పాకిస్తాన్‌లో దాడి.. ఐఎస్‌ సంచలన ప్రకటన | IS Sensational Statement On Pakistan Incident | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో దాడి.. ఐఎస్‌ సంచలన ప్రకటన

Feb 8 2026 7:13 AM | Updated on Feb 8 2026 11:36 AM

IS Sensational Statement On Pakistan Incident

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో షియాలకు చెందిన మసీదులో శుక్రవారం జరిగిన భారీ ఆత్మాహుడి దాడికి తామే కారణమని ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)శనివారం ప్రకటించుకుంది. ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా, 169 మంది గాయపడటం తెల్సిందే. తమ బాంబర్‌ను మసీదు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో, వారిపైకి కాల్పులు జరిపి లోపలున్న వారికి సమీపంలోకి వెళ్లి పేల్చేసుకున్నాడని తెలిపింది.

ఇదే సమయంలో సిరియాలో షియా సాయుధ గ్రూపులకు పాకిస్తాన్‌ మానవ వనరుగా మారిందని, ఇక్కడి నుంచే రిక్రూట్లు జరుగుతున్నాయని ఆరోపించింది. అందుకే తాము పాకిస్తాన్‌లోని షియాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని తెలిపింది. ఇలా ఉండగా, శుక్రవారం నాటి ఆత్మాహుతి దాడికి కీలక సూత్రధారి సహా నలుగురిని ఖైబర్‌ ప్రావిన్స్‌లోని పెషావర్, నౌషేరాల్లో అరెస్ట్‌ చేసినట్లు పాక్‌ అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో లభ్యమైన గుర్తింపు కార్డు ఆధారంగా ఆత్మాహుతి బాంబర్‌ను పెషావర్‌కు చెందిన యాసిర్‌గా గుర్తించామన్నారు. ఇతడు ఐదు నెలలపాటు అఫ్గానిస్తాన్‌లో ఉండి ఆయుధాల వినియోగంతోపాటు ఆత్మాహుతి దాడులకు శిక్షణ తీసుకున్నాడన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement