సమాజ ఐక్యతే ఆర్‌ఎస్‌ఎస్ ఏకైక లక్ష్యం
మోహన్ భగవత్ స్పషీ్టకరణ
ముంబై: సమాజాన్ని ఐక్యంగా ఉంచాలన్నదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) లక్ష్యమని సంస్థ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. అంతేతప్ప, ఆర్‌ఎస్‌ఎస్ ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదు, అధికారాన్ని కోరుకోదు, ప్రభావాన్ని చూ పాలనీ అనుకోదు అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ఉన్న అనైక్యత తదితర అనేక బలహీనతలను గమనించిన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారన్నారు.
సంస్థ అవతరించి వందేళ్లయిన సంద ర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. సమాజాన్ని ఐక్యంగా ఉంచడమనే కర్త వ్యాన్ని మినహా మరే పనినీ ఆర్‌ఎస్‌ఎస్ చేపట్టబోదన్నారు. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత ఇక మరే ఇతర ఎజెండా ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉండదని భగవత్ చెప్పారు. ‘అన్ని మతాలను గౌరవించాలని నిర్ణయించుకోవడానికి కారణం మనం హిందువులం కావడమే.
హిందూ ధర్మంలో ఉన్న సహనం వల్లే భారత్ ఇప్పటికీ భిన్నత్వంలో ఏక త్వాన్ని చాటుతోంది. హిందూ భావ విస్మరణ వల్లే దేశం ముక్కలైంది. అంటే, హిందువులు తమ సాంస్కృతిక, ధార్మిక మూలాలను లేదా ఐక్యతను మర్చిపోవడం వల్లే విభజన అడ్డుకోలేకపోయాం’అని ఆయన వివరించారు. దేశంలో ఇస్లాం, క్రైస్తవ మతాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలుజరుగుతున్నప్పటికీ, దేశం మాత్రం ఐక్యంగానే ఉందన్నారు.
ఈ ఐక్యతకు కారణం మన దేశ ప్రాథమిక హిందూ స్వభావమేనని ఆయన నొక్కి చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ వల్లే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారంటూ కొందరు భావిస్తున్నారన్న ఆయన.. మోదీ రాజకీయ పారీ్టకి నా యకత్వం వహిస్తుండగా ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారన్న విషయం గమనించాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయాలతో ఎటువంటి సంబంధం ఉండదని స్ప ష్టం చేశారు. అదేవిధంగా, హిందూభావాన్ని మ ర్చిపోయిన ఫలితంగానే దేశ విభజన జరిగిందని భగవత్ అభిప్రాయపడ్డారు. చర్చలు జరపనిదే ఆర్‌ఎస్‌ఎస్ గురించి అర్థం కాదని పేర్కొన్నారు.


