Updates: ఎయిరిండియా కీలక నిర్ణయం | Air India Ahmedabad Plane Crash Day 3 Investigation Live Updates | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమాన ప్రమాదం: మూడో రోజు దర్యాప్తు.. లైవ్‌ అప్‌డేట్స్‌

Jun 14 2025 9:57 AM | Updated on Jun 14 2025 5:13 PM

Air India Ahmedabad Plane Crash Day 3 Investigation Live Updates

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగం పెరిగింది. డీజీసీఏతో పాటు దర్యాప్తు సంస్థలు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన శకలాలను తొలగించకూడదని గుజరాత్‌ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్లీనియంగ్‌ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.

AI-171 విమానం నుంచి చివరి సందేశం
విమానంలో పవర్‌ కట్‌ అయిందని..కిందకి పడిపోతున్నట్టు మెసేజ్‌
ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి మేడే కాల్‌లో ఆడియో
విమానంలో పవర్ కోల్పోయామని ఏటీసీకి వెల్లడించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఐదు సెకన్ల ఆడియో
 మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్ అని చెప్పిన కెప్టెన్ సబర్వాల్
ఏటీసీ వద్ద రికార్డయిన ఐదు సెకన్ల ఆడియో

ఎయిరిండియా కీలక నిర్ణయం

  • అహ్మాదాబాద్‌ విమాన ప్రమాద నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం
  • విమానంలో ప్రయాణిస్తున్నన 241 మంది దుర్మరణం
  • భవనంపై విమానం కూలి మెడికోలు, ఇతరులు మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 274
  • ఇక నుంచి ఏఐ-171 విమాన సర్వీస్‌ నిలిపివేత
  • దానికి బదులు ఎయిరిండియా- 159 విమానం
  • ఇక నుంచి లండన్‌కు వెళ్లనున్న ఏఐ-159 సర్వీస్‌ విమానం 

ప్రమాదంపై విచారణ జరుగుతోంది: రామ్మోహన్‌నాయుడు

  • అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ జరిపిన సమీక్ష వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

  • పైలట్‌ మే డే కాల్‌ చేశారు

  • ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లకే ప్రమాదం జరిగింది

  • అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది

  • రెస్క్యూ ఆపరేషన్‌కు గుజరాత్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది

  • బ్లాక్‌ బాక్స్‌ దొరికింది.. డీకోడ్‌ చేస్తున్నారు

  • బ్లాక్‌ బాక్స్‌ విశ్లేషణ ద్వారా ఏం జరిగిందనేది తెలుస్తుంది

  • హైలెవల్‌ కమిటీతో ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది

  • నివేదిక వచ్చాకే బాధ్యులపై చర్యలు ఉంటాయి

  • విమాన ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది

  • 787 సిరీస్‌ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చాం

  • డీఎన్‌ఏ పరీక్షలు పూర్తైన వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాం

పౌర విమానయాన శాఖ సమీక్ష వివరాలు వెల్లడి

  • ఎయిరిండియా విమాన ప్రమాదంపై పౌరవిమానయాన శాఖ సమీక్ష

  • వివరాలు వెల్లడించిన సివిల్‌ ఏవియేషన్‌ అధికారులు

  • Aircraft Accident Investigation Bureau (AAIB) దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులు
  • విమానం 650 అడుగుల ఎత్తు ఎగిరాక కూలిపోయింది
  • పైలట్‌ చివరిసారిగా మే డే కాల్‌ అన్నారు
  • ఆ తర్వాత ఎలాంటి సిగ్నల్‌ అందలేదు
  • మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాం

రంగంలోకి ఎన్‌ఐఏ

  • అహ్మదాబాద్‌ విమాన ప్రమాద స్థలికి జాతీయ దర్యాప్తు సంస్థ

  • కుట్ర కోణం నేపథ్యంతో విచారణ జరుపుతున్న ఎన్‌ఐఏ

  • క్షుణ్ణంగా పరిశీలనలు జరుపుతున్న బృందం

బోయింగ్‌ ట్రాజెడీ పాపం ఎవరిది?

  • తనిఖీ, నిర్వహణ లోపమే కారణమా?
  • డీజీసీఏ హెచ్చరికలను ఎయిరిండియా పట్టించుకోలేదా? 
  • వైమానిక ఇంధనం కలుషితం అయ్యిందా? 
  • ఎందుకు గాల్లో ఎగరలేక పోయింది? 
  • టేకాఫ్‌ సెట్టింగుల్లో లోపం, పైలట్‌ తప్పిదమే కారణం?
  • ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి అంతు చిక్కడం లేదా?
  •  దర్యాప్తులో తేలాల్సిన విషయాలెన్నో


క్లిక్‌ చేయండి:  రెండు ఇంజన్లు విఫలమవడం అత్యంత అసాధారణం!
 

అహ్మదాబాద్‌ ప్రమాద ఘటన.. మరికాసేపట్లో పౌర విమానయాన శాఖ సమీక్ష

కీలకంగా డిజిటల్‌ ఆధారాలు

  • అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు

  • భవన శిథిలాల నుంచి ఇప్పటికే బ్లాక్‌ బాక్స్‌ స్వాధీనం

  • బ్లాక్‌ బాక్స్‌ విశ్లేషిస్తే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలిసే అవకాశం

  • డిజిటల్‌ వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్న గుజరాత్‌ ఏటీఎస్‌ 

  • ఫోరెన్సిక్స్‌ సైన్స్‌ ల్యాబ్‌కు డీవీఆర్‌ను పంపిన అధికారులు

బోయింగ్‌ ట్రాజెడీ ఫైల్స్‌

  • అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు
  • ప్రాథమికంగా.. ఎయిర్‌క్రాఫ్ట్‌​ యాక్సిడెంట్‌ కమిటీ దర్యాప్తు
  • కేంద్రం తరఫున.. నిపుణులతో హైలెవల్‌ కమిటీ దర్యాప్తు
  • డీజీసీఏ విచారణ కూడా
  • భారత్‌లో బోయింగ్‌ విమానాల తనిఖీలు
  • ప్రత్యేక అడిటింగ్‌కు ఆదేశించిన కేంద్రం

👉ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు.. విమానం నేరుగా బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనంపై కూలడంతో అందులోని వాళ్లు కూడా మరణించారు. దర్యాప్తు నేపథ్యంలో మెడికల్‌ కాలేజీ భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 

👉ఎయిరిండియా బోయింగ్‌ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య శనివారం ఉదయానికి 274కి చేరింది. 

👉విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉండగా.. 241 మంది మరణించారు. విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రుడు రమేష్‌ను ప్రధాని మోదీ సైతం పరామర్శించారు. 

👉గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానం (AI171) అహ్మదాబాద్‌  సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌ గాట్విక్‌ వెళ్తుండగా.. టేకాఫ్‌ అయిన కొద్ది సెకన్లకే మెఘాని ప్రాంతంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. 

👉మే డే కాల్‌ ఇచ్చిన పైలట్‌ ఆ వెంటనే విమానాన్ని క్రాష్‌ ల్యాండ్‌ చేశారు. ఆ ధాటికి విమానం భారీ శబ్దం చేస్తూ పేలిపోగా.. 1000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ధాటికి ప్రయాణికులు ఖాళీ మసైపోయారు. 

👉ప్రయాణికులతో పాటు జనావాసాలపై కుప్పకూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది

👉విమాన ప్రమాదం ఎందుకు జరిగిందనేదానిపై కొనసాగుతున్న విచారణ

Plane Crash: పెరుగుతున్న మృతుల సంఖ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement