‘నిజమైన ప్రేమికుడు వికృత చేష్టలు చేయడు’ | No true lover would indulge in taking photographs of intimate scenes and blackmail | Sakshi
Sakshi News home page

‘నిజమైన ప్రేమికుడు వికృత చేష్టలు చేయడు’

Feb 7 2026 1:07 PM | Updated on Feb 7 2026 1:16 PM

No true lover would indulge in taking photographs of intimate scenes and blackmail

కర్ణాటక: నిజమైన ప్రేమికుడు ఎప్పటికీ వికృత చేష్టలు చేయడని హైకోర్టు పేర్కొంది. ప్రేమ నెపంతో మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ముందస్తు బెయిల్‌ నిరాకరించింది.  ప్రియుడొకరు తన ప్రియురాలితో కలిసిన ప్రైవేట్‌ క్షణాలను ఫోటోలు తీసి లైంగిక క్రియకు డిమాండ్‌ చేశాడు. 

ఈ విషయమై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముందస్తు బెయిల్‌ కోరుతూ ప్రియుడు హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ వీ.శ్రీషానందతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపి బెయిల్‌ ఇవ్వటానికి నిరాకరించింది. నిజమైన ప్రేమికుడు తన ప్రియురాలితో కలిసిన ప్రైవేట్‌ క్షణాల దృశ్యాలను ఫోటోలు తీయరని, అటువంటి ఫోటోలను చూపించి లైంగిక క్రియకు బలవంతం చేయరని హైకోర్టు అభిప్రాయపడింది.    

Advertisement
 
Advertisement
Advertisement