కౌలాలంపూర్: రెండు రోజుల పర్యటన నిమిత్తం.. ప్రధాని నరేంద్ర మోదీ మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు చేరుకున్నారు. ఆయనకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల జెండాలతో చిన్నారులు ప్రధాని మోదీకి అభివాదం చేశారు. అనంతరం, ఎయిర్ పోర్టు నుంచి మోదీ, అన్వర్ ఇబ్రహీం కలిసి ఒకే కారులో ప్రయాణించారు. కౌలాలంపూర్ లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ నృత్యంతో మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు
కాగా, భారత్-మలేషియా మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' మరింత పటిష్టం చేయడమే ప్రధాని పర్యటన సాగుతోంది. రక్షణ, భద్రత, ఆర్థిక బంధాల బలోపేతంపై ఇరు దేశాల దృష్టి పెట్టారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రక్షణ, భద్రత, ఆర్థిక, ఆవిష్కరణల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
From airport to community meet: PM Modi shares car ride with Malaysia's PM Anwar, reflecting personal rapport
Read @ANI Story | https://t.co/ZzlEW7jXby#PMModi #Malysia #bilatiralvisit #AnwarIbrahim pic.twitter.com/vgOnvrbQjd— ANI Digital (@ani_digital) February 7, 2026
2024లో ఇరు దేశాల మధ్య కుదిరిన 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయి పెంపు తర్వాత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. భారతీయ సంతతి ప్రజలు ఇరు దేశాల మధ్య 'సజీవ వారధి'గా నిలుస్తున్నారని, వారి చారిత్రక స్నేహానికి వారే బలమైన స్తంభాలని ప్రధాని మోదీ కొనియాడారు.


