‘పాగీ’లు! గుజరాత్లో, మూడు ఎడారి జిల్లాల సరిహద్దుల్లో నివసిస్తుండే ఈ పాగీలు... ఇసుకలో పాదముద్రలను బట్టి చొరబాటు దారుల వివరాలను చెప్పటంలో సిద్ధహస్తులు. మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాగీలు భారత సైన్యానికి సహాయపడ్డారు.అలా చెప్పేస్తారంతే! సరిహద్దుల్లో శత్రువు కదలికల్ని పసిగట్టేందుకు భారత్ దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. హైటెక్ గాడ్జెట్స్ ఉన్నాయి. సైనికులు నిరంతరం మూడంచెలుగా గస్తీ కాస్తుంటారు. చీమ చిటుక్కున్నా మన తుపాకులు మేల్కొనే శాటిలైట్ వ్యవస్థ ఉంది. ఇవేమీ అవసరం లేకుండానే ‘పాగీ’లు తమ సహజ పరిశీలనా శక్తితో ఎడారిలో ఇసుక ముద్రల్ని డీకోడ్ చేసి సైన్యానికి ఉప్పందించగలరు. పాగీల దగ్గర వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వస్తున్న ప్రాచీన అపరాధ పరిశోధనా నైపుణ్యం తప్ప, సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. అయినా, ఇసుకపై ముద్రల్ని బట్టి అటువైపు ఎవరు నడిచారు, ఎంతమంది నడిచారు అన్నది విశ్లేషించి చెప్పేయగలరు. కాలం చెల్లినట్లుగా కనిపించే ఈ పాగీలు ఒక విధంగా ఇంటెలిజెన్స్ సిబ్బందికి దీటైనవారు.పేగుల్ని లెక్కపెట్టే వేగులుఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చి చూస్తే పాగీలు ఆదిమానవుల కింద లెక్క. కానీ ఈ మానవ ‘ట్రాకింగ్ వ్యవస్థలు’ ఎడారి చొరబాట్ల వివరాల విశ్లేషణల్లో అత్యంత విశ్వసనీయమైనవి. ఉదాహరణకు : సరిహద్దును ఎవరు దాటారు అన్నదొక్కటే కాకుండా, ఎంత మంది దాటారు? వారు ఏమి మోసుకెళ్లారు? వారి లక్ష్యం ఏమిటి? అన్నవి కూడా పాగీలు అంచనా వేయగలరు. మాదకద్రవ్యాల స్మగ్లర్ల కదలికలను కనిపెట్టటం దగ్గర్నుండి, పూర్తిస్థాయి యుద్ధాల సమయంలో సైనికులకు అత్యవసర సమాచారం అందించటం వరకు ఈ సరిహద్దు సంరక్షకులు దేశం ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. 1965, 1971లో పాకిస్తా¯Œ తో జరిగిన యుద్ధాలలో భారత సైన్యం శత్రు భూభాగాలలో చొచ్చుకు వెళ్లటానికి, శత్రువుల కదలికలను గుర్తించడానికి పాగీల నుండి కీలకమైన సహాయం తీసుకుంది. తరచు యుద్ధాల గమనాన్ని నిర్ణయించటంలో కూడా పాగీల భాగస్వామ్యం ఉంటుంది. మెడలిస్టులు కూడా ఉన్నారుబనస్కాంత, కచ్, పటాన్ జిల్లాల్లో ఉండే పాగీలు ఇటీవలి భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి మళ్లీ కీలకం అయ్యారు. పారంపర్య జ్ఞానమే తప్ప, ఎలాంటి శిక్షణా ఉండని పాగీలు సాధారణ నేత్రాలకు కనిపించని ప్రమాద సూచనలను గుర్తించటంలో అత్యద్భుతమైన ప్రావీణ్యం గలవారు. బనస్కాంత జిల్లాలోని సుయిగామ్ తాలూకా, జలోయా గ్రామానికి చెందిన రేవాజీ రాథోడ్ ఇందుకొక నిదర్శనం. 1927లో జన్మించిన ఆయన 1962 ఆగస్టు 4న పాగీగా పోలీసు దళంలో చేరారు. సుయిగామ్, వావ్, ధనేరా సరిహద్దు ప్రాంతాల వెంబడి 28 ఏళ్లపాటు, రెండు యుద్ధాల సమయంలో భారత దళాలకు భూభాగాలపై మార్గ నిర్దేశం చేశారు. ఆ నైపుణ్యాలు ఆయనకు ‘సంగ్రామ్ మెడల్’ ‘వెస్ట్రన్ స్టార్’ పురస్కారాలతో సహా కీర్తి ప్రతిష్ఠల్ని, గుర్తింపును సంపాదించి పెట్టాయి. రంగంలోకి దూకేందుకు సిద్ధంగుజరాత్ సరిహద్దులో కొన్ని చోట్ల కంచె లేకపోయినప్పటికీ ఆ ప్రాంతాలు సురక్షితంగా ఉండటానికి ఒక కారణం.. పాగీల నిరంతర నిఘా. వారు కేవలం పాదముద్రలను గుర్తించడమే కాదు, వాటిని అర్థం చేసుకుంటారు కూడా. శత్రువు ఎలాంటి బూట్లు వేసుకున్నాడు, ఏ మార్కెట్లలో ఆ బూట్లు అమ్ముడవుతాయి, అలాగే – ఎంత బరువుతో వారి నడక సాగింది, ఆ వెళ్లినవారు స్త్రీలా, పురుషులా అనేది కూడా పాగీలు కనిపెడతారు. అవసరం అయిన వెంటనే భద్రతా దళాలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న 5–10 మంది శిక్షణ పొందిన పాగీలు, వారికి సహాయంగా ఉండే 20 మంది యువకుల బృందం ప్రస్తుతం సైన్యానికి అందుబాటులో ఉంది. ఇరవై ఐదు మందికి ఉద్యోగాలుకొంతమంది పాగీలను అధికారికంగా సైన్యంలోకి తీసుకున్నప్పటికీ, వారి సంఖ్య తక్కువగానే ఉంది. ‘‘వారు ట్రాకర్లు మాత్రమే కాదు, అపరాధ పరిశోధకులు కూడా..’’ అని గుజరాత్ పోలీసు సరిహద్దు పరిధి ఐజీపీ చిరాగ్ కొరాడియా అంటారు. ‘‘పాదముద్రలను బట్టి వారు ఒక వ్యక్తిని గుర్తించగలరు. వారిలో ఎవరైనా బరువులు మోస్తున్నారా, వారి వద్ద జంతువులు ఉన్నాయా అని కూడా తెలుసుకోగలరు. ఇంకా అనేక ఇతర వివరాలను అందించగలరు. 2013 హోమ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించి 2014లో క్లాస్ 4 పే గ్రేడ్‌లో 25 మంది పాగీలను శాశ్వతంగా నియమించుకున్నాం’’ అని కొరాడియా తెలిపారు. యూనిఫాం ఉండని సైనికులుపాగీలు కేవలం చారిత్రక యోధులు కారు. వారి అవసరం నేటికీ కొనసాగుతోంది. కచ్‌కు చెందిన 70 ఏళ్ల పాగీ తేజ్మల్జీ సోధా 2001 – 2017 మధ్య సైన్యానికి సహాయంగా పనిచేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణానే కాక, అనేకానేక చొరబాట్లను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించారు. ‘‘వారు ఎంత దూరం వెళ్లినా, నేను కచ్చితంగా ట్రాక్ చేయగలను..’’ అని ఆయన అంటారు. పాగీలు ఇప్పుడు తమకు గుర్తింపును, తగిన పరిహారాన్ని, తర్వాతి తరానికి శాశ్వతకాల ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘మేము యూనిఫాం ధరించం. అయినప్పటికీ మాతృభూమిని కాపాడతాం’’ అని అంటున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ఫీల్డ్ మార్షల్ జనరల్ శామ్ మానెక్షాపాగీలలో అత్యంత పురాతన వ్యక్తులలో దివంగత రణ్ ఛోడ్ పాగి ఒకరు. ఆయన అసలు పేరు రణ్ ఛోడ్ రబారి. తన 100వ యేట వరకు ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. యుద్ధాల సమయంలో భారత దళాలకు సహాయంగా ఉన్నారు. జనరల్ శామ్ మా¯ð క్షా స్వయంగా రణ్ ఛోడ్ సేవల్ని గుర్తించి 1971లో రూ. 300 వ్యక్తిగత నగదు బహుమతిని కూడా అందజేశారు. రణ్ ఛోడ్ పాగి 2013లో తన 112 ఏళ్ల వయసులో మరణించిన తర్వాత బి.ఎస్.ఎఫ్. ఆయన గౌరవార్థం బనస్కాంత ఔట్పోస్టులలో ఒకదానికి ఆయన పేరు పెట్టింది. -
అవినీతి అధికారుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడమా?: సుప్రీం కోర్టు
అవినీతి కేసులో శిక్షలు పడ్డ ప్రభుత్వాధికారుల నిర్దోషిత్వం పైకోర్టుల్లో రుజువు అయ్యేదాకా తిరిగి విధుల్లోకి తీసుకోవడం సరికాదని దేశసర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం అవుతుందన్న సుప్రీం కోర్టు.. ఇలాంటి చర్యలు నిజాయితీపరులైన అధికారులను అవమానించడమే అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కేసు ఏంటంటే.. గుజరాత్‌లోని ఒక రైల్వే ఇన్స్పెక్టర్ లంచం తీసుకున్నాడన్న కేసులో ట్రయల్ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించింది. అయితే దీనిపై ఆయన అప్పీల్‌కు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని స్టే కోరుతూ సదరు ఇన్స్పెక్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.పిటిషనర్ వాదనలు.. నేను లంచం తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేకపోయారు. అయినా కింది కోర్టు మా వాదనలను పట్టించుకోకుండా శిక్ష వేసింది. ఉన్నత న్యాయస్థానం నాకు ఊరట ఇచ్చినప్పటికి శిక్షను రద్దు చేయలేదు. కాబట్టి నా శిక్షపై స్టే విధించి.. నన్ను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి.సుప్రీం కోర్టు(Supreme Court) ఏం చెప్పిందంటే.. గురువారం జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బీ వరాలేలతో కూడిన బెంచ్ ఆ రైల్వే ఇన్స్పెక్టర్ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ క్రమంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజల నమ్మకమే పాలనా వ్యవస్థకు మూలాధారం. అవినీతికి లోనైన ప్రభుత్వ అధికారిని అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తయ్యే వరకు ఉద్యోగంలోకి తిరిగి అనుమతించడం ఆ నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. కోర్టులో దోషులుగా తేలిన అధికారులను.. తిరిగి విధుల్లోకి తీసుకోవడం వ్యవస్థ మూలాలను బలహీనపరుస్తుంది. పైగా ఇలాంటి చర్యలు.. నిజాయితీ పరులైన అధికారులను అవమానించడమే అవుతుంది అని బెంచ్ వ్యాఖ్యానించింది.ఈ క్రమంలో.. కేసీ సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పును ప్రస్తావించింది. ‘‘ఒక ప్రభుత్వ అధికారి అవినీతి కేసులో దోషిగా తేలితే.. పైకోర్టుల్లో అతను నిర్దోషిగా తేలేంతవరకు విధుల్లోకి తీసుకోకూడదు. ఒకవేళ అతని/ఆమె అప్పీల్ పెండింగ్‌లో ఉన్నాసరే.. ఉద్యోగంలోకి తిరిగి అనుమతించకూడదు’’ అని ఈ కేసులో తీర్పు ఇచ్చింది. -
Air India crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దెబ్బతిన్న బ్లాక్ బాక్స్
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India Boeing 787-8 Dreamliner) విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాల్ని వెలికి తీసే బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.అయితే, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ నుంచి వివరాల్ని సేకరించేందుకు కేంద్రం అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్ బాక్స్ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.ఏప్రిల్ 12న అహ్మదాబాద్ నుంచి ఎయిరిండియా 787 డ్రీమ్‌లైనర్ విమానం 242 మందితో లండన్ బయల్దేరింది. కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీనగర్ బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్‌పై కప్పు మీద ఆ విమానం కూలిపోయి (air india crash video) అగ్ని గుండంలా మారింది. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డీఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ వైద్యులు మృతదేహాల్ని ఎనాలసిస్ చేసి మొత్తం 208 మృతదేహాల్ని గుర్తించారు. అలా ఇప్పటి వరకు (ఏప్రిల్ 18) ఉన్న సమాచారం ప్రకారం.. 170 మృతదేహాల్ని డీఎన్ఏతో గుర్తించారు. వారిలో యూకే, ఫోర్చుగల్,కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు మృత దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. -
నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్.. 23న ఫలితాలు..
Four states by polls Voting Updates..ముగిసిన పోలింగ్.. 23న ఫలితాలు.పంజాబ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరుగుతున్నాయి. ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికలకు ఎన్డీయే కూటమి, ఇండియా మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక, ఐదు స్థానాలకు ఓట్ల లెక్కింపు జూన్ 23న జరుగుతుంది.పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది..ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా.. Polling percentage till 9 am in Assembly by-polls: Visavadar: 12.10%, Kadi: 9.05%, Nilambur: 13.15%, Ludhiana West: 8.50% and Kaliganj: 10.83%Source: Election Commission of India pic.twitter.com/NyVcI3Kai1— ANI (@ANI) June 19, 2025ఉప ఎన్నికల్లో స్థానికులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Kerala | LDF candidate M. Swaraj casts vote in Nilambur by-election, at polling booth no. 202 of the Government LP School in Muthiri Mankuth, NilamburSwaraj states that voting is a citizen's right and urges everyone in the constituency to exercise their franchise. pic.twitter.com/3IhGv0BsXv— ANI (@ANI) June 19, 2025 పంజాబ్..లూథియానా (పశ్చిమ)లో, సిట్టింగ్ ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ గోగి మరణం కారణంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అర్బన్ సీటుపై తన పట్టును నిలుపుకోవడానికి రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను పోటీకి దింపింది. కాంగ్రెస్ నుండి భరత్ భూషణ్ ఆశు, బీజేపీ నుండి జీవన్ గుప్తా, శిరోమణి అకాలీదళ్ నుండి పరూప్కర్ సింగ్ ఘుమ్మాన్ పోటీలో ఉన్నారు.#WATCH | Ludhiana, Punjab | Congress candidate Bharat Bhushan Ashu casts his vote at booth number 72-76, Malwa Sr Secondary School, in Ludhiana West assembly by-pollHe says, "I have fulfilled my constitutional duty and appeal to the voters to do the same." pic.twitter.com/WBxrRVazZ0— ANI (@ANI) June 19, 2025పశ్చిమ బెంగాల్..పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం తరువాత కలిగంజ్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. మహిళలు, మైనారిటీ ఓటర్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆయన కుమార్తె అలీఫా అహ్మద్‌ను పోటీకి దింపింది. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్-వామపక్ష కూటమి కబిల్ ఉద్దీన్ షేక్‌ను బరిలోకి దింపింది.#WATCH | West Bengal | Voting is underway at polling booth 171 in Nadia for the Kaliganj by-elections.TMC's Alifa Ahmed, BJP's Ashish Ghosh, and Congress' Kabil Uddin Shaikh are the candidates from the constituency. pic.twitter.com/gxKANa55DI— ANI (@ANI) June 19, 2025గుజరాత్లో త్రిముఖ పోరు..గుజరాత్లో కడి, విసావదర్లలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కడిలో బీజేపీ ఎమ్మెల్యే కర్సన్భాయ్ సోలంకి మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. బీజేపీ నుంచి రాజేంద్ర చావ్డాను, కాంగ్రెస్ రమేష్ చావ్డాను, ఆప్ జగదీష్ చావ్డాను పోటీకి దింపింది. ఇక, విశావదర్ సిట్టింగ్ ఎమ్మెల్యే భయాని భూపేంద్రభాయ్ ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో, అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ స్థానంలో బీజేపీ నుంచి కిరీట్ పటేల్‌ను, కాంగ్రెస్ నితిన్ రాన్‌పారియాను, ఆప్ గోపాల్ ఇటాలియాను పోటీకి దింపింది.Polling begins for the assembly by-elections in Kerala's Nilambur, Punjab's Ludhiana West, Kaliganj in West Bengal, and Visavadar and Kadi in Gujarat.The results will be declared on 23 June. pic.twitter.com/Wp2udg68ta— ANI (@ANI) June 19, 2025కేరళ..కేరళలో నీలంబూరులో ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆర్యదన్ మొహమ్మద్ కుమారుడు ఆర్యదన్ షౌకత్‌ను పోటీకి దింపగా, అధికార ఎల్డిఎఫ్ ఎం. స్వరాజ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. #WATCH | Kerala: Voting begins at polling booth number 184, at Govt Lower Primary School, Veettikkuth, in the Nilambur assembly by-electionLDF has fielded M Swaraj, UDF has fielded Aryadan Shoukath, while BJP has fielded Adv. Mohan George as candidates pic.twitter.com/YGQJxyClKJ— ANI (@ANI) June 19, 2025 -
ఎయిరిండియా ఘటన: అయ్యో! ప్రాణాల కోసం..
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ (వీటీ–ఏఎన్‌బీ) 171 విమాన ప్రమాదం దుర్ఘటనలో భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 12న మేఘానీ నగర్ బీజే మెడికల్ కాలేజీకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగే సమయంలో విమాన ప్రమాద భయం నుంచి తప్పించుకునేందుకు మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోని మూడో అంతస్తునుంచి విద్యార్థులు కిందకి దూకి తప్పించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి. బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీకొన్నాక వెలువడిన దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో మూడో భవనంలో ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో హాస్టల్ బాల్కనీ నుంచి కిందకి దూకారు. తమ ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు.మెస్‌లో భోజనం చేస్తుండగా ఎయిరిండియా విమానం ఢీ కొట్టడంతో.. అప్రమత్తమైన విద్యార్థులు హాస్టల్ బాల్కనీ నుంచి బెడ్ షీట్లను వేలాదీస్తూ కిందకు దూకి ప్రాణాల్ని రక్షించుకునే భయనక దృశ్యాలు ప్రమాద తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. A distressing video has emerged showing medical students at BJ Medical College hostel in #Ahmedabad desperately jumping from balconies to escape following the catastrophic Air India #planecrash crash on June 12!!Although no media is highlighting this..#MedTwitter pic.twitter.com/iBAqn8xngc— Indian Doctor🇮🇳 (@Indian__doctor) June 17, 2025మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది.ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్‌వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు.వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. -
విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే.. మరో వీడియోలో
గాంధీ నగర్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్‌కు చెందిన మరో వీడియో వైరల్‌గా మారింది. తాజాగా, వెలుగులోకి వచ్చిన వీడియోలో బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్‌ను ఎయిరిండియా విమానం ఢీకొట్టడంతో అగ్నికిలలు ఎగిసిపడున్నాయి. ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా అగ్నికోళం బద్దలైనప్పుడు మంటలు ఏ విధంగా ఎగిసిపడతాయో.. ఆ విధంగా మంటలు ఎగిసిపడుతున్నా 11ఏ సీటులో కూర్చున్న రమేష్, బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ నుండి బయటకు వస్తూ కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతన్ని గమనించి, అతని చెయ్యి పట్టుకుని ప్రమాదం స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లాడు.జూన్ 12న అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్‌ను ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఢీకొట్టింది. ఈపెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242మందిలో మృత్యుంజయుడు ఒక్కడే సురక్షితంగా బయటపడ్డాడు.తాజా సమాచారం మేరకు ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, మెడికల్ కాలేజీ క్యాంపస్ బాధితులతో కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడతో మృతదేహాల్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల డీఎన్ఏల ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. Unbelievable! New video of lone survivor, Viswashkumar Ramesh has emerged, showing him walking out from the crash site.He is seen wearing a white t-shirt and holding his phone in left hand.#AirIndia #AhmedabadPlaneCrash pic.twitter.com/xV83t2yjGX— Ishani K (@IshaniKrishnaa) June 16, 2025 -
లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా?
ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కొమ్మి వ్యాస్.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్‌లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్ తన కుటుంబానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మా పాప మిరాయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్ చేసి కొందరు వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్ కుల్దీప్ భట్ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. వ్యాస్ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి కంటెంట్‌ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్‌ను తెర మీదకు తీసుకొచ్చి షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్‌ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు. -
Air India plane crash: భార్య చెప్పిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వైద్యుడు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న గుజరాత్‌కు చెందిన ఒక వైద్యుడు తన భార్య, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇంటిలోనివారి మాట కాదని, ఒకవేళ అతను ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో ప్రయాణించి ఉంటే, ఇప్పుడు మన మధ్య ఉండేవాడు కాదు.ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతిచెందారు. గుజరాత్‌కు చెందిన డాక్టర్ ఉమాంగ్ పటేల్ తన భార్య, కుమారులతో పాటు మే 24న గుజరాత్‌లోని మహిసాగర్‌కు వచ్చారు. భారతదేశంలో తన కుటుంబాన్ని ఉంచి, జూన్ 12న బ్రిటన్‌లోని నార్తాంప్టన్‌కు తిరిగి వెళ్లాలని ఆయన అనుకున్నారు. (Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్య)‘నేను జూన్ 12న ఒక్కడినే లండన్ వెళ్లవలసి ఉంది. అయితే జూన్ 9న నాకు తీవ్ర జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి జ్వరం మరింతగా పెరిగింది. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన నా భార్య.. జూన్ 12న బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను రద్దు చేసుకుని, ఆరోగ్యం కుదుటపడేవరకూ ఇక్కడే ఉండమని కోరింది. దీంతో నేను విమానం టిక్కెట్ రద్దు చేసుకున్నాను. తరువాత జూన్ 15కి తిరిగి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు విమాన ప్రమాద వార్త వినగానే దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ దేవుడే నన్ను కాపాడాడు. విమాన ప్రమాదంలో మరణించినవారికి భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని డాక్టర్ ఉమాంగ్ పటేల్ అన్నారు. ఆయన గత ఐదేళ్లుగా నార్తాంప్టన్‌లో నివాసం ఉంటున్నారు.ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ -
చలో గుజరాత్
హీరో నాగచైతన్య గుజరాత్ వెళ్లనున్నారట. నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమాకు చెందిన భారీ షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది. ఓ ప్రముఖ స్టూడియోలో గుహ సెట్ వేసి, నాగచైతన్య పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల చివరి వారంలో గుజరాత్లోప్రారంభం కానుందని, నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా మేకర్స్ కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారని సమాచారం. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బి. సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. -
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు
-
AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్
అహ్మదాబాద్ (గుజరాత్): సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విధ్వంసకర AI 171 విమాన ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది , కుటుంబ సభ్యులులను శుక్రవారం BJమెడికల్ కాలేజీ వైద్యుల హాస్టల్ ప్రాంగణం నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి ఈ సందర్భంగా ముఖ్యంగా డా. అనిల్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తమను ఇప్పటికిపుడు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా మాండేటరీ ఆదేశాలిచ్చారు, రెండు మూడు రోజులు సమయం ఇవ్వండి, మానవత్వం చూపండిఅంటూ భావోద్వేగానికి గురి అవుతున్న వీడియో సంచలనంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తన కుమార్తె, తన ఇంట్లో సహాయకురాలు ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి తనసాయం అవసరం అంటూ కంటతడి పెట్టారు. తన భార్య లేదని, చాలా నిస్సహాయంగా ఉన్నానంటూ భోరున విలపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కన్నీంటి పర్యంత మయ్యారు. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! View this post on Instagram A post shared by Vinay Sharma (@vinayshaarma)> కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ సందర్బంగా మధ్యాహ్నం లంచ్‌కోసం వచ్చిన విద్యార్థులు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. -
Updates: ఎయిరిండియా కీలక నిర్ణయం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగం పెరిగింది. డీజీసీఏతో పాటు దర్యాప్తు సంస్థలు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన శకలాలను తొలగించకూడదని గుజరాత్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్లీనియంగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.AI-171 విమానం నుంచి చివరి సందేశంవిమానంలో పవర్ కట్ అయిందని..కిందకి పడిపోతున్నట్టు మెసేజ్ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి మేడే కాల్లో ఆడియోవిమానంలో పవర్ కోల్పోయామని ఏటీసీకి వెల్లడించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఐదు సెకన్ల ఆడియో మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్ అని చెప్పిన కెప్టెన్ సబర్వాల్ఏటీసీ వద్ద రికార్డయిన ఐదు సెకన్ల ఆడియోఎయిరిండియా కీలక నిర్ణయంఅహ్మాదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయంవిమానంలో ప్రయాణిస్తున్నన 241 మంది దుర్మరణంభవనంపై విమానం కూలి మెడికోలు, ఇతరులు మృతిమొత్తం మృతుల సంఖ్య 274ఇక నుంచి ఏఐ-171 విమాన సర్వీస్ నిలిపివేతదానికి బదులు ఎయిరిండియా- 159 విమానంఇక నుంచి లండన్‌కు వెళ్లనున్న ఏఐ-159 సర్వీస్ విమానం ప్రమాదంపై విచారణ జరుగుతోంది: రామ్మోహన్నాయుడుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ జరిపిన సమీక్ష వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుపైలట్ మే డే కాల్ చేశారుఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ప్రమాదం జరిగిందిఅహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగిందిరెస్క్యూ ఆపరేషన్‌కు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందిబ్లాక్ బాక్స్ దొరికింది.. డీకోడ్ చేస్తున్నారుబ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా ఏం జరిగిందనేది తెలుస్తుందిహైలెవల్ కమిటీతో ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందినివేదిక వచ్చాకే బాధ్యులపై చర్యలు ఉంటాయివిమాన ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది787 సిరీస్‌ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చాండీఎన్ఏ పరీక్షలు పూర్తైన వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాంపౌర విమానయాన శాఖ సమీక్ష వివరాలు వెల్లడిఎయిరిండియా విమాన ప్రమాదంపై పౌరవిమానయాన శాఖ సమీక్షవివరాలు వెల్లడించిన సివిల్ ఏవియేషన్ అధికారులుAircraft Accident Investigation Bureau (AAIB) దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులువిమానం 650 అడుగుల ఎత్తు ఎగిరాక కూలిపోయిందిపైలట్ చివరిసారిగా మే డే కాల్ అన్నారుఆ తర్వాత ఎలాంటి సిగ్నల్ అందలేదుమూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాంరంగంలోకి ఎన్ఐఏఅహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలికి జాతీయ దర్యాప్తు సంస్థకుట్ర కోణం నేపథ్యంతో విచారణ జరుపుతున్న ఎన్ఐఏక్షుణ్ణంగా పరిశీలనలు జరుపుతున్న బృందంబోయింగ్ ట్రాజెడీ పాపం ఎవరిది?తనిఖీ, నిర్వహణ లోపమే కారణమా?డీజీసీఏ హెచ్చరికలను ఎయిరిండియా పట్టించుకోలేదా? వైమానిక ఇంధనం కలుషితం అయ్యిందా? ఎందుకు గాల్లో ఎగరలేక పోయింది? టేకాఫ్ సెట్టింగుల్లో లోపం, పైలట్ తప్పిదమే కారణం?ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అంతు చిక్కడం లేదా? దర్యాప్తులో తేలాల్సిన విషయాలెన్నోక్లిక్ చేయండి: రెండు ఇంజన్లు విఫలమవడం అత్యంత అసాధారణం! అహ్మదాబాద్ ప్రమాద ఘటన.. మరికాసేపట్లో పౌర విమానయాన శాఖ సమీక్షకీలకంగా డిజిటల్ ఆధారాలుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుభవన శిథిలాల నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ స్వాధీనంబ్లాక్ బాక్స్ విశ్లేషిస్తే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలిసే అవకాశండిజిటల్ వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్‌కు డీవీఆర్‌ను పంపిన అధికారులుబోయింగ్ ట్రాజెడీ ఫైల్స్అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుప్రాథమికంగా.. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ కమిటీ దర్యాప్తుకేంద్రం తరఫున.. నిపుణులతో హైలెవల్ కమిటీ దర్యాప్తుడీజీసీఏ విచారణ కూడాభారత్లో బోయింగ్ విమానాల తనిఖీలుప్రత్యేక అడిటింగ్‌కు ఆదేశించిన కేంద్రం👉ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు.. విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని వాళ్లు కూడా మరణించారు. దర్యాప్తు నేపథ్యంలో మెడికల్ కాలేజీ భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 👉ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య శనివారం ఉదయానికి 274కి చేరింది. 👉విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉండగా.. 241 మంది మరణించారు. విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రుడు రమేష్‌ను ప్రధాని మోదీ సైతం పరామర్శించారు. 👉గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (AI171) అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తుండగా.. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే మెఘాని ప్రాంతంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. 👉మే డే కాల్ ఇచ్చిన పైలట్ ఆ వెంటనే విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ ధాటికి విమానం భారీ శబ్దం చేస్తూ పేలిపోగా.. 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ధాటికి ప్రయాణికులు ఖాళీ మసైపోయారు. 👉ప్రయాణికులతో పాటు జనావాసాలపై కుప్పకూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది👉విమాన ప్రమాదం ఎందుకు జరిగిందనేదానిపై కొనసాగుతున్న విచారణ -
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్‌లైన్స్ డ్రీమ్‌లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. In light of the AI-171 accident on 12.06.2025, DGCA issues directives to Air India to carry out additional maintenance actions on B787-8/9 aircraft equipped with Genx engines with immediate effect.@RamMNK @mohol_murlidhar @dgca pic.twitter.com/L8YCJ1FVVT— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025 -
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్,ఆర్యన్,మనవ్ జయ్ ప్రకాష్‌లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్‌లో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్ కాలేజీ హాస్టల్ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్‌పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్లో లోపల ఉన్న టేబుల్ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
ఎయిరిండియా ప్రమాదం.. దొరికిన బ్లాక్ బాక్స్
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతకు ముందు.. బ్లాక్‌బాక్స్ దొరికిందంటూ ప్రచారం జరగ్గా.. అధికారులు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై ఆరంజె కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఏ171 బ్లాక్ బాక్స్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంనతరం, బ్లాక్ బాక్స్‌ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ బ్లాక్ బాక్స్‌లో సీవీఆర్, ఎఫ్డీఆర్ భాగాలుంటాయి. వీటిల్లో విమాన డేటా రికార్డింగ్, వేగం, ఎత్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సీవీఆర్‌లో రికార్డయిన చివరి రెండు గంటల పైలెట్, కోపైలెట్ల మధ్య సంభాషణ వినొచ్చు. గురువారం మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.ఇదీ చదవండి: బ్లాక్‌బాక్స్‌తో ఏం చేస్తారో తెలుసా? -
ఎలా బతికానో కూడా తెలియదు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మందికి(ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం) మరణించారు. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్ ఒక్కడే. ప్రస్తుతం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఆయన నుంచి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. .. ‘‘నమ్మలేకపోతున్నా.. ఎలా బతికానో కూడా తెలియట్లేదు’’ అంటూ అతను చెబుతున్నాడు. విమానంలో 11ఏ సీట్లో కూర్చున్న రమేష్.. ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారంటూ తొలుత పోలీసులు చెప్పారు. అతని సోదరుడు ధీరేంద్ర సోమ్బాయ్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రమేష్ మాత్రం జరిగింది అది కాదని స్పష్టత ఇచ్చారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని, తమ విమానం నేలకూలుతుందన్న విషయం తనకు అర్థమైంది. ఆ వెంటనే విమానం కిందకు వచ్చి ముక్కలై.. పేలిపోయిందని.. ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నారు.40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ అయిన విశ్వాష్ కుమార్ రమేష్.. ఏదో అద్భుతం జరిగినట్లే ప్రమాదం నుంచి బయటడ్డారు. ప్రమాద సమయంలో విమానం నేలను తాకి రెండు ముక్కలైంది. ఆ సమయంలో సీటు ఎగిరి కాస్త దూరం పడిపోయింది. ఈ క్రమంలోనే నాకు గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో అసలు ఎలా బతికానో కూడా తెలియదు అని రమేష్ ప్రధాని మోదీ సహా తనను పలకరించిన వారికల్లా చెబుతున్నాడు.‘‘ప్రమాదం జరిగాక నేను బతకడం కష్టమనే అనుకున్నా. అయితే నా సీటు దగ్గర్లో విమాన ప్రధాన భాగం ఉందని కనిపించింది. అక్కడ కొంచెం సందు కనిపించింది. నా సీటు బెల్ట్‌ను నెమ్మదిగా తొలగించి.. పాకుంటూ బయటకు వచ్చా. నా చుట్టుపక్కల వాళ్లలో కొందరు చనిపోయి ఉన్నారు. కొందరికి ఊపిరి ఆగిపోతున్న పరిస్థితి. అది చూశాక.. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చాక.. విమానం పేలిపోయిందని ఏదో భాషలో(గుజరాతీ) అంతా అరుస్తున్నారు. ఆ గందరగోళ వాతావరణంలోనే నడుచుకుంటూ వచ్చి ఆంబులెన్స్ ఎక్కాను’’ అని రమేష్ తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న రమేష్‌ను.. త్వరలో పోలీసులు, దర్యాప్తు కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది. -
ప్రయాణికుల పాలిట పీడకలగా డ్రీమ్ లైనర్
-
అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం... మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన ఎయిర్ ఇండియా విమానం.. 265 మంది దుర్మరణం... మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
-
విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
-
అర నిమిషంలో కూలిపోయింది
-
దిగ్విజయాల నుంచి దిగంతాలకు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సాధారణ ప్రయాణికులతోపాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయిన వార్త తెలిసి గుజరాత్ ప్రజలు హుతాశులయ్యారు. పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి ప్రజారంజకంగా పాలించిన విజయ్ రూపానీ లేరన్న వార్త గుజరాత్ వాసులను కలిచివేసింది. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్పై మక్కువ ప్రస్తుతం మయన్మార్‌గా పిలుచుకుంటున్న నాటి బర్మాలోని యాంగూర్ నగరంలో 1956 ఆగస్ట్ రెండో తేదీన విజయ్ కుమార్ రూపానీ జన్మించారు. నాటి బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ తల్లిదండ్రులు మాయబెన్, రామ్నిక్లాల్ రూపానీలు 1960లో గుజరాత్‌కు వలసవచ్చింది. చిన్నప్పటి నుంచే హిందూత్వంపై మక్కువతో టీనేజీలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లో చేరారు. ఇందులోభాగంగా తొలుత ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా చేరారు. 1971లో జనసంఘ్‌లో చేరారు. భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీకు పూర్తిగా అంకితమయ్యారు. 1976లో ఎమర్జెన్సీ కాలంలో భుజ్, భావనగర్ జైళ్లలో 11 నెలలపాటు కారాగార శిక్ష అనుభవించారు. 1978 నుంచి 1981 వరకు ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గానూ పనిచేశారు. 1987లో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పోరేటర్‌గా గెలిచారు. 1996 నుంచి 1997 దాకా రాజ్‌కోట్ మేయర్‌గా సేవలందించారు. 1998లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేశూభాయ్‌పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. 2006లో గుజరాత్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా సేవలందించారు. 2006 నుంచి 2012 ఏడాదిదాకా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేసిన రికార్డ్ ఈయన సొంతం. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్ర మున్సిపల్ ఫైనాన్స్ బోర్డ్‌కు రూపానీ ఛైర్మన్ సేవలందించారు. 2014లో విజుభాయ్ వాలా రాజ్‌కోట్ పశి్చమ శాసనసభ నియోజకవర్గానికి రాజీనామాచేయడంతో అక్కడ ఉపఎన్నిక చేపట్టారు. బీజేపీ మద్దతుతో ఆనాడు రూపానీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 నవంబర్‌లో నాటి మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తొలిసారిగా కేబినెట్‌ను విస్తరించినప్పుడు మొట్టమొదటిసారిగా రూపానీని మంత్రిపదవి వరించింది. రవాణా, నీటి పారుదల, ఉపాధి కారి్మక శాఖల మంత్రిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రూపానీ ఎన్నికయ్యారు. 2021లో భారత్‌లో అత్యంత ప్రభావశీలురైన తొలి 100 మంది వ్యక్తుల జాబితాలో రూపానీ స్థానం సంపాదించుకున్నారు.ముఖ్యమంత్రిగా.. 2017లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటిదాకా సీఎంగా కొనసాగిన ఆనందిబెన్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీకోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న రూపానీకి సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రాజ్‌కోట్ వెస్ట్‌లో కాంగ్రెస్ నేత ఇంద్రాణిరాజ్యగురును మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలిచిన రూపానీని పార్టీ శాసనసభాపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. ప్రజల సమస్యలను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు కృషిచేసి సమర్థవంతమైన సీఎంగా పేరుతెచ్చుకున్నారు.లక్కీనంబర్ 1206 నాడే...1206. ఇది తన లక్కీ నంబర్ అని విజయ్ రూపానీ బాగా నమ్ముతారు. అందుకే తొలినాళ్లలో వాడిన మోటార్‌సైకిళ్ల నుంచి ఆయన కార్ల దాకా అన్నింటికీ ఇదే నంబర్ ఉంటుంది. చివరికి విమాన ప్రమాదంలో రూపానీ దుర్మరణం పాలైన తేదీ కూడా 12.06 (జూన్ 12) కావడం విధి వైచిత్రేనంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. -
హృదయం ముక్కలైంది: ప్రధాని మోదీ
మాస్కో/లండన్/వాషింగ్టన్/పారిస్/బ్రస్సెల్స్: మాన ప్రమాద వార్త తెలియగానే తన హృదయం ముక్కలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో ఒక సంతాప పోస్ట్ పెట్టారు. ‘‘ అహ్మదాబాద్‌లో పెను విషాదం నన్ను ఎంతగానో కలచివేసింది. మాటలు రావడం లేదు. మాటలకందని మహా విషాదమిది. నా హృదయం ముక్కలైంది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించే. సహాయక చర్యల్లో నిగమ్నమైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నా’’ అని మోదీ అన్నారు. ‘‘ హృదయ విదారక దుర్ఘటన ఇది. ఇంతటి విషాద సమయంలో బాధిత కుటుంబాలకు యావత్భారతావని అండగా నిలుస్తోంది’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు పార్టీల అధినేతలు, అగ్రనేతలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు వెలువర్చారు.ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసిన ప్రపంచాధినేతలుఅంతులేని విషాదాన్ని మిగిల్చిన గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై ప్రపంచదేశాలు నిర్వరపోయాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తంచేస్తూ ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదలు మలేసియా ప్రధాని అన్వర్ఇబ్రహీం దాకా పలువురు ప్రపంచ దేశాల అధినేతలు, పాలకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు పంపించారు. ‘‘ ఎంతో మంది బ్రిటిష్ జాతీయులతో లండన్‌కు బయల్దేరిన విమానం కూలిన దుర్ఘటన దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ ఘటన వివరాలను ఎప్పటికప్పుడు తెల్సుకుంటున్నా. తాజా పరిస్థితిపై ఆరాతీస్తున్నా. భాదితుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్మార్మర్ వ్యాఖ్యానించారు. బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లెయిన్ తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. -
మహా విషాదం.. 265 మంది దుర్మరణం
అహ్మదాబాద్: మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్‌వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని యిర్ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగింది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు. హాస్టల్లోకి చొచ్చుకెళ్లిన విమానం పైలట్ ‘మే డే’ అలర్ట్ విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్ గేర్ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ‘మే డే’ కాల్ చేశారు. ‘‘ఏటీసీ తక్షణం స్పందించి తిరిగి కాల్ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజన్లలో టేకాఫ్‌కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ‘‘విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు’’ అని హరేశ్ షా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం! ఎవరినీ కాపాడలేకపోయాం: అమిత్ షా ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ‘‘అదంతా ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రమైన మంటలు చెలరేగి భరించలేనంత వేడి పుట్టుకొచ్చింది. దాంతో ఎవరినీ కాపాడే అవకాశం లేకుండా పోయింది’’ అని చెప్పారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అనంతరం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. ‘‘డీఎన్ఏ శాంపిళ్లను ఇప్పటికే సేకరించారు. గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాయి’’అని తెలిపారు. సెకెనుకు 4 లీటర్ల ఇంధనం విమాన ఇంధనాన్ని జెట్ ఫ్యూయల్ లేదా జెట్ ఏ1 అని పిలుస్తారు. బోయింగ్ 747 విమానం నడవాలంటే భారీగా ఇంధనం కావాలి. సెకెనుకు 4 లీటర్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి 240 లీటర్లు, గంటకు 14,400 లీటర్లు కావాలన్నమాట. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు సుమారు 6,859 కి.మీ. దూరానికి 9 గంటలపైనే ప్రయాణం. ఎయిరిండియా విమానంలో అంత భారీగా ఇంధనం ఉండటానికి అదే కారణం. విమానం వేగంగా, బలంగా నేలను తాకగానే అంత ఇంధనం ఒకే మండిపోయింది. దాంతో భారీగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తేలాల్సి ఉంది. విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు విమాన కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్ భవనాలు తదితరాల కింద చాలామంది వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకుని ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) తెలిపింది. వారిని వెలికితీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మృతదేహాలను సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని ఎఫ్ఏఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివ్యాన్‡్ష సింగ్ అన్నారు. వెలికితీసిన మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పారు. -
ఆకాశంలో విషాదం!
గుజరాత్‌లోని అహమ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరిన ఎయిరిండియా సంస్థ విమానం బోయింగ్–787–8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కాసేపటికే గురువారం ప్రమాదానికి లోనై కూలిపోవటం ఎంతో విషాదకరం. మన విమానాలు ఎంతో సురక్షితమైనవనీ, ప్రమాదాలకు ఆస్కారం లేనివనీ పేరుంది. ఇప్పుడు కూలిపోయిన విమానం పదకొండేళ్లుగా వినియోగంలో ఉంది. ఈ తరహా విమానాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ఆలోచన కూడా ఉంది. ఇంతలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్య మంత్రి విజయ్ రూపానీ సహా 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ వాసులు, కెనడావాసి ఒకరు వున్నారని ఎయిరిండియా సంస్థ ప్రకటన చెబు తోంది. వీరిలో ఒక్కరు గాయాలతో బయటపడ్డారు. భవనంపై ఈ విమానం కూలడంతో అందులో కూడా మరణాలు సంభవించాయని, చాలామంది గాయపడ్డారని అంటున్నారు. వర్తమాన యుగంలో దేశాల మధ్య అనుసంధానం బాగా పెరిగింది. వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఉపాధి, పర్యాటకం లాంటి ఎన్నెన్నో అవసరాల నిమిత్తం ఒకచోటనుంచి మరో చోటుకు ప్రయాణిస్తున్నవారి సంఖ్య పదేళ్ల క్రితంతో పోల్చినా ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు సంపన్న వర్గాల సొంతం అను కునే విమానయానం ఇవాళ మధ్యతరగతి పౌరులకు సైతం జీవితావసరంగా మారింది. ఎప్పటికప్పుడు అందుబాటులోకొస్తున్న సాంకేతికతలు విమానయానాన్ని సురక్షితం చేశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మానవ తప్పిదాలకు ఆస్కారం ఉంటుంది గనుక విమాన గమనాన్నీ, దాని తీరుతెన్నులనూ నిర్దేశించగల మెకానికల్, హైడ్రో మెకానికల్ నియంత్రిత వ్యవస్థలు ప్రవేశించాయి. ఇందువల్ల పైలెట్ ఒక కమాండ్ ఇవ్వగానే దానికి సంబంధించిన అనుబంధ మార్పులన్నీ ఒకదాని వెంబడి మరోటి వేగంగా పూర్తవుతాయి. ఈ క్రమంలో ఎక్కడ లోపం కనిపెట్టినా సెన్సర్లు గుర్తిస్తాయి. ఆ వెనకే తక్షణం సరిచే యగల వ్యవస్థలకు సంకేతాలిస్తాయి. ఏకకాలంలో అనేక పనుల్ని క్షణాల్లో చేయగలిగే ఈ వ్యవస్థల కారణంగా పైలెట్ల పని గతంతో పోలిస్తే చాలా మేరకు తగ్గిందనే చెప్పాలి. అయితే పైలెట్ సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవటం ఇందులోని బలహీ నత. ఏ వృత్తిలోనైనా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినవెన్నో ఉంటాయి. అన్నీ యంత్రాలే చేయటం ఆ అనుభవాలకు పరిమితులు విధిస్తుంది. మరి ఇంత సాంకేతికాభివృద్ధి జరిగినా ప్రమాదం ఎలా సంభవించిందన్నదే ప్రశ్న. ఒక మాదిరి విశాలంగా, ఒకేసారి 290 మంది ప్రయాణించగల ఈ మోడల్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. ఎక్కడా ఆగకుండా ఏకబిగిన వేలాది కిలోమీ టర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అయినా ఈ విషాదం ముంచుకొచ్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటుచేసుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పైలెట్ నుంచి తక్షణ సాయం అవసరమని సూచించే ‘మేడే కాల్’ కూడా అందింది. ఆ మరుక్షణమే విమానం ప్రమాదంలో చిక్కుకుంది. దూరప్రయాణం కనుక ఇంధనం అధికంగా ఉంది. దాని వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఆవాసాలుండటం ఒక సమస్య. అందువల్ల ఆహారం కోసం వచ్చే పక్షులు విమానాలకు ముప్పు తెస్తాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో 92 శాతం వరకూ పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చంటారు. మహా అయితే అత్యవ సర ల్యాండింగ్ తప్పకపోవచ్చు. కానీ ఆ మిగిలిన 8 శాతం మేర ముప్పు పొంచివున్నట్టే లెక్క. పక్షుల గుంపు విమాన మార్గంలో అడ్డు తగలటం, దానికుండే రెండు ఇంజన్లలోనూ అవి చిక్కు కోవటం వంటి కారణాలు ప్రమాదానికి దోహదపడ్డాయా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ డ్రీమ్‌లైనర్ రకం విమానాల్లో నిర్వహణా లోపాలున్నాయని చాన్నాళ్లుగా ఫిర్యాదు లందుతున్నాయి. వాటి పర్యవసానంగా విమానాలు కూలిపోవటం వంటివి చోటుచేసుకోలేదుగానీ అవి భారీ కుదుపులకు లోనై ప్రయాణికులు గాయపడిన ఉదంతాలున్నాయని ఏవియేషన్ సేఫ్టీ నెట్ వర్క్ (ఏఎస్ఎన్) గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు జనవరిలో అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ప్రయాణంలో ఉండగా దానికి చిల్లుపడి చొచ్చుకొచ్చిన పెనుగాలి ధాటికి ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అప్రమత్తమైన పైలెట్ చాకచక్యంగా కిందకు దించటంతో ముప్పు తప్పింది. విమానం ఫ్యూజలాజ్ (ప్రయాణికులు కూర్చునే బాడీ) నిర్మాణం సక్రమంగా లేదని, అందువల్ల ముప్పు ఏర్పడే అవకాశమున్నదని బోయింగ్‌లో పనిచేసిన ఒక ఇంజనీర్ నిరుడు వెల్లడించినప్పుడు సంస్థ కొట్టిపారేసింది. విస్తృతంగా పరీక్షలు జరిపాక వెంటనే సమస్యాత్మకం అయ్యేదేమీ లేదని ప్రకటించింది. అయితే ఈ కంపెనీ రూపొందించిన 737 రకం విమానాలు రెండు 2018, 2019 సంవత్సరాల్లో కుప్పకూలి 346 మంది మరణించారు. ఈ రెండు ఉదంతాల్లోనూ తన నేరసంబంధ బాధ్యత నుంచి తప్పించుకోవటానికి అమెరికా ప్రభుత్వంతో గత నెలలోనే ఒప్పందానికొచ్చింది. ప్రభుత్వ పర్యవేక్షణను తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు భారీయెత్తున జరిమానా చెల్లించింది. విమానాల తయారీలో నాణ్యతనూ, భద్రతనూ మరింత పెంచుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఈ దురదృష్టకర ఘటనపై జరిగే దర్యాప్తులో ఉత్పాదక సంబంధ లోపాలపై కూడా దృష్టి పెట్టాల్సివుంది. ఇదే సమయంలో విమానయాన సంస్థలన్నీ భద్రతపై మరింత శ్రద్ధపెట్టి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. -
ఇటీవలే పెళ్లి, భర్త కోసం లండన్‌కు నవ వధువు.. నిమిషాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు
గాంధీనగర్: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్ని తీవ్ర విషాదాన్ని నింపింది. వారిలో నవ వధువు ఖుష్బూ రాజ్‌పురోహిత్ ఉన్నారు. ఆమె లండన్‌లో ఉంటున్న తన భర్తను కలిసేందుకు ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. కానీ అంతలోనే అనుకోని విషాదం.. నిమిషాల వ్యవధిలోనే తన భర్తను కలవాలన్న ఆమె కలను చిదిమేసింది. ఖుష్బూ రాజస్థాన్‌లోని బాలోటరా జిల్లాలోని అరాబా గ్రామ వాసి ఖుష్బూ రాజ్‌పురోహిత్ . ఆమెకు ఇటీవల మన్ఫూల్ సింగ్‌తో వివాహం జరిగింది. వివాహం తర్వాత తొలిసారి లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భర్తను కలిసేందుకు అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. విమాన ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్టులో ఖుష్బూ రాజ్ పురోహిత్ కుమార్తె తన తండ్రి మదన్ సింగ్‌తో దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రిమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలో జనావాస్లాల్లో దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 11 మంది ఈ విమానంలో ఉన్నారు. వారిలో ఇద్దరు యూకేలో చెఫ్‌గా పని చేయడానికి వెళ్తున్న పురుషులు , ఒక మార్బుల్ వ్యాపారి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, ఏడు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో ఒక్కే ఒక్క ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, రమేష్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,ఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఘోర విమాన ప్రమాదంలో ఎయిరిండియా విమానంలోని 242 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రమాదంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం తనని కలిచి వేసిందన్న ప్రధాని మోదీ.. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విమాన ప్రమాదంపై రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన హృదయ విదారకరమైంది.ప్రధాని మోదీ, భారత్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంఘీభావం. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో నా సహచరుడు ప్రధాని మోదీ, భారత ప్రజలకు అండగా నిలుస్తాం. 242 మంది పురుషులు, మహిళలు, పిల్లల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని నేను బాధపడ్డాను’అని అన్నారు.ఈరోజు అహ్మదాబాద్‌లో జరిగిన అత్యంత విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ గురయ్యా. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. బాధితుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రాణాలతో బయటపడిన వారి వివరాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ప్రమాదంలో అందరు సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాను’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. -
Plane Crash: విమానంలో ఉన్నవారందరూ మృతి
-
కేంద్రం హెచ్చరికను పెడ చెవిన పెట్టి.. 242 మంది మృతికి ఎయిరిండియానే కారణమా?
గాంధీ నగర్: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు మరణించిన జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఎయిరిండియా?నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కూలిన విమానం ఇప్పటికే గతంలో పలు మార్లు మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్‌లో పొగలు కమ్ముకున్నాయి. గతవారం ఇదే విమానం ప్యారిస్ వెళ్తుండగా మొరాయించడంతో పైలెట్ షార్జాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానానికి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు,ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. -
‘విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదు’: సీపీ
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిరిండియా ఘోర విమానం ప్రమాదంలో మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడారు. విమానం జనావాసాల్లో కూలిపోవడంతో స్థానికులు మరణించినట్లు చెప్పారు. అయితే, ఆ మరణాలు సంఖ్య ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. -
ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు విమాన ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.— Narendra Modi (@narendramodi) June 12, 2025ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అని మోదీ ట్వీట్ చేశారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిన సమీక్షిస్తున్నానని,. బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతివిమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా బాధించిందన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్న ఆమె.. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి దేశం అండగా నిలుస్తుందన్నారు. I am deeply distressed to learn about the tragic plane crash in Ahmedabad. It is a heart-rending disaster. My thoughts and prayers are with the affected people. The nation stands with them in this hour of indescribable grief.— President of India (@rashtrapatibhvn) June 12, 2025 కాగా, ఈ రోజు గురువారం(జూన్ 12) అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందిపైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. :అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 100 మందికిపైగా మృతి? -
Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!
Ahmedabad Plane Crash గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం - ఫ్లైట్ AI-171 కుప్పకూలిపోయింది. గురువారం (2025 జూన్ 12వ తేదీ) లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఈ విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. వీరిలోఇద్దరు పైలట్లు ,10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్‌గా క్లైవ్ కుందర్ ఉన్నారు. ఈ దుర్ఘటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సహా పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతికత ,సౌకర్యవంతమైన ప్రయాణీకుల అనుభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సుదూర విమానం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌తో మొట్టమొదటి ప్రాణాంతక ప్రమాదం ఇదని నిపుణులు భావిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అనేది దానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 169 మంది భారతీయులు, 53 బ్రిటిష్ పౌరులు,ఒకకెనడియన్, ఏడుగురు పోర్చుగీసు వారున్నారు. వీరిలో ఎంత మంది ప్రాణాలున్నారు అనేది సందేహమే.#WATCH | Air India plane crash: "My sister was going to London. She had her flight around 1.10 pm, but the flight crashed," says Bhawna Patel as she arrived at the Civil Hospital in Ahmedabad, Gujarat pic.twitter.com/aDkixvDB9d— ANI (@ANI) June 12, 2025మేడే కాల్ విమానంనుంచి ‘ మేడే (MAYDAY) కాల్ వచ్చిందని, కానీ ఆ తర్వాత విమానం నుండి ఎటువంటి స్పందన రాలేదు" డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు యూకే ప్రభుత్వం కూడా స్థానిక అధికారులతో కలిసి చేస్తోంది. ఈ మేరకు ఒక ఒక ప్రకటనవిడుదల చేసింది.. కాన్సులర్ సహాయం అవసరమైన లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆందోళనలు ఉన్న బ్రిటిష్ జాతీయులు 020 7008 5000 కు కాల్ చేయాలని తెలిపింది.ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్అవేర్ ప్రకారం, విమానం మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరింది - మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరడానికి 45 నిమిషాలు ఆలస్యంతో బయలుదేరి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ప్రమాద స్థలం సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు పెద్ద పేలుడు సంభవించి, నల్లటి పొగలు కమ్ముకున్నట్లు నివేదించారు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘని నగర్ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలను దృశ్యాలు చూపించాయి. స్థానిక అగ్నిమాపక విభాగాలు, అంబులెన్స్‌లు NDRF బృందాలు సహా అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.కేంద్ర పౌర విమానయాన మంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమయ్యామని త్వరితగతిన సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. (అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్)బోయింగ్ 787 డ్రీమ్లైనర్బిజినెస్ స్టాండర్ట్ రిపోర్ట్ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అత్యంత అధునాతన విమానాలలో ఒకటి కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది. తక్కువ ఇంధనం పడుతుంది. అధిక తేమ స్థాయిలు, లార్డర్ డిమ్మబుల్ విండోస్, నిశ్శబ్ద క్యాబిన్ లాంటి ఫీచర్స్ దీని సొంతం. 2009లో ప్రవేశపెట్టబడిన 787-8 వేరియంట్, సాధారణంగా 242 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. 13,500 కిలోమీటర్లకు పైగా ఎగురుతుంది. అయితే, ఈ విమానం సంవత్సరాలుగా నిరంతర సాంకేతిక, భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది.2013లో, లిథియం-అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన రెండు వేర్వేరు సంఘటనల తర్వాత డ్రీమ్లైనర్లను మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిలిపిశారు. అందులో ఒకటి బోస్టన్‌లో జపాన్ ఎయిర్‌లైన్స్ 787, మరొకటి జపాన్‌లోని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్కు మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను పునఃరూపకల్పన చేసేవరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) డ్రీమ్‌లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది.ఇదీ చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్‌గా అఖిల్ అర్థాంగి2024లో, కంపెనీలో ఇంజనీర్ అయిన విజిల్‌బ్లోయర్ సామ్ సలేహ్‌పూర్ డ్రీమ్‌లైనర్ ఫ్యూజ్లేజ్లోని నిర్మాణాత్మక సమస్యల గురించి యుఎస్ సెనేట్‌కు సాక్ష్యమిచ్చిన తర్వాత బోయింగ్ తిరిగి పరిశీలనలోకి వచ్చింది. నిర్మాణ వైఫల్యానికి దారితీయవచ్చని ఆయన ఆరోపించారు. FAA దర్యాప్తు ప్రారంభించింది, అది ఇంకా కొనసాగుతోంది.- మార్చి 2024లో, LATAM ఎయిర్‌లైన్స్ బోయింగ్ 787-9 విమానం మధ్యలో అకస్మాత్తుగా సమస్యలు రావడంతో, పడిపోవడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్‌పిట్‌లో సీటు-స్విచ్ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తరువాత గుర్తించారు. దీంతో పాటు గత కొన్నేళ్లుగా డ్రీమ్‌లైనర్‌ను నడుపుతున్న పైలట్లు ఇంజిన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు , ఇంధన లీకేజీలు వంటి సమస్యల గురించి వివరించారు. అయితే ఇంత ప్రమాదం మునుపెన్నడూ జరగలేదు.ఇదే ఎయిరిండియా విమానం కేవలం ఆరు నెలల క్రితం తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మార్గంలో AI-171, డిసెంబర్ 2024లో ఒక పెద్ద సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. ఈ సమయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. నిర్వహణ లోపాలు. విమాన భద్రతా విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ విమానం తరువాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి లభించిందట. -
Plane Crash: ప్రమాదం దగ్గర ప్రస్తుత పరిస్థితి
-
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం..!
-
కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc— Shiv Aroor (@ShivAroor) June 12, 2025 -
Air India Plane Crash : అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం (ఫొటోలు)
-
BIG BREAKING: గుజరాత్లో కూలిన విమానం
-
ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రం అహ్మాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ పెను విషాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు కేంద్ర మంత్రి, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. (విమాన ప్రమాదానికి ముందు మాజీ సీఎం విజయ్ రూపానీని సెల్ఫీ తీసిన తోటి ప్రయాణికురాలు)ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధితుల్లో విజయ్ రూపానీ ఉన్నారు. ‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి (లండన్) వెళ్తున్నారు. ఈ సంఘటనలో ఆయన కూడా బాధితుడే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది బిజెపికి పెద్ద నష్టం’అంటూ సీఆర్ పాటిల్ విచారం వ్యక్తం చేశారు. VIDEO | Ahmedabad Plane Crash: Union Minister and Gujarat BJP president, CR Patil (@CRPaatil) confirms former Gujarat CM Vijay Rupani's demise. Speaking to reporters, he says, "Our leader and former Chief Minister, Vijay Rupani, was going (to London) to meet his family. He is… pic.twitter.com/5c1VIk8KIb— Press Trust of India (@PTI_News) June 12, 2025 పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తేలింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపానీ 12వ ప్రయాణికుడు. జెడ్ క్లాస్‌లో రూపానీ టికెట్ బుక్ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:10 గంటలకు సర్వీస్ ఉంది. ఆ విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు.Ahmedabad Plane Crash: Video captured exact moment Air India's AI -171 passenger aircraft crashed near Meghnaninagar area earlier today.(Disclaimer: PTI can not verify the authenticity of the video)(Source: Third party) pic.twitter.com/qAK8aP6wGH— Press Trust of India (@PTI_News) June 12, 2025విమానంలో 169 మంది భారతీయులు, 53 మంత్రి బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.ప్రమాదానికి గురైన విమానం వైడ్‌బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 265 మంది మృతి
👉అహ్మదాబాద్‌లో హోంమంత్రి అమిత్ షా పర్యటనవిమాన ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతివిమానం పేలడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం రాలేదుబాధిత కుటుంబాలకు అండగా ఉంటాండీఎన్ఏ టెస్టుల తర్వాత మృతులను గుర్తిస్తాంగుజరాత్లోనే వీలైనంత త్వరగా డీఎన్ఏ టెస్టులు పూర్తి చేస్తాంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుడిని కలిశానుమృతదేహాల వెలికితీత పూర్తైంది👉అహ్మదాబాద్ చేరుకున్న డీజీసీఏ దర్యాప్తు బృందంవిమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏఏఏఐజీ డీజీ నేతృత్వంలో దర్యాప్తువిమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతిఅధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం2016-2021 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన విజయ్ రూపాని👉మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియామృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియాక్షతగాత్రుల వైద్య పరీక్షలన్నీ భరిస్తాం: చంద్రశేఖరన్బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని పునర్నిర్మిస్తాం 👉ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడుఒక ప్రయాణికుడు బతికే ఉన్నాడని ప్రకటించిన సీపీ11A సీటులో ఉన్న వ్యక్తి బతికాడంటున్న పోలీసులుఆలస్యంగా గుర్తించిన పోలీసులురమేష్ విశ్వాస్ కుమార్‌గా గుర్తింపు 👉ఎయిరిండియా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనే అనుమానంవిమానానికి పలుమార్లు సాంకేతిక లోపంగత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలుఏడాదిలో రెండుసార్లు సాంకేతిక సమస్యలుజూన్, డిసెంబర్లో తప్పిన ప్రమాదాలు👉విమానంలో ఉన్న 241 మంది దుర్మరణం..!229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు మృతి10 మంది విమాన సిబ్బంది మృతి👉విమాన ప్రమాదంపై విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనవిమాన ప్రమాదంలో చాలా మంది చనిపోయారుమృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం: విదేశాంగ శాఖమృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ👉అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతిఎయిర్ ఇండియా AI-171 విమానం కూలిపోయిన విషయం తెలిసి నేను షాక్ అయ్యా..ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా..మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడ్ని కోరుతున్నా..👉విమాన ప్రమాదంపై స్పందించిన భారత్‌లోని యూకే హైకమిషన్బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన యూకే హైకమిషన్స్థానిక అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: యూకే హైకమిషన్👉అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర పటేల్క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భూపేంద్ర పటేల్బాధిత కుటుంబాలను ఆదుకుంటాంజరిగిన ఘటన దురదృష్టకరంచాలా మందికి రక్తం అవసరం.. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశాంరక్తదానం చేయడానికి దాతలు రావాలి: భూపేంద్ర పటేల్రక్తదాన కేంద్రాలు:1. U. N. Mehta Institute of Cardiology and Research Centre Room no 110, 1st floor, A block Contact no-9316732524 2. IHBT Department, Civil Hospital 2nd floor, 1200 bed Civil Hospital, Contact no-9428265409 3. IKDRC Blood Centre 1st floor, IKDRC Hospital, Manjushree mill road, Baliya limdi Contact no-07922687500 Ext no-4226 4. GCRI Blood Centre 1st floor, Gujarat cancer & Research institute Contact no-07922688026👉అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీవిమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధించిందిఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటనబాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని👉విమాన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతిబాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరిన రేవంత్👉విమానయాన శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటుఫోన్ నంబర్లు: 011 24610843, 9650391859ఎయిరిండియా హెల్ప్‌లైన్ నంబర్ 1800 5691 444👉బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిన విమానంబీజే మెడికల్ కాలేజీలోని 24 మంది వైద్య విద్యార్థులు మృతివిమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా 242 మంది👉విమాన ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటుహెల్ప్లైన్ నంబర్ 1800 5691 444ప్రమాదంపై ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్రశేఖరన్బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రశేఖరన్ 👉విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులువిమానంలో ఏడుగురు పోర్చుగ్రీస్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడువిమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలుఅహ్మదాబాద్ ఆసుప్రతికి చేరిన 40 మృతదేహాలు👉విమాన ప్రమాదంపై డీజీసీఏ ప్రకటనవిమానంలో 242 మంది ప్రయాణికులుఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందిఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందిఏటీసీ నుంచి చేసిన కాల్స్‌కు స్పందన రాలేదుఅహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిందిఎయిర్ పోర్ట్‌పరిసరాల్లోనే విమాన ప్రమాదం👉కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ప్రధాని మోదీ ఫోన్విమాన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధానిఎప్పటి కప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలన్న మోదీ👉విమానంలో 52 మంది బ్రిటన్ దేశస్థులుసాయంత్రం 5 గంటల వరకు ఎయిర్పోర్ట్ మూసివేతవిమానం కూలిపోయే ముందు ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చిన పైలట్లుపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ👉విమాన ప్రమాదంలో 100 మందికిపైగా మృతి?కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని?విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందిపైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలేర్దిన విమానంవిమానానికి ఫస్ట్ ఆఫీసర్‌గా ఉన్న పైలట్ కైవ్ కుందర్న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం ఎయిర్పోర్ట్ సమీపంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లు చేరుకుంటున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం మధ్యాహ్నాం మధ్యాహ్నం 1:39 గంటలకు బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయ్యిందని.. టేకాఫ్ కాసేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం లండన్ వెళ్తుండగా.. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి.Ahemdabad Plan crash around 242 passengers are traveling 💔 reason :- technical fault #Planecrash #Ahmedabad #Airindia #crash pic.twitter.com/5iUENTIPxd— Manan Trivedi (@itsurbunny7) June 12, 2025828 అడుగుల ఎత్తులో విమానం క్రాష్ అయ్యింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. పలువురిని అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షత గాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.గుజరాత్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఅహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు. -
టూరిస్టులకూ నో : మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరం ఇదే..!
గుజరాత్‌లోని ‘పాలిటానా’ నగరం ప్రపంచంలో మాంసాహారం నిషేధించబడిన ఏకైక నగరంగా నిలిచింది. ఈ నగరంలో, మాంసాహార ఆహార పదార్థాల వినియోగం, అమ్మకం, కలిగి ఉండటం కూడా పూర్తిగా నిషేధం. పర్యాటకులకు కూడా మాంసాహారం తీసుకురావడానికి, తినడానికి అనుమతి లేదు. అసలేంటీ నగరం ప్రత్యేకత. ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుంది తెలుసుకుందామా..!గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉంది పాలిటానా నగరం. రాజధాని నగరం అహ్మదాబాద్ సమీపంలో సౌకర్యవంతంగా ఉంది. జైనులకు ఎంతో పవ్రితమైన ప్రదేశంగా, "జైన్ టెంపుల్ టౌన్" గా పాలిటానా ప్రసిద్ది చెందిది. ఈ ప్రత్యేకతను మరింత నిలుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శాఖాహార నగరంగా ప్రకటించింది. 900 కి పైగా జైన దేవాలయాలు ఒక్కడ కొలువు దీరి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఏడాది పొడవునా జైన భక్తులు ఇక్కడికి క్యూ కడతారు.జైనమతం బోధించే వాటిల్లో ప్రధాన సూత్రం అహింస లేదా అనువ్రతం. ఏ జీవికి హాని కలిగించకూడదని విశ్వసిస్తుంది. 2014లో, జైన సన్యాసుల అభ్యర్థనలను అనుసరించి, గుజరాత్ ప్రభుత్వం పాలిటానాను "మాంసం లేని నగరం"గా ప్రకటించింది. దీని ప్రకారం మాంసం, చేపలు ,గుడ్ల అమ్మకం మరియు వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధించింది. పూర్తిగా శాఖాహార నగరంగా ప్రకటించిన పాలిటానాలో ఎటువంటి కబేళాలులేదా మాంసాహార రెస్టారెంట్లు ఉండటానికి వీల్లేదు. పర్యాటకులు నగరంలోకి మాంసాహార ఆహారాన్ని తీసుకు రావడం కూడా చట్ట రీత్యా నిషేధం. శ్వేతాంబర జైన సమాజానికి ప్రాథమిక తీర్థయాత్ర స్థలంగా, "సిద్ధక్షేత్రం" లేదా మోక్షాన్ని పొందే ప్రదేశంగా పరిగణించబడే పాలిటానాలో సుమారు 900 దేవాలయాలు ఉన్నాయి. జైన విశ్వాసాల ప్రకారం, అనేక మంది తీర్థంకరులు ఈ కొండపై మోక్షాన్ని పొందారు, దీని ఫలితంగా 2014లో జైన సన్యాసులు మతపరమైన ఉపవాసం ఆచరించారు. శత్రుంజయ దేవాలయాలు 11వ , 20వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన వాటి సంక్లిష్టమైన చెక్కబడిన వాస్తుశిల్పం, అద్భుతమైన పాలరాయి పనికి ప్రసిద్ధి చెందాయి. శత్రుంజయ కొండపై ఉన్న ఈ దేవాలయాలను చేరుకోవడానికి సుమారు 3,500 మెట్లు ఎక్కాలి. ఈ ప్రదేశం జైన మతం మరియు గోహిల్ రాజ్‌పుత్‌ల వంటి ప్రాంతీయ పాలకులకు ప్రాముఖ్యతను కలిగి ఉంది. చదవండి: భారత్- భూటాన్ ఛిల్.. లాంగ్.. టూర్పాలిటానా జనాభా సుమారు 65,000, అధిక అక్షరాస్యత రేటు 85%. జనాభాలో 60% జైనులు, 35% హిందూ మరియు 5% ముస్లిం మరియు ఇతర వర్గాలు ఉన్నారు. ముఖ్యంగా, పాలిటానాలో నివసించే ముస్లింలు కూడా మాంసాహార నిషేధాన్ని పాటిస్తారు. నగర ఆర్థిక వ్యవస్థ మతపరమైన పర్యాటకంపై వృద్ధి చెందుతుంది, ఏటా లక్షలాది మంది భక్తులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది, ఆలయ నిర్వహణ కార్యకలాపాలు, హోటళ్ళు, ధర్మశాలల ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. -
ఆరావళి గ్రీన్‌వాల్ ప్రాజెక్టు ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో గురువారం మొక్క నాటారు. ఢిల్లీ నుంచి గుజరాత్‌లోని ఆరావళి పర్వతాల వరకు 700 కిలోమీటర్ల మేర అడవుల పెంపకం కోసం ఉద్దేశించిన ‘ఆరావళి గ్రీన్‌వాల్ ప్రాజెక్టు’ను ప్రారంభించారు. మన భూగోళంపై ఆరావళి పర్వతాలు అత్యంత ప్రాచీనమైనవని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గుజరాత్, రాజస్తాన్, హరియాణా, ఢిల్లీలో ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల ఇక్కడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే అడవుల పునరుజ్జీవన పథకంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని వెల్లడించారు. ఈ ఉద్యమంలో ప్రజలంతా పాల్గొనాలని, విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత చొరవ తీసుకోవాలని కోరారు. ఆరావళి గ్రీన్‌వాల్ ప్రాజెక్టుతో పర్యావరణం మెరుగుపడుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
వాళ్లకు టెర్రరిజమే టూరిజం
భుజ్/వడోదర: ఆపరేషన్ సిందూర్‌తో భారత ఆర్మీతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు, సైన్యం, పాలకులకు బుద్ధిచెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆ దేశ ప్రజలకూ హితవు పలికారు. ఉగ్రవాదం మీ ప్రభుత్వం, సైన్యానికి ఆదాయ వనరుగా మారిందని, ఇకనైనా మీరు మేల్కొనాలని పాక్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రం గుజరాత్లో సోమవారం పర్యటించిన ప్రధాని మోదీ దాహోద్, భుజ్, గాం«దీనగర్లలో రూ.82,950 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు చేశాక భుజ్, దాహోద్‌లలో బహిరంగ సభల్లో ప్రస ంగించారు. పాక్ సరిహద్దులోని కఛ్ జిల్లాలోనూ మోదీ పర్యటించారు. ‘‘భారత్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్నే పర్యాటకంలా ప్రోత్సహిస్తోంది. పాక్ ఈ తరహా పంథా కేవలం వాళ్లనే కాదు యావత్ ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించింది. పాకిస్తాన్ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా. మీ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. ఇకనైనా ఉగ్రవాదానికి అంతం పలికేందుకు మీరంతా ముందుకు రావాలి. సంతోషంగా, ప్రశాంత జీవనం గడపండి. కడుపారా తినండి. రోటీ కావాలో మా తూటా కావాలో మీరే నిర్ణయించుకోండి. మిమ్మల్ని ఒక్కటే అడగదల్చుకున్నా. మేం 11 ఏళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. నేడు జపాన్ను దాటేసి భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరి మీరేం సాధించారు?. మీ పరిస్థితేంటి? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మీ ప్రభుత్వాలు, సైన్యం మీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ ధోరణి సరైందో కాదో యువతే నిలదీయాలి. మిమ్మల్ని ఆర్మీ, పాలకులు అంధకారంలోకి నెట్టేస్తున్నారు’’అని మోదీ పాక్ ప్రజలకు హితవు పలికారు. పక్షం రోజులు వేచి చూశా ‘‘పహల్గాంలో పాశవిక ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కఠిన చర్యల కత్తి పట్టుకుంటుందేమోనని 15 రోజులపాటు వేచి చూశా. కానీ ఉగ్రవాదమే పాకిస్తాన్‌కు తిండిపెడుతోందని స్పష్టమైంది. అందుకే పాక్‌పై దాడులకు మా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చా. మే 9న భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ దాడులకు తెగిస్తే అంతకు రెట్టింపు స్థాయిలో దాడి చేసి మేం పాక్ వైమానిక స్థావరాలను నేలమట్టంచేశాం’’అని మోదీ అన్నారు. తర్వాత మోదీ 1971లో పాక్ బాంబుదాడుల్లో ధ్వంసమైన ఎయిర్‌ఫీల్డ్‌ను 72 గంటల్లో పునర్నిర్మించిన మధాపార్ గ్రామంలోని 300 మంది మహిళలతో మోదీ మాట్లాడారు. వీళ్లు మోదీకి సిందూర్ మొక్కను బహూకరించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో దీనిని నాటుతానని మోదీ చెప్పారు.మూడు రోడ్‌షోలు తొలుత గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం మోదీ ఏకంగా మూడు రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఉదయం వడోదరలో భారీ రోడ్‌షో చేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వెల్లడించి దేశం దృష్టిని ఆకర్షించిన కల్నల్ సోఫియా ఖురేషి తల్లిదండ్రులు, సోదరుడు, కవల సోదరి షాయనా సున్సారా కూడా ఈ రోడ్‌షోలో పాల్గొనడం విశేషం. ఖురేషి స్వస్థలం వడోదరే. రోడ్ షో సందర్భంగా జనం జాతీయ జెండాలు చేతపట్టుకుని సైన్యాన్ని కీర్తిస్తూ నినాదాలు చేశారు. మోదీ కారు నుంచి బయటకొచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం భుజ్‌లో, అహ్మదాబాద్‌లో కూడా మోదీ రోడ్‌షోలు చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ.82,950 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..
ఇండియా-ఎ జట్టు మాజీ కెప్టెన్, గుజరాత్ స్టార్ బ్యాటర్ ప్రియాంక్ పంచల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన తన దేశవాళీ కెరీర్‌కు ముగింపు పలికాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. నాకు ఈ క్షణం చాలా భాగోద్వేగంతో కూడుకున్నది. అంతే గర్వంగా కూడా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన గుజరాత్ క్రికెట్ ఆసోషియేషన్‌కు, అభిమానులకు, సహచర ఆటగాళ్లు ధన్యవాదాలు అని తన రిటైర్మెంట్ నోట్లో పంచల్ పేర్కొన్నాడు.ప్రియాంక్‌కు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన రికార్డులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో పరుగులు వరద పారించాడు. ప్రియాంక్ తన 17 ఏళ్ల కెరీర్లో127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 8856 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా 2016-17 రంజీ సీజన్లో ఈ గుజరాతీ బ్యాటర్ భీబత్సం సృష్టించాడు. ఆ సీజన్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఆ ఎడిషన్‌లో 1310 పరుగులు చేశాడు. అదేవిధంగా97 లిస్ట్ ఏ మ్యాచుల్లో 8 సెంచరీలతో కలిపి 3,672 పరుగులు చేశాడు. 59 టీ20లు ఆడిన ప్రియాంక్ 28.71 సగటుతో 1,522 పరుగులు సాధించాడు.కాగా ప్రియాంక్ 2021లో టీమిండియాకు రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. కానీ భారత తరుపన అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. 2022 శ్రీలంక టూర్‌కు కూడా సెలక్ట్ అయ్యాడు. అక్కడ కూడా అతడికి డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు. -
వడోదరలో ప్రధాని మోదీ రోడ్ షో
-
పాక్‌కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న వ్యక్తి అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్‌లోని మిలటరీ సంస్థల కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార విభాగాలకు చేరవేస్తున్న సరిహద్దుల్లోని కచ్ జిల్లా వాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. లఖ్‌పత్ ప్రాంతానికి చెందిన సహదేవసిన్హ్ గోహిల్(28) కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 2023లో ఇతడికి అదితి భరద్వాజ్ పేరుతో పాకిస్తాన్ ఏజెంట్ వాట్సాప్ ద్వారా పరిచయమైంది. తరచూ చాటింగ్ చేస్తూ అతడిని బుట్టలో వేసుకుంది. గోహిల్ తన ఆధార్ కార్డుతో తీసుకున్న రెండు సిమ్ల ఓటీపీలను ఆమెకు పంపాడు. దీంతో, ఆమె పాకిస్తాన్ నుంచి ఆ నంబర్లతో వాట్సాప్ చాటింగ్ సాగిస్తోంది. ఆమె కోరిన విధంగా, తనుండే ప్రాంతంలోని బీఎస్ఎఫ్, నేవీల మౌలిక వసతులతోపాటు నిర్మాణంలో ఉన్న వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని, ఫొటోలను పంపాడు. బదులుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇతడికి రూ.40 వేల నగదు అందింది. విషయం పసిగట్టిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) ఇటీవల గోహిల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అదితి భరద్వాజ్ పాకిస్తాన్ గూఢచారి అనే విషయం గోహిల్‌కు తెలుసునని ఏటీఎస్ శనివారం వెల్లడించింది. ఇతడితోపాటు పాక్ ఏజెంట్ అదితి భరద్వాజ్పైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపింది. -
గుజరాత్లో పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్
కచ్: సరిహద్దు భద్రతా దళం (BSF), భారత వైమానిక దళం (IAF)కు సంబంధించిన కీలక రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని గుజరాత్‌లోని కచ్‌లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్న సహ్‌దేవ్ సింగ్ గోహిల్ అనే వ్యక్తి,.. 2023 జూన్, జూలై మధ్యలో వాట్సాప్ ద్వారా అదితి భరద్వాజ్ అనే మహిళతో అతడు పరిచయం పెంచుకోగా.. ఆమె పాకిస్థాన్ ఏజెంట్ అని అతనికి ఆ తర్వాత తెలిసింది.కొత్తగా నిర్మిస్తున్న బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ సైట్ల ఫోటోలు వీడియోలు ఆమె అడగటంతో వాట్సాప్ ద్వారా వాటిని పంపించాడని గుజరాత్ ఏటీఎస్ సీనియర్ అధికారి కే సిద్ధార్థ్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో గోహిల్ తన ఆధార్ వివరాల ద్వారా ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశాడని.. పాక్ మహిళా ఏజెంట్‌తో సంప్రదింపుల కోసం వాట్సాప్‌ను యాక్టివేట్ చేశాడు.ఆ తర్వాత పాకిస్థాన్ ఏజెంట్ ఉపయోగిస్తున్న ఆ నంబర్ నుంచి బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ సదుపాయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు. గూఢచార చర్యకు పాల్పడిన గోహిల్‌కు గుర్తు తెలియని వ్యక్తి రూ.40,000 చెల్లించినట్లు నిర్ధారించిట్లు ఏటీఎస్ అధికారి తెలిపారు. -
బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం
-
‘ట్రైలర్ మాత్రమే చూశారు.. పాక్ తీరు మారకపోతే పూర్తి సినిమా చూపిస్తాం’
గాంధీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) ముగియలేదు. ట్రైలర్ మాత్రమే చూశారు. పాక్ తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తాం’ అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (rajnath singh) హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్ ఎయిర్ బేస్‌లో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం, ఆయన మీడియా మాట్లాడారు. పాకిస్తాన్‌పై భారత్ విజయానికి ఎయిర్‌బేస్ సాక్ష్యం.పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశాం. బ్రహ్మోస్ మిస్సైల్ పవరేంటో పాకిస్తాన్‌కు చూపించాం. బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. పాకిస్తాన్ ముఖ్య ఉగ్ర కేంద్రాన్ని ధ్వంసం చేశాం. నయా భారత్ ఎంటో ప్రపంచానికి తెలిసింది.మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహార్‌కు పాక్ రూ.14కోట్లు ఇచ్చింది. ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం. మన వాయిసేన అసమాన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థులను వణికించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఫండింగ్ చేస్తోంది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే.. పాక్‌కు అసలు సినిమా ముందుంది’ అంటూ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. Addressing the brave Air Warriors at the Air Force Station in Bhuj (Gujarat). https://t.co/3TGhBlyxFH— Rajnath Singh (@rajnathsingh) May 16, 2025 -
సరిహద్దుల్లో కాల్పుల మోత
న్యూఢిల్లీ/జమ్మూ/శ్రీనగర్: సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కాల్పులు శనివారం వరుసగా పదహారో రోజు కూడా కొనసాగాయి. దాంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ (పడగొట్టలేని దృఢమైన గోడ) పేరిట శుక్రవారం అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా సైన్యం భారీ కాల్పులకు పాల్పడింది. సైనిక స్థావరాలతో పాటు సాధారణ జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, హోషియార్పూర్, అమృత్సర్, ఫిరోజ్‌పూర్, తార్న్‌తరన్, హరియాణాలోని సిర్సాలో కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. పాక్ కాల్పులను సైన్యం దీటుగా తిప్పికొట్టింది. మన ప్రతిదాడుల భయంతో శనివారం తెల్లవారుజాము 3.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. ప్రభుత్వాధికారి సహా ఆరుగురి మృతి పాక్ కాల్పుల్లో జమ్మూలో ఆరుగురు మరణించారు. 8 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది సహా 20 మంది గాయపడ్డారు. మృతుల్లో రాజౌరీ జిల్లా అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ రాజ్‌కుమార్ థాపా, ఓ సైనికాధికారితో పాటు రెండేళ్ల బాలిక ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాక్ సైన్యం సామాన్యులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటమే గాక డ్రోన్లు ప్రయోగించిందని పేర్కొన్నారు. జమ్మూ సహా పలు పట్టణాలు, గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. సైరన్లు నిరంతరాయంగా మోగుతుండడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం ఉదయం 5 గంటలకు భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజ్‌కుమార్ థాపా అధికారిక నివాసంపై కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. థాపా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దాంతో స్థానికంగా విషాదం అలుముకుంది. థాపా శుక్రవారం సైతం విధుల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రితో కలిసి జిల్లావ్యాప్తంగా పర్యటించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. పాక్ దాడుల్లో రాజౌరీ టౌన్లో ఐషా నూర్ (2), మొహమ్మద్ షోహిబ్(35) మృతిచెందారు. పూంఛ్ జిల్లాలో రషీదా బీ(55) ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయాలపాలయ్యారు. జమ్మూ జిల్లా ఆర్.ఎస్.పురా సెక్టార్లో అశోక్ కుమార్ అనే పౌరుడు విగతజీవిగా మారాడు. పూంఛ్‌లోని కృష్ణఘాటీ సెక్టార్లో బాంబు పేలుడులో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమరుడయ్యాడు. జమ్మూ శివార్లలోని ఖేరీ కేరాన్ గ్రామంలో జకీర్ హుస్సేన్ (45) మరణించాడు. శ్రీనగర్‌లో భారీ పేలుళ్లు శ్రీనగర్ శనివారం పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదయం 11.45 గంటల వేళ ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతకుముందు నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్‌లోని ఓల్డ్ ఎయిర్‌ఫీల్డ్ వైపు దూసుకొచి్చన ఓ డ్రోన్‌ను సైన్యం కూల్చివేసింది. సీఎం ఒమర్ సంతాపం రాజ్‌కుమార్ థాపా మరణం పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు. అంకితభావం కలిగిన సీనియర్ అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. జమ్మూలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒమర్ పర్యటించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రజలకు స్థైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.హిమాచల్‌లో డ్రోన్, క్షిపణుల శకలాలు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ఉనా జిల్లాలోని బెహాద్ గ్రామంలో శనివారం క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. కాంగ్రా జిల్లా నూర్పూర్లో రెండుచోట్ల డ్రోన్, మిస్సైల్ విడిభాగాలను గుర్తించారు. అవి సైన్యం కూల్చివేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలని అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అక్కడ భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సైనిక పోస్టులు, ఉగ్ర లాంచ్ప్యాడ్లు ధ్వంసం జమ్మూ సమీపంలో పాకిస్తాన్ భూభాగంలో సైనిక పోస్టులతో ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ‘‘భారత్‌పై డ్రోన్ దాడులకు ఈ లాంచ్ప్యాడ్లనే వాడారు. ఇవి పాక్‌లోని సియాల్కోట్ జిల్లా లూనీలో ఉన్నాయి’’ అని బీఎస్ఎఫ్ వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ భూభాగం నుంచి జరిగిన కాల్పులకు గట్టిగా బదులిచ్చామని వెల్లడించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బీఎస్ఎఫ్ పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులకు దిగింది. దాంతో పాక్ రేంజర్ల క్యాంపులపై బీఎస్ఎఫ్ విరుచుకుపడింది.మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలుకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ: పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సరిహద్దు ప్రాంతాల్లోని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, జమ్మూ సెక్టార్లపై నాలుగు రోజుల పాటు జరిగిన కాల్పుల్లో జిల్లా అదనపు అభివృద్ధి కమిషనర్ సహా 19 మంది చనిపోయారు. ‘పాక్ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదన కలిగించింది. మా ప్రజలకు కలిగిన నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం. ఆప్తులను కోల్పోయిన వారి వేదనను తగ్గించలేకపోవచ్చు గానీ ఆ కుటుంబాలకు మా వంతు మద్దతుగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తాం’అని సీఎం ఒమర్ పేర్కొన్నారు. -
సరిహద్దు జిల్లాల్లో 'హై అలర్ట్'
చండీగఢ్/అహ్మదాబాద్: భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్‌తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1,070 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల్లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల ముందు క్యూ కట్టారు. పంజాబ్‌లోని సరిహద్దుకు సమీపంలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్‌పూర్, తార్న్ తరన్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు. ఇక అమృత్‌సర్‌లో నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం ఒక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నిత్యావసర వస్తువుల కొరత లేదని, బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించవద్దని, ప్రజలు అనవసరంగా అదనపు వస్తువులను కొనుగోలు చేయవద్దని అధికారులు కోరారు. మరోవైపు పప్పులు, వంటనూనె, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి వస్తువులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అమృత్‌సర్‌లోని కిరాణా దుకాణాలు, డిపార్ట్మెంటల్ స్టోర్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. సరిహద్దు జిల్లాల్లో ఒకటైన గురుదాస్‌పూర్‌లో గురువారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాకవుట్ విధించారు. ప్రజల భద్రత కోసం పోలీసు స్క్వాడ్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలను నియమించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసింది. రిట్రీట్ నిలిపివేత.. ప్రజల భద్రత దృష్ట్యా పాక్ సరిహద్దుల్లో రిట్రీట్ వేడుకలను బీఎస్ఎఫ్ నిలిపివేసింది. పంజాబ్‌లోని పాకిస్తాన్ వెంబడి ఉన్న మూడు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రిట్రీట్ వేడుకలను నిర్వహించబోమని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. పాకిస్తాన్ వాఘాకు ఎదురుగా ఉన్న అట్టారీ (అమృత్సర్), ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా, ఫజిల్కా జిల్లాలోని సద్కీ వద్ద ఉన్న జేసీపీల వద్ద పాకిస్తాన్ రేంజర్లతో కలిసి బీఎస్ఎఫ్ దళాలు ప్రతిరోజూ సాయంత్రం రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వమిస్తాయి. తీరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత.. ఇక గుజరాత్ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. తీరం వెంబడి ఉన్న రాజ్‌కోట్ రేంజ్‌లోని జామ్‌నగర్, మోర్బి, దేవభూమి, ద్వారకాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు తీరప్రాంత గ్రామాలు, బోట్‌ల్యాండింగ్ పాయింట్లను సందర్శిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను పోలీసులు కోరుతున్నారు. -
అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లు
లయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అనగానే ఆయిల్ నుంచి టెలికాం దాకా వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలు గుర్తొస్తాయి. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ప్రపంచంలోనే అత్యధికంగా మామిడిపండ్లను ఎగుమతి చేసే సంస్థల్లో ఒకటిగా ఉందని తెలుసా? అంబానీకి ఎన్ని ఎకరాల మామిడి తోట ఉంది? ఎన్ని రకాలు మామిడి పళ్లను పండిస్తారు? అసలు మ్యాంగో ఫామ్ వెనుకున్న రియల్ స్టోరీ ఏంటి? ఆ వివరాలు మీకోసం.గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 600 ఎకరాల మామిడి తోట (Reliance Mango Farm) రిలయన్స్ సొంతం. ఇందులో 1.5 లక్షలకు పైగా వివిధ రకాల మామిడి చెట్లున్నాయి. అల్ఫాన్సో మొదలు టామీ అట్కిన్స్ , 200లకు పైగా దేశీ, విదేశీ రకాల మామిడి చెట్లు ఫలాలనిస్తాయి. వీటిల్లో చాలా వరకు ప్రపంచంలోని అత్యుత్తమ రకాలకు చెందినవి కావడం విశేషం.ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్అయితే రిలయన్స్ మామిడి వ్యాపారంలోకి ప్రవేశించటానికి వెనుక ఒక కథ ఉంది. మ్యాంగో ఫామ్ హౌస్ వెనకాల పెద్ద చరిత్ర ఉంది. 1997లో, జామ్‌నగర్‌లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారం భారీ కాలుష్యానికి కారణమైంది. గుజరాత్ కాలుష్య నియంత్రణ బోర్డు నుండి పదేపదే నోటీసులిచ్చింది. పర్యావరణాన్ని కాపాడి, ఫ్యాక్టరీని కొనసాగించే లక్ష్యంతో, అనివార్యంగా రిలయన్స్ మామిడి తోటను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది రిలయన్స్. 1998 లో ఈ కర్మాగారం చుట్టూ ఉన్న బంజరు, ఉప్పునీటి భూముల్లో మామిడి చెట్లను నాటించింది. ఇక్కడున్న అనేక ప్రతికూలతలను అధిగమించేందకు కంపెనీ కొత్త టెక్నాలజీని వినియోగించింది. డీశాలినేషన్, బిందు సేద్యం, వర్షపు నీటి సంరక్షణ, పోషక నిర్వహణ పద్దతులను పాటించారు. సముద్రపు నీటిని శుద్ధి చేసేందుకు, డీశాలినేషన్, నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్దతులను ఉపయోగించారు.చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్దాదాపు 7-8 సంవత్సరాల ప్రయత్నాలు ఫలించాయి. ఈ గార్డెన్ పేరే ధీరూభాయ్ అంబానీ లఖిబాగ్ అమ్రాయీ. ప్రపంచంలోనే అతిపెద్దదిగా 600 ఏకాల విస్తీర్ణంలో చుట్టూ పచ్చని చెట్లతో ఏడాది 600 టన్నుల మామిడి పళ్లను అందిస్తుందీ తోట. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారుగా అవతరించింది. అలా కాలుష్య కాసార నుంచి పచ్చని ప్రకృతిక్షేత్రంగా ఎదిగింది. దీంతో పాటు రిలయన్స్ ప్రతి సంవత్సరం ఒక లక్ష మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. అలాగే ఆధునిక వ్యవసాయంలో శిక్షణ అందించడం ద్వారా స్థానిక రైతులకు సహాయం చేస్తుంది. ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర? -
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
అహ్మదాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ జాతీయుల వీసాల రద్దు, వారిని తిరిగి వెనక్కి పంపించే చర్యలు కొనసాగుతున్న వేళ.. అక్రమంగా భారత్ లో నివసిస్తున్న విదేశీయులు వేల సంఖ్యలో బయటపడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో అక్రమంగా భారత్ కు వచ్చి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన వారు వెయ్యి మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా అక్రమ వలస దారుల వేరివేతకు శ్రీకారం చుడితే అహ్మదాబాద్, సూరత్ లలో కలిపి వెయ్యి మందికి పైగా అక్రమ బంగ్లా దేశీయులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ శనివారం తెలిపారు. అహ్మదాబాద్ లో నివసిస్తున్న బంగ్లాదేశీయులు 890 మంది కాగా, సూరత్ లో నివసిస్తున్న బంగ్లా జాతీయులు 134 ఉన్నట్లు గుర్తించినట్లు హోంమంత్రి తెలిపారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద పోలీస్ ఆపరేషన్ అని ఆయన పేర్కొన్నారు.స్వచ్ఛందంగా బయటకు రండి.. లేకపోతేఅక్రమ వలసదారులకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే కఠినమైన చర్యలు ఉంటాయని సంఘ్వీ హెచ్చరించారు. ఎవరైనా ఇంకా ఉంటే స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆపై తీసుకునే కఠిన చర్యలు దారుణంగా ఉంటాయన్నారు. Surat, Gujarat | The people caught last night are Bangladeshis. We will check their documents. After this, we plan to send them to Bangladesh: Surat JCP Crime Raghavendra Vats. https://t.co/jqgyPEJmzm— ANI (@ANI) April 26, 2025 Over 550 Illegal Bangladeshi immigrants detained in Gujarat operationsRead @ANI Story | https://t.co/NuuktkcjCp#IllegalImmigrant #Gujarat pic.twitter.com/6Cwc8g3Ci9— ANI Digital (@ani_digital) April 26, 2025 Massive numbers incoming - More than 1000 illegal Bangladeshis and Pakistanis detained in pre-dawn Ops by Gujarat PoliceMale - 436+88Female - 240+44Kids - 214Total - 1022 pic.twitter.com/rvAB5HdLPQ— Megh Updates 🚨™ (@MeghUpdates) April 26, 2025 -
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి, కోటి ఆశలతో అత్తింటికి చేరే కోడళ్లను కన్న కూతురిలా చూసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ కొడుకు మరణం తరువాత కోడల్ని అక్కున చేర్చుకుని ఆదరించడమే కాకుండా, ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించిన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి ఒక హృద్యమైన కథనం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక ప్రశంసలు దక్కించుకుంది. గుజరాత్‌లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా. ముదిమి వయసులో ఆదు కుంటాడనుకున్న పెద్ద కుమారుడు సిద్ధరాజ్ సింగ్ అర్థాంతరంగా కన్నుమూశాడు. దీంతో తనతో పాటు కోడలు, నెలల వయస్సున్న చిన్న బిడ్డ అనాథలైపోయారు. కానీ ఇక్కడే ప్రవీణ్ సింగ్ తన పెద్దరికాన్ని చాటుకున్నాడు. కోడలికి తండ్రి స్థానంలో నిలబడ్డాడు. చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు. కోడలి, మనవరాల్ని కన్నీటితో సాగనంపడం విశేషంగా నిలిచింది.చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది! కొడుకు మరణం2024లో దీపావళి పండుగ సందర్భంగా ఆకస్మిక గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఈ సంఘటనతో సిద్ధరాజ్ భార్య కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక జీవితాంతం భర్తలేకుండా గడపాల్సి ఉంటుందని, తండ్రి లేకుండా తన కుమార్తెను ఎలా పెంచాలంటూ కృష్ణ అంతులేని శోకంలో మునిగిపోయింది. చుట్టుపక్కల సమాజం కూడా అలానే అనుకుంది.కానీ ప్రవీణ్ మనసు వేరేలా ఆలోచించింది. తన కుమార్తెలా చూసుకున్నాడు. సమాజం అభిప్రాయాలను, భయాలను పట్టించుకోకుండా, తన కొడుకు ప్రాణ స్నేహితుడు సంజయ్‌తో తన కోడలి కృష్ణకు వైభవంగా పెళ్లి జరిపించాడు. కోడలితో పాటు, మనవరాలు దీక్షిత తరలి పోతోంటే, తన తల్లితో వెళ్లిపోయినప్పుడు తాత భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు ప్రవీణ్,కుటుంబంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు కదా నేటి సమాజానికి కావాల్సింది అంటూ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్.. ఎవరీ నటుడు?కృష్ణను రెండో పెళ్లి చేసుకున్న సంజయ్ ప్రవీణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరాజ్ తన చిన్ననాటి స్నేహితుడనీ, కృష్ణను కొంతకాలంగా తనకు తెలుసునని చెప్పారు. కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని సిద్ధరాజ్ కుటుంబానికి సంజయ్ హామీ ఇచ్చాడు. తన స్నేహితుడి కుమార్తె , కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. దీని గురించి ప్రవీణ్ సింగ్‌తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. అటు కృష్ణ కూడా అత్త మామలకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. -
రూ.1,800 కోట్ల డ్రగ్స్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తీసుకువచ్చే పాకిస్తాన్ స్మగ్లర్ల ఆటకట్టింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ బృందం(ఏటీఎస్), తీర రక్షక దళం(ఐసీజీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల మెథాంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి దాటాక అరేబియా సముద్రంలో ఘటన చోటుచేసుకుంది. ఫిదా అనే పేరున్న మాఫియా ముఠా చేపల పడవలో భారత జలాల్లోకి ప్రవేశించనుందంటూ ఏటీఎస్ అందించిన నిఘా సమాచారం మేరకు ఐసీజీ గస్తీని ముమ్మరం చేసింది. అంతర్జాతీయ సముద్ర జలాలకు అత్యంత సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఐసీజీ గస్తీ ఓడను దూరం నుంచే గమనించిన స్మగ్లర్లు తమ బోటులో ఉన్న డ్రగ్స్ డ్రమ్ములను సముద్రంలో విసిరేశారు. వేగంగా అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుల వైపు వెళ్లిపోయారు. ఇదంతా వెంటవెంటనే జరిగిపోయింది. వారిని పట్టుకునేందుకు ఐసీజీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కటిక చీకటిలోనే వారు విసిరేసిన డ్రగ్ పార్శిళ్లను ఐసీజీ, ఏటీఎస్ సిబ్బంది గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 311 ప్యాకెట్లలో 311 కిలోల మెథాంఫెటమైన్‌ను పోర్బందర్ తీరానికి తరలించి, దర్యాప్తు చేపట్టామని ఐసీజీ తెలిపింది. ఈ ప్యాకెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సీల్ వేసి ఉంచారని, సముద్ర జలాల్లో వేసినా అందులోని సరుకు పాడవదని ఏటీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి చెప్పారు. ఈ డ్రగ్స్ గమ్యస్థానం తమిళనాడని ఆయన వివరించారు. పాక్‌లోని పస్ని పోర్టు నుంచి బయలుదేరిన మాఫియా సభ్యులు సముద్ర జలాల్లోనే డ్రగ్స్‌ను మరో బోటులోకి మార్చి, ఆపైన తమిళనాడుకు చేరవేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇటువంటి 13 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి, అక్రమార్కుల ఆటకట్టించామని వివరించారు. కాగా, ఐస్, క్రిస్టల్ మెథ్ అని కూడా పిలిచే మెథాంఫెటమైన్ చాలా శక్తివంతమైన డ్రగ్. పొట్టలో రూ.7.85 కోట్ల కొకైన్ ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఉగాండా దేశస్తుడి పొట్టలో రూ.7.85 కోట్ల విలువుండే 785 గ్రాముల కొకైన్‌ను గుర్తించారు. ఈ నెల 9వ తేదీన రాత్రి ఓ విమానంలో వచ్చిన అతడిని అధికారులు అడ్డుకున్నారు. విచారణ సమయంలో అతడు ఆందోళనతో కనిపించడంతో కనిపించాడు. దీంతో, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేయించగా పొట్టలో టాబ్లెట్లు ఉన్నట్లు తేలింది. -
భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి సేఫ్టీ నెట్లోకి..!
అహ్మదాబాద్: నగరంలో ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికంగా పెద్ద అలజడి రేపింది. అహ్మదాబాద్‌లోని కోక్రా సర్రిల్లోని పరిస్కార్ 1 అప్టార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అపార్ట్మెంట్ ఆరో అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్రి ప్రమాదం జరిగి అది తీవ్ర రూపం దాల్చింది. మొత్తం బిల్డింగ్ అంతా దావానంలా వ్యాపించింది.అయితే దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు వచ్చి మంటల్ని అదుపు చేశారు. వారు తీవ్రంగా శ్రమించిన తర్వాత ఎట్టకేలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వీరితో పాటు పోలీసులు అక్కడకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటల్ని అదుపు చేసే క్రమంలో పలువురు బాల్కనీ నుంని కింద ఉంచిన సేప్టీ నెట్లోకి దూకేశారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రధానంగా అపార్ట్మెంట్ పై నుంచి మహిళలు, పిల్లలు దూకిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.A major fire has erupted in a building in Ahmedabad’s Khokhra area. Sending strength to those affected and hoping for a timely rescue operation.#FireIncident #ViralVideo #Ahmedabad pic.twitter.com/67NkYOKhJj— Parimal Nathwani (@mpparimal) April 11, 2025 -
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
జీవితంలో కష్టాలనేవి సహజం. సాధారణంగా మన కంటే వయసులో చిన్నవాళ్లు మనకళ్లముందే వెళ్లిపోతుంటే ఏ వ్యక్తులకైనా.. తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ఏదోలా బతికినా..చివరికి విధి మరింత కఠినంగా పరీక్షలు పెట్టి.. ఉపాధి లేకుండా చేసి ఆడుకుంటే..ఆ బాధ మాములుగా ఉండదు. అదికూడా ఏడు పదుల వయసులో ఈ సమస్యలు చుట్టుముడితే పరిస్థితి మరింత ఘోరం. ఎవ్వరైనా..విలవిలలాడతారు. కానీ ఈ బామ్మ మాత్రం ఆ కష్టాలకు వెరవలేదు. పైగా మనవడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అతడికి జీవనమార్గాన్ని అందించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ బామ్మే 79 ఏళ్ల ఊర్మిళ ఆషర్ అకా. అంతా ముద్దుగా ఆమెను గుజ్జు బెన్‌గా పిలుచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు, తాతలకు సాయం అదించడం విని ఉంటాం. కానీ మనవడికోసం ఓ బామ్మ తన పాకకళా నైపుణ్యన్ని వెలికి తీసి..అతడి జీవనోపాధికి ఆసరాగా మారడం గురించి విన్నారా.?. అది కూడా 75 ఏళ్ల వయసులో.. అయితే ఈ బామ్మ చాలా ధీమాగా ఆ సాహసం చేసింది. రెస్ట్ తీసుకుని "కృష్ణా.. రామ.." అని జపించే వయసులో మనవడి కోసం వ్యాపారం మెదలు పెట్టింది. ఆమె కథ వింటుంటే..ఒక వ్యక్తికి వరుస కష్టాలు పలకరిస్తుంటే.. బతకగలరా..? అనే బాధ కలుగుతుంది. కానీ ఊర్మిళ వాటన్నింటిని ఒక్క చిరునవ్వుతో ఎదిరించి నిలబడింది. గుజరాత్‌కి చెందిన ఈ బామ్మ గుజ్జు బెన్ నా నాస్తా అనే స్నాక్ సెంటర్‌ని నడిపింది. దాన్ని లాభాల్లో దూసుకుపోయేలా చేసింది. ఆమె మాస్టర్ చెఫ్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రముఖ చెఫ్ రణవీర్బ్రార్ వంటి ప్రముఖుల మన్ననలకు కూడా పొందారామె. వ్యాపారం ప్రారంభించడానికి కారణం..2019లో, ఆమె ఏకైక మనవడు హర్ష్ ఒక ప్రమాదంలో కింది పెదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా జాబ్ కోల్పోయాడు. ప్రమాదం ఇచ్చిన వికృత రూపం కారణంగా ఎవ్వరూ అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పైగా అతడు కూడా ఆత్మనూన్యత భావంతో ఇక ఇంట్లోనే ఒంటిరిగా ఉండిపోయేవాడు. అతనిలో స్థైర్యం నింపేందుకు ఆమె వ్యాపారం చేయాలని సంకల్పించి 'గుజ్జు బెన్ నా నాస్తా' అనే గుజరాతీ స్నాక్ సెంటర్‌ని ప్రారంభించింది. తన మనవడితో కలిసి గుజరాతీ వంటకాలైనా.. థెప్లాస్, ధోక్లా, ఖాఖ్రా, ఫరాలి వంటి రుచులతో కస్టమర్లను మెప్పించారు. అనతి కాలంలోనే పెద్ద స్నాక్ సెంటర్‌గా మారింది. అంతేగాదు ఊర్మిళ ఆషర్ టెడ్ఎక్స్ స్పీకర్‌గా మారి తప కథని వినిపించిది. అక్కడున్న వారందర్నీ ఆమె గాథ కదిలించింది. చాలా కష్టాలు చూశారామె..మాజీ మాస్టర్ చెఫ్ అయిన ఊర్మిళ జీవితంలో వరుస విషాదాలను చవిచూసిందని ఆమె సన్నహితులు చెబుతుంటారు. రెండున్నర సంవత్సరాల కూతురుని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు ఒకరు బ్రెయిన్ ట్యూమర్‌తో మరొకరు గుండెజబ్బుతో చనిపోవడం. చివరికి మిగిలిన ఒక్కగానొక్క మనవడు ప్రమాదం బారినపడి వికృతరూపంతో బాధపడటం వరకు చాలా కష్టాలను అధిగమించారు. ఏడు పదుల వయసు వరకు వెన్నంటిన కష్టాలకు చలించలేదు. ఉన్న ఒక్క మనవడు ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు తాపత్రయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏజ్‌లో వ్యాపారమా..? అనే సందేహానికి తావివ్వకుండా కష్టపడింది. అనుకున్నట్లుగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మంచి సక్సెస్‌ని అందుకున్నారామె. త్వరలోనే ఆమె చిన్న వ్యాపారం కాస్త సొంతంగా వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసుకుని మరింత మంది కస్టమర్ల మన్నలను అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఊర్మిళ 79 ఏళ్ల వయసులో ఏప్రిల్ 07న గుండెపోటుతో చనిపోయారు. చనిపోయేంత వరకు తరుముతున్న కష్టాలని చూసి కన్నీళ్లు పెట్టకుండా పోరాడారు.. గెలిచారు. ఉక్కు సంకల్పం ఉంటే..సంపాదనకు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పారు ఊర్మిళ. చిన్న చిన్న వాటికే కుంగిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే యువతకు కనువిప్పు ఈ బామ్మ కథ..!.(చదవండి: ద్రౌపది తెలివిగా సృష్టించిన వంటకమే పానీపూరి.. పూర్తి కథ ఏంటంటే?) -
సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్ నేత చిదంబరం
అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సబర్మతి ఆశ్రమంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నట్లుండి ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. వేడి కారణంగా డీహైడ్రేషన్‌తో ఆయన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. #WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25— ANI (@ANI) April 8, 2025కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అయిన చిదంబరం 79 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. కేంద్రంలోని బీజేపీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తమిళనాడు రామేశ్వరంలో పాంబన్ వంతెనను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన బడ్జెట్ వ్యాఖ్యలకూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రధాని సహా కేంద్రమంత్రులు 2004-14తో పోలిస్తే.. 2014-24 మధ్య కాలంలో తమిళనాడుకు అధికంగా నిధులు ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామని ప్రధాని చెప్పారు. ఫస్టియర్ ఎకానమీ విద్యార్థిని అడగండి. ‘ఎకానమీ మ్యాట్రిక్’ ఎప్పుడూ గతేడాది కంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతారు. జీడీపీ గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. కేంద్ర బడ్జెట్ మొత్తం మునుపటి కంటే పెరుగుతుంది. ప్రభుత్వ మొత్తం ఖర్చూలూ అంతే. మీ వయసు కూడా గతేడాది కంటే పెరిగింది. అంకెల పరంగా ఆ సంఖ్య పెద్దగానే కనిపించి ఉండొచ్చు. కానీ, జీడీపీ పరంగా లేదా మొత్తం వ్యయ నిష్పత్తి పరంగా అది ఎక్కువగా ఉందా?’’ అని ప్రశ్నించారు. -
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
గాంధీనగర్: ఎండా కాలంలో దాహంతో ఉన్న చీతాలకు నీరు అందించిన కారణంగా ఓ డ్రైవర్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. అదేంటీ.. నీరు పోసినందుకు ఎందుకు ఉద్యోగం పోయిందనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ అక్కడే ఉంది.వివరాల ప్రకారం.. కూనో పార్కులో చీతా జ్వాల దాని పిల్లలు ఇటీవల ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు చీతాలపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న జ్వాల (చిరుత) దాని నాలుగు పిల్లలను గమనించిన అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్.. వాటికి నీరు అందించాడు. ఓ క్యానులో నీటిని తీసుకొచ్చి.. పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటు పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.A heartwarming video from Madhya Pradesh's Kuno National Park shows a female cheetah and her four cubs being offered water by a member of the monitoring team. pic.twitter.com/SN9Q4e8vxq— NDTV (@ndtv) April 6, 2025ఈ వీడియో అటవీ శాఖ అధికారులు దృష్టికి చేరింది. ఆ డ్రైవర్‌పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో..‘చీతాలకు నీరు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కావని తెలుసుకుంటున్నారు. కానీ, ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని వారంతా గ్రహించారు. అందుకే, వన్యప్రాణులతో (చీతాలతో) స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం పద్ధతి కాదు. ఇలాంటి చర్యలు వాటి మనుగడకే ప్రమాదం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.Historic moment in Kuno National Park! ✨ Cheetah Jwala and her 4 cubs spotted thriving in the wild for the first time! A true milestone for India’s cheetah conservation efforts. Witness the legacy of speed and survival unfold in Kuno!#Cheetah #KunoCheetahSafari #FlyingCatSafari pic.twitter.com/Bs5ThPnqhI— Flying Cat Safari (@KunoSafari) February 28, 2025మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు డ్రైవర్ చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని.. మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు. @KunoNationalPrk female #cheetah #Jwala along with her cubs hunted 6 goats in Umrikalan village in Agra area of Vijaypur - villagers made a video, tracking team of Kuno National Park was also on the spot.. @Ajaydubey9#cheetah #kuno #wildlifephotography #viralvideo pic.twitter.com/RgJHqJFXgS— UTTAM SINGH (@R_UTTAMSINGH) April 4, 2025 -
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
చంఢీగఢ్ : గుజరాత్ జామ్‌నగర్‌లో ఈ బుధవారం జాగ్వార్ జెట్‌లో మరణించిన భారత వాయుసేన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఆయన స్వగ్రామామైన భలాకీ మజ్రాలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది స్థానికులు, వాయుసేన అధికారులు, ఇతర సైనికులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొని సిద్ధార్థ్ యాదవ్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. పది రోజుల క్రితం సిద్ధార్థ యాదవ్, సానియాల ఎంగేజ్మెంట్ అయ్యింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో కాబోయే భార్య సానియా.. సిద్ధార్ధ్ అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది.అంత్యక్రియలు ముగిసే సమయంలో సానియా గుండెలవిసేలా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.‘సిద్ధార్ధ్ ముఖాన్ని చూపించండి. ఇంకోసారి సిద్ధార్ధ్ ముఖాన్ని చూడనివ్వండి అని భౌతిక ఖాయం వద్ద గుండెలవిసేలా ఏడుస్తున్న దృశ్యాలు చూపురలను కంటతడి పెట్టిస్తున్నాయి. ‘బేబీ నన్ను తీసుకెళ్లేందుకు నువ్వు ఎందుకు రాలేదు. నువ్వు నాకు ప్రామిస్ చేశావ్ కదా అంటూ సిద్ధార్ధ్ భౌతికఖాయంతో సంభాషించడం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.What a heart wrenching moment...#SiddharthYadav got engaged 10 days back, marriage was due on 2nd November...his fiance says: Baby तू आया नहीं...तूने कहा था मुझे लेने आएगा। #jaguarcrash #Rewari pic.twitter.com/c7KGJOQixr— Rahul Yadav (@Raahulrewari) April 4, 2025 అంతా బాగున్నప్పుడు కాదు.. ప్రమాదంలో అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. #BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025 తాను మరణిస్తూ.. మరికొందరికికో పైలట్‌తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానం జనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.IAF's Jaguar fighter aircraft crashes in Jamnagar, Gujarat. More details awaited.#planecrash pic.twitter.com/Xz8UAGeasc— Kedar (@Kedar_speaks88) April 2, 2025 చివరి క్షణాల్లోనూ... బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. సిద్ధార్థ్ ఇటీవలే సెలవులనుంచి తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ ప్రమాదం ఒక సాధారణ శిక్షణ ఫ్లైట్ సమయంలో జరిగింది.విచారంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మృతిపై భారత వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారి కుటుంబానికి మేం అండగా నిలుస్తాం. ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు విచారణ కమిటీని నియమించినట్లు తెలిపింది. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ట్వీట్ సిద్ధార్ధ్ యాదవ్ మరణంపై హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ విచారం వ్యక్తం చేశారు. జామ్‌నగర్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేవారి జిల్లా మజ్రా (భాల్ఖీ) గ్రామానికి చెందిన పుత్రుడు, జాగ్వార్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్‌కు నా శ్రద్ధాంజలి. ఈ త్యాగం ఎప్పటికీ మరిచిపోలేము. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలి’అని ట్వీట్లో పేర్కొన్నారు. -
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య
జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన IAF పైలట్ సిద్ధార్థ్ యాదవ్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. క్లిష్టమైన సమయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి, తోటి పైలట్‌ను, అనేక మంది పౌరులను కాపాడిన సిద్దార్థ్ యాదవ్‌కు యావద్దేశం సంతాపం ప్రకటించింది. ఆయన త్యాగం, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నయనాలతో సెల్యూట్ చెబుతున్నారు. త్రివర్ణ పతాకం కప్పి, పూర్తి సైనిక గౌరవాలతో మజ్రా భల్ఖిలోని ఆయప స్వగ్రామంలో ఏప్రిల్ 4న అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో సిద్ధార్థకకు కాబోయే భార్య సోనియా యాదవ్ అతని శవపేటిక పక్కనే కుప్పకూలిపోయింది. పెళ్లి బారాత్‌లో ఆనందంగా ఊరేగి వెళ్లాల్సిన బిడ్డకు, అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడం కన్నతల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ ఈ జెట్ ప్రమాదంలో మరణించడానికి కేవలం పది రోజుల ముందు సోనియా యాదవ్‌తో నిశ్చితార్థం జరిగింది. నవంబరు 2న అంగరంగవైభంగా ఈ జంటకు పెళ్లిచేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగి ఉండగా ఊహంచని విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది. ఫైటర్‌జెట్ ప్రమాదంలోమరణించిన సిద్దార్థ్ పార్ధివ దేహాన్ని స్వగ్రామానికి తరలించి, గౌరవ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే భార్య సోనియా సిద్దార్థ శవపేటిక పక్కనే కూలిపోయింది. ఇదీ చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంభోరున విలపిస్తూ అంతులేని శోకంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కుడన్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. సిద్ధార్థ్ యాదవ్ శవపేటికను కౌగిలించుకుని ‘‘వస్తానని చెప్పావు కదా బేబీ...రానేలదు ("బేబీ తు ఆయా నహీ...తునే కహా థా మై ఆవుంగా’’) అంటూ విలపించిన తీరు అందర్నీ కలిచివేసింది. కన్నీళ్లు ఆపుకోవడం అక్కడున్న ఎవ్వరి తరమూ కాలేదు. పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు , ఇతర అధికారులు సిద్ధార్థ్‌కు వీడ్కోలు పలికారు.Such incidents breaks down the hearts of many. My 🙏🙏🙏 to the family members of #SiddharthYadav I don't understand the story. Technical Snag, and a fighter jet and 2 pilot down. Technical efficacy of the Aero Engineers must improve. Loss can't be adjusted. pic.twitter.com/YXkdeSG5zU— Little Somesh 🇮🇳 1729 (@shankaravijayam) April 4, 2025 -
సెల్యూట్ పైలట్ సిద్ధార్థ్!
అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. 28 ఏళ్ల యువకుడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. పైగా 10 రోజుల కిందే నిశ్చితార్థం కూడా అయింది. కో పైలట్‌తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానంజనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. చివరి క్షణాల్లోనూ... బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ స్వస్థలం హరియాణాలోని రేవారీ. వారిది తరతరాలుగా సైనిక కుటుంబమే. ఆయన ముత్తాత బ్రిటిష్ హయాంలో బెంగాల్ ఇంజనీర్స్ విభాగంలో పనిచేశారు. తాత పారామిలటరీ దళాల్లో సేవలందించారు. తండ్రి కూడా వైమానిక దళంలో పనిచేశారు. సిద్ధార్థ్ 2016లో వైమానిక దళంలో చేరారు. రెండేళ్ల సర్వీసు తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందారు. మార్చి 23నే నిశ్చితార్థం జరనిగింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. మార్చి 31 దాకా కుటుంబీకులతో గడిపి ఇటీవలే విధుల్లో చేరారు. ఆయన మరణవార్తతో కుటుంబం, స్నేహితులే గాక పట్టణమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విమానంలో ప్రయాణించాలని, దేశానికి సేవ చేయా లని సిద్ధార్థ్ ఎప్పుడూ కలలు కనేవాడని చెబుతూ తండ్రి సుజీత్ యాదవ్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘సిద్ధార్థ్ తెలివైన విద్యారి్థ. తనను చూసి ఎప్పుడూ గర్వపడేవాళ్లం. ప్రజల ప్రాణాలు కాపాడుతూ తన ప్రాణాలర్పించాడు. నా కొడుకును చూసి చాలా గర్వపడుతున్నా. మాకు ఒక్కగానొక్క కొడుకు తను’’అంటూ గుండెలవిసేలా రోదించారు. సిద్ధార్థ్ పారి్థవదేహం శుక్రవారం రేవారీకి చేరింది. పూర్వీకుల గ్రామం భలాకి మజ్రాలో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ద్వారకకు కాలినడకన అనంత్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ద్వారకకు పాదయాత్ర చేపట్టారు. ఆధ్యాత్మిక భావాలు కలిగిన అనంత్ తన 30వ పుట్టినరోజును దేశంలోని పవిత్ర నగరాల్లో ఒకటైన ద్వారకలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి కాలినడకన చేరుకోనున్నారు. తమ పూర్వీకుల స్వస్థలమైన గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకకు 170 కి.మీ. మేర ఆయన పాదయాత్రగా వెళ్తున్నారు. మార్చి 29న అనంత్ పాదయాత్రను ప్రారంభించారు. రోజూ 20 కి.మీ. మేర 7 గంటల పాటు నడక సాగిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన తన పుట్టినరోజుకు ముందు అనంత్ ద్వారకకు చేరుకుని ద్వారకాదీశుడి ఆశీస్సులు అందుకుంటారు. ఈ పాదయాత్రలో పలువురు ఆయనకు సంఘీభావంగా కొంతదూరం పాటు నడిచారు. ఈ సందర్భంగా కొంతమంది ద్వారకాదీశుడి చిత్రాలను అనంత్‌కు బహూకరించారు. అనంత్ పాదయాత్ర పొడవునా హనుమాన్ చాలీసా, సుందరకాండ, దేవీ స్తోత్రం పఠిస్తూనే ఉన్నారు. కుషింగ్ సిండ్రోమ్ అనే అరుదైన హార్మోన్ల రుగ్మత, స్థూలకాయం, ఉబ్బసం తదితరాలతో బాధపడుతున్నా.. 170 కి. మీ. దూరం నడుస్తుండటం విశేషంగా నిలిచింది. సనాతన భక్తుడైన అనంత్.. బద్రీనాథ్, కేదార్నాథ్, కామాఖ్య, నాథ్‌ద్వారా, కాళీ ఘాట్ వంటి ప్రఖ్యాత ఆధ్మాత్మిక క్షేత్రాలను తరచూ సందర్శిస్తుంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వన్‌తారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని కూడా అనంత్ అంబానీ నిర్మించడం తెలిసిందే. ప్రధాని మోదీ దాన్ని ఇటీవలే ప్రారంభించారు. -
వైరల్.. మృగరాజుకి ఆకలేసి కిచెన్‌లో దూరింది!
గాంధీనగర్ : అడవికి రాజు అయిన సింహం జనావాసాల్లోకి వస్తే ఏమవుతుంది. అమ్మో.. ఊహించుకోవడానికే భయంగా ఉందంటారా? అలాంటిది. ఇంట్లో అందరూ గాఢనిద్రలో ఉండగా.. ఆ సింహం ఇంటి పై కప్పు నుంచి సైలెంట్‌గా కిచెన్‌లో అడుగుపెడితే . సుమారు రెండు గంటల పాటు అక్కడే తిష్ట వేస్తే.. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో ఒక కుటుంబానికి ఓ చిరుత షాకిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో బుధవారం రాత్రి ములుభాయ్ రాంభాయ్ లఖన్నోత్రా కుటుంబం బుధవారం రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఓ సింహం వారి కిచెన్‌లోని గోడపై కూర్చొంది. సుమారు రెండుగంటల పాటు తిష్టేసింది.#Amreli: #Gujarat Family Finds Lion Sitting In Their Kitchen pic.twitter.com/dMkfqcILI0— Timeline. (@timelinelatest) April 4, 2025అయితే అర్ధరాత్రి తర్వాత ఇంట్లో చప్పుడు కావడంతో ములుభాయ్ కుటుంబసభ్యులు ఉలిక్కపడి లేచారు. కళ్లార్పకుండా వంటగది గోడమీద ఉన్న సింహం వారినే చూస్తుండడంతో ఒక్కసారిగా హతాశులయ్యారు. బతుకు జీవుడా అనుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తూ భయటకు పరుగులు తీశారు. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ములుభాయ్ కుటుంబసభ్యులకు ఏమైందోనని వచ్చి చూడగా.. వంటగదిలో ఉన్న సింహాన్నిచూసి జడుసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం, వైరల్ అవుతున్న ఓ వీడియోలో సింహం వంటగది గోడపై కూర్చొని ఉండడాన్ని గమనించొచ్చు. చికట్లో కూడా మిరుమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతున్న సింహం కళ్లను గ్రామస్తులు తమ సెల్ఫోన్లలో బంధించడం మనం చూడొచ్చు. సుమారు రెండు గంటల తర్వాత గ్రామస్తుల సహాయంతో సింహాన్ని తరిమికొట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఇంట్లో సింహం చొరబడిందనే సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సింహం ఎక్కడ నుంచి వచ్చిందో ఆరా తీశారు. -
Jaguar jet Incident మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం
గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 28 ఏళ్ల పైలట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ చనిపోయిన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయనకు కొద్దిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది, మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన తమ కుమారుడు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో పైలట్ కుటుంబంలో విషాదం నెలకొంది.జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో సిద్ధార్థ్ యాదవ్ అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా సిద్ధార్థ్ కో-పైలట్ ఇతరులు ప్రాణాలను కాపాడిన తీరు పలువురి చేత కంట తడిపెట్టించింది. అపారమైన ధైర్యం, త్యాగం ఎన్నటికీ మరువ లేమంటూ పలువురు ఆయనకు నివాళి అర్పించారు.గత నెలలో (మార్చి 23) సిద్ధార్థకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న అతని వివాహం జరిపించేందుకు కుటుంబం సన్నద్ధమవుతుండగా, ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. గుజరాత్‌లోని సువర్ద గ్రామంలో జామ్‌నగర్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే సిద్ధార్థ్ అతి క్లిష్టమైన సమయంలో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించి, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం నుండి జెట్‌ను పక్కను మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన కో-పైలట్ మనోజ్ కుమార్ సింగ్ చికిత్స పొందుతున్నాడు. హర్యానిలోని రేవారిలోని భల్ఖి-మజ్రా గ్రామానికి సుశీల్ యాదవ, నీలం దంపతుల ఏకైక సంతానం సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఫైటర్ పైలట్‌గా శిక్షణ పూర్తి చేసి 2016లో NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత భారత వైమానిక దళంలో చేరారు. రెండేళ్లలోపు, అతను ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందాడు. అతని మరణ వార్త అతని కుటుంబంలోని ప్రతి ఒక్కరితోపాటు రేవారీ వాసులను కూడా తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, ప్రస్తుతం LICలో పనిచేస్తున్న సుశీల్ యాదవ్ తన కొడుకు ధైర్యాన్ని తనకు గర్వకారణంగా అభివర్ణించారు. సిద్ధార్థ్ భౌతికకాయానికి ఆయన స్వస్థలంలో పూర్తి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సిద్ధార్థ్ ముత్తాత కూడా బ్రిటిష్ కాలంలో బెంగాల్ ఇంజనీర్లలో పనిచేశారు. మరోవైపు, అతని తాత పారామిలిటరీ దళాలలో సభ్యుడు. అతని తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. -
గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
గాంధీ నగర్: గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం గుజరాత్‌లోని జామ్ నగర్లో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఓ పైలట్ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్ మృతిచెందారు. ప్రమాదం అనంతరం యుద్ధ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ మేరకు భారత వాయుసేన అధికారుల స్పందిస్తూ.. పైలట్ మృతి చెందినట్టు వెల్లడించారు. పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌లోని సువర్ద సమీపంలో బుధవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ తప్పిపోయాడు. శిక్షణలో ఉన్న విమానం కూలగానే మంటలు అంటుకున్నాయని, ప్రమాద కారణం ఇంకా తెలియరాలేదని జిల్లా ఎస్పీ ప్రేమ్‌సుఖ్ దేలూ తెలిపారు. గాయపడిన పైలట్‌ను జామ్‌నగర్‌లోని జీజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఇక, విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.#BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025ఇదిలా ఉండగా.. మార్చి నెలలో హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలో సాంతికేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని జనవాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పకూలిన విమానం అంబాలా ఎయిర్‌బేస్ నుంచి శిక్షణాలో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే.. మరో జాగ్వార్ యుద్ధ విమానం క్రాష్ కావడం ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.Tragic news tonight. Trainee IAF fighter pilot killed in Jaguar crash near Jamnagar. The other pilot managed to eject, being treated in hospital.Deepest condolences to the family of the deceased pilot. 💔 pic.twitter.com/bQy6bG1918— Shiv Aroor (@ShivAroor) April 2, 2025 An IAF Jaguar two seater aircraft airborne from Jamnagar Airfield crashed during a night mission. The pilots faced a technical malfunction and initiated ejection, avoiding harm to airfield and local population. Unfortunately, one pilot succumbed to his injuries, while the other…— Indian Air Force (@IAF_MCC) April 3, 2025 -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 13 మంది మృతి
బనస్కాంత:గుజరాత్‌లోని బనస్కాంతలోని అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. దీసాలోని జీఐడీసీ ప్రాంతంలోని ఒక బాణసంచా కర్మాగారంలో మంగళవారం ఉదయం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. బాయిలర్‌లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ప్రాథమికంగా ముగ్గురు మృతిచెందారని భావించారు. అయితే ఆ తరువాత మరో పది మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య 13కి చేరింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్యాక్టరీలోని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.అగ్నిమాపక సిబ్బంది(Fire fighters) సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ మాలి సహా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణంగా భవనంలోని కొంత భాగం కూలిపోయిందని ప్రవీణ్ మాలి తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court Of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో.. అందునా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని.. ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాల విధి అని స్పష్టం చేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ(Freedom of Expression) అంతర్భాగమని, ఆ హక్కును గౌరవించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో ఎలాంటి నేరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.సినిమాలు, కవిత్వం.. సాహిత్యం, వ్యంగ్యం.. మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది?. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే.. అవి సహేతుకంగా ఉండాలే గానీ.. ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. భావ స్వేచ్ఛ ప్రకటన, వాక్ స్వాతంత్య్రం(Freedom of Speech) అనేవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. అంతిమంగా.. ఆర్టికల్ 19(1)ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే’’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. జరిగింది ఇదే..గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి(Imran Pratapgarhi) గతేడాది డిసెంబరులో 46 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఓ పెళ్లి వేడుక మధ్యలో ఆయన నడిచివస్తుండగా పూలవర్షం కురిపిస్తూ.. బ్యాక్‌గ్రౌండ్ ఓ పద్యం వినిపించారు. అయితే, ఆ పద్యంలో పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవి మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుతో గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ హైకోర్టులో ఇమ్రాన్‌కు ఊరట లభించలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌కు ఊరట ఇచ్చింది. -
ఐక్యతా విగ్రహ శిల్పి రామ్‌సుతార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం మహారాష్ట్ర భూషణ్ అవార్డుకు ప్రముఖ శిల్పి రామ్ సుతార్‌ను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం శాసనసభలో ప్రకటించారు. మార్చి 12న ఆయన తన నేతృత్వంలోని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఫడ్నవీస్ తెలియజేశారు. ఈ అవార్డుకింద ఆయనకు రూ.25లక్షల నగదు, మెమెంటో అందజేస్తామని వెల్లడించారు. ‘ఆయనకు ఇప్పుడు వందేళ్ళు. కానీ దాన్ని లెక్కచేయకుండా ముంబైలోని ఇందు మిల్లు స్మారక ప్రాజెక్టులో అంబేద్కర్ విగ్రహం రూపకల్పనలో ఆయన నిమగ్నమై ఉన్నారు.’అని ప్రశంసించారు. పలు భారీప్రాజెక్టుల రూపశిల్పి గత నెలలో 100 ఏళ్లు నిండిన సుతార్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఈ ఏడాదితో వందేళ్లు పూర్తిచేసుకున్న రామ్‌సుతార్ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారు. సుతార్ తన కుమారుడు అనిల్‌తో కలిసిస్టాట్యూ ఆఫ్ యూనిటీ, అయోధ్యలో రెండు వందల యాభై ఒక్క మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం, బెంగళూరులో నూటయాభై మూడు అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం, పూణేలోని మోషిలో వంద అడుగుల ఎత్తైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ విగ్రహం వంటి అనేక ప్రధాన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తో సంబంధం కలిగి ఉన్నారు.గతేడాది మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ముప్పై ఐదు అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయి రాష్ట్రంలో భారీ రాజకీయ దుమారం చెలరేగింది. ఆ సంఘటన జరిగిన నాలుగునెలల తరువాత ప్రభుత్వం అరవై అడుగుల కొత్త విగ్రహాన్ని నిర్మించే కాంట్రాక్టును రామ్ సుతార్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించింది. గుజరాత్లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారు. గత నెలలో 100 ఏళ్లు నిండిన సుతార్, మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందినవారు. -
సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
భారత సంతతికి చెందిన నాసా(Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తొమ్మిది నెలల తరువాత ఎట్టకేలకు సురక్షితంగా భూమి మీదకి చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ఫ్లోరిడా తీరంలో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీతా విలియమ్స్‌తో కలిసి ల్యాండ్ అయ్యారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కూడా అమితానందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీతా సమీప బంధువు ఫల్గుణి పాండ్యా ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన సంతోషాన్ని ప్రకటించారు అంతేకాదు ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ త్వరలో భారతదేశంలో సునీతా పర్యటిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలోని గుజరాత్‌లోని ఆమె తండ్రి దీపక్ పాండ్యాకు పూర్వీకుల ఇల్లు ఉందని గుర్తు చేశారు. 286 రోజుల అంతరిక్షయానం తర్వాత నాసా వ్యోమగామి ఇంటికి తిరిగి రావడం గురించి ఆమె మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి ఆమె తిరిగి వస్తుందని తెలుసు. తన మాతృదేశం, భారతీయుల ప్రేమను పొందుతుందని కూడా తనకు తెలుసన్నారు.కలిసి సెలవులకు రావాలని కూడా ప్లాన్ చేస్తున్నాం, కుటుంబ సభ్యులతో గడబబోతున్నామని చెబతూ త్వరలో ఇండియాను సందర్శిస్తామని ఫల్గుణి ధృవీకరించారు. సునీత విలియమ్స్ మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తారా లేదా అంగారకుడిపైకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి అవుతారా అని అడిగినప్పుడు, అది ఆమె ఇష్టం అన్నారు. వ్యోమగామిగా తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ది బెస్ట్‌గా పనిచేస్తుందని,"ఆమె మనందరికీ రోల్ మోడల్" ఆమె ప్రశంసించారు. సెప్టెంబర్ 19న అంతరిక్షంలో ఆమె 59వ పుట్టినరోజును జరుపుకున్నారనీ, ఈసందర్భంగా భారతీయ స్వీట్ కాజు కట్లిని పంపినట్లు కూడా ఆమె చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాను అంతరిక్షంనుంచి వీక్షించినట్టు కూడా చెప్పారన్నారు.సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో సమోసాలు తీసుకెళ్లిన తొలి వ్యోమగామి కాబట్టి, ఆమె కోసం 'సమోసా పార్టీ' ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని కూడా చమత్కరించడం విశేషం. గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ వెళ్లారు. రౌండ్‌ట్రిప్‌గా భావించారు. అయితే, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ సమస్యలను నేపథ్యంలో అది వెనక్కి తిరిగి వచ్చేసింది. చివరకు ఇద్దరు వ్యోమగాములను NASA-SpaceX Crew-9 మిషన్ ద్వారా భూమికి చేరిన సంగతి తెలిసిందే. -
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్‌లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్‌ను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.సమోసా పార్టీసునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!తొమ్మిది నెలలు అంతరిక్షంలోనేఒక వారం రోజుల మిషన్‌మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్ ఒక రోల్‌మోడల్‌గా నిలిచారు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
చైనా వాల్ తరహాలో భారత్ వాల్.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: భారతదేశం సరిహద్దు వెంబడి ఒక భారీ గోడను నిర్మించనుంది. ఈ గోడ 1,400 కిలోమీటర్ల పొడవున ఉండనుంది. ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంటుంది. పాకిస్తాన్(Pakistan) సరిహద్దుల్లో ఉన్న ఎడారి ప్రాంతాలను తిరిగి పచ్చగా మార్చడమే లక్ష్యంగా ఈ గోడను నిర్మించనున్నారు.ఆరావళి పర్వత శ్రేణి(Aravalli mountain range)ని పచ్చగా మార్చడం, సహజ అడవులను కాపాడటం, చెట్లు, మొక్కల పరిరక్షణ, వ్యవసాయ భూమి, నీటి వనరులను కాపాడేందుకు ఈ భారీ గోడను నిర్మించాలని భారత్ భావిస్తోంది. ఇది చైనా గ్రేట్ వాల్ మాదిరిగా ఉంటుదనే మాట వినిపిస్తోంది. గుజరాత్‌లోని పోర్బందర్ నుండి ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు 1,400 కి.మీ పొడవైన గ్రీన్ వాల్‌ను నిర్మించనున్నారు. ఇది మహాత్మా గాంధీ జన్మస్థలం, సమాధి స్థలాలను అనుసంధానిస్తుంది.ఇది రాజస్థాన్, హర్యానాలోని 27 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఆరావళి అటవీ పునరుద్ధరణ ప్రాజెక్ట్. దీని వలన 1.15 మిలియన్ హెక్టార్లకు పైగా భూభాగంలో అడవుల పునరుద్ధరణ, చెట్లను నాటడం, వ్యవసాయ యోగ్యమైన భూమి, నీటి వనరుల పునరుద్ధరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆఫ్రికన్ యూనియన్‌కు చెందిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్ట్ నుండి ప్రేరణ పొందింది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ. 7,500 కోట్లు. దీనికి కేంద్రం 78 శాతం, రాష్ట్రాలు 20 శాతం, అంతర్జాతీయ సంస్థలు రెండు శాతం నిధులు సమకూర్చనున్నాయి. ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి -
దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి
వడోదర: గుజారాత్‌లో అమానుష ఉదంతం చోటుచేసుకుంది. వడోదర(Vadodara) జిల్లాలోని ఒక దర్గాలోకి బూట్లు ధరించి ప్రవేశించిన నలుగురు విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. ఆ విద్యార్థులకు గుజరాతీ భాష అర్థం కాకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు.ఈ దాడిలో ఒక విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి వాఘోడియా పోలీస్ స్టేషన్(Police station)లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం థాయిలాండ్, సూడాన్, మొజాంబిక్, బ్రిటన్‌కు చెందిన నలుగురు విద్యార్థులు పరుల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. మార్చి 14న సాయంత్రం ఈ విద్యార్థులను దాదాపు 10 మంది వ్యక్తులు వెంబడించి దాడి చేశారు. ఆ విద్యార్థులు గుజరాతీ భాష అర్థం చేసుకోలేకపోవడంతో వారిపై దాడి చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వారు ఒక దర్గాకు వెళ్లగా, వారిని బూట్లు ధరించి రాకూడదని ఒక వ్యక్తి సూచించారు. ఇది వారికి అర్థం కాలేదు.దాడి సమయంలో ముగ్గురు విద్యార్థులు తప్పించుకోగలిగారని, థాయ్ విద్యార్థి సుపచ్ కంగ్వాన్రత్న (20)తలకు తీవ్ర గాయాలు అయ్యాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బాధితుడిని పరుల్ సేవాశ్రమ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వాఘోడియా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: 43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. మండిపోతున్న ఎండలు -
Vadodara: ‘తాగలేదు.. గుంతల వల్లే కారు అదుపు తప్పింది’
వడోదర: గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కారును వేగంగా నడిపి, ఒక మహిళ మృతికి కారణమైన రక్షిత్ రవీష్ చౌరాసియా పోలీసుల ముందు తన వాదన వినిపించాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో లేనని పేర్కొన్నాడు. గురువారం రాత్రి వడోదరలో రక్షిత్ నడుపుతున్న కారు ఒక స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలో పోలీసులు రక్షిత్‌ను అరెస్టు చేశారు.నిందితుడు రక్షిత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ గురువారం రాత్రి తాను నడుపుతున్న కారు ఆ స్కూటీ కంటే ముందుగా వెళుతున్నదని, ఇంతలో తాను రైట్ సైడ్ తీసుకున్నానని తెలిపారు. అక్కడ రోడ్డుపై పెద్ద గుంత ఉన్నదని, దీంతో కారు అదుపుతప్పి, పక్కనే ఉన్న స్కూటీని ఢీకొన్నదన్నారు. ఇంతలో ఎయిర్ బ్యాగ్ తెరుచుకున్నదని, ఆ తరువాత ఏం జరిగిందో తమకు తెలియలేదన్నారు. తమ కారు ప్రమాదం జరిగిన సమయంలో50 కి.మీ. స్పీడులోనే వెళుతున్నదని, తాను మద్యం తీసుకోలేదని, హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లి వస్తున్నామని రక్షిత్ తెలిపారు. #WATCH | Vadodara, Gujarat: One woman has died, and four others are injured after an overspeeding four-wheeler rammed into a two-wheeler (14/03). Accused Rakshit Ravish Chaurasia claims, " We were going ahead of the scooty, we were turning right and there was a pothole on the… pic.twitter.com/7UMundtDXH— ANI (@ANI) March 15, 2025వడోదర పోలీస్ కమిషనర్(Police Commissioner) నరసింహ మీడియాతో మాట్లాడుతూ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారన్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడున్నవారి నుంచి సమాచారం సేకర్తిస్తున్నామని, రక్షిత్ మద్యం తాగి వాహనం నడిపినట్లు కేసు నమోదయ్యిదన్నారు. అయితే రక్షిత్ ప్రమాదం జరిగిన సమయంలో మద్యం మత్తులో లేనని చెబుతున్నాడని, ఈ కేసులో నిజానిజాలు నిర్థారించాల్సి ఉందన్నారు. ఇది కూడా చదవండి: దేశ విభజనలో రైల్వే పంపకాలు.. నాడు భారత్-పాక్‌లకు ఏమి దక్కాయి? -
అక్కడ పది రోజులపాటు హోలీ వేడుకలు
నవసారి: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు(Holi celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. చిన్నాపెద్దా అంతా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా హోలీ వేడుకలు ఒకరోజు జరుగుతాయి. కానీ ఆ ప్రాంతంలో ఏకంగా 10 రోజుల పాటు హోలీ వేడుకలు కొనసాగుతాయి. గుజరాత్‌లోని ఆదివాసీ జనబాహుళ్యం కలిగిన డాంగ్ జిల్లాలో హోలీ ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.డాంగ్ జిల్లాలో జరిగే హోలీని రాజుల హోలీ(Holi of the Kings)గా చెబుతారు. డాంగ్ జిల్లాలో నేటికీ ఐదుగురు రాజవంశస్థులు ఉన్నారు. ఏడాదిలో ఒకసారి ఈ రాజులను బహిరంగంగా గౌరవపూర్వకంగా సన్మానిస్తారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనిని డాండ్ దర్బార్ మేళా అని అంటారు. ఈ ఉత్సవాల్లో ఆ రాజులను రథాలలో కూర్చోబెట్టి వేదిక దగ్గరకు తీసుకువచ్చి, ఘనంగా సన్మానిస్తారు. వీరికి ప్రభుత్వం ఫించను అందజేస్తుంది. పది రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో ప్రతీరోజూ ఇక్కడి ఆదివాసీ మహిళలు సాయంత్రం వేళల్లో జానపద గీతాలు ఆలపిస్తారు. అలాగే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతలోని చిన్నారులు తమ మేనమామలకు హోలీ స్నానం చేయిస్తారు. చిన్నారులను స్థానికులు భక్త ప్రహాదుని రూపాలుగా భావించి పూజలు చేస్తారు.ఇది కూడా చదవండి: ‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన -
గుజరాతీలు జాబ్స్ ఎందుకు చేయరంటే..
వ్యాపారం, ఆర్థిక రంగాల్లో గుజరాతీల (Gujaratis) ఆధిపత్యం గురించి తెలిసిందే. అయితే వారు ఆయా రంగాల్లో అంతలా రాణించడానికి కారణాలు ఏంటి.. సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేక లక్షణాలేంటి అన్న దానిపై పై స్టాకిఫీ వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్సీ అద్భుతమైన విశ్లేషణ చేశారు. వారి ఆర్థిక ప్రభావాన్ని హైలైట్ చేసే గణాంకాలతో ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.దేశంలోని 191 మంది బిలియనీర్లలో 108 మంది గుజరాతీలేనని రాసుకొచ్చిన చోక్సీ సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేకతలను వివరించారు. చివరికి అమెరికాలో నివసిస్తున్న గుజరాతీ.. సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడని చోక్సీ అభిప్రాయపడ్డారు. భారతదేశ జనాభాలో కేవలం 5% మాత్రమే ఉన్నప్పటికీ, గుజరాత్ దేశ జీడీపీకి 8% పైగా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 18% భాగస్వామ్యం వహిస్తోంది. భారత భూభాగంలో కేవలం 6% మాత్రమే ఉన్న గుజరాత్ దేశం మొత్తం ఎగుమతుల్లో 25% వాటాను కలిగి ఉంది.గుజరాతీల సక్సెస్‌కు కారణాలివే..మరి గుజరాతీలు వ్యాపారంలో అంత సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? చోక్సీ ప్రకారం.. ఇది తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వ్యవస్థాపక మనస్తత్వం, కొత్త మార్కెట్లను స్వీకరించడానికి, ఆధిపత్యం చేయడానికి సాటిలేని సామర్థ్యం కలయిక. గుజరాతీలు వ్యాపార, ఆర్థిక వ్యవహారాలను శాసించడానికి 20 కారణాలను ఆయన వివరించారు.ఉద్యోగాల (Jobs) కంటే వ్యాపారానికి తరతరాలుగా ప్రాధాన్యత ఇవ్వడమే ఈ విజయానికి కారణమని చోక్సీ పేర్కొన్నారు. "నౌకరీ తో గరీబోన్ కా దండా చే" (ఉద్యోగాలు పేదల కోసం) అనేది గుజరాతీ కుటుంబాలలో ఒక సాధారణ నమ్మకం. వ్యాపారం అనేదేదో నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యంలాగా కాకుండా గుజరాతీ పిల్లలు.. తమ కుటుంబాల్లో డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు.. డీల్స్ ఎలా చేస్తున్నారు.. నష్టాలను ఎలా అంచనా వేస్తున్నారు.. అనేది నిత్యం చూస్తూ పెరుగుతారు.రిస్క్ తీసుకోవడం అనేది మరో ముఖ్యమైన లక్షణం. వజ్రాల ట్రేడింగ్ నుంచి స్టాక్ మార్కెట్ల వరకు గుజరాతీలు అనిశ్చితిని స్వీకరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ మనస్తత్వం ప్రారంభ ఆర్థిక విద్య ద్వారా బలపడుతుంది. చాలా మంది పిల్లలు చిన్న వయస్సు నుండే కుటుంబ వ్యాపారాలలో సహాయపడతారు. ఏ ఎంబీఏ బోధించలేని రియల్ వరల్డ్ ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకుంటారు.నెట్ వర్కింగ్, కమ్యూనిటీ సపోర్ట్ కీలకం. రుణాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ విషయంలో గుజరాతీలు ఒకరికొకరు చురుకుగా సహాయపడతారు. వారి పొదుపు జీవనశైలి కూడా ఒక పాత్ర పోషిస్తుంది. లాభాలను విలాసవంతంగా ఖర్చు చేయకుండా తిరిగి పెట్టుబడి పెడతారు. ఇది దీర్ఘకాలిక సంపద సేకరణకు దారితీస్తుంది.వివిధ పరిశ్రమల్లో గుజరాతీలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారో కూడా చోక్సీ తెలియజేశారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్ మాత్రమే ప్రాసెస్ చేస్తోందని, బెల్జియం, ఇజ్రాయెల్ లోని పోటీదారులను గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎలా అధిగమించారో ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, భారతదేశ స్టాక్ మార్కెట్ వ్యాపారులలో 60% పైగా గుజరాతీలు లేదా మార్వాడీలు ఉన్నారు.అమెరికాలో కూడా గుజరాతీలు వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అమెరికాలోని మొత్తం హోటళ్లలో 60 శాతానికి పైగా గుజరాతీ కుటుంబాలకు చెందినవేనని, ప్రధానంగా పటేల్ సామాజిక వర్గానికి చెందినవని చోక్సీ వెల్లడించారు. 1950వ దశకంలో చిన్న చిన్న పెట్టుబడులుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపాంతరం చెందింది.108 out of 191 Indian billionaires are Gujarati.A Gujarati living in America makes three times more than an average American.Gujarat, which has 5% of India’s population, contributes over 8% to the GDP and 18% of the industrial output.Gujarat has a land area of only 6% but… pic.twitter.com/ZId5idzCNS— Abhijit Chokshi | Investors का दोस्त (@stockifi_Invest) March 8, 2025 -
నారీ శక్తికి సలాం
నవాసరీ (గుజరాత్): ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా మహిళలను గౌరవించడమే ప్రగతి దిశగా తొలి అడుగని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మహిళల సారథ్యంలో సమాజ ప్రగతి దిశగా భారత్ కొన్నేళ్లుగా ముందుకు సాగుతోందన్నారు. ‘‘నారీ శక్తికి నా నమస్సులు. మహిళల ఆత్మగౌరవానికి, భద్రతకు, సాధికారతకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన చట్టాల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు పొందుపరిచాం. వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాల స్థానంలో తెచి్చన పూర్తి దేశీయ చట్టాల్లో అత్యాచారం వంటి దారుణ నేరాలకు మరణశిక్షకు వీలు కల్పించాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తదితరాల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందిస్తున్నాం. వారిపై తీవ్ర నేరాల్లో 45 నుంచి 60 రోజుల్లోపే తీర్పులు వచ్చేలా చర్యలు చేపట్టాం. విచారణ క్రమంలో బాధిత మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా నిబంధనలు పొందుపరిచాం’’అని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గుజరాత్లో నవాసరీ జిల్లా వన్శ్రీ బోర్సీ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం లక్షన్నర మందికి పైగా మహిళలు హాజరైన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఆడపిల్ల ఆలస్యంగా ఇంటికొస్తే పెద్దవాళ్లు లక్ష ప్రశ్నలడుగుతారు. అదే మగపిల్లాడు ఆలస్యమైతే పట్టించుకోరు. కానీ అతన్ని కూడా కచ్చితంగా నిలదీయాలి’’అని తల్లిదండ్రులకు సూచించారు. ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని నేనే తాను ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని అంటూ ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది విని కొందరికి ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడవచ్చు. కానీ ఇది నిజం. కాకపోతే సంపదపరంగా కాదు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, కూతుళ్ల ఆశీస్సులు నాకున్నాయి. ఆ రకంగా నేను అందరి కంటే సంపన్నుడిని. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద బలం, నా పెట్టుబడి. అవే నాకు తి రుగులేని రక్షణ కవచం కూడా’’అని వివరించారు. ప్రధాని సోషల్ ఖాతాల్లో... మహిళల విజయగాథలు పలు రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళా ప్రముఖులు శనివారం ప్రధాని మోదీ సోషల్ మీడియా హాండిళ్లను ఒక రోజు పాటు తామే నిర్వహించారు. తమ విజయగాథలను పంచుకున్నారు. కలలను నిజం చేసుకునేందుకు అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలి, పారిశ్రామికవేత్తగా మారిన రైతు అనితా దేవి, అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పీ సోనీ తదితరులు వీరిలో ఉన్నారు. గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞా్ఞనంద సోదరి అయిన వైశాలి ఆరేళ్ల వయసు నుంచే చెస్ ఆడుతున్నారు. రైతు ఉత్పత్తుల కంపెనీ ద్వారా తన గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పించినట్టు అనితాదేవి వివరించారు. ఇది వారికి సంపాదనతో పాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కూడా కల్పించిందన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత అవసరాన్ని ఫ్రాంటియర్ మార్కెట్స్ సీఈఓ అజితా షా వివరించారు. అనంతరం వారి విజయగాథలను ప్రస్తుతిస్తూ మోదీ పలు పోస్టులు చేశారు. వికసిత భారత్ లక్ష్యసాధనలో మహిళలదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. మహిళా పోలీసుల రక్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవాసరీ సభలో ప్రధాని మోదీకి పూర్తిగా మహిళలతో కూడిన అంగరక్షక దళం భద్రత కల్పించడం విశేషం. బహిరంగ సభతో పాటు ఆయన రక్షణ బాధ్యతలను కూడా 2,500 మందికి పైగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకున్నారు. వీరిలో 2,145 మంది కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది ఇన్స్పెక్టర్లు, 19 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక డీఐజీ తదితరులున్నారు. హెలిప్యాడ్ వద్ద మోదీ రాక మొదలుకుని సభనుద్దేశించి ప్రసంగం, లఖ్పతీ దీదీ లబి్ధదారులకు సన్మానం, అనంతరం ఆయన వెనుదిరిగేదాకా సర్వం వారి కనుసన్నల్లోనే సాగింది. మొత్తం ఏర్పాట్లను అదనపు డీజీపీ నిపుణా తోర్వానే పర్యవేక్షించారు. పురుష సిబ్బంది పార్కింగ్, ట్రాఫిక్ విధులకే పరిమితమయ్యారు. ఇంతటి భారీ కార్యక్రమ భద్రత ఏర్పాట్లను పూర్తిగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. -
మీకు మీరే ట్రోల్ చేసుకుంటున్నారు.. బాగుందయ్యా రాహుల్!
అహ్మదాబాద్: కొందరు కాంగ్రెస్ నేతలు.. బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల ఆ పార్టీకి కలిసొచ్చే ఏమీ లేదని, వాళ్లని వారే ట్రోల్ చేసుకుంటున్నారంటూ గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్లా విమర్శించారు. ‘ రాహుల్ గాంధీ మిమ్మల్ని మీరే ట్రోల్ చేసుకుంటున్నారు. మీ పార్టీని కూడా బానే ట్రోల్ చేస్తున్నారు. ఆయన్ని ఆయన అద్దంలో చూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ గుజరాత్ లో గెలవలేకపోతుందనే అసహనం. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వివాహాల్లో గుర్రాల చేత డ్యాన్స్ చేయించే వారి మాదిరిగా ఉన్నారని, మరి కొంతమంది పోటీల్లో పరుగెత్తే పెళ్లి గుర్రాల్లా ఉన్నారని రాహుల్ అంటున్నారు. అంటే మీ పార్టీ కార్యకర్తలు జంతువులా? అని ప్రశ్నించారు షెహజాద్. కనీసం మీ పార్టీ కార్యకర్తల్ని మనుషుల మాదిరి చూడండి.. అంతే కానీ వారిని గుర్రాలతో పోలుస్తారా? అంటూ నిలదీశారు.కాగా, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ అని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. -
కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
గాంధీనగర్: గుజరాత్లో కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ. గుజరాత్లో కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదవలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 22 శాతం ఓట్లు పెరిగాయి.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపించారు.గుజరాత్లో కూడా కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నది.. కానీ అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. అందరూ పార్టీ లైన్లో ఉండి పనిచేయాల్సింది.. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదు.. ఇప్పుటికైనా మించిపోయిందేమీ లేదు. వైఖరి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలి. పీసీసీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, గత 30 ఏళ్లుగా గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో లేదు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ 2007, 2012, 2017, 2022, 2027 అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చలు జరుగుతాయి. కానీ ప్రశ్న ఎన్నికల గురించి కాదు. మన బాధ్యతలను నెరవేర్చే వరకు గుజరాత్ ప్రజలు మనల్ని ఎన్నికల్లో గెలిపించరు. ప్రజల పట్ల మనం బాధ్యతతో ఉన్న రోజున వారే మనకు అధికారం ఇస్తారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. #WATCH | Ahmedabad, Gujarat: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "...Gujarat is stuck, it is unable to see the way, Gujarat wants to move forward. I am a member of the Congress party and I am saying that the Congress party of Gujarat is unable to show it the way, and… pic.twitter.com/UYBZ5BdvfM— ANI (@ANI) March 8, 2025 -
బాలుడికి చెంపదెబ్బ.. పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్, ఆగిన శాలరీ హైక్
గాంధీ నగర్ : ప్రధాని మోదీ ఇవాళ తన సొంతరాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. అయితే, ఈ పర్యటనకు ముందు రోజు అంటే నిన్న ప్రధాని మోదీ ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహించారు అధికారులు. అంత వరకు బాగానే ఉన్నా.. కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.ప్రధాని మోదీ రాక నేపథ్యంలో సెక్యూరిటీ రిత్యా ఆయా ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. గుజరాత్ పర్యటన వేళ గుజారత్‌లోని రతన్ చౌక్ వద్ద పోలీస్ ఉన్నతాధికారులు మోదీ కాన్వాయ్‌తో రిహారాల్స్ నిర్వహించారు. ఆ సమయంలో 17ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుకుంటూ పొరపాటున రిహార్సల్స్ జరిగే ప్రాంతం వైపు వచ్చాడు. వెంటనే రెప్పపాటులో సైకిల్‌ను వెనక్కి తిప్పాడు.అదే సమయంలో పక్కనే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి ఎస్ బీఎస్ గాధ్వీ సదరు బాలుడిని జుట్టు పట్టుకుని లాగారు. ఆపై చెంప చెల్లు మనిపించాడు. దీంతో బాలుడు వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే, బాలుడిపై సదరు పోలీస్ అధికారి దాడి సమయంలో స్థానికంగా పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. సంబంధిత వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. వైరలైన వీడియోలపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ వానాని స్పందించారు. గాధ్వీ తీరు క్షమించరానిది. ప్రస్తుతం,మ్రోబి జిల్లాలో పోలీస్‌స్టేషన్‌లో విధిలు నిర్వహిస్తున్న ఆయన్ను కంట్రోల్ రూంకి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు, ఏడాదిపాటు శాలరీ ఇంక్రిమెంట్ సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది.This Gujarat Police officer brutally thrashed a harmless kid on a cycle just for coming in between the convoy of Police VVIP movement rehearsal.Look at how he makes a fist and punches the kid. NAME AND SHAME THIS COP UNITL HE IS SUSPENDED! pic.twitter.com/5a08yvdUVd— Roshan Rai (@RoshanKrRaii) March 7, 2025 -
మోదీ జంగిల్ సఫారీ (చిత్రాలు)
-
సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు
గిర్ సోమనాథ్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయంలో పూజలు చేశారు. సోమనాథ్ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతకుముందు ప్రధాని మోదీ జామ్‌నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన ‘వంతారా’ను సందర్శించారు. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత మోదీ సమీపంలోని జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయమైన సాసన్ చేరుకున్నారు.ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగిసిన తర్వాత సోమనాథుణ్ణి పూజించాలనే తన సంకల్పంలో భాగంగా ఈ సందర్శన జరిగిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. ‘కోట్లాది మంది దేశప్రజల కృషితో ప్రయాగ్‌రాజ్‌లో ‘ఐక్యతా మహాకుంభ్’ విజయవంతమయ్యింది. ఒక భక్తునిగా మహా కుంభమేళా అనంతరం 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన శ్రీ సోమనాథుణ్ణి(The Jyotirlinga of Sri Somanath) పూజించాలని నా మనస్సులో నిశ్చయించుకున్నాను’ అని తెలిపారు. ‘ఈ రోజు సోమనాథుని ఆశీస్సులతో నా సంకల్పం నెరవేరింది. దేశప్రజలందరి తరపున, నేను ఐక్యతా మహా కుంభ్ విజయాన్ని సోమనాథుని పాదాలకు అంకితం చేస్తున్నాను. అలాగే దేశప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ససాన్లోని 'లయన్ సఫారీ'ని ప్రధానమంత్రి సందర్శించనున్నారు. అలాగే జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్బీడబ్ల్యూఎల్) సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.ఇది కూడా చదవండి: India Bhutan Train : త్వరలో భారత్-భూటాన్ రైలు.. స్టేషన్లు ఇవే.. -
గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ.. నేడు ’వంతారా’ సందర్శన
జామ్‌నగర్: మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) గుజరాత్ చేరుకున్నారు. శనివారం రాత్రి జామ్‌నగర్ సర్క్యూట్ హౌస్‌లో బస చేసిన ఆయన నేడు (ఆదివారం) రిలయన్స్ ఫౌండేషన్ జంతు రక్షణ, పునరావాస కేంద్రమైన ‘వంతారా’ను సందర్శించనున్నారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా గిర్ జిల్లాలోని ససన్ గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి, జంగిల్ సఫారీ చేయనున్నారు. సోమవారం ప్రధాని మోదీ సోమనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటనపై గుజరాత్ మంత్రి ములుభాయ్ బేరా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని రాకకు సంబంధించి అన్ని సన్నాహాలు పూర్తి చేశామని, ఆయన జామ్‌నగర్, ద్వారక, గిర్ జిల్లాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతారన్నారు.జంతు సంరక్షణ కేంద్రం సందర్శనఈ రోజు(ఆదివారం) సాయంత్రం ప్రధాని మోదీ జామ్‌నగర్(Jamnagar)లోని ‘వంతారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించనున్నారు. తరువాత ఆయన ససాన్ చేరుకుంటారు. అక్కడి అటవీ శాఖ కార్యాలయ అతిథి గృహం ‘సింగ్ సదన్’ను సందర్శిస్తారు. అలాగే ఈరోజు జరిగే సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.జంగిల్ సఫారీ..మార్చి 3న ప్రధాని గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీలో పాల్గొంటారు. అక్కడి నుండి సింగ్ సదన్‌కు చేరుకుని ఎన్బీడబ్ల్యు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వన్యప్రాణులకు సంబంధించిన జాతీయ స్థాయి అంశాలపై చర్చించనున్నారు.సోమనాథ్ ఆలయంలో పూజలు అదే రోజున ప్రధాని ససాన్‌లో అటవీశాఖ సిబ్బందితో సంభాషించనున్నారు. తరువాత సోమనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సోమనాథ్ నుండి రాజ్‌కోట్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.ఇది కూడా చదవండి: సునీతా విలియమ్స్ రాకకు సమయం ఆసన్నం -
నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈరోజు (శనివారం) నుంచి మూడు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. జునాగఢ్ జిల్లాలోని ససాన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్బీడబ్ల్యుఎల్) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణ కేంద్రంను సందర్శించనున్నారు. అలాగే సోమనాథ్ ట్రస్ట్ సమావేశంలో కూడా పాల్గొననున్నారు.ప్రధాని మోదీ తన పర్యటనలో ఆదివారం జామ్‌నగర్‌లోని వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం జంగిల్ సఫారీ చేయనున్నారు. గుజరాత్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎపీ సింగ్ మాట్లాడుతూ మార్చి ఒకటిన సాయంత్రం ప్రధాని జామ్‌నగర్(Jamnagar) చేరుకుంటారని, రాత్రికి అక్కడి సర్క్యూట్ హౌస్‌లో బస చేస్తారని తెలిపారు. మరుసటి రోజు వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారన్నారు. తరువాత జామ్‌నగర్ నుండి బయలుదేరి సాయంత్రం ససాన్ చేరుకుంటారు. అక్కడ ఆయన సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.మార్చి 3న ప్రధాని మోదీ ఆసియా సింహాలకు నిలయమైన గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీని ఎంజాయ్ చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో పూజలు చేయనున్నారు. అలాగే అటవీ ఉద్యోగులతో మోదీ సంభాషించనున్నారు. అనంతరం సోమనాథ్ నుండి రాజ్‌కోట్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరుతారని సింగ్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉదయాన్నే వర్షం.. వీడని చలిగాలులు -
నోవోటెల్లో నోరూరిస్తున్న ఫుడ్ ఫెస్ట్
విభిన్న వంటకాలకు నెలవైన నగరంలో గుజరాత్ రుచులు ఆహార ప్రియుల నోరూరిస్తున్నాయి. భౌగోళిక సమ్మేళనానికి ఈ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెఫ్ పూనమ్ చెబుతున్నారు. గుజరాత్ గ్రామీణ పాంతాల్లోని ప్రత్యేక వంటకాలతో పాటు, విశ్వవ్యాప్తంగా ఇష్టపడే తమ సిగ్నేచర్ డిషెస్ వండి వడ్డిస్తున్నారు. ఎయిర్‌పోర్టు వేదికగా నోవోటెల్లో ఏర్పాటైన ఈ ఫెస్టివల్ మార్చ్ 2 వరకూ కొనసాగనుంది. ఇందులో సూర్తి ప్యాటీలు, కుచ్చి దబేలి వంటి వెరైటీలు లైవ్ కౌంటర్లలో ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి సిటీ బ్యూరో నగరంలోని నోవోటెల్ ఎయిర్పోర్ట్ వేదికగా కొనసాగుతున్న గుజరాత్ కతియావాడి వంటకాలు నగరవాసుల నోరూరిస్తున్నాయి. గుజరాత్ ప్రాంతానికి చెందిన ప్రముఖ చెఫ్ పూనమ్ దేధియ ఆధ్వర్యంలో అక్కడి సంప్రదాయ వంటకాలను ఆహారప్రియులకు వడ్డిస్తున్నారు. ఈ ఫెస్ట్ నగరంలో మరో సాంస్కృతిగా సమ్మేళనంగా కనిపిస్తోంది. ‘స్వాద్ కతియావాడ్ కా’ పేరుతో ఏర్పాటైన ఈ పసందైన రుచులు బఫే నుంచి స్నాక్స్ వరకూ అక్కడి పురాతన రుచులను అందిస్తుంది. కోప్రా పాక్.. ఎండు కొబ్బరి, చక్కెర, నెయ్యి, కొత్తిమీరతో తయారు చేసే వినూత్న రుచికరమైన వెరైటీ. ఇది గుజరాతీ స్పెషల్. ఇందులో విభిన్న రకాల డ్రై ఫ్రూట్స్ వినియోగిస్తారు. 100 గ్రాములకు సుమారు 280 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. క్లాసిక్ హ్యాండ్వో.. ఇది గుజరాత్‌కి చెందిన ప్రత్యేక స్నాక్. ఈ క్లాసిక్ హ్యాండ్వో ఫెర్మెంటెడ్ రైస్, బటర్, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కూరగాయల మిశ్రమం, గుజరాత్లో మాత్రమే లభించే మసాలాలు కలిపి తయారుచేస్తారు. వంటకాల్లో వైవిధ్యంవిభిన్న కూరగాయల మిశ్రమంతో, ఘాటైన మసాలాల ఘుమఘుమలతో తక్కువ సెగపై నెమ్మదిగా వండేవంట వరదియు.. మంచి సువాసనతో కాసింత సూప్‌తో గుజరాతీ వెరైటీని నోటికి అందిస్తుంది. బిజోరా పికిల్.. ఈ అరుదైన వంటకం గుజరాత్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు పొందిన ప్రత్యేక వంటకం. ఈ బిజోరా పికిల్ కేవలం గుజరాత్లో మాత్రమే లభిస్తుందని చెఫ్ తెలిపారు. ఇది స్థానిక సాంస్కృతిక వంటకమే కాకుండా ఎన్నో ఆరోగ్య సంరక్షణ గుణాలున్న రుచికరమైన పికిల్. లిల్వాని కచోరి.. కరకరలాడించే లడ్డూ లాంటి స్పెషల్ గుజరాతీ కచోరి ఇది. ఇందులో ప్రత్యేక రుచికరమైన పదార్థాలతో పాటు బఠానీల మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసి వడ్డిస్తారు. చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ? -
Vantara అనంత్ అంబానీ ‘వంతారా’ అరుదైన ఘనత
రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ (Anant Ambani) మరో ఘనతను సాధించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమారుడిగా జంతుప్రేమికుడిగా అనంత్ అంబానీ అందరికీ సుపరిచితమే. జంతు రక్షణ, ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కోసం వంతారా (Vantara) అనే సంస్థను స్థాపించారు. అనంత్ అంబానీ ప్రాణప్రదమైన వంతారాకు ప్రతిష్టాత్మక 'ప్రాణి మిత్ర' జాతీయ అవార్డు లభించింది.'కార్పొరేట్' విభాగంలో జంతు సంక్షేమంలో భారతదేశంలోని అత్యున్నత గౌరవం పురస్కారం 'ప్రాణి మిత్ర' ( Prani Mitra Award ) జాతీయ అవార్డు వంటారా దక్కించుకుంది. వంటారా సంస్థ అయిన రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT)కు గౌరవం దక్కింది. ఈ అవార్డును భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ సహాయ మంత్రి గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేశారు. దీనికి వంతారా సీఈవో వివాన్ కరణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జంతు సంక్షేమం పట్ల వంతారా లోతైన నిబద్ధతను నొక్కి చెప్పారు. సంక్షేమ ప్రమాణాలను పెంచడం, భారతదేశ జీవవైవిధ్యాన్ని కాపాడటం వారి లక్ష్యమనన్నారు. "ఈ అవార్డు భారతదేశ జంతువులను రక్షించడానికి, సంరక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన అనేక మంది వ్యక్తులకు నివాళి. వంతారాలో, జంతువులకు సేవ చేయడం అంటే కేవలం డ్యూటీ కాదు - ఇది తమ ధర్మం, సేవ, కరుణ, తమ బాధ్యతలో దృఢమైన నిబద్ధత అన్నారు. భవిష్యత్తరాలకోసం దేశ గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడటం అనే లక్ష్యంలో తాము అలుపెరగకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.చదవండి : పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్‌గా!కెరీర్లో పీక్‌లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనంవంతారాగుజరాత్లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. వంతారాలోని ఎలిఫెంట్ కేర్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగు ఆసుపత్రికి నిలయంగా ఉంది. 240కి పైగా ఏనుగులకు రక్షణ కల్పిస్తోంది. ఇక్కడ ఏనుగులకు ప్రపంచ స్థాయి పశువైద్య చికిత్స, కరుణా సంరక్షణ లభిస్తుంది. ఇక్కడ అల్లోపతిని ప్రత్యామ్నాయ వైద్యంతో అనుసంధానించే అధునాతన పశువైద్య సంరక్షణను అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ కోసం ఆయుర్వేదం మరియు నొప్పి నివారణ కోసం అక్యుపంక్చర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. దీని అత్యాధునిక వైద్య సౌకర్యాలలో ఆర్థరైటిస్ చికిత్స కోసం అధిక పీడన నీటి జెట్లతో కూడిన హైడ్రోథెరపీ చెరువు, గాయం నయం కోసం హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్ , పెడిక్యూర్ నిపుణులతో అంకితమైన పాద సంరక్షణ సౌకర్యాలుండటం విశేషం.అలాగే వంతారా అతిపెద్ద ఏనుగు అంబులెన్స్‌ల సముదాయాన్ని నిర్వహిస్తోంది.హైడ్రాలిక్ లిఫ్ట్‌లు, రబ్బరు మ్యాట్ ఫ్లోరింగ్, వాటర్ ట్రఫ్లు, షవర్లు , కేర్‌టేకర్ క్యాబిన్లున్న 75 కస్టమ్-ఇంజనీరింగ్ వాహనాలున్నాయి. -
పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్‌గా!
‘‘సాధించినదానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటే పొరపాటోయి…ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా’’ ఈమాటల్ని మహాకవి శ్రీశ్రీ ఏ సందర్భంలో అన్నప్పటికీ.. ఈ మాటల్నే తనకు ప్రేరణగా తీసుకున్నాడో యువకుడు. కుటుంబాన్నీ పేదరికం నుంచి బయటపడేయడమే అతని అక్ష్యం. అలాగని సాధించిన ఉద్యోగంతో తృప్తి పడలేదు. పట్వారీగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, తరువాత తహసీల్దార్, అసిస్టెంట్ జైలర్, స్కూల్ లెక్చరర్‌గా పనిచేశాడు. ఆరేళ్లలో (2010-2016) 12 ప్రభుత్వ ఉద్యోగాలు. చివరికి ఐపీఎస్ ఆఫీసర్‌గా నిలిచాడు. ఎలా సాధ్యం అని ఆశ్యర్యపోతున్నారా? తన కలను సాకారం చేసుకునేందుకు ఐపీఎస్ అధికారిగా నిలిచేందుకు చేసిన కృషి ఇందుకు సమాధానం. పదండి అతని స్ఫూర్తిదాయకమైన కెరీర్ గురించి తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని రసిసార్లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ప్రేమ్‌సుఖ్ డెలు. ప్రారంభంలో ఒంటె బండి డ్రైవర్‌గా పనిచేశాడు. పశువుల మేతకోసి తెచ్చేవాడు. అయితే పేదరికం నుండి తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో, చదువుకోవాలని నిర్ణయించాడు. ఎన్నిఇబ్బందులొచ్చినా చదువును సాగించాడు. ఆర్థిక ఇబ్బందుల భారం తన కలలకు అడ్డు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అతని కుటుంబం కూడా చదువు ప్రాధాన్యతను గురించింది. ఎన్ని సవాళ్లెదురైనా, పరిమిత వనరులు ఉన్నప్పటికీ అతనిలో విశ్వాసాన్ని నింపింది. డెలు సంకల్పానికి కుటుంబ సహకారం మరింత బలాన్నిచ్చింది.గొప్ప గొప్ప బిరుదులు, హోదాలు కాదు... తనకుటుంబం ఆర్థిక కష్టాలనుంచి బైటపడి, గౌరవంగా బతకాలి ఇదే అతని పట్టుదల. ప్రేమ్ కష్టపడి చదువుతూ ఎంఏ హిస్టరీ పూర్తి చేశాడు. 2010లో తొలిసారి పట్వారీ (రెవెన్యూ ఆఫీసర్) ఉద్యోగం సంపాదించాడు. ఆ తరువాతి ఏడాదికే అసిస్టెంట్ జైలర్‌గా , ఆ తరువాత ఉపాధ్యాయుడిగా, అనంతరం కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం సంపాదించాడు. అయితే స్వల్పమార్కులతో పోలీస్ ఉద్యోగం చేజారినా ఐపీఎస్ అవ్వాలన్న కల స్థిమితంగా నిద్రపోనీయలేదు. మరోపక్క సాధించి చాల్లే..ఉన్నదాంతో సంతోషంగా బతుకుందాం అన్నారు కుటుంబ సభ్యులు. అయినా పట్టువీడని ప్రేమ్..2015లో యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాశాడు. యూపీఎస్సీలో (UPSC) AIR 170 ర్యాంకుతో తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు వేశాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్‌గానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.‘ఉద్యోగం చేసుకుంటూ యూపీఎసీసీకి సిద్ధమవ్వడం అంత సులభం కాదు. అంకిత భావంతో చదివాను. కేవలం ఆరేళ్ళలో 12 ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే తనకు స్ఫూర్తినిచ్చింది। అంటాడు డైలు. ఇదీ కదా పట్టుదల అంటే.. ఇదీ కదా సక్సెస్ అంటే. అవిశ్రాంత దృఢ సంకల్పం , దృఢ నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు డైలు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. -
పిల్లలను అమ్మే ముఠా గుట్టురట్టు.. గుజరాత్ నుంచి నగరానికి తీసుకువచ్చి..
సాక్షి,హైదరాబాద్ : రాచకొండలో అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. 11 మందిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్యపురి పోలీసులతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ జాయింట్ ఆపరేషన్‌లో అప్పుడే పుట్టిన నలుగురు పిల్లలను అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.పిల్లలు లేని తల్లిదండ్రులు ఆరాటం.. ఆ దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులను.. ముక్కు పచ్చలారని పసికందుల్ని అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. ఇందులో భాగంగా నిందితులు గుజరాత్లో పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులకు డబ్బులు ఎరవేస్తున్నారు. మెడికల్ ప్రతినిధుల ద్వారా బేరసారాలు జరిపి అప్పుడే పుట్టిన పిల్లల్ని గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తెస్తున్నారు. నగరంలో ఆడ శిశువును రూ.2.5 లక్షలకు, మగ శిశువును రూ 4.5లక్షలకు విక్రయిస్తున్నారు. అయితే, ఛైల్డ్ ట్రాఫికింగ్‌పై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతులని సైతం నిందితులుగా చేర్చారు. -
ఏప్రిల్‌లో ఏఐసీసీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సమావేశాలను ఏప్రిల్ 8, 9వ తేదీల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్లు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనను ఈ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపింది. కీలకమైన చర్చలకు వేదికగానే కాకుండా, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి, దేశం కోసం బలమైన ప్రత్యామ్నాయ దృక్పథ ఆవిష్కరణకు, పార్టీ సమష్టి సంకల్పానికి పునరుద్ఘాటనగా ఉంటాయని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ సమావేశం దేశ వ్యాప్తంగా ఉన్న ఏఐసీసీ ప్రతినిధులను ఒకచోట చేర్చి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లను, రాజ్యాంగం, దాని విలువలపై బీజేపీ చేస్తున్న నిరంతర దాడులను చర్చించి, కార్యాచరణను సిద్ధం చేస్తుంది’అని చెప్పారు. 1924 సమావేశంలో మహాత్మాగాంధీ అధ్యక్ష పదవి చేపట్టిన వందేళ్ల వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన తీర్మానాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉంటాయని తెలిపారు. గాం«దీజీ, బీఆర్ అంబేడ్కర్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరాన్ని గుర్తిచేలా సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్రను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భేటీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాం«దీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాం«దీ హాజరవుతారు. -
కేరళ కల సాకారం.. కష్టానికి తోడైన అదృష్టం.. తొలిసారి రంజీ ఫైనల్లోకి ప్రవేశం
‘ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడి కేరళ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. 68 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... 352 మ్యాచ్‌ల పోరాటం అనంతరం కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న కేరళ జట్టు... తీవ్ర ఉత్కంఠ మధ్య మాజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించి తొలిసారి తుదిపోరుకు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్‌ను వెనక్కి నెట్టిన కేరళ... ఇప్పుడు సెమీఫైనల్లో గుజరాత్‌పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఒక్క పరుగే కదా అని తేలికగా తీసుకుంటే ... ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యర్థికి రుచి చూపింది. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కేరళ జట్టు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. సుదీర్ఘ కాలంగా రంజీ ట్రోఫీ ఆడుతున్న కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ముంబై, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ మాదిరిగా తమ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినా... నిలకడ కనబరుస్తున్నప్పటికీ ఆ జట్టు తుదిపోరుకు మాత్రం అర్హత సాధించలేదు. తాజా సీజన్లో అసాధారణ పోరాటాలు, అనూహ్య ఫలితాలతో ఎట్టకేలకు కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. జమ్మూ కశ్మీర్‌తో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన కేరళ జట్టు... సెమీస్‌లో మాజీ చాంపియన్ గుజరాత్‌పై 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ చిరకాల కల నెరవేర్చుకుంది.నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ చివరి రోజు కేరళ జట్టు అద్భుతమే చేసింది. చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు తుదిపోరుకు అర్హత సాధించాలంటే మరో 29 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఇన్నింగ్స్ కొనసాగించగా... కేరళ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయి మొండిగా పోరాడుతున్న గుజరాత్ బ్యాటర్లు జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్‌లను కేరళ బౌలర్ ఆదిత్య వెనక్కి పంపాడు. ఇంకేముంది మరో వికెట్ తీస్తే చాలు కేరళ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం ఖాయమే అనుకుంటే... ఆఖరి వికెట్‌కు అర్జాన్ నాగ్వస్వల్లా, ప్రియజీత్ సింగ్ జడేజా మొండిగా పోరాడారు.పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన ఈ జంటను చూస్తే ఇక మ్యాచ్ కేరళ చేజారినట్లే అనుకుంటున్న తరుణంలో అర్జాన్ కొట్టిన షాట్ కేరళకు కలిసొచ్చింది. ఆదిత్య వేసిన బంతిని అర్జాన్ బలంగా బాదే ప్రయత్నం చేశాడు. బంతి షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్‌కు తాకి గాల్లోకి లేచి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కెప్టెన్ సచిన్ బేబీ చేతిలో పడింది. అంతే కేరళ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. స్టార్లు లేకుండానే... స్టార్ ఆటగాడు సంజూ సామ్సన్ భారత జట్టులో ఉండగా... అనుభవజ్ఞులైన విష్ణు వినోద్, బాబా అపరాజిత్ వంటి వాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అయినా ఈ సీజన్లో కేరళ జట్టు స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా మిడిలార్డర్లో కెప్టెన్ సచిన్ బేబీతో పాటు సీనియర్ ప్లేయర్ జలజ్ సక్సేనా... యువ ఆటగాళ్లు మొహమ్మద్ అజహరుద్దీన్, సల్మాన్ నిజార్ అసమాన పోరాటం కనబర్చారు.జమ్మూ కశ్మీర్‌తో క్వార్టర్స్ పోరులో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు సల్మాన్, అజహరుద్దీన్ కనబర్చిన తెగువను ఎంత పొగిడినా తక్కువే. 40 ఓవర్లకు పైగా జమ్మూ బౌలర్లను కాచుకున్న ఈ జంట వికెట్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించి తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఒక్క పరుగు ఆధిక్యంతో సెమీఫైనల్‌కు చేరింది.తాజాగా గుజరాత్‌తో సెమీస్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో కేరళ బ్యాటర్లు అసాధరణ ప్రదర్శన కనబర్చారు. సచిన్ బేబీ 195 బంతుల్లో 69 పరుగులు, జలజ్ సక్సేనా 83 బంతుల్లో 30 పరుగులు, అజహరుద్దీన్ 341 బంతుల్లో 177 పరుగులు, సల్మాన్ నిజార్ 202 బంతుల్లో 52 పరుగులు చేసి గుజరాత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముందు నుంచే చక్కటి గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెట్టిన కేరళకు చివర్లో అదృష్టం కూడా తోడవడంతో చక్కటి విజయంతో తొలిసారి రంజీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ చరిత్రలో కేరళ జట్టు ఇప్పటి వరకు అత్యుత్తమంగా 2018–19 సీజన్లో సెమీఫైనల్‌కు చేరింది.నిరీక్షణకు తెరదించుతూ.. తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో కేరళ జట్టు 1957లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫుట్‌బాల్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ వాసులు... క్రికెట్‌ను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో కేరళ క్రికెట్లో అనూహ్య మార్పు వచ్చింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్ స్ఫూర్తితో మరెందరో ఆటగాళ్లు క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నారు.అందుకు తగ్గట్లే గత కొన్నేళ్లుగా కేరళలో క్రీడా మౌలిక వసతులు మరింత మెరుగు పడటంతో ప్రతిభావంతులు వెలుగులోకి రావడం మొదలైంది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. అందుకే శుక్రవారం సెమీస్‌లో కేరళ జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో ప్రసార మాధ్యమాల్లో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా లక్షల్లో పెరిగింది. ప్రతిష్టాత్మక టోర్నీలో కేరళ టీమ్ ఫైనల్‌కు చేరగానే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు... తామే గెలిచినంతగా లీనమైపోయి జట్టును అభినందనల్లో ముంచెత్తారు. మౌలిక వసతుల్లో భేష్.. సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే కేరళలో ఒకప్పుడు నిరంతరం అవుట్డోర్ ప్రాక్టీస్ చేయడం కూడా కష్టతరంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఫస్ట్‌క్లాస్ మైదానాలు అందుబాటులోకి వచ్చాయంటే కేరళ క్రికెట్లో ఎంత పురోగతి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కృషి వల్లే కేవలం పెద్ద నగరాల నుంచే కాకుండా... ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా రంజీ జట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నారు.‘ముంబై, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి ఇతర జట్లతో పోల్చుకుంటే... కేరళ జట్టు ఎంపిక విభిన్నంగా ఉండేది. పరిమితమైన వనరులు మాత్రమే ఉండటంతో అందుబాటులో ఉన్నవాళ్లనే ఎంపిక చేసేవాళ్లం. ముందు ఆ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో అకాడమీలను స్థాపించాం. కేవలం ప్లేయర్లకే కాకుండా కోచ్‌లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒకప్పుడు వర్షం వస్తే ప్రాక్టీస్ ఆగిపోయేది. ఇప్పుడు ఇండోర్‌లోనూ నెట్స్ ఏర్పాటు చేశాం.2005లో రాష్ట్రంలో ఒక్క మైదానంలో కూడా లేదు. ఇప్పుడు మొత్తం 17 ఫస్ట్‌క్లాస్ గ్రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలో లేనంతమంది బీసీసీఐ లెవల్1 కోచ్‌లు కేరళలో ఉన్నారు’ అని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు మాథ్యూ తెలిపారు.కేరళ క్రికెట్ సంఘం కృషి వల్లే స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని... సెమీఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న అజహరుద్దీన్ వెల్లడించాడు. పరస్పర సహకారం, సమష్టితత్వంతో ముందుకు సాగడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నాడు. ఈనెల 26 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తుది పోరులోనూ కేరళ విజయం సాధిస్తే 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన దక్షిణాది జట్టుగా నిలుస్తుంది... ఆల్ ద బెస్ట్ కేరళ..! -
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
గాంధీ నగర్ : గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మురణం పాలయ్యారు. శుక్రవారం కీరా ముంద్రా రహదారి మార్గంలో 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో హైడ్రామా
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) సెమీ ఫైనల్లో హైడ్రామా చోటు చేసుకుంది. గుజరాత్‌తో (Gujarat) జరుగుతున్న తొలి సెమీస్‌లో కేరళ (Kerala) 2 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. రంజీ రూల్స్ ప్రకారం.. మ్యాచ్‌లో ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. గుజరాత్, కేరళ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం కాబట్టి, కేరళ విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరుకుంటుంది.Drama in the Ranji Trophy semifinals🤯pic.twitter.com/o8Bykc8Q4P— CricTracker (@Cricketracker) February 21, 2025కాగా, ఈ మ్యాచ్‌లో గుజరాత్.. కేరళకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. కేరళపై లీడ్ సాధించేందుకు కేవలం మూడు పరుగులు అవసరమైన తరుణంలో గుజరాత్ ఆఖరి ఆటగాడు సగస్వల్లా ఔటయ్యాడు. నగస్వల్లా బౌలర్ ప్రతిభ కారణంగా ఔటై ఉంటే గుజరాత్ అంత ఫీల్ అయ్యేది కాదు. నగస్వల్లా కొట్టిన షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ సల్మాన్ నిజర్ హెల్మెట్‌కు తాకి స్లిప్స్‌లో ఉన్న సచిన్ బేబి చేతుల్లోకి వెళ్లింది. దీంతో నగస్వల్లా పెవిలియన్ ముఖం పట్టాడు. అప్పటివరకు బాగా ఆడిన నగస్వల్లా ఔట్ కావడంతో గుజరాత్ శిబిరంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. తాము ఫైనల్‌కు చేరలేమన్న విషయం తెలుసుకుని గుజరాత్ ఆటగాళ్లు కృంగిపోయారు. తృటిలో గుజరాత్‌కు ఫైనల్ బెర్త్ మిస్ అయ్యింది. ఈ సీజన్లో కేరళను లక్కీ జట్టుగా చెప్పాలి. క్వార్టర్ ఫైనల్లోనూ ఆ జట్టు ఇలాగే స్వల్ప ఆధిక్యంతో (ఒక్క పరుగు) సెమీస్‌కు చేరుకుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.స్కోర్ల విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో అదరగొట్టడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు. -
చరిత్ర సృష్టించనున్న కేరళ.. 91 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి..!
కేరళ క్రికెట్ జట్టు (Kerala Cricket Team) చరిత్ర సృష్టించనుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించనుంది. గుజరాత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో కేరళ 2 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. తద్వారా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆట చివరి రోజు కొనసాగుతుంది. కేరళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం. రంజీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టు విజేత నిలుస్తుంది. తద్వారా కేరళ ఫైనల్‌కు చేరుతుంది.దీనికి ముందు కేరళ కార్టర్ ఫైనల్లోనూ ఇలాగే స్వల్ప ఆధిక్యం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్‌పై ఒక్క పరుగు లీడ్ సాధించింది. ఫలితంగా సెమీస్‌కు అర్హత సాధించింది.1957-58 సీజన్లో తొలిసారి రంజీ బరిలోకి దిగిన కేరళ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేదు. 2018-19 సీజన్లో సెమీస్‌కు చేరినా.. తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. 1957/58కి ముందు కేరళ ట్రావన్‌కోర్-కొచ్చిన్ టీమ్‌గా రంజీల్లో ఆడింది.మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో కదంతొక్కడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు.విదర్భతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో ముంబై ఓటమి అంచుల్లో నిలిచింది. 406 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే మరో 226 పరుగులు సాధించాలి. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌లో ముంబై గెలవడం అసాధ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేయగా.. ముంబై 270 పరుగులకే పరిమితమైంది. కాగా, గత సీజన్ ఫైనల్లో ముంబై.. విదర్భను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.


