కత్తిపోట్ల కలకలం.. రష్యాలో భారతీయ విద్యార్థులపై దాడి | Indian Students Suffer Injuries In Russia Latest | Sakshi
Sakshi News home page

కత్తిపోట్ల కలకలం.. రష్యాలో భారతీయ విద్యార్థులపై దాడి

Feb 8 2026 12:55 AM | Updated on Feb 8 2026 3:05 PM

Indian Students Suffer Injuries In Russia Latest

రష్యాలో కత్తిపోట్లు హడలెత్తించాయి. ఇందులో నలుగురు భారత విద్యార్థులు గాయపడ్డారు. అరెస్ట్ చేసే క్రమంలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అయింది. దీని గురంచి రష్యాలోని భారత ఎంబసీ ట్వీట్ కూడా చేసింది.

అసలేం జరిగిందంటే?
బాష్కోరోస్థాన్ రిపబ్లిక్‌లో ఉన్న స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లోకి కత్తితో ప్రవేశించిన యువకుడు.. అక్కడున్న విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. అరెస్ట్ చేయాలని ప్రయత్నించిన పోలీసులపై కూడా తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా తనని తాను కూడా గాయపరుచుకున్నాడు. ఈ విషయాల్ని అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. క్షతగాత్రులతో పాటు సదరు యువకుడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ సంఘటనపై స్పందించిన రష్యాలోని భారత ఎంబసీ కార్యాలయం.. బాధితుల్లో నలుగురు భారత విద్యార్థులు ఉన్నట్లు ట్విటర్‌లో క్లారిటీ ఇచ్చింది. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని తెలిపింది. కజాన్‌లోని భారత కాన్సులేట్ అధికారులు.. విశ్వవిద్యాలయానికి బయలుదేరారని, బాధిత విద్యార్థులకు సహకారం అందిస్తారని తెలియజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement