ముంబై మేయర్‌గా రీతూ తావ్డే? | BJP Has Selected Ritu Tawde As Their Mumbai Mayor Candidate After Strong BMC Poll Performance | Sakshi
Sakshi News home page

ముంబై మేయర్‌గా రీతూ తావ్డే?

Feb 7 2026 2:17 PM | Updated on Feb 7 2026 2:45 PM

The BJP has selected its Mumbai mayor candidate

మహాయుతి కూటమి  ముంబై మేయర్‌ అభ్యర్థిపై సందిగ్దత వీడింది. మేయర్ పదవికి బీజేపీకి చెందిన రీతూ తావ్డే అభ్యర్థిగా నామినేషన్ వేసింది. డిప్యూటీ మేయర్ పదవికి శివసేన (శిండే) అభ్యర్థి సంజయ్ శంకర్ గాదీని నిలిపింది. వీరి ఎంపిక దాదాపు లాంఛనమే కానుంది. బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా, శివసేన శిండే 29 చోట్ల గెలుపొందింది. 

బృహత్ ముంబయిలో మెుత్తం 227 మున్సిపల్ కార్పోరేషన్ స్థానాలకు ఎన్నికలు జరిగగా మహాయుతీ కూటమి 118 స్థానాల్లో గెలుపొంది స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాగా ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ప్రస్తుతం బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసిన రీతూ తావ్డే 132 వార్డు అభ్యర్థిగా గెలుపొందారు. 2012లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. గత పాతికేళ్లుగా ముంబై పీఠం శివసేన చేతుల్లో ఉంది. ఈ సారి ఆ పార్టీ కేవలం 65 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. బృహత్ ముంబై దేశంలోనే అతిపెద్ద కార్పోరేషన్ దీని గతేడాది బడ్జెట్ రూ.74,450 కోట్లుగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement