మహిళా అధికారిణి బెడ్‌రూంలో రహస్య కెమెరాలు.. | Three Arrested In Karnataka For Secretly Filming Woman Officer And Blackmailing Her, More Details Inside | Sakshi
Sakshi News home page

మహిళా అధికారిణి బెడ్‌రూంలో రహస్య కెమెరాలు..

Feb 7 2026 12:55 PM | Updated on Feb 7 2026 1:23 PM

 Secret Camera Bulb Holder in karanataka

కర్ణాటక: విలేకరుల ముసుగులో మహిళా అధికారిణి బెడ్‌రూం వీడియో దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి వాటిని చూపి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ముగ్గురిని బెళగావి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. సదరు మహిళ ప్రైవేట్‌ దృశ్యాలు ఉన్న వీడియో చిత్రీకరించుకొని ఆ మహిళను విలేకరుల పేరుతో బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.50 లక్షలు డిమాండ్‌ చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్తతో పాటు ముగ్గురు నిందితులను బెళగావి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. 

గోకాక్‌ జలాల్‌ గల్లి నివాసి సమీర్‌ నిస్సార్‌ అహ్మద్‌ షేక్‌ (32), గోకాక్‌ తాలూకా యోగికొళ్ల నివాసి అబ్దుల్‌ రఫీక్‌ నజీర్‌ అహ్మద్‌ మకాందార్‌(51), గోకాక్‌ తాలూకా ఘటప్రభ నివాసి మహమ్మద్‌ దిలావర్‌ బాళెకుంద్రి(43) అరెస్ట్‌ అయిన నిందితులు. ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో ఇంటి తలుపునకు వేసిన తాళం చెవిని ఆ పక్కన పెట్టే విషయాన్ని పొరుగింటి వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు.

బల్బు హోల్డర్‌లో సీసీ కెమెరా అమర్చి.. 
దుండగులు రహస్యంగా బల్బు హోల్డర్‌లో సీసీ కెమెరా అమర్చి ఆ మేరకు ఆమె ప్రైవేట్‌ దృశ్యాలను చిత్రీకరించుకొని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాతో పాటు న్యూ చానల్‌లో వైరల్‌ చేస్తామంటూ బెదిరించారు. అలా వైరల్‌ చేయకూడదంటే రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మహిళకు బ్లాక్‌ మెయిల్‌ చేసిన వారిపై బెళగావిలోని మాళమారుతి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నిందితులు ముగ్గురిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 3 మొబైల్స్, 64 జీబీ పెన్‌డ్రైవ్, 6 హిడెన్‌ కెమెరా హోల్డర్లు, ఐక్యూ జెడ్‌ఎక్స్, రెండు ఓటీజీ, రెండు మెమరి కార్డులు, రీడర్లు, 128 జీబీ 8 మెమరి కార్డులు, ఒక టోయోటా ఇన్నోవా క్రిస్టా కారును పోలీసులు జప్తు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టారని బెళగావి నగర పోలీస్‌ కమిషనర్‌ భూషణ్‌ బోర్సే మీడియాకు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement