breaking news
Karnataka
-
సౌకర్యాలు అందించాలని డిమాండ్
శ్రీనివాసపురం: కార్మికులకు వివిధ సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేస్తూ బహుజన సంఘటనల సమాఖ్య కార్యకర్తలు మంగళవారం ముళబాగిలు నగరంలోని మిని విధాన సౌధ ముందు ప్రతిఘటన నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య సంస్థాపక అధ్యక్షుడు సంగసంద్ర విజయ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నాణ్యమైన సేఫ్టీకిట్లు ఇవ్వాలని కోరారు. కార్మికులకు పింఛన్లు, పిల్లలకు విద్యార్థి వేతనాలను సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు అందిస్తున్న రూ.3 వేల పింఛన్‌ను రూ.5 వేలకు పెంచాలని సూచించారు. బాల కార్మికులను గుర్తించి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కొండప్పకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సంచాలకురాలు నాగమణి, రాష్ట్ర సంచాలకుడు యల్లేష్, జిల్లా సమన్వయ సంచాలకుడు తాయలూరు చరణ్ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తకూడదు కోలారు: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామిలింగారెడ్డి అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నగరంలోని జిల్లా పంచాయతీ సభాంగణంలో నిర్వహించిన ప్రగతి పరిశీలన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. తాగునీటి సమస్యతో పాటు, వ్యవసాయం, ఎత్తినహొళె తదితర పథకాల సమగ్ర అభివృద్ధిపై చర్చించారు. కొత్తగా వేసిన బోరుబావులకు మోటారు పంపులను అమర్చి విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని సూచించారు. కార్యక్రమంలో నేతలు ఎస్ఆర్ మెహరాజ్ ఖాన్, శివకుమార్, ఎమ్మెల్యేలు కొత్తూరు మంజునాథ్, కె.వై.నంజేగౌడ, ఎస్.ఎన్.నారాయణ స్వామి, వెంకటశివారెడ్డి, రూపా శశిధర్, సమృద్ధి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులను పర్మినెంట్ చేయాలి
రాయచూరు రూరల్: కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించడంతో పాటు వారిని పర్మినెంట్ చేసి సక్రమంగా సౌకర్యాలు, కార్మికుల నమోదు, రెన్యువల్, ఆరోగ్య భాగ్య, విద్యా, విశ్రాంతి పింఛను, ఇతర పథకాలను కార్మికులకు అందించాలని కోరుతూ స్థానికాధికారి దేశాయికి వినతిపత్రం సమర్పించారు. హాస్టల్ వార్డెన్‌పై చర్యలు చేపట్టండి రాయచూరు రూరల్: డాక్టర్ అంబేడ్కర్ హాస్టల్ వార్డెన్ ప్రేమలతపై చర్యలు చేపట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంచాలకుడు రాజు డిమాండ్ చేశారు. మంగళవారం డాక్టర్ అంబేడ్కర్ హాస్టల్ జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహించే వారితో ఇతర పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. వారికిచ్చే కేవలం రూ.10 వేల గౌరవధనంతో కార్యాలయాల్లో పనులు మాత్రమే చేయించుకోకుండా స్వంత పనులకు వినియోగించుకోవడాన్ని ఖండించారు. ఈ విషయంలో వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. గ్రామాల్లో శాంతిని కాపాడాలి రాయచూరు రూరల్: దేశానికి స్వాతంత్య్రం లభించి దశాబ్దాలు గడుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శాంతిని కాపాడాలని గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ నింగప్ప, ఎస్ఐ తిమ్మణ్ణ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాల నివారణపై జరిగిన శాంతి సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ప్రతి చిన్న విషయాలకు గొడవలు పడకుండా శాంతియుతంగా రాజీ ప్రక్రియ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. బాగల్కోటెలో 500 మీటర్ల జెండావిష్కరణ రాయచూరు రూరల్: దేశానికి స్వాతంత్య్రం లభించిన ఆగస్టు 15న జెండా పండుగ చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం బాగల్కోటెలో 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండాతో నగరంలోని పలు వీధుల్లో సంచరించారు. ఆరోజున మైదానాల్లో పరేడ్, జెండా ఎగురవేయనున్న నేపథ్యంలో ప్రజల్లో జాగృతి కల్పించడానికి బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రదర్శించారు. హత్య కేసు నిందితుల అరెస్ట్‌కు వినతి రాయచూరు రూరల్: పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు అమరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. వారం రోజుల క్రితం దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హద్దినాళ వద్ద బీఎస్పీ, దళిత కార్యకర్త భూమానందపై గొడ్డళ్లతో దాడి చేసి చంపిన కేసుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అరకొరగా నిందితులను అరెస్టు చేశారన్నారు. ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
కరియమ్మదేవికి జ్యోతుల ఉత్సవాలు
అగళి: మండలంలోని అలూడి గ్రామంలో వెలసిన కరియమ్మ దేవికి మంగళవారం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జ్యోతుల ఉత్సవాలు నిర్వహించారు. మహిళలు జ్యోతులను ఊరేగింపుగా తీసుకెళ్లి కరియమ్మదేవి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కురిసి పంటలు పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని కరియమ్మదేవిని ప్రార్థించారు. అర్చకులు భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు. ఘనంగా మారెమ్మ దేవతకు జ్యోతుల ఉత్సవాలు అగళిలో వెలసిన మారెమ్మ దేవతకు మంగళవారం అగళి, ఎంఎం పాళ్యం, రామాపురం గ్రామాల ప్రజలు జ్యోతుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉపవాసదీక్షతో మహిళలు జ్యోతులను తలపై ఉంచుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మడకశిర : పట్టణంలో మంగళవారం గ్రామ దేవతలు ఊరు మారెమ్మ, ముత్యాలమ్మ, ఉడుసలమ్మ, తుమ్మల మారమ్మ, కొల్లాపురమ్మ, గంగ పూజ, దండి మారమ్మ, మూలకంఠేశ్వరమ్మ, కన్యకా పరమేశ్వరి తదితర గ్రామ దేవతలకు జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప, ఎస్ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్ రెడ్డి తదితరులు అమ్మవార్లకు పూజలు జరిపారు. రైతు విభాగం, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శులు రామిరెడ్డి, నాగభూషణరెడ్డి, పట్టణ కన్వీనర్ ఓంకుమార్, ఎస్సీ సెల్ కార్యదర్శి తిప్పేస్వామి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రంగనాథ్, సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షుడు నగేష్, ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడు ధను, పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు రఘునందన్, పట్టణ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ స్వామి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు హరీష్ పాల్గొన్నారు. గుడిబండ: కొంకల్లు గ్రామంలో మంగళవారం గ్రామదేవత మారెమ్మ దేవికి జ్యోతుల ఉత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి పలు రకాల పూజలు చేపట్టారు. అనంతరం మహిళలు గ్రామ పురవీధుల్లో జ్యోతులతో ఊరేగింపుగా వచ్చి మారెమ్మదేవికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలూడిలో జ్యోతుల ఉత్సవాలు నిర్వహిస్తున్న దృశ్యం మడకశిరలో అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్న ఈరలక్కప్ప -
ఘనంగా మారెమ్మ జాతర
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని హిరిసావెలో మంగళవారం మారెమ్మ దేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేప చెట్టు దగ్గర మారెమ్మ దేవి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి, జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాదిగ సముదాయానికి చెందిన 40 కుటుంబాలవారు అమ్మవారి హారతిని తలపై మోస్తూ ఊరేగించారు. గతంలో ఏటా మేము తుమకూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న మా గ్రామాలకు వెళ్లి పండుగను జరిపేవారమని, ఇప్పుడు ఇక్కడే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సౌధ ముందు స్వరాజ్య హబ్బ బనశంకరి: ఆగస్టు 15న నగరంలో విధానసౌధ ఆవరణలో ఫ్రీడం హబ్బకు ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో స్వాతంత్య్ర ఉత్సవాలను ఇక్కడ తొలిసారి జరపబోతున్నారు. ఈ సందర్భంగా బాలలు, వారి తల్లిదండ్రులు విధానసౌధలోనికి వెళ్లి అక్కడి వాస్తుశిల్ప వైభవాన్ని కూడా వీక్షించడానికి అనుమతిస్తారు. ఇందుకోసం పాస్‌లను అందిస్తారు. పిల్లల కోసం సౌధలో మక్కళమేళా, ఆటలు, కథలు, చేనేత హస్తకళలుతో పాటు కుటుంబ వినోద కార్యక్రమాలను ఆ రోజంతా నిర్వహిస్తామని మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. ఆరోజు విధానసౌధ సందర్శనను ప్రతి విద్యార్థి తమ జీవితంలో అపరూపమైన జ్ఞాపకంగా దాచుకోవాలనేది తమ ఆశయమన్నారు. టూరిస్టు బస్సు ఢీ, మహిళా ఉద్యోగిని మృతి మైసూరు: టూరిస్ట్ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఓ మహిళ అక్కడికక్కడే మరణించిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకాలోని మధువనహళ్లి వద్ద జరిగింది. మృతురాలు గ్రామ శివార్లలోని ఎస్వీఎస్ శీకాయపొడి ఫ్యాక్టరీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న కొళ్లెగాలవాసి దాక్షాయణి (47). ఆమె టీవీఎస్ మోపెడ్‌లో ఇంటి నుంచి ఫ్యాక్టరీకి వెళుతుండగా ఘటనాస్థలిలో తమిళనాడు వైపు నుంచి వస్తున్న టూరిస్ట్ బస్సు ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడే కన్నుమూసింది. డీఎస్పీ మోహన్, సీఐ రవీంద్ర, ఎస్ఐ సుప్రీత్ చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్వాధీనపరచుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ప్రదోష్ అప్రూవర్ సాక్ష్యం వాయిదాబనశంకరి: రేణుకాస్వామి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు ప్రదోష్ సాక్ష్యం నమోదును ఒక వారం పాటు నిలిపివేయాలని 2వ నిందితుడు దర్శన్ తరఫు న్యాయవాదులు కోరగా, 59వ సీసీహెచ్కోర్టు సమ్మతించింది. ప్రదోష్‌ను అప్రూవర్‌గా పరిగణించే ముందు సహ నిందితుల వాదనలు ఆలకించాలని దర్శన్ వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించారు. పరప్పన అగ్రహార జైలు నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా దర్శన్, పవిత్రాగౌడ, ప్రదోష్ విచారణలో పాల్గొన్నారు. ప్రదోష్పై హత్య, కిడ్నాప్ అభియోగాలు ఉన్నాయని దర్శన్ వకీలు వాదించారు. బెదిరింపుల వెనుక మహిళ? రేణుకాస్వామి హత్యకేసులో 49వ సాక్షి సందీప్‌ను కొందరు దుండగులు ఇటీవల కిడ్నాప్ చేసి బెదిరించారనే ఘటన వెనుక ఓ ప్రముఖ మహిళ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. కిడ్నాపర్ పునీత్‌కు సదరు మహిళ ఫోన్ ద్వారా దిశా నిర్దేశం చేసిందని కాల్ డేటా రికార్డుల ద్వారా గుర్తించారు. ఈ కేసులో కామాక్షిపాళ్య పోలీసులు పునీత్, సుహాస్, వేణులను అరెస్ట్‌చేశారు. గౌరవ్‌శెట్టి, కిరణ్‌కు విచారణకు రావాలని నోటీసులిచ్చారు. నమామి వాయుపుత్రా శ్రీనివాసపురం: ముళబాగిలులోని పురాణ ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సుప్రభాత సేవ, తదితర పూజలు కొనసాగాయి. మూల విరాట్టును విశేషంగా అలంకరించి అర్చించారు. ఆలయంలో ఉన్న వెంకటేశ్వరస్వామి, గోవిందరాజ స్వామి , వరద రాజస్వామి విగ్రహాలకు ప్రత్యేక అలంకారం, పూజలు జరిగాయి. ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్‌తో పాటు వందలాది భక్తులు దర్శనం చేసుకున్నారు. -
ఖరీఫ్‌లో నీటి విడుదలకు పచ్చజెండా
వరద నీటితో నిండుకుండలా తొణికిసలాడుతున్న తుంగభద్ర డ్యాం ఐసీసీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు తదితరులు కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న రైతు సంఘం నాయకులుసాక్షి,బళ్లారి: ఎట్టకేలకు వరుణుడి కృపా కటాక్షాలతో తుంగభద్ర డ్యాంలోకి ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు సరిపడేంతగా 80 టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేరడంతో తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని లక్షలాది ఎకరాలకు ఖరీఫ్‌లో సాగు చేసే పంటలకు నీటిని విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని పలు జిల్లాలకు సాగు, తాగునీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాం నుంచి ఆయకట్టు పరిధిలో కర్ణాటక కోటా కింద నీటి విడుదలకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో మంత్రులు, అధికారులు ఈ మేరకు తీర్మానం తీసుకున్నారు. మంగళవారం కొప్పళ జిల్లా మునిరాబాద్ వద్ద నిర్వహించిన ఐసీసీ(నీటిపారుదల సలహా సమితి) ఆధ్వర్యంలో సంబంధిత మంత్రి శివరాజ్ తంగడిగి అధ్యక్షతన జరిగిన, మంత్రి నాగేంద్ర, ఎమ్మెల్యేలు గణేష్, రాఘవేంద్ర హిట్నాల్, అధికారులు, రైతు సంఘం నాయకులు దరూరు పురుషోత్తం గౌడ తదితరులు పాల్గొన్న సమావేశంలో కాలువలకు నీటి విడుదలకు సంబంధించిన అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. డ్యాంలో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత ఆధారంగా కాలువలకు ఏమేరకు నీరు విడుదల చేయాలన్న దానిపై స్పష్టత ఇచ్చారు. కాలువలకు నీటి విడుదల వివరాలివే.. తాగునీటి అవసరాలకు నీటిని నిల్వ ఉంచుకుని డ్యాం నుంచి ఖరీఫ్ పంటల సాగుకు ఆయకట్టుకు నీరు విడుదల చేసేందుకు అన్ని విధాలుగా అనుమతులు ఇచ్చారు. ఐసీసీ సమావేశంలో ఈ మేరకు కాలువలకు నీరు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. తుంగభద్ర ఎడమ గట్టు ప్రధాన కాలువ(ఎల్‌బీఎంసీ) కాలువకు ఆగస్టు 11వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ప్రతి రోజు 4100 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల పాటు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. తుంగభఽద్ర కుడి గట్టు ప్రధాన కాలువ (హెచ్ఎల్సీ)కు కూడా నవంబర్ 10 వరకు 90 రోజుల పాటు ప్రతి రోజు 1200 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని తీర్మానించారు. తుంగభద్ర కుడి గట్టు దిగువ కాలువ(ఎల్ఎల్సీ)కు నవంబర్ 10వ తేదీ వరకు ప్రతి రోజు 650 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. రాయబసవణ్ణ కాలువకు డిసెంబర్ 10 వరకు ప్రతి రోజు 180 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని తీర్మానం చేశారు. నదీ పరివాహక ప్రాంతాలకు ఆగస్టు 17వ తేదీ వరకు ప్రతి రోజు 500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నీటి విడుదల కోసం రైతుల ధర్నా ఈసారి ఖరీఫ్ సీజన్లో ఆయకట్టు రైతులకు పంటలు పూర్తిగా చేతికందే వరకు నీరు విడుదల చేయాలని, ఆమేరకు ఐసీసీ సమావేశంలో తీర్మానం చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మునిరాబాద్‌లో నిర్వహించిన ఐసీసీ సమావేశంలో కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి, ఏఐకేకేఎంఎస్ ప్రముఖులు గుర్రళ్లి రాజు తదితరులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన, ఆందోళన చేపట్టారు. వర్షాభావంతో ఖరీఫ్‌లో పంటలు సాగు చేయలేక పోయామన్నారు. ఇప్పటికే సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. ఇక తుంగభద్ర ఆయకట్టుపై మాత్రమే రైతులు నమ్ముకుని జీవిస్తున్నారన్నారు. ఈసారి తుంగభద్ర ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. డ్యాంలో నీరు వృథా చేయకుండా ఫ్యాక్టరీలకు అనవసరంగా నీరు విడుదల చేయకుండా రైతుల ప్రయోజనాల కోసం నీరు విడుదల చేయాలని ఒత్తిడి చేశారు. తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర జిల్లాలతో పాటు, పొరుగున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆయా జిల్లాలకు కూడా దామాషా ప్రకారం అన్ని ప్రాంతాల రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నీరు విడుదల చేయాలని ఒత్తిడి చేశారు. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో రైతులకు శుభవార్త అన్ని ప్రధాన కాలువలకు నవంబర్ 10 వరకు సాగునీరు -
సేవే పరమార్థం, అవినీతి అమానుషం
బనశంకరి: ‘మనందరి ప్రధాన ఉద్దేశం ప్రజాసేవ. అందరూ కలిసి టీమ్ కర్ణాటక అనే లక్ష్యంతో ప్రజాసేవ చేద్దాం’ అని అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం డీకే.శివకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం విధానసౌధ బ్యాంక్వెట్ హాల్లో ప్రభుత్వ ఉద్యోగులతో నేరుగా, జిల్లాల ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఐదున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు 7 కోట్ల మంది ప్రజలకు సేవచేసే భాగ్యం దక్కిందన్నారు. అవినీతిని సహించేది లేదని, ఇందులో రాజీ ప్రశ్నే లేదన్నారు. అధికారులు, ఉద్యోగుల ప్రతి ఒక్కరి కదలికలపై తమకు సమాచారం ఉంటుందని, నిఘా వ్యవస్థ ఉందని తెలిపారు. మనిషి కడుపు నిండడానికి ఎంత తిండి అవసరమంటూ, అవినీతికి పాల్పడరాదని సూచించారు. ప్రజా సమస్యలను తీర్చాలి ప్రతి ఒక అధికారి, ఉద్యోగి పనిచేసే కేంద్ర స్థానంలో ఉండాలి, ప్రజా సమస్యల పట్ల స్పందించాలి. ప్రజలు కార్యాలయాలకు వచ్చినప్పుడు సకాలంలో పనులు చేయాలి, చట్టపరిధిలో విధులు నిర్వర్తించాలని సీఎం ఆదేశించారు. ఆలస్యం లేకుండా ప్రజలకు ప్రభుత్వ సౌలభ్యాలను అందించాలి, స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి, వాయిదాలు వేయరాదని చెప్పారు. దేశంలో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచిందని, మీ కష్టాన్ని మెచ్చుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అద్యక్షుడైన షడక్షరి ఉద్యోగులకు గ్యారంటీ పథకాలు వద్దని చెప్పడం అభినందనీయమన్నారు. పేదలకు గ్యారంటీ పథకాలు సక్రమంగా అమలయ్యేలా మీరు పనిచేయాలని కోరారు. ఆఫీసులకు ప్రజలు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు గౌరవం ఇవ్వాలని తెలిపారు. పల్లెల్లో యువ జోడో సంఘాలు జిల్లా ఇన్చార్జ్ మంత్రులు నెలకు రెండుసార్లు తాలూకాలకు వెళ్లి ప్రజా సమస్యలను ఆలకించి పరిష్కారం చేయాలన్నారు. ప్రతి పంచాయతీలో భారత్ జోడో యువకుల సంఘాన్ని ఏర్పాటు చేస్తామని, యువతకు ఉపయోగకరంగా ఉంటుందని సీఎం తెలిపారు. గ్యారంటీ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని, దానిని అరికట్టాలన్నారు. ఇంజనీర్లు బోగస్ బిల్లులు చేస్తున్నారు, అది మానేయాలని సూచించారు. కాగా, నూతన మంత్రులకు వెంటనే శాఖలు కేటాయిస్తామని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పరమేశ్వర్, మంత్రులు, ఐఏఎస్‌లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం డీకే హితబోధ విధానసౌధలో సమావేశం -
ఘనంగా రేణుకా యల్లమ్మ రథోత్సవం
బళ్లారిటౌన్: నగరంలోని సంగనకల్లు రోడ్డులోని సుబ్బారావు క్యాంప్‌లో వెలసిన శ్రీరేణుకా యల్లమ్మ దేవి ఆలయ 5వ రథోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు, వివిధ ధార్మిక కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం సాయంత్రం ఆలయం నుంచి కళా బృందాలతో రథోత్సవాన్ని స్థానిక ఎదురు బసవన్న ఆలయం వరకు లాగారు. ఈ ఉత్సవాలకు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. చిన్నారిని చిదిమేసిన స్కూల్ వాహనం హుబ్లీ: స్కూల్ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన వాహనం దూసుకెళ్లడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ధార్వాడ జిల్లా అళ్నావర తాలూకా ఉల్లికేరి గ్రామంలో చోటు చేసుకుంది. మృత చిన్నారిని ఉల్లికేరి గ్రామ నివాసి ల్కుమాన్ బేగూరుగా గుర్తించారు. మంగళవారం స్కూలు పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన స్కూల్ వాహనం ఉల్లికేరి గ్రామంలో ఉన్న వేళ రోడ్డు పక్కన నిలబడిన చిన్నారి ల్కుమాన్పైకి దూసుకెళ్లింది. ఫలితంగా చిన్నారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు హుబ్లీ: స్థానిక అల్తాఫ్ ప్లాట్‌లో ఇంటి ముందు ఆటలాడుతున్న మూడేళ్ల బాలుడు అజాన్‌పై నాలుగైదు వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని హుబ్లీ కిమ్స్ ఆస్పత్రి ఐసీయూ విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో లక్ష్మి పూజలు రాయచూరు రూరల్: ఆషాఢ మాసం చివరి రోజున గౌళి సమాజం ఆధ్వర్యంలో లక్ష్మి పూజలను నెరవేర్చారు. మంగళవారం ఎల్‌వీడీ కళాశాల వద్ద వెలసిన లక్ష్మిదేవి ఆలయంలో 75వ అమృత మహోత్సవ జాతర సందర్భంగా కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి వీరశివాచార్య ప్రత్యేక పూజలు చేపట్టారు. అభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, మహా మంగళ హారతిలను నెరవేర్చారు. కార్యక్రమంలో విశ్వనాథ్, లక్ష్మణ్, ఈరేశ్, రాము, శాంతప్ప, ఆంజనేయలున్నారు. ఆరోగ్య రంగానికి పెద్దపీటరాయచూరు రూరల్: ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత కల్పించాలని విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడారు. ట్రామా కేర్ కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతగా చేపట్టాలని సూచించారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్నారు. తాలూకాలోని ఆర్‌హెచ్ క్యాంప్‌లో తాగునీటి ఎద్దడి నుంచి ప్రజలకు విముక్తి కల్పించారు. క్యాంప్ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి మంగళవారం తాగునీటి ట్యాంకులను ప్రారంభించి నీటి సౌకర్యం కల్పించారు. మొబైల్స్ అతిగా వినియోగిస్తే అనర్థాలు కోలారు: మొబైల్స్ అతిగా వినియోగిస్తే అనర్థాలు చోటుచేసుకుంటాయి. పిల్లలను మొబైల్స్‌కు దూరంగా ఉంచాలని ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి జయశ్రీ తెలిపారు. మంగళవారం నగరంలోని పాల సంద్ర లేఅవుట్లో జిల్లా న్యాయవాదుల సంఘం, నలంద విద్యా నికేతన్ ఆధ్వర్యంలో న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మౌలిక హక్కులు, కర్తవ్యాలు, పోక్సో చట్టాలు, గృహ హింస చట్టంపై అవగాహన కల్పించారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో సంస్కృతి సాంప్రదాయాలకు దూరం అవుతుండటం విచారకరమన్నారు. నేడు చిన్న వయసులోనే పిల్లలకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవల ప్రాధికార సభ్యుడు, సివిల్ న్యాయమూర్తి నీలాచారి బడిగేర, నలంద విద్యా నికేతన్ కార్యదర్శి టీ.ఆర్.జయరాం తదితరులు పాల్గొన్నారు. -
13న రాష్ట్ర బంద్ తథ్యం
● వాటాళ్ నాగరాజ్ ప్రకటన హుబ్లీ: తమిళనాడుకు కావేరి జలాల విడుదలను వ్యతిరేకిస్తూ ఈ నెల 13న కన్నడ సంఘాల ఒక్కూట రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది, దీంతో బంద్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. వానలు వచ్చి నీటిని వదలడంతో పెద్ద సమస్య ఎదురుకాలేదు. ఇంతలోనే రోజూ ఓ టీఎంసీ దాకా విడుదల చేయాలని తాజాగా కావేరి కమిటీ రాష్ట్రాన్ని ఆదేశించడంతో పరిస్థితి వేడెక్కింది. ఎవరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా కన్నడ సంఘాల ప్రముఖ నాయకుడు వాటాళ్ నాగరాజ్ మాత్రం బంద్ నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆయన మంగళవారం హుబ్లీలో కేసీ కూడలిలో కన్నడ సంఘాల నేతతో కలిసి ధర్నా చేశారు. కళసా బండూరి నీటి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ, ముందు అనుకున్నట్లు 13వ తేదీ గురువారం రాష్ట్ర బంద్ చేపట్టడం తథ్యమని చెప్పారు. కావేరి జల వివాదం మాత్రమే కాకుండా కావేరిపై మేకెదాటు ప్రాజెక్ట్ అమలు, ఉత్తర కర్ణాటక జీవనాడి మహదాయి ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యంపై కూడా న్యాయం లభించాలని, అందుకు పోరాటం అనివార్యమని వాటాళ్ ప్రకటించారు. -
దళితులంటే బీజేపీకి గిట్టదు
సాక్షి,బళ్లారి: దళితులంటే బీజేపీకి గిట్టదు, దళితులు రాజకీయంగా ఎదిగితే బీజేపీ సహించలేదని మంత్రి బీ.నాగేంద్ర పేర్కొన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వాల్మీకి అభివృద్ధి మండలిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు మంత్రి పదవి ఇవ్వడంతో బీజేపీ నాయకులు ఆగ్రహంతో ఉండటంతో పాటు నాగేంద్రకు వ్యతిరేకంగా అసెంబ్లీలో, బయటా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో తాము గట్టిగా సమాధానం చెబుతామన్నారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఈ విషయంపై సమాధానం చెప్పారన్నారు. సీఎంతో పాటు మంత్రులంతా ఈ విషయంపై అసెంబ్లీలోనే సమాధానం చెబుతామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, పేదలకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అవినీతిలో నా పాత్ర ఏమీ లేదు వాల్మీకి అభివృద్ధి మండలిలో జరిగిన అవినీతికి సంబంధించి డబ్బులు తిరిగి చెల్లించారని, అందులో తన పాత్ర ఏమీ లేదన్నారు. తప్పు చేసి ఉంటే న్యాయస్థానం తనకు శిక్ష వేస్తుందన్నారు. తాను దోషిని కాదని గుర్తు చేశారు. న్యాయాలయంపై తనకు నమ్మకం ఉందన్నారు. తాను ఆరోపణల నుంచి పూర్తిగా కడిగిన ముత్యంలా బయట పడతానన్నారు. ఢిల్లీ, తిరుపతి, షిర్డీ, కామాఖ్య తదితర దేవాలయాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాను కోర్టు అనుమతి తీసుకొని వెళ్లానన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా బీజేపీ వారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనకు ఏ శాఖ అప్పగించినా బాధ్యతాయుతంగా పని చేస్తానన్నారు. ఈసారి తాను ఫలానా శాఖే తనకు కావాలని పట్టుబట్టడం లేదన్నారు. అసెంబ్లీలోనే తగిన జవాబు చెబుతాం ఏ శాఖ ఇచ్చినా బాధ్యతగా పని చేస్తా బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే, మంత్రి నాగేంద్ర -
క్రికెట్ టోర్నీ షురూ
కోలారు: యువనాయకుడు మురళీగౌడ నిర్వహిస్తున్న సామాజిక సేవలు శ్లాఘనీయమని మాజీ సీఎం సిద్దరామయ్య మీడియా సలహాదారు కేవీ ప్రభాకర్ అన్నారు. మంగళవారం తాలూకాలోని సీతిహోసూరు గ్రామంలో మురళీగౌడ నేతృత్వంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. యువకులు మొబైల్‌కు పరిమితం కాకుండా ఆటల్లో ముందుండాలన్నారు. దేవరాజ్, రఘుపతి, మద్దేరి పీఎల్డీ బ్యాంకు ఉపాధ్యక్షుడు వెంకటరాం తదితరులు పాల్గొన్నారు. బీఈఓగా బాధ్యతల స్వీకరణ కోలారు: ముళబాగిలు తాలూకా నూతన బీఈఓగా జీ.ఆర్.శంకరేగౌడ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం నగరంలోని బీఈఓ కార్యాలయంలో తాలూకా ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జీ.ఆర్.శంకరేగౌడను పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తాలూకా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు కే.వీ.జగన్నాథ్ మాట్లాడుతూ.. సంఘం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. తాలూకాలోని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఎం.సీ.రఘునాథ్, శారదా ఎయిడెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ స్వామి, ఉపాధ్యాయుల సంఘం గౌరవ అధ్యక్షుడు నాగరాజ్, కోశాధికారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యుల ర్యాలీ హోసూరు: డాక్టర్లకు, నర్సులకు రక్షణ కల్పించాలని, వైద్యులపై దాడులను అరికట్టాలని మంగళవారం ఉదయం అభయ దినాన్ని ఆచరిస్తూ ర్యాలీ చేశారు. పట్టణంలోని గుణం ఆస్పత్రి యంత్రాంగంచే ఏర్పాటు చేసిన ఈ చైతన్య ర్యాలీలో 250 మందికి పైగా డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు. డాక్టర్లపై దాడులు తగదంటూ నినాదాలు చేశారు. వివిధ ఆస్పత్రులకు చెందిన డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు. -
కూలీల సజీవ సమాధి
బనశంకరి: కూలీలు పనుల్లో ఉండగా పై నుంచి పెద్దమొత్తంలో మట్టి విరిగి పడడంతో సజీవ సమాధి అయ్యారు. బెంగళూరు నగరంలోని కంఠీరవ స్టూడియో ముందు భాగంలో అండర్‌పాస్ నిర్మాణం కోసం తవ్వుతున్న భారీ గుంత ఓ వైపు కూలడంతో ఇద్దరు కార్మికులు మట్టిదిబ్బల్లో చిక్కుకుని మరణించారు. ఎఫ్టీఐ సర్కిల్ వద్ద అండర్‌పాస్ కోసం సుమారు 20 అడుగుల లోతు, అంతకంటే ఎక్కువ వెడల్పుతో గొయ్యిని తవ్వుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆరేడు మంది కార్మికులు మట్టి తవ్వే పనుల్లో ఉండగా, ఓ వైపు మట్టి కూలి వారి మీద పడిపోయింది. ఐదుమంది కార్మికులు చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది, నందినీలేఔట్ పోలీసులు చేరుకుని మట్టిని తీసి సదానంద్, సునీల్, ఇర్మియాజ్ అనే కూలీలను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. సోనారామ్ (26), పరిమళ్ (31) అనే కూలీలు మట్టిలో చిక్కుకుని ఊపిరొదిలారు. ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? అని గాలిస్తున్నారు. విరిగిపడ్డ అండర్‌పాస్ గుంత మట్టి బెంగళూరు కంఠీరవ స్టూడియో వద్ద ప్రమాదం ఇద్దరు మృతి, ముగ్గురికి విషమం అధికారుల నిర్లక్ష్యమే: ఎమ్మెల్యే జీబీఏ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణమని ఎమ్మెల్యే కే.గోపాలయ్య మండిపడ్డారు. ఘటనాస్థలిని పరిశీలించి మాట్లాడుతూ ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, మరో ఇద్దరు లోపలే చిక్కుబడినట్లు తెలుస్తోందన్నారు. గాయపడిన ముగ్గురిని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి అవుతున్నారని, వర్షాకాలం సమయంలో ఇలాంటి భారీ అండర్‌పాస్ పనులు ఎవరైనా చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది చిన్న డ్రైనేజీ పనికాదని, నిలిచిన వాననీటిని తొలగించినప్పుడు ఈ దుర్ఘటన సంభవించిందని తెలిపారు. ఈ పనులు నిలిచిపోతే తన ఒత్తిడితో 2023 నుంచి మళ్లీ ప్రారంభించారని చెప్పారు. -
అనివార్యంగా రాజీనామా చేశా
హుబ్లీ: అనివార్యంగా విధాన పరిషత్ స్పీకర్ పదవికి రాజీనామా చేసినట్లు బసవరాజ్ హొరట్టి పేర్కొన్నారు. ఆయన మంగళవారం నగరంలో మీడియాతో మాట్లాడారు. అనివార్యంగా తాను రాజీనామ పత్రంపై సంతకం చేశానన్నారు. ఈ నెల 14న సమావేశంలో అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేసిన తర్వాత రాజీనామ చేస్తానన్న ఒప్పందం నాకు, సీఎం డీకే.శివకుమార్ మధ్య జరిగింది. రాజీనామా పత్రం కూడా సిద్ధం చేశాను. ఈ నెల 7న గాయత్రి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. ఈ క్రమంలో సీఎంతో పాటు పలువురు తన కార్యాలయంలోకి వచ్చారు. అప్పుడు సీఎం ఇప్పుడే రాజీనామా చేయాలని కోరారు. ఈ నెల 14న రాజీనామ చేస్తానని చెప్పినా కూడా అలా కుదరదు. ఇప్పుడే రాజీనామా చేయాలని తనను కోరారన్నారు. దీంతో అనివార్యంగా తాను రాజీనామా పత్రంపై సంతకం చేసి ఇచ్చానన్నారు. వారిపై ఒత్తిళ్లకు గల కారణం ఏమిటో తనకు తెలియదు. నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు సీఎం ఫోన్ చేసి రాజీనామా ఇవ్వాలని కోరారు. మాపై ఒత్తిడి ఉంది, అందువల్ల రాజీనామా చేయాలని సీఎం కోరారన్నారు. 1956 నుంచి ఇప్పటి వరకు స్పీకర్ స్థానం అవిశ్వాస తీర్మానంతో, అధికార గడువు ముగియకుండానే రాజీనామా ఇప్పించలేదని బసవరాజ్ హొరట్టి ఒకింత ఆగ్రహం, ఆవేదనతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
మనకే నీళ్లు లేకుంటే.. ఎలా?
మండ్య: కావేరి నదిపైనున్న జలాశయాల నుంచి తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 16 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ కమిటీ ఇచ్చిన ఆదేశాలపై నగరంలో రైతులు, వివిధ సంఘాల కార్యకర్తలు రోడ్లపైకొచ్చారు. జయ చామరాజేంద్ర ఒడెయార్ సర్కిల్లో హైవే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. కావేరి జల కమిటీలు, తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కావేరీ పరివాహక ప్రాంతాల్లో పొలాలకు నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయాయి, ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా కేరళ, కొడగు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఎంతో కొంత ప్రవాహం పెరిగింది, ఆ వానలు కూడా తగ్గాయి, వర్షాలు కురుస్తాయనే అంచనాలు కూడా లేవు, ఈ పరిస్థితుల్లో తమిళనాడుకు ఎలా నీటిని విడుదల చేయగలరు? అని రైతు నేతలు ప్రశ్నించారు. కేఆర్‌ఎస్‌లో 30 టీఎంసీలే కేఆర్ఎస్ డ్యాంలో సుమారు 30 టీఎంసీలు మాత్రమే నీరుందని, ఇందులో 16 టీఎంసీలను తమిళనాడుకు విడుదల చేస్తే, మా రైతుల పంటలకు నీరు వద్దా? అని రైతునేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్, జలవనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డి, అధికారుల్లో కనీస ఆందోళన కూడా లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పొలాలకు ఎంత నీరు కావాలో, తాగునీటికి ఎంత అవసరమో అనే గణాంకాలను కావేరీ జల కమిటీ ముందు ఉంచడంలో వారు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రతిసారీ ప్రాణాంతకమైన ఉత్తర్వులు అందుతున్నాయని వాపోయారు. తమిళనాడుకు నీరు అందించరాదని రైతులు నేతలు స్పష్టంచేశారు. ఒకవేళ వదిలితే.. ప్రజలు, రైతులు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తారని హెచ్చరించారు. మండ్యలో రైతు నేతల ధర్నా -
ప్రైవేటుకు దీటుగా సర్కారు బడి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యగంలో విద్యా రంగానికి ఉన్న ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రైవేట్ కాన్వెంట్లు, పాఠశాలల వైపు అధికంగా ఆకర్షితులవుతున్న తరుణంలో సర్కారు పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిన దిద్దిన వైనం వెలుగులోకి వచ్చింది. ఉత్తర కళ్యాణలోని విజయపుర జిల్లా బబలేశ్వర తాలూకా మమదాపురలో టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన కర్ణాటక పబ్లిక్ పాఠశాలను, పాఠశాలలో సైన్సు ల్యాబరేటరీ, నూతన గదులను జిల్లా ఇంచార్జి మంత్రి ఎంబీ పాటిల్ అధికారులతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రతిభా వికాసానికి ఆధునిక తరగతి గదులు, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన బోధన సామగ్రి నిర్వహణకు రూ.6 లక్షల నిధులు కేటాయించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆడుకోడానికి ప్రత్యేకంగా పార్కు, ఇతర పరికరాలను అమర్చారు. మంత్రి చేతుల మీదుగా ప్రారంభం విజయపురలో ఏర్పాటు చేసిన వైనం -
కావేరి.. ఏదీ దారి?
బనశంకరి: కన్నడనాట కావేరి నదీ జలాశయాల్లో అరకొరగా నీరున్న తరుణంలో, తమిళనాడుకు రానున్న 15 రోజుల పాటు నిత్యం 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరి జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్సీ) తాజాగా మంగళవారం ఆదేశించడం అన్ని వర్గాలకూ కలవరాన్ని కలిగిస్తోంది. ఢిల్లీలో నిర్వహించిన కమిటీ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల ముఖ్య అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. వాదనలు వినిపించినా.. కర్ణాటక అధికారులు రాష్ట్ర వాస్తవ పరిస్థితిని ఏకరువు పెట్టారు. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయని, గత రెండు వారాల నుంచి అంతంతంగా వానలు పడడంతో జలాశయాలకు ఆశించినమేర నీరు చేరలేదని తెలిపారు. మాకు తాగునీరే లేదని, పంట పొలాలకు కాలువలకు నీరు వదలాలని రైతులు కోరుతున్నా, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నీరు వదలడం లేదని కమిటీకి వివరించారు. మా ప్రాంతానికే నీరు లేని సమయంలో తమిళనాడుకు వదలడం ఎలా అని పేర్కొన్నారు. తమిళనాడు అధికారులు వాదిస్తూ ఈ సీజన్లో చాలా తక్కువ నీటిని ఇచ్చారని, తమ ప్రాంతం అవసరాలను వివరించారు. ఉభయుల వాదనలను ఆలకించి కమిటీ పెద్దలు.. తమిళనాడుకే మొగ్గు చూపారు. దీంతో కర్ణాటక అధికారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరి డీకేశి ప్రభుత్వం రోజూ టీఎంసీ నీటిని విడుదల చేస్తుందా?, కావేరి అథారిటీకి అప్పీల్ చేస్తుందా, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు కన్నడ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు సన్నాహాలు చేస్తున్నాయి. తమిళనాడుకు 15 రోజులు.. నిత్యం 1200 క్యూసెక్కులు వదలాలి కర్ణాటకకు సీడబ్ల్యూఆర్సీ ఆదేశం కన్నడ, రైతు సంఘాల్లో ఆగ్రహం డీకే సర్కారుకు సంకటస్థితి మరోసారి కావేరి జలాల పంపిణీ ఆదేశం ఉరుము లేని పిడుగులా పడింది. రాష్ట్రంలో వానలు వచ్చినట్లే వచ్చి ముఖం చాటేసిన క్లిష్ట సమయంలో తమిళనాడుకు ఉదారంగా జలాలను పంపిణీ చేయాలనే ఉత్తర్వు.. సర్కారుతో పాటు రైతు, కన్నడ సంఘాలకు ఉలికిపాటుకు గురిచేసింది. దీంతో తిరిగి నిరసనలు భగ్గుమనే అవకాశం పొంచి ఉంది. -
‘రాము.. ఇంటికి రా..!’ అర్ధరాత్రి ప్రియుడికి భార్య ఫోన్
కర్ణాటక: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను చంపి అతని మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టిన దారుణ ఘటనలో 6 నెలల తర్వాత సదరు నిందితురాలు పోలీసుల వలలో చిక్కింది. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కడక్లాట్లో ఈ దురంతం చోటు చేసుకుంది. వివరాలు.. రఘు గవాడే(40) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య బంగారి గవాడే, ప్రియుడు రాము రాణా నిందితులు. గత ఫిబ్రవరి 7న రాజు గవాడేను హత్య చేసి, భర్త పని కోసం వేరే ఊరికి వెళ్లాడని అందరినీ కిరాతక భార్య నమ్మించింది. బంగారి గవాడేకు రాము రాణాతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యపై అనుమాన పడుతూ రఘు ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న రాత్రి మద్యం తాగి వచ్చి ఘర్షణ పడ్డాడు. దీంతో ఆక్రోశానికి గురైన భార్య ప్రియుడు రామును పిలిపించి గాఢ నిద్రలో ఉన్న రఘు గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం అర్ధరాత్రి టాటాఏస్ వాహనంలో పొలానికి శవాన్ని తరలించి దాచిన నిందితులు ఫిబ్రవరి 8న చెరకు చేనులో గొయ్యి తీసి శవాన్ని పాతిపెట్టారని దర్యాప్తులో తేలింది. ఘటనపై కడక్లాట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. -
వైద్యులు దేవుళ్లతో సమానం
సాక్షి,బళ్లారి: ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడే వైద్యులు దేవుళ్లతో సమానం అని, అలాంటి వైద్యులను మనందరం గౌరవించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే నారా సూర్య నారాయణరెడ్డి, మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. వైద్యుల దినోత్సవం–2026ను పురస్కరించుకుని నగరంలోని బసవ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. వివిధ రంగాల్లో రాణించిన వారితో పాటు ఇటీవల నీట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన వారిని సన్మానించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ వైద్యుల దినోత్సవం రోజున మాత్రమే వారిని సన్మానించి, గౌరవించడం కాకుండా, నిత్యం వారి సేవలను గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ వృత్తి ఎంతో పవిత్రమైంది, డబ్బుల కోసమే పని చేయకుండా సేవాదృక్పథంతో పని చేయాలని వైద్యులకు సూచించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ బీ.కే.సుందర్, యోగానందరెడ్డి, భరత్, మల్లికార్జున, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి ఐఎంఏ బళ్లారి బ్రాంచికి వ్యక్తిగతంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించి అందజేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. -
గంజాయి విక్రేత అరెస్ట్
హుబ్లీ: స్నాక్స్ ప్యాకెట్లలో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న నిందితుడిని బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యమ్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలేజీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బోలు ప్రజాప్రతి అనే వ్యక్తి స్నాక్స్ ప్యాకెట్లలో గంజాయి నింపి చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.54 వేల విలువ చేసే 6 కేజీల గంజాయి, ఓ ఫోన్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వేతనాలు అందించాలని ర్యాలీ రాయచూరు రూరల్: కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ఏఐటీయూసీఐ ర్యాలీ చేపట్టింది. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. కార్మికుల నమోదు ప్రక్రియ, రెన్యువల్, ఆరోగ్య భాగ్య, విద్యా, విశ్రాంతి పింఛన్, ఇతర పథకాలను గురించి కార్మికులకు వివరించాలన్నారు. రాష్ట్ర సర్కార్ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించేందుకు తోడు వారిని పర్మినెంట్ చేసేలా సర్కార్ చర్యలు చేపట్టి వారికి సౌకర్యాలు సక్రమంగా అందేలా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. -
నందిగిరుల్లో శివోహం
చిక్కబళ్లాపురం: ఆషాఢ మాసం చివరి సోమవారం కావడంతో ఇక్కడి ప్రసిద్ధ నంది కొండల ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో జరిగింది. వేలాది మంది ప్రజలు శివనామస్మరణ చేస్తు నందిగ్రామంలోని భోగనందీశ్వర ఆలయంలో మహాశివున్ని దర్శించుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. చిక్కబళ్లాపురం, దొడ్డబళ్లాపురం, బెంగళూరు, తుమకూరు, గౌరిబిదనూరు, విజయపుర, కోలారు తదితర ప్రాంతాల నుంచి భక్తజనం తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరు పాల్గొన్నారు. 16 కిలోమీటర్లు సుమారు 16 కి.మీ మేర గిరి ప్రదక్షిణ జరగ్గా ఓం నమః శివాయ అని నామస్మరణ చేస్తు నడక సాగించారు. మధ్య మధ్యలో కొందరు కళింగర పండ్లు, పానీయాలను భక్తులకు అందజేశారు. నందిగ్రామం నుండి కారహళ్లి క్రాస్ మీదుగా గాంధీగ్రామం నుంచి కణివె బసవణ్ణ ఆలయానికి వచ్చారు. అక్కడ బసవణ్ణ స్వామిని దర్శించుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి భోగనందీశ్వర ఆలయానికి చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ సమాప్తమైంది. భక్తిశ్రద్ధలతో ఆషాఢ సోమవార గిరి ప్రదక్షిణ పాల్గొన్న వేలాది భక్తులు -
కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తగదు
రాయచూరు రూరల్: లోక్‌సభలో ప్రతిపక్షాలకు విలువ లేదని, కేంద్ర పాలకులు ఏకపక్ష నిర్ణయాలతో తీర్మానాలు చేస్తున్నారని నగరంలో పలు కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో కార్మిక నేతలు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, విద్యుత్ చట్టం ఇతర మూడు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. రైతు, కార్మిక, దళిత, మహిళా, విద్యార్థి, యువత వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జిల్లాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తుండగా ఆందోళనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించి తరలించారు. ఆందోళనలో శరణ బసవ, వీరేష్, పద్మ, కరియప్ప, వరలక్ష్మిలున్నారు. -
కొత్త మంత్రుల శాఖలు ఖరారు
శివాజీనగర: రాష్ట్ర మంత్రివర్గంలో చిన్న చిన్న మార్పులు, నూతన మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ ఆదివారం రాత్రి ఢిల్లీలో హైకమాండ్ నాయకులతో చర్చలు జరిపారు. దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం ఉదయం ఏఐసీసీ నేత వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. మహిళలకు మంత్రి పదవులు కట్టబెట్టడానికి చిన్నపాటి పునర్వ్యవస్థీకరణ చేయాలని అనుకున్నట్లు తెలిసింది. గురువారం నుంచి శాసనసభా వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా, ఆరోజుకల్లా శాఖలను ప్రకటించడం అనివార్యం. అందువల్ల ఆ పనిమీద దృష్టి సారించారు. మంత్రి పదవులు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడానికి ఏం చేయాలనేది చర్చకు వచ్చింది. మంత్రి పదవులు కోల్పోయిన ఎమ్మెల్యేలకు అవే పీఠాలు దక్కే చాన్సు దాదాపు లేదని, బోర్డుల, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులతో బుజ్జగించాలని భావిస్తున్నారు. నూతన మంత్రులకు ఈ శాఖలు కొత్త మంత్రులు బసవరాజ రాయరెడ్డి న్యాయ– అసెంబ్లీ వ్యవహారాలు; ఎస్.ఎస్.మల్లికార్జున– ఉద్యానవన, మైనింగ్; ఎన్.చలువరాయస్వామి– వ్యవసాయం; ఎం.శివలింగేగౌడ– గృహవసతి; లక్ష్మణ సవది– సహకార, చక్కెర; మధు బంగారప్ప– ప్రాథమిక విద్యాశాఖ, జమీర్ అహ్మద్‌ఖాన్– మైనార్టీ, హజ్ శాఖ; కే.ఎన్.బసవంతప్ప– చేనేత, వస్త్ర పరిశ్రమ, వ్యవసాయ మార్కెటింగ్; అజయ్‌సింగ్– చిన్న పరిశ్రమలు; రుద్రప్ప లమాణి– ఎకై ్సజ్, హెచ్.సీ.బాలకృష్ణ– అటవీ, సైన్స్, పర్యావరణం; రిజ్వాన్ హర్షద్– ఉన్నత విద్య, పుట్టరంగశెట్టి– పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ; బి.నాగేంద్ర– మత్స్య, ఓడరేవులు; సంతోష్ ఎస్.లాడ్– కార్మిక శాఖ, శివరాజ్ తంగడగి– బీసీ సంక్షేమం, కన్నడ– సంస్కృతి; టి.రఘుమూర్తి– ఎస్సీ సంక్షేమ శాఖలు ఖరారైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలలోగా శాఖలు: సీఎం కోలారు: రాబోయే శాసనసభ సమావేశాలలోగా నూతన మంత్రులకు పోర్టుపోలియోల కేటాయింపు జరుగుతుందని, ఢిల్లీలో చర్చలు పూర్తయ్యాయని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం మాలూరు తాలూకాలో సాధన సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మరో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తామని తెలిపారు. బిడది టౌన్షిప్ వద్దంటూ ప్రతిపక్షాలు చేస్తున్న పాదయాత్ర రాజకీయ లబ్ధి కోసమే తప్ప రైతులపై ప్రేమతో కాదని అన్నారు. పాదయాత్రలో రైతులు ఎవరూ లేరని, పక్క నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను పిలిపించి పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. టౌన్‌షిప్‌ను గతంలో వారి ప్రభుత్వమే ప్రారంభించి మధ్యలో వదిలేస్తే, దానినే తాము కొనసాగిస్తున్నామమని, ఇదేమీ కొత్త పథకం కాదని అన్నారు. శాఖల కేటాయింపు ఓ కొలిక్కి!కేసులు లేనివారెవరు? ● మంత్రి నాగేంద్రకు సీఎం డీకే అండ శివాజీనగర: వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ నిధుల స్వాహా కేసులో నిందితునిగా ఉన్న బి.నాగేంద్రకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఆరోపణలు చేస్తుండగా, కేసులు లేనివారెవరు? అని సీఎం డీకే శివకుమార్ అన్నారు. సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన, దేశంలో కేసులు లేనివారున్నారా?, బెయిల్ పొంది మంత్రులుగా కొనసాగడం లేదా? అని ప్రశ్నించారు. హెచ్.డీ.కుమారస్వామికి బెయిల్ రాలేదా అన్నారు. నాగేంద్ర కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కర్ణాటకను విడిచి వెళ్లాడనేది తన దృష్టికి రాలేదన్నారు. పరిషత్ సభాపతి బసవరాజ్ హొరట్టి స్వయంగా తన వద్దకు వచ్చి రాజీనామా చేస్తానని చెప్పారని, సగౌరవంగా రాజీనామాను ఆమోదించామని తెలిపారు. ఆయన తప్పుకోకపోతే తామే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేవాళ్లమని తెలిపారు. మంత్రి యూ.టీ.ఖాదర్, తాను గవర్నర్‌ను కలసి పూర్తి వివరణ ఇచ్చామన్నారు. బీజేపీ తమ పార్టీలోని సీనియర్ నాయకులను వేధిస్తోందని హైకమాండ్, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేబినెట్లో చిన్నపాటి మార్పులు సీఎం ఢిల్లీ చర్చల్లో నిర్ణయం పాత మంత్రులకు మార్పులు పాత మంత్రుల్లో ఒకరిద్దరి శాఖలు మారినా మారవచ్చు. ముగ్గురు మంత్రులు సాంఘిక సంక్షేమ శాఖను కోరుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి యూ.టీ.ఖాదర్, పట్టణాభివృద్ధి మంత్రి యతీంద్ర సిద్దరామయ్యల శాఖల్ని పరస్పరం మారుస్తారని తెలిసింది. యతీంద్ర ఆరోగ్యశాఖను కోరినట్లు తెలిసింది.14న స్పీకర్ ఎన్నిక బనశంకరి: విధానసభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 14వ తేదీ జరుగుతుందని లోక్‌భవన్ నుంచి ప్రకటన వెలువడింది. అసెంబ్లీ సమావేశాలు 13 నుంచి ప్రారంభమవుతాయి. మరుసటి రోజు ఎన్నిక జరుగుతుంది. అంతవకు సీనియర్ ఎమ్మెల్యే టీబీ.జయచంద్ర ప్రొటెం స్పీకర్‌గా ఉంటారు. స్పీకర్‌గా రోణ ఎమ్మెల్యే జీఎస్.పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా ఏఎస్.పొన్నణ్ణ ఖరారయ్యారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
హబ్లీ: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను చంపి అతని మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టిన దారుణ ఘటనలో 6 నెలల తర్వాత సదరు నిందితురాలు పోలీసుల వలలో చిక్కింది. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కడక్లాట్లో ఈ దురంతం చోటు చేసుకుంది. వివరాలు.. రఘు గవాడే(40) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య బంగారి గవాడే, ప్రియుడు రాము రాణా నిందితులు. గత ఫిబ్రవరి 7న రాజు గవాడేను హత్య చేసి, భర్త పని కోసం వేరే ఊరికి వెళ్లాడని అందరినీ కిరాతక భార్య నమ్మించింది. బంగారి గవాడేకు రాము రాణాతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యపై అనుమాన పడుతూ రఘు ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న రాత్రి మద్యం తాగి వచ్చి ఘర్షణ పడ్డాడు. దీంతో ఆక్రోశానికి గురైన భార్య ప్రియుడు రామును పిలిపించి గాఢ నిద్రలో ఉన్న రఘు గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం అర్ధరాత్రి టాటాఏస్ వాహనంలో పొలానికి శవాన్ని తరలించి దాచిన నిందితులు ఫిబ్రవరి 8న చెరకు చేనులో గొయ్యి తీసి శవాన్ని పాతిపెట్టారని దర్యాప్తులో తేలింది. ఘటనపై కడక్లాట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. తమ సంతోషానికి అడ్డుగా ఉన్నాడని అక్కసుతో అకృత్యం ఆరు నెలల తర్వాత పోలీసులకు పట్టుబడిన వైనం -
కేబుల్ కట్ చేసి.. సేవలు ఆటంకపరిచి..
● నిందితుడి అరెస్ట్ హుబ్లీ: ఇంటర్నెట్ కేబుల్ కట్ చేసి ప్రభుత్వ సేవలకు ఆటంకం కలిగించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. హుబ్లీ ఉణకల్ నివాసి అనిల్ సురేష్గిరిని అరెస్ట్ చేశారు. నరగుంద ఆయిల్ మిల్ క్రాస్ దగ్గర టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ ఆఫ్టికల్ ఫైబర్ నెట్వర్క్ కేబుల్‌ను అమర్చారు. ఈ ఇంటర్నెట్ టెలికామ్ సేవలకు ఆటంకం కలిగించే దురుద్దేశంతో నిందితుడు అనిల్ తదితరులు గత జూన్ 18న నెట్వర్క్ కేబుల్ కట్ చేశారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల సేవలు పూర్తిగా స్తంభించాయి. గత నెల 20న నవలగుంద తాలూకా గొబ్బారగుంపి దగ్గర ఏరియల్– 2 అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా కట్ చేయడంతో 9 గంటల పాటు నెట్వర్క్ స్తంభించి రూ.వేలాదిగా నష్టం వాటిల్లింది. కేసును తీవ్రంగా పరిగణించిన నరగుంద సీఐ సత్యప్ప నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల డంప్ స్వాధీనం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా హొసహళ్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచిన గోదాముపై అధికారులు దాడి చేసి మొత్తం 216 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్ల మొత్తం విలువ రూ.4,38,306గా అంచనా వేశారు. ఈ కేసులో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు హొసహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. క్రీడలు మనోధైర్యాన్ని నింపుతాయి రాయచూరు రూరల్ : క్రీడాకారులు క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తే మనోధైర్యాన్ని నింపుతాయని మాజీ మంత్రి బోసురాజు పిలుపునిచ్చారు. ఆదివారం మహాత్మ గాంధీ ఇండోర్ క్రీడా మైదానంలో రాయచూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి ముగింపు పోటీల్లో క్రీడాకారులకు ట్రోఫీలు అందించి మాట్లాడారు. క్రీడలతో మానసికంగా, శారీరకంగా ఎదగడానికి అవకాశం ఉందన్నారు. క్రీడలతో పాటు విద్యా రంగంపై కూడా ఆసక్తిని కనబరచాలన్నారు. 80 టీఎంసీలకు చేరిన తుంగభద్ర హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల రైతులకు, ప్రజలకు సాగు, తాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఊపందుకోవడంతో డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాంకు ఎగువ నుంచి 43022 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, రిజర్వాయర్‌లో నీటి నిల్వ సోమవారానికి 80 టీఎంసీలకు చేరుకుంది. డ్యాం నుంచి కాలువలకు సాగు నీటి విడుదలపై మంగళవారం మునిరాబాద్‌లో నిర్వహించే ఐసీసీ సమావేశం అనంతరం నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటారు. డ్యాం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1625.82 అడుగులకు చేరింది. -
రెడ్డి సంఘం కార్యవర్గం ఎంపిక
రాయచూరు రూరల్: తాలూకా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా సుధాకర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. సోమవారం నగరంలోని రెడ్డి సంఘం కార్యాలయంలో జరిగిన పదాధికారుల ఎన్నికల్లో సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధ్యక్షుడిగా తురకనడోణ సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రాఘవరెడ్డి, కార్యాధ్యక్షుడిగా అచ్యుతరెడ్డి, గౌరవాధ్యక్షుడిగా వేంకటేశ్వరరెడ్డి, కార్యదర్శిగా శేఖర్‌రెడ్డి, కోశాధికారిగా నరసింహారెడ్డిలను ఎన్నుకున్నారు. మరణంలోనూ వీడని బంధం సాక్షి,బళ్లారి: భార్య మృతితో విషాదంలో మునిగిపోయిన భర్త కూడా కొద్ది సేపటికే మృతి చెందారు, మరణంలోనూ వీడని బంధం అని నిరూపించారు. దావణగెరె జిల్లా హదడి గ్రామంలో మల్లప్ప (81) ,సిద్దమ్మ(75)ది 50 ఏళ్ల దాంపత్య జీవనం. సిద్దమ్మ అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందగా, సోమవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, భర్త మల్లప్ప కూడా మరణించాడు. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యువత స్వయం ఉపాధి సాధించాలి రాయచూరు రూరల్: నగర, పట్టణ ప్రాంతంలోని యువత స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి సూచించారు. సోమవారం సింధనూరులోని తన కార్యాలయం వద్ద యువతకు నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా వీరశైవ అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో స్వావలంబి సారథి పథకం కింద మంజూరైన కారును పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడాలన్నారు. పుట్టిన 5 రోజులకే ఆధార్ నమోదు● చిన్నారికి ప్రపంచ రికార్డు గౌరవం.! హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకా శ్రీరామనగరకు చెందిన చిన్నారి అంచురి రాయంక త్రినయని పుట్టిన కేవలం ఐదు రోజులకే ఆధార్ కార్డు నమోదు చేయించుకున్న అతి పిన్న వయసు చిన్నారిగా నిలిచింది. ఈ ఘనతను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి ప్రపంచ రికార్డు పతకం, సర్టిఫికెట్తో సత్కరించింది. శ్రీరామనగర నివాసులు డాక్టర్ ఏ.పవన్‌కుమార్, డాక్టర్ వరలక్ష్మీ పాల్ దంపతుల కుమార్తె అంచురి రాయంక త్రినయని 2026 మే 1న గంగావతిలోని వివేకానంద ఆస్పత్రిలో జన్మించింది. బిడ్డ పుట్టిన తర్వాత ఐదవ రోజున అంటే మే 6న తల్లిదండ్రులు బిడ్డ పేరు మీద ఆధార్, జనన నమోదు పత్రాలను నమోదు చేయించారు. ప్రతిభ తార్కాణం కావాలి రాయచూరు రూరల్ : విద్యార్థుల ప్రతిభకు ప్రదర్శనలకు తార్కాణం కావాలని ఎంపీ కుమార నాయక్ పేర్కొన్నారు. నగరంలోని పండిత సిద్ద రామ జంబల దిన్ని రంగమందిరంలో మహర్షి వాల్మీకి సమాజం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. సమాజ సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. స్వార్థం వీడి నిస్వార్థంతో పని చేయాలన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉత్తమ విద్యకు అవకాశం ఉంటుందన్నారు. స్వశక్తితో ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు. స్వామీజీలు, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్, ఎమ్మెల్సీ బోసురాజ్, ప్రముఖులు రవి, పాటిల్, రవీంద్ర, వెంకటేష్ నాయక్‌లున్నారు. -
అర్చకులకు వస్త్రదానం
సాక్షి,బళ్లారి: నగరంలో పలు ఆలయాల్లో పని చేసిన, చేస్తున్న అర్చక కుటుంబాలకు వస్త్రదానం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని అర్చకుల ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబాలకు వస్త్రాలు అందజేసి, ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి వారసత్వాలను కాపాడటంలో ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న అర్చకులను గౌరవించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ధర్మోరక్షతి రక్షతః అని అన్నారు. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు హొసపేటె: కొప్పళ నుంచి కర్కిహళ్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లిన ఘటన జరిగింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రాంతంలో రోడ్డు మరమ్మతు పనులు నెమ్మదిగా సాగుతుండటంతో రోడ్డు గుంతలతో నిండిపోయింది. దీని ఫలితంగా వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా ఈ రోడ్డుపై ఒక బస్సు బోల్తా పడిన ఘటన జరిగింది. ఆదివారం కావడంతో విద్యార్థులెవరూ ఈ బస్సులో ప్రయాణించలేదు. సాధారణ రోజుల్లో ప్రతి రోజూ 150 మందికి పైగా విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణిస్తారు. ఈనేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకముందే రోడ్డు మరమ్మతు పనులను సత్వరం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
జర్నలిస్టులకు భద్రత కల్పించాలి
శివాజీనగర: జర్నలిస్టుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని చేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. బెంగళూరులో శని, ఆదివారం జరిగిన ఐజేయూ సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. జాతీయ అధ్యక్షుడు బల్విందర్ సింగ్ జమ్మూ అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, చట్టపరమైన దాడులు పెరిగిపోవడం, వార్తా సేకరణలో అడ్డంకులు కల్పించడం, రక్షణకు చట్టాలు లేకపోవడం వంటి పరిస్థితులపై ఐజేయూ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో దేశంలో పాత్రికేయులు, మీడియా సంస్థల భద్రతకు ఒక ప్రత్యేక బలమైన చట్టం చేయాల్సిన అవసరం ఉందని సమావేశం తీర్మానించింది. ఐజేయూ పూర్వాధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో పత్రికా స్వేచ్ఛ నానాటికీ దిగజారి పోతోందని తెలిపారు. భారత రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛకు గట్టి హామీ ఇచ్చినప్పటికి వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ కల్పించే సమగ్ర చట్టం లేకపోవడం వల్లనే బెదిరింపులు, దాడులు పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టుల భద్రతకు చట్టాలు వచ్చినప్పటికి, అవి సమగ్రంగా లేవని పేర్కొన్నారు. పాల్గొన్న ప్రముఖులు ఐ.జే.యూ సెక్రటరీ జనరల్ డీ.సోమసుందర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్.ఎన్.సిన్హా, దేవులపల్లి అమర్, ఎం.ఏ.మాజిద్, అమర్ మోహన్ ప్రసాద్, వై.నరేంద్రరెడ్డి, జాతీయ కార్యవర్శులు డీ.ఎస్.ఆర్.సుభాస్, పీ.భాస్కర్‌రెడ్డి, నరేంద్ర భరద్వాజ్, ఎం.జానకి మోహన్, అంజన్‌కుమార్ తదితరులు జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన కర్ణాటక జర్నలిస్టు ప్రముఖులను సన్మానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తేవాలి ఐజేయూ కార్యవర్గ భేటీలో తీర్మానాలు -
జిల్లాలో రగిలిన మంత్రి పదవి చిచ్చు
రాయచూరు రూరల్: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులుగా నియమించారు. రాయచూరు జిల్లా ఇంచార్జి మంత్రి నియామకంలో అన్యాయం జరిగింది. ప్రస్తుతం జిల్లా ఇంచార్జి మంత్రిగా మంత్రి అజయ్ సింగ్‌ను నియమించడంపై జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నలుగురు విధాన పరిషత్ సభ్యులు, నలుగురు శాసన సభ్యులున్నా ఏ ఒక్కరూ మంత్రి పదవికి అర్హులు కాదా? అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. సోమవారం ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లికి మంత్రి పదవి కల్పించాలని జిల్లాలోని సింధనూరులో అభిమానులు రాస్తారోకో చేశారు. నగరంలో బాదర్లి అభిమాని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటున్న సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఎంకు పంపదలచిన వినతిపత్రాన్ని ఏసీ హంపణ్ణకు అందించారు. -
పిల్లల్లో రక్తహీనత నులిమేద్దాం
హొసపేటె: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా 1,583 అంగన్వాడీ కేంద్రాలు, 1,203 ప్రభుత్వ పాఠశాలలు, 406 ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం 4,44,094 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ టీ.లింగరాజు తెలిపారు. సోమవారం అమరావతి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. పిల్లల్లో నులిపురుగుల బెడదతో పౌష్టికాహార లోపం, రక్తహీనత ఏర్పడి వారి శారీరక వికాసం, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయన్నారు. అందువల్ల పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. పిల్లలను నులిపురుగుల బారి నుంచి కాపాడటానికి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. భోజనానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు. పిల్లలు చెప్పులు ధరించి నడవాలన్నారు. 1 నుంచి 19 ఏళ్ల లోపు వారంతా అల్బెండజోల్ మాత్రలను వేసుకుని జిల్లాను నులిపురుగుల రహితంగా మార్చడంలో సహకరించాలన్నారు. జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, అమరావతి ప్రభుత్వ బాలికల పీయూ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీవ్, ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేష్, పీయూ విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగరాజ్ హవల్దార్, జిల్లా కుష్ఠువ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ రాధిక, మహిళా శిశు అభివృద్ధి విభాగం డిప్యూటీ డైరెక్టర్ గంగణ్ణ, విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 4.44 లక్షల మందికి అల్బెండజోల్ మాత్రల పంపిణీ లక్ష్యం జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమాధికారి డాక్టర్ లింగరాజు -
శివమొగ్గలో ఫుట్‌పాత్ అభియాన్
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ఆపరేషన్ ఆరంభమైంది. సోమవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో కువెంపు రోడ్డులో పెట్టంగళ్లు, బండ్లు తదితరాలను జేసీబీలతో తొలగించారు. ప్రవాసి మందిర్ సర్కిల్ సమీపం నుంచి శివమూర్తి సర్కిల్ వరకు కువెంపు రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద రోడ్ల పనులు చేపట్టిన తర్వాత ట్రాఫిక్ సమస్య మరింత అధికమైంది. వ్యాపారాలతో పాటు వాహనాల పార్కింగ్ వల్ల సమస్యగా ఉంది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దేవరాజ్, ఎస్ఐ స్వప్న, కార్పొరేషన్ అధికారులు తొలగింపులో పాల్గొన్నారు. షేర్ మార్కెట్ పేరుతో రూ.15 లక్షల మస్కామైసూరు: మీ డబ్బును రెట్టింపు చేస్తామని ఆశ చూపి ఒక వ్యక్తి నుంచి రూ.15.29 లక్షలకు స్వాహా చేసిన ఘటన నగరంలో జరిగింది. మైసూరులోని సిద్ధార్థ బారంగే నివాసి ఒకరు ఫేస్బుక్లో స్టాక్ మార్కెట్ ప్రకటనను చూశారు. అందులోని నంబరుకు ఫోన్ చేయగా, మోసగాళ్లు అతనికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి గురించి చెప్పారు. ఎంత పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పి వారు అతన్ని ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన ఆ వ్యక్తి, క్రమంగా వివిధ ఖాతాలలో రూ. 15,29,894 జమ చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మోసగాళ్లు నంబరును బ్లాక్ చేశారు. దీంతో బాధితుడు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ప్రైవేటు బస్సు బోల్తా● ఒకరు మృతి దొడ్డబళ్లాపురం: గోవా నుంచి బెంగళూరుకు వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడగా ఓ ప్రయాణికుడు మృత్యువాత పడ్డారు. హావేరి పట్టణ శివారులోని 48వ జాతీయ రహదారిలో సోమవారం ఉదయం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగం వల్ల పల్టీ పడగా, బస్సులో ఉన్న 20మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బావర్‌సింగ్ రాజ్‌పుత్ (18) అనే యువకుడు అక్కడే మృతి చెందాడు. పోలీసులు చేరుకుని క్షతగాత్రులను హావేరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సును క్రేన్ సాయంతో తొలగించి వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించారు. ప్రదోష్ అప్రూవర్‌కు కోర్టు ఆమోదం బనశంకరి: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో 14వ నిందితుడు ప్రదోష్‌ను సాక్షిగా పరిగణించడానికి బెంగళూరు 59వ సీసీహెచ్ సెషన్స్ కోర్టు సమ్మతించింది. దీంతో దర్శన్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దర్శన్ తరఫు న్యాయవాదుల సుదీర్ఘ వాదనలను జడ్జి సుజాతా సాంబ్రాణి తోసిపుచ్చి ప్రదోష్ అప్రూవర్ పిటిషన్‌ను ఆమోదించారు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందో పూర్తిగా వివరిస్తానని ప్రదోష్ తెలిపాడు. తన మాట వినకుండా దర్శన్ దాడి చేశాడని, రేణుకాస్వామిని చెప్పుతో కొట్టాలని పవిత్రాగౌడ ఒత్తిడి చేసిందన్నారు. ప్రదోష్.. దర్శన్ నుంచి రూ.30 లక్షలు డబ్బు తీసుకుని నకిలీ నిందితులను సృష్టించడానికి ప్రయత్నించాడని, ఘటనాస్థలికి అతడే పవిత్రగౌడను తీసుకువచ్చాడని, హత్యలో పాల్గొన్నాడని అభియోగాలున్నాయి. పేగుబంధాన్నే చిదిమేసింది ● బీదర్ జిల్లాలో కిరాతక తల్లి దొడ్డబళ్లాపురం: కన్నకొడుకును తల్లి హత్య చేసిన కిరాతక సంఘటన బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా వడగాంవ్ గ్రామంలో వెలుగు చూసింది. ఈ దారుణంలో ఆమెకు తల్లిదండ్రులు, సోదరుడు సహకరించడం గమనార్హం. నిందితురాలు వాణిశ్రీకి మహారాష్ట్ర దేగులూరు తాలూకా కవళగడ్డ గ్రామానికి చెందిన సంజుతో వివాహం జరిగింది. తెలంగాణ నిజామాబాద్‌లో కూలిపనులు చేసుకుంటూ నివసించేవారు. ఇటీవల వాణిశ్రీ కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 50 రోజుల క్రితం మగబిడ్డ పుట్టగా ఓంకార్ అని పేరు పెట్టారు. రెండురోజుల కిందట వాణిశ్రీ, భర్తకు కాల్ చేసి పిల్లాడు చనిపోయినట్లు చెప్పడంతో అనుమానంతో పరుగున వచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురినీ అరెస్టు చేసి విచారించగా తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ఎందుకు హత్య చేశారనే స్పష్టత రావాల్సి ఉంది. క్షుద్ర పూజల కోసం చంపి ఉంటారనే అనుమానాలున్నాయి. -
కుళ్లిన మాంసంతో వంటలు
శివాజీనగర: బెంగళూరులో విలాసవంత హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఆ హోటళ్ల వంటగదులలో గడువు ముగిసిన మాంసం, చేపలు, పాలు, పెరుగు, నాసిరకం ఆహార పదార్థాలు బయటపడ్డాయి. రాయల్ చైన్ హోటల్లో గడువు దాటిన సుమారు 50 కిలోల మాంసాహారం సీజ్ చేశారు. యూబీ సిటీలోని 16వ అంతస్తులో ఉన్న స్ట్రైక్ లాంజ్‌లో కుళ్లిన మాంసం 45 కేజీలు, నూనెల నిల్వలు సీజ్ చేశారు. ఆహార భద్రతా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించే హోటళ్లకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామన్నారు. సెలబ్రిటీలను అనుసరించవద్దు ఆరోగ్య శాఖ మంత్రి ఖాదర్ మాట్లాడుతూ తాము ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని అన్నారు. ప్రజారోగ్యం, పరిశుభ్రత కోసం దాడులు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని హోటళ్లలో విదేశాల నుంచి నాణ్యత లేని మటన్‌ను తెప్పించినట్లు తెలిసిందన్నారు. సెలబ్రిటీలు తాగే పానీయాలను చూసి పిల్లలు, తల్లిదండ్రులు వాటిని వాడకూడదన్నారు. సెలబ్రిటీలు ఆ పానీయాలను తాగరు, ప్రకటనల కోసమే అలా చేస్తారన్నారు. స్టార్ హోటళ్లపై దాడుల్లో గుట్టురట్టు -
రైతు, కూలీల ఆగ్రహజ్వాల
మండ్య: రైతుల నుంచి బలవంతపు భూసేకరణలు, కార్పొరేట్ సంస్థలచే భూ కబ్జాలు, ధరల పెరుగుదలకు నిరసనగా కార్పొరేట్ సంస్థలు క్విట్ ఇండియా అనే నినాదంతో వివిధ రైతు, కమ్యూనిస్టు సంఘాలు సోమవారం బృహత్ ఆందోళన నిర్వహించాయి. మండ్యలో సిల్వర్ జూబ్లీ పార్కు వద్ద గుమిగూడిన కార్యకర్తలు, బెంగళూరు–మైసూరు హైవే మీదుగా పాదయాత్ర చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. వీబీజీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీని కొనసాగించాలన్నారు. రైతులు–వ్యవసాయ కూలీల రుణాలను రద్దు చేయాలన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, డీజిల్ తదితరాల ధరలను తగ్గించాలని పలు డిమాండ్లను వినిపించారు. పోలీసులు వారిని అడ్డుకుని వాహనాలలో తరలించారు. -
కరువుపై చర్చకు సర్కార్ సిద్ధం
రాయచూరు రూరల్: కరువు సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని కలబుర్గి జిల్లా ఇంచార్జి, హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాల మేరకు కల్యాణ కర్ణాటకలో ఇంచార్జి మంత్రులు కరవు అధ్యయనం చేపట్టారు. ఇటీవల యాదగిరి జిల్లా ఇంచార్జి మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి శివరాజ్ తంగడిగి ఆయా జిల్లాల్లో పర్యటించగా సోమవారం విజయపుర జిల్లాలో ఇంచార్జి మంత్రి ఎంబీ పాటిల్, కలబుర్గి జిల్లాలో ఇంచార్జి మంత్రి ప్రియాంక్ ఖర్గే పర్యటించారు. రైతులు తమ భూముల్లో వేసుకున్న కంది, పత్తి, చెరకు, జొన్న తదితర పంటలను పరిశీలించారు. కలబుర్గి తాలూకా అవర్దలో, విజయపుర జిల్లా బబలేశ్వర, సారవడిగిలో పంటలను చూసి కరువు పరిస్థితులపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదికను అందిస్తామన్నారు. -
రైతుల భూములు లాక్కొంటే ఊరుకోం
సాక్షి,బళ్లారి: దేశానికి వెన్నెముక వ్యవసాయం, వ్యవసాయమే లేకపోతే దేశానికి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, అలాంటి వ్యవసాయ భూములను రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కొంటే చూస్తూ ఊరుకునేది లేదని ఎస్కేఎం– జేసీటీయూ పోరుబాట పట్టింది. సోమవారం కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి, ఎస్కేఎం–జేసీటీయూ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పలు ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నిర్మాణం కోసం బలవంతంగా భూములను లాక్కొని రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల కోసం భూకబ్జాలను చేస్తే రైతులు ఎలా జీవించాలని ప్రశ్నించారు. దేశంలోని రైతులు, కార్మికుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను వెంటనే విరమించుకోవాలన్నారు. వ్యవసాయ భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు, రైతుల జీవనాధారంతోపాటు దేశ ఆహార భద్రతకు పునాది అని అన్నారు. వ్యవసాయ భూముల రక్షణకు పోరాటం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది ఎవరు పండించిన బియ్యం? అని మండిపడ్డారు. ఏడాది పాటు పంటలను పండించకపోయినా అంత వరకు బియ్యం, ఇతర తిండిగింజలను నిల్వ ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ తిండి గింజలు ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు పండిస్తున్నారో కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రైతులు భూములను బలవంతంగా పరిశ్రమల కోసం తీసుకుని రైతుల జీవనాధారాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను, వ్యవసాయ రంగ నూతన విధానాలను, విత్తన చట్టాన్ని, వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని ఇతర రైతు వ్యతిరేక చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సత్యబాబు, ఏఐయూటీయూసీ అధ్యక్షుడు దేవదాస్, కేపీఆర్‌ఎస్ అధ్యక్షుడు శివశంకర్, రైతు సంఘం నాయకుడు గుర్రళ్లి నాగరాజు, ప్రముఖులు తిప్పేస్వామి, తాయప్ప, ఖాదర్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. బలవంతపు భూసేకరణ చేస్తే ఖబడ్దార్ రైతులు, కార్మికుల డిమాండ్లపై పోరుబాట ఎస్కేఎం–జేసీటీయూ నేతృత్వంలో భారీ ఎత్తున ర్యాలీ, ఆందోళన -
ఎవరి కోసం బిడది టౌన్షిప్?
దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం బిడది టౌన్షిప్ పేరుతో రైతుల పొట్ట కొడితే చూస్తూ ఊరుకోమని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. టౌన్షిప్ వ్యతిరేక పాదయాత్ర సోమవారంనాడు రెండోరోజుకు చేరుకొంది. దేవెగౌడ ప్రసంగిస్తూ టౌన్షిప్ కావాలని రైతులు అడగలేదన్నారు. టౌన్ షిప్ నిర్మిస్తానని ఢిల్లీలో సీఎం ఎవరెవరికి మాట ఇచ్చారో చెప్పాలన్నారు. టౌన్షిప్ పేరుతో 7,481 ఎకరాల వ్యవసాయ భూములను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రైతుల కడుపు కొట్టే ఏ ప్రాజెక్టు అయినా తాను అడ్డుకుంటానన్నారు. పోలీసులతో గొడవ పాదయాత్ర కణమిణికె కాలనీ వద్దకు చేరుకోగానే బెంగళూరు పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టారు. దీంతో జేడీఎస్ కార్యకర్తలు, రైతులు వాగ్వాదానికి దిగారు. నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతూ పాదయాత్ర ను అడ్డుకుంటే సర్కారు తప్పును ఒప్పుకున్నట్టే అన్నారు. తాము శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నామన్నారు. తరువాత పాదయాత్ర ముందుకు సాగింది. సర్కారుపై దేవెగౌడ ధ్వజం -
ధాన్యం కంత్రీలు
● రాష్ట్ర ఆహార గిడ్డంగిలో రూ.86 లక్షల స్కాం బొమ్మనహళ్లి: బెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్ తాలూకా, రామకృష్ణపురలో ఉన్న కర్ణాటక ఆహార, పౌర సరఫరాల సంస్థ గిడ్డంగిలో అధికారులు, సిబ్బంది కలిసి రూ.86.65 లక్షల విలువైన బియ్యం, గోధుమలు, రాగిని అమ్మేసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. గిడ్డంగి మేనేజర్ శివకుమార్, సిబ్బంది నారాయణస్వామి, తిమ్మరాజు, రాజ్‌కుమార్, తౌసిక్లపై సూర్యనగర్ పీఎస్‌లో ఉన్నతాధికారులు కేసు పెట్టారు. ఇటీవల గోదాములో తనిఖీలు చేయగా బియ్యం, గోధుమలు, రాగిని అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైంది. వందలాది క్వింటాళ్లను అమ్మేసి డబ్బులు తినేశారని అనుమానాలున్నాయి. ఇప్పటికి లెక్కల ప్రకారం రూ.86.65 లక్షల విలువైన సరుకు దోపిడీకి గురైంది. స్కాం బయటపడడంతో నిందితులు పరారయ్యారు. -
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎలా దాడి చేసి చంపారు?.. అనంతరం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు.. ఆపై తెరపైకి వచ్చిన కవర్అప్ కథను అందులో అతను ‘పూసగుచ్చినట్లు’ వివరించాడు. దీంతో నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది.సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రగౌడ, దర్శన్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రదోష్ ఏ-14గా ఉన్నాడు. అప్రూవర్‌గా మారేందుకు 59వ సెషన్స్ కోర్టులో అతను వేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి.. తొలుత రేణుకాస్వామిని దర్శన్ మనుషులు కొందరు ఎత్తుకొచ్చారు. పవిత్ర గౌడకు పంపినట్లు చెబుతున్న సందేశాల విషయంలో దర్శన్ అతడిని ప్రశ్నించాడు. ఆ తర్వాతే తన మనుషుల్ని ఉసిగొల్పడంతో.. దాడి జరిగింది. కర్రలు, తాళ్లతో అతన్ని తీవ్రంగా గాయపరిచారు. రేణుకాస్వామి మరణించాడని నిర్ధారించుకున్నాక.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు.మృతదేహాన్ని తరలించి.. కథ మార్చే ప్రయత్నం?రేణుకాస్వామి మరణం తర్వాత ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రత్యామ్నాయ కథనం సిద్ధం చేసుకున్నారు. తొలుత శవాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. ఆ నేరం వాళ్ల మీద వేసుకునేందుకు దర్శన్ పవిత్రలు వాళ్లకు డబ్బులు ఆఫర్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది కూడా.అయితే ఈ కేసులో జరిగిదంతా నిజాయతీగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకే అప్రూవర్ హోదా ఇవ్వాలని ప్రదోష్ కోర్టును కోరాడు. జైల్లో తనకు భద్రత కల్పించాలని, ఇతర నిందితులతో కలిపి ఉంచొద్దని కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రదోష్ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు అతన్ని అప్రూవర్‌గా అంగీకరిస్తే.. ఆపై వాంగ్మూలం లభిస్తే.. దర్శన్, పవిత్ర గౌడ సహా ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్ కేసుకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్‌గా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాలు కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్‌కు వీరాభిమాని. అయితే నటి పవిత్రా గౌడ వల్ల దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని అతను కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు అసభ్యమైన సందేశాలు పంపాడు. ఈ విషయంలోనే ఆగ్రహించిన దర్శన్.. అతన్ని కిడ్నాప్ చేయించి తన మనుషులతో అతికిరాతకంగా హత్య చేయించాడన్నది అభియోగం. ఈ కేసులో అరెస్టైన దర్శన్‌కు తొలుత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. కేసు విచారణ త్వరగా ముగించాలని ట్రయల్ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దర్శన్, పవిత్రలు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
కేంద్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. లోక్‌సభలో ప్రతిపక్షాలకు విలువ లేదు. ఏకపక్ష నిర్ణయాలతో తీర్మానాలు చేస్తున్నారని రాయచూర్ లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు, విద్యుత చట్టం ఇతర మూడు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు. ఈ బిల్లులపై చర్చిండానికి అవకాశం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. జంతర మంతర్‌లో జరిగిన అంశాలు కూడా చర్చలకు రాలేదని తెలిపారు. మాజీమంత్రి యన్.ఎస్,బోసురాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రాయచూరు యాదగరి, విజయనగర జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించలేదన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. రామదుర్గలో బొప్పాయి తోట ధ్వంసం హొసపేటె: బొప్పాయి మొక్కలను గుర్తు తెలియని దుండగులు నరికివేసిన ఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని గూడెకోట హుబ్లీ పరిధిలో చోటుచేసుకుంది. రామదుర్గ గ్రామం నాగర్హునసే రోడ్డులో ఉన్న బొప్పాయి తోటలోకి దుండగులు చొరబడ్డారు. ఛాతీ ఎత్తు వరకు పెరిగిన మొక్కలను గొడ్డళ్లతో నరికివేశారు. రెండేళ్ల క్రితం అప్పు చేసి బొప్పాయి పంట సాగు చేశారు. కాయలు కోతకు వచ్చే దశలో ఉండగా దుండగులు నరికి వేయడంతో రైతులు బోరున విలపించారు. ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్యాసింజర్ రైళ్లు నడపాలిరాయచూరు రూరల్: కుష్టిగి నుంచి బెంగళూరు, హుబ్లీకి ప్యాసింజర్ రైళ్లను నడపాలని రైతు సంఘం అధ్యక్షుడు అందానప్ప డిమాండ్ చేశారు. ఆదివారం హుబ్లీలోని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గదగ్–వాడి నూతన రైలు మార్గం ప్రారంభమైన నేపథ్యంలో కోప్పళ–కుష్టిగి రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం కుష్టిగి–బెంగళూరు, కుష్టిగి–హుబ్లీ మధ్య ప్రత్యేక ప్యాసెంజర్ రైళ్లను నడపాలని కోరారు. కార్యక్రమంలో ముదుకప్ప, బసవరాజ్ పాల్గొన్నారు. స్వదేశీ వస్తువుల విక్రయ శాల ప్రారంభంరాయచూరు రూరల్: నేటి తరం ప్రజలు ఫ్యాషన్ డిజైన్ల దుస్తులకు అలవాటుపడుతున్నారు. పాతకాలం నాటి స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని కిల్లే బృహ్మనమఠం శాంతమల్ల శివాచార్యులు సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన స్వదేశీ వస్తువుల విక్రయ శాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఫ్యాషన్ డిజైన్ల దుస్తులు మానవ శరీరానికి ఆరోగ్యాన్ని అందించకపోగా, పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వదేశీ వస్తువులు, సహజ పదార్థాలతో తయారైన దుస్తులు వినియోగించాలని సూచించారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాల్సిందే రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని మాజీ ఎంపీ ఉగ్రప్ప డిమాండ్ చేశారు. ఆదివారం రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో రూ.282.3 కోట్లు నిధులు కేటాయించగా.. ప్రస్తుతం అందులో రూ.80 కోట్లు కోత విధించిందని ఆరోపించారు. ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు వారికి కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగాలను బ్యాక్లాగ్ పోస్టులుగా గుర్తించాలన్నారు. మిగిలిన ఖాళీలను భర్తీ చేసి ఎస్టీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. -
మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారు?
కోలారు: కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల అవినీతి కుంభకోణంలో జైలుకు వెళ్లి వచ్చిన నాగేంద్రను మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ప్రశ్నించారు. ఆదివారం నగర సమీపంలోని రత్న కన్వెన్షన్ హాల్లో ఆగ్నేయ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ పడుతున్న కె.ఎం.సురేష్ ఎన్నికల ప్రచార పూర్వ సిద్దతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగేంద్రపై ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలో వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. బిడది టౌన్‌షిప్‌ను వ్యతిరేకించిన విపక్ష నాయకుడు ఆర్.అశోక్, కేంద్ర మంత్రి కుమారస్వామి చేస్తున్న పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఉందన్నారు. రైతులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ విషయంలో హోం మంత్రి ప్రియాంక ఖర్గే విమర్శలను ఖండిస్తున్నామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడం మాని రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఓం శక్తి చలపతి తదితరులు పాల్గొన్నారు. -
హైకమాండ్ నిర్ణయం మేరకే శాఖల కేటాయింపు
సాక్షి, బళ్లారి: మంత్రులకు శాఖల కేటాయింపులో ఎలాంటి గందరగోళం ఉండడు. సోమవారం మంత్రులకు శాఖలు కేటాయింపు ప్రక్రియ పూర్తి అవుతుందని మంత్రి ఈశ్వర్ ఖండ్రే పేర్కొన్నారు. ఆదివారం ఆయన బళ్లారిలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి పదవుల కేటాయింపు అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయం. పార్టీ ఎవరెవరికి ఏయే సమయంలో పదవులు ఇవ్వాలనే దానిపై ఆచితూచి అడుగులు వేస్తుందని తెలిపారు. మంత్రి పదవుల కేటాయింపు, శాఖలు గురించి మాజీ మంత్రి శ్రీరాములు మాట్లాడటంలో అర్థం లేదన్నారు. బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్రకు మంత్రి పదవి ఇవ్వడంలో తప్పు లేదని సమర్థించుకున్నారు. 2028లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతో బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రిపబ్లిక్ ఆఫ్ బళ్లారి ఎవరి హయాంలో జరిగిందో తెలుసుకోవాలన్నారు. డీకేశీ హయాంలో మహిళలకు కూడా పదవులు దొరకుతాయన్నారు. కార్యక్రమంలో మేయర్ గాదెపప,డీసీసీ అధ్యక్షుడు అల్లం ఫ్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
విశేష అగ్నిహోత్ర అనుష్టాన వేడుకలు
హుబ్లీ: ధార్వాడ హెబ్బళ్లి రోడ్డు గాలి వీధిలోని ముదిమారుతి గుడి సముదాయ భవనంలో అంతర్జాతీయ యోగా గురువు భవర్లాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢమాస విశేష అగ్నిహోత్ర అనుష్టాన వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భవర్లాల్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల క్రితం యోగా సామాన్యులకు దూరంగా ఉండేదన్నారు. నేడు విశ్వవ్యాప్తంగా యావత్ జగత్తు యోగా సాధన చేస్తోందని తెలిపారు. అగ్నిహోత్రను అభ్యసించి అధ్యాత్మిక లాభంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్య లబ్ధిని పొందవచ్చని శాసీ్త్రయంగా రుజువు అయిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటి మేయర్ రత్నబాయి, కార్పొరేటర్ దీపా, ఆ ఆలయ ప్రముఖులు రవి, వాసు, లీలావతి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభావంతులకు నాణ్యతతో కూడిన శిక్షణ
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలోని నిరుపేద గ్రామీణ ప్రతిభావంతులకు వివిధ పోటీ పరీక్షలకు నాణ్యతతో కూడిన శిక్షణ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు మాజీ సీఎం, ఎంపీ బసవరాజ్ బొమ్మై తెలిపారు. స్థానిక ప్రైవేట్ హోటల్లో సంబంధిత ఉత్తర కర్ణాటక ప్రతిభావంతం మక్కల స్పార్ధాత్మక పరీక్ష హిత రక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర సమాలోచన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంకల్పంతో పనులు నేరవేరుతాయన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో శిక్షణ కేంద్రం ప్రారంభించడం అందరి ఆశయం అని గుర్తు చేశారు. ప్రభాకర్ కోరె సమావేశంలో పాల్గొనడం ఈ శిక్షణ కేంద్రానికి స్ఫూర్తినిస్తుందన్నారు. సదరు కేంద్రం నిపుణుల నేతృత్వంలో ఓ క్రియ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కేంద్రాన్ని బెంగళూరు వరకు విస్తరించేందుకు యోచిస్తునట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదృశ్య కడా సిద్దేశ్వర స్వామి, కన్హేరి స్వామి, మాజీ సీఎం, ఎంపీ జగదీశ్ శెట్టర్, మాజీ ఎంపీ అన్నసాహేబ్ జొల్లే, రమేష్ కత్తి, మాజీ మంత్రి శంకర్ పాటిల్ మునేనకొప్ప తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
తల్లి పాలు దివ్యౌషధం
చిక్కబళ్లాపురం: విశ్వ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో జాగృతి కోసం బెంగళూరు హెబ్బాళ నుంచి ముద్దేనహళ్లి మధుసూదన్‌సాయి వైద్య సంస్థ వరకు బైక్ ర్యాలీ సాగింది. రోటరీ క్లబ్ సభ్యులు, వైద్యులు, పౌరులు ఇందులో పాల్గొన్నారు. తల్లి పాలు శిశువు అత్యుత్తమ పెరుగుదలకు ఉపయుక్తమని తెలిపారు. నెలల తక్కువ బిడ్డలు, రోగగ్రస్త శిశువులకు తల్లి పాలే ఔషధమన్నారు. తల్లుల నుంచి పాలను సేకరించి పాలు లేని శిశువులకు అందజేసే విధానం పెంపొందాలన్నారు. బెంగళూరులోని ఆస్పత్రుల్లో నవజాత శిశువులకు 25 లీటర్ల తల్లి పాలను సేకరించి అందజేసినట్లు వైద్యులు తెలిపారు. పాలు దానం చేసిన మహిళలను సన్మానించారు.పరామర్శకు వచ్చిన మహిళ అరెస్టు శివమొగ్గ: సెంట్రల్ జైలులో విచారణ ఖైదీని కలిసి గంజాయిని ఇవ్వడానికి ప్రయత్నించిన మహిళ, మరొకరు అదే జైలు అతిథులయ్యారు. రుక్సర్ బాను, నాసిర్ ఖురేషి 5న విచారణ ఖైదీ అబ్దుల్ మునాఫ్‌ను కలవడానికి బైక్‌లో జైలుకు వచ్చారు. వారిని జైలు సిబ్బంది సాధారణ తనిఖీలు చేశారు. రుక్సర్ జీన్స్ బెల్టులో టేప్ ఉపయోగించి గంజాయి, పొగాకు వంటి నిషేధిత వస్తువులను దాచుకున్నట్లు గుర్తించారు. వెంటనే గంజాయి, పొగాకుగా భావిస్తున్న పదార్థాలు, జీన్స్, ఒక అంగీ, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జైలు అధికారి రంగనాథ్ ఫిర్యాదు మేరకు తుంగ నగర పోలీసులు అరెస్టు చేశారు. బిడది వద్ద కేరళ బస్సు పల్టీ● ఇద్దరు మృతి, 25 మందికి గాయాలు మైసూరు: బెంగళూరు నుంచి కోజికోడ్‌కు వెళ్తున్న కేరళ ఆర్టీసీ బస్సు రామనగర వద్ద మైసూరు ఎక్స్‌ప్రెస్ వేలో పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా, పెద్దసంఖ్యలో గాయాల పాలయ్యారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలు తగిలాయి. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో అరవెగెరె గేట్ అనే చోట బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద సైన్‌బోర్డును ఢీకొని బోల్తా పడింది. అఖిలేష్, అరుణ్ అనే ఇద్దరు దుర్మరణం చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. బిడది పోలీసులు, స్థానికులు కలిసి క్షతగాత్రులకు రక్షించి రామనగర, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. బస్సు అడ్డంగా పడిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయ ఏర్పడింది. రౌడీల గొడవలో పోలీసుకు గాయాలు బనశంకరి: ఉత్తర కన్నడ జిల్లా భట్కళ తాలూకా మురుడేశ్వరలో శనివారం అర్ధరాత్రి రౌడీ ముఠాల మధ్య కొట్లాటలు జరగ్గా, అడ్డుకోబోయిన పోలీసులపై చాకుతో దాడి చేశారు. రౌడీషీటర్ రాజు, మనోజ్ వర్గాల మధ్య గొడవ జరుగుతోందని ప్రజలు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి గొడవను విడిపించడానికి ప్రయత్నించారు. రౌడీలు ఓ పోలీసుపై కత్తితో పొడవడంతో గాయాలై ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటనలో రాజు, రితిక్, మదన్‌నాయక్, యోగేశ్, దర్శన్ అనేవారిపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. -
చలో పుష్పలోకం
ఆదివారం ఫ్లవర్ షోలో జనం ఇకెబనా ప్రదర్శనలో నటి అమూల్య ఆదివారం బెంగళూరు లాల్బాగ్ జనసాగరమైంది. స్వరాజ్య ఫల పుష్ప ప్రదర్శనను వీక్షించడాని తరలివచ్చారు. పుష్ప సొగసులను తనివితీరా వీక్షించి, కొండపై సేదదీరారు. పూల రూపాలు, ఫౌంటెన్ వద్ద చిత్రాలు తీసుకుంటూ సరదాగా గడిపారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జనం రావడంతో ఉద్యానవనం కిక్కిరిసింది –బనశంకరి ఫౌంటెన్ ముందు కోలాహలం కొండపై సందడి -
వీరశైవ విద్యావర్దక సంఘం సేవలు ఆదర్శం
సాక్షి, బళ్లారి: వీరశైవ విద్యావర్దక సంఘం సేవలు ఆదర్శం అని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం హీరద సూగమ్మ పాఠశాల శబాబ్ది వేడుకల ముగింపు సమావేశం నిర్వహించారు. కొట్టూరు గవిమఠం స్వామిజీ అభినవ సిద్దలింగేశ్వర స్వామి, మంత్రి ఈశ్వర్ ఖండ్రే, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, పలువురు స్వామీజీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వీరశైవ విద్యావర్ధక సంఘం ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంద సంవత్సరాలు క్రితమే విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్రాంతంలో ఎందరో బాగు పడ్డారని తెలిపారు. వీరశైవ విద్యావర్దక సంఘం విద్యాభివృద్ధికి పెద్దపీఠ వేసిందని గుర్తు చేశారు. శబాబ్దం క్రితమే మనిషి జ్ఞానంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలను ప్రారంభించారని వెల్లడించారు. ప్రస్తుతం విద్యాసంస్థలను డబ్బు సంపాదించేందుకు ప్రారంభిస్తున్నారన్నారు. విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు రిటైర్డ్ ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు కణేకల్ మహంతేష్, డాక్టర్ అరవింద్ పాటిల్, సీనియర్ పాత్రికేయులు వీరభద్రగౌడ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన హీరద సూగమ్మ పాఠశాల శతాబ్ది వేడుకలు -
అవినీతికి కొమ్ముకాస్తున్న కాంగ్రెస్
సాక్షి, బళ్లారి: వాల్మీకి అభివృద్ధి నిగమ మండలిలో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైలుకు వెళ్లి వచ్చిన నాగేంద్రకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి కట్టబెట్టింది. ఇదంతా చూస్తే ఆ పార్టీ అవినీతికి కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నాగేంద్ర ఏమి సాధించారో తెలియడం లేదు.. అవినీతి కూపంలో కూరుకుపోయిన్పప్పటికి మంత్రి పదవి ఇచ్చారన్నారు. నాగేంద్రతో రాజీనామా చేయించే వరకు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనివ్వకూడదన్నారు. వాల్మీకి నిగమ మండళి అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ మృతికి కారణం కావడం, నకిలీ ఖాతాలు సృష్టించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్న వ్యక్తికి మంత్రి పదవి మళ్లీ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు ఆశోక్, చలవాది నారాయణ స్వామి కలిసి నాగేంద్రతో రాజీనామా చేయించే వరకు అసెంబ్లీలో పోరాటం చేయాలని సూచించారు. డీకే, బీకే ఒత్తిడితోనే బసవరాజు హొరట్టి రాజీనామా చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ లోక్‌సభ సభ్యుడు సన్నపక్కీరప్ప, పాలికె ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాస రెడ్డి, కార్పొరేటర్లు అశోక్, హనుమంతప్ప, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగేంద్రకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు? మాజీ మంత్రి శ్రీరాములు -
నోటీసులకు భయపడవద్దు
కోలారు: ఆదాయ పన్నుల శాఖ నుంచి వచ్చిన నోటీసులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నోటీసులకు సంబంధించి అవసరమైన దాఖలాలు సమర్పించి సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆదాయ పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ మీరా పండిత్ తెలిపారు. ఆదివారం తాలూకాలోని అజ్జప్పనహళ్లి గేట్ వద్ద ఉన్న ఎస్కె ఇంటర్నేషనల్ ఇన్ సభాంగణంలో జాతీయ పన్నుల సమ్మేళనం, పన్ను సలహాదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నోటీసు అనేది నిఖరమైన సమాచారం పొందడానికి అవసరమైన సాధనం మాత్రమే అన్నారు. నోటీసులకు సమాధానం, అవసరమైన దాఖలాలను ఆన్లైన్లో సమర్పించాలని తెలిపారు. ప్రతి విషయానికి కార్యాలయానికి వెళ్లి దాఖలాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా పన్నుల సలహాదారుల సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్, ఎఫ్‌కేసీసీఐ అధ్యక్షుడు ఉమారెడ్డి, జిల్లా సంఘం పదాధికారులు పాల్గొన్నారు. -
మేలుకోటెలో భక్తకోటి తన్మయం
చెలువనారాయణ స్వామి ఊరేగింపు గజేంద్రమోక్షం అలంకారం కృష్ణరాజముడి పట్టాభిషేక ఉత్సవంమండ్య: మండ్య జిల్లాలోని మేలుకోటలోని వెలసిన ప్రఖ్యాత శ్రీ చెలువ నారాయణ స్వామి ఆలయంలో కృష్ణ రాజముడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మైసూరు ముమ్మడి కృష్ణరాజ ఒడెయార్ సమర్పించిన వజ్రాలు పొదిగిన కృష్ణరాజ ముడి కిరీటం, బంగారు కిరీటాలను శ్రీదేవి, భూదేవి సమేత చెలువ నారాయణునికి అలంకరించి ఊరేగించగా భక్తులు ఆనంద పరవశులయ్యారు. 9 రోజులపాటు జరిగిన జాతర మహోత్సవాలు, కృష్ణరాజముడి ఉత్సవం, ప్రహ్లాద పరిపాలన, గజేంద్రమోక్ష రథోత్సవం, పట్టాభిషేక ఉత్సవాలు నయనానందకరంగా సాగాయి. ప్రబంధ పారాయణాలు శ్రీరంగం, కంచి, తిరువల్లికేణి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు 9 రోజులు దివ్య ప్రబంధ పారాయణాలు సాగించగా భక్తకోటికి దివ్య అనుభూతినిచ్చాయి. విద్వాన్ శ్రీరంగం శల్వనారాయణన్ నేతృత్వంలో నాదస్వర, శాక్సోఫోన్ మంగళ వాయిద్యాలు ఉత్సవాలకు ప్రత్యేక హంగులు అద్దాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన పదవ రోజైన ఆదివారంనాడు చెలువ నారాయణస్వామికి లాంఛనప్రాయంగా పుష్ప సమర్పణంతో సమాప్తమయ్యాయి. నేత్రపర్వంగా కృష్ణ రాజముడి బ్రహ్మోత్సవాలు వజ్ర, స్వర్ణ సింహాసనాలతో ఊరేగింపు -
బకాయి వేతనాలు చెల్లించరా?
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్‌వర్క్ కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్‌వర్క్ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాగలింగ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, వసంత కుమార్‌ను వేర్వేరుగా కలసి వినతిపత్రాలు అందజేశారు. మునిరాబాద్‌లో జరగనున్న ఐసీసీ సమావేశంలో బకాయి వేతనాల చెల్లింపులపై చర్చించాలని కోరారు. ఏడాదిగా పనులు లేకపోవడంతో వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకుని టాస్క్‌వర్క్ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. నీరు విడుదల చేయిస్తాంరాయచూరు రూరల్: తుంగభద్ర జలాశయం ఎడమ కాలువకు నీరు విడుదల చేయిస్తామని మాజీ మంత్రి బోసురాజ్ రైతులకు హమీ ఇచ్చారు. ఆదివారం ిసిరవార పరిధిలోని కాలువలను పరిశీలించి మాట్లాడారు. ఈనెల 11వ తేదీన తుంగభద్ర నీటి సలహా సమితి సమావేశం జరగుతుందన్నారు. డ్యాంలో నీటి లభ్యతను బట్టి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు. రాయచూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు నీరు అందించేలా అధికారులతో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, అధికారిణి విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి రాయచూరు రూరల్: అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ తెలిపారు. ఆదివారం మాన్వి తాలూకా అరోలిలోని హులిగమ్మ ఆలయం ముందు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసన సభ్యులు ఏకతాటిపై ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ముందుకొస్తే అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. నూతన చెరువుల నిర్మాణాలకు రూ.5 కోట్లు, రహదారికి రూ.2 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. కటకటాల్లోకి ఘరానా దొంగ హుబ్లీ: ఘరానా దొంగను పోలీసులు కటకటాలోకి నెట్టారు. ధార్వాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఇళ్లలో చోరీలు, ఓ ఆలయంలో దొంగతనం, ద్విచక్ర వాహన చోరీ కేసులో దొంగను ఎట్టకేలకు పోలీసులు బంధించారు. నిందితుడు హుబ్లీకి చెందిన అసిఫ్ కాశింసాబా బేగ్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి ఓ కేసులో రూ.5.04 లక్షల విలువ చేయూ 42 గ్రాముల బంగారు ఆభరణాలు రూ.4,500 విలువ చేసే 20 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.30 వేల విలువైన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యం సాక్షి, బళ్లారి: విద్యతోనే అభివృద్ధి సాధ్యం. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని కర్ణాటక రక్షణ వేదిక ప్రముఖులు పేర్కొన్నారు. కరవె జిల్లా అధ్యక్షుడు అంగడి శంకరప్ప జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మోకా కర్ణాటక పబ్లిక్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు సమయం వృథా చేసుకోకుండా లక్ష్యం వైపు దూసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కర్ణాటక రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు శంకరప్ప, ఉపాధ్యక్షుడు శివకుమార్, తాలూకా కరవే అధ్యక్షుడు పంపనగౌడ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాల్గొన్నారు. సృజనాత్మకకు వేదిక హ్యాకథాన్ మండ్య: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడానికి హ్యాకథాన్లు ఉత్తమ వేదిక అని కావేరీ టెక్నికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. ఎస్. శ్రీకాంతప్ప అన్నారు. తాలూకాలోని సుందహళ్లి సిఐటి కళాశాల ప్రాంగణంలో కావేరీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ర్యాంక్బుక్ లెర్నింగ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి ప్రాక్టికల్ టెక్నికల్ పోటీ (హ్యాకథాన్)ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫుల్‌స్టాక్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ టెక్నాలజీకి సంబంధించిన సమస్యలపై సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని ఆయన వివరించారు. హుబ్బళ్లి, ధార్వాడ్, దావణగెరెతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల నుండి విద్యార్థులు వచ్చారు. -
హెలిప్యాడ్ నిర్మాణం వద్దు
హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హెలిప్యాడ్ నిర్మించాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్.విరుపాక్షి పూజరహళ్లి, రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (కేఎస్‌ఐఐడీసీ) అధ్యక్షుడు ఎస్.జీ నంజయనమఠ్్కు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్ట్ స్థలాన్ని తనిఖీ చేయడానికి వచ్చిన కేఎస్‌ఐఐడీసీ అధ్యక్షుడు ఎస్జీ నంజయనమఠ్తో పాటు సబ్ డివిజనల్ అధికారి పి.వివేకానంద, తహలాస్దీర్ శృతి ఎం.మల్లప్ప గౌడను విశ్వవిద్యాలయ అధికారులు, విద్యార్థులు అడ్డుకున్నారు. విశ్వవిద్యాలయ భూమిలో హెలిప్యాడ్ అభివృద్ధి చేసే ప్రణాళికను విశ్వవిద్యాలయ పరిపాలన స్పష్టంగా వ్యతిరేకించిందన్నారు. వీఐపీ హెలికాప్టర్ల ల్యాండింగ్, టేకాఫ్ కోసం భూమిని అప్పగించాలన్న విజయనగర జిల్లా కలెక్టర్ కార్యాలయం అభ్యర్థనపై మండిపడ్డారు. ఆ భూమిని ఇవ్వడం సాధ్యపడదని విజయనగర విశ్వవిద్యాలయ ఇప్పటికే స్పష్టంగా వ్యతిరేకించిందని తెలిపారు. -
హైకోర్టు అదనపు జడ్జిల ప్రమాణం
సాక్షి బెంగళూరు: రాష్ట్ర హైకోర్టులో ఆరుమంది అదనపు జడ్జిలు చేరారు. ఆదివారం లోక్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సమక్షంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బక్రు వారి చేత ప్రమాణం చేయించారు. సీఎం డీకే శివకుమార్, పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొని జడ్జిలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అదనపు జడ్జిల వివరాలు.. ● జస్టిస్ రాఘవేంద్ర సీతారామ్ శ్రీవత్స ● హేమా కులకర్ణి ● సుబ్రమణ్య రంగారావు ● డగవాడి ప్రకాశ్ వివేకానంద ● బక్కేశ్వర ప్రమోద్ ● హోంబేగౌడ శాంతి భూషణ్ ప్రమాదంలో జానపద కళలుమండ్య: ఆధునికత, పెట్టుబడిదారీ విధానం ప్రభావం వల్ల గ్రామీణ జానపద కళలు కనుమరుగవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ గొల్లహళ్లి శివప్రసాద్ అన్నారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో గాంధీ భవన్లో జరిగిన జానపద సంబ్రాహ్మణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జానపదాలు ఈ నేల యొక్క గుర్తింపు అని, అవి శ్రమకు చిహ్నమని అన్నారు. జానపదాలలో కష్టపడి పనిచేసే జీవితం దాగి ఉందని, అందులో సంగీతం, సాంస్కృతిక వైవిధ్యం, జీవితం ఎలా ఉండేదో, ఎలా ఉండాలో చెప్పే శాసీ్త్రయ సందేశం ఉందని వివరించారు. ఆధునిక జీవితపు హడావుడిలో గ్రామీణ జానపద కళలు కనుమరుగవుతున్నాయని, వాటిని నిత్య జీవితంలోకి తీసుకురావడం ద్వారా పునరుద్ధరించాలని తెలిపారు. సాంస్కృతిక కళలు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో జానపద శాస్త్ర తరగతులను నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా జనపద కళాకారుల ప్రదర్శనలు రంజింపజేశాయి. గజ దాడిలో అటవీ ఉద్యోగి మృతిమైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలే మహదేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని పొన్నాచి వద్ద హునసే బయలు అడవిలో ఏనుగు దాడిలో ఫారెస్ట్ రేంజర్ చనిపోయాడు. మలే మహదేశ్వర బెట్ట నివాసి అయిన మహాదేవస్వామి (48) మృతుడు. ఆయన సుమారు 20 ఏళ్లుగా అక్కడే ఫారెస్ట్ రేంజర్‌గా పనిచేస్తున్నాడు. వేటగాళ్లు రాకుండా గస్తీ కాస్తుండగా, ఏనుగు వేగంగా వచ్చి ఆయనపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడి స్పహ కోల్పోయాడు. మరో ఇద్దరు సిబ్బంది ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నారు. ఇతర సిబ్బంది వెంటనే ఆయనను కొల్లేగాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో మరణించాడు. కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు కోరారు. -
బిడది.. తగదిది
బనశంకరి: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రవివాదానికి కారణమైన బిడది టౌన్షిప్ పథకానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్‌లు పోరాటానికి నాంది పలికాయి. బిడదిలో టౌన్షిప్ నిర్మాణానికి ఒప్పుకునేది లేదని ప్రకటించాయి. ఆదివారం బిడదిలోని బైరమంగల నుంచి బెంగళూరు ఫ్రీడం పార్కు వరకు 3 రోజుల జేడీఎస్–బీజేపీ పాదయాత్రకు కేంద్రమంత్రి హెచ్డీ.కుమారస్వామి, బీజేపీ పక్షనేత ఆర్.అశోక్ నాంది పలికారు. కుమారస్వామి మాట్లాడుతూ... బిడది టౌన్షిప్ పథకానికి తాను సీఎంగా ఉన్నప్పుడే ఆమోదం తెలిపామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కానీ తాను ఆమోదం ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఈ ప్రాంత రైతులు, మహిళలు గత 516 రోజుల నుంచి నిరంతర ఆందోళనలు చేస్తున్నారన్నారు. సారవంతమైన, పచ్చని పంట భూమిలో టౌన్షిప్ కట్టరాదని డిమాండ్ చశారు. ఆర్.అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, తాము అంగీకరించబోమని చెప్పారు. శాసనసభ లోపల, బయట తీవ్ర పోరాటం చేస్తామన్నారు. జేడీయస్ యువజన అధ్యక్షుడు నిఖిల్ మాట్లాడుతూ బిడది టౌన్‌షిప్‌తో రైతులకు మరణ శాసనం రాస్తోందన్నారు. కాగా, వందలాది మంది పాదయాత్రలో పాల్గొన్నారు. 11వ తేదీ మధ్యాహ్నానికి ఫ్రీడంపార్కుకు చేరుకుని భారీ సభ నిర్వహిస్తారు. బిడదిని ప్రపంచ ఏఐ సిటీ చేస్తాం: సీఎం బనశంకరి: ‘చాలా ఏళ్లుగా పక్కనపెట్టిన బిడది టౌన్షిప్ పథకాన్ని మళ్లీ ప్రారంభించి, ప్రపంచస్థాయి రోడ్లు, మెట్రో రైలు వసతి, క్రీడామైదానాలు, పార్కులు, ఆధునిక సౌకర్యాలతో కూడిన ఏఐ సిటీగా అభివృద్ధి చేస్తాం అని సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ప్రతిపక్షాల యాత్ర నేపథ్యంలో ఆయన ఆదివారం ఎక్స్‌లో ఈ పోస్టు చేశారు. గ్రేటర్ బెంగళూరు కింద చేపట్టే బృహత్ పథకంతో బెంగళూరు దక్షిణ జిల్లా రూపురేఖలు మారిపోతాయన్నారు. రైతుల క్షేమానికి పెద్దపీట వేశామన్నారు. బిడదిలో గత ప్రభుత్వం ఎకరాకు రూ.25 లక్షలు నిర్ణయించగా, తమ సర్కారు ఎకరాకు రూ.3 కోట్లకు పైగా పరిహారం అందిస్తుందన్నారు. డబ్బుకు బదులు భూమి ఇష్టపడే రైతులకు 50 శాతం అభివృద్ధి చేసిన స్థలం ఇస్తామని, భూములు ఇవ్వడం ఇష్టం లేని రైతులపై ఎలాంటి ఒత్తిడీ లేదన్నారు. యువతకు అపారమైన ఉద్యోగ అవకాశాలు, అన్నదాతలకు గౌరవ జీవనానికి కట్టుబడి ఉన్నామన్నారు. రైతుల పొట్టకొట్టొద్దు కేంద్రమంత్రి కుమారస్వామి బెంగళూరుకు ప్రతిపక్షాల పాదయాత్ర -
బ్యాంకు కాటుకు రైతు దెబ్బ!
టిట్ ఫర్ ట్యాట్ అనండి.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనండి.. ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి. హాసన్ జిల్లా సకలేశ్పుర కెనెరాబ్యాంకులో జరిగిన ఈ ఘటన మాత్రమిప్పుడు సోషల్ మీడియాలో పిచ్చవైరల్ అవుతోంది. ‘‘రైతన్నా.. పొగరుబోతు బ్యాంకుకు భలే బుద్ధి చెప్పావు’’అన్న కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే... చొక్కన గౌడ అనే రైతు కెనెరాబ్యాంకు నుంచి యాభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఠంచనుగా తిరిగి కట్టేశాడు కూడా. హమ్మయ్య అప్పు బాధ తీరిందిలే అనుకుని ఇంటికెళితే.. కొంత కాలానికే బ్యాంకు నుంచి ఒక నోటీసొచ్చింది. ఇదేమిటబ్బా అని చూస్తే అతడికి షాక్.. ‘‘ఇంకో 9.34’’రూపాయలు బాకీ ఉన్నావు. కట్టూ అంటూ బ్యాంకు తాఖీదు. బ్యాంకు అధికారుల అతికాకపోతే.. రూ.యాభై వేలు కట్టినోడికి తొమ్మిది రూపాయల ముప్ఫై నాలుగు పైసలు ఎక్కువవుతుందా? చొక్కన గౌడ కూడా ఇలాగే ఫీలయ్యాడు. సరే అనుకుని బ్యాంకుకు వెళ్లాడు. మిగిలిన బాకీ వివరాలతో పే ఇన్ స్లిప్ నింపాడు. పది రూపాయల నోటు జత చేసి బ్యాంకు అధికారికి ఇచ్చాడు. వాళ్లేమో భలే నిక్కచ్చిగా పనిచేశాము మేము అనుకుని భుజాలు చరుచుకుని సీలు వేసిన స్లిప్‌ను చొక్కనగౌడకు రిటర్న్ ఇచ్చాడు. అక్కడ మొదలైంది తకరారు. ‘‘పది రూపాలిచ్చా. మీకివ్వాల్సింది రూ.9.34. ఆ విషయమే స్లిప్‌లో రాశా. మీరు సీల్ కూడా వేశారు. మరి... బాకీ 66 పైసల మాటేమిటి?’’అన్నాడు చొక్కనగౌడ. నోట మాట రాలేదు బ్యాంకు అధికారులకు. ఈ ఘటన ఫిబ్రవరిలోనే జరిగినప్పటికీ తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది. కొసమెరుపు ఏమిటంటే.. చొక్కనగౌడ డిమాండ్‌కు తలొగ్గిన బ్యాంకు 66 పైసల మొత్తాన్ని అతడి ఖాతాలోకి జమ చేయడం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మినీ బంగ్లాదేశ్‌లపై పోలీసుల దాడులు
బనశంకరి: పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల నుంచి సిలికాన్ సిటీకి నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు ఉదయమే చేరుకుంటాయి. వాటిలో నుంచి వేలాది మంది వలస కార్మికులు దిగుతారు. నగరంలో పనులు వెతుక్కుంటూ ఇక్కడే స్థిరపడిపోతున్నారు. కానీ వారిలో భారతీయులు కానివారు ఎంత మందో ఎవరికీ తెలియదు. అక్రమంగా వలస వస్తున్న బంగ్లాదేశీలతో పలు రకాలు నేరాలు పెరగడంతో బెంగళూరు పోలీసులు మేలుకున్నారు. వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీలో బెంగళూరు నగరంలో అక్రమంగా మకాం వేసిన బంగ్లాదేశీ వలసదారులపై నగర పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ‘ఆపరేషన్ ముక్త’ పేరుతో శనివారం 50 చోట్లకు పైగా దాడులు నిర్వహించారు. సుమారు 2 వేలమందికి పైగా బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుని వారి గుర్తింపు కార్డుల పరిశీలనతో పాటు విచారణ ప్రారంభించారు. వర్తూరు, కాడుగోడి, మారతహళ్లి, బెల్లందూరు, ఎలక్ట్రానిక్ సిటీ, బేగూరు, బండేపాళ్యతో పాటు వివిధ ప్రదేశాల్లో షెడ్లు వేసుకుని స్థిరపడిన బంగ్లావాసులపై పోలీసులు దాడిచేశారు. ఈ ప్రాంతాలు వేలాది షెడ్లతో మినీ బంగ్లాదేశ్‌లుగా మారాయని ఆరోపణలున్నాయి. దాఖలాల తనిఖీ వలసవాసులు ఇక్కడకు వచ్చాక తీసుకున్న ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డుతో పాటు వివిధ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి ఊరి, పేరు, వృత్తి వివరాలను సేకరించడంతో పాటు షెడ్లలో సోదాలు చేశారు. ఇక్కడ పురుషులు, మహిళలతో పాటు వందలాది కుటుంబాలు స్థిరపడ్డాయి. నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ సూచన మేరకు బంగ్లా వలసదారులపై కార్యాచరణ జరుగుతోందని వైట్‌ఫీల్డ్ డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. 500 మందికిపైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానితులను విదేశాంగ శాఖ విభాగం (ఎఫ్ఆర్ఆర్ఓ) ముందు హాజరుపరుస్తామని తెలిపారు. అక్రమంగా వలస వచ్చారని రుజువైతే వారి దేశానికి పంపించే చర్యలు తీసుకుంటామని సైదులు తెలిపారు. బెంగళూరులో పలుచోట్ల ముమ్మర తనిఖీలు -
పూల సొబగులు కనులవిందు
బనశంకరి: నిత్యం ఇల్లు, ఆఫీసు పనుల్లో నిమగ్నమై ఉండే మహిళలు ఫ్లవర్ షోలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉద్యాననగరి లాల్‌బాగ్‌లో ఈ నెల 6వ తేదీన ఆరంభమైన ఫల పుష్ప ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. అదే మాదిరిగా లాల్‌బాగ్‌లోని ఆడిటోరియంలో పలు ప్రదర్శనలు జరుగుతున్నాయి. పండ్ల, కూరగాయలను అందంగా తీర్చిదిద్దడం, జపాన్ శైలిలో పుష్ప అలంకారం (ఇకెబనా), పూలతో ముగ్గులు, పొట్టి చెట్ల ప్రదర్శన పోటీలను శనివారం ప్రారంభించారు. కళింగర, గుమ్మడి తదితర పండ్లపై మహనీయులు ఆకారాలను చెక్కారు. మహిళలు పూలతో రంగవల్లులు రూపొందించారు. కాగా, మధ్యాహ్నం నుంచి నుంచి ఓ మోస్తరు వర్షం ప్రారంభం కావడంతో పుష్ప ప్రదర్శనలో కొంత రద్దీ తగ్గింది. లాల్‌బాగ్‌లో పోటీలు -
భక్తిశ్రద్ధలతో మురుగన్ ఆడి కృత్తిక
హొసపేటె: తాలూకాలోని కడ్డిరాంపురలో మురుగన్ ఆలయం 53వ శంకుస్థాపన వార్షికోత్సవాన్ని వందలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఆడి కృత్తిక మహోత్సవంలో భాగంగా ఉదయం ఆలయం నుంచి గంగమ్మ ఊరేగింపు జరిగింది. అక్కడ కావడిలకు అభిషేకం చేసి అలంకరించారు. అనంతరం కావిడి, పూర్ణ కుంభాలను మోసుకుంటూ ఊరేగింపుగా వెళ్లారు. కృత్తిక మహోత్సవంలో భాగంగా భక్తి పరాకాష్టకు చేరింది. భక్తులు తమ వీపులకు ఇనుప కొక్కాలను కట్టుకుని రాళ్లను, ఆటోలను లాగడం, జేసీబీ యంత్రానికి తాళ్లు కట్టుకుని ఉయ్యాలలా ఊగడం ద్వారా తమ భక్తిని చాటారు. కడ్డిరాంపుర, హంపీ, కమలాపుర తదితర చోట్ల నుంచి ఆడికృత్తిక మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మురుగన్ స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వేడుకల్లో పాల్గొన్న భక్తులు -
అక్రమ డిపాజిట్ల కేసులో ఈడీ తనిఖీలు
బనశంకరి: బెళగావి నగరంలో ఆఫీసు తెరిచి వేలాది మంది నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన కేసులో శివానంద నీలణ్ణవర్కు చెందిన శివం అసోసియేట్స్ కంపెనీ ఆస్తిపాస్తులపై ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. శుక్రవారంతో పాటు శనివారం కూడా బెళగావిలోని శివబసవ నగరలోని ఎంహెచ్ టవర్‌లో సోదాలు నిర్వహించారు. పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో వడ్డీలు, లాభాలు ఇస్తామని వేలాది మంది ఉద్యోగులు, ప్రజల నుంచి ఇతడు రూ.4 వేల కోట్లకు పైగా వసూలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఆ డబ్బుతో జల్సాలు, ఆస్తుల కొనుగోళ్లు చేసుకున్నాడు. కోట్లాది రూపాయల జాడ లేదు. దీనిపై సీడీఐ దర్యాప్తు చేస్తోంది. ఇంతలో ఈడీ కూడా అక్రమ నగదు బదిలీ కింద కేసు నమోదు చేసి దాడులు తీవ్రతరం చేసింది. బెళగావి, చిక్కోడి, హుక్కేరి సహా అతని బంధువుల ఇళ్లలో సీఆర్పీఎఫ్ భద్రతతో సోదాలు జరుగుతున్నాయి. కేవలం ఫైళ్లకు పరిమితం కాకుండా ఇళ్లు, ఆఫీసుల్లో లభించిన ప్రతి ఆధారాన్ని పరిశీలించి ఆర్థిక మోసాలపై సమాచారం రాబడుతున్నారు. అతని భార్య, సోదరున్ని ప్రశ్నించారు. కాగా ఇటీవల బెయిలుపై విడుదలపై శివానంద ఈడీ దాడులకు కొంతసేపు ముందు పరారైనట్లు తెలిసింది. -
విజయనగరలో తీవ్ర వర్షపాత లోటు
హొసపేటె: ప్రస్తుత వర్షాకాలంలో విజయనగర జిల్లా తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటోంది. జిల్లా తీవ్ర కరువుతో అల్లాడుతోంది. జూన్ 1 నుంచి ఆగస్టు 6 వరకు సాధారణ వర్షపాతం 188.7 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. ఇది 60 శాతం వర్షపాత లోటును సూచిస్తున్న నేపథ్యంలో రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని జిల్లా ఇంచార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఆయన జిల్లాలో కరువు అధ్యయనం నిర్వహించి, జిల్లాధికారి కార్యాలయ హాలులో అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరువు అధ్యయనం చేపట్టి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. రైతుల రుణాల మాఫీ విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని రైతులకు తెలిపారు. జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేయాలని జిల్లాధికారిని ఆదేశించారు. జలాశయంలో నీరు అందుబాటులో ఉన్నందున తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 56 ప్రైవేట్ బోరుబావుల నుంచి నీటి సరఫరా జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో హరపనహళ్లి ఎమ్మెల్యే లతా మల్లికార్జున, హడగలి ఎమ్మెల్యే కృష్ణానాయక్, జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి నోంగ్‌జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, ఎస్పీ జాహ్నవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కరువు నివారణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం జిల్లా ఇంచార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ -
భూబాధితులకు న్యాయం చేయండి
రాయచూరు రూరల్: హట్టి బంగారు గనుల కోసం భూములు పోగోట్టుకున్న రైతులకు న్యాయం చేయాలని లింగసూగూరు మాజీ ఎమ్మెల్యే హొలిగేరి డిమాండ్ చేశారు. శనివారం హట్టి బస్టాండ్‌లో ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలిపి ఇంచార్జి మంత్రి అజయ్ సింగ్‌తో మాట్లాడారు. రైతులు బ్యాంక్‌లో రుణాలు పొందాలంటే భూమి ఖాతాలో హట్టి గని స్థలమని పేర్కొనడంతో రైతులు పంటలను సాగులు చేయడం కష్టమైందన్నారు. 450 ఎకరాల భూమి గని పేరు మీద నమోదు కావడం విడ్డూరంగా ఉందన్నారు. భూములు పోగొట్టుకున్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. జిల్లాధ్యక్షుడు వలీబాబు, శంకర గౌడ, నారాయణప్ప, సరస్వతి, సంగీత, ఈరమ్మ, నింగప్ప, శివరాజ్, వెంకోబ, శరణప్ప, మల్లికార్జునలున్నారు. -
గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్
హుబ్లీ: అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నగరానికి చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఫర్దీన్, వసీం, మహమ్మద్ జోష్, మల్లిక్ రేహాన్ కార్వార రోడ్డు ఎంటీఎస్ కాలనీ రైల్వే క్వార్టర్స్ బహిరంగ స్థలంలో బ్యాగ్‌లో గంజాయిని పెట్టుకొని విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. పాత హుబ్లీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మరో ఘటనలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. హుబ్లీ ధార్వాడ బైపాస్‌లోని తారిహళ్లి పారిశ్రామికవాడ దగ్గర బొలెరో ఢీకొని ఒకరు మృత్యువాత పడ్డారు. బ్యాడగి తాలూకా కాగినెలె నివాసి మహమ్మద్ సలీం(27) మృతుడు. ఖలంధర్, మహమ్మద్ సలీం వెళుతుండగా కబ్బూరు వైపు నుంచి వచ్చిన బొలెరో అదుపు తప్పి ఢీకొనడంతో బైక్ చోదకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స ఫలించక మృతి చెందినట్లు హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేబినెట్లో సీనియర్లకు చోటివ్వండిరాయచూరు రూరల్: రాష్ట్రంలోని డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సేవా దళ్ అధ్యక్షుడు కే.లక్ష్మికాంతరెడ్డి బూర్దిపాడు డిమాండ్ చేశారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందించిన సీనియర్ నాయకులకు పార్టీ అగ్రనేతలు, ముఖ్యమంత్రి మంత్రి పదవిని కేటాయించాలన్నారు. దుర్భిక్ష ప్రాంతంగా ప్రకటించరూరాయచూరు రూరల్: రాష్ట్రాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించి రైతుల బ్యాంక్ రుణాలను రద్దు చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు మరిస్వామి డిమాండ్ చేశారు. శనివారం దేవదుర్గ తాలూకాలో ఇంచార్జి మంత్రి అజయ్ సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు పొలంలో వేసిన పంటలు వర్షాలు లేక వాడుముఖం పట్టాయని, నగర, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తోడు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని కోరారు. యాదగిరిలో పాత్రికేయుడు కిడ్నాప్రాయచూరు రూరల్: పాత్రికేయుడు కిడ్నాప్‌నకు గురైన ఘటన యాదగిరిలో చోటు చేసుకుంది. శనివారం యాదగిరిలోని లుంబిని పార్కు వద్ద సాగర్ దేశాయి స్కూటర్‌పై వెళుతుండగా, అతడిని అడ్డుకుని కారులో తీసుకెళ్లినట్లు తెలిసింది. దేశాయి కిడ్నాప్‌నకు కారణాలు తెలియ రాలేదు. యాదగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనం ఢీకొని వ్యక్తి మృతి హుబ్లీ: హుబ్లీ– గదగ్ రోడ్డులో పంచగంగా లేఅవుట్లోని ఖాళీ స్థలం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హుబ్లీ తూర్పు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, అతడి ఆచూకీ తెలిసిన వారు హుబ్లీ తూర్పు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. మరో ఘటనలో హుబ్లీ రైల్వే స్టేషన్లో అస్వస్థతకు గురైన సుమారు 60–65 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని చికిత్స కోసం కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు హుబ్లీ రైల్వే పోలీసుస్టేషనులో సంప్రదించాలని పోలీసులు ఓ ప్రకటనలో కోరారు. కేకేఆర్డీబీ అధ్యక్ష పదవిని కేటాయించాలిరాయచూరు రూరల్: ముఖ్యమంత్రి డీ.కే.శివ కుమార్ కేబినెట్లో జిల్లాకు మంత్రి పదవి కేటాయించనందున కళ్యాణ కర్ణాటక గ్రామీణ అభివృద్ధి మండలి(కేకేఆర్డీబీ) అధ్యక్ష పదవినైనా కేటాయించాలని రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మూడేళ్ల పాటు జిల్లాకు మంత్రి పదవి లేకుండా చేశారని, మరో రెండేళ్ల పాటు ఇతరులకు ఇంచార్జి మంత్రి పదవిని కేటాయించి అన్యాయం చేశారని, దానిని సరి చేయాలంటే కేకేఆర్డీబీ అధ్యక్ష పదవిని రాయచూరు జిల్లాకు కేటాయించాలని కోరారు. -
బస్సులు రాకుంటే, చదివేదెలా?
తుమకూరు: జిల్లాలోని శిరా తాలూకా హొసూరు గ్రామానికి కేఎస్ఆర్టీసీ బస్సు సమయానికి రావడం లేదు, బస్సు డ్రైవర్, కండక్టర్లు తమ సమస్యలపై స్పందించడం లేదని హొసూరు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు శిరా కేఎస్ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ధర్నా చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ తావరకెరె గ్రామానికి బూతప్పనగుడి, కళువరహళ్లి, రంగనహళ్లి, గోమారదనహళ్లి, హొసహళ్లి, పురలెహళ్లి, హొసూరుతో పాటు వివిధ గ్రామాల నుంచి రావడానికి సమయానికి బస్సులు లేవని వాపోయారు. రోజూ ఇబ్బందులు పడుతున్నట్లు, సరిగా చదువుకోలేకపోతున్నామని చెప్పారు. ఆర్టీసీ అధికారులు వెంటనే బస్సులను సకాలంలో నడపాలని కోరారు. స్కూటర్‌ను సిటీ బస్సు ఢీ, యువతి బలి మైసూరు: మైసూరులో కేఎస్ఆర్టీసీ బస్సు– స్కూటర్‌ను ఢీకొనడంతో ఒక విద్యార్థిని మరణించింది. మైసూరు, శ్రీరాంపుర నివాసి గోవిందు కుమార్తె కీర్తన (19) అనే బీసీఏ విద్యార్థిని మరణించగా, మరో యువతికి గాయాలయ్యాయి. కీర్తన, స్నేహితురాలు హర్షిణితో కలిసి నగరంలోని పంచమాత్ర రోడ్డుపై స్కూటర్‌పై వెళ్తోంది. జ్ఞానగంగ స్కూల్ జంక్షన్ వద్ద సిటీ బస్‌ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో, బస్సు స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువతులూ కింద పడిపోయారు, బస్సు ముందు చక్రం కీర్తనపై నుంచి దూసుకెళ్లింది. స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, కొంతసేపటికే కీర్తన చనిపోయింది. కువెంపునగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నగరంలో సిటీ, ప్రైవేటు బస్సులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. బోనులో చిరుత బందీ తుమకూరు: జిల్లాలోని తురువెకెరె తాలూకా చిమ్మనహళ్లి గ్రామంలోని శ్రీమునేశ్వర స్వామి దాసోహ మఠం వద్ద బోనులో ఆడ చిరుత చిక్కింది. వారం రోజులుగా కొండజ్జి, చిమ్మనహళ్లి, దొడ్డగోరాఘట్ట ప్రాంతాల్లో మూడు నాలుగు చిరుతలు తిరుగుతూ ఉండడంతో ప్రజల్లో భయం నెలకొంది. చిమ్మనహళ్లి మునేశ్వర దేవస్థానం వెనుక ఓ చిరుత తిరుగుతోంది. అక్కడ అటవీ సిబ్బంది బోనులు పెట్టగా, రెండున్నరేళ్ల వయస్సుగల ఆడ చిరుత బందీ అయింది. ఇంకా 2–3 చిరుతలు ఈ ప్రాంతంలో ఉన్నాయని, వాటిని కూడా పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పట్టుబడిన చిరుతను దూరంగా తరలించారు. -
ఆలయంలో చోరీ.. ముగ్గురి అరెస్ట్
రాయచూరు రూరల్ : ఆలయంలో చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు విజయపుర జిల్లా ఎస్పీ లక్ష్మణ నింబర్గి వెల్లడించారు. శుక్రవారం ముద్దేబిహాళ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముద్దేబిహాళ్ తాలూకా బసరకోడు గ్రామంలోని బసవేశ్వర ఆలయంలో బుధవారం రాత్రి ఆలయంలోకి చొరబడి 32 కేజీల వెండి ఆభరణాలను దుండగులు దొంగలించారని తెలిపారు. ఈ విషయంపై ముద్దేబిహాళ్ పోలీసు అధికారులు చంద్రశేఖర్, మహ్మద్ ఫసియుద్దీన్, తిప్పారెడ్డిల సహకారంతో గుజరాత్‌కు చెందిన సంతోష్, కుమార్, ఇంద్రజిత్, కమ్మార్లను అరెస్ట్ చేశారన్నారు. నిందితుల నుంచి రూ.52 లక్షల విలువ చేసే 32 కేజీల వెండి వస్తువులను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. -
డ్యాం నిండాలని చాలీసా పఠనం
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే ఉమ్మడి జలాశయం తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి హనుమాన్ చాలీసా పఠించారు. ఆయన శనివారం హొసపేటె సమీపంలోని తుంగభద్ర డ్యాం వద్ద కొండపై వెలసిన శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం 108 సార్లు హనుమాన్ చాలీసాను పఠించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే శ్రీఆంజనేయస్వామి హనుమాన్ చాలీసా చదివి ప్రార్థిస్తే కచ్చితంగా కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉందన్నారు. గతంలో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించి డ్యాం నిండాలని ప్రార్థించామన్నారు. అదే సంవత్సరం డ్యాం నిండి రైతులకు మంచి పంటలు పండాయన్నారు. ప్రస్తుతం డ్యాం నిండకపోవడంతో ఖరీఫ్ పంట సాగు చేయడానికి రైతన్నలు ఎంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంచి వర్షాలు పడి రైతులు పంటలు పండించుకునేందుకు వీలు కల్పించాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. కచ్చితంగా త్వరలో డ్యాం నిండుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
అవినీతి రూపుమాపాలని నిరసన
హొసపేటె: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్సీ)లో అవినీతిని రూపుమాపాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జాబ్ ఆస్పిరెంట్స్ స్ట్రగుల్ కమిటీ, ఆల్ ఇండియా డెమొక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్(ఏఐడీవైఓ) జిల్లా శాఖ నేతృత్వంలో నిరసన చేపట్టారు. ఏఐడీవైఓ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రిస్వామి మాట్లాడుతూ యువత కలల వెలుగుగా ఉండాల్సిన కేపీఎస్సీలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. నిరసనలో పోరాట సమితి జిల్లా కో–ఆర్డినేటర్ ప్రకాష్ నాయక్, ఏఐడీఎస్ఓ, జేఏసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. దుర్గమ్మ ఆలయానికి విరాళంఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్న దానానికి కర్ణాటకకు చెందిన భక్తులు రూ.2.50 లక్షలు విరాళంగా అందజేశారు. రాయచూరు నగరానికి చెందిన కే.వెంకటరావు, పార్వతి దంపతులు శనివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులకు రూ.2.50 లక్షల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. తాగునీటి సమస్య ఉండబోదు హొసపేటె: రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విజయనగర జిల్లాలో తాగునీటి సమస్య ఉండబోదని జిల్లా ఇంచార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని కూడ్లిగి తాలూకా మొరబ గ్రామంలో కరువు సర్వే నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యాంలో 80 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం డ్యాంలో 70 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందన్నారు. కరువు కారణంగా రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు కష్టమవుతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తామని ఆయన అన్నారు. శాఖల కేటాయింపుపై వ్యాఖ్యానిస్తూ, తనకు ఏ శాఖ ఇచ్చినా నిర్వహించడానికి తాను సిద్ధమని అన్నారు. జాతీయ రహదారి పనుల్లో అలసత్వం తగదు రాయచూరు రూరల్: జిల్లాలో జాతీయ రహదారి పనుల్లో అధికారులకు అలసత్వం తగదని రాయచూరు లోక్‌సభ సభ్యుడు జీ.కుమార్ నాయక్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తన కార్యాలయంలో జాతీయ రహదారి పనుల ప్రగతిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ మాల పథకంలో భాగంగా రాయచూరు–హునగుంద మధ్య చేపడుతున్న జాతీయ రహదారి పనుల్లో నాణ్యత కొరవడిందన్నారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన రహదారి నిర్మాణ పనుల్లో లోపాలను సవరించి శాసీ్త్రయంగా రహదారి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. రహదారిరి వెడల్పుగా చేసి మురుగు కాలువలను చిన్నవిగా చేసి వర్షాకాలంలో నీరు పారకుండా నిర్మాణం చేపట్టడంపై పెదవి విరిచారు. చురుకుగా కాలువ గట్టు మరమ్మతులు రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువపై మైలాపూర్, దుర్గా క్యాంప్‌ల మధ్య కుదించుకు పోయిన సిమెంట్ కాంక్రీట్ కాలువ గట్టు మరమ్మతు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 11న తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం ఏర్పాటు చేసి కాలువలకు నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి శివరాజ్ తంగడిగి మరమ్మతు పనులను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడంతో యంత్రాల సాయంతో పనులను శరవేగంగా చేపడుతున్నారు. -
విద్యా రంగానికి వీరశైవ సంస్థల సేవలు భేష్
సాక్షి,బళ్లారి: స్వాతంత్య్రానికి పూర్వం నుంచి వీరశైవ విద్యాసంస్థ విద్యారంగానికి చేసిన సేవలు మరవలేనివని, కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర భారీ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్ పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని హీరద సూగమ్మ పాఠశాల శతాబ్ధి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ప్రజలకు విద్య అందించేందుకు వీరశైవ సంఘం విద్యా సంస్థలను ప్రారంభించారని గుర్తు చేశారు. పాఠశాలలు, కళాశాలలు, ఉచిత హాస్టల్స్ నిర్మించి కులమతాలకతీతంగా పేద విద్యార్థులను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందన్నారు. కర్ణాటకలో సిద్దగంగా మఠం, కొప్పళ గవిసిద్దేశ్వర మఠం వంటి సంస్థలు పాఠశాలల ద్వారా విద్యార్థులకు విద్యనందిస్తున్న తరహాలో ఈ సంస్థలు విద్యాభివృద్ధి దోహదం చేస్తున్నాయన్నారు. పేదరిక నిర్మూలన విద్య ద్వారానే సాధ్యం అని భావించి ఆ దిశగా అడుగులు వేశారన్నారు. మేమూ ఇక్కడే చదువుకున్నాం మంత్రి నాగేంద్ర మాట్లాడుతూ తాను, తన తండ్రి ఇద్దరూ నాడు ఈ సంఘానికి చెందిన విద్యా సంస్థల్లోనే చదువుకున్నామన్నారు. విద్యారంగానికి వీరశైవ విద్యావర్ధక సంఘం అందించిన సేవలు ఆపారమన్నారు. వెనుకబడిన వర్గాలతో పాటు అన్ని వర్గాల వారికి అక్షర దాసోహం చేసిన ఘనత ఈ సంఘానికి దక్కుతుందన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ హీరద సూగమ్మను అక్షర అవ్వగా అభివర్ణించారు. ఎమ్మిగనూరు మహాంత మఠం స్వామీజీ, కమ్మరచేడు కళ్యాణ స్వామీజీ, మేయర్ గాదెప్ప, మాజీ మంత్రి అల్లం వీరభద్రప్ప, మాజీ ఎమ్మెల్సీ శశీల్ నమోశి, వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు మహంతేష్, సంఘం ప్రముఖులు జానెకుంట బసవరాజు, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బీ. పాటిల్ -
నిలిచిన లారీని కారు ఢీ.. ముగ్గురు దుర్మరణం
యశవంతపుర: వారాంతపు టూర్ విషాదంగా మారింది. రోడ్డు పక్కలో నిలిపి ఉన్న గ్యాస్ సిలిండర్ల లోడు లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా కొట్టిగేహర దగ్గర జరిగింది. తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాకు చెందిన గురుకిరణ్ (28), మోహన్ (30), జ్ఞానేశ్ (28) మృతులు. గాయాలైన ప్రేమ్‌కుమార్, హృతిక్ హాసన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీకెండ్ కావడంతో తుమకూరు నుంచి ధర్మస్థళకు కారులో బయల్దేరారు. వేగం వల్ల అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన నిలిచి ఉన్న సిలిండర్ల లారీని ఢీకొనడంతో తుక్కయింది. బిర్యానీ గొడవ.. హోటల్‌పై దాడియశవంతపుర: బెంగళూరులో పుట్టగొడుగుల బిర్యానీలోకి నంజుకోవడానికి చట్నీ ఇవ్వలేదనే కోపంతో హోటల్ యజమానిపై కస్టమర్లు దాడి చేసి క్యాష్ కౌంటర్, టెంట్‌ను ధ్వంసం చేశారు. నాగరబావి సువర్ణ లేఔట్లో ఈ ఘటన జరిగింది. అప్పు మష్రూం బిర్యానీ హోటల్‌కు వెళ్లిన ఇద్దరు బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానీలోకి చట్నీ ఇవ్వలేదని, వట్టి బిర్యానీ ఎలా తినాలంటూ గొడవకు దిగారు. కోపం పట్టలేక క్యాష్ కౌంటర్, టెంట్‌ను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి చేశారు. హోటల్ యజమాని అన్నఫూర్ణేశ్వరినగర పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిసింది. రెండు రోజుల క్రితం ఈ గొడవ జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూలిన సర్కారీ బడి ప్రహరీ ● నాలుగేళ్ల పాప మృతి ● కొడగు జిల్లాలో ప్రమాదం యశవంతపుర: పాఠశాల కాంపౌండ్ కూలిపడి నాలుగేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. ఈ విషాదం కొడగు జిల్లా మడికెరి దగ్గర కుశాలనగర బసవనహళ్లిలో జరిగింది. శుక్రవారం సాయంత్రం వాల్మీకి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న అక్కను తీసుకురావడానికి అపూర్వ (4) పాఠశాల వద్దకు వెళ్లింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షంతో పాఠశాల ప్రహరీ బలహీనంగా ఉంది. ఒక్కసారిగా గేటు, కాంపౌడ్ కూలి చిన్నారిపై పడ్డాయి. తీవ్ర గాయాలతో బాలిక అక్కడే ప్రాణాలు వదిలింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే తమ పాపను బలిగొందని తల్లిదండ్రులు ఆరోపించారు. పెద్దసంఖ్యలో స్థానికులు చేరి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పాఠశాల ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. పరిహారం చెల్లించాలని కుటుంబీకులు పట్టబట్టారు. మైసూరువాసిపై లడఖ్‌లో ఫిర్యాదు మైసూరు: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మైసూరు నగరానికి చెందిన ఒక వ్యక్తి ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్ట్ పెట్టారని జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఒక నివాసి ఫిర్యాదు చేశారు. మైసూరులోని దేవరాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వ్యక్తి అమిత్ షాపై అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారని లడఖ్‌కు చెందిన పైరింగ్ ముత్తాఫ్ అనే వ్యక్తి అక్కడి లేహ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడి పోలీసులు కేసును మైసూరు దేవరాజ్ ఠాణాకు బదిలీ చేశారు. ప్రాథమిక విచారణలో, నిందితుడు బృందావన్ బరంగాయ్‌కు చెందిన యోగిష్ అని తేలగా దర్యాప్తు చేపట్టారు. -
కరువుపై మంత్రుల అధ్యయనం
రాయచూరు రూరల్: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాల మేరకు కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఇంచార్జి మంత్రి అజయ్ ధరంసింగ్ పర్యటించారు. శనివారం జిల్లాలోని మస్కి, సింధనూరు, మాన్వి తాలూకాల్లో ఆయన పర్యటించి కరువు అధ్యయనం చేశారు. మెట్ట భూముల్లో రైతులు వేసుకున్న వాడు ముఖం పట్టిన పత్తి, కంది, పొద్దు తిరుగుడు, పెసర, అలసంద, ఆముదాలు, ఇతర పంటలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కరువు కాలంలో రైతులను ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురవక కరువు నెలకొందని, ప్రభుత్వం స్పందించి పరిహారం అందించడానికి ప్రయత్నిస్తుందన్నారు. కరువు పరిస్థితులను అధ్యయనం చేసి సోమవారం ముఖ్యమంత్రికి నివేదికను సమర్పిస్తామన్నారు. ఎమ్మెల్సీలు బసన గౌడ బాదర్లి, బోసురాజు, ఎమ్మెల్యే బస నగౌడ, జిల్లాధికారి పూవిత, జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ తదితరులున్నారు. పంట నష్టంపై మంత్రి సుడిగాలి పర్యటన హొసపేటె: రాష్ట్రంలో కొత్త మంత్రులు తమకు అప్పగించిన జిల్లాల్లో కరువు పరిస్థితులపై అధ్యయనం, సర్వే ప్రారంభించారు. విజయనగర జిల్లా ఇంచార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి, కొట్టూరు, కూడ్లిగి తాలూకాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం గురించి బాధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో జరిగిన పంట నష్టంపై సత్వరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అధికారులు పారదర్శకంగా నివేదికను తయారు చేయాలన్నారు. పంట నష్టాన్ని పరిశీలించడానికి క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్, జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరి, జెడ్పీ సీఈఓ నోంగ్జాయ్ మహ్మద్ అక్రమ్ షా, ఎస్పీ జాహ్నవి, వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ దెబ్బ తిన్న పత్తి పంటను పరిశీలిస్తున్న మంత్రి అజయ్ సింగ్ రాయచూరు జిల్లాలో మంత్రి అజయ్ సింగ్ పరిశీలన విజయనగరలో మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ పర్యటన -
తాగునీటి ఎద్దడి నివారించండి
రాయచూరు రూరల్: జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించాలని జిల్లా ఇంచార్జి మంత్రి అజయ్ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాధికారి కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఖరీఫ్‌లో ముందుగానే వానలు కురవడంతో రైతులు వేసుకున్న విత్తనాలు సరిగా మొలకెత్తక పంట నష్టం జరిగిన నేపథ్యంలో అధికారులు రైతులకు సహకరించాలన్నారు. పశువులకు గ్రాసం కొరత రాకుండా చూడాలని సూచించారు. మరో వారం రోజుల్లో వానలు కురవకపోతే రైతులకు పంటల బీమా పాలసీలు చేసుకోడానికి అవకాశం కల్పించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే సబ్సిడీ పథకాలను రైతులకు అందించాలన్నారు. ఎంపీ కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ దద్దల్, హంపయ్య నాయక్, బసన గౌడ తుర్విహాళ్, ఎమ్మెల్సీలు బోసురాజ్, బసన గౌడ బాదర్లి, జిల్లాధికారి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర పాలికె కమిషనర్ జుబిన్ మహాపాత్రో, వ్యవసాయ శాఖాధికారి హుసేన్ పాల్గొన్నారు. -
ఆన్లైన్ ట్రేడింగ్‌లో రూ.60 లక్షల నష్టం.. ఆర్బీఐ ఉద్యోగి.!
తమిళనాడు: ఆన్లైన్ ట్రేడింగ్‌లో రూ.60 లక్షల నష్టం ఏర్పడిందని రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగి కూవం నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిపై పిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బంది అతని కోసం గాలిస్తున్నారు. వివరాలు.. చెన్నై కే.కే. నగర్ కామరాజర్ శాలైలోని రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో మోహన్ (30) నివసిస్తున్నారు. ఈయన ప్యారీస్ కార్నర్‌లోని రిజర్వ్ బ్యాంక్‌లో పని చేస్తున్నారు ఆన్లైన్ ట్రేడింగ్‌పై ఆసక్తి ఉన్న మోహన్, గత ఏప్రిల్ నెలలో బ్యాంక్ నుండి రూ.30 లక్షల అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టారు. ఇదే విధంగా తన స్నేహితుల వద్ద నుండి కూడా రూ.30 లక్షలు అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనకు భారీ నష్టం రావడంతో డబ్బు మొత్తం పోగొట్టుకున్నారు. పైగా అప్పు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో మోహన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ స్థితిలో బుధవారం రాత్రి కోటూర్పురం వంతెన వద్దకు వచ్చిన మోహన్, హఠాత్తుగా వంతెన పైకి ఎక్కి కూవం నదిలోకి దూకేశారు. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన స్థానికులు పోలీసులకు, అగి్నమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కోటూర్పురం పోలీసులు మరియు మైలాపూర్ అగి్నమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, నదిలో మునిగిపోయిన మోహన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం కూడా ఆయన కోసం వెతికే పని కొనసాగింది. దీనిపై కోటూర్పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ఒకే చెట్టుకు ఇద్దరు యువతుల ఆత్మహత్య!
బెంగళూరు: ఉపాధి కోసం దేశం కాని దేశం వచ్చారు. కానీ ఏం సంకటం వచ్చిందో ఇద్దరు యువతులు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులో యలహంక దగ్గర జక్కూరులో వెలుగు చూసింది. గురువారం ఉదయం వాకింగ్‌కు వెళ్లినవారు చూసి కంగుతిన్నారు. జక్కూరులోని కృష్ణ రెస్టారెంట్ సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఇద్దరు యువతుల మృతదేహాలు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన వాకర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యలహంక పోలీసులు మృతులను నేపాల్‌కు చెందిన సిర్జనా (22), రితా (23)గా గుర్తించారు.దొరకని వివరాలువీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఏం పనిచేసేవారు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు.. అనే విషయాలు తెలియరాలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. నిజంగా ఆత్మహత్య, లేక మరేదైనా జరిగిందా? అనే అనుమానాలున్నాయి, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. -
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. కాంగ్రెస్ నేత హత్య
బెంగళూరు: కర్ణాటకలోనియ దారుణ ఘటన వెలుగు చూసింది. ఉడుపి జిల్లాలో కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్, మాజీ పంచాయతీ అధ్యక్షుడు డేవిడ్ డిసౌజా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో డేవిడ్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి డిసౌజాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, డిసౌజా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా ఉండటంతో పాటు కాంట్రాక్టు పనులు చేసేవారు. గతంలో పంచాయతీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. దీంతో ఆయన హత్య స్థానిక రాజకీయ, వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది.అయితే, డేవిడ్ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. -
రీల్స్ మోజులో వంట చేయలేదని భార్యను.. కడతేర్చాడు!
బెంగళూరు: సమయానికి సక్రమంగా వంట వండకుండా ఇంట్లో రీల్స్‌తో కాలం గడుపుతున్న భార్యను హత్య చేసినట్లు పోలీసుల ముందు భర్త నోరువిప్పాడు. కుంబళగోడు పోలీస్‌స్టేషన్ పరిధిలో 12 రోజుల క్రితం బెడ్‌షీట్‌లో మహిళ శవం చుట్టిన కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు హత్యకు కారణాలను పోలీసులు సేకరించారు. బిహార్‌కు చెందిన ధీరజ్ కుమార్(24), రీమా కుమారి(20) ప్రేమించుకున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా బిహార్ నుంచి 10 నెలల క్రితం బెంగళూరుకు చేరుకుని ఇద్దరూ వివాహం చేసుకున్నారు. దంపతులు గేరుపాళ్యలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ సమీపంలోని పరిశ్రమలో పనికి వెళ్లేవారు. రీమా రీల్స్ చేయడానికి అలవాటు పడి ఇంట్లో సక్రమంగా వంట చేసేది కాదు. దీంతో కోపోద్రిక్తుడైన ధీరజ్‌కుమార్ భార్యతో గొడవ పడేవాడు. ప్రతినిత్యం ఇద్దరూ ఘర్షణ పడేవారు. రీమా ఇటీవల తాను బిహార్‌కు వెళ్లిపోతానని పట్టుబట్టింది. ఈక్రమంలో గత నెల 27న రాత్రి ధీరజ్‌కుమార్ విధులు ముగించుకుని ఇంటికి రాగా ఇంట్లో వంట వండలేదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ ఏర్పడి తీవ్ర స్థాయికి చేరడంతో చేతికి దొరికిన కర్రతో ధీరజ్‌కుమార్ రీమాపై దాడి చేశాడు. అనంతరం చున్నీతో రీమా గొంతు బిగించి చంపి ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి బిహార్‌కు పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుంబళగోడు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి బిహార్‌లో ఉన్న ధీరజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
మానసిక ఒత్తిడితో మోడల్ శృతి ఆత్మహత్య
కర్ణాటక: ఉడుపి జిల్లా మల్పె పోలీసు స్టేషన్ పరిధిలోని కల్మాడిలో మాడల్ శృతి బంగేర(27) తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. మాడలింగ్ చేస్తున్న శృతి కడియాళలోని ఒక హోటల్లో ఉద్యోగం చేస్తోంది. ఐదు నెలలుగా పనికి పోకుండా తల్లీ, సోదరితో కలిసి ఉంటోంది. మానసిక ఒత్తిడికి గురైన శృతి గురువారం మధ్యాహ్నం తల్లి రత్నను ఇంటిలోంచి బయటకు పంపి గడియ వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. శృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మల్పె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సెబర్ వంచనకు గురైన విశ్రాంత అధికారిణిమైసూరు: మైసూరులో ఒక దుండగుడు ముంబై పోలీసుల పేరుతో విశ్రాంత మహిళా అధికారిణిని బెదిరించి రూ. 31 లక్షలు తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. నగరంలోని అలనహళ్లిలో విశ్రాంత మహిళా అధికారిణి నివాసం ఉంటున్నారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ముంబై పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. మీరు మనీలాండరింగ్ కేసులో ఉన్నారని చెప్పాడు. మేము చెప్పినట్లు చేస్తే మిమ్మల్ని కాపాడగలమని నమ్మబలికాడు. ఆ తర్వాత వారు చెప్పినట్లుగా డిపాజిట్ డబ్బును, సేవింగ్స్ ఖాతాలోని డబ్బు మొత్తం రూ. 31,10,200 వివిధ ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత మోసగాడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. దీంతో తాను సైబర్ మోసానికి గురయ్యానని ఆమె గ్రహించి సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
ఏడాది తర్వాత అస్థిపంజరంగా..!
కట్టుకున్న తోడు లేదు.. కొడుకు కూడా దూరమయ్యాడు. కన్నకూతురుకి ఏమైందో తెలియదు?. ఒంటరి జీవితంతో పోరాడుతూ రోజులు గడిపిన ఆమెను చివరకు మృత్యువు కూడా నిశ్శబ్దంగానే తీసుకెళ్లింది. అయితే ఆమె మరణించిన విషయం చెప్పేందుకు, కన్నీరు పెట్టేందుకు కూడా ఎవరూ లేకపోయారు. చివరకు ఆమె మృతదేహం అస్థిపంజరంగా మారిన తర్వాతే ఈ విషాదం బయటపడింది. పోలీసులు వచ్చి తలుపులు తెరిచినప్పుడు కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది.మెట్రో నగరం బెంగళూరులో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళ.. చివరకు తన ఇంట్లోనే కన్నుమూసింది. అయితే ఆమె మరణించిన విషయం ఎవరికీ తెలియలేదు. చివరకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తలుపులు తెరిచిన పోలీసులు చూసిన దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటికే ఆ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారిపోయింది.బెంగళూరులోని బాగలగుంట ప్రాంతం హవనూర్ లేఅవుట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో లభించిన అస్థిపంజరం 52 ఏళ్ల దాక్షాయిణిదిగా గుర్తించారు. దాక్షాయిణి కొంతకాలంగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త ఉమేశ్ దాదాపు పదేళ్ల క్రితం మరణించగా.. ఆ తర్వాత కొడుకు కూడా క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయాడు. వరుస విషాదాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.భర్త, కొడుకు మరణాల తర్వాత ఆమెను పలకరించేవారు కూడా లేకుండా పోయారని తెలుస్తోంది. ఏడాది పాటు ఆమె ఇంటి తలుపులు తెరుచుకోలేదు. కూతురు-అల్లుడు సహా బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఆమెను కలిసేందుకు రాకపోవడంతో విషాదం మరింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాగలగుంట పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాక్షాయిణి మృతి సహజ మరణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఆమె దాదాపు ఏడాది క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జనాలతో కిటకిటలాడే మహానగరంలో.. పక్కింట్లోనే ఓ మనిషి ఏడాది పాటు కనిపించకపోవడం, ఆమె మరణం గురించి ఎవరికీ తెలియకపోవడం ఒంటరి జీవితాలపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. -
ఎమ్మెల్సీగా గాయత్రి ప్రమాణ స్వీకారం
శివాజీనగర: చిక్కమగళూరు జిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు గాయత్రి శాంతేగౌడ ఎమ్మెల్సీగా శుక్రవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పరిషత్ సభాపతి బసవరాజ్ హొరట్టి ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఆమైపె బీజేపీ అభ్యర్థి ఎం.కే.ప్రాణేశ్ కేవలం 6 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గాయత్రి శాంతేగౌడ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రీకౌంటింగ్ ఆదేశం, అనంతరం సుప్రీంకోర్టులో జరిగిన న్యాయపోరాటం తరువాత హైకోర్టు గాయత్రి శాంతేగౌడను విజేతగా ప్రకటించింది. ఆరేళ్ల పదవీ కాలంలో ఇప్పటికే 4.5 ఏళ్లు గడిచిపోయాయి. మిగిలిన పదవీకాలానికి గాయత్రి ఎమ్మెల్సీగా కొనసాగుతారు. స్పీకర్ కార్యాలయంలో జరిగిన నిరాడంబర ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం డీ.కే.శివకుమార్, పార్టీ ప్రముఖ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మద్దతుదారులు హాజరై కొత్త సభ్యురాలికి శుభాకాంక్షలు తెలిపారు. -
కరువు పరిస్థితిపై నివేదికలు సమర్పిస్తాం
రాయచూరు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఆదేశాల మేరకు రాయచూర్ గ్రామీణలోని హుణషాల హుడా, దేవదుర్గ తాలుకాలోని రామదుర్గ, సుంకేశ్వరలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అజయ్ సింగ్ పర్యటించారు. రైతులు, అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. తీవ్ర వర్షాభావంతో పత్తి, కంది, ఇతర పంటలు ఎండిపోయాయన్నారు. కరువు పరిస్థితిని అధ్యయనం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదికలను సమర్పించడం జరుగుతుందన్నారు. పంటల బీమా, ఇన్సూరెన్స్ ఇతర పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలని తెలిపారు. కేంద్ర సర్కార్ స్పందించి పరిహారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యులు బసనగౌడ దద్దల్, శివరాజ్ పాటిల్, కరెమ్మ నాయక్, జిల్లా అధికారి పూవిత, జిల్లా ఎస్పీ పి.అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర కుమార్ కాందూ, నేతలు రామణ్ణ ఇరబగేర, శాలం తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకునేందుకు చర్యలు
సాక్షి, బళ్లారి: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. వర్షాధారిత భూముల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాగేంద్ర స్పష్టం చేశారు. శుక్రవారం సండూరు నియోజకవర్గంలోని విఠలాపురం, దరోజి తదితర గ్రామాల్లో పర్యటించారు. అధికారులు, ఎమ్మెల్యేలతో కలసి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతులు పెద్ద సంఖ్యలో చేరి సమస్యలు చెప్పుకున్నారు. పంటలు పూర్తిగా ఎండిపోయాయి అని.. ప్రస్తుతం వర్షం వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి సహాయం చేయాలని వేడుకున్నారు. అనంతరం మంత్రి నాగేంద్ర మాట్లాడుతూ.. సీఎం డీకే శివకుమార్ ఆదేశాల మేరకు పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు సాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పూర్తి వివరాలు అందించాలని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 37 వేల మంది రైతులు పంటలు బీమా చేయించుకున్నారని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం కింద పని దినాలు పెంచుతామని పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కచ్చితంగా పంటలకు నీరు వదులుతామన్నారు. పశుగ్రాసం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహార్షి వాల్మీకి విగ్రహావిష్కరణ అంశంపై సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అన్నపూర్ణ, జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి నాగేంద్ర -
తుంగభద్ర ఆయకట్టు రైతులకు శుభవార్త
సాక్షి, బళ్లారి: తుంగ్రభద్ర జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు నెల ప్రారంభం నుంచి భారీ ఎత్తున ఇన్‌ఫ్లో చేరుతుండటంతో డ్యాంలో ప్రస్తుతం 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో కూడా 45 వేల క్యూసెక్కులు ఉండటంతో త్వరలో 80 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాగు, తాగు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 11వ తేదీన కొప్పళ జిల్లా మునిరాబాద్ వద్ద తుంగ్రభద్ర నీటి సలహా సమితి (ఐసీసీ) సమావేశం నిర్వహించనున్నారు. ఖరీఫ్‌కు నీరు విడుదల చేసే విషయంపై చర్చించనున్నారు. తుంగభద్ర నీటి పారుదల సలహా సమితి అధ్యక్షుడు, స్థానిక మంత్రి శివరాజ్ తంగడిగి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతు సంఘం నేతలు హాజరై తమ సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు నీటి విడుదలపై ప్రముఖంగా చర్చించనున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేసే అవకాశం ఉండటంతో సంతోషం వ్యక్తం అవుతోంది. నీటి విడుదలకు ఈనెల 11న ఐసీసీ సమావేశం -
గడువుకు ముందే నిష్క్రమణ నిరాశాజనకం
శివాజీనగర: విధానపరిషత్ సభాపతి పదవికి బసవరాజ్ హొరట్టి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన మాట్లాడుతూ నన్ను వెంటనే రాజీనామా చేయమని అడిగారు. అందుకే నేను రాజీనామా చేశాను. ఆగస్టు 14న రాజీనామా చేయాల్సింది. రాజీనామా చేయాలని తాను అప్పటికే నిర్ణయించుకున్నాను. నా పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయడం కొంచెం నిరాశ కలిగిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. రాజీనామా చేయమన్నారు. నిబంధనల ప్రకారం రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పటికీ స్పీకర్ రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి. విధాన పరిషత్ కార్యదర్శి దానిని ఆమోదం కోసం గవర్నర్‌కు పంపుతారని వివరించారు. జీవితంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇది అలానే జరిగింది. రాజకీయాల్లో ఇదంతా సహజం. రాజీనామా చేయమన్నప్పుడు చేయక్కర్లేదా? నేను ఈరోజే రాజీనామా చేశాను. ఈ స్థానానికి గౌరవం ఇవ్వటం, ఇవ్వకపోవటం వారికి సంబంధించినది. నేను 18 మంది ముఖ్యమంత్రులను చూశాను. సభలోని అన్ని పార్టీలు దానిని గౌరవించాయి. సభ నిర్వహణ తీరుపై నేను 90 శాతం మేరకు సంతృప్తిగా ఉన్నాను. బెళగావిలో అర్థరాత్రి వరకు సభ నడిపా బెళగావిలో అర్థరాత్రి 2 గంటల వరకు నేను సభను నడిపాను అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకవేళ సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదా? అని అడగగా ఆయన, నేను దీని గురించి మాట్లాడను. రాజీనామా విషయాన్ని నేను సిద్దరామయ్యకు కూడా తెలియజేశానని అన్నారు. నేను ఈరోజు రాజీనామా చేస్తానని అనుకోలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. అకస్మాత్తుగా వచ్చాను, అకస్మాత్తుగా వెళుతున్నాను అంతే అని అన్నారు. సీ.టీ.రవి వర్సెస్ లక్ష్మీ హెబ్బాళ్కర్ కేసుపై వ్యాఖ్యానిస్తూ, ఇలాంటి సంఘటనలు జరుగకూడదు. నేను వారిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడి నా నిర్ణయాన్ని తెలియజేశాను. వారు మళ్లీ తమ తరపున దరఖాస్తు చేశారు. నేను దానిని ఎథిక్స్ కమిటీకి ఇచ్చానన్నారు. హొరట్టితో సమావేశం అనంతరం సీఎం మాట్లాడుతూ మేం హొరట్టితో చర్చించాం. నాకు రాజకీయ వాస్తవాల గురించి తెలుసు. ఆయన తన రాజీనామాను సమర్పించారు. నేను స్వయంగా ఆయనకు విజ్ఞప్తి చేశా. ఆయన ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారన్నారు. బసవరాజ్ హొరట్టి -
అసంతృప్తులకు బుజ్జగింపులు
శివాజీనగర: మంత్రి పదవి దక్కక తీవ్ర మనోవేదనకు గురైన విజయనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియాకృష్ణప్పలను ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్, ఏఐసీసీ కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి సుర్జేవాలా పరామర్శించారు. కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్ కూడా కృష్ణప్ప నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. హరిప్రసాద్‌తో మాట్లాడిన అనంతరం కృష్ణప్ప మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలని, అంతకు మించి మరో మార్గం లేదని అన్నారు. కృష్ణప్పతో భేటీ గురించి బీ.కే.హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. సీనియర్ నాయకులకు హోదా ఇవ్వనప్పుడు వారు బాధపడటం సహజమన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో రాహుల్ స్వయంగా వారితో మాట్లాడి ఓదార్చుతారని అన్నారు. మంత్రి పదవి దక్కకపోయినా కృష్ణప్ప పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా హుందాగా మెలిగారన్నారు. ఆయనకు ఏ బాధ్యత ఇవ్వాలనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని తెలిపారు. రాజకీయం అనేది అవకాశాల ఆట, ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. మనం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియాకృష్ణప్పలకు సీఎం తదితరుల పరామర్శలు -
సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని విధాన పరిషత్ సభ్యుడు బసవన గౌడ బాదర్లి ఆదేశించారు. శుక్రవారం సింధనూర్ ఎమ్మెల్సీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమ్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం బసవన గౌడ బాదర్లి మాట్లాడుతూ.. మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. తుంగభద్ర కాలువ నుంచి చెరువులకు తాగు నీటిని పంపింగ్ చేయాలన్నారు. గుంతలు పడిన రహదారులకు మరమ్మతులు చేయాలని తెలిపారు. చౌకధరల దుకాణాల్లో పేదలకు సక్రమంగా బియ్యం పంీపిణీ చేయాలని సూచించారు. వినాయక చవితి ప్రశాంతంగా జరుపుకోండి రాయచూరు రూరల్: జిల్లాలో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా అధికారి పూవిత సూచించారు. గురువారం సాయంత్రం జిల్లా పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించి పూజలు చేయాలని తెలిపారు. పీఓపీ, రసాయనిక పదార్థాలను వినియోగించడానికి అవకాశాలు లేవన్నారు. పరిసరాల సంరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, నగర సభ కమిషనర్ జుబీన్ మహపాత్రో, గిరీశ, మల్లికార్జున, నందిత, సురేష్ వర్మ, హరీష్, శాంతవీర, పుష్పలత, ఉమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంతరంగ భావాలకు అక్షర రూపమే సాహిత్యం సాక్షి, బళ్లారి: అంతరంగ భావాలకు అక్షర రూపం ఇవ్వడమే సాహిత్యమని ప్రముఖ రంగస్థల కళాకారుడు అంధ్యాళ పురుషోత్తం పేర్కొన్నారు. శుక్రవారం కన్నడ సాహిత్య పరిషత్ బళ్లారి గ్రామీణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజల వల్లే కన్నడ భాష, సంస్కృతి నేటికీ సజీవంగా నిలిచి ఉన్నాయని తెలిపారు. నిరక్షరాస్యులు సైతం నాటకాలు, బయలాటల ద్వారా జీవిత విలువలను అలవరచుకుని నైతిక జీవనం గడిపిన అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. సర్వజ్ఞుడు ప్రతి ఒక్కరి నుంచి మంచిని గ్రహించి విద్యావంతుడిగా ఎదిగి సాహిత్య రంగంలో చక్రవర్తిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారులు తదితరులు పాల్గొన్నారు. మౌలిక సౌలభ్యాలు కల్పించాలని పాదయాత్ర రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సౌలభ్యాలు కల్పించాలని జేడీఎస్ కలబుర్గి జిల్లా మహిళ అధ్యక్షురాలు మహేశ్వరి డిమాండ్ చేశారు. శుక్రవారం అళంద నుంచి కలబుర్గి జిల్లా అధికారి కార్యాలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అళంద క్షేత్రంలో మహిళలకు శౌచాలయాలు లేవని పేర్కొన్నారు. తాగునీటి ఎద్దడి, రహదారుల మరమ్మతుల విషయంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అళంద నుంచి 85 కి.మీ దూరం పాదయాత్రను చేస్తున్న తరుణంలో మహేశ్వరికి రహదారి వెంబడి మహిళలు మద్దతు ఇస్తున్నారు. వాహనాల సంచారంపై ఆంక్షలు చిక్కబళ్లాపురం: నందిహిల్స్‌పై మారథాన్ పోటీలు ఏర్పాటు చేసినందున శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం మద్యాహ్నం 12 గంటల వరకు కారహళ్లి క్రాస్ నుంచి నంది కొండ వరకు వాహన సంచారాన్ని బంద్ చేసినట్లు అధికారులు తెలిపారు. 10 కిలోమీటర్లు, 21 కి.మీ విభాగంలో జరిగే మారథాన్‌కు 4500 మంది క్రీడా కారులు హాజరు కానున్నారు. -
వైభవంగా ఆరాధనోత్సవం
చిక్కబళ్లాపురం: దక్షిణకాశీ పంచనదుల మహా పుణ్య క్షేత్రం పాపాగ్ని మఠం చారిటబల్ ట్రస్ట్ విశ్వకర్మ సముదాయం నుంచి శరభ యోగీంద్ర స్వాముల 308వ ఆరాధనోత్సవం, వీరబ్రహ్మయ్య స్వామి రథోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి గణపతి హోమం, పుణ్యాహ, దశ శాంతి, రుద్రాభిషేక, కలసారాధన, మహా మంత్ర హోమం, కలసోత్సవం, లింగప్రతిష్టాపన, శరభ యోగీంద్రస్వామి, అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వనాథస్వామి వారికి పంచామృత అభిషేకం, వివిధ పూజా కై ంకర్యాలు నెరవేరాయి. చిక్కబళ్లాపురం జిల్లా చుట్టు పక్కల నుంచి వచ్చిన అసంఖ్యాక భక్తాదులు పూజా కై ంకర్యంలో పాల్గొన్నారు. తరువాత వీరబ్రహ్మయ్య రథోత్సవానికి విధి విధానాలతో శ్రీకారం చుట్టారు. వందలాది మంది భక్తాదులు రథానికి పూజలు నెరవేర్చారు. తరువాత అందరూ ఊరేగింపులో పాల్గొన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు హెంజారాచారి, సభ్యులు నంజుండాచారి, సుబ్రహ్మణ్యాచారి, మంజునాథ్, కృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికతతో ఒత్తిడి లేని జీవితం
బనశంకరి: ఆధ్యాత్మికత, ధ్యానంతో ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం గడపవచ్చునని వేదపండితుడు గణపతిభట్ తెలిపారు. శ్రీశివబాలయోగిమహారాజ్ 65వ తపస్సిద్ది వార్షికో త్సవం సందర్భంగా బెంగళూరు జేపీ.నగర మూడో ఫేజ్ శ్రీశివబాలయోగి మహారాజ్ ఆశ్రమంలో శుక్రవారం ట్రస్ట్ కార్యాధ్యక్షుడు డీ.రాంబాబుతో కలిసి సమాధి పూజ నిర్వహించి మాట్లాడారు. భగవంతుడు ఇచ్చిన జన్మను సార్థకం చేసుకోవాలంటే మంచి నడవడిక, దానగుణంతో ఉండాలన్నారు. చెడు ఆలోచనలు వీడి భక్తిమార్గంలో ముందుకు సాగాలన్నారు. అనంతరం ప్రపంచశాంతికోసం పూజలు,హోమాలు నిర్వహించారు. శివబాలయోగిమహారాజ్ విగ్రహానికి మరకత శివలింగానికి కుంభాభిషేకం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆశ్రమంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. -
మంత్రి ఎస్కార్టు వాహనానికి ప్రమాదం
● గేటును ఢీకొన్న పోలీసు జీపు యశవంతపుర: మంత్రి కేజే జార్జ్‌కు ఎస్కార్టుగా వెళుతున్న వాహనం ప్రమాదానికి గురైన ఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర పట్టణంలోని అమృత మహల్ తళి సంవర్థన కేంద్రం వద్ద జరిగింది. మంత్రి జార్జ్ శుక్రవారం కరవు ప్రాంతాల పరిశీలనకు ఆ జిల్లాలోని అజ్జంపురలో పర్యటించారు. అయితే ఆయన ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పి అమృత్ మహల్ వద్ద సంవర్థన కేంద్రం గేటును ఢీకొంది. దీంతో పోలీసు జీపు ముందుభాగం దెబ్బ తిన్నట్లు పోలీసులు తెలిపారు.గుండెపోటుతో బీఈఓ మృతి యశవంతపుర: కొడగు జిల్లా విరాజపేటె తాలూకా విద్యా శాఖాధికారి(బీఈఓ) విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. బీఈఓ పీ.జీ.ఆనంద్(55) రోజు వారి మాదిరిగా శుక్రవారం మైసూరు నుంచి విరాజపేటెకు బస్సులో వెళుతుండగా ఇలవాల సమీపంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తీవ్రమైన ఛాతీనొప్పి వచ్చింది. తక్షణం బస్సులోని కండక్టర్, డ్రైవర్ తోటి ప్రయాణికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయన మృతిపై ఉపాధ్యాయ సంఘాలు సంతాపం తెలిపాయి. యువతి ఆత్మహత్య యశవంతపుర: ఉడుపి జిల్లా మల్పె పోలీసు స్టేషన్ పరిధిలోని కల్మాడిలో మాడల్ శృతి బంగేర(27) తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. మాడలింగ్ చేస్తున్న శృతి కడియాళలోని ఒక హోటల్లో ఉద్యోగం చేస్తోంది. ఐదు నెలలుగా పనికి పోకుండా తల్లీ, సోదరితో కలిసి ఉంటోంది. మానసిక ఒత్తిడికి గురైన శృతి గురువారం మధ్యాహ్నం తల్లి రత్నను ఇంటిలోంచి బయటకు పంపి గడియ వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. శృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మల్పె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ వంచనకు గురైన విశ్రాంత అధికారిణిమైసూరు: మైసూరులో ఒక దుండగుడు ముంబై పోలీసుల పేరుతో విశ్రాంత మహిళా అధికారిణిని బెదిరించి రూ. 31 లక్షలు తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. నగరంలోని అలనహళ్లిలో విశ్రాంత మహిళా అధికారిణి నివాసం ఉంటున్నారు. ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ముంబై పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. మీరు మనీలాండరింగ్ కేసులో ఉన్నారని చెప్పాడు. మేము చెప్పినట్లు చేస్తే మిమ్మల్ని కాపాడగలమని నమ్మబలికాడు. ఆ తర్వాత వారు చెప్పినట్లుగా డిపాజిట్ డబ్బును, సేవింగ్స్ ఖాతాలోని డబ్బు మొత్తం రూ. 31,10,200 వివిధ ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత మోసగాడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. దీంతో తాను సైబర్ మోసానికి గురయ్యానని ఆమె గ్రహించి సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బైకును ఢీకొన్న బస్సు ● ముగ్గురు దుర్మరణం యశవంతపుర: బెళగావి జిల్లా గోకాక్ తాలూకా హెణ్ణూరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి, కూతురితో పాటు ముగ్గురు మృతి చెందారు. మరో బాలిక బలమైన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కొణ్ణూరు గ్రామానికి చెందిన బషీర్ ముల్లా(28), అతడి కూతురు సీజా(5), ఇంతియాజ్ బడగాంవ్(34) మృతి చెందారు. గాయపడిన మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హిడకల్ డ్యాం నుంచి గోకాక్ వైపు వెళుతుండగా కేఎస్ఆర్టీసీ బస్సు బైకుపై వెళుతున్న వీరిని ఢీకొంది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు డ్రైవర్ పరారయ్యారు. గోకాక్ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. సర్ గడువు 17 వరకు పొడిగింపుబనశంకరి: రాష్ట్రంలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ గడువును ఎన్నికల కమిషన్ పొడిగించింది. దీనికి సంబంధించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ గడువును ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది. అభ్యంతరాలు తెలియజేయడానికి ఈనెల 24 నుంచి సెప్టెంబరు 23 వరకు అవకాశం కల్పించారు. అంతిమ ఓటరు జాబితాను అక్టోబరు 27వ తేదీన ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. -
భక్తులతో చాముండి కొండ కిటకిట
మైసూరు: ఆషాఢ మాస చివరి శుక్రవారం శక్తి స్వరూపిణి, నాడ శక్తి దేవత చాముండేశ్వరి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో మైసూరులోని చాముండి కొండపైకి విచ్చేశారు. దీంతో భక్తులతో కొండ పరిసరాలు కిటకిటలాడాయి. కొండకు చేరుకున్న లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ‘జై చాముండేశ్వరి‘ నినాదాలు చేశారు. చాముండి కొండపై ఆషాఢ శుక్రవారం చాముండేశ్వరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంబరాలు మిన్నంటాయి. శక్తిదేవత దర్శనం కోసం ఉదయాన్నే వివిధ ప్రాంతాల నుంచి కొండకు చేరుకున్న భక్తులు, చల్లటి వాన చినుకులు పడుతున్నా ఎలాంటి ఇబ్బంది పడకుండా దర్శనం కోసం గంటల తరబడి క్యూలలో నిలబడ్డారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా వారు ఆలయం లోపలకు వెళ్లి చాముండేశ్వరి దర్శనం చేసుకుని భక్తి పారవశ్యం చెందారు. తెల్లవారు జాము నుంచే పూజలు ఆలయ ప్రధాన పురోహితుడు శశిశేఖర్ దీక్షిత్ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేకంగా మహాలక్ష్మి అలంకరణ చేశారు. రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ఏకాదశ పుష్పార్చన, సహస్రనామాచార్చన వంటి పూజలు తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణాన్ని చామంతి, బంతి, వివిధ రంగుల గులాబీలతో సహా పలు రకాల పూలతో ఆలయ ప్రవేశ ద్వారం, బయటి భాగాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కొండపైకి తరలివచ్చారు. దర్శనం చేసుకున్న ప్రముఖులు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, మాజీ మంత్రులు కే.ఎస్.ఈశ్వరప్ప, అరవింద్ లింబావళి, మంకాళ వైద్య, ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణ, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ, మాజీ ఎంపీ ప్రతాప్సింహ, మాజీ ఎమ్మెల్యే అనితా కుమారస్వామి, తెలుగు సినీ హాస్య నటుడు సునీల్. అనేక ఇతర ప్రముఖులు ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం దర్శనానికి తరలి వచ్చిన భక్తజనం -
రహదారి పనులపై విచారణ చేపట్టాలి
రాయచూరు రూరల్: నాసిరకంగా జరుగుతున్న మాన్వి–రాయచూరు జాతీయ రహదారి నిర్మాణ పనులపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం మాన్విలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన నిర్వహించారు. పనులు పరిశీలించేందుకు వచ్చిన బెంగళూరుకు చెందిన కేఆర్‌డీసీఎల్ ఇంజినీర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రధాన రహదారి నిర్మాణాల్లో ఉన్న లోపాలను సరిదిద్దకుండా అవైజ్ఞానికంగా పనులు చేపట్టడం తగదని విమర్శించారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రహదారిని వెడల్పు చేసి, మురుగు కాలువలను కుదించడం వల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. -
కాలువలకు నీరు విడుదల చేస్తాం
రాయచూరు రూరల్: రైతులను కరువు రక్కసి నుంచి రక్షిస్తాం. పంటల సాగు కోసం తుంగభద్ర ఎడమ కాలువలకు నీరు విడుదల చేస్తామని గదగ్ ఇన్చార్జ్ మంత్రి బసవ రాజ రాయరెడ్డి, కొప్పళ్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు. శుక్రవారం కొప్పళ జిల్లా కుకనూర్, యలబుర్గ, కుష్టిగి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదికలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి, తగు పరిహారం అందజేస్తామన్నారు. తాగునీటి కోసం తుంగభద్ర ఎడమ కాలువకు నీరు వదిలారన్నారు. కాలువ పైభాగంలో మట్టి కుదించుకుని పోయిన విషయంపై రాజకీయం చేయడం తగదన్నారు. -
చోరీ సొత్తు స్వాధీనం
కేజీఎఫ్: ఈ ఏడాది జనవరి 13వ తేదీన బంగారుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమెల్ నగర నివాసి నిత్యానంద ఇంట్లో, హెచ్.సి. నగర నివాసి డెరిక్ అలెగ్జాండర్ ఇంటిలో జరిగిన చోరీ కేసులను బంగారుపేట పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన సురేష్ (35), వీరపాండియన్ (25), లక్ష్మణ కాంతన్ (30) అనే దొంగలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు, 475 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ ఆభరణాలను తమిళనాడులో విక్రయించగా పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కార్యవైఖరిని ఎస్పి శివాంశు రాజపూత్ ప్రశంసించారు. 10న సీఎం పర్యటనకోలారు: వివిధ కారణాల వల్ల వాయిదా పడిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జిల్లా పర్యటన ఈ నెల 10వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా మాలూరు తాలూకాలో వివిధ అభివృధ్ది కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ రవికుమార్ తెలిపారు. మాలూరు తాలూకాలోని చొక్కండహళ్లి వద్ద సాధన సమావేశం సమావేశ వేదిక ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలన చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే కేవై నంజేగౌడ నేతృత్వంలో సాధనా సమావేశం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తాలూకాలో రూ.3,200 కోట్లతో అభివృధ్ది పనులు ప్రారంభిస్తున్నారని తెలిపారు. -
హీరద సూగమ్మ పాఠశాలకు వందేళ్లు
సాక్షి, బళ్లారి: బళ్లారిలోని ిహీరద సూగమ్మ పాఠశాలకు వందేళ్లు. రాష్ట్రంలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఒక్కటైన వీరశైవ విద్యావర్ధక సంఘం స్థాపించిన తొలి విద్యా సంస్థ ఇదే. హీరద సూగమ్మ పాఠశాల శబాబ్ది ఉత్సవాలు శుక్రవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న వేడుకల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజు శోభాయాత్ర, డోలు, వీరగాసె నృత్యం, డప్పు చప్పుళ్ల మధ్య నిర్వహించిన ఊరేగింపులో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. వీరశైవ విద్యావర్ధక సంఘం పదాధికారులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాలకు ఘన చరిత్ర.. హానగల్ కుమార శివయోగులు, ఉజ్జయిని పీఠాధిపతి సిద్దలింగ శివాచార్య జగద్గురువుల మార్గదర్శకత్వంలో ప్రజల్లో ధార్మిక చైతన్యంతో పాటు, విద్యా, సామాజిక అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో 1916లో వీరశైవ విద్యావర్ధక సంఘం స్థాపించారు. తొలుత విశ్రాంతి నిలయం, అనంతరం ప్రసాద నిలయం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సాంస్కృతి పాఠశాలను ప్రారంభించారు. 1906 సంవత్సరంలో హీరద సూగమ్మ ధర్మార్థ కార్యక్రమాల కోసం బళ్లారిలోని గణేశగుడి వీధిలో ఒక చౌకిని ఏర్పాటు చేశారు. అనంతరం 1924 సంవత్సరం వీరశైవ విద్యావర్ధక సంఘం సాంస్కృతిక పాఠశాలను అక్కడికి మార్చి వీరశైవ స్కూల్‌ను ప్రారంభించారు. స్వాతంత్య్రానంతరం 1956లో హిరద సుగమ్మ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం అఖండ బళ్లారి జిల్లాలో వీరశైవ విద్యావర్ధక సంఘం ఆధ్వర్యంలో అనేక పాఠశాలలు, కళాశాలలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఉచితంగా విద్యను అందిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులకు విద్యాదానం, అన్నదానం చేస్తూ పాఠశాల దినదినాభివృద్ధి చెందింది. ఈ పాఠశాలలో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. అట్టహాసంగా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం రెండు రోజుల పాటు వేడుకలు -
పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు తేదీ ఖరారు
శివాజీనగర: విధాన పరిషత్ సభాపతిగా బసవరాజ హొరట్టి సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించే వరకు ఈ పదవిలో కొనసాగాలని కోరుతూ నేను గవర్నర్‌కు లేఖ రాశానని సీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. శుక్రవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడిన సీఎం, ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బసవరాజ్ హొరట్టి తన రాజీనామాను సమర్పించారు. ఆయనకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నాను. హొరట్టి దేశ శాసనమండలి చరిత్రలోనే అత్యంత సీనియర్ నాయకుడు. ఆయన తన ఔదార్యాన్ని ప్రదర్శించారు. అది ప్రశంసనీయం. శాసన మండలి సమావేశాలు ఆగస్టు 13న ప్రారంభమవుతాయి. కొత్త డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ప్రక్రియ 14వ తేదీని జరుగుతుంది. ఆ తరువాత డిప్యూటీ స్పీకర్ల ద్వారా స్పీకర్ ఎన్నిక జరుగుతుందని ఆయన అన్నారు. స్పీకర్ పదవికి ఇతోధిక సేవ అంతకుముందు విధానసౌధలో హొరట్టితో చర్చలు జరిపిన సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన రాజీనామా చేశారు. ఒకవేళ ఆ రాజీనామాను ఆమోదించినా ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించాలి. హొరట్టి దేశం ముందు తాను రాజీనామా చేస్తానని చెప్పినప్పుడు అది ఒక సమస్య కాకూడదు. బసవరాజ్ హొరట్టి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన స్పీకర్ పదవికి ఎంతో సేవ చేశారు. మా అందరికీ ఆయనను చూస్తే గర్వంగా ఉందన్నారు. ఈనెల 14న ఎన్నిక -
అభిమానం.. అను‘రక్తం’
సాక్షి,బళ్లారి: సాధారణంగా తమ నాయకుడి జన్మదిన వేడుకకు అభిమానులు కేక్ కట్ చేయడం, అన్నదానం చేయడం, ఆస్పత్రుల్లో పాలు, బ్రెడ్ పంపిణీ చేయడం చూస్తుంటాం. అయితే కర్ణాటకలోని హావేరి జిల్లా హానగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ 52వ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు వినూత్న తరహాలో రక్తదాన శిబిరం నిర్వహించి హిందూ, ముస్లిం, క్రైస్తవ మత గురువులకు రక్త తులాభారం వేశారు. అభిమానానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఈ శిబిరంలో 901 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం విశేషం. రక్తదానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా సర్వమత గురువులకు రక్త తులాభారం -
14 మందిపై కేసు నమోదు
హుబ్లీ: స్థలానికి సంబంధించిన వివాదంలో మహిళ ఇంట్లోకి చొరబడిన ఆరోపణలపై 14 మందిపై నగర బెండిగెరి పోలీసులు కేసు నమోదు చేశారు. బెండిగెరి బస్టాండ్ సమీపంలోని స్థలంలోకి వెళ్లకూడదు అంటూ బెదిరించి దాడి చేసినట్లు బాధితురాలు షరీన్ తెలిపింది. ఇంట్లోని సీసీ కెమెరాను కూడా ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అంత్యక్రియలకు అవస్థలుహుబ్లీ: కలబుర్గిలోని సేడంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మాజీ కౌన్సిలర్ అంత్యక్రియలకు బంధువులు పడరాని పాట్లు పడ్డారు. కమలావతి నదిలోనే శవయాత్ర సాగించి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాలు ఇలా.. మాజీ కౌన్సిలర్ రాజు శుక్రవారం మృతి చెందాడు. అంత్యక్రియలు చేసేందుకు కమలావతి నది దాటాలి. నది దాటేందుకు వంతెన లేకపోవడంతో మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించి, శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. వంతెన సమస్య చాలా రోజుల నుంచి ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. కరువు ప్రాంతంగా ప్రకటించడంలో విఫలం రాయచూరు రూరల్: రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడంలో సర్కార్ విఫలమైందని విధాన సభ సభ్యుడు శివరాజ్ పాటిల్ ఆరోపించారు. శుక్రవారం రాయచూర్ తాలూకాలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అజయ్ సింగ్ తూతూమంత్రంగా పర్యటించారని ఆరోపించారు. వర్షాభావంతో రైతులు సాగు చేసిన పంటలు వాడుముఖం పట్టాయని తెలిపారు. మంత్రి అజయ్ సింగ్‌ను కరువు నెలకొన్న ప్రాంతాలకు తీసుకెళ్లడం లేదన్నారు. నాయకులు తమకు ఇష్టం వచ్చిన ప్రాంతాలకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. రైతులు వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. ఆపరేషన్ చేయించుకున్న గంటలకే ఇంటర్వ్యూకు.. హుబ్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆపరేషన్ చేయించుకున్న ఓ యువకుడు గంటలు గడవక ముందే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. వివరాలు ఇలా.. కొప్పళ జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 26 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ ల్యాబ్ సాంకేతిక అధికారి (11 పోస్టులు), ఫార్మసీ అధికారి (04) నర్సులు (11) మొత్తం 26 పోస్టులకు 2 వేల మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం హుబ్లీ కేఎంసీ ఆస్పత్రిలో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న గోవింద అనే నిరుద్యోగి ప్రభుత్వ కొలువు కోసం ఇంటర్వ్యూకు వచ్చాడు. ఉదయం నుంచే క్యూలో నిలబడి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సర్కారీ కొలువు కోసం నిరుద్యోగులు పడుతున్న అవస్థలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. చదువు నేర్పిన గురువులను మరువరాదు కోలారు: తాలూకాలోని అరాభికొత్తనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2001–02 టెన్త్ విద్యార్థుల సమ్మేళనం శుక్రవారం ఘనంగా జరిగింది. నరసాపురం పీయూసీ కళాశాల ఉపన్యాసకురాలు ఉమాదేవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం, సంస్కారం నేర్పించి జీవితానికి దారి చూపిన పాఠశాల, ఉపాధ్యాయులను ఎన్నటికీ మరువరాదన్నారు. విద్యార్థులు నైతిక విద్యను అభ్యసించడం వల్లనే తాము చదివిన పాఠశాల, గురువులను స్మరించుకుంటున్నారన్నారు, 25 సంవత్సరాల అనంతరం గురువులను స్మరించుకోవడం ఎంతో సంతోషించదగిన విషయమన్నారు. ఇదే సమయంలో పూర్వ విద్యార్థులు పాఠశాలకు ప్రోజెక్టర్, ఫ్యాన్, పిల్లలకు ప్లేట్, గ్లాసులను విరాళంగా అందించారు. -
రైతు సంక్షేమమే సర్కార్ ధ్యేయం
పంటలను పరిశీలిస్తున్న మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ పంటలను తిలకిస్తున్న మంత్రి శివరాజ్ తంగడిగి పంటలను పరిశీలిస్తున్న మంత్రి విజయానంద కాశప్పనవర్ రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాల మేరకు ఉత్తర, మధ్య, కల్యాణ కర్ణాటకలో ఇంచార్జి మంత్రులు కరువు అధ్యయనం చేశారు. రైతుల సంక్షేమమే సర్కార్ ధ్యేయమని మంత్రులు పేర్కొన్నారు. యాదగిరి జిల్లా ఇంచార్జి శరణు ప్రకాష్ పాటిల్, కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి శివరాజ్ తంగడిగి, బాగల్కోటె ఇంచార్జి మంత్రి విజయానంద కాశప్పనవర్ తమ తమ జిల్లాల్లో పర్యటించి రైతులు పంటలు వేసుకున్న భూముల్లో వాడుముఖం పట్టిన పంటలను పరిశీలించారు. యాదగిరి జిల్లాలో అధిక మొత్తంలో ఎరువులు, రసాయనిక, క్రిమి సంహారక మందులు విక్రయిస్తున్న అంశంపై రైతులు మంత్రి పాటిల్ దృష్టికి తెచ్చారు. బాగల్కోటె జిల్లా హునగుంద తాలూకా హేరూరులో పంటలను చూసి మంత్రి విజయానంద కాశప్పనవర్ చలించి పోయారు. కరువు పరిస్థితిని అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి సమగ్ర నివేదికను అందచేస్తామన్నారు. కొప్పళ జిల్లాలో మంత్రి శివరాజ్ తంగడిగి గంగావతి, కనకగిరి, కారటిగి ప్రాంతాల్లో సంచరించి కరువుతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టంపై మంత్రి పరిశీలన చెళ్లకెరె రూరల్: తాలూకాలోని హళ్లికుంటె గ్రామాన్ని మంత్రి టీ.రఘుమూర్తి సందర్శించి తీవ్ర కరువు కారణంగా హాని జరిగిన వక్కతోటలను పరిశీలించి రైతు సమస్యలను తెలుసుకున్నారు. కరువు వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తక్షణమే అధికారులతో చర్చించి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భోవి నిగమ అధ్యక్షుడు ఎం.రామప్ప, అధికారులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాల్లో కరువు అధ్యయన బాటలో అమాత్యులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇంచార్జి మంత్రుల పర్యటనలు -
కురుబలకు కేబినెట్లో చోటు ఇవ్వాలి
బళ్లారిటౌన్: ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ నేతృత్వంలోని కేబినెట్లో ఉత్తర కర్ణాటకకు చెందిన కురుబ సముదాయ ఎమ్మెల్యేలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని జిల్లా కురుబ సంఘం డిమాండ్ చేసింది. గురువారం పత్రికా భవనంలో సంఘం అధ్యక్షుడు పీఎస్ గాదిలింగనగౌడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో తమ సముదాయానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారన్నారు. సంఖ్యా బలం ప్రకారం కనీసం నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఇద్దరికి మాత్రమే చోటు కల్పించారన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. మంత్రి మండలిలో బ్యాడగి ఎమ్మెల్యే బసవరాజ్ శివన్న పేరు రేసులో ఉన్నా అంతిమ దశలో జరిగిన మార్పులు చేర్చులలో ఆయనకు మంత్రి పదవి చేజారిందన్నారు. ఇంకా భర్తీ చేయాల్సి ఉన్న ఒక స్థానంలో ఉత్తర కర్ణాటక నుంచి తమ సముదాయం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం నేతలు బీఎం పాటిల్, సింధవాళ గాదిలింగనగౌడ, మల్లికార్జున, సోమప్ప, రామలింగరాజు, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు పట్టాలపై మొరాయించిన స్కూల్ బస్సు
హుబ్లీ: విజయపుర జిల్లాలో త్రుటిలో భారీ ముప్పు తప్పింది. ఓ వైపు రైలు వస్తుండగానే 25 మంది పిల్లలతో ఉన్న స్కూలు బస్సు రైలు పట్టాలపై ఆకస్మికంగా ఆగిపోయింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు.. విజయపుర జిల్లా ఇండి తాలూకా లచ్యాణ గ్రామ సమీపంలోని కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఊపిరి బిగబట్టేంతలో ఓ పెను ప్రమాదం రెప్పపాటులో అదృష్టవశాత్తు తప్పింది. స్థానికుల సమయస్ఫూర్తితో ఈ భారీ దురంతం వెంట్రుక వాసిలో తప్పి పోయింది. అలసంగి నుంచి లచ్యాణ వెళ్లే మార్గం మీదుగా సిరుగూరు గ్రామానికి చెందిన 25 మందికి పైగా స్కూలు విద్యార్థులను తీసుకెళుతున్న బస్సు రైలు పట్టాలపై గేటు దాటుతుండగా గేర్ బాక్స్ వైఫల్యంతో రైలు పట్టాల మీదే ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా వాహనం ముందుకు కదలకుండా మొరాయించింది. కొన్ని క్షణాల పాటు విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. వాహనం పట్టాలపై ఆగిపోయిన కొన్ని క్షణాల్లోనే అదే పట్టాలపై వేగంగా రైలు వచ్చే సమయం అయింది. వాహనంలో ఉన్న 25 మందికి పైగా విద్యార్థులు భయంతో కేకలు వేశారు. ప్రాణాలను పణంగా పెట్టి.. పట్టాలపై బస్సు ఆగిపోయిన దృశ్యాన్ని గమనించిన లచ్యాణ గ్రామ యువకులు, గ్రామస్తులు ఒక క్షణం కూడా ఆలోచించకుండా పరుగు పరుగున పట్టాల వైపు వచ్చారు. చావు కళ్ల ముందు కనబడుతున్నా కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా నిలిచి పోయిన బస్సును ముందుకు తోసి రైలు పట్టాలకు అటు వైపునకు వెళ్లేలా చేయడంలో సఫలం అయ్యారు. గ్రామస్తుల ఈ విరోచిత కృత్యంతో వాహనంలోని అమాయక విద్యార్థులందరూ ఎటువంటి ప్రమాదం లేకుండా బతికి బట్టకట్టారు. గ్రామస్తులు ఈ చాకచక్యత, సమయస్పూర్తితో తీసుకున్న నిర్ణయంతో అందరికీ కంటతడి తప్పిపోగా ఘటన సుఖాంతం అయింది. గత మంగళవారం సాయంత్రమే ఈ సాహసోపేతమైన ఘటన జరిగినా ఆలస్యంగా వీడియో తదితర వివరాలు వెలుగులోకి వచ్చాయి. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విద్యార్థుల ప్రాణాలు కాపాడిన లచ్యాణ యువత, గ్రామస్తుల సమయస్పూర్తి, ధైర్య సాహసాలపై పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యంతో పాటు సర్వత్రా ప్రజల నుంచి అభినందనల జల్లు కురిసింది. విజయపుర జిల్లాలో త్రుటిలో తప్పిన ముప్పు గ్రామస్తుల సమయస్ఫూర్తితో ప్రమాదం సుఖాంతం -
హాస్టళ్లలో జిల్లాధికారిణి ఆకస్మిక తనిఖీ
రాయచూరు రూరల్: నగరంలోని మైనార్టీ, సాంఘీక సంక్షేమ శాఖ ఆధీనంలోని ప్రభుత్వ హాస్టళ్లను జిల్లాధికారిణి పూవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం రాత్రి ఆమె హాస్టల్‌ను సందర్శించి హాస్టల్లోని విద్యార్థినులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్, వార్డెన్ల పని తీరుపై విచారించారు. ఇటీవల సింధనూరు తాలూకాలోని హాస్టళ్లలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆమె తనిఖీ చేశారు. కోడిగుడ్లు, అరటి పండ్లు, ఆహార పదార్థాలు, దుస్తులు, మౌలిక సౌకర్యాలు, వంట గది శుభ్రత గురించి పరిశీలించారు. కృష్ణమ్మ వరద యథాతథం ● ఆల్మట్టి డ్యాం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల రాయచూరు రూరల్: ఎగువన ఉన్న మహారాష్ట్రలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఆల్మట్టి, నారాయణపుర డ్యాంల నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వదిలారు. ఉత్తర కర్ణాటకలో బెళగావి, బాగల్కోటె, విజయపుర, గదగ్, కళ్యాణ కర్ణాటకలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. నదీ తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందరాదని అధికారులు ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. రాయచూరు తాలూకా దేవసూగూరు వద్ద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు తాలూకాల్లో అసిస్టెంట్ కమిషనర్ హంపన్న, తహసీల్దార్ సురేష్ తదితరులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిరాటంకంగా థర్మల్ విద్యుదుత్పత్తి రాయచూరు రూరల్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య కూడా రాయచూరు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్)లో అధిక శాతం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆర్టీపీఎస్లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే 8 కేంద్రాల నుంచి 1720 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచిన ఈ సమయంలో గత రెండేళ్లతో పోల్చితే 300 బిలియన్ల యూనిట్ల విద్యుత్ వినియోగించడం జరిగింది. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రతి రోజు సోలార్, గాలి మరల విద్యుత్, థర్మల్, హైడ్రో ప్రాజెక్టుల నుంచి అధిక ప్రమాణంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 1720 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఆర్టీపీఎస్లోని మొత్తం 8 యూనిట్లకుగాను రెండు యూనిట్లను సాంకేతిక సమస్యతో స్తంభింప చేశారు. ఆరు యూనిట్లలో మాత్ర మే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఆర్టీపీఎస్ నుంచి 1090 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. కాగా రెండు లక్షల టన్నుల మేర బొగ్గు నిల్వ ఉన్నట్లు ఆర్టీపీఎస్ అధికారి రమేష్ తెలిపారు. -
గంగరాజుల పుష్ప రాజ్యం
చూడముచ్చటగా పూల రూపాలు గంగ రాజుల సామ్రాజ్య పుష్ప థీమ్బనశంకరి: స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఉద్యాననగరిలో లాల్బాగ్ పార్కులో గురువారం ఫల పుష్ప ప్రదర్శనను సీఎం డీకే.శివకుమార్ ప్రారంబించారు. ప్రాచీన కన్నడ చక్రవర్తుల గంగ రాజుల సామ్రాజ్య వైభవం, చరిత్ర, కళలు, వాస్తుశిల్పాలకు అద్దం పట్టే థీమ్‌తో ఏర్పాటైంది. వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన 130 కి పైగా అపురూపమైన పుష్పాల రాశులతో ఆకృతులను తీర్చిదిద్దారు. లాల్బాగ్ చెరువు వద్ద కృత్రిమ జలపాతం, సెల్ఫీ పాయింట్ ఏర్పాటయ్యాయి. సీఎం డీకే మాట్లాడుతూ... చరిత్రను పుష్పాల ద్వారా ప్రజలకు పరిచయం చేయడమే ఈ షో ఉద్దేశమన్నారు. పూల రూపాలను వీక్షిస్తూ సీఎం పోజులిచ్చారు. మొదటిరోజే పెద్దసంఖ్యలో జనం పుష్పందాలను తిలకించి తన్మయులయ్యారు. ఉద్యానశాఖ అధికారులు మాట్లాడుతూ శ్రావణ బెళగొళ బాహుబలి విగ్రహం, తలకాడు శిల్పకళా మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. లాల్‌బాగ్‌లో స్వాతంత్య్ర ఫల పుష్ప ప్రదర్శన ప్రారంభించిన సీఎం డీకే ప్రాచీన కన్నడ చరిత్రకు దర్పణం -
మంత్రి నాగేంద్రకు స్వాగతం
సాక్షి,బళ్లారి: బళ్లారి గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర పట్టు వదలకుండా ఎట్టకేలకు మంత్రి పదవిని దక్కించుకుని బళ్లారికి చేరుకోవడంతో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గంలో మలి విడత కేబినెట్ విస్తరణలో మంత్రి అయిన నాగేంద్ర గురువారం బళ్లారికి చేరుకోవడంతో ఆయనకు అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి అనంతపురం రోడ్డు గుండా చేళ్లగుర్కి మీదుగా బళ్లారికి విచ్చేసిన నేపథ్యంలో చేళ్లగుర్కిలో తన ఇష్టదైవం ఎర్రితాత ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. చేళ్లగుర్కి వద్దకు వేలాది మంది జనం చేరుకుని ఘన స్వాగతం పలికారు. జిల్లాధికారి నాగేంద్రప్రసాద్‌తో పాటు జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్, జెడ్పీ సీఈఓ తదితరులు కూడా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతించారు. వేలాది మంది జనం దారి పొడవునా నీరాజనాలు పలికారు. అనంతరం పలువురు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. -
వేకువనే కాల్పుల మోత
బొమ్మనహళ్లి: ఓ ఐటీ ఇంజనీరు మద్యం మత్తులో ఎయిర్‌గన్ తీసుకుని చాలాసేపు కాల్పులు జరిపాడు. బెంగళూరు వద్ద ఆనేకల్ తాలూకాలోని బండాపూర్ సమీపంలో ఉన్న సిపానీ అపార్ట్మెంట్లో ఈ సంఘటన జరిగింది. యూపీలోని లక్నోకు చెందిన అనురాగ్ తివారీ (40)గా గుర్తించారు. పోలీసులు అతన్ని కటకటాలకు తరలించారు. 45 నిమిషాలు కాల్పులు అనురాగ్ తివారీ వైట్‌ఫీల్డ్‌లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. 8 నెలలుగా సిపానీ అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులోని ఫ్లాటులో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి బాగా మద్యం తాగిన అతడు.. ఫోన్లో మాట్లాడుతూ గట్టిగా అరుస్తున్నాడు. ఆ తర్వాత తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు, అతను బాల్కనీలోకి వచ్చి, ఎయిర్‌గన్‌తో పార్కింగ్ షెడ్‌పై కాల్చసాగాడు. శబ్దం విని అక్కడికి వచ్చిన సెక్యూరిటీ గార్డులపై కూడా కాల్పులు జరిపాడు. అతను సుమారు 45 నిమిషాల పాటు ఉన్మాదిగా మారి కాల్పులు జరుపుతూ భయాందోళనలు సృష్టించాడు. ఓ కారు అద్దాలు పగిలిపోయాయి. ఎవరికీ గాయాలు కాలేదు. అరెస్టు, విచారణ కారు యజమాని మాట్లాడుతూ స్థానిక సూర్యనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పాడు. పోలీసులు, క్లూస్ టీం చేరుకుని తనిఖీలు చేశారు. నిందితుడు అనురాగ్ తివారీని నిర్బంధించి వివరాలు రాబడుతున్నారు. ఎయిర్ గన్ను, తూటాలను సేకరించారు. కాల్పులతో అపార్టుమెంటులోని జనం భీతావహులయ్యారు. మద్యం మత్తులో టెక్కీ ఉన్మాద చేష్టలు ఆనేకల్‌లో అపార్టుమెంటులో ఘటన కటకటాల్లోకి నిందితుడు -
హంపీలో అక్రమ హోంస్టేలపై సుమోటో కేసు
హొసపేటె: ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపీలోని కోర్ జోన్, బఫర్ జోన్, పర్యావరణ జోన్లలో నిబంధనలను ఉల్లంఘించి, అక్రమ వాణిజ్య కార్యకలాపాలు, హోంస్టేలకు అనుమతి ఇచ్చిన అధికారులపై ఉపలోకాయుక్త జస్టిస్ బీ.వీరప్ప సుమోటోగా ఫిర్యాదు దాఖలు చేశారు. హంపీ ప్రపంచ వారసత్వ ప్రదేశ నిర్వహణ అథారిటీ నియమ నిబంధనలను ఉల్లంఘించి, నిషేధిత ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ ప్రక్రియలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హొసపేటె, కొప్పళ జిల్లాల అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. హంపీ ప్రపంచ వారసత్వ ప్రాంత నిర్వహణ అథారిటీ అధికారులు, సహాయక కమిషనర్, తహసీల్దార్, టీపీ ఈఓలు, హొసపేటె, కొప్పళ జిల్లాల గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు యునెస్కో నిబంధనల ప్రకారం హంపీ సాంస్కృతిక, వారసత్వ ప్రాముఖ్యతను పరిరక్షించడానికి కోర్‌జోన్, బఫర్ జోన్లలో ఎలాంటి అనధికార వాణిజ్య నిర్మాణాలు, రిసార్ట్లు లేదా హోంస్టేలను నడపడానికి వీలు లేదు. అయితే సంబంధిత అధికారులు తమ అధికార పరిధిలో అటువంటి కార్యకలాపాలను నివారించడంలో పూర్తిగా విఫలమయ్యారని, కొన్ని చోట్ల చట్టవిరుద్దంగా అనుమతి ఇచ్చారని వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఉపలోకాయుక్త ఈ కేసును తీవ్రంగా స్వీకరించారు. -
మధ్యంతర బెయిల్‌పై సంబరాలా?
హుబ్లీ: జెడ్పీ సభ్యుడు యోగేష్ గౌడ హత్య ఆరోపణలపై మాజీ మంత్రి వినయ్‌కులకర్ణికి హైకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేయడంతో యుద్ధంలో గెలిచినట్లుగా సంబరాలు చేసుకోవడం మూర్ఖత్వం అని హతుడు యోగేష్ గౌడ సోదరుడు గురునాథ్ గౌడ పేర్కొన్నారు. ధార్వాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పనిసరిగా తాము హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం. దీనిపై తమ న్యాయవాదులతో చర్చిస్తున్నామన్నారు. మాజీ మంత్రి వినయ్ కులకర్ణి దోషి అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ మేరకు ఆయన శిక్షకు గురై కారాగృహంలో ఉన్నారు. ఇప్పుడేమో ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. దీన్నే ఆయన మద్దతుదారులు పెద్ద సాహసంలా భ్రమించి సంబరాలు చేసుకోవడం తగదన్నారు. తమ సోదరుడు యోగేష్‌గౌడ హత్యకు న్యాయం దొరికేంత వరకు తమ కుటుంబ పోరాటం ఆగదన్నారు. హొసపేటె వద్ద సినిమా స్టూడియో హొసపేటె: కంఠీరవ స్టూడియోస్ విస్తరణ లో భాగంగా విజయనగర జిల్లాలోని హొసపేటె పట్టణం సమీపంలో ఒక ప్రభుత్వ భూమిని గుర్తించాం, అక్కడ అద్భుతమైన స్టూడియోను నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని కంఠీరవ స్టూడియాస్ అధ్యక్షుడు మహబూబ్ పాషా తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బెంగళూరుకే పరిమితమైన సినిమా నిర్మాణ కార్యకలాపాలను వికేంద్రీకరించేలా, తాలూకాలోని మరియమ్మనహళ్లి సమీపంలో ఉన్న కనవిహళ్లి గ్రామంలో స్టూడియోకు భూమిని గుర్తించామన్నారు. కనీసం 25 ఎకరాల భూమిని మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. సిట్ క్లీన్చిట్ ఇచ్చింది: మంత్రి సాక్షి, బళ్లారి: తనపై వస్తున్న ఆరోపణలకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చిందని, అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నాగేంద్ర అన్నారు. గురువారం బళ్లారికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకులు ఎంతోమందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వారు కూడా మంత్రి పదవుల్లో ఉన్నారని అన్నారు. కరువుతో జిల్లాలో ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించారు. ముండ్రిగి నాగరాజు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాదక వస్తువులపై జాగృతి జాతా రాయచూరు రూరల్ : మాదక వస్తువుల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నవయుగ కళాశాల అధ్యక్షుడు విఘ్నేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని విద్యాలయంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మాదక వ్యసనాల నుంచి విముక్తిపై ప్రచార జాతా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నేటి తరం యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారన్నారు. యువకులు దురలవాట్లకు గురై ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక వస్తువుల సేవనం ఆరోగ్యానికి హానికరంతో పాటు మానసికంగా కుంగిపోతారని అన్నారు. గంజాయి, హఫీం వంటి వాటికి బానిస కారాదన్నారు. జాతాలో విద్యార్థులు పాల్గొన్నారు అక్రమాలపై దర్యాప్తు ఏదీ? రాయచూరు రూరల్: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్సీ) కార్యాలయంలో జరిగిన అక్రమాలపై న్యాయాంగ విచారణ జరిపించాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడి వారి భవిష్యత్తును అంధకారం చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై న్యాయాంగ విచారణ జరపాలని కోరుతూ తహసీల్దార్ సురేష్ వర్మకు వినతిపత్రం సమర్పించారుహత్య కేసు నిందితుల అరెస్ట్‌కు డిమాండ్ రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హద్దినాళ వద్ద బుధవారం జరిగిన దళిత, బీఎస్పీ కార్యకర్త భూమానంద హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని హైదరాబాద్ కర్ణాటక వాల్మీకి సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో నేతలు మాట్లాడారు. హత్య చేసిన వారిని కాకుండా ఇతరుల పేర్లను నమోదు చేశారని, వారి పేర్లను తొలగించాలని కోరుతూ ఎస్పీ అరుణాంగ్శు గిరికి వినతిపత్రం సమర్పించారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని అఖిల భారత జనవాది మహిళా సంఘం డిమాండ్ చేసింది. పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. ఎన్నికై న ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటూ గొప్పలు చెప్పడం మాని బిల్లును జారీ చేయాలన్నారు. జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల విభజన పేరుతో మహిళా బిల్లుకు చెక్ పెట్టరాదని డిమాండ్ చేశారు. -
ఎగుమతులపై అవగాహన అవసరం
సాక్షి,బళ్లారి: వ్యవసాయంలో కాని, ఇతర రంగాల్లో కాని ఉత్పత్తి చేయడమే కాదని, నాణ్యత, గ్రేడింగ్‌తో పాటు మార్కెటింగ్‌పై కూడా పూర్తిగా అవగాహన అవసరం ఉందని, ఎగుమతులు చేస్తే మంచి లాభాలు వస్తాయని, ఆ దిశగా ఆలోచించి ముందుకెళ్లాలని బీఐటీఎం కళాశాల డైరెక్టర్ పృథ్విరాజ్ పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలో బీబీసీ కళాశాలలో ఎక్స్పోర్ట్ కనెక్ట్–2026 వ్యాపార అవగాహన సదస్సు ప్రారంభించి మాట్లాడారు. ఏదైనా రంగంలో కేవలం వస్తువులను తయారు చేయడం వల్ల మాత్రమే విజయం సాధించలేమని, సమర్ధవంతమైన మార్కెటింగ్ కూడా ఉండాలన్నారు. మార్కెటింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ కర్ణాటకలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో విజన్ కర్ణాటక ఫౌండేషన్, కర్ణాటక టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ బోర్డు, జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్తంగా పని చేస్తున్నాయన్నారు. పరిశ్రమలు నాణ్యత, ఉత్పత్తి, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలపై వివరించారు. ఎగుమతులపై పూర్తిగా అవగాహన పెంచుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రముఖులు గౌరీశంకర్, శ్రీధర్ నాగభూషణ, పరిశ్రమల అధికారి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. బీఐటీఎం కళాశాల డైరెక్టర్ పృథ్విరాజ్ -
తుంగభద్ర బోర్డు కార్యదర్శిగా శ్రీనివాస్
హొసపేటె: తుంగభద్ర బోర్డు నూతన కార్యదర్శిగా శ్రీనివాస్ బైరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సీడబ్ల్యూసీ ఆర్ అండ్ డీ విభాగంలో డైరెక్టర్‌గా ఉన్న ఆయనను మండలి కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ జల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఉన్న కార్యదర్శి ఓఆర్కే రెడ్డి పదవీ కాలం పూర్తి కావడంతో ఆయన బదిలీ అయ్యారు. ప్రస్తుతం తుంగభద్ర బోర్డు ఇన్చార్జి కార్యదర్శిగా ఆస్మా ఖాటూన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో నూతన కార్యదర్శి బాధ్యతలు చేపట్టనున్నారు. భూ బాధిత రైతులకు న్యాయం కావాలి రాయచూరు రూరల్: హట్టి బంగారు గనుల కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలని లింగసూగూరు శాసన సభ్యుడు వజ్జల మానప్ప డిమాండ్ చేశారు. గురువారం హట్టి బస్టాండ్‌లో చేపట్టిన ఆందోళనలో రైతులకు మద్దతు పలికి మాట్లాడారు. రైతులు బ్యాంక్‌లో రుణాలు పొందాలంటే భూమి ఖాతాలో హట్టి గని స్థలమని పేర్కొనడంతో రైతులు పంటల సాగు చేయడం కష్టకరమైందన్నారు. 450 ఎకరాల భూమి గని పేరు మీద నమోదు కావడం విడ్డూరంగా ఉందన్నారు. భూములు పోగొట్టుకున్న రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేపడతామన్నారు. ఆందోళనలో జిల్లాధ్యక్షుడు వీరనగౌడ, వలీబాబు, శంకరగౌడ, నారాయణప్ప, సరస్వతి, సంగీత, ఈరమ్మ, నింగప్ప, శివరాజ్, వెంకోబ, శరణప్ప, మల్లికార్జునలున్నారు. జొన్నల డబ్బులు ఖాతాల్లో జమ చేయండిరాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు విక్రయించిన జొన్నల డబ్బులు ఖాతాలోకి జమ చేయాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అద్యక్షుడు అమీన్‌పాషా దిద్దిగి మాట్లాడారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యల నియంత్రణకు స్వామినాథన్ నివేదికను జారీ చేయాలన్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరలను ప్రకటించాలన్నారు. నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు అవకాశాలు కల్పించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్ ధరకే విత్తనాలు, ఎరువుల విక్రయాలు జరిపేలా చూడాలన్నారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామయ్య, తిమ్మన్న, చెన్నప్ప, వెంకటేష్, ఖాసీం, నరసింగ్ రావ్లున్నారు. డివైడర్‌కు కారు ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు హొసపేటె: అతి వేగంగా వస్తున్న కార్ డివైడర్‌ను ఢీకొనడంతో డ్రైవర్ కారులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం కానాహొసళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని ఆలూరు క్రాస్ సమీపంలో జాతీయ రహదారి– 50పై ఈ ఘటన జరిగింది. హైవేఫై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపడుతున్న కారణంగా అక్కడ డివైడర్‌ను ఏర్పాటు చేశారు. అయితే డివైడర్‌ను గమనించని బెంగళూరు నుంచి వస్తున్న కారు డ్రైవర్ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను స్థానికులు రక్షించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను జగళూరు ఆస్పత్రిలో చేర్పించారు. -
కొట్టూరు జగద్గురువులకు ఘన స్వాగతం
హొసపేటె: దేవప్రయాగ్‌లో పవిత్రమైన తపస్సును పూర్తి చేసి బుధవారం సాయంత్రం మఠానికి విచ్చేసిన కొట్టూరు స్వామి సంస్థాన మఠానికి చెందిన జగద్గురువులు కొట్టూరు బసవ లింగ మహాస్వామికి భక్తులు, వీరశైవ సమాజ బాంధవులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను మఠానికి తీసుకెళ్లారు. నగరంలోని పేటె బసవేశ్వర ఆలయం నుంచి కొట్టూరు స్వామి సంస్థాన మఠం వరకు ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు. ఊరేగింపులో ముత్తైదు మహిళలు, వివిధ కళా, సంగీత బృందాలు పాల్గొన్నాయి. స్వాగత కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు జి.నీలకంఠప్ప, సాలి సిద్దయ్య స్వామి, అక్కన బళగ సభ్యులు స్వామి, గంగాధరప్ప, కే.కొట్రేష్, కోరిశెట్టి లింగప్ప, ఎల్.బసవరాజు, బి.చిత్తప్ప, కిచిడి కొట్రేష్, ఎం.ధర్మనగౌడ, వివిధ యూనిట్ల పదాధికారులు, శ్రీమఠం భక్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
నగల షాపులో కాల్పులు, దోపిడీ యత్నం
● దాబస్‌పేటలో కలకలం దొడ్డబళ్లాపురం: కొనుగోలుదారుల్లా నగల షాప్‌కు వచ్చిన దుండగులు యజమానిపై తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటన నెలమంగల తాలూకా దాబస్‌పేటలో జరిగింది. వివరాలు.. గురువారం దాబస్పేటలోని ప్రేమ్ శివ జ్యువెలరీకి బొలెరో వాహనంలో 6 మంది వచ్చారు. నగలు కొంటామని మాట్లాడుతూ, తుపాకీ తీసి దోపిడీకి యత్నించారు. యజమాని పున్నారాం అడ్డుకోగా నాటు పిస్టల్‌తో కాల్పులు జరిపి పరారయ్యారు. బుల్లెట్ కాలికి తగలడంతో పున్నారాం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతడు ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరీక్షించగా, రెండు పేలని తూటాలు లభించాయి. సీసీ కెమెరా చిత్రాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఉత్తరాది ముఠాలే పాల్పడి ఉంటాయని అనుమానాలున్నాయి. ఆర్టీసీ బస్సు బీభత్సం ● బాలిక, తండ్రి, మరొకరు మృతి ● బాలునికి తీవ్రగాయాలు ● బెళగావి జిల్లాలో ఘోరం దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో బాలిక సహా ముగ్గురు మృతిచెందిన సంఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా కొణ్ణూరు పట్టణంలో జరిగింది. సైఫ్ ముల్లా (29), కుమార్తె సిజా (4), స్నేహితుడు ఇంతియాజ్ (35) మృతులు. సిహాన్ షారుఖ్ (4) అనే బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం గోకాక్ ఫాల్స్ ఫోర్బ్ స్కూల్ నుంచి సైఫ్, ఇంతియాజ్‌లు తమ పిల్లలను బైక్‌లో తీసుకుని ఇళ్లకు వెళ్తున్నారు. వారి వెనుకే గోకాక్ వైపు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్తూ బైక్‌ను ఢీకొని దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడ్డ సిహాన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వెంటనే డ్రైవర్ బస్సును అక్కడే వదిలి పరారయ్యాడు. బైకు తుక్కుగా మారింది. దుర్ఘటన చూసి బస్సులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. గోకాక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోస్ట్‌వాంటెడ్ అరెస్టు ● బీజేపీ కార్యకర్త ప్రవీణ్ హత్య కేసు... బనశంకరి: మంగళూరు వద్ద బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకేసులో ఎన్ఐఏ అధికారులు గురువారం కేరళ కొచ్చిలో తలదాచుకున్న మోస్ట్‌వాంటెడ్ ఎంఆర్ ఉమర్ ఫరూక్‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పట్టుబడినవారి సంఖ్య 25 మందికి చేరుకుంది. హత్య జరిగిన నాటినుంచి ఫరూక్ పరారీలో ఉన్నాడు. అతని కోసం అరెస్టు వారంటు, రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేశారు. తలపై రూ.4 లక్షల బహుమతి ప్రకటించారు. హంతకులకు అన్ని విధాలా సాయం చేశాడు. పోలీసులు గాలించడంతో కేరళకు పారిపోయి తలదాచుకున్నాడు. గతనెల 11 తేదీన నౌషాద్, నసీర్ అనే ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్‌చేసింది. వారిచ్చిన సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. సుళ్య తాలూకా బెళ్లారెలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్‌నెట్టారు (32).. 2022 జూలై 26 తేదీ రాత్రి అంగడి మూసి వెళ్తుంటే దుండగులు హత్య చేశారు. రాజధానిలో 49.53 లక్షల ఓటర్లు డౌటే!శివాజీనగర: గ్రేటర్ బెంగళూరు పరిధిలో గైర్హాజరు, శాశ్వత స్థానభ్రంశం, మరణం, పునరావృతం, ఇతర కారణాల వల్ల మొత్తం 49,53,020 (47.68 శాతం) మంది ఓటర్లు డోలాయమానంలో పడ్డారు. వారిని ఏఎస్‌డీడీఓ కేటరిగీలో చేర్చారని ఎన్నికల ప్రత్యేక కమిషనర్ సుష్మా గాడ్బోలే తెలిపారు. జీబీఏ గుర్తించిన 49,53,020 మంది ఓటర్లలో, 7,98,416 మంది వారి ఇళ్లలో లేరు. 33,84,790 మంది శాశ్వతంగా స్థానభ్రంశం అయ్యారు. 3,15,175 మంది మరణించారు, 60,005 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. మిగిలిన 3,94,634 మంది ఓటర్లు ఇతరత్రా అంశాలకు చెందినవారు. జీబీఏ వెబ్సైట్లో వివరాలు ప్రచురించినట్లు, ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించవచ్చని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే ఇచ్చేయాలన్నారు. -
ఎగువసభపై హస్త ఆధిపత్యం
శివాజీనగర: ఓ వైపు మంత్రిమండలి విస్తరణ రగిల్చిన చిచ్చు అలా ఉండగానే, మరోవైపు విధాన పరిషత్ అధ్యక్ష స్థానాన్ని కై వసం చేసుకోవడానికి సీఎం డీకే శివకుమార్ పావులు వేస్తున్నారు. తీవ్ర ఒత్తిళ్లతో పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారు. రాబోయే వర్షకాల సమావేశాల రెండో రోజున డిప్యూటీ స్పీకర్ ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయన తప్పుకుంటారని తెలిసింది. ఆగస్టు 14న పరిషత్ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆయన వారంరోజులే కుర్చీలో ఉండొచ్చు. కొందరు మంత్రులు వారించినా.. బసవరాజ్ హొరట్టికి కాంగ్రెస్ సీనియర్ మంత్రులు సతీష్ జార్కిహొళి, ఎన్.చెలువరాయస్వామి, జమీర్ అహ్మద్ ఖాన్, యూ.టీ.ఖాదర్, ఎమ్మెల్యే ఎన్.ఏ.హ్యారిస్ మద్దతుగా నిలవడం విశేషం. సీనియర్ నాయకుడైన హొరట్టి అనుభవం అవసరమని వారు తెలిపారు. కానీ మంత్రులు కోరినప్పటికీ డీకే వెనక్కి తగ్గలేదు. పార్టీ హైకమాండ్, సీనియర్లు తీసుకున్న నిర్ణయాన్ని మార్చలేమని సీఎం స్పష్టం చేసి, నిష్క్రమించాలని హొరట్టికి సూచించినట్లు సమాచారం. ఇందుకు హొరట్టి అయిష్టంగానే అంగీకరించారు. హొరట్టితో మంతనాలు హొరట్టితో కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్ గురువారం చర్చలు జరిపారు. రాజీనామా కోసం ఒప్పించేందుకు కలిశారు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నందున పదవిని వదిలిపెట్టాలని కోరారు. హొరట్టి రాజీనామా చేయకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని కాంగ్రెస్ నేతలు కొందరు హెచ్చరించారు. సలీం అహ్మద్, ఉమాశ్రీకి పగ్గాలు పరిషత్‌కు కొత్త స్పీకర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. సలీం అహ్మద్ చైర్మన్‌గా, ఉమాశ్రీని డిప్యూటీ చైర్మన్‌గా ఆమోదించింది. 14న ఎన్నికలు జరుపుతారు, అభ్యర్థులు ఎన్నికైన వెంటనే హొరట్టి రాజీనామా ప్రకటిస్తారు. 1980 నుంచి ఎమ్మెల్సీగా.. హొరట్టి సొంతూరు బాగల్‌కోట జిల్లా. 1980లో టీచర్ ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన రాష్ట్రంలో సీనియర్ ఎమ్మెల్సీ. 8 సార్లు ఆ పదవికి ఎన్నికవుతూ వచ్చారు. జేడీఎస్‌లో ఉంటూ బీజేపీలో చేరారు. ఆ కూటమి మద్దతుతో హొరట్టి కొనసాగుతున్నారు. తప్పుకోవాలని సభాపతి బసవరాజ హొరట్టిపై తీవ్ర ఒత్తిడి తలొగ్గిన హొరట్టి.. 14న రాజీనామా? సీఎం డీకే శివ మంత్రాంగం కాంగ్రెస్ నుంచి సభాపతి, డిప్యూటీ సిద్ధం చిక్కకు అన్యాయమా? బొమ్మనహళ్లి: చిక్కమగళూరు జిల్లాకు మంత్రి పదవిని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ నాయకులు బుధవారం రాత్రి తరికెరి పట్టణంలో కాగడాల ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే జి.హెచ్. శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నినాదాలు చేశారు. జిల్లా ప్రజల కోరికను హైకమాండ్ పట్టించుకోవాలన్నారు. ఇందిరాగాంధీకి రాజకీయ పునర్జన్మనిచ్చిన నేలకు మంత్రి పోస్టు ఇవ్వాలి. చిక్కమగళూరు జిల్లాకు అన్యాయం చేయవద్దు అని నినాదాలు చేశారు. -
ర్యాపిడో రైడ్.. రూ.20 లక్షల ఆస్పత్రి బిల్లు
యశవంతపుర: బెంగళూరులో ర్యాపిడో బైక్‌లో ప్రయాణిస్తుండగా కింద పడి గాయపడిన యువతి ఆస్పత్రి ఖర్చులు రూ.20 లక్షలు దాటిపోయాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరు బైరసంద్రలో ఉంటే ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేసే శానీ కృష్ణ బాధితురాలు. ఆమె ఆఫీసుకు వెళ్లాలని జూన్ 17న ర్యాపిడో బైక్ ఎక్కింది. రైడర్ నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చగా రూ.20 లక్షలకు పైగా ఖర్చయింది. తన ఆవేదనపై ఆమె సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఆ సంస్థకు ఫిర్యాదు చేసినా ఏమీ స్పందన లేదని వాపోయింది. -
నటుడు దర్శన్‌కు షాక్
బనశంకరి: బెంగళూరులో తీవ్ర సంచలనం సృష్టించిన చిత్రదుర్గ రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో నటి పవిత్రగౌడ మొదటి, ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప రెండవ నిందితులుకాగా, 14వ నిందితునిగా ఉన్న వారి మిత్రుడు ప్రదోశ్ ఎస్.రావ్ అప్రూవర్‌గా మారతానని ప్రకటించాడు. కేసు విచారణ గురువారం బెంగళూరు సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో జరిగింది. అప్రూవర్‌గా మారతానని పిటిషన్ దాఖలు చేశాడు. నటుడు దర్శన్ సీనియర్ న్యాయవాది హస్మత్ పాషా వాదిస్తూ.. కేసులో అవసరం కంటే అధికంగా సాక్ష్యాధారాలు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని దర్యాప్తు బృందం హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు తెలిపిందన్నారు. ప్రదోశ్ పిటిషన్ కాపీని తమకు అందజేయాలని, న్యాయపరమైన అభ్యంతరం తెలియజేస్తామని హస్మత్ పాషా ధర్మాసనాన్ని కోరారు. అతడు అప్రూవర్‌గా మారడాన్ని ఆయన దాదాపు వ్యతిరేకించారు. అడ్డుకోలేరు: ప్రభుత్వ వకీలు ప్రభుత్వ న్యాయవాది ప్రసన్నకుమార్ వాదిస్తూ అప్రూవర్ ప్రక్రియ చట్టబద్ధంగా జరుగుతుంది, నిందితుని సాక్ష్యాన్ని అడ్డుకునే హక్కు ఇతరులకు లేదని అన్నారు. అప్రూవర్ కావడానికి ప్రాసిక్యూషన్, కోర్టు అనుమతి కావాలి కానీ ఇతర నిందితుల సమ్మతితో పని లేదన్నారు. హత్య జరిగిన షెడ్డులో చోటుచేసుకున్న దృశ్యాలను ప్రస్తావించిన ప్రాసిక్యూటర్.. రేణుకాస్వామిపై దర్శన్ దారుణంగా దాడి చేశాడన్నారు. ప్రదోశ్ వద్దు సార్ అని దర్శన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. ఈ కేసులో ప్రదోశ్ పాత్ర ప్రధానమైనదని వివరించారు. అయితే అప్రూవర్‌గా మారడానికి కొన్ని ముఖ్య షరతులను విధించారు. ఈ కేసులో తెలిసిస ప్రతి విషయాన్ని కోర్టు ముందుంచాలి, తనతో పాటు నటుడు దర్శన్, మిగిలిన నిందితుల భాగస్వామ్యం, కుట్ర వివరాలను స్పష్టంగా వివరించాలని పేర్కొన్నారు. వాదనలను ఆలకించిన జడ్జి.. దర్శన్ న్యాయవాదికి ప్రదోశ్ పిటిషన్ కాపీని అందజేయాలని ఆదేశించి విచారణను వాయిదా వేశారు. రేణుకాస్వామి హత్య కేసు... అప్రూవర్‌గా మారతానని నిందితుడు ప్రదోశ్ పిటిషన్ వ్యతిరేకించిన దర్శన్ న్యాయవాది కోర్టులో వాడివేడిగా వాదనలు -
మైక్ విసిరేసిన సీఎం డీకే శివకుమార్!
బెంగళూరు: ప్రముఖ నటుడు, హత్య కేసులో జైలుపాలైన దర్శన్ ఫ్యాన్స్‌పై సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏకంగా మైకు విసిరారు. అసలేం జరిగిందంటే... రామనగరలో ప్రసిద్ధ శ్రీచాముడేశ్వరి కరగ మహోత్సవం ఏర్పాటు చేశారు. సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మైకు తీసుకుని మాట్లాడడం ప్రారంభించగా దర్శన్ అభిమానులు ది బాస్, ది బాస్ అంటూ నినాదాలు చేయసాగారు. మౌనంగా ఉండండి అని ఎంత చెప్పినా వినకపోవడంతో సీఎంకు కోపం ముంచుకొచ్చి మైకు పడేసి మాట్లాడడం నిలిపివేశారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ కూడా వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు. తరువాత మాట్లాడిన సీఎం డీకే.. మీ అభిమానాన్ని నేను గౌరవిస్తాను, ఇది భక్తి కార్యక్రమం, కోర్టులో ఉన్న విషయాలను ఇక్కడ మాట్లాడలేను, అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. -
రాపిడో రైడర్లకు బిగ్ షాక్: లైసెన్స్, ఆర్సీ రద్దు!
బెంగళూరు: రాజధానిలో బైక్ ట్యాక్సీ సేవలపై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించి 70 బైకులను స్వా«దీనం చేసుకున్నారు. మొబైల్యాప్ల ద్వారా ట్రిప్పులు వేస్తున్న బైకిస్టులను అడ్డుకుని సీజ్ చేశారు. యలహంక సింగనాయకనహళ్లి ఆర్టీఓ పరిధిలో 40కి పైగా బైకులను జప్తు చేశారు. బైకిస్టుల మొబైల్స్‌ను కూడా స్వాధీనం చేసుకుని రికార్డులు పరిశీలించారు. బైక్ ట్యాక్సీలను నిషేధించాలని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళనలు చేయడంతో పాటు హైకోర్టులో కేసులు వేయడం తెలిసిందే. దీంతో మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో రవాణాశాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. డీఎల్, ఆర్సీ రద్దు చేస్తాం అక్రమంగా బైకు ట్యాక్సీ నడుపుతున్న వారి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ రద్దుచేస్తున్నామని అధికారులు తెలిపారు. రాజాజీనగరలో వాహనాలు జప్తుచేయడంతో ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాపిడో డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కావాలనే బైక్ ట్యాక్సీలను బుక్‌చేసి అధికారులకు తెలిపి పట్టిస్తున్నారని కొందరు యువకులు ఆరోపించారు. వారంపాటు తనిఖీలు జరుగుతాయని అధికారులు తెలిపారు. -
ఒంటరిగా ఉన్నా యువతితో డెలివరీ బాయ్ వికృత చేష్టలు!
యశవంతపుర: బెంగళూరులో మద్యం మత్తులో డెలివరీ బాయ్ యువతి ఇంట్లో రచ్చ చేశాడు. బాధిత యువతి అనేరి ఠక్కర్ ఇన్‌స్టాలో వివరించింది. ఆమె ఒక్కరే ఉండగా డెలివరీ బాయ్ వచ్చాడు. ఆమెతో అతి ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు, మొబైల్లో చార్జింగ్ పెట్టుకుంటానని, ఇక్కడే ఉండి సిగరెట్ తాగుతానని ఆమెను ఒత్తిడి చేశాడు. ఇంట్లోకి చొరబడడానికి యత్రించాడని యువతి వాపోయింది. చివరకు ఎలాగో అతన్ని వెనక్కి పంపించినట్లు, అతడు పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తామని చెప్పారని పేర్కొంది. View this post on Instagram A post shared by Aneri Thakkar | Growth Mindset | People skills | Relationships (@anerithakkar_) -
రేణుకాస్వామి కేసులో కీలక పరిణామం
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్ (మాఫీ సాక్షి)గా మారేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ప్రదోష్ కోర్టు ముందు నిజాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడంతో.. ఈ పరిణామం దర్శన్‌కు కొత్త చిక్కులు తెచ్చే అవకాశముందనే చర్చ మొదలైంది.రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన నిందితులుగా దర్శన్, పవిత్ర గౌడ పేర్లను ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఏ14 నిందితుడు ప్రదోష్ ప్రస్తుతం అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. అయితే కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలను కోర్టు ముందు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని పిటిషన్లో అతను పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు చట్టపరంగా మాఫీ సాక్షిగా(approver) మారే అవకాశం కల్పించాలని కోరాడు.కేసులో కొత్త మలుపుప్రదోష్ అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే.. రేణుకాస్వామి హత్య కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సాక్షిగా మారితే కేసులోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రదోష్ చెప్పే వివరాలను కోర్టు ఎలా పరిగణిస్తుంది? అతడి వాంగ్మూలం కేసులో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? అనేది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.కోర్టు ముందుకు ప్రదోష్ప్రదోష్ ఇవాళో, రేపో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అతడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే.. కేసులోని ఇతర నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.2024 జూన్‌లో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి.. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్‌పై హత్య కుట్ర, కిడ్నాప్, దాడి వంటి అభియోగాలు నమోదు చేసి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. తొలుత కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ దర్శన్‌ను తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో దర్శన్ మళ్లీ జైలు పాలయ్యాడు. అయితే.. ఈ కేసులో సాక్షుల్ని బెదిరిస్తున్నారంటూ తాజాగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జైల్లో దర్శన్ ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరగ్గా, కర్ణాటక డీజీపీ దానిని పుకారుగా కొట్టి పారేశారు. ప్రదోష్ వాంగ్మూలం కీలకమవుతుందా?తాజాగా ఈ కేసులో ఏ14 నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించడం మరో కీలక పరిణామంగా మారింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తి సాధారణంగా కేసుకు సంబంధించిన కీలకసమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు అతడి అభ్యర్థనను అంగీకరిస్తే.. కేసులోని మరిన్ని వివరాలు, నిందితుల పాత్రకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
30 ఫ్లస్.. డీకేకు చెక్ పెట్టే వ్యూహమా?
కేబినెట్ విస్తరణ తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌లో మొదలైన అసంతృప్తి మరింత తీవ్రరూపం దాలుస్తోంది. మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు నిరసనలు కొనసాగిస్తుండగా.. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ నేతలు నేడు కీలక సమావేశం నిర్వహిస్తుండడం.. ఉత్కంఠను రేకెత్తిస్తోంది.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. అయితే పలువురు సీనియర్ నేతలు తమకు అవకాశం రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతల అనుచరులు బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట నిరసనలు కూడా చేపట్టారు. ముఖ్యంగా తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న నేతలు.. ప్రాంతీయ సమతుల్యత, సీనియారిటీ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. కొన్ని జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదని, మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కూడా అసంతృప్త నేతలు చెబుతున్నారు.ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్యే..మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి చెందిన ఇండీ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదని అనుచరులు చెబుతున్నారు. మరో నేత బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా ఆలోచనలో ఉన్నారు. వీరితో పాటు దినేశ్ గుండు రావు, ఎం. కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణ, ఎం.సీ. సుధాకర్, ఆర్బీ తిమ్మాపూర్, రహీం ఖాన్ వంటి పలువురు నేతలు కేబినెట్ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.మంత్రి పదవుల ఎంపికలో ప్రాంతీయ సమతుల్యత పాటించలేదని, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు తమ అనుచరులతో కలిసి నిరసనలు చేపట్టగా.. మరికొందరు పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా: డీకేఅసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా హెచ్చరికలపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కఠినంగా స్పందించారు. రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరని, రాజీనామా లేఖలు వస్తే నిమిషాల్లో ఆమోదిస్తామని హెచ్చరించారు. “రాజకీయాల్లో రాజీనామాలు సాధారణం. పార్టీ అన్నింటికంటే ముఖ్యం. ఓపికగా ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, సహనం పాటించడం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని అసంతృప్త నేతలకు సూచించారు. ఈ తరుణంలో.. డీకే శివకుమార్‌తో చర్చల అనంతరం కొందరు నేతలు మెత్తబడినట్లు సమాచారం.నేడు ఏం తేలనుంది?మంత్రి పదవులు దక్కని నేతలు నేడు రహస్యంగా భేటీ అవుతున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో.. తమ డిమాండ్లు, పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచే మార్గాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది. సీఎం డీకే వైఖరి కారణం.. అవసరమైతే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని కూడా వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేల సమావేశం నేపథ్యంలో ఈ అసంతృప్తి ఏ స్థాయికి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.అధిష్టానం రంగంలోకి..కర్ణాటక కాంగ్రెస్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలాను బెంగళూరుకు పంపింది. ఇప్పటికే ఆయన సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చించారు. ఇవాళో, రేపో అసంతృప్త నేతలతో చర్చలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేలా చేయడమే లక్ష్యంగా హైకమాండ్ ప్రయత్నిస్తోంది.ప్రభుత్వానికి ముప్పు ఉందా?కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 113. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి 135 స్థానాలు గెలుచుకుంది. అంటే మెజారిటీ మార్క్ కంటే 22 స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాలు గెలుచుకున్నాయి.అందుకే ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ప్రభుత్వం పడిపోయేంత సంఖ్యాబలం సంక్షోభం లేదని పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బయటకు వెళితే తప్ప ప్రభుత్వానికి తక్షణ ముప్పు ఉండదన్న అంచనా ఉంది. అయితే సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. సీనియర్ నేతల అసంతృప్తి కొనసాగితే అది డీకే శివకుమార్ నాయకత్వానికి, పార్టీ అంతర్గత ఐక్యతకు రాజకీయ సవాల్‌గా మారే అవకాశం ఉంది.ఇప్పటి వరకు మంత్రి పదవుల కోసం జరిగిన అసంతృప్తి.. నేడు జరిగే ఎమ్మెల్యేల సమావేశంతో ఏ మలుపు తిరుగుతుందన్నదే కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారు? అధిష్టానం వారిని బుజ్జగిస్తుందా? లేదంటే డీకే శివకుమార్ కఠిన వైఖరినే కొనసాగిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. -
ఫార్మా కంపెనీలో మృత్యుఘోష
రాయచూరు రూరల్: కర్మాగారంలో విషపూరిత గ్యాస్ లీక్ కాగా, దానికి పీల్చడంతో ముగ్గురు కార్మికులు మరణించిన ఘటన యాదగిరి జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గురుమిఠకల్ నియోజకవర్గంలోని కడేచూర్ బాడియాల పారిశ్రామికవాడలో సిల్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనే ఫార్మా ఫ్యాక్టరీ ఉంది. బుధవారం ఉదయం పైపుల నుంచి ప్రమాదకర గ్యాస్ లీకేజీ కాగా, విధుల్లో ఉన్న కార్మికులు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. తెలంగాణలోని మాగనూర్– అలంపల్లికి చెందిన కట్లా గణేష్ (23), మధ్యప్రదేశ్వాసులు విక్రంసింగ్ గోండా(25), సంజయ్‌సింగ్ గోండా (25) రసాయనం తీవ్రతకు మృత్యువాత పడ్డారు. ఏపీలో అనంతపురం సిండికేట్ నగర్‌కు చెందిన మంచాల హేమంత్ (23), అనంతపురం జిల్లా కూడేరు దగ్గర చోళసముద్రంవాసి మంచాల శివకుమార్ (25)లు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. తోటి కార్మికులు రాయచూరు ప్రభత్వ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేలు శరణేగౌడ కందకూర్, వేణుగోపాల్ నాయక్, దర్శనాపుర, జిల్లా కలెక్టర్ రావుల్ తుకారం పాండ్వే, జడ్పీ సిఇఓ లవీష్ ఒడెయార్, ఎస్పీ పృధ్వీ శంకర్లు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. ప్రమాదకర వాయువు లీకై ముగ్గురు కార్మికులు మృతి మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థత బాధితుల్లో తెలంగాణ, ఏపీవాసులు యాదగిరి జిల్లాలో సంఘటన -
థార్ జీపు పల్టీలు, ఇద్దరు మృతి
దొడ్డబళ్లాపురం: పుట్టినరోజు వేడుక చేసుకున్న మిత్రులకు సంతోషం ఎంతోసేపు మిగలలేదు. థార్ జీప్ బోల్తాపడడంతో ఇద్దరు చనిపోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన బెంగళూరు దగ్గర నెలమంగల తాలూకా కంబాళులో జరిగింది. మంగళవారం రాత్రి పవన్, దీపక్, మరో ముగ్గురు కలిసి మిత్రుని బర్త్‌డే విందులో పాల్గొని థార్ జీప్‌లో తిరిగి వస్తుండగా కంబాళు వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది, వాహనం తుక్కుగా మారింది. పవన్, దీపక్ తీవ్ర గాయాలతో మృత్యువాత పడ్డారు. మిగతా ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతి వేగం వల్ల ప్రమాదం సంభవించినట్టు అనుమానిస్తున్నారు. దాబస్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డెలివరీ బాయ్ అతి యశవంతపుర: బెంగళూరులో మద్యం మత్తులో డెలివరీ బాయ్ యువతి ఇంట్లో రచ్చ చేశాడు. బాధిత యువతి అనేరి ఠక్కర్ ఇన్‌స్టాలో వివరించింది. ఆమె ఒక్కరే ఉండగా డెలివరీ బాయ్ వచ్చాడు. ఆమెతో అతి ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు, మొబైల్లో చార్జింగ్ పెట్టుకుంటానని, ఇక్కడే ఉండి సిగరెట్ తాగుతానని ఆమెను ఒత్తిడి చేశాడు. ఇంట్లోకి చొరబడడానికి యత్నించాడని యువతి వాపోయింది. చివరకు ఎలాగో అతన్ని వెనక్కి పంపించినట్లు, అతడు పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తామని చెప్పారని పేర్కొంది. ఇంటి నుంచే పని పేరుతో భారీగా మోసాలుదొడ్డబళ్లాపురం: సోషల్ మీడియాలో అసత్యపు ప్రకటనలు ఇచ్చి అమాయకపు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మోసకారి దంపతులను దేవనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. చిక్కజాల నివాసులు కిరణ్ (28), ఆరతి (23) పట్టుబడ్డారు. ఇంట్లో కూర్చునే వేల రూపాయల్ని సంపాదించవచ్చని, పేపర్ ప్లేట్లు, అగరొత్తులు, క్యాండిల్స్ ప్యాకింగ్ చేస్తే డబ్బులు ఇస్తామని కార్మికాదేవి ఎంటర్‌ప్రైజస్ పేరుతో ఇంటర్నెట్లో జోరుగా ప్రకటనలు ఇచ్చారు. వాటిని చూసి కాల్ చేస్తే డిపాజిట్ చెల్లించాలని చెప్పి అందినంత వసూలు చేసుకునేవారు. ఇలా ఎంతోమంది నుంచి పెద్ద మొత్తాల్లో లాక్కున్నారు. వీరిపై దేవనహళ్లి, దొడ్డబళ్లాపురం, చిక్కజాల, యలహంక తదితర పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దేవనహళ్లి పట్టణ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. విద్యార్థుల ఘర్షణ యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లా మంగళూరు నగరంలో ప్రముఖ కాలేజీలో గొడవల వల్ల ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం గుజ్జరెకెరెలో కాలేజీ వద్ద టీస్టాల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై దాడి చేశారు, ఇందులో ఒకరి మెడ ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుమంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. అలాగే.. మరో కాలేజీలో విద్యార్థుల నుంచి 290 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని డ్రగ్స్ కేసు నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ సుధీర్‌కుమార్ రెడ్డి తెలిపారు. బైక్ ట్యాక్సీల సీజ్ ● బెంగళూరులో రవాణాశాఖ దాడులు బనశంకరి: రాజధానిలో బైక్ ట్యాక్సీ సేవలపై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించి 70 బైకులను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్యాప్ల ద్వారా ట్రిప్పులు వేస్తున్న బైకిస్టులను అడ్డుకుని సీజ్ చేశారు. యలహంక సింగనాయకనహళ్లి ఆర్టీఓ పరిధిలో 40కి పైగా బైకులను జప్తు చేశారు. బైకిస్టుల మొబైల్స్ ను కూడా స్వాధీనం చేసుకుని రికార్డులు పరిశీలించారు. బైక్ ట్యాక్సీలను నిషేధించాలని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళనలు చేయడంతో పాటు హైకోర్టులో కేసులు వేయడం తెలిసిందే. దీంతో మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో రవాణాశాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. డీఎల్, ఆర్సీ రద్దు చేస్తాం అక్రమంగా బైకు ట్యాక్సీ నడుపుతున్న వారి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ రద్దుచేస్తున్నామని అధికారులు తెలిపారు. రాజాజీనగరలో వాహనాలు జప్తుచేయడంతో ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాపిడో డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కావాలనే బైక్ ట్యాక్సీలను బుక్‌చేసి అధికారులకు తెలిపి పట్టిస్తున్నారని కొందరు యువకులు ఆరోపించారు. వారంపాటు తనిఖీలు జరుగుతాయని అధికారులు తెలిపారు. -
కరువుపై అధ్యయన బృందం పరిశీలన
హుబ్లీ: రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఛాయలు నెలకొన్న నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కరువు అధ్యయన బృందం బుధవారం ధార్వాడ జిల్లాలో పర్యటించి అన్నదాతల ఆవేదనను స్వయంగా తెలుసుకుంది. ఎమ్మెల్సీ రవికుమార్ నేతృత్వంలో బృందం కుందగోళ తాలూకా గుడెకట్టి గ్రామ శివారులో వర్షాభావంతో పూర్తిగా ఎండిపోయిన పెసర పంట పొలాలను పరిశీలించింది. స్థానిక రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను, వారి గోడును బృందం ఆలకించింది. పొలంలో విత్తిన విత్తనాలన్ని మట్టిపాలు కావడాన్ని తిలకించింది. తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి పంట నష్టం, వర్షాభావం, ప్రభుత్వం తీసుకున్న పరిహార చర్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ కరువు కాటుతో బాధపడే ఉత్తర కర్ణాటక రైతులకు ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. పంట నష్ట అధ్యయనాన్ని పారదర్శకంగా నిర్వహించి బాధల్లో ఉన్న రైతులకు తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. బృందంలో జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ బసవరాజ్ బొమ్మైతో పాటు బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. -
తుంగభద్ర కాలువ గట్టు పరిశీలన
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు ఇరువైపుల కుదించుకు పోయిన గట్లను బుధవారం మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప, మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ పరిశీలించారు. కాలువ గట్టుపై మట్టి కుదించుకుని పోయింది. దీంతో ఆయకట్టు చివరి భూములకు నీరందడం కష్టంగా మారింది. రాయచూరు, కొప్పళ జిల్లాల మధ్య గల మైలాపుర, దుర్గా క్యాంపుల వద్ద కాంక్రీట్ సిమెంట్ కుదించుకుపోయి ఏడాది గడుస్తున్నా అధికారులు మరమ్మతులు చేపట్టక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెంట దొడ్డ బసవరాజ్, వీరోజీ మరాఠి, మంజు హొసమనిలున్నారు. -
రైతుల్లో చిగురించిన ఖరీఫ్ ఆశలు
సాక్షి,బళ్లారి: ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి తుంగభద్ర డ్యాంలో నీరు చేరడం ఆలస్యం కావడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందారు. ఎల్‌నినో ప్రభావం కూడా ఉందని, డ్యాంలోకి నీరు చేరడం కష్టం అవుతుందని భావించి రైతులందరూ నిరుత్సాహంతో డీలా పడ్డారు. జూలై నెల దాటిన కూడా డ్యాంలో తగినంత నీరు చేరకపోవడంతో ఇక ఖరీఫ్‌కు క్రాప్‌హాలిడే ప్రకటిస్తారేమోనని ఆయకట్టు రైతులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే ఉన్నఫళంగా ఆగస్టు నెల ప్రారంభం నుంచి క్రమేణా తుంగభద్ర డ్యాంలోకి వరద వెల్లువెత్తడంతో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. తుంగభద్ర డ్యాంకు ఎగువన ఆగుంబె, మోరాళ, తీర్థహళ్లి, శివమొగ్గ తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో తుంగా డ్యాం పూర్తిగా నిండిపోయి దిగువకు నీటి ప్రవాహం పెరిగి పోయింది. ప్రస్తుతం డ్యాంలోకి ఇన్‌ఫ్లో రూపంలో లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతుండటంతో డ్యాంలో నీటి నిల్వ 60 టీఎంసీలకు పైగా చేరింది. ఖరీఫ్‌లో పంటల సాగుకు ఢోకా లేనట్లే.. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేయడానికి తగినంత నీరు చేరిపోయింది. ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో డ్యాం పూర్తిగా నిండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డ్యాంలో నీటి నిల్వ, డ్యాంలోకి వస్తున్న ఇన్‌ఫ్లోను బట్టి ఖరీఫ్ పంటకు ఢోకా లేనట్టేనని తెలుస్తోంది. ఇప్పటికే తుంగభద్ర ఆయకట్టులో బోరుబావులు, చెరువుల కింద వరి నార్లు పోసుకుని రైతన్నలు సిద్ధంగా ఉన్నారు. వరినాట్లు వేయడానికి కొందరు రైతులు ముందుగానే దుక్కులు దున్నగా, మరికొందరు రైతులు తమ భూముల్లో జోరుగా ఖరీఫ్ పనులను ఉత్సాహంగా చేస్తున్నారు. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగరతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం, తెలంగాణలోని మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 20 లక్షల మేర ఆయకట్టు భూములు ఉన్నాయి. దీంతో అన్ని ప్రాంతాలకు దామాషా ప్రకారం నీటి విడుదలకు డ్యాంలో తగినంత నీరు చేరింది. సాగునీటి విడుదలకు అధికారుల ఏర్పాట్లు ఈనేపథ్యంలో హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, ఎల్‌బీఎంసీ, రాయబసవణ్ణ తదితర కాలువలకు నీరు విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంచినీటి కోసం కాలువలకు నీరు వదిలిన నేపథ్యంలో అదే నీటిని నిలుపుదల చేయకుండా కాలువ ద్వారా ఖరీఫ్ సాగుకు నీరు కొనసాగిస్తామని అధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్ సాగుపై ఆందోళన చెందిన రైతాంగానికి, ప్రస్తుతం డ్యాంలోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో వల్ల రైతన్నలకు పెద్ద ఊరట చెందిందని చెప్పవచ్చు. కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి సాక్షితో మాట్లాడుతూ వరుణుడి దయతో ఖరీఫ్‌కు సరిపడేంతగా డ్యాంలోకి నీరు చేరిందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నారు పోసుకున్న రైతులు సకాలంలో అదునులో వరినాట్లు వేయడానికి, మిర్చి నారు పోసుకున్న రైతులు కూడా మిర్చి నాట్లు వేసుకోడానికి వీలవుతుందన్నారు. అధికారులు తక్షణం సాగునీటి అవసరాలకు కూడా కాలువలకు నీరు వదలాలని అన్నారు. వరద నీటితో తొణికిసలాడుతున్న తుంగభద్ర డ్యాం ఆయకట్టులోని పంటలను పరిశీలిస్తున్న రైతు సంఘం నేతలు డ్యాంకు లక్ష క్యూసెక్కులకు పైగా ఎగువ నుంచి వస్తున్న వరద తుంగభద్ర డ్యాంలో 60 టీఎంసీలకు పైగా చేరిన నీటి నిల్వ ఆయకట్టులో ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు సగానికి పైగా తుంగభద్ర డ్యాం భర్తీహొసపేటె: బళ్లారి, కొప్పళ, రాయచూరు, విజయనగర జిల్లాలతో సహా మూడు రాష్ట్రాల్లోని 8 జిల్లాలకు జీవనాడి తుంగభద్ర డ్యాంలోకి ఎగువ నుంచి వరద భారీగా పెరిగింది. ప్రస్తుతం డ్యాం సగానికి పైగా నిండటంతో జలకళ వచ్చింది. 1633 అడుగుల గరిష్ట నీటిమట్టం కలిగిన డ్యాంలో బుధవారం ఉదయం 8 గంటలకు నీటిమట్టం 1619.42 అడుగులకు చేరింది. 105.788 టీఎంసీల గరిష్ట నీటినిల్వ సామర్థ్యం కలిగిన ఈ డ్యాంలో ఇప్పటికే 59.718 టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేరింది. తొలిసారిగా లక్ష క్యూసెక్కుల వరద ప్రస్తుత ఏడాదిలో తొలిసారిగా డ్యాంలోకి వరద లక్ష క్యూసెక్కులను దాటింది. గత 24 గంటలుగ 1,00,750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాలువల ద్వారా 1,443 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం 1626.06 అడుగులుగా, నీటి నిల్వ 80.003 టీఎంసీలుగా ఉండేది. మల్నాడులో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వచ్చేవారంలో డ్యాం పూర్తిగా నిండుతుందనే ఆశలు చిగురించాయి. మొత్తం మీద తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుండటం రైతులకు ఆనందాన్ని కలిగిస్తోంది. -
బాగేపల్లిలో బంద్
● ముమ్మరంగా అభిమానుల నిరసనలు బాగేపల్లి: ఎమ్మెల్యే సుబ్బారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు బుధవారం కూడా వినూత్నంగా నిరసన తెలిపారు. అలాగే పట్టణ బంద్ నిర్వహించగా విజయవంతమైనట్లు ప్రకటించారు. పట్టణంలో ఉదయం నుంచే ధర్నా ప్రారంభమైంది. కార్యకర్తలు పట్టణ నలు దిక్కుల నుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా అడ్డుకున్నారు. మిరపకాయలను తిని, టైర్లను కాల్చి, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వాహనాల ముందు కూర్చున్నారు. సుబ్బారెడ్డికి పదవి ఇవ్వకుండా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. పట్టణంలోని షాపులు, సముదాయాలు మూతపడ్డాయి. పలుచోట్ల నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. -
బాధిత కుటుంబాన్ని ఆదుకోండి
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో ఇటీవల మరణించిన అమాయక పేద కార్మికుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అంజుమన్ కమిటీకి చెందిన నూర్ అహ్మద్ అన్నారు. ఆయన పట్టణంలో మృతుని కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఎస్పీ నిజం బయట పెట్టాలన్నారు. ఒక వైపు పోలీసులు కొట్టి చంపగా, ఉన్నతాధికారులు కనీసం బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించలేదన్నారు. వారికి చిన్న పిల్లలు ఉన్నారు. బాధిత కుమార్తె ఎలా బతకాలి? వారిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మాని, న్యాయం జరిగేలా ఏదైనా చేయాలి. రాబోయే రెండు రోజుల్లో సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేయకపోతే, ఈ విషయాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. భవిష్యత్తులో న్యాయం జరగాలంటే ఈ మరణంపై పూర్తి పారదర్శకంగా న్యాయ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ ఇస్మాయిల్, కే.ఇస్మాయిల్, న్యాయవాది బషీర్ అహ్మద్ హాజరయ్యారు. -
చీపురు పట్టిన అధికారులు
మైసూరు: త్వరలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం మైసూరు పాలికె ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛతా అభియాన్ జరిగింది. చిక్కవీరణ్ణ రోడ్డులో ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్థాలు, చెత్తచెదారాన్ని చీపుర్లతో ఊడ్చి తొలగించారు. 5 లోడర్లు, 10 టిప్పర్లు, 5 డోజర్లతో చేపట్టిన ఈ అభియాన్‌లో మొత్తం 83 టన్నుల వ్యర్థాలను ఖాళీ చేయించారు. జిల్లాధికారి లక్ష్మీకాంత్‌రెడ్డి, పాలికె కమిషనర్ ఎంకే సవిత, అధికారులు, సిబ్బంది పాల్గొని స్వయంగా చీపుర్లు పట్టి చెత్తను ఊడ్చారు. తరువాత ప్రజలతో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. మైసూరులో స్వచ్ఛ సేవ -
ఎగువన వానలు.. నదుల పరవళ్లు
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా, దాని ఉపనదులకు వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఆల్మట్టి, నారాయణపుర నుంచి లక్షా 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. దీంతో ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, గదగ్, కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు తాలూకాలో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ప్రజలను జాగృతం చేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. బెళగావి జిల్లాలో శంకర లింగ దేవాలయం, రాయచూరు తాలూకా కాడ్లూరు వద్ద ఉపేంద్ర తీర్థ ఆలయం నీట మునిగింది. లింగసూగూరు తాలూకా శీలహళ్లి, హంచినాళ వాగుల్లో నీటి ఉధృతితో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవదుర్గ తాలూకా హువిన హెడగి వంతెన పైగుండా నీరు పారుతోంది. భారీ వర్షాలతో కోయ్నా డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో ఉత్తర కర్ణాటకలో నదులు ఉప్పొంగుతున్నాయి. దూద్‌గంగా, వేదగంగా, ఘటప్రభ, మలప్రభ నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా, దాని ఉపనదులకు ముంచెత్తిన వరదలు ఆల్మట్టి డ్యాం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల -
వాల్మీకి మండలి అధ్యక్ష పదవికి రాజీనామా
రాయచూరు రూరల్: సీఎం డీ.కే.శివకుమార్ మలి విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనందుకు నిరసనగా మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ రాజీనామా చేశారు. బుధవారం తన రాజీనామా లేఖను సీఎంకు పంపించారు. మూడేళ్ల పాటు అందరి సహకారంతో పని చేశాననే తృప్తి తనకు ఉందని తెలిపారు. కనీస వేతనాలు అందించాలని ధర్నా రాయచూరు రూరల్: కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ఏఐటీయూసీఐ డిమాండ్ చేసింది. బుధవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అణ్ణప్ప మాట్లాడారు. కార్మికుల నమోదు ప్రక్రియ, రెన్యువల్, ఆరోగ్య భాగ్య, విద్యా, విశ్రాంతి పింఛన్, ఇతర పథకాలను గురించి కార్మికులకు వివరించాలన్నారు. రాష్ట్ర సర్కార్ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించేలా సర్కార్ చర్యలు చేపట్టి వారికి సౌకర్యాలు సక్రమంగా అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. రౌడీల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలుహుబ్లీ: జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లు, పట్టణాలు, గ్రామాల్లో రౌడీ స్క్వాడ్ ఆధ్వర్యంలో రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య సూచనల మేరకు డీఎస్పీ ధార్వాడ గ్రామీణ, సీఐ, ఎస్ఐలు, ఇతర సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. రౌడీ షీటర్ల ఇళ్లలో మారణాయుధాలు తదితరాలు ఉన్నాయా? అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా పరిధిలో మొత్తం 103 మంది రౌడీల ఇళ్లను పరిశీలించారు. అంతేగాక ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు చట్టంపై తగిన అవగాహన కల్పించి హెచ్చరికలు జారీ చేశామని జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించండి రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్‌వర్క్ కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలను చెల్లించాలని టాస్క్‌వర్క్ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాగలింగస్వామి సర్కార్‌ను డిమాండ్ చేశారు. బుధవారం రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది నుంచి వేతనాలు లేకపోవడంతో పాటు పనులు లేని కారణంగా బకాయి వేతనాలు చెల్లించకపోవడం తగదని అన్నారు. ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేయాలన్నారు. చెరువు పనుల తనిఖీ హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా అయ్యనహళ్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువు పునరుద్ధరణ పనులను టీపీ ఈఓ ఎండీ ఆలంఖాన్ బుధవారం పరిశీలించారు. కార్మికులందరూ పనిలో నిమగ్నం కావాలని, కార్మికుల బాధ్యతలు, హక్కుల గురించి ఆయన వివరించారు. వీబీజీ రాంజీ పథకం కింద ఉన్న 318 పనులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నారు. టీపీ పాలనాధికారి శ్రీనివాస్ కులకర్ణి, మన్సూర్ సాబ్, ఐఈసీ కో–ఆర్డినేటర్ హెచ్.నాగరాజ్, టెక్నికల్ కో–ఆర్డినేటర్, ఆస్పత్రి కోఆర్డినేటర్ దేవరాజ్, కార్మికులు పాల్గొన్నారు. పథకాలు లబ్ధిదారులకు అందించాలిరాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు, కూలీలకు వీబీజీ రాంజీ తదితర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ సూచించారు. రాయచూరు తాలూకా ఇడపనూరు, నడిగడ్డ మల్కాపుర, గుండ్వేలిలో పర్యటించి అధికారులతో మాట్లాడారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి గ్రామ పంచాయతీ అధికారులు ముందుకు రావాలన్నారు. నత్తనడకన సాగుతున్న పథకాలను, అభివృద్ధి పనుల వేగాన్ని పెంచాలన్నారు. జిల్లాలో అపౌష్టికత నివారణ, పిల్లలను పొలం పనులకు పంపకుండా వారిని పాఠశాలల్లో చేర్పించడానికి శ్రమించాలన్నారు. ఆయన వెంట టీపీ ఈఓ చంద్రశేఖర్, బీఈఓ ఈరణ్ణ, హన్మంతు, మహేష్, అల్తాఫ్, మన్సూర్లున్నారు. -
రాష్ట్రంలో 5.54 కోట్ల ఓటర్లు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్)లో 99.84 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. రాష్ట్రంలో 5,54,32,314 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. 4.43 కోట్లు యాక్టివ్ ● బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అన్బుకుమార్ వివరాలను తెలిపారు. 5.54 కోట్ల ఎన్యూమరేషన్ ఫారంలు ముద్రించి బీఎల్ఓలకు పంపిణీ చేశామన్నారు. ● 4,43,04,632 మంది ఓటర్ల వివరాలు డిజిటల్లీ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. 1,11,07,461 (20 శాతం) దాఖలాలను ఏఎస్‌డీడీఓ తనిఖీలోకి చేర్చామన్నారు. ● 66,64,943 మంది ఓటర్లు చిరునామాను శాశ్వతంగా మార్చారని తెలిపారు. ● 16,30,872 మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారు. ● 16,30,753 మంది ఓటర్ల చిరునామా, వివరాలు అందుబాటులో లేవు. బెంగళూరులో భారీ తేడా సర్ ప్రక్రియలో బెంగళూరులో అత్యధికంగా ఓటర్లు గల్లంతయ్యారు. బెంగళూరు నగర జిల్లాలో 45 శాతం, బె.ఉత్తర జిల్లాలో 47 శాతం, బె.సెంట్రల్లో 48 శాతం, బె.దక్షిణలో 51 శాతం మంది ఓటర్ల వివరాలు లేవని సీఈఓ చెప్పడం విశేషం. మృతులు, అడ్రస్ మార్పులు, ఆచూకీ లేనివారు ఇందులో ఉండవచ్చన్నారు. బె.గ్రామీణ, జీబీఏ నార్త్, జీబీఏ సెంట్రల్, జీబీఏ దక్షిణలో 100 శాతం ఎన్యుమరేషన్ ఫారంలు పంపిణీ చేసినట్టు తెలిపారు. సర్ 99 శాతం డిజిటలైజేషన్ పూర్తి బెంగళూరు పరిధిలో ఎక్కువ ఓటర్ల గల్లంతు సీఈఓ అన్బుకుమార్ వెల్లడి -
విజయనగరకు ఇంచార్జి మంత్రిగా జమీర్ అహ్మద్ ఖాన్
హొసపేటె: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్రంలో కరువు అధ్యయనం కోసం జిల్లా ఇంచార్జి మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి బీ.జెడ్.జమీర్ అహ్మద్ ఖాన్ విజయనగర జిల్లా ఇంచార్జి మంత్రిగా తిరిగి నియమితులయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న వరద, కరువు పరిస్థితులపై తమకు కేటాయించిన జిల్లాల్లో తక్షణమే పర్యటించి, పరిస్థితులను పరిశీలించి, వాస్తవ స్థితిపై ఉపముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి వెంటనే నివేదిక సమర్పించాలని ఇంచార్జి మంత్రులను ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఆదేశించారు. యువకుడు దారుణ హత్య సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: పాతకక్షల నేపథ్యంలో దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా గబ్బూరు ఫిర్కా పరిధిలోని సుంకేశ్వరహాళ రోడ్డులో జరిగింది. హద్దినాళ గ్రామానికి చెందిన బీఎస్పీ కార్యకర్త, దళిత యువకుడు భూమానంద(28)ను మంగళవారం రాత్రి హద్దినాళ క్రాస్‌లో పాత కక్షలతో దుండగులు మారణాయుధాలతో దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనపై గబ్బూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దళిత యువకుడిని దారుణంగా హత్య చేయడం హేయమని, నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని మాదిగ పోరాట సమితి తదితర దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. హత్యను నిరసిస్తూ సుంకేశ్వరహాళ వద్ద చేపట్టిన రాస్తారోకోలో దళిత సంఘం నేత ప్రభురాజ్ కొడ్లి మాట్లాడారు. ఆందోళనలో హన్మంతప్ప తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏఎస్పీ హరీష్, డీఎస్పీ దత్తాత్రేయ కార్నాడ్లున్నారు. మాజీ ప్రియుడి వేధింపులతో యువతి ఆత్మహత్యబళ్లారిఅర్బన్: వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ మాజీ ప్రియుడి వేధింపులు, బెదిరింపులకు గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని కౌల్‌బజార్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతురాలు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. గతంలో కౌల్‌బజార్‌కు చెందిన అజీం అనే యువకుడితో ప్రేమలో ఉన్న ఆమె, కొంతకాలం తర్వాత అతనితో విభేదాల కారణంగా దూరమైంది. అనంతరం అజీం స్నేహితుడు సోహైల్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న అజీం తనతో ఉన్న వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు ముందు ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేసి, తన మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేసింది. అడవి పంది వేటగాళ్ల అరెస్టుహొసపేటె: తమకు అందిన సమాచారం మేరకు హొసపేటె జోనల్ అటవీ శాఖ సిబ్బంది దాడి నిర్వహించి, అడవి పందులను అక్రమంగా వేటాడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. తాలూకాలోని మరియమ్మనహళ్లి పరిధిలో చిక్కకెరె సమీపంలో అరెస్టయిన నిందితులు అడవి పందులను అక్రమంగా వేటాడుతున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. నిందితులను హనుమనహళ్లికి చెందిన టీ.పరశురామ, కే.పాండురంగ, సోమప్ప, మగిమావినహళ్లికి చెందిన ప్రభాకర్‌గా గుర్తించారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 కింద కేసు నమోదు చేసి జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచి, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసినట్లు హొసపేటె జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కౌశిక్ దళవాయి తెలిపారు. ఆకతాయి కోతి బందీహొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి, చిలకనహట్టి చుట్టు పక్కల గ్రామస్తులను ముప్పుతిప్పలు పెడుతున్న ఆకతాయి కోతిని జోనల్ అటవీ శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. హారువనహళ్లి, చిలకనహట్టి, తిమ్మలాపుర గ్రామాల్లో ఈ కోతి ప్రజలను, విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా అటవీ శాఖ సిబ్బంది కోతిని పట్టుకోడానికి బోనును పెట్టారు. దానికి ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌కు జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కౌశిక్ దళవాయి, చిలకనహట్టి బ్రాంచ్ డిప్యూటీ జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నాగరాజ్, పెట్రోల్ ఫారెస్ట్ గార్డ్స్ రమణ ఇతరులు నాయకత్వం వహించారు. మల్లికార్జున, అటవీ గార్డులు రఫీ, స్వామి, హేమన్న, నాగేశ్, హంపీ జూకు చెందిన మత్తు మందు నిపుణుడు మహేంద్ర పాల్గొని, గ్రామస్తుల సహాయంతో కోతిని పట్టుకోవడంలో సఫలమయ్యారు. -
తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సరైన వానలు కురవనందున తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు చేపట్టాలని యాదగిరి జిల్లా ఇంచార్జి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం యాదగిరి జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఖరీఫ్‌లో ముందుగానే వానలు కురిసినందున, రైతులు విత్తనాలు వేయడం వల్ల పంట నష్టం విషయంలో అధికారులు రైతులకు సహకరించాలన్నారు. భవిష్యత్తులో పశువులకు గ్రాసం కొరత రాకుండా చూడాలని సూచించారు. రైతులకు పంటల బీమా పాలసీలు చేయడానికి అవకాశం కల్పించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే సబ్సిడీ పథకాలను రైతులకు అందించాలన్నారు. గురుమఠకల్ శాసన సభ్యుడు శరణే గౌడ మాట్లాడుతూ కడేచూరు బాడియాళ పరిశ్రమల కేంద్రంలో ముగ్గురు దుర్మరణం పాలైన విషయాన్ని మంత్రి పాటిల్ దృష్టికి తెచ్చారు. యాదగిరి జిల్లాలో విషపూరిత పరిశ్రమలు ప్రారంభించ కూడదని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మనుషుల ప్రాణాలను హరించే పరిశ్రమల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు వేణు గోపాల్ నాయక్, శరణ బసప్ప దర్శనాపూర్, చెన్నారెడ్డి తనూర్, జిల్లాధికారి రాహుల్ తుకారాం పాండే, జెడ్పీ సీఈఓ లవీష్ ఒడెయర్, ఎస్పీ పృథ్వీశంకర్లున్నారు. అధికారులకు మంత్రి సూచన -
కేబినెట్ విస్తరణలో లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు చేదు అనుభవం
హుబ్లీ: పోటాపోటీగా జరిగిన డీకే.శివకుమార్ మంత్రివర్గ విస్తరణలో అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవది బెళగావి కుందాతో నోటిని తీపి చేసుకున్నారు. సవదికి మంత్రి పదవి దక్కగా దీనిపై ఆశ పెట్టుకున్న పలుకుబడి కలిగిన మహిళా నాయకురాలు, మాజీ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మొత్తానికి శివకుమార్ కేబినెట్లో బెళగావి జిల్లాకు రెండు స్థానాలు దక్కాయి. ఈ రెండు స్థానాలు చిక్కోడి లోక్‌సభ పరిధిలోకి రాగా, బెళగావి లోక్‌సభకు మొండి చేయి చూపారని ఆ ప్రాంత కార్యకర్తలు అసంతృప్తితో రగిలి పోతున్నారు. సవదిని వరించిన అదృష్టం జిల్లాలోని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను సవది, లక్ష్మీ, అశోక్ పట్టణ, మహంతేష్ కౌజలిగి మంత్రిగిరి కోసం జోరుగా లాబీయింగ్ చేశారు. దీంతో సహజంగానే ఎవరికి మంత్రి పదవి లభిస్తుందన్న కుతూహలం నెలకొనగా, చివరికి లక్ష్మణ సవదికి అమాత్య పదవి దక్కింది. ఇప్పటికే చిక్కోడి లోక్‌సభ పరిధిలోని యమనకమరడి అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యే సతీష్ జార్కిహోళికి తొలి దశలోనే డీకే.మంత్రి వర్గంలో స్థానం లభించింది. రెండో విస్తరణలో కూడా అదే లోక్‌సభ స్థానం పరిధిలోని అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవదిని మంత్రి పదవి వరించింది. బెళగావి లోక్‌సభకు మొండిచేయి రెండు మంత్రి స్థానాలు చిక్కోడి పాలు కావడంతో బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం లభించక పోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసే సూచనలు ఉన్నాయి. మహిళా కోటాలో తనకు మంత్రి పదవి లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న లక్ష్మి హెబ్బాళ్కర్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇంతకు ముందు మంత్రిగా పని చేసిన అనుభవం, పార్టీ సంఘటితత్వానికి శ్రమించిన తీరు తనకు లాభిస్తుందని భావించిన ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో మద్దతుదారుల్లో తీవ్ర నిరాశ ఛాయలు అలుముకున్నాయి. దీంతో లక్ష్మి అభిమానులు పలు చోట్ల తమ ఆందోళనను వ్యక్త పరిచి పార్టీ హైకమాండ్‌పై ఆక్రోశించారు. -
డీకే కేబినెట్‌పై గాలి జనార్దనరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,బళ్లారి: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మలి విడత నిర్వహించిన మంత్రివర్గ విస్తరణలో బళ్లారి గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే నాగేంద్రకు మంత్రి పదవి కేటాయించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ప్రతిపక్ష నేత ఆశోక్, మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డితో పాటు పలువురు నాయకులు వేర్వేరు ప్రాంతాల్లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ను, ఆ పార్టీ రాష్ట్ర నేతలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి జనార్దనరెడ్డి మాట్లాడుతూ వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, అప్పట్లో నాగేంద్ర తన మంత్రి పదవిని కోల్పోయి, జైలుకు కూడా వెళ్లి వచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ అవినీతిలో ఒక్క నాగేంద్రది మాత్రమే పాత్ర కాదని, పలువురు ఆ పార్టీ పెద్దలకు కూడా ఉన్నట్లు రుజువు అయిందన్నారు. నాగేంద్ర ముఖానికి అవినీతి రంగు పులిమి, మిగిలిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా లూటీ చేశారన్నారు. వాస్తవాలు బయట పడతాయనే.. నాగేంద్రకు కేవలం 10 నుంచి 20 శాతం మాత్రమే పర్సంటేజ్ ఇచ్చి, మిగతా సొమ్మును అప్పట్లో బళ్లారి లోక్‌సభ ఎన్నికలతో పాటు తెలంగాణ, గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఖర్చు చేశారన్నారు. ఈ విషయాలను నాగేంద్ర బయటకు చెబుతారనే భయంతో మంత్రి పదవిని కేటాయించారని ఆరోపించారు. ఇదే విషయంపై అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు అశోక్ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. వాలీ్మకి అభివృద్ధి మండలిలో అవినీతిపై తాము ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్రతో మంత్రి పదవికి రాజీనామా చేయించే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేశామన్నారు. అయితే ప్రస్తుతం అదే పార్టీలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవిని కేటాయించారని, ఆయన అవినీతి అంతా వాషింగ్ మిషన్‌లో వేసి కడిగి ఉండవచ్చన్నారు. అవినీతిలో ఆ పార్టీ పెద్దల పాత్ర కూడా ఉందనే విషయం స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. ఇదే విషయంపై పరిషత్ సభ్యుడు లింగరాజ్ పాటిల్ నేతృత్వంలో బెళగావిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. -
ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదు
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది, మా కష్టాల గురించి అడిగేవారే లేరని, అమ్మా నాన్న లేని అనాథలుగా అనిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంవై గోపాలకృష్ణ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి దక్కకపోవడం ఆశ్చర్యంగా, అవమానంగా ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణ లో అనేక లోపాలున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారన్నారు. సిద్దుకు ఆప్తుడనని ఇవ్వలేదు: సుధాకర్ యశవంతపుర: తాజా మాజీ మంత్రి, చింతామణి ఎమ్మెల్యే డాక్టర్ ఎంసీ సుధాకర్ సీఎం శివకుమార్‌ను ప్రస్తావించకుండా ప్రభుత్వ ముఖ్యులు కారణమని ఎదురుదాడి చేశారు. వచ్చే రోజుల్లో గట్టి నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. మంత్రి స్థానం తప్పడంపై స్పందిస్తూ, సిద్ధరామయ్య పనితీరును చూసి దగ్గరయ్యా, ఆ ద్వేషంతో నాకు మంత్రి పోస్టు ఇవ్వలేదని పరోక్షంగా సీఎంపై విమర్శలు చేశారు. గతంలో మంత్రులుగా ఉన్నవారికి మళ్లీ ఇచ్చారు, వారిలో ఏం చూసి ఇచ్చారో తనకు తెలియదన్నారు. -
కర్ణాటక కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. సీఎంకు షాకిచ్చిన మండలి చైర్మన్
కర్ణాటక రాజకీయాల్లో ‘రాజీనామా’ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక శాసన మండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనకు ఫోన్ చేసి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయంలో బీజేపీ, జేడీఎస్ నాయకులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సీఎం డీకేకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం కొంతమంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమం చేయాలన్న చర్చలు రాజకీయ దుమారం రేపగా, ఇప్పుడు అదే చర్చ శాసన మండలికి చేరింది. మండలి ఛైర్మన్ బసవరాజ్ హొరట్టికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరినట్లు హొరట్టి స్వయంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో హొరట్టి వెంటనే స్పందిస్తూ..‘ఛైర్మన్‌ను పార్టీ అధిష్ఠానం నిర్ణయించదు.. సభే ఎన్నుకుంటుంది. తొలగించాలంటే సభా నిబంధనల ప్రకారమే జరగాలి’ అని కౌంటర్ ఇచ్చారు. తన పదవీకాలం 2028 వరకు ఉందని, తనను తొలగించాలంటే సభలో అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిందేనని హొరట్టి స్పష్టం చేశారు. ఈ అంశంపై బీజేపీ, జేడీఎస్ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.తనను తొలగించాలంటే కనీసం 10 మంది సభ్యులు 14 రోజుల ముందుగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత సభలో జరిగే ఓటింగ్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 1956 నుంచి ఏ చైర్మన్ కూడా ప్రభుత్వం మధ్యలో రాజీనామా చేయించలేదని, తనను తొలగించడానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 75 సభ్యుల కర్ణాటక శాసన మండలిలో కాంగ్రెస్‌కు 38 మంది సభ్యులతో మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో హొరట్టి కొనసాగింపుపై రాజకీయ చర్చ మరింత వేడెక్కింది. దీంతో, ముఖ్యమంత్రి, మండలి చైర్మన్ మధ్య పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకుంది.#WATCH | Bengaluru, Karnataka: On the removal and changes of names from the Karnataka Legislative Council Chairman's list, BJP leader Basavaraj Horatti says, “...Whatever decision is taken by the House, the House is supreme. I will go to the House. Whatever the House decides, I… pic.twitter.com/q9fnQJC0Ir— ANI (@ANI) August 3, 2026అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం శాసన మండలి చైర్మన్ పదవికి సలీం అహ్మద్ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్‌గా జీఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా ఏఎస్ పొన్నన్న, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉమాశ్రీ పేర్లను కూడా కాంగ్రెస్ ఆమోదించింది. కాగా, పార్టీ ముందుగానే చైర్మన్ పేరును ప్రకటించడంపై హొరట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని ఘాటుగా వ్యాఖ్యానించారు. -
ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి?
కర్ణాటక: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు గురించి సీఎం డీకే శివకుమార్ హైకమాండ్‌తో చర్చలు జరిపారు. కొందరు మంత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో సిద్దరామయ్య సర్కారులో పనిచేసిన మంత్రులకు ఇప్పుడు అవే శాఖలను కేటాయించే అవకాశముంది. పాత మంత్రులు శాఖల మార్పును వాంఛిస్తున్నారు. మంత్రి కే.హెచ్.మునియప్ప ఆహారపౌరసరఫరాల శాఖకు బదులుగా సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో వ్యవసాయ శాఖను చూసిన ఎన్.చెలువరాయస్వామికి అదే శాఖను ఇస్తారని తెలుస్తోంది. సిద్దు హయాంలో మంత్రులుగా ఉండి, మళ్లీ ఇప్పుడు పదవులు చేపట్టిన శివరాజ్ తంగడగి, బీ.జేడ్ జమీర్ అహ్మద్ ఖాన్, సంతోష్ లాడ్, మధుబంగారప్ప, నాగేంద్ర, ఎస్.ఎస్.మల్లికార్జున్‌లకు పాత శాఖలే ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కొత్త మంత్రులకు ఈ శాఖలు? కొత్తగా చేరిన రుద్రప్ప లమాణికి–ఎక్సైజ్, కే.ఎస్.బసవంతప్ప–పురపాలక, టీ.రఘుమూర్తి–ఎస్టీల సంక్షేమం, రిజ్వాన్ హర్షద్–ఉన్నత విద్య, పుట్టరంగశెట్టి–పశు సంవర్ధక, పట్టు, అజయ్‌సింగ్–చిన్న పరిశ్రమల–కే.ఎం.శివలింగేగౌడ, హెచ్.సీ.బాలకృష్ణ–అటవీ, పర్యావరణ, బసవరాజరాయరెడ్డి–న్యాయ, అసెంబ్లీ వ్యవహారాలు, విజయానంద కాశప్పనవర్–జౌళి, లక్ష్మణ్ సవది–సహకార, చక్కెర శాఖలు లభించే అవకాశముంది. -
డీప్ టెక్ విప్లవానికి సంసిద్ధం: సీఎం
శివాజీనగర: నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీ కండక్టర్లు, బయోటెక్నాలజీ, క్వాంటం టెక్నాలజీతో సహా డీప్ టెక్ కోసం బెంగళూరును ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా కర్ణాటకను అగ్రగామిగా నిలపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. బెంగళూరులోని ఓ హోటల్లో శాస్త్ర సాంకేతిక, నానో టెక్నాలజీ విభాగం నిర్వహించిన 14వ బెంగళూరు ఇండియా నానో కాన్ఫరెన్స్‌ను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. బెంగళూరు భారతదేశాన్ని ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టింది, ఇప్పుడు ప్రపంచ డీప్–టెక్ పటంలో నిలబెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల మధ్య సహకారంతోనే ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయన్నారు. కర్ణాటక ప్రముఖ పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లకు, విశ్వవిద్యాలయాలతో కూడిన బలమైన వ్యవస్థకు కేంద్రమన్నారు. డీప్–టెక్ ఆవిష్కరణలు ప్రపంచ అగ్రగామిగా నిలవడానికి దోహదం చేస్తాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, ఎలక్ట్రానిక్స్, ఇంధన, వ్యవసాయం, రవాణా, అంతరిక్షం, రక్షణ, అధునాతన తయారీ రంగాలను మార్చివేసే ఒక ప్రాథమిక సాంకేతికత అని అన్నారు. -
తుంగభద్రకు పోటెత్తిన వరద
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పలు జిల్లాల ప్రజలకు, రైతులకు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. మంగళవారం సాయంత్రం డ్యాంకు ఇన్‌ఫ్లో 1,08,531 క్యూసెక్కులకు చేరుకుంది. ఔట్ ఫ్లో 1,556 క్యూసెక్కులు నమోదైంది. కర్ణాటక, ఏపీ తాగునీటి అవసరాల కోసం కాలువల ద్వారా 1,390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు, నీటి నిల్వ 105 టీఎంసీలకుగాను ప్రస్తుతం డ్యాంలో నీటినిల్వ 53.648 టీఎంసీలకు చేరుకుందని మండలి అధికార వర్గాలు తెలిపాయి. డ్యాంలోకి భారీగా వరద చేరుతుండటంతో నీటిమట్టం క్రమేణ పెరుగుతోంది. దీంతో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఉప్పొంగిన కృష్ణమ్మ రాయచూరు రూరల్: పైభాగంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది ఉప్పొంగుతోంది. ఆల్మట్టి డ్యాం నుంచి కృష్ణా నదికి 1.50 లక్షల క్యూసెక్కులను నారాయణపుర డ్యాంకు వదిలారు. మంగళవారం నారాయణపుర డ్యాం నుంచి 1 లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. లక్ష క్యూసెక్కులు దాటిన ఇన్‌ఫ్లో డ్యాంకు కొనసాగుతున్న ప్రవాహం -
వికటించిన అల్పాహారం
రాయచూరు రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్లో ఉదయం చపాతి తిన్న 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రాయచూరు జిల్లాలో సంభవించింది. మంగళవారం సింధనూరు నగర పోలీస్ స్టేషన్ వద్ద హాస్టల్లో టిఫిన్ చేసిన విద్యార్థులు అతిసార, విరేచనాల బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం సర్కార్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రిన్సిపాల్, వార్డెన్ల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ ఆస్పత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. పది రోజుల్లో ఇలా రెండో సారి జరగడంపై నాడగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 మంది విద్యార్థులకు అస్వస్థత సింధనూరు ఆస్పత్రిలో చికిత్స రాయచూరు జిల్లాలో ఘటన -
సిద్దరామయ్యకు ఎలాంటి అసంతృప్తి లేదు
సాక్షి,బళ్లారి: మంత్రివర్గ విస్తరణపై మాజీ సీఎం సిద్దరామయ్యకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన తనయుడు, మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన మంగళవారం బీదర్‌లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మలి విడత మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి మాజీ సీఎం సిద్దరామయ్య హాజరు కాకపోవడంతో ఆయన వర్గానికి చెందిన పలువురికి మంత్రి వర్గంలో చోటు కల్పించలేదన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. అలాంటిదేమీ లేదని అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోయారని, ఆయనకు ఎలాంటి అసంతృప్తి ఏమీ లేదన్నారు. మంత్రి పదవులు రాని వారు అసంతృప్తి చెందడం, వారి మద్దతుదారులు, కార్యకర్తలు ఆందోళనలు చేయడం సర్వసాధారణం అన్నారు. అన్నీ సర్దుకు పోతాయన్నారు. హైకమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనన్నారు. మంత్రి వర్గ కూర్పు అనేది అన్ని కోణాల్లో చేస్తారని, సీనియర్లు, పార్టీకి వివిధ రకాలుగా సేవలు అందించిన వారిని గుర్తిస్తారన్నారు. సామాజిక సమీకరణల్లో భాగంగా పలువురు కొత్తవారికి అవకాశాలు వచ్చి ఉండవచ్చన్నారు. మహిళలకు కూడా మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారన్నారు. గాయత్రీ శాంతగౌడకు కూడా ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తనకు కేటాయించిన మంత్రి పదవిని చివరి క్షణంలో ఎందుకు నిరాకరించారో తెలియడం లేదని మాత్రమే చెప్పారన్నారు. కురుబ సముదాయానికి, మైనార్టీలకు కూడా సముచిత స్థానం కల్పించారని, ఈ రెండు వర్గాల వారికే కాకుండా అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. కార్యకర్తలు ఆందోళనలకు దిగడం సర్వసాధారణం మహిళలకు కచ్చితంగా మంత్రి పదవి కేటాయిస్తారు మాజీ సీఎం తనయుడు, మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య -
ఆసనం దక్కక.. ఆగ్రహజ్వాల
శివాజీనగర: డీకే శివకుమార్ మంత్రివర్గ విస్తరణలో పదవులు లభించని హస్తం ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం అందుకున్నారు. అనేక మంది ఆశలు ఆవిరయ్యాయి, అలాంటి కొందరు ఎమ్మెల్యేలు బెంగళూరులో సమావేశం కాగా, కొందరు రాజీనామా చేస్తామని తిరుగుబాటు స్వరం పెంచారు. బెంగళూరులో కేపీసీసీ ఆఫీసు ధర్నాలకు వేదికగా మారింది. బెంగళూరు నగర ఎమ్మెల్యే దినేష్ గుండురావుకు బెర్తు రాకపోవడంతో ఆగ్రహించారు. గాంధీనగర కార్యకర్తలు, వందలాది మంది అభిమానులు కేపీసీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్ల వద్ద తోపులాట జరిగింది. మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని కార్యకర్తలు కేకలు వేశారు. మంత్రి పదవి ఇవ్వడం లేదని ముందే చెప్పి ఉండాల్సిందన్నారు. అర్చకుల సంఘం కూడా మద్దతుగా పాల్గొంది. దినేశ్ గుండురావు విలేకరులతో మాట్లాడుతూ ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పి ఉండాల్సింది, ఇది తమ కార్యకర్తలను బాధించిందని అన్నారు. ఏకధాటిగా ఆందోళనలు ● మరో ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప అభిమానులు కూడా కేపీసీసీ ముందు ధర్నా సాగించారు. కొందరు నల్లగుడ్డలు చుట్టుకుని వచ్చారు. ● నగర ఎమ్మెల్యే ప్రియా కృష్ణ మద్దతుదారులు కాంగ్రెస్ ఆఫీసు ముందు బైఠాయించి రభస చేశారు. ● ఆనేకల్, బాగేపల్లి సహా కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. నిరసనలు పెరుగుతాయా, చల్లబడతాయా? అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టం కానుంది. బెంగళూరు కేపీసీసీ ఆఫీసు ముందు వరుస ధర్నాలు కొందరు ఎమ్మెల్యేల తీవ్ర వ్యాఖ్యలు కేబినెట్ విస్తరణ రగిల్చిన చిచ్చు అనాథల్లా ఉన్నాం ఎమ్మెల్యే గోపాలకృష్ణ దొడ్డబళ్లాపురం: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది, మా కష్టాల గురించి అడిగేవారే లేరని, అమ్మా నాన్న లేని అనాథలుగా అనిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంవై గోపాలకృష్ణ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి దక్కకపోవడం ఆశ్చర్యంగా, అవమానంగా ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణ లో అనేక లోపాలున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారన్నారు. తలలు పగలగొడితేనే... గుబ్బి ఎమ్మెల్యే శ్రీనివాస్ తుమకూరు: విస్తరణలో మంత్రి పదవి లభించలేదని అసంతృప్తికి గురైన గుబ్బి ఎమ్మెల్యే ఎస్ఆర్ శ్రీనివాస్ కేఎస్ఆర్టీసీ బోర్డు అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో విలేకరులతో మాట్లాడుతూ తనకు మంత్రి పదవి లభిస్తుందని ఆశించానని, రాకపోవడం విసుగు తెప్పించిందన్నారు. బుధవారం బెంగళూరుకు వెళ్లి కేఎస్ఆర్టీసీ బోర్డు అధ్యక్ష స్థానానికి రాజీనామా ఇస్తానన్నారు. రాజకీయాల్లో తమలాంటి సామాన్య రైతు కొడుకు పైకెదగడం కష్టమన్నారు. ఎవరైతే తలలు పగులగొట్టి డబ్బులు సంపాదిస్తున్నారో వారు రాజకీయాల్లో పైకి వస్తారని వ్యంగ్యమాడారు. నాకు గాడ్‌ఫాదర్ లేడు. అందుకే మంత్రి పదవి చేజారింది, రాజకీయాల్లో కొత్త పాఠం ఇప్పుడు అర్థమవుతోందన్నారు. సిద్దుకు ఆప్తుడనని ఇవ్వలేదు: సుధాకర్ యశవంతపుర: తాజా మాజీ మంత్రి, చింతామణి ఎమ్మెల్యే డాక్టర్ ఎంసీ సుధాకర్ సీఎం శివకుమార్‌ను ప్రస్తావించకుండా ప్రభుత్వ ముఖ్యులు కారణమని ఎదురుదాడి చేశారు. వచ్చే రోజుల్లో గట్టి నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. మంత్రి స్థానం తప్పడంపై స్పందిస్తూ, సిద్ధరామయ్య పనితీరును చూసి దగ్గరయ్యా, ఆ ద్వేషంతో నాకు మంత్రి పోస్టు ఇవ్వలేదని పరోక్షంగా సీఎంపై విమర్శలు చేశారు. గతంలో మంత్రులుగా ఉన్నవారికి మళ్లీ ఇచ్చారు, వారిలో ఏం చూసి ఇచ్చారో తనకు తెలియదన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
హుబ్లీ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనలు జంట నగరాల్లో చోటు చేసుకున్నాయి. పొలానికి వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడిన ఘటన కుందగోళ తాలూకా హిరేహరకుణి గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఘటనలో ఆ గ్రామానికి చెందిన తిప్పణ్ణ కురహట్టి(45) మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరిని బెళగావి ఆస్పత్రికి, మరొకరిని హుబ్లీ కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బసవరాజ్, అశోక్, ప్రవీణ్, రామన్న, మహేష్, మల్లప్ప, చేతన్, మంజునాథ్ గాయపడ్డారు. ఉదయం పొలానికి 10 మందితో కలిసి ట్రాక్టర్లో వెళుతుండగా హుక్ కట్ అయి అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ఘటనపై కుందగోళ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నీటి ట్యాంకర్ బోల్తా.. ఒకరు మృతి మరో ఘటనలో డ్రైవర్ అదుపు తప్పి నీటి ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కోళివాడ శివారులో జరిగింది. బాగలకోటె జిల్లా బీళగి తాలూకా సిద్దాపురకు చెందిన ప్రసాద్ (28) మృతుడు. ట్రాక్టర్ ద్వారా నీటి ట్యాంకర్ తీసుకెళుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ అతడిపై పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. లారీ ఢీకొని బైకిస్టు మృతి మరో ఘటనలో ధార్వాడ గుళేదకొప్ప గ్రామం వద్ద జాతీయ రహదారిలో బైక్, లారీ ఢీకొనగా బైక్ చోదకుడు మృతి చెందాడు. గుళేదకొప్ప గ్రామానికి చెందిన హనుమంత(65) మృతుడు. బెళగావి నుంచి గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ యూపీ రాహుల్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టినట్లు గరగ పోలీసులు తెలిపారు. నగదు బదలాయించుకుని రూ.లక్షల్లో మోసంహుబ్లీ: బ్యాంక్ ఖాతా నుంచి అక్రమంగా రూ.6.67 లక్షలు బదలాయించుకుని సైబర్ కేటుగాళ్లు వంచించారని బాధితురాలు, గోకుల్ రోడ్డు నివాసి అక్కమహాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంచకులు డెబిట్ కార్డు సెట్టింగ్‌ను మార్చి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును బదలాయించుకుని వంచించినట్లు బాధితురాలి భర్త రవీంద్ర నాథ్ తెలిపారు. జీవనశైలి మార్పుతో మెదడుకు ఆరోగ్యం ● డీహెచ్ఓ డాక్టర్.టి.లింగరాజు హొసపేటె: మానవ శరీరానికి మెదడు నియంత్రణ కేంద్రం. మెదడులో సమస్య వస్తే అది కేవలం వ్యక్తి ఆరోగ్యాన్నే కాకుండా మొత్తం కుటుంబం ఆర్థిక, మానసిక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుందని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్.టి.లింగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రిలో నిర్వహించిన ప్రపంచ మెదడు దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం, వ్యసనాలు, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేదా వ్యాయామం లేక పోవడం వంటి కారణాల వల్ల మెదడు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. పక్షవాతం, మెదడు రక్తస్రావం, నాడీ మండల బలహీనత, మతిమరుపు వంటివి సర్వసాధారణం అవుతున్నాయని ఆయన అన్నారు. సకాలంలో ఈ వ్యాధికి చికిత్స పొందడం, అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ దిశాంత్, జిల్లా లెప్రసీ కంట్రోల్ అధికారి డాక్టర్ కే రాధిక, జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, జిల్లా ఆరోగ్య విద్యాశాఖాధికారి దొడ్డమని, డాక్టర్ భరత్, డాక్టర్ సతీష్ చంద్ర, డాక్టర్ ఫసియుద్దీన్, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ సిద్దలింగప్ప, డాక్టర్ ఆశా కోరి, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
కేబినెట్ విస్తరణలో మొండిచేయి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన తరుణంలో ఆయా జిల్లాల శాసన సభ్యులను జిల్లా ఇంచార్జి మంత్రులుగా నియమించారు. రాయచూరు జిల్లా ఇంచార్జి మంత్రి నియామకంలో అన్యాయం జరిగింది. ప్రస్తుతం జిల్లా ఇంచార్జి మంత్రిగా మంత్రి అజయ్ సింగ్‌ను నియమించడంపై జిల్లా ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. కల్యాణ కర్ణాటకలో కలబుర్గి జిల్లా నుంచి శరణు ప్రకాష్ పాటిల్, అజయ్ సింగ్, ప్రియాంక్ ఖర్గే, కొప్పళ జిల్లా నుంచి బసవరాజ రాయరెడ్డి, శివరాజ్ తంగడిగి, బీదర్ నుంచి ఈశ్వర్ ఖండ్రే, విజయపుర నుంచి ఎం.బీ.పాటిల్, బాగలకోటె నుంచి విజయానంద కాశప్పనవర్ మంత్రి పదవులను దక్కించుకున్నారు. రాయచూరు, విజయనగర(హొసపేటె), యాదగిరి జిల్లాలో సమర్థులైన నాయకులున్నా రాయచూరు జిల్లా ఇంచార్జి బాధ్యతలను ఇతర జిల్లాల వారి పరం కావడం నేటికీ తప్పలేదు. 2013లో కాంగ్రెస్ పార్టీ హయాంలో మాలాశ్రీ, ఆనంద్ అస్నోటికర్, తన్వీర్ సేట్, శరణు ప్రకాష్ పాటిల్, 2018లో బీజేపీ హయాంలో సోమణ్ణ, శ్రీరాములు, లక్ష్మణ్ సవది, శంకర్ పాటిల్ మునేనకొప్ప ఇంచార్జిలుగా కొనసాగారు. స్థానికులకే సమస్యలపై అవగాహన జిల్లా సమస్యలపై స్థానికంగా ఎన్నికై న శాసన సభ్యులకు అవగాహన ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాల వారు నియమితులైతే కేవలం సభలు, సమావేశాలకు, జాతీయ పండుగలకు చుట్టరికంలా వస్తారనే అభిప్రాయాలున్నాయి. 23 ఏళ్లుగా రాయచూరు అన్య జిల్లాల వారి పెద్దనానికి లోనై అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. రాయచూరులో ఇంచార్జి మంత్రులకు కార్యాలయాలు, ఆప్త కార్యదర్శులు లేకపోవడం విడ్డూరంగా ఉంది. రాయచూరు జిల్లాలో నలుగురు విధాన పరిషత్ సభ్యులు, నలుగురు శాసన సభ్యులున్నా ఏ ఒక్కరికీ మంత్రి పదవి లభించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతర్గతంగా అసమ్మతి రగిలి పోతోంది. రాయచూరు జిల్లాలో సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, కొప్పళ శాసన సభ్యుడు రాఘవేంద్ర హిట్నాళ్కు మంత్రి పదవి లభించక పోవడంతో రాయచూరు, కొప్పళ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. సీనియర్లు హంపనగౌడ బాదర్లి, బోసురాజుల మధ్య జరిగిన పోరులో మంత్రి పదవి చేజారినట్లు తెలుస్తోంది. కల్యాణ కర్ణాటకలో ఇంచార్జిలు వీరే.. రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వివిధ జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమించారు. రాయచూరు జిల్లా ఇంచార్జి మంత్రిగా అజయ్ సింగ్, కలబుర్గి జిల్లాకు ప్రియాంక్ ఖర్గే, యాదగిరి జిల్లాకు శరణు ప్రకాష్ పాటిల్, కొప్పళ జిల్లాకు శివరాజ్ తంగడిగి, గదగ్ జిల్లాకు బసవరాజ రాయరెడ్డి, బీదర్‌కు ఈశ్వర్ ఖండ్రే, విజయపురకు ఎం.బీ.పాటిల్, బాగల్కోటెకు విజయానంద కాశప్పనవర్లను ఇంచార్జి మంత్రులుగా నియమించారు. రాయచూరు, యాదగిరి, విజయనగరలకు నో ఛాన్స్ 23 ఏళ్లుగా ఆ జిల్లాల్లో ఇతర జిల్లాల నేతలదే పెత్తనం -
లాల్‌బాగ్‌లో పుష్ప సౌరభాలు
బనశంకరి: స్వాతంత్య్ర దినోత్సవం వస్తోందంటే బెంగళూరు లాల్బాగ్ ఉద్యానవనంలో ఫల పుష్ప ప్రదర్శన అందరికీ గుర్తుకొస్తుంది. ఈదఫా నిర్వహించే 220వ ఫ్లవర్ షో 6వ తేదీన ఆరంభమై 17 వరకూ పుష్ప ప్రేమికులకు కనువిందు చేయబోతోంది. రాష్ట్రంలో ప్రముఖ రాజవంశాలలో తొలివారైన గంగ రాజుల థీమ్‌తో ప్రదర్శనను తీర్చిదిద్దుతున్నట్లు ఉద్యానవనశాఖ కార్యదర్శి ఆర్.గిరీశ్ తెలిపారు. సీఎంచే ప్రారంభం 6వ తేదీ ఉదయం 11 గంటలకు సీఎం డీకే.శివకుమార్ ప్రారంభిస్తారని చెప్పారు. మంగళవారం లాల్‌బాగ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంగరాజుల గజసేన, యుద్ధ సన్నివేషాలు, శ్రావణ బెళగొళ బాహుబలి విగ్రహం, తలకాడు ఆలయాల పుష్ప నమూనాలు నిర్మాణమవుతున్నట్లు తెలిపారు. రూ.3.75 కోట్ల బడ్జెట్‌తో పనులు జరుగుతున్నట్లు చెప్పారు. పూల జలపాతం, సెల్ఫీ పాయింట్ ఈసారి ప్రత్యేకమన్నారు. టికెట్ ధరలు ఇలా మామూలు రోజుల్లో పెద్దలకు రూ.80 , పిల్లలకు రూ.30 టికెట్ తీసుకోవాలి. శని, ఆది, సెలవురోజుల్లో పెద్దలకు రూ.100 ఉంటుంది. 10 వ తరగతి వరకు విద్యార్థులు యూనిఫాంలో వస్తే ప్రవేశం ఉచితమని చెప్పారు. ఈసారి ఆన్లైన్లో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్కింగ్ వసతి, 136 సీసీ కెమరాలతో నిఘా ఉంటుంది. రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వీక్షించవచ్చు. రేపటి నుంచే స్వాతంత్య్ర ఫ్లవర్ షో అలరించబోతున్న కళారూపాలు -
కరువు జిల్లాగా ప్రకటించండి
సాక్షి,బళ్లారి: జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణం బళ్లారి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా చేపట్టి, జిల్లా యంత్రాంగానికి వినతిపత్రం సమర్పించింది. రెండు రోజులుగా జిల్లాధికారి కార్యాలయం ముందు జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ ప్రముఖులు పాల్గొని నిరసన, ధర్నా చేపట్టారు. మంగళవారం మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్, బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా తదితరుల బృందం ఽజిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కరువుతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వర్షాలు రాకపోవడంతో పెట్టిన పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. చాలా మంది రైతులు పంట పెట్టుకోలేక దుక్కులు దున్ని భూములను బీళ్లుగా వదిలేశారన్నారు. వర్షాలు జాడలేకపోవడంతో సమస్యలు తీవ్రతరం అవుతున్నాయన్నారు. వెంటనే బళ్లారి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి సహాయ చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఒక ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలని, తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గోశాలల ప్రారంభానికి పిలుపు పశువులకు మేత లేక రైతాంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, వెంటనే పశువులకు మేత అందించేందుకు గోశాలలను తెరవాలన్నారు. పశువులకు మేతతో పాటు తాగునీటి సమస్య కూడా ఉన్నందున తుంగభద్ర నదికి నీరు విడుదల చేయాలన్నారు. తీవ్ర కరువు పరిస్థితులు జనం ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించేందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. వ్యవసాయ కూలీలు వలసలు వెళ్లకుండా ఆపాలన్నారు. స్థానికంగానే ఉపాధి కల్పించాలన్నారు. బీజేపీ జిల్లా నాయకులు, రైతు మోర్చా, మహిళా మోర్చా పదాధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలి వెంటనే తుంగభద్ర నదికి నీరు విడుదల చేయాలి బీజేపీ నేతల ధర్నా, జిల్లా యంత్రాంగానికి వినతి -
సవదికి తీపి.. హెబ్బాళ్కర్‌కు చేదు
హుబ్లీ: పోటాపోటీగా జరిగిన డీకే.శివకుమార్ మంత్రివర్గ విస్తరణలో అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవది బెళగావి కుందాతో నోటిని తీపి చేసుకున్నారు. సవదికి మంత్రి పదవి దక్కగా దీనిపై ఆశ పెట్టుకున్న పలుకుబడి కలిగిన మహిళా నాయకురాలు, మాజీ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మొత్తానికి శివకుమార్ కేబినెట్లో బెళగావి జిల్లాకు రెండు స్థానాలు దక్కాయి. ఈ రెండు స్థానాలు చిక్కోడి లోక్‌సభ పరిధిలోకి రాగా, బెళగావి లోక్‌సభకు మొండి చేయి చూపారని ఆ ప్రాంత కార్యకర్తలు అసంతృప్తితో రగిలి పోతున్నారు. సవదిని వరించిన అదృష్టం జిల్లాలోని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను సవది, లక్ష్మి, అశోక్ పట్టణ, మహంతేష్ కౌజలిగి మంత్రిగిరి కోసం జోరుగా లాబీయింగ్ చేశారు. దీంతో సహజంగానే ఎవరికి మంత్రి పదవి లభిస్తుందన్న కుతూహలం నెలకొనగా, చివరికి లక్ష్మణ సవదికి అమాత్య పదవి దక్కింది. ఇప్పటికే చిక్కోడి లోక్‌సభ పరిధిలోని యమనకమరడి అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యే సతీష్ జార్కిహోళికి తొలి దశలోనే డీకే.మంత్రి వర్గంలో స్థానం లభించింది. రెండో విస్తరణలో కూడా అదే లోక్‌సభ స్థానం పరిధిలోని అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవదిని మంత్రి పదవి వరించింది. బెళగావి లోక్‌సభకు మొండిచేయి రెండు మంత్రి స్థానాలు చిక్కోడి పాలు కావడంతో బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం లభించక పోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసే సూచనలు ఉన్నాయి. మహిళా కోటాలో తనకు మంత్రి పదవి లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న లక్ష్మి హెబ్బాళ్కర్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇంతకు ముందు మంత్రిగా పని చేసిన అనుభవం, పార్టీ సంఘటితత్వానికి శ్రమించిన తీరు తనకు లాభిస్తుందని భావించిన ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో మద్దతుదారుల్లో తీవ్ర నిరాశ ఛాయలు అలుముకున్నాయి. దీంతో లక్ష్మి అభిమానులు పలు చోట్ల తమ ఆందోళనను వ్యక్త పరిచి పార్టీ హైకమాండ్‌పై ఆక్రోశించారు. -
కరావళి జిల్లాల్లో భారీ వానలు
యశవంతపుర: రాష్ట్రంలో కరావళిలో దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో మళ్లీ భారీవర్షాలు పడుతున్నాయి. పాఠశాలలు, కాలేజీలకు జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఉడుపి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. రెండు జిల్లాల్లో జన జీవనం స్తంభించిపోయింది. శివమొగ్గ, చిక్కమగళూరు, కొడగు జిల్లాల్లో భారీ గాలులతో వానలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. తుంగా డ్యాంలో నీటిమట్టం 80 టీఎంసీలకు చేరినట్లు తెలిపారు. కేఆర్ఎస్ డ్యాంకూ నీరు చేరుతోంది. బెంగళూరులో జల్లులు బనశంకరి: కొన్నిరోజులుగా బెంగళూరులో మేఘావృతమై ఉండగా, మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో జల్లు వర్షం కురిసింది. శివారులోని నెలమంగల చుట్టుపక్కల కొద్దిమేర వర్షం కురిసింది. వానతో నగరంలో వాతావరణం చల్లబడింది. -
చెట్టును ఢీకొని ముక్కలు..
శివమొగ్గ: అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు మూడు ముక్కలుగా విరిగిపోయింది. సోమవారం రాత్రి సమీపంలో హైవేలో జరిగింది. శివమొగ్గలోని సీగేహట్టివాసి గురురాజ్ (21) అర్ధరాత్రి హోండా సిటీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ ఎస్ఐ భారతి, సిబ్బంది విచారణ చేపట్టారు. జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు శివాజీనగర: డీ.కే.శివకుమార్ మంత్రివర్గ విస్తరణ తరువాత జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను ప్రకటించారు. కరువు, అతివృష్టి పరిస్థితిని అవలోకించి వాస్తవ నివేదికను ఇవ్వాలని వారిని ఆదేశించారు. తాలూకాలలో పర్యటించాలని తెలిపారు. చాలామంది మంత్రులకు వారి సొంత జిల్లాలనే ఇచ్చారు. కృష్ణభైరేగౌడ–బెంగళూరు నగర, సతీశ్ జార్కిహొళి–బెళగావి, ప్రియాంక ఖర్గే–కల్బుర్గి, యతీంద్ర సిద్దరామయ్య–మైసూరు, బీ.నాగేంద్ర–బళ్లారి, శివరాజ్ తంగడగి–కొప్పళ, రామలింగారెడ్డి– కోలారు, జీ.పరమేశ్వర్– తుమకూరు, అజయ్‌సింగ్– రాయచూరు జిల్లాలను అప్పగించారు. మహిళల కోసం రుతు తార బనశంకరి: మహిళల కోసం రుతు తార అనే కొత్త పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖమంత్రి యుటీ.ఖాదర్ తెలిపారు. నటి రమ్య ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉంటారన్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మహిళలతో మాట్లాడి మెనోపాజ్ సమస్యల నుంచి విముక్తికి సలహాలు ఇస్తారన్నారు. మంగళవారం మంత్రి ఖాదర్, నటి రమ్యా ఓ సదస్సులో పాల్గొన్నారు. అందరి సలహాలు విన్న తరువాత రుతు తార నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నటి రమ్య మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మెనోపాజ్ తొందరగా కనబడుతుందన్నారు. నగరంలో ఎక్కువమంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు, ఉపశమన చర్యల గురించి చాలామందికి తెలియదని అన్నారు. సీఎంపై పరిషత్ చైర్మన్ గుస్సాదొడ్డబళ్లాపురం: విధాన పరిషత్ స్పీకర్ స్థానానికి రాజీనామా చేయాలని సీఎం డీకే శివకుమార్ ఫోన్ చేసి చెప్పారని, తమ హైకమాండ్ మాదిరిగా ఆదేశించారని పరిషత్ స్పీకర్ బసవరాజు హొరట్టి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నేటి రాజకీయం చాలా భ్రష్టు పట్టిందని విమర్శలు గుప్పించారు. పరిషత్ అధ్యక్ష పదవి నుంచి హొరట్టిని సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పరిణామాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగలేదు, పార్టీ లెటర్ హెడ్లో స్పీకర్ల ఎన్నిక జరగలేదన్నారు. స్పీకర్ పదవి రాజ్యాంగం కల్పించిన పదవి అని హొరట్టి అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ఒక్క తప్పు చేయలేదన్నారు. రాజీనామా ఎందుకు చేయిస్తున్నారో తెలియడం లేదన్నారు. అవసరమనుకుంటే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం డీకే కు సవాల్ చేశారు. ఏనుగు దెబ్బ.. కారు ధ్వంసం దొడ్డబళ్లాపురం: ఓ అడవి ఏనుగు కారుపై దాడి చేయగా అందులో ప్రయాణిస్తున్న కుటుంబం ఎలాగో తప్పించుకుంది. కానీ కారును ఏనుగు ధ్వంసం చేసిన సంఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా దోలనమనె గ్రామం వద్ద సోమవారం రాత్రి జరిగింది. మహమ్మద్ జాహిద్ కుటుంబంతో కలిసి బెంగళూరులో ఒక శుభకార్యంలో పాల్గొని తిరిగి వెళ్తండగా, హఠాత్తుగా ఏనుగు అడ్డంగా వచ్చింది. తొండంతో బాదడంతో కారు వెనుక భాగం ధ్వంసమైంది. జాహిద్ కుటుంబం తీవ్ర భయభ్రాంతులకు లోనైంది. పిల్లలు, మహిళలు గట్టిగా ఏడవడం ప్రారంభించారు. జాహిద్ లైట్లు ఆన్, ఆఫ్ చేయడంతో ఏనుగు కాస్త దూరం వెళ్లింది. ఇంతలో కారుతో వెళ్లిపోయారు. మంగళవారం ఆయన అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. నాగేంద్ర ఢిల్లీ టూర్‌కి కోర్టు నో బొమ్మనహళ్లి: మహర్షి వాల్మీకి కార్పొరేషన్ నిధుల స్కాం కేసులో నిందితునిగా ఉన్న నూతన మంత్రి బి.నాగేంద్ర ఢిల్లీ పర్యటనకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు నో చెప్పింది. ఆగస్టు 10 వరకు ఢిల్లీ పర్యటనకు అనుమతి కోరుతూ బి.నాగేంద్ర పిటిషన్ దాఖలు చేశారు. అనుమతి ఇవ్వరాదని ఈడీ వ్యతిరేకించింది. విచారించిన కోర్టు, ఢిల్లీ పర్యటనకు దరఖాస్తుదారు సరైన కారణం చెప్పలేదని పేర్కొంటూ కొట్టివేసింది. -
హడపద అప్పణ్ణ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో హడపద అప్పణ్ణ జయంతిని ఆచరించారు. మంగళవారం బసవేశ్వర సర్కిల్లో జిల్లా పంచాయతీ, జిల్లాధికార యంత్రాంగం, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖ, హడపద అప్పణ్ణ సమాజం ఆధ్వర్యంలో హడపద అప్పణ్ణ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పణ్ణ చిత్రపటానికి అదనపు జిల్లాధికారి శివానంద పూలమాల వేశారు. అధికారులు మాట్లాడుతూ సమాజం అభివృద్ధికి విద్య ప్రధానమని అన్నారు. హడపద అప్పణ్ణ మార్గదర్శనంలో నడవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ వర్మ, శరణప్ప తదితరులు పాల్గొన్నారు. సొంతంగా రోడ్డు మరమ్మతులకు శ్రీకారం రాయచూరు రూరల్: సిరవారలో గుంతలు పడి అధ్వాన స్థితికి చేరుకున్న లింగసూగూరు–రాయచూరు జాతీయ రహదారి మరమ్మతులకు శ్రీకారం చుట్టిన ఘటన జరిగింది. మంగళవారం రైతు అమరేష్ చాగబావి బుల్డోజర్ సాయంతో గుంతలు పడ్డ రహదారిలో రాళ్లు, ఎర్రమట్టిని కలిపి వేసి మరమ్మతులు చేశారు. రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని మాజీ మంత్రి బోసురాజు, మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్, అధికారులకు పలు మార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో సొంత ఖర్చులతో రెండు కి.మీ.ల మేర రహదారికి మరమ్మతులు చేపట్టారు. ఎడమ కాలువలో గేజ్ పాటించాలిరాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ చివరి ఆయకట్టు భూములకు సక్రమంగా నీరందాలంటే గేజ్‌ను పాటించాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో సంచాలకులు శంకర గౌడ మాట్లాడారు. మైల్ నంబర్–69 వద్ద నీటి నిర్వహణ గేజ్ సామర్థ్యాన్ని గురించి జిల్లాధికారికి వివరించినా ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదన్నారు. గేజ్ నిర్వహణలో జరిగిన లోపంతో కింది భాగానికి నీరందడం కష్టంగా మారిందన్నారు. 69వ మైలు పైభాగంలో దాదాపు 2 లక్షల ఎకరాల వరకు అక్రమంగా నాన్ ఆయకట్టు సాగులో ఉందని, దాన్ని తొలగిస్తే ఆయకట్టు చివరి భూముులకు నీరు అందుతాయన్నారు. మంత్రి, శాసన సభ్యుల మధ్య రైతులు నష్ట పోతున్నారన్నారు. కురుబలకు అన్యాయం తగదు హుబ్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కురుబ కులానికి తగిన ప్రాతినిథ్యం లభించక పోవడం అత్యంత విచారకరం, అదే అసంతృప్తికి కారణం అయిందని రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు సిద్దన్న తేజి తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ కురుబ వర్గం రాష్ట్రంలో అతిపెద్ద బీసీ కులాలలో ఒకటి. కాంగ్రెస్ పార్టీ సంఘటితానికి, ఎన్నికల్లో గెలుపునకు కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అయినా మంత్రివర్గ విస్తరణలో తమ వర్గానికి ఆశించిన మేర పదవులు ఇవ్వలేదు. ప్రత్యేకించి ఉత్తర కర్ణాటక కురుబ ప్రజాప్రతినిధులకు అవకాశం దొరకక పోవడం సామాజిక మనోభావాలను కుంగదీసిందన్నారు. అంతేగాక మంత్రి పదవికి గాయత్రి పేరు ప్రకటించాక స్వస్తి చెప్పారన్న వార్తలు తమ వర్గాలకు తీరని నిరాశ కలిగించాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, పార్టీ పెద్దలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వర్గాల జనాభాకు అనుగుణంగా మంత్రివర్గంలో కనీసం 5 పదవులు ఇవ్వాల్సింది. కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించడం న్యాయ సమ్మతం కాదు. ఖాళీగా ఉన్న మంత్రి పదవిని గాయత్రి శాంతేగౌడకు లేదా ఈ ప్రాంత కురుబలలో అర్హులైన ఎమ్మెల్యేకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయ సమ్మతమైన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే చైతన్య కార్యక్రమాల ద్వారా సమాజాన్ని సంఘటితం చేస్తామని, అంతేగాక ప్రజాస్వామ్యం ద్వారా తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. -
కటాక్షించు మాతా చాముండేశ్వరి
మైసూరు: ఆషాఢ మాసంలోని ఏడవ నక్షత్రం రోజున, మంగళవారంనాడు, శక్తి స్వరూపిణి చాముండేశ్వరి అమ్మవారి జన్మోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చాముండి గిరులపై తేరు ఉత్సవం జరగ్గా వేలాది భక్తజనం పాల్గొన్నారు. 1820లో, మైసూరు రాజు ముమ్మడి కృష్ణరాజ ఒడెయార్, ఆషాఢ మాసంలోని ఏడవ నక్షత్రం రోజున చాముండేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని బహూకరించారు. ప్రతి సంవత్సరం ఆ రోజును అమ్మవారి పుట్టిన రోజుగా ఆచరిస్తారు. చాముండేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని, మూలవిరాట్‌ను ఒకే విధంగా అలంకరించడం విశేషం. తెల్లవారు నుంచి విశేష పూజలు తెల్లవారుజామున 3 గంటలకు, చాముండికొండ ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, మంగళారతి చేశారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయం లోపల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవ విగ్రహాన్ని జరీ చీర, బంగారం, వజ్రాల ఆభరణాలతో సింగారించారు. ఎంపీ యదువీర్ ఒడెయార్ దంపతులు, రాజమాత ఆలయంలో ప్రార్థనలు చేసి జన్మోత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారి రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు. రథంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రధాన పురోహితుడు శశిశేఖర్ దీక్షిత్ జన్మోత్సవం ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. రాజ కుటుంబానికి ఆది దేవత అయిన అమ్మవారిని దర్శించి దేశంలో మంచి వర్షాలు, పంటలు పండాలని ప్రార్థించామని యదువీర్ తెలిపారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలయాన్ని దర్శించుకున్నారు. వైభవోపేతంగా అమ్మవారి జన్మోత్సవం చాముండి కొండపై నేత్రపర్వంగా రథోత్సవం -
అసంతృప్తి నేతలకు డీకే శివకుమార్ షాక్!
కర్ణాటక కాంగ్రెస్‌లో మంత్రి పదవుల కేటాయింపు తర్వాత మొదలైన అసంతృప్తి చర్చలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెక్ పెట్టారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించడంపై ఆయన నేరుగా స్పందించారు. ఈ క్రమంలో రాజకీయాల్లో రాజీనామాలు సర్వసాధారణమని.. దాన్నొక టీ కప్పులో తుపానుగా చూపించే ప్రయత్నం చేశారు.మంగళవారం ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. “రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అయితే పార్టీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని, పదవులు రాకపోయినా నేతలు ఓపికగా ఉండాలని సూచించారు.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రి పదవి దక్కని సీనియర్ నేత యశ్వంతరాయగౌడ వి. పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.ఈ పరిణామాలపై స్పందించిన డీకే శివకుమార్.. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. ధర్మ్సింగ్, సిద్ధరామయ్య ప్రభుత్వాల సమయంలో తనకు మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని.. అయినా పార్టీ కోసం ఓపికగా ఉన్నానని చెప్పారు. “నాకు కూడా అప్పట్లో అవకాశాలు రాలేదు. నేను రాజీనామా చేయలేదు. జీ. పరమేశ్వర కూడా ఓపికగా ఎదురుచూశారు. పార్టీలో ఉంటేనే భవిష్యత్ ఉంటుంది” అని డీకే వ్యాఖ్యానించారు.మరోవైపు మంత్రి పదవి దక్కని నేతలకు తగిన బాధ్యతలు అప్పగిస్తామని డీకే శివకుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రతి నాయకుడికి పదవి ఆశించడం సహజమేనని, అసంతృప్తిగా ఉన్న వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్‌లో అసంతృప్తి బయటపడటం అధిష్ఠానానికి కొత్త తలనొప్పిగా మారింది. అయితే నేతల మధ్య సమన్వయం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు.. పదవుల కోసం ఒత్తిడి తెస్తున్న నేతలకు స్పష్టమైన సంకేతంగా మారాయి. పార్టీని వీడే నిర్ణయం వ్యక్తిగతమైనదే అయినప్పటికీ.. రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్‌లోనే కొనసాగాలని ఆయన సూచించినట్లు కనిపిస్తోంది. -
సిద్దరామయ్య గైర్హాజరు దేనికో?
సాక్షి, బెంగళూరు: మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం సిద్దరామయ్య గైర్హాజరు ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం పదవిని ఆయన అయిష్టంగా వదులుకోవడం తెలిసిందే. అలాగే మంత్రుల ఎంపిక గురించి ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఫలితంగా రాలేకపోయినట్లు సమాచారం. దీనిపై తలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ గాయత్రి శాంతేగౌడ పేరును మంత్రుల జాబితా నుంచి చివరి నిమిషంలో తొలగించడం సిద్దరామయ్యకు ఆగ్రహం తెప్పించింది. ఆమెకు కుర్చీ ఇవ్వాలని సిద్దరామయ్య ప్రయత్నాలు చేశారని, తీరా తొలగించేసరికి అలిగారని పార్టీ వర్గాల కథనం. siddaramaiah-absent-karnataka-cabinet-oath-gayathri-santhegowdasiddaramaiah-absent-karnataka-cabinet-oath-gayathri-santhegowdasiddaramaiah-absent-karnataka-cabinet-oath-gayathri-santhegowda -
అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లు, ప్రైవేట్ ఫొటోలు..!
బెంగళూరు: భర్త వేధింపులను భరించలేక అతనికి విడాకులు ఇచ్చి ప్రశాంతంగా బతుకుదామనుకున్న మహిళకు పీడకలలా మారాడు. వేరుగా జీవిస్తున్న మాజీ భార్యను నానా రకాలుగా వేధిస్తున్న సైకో బెంగళూరు హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూశాడు. వైట్‌ఫీల్డ్ నివాసి అయిన మహిళ (36)ను ఆమె మాజీ భర్త నితిన్ గుప్త నానా రకాలుగా సతాయిస్తున్నాడు. వీరికి 2013లో ఢిల్లీలో పెళ్లయింది. అయితే నితిన్ ఆమెకు నరకం చూపించాడు. దీంతో విడాకులు తీసుకుని 2022లో బెంగళూరుకు వచ్చి జీవిస్తోంది. ఆమె ఇంటికి అర్ధరాత్రిళ్లు ఫుడ్ ఆర్డర్ పెట్టడం ప్రారంభించాడు. ఆమె ప్రైవేటు ఫోటోలను ఇంటర్నెట్లో పోస్టు చేశాడు. పలుమార్లు ఇంటికి వచ్చి హత్యాయత్నం చేసినట్టు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
19 మందితో కర్ణాటక మంత్రివర్గ విస్తరణ
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో ఆశావహులు ఎంతో ఆశతో ఎదురు చూసిన మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. బెంగళూరు లోక్‌భవన్‌లో సోమవారం సాయంత్రం 19 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. జూన్ 3వ తేదీన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణ పెండింగ్‌లో పడుతూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ అందడంతో కేబినెట్ విస్తరణకు మార్గం సుగమం అయింది. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు అదే రోజు మొత్తం 13 మంది నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 33కు చేరింది. సిద్ధరామయ్య మంత్రివర్గ సభ్యుల సంఖ్య 34 కావడం గమనార్హం. కాగా సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్న దాదాపు 19 మంది డీకే మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. సీనియారిటీ, పలుకుబడికి జాబితాలో ప్రాధాన్యత లభించినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు. తాజా మాజీ సీఎం సిద్ధరామయ్య, బీజేపీ, జేడీఎస్ నేతలు గైర్హాజరయ్యారు. చివరి క్షణంలోనూ మార్పులు.. చేర్పులు తాజామంత్రివర్గ విస్తరణ జాబితాలో తొలుత ఒక మహిళ పేరు ఉన్నప్పటికీ.. అటు తర్వాత వేరొకరితో ఆ స్థానాన్ని భర్తీ చేయడం గమనార్హం. దీనితో డీకే మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కని పరిస్థితి నెలకొంది. చివరి మూడు గంటల్లోనే మూడు సార్లు మంత్రులు, స్పీకర్ అభ్యర్థుల జాబితా మారడం గమనార్హం. తొలి జాబితాలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్సీ గాయత్రీ శాంతేగౌడను చివరి నిమిషంలో తప్పించి తాజా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బోసురాజుకు అవకాశం ఇచ్చారు. అలాగే తొలి జాబితాలో మహంకాళు వైద్య పేరు ఉంటే, దీనిని తొలగించి తాజా మాజీ మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్‌తో భర్తీ చేశారు. తమకు తాజా విస్తరణలో చోటు లభించకపోవడంతో పలువురు సీనియర్లు, ఆశావహులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కొందరు ఏకంగా శాసన సభ్యత్వానికే రాజీనామా సమరి్పస్తామని బెదిరించే వరకూ పరిస్థితి వెళ్లింది. అయితే అసమ్మతిని సహించబోమని అధిష్టానం స్పష్టం చేసింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన 19 మంది మంత్రులు.. 1. డాక్టర్ అజయ్‌సింగ్, 2. హెచ్‌సీ బాలకృష్ణ, 3. కేఎస్ బసవంతప్ప, 4. బసవ రాజరాయరెడ్డి, 5. ఎన్.చలువరాయస్వామి, 6. లక్ష్మణ సవది, 7. సారెకొప్ప మధు బంగారప్ప, 8. ఎస్ఎస్.మల్లికార్జున్, 9. బి.నాగేంద్ర, 10. నరేంద్ర స్వామి, 11. పుట్టరంగశెట్టి, 12. టి.రఘుమూర్తి, 13. రిజ్వాన్ అర్హద్, 14. రుద్రప్ప లమాణి, 15. సంతోష్ ఎస్.లాడ్, 16. కేఎం శివలింగేగౌడ, 17. శివరాజ్ తంగడగి, 18. విజయానంద కాశప్పనవర్, 19. జమీర్ అహ్మద్‌ఖాన్ -
ఎమ్మెల్యేలూ.. ఓపిక పట్టాలి: సీఎం
శివాజీనగర: వారాల తరబడి కసరత్తు, నిరీక్షణల తరువాత సీఎం డీకే శివకుమార్ మంత్రిమండలిలోకి కొత్త బలగం వచ్చి చేరింది. అనేక మందికి ఆశా భంగం కాగా, 19 మందిని మాత్రమే మంత్రిపదవీ యోగం వరించింది. వారిలో ఎక్కువమంది గత సిద్దరామయ్య కేబినెట్ సభ్యులే కావడం విశేషం. ఇరు వర్గాలకూ సమానంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు లోక్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సిద్దరామయ్య వర్గానికి, డీ.కే.శివకుమార్ సన్నిహితులకు సమాన స్థానాలు కల్పించినట్లు కనిపిస్తోంది. నలుగురు లింగాయత్‌లు, ముగ్గురు ఒక్కలిగలు, ముగ్గురు ఎస్సీ నేతలు, ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇద్దరు ముస్లింలు, ఒకరు లంబాణి, ఒకరు రాజపుత్ర, ఒకరు మరాఠా, ఒకరు ఉప్పర, ఒకరు ఈడిగ ఎమ్మెల్యేలు కొత్త మంత్రుల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ధరం సింగ్ కుమారుడు, కల్బుర్గి జిల్లా జీవర్గి ఎమ్మెల్యే అజయ్‌సింగ్‌కు ఎట్టకేలకు పదవి లభించింది. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి మంత్రి పదవిని కోల్పోయిన బళ్లారినేత బీ.నాగేంద్రకు మళ్లీ మంత్రి పదవి లభించడం ఆశ్చర్యకరం. 7 మంది తాజా మాజీలకు చాన్సు బనశంకరి: సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన జమీర్ అహ్మద్‌ఖాన్, ఎస్ఎస్.మల్లికార్జున్, ఎన్.చలువరాయస్వామి, శివరాజ తంగడగి, సంతోష్ లాడ్, మధు బంగారప్ప, నాగేంద్ర, పుట్టరంగశెట్టికి పదవులు కట్టబెట్టడం గమనార్హం. వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్న బసవరాజ రాయరెడ్డి, హెచ్‌సీ.బాలకృష్ణ, పీఎం.నరేంద్రస్వామి, బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న లక్ష్మణ సవది డీకే కేబినెట్లో చేరారు. వీరు కొత్తగా వచ్చారు... కొత్తగా ఎవరు వచ్చారంటే.. టీ.రఘుమూర్తి, అజయ్ సింగ్, కేఎస్.బసవంతప్ప, కేఎం.శివలింగేగౌడ, విజయానంద కాశప్పనవర్ మంత్రులయ్యారు. వీరు సిద్దు కేబినెట్లో మంత్రులుగా లేరు.బాగేపల్లిలో సుబ్బారెడ్డి అభిమానుల ఆందోళన సిద్దరామయ్య గైర్హాజరు దేనికో?సాక్షి, బెంగళూరు: మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం సిద్దరామయ్య గైర్హాజరు ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం పదవిని ఆయన అయిష్టంగా వదులుకోవడం తెలిసిందే. అలాగే మంత్రుల ఎంపిక గురించి ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఫలితంగా రాలేకపోయినట్లు సమాచారం. దీనిపై తలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ గాయత్రి శాంతేగౌడ పేరును మంత్రుల జాబితా నుంచి చివరి నిమిషంలో తొలగించడం సిద్దరామయ్యకు ఆగ్రహం తెప్పించింది. ఆమెకు కుర్చీ ఇవ్వాలని సిద్దరామయ్య ప్రయత్నాలు చేశారని, తీరా తొలగించేసరికి అలిగారని పార్టీ వర్గాల కథనం.బనశంకరి: నేను అందరికీ ఏదో ఒక అవకాశం కల్పిస్తా, ఎమ్మెల్యేలు ఓపిక పట్టాలని సీఎం డీకే.శివకుమార్ అసంతృప్త ఎమ్మెల్యేలను కోరారు. నివాసంలో డీకే.శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. మంత్రి రేసులో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కువమంది అర్హులు ఉన్నారు, కొన్ని సమయాల్లో పార్టీ నిర్ణయిస్తుంది. 2004లో నన్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదని, ఓపిక వహించానని చెప్పారు. సహనం వల్లే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానన్నారు. మంత్రిపదవి దక్కలేదని కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు ప్రకటించారని తెలిసిందన్నారు. కాగా, పెరుగుతున్న అసంతృప్తిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ఇక శాఖల కేటాయింపు ఎలా ఉంటుందనేది కూడా కుతూహలమే. నూతన మంత్రులు ఎవరంటే...1) డాక్టర్ అజయ్‌సింగ్ (జేవర్గి నియోజకవర్గం) 2) హెచ్‌సీ.బాలకృష్ణ (మాగడి) 3) కేఎస్.బసవంతప్ప (మాయకొండ) 4) బసవరాజ రాయరెడ్డి (యలబుర్గా ) 5) ఎన్.చలువరాయస్వామి (నాగమంగల) 6) లక్ష్మణ సవది (అథణి) 7) సారెకొప్ప మధు బంగారప్ప(సొరబ) 8) ఎస్ఎస్.మల్లికార్జున్ (దావణగెరె ఉత్తర) 9) బి.నాగేంద్ర (బళ్లారి గ్రామీణ) 10) నరేంద్రస్వామి (మళవళ్లి) 11) పుట్టరంగశెట్టి (చామరాజనగర) 12) టి.రఘుమూర్తి (చళ్లకెరె) 13) రిజ్వాన్ అర్షద్ (శివాజీనగర) 14).రుద్రప్ప లమాణి (హావేరి) 15) సంతోష్ ఎస్.లాడ్ (కలఘటగి) 16) కేఎం శివలింగేగౌడ(అరసికెరె) 17) శివరాజ్ తంగడగి (కనకగరి) 18) విజయానంద కాశప్పనవర్ (హునగుంద) 19) జమీర్ అహ్మద్‌ఖాన్ (చామరాజపేటే) డీకే శివకుమార్ సీఎం అయిన సరిగ్గా 2 నెలల తరువాత మంత్రిమండలి విస్తరణ కుదిరింది. ఇప్పటికే 13 మంది మంత్రులు ఉండగా, మరో 19 మంది చేరారు. దీంతో దాదాపుగా పూర్తిస్థాయి కేబినెట్ ఊపిరి పోసుకుంది. ఇక పరిపాలనలో కొత్తదనం, వేగం చూపాల్సిన బాధ్యత డీకే భుజాలపై ఉంది. పేరుకే కొత్త మంత్రులైనా వారిలో చాలామంది గత ప్రభుత్వంలో, అంతకుముందు మంత్రులుగా పనిచేసినవారే కావడం విశేషం. నలుగురైదుగురు మాత్రమే కొత్త ముఖాలు. అదే సమయంలో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. మాకు బెర్తు దక్కలేదని అనేకమంది ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. కొందరు రాజీనామాలకూ సై అనడంతో రానున్న రోజులు డీకే సహనానికి పరీక్ష కాబోతున్నాయి. ఎట్టకేలకు పూర్తయిన కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు 19 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం ఇంకా ప్రకటించని శాఖలు ఆశాభంగ ఎమ్మెల్యేల్లో ఆగ్రహ జ్వాలబెర్తు దక్కక... భగభగ ఎమ్మెల్యేల్లో ఆవేదన అభిమానుల నిరసనలు శివాజీనగర: సీనియర్లలో చాలామందికి మంత్రి గిరీ దక్కలేదు. దీంతో అనేకమంది ఆగ్రహానికి లోనయ్యారు. కొందరు ఎమ్మెల్యేల అభిమానులు నిరసనలకు కూడా దిగారు. బాగేపల్లిలో ఎమ్మెల్యే సుబ్బారెడ్డి అనుచరులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో రహదారిని దిగ్బంధించారు. ఉవ్వెత్తున మంటలు వేసి నినాదాలు చేశారు. ముఖ్య నేతలకు మొండిచెయ్యి బెళగావి జిల్లాలో తీవ్రమైన పోటీ నెలకొంది. లక్ష్మీ హెబ్బాళ్కర్, పీ.ఎం.అశోక్, గణేష్ హుక్కేరి, ఆసిఫ్ సేట్, మహాంతేష్ కౌజలగిలో ఎవరికీ సీటు రాకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బాగల్‌కోట, విజయపుర, కల్బుర్గి, యాదగిరి, బీదర్, రాయచూరు జిల్లాలకు చెందిన ఆర్.బీ.తిమ్మాపుర, అప్పాజీ నాడగౌడ, శివానంద పాటిల్, ఎం.వై.పాటిల్, కనీజ్ ఫాతిమా వంటి ప్రధాన ఆశావహులకు ఆశాభంగమైంది. హుబ్లీ– ధార్వాడ ప్రాంతంలో ఎన్.హెచ్.కోనారెడ్డికి ఏమీ ఇవ్వలేదు. -
మైసూరులో నిరసనల జోరు
మైసూరు: మంత్రి పదవి రాకపోవడంతో మైసూరు నగరం ఎన్.ఆర్. నియోజకవర్గ ఎమ్మెల్యే తన్వీర్ సేట్ అభిమానులు, అనుచరులు రచ్చ చేశారు. హఠాత్తుగా భారీ నిరసన చేయడంతో నగరంలో తీవ్ర గందరగోళం నెలకొంది. తబ్రేజ్ అనే అభిమాని పురుగుల మందు తాగి పడిపోయాడు, దీంతో అతన్ని కొందరు ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి చికిత్స జరుగుతోందని, ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఇది ప్రచారమైన వెంటనే పెద్దసంఖ్యలో ఎమ్మెల్యే తన్వీర్ ఇంటిముందు గుమిగూడారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన్వీర్‌ను చుట్టుముట్టిన అభిమానులు, కార్యకర్తలు ఆయన రాజీనామా చేయాలని పట్టుబట్టారు. కొందరు విలపించారు. ఉదయగిరి పోలీసులు చేరుకుని జనాన్ని అదుపు చేశారు. పలు చోట్ల అభిమానులు నిరసనలు కొనసాగించారు. ఒకరు పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు బాటిల్‌ను లాక్కున్నారు. నిరసనకారులను వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్లారు. నిరాశ చెందాను: ఎమ్మెల్యే తన్వీర్ పదవి రాకపోవడంపై ఎమ్మెల్యే తన్వీర్ సేట్ మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ చాలా నిరాశ చెందాను, రెండున్నర ఏళ్లు మంత్రి పదవి ఖాయమని హైకమాండ్ ఇచ్చిన హామీ అబద్ధమైంది. కార్యకర్తలకి లోబడి నిర్ణయం ఉంటుంది అని ఆయన అన్నారు. నాలాంటి విధేయులకు న్యాయం చేయలేదన్నారు. తాను ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేయలేదు, ఇప్పటికీ చేయను, పదవి రాకపోవడానికి కొంతమంది రాష్ట్ర నాయకులే కారణమని ఆరోపించారు. రోడ్లపైకి ఎమ్మెల్యే తన్వీర్ సేట్ అభిమానులు మంత్రి పదవి కోసం డిమాండ్


